Monday, February 7, 2011

Unsubstantial

Unsubstantial adj not real, not solid, not firm అస్థిరమైన, మాయగా వుండే,భూటకముగా వుండే. the * pleasures of this life ఐహికములైన అల్పసుఖములు.
Unsuccessful adj failing, disappointing నిష్ఫలమైన, వ్యర్థమైన. In thisbusiness he was * యీ పని వాడికి సఫలము కాలేదు. an * affair నిష్ఫలమైన పని.
Unsuccessfully adj vainly, emptily నిష్ఫలముగా, వ్యర్థముగా. he * tried toget back the money ఆ రూకలను రాబట్టుకోవలెనని చూచినాడు గాని నిరర్థకమైనది.
Unsufferable adj intolerable తాళగూడని, పడగూడని, సహించగూడని.
Unsuitable adj not fit, not proper తగని, అయోగ్యమైన, అన్యాయమైన.
Unsuitably adv not fitly, not rightly అన్యాయముగా, తగనిరీతిగా.
Unsullied adj not spotted, not stained నిష్కళంకమైన, నిర్మలమైన,స్వచ్ఛమైన.
Unsung adj not celebrated in verse పద్యములుగా చెప్పి శ్లాఘించబడని,కొనియాడబడని. that deed remains * ఆ వ్యవహారము పద్యములుగా రచించబడకయున్నది.
Unsunned adj not exposed, hidden దాచిపెట్టబడ్డ. * silver దాచిపెట్టబడ్డవెండి.
Unsupplied adj not provided జాగ్రత చేయబడని, సిద్ధము చేయబడని. a cart isas yet * యింకా వొక బండీ కుదరలేదు. I am as yet * with a cart నాకు యింకావొక బండి కుదరలేదు.
Unsupportable adj that cannot be born పడగూడని, తాళగూడని,సహించగూడని.
Unsupportably adv intolerably పడగూడక, తాళగూడక వుండేటట్టు.
Unsupported adj not sustained సహాయము చేయబడని, సహాయ విహీనమైన.
Unsure adj not fixed; not certain అస్థిరమైన, అనిశ్చయమైన, నమ్మరాని.
Unsurmountable adj that cannot be mastered అసాధ్యమైన.
Unsurmountably adv vastly, hugely అతిశయించి, అసాధ్యముగా.
Unsurpassed adj not exceeded అసమానమైన.
Unsusceptible adj incapable వల్లకాని, వల్లగా వుండని. they are very * వాండ్లువట్టి మొద్దులు. this house is * of improvement యీ యిల్లు చక్కపెట్టడమునకువల్ల లేకుండా వున్నది.
Unsuspected adj not supposed అనుమానించబడని. this writer of thisletter is * by any one యీ జాబు వ్రాసిన వాడు యిట్టివాడని యెవరికిన్నీ తగలలేదు.
Unsuspecting, Unsuspicious adj not doubting అనుమానపడని, సందేహించని,సంశయపడని.
Unsustained adj not supported నిరాధారమైన, పెంచబడని, పోషించబడని,ప్రోద్బలము చేయబడని.
Unswayed adj not moved, not yielding లోబడని. * by partiality he madethis decision పక్షపాతమునకు లోబడక యీ తీర్పు చేశినాడు.
Unswept adj not cleansed by the broom or brush వూడబడని, తుడవబడని.
Unswerving adj not changing నిర్భిన్నమైన, దృఢమైన, నిబ్బరమైన. he wenton with * rectitude in this business యీ పనిలో నిబ్బరముగా నిలకడగలవాడైజరిగించినాడు.
Unswervingness n s దార్ఢ్యము, నిబ్బరము.
Unsworn adj not having taken an oath ప్రమాణము చేయబడని, ప్రమాణముచేయించబడని. an * withness ప్రమాణము చేయకుండా సాక్షి చెప్పినవాడు.
Untainted adj not stained, pure నిర్మలమైన, నిష్కళంకమైన.
Untaken adj not seized పట్టబడని.
Untalked of adj not mentioned అప్రసిద్ధమైన, పదిమంది నోటబడని.
Untameable, Untamed adj అణగని, వశపడని, పనుపరచకూడని, అస్వాధీనమైన,గడుసైన. he shewed * pride వాణి గర్వము యింతంత కాదు.
Untasted adj not touched, not enjoyed రుచి చూడబడని, చవిచూడబడని,అననుభూతమైన, అంటబడని. he left his dinner * వొక మెతుకైనా నోటబెట్టుకోకలేచిపోయినాడు.
Untaught adj. not instructed నేర్పబడని, అశిక్షితమైన,చదవని, an * poetచదువలేకనే కవనధారగలవాడు, పుట్టుకవి. an * mathematician గురువు లేకనేమహాగణితము తెలుసుకొన్నవాడు.
Unteachable adj who cannot be instructed శిక్షకు అనర్హుడైన. he is * byadversity యింత దరిద్రము వచ్చిన్ని వాడికి తెలివి రాలేదు.
Untempered adj not properly prepared పక్వము కాని, మిశ్రితము కాని. *mortar పక్వముగా వుండని సున్నము. words * with discretion వివేక మిశ్రితముకాని మాటలు, అనగా తెలివిలేని మాటలు.
Untempted adj లోబడని. he was * by all their promises వాండ్ల మాటలకువాడు లోబడలేదు.
Untenable adj which cannot be kept, indefensible రక్షణీయముకాని, భద్రముకాని, నిలుపుకోశక్యము కాని. this rendered the post * యిందువల్ల అక్కడనిలిచేటందుకు లేక పోయినది. your position is * నీవు వుండే స్థానము భద్రము కాదుఅనగా నీవు చెప్పిన మాట నిజపరచ కూడదు.
Untenanted adj empty కాపురము లేని, వూరికె వుండే. the house is atpresent * ఆ యిల్లు యిప్పుడు వూరికె వున్నది, ఆ యింట్లో యెవరున్ను కాపురము లేదు.as I could not afford to let the house remain * so long అన్నాళ్ళ దాకా ఆ యింటిని కాపురము లేకుండా వూరికె వుండనియ్యడము నాకు పడదు గనుక.
