Monday, February 7, 2011

Ubiquitous

Ubiquitous adj సర్వవ్యాపియైన. from his * language you would imaginehim * వాడి మాటలవల్ల వాడు లేని చోటు లేదని నీవు యెంచుకోవచ్చును.
Ubiquity n s existence at the same time in all places సర్వవ్యాపకత్వము.from the * of this disease యీ రోగము అంతటాకద్దు గనక.
Udder n s పొదుగు.
Ugliness n s కురూపము, వికారము.
Ugly adj కురూపమైన, వికారమైన, అనాకారముగా వుండే.
Ukase n s ( a Russian word ) శాసనము, చట్టము.
Ulcer n s వ్రణము, పుండు. an indolent * నొప్పి లేని వ్రణము.
Ulceration n s the act of breaking into ulcers; sore పుండ్లు లేవడము,పుండు కురుపు.
Ulcered adj వ్రణముగా వుండే, పుండుగా వుండే.
Ulcerous adj వ్రణముగా వుండే, పుండుగా వుండే. an * place పుండుగా వుండేచోటు.
Ulterior adj further అవతలి, ఉత్తరోత్తరావచ్చే. an * dispute అవతలవచ్చేవిరోధము. * consequences తుదకు వచ్చే ఫలము.
Ultimate adj final కడపటి. the * settlement ఆఖరు తీర్పు కడపటి తీర్పు. his *object వాని ముఖ్యమైన కోరిట. this led to his * ruin తుదకు యిందువల్ల వాడుచెడిపోయినాడు.
Ultimately adv తుదకు.
Ultimatum n s final decision కడపటి తీర్పు, కడపటి మాట.
Ultimo adv in the last month పోయిన నెలలో. on the twentieth * పోయిననెల యిరువై యో తేది.
Ultra adj విశేషమైన, వీర, సాహసముగల, ప్రచండమైన. an * royalist రాజుపక్షము ప్రచండముగా వాదించేవాడు.
Ultramarine n s అతి శ్రేష్ఠమైన నీలవర్ణము.
Ultramontane adj విపరీతమైన.
Ultramundane adj not in this word యీ లోకములో లేని, జగద్బహిస్థమైన,వికారమైన, విపరీతమైన.
Umber n s ( a colour ) dark brown.
Umbered adj నల్లని, తమాలనీలమైన, చీకటిగా వుండే.
Umbilical adj belonging to the navel నాభి సంబంధమైన. the * cordనాభినాళము.
Umbrage n s shade నీడ. offence అసహ్యము, చీదర. he took * at thisయిందుకు అసహించినాడు. he gave them * by these statements యీ మాటలుచెప్పి వాండ్లకు అసహ్యము వచ్చేటట్టు చేసినాడు.
Umbrageous adj నీడగల.
Umbrella n s గొడుగు.
Umpire n s an arbitrator; one who, as a common friend, decideddisputes తీర్పరి, మధ్యస్థుడు తటస్థుడు.
Un 3నిషేదార్థకమైనవొకప్రత్యయము, just న్యాయమైన. unjust అన్యాయమైన. fitతగిన. unfit తగని. This word is used in some places to denote vile badప్రతికూలమైన, విరుద్ధమైన. as Un-English ఇంగ్లిషువారి మర్యాదకు ప్రతికూలమైన. Un-French ఫ్రెంచి మర్యాదకు విరుద్ధమైన.
Unable adj అసమర్థమైన, అశక్తమైన, శక్తి లేని. one who is * to writeవ్రాయలేనివాడు. I was * to go వెళ్ళలేక పోయినాను. being * to decide how towrite it I left it out యెటు వ్రాయడానకు పాలుపోనందున విడిచిపెట్టినాను. * tostand before him వాని యెదట నిలవలేక. * to do this దీన్ని చేయలేక. he who is* to learn his bread కూటికి సంపాదించుకోలేని వాడు. those who were * toanswer ఉత్తరము చెప్పలేని వాండ్లు. being * to refrain from sleep నిద్ర ఆచలేక,నిద్రను నిలపలేక.
Unabridged adj సవిస్తారముగా వుండే.
Unabshed adj not ashamed సిగ్గు లేని, మానహీనము లేని, రోసుబడియైన.
Unacceptable adj ప్రతికూలమైన, విరుద్ధమైన, అసమ్మతమైన, అగ్రాహ్యమైన. thesewords were very * to him యీ మాటలు అతనికి అసమ్మతముగా వుండినివ,విరుద్ధముగా వుండినవి. this will be very * news to him యిది వానికిఅసమ్మతముగా వుండును, ఇది వాడికి ప్రతికూలముగా వుండును.
Unaccommodating adj క్రూరమైన, మూర్ఖమైన, విరసమైన.
Unaccompanied adj సహాయుడైన. why do you send the accounts * bydocuments ? దస్తావేజులు లేక వట్టి లెక్కలను యెందుకు పంపినావు. children * bytheir mothers తల్లులు లేకుండా తాము మాత్రము వచ్చిన బిడ్డలు.
Unaccomplished adj తీరని, ముగియని, నెరవేరని, సఫలముకాని, ఫలించని. thosewho are * in elegant learning సాహిత్య జ్ఞానము లేనివాండ్లు.
Unaccountability n s వైపరీత్యము, విపరీతత. from the * of his decisionవాడు చేసిన తీర్పు విపరీతమైనది గనక.
Unaccountable adj not explicable, strange విపరీతమైన, వికారమైన,చమత్కారమైన, వింతైన, అవ్యాక్యాతవ్యమైన, అబోధనీయమైన.
Unaccountably adv strangely విపరీతముగా, విచిత్రముగా, వింతగా. I feel *weak to-day నేడు నాకు వుండే నిస్త్రాణ వింతగా వున్నది.
Unaccustomed adj వాడుకపడని, అభ్యాసములేని, అపరూపమైన, కొత్త. * toelegant society సరసులతో సహవాసము లేనివాడై. being * to write వ్రాయడానకుఅభ్యాసము లేనందున.
Unacknowledged adj ఒప్పుకోని. an * crime or fault వొప్పుకోని నేరము. an *letter ప్రత్యుత్తరము రాని జాబు.
