Monday, February 7, 2011

To Wake

To Wake v n to get up మేలుకొనుట. when he woke in the morning తెల్ల వారి మేలుకోగానే, నిద్రలేవగానే.
To Waken v n to rouse మేలుకొనుట, నిద్రలేచుట.
To Walk v n to go నడుచుట. at first the horse was galloping, but now he is walking ముందర గుర్రము పరుగెత్తుతూ వుండినది, యిప్పుడు నడగా పోతున్నది. they say, that his ghost *s వాడు దయ్యముగా తిరుగుతున్నాడంటారు. to * about తిరుగుట. to * away వెళ్ళుట. Sir, * in అయ్యా లోపలికి దయచేయండి. he *ed out at noon మధ్యాహ్నము బయిట తిరగ పోయినాడు. he was walking to and fro యిక్కడికి అక్కడికి తిరుగుతూ వుండినాడు.
To Wall v a to inclose with a wall ప్రహరి వేసుట, చుట్టూ గోడవేసుట. he *ed the town ఆ పట్నానికి చుట్టూ గోడవేసినాడు. he *ed in the garden ఆ తోటకు చుట్టూ గోడ వేసినాడు.
To Wallop v n to walk or move coarsely వికారముగా నడుచుట.
To Wallow v n to roll in the mire &c. పొర్లాడుట. he *s in pleasures ఉల్లాసములో ముణిగి తేలుతూ వున్నాడు. people who are wallowing in wealth ఐశ్వర్యములో ముణిగి తేలుతూ వుండేవాండ్లు.
To Wander v n and v. a. to rove, ramble తిరుగుట, సంచరించుట. he *ed the town all night రాత్రిఅంతా వూళ్ళో అల్లాడుతూ వుండినాడు. his thoughts are wandering వాడికి తెలివితప్పి వున్నది.
To Wane v n to diminish, to decrease క్షయించుట, క్షీణమవుట. the waning moon క్షీణచంద్రుడు. no marriage is performed when the moon is waning క్షీనచంద్రుడుగా వుండేటప్పుడు వివాహము చేయరాదు, అనగా కృష్ణపక్షములో వివాహము చేయరాదు.
To Want v a to be without, to need కొరతగా వుండుట, లేక వుండుట, అక్కరవుండుట, ఆశించుట, కోరుట. I * it అది నాకు కావలెను. I do not * that అది నాకు అక్కరలేదు, వద్దు. I do not * water నాకు నీళ్ళతో పనిలేదు. I do not * him to sit here వాడు యిక్కడ కూర్చుండ వలెనని నాకు అక్కరలేదు. comehere I * you యిందా నీతో పనివున్నది, యిక్కడికిరా, పనివున్నది. he *s manners వానివద్ద మర్యాదలేదు. what do you * ? నీ కేమి కావలెను, నీ వేమి పనికి వచ్చినావు. he *s you వాడు నిన్ను పిలుస్తాడు,రమ్మంటాడు. what I * is a light నాకు కావలసినది దీపము. the horse *s an ear ఆ గుర్రానికి వౌక చెవి తక్కువ. this house *s width యీ యింటికి వెడల్పు తక్కువ. this beam *s length యీ దూలమునకు నిడువు చాలదు. she *s the use of her two handsఆపెకు రెండు చేతులూ స్వాధీనము లేదు. begin this work and you shall not * aid యీ పనిని ఆరంభించు, నీకు కావలసిన సహాయము నేను చేస్తాణు. he *s several of his teeth వానికి కొన్ని పండ్లు పోయినవి. this spear *s a head యీ బల్లెము మొణపోయినది. the carriage *s a wheel యీ బండికి వొక చక్రము లేదు. he *s nothing వానికి యేమిన్ని తక్కువలేదు. It *s an hour of noon మధ్యాహ్నము కావడానకు యింకా గంట తక్కువ వున్నది. rich men never * flatterersభాగ్యవంతులకు పొగిడేవాండ్లు తక్కువా. the unhappy never * enemies? దౌర్భాగ్యులకు శత్రువులు లేక వుండరు. I * to go to Nellore నెల్లూరికి పోవలెనని వున్నాను, నాకు నెల్లూరికి పోవలసి వున్నది. the book that is *ed కావలసి వుండే పుస్తకము you have been wanting to yourselfin this business యీ పనిలో నీవు అశ్రద్ధచేసినావు.