Untended adj not cared for కాచబడని, కాపాడబడని, పోషించబడని,సంరక్షించబడని. the children being * ran wild ఆ బిడ్డలు హద్దు ఆజ్ఞలోవుంచబడనందున దుండగాయలై పోయినారు. ఆశిక్షితు లైనందున వ్యర్థులైపోయినారు.
Unterrified adj not frightened, not alarmed నిర్భయులై, భయపెట్టబడని వారై.
Unthankful adj not grateful కృతజ్ఞతలేని. they were * for all he did వాడుచేసిన మేలును యెరగక పోయినారు.
Unthankfulness n s ingratitude కృతజ్ఞత చేసిన మేలును మరవడము. thisshowed great * చేసిన మేలును మరిచినారని యిందువల్ల తెలిసినది.
Unthawed adj not melted కరగని. the ice is still * మంచుగడ్డ యింకాకరగలేదు. I said all I could but he remained * నేనెంత చెప్పినా వాడి మనసుకరగలేదు.
Unthinking adj inconsiderate, careless అజాగ్రతగా వుండే, అవివేకియైన,చపలుడైన, అవధానము లేని.
Unthinkingly adv thoughtlessly, carelessly అజాగ్రతగా, తోచక.
Unthought of adj not considered, not heeded తలచని, మరచిన, ఎంచని.the expense of this is unthought of దీని వ్రయము వొక లక్ష్యము కాదు. thiswas unthought of దీన్ని తలచినారు కారు.
Unthrashed adj not cleansed from the straw నూర్చబడని. they sold thecrop * ఆ పయిరును నూర్చకుండానే అమ్మివేసినారు.
Unthreaded pearls n s విడి ముత్యములు.
Unthreatened adj not menaced, not frightened బెదిరించబడని. at presentthey are * with ill వాండ్లకు యిప్పట్లో చెరుపు యొక్క భయము లేదు.
Unthrift n s దూబరదండితనము, అజాగ్రత. * ruined him దూబరదండితనము వల్లచెడ్డాడు.
Unthriftily adv carelessly అజాగ్రతగా, దూబరదండితనముగా.
Unthriftiness n s imprudence, waste అజాగ్రత, దూబరదండితనము.
Unthrifty adj wasteful దూబరదండియైన.
Unthroned adj deposed పడదోయబడ్డ, రాజ్యభ్రష్టుణ్నిగా చేయబడ్డ.
Untiariansism n s Gent. Mag. March 1828. p. 225."Unitarianism is to Christianity, what emasculation is tothe human race: a savage mutilation, fit only forMahomedans."
Untidily adv not in good order వికారముగా.
Untidiness n s want of neatness వికారము.

Untidy adj not neatly dressed వికారమైన.
Untied adj loosened విచ్చబడ్డ, విడిగా వుండే.
Until adv as far as దాకా, వరకు, పరియంతము, మట్టుకు. he remained * theend of the year ఆ సంవత్సరము ముగిశేవరకు కనిపెట్టుకొని యుండినాడు. I waited* winter శీతకాలము దాకా కనిపెట్టుకొని యుంటిని. I waited * he could comeఅతడు వచ్చేపరియంతము కాచుకొని వుండినాను. * now యిందాకా.
Untilled adj not cultivated దున్నని. the fields remained * for four years ఆ నేల దున్నక నాలుగేండ్లు పాడుగా వుండినది.
Untimely adj unreasonable, happening before the usual time ఆకాలములో సంభవించిన, కాలము కాని కాలములో తటస్థించిన. * death అకాలమరణము.in an * hour ఆకాలములో, చెడువేళలో.
Untinctured with adj devoid of విహీనమైన.
Untired adj not exhausted by labour అలియని, బడలని.
Untitled adj having no title విశేష నామము లేని.
Unto కి,కు To, unto him అతనికి.
Untold adj not described చెప్పబడని, ఉదాహరించబడని. some circumstancesremain * కొన్ని సంగతులు చెప్పక విడిచివున్నవి. in numbers * that iscountlessly అసంఖ్యేయముగా, యెన్నికలేక.
Untouched adj not hit తాకని, తగలని. he was * by the dart ఆ బాణము వాడిమీద తగలలేదు. he was * at their grief వాండ్ల దుఃఖము వీడికి తగలలేదు, వాండ్లుదుఃఖపడిన దాన్ని చూచి వీడు దుఃఖపడలేదు. the money is * until now ఆ రూకలుయిదివరకు తాకబడకుండా వుండినవి, చెక్కు చెదరకుండా వుండినవి.
Untowards adj awkward; ungraceful వికారమైన, అవలక్షణమైన. this is an* event యిది విపరీతత మైన పని. * intelligence చెడు సమాచారము. an * boyఅణగని పిల్లకాయ, దుష్టపిల్లకాయ. he is an * solicitor చేతకాని మంత్రి. the timesare * కాలము బాగా వుండలేదు.
Untowardsly adj awkward; pervese; forward చెడు, చెడ్డ, దుష్ట, కాని,చేతకాని. this was an * circumstance యిది కాని సంగతి, చెడు పని. * omensదుశ్శకునములు.
Untractable adj obstinate, rude దోవకు రాని, మొండియైన, మూర్ఖమైన.
Untractableness n s stubbornness మొండితనము, మూర్కత్వము.
Untrained adj not disciplined పనుపరచబడని, అశిక్షుతుడైన. what is thegood of * troops ? అశిక్షితులైన బంట్లవల్ల యేమి ప్రయోజనము.
Untrammelled adj free, not burdened చిక్కులేని, ఇబ్బందిలేని. he is quite *వాడికి వొక జంజాటము లేదు, చిక్కులేదు. as he is * with a family సంసారమనేయిబ్బంది లేనివాడుగా వున్నాడు గనక. those who are * with debts ఋణములనేపీకులాటలేని వాండ్లు.