Unacquinted adj యెరగని, పరిచయము లేని. he is at present * with themయిప్పుడు వీడికి వాండ్లకు విహితము లేదు. those who are * with accounts లెక్కతెలియనివాండ్లు. I am * with his name వాడి పేరు నాకు తెలియదు.
Unactive adj వ్యాపించని, పారని, యెక్కని. the medicine remained * ఆ మందుపారలేదు, యెక్క లేదు.
Unactuated adj అప్రేరితమైన, ప్రేరేపించబడని. witness who were * bymalice చలములేని సాక్షులు. * by anger కోపము లేనివాడై.
Unadored adj not worshipped అపూజితమైన, అప్రశస్థమైన.
Unadorned adj not decorated శృంగారము లేని, సాదాగా వుండే,శృంగారించబడని. * with wisdom జ్ఞానమనే ఆభరణము లేని.
Unadulterated adj నిష్కల్మషమైన, స్వచ్ఛమైన, నిర్మలమైన, అచ్చమైన, మంచి.
Unadvisable adj not expedient; not prudent అయుక్తమైన, అనుచితమైన.
Unadvised adj ఆలోచన పూర్వకము కాని, అనాలోచితమైన, అవివేకమైన, పిచ్చి,పనికిరాని.
Unadvisedly adv అబుద్ధిపూర్వకముగా, అవివేకముగా, ఆలోచన లేకుండా, పిచ్చిగా.
Unaffected adj plain; real; natural, simple ; sincere కపటము లేని,సహజమైన, సాధువైన, నిశ్చయమైన, బేడిజము కాని. he showed * surprize at thisదీనికి వాడు నిండా ఆశ్చర్యపడ్డాడు. * sorrow నిజమైన వ్యాకులము, బేడిజము కానివ్యాకులము. not moved కరగని. he was * at their grief వాండ్ల వ్యసనాన్ని చూచివీడి మనసు తొణక లేదు. the justice of the decision is * by their opinionవాండ్లకు యెటు తోచినా సరే యీ తీర్పే తీర్పు.
Unaffectedly adj సహజముగా, వాస్తవ్యముగా, నిష్కపటముగా, బేడిజము,లేకుండా.
Unaffecting adj not pathetic విరసమైన, రసము లేని, మనసును తొణికించలేని.an * story మనసుకు మోదమునుగాని ఖేదమును గాని పుట్టించలేని కథ.
Unafflicted adj దుఃఖపడని,తొందరపడని,బాధయెరగని, a country * byfamine కరువు తొందరను యెరగని దేశము.
Unagitated adj కదలని తొందరలేని, కలవరపడని కలియపెట్టబడిన. those whowere * by fear and hope భయము ఆశ అనే తొందర లేనివాండ్లు.
Unaided adj అసహాయమైన, సహాయము లేని.
Unalarmed adj భయపడని, నిర్భయమైన.
Unalienable adj not to be transferred ఒక పరము చేయకూడని, మరి వొకరిపేరిట చేయకూడని.
Unallied adj సంబంధము లేని, అసంబంధమైన.
Unalloyed adj స్వచ్ఛమైన, నిష్కల్మషమైన, చొక్కమైన. * silver చొక్క వెండి,మంచివెండి. * gold అపరంజి మంచి బంగారు.
Unalterable adj unchangeable; immutable తిరగని, శాశ్వతమైన, స్థిరమైన,అనన్యధాకరణీయమైన, అపరివర్తనీయమైన. an * rule తిరగని సూత్రము.
Unalterably adv స్థిరముగా, శాశ్వతముగా.
Unaltered adj తిరగని, స్థిరమైన, మార్చబడని, దిద్దబడని. leave it * దిద్దకుండా అట్టే వుండని. It is * అది ఆ పాటుననే వున్నది. his conduct is * by his misfortunesవాడికి యెన్ని కడగండ్లు వచ్చినా వాడి నడతకు వ్యత్యాసము రాలేదు.
Unalteredly adv నివ్యత్యాసముగా, యథాస్థితిగా, యథారీతిగా, యెప్పటివలె.
Unambitious adj not affecting show సాదాగా వుండే, సాచాగావుండే,శృంగారములేని, దీన భావముగల. this book is written in an * style యీపుస్తకము సాధారణమైన రీతిగా వ్రాయబడి యున్నది.
Unamiable adj విరసమైన, వికారమైన, మొండి.
Unanealed adj మొండియైన, అధ్వాన్నమైన.
Unanimated adj ప్రాణము లేని, చచ్చిన, మొండి. an * face చావు ముఖము, వెర్రిముఖము.
Unanimity n s ఐకమత్యము, ఐకకంఠ్యము, ఐకవాక్యత. from their * వాండ్లు యేకవాక్యతగా వుండేటందువల్ల.
Unanimous adj ఏకవాక్యముగా వుండే, వొకమాటగా వుండే, వొక చెయిగా వుండే. thiswas their * opinion వాండ్లందరి అభిప్రాయమిది.
Unanimously adv ఏక వాక్యముగా, ఏకగ్రీవముగా. they * blamed this వాండ్లందరు యేకస్థులై దీన్ని కారాదన్నారు.
Unanswerable adj not to be refuted ఖండించకూడని. this objection is యీ ఆక్షేపణకు అడ్డము లేదు. this statement is * యీ మాటకు అడ్డమే లేదు.
Unanswerably adv ఆక్షేపణ లేకుండా, అడ్డము లేకుండా.
Unanswered adj ప్రత్యుత్తరము లేని, జవాబు లేని.
Unappalled adj భయపడని, జడియని.
Unapparelled adj not dressed అలంకారవిహీనమైన.
Unapparent adj అగుపడని, కండ్లపడని, తెలియని. an * difference తెలియనిభేదము.
Unappeasable adj శాంతి పొందని, ఉపశమించని, అణగని.
Unappeased adj not pacified శాంతబడని.
Unapplicable adj పొందని, ఇమడని. that word is * in this place యీస్థళములో ఆ మాట యిమడదు.
