R. రేఫ, రకారము
Rabbet n s నడమ కుసులు తగిలించి పలకతో పలకను జోడించడము.
Rabbi, or Rabbin n s. యూదియావాండ్ల గురువు.
Rabbinical adj యూదియాగురు సంబంధమైన.
Rabbit n s సీమకుందేలు. a welsh * వుప్పు, మిరియము వేసి కాల్చిన జున్ను గడ్డతునక. properly spelt ` Rare bit."
Rabbit weed n s బాలబంద.
Rabble n s అల్లరిమూక, నీచజనము.
Rabid adj వెర్రి, పిచ్చిపట్టిన, చిరచిరలాడే.
Rabidness n s వెర్రి, చిరచిరలాడడము.I was the * of his temper వాడుమండిపడడమును కనుక్కొన్నాను.
Race n s ( Lineage or family ) వంశము, సంతతి. or sons సంతానము. tohim and all his race వాడికిన్ని వాడి బిడ్డలకున్ను. the human * or peopleమనుష్యులు. the kings of the solar * సూర్య వంశపు రాజులు. those of theroyal * రాజ వంశస్థులు, రాజకులస్థులు. A man of illustrious * కులీనుడు, సత్కులప్రసూతుడు. a * of beggars బిచ్చగాండ్లగుంపు, బికారిగుంపు. or running matchపందెము. a horse * గుర్రపు పందెము. boat * పడవల పందెము. foot * పందెమువేసుకొని పరుగెత్తడము. they ran a * పందెము వేసికొని పరుగెత్తినారు. a * horseపందెపు గుర్రము. progress or course గతి. the * of life ఆయుష్క్రమము. hefinished his * వాని ఆయుస్సు తీరినది. the sea was running at a great *సముద్రము మహా వడిగా పారుతూ వుండెను. ( See Johnson No.8,9 .) A * ofginger అల్లపు కొమ్ము సొంటి కొమ్ము.
Racer n s పందెపు గుర్రము. horse * గుర్రములను పందెమునకు విడిచేవాడు.
Raciness n s మంచిరుచి, మాధుర్యము.
Rack n s an engine of torture చేతులు కాళ్లు తొడలు నలిపి చిత్ర హింసచేయడమునకై వుండే ఆయుధము. while he was on the * of doubt ఒకటీ తోచకతల్లడిస్తూ వుండగా. her thoughts were on the * about this అందున గురించిఆమె తల్లడిస్తూ వుండెను. Rack meaning clouds driven by the wind గాలికికొట్టుకొని పొయ్యే మేఘము. A * for hay or straw గాడి, తొట్టి. a bottle * వట్టిబుడ్లు బోర్లించే చట్టము. a ( or arrack ) a spirit కల్లు, సారాయి.
Racket n s a noise చప్పుడు, రంతు, గల్లంతు, కూతలు, రచ్చ. what a * thecarpenters make ! అబ్బా యీ వడ్లవాండ్లు చేసే చప్పుడు తల వేదనగా వున్నది ఇ donot make such a terrible * దడబిడలు చేయక, రచ్చ చేయక. what a * thechildren are making ! అబ్బా ఆ పిల్లకాయలు యేమి రచ్చ చేస్తారు. Instrument forplaying at ball చెండు తట్టే కఱ్ఱ యీ ఆటను fives అని అంటారు.
Racking adj వేదన పెట్టే. a * pain శూలనొప్పి, గిజగిజలాడించే నొప్పి. a * headache వెర్రి తల నొప్పి.
Rack-rent n s దండుగ, అధికముగా కొట్టి తీసే పన్ను.
Racoon n s నక్కవంటి యొక్క జంతువు, వొక విధమైన అడివి జంతువు.
Racy adj నిండా రుచిగా వుండే, మాధుర్యమైన, కొంచెము పులుసు కొంచెము వొగరుగావుండే.
Raddle n s a fascine కట్టెల మోపు.
Radiance, Radiancy n s. ప్రకాశము, జ్యోతి, కాంతి, ప్రభ.
Radiant adj ప్రకాశమైన. a face * with smiles నవ్వుతో వెలిగెడి మోము. a face* with delight ఆనందోద్భాసిత ముఖము.
Radiation n s వ్యాపించడము, ప్రసరించడము, సూర్యకిరణములవలె నల్దిక్కులవ్యాపించడము.
Radical adj అదిమ, మూల. this effected a * cure తుట్రమరస్వస్థమైనది. thisis a * evil యిది జన్మసిద్ధమైన దుర్గుణము. * reform నూతన సృష్టి, మునుపటిదంతాకొట్టివేసి నూతనముగా చేసిన యేర్పాటు. they made a * reform in the regimentఆ దండులో మునుపు వుండిన దంతా శుద్ధముగా తోశివేశి కొత్త యేర్పాటు చేసినారు. *change పునఃసృష్టి. A * that is " visionary defendant of thoroughequality " ( Sir W. Scott ) ఒక డెక్కువ మరి వొకడు తక్కువ అనేదేమి సర్వత్రసమమే ననేవాడు దొరతనములో వుండిన మర్యాదలను తోసి వేశి కొత్త క్రమమునుపెట్టేవాడు. Sanscrit * s సంస్కృత ధాతుమాల. Hebrew or Arabic *s ఆ భాషలలోకొన్ని అక్షరములకు యీ పేరు కలదు.
Radically adv సమూలముగా, బొత్తిగా, తుట్రమర. * bad సర్వధా పనికిరాని.
Radish n s ముల్లంగిగడ్డ, మూలకము. the horse * tree మునగచెట్టు, కత్తితోచివ్విన పచ్చి వేరు పొడి యింగిలిషువారు వొక వ్యంజనముగా తింటారు.