Untranslateable adj which cannot be rendered భాషాంతరము చేయడమునకువల్లకాని. the word freeholder is * into Telugu. The word సపిండులు is *into English యీ రెండు మాటలు భాషాంతరము చేయకూడనివి.
Untravelled adj home-staying, ignorant యిల్లు విడిచి బైట కదలని, యేమీయేరగని, ప్రపంచ మిట్టిదని యెరగని not trodden by passengers మనుష్యసంచారము లేని. the * wilderness మనుష్య సంచారము లేని అడవి.
Untried adj not attempted, not experienced, not examined ప్రయత్నముచేయబడని అనుభవము లేని, విమర్శించబడని. ten prisoners remain * యింకాపదిమంది కయిదీలు విచారించబడక యున్నారు.
Untrimmed adj not dressed, not set right, not pruned దిద్దబడని, క్రమపరచబడని, బాగు చేయబడని, కత్తిరించబడని, కోయబడని. their beards were * for sixmonths వాండ్ల దాడీలు ఆరు నెలల దాకా దిద్దబడలేదు, కత్తిరించి బాగు చేయబడలేదు. thetrees are all * ఆ చెట్లు అధిక కొమ్మలు నరికి బాగుచేయబడ లేదు. he wore hishead * for a year వొక సంవత్సరము దాకా తల పెంచుకొని వుండినాడు. the lightremained * until morning తెల్లవారేదాకా ఆ దీపపు కొడి కత్తిరించి చక్కపెట్టబడలేదు.
Untrod, Untrodden adj not pressed with the foot తొక్కబడని,సంచరించబడని.
Untroubled adj not grieved, not agitated తొందర పెట్టబడని, నిరాయాసముగావుండే, హాయిగా వుండే, కలపబడకుండా వుండే. the water is * నీళ్లు కలపబడకుండావున్నది. he is * with visitors దర్శనమునకు వచ్చేవాండ్ల తొందర లేకుండా వున్నాడు.
Untrue adj false అబద్ధమైన. they consider these stories * యీ కథలనుఅబద్ధమని యెంచుతారు.
Untrusworthy adj not deserving of confidence నమ్మరాని,అవిశ్వసనీయమైన.
Untruth n s falsehood అబద్ధము, అనృతము, కల్ల.
Untuned adj without pleasing sound చెవులకు యింపుకాని.
Unturned adj not changed తిప్పని, తిరగవెయ్యని. he left no stone * toeffect this దీన్ని సాధించడానికి వాడు చేయని ప్రయత్నము లేదు, వాడు పడని పాటులేదు.
Untutored adj not instructed శిక్షించబడని, పనుపరచబడని. he is an * painterశిక్షలేక చిత్రపని నేర్చుకొన్నవాడు.
Untwined, Untwisted adj loosened విచ్చిన, మెలి విచ్చిన.
Unused adj lying idle వూరికె వుండే. the horses were * for ten daysగుర్రాలకు పది దినాళ దాకా పని లేక వుండినది. not accustomed పనుపరచబడని,అలవరచ బడని. they are * to swimming వాండ్లకు యీదడము అలవాటు లేదు.
Unusual adj not common అపూర్వమైన. such behaviour is * యిట్లాచేయడము విపరీతము, యిట్లా యెక్కడనైనా కద్దా.
Unutterable adj not to be spoken అనరాని, చెప్పనలవిగాని, అనిర్వచనీయమైన.the * name of God చెప్పనలవిగాని దేవుని పేరు.
Unvalued adj not prized; neglected అలక్ష్యము చేయబడ్డ.
Unvanquished adj not conquered జయించడబడని.
Unvariable adj perpetual నిత్యమైన, మారని, నిర్వ్యత్యాసమైన. this is an *rule యిది తిరగని నిబంధన.
Unvaried adj constant అవిచ్చిన్నమైన, నిర్వ్యత్యాసమైన. from his * attentionto business వాడు పనిలో జీమూతముగా వున్నందున.
Unvarnished adj not adorned శృంగారించబడని. he told me an * tale జరిగినపని శృంగారించకుండా నాతో చెప్పినాడు అనగా వున్నది వున్నట్టు చెప్పినాడు.
Unvarying adj not changeable, constant మారని, నిర్వ్యత్యాసమైన. this isthe * custom యిది యెప్పుడూ నడిచే మర్యాద.
Unveiled adj displayed, showed openly తెలియచేయబడ్డ, విశదముగాఅగుపరచబడ్డ, స్పష్టమైన, విశదమైన.
Unventilated adj not fanned by the wind గాలి అడవి, గాలి చొరరాని.
Unversed adj not skilled అసమర్ధుడైన. as they are * in trade వాండ్లువర్తకములో వ్యక్తులు కారు గనక.
Unvexed adj not tormented నిరాయాసమైన, తొందరలేని. they who are * withlaw suits వ్యాజ్యములనే పీకులాట లేనివాండ్లు.
Unviolable adj Sacred ఘనమైన, తప్పరాని. an * oath మహత్తైన ప్రమాణము.
Unviolated adj not injured, not broken అబాధితమైన, బాధించబడని,చెరపబడని. their honor is * వాండ్ల గౌరవానికి హాని లేదు. no temple remained *చెరపబడని గుడి లేదు.
Unwalled adj not fortified by wall గోడలు లేని.
Unwarily adv heedlessly అజాగ్రతగా, పరాకున.
Unwarlike adj not able to fight యుద్ధానకు అర్హముకాని.
Unwarned adj not informed ఎరుక చేయబడని, ఎచ్చరిక చేయబడని. I was * ofthis దీన్ని గురించి నాకు యెచ్చరిక చేయలేదు.
Unwarrantable adj not just అన్యాయమైన, అక్రమమైన.
Unwarrantably adj unjustly అన్యాయముగా. he is * angry వాడు యింతకోపము చేయరాదు.
Unwarranted adj not authorized అధికారము లేని, అదరువులేని, సాధకము లేని.his acts are * అతడు చేసినది వట్టి అన్యాయము. this interpretation is * యీఅర్థమునకు సాధకము లేదు.
