Vegetable adj belonging to plants చెట్ల సంబంధమైన. the * world కూరాకులు మొదలైనవి.
Vegetation n s growth as of plants. మొలవడము, పెరగడము, చెట్లూచేమలు.
Vehemence, Vehemency n s. violence, strength, force వేగము, బలము, ఉగ్రము, ఉద్రేకము, ముమ్మరము, సాహసము.
Vehement adj furious, earnest ప్రచండమైన, ఉగ్రమైన, వేగముగల, సాహసముగల. * anger మహత్తైన కోపము. * heat అత్యుష్ణము.
Vehemently adv urgently; forcibly వేగముగా, బలముగా, అత్యుగ్రముగా.
Vehicle n s a carriage, means of conveyance వాహనము, యానము, సవారి, గుర్రము, బండి మొదలైనవి. means సాధకము, సాధనము. a newspaper is a * of intelligence వొక ప్రసిద్ధ పత్రిక సమాచారమును తేవడమునకు సాధకముగా వున్నది. for swallowing medicine అనుపానము. Fielding applies it to a bag (Jos Andr. 2. 2.)
Veil n s a cover to conceal the face; disguise తెర, ముసుకు, వేషము, ముఖాచ్ఛాదనము. she took the * ఆమె సన్యసించినది, కాషాయములు తీసుకొన్నది.
Veiled adj concealed, covered, hidden ముసుకు వేయబడ్డ, మరుగుచేయబడ్డ, దాచబడ్డ, కప్పబడ్డ.
Vein n s a vessel which returns the blood to the heart నరము, నాడి నెత్తురు నరము. he has royal blood in his *s వాని పెద్దలు రాజులు, అతడు రాజవంశీకుడు. a * of gold బంగారు తవ్వే భూమిలో బంగారువుండే చారిక, చారికె, రేఖ. there was a * of red in the white marble ఆ తెల్ల రాతిలో వొక యెర్ర చార వుండినది tendency or turn of mind ఉల్లాసము. when I saw he was in the * I asked him వాడు ఉల్లాసముగా వుండే సమయము చూచి అడిగినాడు.
Veined adj streaked చారలుగల. variegated చిత్ర విచిత్రమైన. * marble చారలుగల చలవరాయి.
Velet n s a servant శేవకుడు, పరిచారకుడు, భృత్యుడు.
Vellcity n s (a phrace used by Popish priests) Inclination, desire అభిప్రాయము, ఇచ్ఛ, తలంపు.
Vellum n s species of fine parchment వ్రాయడమునకు వుపయోగించేటట్టుగా కాకితమువలె చేయబడ్డ పశుచర్మము.
Velocipede n s a carriage for one person, having two wheels placed one before the other, in the same line, and connected by a beam, on which the person sits astride, and propels the vehicle by striking the tips of his toes against the earth ఒక బండి. అనగా ముందు వెనకగా రెండే చక్రములు గల వొంటి మనిషి నడమ కూర్చుండి కాలిబొటన వేళ్ళు నేలకు తాకించి తోసుకొని పొయ్యే బండి.
Velocity n s swiftness; celerity వేగము, త్వర. with * అతి త్వరగా.
Velvet n s a silk stuff wiht a fine nap మొకమలు, మొహమలు. soft as * మెత్తని, కోమలమైన, మృదువైన.
Velveteen n s a cloth worn by farmers బీదవాండ్లు కట్టుకొనే ముతకగుడ్డ.
Venal adj open to bribery లంచములు తీసె.
Venality n s readinness to be hired లంచముతీశే భావము. from the * of the judges న్యాయాధిపతులు లంచముతీశే భావము కలవారు గనక.
Vendee n s he who buys కొనేవాడు.
Vender, or Vendor n s. he who sells అమ్మేవాడు, విక్రయించేవాడు. I was the * he was the buyer నేను అమ్మేవాడు వాడు కొనేవాడు.
Vendible adj that may be sold అమ్మ తగ్గ, విక్రయించతగ్గ. a house not * అమ్మతగ్గదిగా వుండని యిల్లు.
Veneer n s నాణ్యమైన సన్నపాటి చెక్క.
Venerable adj worthy of worship పూజ్యమైన, మాన్యమైన, గణ్యమైన. his * motherమాతృశ్రీగారు. a man of * character ఘనుడు, పూజ్యుడు. my * father శ్రీమత్ మా తండ్రిగారు. from his * appearance వాణ్ని చూస్తే మహాపురుషుడుగా అగుపడ్డందున. a phrase of honour శ్రీమత్. the * Sir Wm. Jones శ్రీమాన్ వుల్లియంజోన్సుగారు.
Venerated adj reverenced; treated with honor and respect గౌరవముచేయబడ్డ, పూజ్యమైన.
