Undeniable adj that cannot be denied కాదనికూడని, తోయగూడని, లేదనవల్లగానటువంటి, సిద్ధమైన, నిశ్చయమైన.
Undeniably adv స్పష్టముగా, ప్రత్యక్షముగా, సాక్షాత్తుగా, నిశ్చయముగా.
Under preposition కింద,అడుగున, he put the stick * his arm కర్రనుచంకపెట్టుకొన్నాడు. this cannot be finished * three days యిది మూడు దినాలలోకాదు. I studied * him for one year వాని వద్ద వొక సంవత్సరము చదువుతూవుంటిని. I held a situation * him అతని దగ్గెర వొక పని చూస్తూ వుంటిని. thedistance is * ten miles ఆ వూరు ఆమడ దూరానికి తక్కువగా వున్నది. * thesecircumstances ఇట్లా వుండగా. the matter * consideration ఇప్పుడు విచారణలోవుండే సంగతి. a letter * date 20th June జూన్ నెల యిరువయ్యో తేదీని వేశినజాబు. he gave me this declaration * his own hand యీ వాఙ్మూలమును తనచేవ్రాలు సహితముగా నాచేతికి యిచ్చినాడు. I have this * his hand యిది వానిచేవ్రాలు గలదిగా నా వద్ద వున్నది. he paid ten rupees * the head of interest వడ్డికింద పది రూపాయలు చెల్లించినాడు. * the orders received ఆజ్ఞాప్రకారముగా. hecheated me * the name of friendship స్నేహమనే పేరు బెట్టుకొని నన్ను మోసముచేసినాడు. this is known * the name of Persian silk దీన్ని పార్శీపట్టు అంటారు.there is a road * the hill ఆ కొండ కిందుగా వొక బాట వున్నది. he stood * thewall గోడ వద్ద నిలిచినాడు. you cannot get it * that price నీకు ఆ వెలకుతక్కువగా అది చిక్కదు. he is * my protection నా సంరక్షణలో వున్నాడు. the roadis * repairs యీ దోవను బాగుచేస్తున్నారు. he told me this * the rose దీన్నినాతో రహస్యముగా చెప్పినాడు. the ship is now * sail వాడ చాపలు విప్పినడుస్తున్నది. they kept him * వాణ్ని అణిచిపెట్టినారు. they drain the land tokeep the water * నీళ్ళు లేకుండా చేశేటందుకు గనిమలు తీస్తారు. one who is *age ఆ ప్రాప్త వ్యవహార వయస్కుడు, వ్యవహార యోగ్యమైన వయసు రానివాడు.children * two years old రెండేండ్లకు తక్కువ వయస్సుగల బిడ్డలు. he is now * acloud వానికి యిప్పుడు వొక కళంకము వచ్చి యున్ణది. an * farmer or undertenantలోపాయికారి, వొక కాపు కింద నేల తీసుకొని పయిరు పెట్టే కాపు. underclerk కరణముచేతికింది కరణము, గుమాస్తా చేతికింది గుమస్తా. an * garment అడుగు వస్త్రము. hespoke in an * tone హీనస్వరముగా మాట్లాడినాడు. I smote him * the fifth ribవాణ్ని డొక్కలో పొడిచినాను.
Under-current n s the imperceptible stream : which sometimesflows contrary to the upper water లోనినది, అంతర్ప్రవాహము, లోణి భావము.
Under-done adj not fully boiled బాగా పక్వము కాని. meat that is * లెస్సగాపచనము కాని మాంసము.
Underfoot adv కింద. they tord it * దాన్ని కింద కాలి తొక్కినారు.
Undergraduate n s a student or member of a University or collegeవిద్యార్థి.
Underground adv నేలకింద. a house built * నేలమాళిగ, భూమి కింద కట్టినయిల్లు.
Undergrowth n s shrubs or small trees growing among large onesఅడుగుపొదలు, అడుగు చెట్లు.
Underhand adv by secret means; by fraudulent means రహస్యముగా,మరుగుగా, మోసముగా. this payment was made * యీ రూకలు దొంగతనముగాయివ్వబడ్డవి.