Unwary adj not cautious జాగ్రత లేని.
Unwashed adj not cleansed by water కడగబడని.
Unwasted adj not lavished away వ్రయమైనపోని, క్షయించని, కరిగిపోని.
Unwasting adj not growing less క్షయించని, కరిగిపోని.
Unweakened adj not enfeebled దుర్భలము కాని, those who are * bydisease రోగము చేత దుర్బలులైపోని వాండ్లు. his statements are * by theirreply వాండ్ల వుత్తరమువల్ల వీడు చెప్పినది దుర్బలమైపోలేదు.
Unwearied adj not fatigued అలియని, అలసటలేని. he paid an * attentionto this వాడి మనసంతా వీడి మీదనే వుంచినాడు. he answered them with *patience విసుకు లేక సహనముగా వుత్తరము చెప్పినాడు.
Unweariedly adv without ceasing విసుకు లేకుండా, జీమూతముగా, ఏకదీక్షగా.he served them * for ten years పది యేండ్ల దాకా విసుకు లేకుండా వారి వద్దకొలిచినాడు. he bore her bad temper * for five years అయిదు యేండ్ల దాకామనసు తాళుకొని దాని దుర్గుణమును సహించుకొన్నాడు.
Unwed adj unmarried పెండ్లాడని, పెండ్లి చేసుకోని.
Unweeting adj ignorant ఎరగని, తెలియని.
Unweighed adj not examined by the balance తూచబడని, విచారించబడని.
Unweighing adj inconsiderate; thoughtless ఆలోచనలేని.
Unwelcome adj not pleasing అశుభమైన, అప్రియమైన, దుఃఖకరమైన.
Unwell adj not in good health ఒళ్లు కుదురు లేని. he is * వాడు అస్వస్థముగావున్నాడు.
Unwept adj not lamented ఏడవబడని, చింతించబడని. they died * వాండ్లుచచ్చిన దానికి యెవరూ యేడవ లేదు.
Unwhipt adj not punished శిక్షించబడని.
Unwholesome adj not healthy ఆరోగ్యము కాని, రోగకారియైన. this rice is *యీ బియ్యము వొంటికి కాదు.
Unwholesomeness n s unhealthiness రోగకారిత్వము. from the * of greenfruit పచ్చికాయలు వొంటికి గిట్టవు గనక. from the * of this place యిక్కడి నీళ్లువొంటికి పట్టనందున.
Unwieldily adv inconveniently, awkwardly heavily, with difficultyభారముగా, అలవికాకుండా, వల్ల కాకుండా, సంకటముగా. he walked * తన వొళ్ళునుతాను మోయలేకుండా నడిచినాడు.
Unwieldness n s heaviness; difficulty of being moved బరువు, అసాధ్యత.from the * of the statue ఆ ప్రతిమ నిండా బళువైనందున, ఆ విగ్రహముయెత్తడమునకు పట్టడమునకు వల్లకానిదిగా వుండినందున. from the * of thecommentary ఆ వాఖ్యానము అతి బ్రహ్మాండమైనది గనక.
Unwieldy adj difficult to manage, clumsy అసాధ్యమైన, అరపరాని, బళువైన.an * gun నిండా బరువుగా వుండే తుపాకి, యెత్తను పట్టను వల్లగాని తుపాకి. an * swordసుళువుగా తిప్పడానికి వల్లగా వుండిన కత్తి.
Unwilling adj disinclined ఇష్టము లేని, సమ్మతిలేని. I was * to do this దీన్నిచేయడానకు నేను సమ్మతి లేకుండా వుంటిని.
Unwillingly adv reluctantly అసమ్మతముగా, అయిష్టముగా. he paid themoney * ఆ రూకలను అసమ్మతముగా చెల్లించినాడు.
Unwillingness n s disinclination అసమ్మతము, వొల్లమి.
Unwise adj foolish తెలివిమాలిన, అవివేకియైన, వెర్రి. it was * in you to tellhim this దీన్ని వాడితో చెప్పినది పిచ్చి.
Unwisely adv foolishly అవివేకముగా, తెలివి లేకుండా, పిచ్చితనముగా.
Unwished adj undesired కోరని, అసహ్యమైన.
Unwitnessed adj without testimonial సాక్షి లేని. an * bond సాక్షిలేని పత్రము.
Unwitting adj not knowing ఎరగని, తెలియని.
Unwittingly adv ignorantly తెలియక, ఎరగక.
Unwnoted adj not accustomed, not common వింతైన, విపరీతమైన,అపూర్వమైన చోద్యమైన.
Unwnrung adj not pinched మెలిపెట్టబడని, క్లేశపెట్టబడని. those who are *with poverty దరిద్రము చేత క్లేశపడనివాండ్లు.
Unworldliness n s freedom from passion వైరాగ్యము, కామక్రోధాదిరాహిత్యము.
Unworshipped adj not honoured పూజించబడని.
Unworthily adv not properly, not correctly అయోగ్యముగా. they treatedhim * or they acted * to him వాడి విషయములో అయోగ్యముగా నడిచినారు,దుర్మార్గముగా నడిచినారు.
Unworthiness n s baseness, meanness అపాత్రత, అయోగ్యత. from the *of his conduct వాని దుర్నడతవల్ల.
Unworthy adj unfit, improper అయోగ్యమైన, అనర్హమైన, తగని. this is *conduct యిది తగని పని. he is an * wretch వాడు అప్రయోజకుడు. this was *of you యిది నీకు తగదు.
Unwound adj opened, loosened విచ్చబడ్డ. after the cord was * ఆ దారపుచుట్ట విచ్చిన తర్వాత.
Unwounded adj not hurt గాయము తగలని. they escaped * గాయముతగలకుండా తప్పించుకొన్నారు.
Unwritten adj not recorded వ్రాయబడని. the * law గ్రంథస్థము కాని విధి,శాస్త్రచోదితము కాని నిబంధన, అనగా లోకసాధారణమైన విధి.