To Wanton v n to play loosely, to rove and ramble without restraint తుంటగా తిరుగుట, అల్లాడుట.
To War v n to make or carry on war యుద్ధముచేసుట.
To Warble v n to quaver any sound, to sing కలధ్వని చేసుట, సరళముగా పలుకుట, పాడుట. See Barrow's Works 1. 399.New objects with a gentle touch warble upon the corporeal organs.
To Ward off v a to keep off తట్టగొట్టుట, నివారించుట. he *ed off the blow ఆ దెబ్బను తట్టగొట్టి వేసినాడు.
To Warehouse v a to deposit in a warehouse కొట్టులోపడవేసుట, భద్రముచేసుట, పెట్టుట.
To Warm v a to heat a little తప్తము చేసుట, కాచుట, వెచ్చచేసుట.he *ed his hands చేతులను కాచుకొన్నాడు. It *s my heart to see thisదీన్ని చూచి నా మసను కరిగినది, నాకు దయవచ్చినది. this *ed his heart యిందువల్ల వాడి మనసు కరిగినది.
To Warn v a to caution, to give notice, to tell ఐచ్చరికచేసుట, తెలియచేసుట, చెప్పుట, బుద్ధి చెప్పుట, ఎరుకచేసుట. I * younot to do so again తిరిగీచేస్తివా చూడు. this chill *s me of feverయీ చలిని చూస్తే జ్వరము వచేటట్టు వున్నది. I * you that you had betterdo so నీవు అట్లా చేయక పోవడము మంచిది కాదు సుమీ. they *ed him out ofthe town వాణ్ని పట్టములోనుంచి వెళ్ళగొట్టినారు, వెలివేసినారు. they *edhim off the field వాణ్ని అక్కడనుంచి వెళ్ళగొట్టినారు.
To Warp v n to turn, to contract, to shrivel వంగుట. the plank *ed with the heat యెండకు పలక వంగినది.
To Warrant v a to authorize సెలవిచ్చుట, అనుమతియిచ్చుట, ఉత్తరువుచేసుట, అధికార మిచ్చుట. his Dictionary *s this word యీ మాటకు ఆయన నిఘంటువు ఆధారముగా వున్నది, సాధకముగా వున్నది. the evidence does not * this decision యీ తీర్పుకు ఆ సాక్ష్యము ఆధారము కాలేదు. this will * you in paying the money ఆ రూకలను చెల్లించడానకు నీకు యిది ఆధారముగా వుండును. I do not see nay thingthat *s this conclusion యీ తీర్పుకు ఆధారముగా నాకేమి అగుపడలేదు. I * you! అనగా ofcourse, naturally సుమీ. he had ten horses and fifty servants I * you! పది గుర్రాలనున్ను యాభై మంది పని వాండ్లనున్ను పెట్టుకొని యుండినాడు సుమీ. I * you he thought I was dead నేను చచ్చినానను కొన్నాడు సుమీ. study these books and I will * your learning the language యీ పుస్తకాలను చదువు నీకు యీ భాష రాకుంటే నన్ను అడుగు. this letter will * you to receive the money ఆ రూకలు తీసుకోవడానకు యీ జాబువల్ల నీకు అధికారము కలుగుతున్నది.
To Wash v a to cleanse with water కడుగుట, తొలుచుట, ఉతుకుట. he *ed his hands చేతులు కడుక్కొన్నాడు. they * or sift earth for diamonds రవల కోసరము మంటిని జలకడుగుతారు. they *ed the wall with whiting గోడకు సున్నము కొట్టినారు. the stream *ed the rice down with milk అన్నము తిని పైన పాలు తాగినాడు. the sea *es three sides of the hill ఆ కొండకు మూడుతట్లా సముద్రము యొక్క అలలు వచ్చికొట్టుతున్నవి. the ocean that washes these shores యీ రేవులలో అలలు వచ్చికొట్టే సముద్రము. I *ed my hands of the affair ఆ పనిని మానుకొన్నాను. I * my hands of him వాడికీ నాకు తీరినది. this will * away thy sins యిందువల్ల నీ పాపము పరిహారమైపోను. a washing greenచాకల రేవు.
