Unfitly adv unsuitably అయోగ్యముగా, అనర్హముగా, తగనిరీతిగా. a letter *expressed అయోగ్యముగా వ్రాసిన జాబు.
Unfitness n s not being suitable అయోగ్యత, అనర్హత. this shows his * forthe duty యీ పనికి వాడు అర్హుడు కాడని యిందువల్ల తెలుస్తున్నది.
Unfitted adj not suitable తగని, అనర్హమైన, అయోగ్యమైన. a house * for aschool పల్లె కూటానికి తగని యిల్లు.
Unfitting adj improper తగని, అర్హముకాని, యోగ్యముకాని. this is a very *reward యిది యెంత మాత్రము తగిన బహుమానము కాదు.
Unfixed adj not firm, not certain అనిశ్చయమైన, నిలకడ కాని.
Unflagging adj not wearied అలియని, అశ్రాంతమైన. the * wing of theeagle అలుపనేదిలేని గరుడుని యొక్క రెక్క.
Unfledged adj implumous రెక్కలు రాని, రెక్కలు మొలవని. an * bird యింకారెక్కలు రాని పక్షి.
Unflinching adj not shrinking determined సంకోచించని, జంకని, దృఢమైన. *language నిష్ఠురోక్తులు. he is an * witness వాడు యెంత మాత్రము వెనకతీయనిసాక్షి.
Unflinchingly adv without shrinking జంకు లేకుండా, వెనక్కు తీయకుండా.
Unfloored adj not having a floor తళవరస వేయబడని. an * room తళవరసవేయని గది.
Unfluctuating adj స్థిరమైన, నిబ్బరమైన.
Unfolded adj opened; expanded; revealed తెరవబడ్డ, వికసింపచేయబడ్డ,విశదపరచబడ్డ.
Unforbidden adj permitted; allowed; legal నిషేధము కాని. these are *delights యివి సహజమైన సుఖములు.
Unforced adj not disturbed, easy, natural సహజమైన, సాధారణమైన. thisis an * meaning of the verse యీ శ్లోకమునకు యిది సహజమైన అర్థము.
Unforeknown adj not seen before hand ముందుగా తెలియని.
Unforeseen adj not known before ముందుగా తెలియని. an * claimఆకస్మికముగా వచ్చిన అప్పు.
Unforgiving adj relentless; implicable క్రూరుడైన, మూర్ఖుడైన, మొండియైన.
Unformal adj ceremonious అమర్యాదైన, అక్రమమైన.
Unformed adj not shaped వికారమైన, మొండియైన.
Unfortified adj not defended గోడలు లేని, బురుజులు లేని, బలము లేని. an *town చుట్టూ గోడలు లేని వూరు.
Unfortunate adj not prosperous not luckly దురదృష్టమైన, దౌర్బాగ్యమైన.these * people యీ దౌర్భాగ్యులు, యీ దిక్కుమాలిన వాండ్లు.
Unfortunately adv without success; unhappily దౌర్భాగ్యముగా,దురదృష్టముగా. * he fell down పడిపోయినాడు పాపం. * for him అతని దౌర్భాగ్యముచేత.
Unfought adj యింకా జగడమాడని. the battle is yet * ఆ యుద్ధము యింకాసంభవించలేదు.
Unfouled adj not polluted; pure శుచిభూర్తమైన, నిర్మలమైన, పరిశుద్ధమైన.
Unfound adj not met with, not supplied చిక్కని, దొరకని, జాగ్రత చేయబడని. the ship was * in stores ఆ వాడకు కావలసిన తాళ్ళు మొదలైనవి జాగ్రత చేయబడలేదు.
Unfounded adj not established, vain; idle నిరర్థకమైన, నిష్ప్రయోజకమైన,వట్టి.
Unframed adj not formed; not fashioned యేర్పరచబడని, కుదరని,కుదిరించబడని, చట్టము వేయబడని. an * picture యింకా చట్టము వేయని పఠము.
Unfrequency n s rareness అపరూపము, అరుదు, వింత. from the * of thisdisease యిది వింతైన రోగము గనక.
Unfrequent adj not common అపరూపమైణ, అరుదైన, వింతైన.