Unapprehensive adj గ్రాహకశక్తి లేని. those who are * of instruction చదువుయందు గ్రాహకశక్తి లేని వాండ్లు.
Unapprehensiveness n s జడత, గ్రాహక శక్తి లేమి.
Unapproachable adj inaccessible దగ్గిర చేతకూడని, దుర్గమమైన, చొరగూడని,అసాధ్యమైన, దురవగాహమైన.
Unapproached adj దగ్గిరికి పోగూడని. a mountain * by human foot మనుష్యసంచారము లేని కొండ, మనిషి యెన్నడు అడుగు పెట్టని కొండ.
Unappropriated adj వినియోగపరచబడని. the money that was hitherto *ఇది వరకు దేనికి వినియోగ పరచకుండా వూరికె పడి యుండిన రూకలు.
Unapproved adj not having received approbation అప్రసిద్ధమైన,వొప్పుకోబడని, అంగీకరించబడని. this is an * word యిది అప్రసిద్ధమైన శబ్దము.
Unapt adj unfit, dull తగని, అనర్హమైన, మందమతియైన. this carriage is *for the purpose యీ పనికి యీ బండి సరిపడదు. he is an * scholar వాడుచదువుకోవడమునకు అనర్హుడు.
Unaptly adv improperly అయుక్తముగా, the bat is not * called the flyingmouse గబ్బిడాయిని యెగిరే యెలుక అని చెప్పడము ఆయుక్తము కాదు.
Unaptness n s అనౌచిత్యము, అనుపయుక్తత.
Unarmed adj నిరాయుధులైన. they came * నిరాయుధులుగా వచ్చినారు.
Unarranged adj క్రమపరచబడని, అపరిష్కృతమైన, తారుమారుగా వుండే. thematter is at present * ఆ పని యింకా పరిష్కారము కాలేదు.
Unarrayed adj క్రమపరచబడని, అలంకరించబడని. while they were * వాండ్లువరసగా వుండనప్పుడు.
Unartful adj simple, silly బేలయైన, ఆలోచనలేని సాధువైన.
Unartfully adv నిష్కపటముగా.
Unartificial adj అకృత్రిమమైన, మనుష్యులచే చేయబడని, కపటము లేని, మాయలులేని.
Unasked adj unsolicited అడగని, అయాచితమైన, బతిమాలుకోబడని.
Unaslsured adj స్థిరముగా చెప్పని.
Unaspirated adj ఒత్తులేని,జడలేని the K in the word కర్మం is * కర్మమనే మాటలో వుండే కకారమునకు వొత్తులేదు, the Kh in the word ఖచితము. is aspirated ఖచితము అనే మాటలో వుండే ఖకారమునకు వొత్తు కద్దు.
Unaspiring adj not ambitious దురాశలేని,దీనమైన, నిర్గర్వియైన, సాధువైన.
Unassailable adj not attacted by violence శత్రువులకు అసాధ్యమైన,దూరకూడని.
Unassisted adj అసహాయుడైన. * by you how can I do this? నీ సహాయములేక దీన్ని నేనెట్లా చేతును.
Unassuming adj humble, not proud, and arrogant; modestనిరహంకారమైన, నిర్గర్వియైన, అణిగిన, తిన్నని.
Unattached adj విడిగా వుండే, కలియకుండా వుండే.
Unattainable adj not to be gained దుర్లభమైన, దొరకని, చిక్కని.
Unattempted adj యత్నము చేసి చూడని, ప్రయత్నము చేయని.
Unattended adv ఒంటిగా, యేకాంతముగా. he came * పరివారము లేకుండావొంటిగా వచ్చినాడు. this was * with advantage యిది నిష్ఫలముగా వుండినది.
Unauthoratative adj దుర్బలమైన, ఆధారము లేని.
Unauthoratatively adv దుర్బలముగా, ఆధారము లేకుండా.
Unauthorized adj అధికారము లేని. this sale was * by him అతని వుత్తరువులేకుండా దీన్ని అమ్మివేసినాడు. he was * to do this దీన్ని చేయడమునకు వానికిఅధికారము యివ్వబడి యుండలేదు.
Unavailable adj useless నిష్పలమైన, పనికిరాని.
Unavailableness n s పనికిమాలినతనము. from the * of that money atpresent ఆ రూకలు యిప్పుడు వుపయోగము లేకుండా వున్నందున.
Unavailing adj useless; vain పనికిరాని, నిష్ఫలమైన.
Unavoidable adj which cannot be shunned తప్పించకూడని, అనివార్యమైన,తొయ్యగూడని. this is the * conclusion I drew from his words అతని మాటలువిని నేను అవశ్యముగా చేసుకోవలసివచ్చిన తాత్పర్యము యిది. the payment is *చెల్లించక విధిలేదు.
Unavoidably adv తప్పించకూడక, విధీలేక, అనివార్యముగా. the money was *lost ఆ రూకలు పోక విధి లేదు. I * witnessed this నేను దాన్ని విధిలేక చూడవలసివచ్చినది.
Unaware adj ఎరగని. I was * of this అది నాకు తెలిశి వుండలేదు.
Unawares adv suddenly, without premiditated design, అకస్మాత్తుగా,అనాలోచనగా, అదాటున, తెలియక, యెరగక. they came upon him * అకస్మాత్తుగా వాడిమీదికి వచ్చిపడ్డారు. he killed the man * తెలియక చంపినాడు, యెరగక చంపినాడు. at* అదాటున. he caught them at * వారిని అకస్మాత్తుగా వచ్చి పట్టుకొన్నాడు.
Unawed adj భయపడని, నిర్భీతుడైన, పనుపడని, అలవాటుపడని.
Unbacked adj not aided; not tamed, అసహాయమైన, మరపబడని. * by anyauthority అధికారుల సహాయము లేకుండా. an * horse కొత్త గుర్రము, జీనివేసి వాడుకపడని గుర్రము.
Unbaked adj నిప్పున కాల్చని, పచ్చి.
Unballasted adj not kept steady by ballast అడుగున బరువుకు దేన్నిన్నివేయని. an * ship అడుగున బరువు లేకుండా వుండేవాడు. a mind * with wisdomజ్ఞానము లేని మనసు.