To Waste v a to diminish; dwindle; destroy, squanderపాడుచేసుట, దురర్వయము చేసుట. he *s his time కాలమును వృథాగా పోగొట్టువాడు.
To Watch v n to keep guard, not sleep, to look with expectation కావలివుండుట, మేలుకొని వుండుట, జాఘరము చేసుట, కనిపెట్టుకొని వుండుట ఎదురు చూచుట. he *ed against wolves తోడేండ్ల రాకుండా కనిపెట్టుకొని వుండినాడు.
To Water v a to supply with water; to shed moisture on; to irrigate నీళ్ళు చల్లుట, నీళ్ళు పోసుట, నీళ్ళు తాగించుట,నీళ్ళు చూపించుట, నీళ్ళుకట్టుట. she *s the flower-trees ఆమె పుష్ప చెట్లకు నీళ్ళుపోస్తున్నది. the rain that *s the fields చేనులను తడిపేవాన. five rivers * this country అయిదు నదుల నీళ్లు యీ దేశములో పొలములకు పారుతున్నది. they * their cattle here వాండ్ల గొడ్లకు నీళ్ళు యిక్కడ చూపుతారు. they *ed the rum సారాయిలో నీళ్ళు కలిపినారు.
To Wattle v a to bind or make firm with twigs ఆళ్లుట, చువ్వలతో ఆళ్లుట.
To wave v n to move loosely, ఆడుట, వూగుట. the branches that * in the wind గాలికి వూగులాడే మంటలు. the plumes that * over his helmet వాడికిరీటముమీద ఆడే పింఛంఉ.
To Waver v n to move loosely కదులుట, ఆడుట, వూగుట. my hopes began to * నా కోరిక సఫలమవునో కాదో అనే అనుమానము కలిగినది.
To Wax v a to smear with wax మైనము చరుముట. he *ed the thread ఆ దారమునకు మైనము చరిమినాడు.
To Wax, wax v n. to grow ఆపుట, పెరుగుట, వృద్ధియవుట. he *ed mighty ప్రబలుడైనాడు. he *ed weak బలహీనుడైనాడు. it *ed pale తెల్లపారినది. he *ed werth కోపించినాడు. to * old పాతగిల్లుట. the waxing moon వృద్ధిచంద్రుడు.
To Waylay v a to beset by ambush దోవకట్టుట, దారికట్టుట.they waylaid him wishing to kill him వాణ్ని చంపవలెనని దారిలోకనిపెట్టుకొని వుండినారు.
To Weaken v a to enfeeble దుర్బలము చేసుట, బలహీనముచేసుట.this fever *ed him యీ జ్వరముచేత వాడి సత్తువ పోయినది. thisdocument *s your statement యీ దస్తావేజు చేత నీవు చెప్పేదిబలహీనమై పోతున్నది.
To Wean v a to put form the breast బిడ్డకు చన్నుమాన్పించుట.two months after she *ed the child అది బిడ్డకు చన్ను యివ్వడము విడిచి పెట్టిన రెండు నెలలకు తర్వాత. this punishment *ed himfrom the world యీ శిక్షలో వానికి యిహముమీద ఆశ విడిచినది. this *ed him from abusing people యిందువల్ల వాడికి జనులను తిట్టే దుర్గుణము మానినది. a weaned child చన్ను మాన్పబడ్డ బిడ్డ.