Radius n s ( plural radii ) a ray సూర్య కిరణము చంద్ర కిరణముమొదలయినవి. కిరణము అనగా కైవారము యొక్క నాభి నుంచి బండి ఆకుల వలెనల్దిక్కులకై వారము యొక్క అంచుకు పారేటిది. the radii of a wheel బండి చక్రముయొక్క ఆకులు. the radii of a circle కైవారములో ఆకులురీతిగా నడమ నుంచి అంచుకుపారే గీతలు.
Radix n s ధాతువు. what is the * of this word ? యీ శబ్దానికి ధాతువుయేమి.
Raff n s ( Rascal ) పోకిరి, లుచ్చా.
Raffle n s వొక విధమైన లాటరి ఆట, చీట్లు గాని పాచికలు గాని వేసి ఆడుతారు.A sad* d letter : i.e. a confused or scribbled letter చెడ్డ చిత్తుగా వుండే జాబు.
Raft n s కట్టుమాను, తెప్ప.
Rafter n s యింటి కప్పుకు వేసే వాసము, త్రావి, సరంబి.
Rag n s పేలిక, చింపిగుడ్డ * s చీరికలు, చింపిగుడ్డలు. * s and tatters చీరికలుపేలికలు. he toreit to * s చిందరవందర చేసినాడు, చిన్నా భిన్నము చేసినాడుతుత్తుమురు చేసినాడు. you have boiled this meat to * s నీవు దీన్ని చిముడగొట్టినావు. the board is all in *s ఆ పలక అంతా తుత్తుమురై పోయినది.
Ragamuffin n s అల్పుడు, నీచుడు, దిక్కుమాలినవాడు, వూరురోసినవాడు.
Rage n. s. ఆగ్రహము, కోపము,చిరచిర,చిరాకు,she wasin a great * అదిమండిపడుతూ వుండినది. that book is quite the * ఆ పుస్తకము మీద అందరున్నుపడి చస్తారు. the * of the wind గాలి యొక్క ముమ్మరము. the * of feverజ్వరవేగము.
Ragee n s ( Indian word a sort of grain ) రాగులు.
Ragged adj చింపిరి, చింపి, చినిగిన, శిథిలమైన. a * colt గొరప మెరగని గుర్రపుతట్టు. * rascals బికారివాండ్లు. * school దరిద్రుల పల్లె కూటము. * walls మొండిగోడలు. a * head చింపిరితల.
Raggedness n s చీరికలై యుండడము.
Raggy n s ( a sort of grain ) రాగులు.
Raging n s ఆక్రోశము, ఆగ్రహము.
Ragingly adv వుగ్రముగా, ఆగ్రహముగా. It is * lot యెండ నిప్పులు కురుస్తున్నది
Ragman n s పాత గుడ్డలు కొని అమ్మేవాడు.
Ragout n s కూర, వ్యంజనము.
Ragstone n s వొక విధమైన సానరాయి.
Raid n s (in road of plunderers) దవుడు, అవాంతరము.
Rail n s గ్రాది, కటకటాలు, అలవ. name of a bird the blue throated * వెన్నముద్ద కోడి. a * road పొగబండ్ల బాట. ( See Railway. )
Railer n s తిట్టేవాడు, వుదాసీన మాడేవాడు.
Railery n s పరిహాసము, యెగతాళి, యెత్తి పొడుపు.
Railling, or Railings n s. గ్రాది, కటకటాలు.
Railway n s పొగబండ్లు పొయ్యేబాట, యీ బాట మీద పొయ్యే బండ్లకు గుర్రములనుగాని యెద్దులను గాని కట్టడము లేదు, అయితే వేడినీళ్ళ పొగవల్ల పోతవి యీ బండ్ల పేరు.Steam coach or carriage అని అంటారు.
Raiment n s వస్త్రము. బట్ట, వుడుపు food and * అన్న వస్త్రములు.
Rain n s వాన, వరుషము. constant or continual * ముసురు. a heavy *జడివాన. thin or drizzling * or sleet తూర, తుంపరలు, సోన. excess of *అతివృష్టి. failure of * అనావృష్టి, వరపు. meaning a shower చినుకులు. the *come in చినుకులు లోనికి వస్తవి. the Rains వాన కాలము.
Rainbow n s యింద్రధనుస్సు.she was dressed in all the colours of the *నానా వర్ణముల బట్ట కట్టుకొని వుండినది, పలువన్నెల చీరకట్టుకొని వుండినది.
Rainly adj వాన, చిత్తడి. * season వాన కాలము, వరుషా కాలము.
Raised adj యెత్తిన, లేవనెత్తిన, పుట్టించిన, కలగచేయబడ్డ, కట్టబడ్డ.( See to Raise.)
Raisin n s యెండిన ద్రాక్ష పండు.
Raising n s పెంపు, వుద్ధారణము. ( fire * arson ) యిల్లు తగలబెట్టిన నేరము.
Rajah n s రాజు.
Rajah-boil n s ( carbuncle ) రాచపుండు.
Rake n s (in gardening ) ఆరగొర్రు, పండ్ల మాను, మలారములు. a debaucheeపోకిరి మిండగీడు. a female rake మిండకత్తె.
Rakehell n s దూబరదిండి, పోకిరి.
Rakish adj కొంటె అయిన, పోకిరి అయిన.
Rakishness n s కొంటెతనము, పోకిరితనము, ధూర్తత.
Ralling n s తిట్టు దూషణ.
Ralph n s మాలకాకి, కోతికి తిమ్మన్న అన్నట్టు యిది మాల కాకికి ముద్దు పేరు. Ram, n. s. పొట్టేలు, తగరు. Aries మేషము. a battering * కోటగోడలుయిడియకొట్టడము నకై వేలాడవేసిన మాను.