Unfrequented adj rarely visited మనుష్య సంచారము లేని. an * forestయెవరున్ను యెన్నడూ పోని అడివి. an * road మనుష్యులు నిండా నడవని దారి, యెడారిమార్గము.
Unfrequently adv seldom అదురుగా. this is not * the termination ఇదిప్రాయశః యిట్లా పర్యవసిస్తున్నది.
Unfriended adj not protected, దిక్కుమాలిన. he was at that time * by thegreat అప్పట్లో పెద్దలు వాణ్ణి ఆదోకోక పోయినారు.
Unfriendedness n s misery దిక్కుమాలిన స్థితి, నిరాదరువుగా వుండడము.
Unfriendliness n s disfavour విరోధము, క్రౌర్యము. their * made him dothis వాండ్ల విరోధము వీణ్ని యీ పని చేయించినది.
Unfriendly adj not favourably విరుద్ధమైన, విరోధమైన, అనుకూలము కాని,ప్రతికూలమైన. this tree grows in an * soil యీ చెట్టు వొక పనికిమాలిన భూమిలోపెరుగుతున్నది.
Unfrozen adj not congealed పేరని, ఘనీభవించని.
Unfruitful adj barren ఫలప్రదము కాని, గొడ్డుగా వుండే, నిరర్థకమైన, నిష్ఫలమైన.
Unfulfilled adj not accomplished నెరవేరని, తీరని, ముగియని. his promiseis * వాడు చెప్పిన ప్రకారము యింకా నడవలేదు.
Unfurled adj expanded; unfolded విచ్చబడ్డ, తెరవబడ్డ.
Unfurnished adj not supplied with furniture ఉత్త, పట్టి, వూరికె వుండే.those who are * with money రూకలు లేనివాండ్లు. an * room కురిచీలు బల్లలువేయకుండా వూరికె వుండే గది.
Ungain adj stubborn, obstinate మూర్ఖమైన, మొండియైన. an * horse మొండిగుర్రము. (See Walpole's Letters, 1840 Vol. VI. 16. foot.)
Ungainly adj clumsy : awkward; uncouth మొండియైన, మూర్ఖమైన,జడమైన, వికారమైన.
Ungallant adj not elegant నీచమైన, క్షుద్రమైన మొండియైన, అమర్యాదగా వుండే.an * letter అమర్యాదగా వ్రాశిన జాబు.
Ungarrisoned adj not furnished with troops for defence సంరక్షక సేనలేకుండా వుండే.
Ungathered adj not cropped; not picked పోగుచేయబడని, కోయబడని. fruityet * యింకా కోయని పండ్లు.
Ungenerous adj not noble; not liberal నీచమైన, క్షుద్రమైన, అల్పమైన. an *act క్షుద్రపని, అల్పకార్యము, పనికిమాలిన పని.
Ungenial adj disagreeable విరసమైన, ఆరోగ్యము కాని. an * soil పనికిమాలినభూమి, ఆరోగ్యము కాని భూమి.
Ungenteel adj మూర్ఖమైన, మోటైన, అమర్యాదైన. they thought plain English *( Maria Edgeworth ) సాధారణముగా మాట్లాడడము సరసము కాదన్నారు.
Ungentlemanly adj rude, vulgar మోటతనమైన, అమర్యాదైన.
Ungentleness n s rudeness, unkindness; incivility అమర్యాద, క్రూరత్వము.
Ungently adv harshly; rudely క్రౌర్యముగా, మోటతనముగా.
Ungilded adj not ornamented శృంగారించబడని, అలంకారము లేని.
Ungirt adj loosely, dressed నడుము కట్టని సాధారణమైన వుడుపును వేసుకొనివుండే.
Ungiving adj ఇవ్వని, దానము చేయని.
Ungloved adj having the hand naked చెయిజోళ్లు వేసుకోని.
Ungnentle adj harsh; rude క్రూరమైన, నిర్దయాత్మకమైన.
Ungodlily adv impiously; wickedly భక్తిహీనముగా, దుర్మార్గముగా,పాపిష్ఠితనముగా.
Ungodliness n s impiety; wickedness ద్రోహము, దౌష్ట్యము, పాపిష్టితనము,అపచారము.
Ungodly adj impious పాపిష్ఠియైన, అపచారమైన, ద్రోహమైన, దుష్ట.
