Vacancy n s empty space, a chasm శూన్యము, శూన్యముగా వుండే స్థలము, ఉత్తచోటు ఖాలీగా వుండే చోటు. he was gazing on * ఆకాశమును చూస్తూ వుండినాడు. he shows great * of mind పిచ్చివాడివలె వున్నాడు. an office not occupied, not filled up ఖాలీగా వుండే వుద్యోగము. there is at present a * in the king's household రాజసంస్థానములో వొకపని ఖాలీగా వున్నది.
Vacant adj empty, free, not occupied శూన్యముగా వుండే, ఖాలీగా వుండే, వట్టి, ఉత్త. at present the house is * ఇప్పుడు ఆ యిల్లు ఖాలీగా వున్నది. is there any place * for me ? నాకు చోటు యేదైనా ఖాలీగా వున్నదా. that appointment is now * ఆ వుద్యోగానికి యిప్పుడు యెవరు లేదు. in a * hour ఉత్తప్పుడు, సావకాశమైనప్పుడు. the throne remained * for one year సంవత్సరముదాకా సింహాసనము వూరికె వుండెను, రాజు లేక వుండను. these acts show a * mind యీ పనులవల్ల వాడు జడుడైనట్టు తెలుస్తున్నది. a * face దేబెముఖము.
Vacation n s intermission of business of study విడుపు, సెలవు. intermission of judicial proceedings కోరట్టు మూశివుండే కాలము. after the winter * వర్షాకాలపు సెలవు దినాలు అయిన తర్వాత.
Vaccination n s the act of inoculating with the cow-pox అమ్మవారు పోయకుండా వుండడమునకై పాలుతెచ్చి పోడిపించడము.
Vaccine adj derived from cows ఆవు నుంచి పుట్టిన, గవ్యమైన. the * disease or cow pox స్ఫోటకము. * matter అమ్మవారు రాకుండా వుండడమునకు తెచ్చి పొడిచేపాలు, రసిక.
Vacillating adj wavering ; fluctuating ఊగులాడే, డోలాయమానముగా వుండే, అస్థిరమైన. a * friend నమ్మరాని స్నేహితుడు. he is in * health వాడి వొళ్ళు దినానికి వొక విధముగా వున్నది.
Vacillation n s wavering, fluctiuation of mind, unsteadiness అస్థిరము, చాంచల్యము, డోలాయమానము. disgrace and ruin will follow * of conduct నడత స్థిరములేని వాడికి అవమానమున్ను నాశనమున్ను వచ్చును.
Vacuity n s emptiness, void శూన్యము, పాడు, బయిలు, శూన్యస్థానము, సందు, బిలము.
Vacuum n s space unoccupied ఆకాశము, బయిలు, శూన్యము. this causes a * ఇందువల్ల నడమ సందు కలిగినది, ఎడము కలిగినది.
Vade-mecum n s ఏవేళా దగ్గిర వుంచుకోతగ్గ చిన్న గ్రంథము. the Amaram is the bramin's * బ్రాహ్మణులు అమరము నిత్యము దగ్గిర వుంచుకొనే గ్రంథముగా వున్నది. Johnson's Dictionary is the * of many English men జానుసను యొక్క నిఘుంటు యింగ్లీషు వారు శానామంది యేవేళా దగ్గిర వుంచుకొనే గ్రంథముగా వున్నది. the poet's *అలంకార శాస్త్ర సంక్షేపము.
Vagabond adj wondering దేశమ్మ కాకిగా తిరిగే, ఆకతాయయైన, పోకిరియైన.
Vagary n s wild freak ; a whim చిత్తభ్రమ, చపలచిత్తము, పోకిరిపని. to cut vagaries పోకిరితనాలు చేసుట.
Vagina n s the sheath, the cover కత్తివొర, వాడుకగా భగము.
Vagrancy n s state of wandering without a settled home దేశమ్మ కాకిగా తిరగడము, పోకిరిగా తిరగడము. they made a law against * దేశమ్మ కాకికా తిరిగేవాండ్లను శిక్షించవలశినదని చట్టము చేసినారు.
Vagrant n s an idle wanderrer, a vagabond దేశమ్మ కాకిగా తిరిగేవాడు, పోకిరి.
Vague adj unsettled, indefinite అనిశ్చయమైన, అస్పష్టమైన, అనిర్దిష్టమైన నిలకడలని, అస్థిరమైన. he used these words in a * sense యీ శబ్దములను యెటుబడితే అట్లా అర్థమయ్యేటట్టుగా ప్రయోగించినాడు.