Ramble n s తిరగడము, కొంచెము దూరము పోవడము. I took a * through thetown పట్టణములో కొంచెము దూరము తిరిగినాడు.
Rambler n s ఇటు అటు తిరిగేవాడు, వనవిహారి, లోకసంచారి.
Rambling n s తిరగడము, అల్లాడడము, వన విహారము.
Ramekin n s ( Johnson) నెయ్యి చెరిమికాల్చిన జున్ను గడ్డ తునక.
Ramification n s శాఖోపశాఖలు. this plot had many *s యీ కుట్రశాఖోపశాఖలుగా పెరిగినది, యీ కుట్రలో నుంచి అనేక కుట్రలు బైలుదేరినవి.The *s of a discourse పరిపరి విధములైన ప్రసంగము.
Ramified adj శాఖోపశాఖలైన. a * story చిత్ర విచిత్రమైన కథ. a greatly *family తామర దంపముగా వుండే సంసారము.
Rammer n s దిమ్మసా, గట్టనపలక.
Rammish adj గొర్రె కంపుకొట్టే, గబ్బు కొట్టే, చంకకంపు కొట్టే.
Rampant adj తాండమాడే, తుళ్ళే, మూర్ఖమైన. * lust కామాతురము అధికవ్యామోహము.
Rampart n s కొత్తళము, అలంగము, ప్రాకారము, ప్రహరీ.
Ramping adj తాండవమాడే, తుళ్ళే, మొండి.
Rampingly adj తుళ్ళుతూ, తాండవమాడుతూ.
Ramrod n s తుపాకి గట్టించే శలాక.
Ran pasttenseofRun (See to Run)
Rancid adj కుళ్ళుకంపు కొట్టే, పాశికంపుకొట్టే, బూజు కంపుకొట్టే. (as oil) చిక్కుకంపుకొట్టే to grow * పాశిపోవుట, కంపెత్తుట.
Rancidity, Rancidness n s. మురుగు, వాసన, పాశినకంపు, బూజుకంపు.
Rancor n s అతి క్రౌర్యము, పగ, చలము, వైరము.
Rancorous adj చలము పట్టిన, పగబట్టిన, అతిక్రూరమైన, మహత్తైన, ద్వేషము గల.
Rancorously adv అతి క్రౌర్యముగా.
Rancour n s చలము, వైరము.
Random adj యథేచ్ఛగా, గురిలేక, గుడ్డి వేటుగా. a few * blows కొన్ని గుడ్డివేటుదెబ్బలు * expressions నోటికి వచ్చినట్టు చెప్పిన మాటలు. a * guess వూరికెగుడ్డివేటుగా వూహించడము. he spoke at * పోలుపొందలేక మాట్లాడినాడు. they shotat * గురి లేక కాల్చినారు, మనసు వచ్చినట్టు కాల్చినారు. It floated at * తనంతటతేలుకాడుతూ వుండినది.
Rang past tense of Ring (See to Ring)
Range n s chain or series వరస, పఙ్తి, శ్రేణి. a * of trees చెట్లశాల. a * ofshop అంగళ్ల వరస. * over * వొకటి మీద వొకటి వరసగా. one * of a ladder నిచ్చెనమెట్టు. a kitchen * కుళినిలో వరసగా కట్టిన పొయి మొదలైనది. compass or extentమేర దూరము. through a great * of country సర్వత్ర దేశమంతా. with in ashort * కొంచెము దూరములో. in gunnery గుండు పారే దూరము. the tree waswithin the * of the gun ఆ చెట్టు గుండు పారే దూరమునకు లోగా వుండినది. withinthe * of the eye కన్ను పారే దూరములో. the eagle's eye has a great * గూళియొక్క దృష్టి బహు దూరము పారుతున్నది. every thing that is within the * ofthe child's mind బిడ్డ యొక్క మనసుకు గోచరమయ్యేటి వెల్లా. that village is notin this magistrate's * ఆ వూరు యీ పోలీసు అధికారములో లేదు.
Ranger n s తిరిగేవాడు, సంచరించేవాడు. the tiger is a * of the forest పులిఅడవిలో సంచరించేటిది. or watchman కావలివాడు.
Rank adj high growing ( as weeds ) మదాళించిన. * vegetationమదాళించిన చెట్లు. a * poison చెడు, విషము. ( Rancid ) కుళ్లు, మురుగుడు. a *small బూజుకంపు. gross ముదుగు, మోటు. a * or gross falsehood పచ్చిఅబద్ధము. * obscenity బండ బూతు. a * whore వూరలంజ.
Rankling adj మెరమెరలాడే. a * pain పేగునపట్టిన తీట. a * suspicionమెరమెరలాడే సందేహము, మానని సందేహము. * spleen or ill will బద్ధ వైరము.
Rankly adv మదాళించి. ( See Rank. adj. )
Rankness n s ( richness) మదాళింపు. ( rancidness )కుళ్ళు, బూజు కంపు, చంకకంపు, నీచు కంపు, గౌలు.
Ransack v a ( to plunder ) కొల్ల బెట్టుట. ( to search narrowly )గందరగోళము చేసి వెతుకుట, లొడబెట్టి వెతుకుట, సందు గొందు గాలించి వెతుకుట.
Ransom n s చెర విడదల చేసే నిమిత్తమై యిచ్చే పయికము, శిక్ష లేకుండాచేయడమునకై యిచ్చే పయికము.
Ransomed adj విడదల చేయబడ్డ, అనగా పయిక మిచ్చి చెరవిడిచిపించబడ్డ.