Underhung adj కింది పలువరస పై పలువరస మీదికి వచ్చే. that man is * వాడికింది పలువరసపై పలువరస మీదికి వస్తున్నది.
Underling n s a base fellow నీచుడు, క్షుద్రుడు, కింకరుడు.
Undermined adj కుంగిన, కూలిన. his health is * వాని వొళ్ళు చెడిపోయినది.
Undermost adj lowest in place కింది. though he was * వాడు అందరికీకడపటి వాడైనప్పటికిన్ని కిందివాడై నప్పటికిన్ని.
Underneath adv కింద, అడుగున.
Underpetticoat n s లోని వుడుపు, ఇది ఇంగ్లిషు స్త్రీల వుడుపును గురించిన మాట.
Underplot n s ఉత్తరాలోచన, ఉత్తరాభిప్రాయము, ఉపకథ, రహస్యమైన ఆలోచన.
Underscored adj marked underneath అడుగున గురుతువేసిన, అడుగున గీతగీయబడ్డ.
Undersecretary n s రెండో రాయసగాడు.
Undersheriff n s చిన్ననాజరు.
Undershot adj moved by water passing under the wheel; ( opposedto overshot : ) as, an undershot mill or mill wheel జలయంత్రపుచక్రము కింద నీళ్ళు పారడము చేత తిరిగే. an * wheel కింద నీళ్లు పారడము చేత తిరిగేచక్రము.
Undersigned adj అడుగున చేవ్రాలు చేసిన. the *, inhabitants of this villageయీ అడుగున చేవ్రాలు చేసిన వూరికాపులు. the * యీ అడుగున చేవ్రాలు చేసిన నేను.he received the money from the * నా వద్ద రూకలు పుచ్చుకొన్నాడు.
Understanding n s sense తెలివి, జ్ఞానము. a man of * తెలిశినవాడు, తెలివి గలవాడు, బుద్ధిమంతుడు. a man of no * తెలివిలేనివాడు, తెలివిమాలినవాడు, అవివేకి. orstipulation నిబంధమన. they came to an * సమాధానపడ్డారు. a secret *లోమాట, లోలోనిమాట. In 1. Cor. XIV. 15. మనసా జ్ఞాత్వా A+.
Understapper n s a base servant నీచుడు, దాసానుదాసుడు, కూలివాడు,కామాటివాడు.
Understated adj నిజముగా వుండే బలాన్ని తగ్గించి మట్టుగా చెప్పబడ్డ.
Understood adj అర్థమైన, భావించుకోవలసిన. a language * by them వాండ్లకుతెలిసిన భాష. a word * not expressed కంఠర వేణ చెప్పబడకుండా భావించుకోవలసిన శబ్దము.
Understrapping adj నీచమైన, తుచ్ఛమైన, కామాటి.
Undertaken adj ఉద్యోగించబడ్డ, పూనుకోబడ్డ. this work was * by himwithout his order ఆయన సెలవు లేకుండా యీ పనికి పూనుకొన్నాడు.
Undertaker n s one who manages funerals శవమును సాగవేయుడమునకుకావలసిన వాటిని జాగ్రత చేశేవాడు. he who engages in any businessపూనుకొన్నవాడు, యీ అర్థము యిప్పుడు చెల్లదు.
Undertaking n s engaging in పూనుకోవడము, ఉద్యోగించడము, యత్నము.
Undertenant n s లోపాయకారి.
Undertook past tense of the verbToUndertake he * the business ఆపనికి పూనుకొన్నాడు.
Undervaluation n s rate not equal to the worth తక్కువ వెలకట్టడము,స్వల్పమతింపు వేయడము.
Underwood n s small trees that grow among large trees చెట్ల కింది చిన్నచెట్లు, కిందిపొద.
Underworked adj పని తక్కువగా వుండే. the horses are overfed and *గుర్రములకు తిండి యెక్కువ, పని తక్కువ.
Underwriter n s one who insures; an insurer పూటబడ్డ వర్తకుడు, ఉత్తరవాది.
Undescribable adj వర్ణించశక్యముకాని, వివరించగూడని, యింతంతనరాని.
Undescribed adj వివరించబడని, వర్ణించబడని, తెలియచేయబడని.