Vail n s See Veil.
Vain adj fruitless, inefectual వ్యర్థమైన, నిష్ఫలమైన. all his efforts were * వాడు పడిన పాటంతా వ్యర్థమైపోయినది. in this * world యీ మాయా ప్రపంచములో. it is *to deny that he went there వాడు అక్కడికిపోలేదని అనడము వ్యర్థము. he spoke in * వృథాగా మాట్లాడినాడు. they took God's name in * తప్పు సత్యము చేసినారు. Proud గర్విష్ఠియైన, అహంకారియైన, పొగరుబోతైన, తలకొవ్విన.
Vainglorious adj proud, boastful, elated to excess గర్వియైన.
Vainly adj without effect నిష్ఫలముగా, వృథాగా. Proudly అహంకరించి, గర్వించి.
Valance n s a piece of drapery hanging round the tester of a bed జాలరు.
Vale n s a valley పల్లము, రెండు కొండల సందున వుండే పల్లము. they went over hill and * మిట్టలు పల్లాలు దాటిపోయినారు, కొండలు గుహాంతరములు దాటిపోయినారు. whilehe was in the gloomy * of affliction వాడు నిండా వ్యాకులమనే అంధకార బంధురమైనబొందలో పడి యుండగా. in this * of tears యీ నరక కూపములో, అనగా ఇహమందు. he is now in the * of years నిండా యేండ్లు చెల్లి దీనదశను పొంది యున్నాడు. he was now declining into the * of years వృద్దాప్యముచేత దీనదశను పొందుతూ వుండినాడు.
Valediction n s a bidding farewell పోయివస్తానని దండము పెట్టడము.
Valedictory adj regarding a farewell పోయివస్తానని దండము పెట్టడమును గురించిన. he wrote them a * letter పోయివస్తానని వాండ్లకు వందనముగా వొక జాబు వ్రాశినాడు.
Valence n s See Valance.
Valentine n s name of a certain Saint వొక ఋషి పేరు. a letter containing professions of love or affection, sent by one young person to another, on *'s day, which is the fourteenth day of February ఫిబ్రవరి నెల పధ్నాలుగో తేదియందు వొక చిన్నదిగాని చిన్నవాడు గాని తనకు పెండ్లాడవలెననే ఆశ వుండే వారి పేరిటికి తన వ్యామోహమును తెలియచేశే కొన్ని పద్యములు వ్రాశి తన చేవ్రాలుచేయక. your valentine అని చేవ్రాలుచేశి తపాలు ద్వారా పంపించేజాబు. she sent me a * నేను తన్ను పెండ్లాడవలెననే భావము అగుపడేటట్టుగా నాకు వొక జాబు వ్రాశినది.
Valerian n s a medicinal plant జటామాంసి.
Valetudinarian n s a weak, sickly person అశక్తుడు, దీర్ఘరోగిగా వుండేవాడు. he has been a * of two years రెండేండ్ల దాకా నవుస్తూ వుండినాడు.
Valiant adj bold, brave, courageous సాహసముగల, శూరుడైన, నిర్భయుడైన, విక్రయశాలియైన. Pot-valiant వుత్త తాగడము చేతవచ్చిన సాహసముగల. he was merely pot-* వాడికి యిది వుత్తతాగడముచేత వచ్చిన సాహసము.
Valiantly adv bravely, boldly సాహసముగా, శౌర్యముగా, ధైర్యముగా.
Valid adj firm good in sound దృఢమైన. ప్రామాణికమైన, బలవత్తైన, ప్రబలమైన. he has no very * pretensions to the name of a pandit వొక పండితుడనే పేరుకు వీడు నిండా దృఢమైన అధికారమును కలిగి వుండేలేదు. a * objection మంచి ఆక్షేపణ.
Validity n s strength, force బలము, గట్టి, దార్ఢ్యము, భద్రము. he questioned the * of the bond యీ పత్రములో బలము లేదన్నాడు.
Valley n s a low ground between two hills పల్లము, కొండలసందు.
Valorous adj brave, courageous శౌర్యముగల, పరాక్రమముగల.
Valorously adv bravely శౌర్యముగా, పరాక్రమముగా.
Valour n s bravery, prowess, coruage శౌర్యము పరాక్రమము, ధైర్యము, శూరత్వము. a man of * పరాక్రమవంతుడు.
Valuable adj precious, estimable worthy ఘనమైన, మంచి, ఉపయుక్తమైన, అక్కరకు వచ్చే, పనికివచ్చే. a * friend ఉపయోగమైన స్నేహితుడు, అక్కరకువచ్చే మనిషి. this is a * horse, but he cost me a mere trifle యిది నిండా ఘనమైన గుర్రము అయితే కొంచెము వెలుకు చిక్కినది.