To Wear v a to have on, as clothes or weaponsధరించుట, కట్టుకొనుట, వేసుకొనుట, తొడుక్కొనుట. acters * paint వేషగాండ్లు ముఖాని అరిదళము పూసుకొంటారు. they * red వాండ్లు యెర్రవుడుపులు వేసుకొంటారు. he *s his own hairతల పెంచుకొని వున్నాడు. he *s a cane వేత్రమును ధరించుకొని వున్నాడు, బెత్తమును పెట్టుకొని వున్నాడు. one who *s a sword ఖడ్గధరుడు, కత్తిగలవాడు, కత్తికట్టుదొర. he wore a calm countenance సన్మఖుడుగా వుండినాడు. to waste అరగతీసుట, అరగ్గొట్టుట. the rain wore the stone వర్షముచేత యీ రాయి అరిగిపోయినది. he wore out the book ఆ పుస్తకమును వాడు చెరిపినాడు. he wore out my patience వాడు చేసిన దాంట్లో నాకు వుండిన సహనము పోయినది. time wore away the rock బహుకాలమునందునరాయి అరిగిపోయినది. he wore out his shoes in a month వాడి చెప్పులను వొక నెలలో అరగగొట్టినాడు. he was worn with age వాడికి నిండా యేండ్లు చెల్లినందున వుడిగి వుండినాడు. the sword is much worn కత్తినిండా అరిగిపోయినది. To Wear, v. n. to be wasted; to diminished అయిపోవుట,అరిగిపోవుట. to off; to pass away by degrees మట్టుపడుట.the follies of youth * off with age యేండ్లు వచ్చేటప్పటికిచిన్ననాటి చేష్టలు పోతవి. at last his patience wore out తుదకు వాడి ప్రాణము అరిగిపోవడము మేలు, అనగా వూరికె వుండిచెడిపోవడమునకన్నా పనిచేసి వుడుగుట మేలు. the ring is much worn వుంగరము నిండా అరిగిపోయినది. this cloth wears very well యీ బట్ట కట్టు తాళుతున్నది.
To Weary v a to tire; to fatigue; to harass అలియగొట్టుట,ఆయాసపెట్టుట, శ్రమపెట్టుట.
To Weather v a to withstand, to endure, to bear గాలివానకు తాళుట, ఓర్చుట, నిభాయించుట. a ship that has *ed storm గాలి వానకు చెడిపోకుండా నిలిచిన వాడు. he *ed the difficulty అన్ని పాట్లుకు వాడు డస్సినాడు కాడు.
To Weave v a నేసుట, అల్లుట. the spider *s it's web సాలె పరుగు బూజుతో అల్లుతున్నది. to * verse రచించుట.
To Wed v a to marry దాన్ని పెండ్లాడినాడు, దాన్నికట్టుకొన్నాడు.
To Wedge v a to cleave with a wedge మేకులు కొట్టి చీల్చుట. I *d the stone in ఆ రాతిని నడమ యిరికించి దిగగొట్టినాను. to fasten with a * మేకు కొట్టి బిగించుట. he *d himself in గుంపును తోసుకొని చొరబడ్డాడు. we were *d in by the crowd గుంపు నడమ యిరుక్కొంటిమి. the poeplewere *d together in the doorway మనుష్యులు ఆ ద్వారములో కిక్కిరిసుకొన్నట్టుగా జొరబడిరి.
To Weed v a to take away, as noxious plants కలుపుతీసుట.he *ed the field ఆ పొలములో వుండిన కలుపుతీశినాడు. this placewants weeding యిక్కడ వుండే కట్టె కంపనుతీశి బాగుచేయవలెను. he*ed the book ఆ పుస్తకములో వుండే తప్పులను దిద్ది పరిష్కరించినాడు.
To Ween v n to think; to imagine; to fancy ఎంచుట,తలంచుట. I * they are gone వాండ్లు వెళ్ళినారని తోస్తున్నది(ఇది యెగతాళి మాట.)
To Weep v a and v. n. to shed tears, to lament ఏడ్చుట.wept him, or, they wept for him వానికి యేడ్చినారు. she weptmany tears at this ఇందున గురించి నిండా యేడ్చినది.
To Weet v a to know ఎరుగుట.
To Wehlp v n to bring forth young పిల్లలు వేసుట, ఈసుట.
To Weigh v a to try the weight of nay thing తూచుట. he *ed the copper రాగిని తూచినాడు. the fruit that *s downthe branches కొమ్మలు వాలేట్టుచేసే పండ్లు. the ship *ed anchorవాడ లంగరుతీశి వెళ్ళిపోయినది. to consider ఆలోచించుట. afterweighing the reasons హేతువులలో యెచ్చుతగ్గులు విచారించినతరువాత, యెది ఘనమో విచారించి కారణములను పర్యాలోచన చేసినతరువాత.