Veneration n s respect, reverence పూజ్యత, గౌరవము, సన్మానము, ఆరాధన, అర్చన, పూజ.
Venerbly adv ఘనముగా, పూజ్యతగా.
Venereal adj relating to sexual intercourse రతి సంబంధమైన, సంగమమువల్ల పుట్టిన. * congress సంభోగము. the * disease సుఖసంకటము, స్త్రీ సంయోగమువల్ల పుట్టిన రోగము.
Venery n s the act or exercise of hunting; sexual enjoyment వేట, రతి, సంగమము.
Venesection n s act of opening a vein to let blood కత్తివాటు వేయడము, కత్తి వాటువేసి నెత్తురు తీయడము.
Venetians n s ఒక కర్రకు తగిలించి కావలసినప్పుడు మూసి తెరిచే ఆకులు. a venetina door ఆకుల తలుపు. a gold coin ఒక విధమైన బంగారు రూక.
Vengeance n s punishment; penal retribution శాస్త్రి, శిక్ష, దండన, ప్రతిహింస, కశి తీర్చుకోవడము. In Ps. XCIV. ప్రతిఫలము A+ ప్రతిదండన K+ ఆజ్ఞ P+ శిక్ష G+.
Vengeful adj retributive క్రూరదండనగా వుండే, శాస్తిగా వుండే. a * act క్రూరదండన.
Venial adj pardonable, excusable క్షమించ తగిన, మన్నించ తగిన. a * offence క్షమించతగ్గ స్వల్ప నేరము.
Venison n s the flesh of deer లేడి మాంసము ఇర్రిమాంసము. any thing taken in the chase వేటలో చంపబడ్డ జీవము.
Venom n s poison విషము, గరళము.
Venomous adj poisonous, that which injures by touching the blood, not by the stomach విషమైన, విషముయెక్కే. a * snake విషముగల పాము.
Venomously adv poisonously; spitefully విషముగా, క్రూరముగా.
Venomousness n s poisonousness; spitefulness విషము, క్రూరత్వము. from the * of this snake యీ పాము విషముగలదిగనక, యీ పాము కరిస్తే చస్తారు గనక. from the * of her tongue దానిది విషవాక్కు గనక.
Vent n s out-let, utterance? sale సందు, బెజ్జము, దారి, దోవ, ఉక్తి, విక్రయము, అమ్మకము. there was no * for the smoke పొగ పొయ్యేటందుకు దారి లేకుండా వుండినది. the * of a cask పీపాయి బెజ్జము. the * of a bird పక్షి యొక్క ఆసనము గుదము. of a cannon పిరంగి యొక్క చెవి. she gave * to her feelings దాని మనసులో వుండే దాన్ని బయిట చెప్పినది. she gave * to her tears కండ్ల నీళ్లు పెట్టుకొన్నది, యేడ్చినది. he gave * to rage రేగినాడు, ఆగ్రహపడ్డాడు. the sentiments he gave * to వాడు చెప్పిన అభిప్రాయములు. they gave * to cries బొబ్బలుపెట్టినారు, కేకలు వేసినారు. these goods have no * here యిక్కడ విక్రయము లేదు.
Ventilation n s the state of being fanned గాలి కొట్టేటట్టుగా చేయడము, గాలి ప్రసరించేటట్టుగా చేయడము. this door is merely intended for the purpose of * యీ తలుపు వూరికె గాలి రావడానకై పెట్టివున్నది. for want of * the house is unwholesome గాలి వచ్చేటందుకు దారి లేనందువల్ల యీ యింట్లో ఆరోగ్యము మట్టు.
Ventilator n s a small window for admitting air గాలి వచ్చేటందుకు పెట్టిన వొక చిన్న కిటిక.
Ventricle n s కడుపు. in the heart there are two *s; in the lungs there are two *s called lobes : in the brain there are two *s వీటికి స్థానం భాగం, తిత్తి, కడుపు అని అర్థమవుతున్నది.
Ventriloquism n s the art of speaking in such a manner that the voice appears to come, not from the person, but from some distant place కడుపులో మాట్లాడడము, అనగా పెదవులు తెరవకుండా కడుపులో మాట్లాడి తనకు యెదట కొంత దూరములో మాట వినేటట్టుచేసే విద్య.
Ventriloquist n s one who speaks in such a manner that his voice appears to come from some distant place పెదవులు తెరవకుండా మాట్లాడి తనకు యెదట కొంత దూరములో మాట వినేటట్టు చేసేవాడు.