Unwrought adj not manufactured పనిచేయబడని. * silk చక్కపెట్టబడనిపట్టునూలు. * timber చెక్కి చక్క పెట్టబడని మానులు.
Unyeilding adj tough, stiff బిర్రుగా వుండే, వంగని, an * bow వంగనివిల్లు. *pride నిక్కి నీల్గడము. an * temper క్రౌర్యము.Unyieldingly, adv. stiffly బిర్రుగా, బిరుసుగా, వంగక, లొంగక.
Unyoked adj freed from the yoke కాడికి కట్టి మరపబడని, విడిచిబెట్టిన.
Unzoned adj having no girdle నడికట్టు లేని.
Up adv and prepo. పైన, మీద, మీదికి, పైకి, నిండా, తీరా. the porcupinebristled * ముండ్ల పంది తన శరీరము యొక్క ముండ్లనంతా జలపరించుకొన్నది,నిక్కపొడుచుకొన్నది. before the sun was * సూర్యోదయాత్పూర్వము. these plantsare quickly * యీ చెట్లు శ్రీఘ్రములో పెరుగుతవి. from his youth * చిన్ననాటనుంచి, బాల్యాత్ర్పభృతి. when his blood was * వాడికి కోపము వచ్చినప్పుడు,వాడు రేగినప్పుడు. his credit is * వాడి యందు నమ్మకము తప్పినది. he is awakebut he is not yet * నిద్ర మేలుకొన్నాడు గాని యింకా పడక విడిచి లేవలేదు. he is *పడక విడిచి లేచివున్నాడు. he was * all night వాడు రాత్రి అంతా పండుకోలేదు. thegame is * with him వాడి పని తీరినది, వాడు చెడిపోయినాడు. they are always *early వాండ్లు యెప్పుడూ పెందలకాడే లేస్తారు. is your father * ? నీ తండ్రిలేచినాడా, పడక విడిచి యివతలికి వచ్చినాడా. the water was * to the waistమొలమట్టు నీళ్లుగా వుండినది. he is * to any thing పాట్ల మారిగా వున్నాడు, కడగండ్లుపడ్డవాడుగా వున్నాడు. * to that day ఆ దినము వరకు. * to this time యిదివరకు. he is* stairs మిద్దె మీద వున్నాడు. * with the tent డేరా వేయండి. * with the fladజండా వేయి. * with it దాన్ని పైకి తొయ్యి. he came * to the door యింటి వద్దికివచ్చినాడు, యిల్లు చేరినాడు. come * పైకిరా. to eat * తినివేసుట. he drew * anaccount వొక లెక్క సిద్ధపరచినాడు. fill the jar * ఆ జాడిని నించు. when he got *వాడు లేచేటప్పటికి. he gave * the business ఆ పనిని మానుకొన్నాడు. he is gone* the country నాటుపురానికి పోయివున్నాడు. he is gone * పైకి పోయి వున్నాడు. hewent * the hil కొండ మీదికి యెక్కినాడు. he went * to them వాండ్ల దగ్గిరికిపోయినాడు. he laid * the corn ధాన్యమును కట్టిపెట్టినాడు, చేర్చిపెట్టినాడు. they made * a story వొక కథను కట్టి విడిచినారు, కల్పించినారు. they made * the quarrel సమాధానపడ్డారు, రాజి అయినారు. I added some wood to make * a load వొక మోపు కావడానికి కొన్ని కట్టెలను చేర్చినాను. at last they made * the affair తుదకు రాజి అయినారు. pack them * వాటిని మూటలుగా కట్టు. to pluck * or pull * పీకి వేసుట, పెరుకుట. they plucked * courage and came forward ధైర్యము తెచ్చుకొని బయిలుదేరినారు. to shut * మూశివేసుట. he shut * the gate ఆ వాకిలికిఅడ్డముగా గోడపెట్టి వేసినాడు. he shut * the shop అంగడి యెత్తివేసినాడు. thewater coming from the river shut * the road ఆ యేట్లో నీళ్ళు వచ్చినందున ఆ దారి మూత పడిపోయినది. to sum * వెరశికట్టుట. speak * బిగ్గరగా మాట్లాడు. to tear * చించివేసుట, పీకివేసుట. she threw the ball * or tossed it * ఆ చెండు యెగరవేసినాడు. he tied * the cow ఆవును కట్టినాడు. he vomited * కక్కినాడు, వమనముచేసినాడు. he was walking * and down ఇటు అటు తిరుగుతూవుండినాడు. thegarden is all * and down ఆ తోట అంతా మిట్టలు పల్లాలుగా వున్నది. his writingis all * and down వాడు కొక్కిరి బిక్కిరిగా వ్రాస్తాడు. the ups and downs of lifeహానివృద్ధులు, మంచిచెడు, కీడుమేలు.
Upas n s విషవృక్షము, చావుచెట్టు, యీ చెట్టును తాకే వాండ్లు చస్తారు.
Upeast adj thrown upwards పైకి యెత్తబడ్డ. they viewed him, with * eyesకండ్లు పైకెత్తి చూచినారు.
Upheld pastp|| sustained; supported పైకియెత్తబడ్డ,ఆదుకోబడ్డ
Uphill adj difficult తొందరైన, సంకటమైన, అసాధ్యమైన. it is very * work అదినిండా కష్టమైన పని, అసాధ్యమైన పని.
Upholder n s a supporter రక్షించేవాడు, ఆదుకొనేవాడు.
Upholsterer n s one who furnishes houses with beds, curtains, andthe like యింటికి కావలసిన మంచములు తెరలు కురిచీలు మొదలైన కొయ్య సామానులుజాగ్రతచేసేవాడు.
Upholstery n s furniture కురిచీలు బల్లలు మొదలైన యింటికి కావలసినసామానులు.
Uplands n s hill countries కొండలమీద వుండే దేశములు.
Upon prep మీద. See On.
Upper adj మీది, పై. the * arm రెట్ట, సందిలి. the * classes ఘనులు, పెద్దలు.at the * end of the hall ఆ కూటాములో పైతట్టు. * garment ఉత్తరీయము. theygot the * hand of him వాణ్ని సాధించినారు. * room పైమిద్దె. the wine got intohis * story మైకము తలకెక్కినది.