Valuation n s appraisement, setting a price మతింపు మూల్యము. I bought the house on a * ఆ యింటిని మతింపు మీద కొన్నాను. I wish you to make a * of the house నీవు ఆ యింటిని మతింపు వేయవలసినది.
Value n s rate, worth, improtance, respect వెల, మూల్యము, క్రయము, యోగ్యత, ఘనత. of what * is this gold ? యీ బంగారు యొక్క క్రయ మెంత. this is a house of inferior * యిద ఘనమైన యిల్లు కాదు. goods of superior * నిండా వెలగల సరుకు, పొడుగు సరుకు. they do not know the * of this pandit యీ పండితుడి యొక్క ఘనతను వాండ్లు యెరగరు. this horse cost me a large sum but he is of no * యీ గుర్రానికి నిండా రూకలువేశినాను యిది పనికి మాలినది. this medicine is of great * in fevers యిది జ్వరానికి నిండా అక్కరకు వచ్చే మందు. this medicine is of no * in fevers యిది జ్వరానికి వుపయోగములేని మందు. they considered this of no * దీన్ని అల్పముగా విచారించినారు. a knife of no * కాసు చేయని కత్తి. the * of a bond పత్రార్థము. the * of a bill హుండీ రుకలు. he gave goods to the * of twenty rupees యిరువై రూపాయలుచేశే సరుకు యిచ్చినాడు.
Valued adj appraised వెలకట్టబడ్డ, మతింపువేయబడ్డ. esteemed గణ్యముచేయబడ్డ, గొప్పగా విచారించబడ్డ.
Valueless adj having no worth కాసుచేయని, అల్పమైన, స్వల్పమైన, గణ్యములేని. his assertions are * వాడు చెప్పే మాటలు పనికిరావు నిరర్థకములు.
Valuer n s appraiser మతింపువేశేవాడు, వెలకట్టేవాడు.
Valve n s a folding door, a lid or cover మడపు తలపు, మూత, నీళ్ళు పొగ వీటి గొట్టముల మీది మూత. the * of a bellows is vulgarly called a wind-clap కొలిమితిత్తి యొక్క మూత.
Vamp n s the upper leather of a shoe జోడుపై తోలు.
Vampire n s a demon which is fabled to suck the blood of persons during sleep రక్తపానము చేసే దయ్యము, ఢాకిని, రక్తకాట్రేడు. the * bat ఋషిపిట్ట, అనగా పెద్ద గబ్బిలము. a cruel wretch ఘాతకుడు, చండి.
Van n s front of an army సేనా ముఖము, దండు యొక్క ముందరి భాగము. in the * సేనా ముఖము నందు they who are in the * of civilization జ్ఞానాభివృద్ది చేసే కార్యములో ప్రముఖలుగా వుండే వాండ్లు. a fan for winnowing grain చేట. a cart, or waggon బండి.
Vandyked adj లాహిరి అంచుగల, పావడమువలె వంకరవంకరగా వుండే అంచుగల.
Vane n s a weather cock గాలి యే తట్టు కొట్టే దిన్ని తెలిసే కొరకై వున్నత స్థలమందు వుంచబడ్డ యెటుగాలికొట్టితే అటు తిరిగే ధ్వజ విశేషము.
Vanguard n s the troops in front of an army సేనా ముఖము, దండుకు ముందరి తట్టు వుండే దళము.
Vanilla n s a plant of a fragrant smell పరిమళముగల వొక దినుసు, సుగంధముగల వృక్ష విశేషము.
Vanishing adj disappearing మాయమైపొయ్యే, అంతర్ధానమయ్యే. the * fly చీకటీగ.
Vanity n s empty pride, self conceit, emptiness అహంకారము, దుష్గర్వము, దురభిమానము, మాయ, శూనంత, నిరర్ధకత. In Psalm IV 2. కర్మార్థం. A+ మాయ. K+ in Ps. XIII 2. మిథ్య A+ D+ అబద్ధము K+. In Rom. VIII 20. అళీకత. A+ క్షయ బంధకము. K+. వ్యర్థము P+. In Epes. IV. 17. చంచలమతి. A+. అవివేకము. P+. దుర్బల బుద్ధి. K+.In Eccles. అసారము. A+ D+ The Vanity of Human wishes ముధామానుషేచ్ఛా, మానవేచ్ఛా,నిరర్ధకీ, మనుష్యులకోరిక వుత్తది.