Venture n s a risking, chance, thing hazarded సాహసము, అదృష్టము. a mercantile * కోస్తా వర్తకములో తెగించివేసిన రూకలు. his * was ten thousand rupees వాడు తెగించి పదివేల రూపాయీలు కోస్తా బేరములో వేశినాడు. he lost his * వాడువర్తకములో తెగించివేసిన రూకలు, ముణిగిపోయినది. at a * ; by trying his chance అదృష్టము చూతామని. he spoke at a * యెట్లా అవుతున్నదో అదృష్టము చూతామని తెగించి మాట్లాడినాడు.
Venturesome, Venturous adj bold ; daring సాహసమైన, నిర్భయమైన.
Venus n s the star శుక్రుడు. the goddess of beauty మోహిని, సౌందర్య దేవత. as the mother of Cupid మన్మధుని తల్లి, అనగా లక్ష్మీ. or good fortune శ్రీ. or sexual pleasure రతి.
Veracious adj true యథార్థమైన, ప్రామాణికమైన. a * man నిజస్థుడు, సత్యవాది.
Veraciously adv truthfully, with veracity, నిజముగా, యథార్థముగా.
Veracity n s truth ; honesty ప్రామాణికత, సత్యవాదిత్వము. a man of * నిజస్థుడు,సత్యసంధుడు. he is a man of no * వానికి వాక్శుద్ధి లేదు, వానిమాట నిజము లేదు.
Veranda n s an open portico వసారా, తాళ్వారము, వారపాక, పంచపాళి.
Verb n s a part of speech క్రియాపదము.
Verbally adv orally నోటిమాటలుగా. he * promised to pay the money రూకలు యిస్తానని నోటిమాటగా చెప్పినాడు.
Verbatim adv word for word (literally) మాటకుమాటగా, నిర్వ్యత్యాసముగా
Verbiage n s (a French word) use of many words without necessity ; nonsense గ్రంథపుష్టి, వాక్చాతుర్యము, అగత్యములేని మాటలను ప్రయోగించడము, పిచ్చికూతలు. all his letter is mere * వాని జాబులో అగత్యము లేని పిచ్చి కూతలు నిండా వున్నవి. Wordiness, Weak poetry శబ్దపుష్టి. * and fine writing are the two great plagues in modern literature. (Colburn's United Serv. Journ. Sep. 1845. p. 18.)
Verbose adj abounding in words, prolix మాటలు పుష్టిగా వుండే, శబ్దపుష్టిగల, అధిక మాటలుగా వుండే. a * letter నిండా పెంచి వ్రాసిన జాబు.
Verbosity n s prolixity ; waste of words మాటల పుష్టి, అగత్యములేని అధిక మటలు. from the * of his letter వాడు జాబు నిండా పెంచి వ్రాసినందున. I was weary of his * వాని అతి భాషిత్వముచేత నాకు విసుకు పుట్టినది.
Verdant adj green ; fresh; covered with growing plants పసిరికగా వుండే, చెట్లచేత పచ్చగా వుండే, a * spot పసిరిక బయిలు. the * hill చెట్లచేత పచ్చగా వుండే కొండ.
Verdict n s decision; judgment తీర్పు. the jury found a * పంచాయతివారు తీర్పు చెప్పినారు.
Verdigris n s rust of copper చిలుము.
Verditer n s a kind of green paint ఒక విధమైన ఆకుపచ్చ.
Verdure n s greenness, freshness of vegetation పచ్చిక, పచ్చిక యొక్క పశిమి, పచ్చిగా వుండే చెట్లయొక్క పశిమి. from the * of this place యీ చోటు పచ్చికచేత పచ్చగా వుండేటందు వల్ల. we observed that under the trees there was no * ఆ చెట్లకింద పసిరికలేనట్టు వున్నది.
Verge n s a rod, a wand దండము, శంగోలము, వేత్రము. border, brink సీమ, పొలిమేర. he stood on the * of the hill కొండ అంచున నిలిచినాడు. he is on the * of ruin చెడిపొయ్యే గతిలో వున్నాడు. when he was on the * of eternity యిప్పుడోయింక నిమిషానికో అని వుండే టప్పుడు, సన్నిహిత కాలమందు.
Verger n s a mace bearer in cathedrals గుళ్ళలో గురువు యెక్క శంగోలమును పట్టుకొని పొయ్యేవాడు.
Veriest adj real, actual, true వట్టి, పిచ్చి, శుద్ధ. the * fool knows this యిది వట్టి పిచ్చి వాడికి కూడా తెలుసును.
Verification n s the act of proving to be true; the act of confirming దృఢ పరచడము, స్థిరపరచడము, నిశ్చయముచేయడము, నిజమని నిరూపించడము. * of powers * (i. e. publication of authority, by producing documents) ప్రకటన. after the * of his signature అది వాడి చేవ్రాలని నిరూపించబడ్డ తర్వాత. this was a * of his dream ఇది వాడి స్వప్న ఫలము.