Uppermost adj and adv. మీదిది, ముఖ్యమైనది. they have got * పైనయెక్కినారు, అనగా గెలిచినారు. this was * in his mind వాడి మనసులో యిదిముఖ్యముగా వుండినది. how to take care of his family was * in histhoughts వాడికి సంసారాన్ని గురించిన చింతే చింతగా వుండినది. in his mindrevenge was the * feeling వాడి మనసులో చలము తీర్చడమే ముఖ్యముగావుండినది. he made no choice he took which ever came* యిది అది యనివిచారించక చేతికి చిక్కినదాన్ని యెత్తుకొన్నాడు. we struggled together and whenwe fell he was * మేమిద్దరము గంట్లాడి కిందపడే టప్పటికి వాడు పై వాడుగావుండినాడు.
Uppish adj insolent, arrogant గర్వము గల, పొగరుగల.
Uppishness n s insolence, arrogance గర్వము, పొగరుబోతుతనము.
Upright adj and adv. erect; perpendicular నిలవుగా వుండే, నిక్క బొడుచుకొనివుండే, సరిగ్గా వుండే. the * lines on the forehead నిలువుబొట్టు. written on an *stone నిలువు రాతి మీద వ్రాయబడ్డ. honest just న్యాయమైన, నీతియైన. an * manసత్యసంధుడు, ప్రామాణీకుడు. the soldiers stood bolt * సిపాయీలునిక్కబొడుచుకొని నిలుచుండిరి. he held the sword * ఆ కత్తిని నిలవబట్టినాడు. hestood * యిటు అటు వంగక నిక్కబొడుచుకొని వుండినాడు. he fixed the pole * ఆస్తంభమును నిలవపాతినాడు.
Uprightly adv justly, honeslty, equitably న్యాయముగా, నీతిగా, సరీగా.
Uprightness n s honest న్యాయము, నీతి.
Uprising n s rising ఉదయము. from the * of the sun సూర్యోదయము నుంచి.
Uproar n s noise, trouble, bustle and clamour కూతలు, సందడి, కలహము,జగడము, రచ్చ, ఆర్భాటము. he made an * రచ్చ చేసినాడు. what is the good ofyour making such an * about this ? యీ పిచ్చి తాండవము వల్ల యేమిప్రయోజనము. the whole town was in an * about this యిందునగురించివూరంతా అల్లరిగా వుండినది, గబగుబలుగా వుండినది. an * of feelings మనసులోనికలవరము, తత్తరపాటు.
Uproarious adj making a great noise and tumult రచ్చపెట్టే, బొబ్బలు పెట్టే.an * child పోరు పెట్టే బిడ్డ.
Uproariously adv with great noise and tumult రచ్చగా, బొబ్బలుగా,కూతలుగా, అల్లరిగా.
Uprooted adj torn up by the roots కుంకుడు వేళ్ళతో పెరకబడ్డ, నిర్మూలముచేయబడ్డ.To Uprouse, v. a. to awake లేపుట, నిద్ర లేపుట.
Uprousing n s alarm, start fright భయము, దిగులు.
Upset adj overthrown బోర్లతోయబడ్డ.
Upsetting n s ruin, destruction నాశనము.
Upshot n s conclusion; end పర్యవసానము, తీర్పు. what was the * of thebusiness ? తుదకు ఆ పని యేమిగా తేలినది, తీర్పు యేమి, ఆ పని యేమి తీర్పు. inthe * తుదకు.
Upside-down adv తల్లకిందులుగా, బోర్లగా.
Upsides with adv equal సరిసమానముగా, యీడుజోడుగా. to be upsides withthem he paid the money వాండ్లను జయించడానకై యీ రూకలు చెల్లించినాడు. Iwas upsides with him in this యిందులో వాడి పని చెరిపినాను.
Upstairs adj and adv. మిద్దె మీద వుండే. he is * మిద్దె మీద వున్నాడు. he went* మిద్దె మీదికి పోయినాడు. an upstair house మిద్దె యిల్లు, పై మిద్దె గల యిల్లు. the down stairs are plain but the upstair rooms are much ornamentedకింద వుండే గదులు శృంగారించి వుండలేదు, మిద్దె మీది గదులు శృంగారించి వున్నవి.
Upstart n s a proud fool నడిమంత్రపు కలిమి చేత తుళ్ళిపడేవాడు, నిన్న కుప్పనేడాళ్ళుగా వుండేవాడు, చెడి బ్రతికినవాడు, వున్నట్టుగా వుండి ఘనత కెక్కినవాడు.
Upward, Upwards adv పైకి, మీదికి, పైన. from youth upwards చిన్ననాటనుంచి, బాల్యాదారభ్య. from a penny *s రూక దగ్గిర నుంచి. they were sold forten rupees and upwards కొన్ని పది రూపాయలకు కొన్ని పది రూపాయలకు పైగాఅమ్మబడ్డవి. upwards of twenty years యిరువై యేండ్లకు పైన. upwards of amonth నెలకు మించి.
Urbane adj gentle, civil, polite సాధువైన, నాగరీకముగల, సన్మర్యాదగల,సరుసుడైన. his language was very * వాడు నిండా మర్యాదగా మాట్లాడినాడు పెద్దమనిషిగా మాట్లాడినాడు.
Urbanity n s facetiousness సరసత, మర్యాద, నాగరీకము.
Urchin n s a name given to the hedgehog ముండ్ల పంది. a name of slightanger, of a child దుష్ట వెధవ, తుంట ముండ.
ureter n s a tube conveying the urine from the kidney to the bladderమూత్ర నరము.
Urethra n s the canal by which the urine is conducted from thebladder and discharged మూత్ర ద్వారము. a disease of the * మూత్రద్వారమందు కలిగిన మేహవ్యాధి.