Ransomer n s ( one that redeems ) తారకుడు, రక్షకుడు, రూక లిచ్చి చెరవిడిపించినవాడు.
Ransomless adj రూకలు పుచ్చుకోక విడవబడ్డ, పుణ్యానికి చెరలో నుంచి విడవబడ్డ.he let the prisoners go * ఆ కైదీలను పుణ్యానికి విడిచి పెట్టినాడు.
Rant n s పెద్ద గొంతు పెట్టుకొని భట్రాజువలె పద్యాలు చదవడము. " He began witha * and a roar " ( Swift ) బొబ్బలు పెట్టి మాట్లాడ సాగినాడు. " He said in a *that he would go " ( Duchess of Marlb. 1.314.) పోతానని భోరున అరిచినాడు.
Ranter n s యిది వొక మతము పేరు.
Rantipole n s పొగరుబోతు.
Ranunculus n s వొక పువ్వు పేరు.
Rap n s ( aknock) మొట్టికాయ. a penny పైసా, యిది యింగ్లీషు మాట కాదు. hereceived a * on the knuckles about this యిందున గురించి వాడికి చీవాట్లువచ్చినవి వారు కూకలు బెట్టినారు. I gave him a * on the head వాడి తల మీద వొకమొట్టికాయ యిచ్చినాను.
Rapacious adj దుష్ట, క్రూరమైన, సర్వభక్షకమైన, తిని వేసే. the hawk, the tiger,the wolf are * animals డేగ, పులి, తోడేలు యివి క్రూర జంతువులు. a * laywerసర్వభక్షకుడైన లాయరు.
Rapaciously adv ఆతురముగా, బలాత్కారముగా, సర్వభక్షకత్వముగా.
Rapaciousness n s ఆతురము, సర్వభక్షకత్వము.
Rapacity n s ఆతురము, క్రూరత్వము, దుష్టమృగభావము.
Rape n s చెర, స్త్రీని బలత్కారముగా చెయి పట్టడము. he committed a * on herదాన్ని చెరిపినాడు, దాన్ని బలాత్కారముగా చెయి పట్టినాడు.the * of the Lockకుంతలాపహరణమనే వొక కావ్యము. * of the Jessamine ( title of a Telugupoem ) పారిజాతాపహరణము. the name of a plant or its seed నువ్వు చెట్టు,నువ్వు గింజ.
Rapid adj శీఘ్రమైన, త్వరయైన, వడిగల, వేగమైన. or steep as a descentనెట్రముగా వుండే. he gave me a * sketch of the business ఆ సంగతినిసంక్షేపముగా చెప్పినాడు, రెండు ముక్కలుగా చెప్పినాడు. the house is going to *decay ఆ యిల్లు శిథిలమైపోతున్నది.
Rapidity n s వేగము, వడి, త్వర.
Rapidly adv త్వరగా, వడిగా, వేగముగా, దబ్బున. he is * growing rich వాడికినానాటికి ఐశ్వర్యము పొడుగుతున్నది. the sun was * setting బిరబిర ప్రొద్దుగూకెను.as night was * coming on మరిమరి చీకటి పడుతూ వచ్చి నందున. as thesummer was * approaching యెండ కాలము ఆరంభమైనందున.
Rapidness n s త్వర, వేగము. from the * of its growth అది క్షణేక్షణే అభివృద్ధికావడమువల్ల.
Rapids n s ఏట్లో నీళ్లు వడిగా పారే స్థలము.
Rapier n s సన్నపాటికత్తి, ఖడ్గము.
Rapine n s కొల్ల, దోపుడు.
Rapt adj ఆవేశముగల, పరవశుడైన, విస్మయము పొందిన, ఆనందభరితుడైన.
Rapture n s ఆవేశము, పారవశ్యము, ఆనందము, ఉల్లాసము. they spoke in * sof him వాణ్ని మహాశ్లాఘించినారు.
Raptured adj ఆనందభరితుడైన.
Rapturous adj ఆనందకరమైన, సంభ్రమమైన. he spoke in a * mannerఆహ్లాదభరితుడై మాట్లాడినాడు.
Rare adj అపరూపమైన, అరుదైన, వింతైన, వినోదమైన. or thin సూక్ష్మమైన. a *opportunity దివ్యమైన సమయము. it is not * యిది అరుదు కాదు, అతిశయము కాదు.
Rarefaction n s పలచన కావడము. " తాపద్వారా విస్మరిత భావము, స్ఫీతి, వర్థనంసూక్ష్మభావము. ( Dz. )from the * of the air he could not breathe ఉక్కవల్లవూపిరి తిరగక పోయినది.
Rarely adv అపరూపముగా, అరుదుగా, సకృత్తుగా. I * go there నేను అక్కడికిపోవడము అరుదు.
Rareness n s అపరూపము, అరుదు, దుర్లభత్వము. from the * of the stone ఈరాయి అపరూపము గనుక.
Rareshow n s బొమ్మలాట.
Rarity n s అపరూపము, అరుదు, దుర్లభత.
Rascal n s a mean fellow తుంట, తుచ్ఛుడు, పోకిరి, లుచ్ఛా. or rogue దొంగ.or lean deer బక్కచిక్కిన లేడి, శుష్కహరిణము.
Rascal, Rascally adj means తుంట, తుచ్ఛమైని, నీచమైన, పోకిరైన.
Rascality n s తుంటతనము, తుచ్ఛత, దొంగతనము, పోకిరితనము, ద్రోహము.
Rash adj hasty ఆతురముగల, దుడుకైన, దురుసైన, మొండియైన, వెనకాముందుచూడని, వెర్రియైన.
Rasher n s a bit, a slice తునక, కరకుట్లు, వల్లూరము, కాలిన పంది మాంసపుతునక.