To Welcome v a to salute a new comer with kindness; or to receive and entertain hospitably వచ్చినవాణ్ని సన్మానించుట,ఆదరించుట, విచారించుట, మన్ననచేసుట.
To Weld, weld v a. to beat one mass into an other, so as to incorporate them అతికించుట, కాచికొట్టి అతికించుట.
To Well forth v n to spring, to issue forth ఊట వచ్చుట.welling tears కారే కన్నీళ్లు.
To Welter v n to wallow పొర్లాడుట, పొరలుట. he wasweltering in his blood నెత్తురులో పడి పొర్లాడుతూ వుండినాడు.weltering waves పోర్లే అలలు.
To Wench v n to frequent loose women విడవకుండా మండలతోపోవుట, వ్యభిచరించుట.
To Wend v n to go వెళ్ళుట, పోవుట, ఇది కావ్యశబ్దము. as he was wending along వాడు పోతూ వుండగా.
To Wet v a to dip or soak in liquor తడుపుట, నీళ్ళలోముంచుట. * the cloth ఆ గుడ్డను తడుపు. the child wetted itself, or, wetted the bed బిడ్డ వుచ్చపోసినది.
To Wheedle v n to entice బుజ్జగించుట, లాలించుట.
To Wheel v a to move on wheels, to turn round తిప్పుట,దొల్లించుట. v. n. to * round తిరుగుట.
To Wheeze v n to breathe with a noise గుర్రుగుర్రుమనిశ్వాసము విడుచుట.
To Whelm, hwelm v a. to cover completely; to immerse deeply మూసుకొనుట, కప్పుకొనుట, ముంచుకొనుట. whelmed in ocean సముద్రములో ముణిగిన. the ocean *ed them all వాండ్ల నంతా సముద్రము వచ్చి కప్పుకొన్నది. this *ed him in sorrows యీ వ్యసనములో ముణిగినాడు.
To Whet v a to sharpen పదునుపెట్టుట. this whetted his appetite ఇందువల్ల వాడికి ఆకలి చురుకు పుట్టినది. thiswhetted his passion ఇందుచేత వాడికి మోహము అధికమైనది. thiswhetted his curiosity ఇందువల్ల వాడికి మరీవింతైనది.
To Whiffle v n to brag, to pretend కులుకుట, అహంకరించుట.
To While away v a to spend ప్రొద్దుపుచ్చుట, గడుపుట. he *d away ten days there అక్కడ పది దినాలు పోగొట్టినాడు,గడిపినాడు.
To Whimper v n to cry with a low, whining, broken voiceకూనరాగాలు పెట్టి యేడ్చుట, ముక్కుతో యేడ్చుట.
To Whine v n to murmur meanly, to cry like a dogకూనరాగాలుపెట్టి పోరుపెట్టుట. he *d about this ఇందున గురించిముక్కుతో యేడ్చినాడు, గోజారినాడు.
To Whinny v n to murmur meanly మురియుట, గోజారుట,రచ్చపెట్టుటు. the horse whinnied ఆ గుర్రము ఆహారమును చూచిమురుస్తూ హుంహుం అన్నది.
To Whip v a and v. n. to strike with a lash కొట్టుట,కొరడాతో కొట్టుట. to punish శిక్షించుట, దండించుట. he whippedthe letter into his pocket ఆ జాబును లటక్కున తన జేబులోవేసుకొన్నాడు. he whipped off the dog's tail కుక్క తోకనుపుటుక్కున తెంచినాడు. she whipped a sheet off the bed andthrew it over her head మెత్తమీది దుప్పటిని యీడ్చి తలమీదకప్పుకొన్నది. she whipped off her veil ముసుకుని దడీలుమనితీశివేశినది. he whipped out his sword కత్తిని సరాలునదూళినాడు. he whipped the letter out ఆ జాబును లటక్కునబైటయెత్తినాడు. he whipped his sword through my arm ఆ కత్తితో యీ తట్టు దూరి ఆ తట్టు బయిలుదేలటట్టు భుజములో పొడిచినాడు. she whipped up the child and ran off with it చివుక్కున ఆ బిడ్డను యెత్తుకొని పారిపోయినది.