Ungovernable adj violent, wild అసాధ్యమైన, అణగని.
Ungoverned adj not regulated, not ruled యేలబడని, అణగని. a country *by kings రాజుల చేత యేలబడని భూమి.
Ungraceful adj not elegant వికారమైన, విరసమైన, మోటుగా వుండే.
Ungracefulness n s want of elegance వికారము.
Ungracious adj wicked; hateful కొంటెయైన, పాపోష్ఠియైన, క్రూరుడైన,క్రూరమైన.
Ungraciously adv with disfavor, not in a pleasing mannerవికారముగా, మొండిగా, క్రౌర్యముగా.
Ungrammatical adj not according to rule అశాస్త్రీయమైన, గ్రామ్యమైన. an *sentence శాస్త్ర విరుద్ధమైన వాక్యము. an * word అపశబ్దము.
Ungranted adj not bestowed ఇవ్వబడని.
Ungrateful adj not thankful ఉపకార మెరగని, మేలెరగని, కృతజ్ఞతలేని,కృతఘ్నమైన. an * wretch కృతఘ్నుడు. or disagreeable విరసమైన, వికారమైన.
Ungratefully adv చేసిన మేలెరుగక, కృతజ్ఞత లేక.
Ungrounded adj having no foundation or support నిరాధారమైన. an *complaint పనికిమాలిన ఫిరియాదు.
Ungrudging adj kind, freely giving ధారాళమైన, లోభత్వము లేని.
Ungrudgingly adv freely ధారాళముగా, లోభత్వము లేకుండా.
Unguarded adj not watched, not defended, careless జాగ్రతలేని,కావలిలేని, భద్రము లేని. these were * expressions ముందు ఆలోచన లేకుండాచెప్పిన మాటలు.
Unguardedly adv without caution ముందు జాగ్రత లేకుండా. he wrote *ఆలోచన లేకుండా వ్రాసినాడు.
Unguent n s ointment తైలము.
Unguided adj not directed; not regulated గురు ముఖముగా పనుబడని,సుశిక్షితుడుకాని. an * youth సుశిక్షితుడు కాని పిల్లవాడు, దుష్టపిల్లకాయ, తుంటకుర్రవాడు.
Unhallowed adj wicked, profane దుష్టుడైన, పాపోష్ఠియైన, తుంటయైన,పోకిరియైన. this * act యీ దుష్టపని.
Unhandsome adj not proper అయుక్తమైన, అయోగ్యమైన. * conduct దుష్టపని,దురాచారము, అన్యాయమైన పని.
Unhandsomeness n s unfairness అన్యాయము.
Unhandy adj not convenient, not skilful చేతకాని, అరపరాని.
Unhappily adv not fortunately దురదృష్టముగా, దౌర్బాగ్యముగా. thismarriage ended * తుదకు యీ పెండ్లి పెడాకులైపోయినది. * they quarrelledవాండ్లకు కలహము సంభవించినది పాపం. * for him they did not consent to thisవాడి గ్రహచారము వాండ్లు దీనికి వొప్పకపోయినారు.
Unhappiness n s misfortune; ill luck దౌర్భాగ్యము, దురదుష్టము. he hadthe * to quarrel with his father వాడి దౌర్భాగ్యమువల్ల తండ్రితో పోట్లాడినాడు.
Unhappy adj unfortunate, unluckly దౌర్భాగ్యమైన, దురదృష్టమైన. an *business దౌర్భాగ్యమైన పని. she was * about this యిందున గురించిదుఃఖతురాలుగా వుండినది.
Unharboured adj not sheltered సురక్షితము కాని, దిక్కుమాలిన.
Unhardened adj not rendered hard గట్టి చేయబడని. iron that is * by artసంస్కారము చేత గట్టిపరచబడని యినుము.
Unharmed adj not hurt, not injured నిరుపద్రవమైన, అనాయాసమైన. he boreme * through the business ఆ పనిలో నాకేమిన్ని తొందరలేకుండా గడిపించినాడు.
Unharmonious adj discordant, unmusical కర్ణకఠోరముగా వుండే.
