Vinaigrette n s వాసనబుడ్డి.
Vindication n s justification సమాధానము, దోషనివారణము, విముక్తి, విమోచనము. this is a * of his conduct వానియందు తప్పులేదని యిందువల్ల తెలిసినది. this is no * of your conduct నీవు చేసిన దానికి యిది సమాధానము కాదు. as a * of his conduct he pleaded the orders given him నీవు చేసిన దానికి యేమి సమాధానమని అడిగితే, నాకు వచ్చివుండే ఆజ్ఞేనన్నాడు.
Vindicator n s ప్రోద్బలముగా మాట్లాడేవాడు. are you a * of murder ? ఖూనిపనికి పోద్బలముగా మాట్లాడేవాడవా.
Vindictive adj revengeful, cruel క్రూరమైన, కశితీర్చుకోవలెనని వుండే, పగబట్టిన,* language క్రూరమైన మాటలు. you should not be * నీవు క్రౌర్యము చేయరాదు,చలపట్టరాదు.
Vindictiveness n s revengefulness క్రౌర్యము, చలము, కసి.
Vine n s ద్రాక్షతీగ the wild * వెర్రి ద్రాక్షచెట్టు. the long pepper * శక్యము, మోడితీగ. the betel * నాగవల్లి, తమలపాకుతీగ. the melon * పాపరచెట్టు.
Vinefretter n s a small insect ద్రాక్షచెట్లను కొట్టే పురుగు.
Vinegar n s sour wine సిర్‌కా, కాడి, సీమకాడి.
Vinery n s ద్రాక్షతోట.
Vineyard n s (simply a garden) తోట, ద్రాక్షతోట, a place where work is done పనిచేశే స్థలము. he sent them into the * వాండ్లకు వుద్యోగాలు యిచ్చినాడు, వాండ్లకు పని చూపినాడు.
Vinous adj made of wine ద్రాక్ష సారాయితో చేసిన. * intoxication ద్రాక్ష సారాయి వల్ల కలిగిన మైకము.
Vintage n s the produce of the vine for the season ఒక సంవత్సరములో ద్రాక్ష కాచిన కాపు. the time of gathering the crop of grapes ద్రాక్ష పండ్ల కాలము. the wine produced by the crop of grapes of a season వొక సంవత్సరములో కాచిన ద్రాక్షవల్ల వుత్పత్తి అయిన ద్రాక్షా మద్యము. wine of the * of 1850 సంవత్సరపు ద్రాక్ష కాపువల్ల వుత్పత్తి అయిన ద్రాక్షా మద్యము.
Vintner n s a seller or dealer in wines వైను సారాయి అమ్మేవాడు.
Viod adj empty, unoccupied, destitute, null శూన్యమైన, హీనమైన, ఉత్త, లేని. the house is at present * ఆ యిల్లు యిప్పుడు కాలీగా వున్నది. this medicine left the belly * యీ మందువల్ల కడుపు వుత్తదైపోయినది. not being signed the bond is * చేవ్రాలు లేనందున, ఆ పత్రము వ్యర్థముగా వున్నది. * of sense తెలివిలేని. * of meaning అర్థములేని.
Viol n s a stringed musical insturument వీణెవంటి వొకవాద్య విశేషము.
Violation n s a breaking, transgression చెరపడము, ఉల్లంఘనము, అతిక్రమము, భంగము. * of a woman స్త్రీని చెరపడము. * of a tomb సమాధిని చెరపడము. this is a * of decency యిద మానభంగము, అమర్యద. this is a * of etiquette అది అమర్యాద, యిది ఆచార వ్యతిక్రమము. * of an oath ప్రమాణ భంగము. in * of the law శాస్త్ర విరుద్ధముగా. * of a promise వేస్తానని తప్పడము. in * of his promise he did this మాట తప్పి యిట్లా చేసినాడు.
Violator n s he who breaks or sopils చెరిపేవాడు, అతిక్రమించేవాడ a * of the public peace లోకుల సుఖమునకు భంగము చేశేవాడు. the * of a woman స్త్రీని చెరిపేవాడు.
Violence n s force, fury, vehemence, wrong బలము, వేగము, ఉగ్రము, బలాత్కారము, బలవంతము, సాహసము. from the * of the wind గాలియొక్క బల్లమువల్ల. from the * of his language వాడు చెప్పేవడివల్ల, బలమువల్ల A+. to commit * దౌర్జన్యము చేసుట. in Mw.XI. 82.
Violent adj forcible, outrageous, furious ప్రచండమైన, వడిగల, వేగముగల, సాహసమైన, చెడు, చెడ్డ. a * wind నిండా వడియైనగాలి. you may do it without any * effort నిండా ప్రయాస లేకుండానే దీన్ని నీవు చేయవచ్చును. a * man ధూర్తుడు, సాహసము, దుర్జనుడు. * conduct దౌర్జన్యము. a * blow మంచిదెబ్బ, చెడుదెబ్బ. he laida hands on them వాండ్లమీద దౌర్జన్యము చేసినాడు. he laid * hands on the money ఆ రూకలను గుంజుకొన్నాడు, అపహరించినాడు. he laid a hands on himself తన్ను తానే చంపుకొన్నాడు. a * death దుర్మణము. a * cold చెడ్డజలుబు.