Rashly adv ఆతురముగా, ముందు వెనక చూడక.
Rashness n s ఆతురము, ఓర్పులేమి, అవివేకము, దుస్సాహసము.
Rasp n s a large rough file బలుపాకు రాయి, ముల్లాకురాయి, దీనితో కొయ్యనురాచుతారు.
Raspherry n s కోరింద, ఉండ్రవీటి కాయలవంటి వొక కాయ.
Raspings n s రాపొడి, చూర్ణము.
Rat n s ఎలుక. a bandicoot * పందికొక్కు. musk * చుంచు. to smell a *సందేహించుట.
Ratable adj proportionate తగిన, న్యాయమైన. set at a certainvalue నిర్ణేతవ్యమైన, పన్నచ్చుకోతగిన, కప్పము కట్టడమునకు అర్హమైన.
Ratably adv proportionably తగినట్టుగా, తగుబాటిగా.
Ratacatcher n s ఎలుకలు పట్టేవాడు, ఎరుకల వాండ్లలో భేదము చెంచువాడు.
Ratafia n s వొక విధమైన బ్రాంది సారాయి.
Ratan n s బెత్తము, వేత్రము.
Rate n s manner, proportion క్రమము, పద్ధతి, రీతి. price ధర, వెల.allowance settled నిరఖు, నిష్కర్ష, నిర్ణయము. the * s of duty to be chargedon goods ఆయా సరుకుల మీద తియ్యవలసిన సుంక రూకల యొక్క నిర్ణయములు.grain is now at a high * ధాన్యము యిప్పుడు నిండా ప్రియముగా అమ్మినాడు. hesold it at a low * చవుకగా అమ్మినాడు, నయముగా అమ్మినాడు. at * the * ofచొప్పున, వంతున, లెక్కను. this clock grains at the * of minutes a day ఈగడియారము దినానికి అయిదు నిమిషముల లెక్కను పొడుగుతున్నది. at the * of tenపది వంతున పదేసిగా. at the * of for a rupee రూపాయకు ఆరు లెక్కను. atthat * ఆ పక్షములో, ఆప్రకారముగా, రీతిగా, అట్లా వుండగా. at a great * నిండా,విస్తారముగా, అతి త్వరగా. he went at a great * అతి త్వరగా పోయినాడు. at aslow * తిన్నగా, మెల్లిగా he went at a slow * తిన్నగా పోయినాడు. the clockgoes at a good * ఆ గడియారము క్రమముగా పోతున్నది. he talks at a great *వాడు జంభాలు నరుకుతాడు, జల్లికొట్టుతాడు. first * ఉత్తమమైన, మొదటి తరమైన,శ్రేష్ఠమైన. second * అధమమైన, నికృష్టమైన, విముఖ్యమైన. common *సామాన్యమైన. at any * ఎట్లాగైన, ఏవిధాననైనా. I will come at any * నేను యెట్లాగైనా వస్తాను. a share in taxes చందా. a church * గుడి నిమిత్తము వేసుకొన్న చందా the poor's * బిచ్చగాండ్ల కొరకై వేసుకొన్న చందా.
Rateable adj proportinate తగిన, తగ్గ, సరియైన.
Rather adv more willingly with better liking మనఃపూర్వకముగా,మనసార,ఇష్టముగా. somewhat కాస్త, కొంచెము, రవంత. preferably to the other; withbetter reason ఉత్తమము, మేలు, వాసి. in a greater degree than otherwise బహుశా, సుఖముగా, హాయిగా. especially ముఖ్యముగా, విశేషముగా. moreproperly యుక్తముగా, సరిగ్గా. this is the picture of a cow or * of a buffaloఇది ఆవుపట మనేటందు కంటె బహుశః యెనుముపట మన వచ్చును. he wore a capor * a turband on his head వాడు వేసుకొన్నది కుళ్లాయివలె వున్నదనడమున కంటెబహుశా పాగవలె వున్నదనవచ్చును. he lived in a house or * a hovel on thehill కొండ మీది వొక యింట్లో వుండినాడు అది యిల్లనరాదు అయితె వొక గుడిసెలోవుండినాడు. the fruit is like a lime or * an orange అది నిమ్మపండు వంటిదిఅయితే సరిగ్గా కిచ్చిలి పండువంటిది. this feels like silk or * like shawl దీన్నితాకితే పట్టువలె వున్నది, అయితే సరిగ్గా శాలువ వలె వున్నది. this tastes of salt or * of saltpetre దీన్ని నోట్లో వేసుకొంటే వుప్పువలె వున్నది అయితే సరిగ్గా పెట్లుప్పువలె వున్నది. * a slender sword కొంచెము సన్నపాటి కత్తి. the stick was * big ఆ కర్ర రవంత లావుగా వుండినది. this is * large ఇది కొంచెము పెద్దది. this is * black ఇది రవంత నల్లగా వున్నది. I think the price is * high ఇప్పుడు కొంచెము వెల పొడిగి వున్నదేమో. * than see it he ran away దాన్ని చూడలేక పారిపోయినాడు. I had * read Telugu than Tamilఅరవాని కంటె తెలుగు చదవడము నాకు యిష్టముగా వున్నది.why should I go ? I had * stay at home today బయిట యెందుకుపొయ్యేదినేడు హాయిగా యింట్లో కూర్చుంటాను, బయిట యెందుకు పొయ్యేది యీ వేళ యింట్లో వుండడము నాకు సంతోషము. he had * die than submit ఒకనికిలొంగడము కంటె వాడికి చావడము యిష్టము, లోబడేటందుకంటె సుఖముగా ప్రాణమువిడుచును. you may go on horse back I had * go on foot నీవు కావలిస్తేగుర్రము మీదపో, నేను హాయిగా నడిచివస్తాను. I will not give rupees I would *go without అది లేకపోయినా పోతున్నది గాని నేను పది రూపాయలు ఇవ్వను. theyhad * eat rice than bread; but they would * die than eat flesh రొట్టెనుతినడము కంటె వాండ్లకు అన్నము తినడము యిష్టము, వాండ్లు మాంసమును తినడమునకంటె సుఖముగా ప్రాణమును విడుతురు. he would * drink wine than water నీళ్ళకంటె వాడికి సారాయి తాగడము యిష్టము. I will read this but I would * readSanscrit దీన్ని చదువుతాను గాని అయితే నా మనసంతా సంస్కృతము మీద వున్నది. Iwould * go tomorrow రేపు పోతే మంచిది, రేపు పోతే వాసి. I was notdistressed for food but * had plenty నాకు కూటికి కష్టమనేది లేదు నా వద్దవిస్తారము వుండెను. he is not ignorant he is * a good scholar వాడు శుద్ధతెలియని వాడనేది యెక్కడ వాడు కొంచెము చదువుకొన్న వాడాయెనే. do you call .her .agirl ? she is a * woman దాన్ని పడుచు అంటావా అది యెక్కడ పడుచు అది నిండుఆడదాయెనే. it is* too much to hear such a man abused అట్లాంటి వాణ్నిదూషించగా వినడమనేటిది యెంత మాట.