Unharnessed adj divested of trappings కళ్లెము మొదలైన సామానులనుతీశివేయబడ్డ. after the horses were * బండి గుర్రాల కళ్లెము మొదలైన సామానులనువిచ్చి వేసిన తరువాత.
Unhatched adj not having left the egg, not matured and brought tolight చితికి గుడ్లు చేయబడని, యింకా బాగా కుదరని. in the nest there were threeeggs * గూట్లో యింకా చితికి పిల్లలు చేయబడని గుడ్లు మూడు వుండినవి. a plan yet *యింకా కుదరని యుక్తి.
Unhealthful adj insalubrious; unwholesome ఆరోగ్యము కాని, వొంటికి గిట్టని.
Unhealthy adj sickly ఆరోగ్యము కాని, వొంటికిగిట్టని. an * place దేహానికి గిట్టని స్థలము. I found that place * అక్కడి నీళ్ళు నా వొంటికి సరిపడవు. * food దేహానికి కాని ఆహారము.
Unheard adj వినబడని.
Unheard of adj strange వింతైన, చోద్యమైన. this is an * of price యీ వెలయెక్కడనైనా కద్దా. this is * of injustice యిది మహత్తైన అన్యాయము. a man * ofin the world లోకములో యెన్నడున్ను వినబడనివాడు, అప్రసిద్ధుడు.
Unheeded adj not marked, disregarded అలక్ష్యము చేయబడ్డ. his advicewas * వాడు చెప్పిన మాటలను లక్ష్యము చేయలేదు. his cries were * వాని మొరనుఅలక్ష్య పెట్టినారు, ఆలకించినారు కారు.
Unheedful adj careless అలక్ష్యమైన, నిర్లక్ష్యమైన. he is * of theconsequences యెటైనా కానిమ్మని అలక్ష్యముగా వుండినాడు.
Unheeding adj careless, negligent అజాగ్రతగా వుండే, తాత్సారముగా వుండే. an* pupil శ్రద్ధ లేని శిష్యుడు.
Unhelped adj not assisted అసహాయుడైన, సహాయములేని. he cannot do this* by you తమ సహాయము లేకుండా దీన్ని చేయలేడు.
Unhesitating adj prompt ready సందేహించని, అనుమానించని. he gave an *answer వాడు సందేహించకుండా వుత్తరము చెప్పినాడు.
Unhesitatitngly adj సందేహించక, అనుమానించక.
Unhewn adj rough యింకా చక్కపెట్టని. he built the wall with * stone andmud చక్క పెట్టని గుండురాళ్ళు బురదతో ఆ గోడను కట్టినాడు. * timber యింకాచెక్కిచెక్క పెట్టబడని మాను.
Unholiness n s wickedness; impiety దౌష్ట్యము, దుర్మార్గము, అపవిత్రత,పాపిష్టితనము.
Unholy adj vile, abominable పాపిష్ఠి తనమైన, దుష్ట, దుర్మార్గమైన, కాని,అపవిత్రమైన. A+. in 2 Tim. III. 3 * thoughts దురాలోచన.
Unhonoured adj not regarded with respect అగౌరవమైన, పూజ్యముకాని. thecheque remains * ఆ హుండికి యింకా సంతకము చేయలేదు.
Unhoped adj not expected ఎంచబడని, యెదురు చూడబడని. an * for decisionయిట్లా తీరపోతున్నదని వొకనాడు యెంచని తీర్పు. this * for news delighted usయెంత మాత్రం యెదురు చూడని యీ సమాచారము వచ్చినందున మాకు నిండా సంతోషమైనది.
Unhospitable adj not kind to strangers అతిథి సత్కారము లేని, వచ్చినవాండ్లను ఆదరించని, క్రూరుడైన, ఆదరణలేని.
Unhoused adj homeless ఇల్లు వాకిలి లేని.
Unhouseled adj not having received the sacrament ఉత్తరక్రియలుచేయబడని, చరమదశలో చేయవలసిన కర్మములు చేయబడని.
Unhumbled adj not made submissive అణగని, గర్విష్ఠియైన. he is * bypunishment ఆ శిక్ష చేత యింకా వానికి కొవ్వు అణగ లేదు.