Vanquished adj subdued; defeated జయించపడ్డ, వోడని.
Vantage n s see advantage లాభము. * ground, or clear unoccupied space బయిలు, మైదానము, ఆకాశము.
Vapid adj tasteless రుచిలేని, చవిలేని, నీరసముగా వుండే, చప్పగా వుండే. boiled water is * కాగి చల్లారిన నీళ్ళు నోటికి చప్పగా వుంటున్నది. a * book నీరసముగా వుండే గ్రంథము.
Vaporuing n s boasting జంభాలు నరకడము, అహంకారము.
Vapour n s fume ; steam పొగ, ఆవిరి, ధూమము. the * that hung over the plain in the morning తెల్లవారిపూట ఆ బయిలులో ముసుకొని వుండే పొగ మంచు. an appearance in the sun shine like the * యెండమావులు.
Vapours n s plu. foolish, imaginations : idle affections పిచ్చి కళలు, లేనిపోని వికారములు, వెర్రి యెన్నికలు, వట్టితలంపులు. (Droz says pets, whims వాయురోగ విశేషము, విరక్తభావము, చాంచల్యము, ఉద్వేగజనిత రోగము.) she has nothing the matter with her ; it is only the vapours దానికి వొళ్ళు యేమీలేదు వూరికె తెచ్చి పెట్టుకొన్న వికారములు. this gave her the vapours ఇందువల్ల దానికేమో వొక చీదర పుట్టి వున్నది, అనగా అది దిగులుపడినది.
Variable adj changeable, fickle అస్థిరమైన, చంచలమైన, అనిత్యమైన. the shapes of the clouds are * మేఘములు నిమిషానికి వొక ఆకారము గలవిగా వుంటవి. a * blue tint నిమిషానికి వొక విధముగా వుండే నల్లవర్ణము.
Variableness n s changebleness, unsteadiness అస్థిరత, చాంచల్యము, అనిత్యత్వము.
Variably adv changeably అస్థిరముగా, చాంచల్యముగా.
Variance n s a quarrel పగ, ద్వేషము ఘర్షణ. they are now at * వాండ్లు యిప్పుడు ద్వేషముగా వున్నారు.
Variation n s change ; difference, turn భేదము, వ్యత్యాసము, మారడము. he told the story without * వాడు ఆ కథను నిర్వ్యత్యాసముగా చేసినాడు, తూచా తప్పక చెప్పినాడు. he acted thus without * for one year వొక సంవత్సరము దాకా నిర్వ్యత్యాసముగా అట్లా నడుచు కొన్నాడు, తప్పక అదే రితిగా నడుచుకొన్నాడు. the * of the compass దిక్కులను చూపించే కాంతరాతిముల్లు యొక్క వ్యాత్యాసము. a * in music స్వరకల్పనలు.
Varicose veins n s ఉబ్బు నరాలు, ముఖ్యముగా పక్కలమీద పచ్చగా నల్లగా వుబ్బుకొని వుండ నరాలు.
Variegated adj with colour చిత్ర విచిత్రములుగా చేయబడ్డ, నానా ప్రకారములు చేయబడ్డ. a snake * with black and yellow పసుపు నలుపు మిశ్రితవర్ణముగల పాము.
Variety n s difference, intermixture, diversity భేదము, వ్యత్యాసము, విశేషము, విధము, చిత్రము. there are many varieties in fever జ్వరములలో నానాభేదములు కద్దు. he was actuated by a * of reasons నానావిధమైన హేతువులనుపట్టి వాడు అట్లా చేసినాడు, వాడు అట్లా చేసిన దానికి నానా హేతువులు కలవు. this has happened in a * of instances యిట్లా అనేక పర్యాయములు సంభవించినది. this bird is a * of the goose యీ పక్షి బాతులలో వొక బేధము. See Wilson Sankhya page 125.
Various adj different, diverse నానా విధమైన, నానాప్రకారమైన, వివిధమైన, చిత్రవిచిత్రమైన. * people opposed him వారు వారు వానికి విరుద్ధము చేసిరి. a crownadorned with * gems నానావిధ రత్న ఖచితమైన కిరీటిము. the children are of * ages ఆ బిడ్డలు నానావిధమైన వయసులుగల వాండ్లుగా వున్నారు. the houses are of * prices ఆ యిండ్లు వేరేవేరే వెలలు గలవిగా వున్నవి. the cloths are of * colours ఆ గుడ్డలు వేరేవేరే వర్ణములు గలవిగా వున్నవి. books in * languages నానా భాషలలో వుండే పుస్తకములు. news received from * quarters నాలుగు దిక్కుల నుంచి వచ్చిన సమాచారములు. he gave * rules about religion మతాన్ని గురించి నానావిధమైన సూత్రములుచెప్పినాడు. on * occasions అప్పుడప్పుడు, అనేక పర్యాయములయందు. a * reading or deviation in the text పాఠాంతరము, ప్రతిభేదము.