Verified adj confirmed by competent evidence నిరూపించబడ్డ, రూఢిచేయబడ్డ. her dream was * దాని స్వప్నము ఫలించినది, నిజమైనది.
Verily adv truly, certainly నిజముగా, సత్యంసత్యం, యథార్థముగా, సత్యముగా, నిశ్చయముగా. * they will come వాండ్లు నిజముగా వత్తురు. The modern Greek changes Amen Amen into bebaia bebaia.
Veritable adj real, actual యథార్థమైన, నిజమైన, ఇది యెగతాళిమాట.
Verity n s truth నిజము, వాస్తవ్యము.
Verjuice n s a liquor expressed from wild apples, &c. నిండా పుల్లని పండ్ల రసము. he looked as if he had drunk * or vinergar నిండా ఆగ్రహముగా వున్నాడు. ఆవ తాగినట్టు వున్నాడు.
Vermicelli n s a paste spun like threads తేనెతొలలు. the Madras bazar name is Lucksome లక్సాం; and they change * into "Worm jelly."
Vermicular adj resembling a worm పురుగులవంటి. the * motion of the intestines జీర్ణము కావడమునకై పేగులు పురుగులవలె కదలడము, మెదలడము, ఆంత్రాణాం క్రిమివత్ చలనము.
Vermiculated adj formed in the likeness of the motion of a worm పురుగు పారినట్టుగా వుండే. * work; rustic work so wrought as to have the appearance of having been eaten into or tracked by worms పురుగు తిన్నట్టుగా అగుపడే టట్టు చేసినపని. a * stone సాలిగ్రామము.
Vermilion n s red colour సిందూర వర్ణము, కుంకుమ వర్ణము, లింగము, ఇంగిలీకము, సిందూరము.
Vermin n s worms : all noxious little animals or insects, as squirrels, rats, mice, grubs, flies, &c. పరుగులు, క్షుద్రజంతువులు దుష్టపురుగులు, యెలుకలు, చుంచులు, నల్లులు, పిణుజులు, మిడతలు, ముంగిసలు మొదలైనవి, ఈతి బాధలుచేశే జంతువులు. Benares is full of beggars, thieves, imposters and such * కాశి బిచ్చగాండ్లు, దొంగలు, మోసగాండ్లు మొదలైన క్షుద్రులచేత నిండియున్నది.
Vernacular adj native ; belonging to the country దేశ్యమైన, స్వదేశసంబంధమైన. * languages దేశభాషలు. a book in the * dialect దేశభాషలో వ్రాశిన గ్రంథము. the * name of a plant is different from the scientific name వొకచెట్టుకు గ్రామ్యమైన పేరు వేరే, శాస్త్రీయమైన పేరు వేరే, thus the sacred fig tree అశ్వత్ధము. has the * name రావిచెట్టు. Besides ; casi is the * name for Benares. The * Education Society in Bengal, retains the name * untranslated, both in the Bengali and the Persian characters.
Vernal adj produced in spring time వసంతఋతు సంబంధమైన. * airs మలయమారుతము, పయిరగాలి. the * equinox మేషాయనము, ఉత్తరాయణమార్గము. See Equinox.
Versatile adj cunning, clever, ready చమత్కారముగల, యేపనికిబడితే ఆ పనిలో చొరవగల, సర్వతంత్ర స్వతంత్రముగల. they are very * వాండ్లేపనిలో నంటే ఆ పనిలోచొరవగల వాండ్లుగా వున్నారు.
Versatility n s cunning, cleverness, readiness చమత్కారము, చాతుర్యము,యే పనిలోబడితే ఆ పనిలో చొరవ, సర్వతంత్ర స్వతంత్రము. the * of the bramins is remarkable బ్రాహ్మణులు యేపనికంటే ఆ పనికి గట్టి వాండ్లుగా వున్నారనేది విశేషము, సక్రియత్వము (W. in Sankhya, page 55.)
Verse n s a line of meter చరణము, పాదము. a couple of lines in Sanscrit meter శ్లోకము. four lines of meter పద్యము. a passage of a few words of prose వాక్యము. both in prose and in * వచనముగానున్ను పద్యములుగానున్ను. he brought chapter and * to prove this దీన్ని నిరూపించడానకు యిన్నో అధ్యాయములో యిన్నో శ్లోకమును తెచ్చినాడు.
Versed in adj well skilled, knowing నిండా తెలసిన, వ్యక్తిగల, నిపుణతగల, సమర్థతగల. those who are * in law ధర్మశాస్త్రవేత్తలు.
Versicle n s half a verse అర్ధశ్లోకము.