Unhurt adj not harmed గాయము తగలని. many were wounded, somewere killed, but I was * శానామందికి గాయములు తగిలినవి కొందరు చచ్చినారు,నాకు మాత్రం యేమీ తగలలేదు.
Unhurtful adj harmless; innoxious నిరుపద్రవమైన, అనవద్యమైన. this foodis * ఇది దేహానికి తొందర చేశే ఆహారము కాదు.
Unicorn n s an animal with one horn నొసట వొంటి కొమ్ముగల మృగము.Droz. says అశ్వపదాకృతి శృంగధారి జంతు విశేషము, ఘేండ మృగము.
Unidiomatical adj భాషీయము కాని జాతీయము కాని. this sentence is * యీవాక్యము జాతీయముగా వుండక అకటవికటముగా వున్నది.
Uniform adj not different, alike సమాన రూపముగా వుండే, వొకటే మచ్చుగావుండే, సమానాకారము గల. the two houses are * ఆ రెండు యిండ్లు వొకటే మచ్చుగావున్నవి. these six verbs are * యీ ఆరు క్రియలకున్ను రూపము వొకటే.
Uniformity n s resemblance without difference, sameness సమభావము,ఏకాకృతి, తుల్యత, వైలక్షణ్యాభావము. from the * of their customs వాండ్లందరినడత వొకటే గనక. from the * of my work every year appears the sameనాకువుండేపని వొకటే గనక ప్రతి సంవత్సరమున్ను వొకటే విధముగా వున్నది. +
Uniformly adv without variation నిత్యము, అనవరతము యేకాకారముగా. thetroops were not * English ఆ దండులో అందరు ఇంగ్లిషువాండ్లు కారు. they * feedon rice వాండ్లకు నిత్యము అన్నమే ఆహారము, వాండ్లందరున్ను తినేది బియ్యమే. theyare * cowards వాండ్లందరు పిరికివాండ్లు.
Unimaginable adj not to be conceived ఎంచగూడని, తలచగూడని,భావించగూడని, బుద్ధికి దూరమైన, అగోచరమైన. his motive is * వాని ఆలోచన యెట్టిదో తెలుసుకో కూడ లేదు.
Unimaginably adv exceedingly అతిశయముగా.
Unimaginative adj not having power of thought, common, base,coarse బుద్ధి కుశలత లేని.
Unimagined adj not conceived ఎంచని, తలచని, అగోచరమైన.
Unimpaired adj not diminished దృఢమైన, గట్టిగా వుండే, పాతగిలని.
Unimpassioned adj calm; not violent శాంతమైన.
Unimpeachable adj that cannot be accused, free from suspicionనిరపరాధమైన నిష్కళంకమైన, నిరాక్షేపమైన. + Gibbon, Chapter 50 No. 72 says conversation enriches the understanding, but solitude is the school of genius: and the uniformity of a work denotes the hand of a single artist. Unimpeached, adj. no aclcused అనిందితమైన, నిష్కళంకమైన, నిరాక్షేపమైన.
Unimpeded adj not hindered నిరంకుశమైన, అనర్గళమైన, అడ్డంకిలేని.
Unimportant adj not great స్వల్పమైన, అల్పమైన, విముఖ్యమైన, కొద్ది.
Unimprovable land adj incapable of being cultivated or tilled కృషికి అనర్హమైన, దున్నడానికి వల్ల కాని.
Unimproved adj not tended, not made better, nor tilled పనుపరచబడని,బాగు చేయబడని, చక్కపెట్టబడని, దున్నబడని. they are * by his instructiosn వానిశిక్షవల్ల వాండ్లు అభివృద్ధి కాలేదు.
Unincumbered adj not burderend జంజాటము లేని, పీకులాటలేని, తొందరలేని,ఇబ్బందిలేని. those who were * with debts అప్పులనే తొందరలేనివాండ్లు. asthey were * with baskets they crossed the mounntain soon గంపలులేనందున వాండ్లు కొండలను శీఘ్రముగా దాటినారు.
Uninfluenced adj not prejudiced పక్షపాతము లేని. those who were * byavairice అత్యాశలేని వాండ్లు.
Uninformed adj not taught అశిక్షితుడైన, పామరుడైన, ప్రాకృతుడైన.