Undescried adj not discovered; not seen చుడబడని, కనుక్కోబడని,అదృశ్యమైన.
Undeservant n s దాసానుదాసుడు.
Undeserved adj not merited తగని, అన్యాయమైన, అపాత్రమైన, అనర్హమైన.
Undeservedly adv అన్యాయముగా, నిర్హేతుకముగా.
Undeserving adj అయోగ్యమైన అపాత్రమైన, అనర్హమైన. he is * of thesepraises యీ శ్లాఘనకు వాడు అర్హుడు కాడు.
Undesigned adj not intended అబుద్ధి పూర్వకమైన, యోచించిచేయని, ప్రయత్నపూర్వకాని.
Undesignedly adv without intention అబుద్ధి పూర్వకముగా, తోచక.
Undesigning adj sincere నిష్కపటమైన, నిష్కళంకమైన, సాధువైన.
Undesired adj not solicited కోరని, ఆశించని.
Undeterminable, Undeterminate,Undetermined adj not settled, notcertain తీరని, నిశ్చయించగూడని, నిర్దారణ చేయగూడని, అనిశ్చయమైన. matters areas yet undetermined ఆ సంగతి యింకా తీరలేదు. he is as yet undeterminedto go or stay పొయ్యేదో వుండేదో వాడుయింకా నిష్కర్ష చేసుకోలేదు.
Undeviating adj regular నిర్యత్యాసమైన, నిర్భిన్నమైన, ఏకరీతిగా వుండే.
Undevout adj having no piety భక్తి లేని, విశ్వాసము లేని.
Undid past tense of the verbToUndo చెడ్డ,విచ్చబడ్డ, this * him ఇందుచేతచెడిపోయినాడు. she * the knot అది ఆ ముడిని విచ్చినది.
Undigested adj జీర్ణముకాని, అరగని. an * plan చక్కగా కుదరని యుక్తి.
Undignified adj mean, base క్షుద్రమైన, నీచమైన.
Undiminished adj not lessened తగ్గని, సంపూర్ణమైన.
Undirected adj left without direction గురిపెట్టబడని, ఆజ్ఞాపించబడని, పైవిలాసము వేయబడని. an * letter పై విలాసము వ్రాయని జాబు.
Undiscerned, Undiscernible adj not seen అగుపడని, అగోచరమైన, గూఢమైన,గుప్తమైన.
Undiscerning n s అవివేకి.
Undischarged adj నెరవేర్చని, తీర్చని. duties which he left * వాడునెరవేర్చకుండా విడిచిన పనులు. a debt yet * యింకా తీరని అప్పు.
Undisciplined adj not duly exercised సుశిక్షుతుకు కాని, పనుబడని.
Undiscoverable, Undiscovered adj తెలియని, బయిటపడని, కనుక్కోబడని.
Undiscreet adj not prudent బుద్ధిలేని, తెలివిలేని, వివేకికాని.
Undisguisedly adv clearly తేటగా.
Undisguished adj plain; evident clear, confessed స్పష్టమైన, మరుగుచేయలేని, మాయలు లేని.
Undishonoured adj అగౌరవము చేయబడని.
Undismayed adj not alarmed భయము లేని, ధైర్యముగా వుండే.
Undisposed adj not inclined ఇష్టము లేని, అసమ్మతమైన, వ్రయము కాని. as hewas * to go పోవడానికి వాడికి యిష్టము లేనందున. the money that is yet * ofయింకా వ్రయము కాని రూకలు.
Undisputed adj not questioned నిస్సందేహమైన, నిర్వివాదమైన.
Undissembled adj open స్పష్టమైన, తేటయైన, నిష్కపటమైన, బేడిజములేని.
Undissipated adj not scattered వ్రయము చేయబడని, చెదిరిపోని. the moneyhitherto * యిది వరకు చేయబడని రూకలు.
Undistempered adj free from malady రోగము లేని, ఆరోగ్యముగా వుండే.
Undistinguishable adj that cannot be clearly seen స్పష్టముగా అగుపడని.there is an * difference between these two యీ రెంటికి వుండే భేదముఅగుపడేది కాదు.