Versification n s the art of composing verses శ్లోకరచనము, పద్యములు చెప్పడము. this poem is worthless but it's * is faultless యీ వాక్యము పనికిమాలిన దైనప్పటికిన్ని దీని రచన నిర్దోషముగా వున్నది.
Versifier n s one who writes verse పద్యము చెప్పగలవాడు.
Version n s translation భాషాంతరము. this is a new * of the story ఆ కథకు యిది వొక కొత్త అవతారము, ఆ కథనే యిప్పుడు మరివొక రీతిగా చెప్పతున్నారు. his * of the business differs form yours ఆ సంగతిని గురించి నీవు చెప్పేది వొకటి వాడు చెప్పేది వొకటి.
Verst n s ( a Russian word) about three fourths of an English mileముక్కాలుమైలు, అరగడియ దూరము.
Versus (Latin)against మీద, in law cases Ramiah * Gungia, or Smita v. Fones రామయ్య వాది గంగయ్య ప్రతివాధి, స్మిత్తు వాది జోన్సు ప్రతివాది.
Vert n s green ఆకుపచ్చ.
Vertebre n s joints కీళ్ళు. the * of a snake's back పాము వీపుయెముక యొక్కకీళ్లు.
Vertex n s the top of a hill పర్వత శిఖరము.
Vertical adj being in the zenith or over the head తలకుపైగా వుండే, పుచ్ఛములో వుండే. the * height of this hill is two miles but the distance from the foot to the vertex is ten miles యీ కొండ భూమినుంచి ఆకాశమునకు వుండే పొడుగు రెండుమైళ్ళ దూరము వున్నది, అయితే కొండ అడుగునుంచి శిఖరముదాకా పోవడమునకు వుండే దూరము పదిమైళ్ళు వున్నది. they labour under a * sun నడిమధ్యాహ్నములో పని చేస్తున్నారు.
Vertigo n s giddiness ; dizziness or swimming of the head తలదిమ్ము.
Vertu, or Virtu n s. (French word) a taste for curiosities కాసుచేయని వింతవస్తువులకు నిండా రూకలు వ్రయము చేసినాడు.
Vervain n s a plant బొక్కెనాకు. Schlegel uses "verbena' to translate కుశము. verbena nodiflora బొక్కెనాకు, పొడుదలై, వాసీరం. Rox. 3. 90.
Very adj true ; real, identical నిజమైన, సత్యమైన, వాస్తవ్యమైన, అదే. the * man అతడే. in the * house ఆ యింట్లోనే. at the * end చిట్టచివరన. at the * beginning మొట్టమొదట, తొలుదొలుత. the point చిట్టచివర. in the * middle నట్టనడమ. at the * time అట్టి సమయమునందే. at her * breast దాని రొమ్ము ననె. for this * reason యిదే హేతువునుబట్టి. that is his * voice అదే వానిగొంతు. Very God సాక్షాదీశ్వరుడు.
Vesicle n s a little bladder on the skin బొబ్బ.
Vespers n s evening service or prayers సాయంకాల ప్రార్థన, సంధ్యావందనము. the vesper hour సందెవేళ.
Vessel n s a kettle, vase pot, a cask, a tube, a ship పాత్ర, కుండ, పీపాయి, నాడి, గొట్టము, వాడ. they are *s of wrath వారు అగ్రహమునకు పాత్రులుగా వుండేవాండ్లు, అనగా అనుగ్రహమునకు పాత్రులు కానివాండ్లు, సర్వక్రోధభాజనాని. A+.
Vest n s a garment, a waistcoat ;ధోవతి, మొలధోవతి. * is the modern word for a shirt or coat అరచొక్కాయి.
Vestal n s a virgin consecrated to Vesta కన్యపడుచు, పురుషుని ముఖము యెరగని పడుచు, వొకదేవతకు బసివిగా విడవబడ్డ పడుచు. she is a perfect * అది పురుషుని ముఖమెరగదు.
Vested with కలిగిన,గల, he was * with full authority వాడు పూర్ణమైన అధికారము గల వాడుగా వుండెను. vested rights వొకరియందు వుంచబడ్డ స్వతంత్రము. money * in lands భూస్వాస్థ్యము.
Vestibule n s the porch, or entrance into a house ముఖమంటపము, యింటి వాకిలి ముందరి వసారా.
Vestige n s a mark, a trance జాడ, చిహ్నము, గురుతు. I find no *s of them here వాండ్ల జాడలు యిక్కడ యేమీ అగుపడలేదు.
Vestment n s a garment, part of dress వస్త్రము.
Vestry n s a room attached to a church గుడిలో పాదిరి వుండే గది. a committee for carrying on the affairs of a parish ఆ గదిలోనే కూడే గ్రామాధిపతుల సభ. Vesture, n. s. a garment వస్త్రము, ఉడుపు.