Ratification n s అంగీకారము చేయడము, నిర్ధారణము చేయడము, స్థాపనము,సిద్ధాంతము రూఢిచేయడము.
Ratio n s ప్రమాణము, దిట్టము. ( Dz. says హారము, భావము, సంఖ్య. ) duringthe famine the prisoners increased very fast but they died .in .the .same* కరువులో కయిదీలు యెంత త్వరగా అధికమవుతూ వచ్చినారో అంత త్వరగా చస్తూవచ్చినారు.
Ratiocination n. s. తర్కము, పరామర్శ, Dz. సాంఖ్య శాస్త్రము. is the wordused by Schlegel. వివేచన, వితర్కము, విచారకరణము, హేత్వాది దర్శనము, వితండా.Ratiocinatio is low Latin is reckoning keeping accounts ఎన్నిక, సంఖ్య,లెక్క.
Ration n s నానాటికి బత్తెము, ఒక పురుష ఆహారము. he cut three * s of breadand sent them to us వొక పూటకు ముగ్గురికయ్యే రొట్టె కోసి మా వద్దకి పంపినాడు.they were reduced to half *s వాండ్లకు అర్ధగ్రాసము చేసినారు, వాండ్లకు సగముబత్తెము వేసినారు.
Rational adj endowed with reason జ్ఞానము గల, వివేకము గల, వివేకవిశిష్టమైన,పశుప్రాయము కాని. * being గుర్రము నోరుగల జంతువు కాదు. cannot you behavelike a * being ? నీకేమి తెలివి లేదా, వివేకము లేదా. agreeable to reason తగిన,న్యాయమైన, యదార్థమైన, యుక్తిసిద్ధమైన. a * doubt సయుక్తికమైన సందేహము, ప్రబలసందేహము.
Rationale n s a detail with reasons అన్వయము, అనుక్రమణిక, శబ్దక్రమము.See Wilberforce .2.202. Burnet Ref.1.215 .
Rationalist n s a sort of philosophors ఆక్షేపించేవాడు, తార్కికుడు. boththe believers and the *s నమ్మిన వాండ్లున్ను నమ్మని వాండ్లున్ను.
Rationality n s జ్ఙానము, తెలివి, వివేకము.
Rationally adv న్యాయముగా, తెలివిగా, వివేకముగా. it may * be expected thathe will come అతడు బహుశా వచ్చును.
Ratsbane n s ఎలుక పాషాణము.
Rattan n s బెత్తము. the * vine ప్రబ్బచెట్టు. a * mat బెత్తాల చాప.
Rattle n s గడగడ, గలగల, దడదడ, పటపట, బడబడ. I am weary of the * ofthese women ఆడవాండ్ల గొలగొల నా ప్రాణానికి వస్తున్నది. the * of drumsతప్పెటల యొక్క దడదడ ధ్వని, లొడలొడ ధ్వని.
Rattlesnake n s తాచుపామువంటి సర్పము, దీని తోక నాడిస్తే గలగలమనిచప్పుడౌతున్నది.
Rattletrap n s పనికిమాలినది, వట్టి బూటకమైనది. a * of a bandy పనికిమాలినబండి. do you call this gun ? it is a mere * దీన్ని తుపాకి అంటావా యిదివట్టి పితలాటకము.
Rattling adj గలగల అనే, గడగడ అనే, దడదడ మనే, పటపట మనే, బడబడ అనే. a *carriage గడగడ అని వచ్చే బండి. a * chain గలగల అనే గొలుసు. a * showerచివచివ అని కురిసే వర్షము. a * storm దడబడలుగా వచ్చే వాన. a* war అఘోరమైనయుద్ధము.
Rat-trap n s ఎలుకబోను.
Ravage, Ravages n s. ధ్వంసము, నాశనము, పాడు, హతము, కొల్ల.
Ravaged adj ధ్వంసమైన, పాడైన, హతము చేయబడ్డ, కొల్లపెట్టబడ్డ.
Ravelled adj అంచులు చినగ మొదలుబెట్టిన.
Raven n s బొంతకాకి, మాలకాకి, కాకోలము.
Ravenous adj అశనాతురముగల, చెడ్డ ఆకలిగల. * appetite చెడ్డ ఆకలి ,అతిభుభుక్ష.* animals క్రూర జంతువులు.