Unbattered adj not injured ఇడిసి పోకుండా వుండే, దృఢముగా వుండే.
Unbearable adj పడగూడని, తాళగూడని, సహించగూడని.
Unbeaten adj not trodden కొట్టని, అరగని, నడిచి అరగని. an * path నడిచిఅరగని దోవ.
Unbecoming adj అయోగ్యమైన, తగని. it would be * to repeat this requestమళ్ళీ మళ్ళీ అడగడము అమర్యాదగా వుండును.
Unbecomingly adv అయోగ్యముగా, అమర్యాదగా. she was * dressed అదిబట్టలు కట్టుకొన్నది బాగుగా వుండలేదు.
Unbefitting adj not suitable తగని యిమడని. an * situation తగనివుద్యోగము.
Unbegotten adj eternal, పుట్టని, అసంభవమైన, స్వయంభువైన.
Unbelief n s అపనమ్మిక, నాస్తికత, అవిశ్వాసము. In Rom. III. 3. అవిశ్వసనము A+.
Unbeliever n s నమ్మిక లేనివాడు, నాస్తికుడు, అప్రత్యయి. A+. In 2 Cor. VI. 14. C+ భక్తి లేనివాడు.
Unbelieving adj నమ్మికలేని, నమ్మని, భక్తి లేని. In Rev. XXI. 8. అవిశ్వాసి. A+.
Unbending adj వంగని. not yielding లొంగని, మూర్ఖమైన, మొండి.
Unbeneficed adj not preferred to a benefice మాన్యము లేని.
Unbenigh adj. malignant చెడ్డ, విరోధమైన,కాని, an * climate ఆరోగ్యము కానిభూమి. the * influence of a star వొక నక్షత్రము యొక్క క్రూరత్వము.
Unbent adj not strained by the string అల్లె యెక్కుపెట్టక సళ్ళి వుండే,వదులుగా వుండే.
Unbeseeming adj unbecoming తగని, అయోగ్యమైన.
Unbewailed adj not lamented యేడ్చేవాండ్లు లేని. he died * వాడు చచ్చినాడు,వాడికి యేడ్చేవాండ్లు యెవరు లేరు.
Unbiassed adj పక్షపాతము లేని. a judge should be * న్యాయాధిపతినిష్పక్షపాతిగా వుండవలెను.
Unbid, Unbidden adj uninvited, uncommanded పిలువని, కోరని,ఆజ్ఞాపించబడని. why should you go there * ? పిలవనిది యేల పోతావు. thesewords presented themselves * to my mind ఇది తనకు తానే స్ఫురించినది. theycame * పిలవనిదే వచ్చినారు.
Unbigoted adj free from bigotry దురభిమానములేని, మతవైరము లేని.
Unbitted adj unbridled; unrestrained కళ్ళెము వేసి మరగని, పసుపరచబడని.
Unblamable adj not culpable నిర్దోషియైన, నిరపరాధియైన.
Unblamably adv నిర్దోషముగా.
Unbleached adj చలవచేయబడని, కారికమైన.
Unblemished adj free from reproach నిర్దోషమైన, నిష్కల్మషమైన.
Unblenching adj unshrinking జంకని, భయపడని, వెనకతీయని.
Unblended adj not mingled కలియని, మిశ్రితము కాని. Telugu * withSanscrit సంస్కృతము కలియకుండా వుండే అచ్చ తెలుగు.
Unblest adj accursed పాపిష్ఠి, శాపగ్రస్తమైన, దౌర్బాగ్యమైన.
Unbloody adj not cruel సాత్వికమైన. an * sacrifice సాత్వికపూజ.
Unblown adj వికసించని. * buds విరియని మొగ్గలు.
Unblunted adj మొక్కకాని, మొద్దుకాని, తీక్ష్ణమైన, వాడిగా వుండే. * affectionsఉల్లాసముగా వుండే మనసు.
Unblushing adj శిగ్గులేని, శిగ్గుమాలిన.
Unblushingly adv శిగ్గుమాలి, నిర్లజ్జగా.
Unbodied adj incorporeal విదేహియైన.
Unboiled adj not sodden వండని, పచనము కాని, పచ్చి.
Unbolted adj coarse; gross; no refined, as flour ముతకైన. as a doorగడియ వేయని. not sifted జల్లించని.
Unbonneted adj not covered with a cap బోడితలతో వుండే, టొప్పి లేని.
Unbookish adj uneducated చదవని, పుస్తక ముఖ మెరగని.
Unborn adj పుట్టని, అజనితమైన.
Unborrowed adj original సహజమైన, ఆరోపితము కాని.
Unbottomed adj bottomless, having no solid foundation అగాధమైన,నిరాధారమైన.
Unbought adj obtained without money రూకలు వేసికొనని, పుణ్యానికి వచ్చిన.
Unbound adj కట్టని, విడిగా వుండే, యథేచ్ఛగా వుండే. an * book జిల్దుకట్టని కాకితపుస్తకము. Prometheus * యథేచ్ఛగా తిరిగే దేవత.
Unbounded adj అపారమైన, మేరము లేని, అమితమైన, అసంఖ్యేయమైన.
Unboundedly adv అసమితముగా, అసంఖ్యేయముగా.
Unbowed adj not bent వంచబడని, వంగని, నమ్రము కాని. cotton యేకనిదూది, యేకబడని బొచ్చు.
Unbraced adj not tight బిగువుగా వుండని, వదిలి వుండే.
Unbreathed adj not exercised మరవని, పనుపరచని. an * horse మరపనిగుర్రము, పనుపరచని గుర్రము, కొత్త గుర్రము.
Unbreathing adj ఊపిరి లేని. * sleep మంచి నిద్ర.
Unbred adj not instructed అశిక్షితమైన. an * man మోటవాడు, మర్యాద యెరగనివాడు.
Unbreeched adj చల్లాడము వేసుకొని, చల్లడము తొడుక్కొని. an * boy గోచికట్టనిపిల్లకాయ. Unbribed, adj. లంచము తీయని.
Unbricked adj not paved తళవరస వేయని, యిటికలు పరవని.