Vetch n s a kind of plant ఒక చెట్టు. Bishop Heber observes that the Indigo is a real vetch ; having a vetch-shaped leaf with a blossom like a pea.
Veteran n s an old soldier బహు దినాల ముసలిబంటు. Wilson is a * in Sanscrit వుల్సను దొర సంస్కృతములో నిండా దినాలుగా పరిశ్రమపడుతూ వుండేవాడు.
Veterinary adj regarding the doctrine of horses గుర్రాల వైద్య సంబంధమైన. a * doctor గుర్రాల వైద్యుడు.
Veto n s (in Latin means I forbid) a prohibition నిషేధము, కారాదనడము, కూడదనడము. he laid his * upon them మీరు యిట్లా చేయకూడదని నిషేదించినాడు.
Vexation n s act of irritation, disquiet తొందర, ఆయాసము, చీదర, అసహ్యము.
Vexatious adj troublesome, provoking ఆయాసకరమైన, తొందరైన, సంకటమైన. this is very * యిది నిండా తొందరైన, సంకటమైన. this is very * యిది నిండా తొందరైనపని. I have got a boil on my hand, this is * నా చేతిమీద పుండు లేచినది యిది వొక తొందర.
Vexed adj troubled, grieved తొందరపడ్డ, సంకటపడ్డ, ఆయాసపడ్డ. I was much * at this యిందున గురించి నాకు నిండా తొందరగా వుండినది. in a sea * with storms గాలి వాన యొక్క తొందర గల వొక సముద్రములో. this is a much * question యిది నిండా పీకులాడినారు. he was * at the expense of building this house యీ యిల్లు కట్టడములో ఆయన వ్రయమును గురించి అతని మనసుకు నిండా ఆయాసమైనది.
Via adv (Latin word) by way of, through మార్గాన, దోవన. he went to Madras * Nellore నెల్లూరి మార్గాన చెన్న పట్నానికి వెళ్ళినాడు.
Viaduct n s a thing like a bridge ఒక విధమైన వంతెన.
Vial n s a small bottle చిన్నబుడ్డి.
Viand, Viands n s. meat, food ఆహారము, భోజనము.
Viaticum n s పాథేయము, దారి బత్తెము, దీన్నిపట్టి కాతోలిక్కు మతస్థుడైన వాడికి అవసానకాలమందు చేసే వొక కర్మమునకు అర్థమైనది the priest gave him his * వానికి చరమ దశలో పాదిరి ప్రాయశ్చిత్తము పెట్టించినాడు.
Vibration n s the act of brandishing, swinging ఝళిపించడము, ఊగడము, కదిలించడము.
Vicar n s a substitute, a deputy ప్రతి మనిషి, ప్రత్యామ్నాయముగా వుండేవాడు. a priest గురువు, పాదిరి.
Vicarage n s the benefice of a vicar ఒక గురువుకు వుండే అధికారము, గురువుకు విడిచియుండే మాన్యము.
Vicarious deputed; delegated, suffering for another, పత్యామ్నాయముగా వుండే, ప్రతిగావుండే, వొకనికి ప్రత్యామ్నాయముగా తానుపడే, the * sacrifice వొకరి నిమిత్తమై తాను బలికావడము.
Vicariously adv in the place of another ఒకరికి ప్రత్యామ్నాయముగా. he suffered * వొకరు పడవలసినదాన్ని తాను పడ్డాడు.
Vice n s fault, blemish worng, wickedness దోషము, తప్పు, దుర్మార్గము. an iron * ఇరుకుదాగిలి, పట్టుబట్టె.
Vice-admiral n s in the navy, the second officer in command వాడ సేనాధిపతికి రెండోవాడు
Vice-admiralty n s the office of a vice-admiral వాడ సేనాధిపతికి రెండో వాని వుద్యోగము. a court వొక న్యాయసభ.
Vice-chancellor n s a sort of judge ఒక విధమైన న్యాయాధిపతి.
Vicegerency n s Government held in the absence of the ruler, deputed power ఏలేవాడు లేనప్పుడు వాని ప్రభుత్వమును మరివొకడు చేయడము. in the absence of Rama, the * was held by Bharata రాముడు రాజ్యములో లేనప్పుడు భరతుడు రాజ్యభారము చేసెను.
Vicegerent n s an officer acting in place of another ఒకనికి ప్రత్యామ్నాయముగా వుండి పనిచూచే అధికారి.
Viceroy n s the substitute of a king రాజుకు ప్రత్యామ్నాయముగా వుండి రజ్యధి పత్యము చేశేవాడు. రాజుకు బదులుగా వుండి రాజ్యాధికారము చేసేవాడు.