Urged adj forced, constrained ప్రేరేపించబడ్డ. * by necessity he sold theproperty అగత్యము వచ్చి సొమ్మును అమ్ముకొన్నాడు.
Urgency n s pressure or difficulty అగత్యము, అవసరము. through the *of circumstances నిండా సంకటము వచ్చినందున. from the * of the weatherగాలి కసురుగా వుండినందున. through the * of their petitions వాండ్లు నిండాఅఘోరించి చెప్పినందున.
Urgent adj earnest అగత్యమైన, అవసరమైన. he made an * request thatthey would go వాండ్లు పోవలెనని నిండా బతిమాలుకొన్నాడు.
Urgently adv అగత్యముగా, అవసరముగా. he wrote very * about this దీన్నిగురించి నిండా అక్కరగా వ్రాసుకొన్నాడు.
Urging adj forcing, provoking ప్రేరేపణ చేశే, బుద్ధి పుట్టించే. by the force of* want, he sold the goods అతి దరిద్రము వచ్చి సొత్తులను అమ్ముకొన్నాడు.
Urim and thummim n s శమంతకమణి చింతామణి వీటి వంటి వొక విశేషమైనఆభరణము, పూర్వము దీన్ని పెట్టుకొని వుండిన వొక గురువు దీని మహాత్య్మము చేతభవిష్యద్వర్తగా వుండినాడట.
Urinal n s a bottle in which urine is kept for inspection పరిక్షచూడడమునకై వుచ్చ పోశి పెట్టే బుడ్డి. but in modern days a place for passingఉచ్చపోశే చోటు, మరుగుపెరడు.
Urinary adj pertaining to urine మూత్ర సంబంధమైన. the * vesselsమూత్రసరములు.
Urine n s మూత్రము, ఉచ్చ. stoppage of * నీరు కట్టు. heat of * నీరు చురుకు.
Urn n s a kind of vase used as an ornament కలశము. a vessel forwater కుంభము. a vessel in which ashes of the dead were formerlykept ఆస్థిపాత్ర. a tea * తేయాకులో పోయడమునకై వేణ్నీళ్ళు వుంచే పాత్ర.
Uropygium n s or parson's nose అపానము.
Us objective case of We మమ్మున,మనమును,మమ్ముల,మమ్ములను
Usage n s custom; practice వాడిక, మర్యాద, ఆచారము, సంప్రదాయము. gentle* or good * మన్నన, దయ. rough * దౌర్జన్యము. ill * అన్యాయము.
Usance n s custom, practice, way ఆచారము, ఆచారపద్ధతి, క్రమము, వాడిక.
Use n s the act of employing వినియోగ పరచడము, ఉపయోగ పరచడము. hebought this for his own * తనకు వుపయోగము కాగలందులకై దీన్ని కొనుక్కొన్నాడు,తన స్వంతానికి దీన్ని కొన్నుక్కొన్నాడు. advantage, utility ప్రయోజనము, కార్యము, క్రియ, ఫలము. what * will you make of it ? దీన్ని దేనికి వుపయోగము చేస్తావు, దీన్ని యే పనికి పెట్టుకొంటావు. it will be of no * ప్రయోజనము లేదు, ఫలము లేదు,సార్థకము లేదు. what is the * of doing so ? అట్లా చేస్తే యేమి ప్రయోజనము. whatis the * of this instrument ? యీ ఆయుధము యే పనికి వుపయోగమవుతున్నది. Ido not understand this * of the word యీ మాటకు యిట్లా ప్రయోగము నేనెరగను. you will always find that a thing turned to a dozen uses is ofno * పది పనులకు అయ్యేటిది వొకందుకూ పనికి రాదు. this word is not in * యీశబ్దమునకు ప్రయోగము లేదు. to make * of వినియోగపరచుట, వాడుట. he makes no* of the house ఆ యింటిని వూరికె పెట్టివున్నాడు.
Used adj employed, occupied, treated వాడబడ్డ, వినియోగ పరచబడ్డ,ప్రయోగించబడ్డ, సెలవు చేయబడ్డ. the babe became * to him ఆ బిడ్డ వాడి దగ్గిరమరిగిపోయినది. a drug * in dying చాయకు అక్కరకు వచ్చే వొక దినుసు. this is *as a spade యిది పారగా వుపయోగించ బడ్డది. he is * to that work ఆ పనిలోపనుబడి వున్నాడు. I am not * to such language అటువంటి మాటలను నేనువినేవాణ్ని కాను. it is * up అది అయిపోయినది, కాజేయబడ్డది. he thought himselfill * తాను అన్యాయమును పొందినట్టు అనుకొన్నాడు. this paper you gave me is *up తమరు యిచ్చిన కాకితాలు అయిపోయినవి.
Useful adj serviceable, profitable ఉపయోగమైన, పనికివచ్చే,ప్రయోజనకరమైన. an * man పనికి వచ్చే మనిషి.
Usefully adv serviceably సఫలముగా, సప్రయోజకముగా. the money is *employed in trade ఆ రూకలను వర్తకములో పెట్టడము సఫలము.
Usefulness n s ప్రయోజనము, ఫలము. from the * of this rule యీ సూత్రముసఫలమైనది గనక. from the * of this book యిది వుపయోగమైన పుస్తకము గనక.
Useless adj unserviceable పనికిరాని, నిష్ఫలమైన, నిష్ప్రయోజకమైన,నిరర్థకమైన, కొరగాని. the carriage is * ఆ బండి పనికిరాక వున్నది. this man is quite * వీడు నిష్ప్రయోజకుడు, యెందుకూ కొరగానివాడు. it is quite * to tell this యిది వాండ్లతో చెప్పడము నిష్ప్రయోజనము.
Uselessly adj without profit or advantage వృథాగా, వ్యర్థముగా,నిరర్థకముగా, పనికిమాలి. he passed his time * వృథాగా కాలమును పొగొట్టినాడు.
Usher n s An officer of a court : who introduces strangersద్వారపాలకుడు, దర్శనము చేయించేవాడు. an underteacher రెండవ వుపాధ్యాయులు.