Uninhabitable adj not fit to live in కాపురము వుండడమునకు తగని. from the* condition of the house ఆ యిల్లు పాడుగా వున్నందున.
Uninhabited adj having no dwellers కాపురము లేని, వూరికె వుండే. an *house కాపురము లేని యిల్లు.
Uninitiated adj not taught, not instructed అభ్యసించబడని, ఉపదేశించబడని,నేర్పబడని. those who are * in this business యీ పనిలో పనుబడని వాండ్లు. the*, (that is the common folk;) the ignorant సామాన్యులు, మూఢులు, జడులు.while he was yet * in law వాడికి యింకా ధర్మశాస్త్రాభ్యాసము కాక మునుపేamong Bramins, those who are * are called పశుజనము, or the brutefolk.
Uninjured adj not hurt చెక్కు చెదరని, అక్షతమైన. he arrived * వాడు వొకఅపాయమున్ను లేకుండా వచ్చి చేరినాడు.
Uninnited adj not being called పిలవబడని. they came * పిలవని పేరంటముగావచ్చినారు.
Uninquiring adj devoid of curiosity తెలుసుకోవలెననే యిచ్ఛలేని. an * faithమూఢభక్తి.
Uninscribed adj అంకితము లేని. a poem * to any king యే రాజు మీదఅంకితము చేయని గ్రంథము. an * stone అక్షరాలు వ్రాయని రాయి.
Uninspired adj ప్రేరేపించబడని, ఆవేశము లేని. among the poets some areinspired and some are * కవులలో కొందరు అంశ పురుషులు కొందరు సామాన్యులు.
Uninstructurd adj not taught శిక్షించబడని, అశిక్షితుడైన. I am as yet * as tohis intention ఆయన తాత్పర్య మెట్టిదో నాకు యిది వరకు తెలియదు.
Uninstructuve adj not conferring any improvement నిష్ఫ్రయోజకమైన,నిష్ఫలమైన, ఫలము లేని.
Unintellectual adj dull, stupid జడుడైన, మందుడైన, మూఢుడైన.
Unintelligent adj not clever తెలివిలేని, అవివేకియైన.
Unintelligible adj that cannot be understood అర్థము కాని GilbertStuart's view of Society, page 261 says among barbarians suchinaccuracy is not surprizing. But at this day a British Act ofParliament is often unintelligible even to the very wise acres whohave drawn it up. Of late years in particular our records have been crowded wtih statutes of Explanation. But unluckily barbarians are always quite clear and intelligible. They are by no means inaccurate.
Unintelligibly adv in a manner not ot be understood అర్థము కాకుండా. hespoke * వాడి మాటలకు అర్థము కాలేదు.
Unintentional adj not designed అనాలోచితమైన, అప్రయత్నపూర్వకమైన,అబుద్ధిపూర్వకమైన.
Uninterested adj not caring, careless అక్కరపట్టని, శ్రద్ధలేని. * witnessesపక్షపాతము లేని సాక్షులు. I was * in this businenss యీ పనిలో నాకు అంత అక్కరపట్టలేదు. those who are * in these enquiries think us fools యీ పనిలోఅక్కరలేని వాండ్లకు మేము పిచ్చివాండ్లు.
Uninteresting adj without gratification, without care నీరసమైన, జబ్బుగావుండే. an * poem జబ్బుగా వుండే కావ్యము.
Unintermitted adj continual, constant నిరంతరమైన, యెడతెగని.
Unintermittent, Unintermitting adj continuing యెడతెగని, నిరంతరమైన. an *fever విడవని జ్వరము.
Uninterrupted adj not broken, without interval యెడతెగని. he had *sleep until morning తెల్లవారినదాకా వొకటే నిద్రగా వుండినాడు.
Uninterruptedly adv without interval, having no check నిఘాతములేకుండా, యేకరీతిగా, అడ్డంకి లేకుండా. this went on * for ten years యిదిపదేండ్ల దాకా అభ్యంతరము లేకుండా జరిగినది, అడ్డంకి లేకుండా జరిగినది.
Unintetnionally adv without desing అప్రయత్న పూర్వకముగా, యోచించకపరాకున. words * uttered నోరు జారి వచ్చిన మాటలు.