Ravenously adv ఆశనాతురముగా, చెడ్డ ఆకలిగా.
Ravenousness n s అతిక్షుత్తు, చెడు ఆకలి.
Ravine n s కనమ, కొండచరి, డొంక, లోయ.
Raving n s తబ్బిబ్బు మాటలు, భ్రమమాటలు, వెర్రి కూతలు.
Ravingly adv వెర్రిగా, పిచ్చిగా.
Ravished adj చెరపబడ్డ, బలాత్కారము చేయబడ్డ. he was * with delightఆనందపరవశుడుగా వుండెను.
Ravisher n s ఒకతెను బలాత్కారముగా చెయి పట్టేవాడు, వొకతెను బలాత్కారముగాతీసుకొని పొయ్యేవాడు.
Ravishing p\\ delightfulఅతిమనోహరమైన,వేడుకగావుండే
Ravishingly adv delightfully మనోహరముగా, ఉల్లాసముగా.
Ravishment n s delight ఉల్లాసము, మోహము.
Raw adj not cooked పచ్చి, వండని, అపక్వమైన. * rice బియ్యము. not spun ortwisted వడకని, పేనని. * silk పదును చేయని పట్టునూలు. chilly చలిగా వుండే,జిల్లుమనివుండే, అతిశీతలమైన. bate of skin. తోలుదోగిన. my hand is * నా చెయ్యితోలు దోగిపోయినది. Ignorant మూఢుడైన, బేలఅయిన a * commander అనుభవములేని సేనాధిపతి. not ripe కాయగా వుండే పండని.a * hide పదును చేయని తోలు. *brick పచ్చి యిటికె రాయి. * brandy నీళ్లు కలపని బ్రాంది సారాయి. a * stomachఅజీర్ణము, అగ్ని మాంద్యము. * bones ( that is ) a mere skeleton ఎముకలగూడుగా వుండేవాడు, బక్కచిక్కినవాడు. a * head తోలు కొట్టుకొని పోయిన తల. a *wound పచ్చి పుండు, పచ్చి గాయము.
Ray n s of light కిరణము, అంశువు. a * of light in a room పొగకర్ర. the *s of the sun సూర్యకిరణములు. a * of intellect విద్యాప్రకాశత.he has not a * of sense వాడికి రవంతైనా తెలివి లేదు. there is not a* of hope of her recovery అది బ్రతుకుతుందనే ఆశ రవంతైనా లేదు.a * fish టేకి చేప.
Rayah n s (tenant subject; an Arabic word. ) కాపు, రయితు. vulgarlywritten Ryot or riot : correctly rayyat.
Razed adj సమూలనాశనము చేయబడ్డ.
Razor n s మంగలకత్తి, క్షురి.
Re (the particle denoting doing again) is expressed తిరిగీమళ్లీపునః, Thus to view చూచుట. to * view పునర్విమర్శచేసుట. to light వెలిగించుట. to *light మళ్లీ వెలిగించుట. to divide భాగించుట. to * divide మళ్ళీ భాగించుట.
Reach n s అందుకోవడము. power శక్తి, సామర్థ్యము. logic requires a great *of thought తర్కమునకు నిండా ఆలోచన శక్తి కావలెను. one fruit was within his* the other was not వొక పండు అందేంత దూరములో వుండినది, వొక పండు అందనిదూరములో వుండినది. if I ever get him within my * వాడు నాకు చిక్కితే వాడి మీదనా బాణము సాగితే. logic is beyond the * of women తర్కము స్త్రీలకుఅసాధ్యము. the distance that a river goes without turning వొక నది కొంతదూరము తూపు ్గా పోయి అవతల వుత్తరము తిరిగి కొంత దూరము పోయి మళ్ళీ తూపు్తిరిగి పోతే వొక వొక మూలవరకు వొక్కొక reach అనబడుతున్నది.
Reaching n s in vomiting వోకరింత, డోకు.
Reaction n s ప్రతీకారము, ప్రతికృతి, ప్రతిఘాతము, వైపరీత్యదర్శనము, విసిరివేసినచెండు భూమి మీద తాకి పైకి యెగరడము. the * of fever produces ague జ్వరమువిడిచిన దెబ్బన చలి వస్తున్నది.
Read participle చదివిన,చదవబడ్డ,వినిపించిన, a well * man బాగా చదివినవాడు, చదువరి. he is well * in logic వాడికి తర్కము బాగా వచ్చును. Ill * అనగాఅజ్ఞానియైన, విద్యావిహీనుడైన.
Reader n s చదివేవాడు, చదివి వినిపించేవాడు. or tutor ఉపాధ్యాయులు. the *should observe that these two statements are contradictory ఈ రెండుమాటలున్ను వొకటి కొకటి విరుద్ధముగా వున్నదని దీన్ని చదివేవాడు కనుక్కోవలసినది.or tutor See proof in Blackstone. Vol.3.p.[320]. He learned it withouta * గురువు లేకనే నేర్చుకొన్నాడు.
Read-hook, or Reapinghook n s. కొడవలి.
Readily n s అనాయాసముగా, సుళువుగా.
Readiness n s సిద్ధముగా వుండడము, ఆయత్తముగా వుండడము, ఉద్యుక్తత. fromhis * in arithmetic వాడు లెక్కలలో అతి ప్రవీణుడు గనుక గట్టివాడు గనక. from her* to quarrel అది కయ్యానికి కాలుతవ్వుతూ వున్నది గనక. I saw its * to bite అదికరవ నుద్యుక్తముగా వుండే దాన్ని చూచినాను. you must keep it in * దాన్ని నీవుసిద్ధముగా వుంచు. * of wit చమత్కారము, బుద్ధి కుశలత.