Undistinguished adj having no mark భేదము లేని. the houses are *unless by numbers లెక్కల వల్లనేతప్ప ఆ యిండ్లు వొకటికొకటి భేదము లేకుండావున్నవి.
Undistinguishing adj making no difference వివేకము లేని, విభజన లేక. whatis the use of * censure యుక్తాయుక్త వివేకము లేని చీవాట్ల వల్ల యేమి ప్రయోజనము.
Undistracted adj not perplexed కలవరము లేని, తబ్బిబ్బు లేని.
Undistractedly adv కలవరము లేకుండా, తబ్బిబ్బు లేకుండా.
Undisturbed adj not troubled కలతలేని, తొందర లేని. a mind * by fearభయమనే తొందర లేని మనసు.
Undivided adj unbroken; whole అవిచ్ఛిన్నమైన, అవిభక్తమైన. the * streamof the Godavari అఖండ గోదావరి. the * stream of the Cavari అఖండ కావేరి.he paid * attention to this దాని మీద తదేక ధ్యానముగా వుండినాడు. * affectionసాంద్రమోహము. an * estate విభజించబడని ఆస్తి. those who hold an * estateare called in HIndu law అవిభక్తులు యేక భాండాశనులుగా వుండే వాండ్లు.
Undivulged adj not revealed; secret రహస్యమైన.
Undoing n s ruining, spoiling చెరపడము.
Undone past participle of the verb ToUndo loosenedవిచ్చబడ్డ''afterthe knots were * ముళ్ళు విడువబడ్డ తర్వాత. ruined చెడిపోయిన. they were * byhim వాడివల్ల వాండ్లు చెడిపోయినారు. In Luke XI. 42. ఇది చేయవలసినది అది చేయకమానరాదు.
Undoubted adj certain నిశ్చయమైన, నిస్సందేహమైన, రూఢియైన.
Undoubtedly adv నిస్సందేహముగా.
Undoubting adj sure, simple సందేహము లేని, నిస్సందేహమైన. * faithస్థిరమైన భక్తి.
Undrawn adj దూయని, యెత్తని, వ్రాయని. the * sword దూయని కత్తి. an *ticket లాటరిలో యింకా యెత్తని చీటి.
Undreaded adj not feared సందేహించని. a fate * by them ఆకస్మికముగావచ్చిన ఆపద.
Undreamed, Undreamt of adj తోచని, స్వప్న మందైనా తలచని.
Undress n s plain clothes సాధారణమైన బట్టలు. some of them came indress, some of them came in * కొందరు శృంగారించుకొని వచ్చినారు. he worethe * of a naval captain వాడు వొక వాడదొర యొక్క సాధారణమైన వుడుపునువేసుకొని వచ్చినాడు. In old days undress signified the plain dress worn athomein private. See Smollett's Lancelot Greaves. Chap XXIV. Sheburst upon him in an elegant white undress.
Undressed adj not clothed బట్టలు కట్టుకోని దిగంబరమైన. not cooked వండని,వచ్చి, పక్వముకాని.
Undried adj moist యెండని, వచ్చి, తడిగా వుండే.
Undriven adj not impelled తోలబడని. horses that are * బండికి పనుపరచనిగుర్రములు, బండికి కట్టని గుర్రములు.
Undubitable adj not to be doubted నిస్సందేహమైన.
Undue adj not right improper అన్యాయమైన, అయుక్తమైన, తగని.
Undulating adj waving; vibrating కదిలే, ఊగులాడే. raising and fallingకొంత దూరము మిట్ట కొంత దూరము పల్లుగా వుండే.
Undulation n s waving motion or vibration అలలవలె కదలడము,ఆందోళనము.
Unduly adv not properly అయుక్తముగా, అన్యాయముగా. excessivelyఅధికముగా, అతిగా.
Unduteous adj disobedient అవిధేయుడైన, భక్తి విహీనుడైన.
Undutiful adj disobedient అవిధేయుడైన, తలిదండ్రులకు అణగని.
Undutifully adv అవిధేయుడుగా, తలిదండ్రులయందు భక్తి లేకుండా.
Undutifulness n s want of respect, disobedience అవిధేయత.