Uninviting adj disgusting, not pleasing సహ్యమైన, చీదరైన. this food is * యీ ఆహారము అసహ్యముగా వున్నది, కంటికి యింపుగా వుండలేదు.
Union n s joining, junction సంయోగము, సంగమము, కూడడము, కలియడము,ఐకమత్యము. after the * of these two streams యీ రెండు ప్రవాహములుకలిశిన తర్వాత. this prevented their * యిందువల్ల వాండ్ల యొక్క ఐకమత్యమునకుభంగమైనది, వాండ్లు కలుసుకోవడమునకు భంగమైనది. * with the deity సాయుజ్యము.
Union jack n s ఒక విధమైన ధ్వజపటము.
Unique adj singular, sole అసమానమైన, ఏకమైన. this ruby is * దీనివంటిరత్నము భూలోకములో లేదు.
Uniquietness n s want of tranquillity నెమ్మది లేమి, నిమ్మళము లేమి ఖేదము,వ్యాకులము, తొందర, అల్లరి. this advice relieved the * of his mind యీమాటవల్ల వాడి వ్యాకులము తీరినది. from the * of this street యీ వీధిలో యేవేళాసందడి గనక.
Unison n s accord, harmony సమశ్రుతి. when these lutes were in * యీవీణెలు సమశ్రుతిగా వుండేటప్పుడు. they acted in * వాండ్లిద్దరు వొక చెయిగాప్రవర్తించినారు, ఏకగ్రీవముగా నడిచినారు. this is in * with his design యిది వానియత్నమునకు అనుకూలముగా వున్నది, యిమిడికగా వున్నది.
Unit n s ఏకము usually, ఎక్కము. in arithmetic they count thus; units,tens, hundreds, thousands & c. గణిత శాస్త్రములో యేకము. the yard is the *of measures among the English ఇంగ్లిషు వారిలో కొలతలో మొదటిది గజము,అనగా దానిలోనుంచి కడమ కొలతలు పుట్టుతవని భావము. he is a mere * కశ్చన,యెవడో. he makes but one * in the general account వాడు పదిమందిలో వొకడు.
Unitarian n s A Christian sectary, who, as opposed to theTrinitarians, believes in and worships one God in one person, andhence denies the divinity of Christ. ( Craig's Dict. )
United adj కలిసిన, కూడిచేసిన. by their * efforts అందరు కూడి చేసిన యత్నముచేత. the * kingdom ఇంగ్లండు, స్కాటులెండు, ఐర్లండు యీ మూడు దేశములకు మొత్తపేరు. "The * Provinces" is a name for Holland డచ్చి దేశము. the * statesis a name for America అమెరికా దేశము.
Unitedly adv together కూడి, కలిశి సమష్టిగా, ఏకముగా. they * produced tenthousand pounds వాండ్లందరు కూడి పదివేల పవునులు జాగ్రత చేసినారు.
Unitedness n s union, oneness ఐకమత్యము.
Unity n s oneness ఏకత, వొకటిగా వుండడము, ఐక్యము, సంయోగము, మేళనము.from the * of their origin వాండ్ల వుత్పత్తికి మూలము వొకటే గనక. from the * oftheir opinions వాండ్ల అభిప్రాయములు వొకటిగా వున్నవి గనక. the Musulmansassert the * of the deity తురకలు మూర్తిత్రయము లేదు, ఏకమూర్తే నంటారు.
Universal adj general, common సముదాయమైన, సాధారణమైన, మొత్తమైన.rice is their * food వాండ్లందరికీ సాధారణమైన ఆహారము బియ్యము. the * beliefis that he is dead వాడు గతించినాడని అందరు అంటారు. this is the * beliefఇది అందరికి వుండే భావము. * empire or sway ఏకఛత్రాధిపత్యము. * renownదిగంత విశ్రాంతమైన కీర్తి. the * Church యా వద్భక్తులు, భక్తులందరు.
Universality n s commonness, సాధారణత. from the * this opinion యీఅభిప్రాయము సర్వసాధారణమైనందున, యిది అందరి తలంపుగా వుండినందున.
Universally adv in all places, every where సర్వత్ర, అంతట, అన్ని చోట్ల,సర్వ సాధారణముగా. they are * detested వాండ్లు లోకవైరులు, వారిని అందరునిందిస్తున్నారు. * beloved లోకహితులైన. * known లోకరూఢియైన.