Unbridled adj కళ్ళెము లేని. an * horse కళ్ళెము లేని గుర్రము. * lust అడ్డు అంకె లేని మోహము, అమితమైన మోహము.
Unbroke adj not tamed పనుపడని, మరపని.
Unbroken adj తెగని, విరగని, భంగము కాని. * sleep మంచి నిద్ర. * silenceనిశబ్దము. in * series దండాయమానముగా, క్రమముగా.
Unbrokenly adv నడమ విడవకుండా, యేకధారగా భంగము లేకుండా.
Unbrotherly adj నిర్దయాత్మకుడైన, క్రూరుడైన.
Unbruised adj not hurt నలగని, చిదగని, దోగని. * rice దంచని బియ్యము.
Unbuilt adj కట్టని. a city * with hands దేవ నిర్మితమైన పట్టణము.
Unburdened adj విడిగా వుండే.
Unburied adj పాతిపెట్టని, భూస్థాపితము చేయబడని.
Unburnt adj కాల్చని, పచ్చి. * bricks పచ్చి యిటికెలు.
Unbusinesslike adj i.e. improper, irregular ( a bad words ) వికారమైన,అపరూపమైన, వింతైన.
Uncalled adj పిలువని. uncalled for అక్కరలేని అగత్యములేని, నిమిత్తములేని.this advice is * for యిది కోరనిది చెప్పవచ్చే బుద్ధి, కొరమాలిన బుద్ధి. witnessesthat are * for అక్కరలేని సాక్షులు. I think your letter was * for యీ జాబునీవు వ్రాయవలసిన నిమిత్తము లేదు, యీ జాబు వ్రాయడానకు నీకేమి పట్టినది.
Uncandid adj not friendly, unkind క్రూరమైన, నిర్దయాత్మకమైన.
Uncanonical adj not regular అశాస్త్రీయమైన.
Uncared for adj not regarded విచారణ లేని, దిక్కు లేని, అడిగేవాండ్లు లేని.these children seem * for యీ పిల్లకాయలు దిక్కులేకుండా వున్నారు, వీండ్లను అణిచిమణిచే వాండ్లు లేరు. the garden was * for during three years ఆ తోట మూడుయేండ్ల దాకా పాడుగా వుండినది.
Uncasted adj ( modern English ) expelled from caste కులము చెడిన,కులభ్రష్టుడైన.
Uncaught adj పట్టుబడని, చిక్కని.
Uncaused adj కారణము లేని. a fever * by food కూటిని నిమిత్తముగా పెట్టుకొనిరాని జ్వరము.
Uncautious adj జాగ్రతలేని.
Unceasing adj ఎడతెగని, తీరని. * troubles అంతము లేని తొందర్లు.
Unceasingly adv ఎడతెగని, నిత్యముగా, యెన్నటికి. they * study this వాండ్లుదీన్ని యేవేళా చదువుతారు.
Uncelebrated adj not solemnized చేయబడని. a marriage * according tolaw శాస్త్ర ప్రకారముగా చేయని పెండ్లి.
Uncensured adj not blamed అనిందితమైన, దూష్యముకాని. those * by theminister మంత్రి చేత దూషించబడనివాండ్లు, చీవాట్లు పెట్టబడని వాండ్లు.
Unceremonious adj not polite మర్యాదలేని, మట్టు మర్యాద లేని, నాగరీకము లేని,మోటు.
Unceremoniously adv మట్టు మర్యాద లేకుండా.
Unceremoniousness n s అమర్యాద, ధూర్తత.
Uncertain adj doubtful అనిశ్చయమైన, సందిగ్ధమైన, సంశయమైన. I was *about this అది నాకు సంశయముగా వుండినది. I am * where it is అది యెక్కడవున్నదో.
Uncertainty n s doubt సందేహము, సంశయము. on account of the * abouthis age వాని వయసు తెలియనందున.
Unchangeable adj immutable నిర్వ్యత్యాసమైన, మారని, యేకరీతిగా వుండేమార్చకూడని.
Unchangeableness n s నిర్వ్యత్యాసము, నిర్వికారము.
Unchangeably adv యథారీతిగా, నిర్వ్యత్యాసముగా, నిర్వికారముగా, యేకరీతిగా.
Unchanged adj విభిన్నమైన, నిర్వికారమైన, మార్చబడని.
Unchanging adj శాశ్వతమైన, నిలకడగా వుండే, తిరగని, మారని.
Uncharacteristic adj ( a foolish word) Not exhibiting acharacter, See Unsuitable వికారమైన, అవిశేష.
Uncharitable adj అధర్మమైన, పాపిష్ఠియైన, నిర్దయాత్మకుడైన, క్రూరుడైన.
Uncharitableness n s కఠినత్వము, క్రౌర్యము, నిర్దయాత్మకత.
Uncharitably adv క్రూరముగా, నిర్దయాత్మకుడై.
Unchaste adj lewd; libidinous కొంటెయైన, తుంటయైన, వ్యభిచారిగా వుండే.
Unchastened adj not restrained, not reformed అశిక్షితమైన,సంస్కారవిహీనమైన.
Unchastity n s జారత్వము, కొంటెతనము, పోకిరితనము.
Uncheeked adj నిరర్గళమైన, అడ్డము లేని, విచ్చల విడిగా వుండే. * by fearభయము లేని.
Uncheery adj ( cheerless, dull) విరసమైన.
Unchristian adj ఖ్రిస్తుమతస్థుడు కాని. * rulers ఖ్రిస్తువాండ్లు కాని దొరలు, తురకలు మొదలైన వాండ్లు. * conduct దుర్మార్గము.
Unchristianized adj ఖ్రిస్తు మతభ్రష్టుడైన.
Uncircumcised adj సున్నతు లేని, సున్నతు చేయబడని. as meaning whilewicked దుర్మార్గుడైన. the * in heart మనసా దుర్మార్గులు.
Uncircumcision n s సున్నతులేమి. or perhaps అసున్నతి. P. +. అత్వక్ ఛేదిత్వం.A+.
Uncircumscribed adj unbounded; unlimited అమితమైన, అతివిస్తారమైన,మితిమేర లేని.