Undying adj not perishing, immortal నిత్యమైన అనశ్వరమైన, అశాశ్వతమైన,మొండి ప్రాణము గల, చావని.
Unearned adj not obtained by labour or merit సంపాదించని, గణించనిఆర్జించబడని. money * by labour కష్టపని సంపాదించని రూకలు.
Unearthed adj పెళ్ళగించబడ్డ, తవ్వియెత్తబడ్డ.
Unearthly adj wonderful అద్భుతమైన, ఆశ్చర్యకరమైన.
Uneasily adv with pain శ్రమపడి, కష్టపడి.
Uneasiness n s pain ఆయాసము, దుఃఖము.
Uneasy adj feeling pain, anxious వ్యాకులపడే, చింతపడే. I am very * abouthim అతణ్ని గురించి నాకు నిండా విచారముగా వున్నది.
Uneaten adj not devoured తినని.
Unedified adj not improved దారికిరాని. they were * by his words వారుఅతని మాటలు విన్నారు కారు.
Unedifying adj not improving నిష్ఫలమైన.
Unedited adj దిద్ది అచ్చు వేయించబడని.
Uneducated adj not taught అశిక్షితులైన, పామరులైన, చదవని. an * manఅక్షరము తెలియనివాడు.
Uneligible adj not agreeable అనర్హమైన, తగని.
Unembarrassed adj not perplexed తొందరలేని, ఇబ్బందిలేని. those who are* with families సంసారమేన జంజాటము లేని వాండ్లు. he spoke in an * mannerధారాళముగా మాట్లాడినాడు. a decision * with doubts శంకాటంకము లేని తీర్పు.
Unempassioned adj not agitated కలవరము లేని.
Unemployed adj నిరుద్యోగముగా వుండే, పని లేకుండా వుండే, వూరికె వుండే. hekept the money * ఆ రూకలను వూరికె వేశి పెట్టినాడు.
Unempowered adj అధికార మివ్వబడని. * by the law they can do nothingచట్టము యొక్క బలము లేకుంటే వాండ్లు వొకటీ చేయలేరు.
Unendeared adj without fondness విశ్వాసము లేని, ప్రీతిలేని.
Unendowed adj మాన్యము లేని.
Unenduring adj not lasting అశాశ్వతమైన, నిలకడలేని.
Unengaged adj not bound by promise పూనుకోని, ప్రవర్తించని, మాట్లాడుకోబడనివిడిగావుండే. a house that is * యింకా యెవరికీ బాడిగెకు విడవబడని ఇల్లు. a girlwho is * పెండ్లి చేసుకొంటానని యింకా యెవరికీ మాట యివ్వని పడుచు.
Unenglish adj abominable, hateful, unnatural అసహ్యమైన, దిక్కుమాలిన,పాపిష్ఠి. this was very * conduct ఇది నిండా అన్యాయమైన నడత.
Unenjoyed adj not possessed అనుభవించని, అనుభవించబడని. the estatewas * by his sons ఆ యాస్తి వాని కొడుకులవల్ల అనుభవించబడలేదు.
Unenlarged adj narrow; contracted సంకుచితమైన, కొంచెమైన, అల్పమైన. menof * minds పామరులు, అజ్ఞానులు.
Unenlightened adj not illuminated వివేకము లేని, తెలివిమాలిన.
Unenslaved adj free స్వతంత్రుడుగా వుండే, పరాధీనము లేకుండా వుండే,నిర్బంధము లేని, విచ్చలవిడిగా వుండే.
Unentertaining adj giving no delight విరసమైన, జబ్బుగా వుండే.
Unenviable adj abominable అసహ్యమైన, రోతగా వుండే, చెడ్డ.
Unenvied adj exempt from envy ఎవరున్ను కోరని, యెవరికీ అక్కరలేని, అంతవిశేషమైనది కాని. * wealth యెవరున్ను కోరని ధనము, భాగ్యము. Camsa hasgained the * distinction of having been slain by Krishna కృష్ణుడి చేతచావడమనే లోక గర్హితమైన మహిమ కంసుడికి వచ్చినది.