Universe n s the world విశ్వము, జగత్తు, ప్రపంచము, త్రిలోకము, త్రిభువనము.
University n s a collection of Colleges సమస్త శాస్త్రములు నేర్పేవిద్యాలయము.
Unjaundiced adj not envioous అసూయలేని, సరసమైన. I hope he willexamine the matter with an * eye ఆయన యీ సంగతిని విచారించడములోసమదృష్టి వుంచవలెను.
Unjointed adj broken, separated భిన్నమైన, శిథిలమైన, పొందికలేని. * chatతలాతోకలేని మాటలు.
Unjudged adj not determined తీర్పుచేయబడని, విచారించబడని.
Unjust adj wrongful అన్యాయమైన. it is * for you to do this నీవు యిట్లాచేయడము తగదు.
Unjustifiable adj not to be defended సమాధానము చెప్పకూడని, దూష్యమైన,అన్యాయమైన, శాస్త్రవిరుద్ధమైన. this is a most * act ఇది శాస్త్ర విరుద్ధమైన పని.
Unjustifiably adv శాస్త్రవిరుద్ధముగా, అన్యాయముగా.
Unjustified adj not cleared from guilt పాపవిముక్తుడుకాని, విడవబడని.
Unjustly adv wrongfully అన్యాయముగా.
Unked adj strange, unusual వింతైన, చోద్యమైన.
Unkennelled adj దాగిన స్థలములో నుంచి వెళ్ళకొట్ట బడ్డ.
Unkept adj not preserved, not tended కాపాడబడని. the garden is * ఆ తోట విచారణ లేకుండా పడివున్నది.
Unkilled adj ( Dryden ) చంపబడని.
Unkind adj cruel, not favourable క్రూరుడైన, నిర్దయాత్మకుడైన.
Unkindliness adj unfavourableness క్రూరత. from the * of the soil అదిపనికిరాని భూమి గనక.
Unkindly adj improper, not agreeable క్రూరమైన, నిర్దయాత్మకుడైన. that is a* climate అది మంచి దేశము కాదు. * childbed or a diffiuclt deliveryకష్టప్రసవము.
Unkindness n s cruelty క్రౌర్యము, ద్వేషము.
Unknowing adj ignorant తెలియని, యెరగని, అప్రసిద్ధమైన.
Unknowingly adv ఎరగక, తెలియక, అజ్ఞానతః.
Unknown adj not ascertained తెలియని. a book in an * language యెవరుయెరగని భాష తోవ్రాశిన గ్రంథము. they say that earth quakes are * in Indiaఇండియా దేశములో భూకంపము బొత్తిగా లేదంటారు. the author of this book is *యీ గ్రంథము యెవరు చెప్పినదో తెలియదు. for some reason * to me నేనుయెరగని యేదో వొక హేతువు చేత.
Unlaboured adj produced without trouble అనాయాసముగా వచ్చిన. thispoem is written in an * style యీ కావ్యము సరళముగా వున్నది.
Unladen adj unloaded దిగుమతి చేయబడిన, సామానులు దించబడని, ఖాలీచేయబడ్డ.
Unladylike adj మోటుతనముగా వుండే, నీచమైన. this was * language యిదిదొరసానికి తగని మాటలు, యిది దొరసాని అనరాని మాటలు.
Unlaid adj not placed; not pacified; not suppressed పెట్టబడని,వుంచబడని, అణచబడని. an * ghost యథేచ్ఛగా తిరిగే దయ్యము, అడ్డంకి లేక తిరిగేదయ్యము.
Unlamented adj not deplored యేడవని, చింతపడని. he died * అతనుచచ్చినందుకు యెవరు యేడవలేదు.
Unlawful adj not correct, not proper అన్యాయమైన, అశాస్త్రీయమైన. it is *for him to do so వాడు అట్లా చేయకూడదు.
Unlawfully adv illegally అన్యాయముగా, శాస్త్రవిరుద్ధముగా.
Unlawfulness n s illegality అన్యాయము, శాస్త్రవిరుద్ధత. on the * of this actయీ పని అన్యాయమైనందున గురించి.
No comments:
Post a Comment