Usual adj customary ; common ; frequent వాడుకైన, సహజమైన. themeaning రూఢిగా వుండే అర్థము, సంప్రదాయార్థము. the * or daily sacrificeనిత్యహోమము. at the * rate యెప్పుడూ యిచ్చిన వరుసన. less than *యెప్పటిదానికంటె తక్కువగా. the * time యెప్పటి వేళ. more than *యెప్పటిదానికంటె అధికముగా. it is * to walk there అక్కడ నడవడము కలదు. as * యెప్పటివలెనే, యథాప్రకారముగా. he lamented it as * when it was too lateమించిపోయిన తరువాత అందుకు వ్యసనపడ్డాడు, ఇది వాడికి సహజమే. he paid themoney and as * he took a receipt వాడుక ప్రకారము రూకలు యిచ్చి రసీదుతీసుకొన్నాడు.
Usually adv customarily, commonly వాడుకగా, సాధారణముగా. we * say soమేము వాడుకగా అట్లా అంటాము, మేము అట్లా చెప్పడము కలదు.
Usufruct n s the temporary use : enjoyment of the profit, withoutpower to alienate భోగ్యము, అనగా దానాదులకు అధికారము లేకుండా వచ్చేఫలమును అనుభవించడము.
Usufructuary n s one that has the use and temporary profit అనుభోగి,భోగ్యానికి పెట్టుకొని వుండేవాడు, దానాదులకు అధికారము లేకుండా వచ్చే ఫలాన్నిఅనుభవిస్తూ వుండేవాడు.
Usurer n s one that takes exorbitant interest అధికవడ్డీ తీశేవాడు,అన్యాయవడ్డి తీశేవాడు. he is an * వాడు అన్యాయవడ్డి తీశేవాడు.
Usurious adj taking exorbitant interest అధికవడ్డి తీశే, అన్యాయవడ్డి తీసే. an * man అన్యాయవడ్డి తీశేవాడు.
Usurpation n s illegal seizure or possession ఆక్రమించుకోవడము,అపహరించడము, అన్యాయముగా గుంజుకోవడము.
Usurpen adj seized, by violence ఆక్రమించుకోబడ్డ, అపహరించబడ్డ,అన్యాయముగా గుంజుకోబడ్డ.
Usurper n s one who seizes the property of another without right, ఆక్రమించుకొన్న వాడు, అపహరించిన వాడు, అన్యాయముగా గుంజుకొన్న వాడు.
Usury n s illegal interest అన్యాయవడ్డి, అధికవడ్డి.
Utensil n s an instrument, a tool ఆయుధము, కొరముట్టు, సామగ్రి తట్టుముట్టు,పనిముట్టు. kitchen *s వంటయింటి సామానులు, పాత్ర సామగ్రి, కుండా చట్టి మొదలైనవి.a chamber * మూత్ర పాత్ర.
Uterine adj born of the same mother ఏక గర్భజనితమైన, వొక తల్లి కడుపులోపుట్టిన. they were * brothers వాండ్లు వొక తల్లిబిడ్డలు, సయాం తోడబుట్టిన వాండ్లు.
Uterus n s the womb గర్భము, కడుపు, ఉత్పత్తి స్థానము.
Uti possidetis n s in politics, the basis or principle of a treaty which leaves belligerents mutually in possession of what they have acquired by their arms during the war యథానుభవము, ఎవడిచేత చిక్కినది వాడిది.
Utilitarian n s one who holds that the greatest happiness of thegreatest number is the proper foundation of morals విశేషమైన సౌఖ్యములుప్రజలలో శానామందికి కలగడమే ముఖ్యమనేవాడు.
Utility n s usefulness; profit ఉపయోగము, లాభము, ఫలము. it is of no *అది నిష్ఫలము, నిరర్ధకము, అందువల్ల సార్థకము లేదు.
Utmost adj furthest అత్యంత, సర్వాతిశాయియైన, కడపటి. the * he can claimవాడు కోరవలసినదంతా, వాడు కోరవలసినదెల్లా. with the * humility అత్యంతవినయపూర్వకముగా. to the * అతిశయముగా. he reviled them to the * in hispower వాండ్లను శక్తివంచన లేకుండా తిట్టినాడు.
Utopia n s పరమసుఖదాయియైన వొక లోకమునకు పేరు, ద్వారకవలె లోకములో లేనివొక పట్టణము.
Utopian adj ideal; fanciful వింతైన, విచిత్రమైన, లేనిపోని.
Utter adj extreme, entire వట్టి, శుద్ధ, కేవల, అతి. * darkness కటిక చీకటి. this is * injustice ఇది నిండా అన్యాయము, వట్టి అన్యాయము.
Utterance n s pronounciation, expression ఉచ్చారణ. he gave * to histhought వాడి భావమును చెప్పినాడు. to give * such sentiments was wrong ఆఅభిప్రాయమును బైట చెప్పడము తప్పు.
Uttered adj spoken ; pronounced ; published చెప్పబడ్డ, ఉచ్చరించబడ్డ,ప్రచురము చేయబడ్డ.
Utterer n s one who pronounces చెప్పేవాడు. an * of had money తప్పునాణ్యమును మార్చే వాడు.
Utterly adv perfectly, completely శుద్ధముగా, బొత్తిగా, వొడారము. * helplessనిరుపేదైన. * spoilt బొత్తిగా, చెడిపోయిన. a word * unknown యెంత మాత్రముతెలియని మాట.
Uttermost adj furthest, most remote అతి, దూరతమమైన, సీమస్థితమైన. in the* parts of the earth పృధ్వ్యంతములయందు. దిగంతముల యందు.
Uvula n s what hangs over the tongue కొండనాలుక, చిరునాలుక, ఉపజిహ్వా.
Uxorious adj submissively fond of a wife. An * man స్త్రీవశ్యుడు, స్త్రీలోలుడు. భార్య యేట్లా ఆడిస్తే అట్లా ఆడేవాడు. the * king పెండ్లాము చేతిలోబడ్డ రాజు.

No comments:

Post a Comment