Uncircumspect adj not cautious జాగ్రతలేని.
Uncivil adj unpolite మర్యాద యెరగని, నాగరీకము లేని, మోటు.
Uncivilized adj నాగరీకము లేని, మొండి.
Uncivilly adv అమర్యాదగా, మోటుగా.
Unclarified adj not purified నిర్మలము చేయబడని. * sugar బాగు చేయబడనిబెల్లము.
Unclassical adj ప్రాకృతమైన, పామర. classical language సంస్కృతము. *language ప్రాకృతము.
Uncle n s తల్లిదండ్రుల తోడబుట్టినవాడు. paternal * తండ్రి తోడబుట్టినవాడు.maternal * మేనమామ.
Unclean adj foul; dirty; filthy అపరిశుద్ధమైన, మలినమైన, రోతైన. the * spirit అమేధ్యభూతము. Luke XI. 24. A+. G+. says అశుద్ధఆత్మ. B+ says అపవిత్రభూతము. while she was * అది కడగా వుండేటప్పుడు.
Uncleaned rice n s వడ్లు.
Uncleanliness n s మాలిన్యము, మురికి, రోత, అశుచి. In 1 Thes. IV. 7. అశుచిక్రియ.
Uncleanly adj foul, dirty అపరిశుద్ధమైన, రోతైన, మలినమైన.
Uncleanness n s nastiness అశుచి, మాలిన్యము. or lewdness; wickedness కొంటెతనము, పోకిరి తనము, దుర్మార్గము. from the * of their lives వాండ్లుఅనాచారులు గనక, వాండ్లు భ్రష్టులు గనక.
Unclerical adj not fitting a clergy man పాదుర్లకు నిషిద్ధమైన. they accusedhim of * conduct పాదుర్లకు తగని నడత నడచినా డన్నారు.
Unclipped adj కత్తిరించబడని, గొరగబడని. * coins అంచులు కత్తిరించబడనినాణ్యము, చెల్లే నాణ్యము.
Unclogged adj set free నిర్బంధము లేకుండా వుండే, విచ్చలవిడిగా వుండే.
Uncloistered adj set at large విడుదల చేయబడ్డ, విముక్తులైన.
Unclosed adj తెరిచి యుండే, మూయని, వికసించి యుండే, ముగియని, తీరని. an *door తెరిచి వుండే తలుపు. an * account తీరని లెక్క, పరిష్కారము కాని లెక్క.
Unclothed adj బట్టలను విచ్చి వేయబడ్డ, దిగంబరమైన, దిసమొలగా వుండే.
Unclouded adj మబ్బు లేని, మబ్బు విచ్చిన. the * sky నిర్మలముగా వుండేఆకాశము. an * face వ్యసనము లేని ముఖము.
Uncoated adj తోలు తీయబడ్డ, మట్టలు వొలువబడ్డ. an * gem సానపెట్టిన కెంపు.
Uncoerced adj not forced నిర్బంధము చేయబడని, బలాత్కారము చేయబడని,బలవంతము చేయబడని. * by law he would never pay the money కోట్లో వేసినిర్బంధము చేస్తే గాని వాడు ఆ రూకలు యివ్వడు.
Uncoined adj నాణ్యముగా చేయబడని. * silver యింకా రూపాయిలుగా వేయని వెండి.
Uncollected adj రాబట్టని, పోగు చేయబడని, తండబడని. * debts యింకా తండనిఅప్పులు.
Uncoloured adj వర్ణము వేయని.
Uncombed adj దువ్వని, దువ్వి చక్కపెట్టబడని.
Uncomeliness n s వికారము. from the * of their dress వాండ్ల వుడుపువికారమైనది గనక.
Uncomfortable adj not pleasant, disagreeable హాయిగా వుండని,సుఖకరము కాని, సౌఖ్యము లేని.
Uncomfortably adv సౌఖ్యము లేకుండా, హాయి లేకుండా.
Uncommon adj వింతైన, విచిత్రమైన. from the * beauty of the flower యీపూష్పము యొక్క సౌందర్యము యెక్కడా లేదు గనక.
Uncommonly adv వింతగా, విచిత్రముగా, మిక్కిలి, బహు, నిండా, అతిశయముగా. itis * cold this morning నేటి చలి యెన్నడూ లేదు.
Uncommunicated adj తెలియచేయబడని, యెరుక చేయబడని. this news being *to them, యీ సమాచారము వాండ్లకు తెలియ చేయనందున.
Uncommunicative adj not easy in talking, reserved మర్మి అయిన,బోళాకాని.
Uncompelled adj బలాత్కారము చేయబడని.
Uncomplete adj not perfect అసమగ్రమైన.
Uncompounded of adj విశిష్టముకాని, హితము కాని. * of earth and airమృద్వాయువిశిష్టము కాని.
Uncompromising adj not yielding దోవకు రాణి, సమాధానానికి రాని. an *honesty నిశ్చయమైన పెద్ద మనిషితనము.
Unconcealed adj దాచని, స్పష్టమైన, విశదమైన. * hatred ప్రత్యక్షమైనవిరోధము, బాహాటమైన విరోధము.
Unconcern n s carelessness, heedlessness, negligence ఉపేక్ష, అజాగ్రత,నిశ్చింత.
Unconcerned adj not having any care అక్కరలేని, శ్రద్ధలేని. I am * in thisbusiness యీ పని నాకు అంత అక్కరలేదు. they are * for him వాని చింత వీండ్లకుఅక్కరలేదు. * at this sight దీన్ని చూచి చింతపడని వాండ్లై.
Unconcernedly adv నిశ్చింతగా, విచారము లేక.
Unconcocted adj raw, not dressed, not cooked వండని, పచనము కాని. amere * letter ఆలోచన లేకుండా వ్రాశిన జాబు.
Uncondemned adj నేరము లేని, నిరపరాధులైన. those who are * నేరమునిరూపించబడని వాండ్లు.
Unconditional adj absolute నియమము లేని, వొడంబడికెలేని, సోపాధికము కాని.he received an * pardon నిరుపాధికముగా చేసిన మన్నింపును పొందినాడు.