Unequal adj సమానము కాని, సరికాని. an * contest సరి వుద్దులుగా వుండనివాండ్ల యుద్ధము. as a writer, he is very * వాని రచన కొన్ని చోట్ల బాగా వున్నదికొన్ని చోట్ల బాగు లేదు. the walls are * in height వొక గోడ హెచ్చు వొక గోడతక్కువగా వున్నది.
Unequalled adj అసమానమైన, సరిలేని.
Unequivocal adj not doubtful clear; evident రూఢమైన, నిశ్చయమైన,సిద్ధమైన, పరిష్కారమైన.
Unequivocally adv without doubt; plainly పరిష్కారముగా, స్పష్టముగా,నిశ్చయముగా, రూఢిగా.
Unerring adj incapable of mistake అభ్రాంతమైన, భ్రమలేని, తప్పని.
Unerringly adv భ్రమలేకుండా, భ్రాంతి లేకుండా తప్పకుండా.
Unespied adj not discovered; not seen అగుపడని, తెలియని, కానబడని.
Unessential adj not absolutedly necessary అనావశ్యకమైన, అంత అగత్యముకాని.
Unestablished adj not permanently fixed స్థిరము కాని, శాశ్వతము కాని.
Uneven adj not level మిట్టా పల్లముగా వుండే, విషయమైన, బేసియైన. * groundమిట్లా పల్లముగా వుండే భూమి. * teeth వంకరటొంకరగా వుండే పండ్లు. * numeralsబేసిగా వుండే అంకెలు.
Unevenness n s surface not level మిట్లా పల్లముగా వుండడము. turbulenceవ్యత్యాసముగా వుండడము, కలతగా వుండడము.
Unevitable adj unavoidable నివర్తించగూడని, తప్పించరాని, అపరిహార్యమైన.
Unexacted adj not taken by force దండుగబట్టని, నిర్బంధించి తీయబడని,కక్కసించి తీయబడని.
Unexamined adj not investigated విమర్శించబడని, విచారణ చేయబడని.
Unexampled adj unparalleled అసమానమైన, అతులమైన, అపూర్వమైన, వింతైన.
Unexceptionable adj unobjectionable నిర్దోషమైన, యోగ్యమైన, దూష్యము కాని,నిరాక్షేపమైన, లోపము లేని.
Unexcised adj not charged with the duty of excise సుంకము వేయబడని,హాసీలు కట్టబడని.
Unexcited adj not roused రేచబడని. he wrote this * by anger కోపములేనివాడై దీన్ని వ్రాశినాడు.
Unexecuted adj not done జరగని, నెరవేరని, చేయని, తీరని. he left his will *మరణ శాసనములో చేవ్రాలు చేయకుండా చచ్చినాడు.
Unexemplified adj not illustrated by example దృష్టాంతములేని, నిదర్శనములేని, ఉదాహరణ లేని. these rules are * యీ సూత్రములకు వుదాహరణలు లేవు.
Unexempt adj not free by privilege వినాయింపులేని, వినాయించబడని. theyare * from punishment వాండ్లకు శిక్ష లేదనేది లేదు.
Unexercised adj not practised; not disciplined అలవరచబడని, పనుబడని,వాడుకబడని, అశిక్షితమైన. those who are * in logic తర్కమందు పరిశ్రమ లేనివాండ్లు.
Unexhausted adj not spend అయిపోని, వ్రయమైపోని, తరగని, క్షీణించని,శోషించని. how long will this wealth remain * ? యీ ఐశ్వర్యము తరగకుండాయెన్నాళ్ళకు వుండబోతున్నది ?
Unexpanded adj not spread out, not laid out వికసించని, విచ్చని,అవిస్తృతమైన.
Unexpected adj sudden అకస్మాత్తైన, హఠాత్తుగా వచ్చిన.
Unexpectedly adv suddenly ఆకస్మికముగా, హఠాత్తుగా.
Unexperienced adj not versed అనుభవములేని, వాడుకపడని. a man * intrade వర్తకములో వాడుకపడని వాడు.
Unexpert adj wanting skill వాడుకపడని, పనుపడని, నిపుణతలేని. they arevery * in accounts వాండ్లకు లెక్కలలో యెంత మాత్రము నిపుణత లేదు.