To Whir v a to whirl round or to fling with noiseరొంయనివేసుట.
To Whirl v a to turn తిప్పుట గిర గిరి తిప్పుట. he *ed hissword కత్తిని గిరగిర తిప్పినాడు.
To Whisk v a to move lightly and rapidly విసురుట, వీపుట.the horse *s his tail గుర్రముతోకతో విసురుకొంటున్నది.
To Whisper v a and v. n. to speak with a low voice గుసగుస మాట్లాడుట, చెవిలో చెప్పుట. he *ed to me to come రమ్మనిచెవిలో చెప్పినాడు. he *ed away their character గుడగుసలాడివాండ్ల పేరును చెరిపినాడు.
To Whistle v n and v. a. to form a musical modulation ofthe breath ఈలవేసుట. the ball *d by his head గుండు వాడితలమీదుగా రౌంయిమని పోయినది. he *d back his dog యీలవేశికుక్కను మళ్ళీ తనవద్దికి పిలుచుకొన్నాడు. he *d a tune యీలవేశివొక రాగమును పాడినాడు.
To Whiten v. a. , n. to make or grow white తెలుపుచేసుట, తెల్లపారుటతెల్లబడుట, when age *ed his head యేండ్లు వచ్చి తలపెరుగు బుడ్డి అయ్యేటప్పటికి. to * cloth, to bleach చలవచేసుట.
To Whitewash v a సున్నముకొట్టుట. they *ed the house ఆయింటికి సున్నము కొట్టినారు. he got himself *ed in theinsolvent court అప్పులు చెల్లించడమునకు గతిలేదని దివాణములోనిరూపించి చెరసాల విడిచి వచ్చినాడు, లోన కంపు పెట్టుకొని పైనగంథము పూసుకొని బయిలు దేలినాడు.
To Whittle v a to cut with a knife చెక్కుట, చివ్వుట. See Wesley's Works, Vol, 4. 34.
To Whiz v n to make a loud humming noise, like anarrow or ball; or the sound of wings రొంయిమనుట, రింగుమనుట,బుర్రుమనుట. the bullets whizzed by his head వాడి తలపక్కనగుండ్లు రొంయిమని పోయినవి.
To Whore v n to become a prostitute రంకుబోవుట,వ్యభిచరించుట. to frequent prostitutes లంజల యిండ్లకు పోవుట.ముండల యింటికిపోవుట.
To Widen v a to make broad వెడల్లు చేసుట, విశాలముచేసుట.he *ed the road బాటను వేడల్పు చేసినాడు. this *ed the breachఇందువల్ల కలహము పెరిగినది.
To Widow v a to kill the husband మొగుణ్ని చంపుట, ముండ మోయించుట. the war *ed them ఆ యుద్ధములో వాండ్ల మొగుండ్లు చచ్చినారు.
To Wield v a to rule ఏలుట. to use with full power అవలీలగా తిప్పుట, విసురుట. he *s the sword వాడు ఆ కత్తిని అవలీలగా తిప్పుతాడు.she *s the sceptre ఆమె ప్రభుత్వము చేస్తున్నది,యేలుతున్నది.
To Wig v a to reprimand (a low word) చీవాట్లుపెట్టుట, కూకలుపెట్టుట, గద్దించుట.
To Will v a and v. n. ఇచ్ఛయించుట. the sign of the futuretense: this in TElugu is generally expresed by the present;thus he * go to-morrow రేపు పోతున్నాడు. or by the aorist పోవును. Go if you * నీకు యిచ్చవుంటే పో, కావలశివుంటే పో. do as you * నీకు యిష్టమైనట్టు చెయ్యి. I * go if you * నీవు పోతే నేనున్ను పోతాను. God, *ed this దేవుని సంకల్పమువల్ల యిది సంభవించినది. I shall come tomorrow if God * దేవుని సంకల్పము వుంటే రేపు వస్తున్నాను. he *ed away all his property తన యావత్తు సొత్తును మరణ శాసన పూర్వకముగా యిచ్చినాడు.