Viceroyalty n s ofice or jurisdiction of a viceroy రాజుకు బదులుగా వుండిచేశే రాజ్యాధిపత్యము.
Vice-versa pronouncedviseeversaవైసీవర్సా ఇట్లాఅయితేఅట్లా, అట్లా అయితే యిట్లా. thus, the first class reads grammar when the second is at arithmetic and vice-versa రెండో తరగతివాండ్లు లెక్క వేశేటప్పుడు మొదటితరగతి వాండ్లు వ్యాకరణము చదివేది, మరిన్ని మొదటి తరగతి వాండ్లు లెక్కలు వేశేటప్పుడు రెండో తరగతి వాండ్లు లెక్కలు వేశేటప్పుడు రెండో తరగతి వాండ్లు వ్యాకరణము చదివేది. this town takes its name from the river, or vice versa యీ వూరిపేరు ఆ నదికి వచ్చినదో ఆ నదిపేరే యీ వూరికి వచ్చినదో. you must attend the cattle when your brother goes to the town ; and vice-versa మీ అన్న పట్నానికిపోతే నీవు పశువులు మేపడానికిపో నీవు పట్నానికి పోతే వాడు పశువులను మేపడానికి పోని. Vecinage, n. s. neighbourhood సమీపము, ప్రాంతము.
Vicinity neighhourhood ప్రాంతము,సామీప్యము, in that * ఆ ప్రాంతములో.
Vicious adj immoral, wicked, refractory దుర్మార్గమైన, దుష్ట, చెడ్డ, దౌర్జన్యమైన.
Vicissitude n s change, revolution వ్యత్యయము, మారడము, హానివృద్ధులు, సుఖ దుఃఖములు. he is exposed to continual *s of fortune వాడి పని కొన్నాళ్లు వెన్నెల కొన్నాళ్లు చీకటిగా వున్నది.
Vicitim n s a living being, sacrificed బలి, బలియివ్వబడబొయ్యే జంతువు.he way laid his * and murdered him వాడు తాను బలిపెట్ట వలెననుకొన్న మనిషివచ్చేదోవలో పొంచి యుండి వాణ్ని చంపినాడు. a hapless wretch దిక్కుమాలినపక్షి, దౌర్భాగ్యుడు. being a * to passion మోహముపాలబడ్డవాడై, మోహపరవశుడై. the * of tyranny క్రౌర్యమునకు పాలైనవాడు. he is a * to injustice అన్యాయమును పొందినాడు. he made us the *s of his fury మమ్మున తన అగ్రమునకు బలి చేసినాడు. the child is a * of parental neglect తల్లిదండ్రుల వుపేక్షకు యీ బిడ్డ బలి అయినది, అనగా యీ బిడ్డకు యీగతి వచ్చినది. the house fell a * to the devouring elemanet ఆ యిల్లు నిప్పుకు బలియైపోయినది, ఆ యిల్లు పరశురామ ప్రీతి అయిపోయినది, అనగా కాలిపోయినది.
Victimiser n s ఘాతుకుడు, పచ్చపుదొంగ.
Victimized adj హతము చేయబడ్డ, వంచించబడ్డ.
Victimizing n s శౌర్యము, పచ్చపుపని.
Victor n s a conqueror, a vanquisher జయించినవాడు, జయమును పొందినవాడు. in this business which was the * ? దీంట్లో గెలిచిన వాడెవరు.
Victorious adj conqurering ; superior జయమును పొందిన, జయముగల, ఘనమైన.he was * వాడు జయించినాడు.
Victoriously adv triumphantly ఘనముగా.
Victoriousness n s జయశాలిత్వము. Victory, n. s. conquest జయము.
Victuals n s provision of food, meat stores ఆహారము, భోజనసామగ్రి.
Vide (Latin) "See thou" చుడు, this is used only in books ; thus ఆచార్యుడు, vide గురువు, అనగా గురుగు అనే పదమును చూడు దీని అర్థము వివరముగాతెలుసును అని భావము.
Videlicet adv to wit, namely అనగా. Thus, the proprietor, * my brother యజమానుడు, అనగా నా తమ్ముడు.
Vi-et-armis adv (Latin words) by main force బలాత్కారముగా, దౌర్జన్యముగా, బహుపరుష సహాయముచేత.