Unexpired adj not ended తీరని, ముగియని. the * period of the leaseయింకా తీరకుండా వుండే గుత్త యొక్క గడువు.
Unexplored adj not searched వెతకబడని. caverns hitherto * ఇది వరకుయెవరున్ను చూడని గుహలు. a question * by physicians వైద్యుల చేతవిమర్శించబడని ప్రశ్న.
Unexposed adj not laid open తెరవబడని, అనుభవించని. children who are * to trouble కష్టమెరగని బిడ్డలు. a garden * to storms గాలివాన యొక్క తొందరయెరగని తోట. goods hitherto * for sale యింకా అమ్మకానికి చూపని సరుకులు.those who are yet * to judicial censure నిరపరాధులు.
Unexpressed adj not mentioned; not exhibited చెప్పబడని, అగుపరచబడని.Thus used in " The Monks and the Giants " 3. 52. Or mark the jetty glossy tribes that glance Upon the water's firm unruffled breast; Tracing their ancient labyrinthic dance In mute mysterious cadence unexpressed.
Unexpressive adj భావశూన్యమైన, ఒకటీ తెలియకుండా వుండే. an * face ఒకభావమున్ను అగుపడకుండా వుండే ముఖము.
Unextinguishable adj that cannot be quenched అర్చగూడని. * furyఅణచగూడని ఆగ్రహము.
Unextinguished adj ఆర్చబడని.
Unfaded adj unwithered వాడని, అమ్లానమైన.
Unfading adj not liable to wither వాడని, అమ్లానమైన. * laurels శాశ్వతమైనకీర్తి.
Unfailing adj without fear of change తప్పని, భయము లేని. this is an *promise యిది తప్పని మాట, యిది నిశ్చయము. an * spring యెన్నటికీ పారేబుగ్గ,సంతత ధారగా వుండే బుగ్గ.
Unfailingly adv తప్పకుండా.
Unfair adj not honest, unjust అన్యాయమైన. this is * యిది కారాదు, యిదికూడదు.
Unfairly adv అన్యాయముగా.
Unfairness n s dishonesty, injustice అన్యాయము, పక్షపాతము.
Unfaithful adj not true, not honest నిజము కాని, తాత్వికము కాని. this is an* account యిది యథార్థమైన వృత్తాంతము కాదు. an * servant సత్యముగా నడవనిపనివాడు, వంచకుడుగా వుండే పనివాడు, ద్రోహిగా వుండే వాడు.
Unfaithfully adv కృత్రిమముగా, తప్పుగా.
Unfaithfulness n s ద్రోహము. from their * వాండ్లు సత్యముగా నడవనందున,వాండ్లు ద్రోహులు గనక.
Unfashionable adj నాగరీకము కాని, వింతైన, వికారమైన, విపరీతమైన. he wearsan * dress వాడు వికారమైన వుడుపు వేసుకొంటారు. he keeps * company వాడునీచులతో సహవాసము చేస్తున్నాడు, తగని సహవాసము చేస్తాడు. he lives in an * partof the town వాడు ఆ పట్టణములో తగని చోట కాపురము వున్నాడు. * mannersమోటుతనము. an * man విపరీతుడు. it is * to get drunk తాగడము మరియాదకాదు, సరసము కాదు.
Unfashionableness n s విపరీతము, వికారము, వింత.
Unfashionably adv వింతగా, వికారముగా. he was dressed * వాడు వికారమైనవుడుపు వేసుకొన్నాడు.
Unfashioned adj not well formed వికారమైన, ఆకారముగా యేర్పడని. adwelling * by man in the rock కొండలో మనుష్యకృత్యము కాకుండా వుండే వొకనివాసము.
Unfastened adj loosened, వీడిన, వదిలిన, విచ్చబడ్డ.
Unfathered adj without a parent నాథుడులేని, అనాధగా వుండే. at presentthis book is * యీ గ్రంథకర్త యెవడో యిప్పట్లో తెలియకుండా వున్నది.
Unfathomable adj deep అగాధమైన. these mysteries are * ఇవి నిండాగూఢముగా వుండే రహస్యములు, యివి తెలుసుకోకూడని మర్మములు.