Unconditionally adv absolutely ఒడంబడికె లేకుండా, నిరుపాధికముగా.
Unconfined adj యథేచ్ఛగా వుండే విడిగా వుండే, విడుదలగా వుండే.
Unconfirmed adj రూఢిపడని, స్థిరపడని. a statement * by evidence సాక్షులచేత రూఢి కాని మాట, రూఢి చేయ పడనిమాట.
Unconfused adj కలవరపడని, చీకాకుపడని, భ్రమపడని.
Unconfuted adj కొట్టవేయబడని, ఖండించబడని.
Uncongealed adj పేరని, పేరుకొనిపోని, ఘనీభవించని, గడ్డకట్టుకోని.
Uncongenial adj గిట్టని, యిమడని, అనుకూలము కాని, విరోధమైన. an * climateవొంటికి గిట్టని దేశము.
Uncongeniality n s గిట్టమి, విరోధము. from the * of the climate ఆ దేశముశరీరానికి గిట్టదు గనక.
Unconnected adj అసంగతమైన. a few * words కొన్ని పూర్వోత్తర సందర్భములేని మాటలు.
Unconquerable adj not to be mastered అసాధ్యమైన, జయించగూడని. froman * hatred towards them వాండ్ల యందుండే తీరని ద్వేషము వల్ల.
Unconquered adj ఓడని, జయించబడని.
Unconscientious adj అన్యాయమైన, అధికమైన. * price అధిక వెల, అన్యాయమైనవెల.
Unconscientiously adv అన్యాయముగా, అధికముగా.
Unconscientiousness n s అన్యాయము, శయము, అధికము.
Unconscionable adj vast, prodigious, horrible నిండా, ప్రచండమైన,అన్యాయమైన. this is an * price యిది నిండా అన్యాయమైన వెల.
Unconscionably adv నిండా, మిక్కిలి.
Unconscious adj ignorant తెలియని, యెరగని. she fainted; and while shewas * they carried her away అది మూర్ఛపోయి వొళ్ళు తెలియకుండా పడివుండేటప్పుడు దాన్ని యెత్తుకొని పోయినారు. an infant is * బిడ్డకు వొకటీ తెలియదు.
Unconsciously adv తెలియక, అజ్ఞానతః, అబుద్ధి పూర్వకముగా. he * opened hishand తెలియక చెయి విచ్చినాడు. he * favoured the plaintiff అబుద్ధి పూర్వకముగాఫిరియాది విషయములో దయగా నడిపించినాడు.
Unconsciousness n s తెలియమి, యెరగమి, అజ్ఞానము. from my * of hisintention వాడి యత్నము నాకు తెలియనందున.
Unconsecrated adj నైవేద్యము చేయబడని, ఈశ్వరార్పణము చేయబడని.
Unconsidered adj ఆలోచించని, ఆలోచన లేని.
Unconstant adj not study నిలకడలేని, అస్థిరమైన.
Unconstitutional adj విరుద్ధమైన, విపరీతమైన.
Unconstrained adj natural, easy, plain నిర్బంధము లేని, అడ్డము లేని,నిరంకుశమైన, సహజమైన. this letter is written in an * style యీ జాబుసరళముగా వ్రాయబడి యున్నది.
Unconstrainedly adv దండాయమానముగా, సరళముగా.
Unconsumed adj not wasted క్షయించిపోని, క్షీణించిపోని, అయిపోని, దగ్ధము కాని.
Uncontested adj not disputed, evident, plain నిర్వివాదమైన, నిరాక్షేపముగావుండే, స్పష్టమైన.
Uncontnrite adj not penitent పశ్చాత్తాపము లేని, అనుతాపము లేని.
Uncontrollable adj ungovernable అనర్గళమైన, అణచగూడని, సాధ్యము కాని. an* excess of fury పట్టగూడని మహత్తైన కోపము.
Uncontrollably adv యథేచ్ఛగా, విచ్చలవిడిగా, ప్రచండముగా.
Uncontrolled adj not restrained అస్వాధీనమైన, వశ్యము కాని, అణగని,నిరంకుశమైన, ప్రచండమైన. this is an * truth ( Swift ) ఇది రూఢి, దీనికి వొకఆక్షేపము లేదు. The words of Swift are " It is an * truth that no manever made an ill figure, who understood his own talents, nor a goodone, who mistook them."
Uncontrolledly adv యథేచ్ఛగా, విచ్చలవిడిగా, ప్రచండముగా.
Uncontroverted adj not disputed నిర్వివాదమైన, నిస్సందేహమైన, నిరాక్షేపమైన.
Unconverted adj not changed in opinion; not turned from one faith toanother మారని, నిర్వ్యత్యాసమైన, మతము విడిచి మరివొక మతములో ప్రవేశించని.
Unconvinced adj not persuaded ఒప్పుకోని, నమ్మని, యెరగని. those whoare * నమ్మనివాండ్లు, వొప్పుకోనివాండ్లు.
Uncorrected adj దిద్దని.
Uncorrupt adj not spoiled, not tainted with wickedness చెడిపోని,సత్యసంధుడైన, సన్మార్గుడైన, లంచగొట్టుకాని.
Uncorrupted adj చెడిపోని, మురిగిపోని, ఆభాసము కాని, దూర్నీతి యెరగని.
Uncorruptness n s సన్మార్గము, సత్స్వభావము, సునీతి. in Titus II. 6.అవికారిత్వము C+. నిష్కళంకము P+.
Uncountry n s నాటుపురము.
Uncourteous adj uncivil; unpolite అమర్యాదస్థుడైన, విరసుడైన. he was * tothem వాడు వాండ్లకు సన్మానము చేయలేదు.
Uncourteously adv అమర్యాదగా, విరసముగా.
Uncourteousness n s incivility అమర్యాద.
Uncourtly adj not elegant, rude అమర్యాదస్థులైనా, మొండి, మోటవాండ్లైన,మూర్ఖులైన.
Uncouth adj odd; strange మొండియైన, మూర్ఖమైన, వికారమైన. their mannersare * వాండ్లది మోటరీతి.
Uncouthly adv oddly, strangely మోటతనముగా, పళుప్రాయముగా.