Variously adv in different ways నానావిధముగా. they are * employed వారువారు వేరేవేరే పనులలో పెట్టబడియున్నారు. I was * employed all day నేడంతా వేరేవేరే పునులలో వుంటిని. they were * clothed వాండ్లు నానావిధమైన వుడుపులు వేసుకొని వుండినారు.
Varlet n s a scounderal ; a rascal పోకిరి, తుంటకుర్రవాడు.
Varnish n s a gloosy liquid మైరుగు నూనె. his language was without the * of politeness వానిమాటలలో సన్మరియాద అనే స్నిగ్ధత లేకుండా వుండినది. అనగా సరసముగా వుండలేదు. * tree ధూపవృక్షము. గుగ్గిలపు చెట్టు.
Varnished adj made bright with oil మైరుగునూనె పూయబడ్డ.
Vascular adj consisiting of or full of vessels నాడీ సంబంధమైన.
Vase n s a vessel కుంభము, కలశము, ఘటము, కుండ, చెంబు. a glass * గాజుపాత్ర.
Vassal adj base, mean చేతికింద వుండే. the * peassantry కట్టుబడికాపులు.
Vassalage n s slavery దాసత్వము, అధీనత్వము. the miserable * of debt అప్పుపడడము అనే దిక్కుమాలిన దాసత్వము.
Vast adj very great విస్తారమైన, బ్రహ్మాండమైన. there is a * difference between these two యీ రెంటికిన్ని నిండా భేదము వున్నది. he paid a sum for it ఇందున గురించి నిండా రూకలు యిచ్చినాడు. the * scull of the elephant యేనుగ యొక్క పెద్ద పుర్రె. a * oak పెద్ద వృక్షము. a * distance నిండా దూరము.
Vastly adj greatly, much నిండా, విస్తారముగా, బ్రహ్మాండముగా. they were * astonished నిండా ఆశ్చర్యపడ్డారు. * cold నిండా చలి. * well శాబాసు ఇది యెగతాళి మాట.
Vastness n s greatness బ్రహ్మాండత, అధికత, విస్తారత. from the * of the sum demanded అడిగిన రూకల మొత్తము బ్రహ్మాండమైనది గనక.
Vat n s a vessel తొట్టి. an indigo * నీలి తొట్టి.
Vatican n s the pope's palace రోమనే పట్టణములో పోపనే ప్రధాన గురువువారి నగరు. the thunders of the * పోపు అనే గురువు వారి శాపములు, వారు గద్దించే గద్దింపులు.
Vaticination n s prediction ; prophecy అనాగ తమును చెప్పడము, యికను నడవపొయ్యే దాన్ని చెప్పడము.
Vault n s a continued arch, a cellar, a cavern వంపు కట్టడపుయిల్లు అనగా యిటికలు సున్నము అతికి విలుబద్దరీతిగా వంపుగావంచి కట్టే నేలమాళిగ, గుహ. the stars that twinkle in the * of heaven ఆకాశములో మిణుకుమిణుకు లనే నక్షత్రములు. the money that was in the *s of the treasury బొక్కసము యొక్క నేలమాళిగలో పెట్టియుండిన రూకలు. a place for corpses శవములను పెట్టెలలోవేశి బిగించివుంచే నేలమాళిగ. a leap or jump గంతు, లాగు. To Vault, v. n. to leap గంతులు వేసు, లాగువేసుట.
Vaulted adj built with an arch వంపు కట్టడముగా కట్టిన, యిటిక సున్నము అతికి వింటి బద్దరీతిగా వంచికట్టిన. a * room వంపుకట్టడముగా కట్టిన గది.
Vaulter n s he who leaps గంతులు వేశేవాడు, దొమ్మరవాడు.
Vauneville n s a kind of song or tune ఒక విధమైన పదము, వొకవిధమైన రాగము. ఇది ఫ్రెంచి భాష.
Vaunt, Vaunting n s. boast, brag స్వస్తోత్రము, జంభాలు, గచ్చులు, జల్లి.
Veal n s the flesh of a calf దూడమాంసము,
Veda n s (the Indian scriptures) వేదము, శృతి.
No comments:
Post a Comment