Unfathomably adv deeply అగాధముగా. this is * mysterious ఇది అతిరహస్యము.
Unfathomed adj deep, not sounded అగాధమైన, లోతుగా వుండే. this is an *question యిది తీరని సందేహము.
Unfatigued adv not wearied అలియని. * with this journed, he again setout యీ ప్రయాణము పోయి రావడము చేత అలుపు లేనివాడై మళ్ళీ బయిలుదేరినాడు.
Unfavourable adj not agreeable ప్రతికూలమైన, విరుద్ధమైన, కాని. they heardan * account of the country ఆ దేశమును గురించి వొక చెడు సమాచారమునువిన్నారు.
Unfavourably adv unkindly ప్రతికూలముగా, విరుద్ధముగా. the year began *యీ సంవత్సరము ఆరంభములోనే చెడుగా వున్నది.
Unfeared adj not dreaded అనుమానించని, పిట్ట పిడుగుగా వచ్చిన. a result *by them వాండ్లకు అకస్మాత్తుగా వచ్చిపడ్డ పిడుగు.
Unfeathered adj రెక్కలు లేని.
Unfeatured adj deformed వికారమైన.
Unfed adj not supplied with food పోషించబడని, పాలించబడని, అనాహారియైన,నిరాహారియైన. the beasts are yet * యింకా పశువులకు మేత పెట్టలేదు. the firewas * four hours ఆ నిప్పులో నాలుగు గడియల దాకా కట్టెలు వేయలేదు.
Unfeed adj unpaid రూకలు తీసుకోని, వర్తనను తీసుకోని. an * lawyer వర్తనముతీసుకోని వకీలు.
Unfeeling adj cruel; hard క్రూరుడైన, కఠినుడైన. he is utterly * వాడికిదయాదాక్షిణ్యము లేదు, అతడు నిర్దయాత్మకుడు, క్రూరుడు.
Unfeelingness n s hardness of heart; cruelty నిర్దయాత్మకత, క్రూరత్వము.
Unfeigned adj not counterfeit, real; sincere నిష్కపటమైన, మాయలు లేని,నిశ్చయమైన.
Unfeignedly adv really; sincnerely నిజముగా, నిండా.
Unfelt adj not perceived తెలియని. there was a slight earthquake * by those who were asleep స్వల్పమైన భూకంపము సంభవించినందున నిద్ర పోతూవుండిన వాండ్లకు తెలియలేదు.
Unfenced adj not protected by a hedge వెలుగు లేని. the cattle was leftin an * field పశువులు వెలుగులేని పొలములో వుండినవి.
Unfettered adj free స్వతంత్రుడైన, నిరంకుశమైన. an estate * with debtsఅప్పులనే పీకులాట లేని ఆస్తి.
Unfigured adj not having images ఆకారము లేని. it is a creature * in anybook యీ జంతువు యొక్క ఆకారము యే పుస్తకములోనున్ను లేదు.
Unfilial adj not suitable to a child, undutiful పుత్రుడికి తగని. you oughtnot to act so towards your father; it is very * conduct తండ్రివిషయములో నీవు అట్లా నడుచుకోరాదు యిది పుత్రునికి తగినరీతి కాదు.
Unfilially adv in a manner not proper for a child పుత్రుడికి తగనిరీతిగా. heacted very * towards his mother పుత్రుడు తల్లి విషయములో నడవతగని రీతిగానడుచుకొన్నాడు.
Unfilled adj not filled నించబడని, సంపూర్ణము చేయబడని.
Unfinished adj not complete, imperfect కొరగా వుండే, అసమగ్రముగా వుండే,ముగియకుండా వుండే, తీరకుండా వుండే. an * picture యింకా వ్రాశి తీరకుండా వుండేపఠము.
Unfit adj improper తగని, అనర్హమైన, అయోగ్యమైన. this is a very * answerయిది తగని వుత్తరము, యిది సరియైన వుత్తరము కాదు. he is * to be trusted వాడునమ్మడానికి అర్హుడు కాడు. this food is * to eat యిది తినడానికి అయోగ్యమైనఆహారము.
No comments:
Post a Comment