View n s sight, survey, prospect అవలోకనము, చూపు దర్శనము. there were four hills within * కనుపారేంత దూరములో నాలుగు కొండలు వుండినవి. నాలుగు కొండలు అగుపడ్డవి. from the top of the hill there is a fine * ఆ కొండ మీదినుంచి చూస్తే శానాదూరము తెలుస్తున్నది. at the first * మొదటి విమర్శలో, మొదట చూడగా. he placed the ball full in * ఆ చెండును బాగా తెలిశేటట్టుగా పెట్టినాడు. I do not know his *s in this యిందున గురించి వాడి ఆలోచన యేమో నాకు తెలియలేదు.you must keep this in * దీన్ని ముఖ్యముగా నీ మనసులో పెట్టవలసినది. he sold me a * of Calcutta కలకత్తా పట్టణము యొక్క పటమును నాకు అమ్మినాడు. the lark arose till it went out of * ఆ భరద్వాజము యెగిరి యెగిరి కనుదృష్టిని మించిపోయినది.he set the box out of * ఆ పెట్టెను మరుగుగా పెట్టినాడు, కండ్లబడకుండా పెట్టినాడు.it went out of * అగుపడక పోయినది. it came into * అగుపడ్డది. opinion భావము ఆలోచన తాత్పర్యము. what is your * in speaking to him ? వాడితో మాట్లాడడానికి నీయత్నమేమి, నీ అభిప్రాయమేమి. this is my * of the case అందున గురించి నా తాత్పర్య మిది. a * of logic తర్కదర్శనము, అనగా తర్కసంగ్రహము. in that * of the subject ఆ పక్షమందు . whichever * you take of this యిందున గురించి మీకు యెట్లా భావమైనాసరే. the first * of a question in logic అనుమానము. on a full * of the question ఆ సంగతికి బాగా విచారించినందు మీదట. with a * to screen himself తన ప్రయత్నము కమ్ముదల చేసుకోదలచి. the point in * ఆలోచించినపని, యిప్పుడు వుండే యత్నము. in every point of * this is worng యిది అన్ని విధాల తప్పు, యిది అన్యాయము.
Viewer n s one who surverys చూచి విచారించే వాడు.
Viewless adj unseen, not discernible అగుపడని, కంటికి అగుపడని, అగోచరమైన.
Vigil n s the evening before a holyday, a fast or service before a holyday, a watch పండుగకు పూర్వరాత్రి, ఆ రాత్రిచేశే జాగరము.
Vigilance n s watchfulness జాగరూకత, మెళుకువ, ఎచ్చరిక, జాగ్రత్త.
Vigilant adj watchful, circumspect జాగరూకతగల, జాగ్రతగల.
Vigilantly adv watchfully ; attentively ; with attention to danger జాగ్రత్తగా, పదిలముగా.
Vignette n s a picture of leaves and flowers పత్రపుష్పముల యొక్క చిత్రము, ఆశ్వాసాంత మందువేశే పువ్వు.
Vigorous adj strong, forcible, stout సత్తువగల, త్రాణగల, బలముగల గట్టి. a * appetite మంచి ఆకలి.
Vigorously adv forcibly సత్తువగా, బలముగా, గట్టిగా.
Vigorousness n s force ; strength బలము, త్రాణ.
Vigour n s force, strength, energy, efficacy బలము, శక్తి, త్రాణ, పరాక్రమము, దార్ఢ్యము.
Vile adj base, low, worthless, wicked నీచమైన, అధమమైన, క్షుద్రమైన, దుష్ట, పాపిష్ఠి. a * act దుష్ట పని. a * wretch దుష్టుడు.
Vilely adv basely, shamefully, wickedly నీచముగా, అల్పముగా, అధమముగా, దుర్మార్గముగా.
Vileness n s baseness, meanness నీచత, హీనత్వము, అల్పత్వము, తుచ్ఛత్వము.
Vilification n s the act of defaming నింద, దూషణ, అపఖ్యాతి, అవమానమురట్టు.
Villa n s a country seat ఊరిబైట వుండే పెద్దతోట, యిల్లు, నాటుపురము.
Village n s ఊరు, గ్రామము.
Villager n s ఊరివాడు, గ్రామస్థుడు.
Villain n s దుష్టుడు, క్షుద్రుడు, దొంగ, పోకిరి, హరంజాదా, చండాలుడు.
Villainous adj base, vile, wicked నీచమైన, తుచ్ఛమైన, పాపిష్టి. a * trick దొంగయుక్తి. this was a * shame యిది దిక్కుమాలిన అన్యాయము. a * stink పాపిష్ఠికంపు, చెడుకంపు.
Villainously adv basely నీచముగా, క్షుద్రముగా, పాపిష్ఠితనముగా.
Villanous SeeVillainous
Villanously See Villainously
Villany n s wickedness ; basenes, నీచత్వము, దుర్మార్గము, దొంగతనము.
Villein n s a slave, a drudge దాసుడు, భృత్యుడు. there were two hunderd *s on the estate ఆ సంస్థానముకింద యిన్నూరుమంది దాసులు వుండిరి. Villous, adj. hairy వెంట్రుకలుగా వుండే, బొచ్చుగా వుండే.
No comments:
Post a Comment