Uncouthness n s oddness; strangeness మోటతనము, గ్రామ్యత్వము. fromthe * of his language వాడు మోటతనముగా మాట్లాడడమువల్ల.
Uncovenanted adj not promised by covenant ఒడంబడికె యివ్వని, ముచ్చిలికాయివ్వని, వొడంబడికె తీసుకోబడని. * mercies నిరుపాధికమైన కృప. an * servantవొడంబడికె యివ్వని వుద్యోగస్థుడు.
Uncovered adj మూతలేని, కప్పని, మూయబడని, ఉత్తతలతో, బోడితలతో. hewalked in the procession * వూరేగింపులో బోడితలతో పోయినాడు.
Uncreated adj not yet created సృష్టించబడని, అనాదియైన, శాశ్వతమైన.
Uncrust adj not execrated, శపించబడని, శాపగ్రస్తముకాని. they are * withdebts అప్పులనే పీడనము లేనివాండ్లు.
Unction n s anointing అభ్యంజనము. extreme * మరణావస్థ యందు చేశేలేపనము ఇది కాతోలిక్కు వాండ్లలో చరమదశలో చేశే వొక కర్మము. spirit, forceతేజస్సు ఉద్రేకము, శక్తి.
Unctuosity n s oilness; fatness; greasiness జిడ్డు.
Unctuous adj oily; fat; greasy జిడ్డుగా వుండే. an * fluid తైలము, నెయ్యి.
Unctuousness n s oilness; greasiness జిడ్డు.
Uncultivated adj not tilled; not instructed; rude; rough in mannersదున్నని, అశిక్షితుడైన, ప్రాకృతుడైన, పామరుడైనా, మోటవాడైన.
Uncumbered adj not burdened ఇబ్బందిలేని, పీకులాటలేని, సంకటము లేని.
Uncurable adj స్వస్థము కాని, అసాధ్యమైన.
Uncurbed adj అణగని.
Uncured adj కుదరని, స్వస్థము కాని.
Uncustomed goods n s సుంకము తీరని సరుకులు.
Uncut adj కోయబడని, నరకబడని, సానపెట్టబడని. an * ruby దళముగా వుండే కెంపు,యింకా సానపెట్టని కెంపు. the book was sold * ఆ పుస్తకము కాకితాలంచులుకోయకనే అమ్మివేసినారు.
Undamaged adj not spoiled చెడిపోని. cloth which is * by rain వర్షము చేతచెడిపోని గుడ్డలు. a reputation * by scandal దూషణ చేత చెడిపోని కీర్తి.
Undammed adj అడ్డకట్టలేని, మడవలేని. an * stream అడ్డముగా మడవలు లేకుండాపొయ్యే ప్రవాహము.
Undaunted adj not frightened భయపడని. * heroes నిర్భీతులైన శూరులు.
Undauntedly adv నిర్భీతిగా, ధైర్యముగా.
Undauntedness n s నిర్భీతి, ధైర్యము.
Undazzled adj not confused by splendour మిరుమిట్లుకొనని, ఆశ్చర్యపడని,భ్రమపడని.
Undebauched adj not corrupted; pure చెడని, స్వచ్ఛమైన. he who is * byprosperity ఐశ్వర్యము పొడిగినప్పటికిన్ని చెడనివాడు.
Undecayed adj not impaired by age or accident నశించని, క్షీణించని,యథారీతిగా వుండే, శిథిలమైపోని. the three though old is * యీ చెట్టు బహు దినాలదైనప్పటికిన్ని క్షీణించిపోలేదు.
Undecaying adj క్షీణించని, శిథిలముకాని, చెడిపోని యథారీతిగా వుండే.
Undeceivable adj not subject to deception మోసబోని.
Undeceived adj మోసపోని, భ్రమనివారణమును పొందిన. they are * by histricks వాడి పితలాటకానికి వాండ్లు లోబడలేదు. at last I was * తుదకు నాకు వుండినభ్రమ తీరినది.
Undecided adj not settled తీరని, తీర్పుకాని, డోలాయమానముగా వుండే. acause that is yet * యింకా తీర్పు కాకుండా వుండే వ్యాజ్యము. I am as yet * togo or stay నేను పోదునో వుందునో యింకా నిశ్చయము లేదు.
Undecisive adj not conclusive తీర్పుకాని, పరిష్కారము కాని, నిశ్చయము కాని.this was an * experiment యీ యత్నము చేత వొకటీ తీరలేదు. this proof is *యీ సాక్ష్యమువల్ల వొకటీ తీరలేదు.
Undeclinable adj రూపభేదము లేని. an * noun అవ్యయము.
Undeclined adj రూపభేదము చేయబడని, రూపభేదము లేని. an * noun రూపభేదము చేయబడని శబ్దము.
Undedicated adj not consecrated అంకితము చేయబడని, ఈశ్వరార్పితముచేయబడని. land * to any charity ధర్మానికి యివ్వబడని భూమి.
Undefaced adj not disfigured రూపము చెడగొట్టబడని, యథారీతిగా వుండే. afew letters remained * కొన్ని అక్షరాలు చెడకుండా వుండినవి.
Undefeasible adj that which cannot be taken away అనివార్యమైన,నిరంకుశమైన, సర్వసమ్మతమైన, స్వతంత్రమైన. these are the * rights of afather యివి తండ్రికి సహజమైన, ధర్మములు.
Undefiled adj not polluted అంటుబడని, అశుచికాని, పవిత్రమైన, నిష్కల్మషమైన.In Ps. CXXIX. 1. సరలః. A+. D+.
Undefinable adj which cannot be shown విచారించ గూడని, నిర్ణయించగూడనిస్పష్టముకాని.
Undefined adj not described వివరించబడని, విశదపరచబడని, అస్పష్టమైన,గూఢమైన.
Undemonstrable adj not capable of fuller evidence అనుమేయించ కూడని,రూఢి పరచకూడని, సిద్ధాంతము చేయతగని. his claim is * వాడి వ్యాజ్యము రూఢిపరచకూడనిదిగా వున్నది.

No comments:

Post a Comment