Violently adv forcibly బలముగా, వడిగా, బలాత్కరముగా, బలవంతముగా. the wind blows * గాలి వడిగా విసురుతున్నది. to run * వడిగా పరుగెత్తుట. to burn * ధగధగమని మండుట.
Violet n s a plant and flower అందముగా వుండే వొకపుష్పము, నల్లకలువవంటి వొక పుష్పము.
Violin n s a stringed instrument of music, a fiddle ఒక విధమైన సారంగి, పిడీలు.
Violoncello orn s. a stringed musical instrument ఒక విధమైన పెద్దపిడీలు.
Viper n s a serpent whose bite is venomous నిండా విషముగల వొకపాము, సెంజెర, యీ పాము గుడ్లను పెట్టకుండా పిల్లలను వేస్తున్నదట. Note, P+ C+ A+. say సర్పము, కృష్ణ సర్పము. a person who is mischievous or maliguant దుష్టుడు, దురాత్ముడు, ద్రోహి.
Viperous adj mailignant ; venomous విషముగల, చెడ్డ, దుష్ట.
Virago n s a bold resolute woman ధూర్తురాలు, మొగధీరుడి వలె వుండేటిది.
Virgin n s a maid కన్యపడుచు. the holy * is generally called మాదా, and a chapel to the holy * is called మాదాగుడి. Hence English churches are vulgarly called మాదా కోవిల్.
Virginals n s a certain musical instrument వీణాభేదము.
Virginity n s maidhood కన్నెరికము.
Virgo n s కన్యా రాశి.
Virile adj male పురుష సంబంధమైన.
Virility n s manhood పుంస్త్వము, మొగతనము.
Virtu, or Vertu n s. a love or taste for curiosities వింత, వేడుక, వింత వస్తువులమీది బులుపు, an article of * వింత వస్తువు, చోద్యము పదార్థము.
Virtual adj effectual, being in substance వాస్తవికమైన, ప్రకాంతరమైన, జాడగా వుండే. his letter does not confess the debt in plain words, but it is a * acknowledgemnet వాని జాబువల్ల శబ్దతః ఆ అప్పును వొప్పుకోక పోయినప్పటికిన్ని తాత్పర్యతః వొప్పుకొన్నట్టుగానే వున్నది. transportation is * death నీళ్ళమీదికి పంపడము వురిదీయడమునకు తుల్యమే.
Virtually adv indirectly : not in words భావేణ, తాత్పర్యతః, వాస్తవికముగా, ప్రకారాంతరేణ. in this letter he * has given you permission యీ జబులో వాడు నీకు తాథ్పర్యతః సెలవిచ్చియున్నాడు. I was absent, but my pleader was there : so I was * present నేను వుండలేదు, నా వకీలు వుండినది నేను ప్రకారాంత రేణ వున్నట్టేను. this * annuls the bond యిందుచేత భావేణ ఆ పత్రము కొట్టుబడిపోతున్నది. he is indeed my brother, but he is * my father వాడు నా అన్న సరేగాని క్రియలో నాకు తండ్రిగా వున్నాడు.
Virtueless adj destitute of efficacy or operating qualities జబ్బైన, గుణములేని, సత్తలేని, సారము చచ్చిన.
Virtuoso n s man skilled in painting, music, antiquities, and curiosities చిత్రము, సంగీతము, వింతవస్తువులను విచారించడము, వీటిలో సమర్ధుడుగా వుండేవాడు. Walter Scott defines it, "one who wishes to know and willknow everything" సమస్తమునున్ను తెలుసుకోవలెననే యిచ్ఛగలవాడు. "The doctor's house is full of snakes, fossils, turtles, birds, fishes, &c. all thrown together in the greatest confusion. It makes no matter what it is, the doctor is such a confirmed * that everything is fish that comes to his net (Featherstonhaugh 1. 195.) See Addison's remarks, in Tatler, No. 216.
Virtuous adj morally good, chaste, upright ధర్మమైన, పుణ్యమైన. a * act ధర్మము, పుణ్యము. a * man ధార్మికుడు, పుణ్యవంతుడు, పెద్దమనిషి, a * woman పతివ్రత. the wives of the Lambadis are very * లంబాడీ వాండ్ల పెండ్లాలు నిండా పతివ్రతలు, వాండ్లవద్ద వ్యభిచారము లేదు.
Virtuously adv ధర్మముగా, నీతిగా, సన్మార్గముగా, వ్యభిచారము లేకుండా. they live * వాండ్లు వ్యభిచారము లేకుండా ప్రవర్తిస్తారు.
Virty n s (a certain mixed metal) కంచు.
Virulence n s malignity, a wicked temper వైషమ్యము, ద్వేషము, విరోధము.
Virulent adj venomous ఉగ్రమైన, తీక్ష్ణమైన, క్రూరమైన, విషమైన. * languaage దూషణ.
Virus n s foul matter from ulecers విషనీరు, రసిక.
Vis n s vital force ప్రభావము. * inertia అచైతన్య ప్రభావము.
English to Telugu dictionary
Free online Dictionary English to Telugu
No comments:
Post a Comment