Reading n s చదవడము, పఠనము, పఠించడము, పారాయణము.various *s or deviations in verse పాఠ భేదములు ప్రతిభేదములు. a cross * పంఙ్తి భేదముగా చదవడము. a * desk పుస్తకమును పెట్టి చదివే యేట వాలుబల్ల.
Readjust v a దిద్దుట, సవరించుట.
Readjusted adj మళ్ళీకుదిరిన, మళ్లీ చక్కబడ్డ.
Readjustment n s కుదురబాటు, సవరింపు, మళ్ళీ చక్కబెటటడము.
Readmission n s మళ్ళీ కలుపుకోవడము, మళ్ళీ చేర్చుకోవడము, పునః ప్రవేశము.on our * మేము మళ్ళీ లోపలికి వచ్చేటప్పటికి.
Readmitted adj మళ్ళీ చేర్చుకోబడ్డ.
Ready adj సిద్ధముగా వుండే, జాగ్రతగా వుండే, ఆయత్తముగా వుండే. the money isnot yet * ఆ రూకలు యింకా సిద్ధము కాలేదు. he who is * of speechవాక్పటుత్వము గలవాడు కాచాలుడు. as I was * to return నేను తిరిగి రావలెననివుండగా. as he was * to eat వాడు తినబొయ్యేటప్పటికి నీవు అగుపడ్డావు. theywho were * to perish చావు తటస్థమైన వాండ్లు. I saw that she was * toweep దానికి యేడ్పు వచ్చేటట్టు వుండిన దాన్ని కనుక్కొన్నాను. * made boxesఅమ్మకానికై చేసి పెట్టిన పెట్టెలు. ready money రొక్క రూకలు. a man of * witకుశాగ్రబుద్ధిగలవాడు, తీక్ష్ణబుద్ధి గలవాడు, రంజకము వంటివాడు. a poet of * witఆశుకవిత్వము చెప్పేవాడు. to make * సిద్ధము చేసుట.
Real adj నిజమైన, నిశ్చయమైన, వాస్తవ్యమైన, అకల్పితమైన, అకృత్రిమమైన. the *truth ఉన్నవాస్తవ్యము, కలస్థితి. this is a * ruby ఇది అచ్చమైన కెంపు. this is *silk ఇది అచ్చ పట్టు. * and spiritual శరీరియైన, అశరీరియైన. * security నగలుమొదలైన తాకట్టు. a * occurrence నిజముగా జరిగిన పని. In law * propertyconsisting of things immoveable *s land స్థావరమైన భూమి, ఇల్లు మొదలైనవి.
Realgar n s ( red arsenic ) సిందూరము.
Reality n s తాత్వికత, యథార్థ్యము, వాస్తవ్యము. this proves the * of thedisease నిజముగా యీ రోగము కద్దని యిందువల్ల తెలిసినది. I doubt the * ofthe cure ఆ రోగము నిజముగా కుదిరినట్టు నాకు తోచలేదు. In dreams there is no *స్వప్నములు వట్టిల మాయ. this proves the * of the diamond ఇందువల్ల యిదిమాయ వజ్రము కాదని తెలుస్తున్నది. I doubt the* of his friendship వాడి స్నేహమునిజమైనదని నేను నమ్మలేదు. In * వాస్తవ్యముగా, యథార్థముగా. the horse is calledhis but in * it is mine ఆ గుర్రము పేరుకు అతనిది నిజముగా నాది.
Realization n s అనుభవానికి రావడము, నిజము కావడము, నెరవేరడము. thismarriage is the * of his wishes వాడు కోరినట్టే యీ పెండ్లి వనగూడినది. this isthe * of your plans నీ కోరికెకు యిదే ఫలము. on this * of his fears నాడుయెట్లా భయపడ్డాడో అట్లాగే సంభవించినందున వాడు, భయపడ్డదే నిజమై నందున.before the * of the money రూకలు చేతికి రాకమునుపే తండక మునుపే.
Realized adj సఫలమైన, చెల్లుపుచ్చుకొన్న, తండబడ్డ, నిజపడ్డ, నిశ్చయపడ్డ. theprice * by selling the house ఇల్లమ్మి వచ్చిన రూకలు. his hopes were * వాడుకోరినట్టే అయినది, వాడి కోరికె కొనసాగినది.
Really adv యథార్థముగా, నిశ్చయముగా, నిజముగా. * I do not know నే నెరగనుసుమీ. the money is * paid రూకలు చెల్లించినది నిజమే. * it is of no use to sayso అయ్యో అట్లా అనరాదు. It is * astonishing ఆహా యేమి ఆశ్చర్యము. I have *no leisure నాకు సావకాశము లేదు గదా.
Realm n s రాజ్యము, భూమండలము, దేశము.
Ream n s ఉత్తకాకితాల కట్ట, అనగా ఇరువై దస్తాలు గల కాకితాల కట్ట.
Reaper n s కోత కోసేవాడు. a phrase at Madras for a rafter దబ్బ పెండె.
Re-appearance n s మళ్ళీ అగుపడడము, తిరిగి సంభవించడము.
Rear n s వెనకటితట్టు. the * of the army దండు యొక్క వెనకటి భాగము. hebrough up the * వెంట వచ్చినాడు, వెనక వచ్చినాడు. he sent his wife andchildren on and he hilself brought up the * పెండ్లాన్ని బిడ్డలను ముందుపంపి తానున్ను వాండ్ల వెంటనే వస్తూ వుండినాడు. they stood in the * వెనక తట్టునవుండిరి.
Rearmouse n s a bat గబ్బిలము.
English to Telugu free online dictionary
Enter English word and know Telugu meaning
No comments:
Post a Comment