To Win v a to gain గెలుచుట. he won the prize పందెమునుగెలిచినాడు, బహుమానమును పొందినాడు. he won several victoriesఅనేక మాట్లు జయించినాడు, అనేక జయములు పొందినాడు. you have wontheir hearts by this ఇందు చేత వాండ్లందరు నీ పక్షమైనారు in rustic English to win a house or crop is to get it readyతయారుచేసుట, సిద్ధముచేసుట. they * coal here * (That is, theydig coal here) యిక్కడ బొగ్గులు తవ్వుతారు. a place where they* marble పలుగు రాళ్ళు తొవ్వే స్థలము. the ship *s her easy way వాడ హాయిగా పోతున్నది.
To Wince v n to shrink from pain జంగుట, నొప్పికి జంకుట,కులుకుట. the horse *d ఆ గుర్రము జంకినది, వెనక్కు తీసినది. awincing maid కులుకులాడి.
To Wind v a to turn; to twist చుట్టుట, తిప్పుట. మెలిపెట్టుట. he wound upthe thread on the stick ఆ దారనమును కట్టెకు చుట్టినాడు. you must * up the watch every day డిగయారమును నీవు ప్రతి దినమున్ను తిప్పుతూ రావలసినది. he wound up the story with these words యీ మాటలతో కథను ముగించినాడు. he wound up his speech by saying he would not consent తుదకు సమ్మతి లేదన్నాడు. he wound himslef into their councilsమారీచ వేషము వేసుకొని వాండ్లకు అంతరంగుడివలె వుండినాడు. she wound herself into his heart ఉపాయముగా వానికి అంతరంగురాలై పోయినది. he wound his arms round her దాన్ని కౌగిలించుకొన్నాడు. to nose ; to follow by scent వాసనపట్టిపోవుట. the dog *ed the hare కుక్క కుందేటి వాసనపట్టి పోయినది.the huntsman wound his horn వేటగాడు కొమ్మును వూదినాడు.
To Wing v a to go through. he *ed his way యెగిరిపోయినాడు. to wound in the wing రెక్కలో గాయము చేసుట.
To Wink v n to shut the eyes ; conive ; hint రెప్పవేయుట,కన్నుగీటుట, కనుసైగ చేసుట, అపేక్ష చేసుట. he *ed to me నన్ను కనుసైగ చేసినాడు. do you think he will * at this ? దీన్ని చూచి వాడు వూరికెవుంటాడని తలిచినావా, ఉపేక్షగా వుండునని తలచినావా. we must * at this దీన్ని మనము పాటించరాదు, దీన్ని మనము అంతగా విచారించరాదు. Hood-winked కండ్లు మూసి గంతకట్టిన.
To Winnow v a to fan, to sift చెరిగి చక్కచేసుట, నేముట,మలచుట. they *d the corn in the wind ధాన్యమును తూర్పార పెట్టినారు. he *ed the case thoroughly ఆ సంగతిని చక్కగా విచారించినాడు, విమర్శించినాడు.
To Wipe v a to cleanse by rubbing to clear తుడుచుట. he *dhis hands చేతులన తుడుచుకొన్నాడు. he *d the table బల్లను తుడిచినాడు. he *d the sweat off his face నొసటి చెమటను తుడుచుకొన్నాడు. he *d out the debt ఆ అప్పును కొట్టివేశినాడు, తీర్చివేశినాడు. this *s out the debt ఇందువల్ల అప్పు తీరిపోతున్నది.
To Wis v n to think, to imagine ఎంచుట, తలచుట. (ఈ శబ్దముయిప్పట్లో చెల్లదు.)
To Wish v n to desire కోరుట. wishing to go there అక్కడికిపోవలెనని. do you * for this? ఇది నీకు కావలె నా. I * for thisone ఇది వొకటే నాకు కావలసినది. don't you * for this? ఇది నీకువద్ధా. I do not * for that horse ఆ గుర్రము నాకు వద్దు. I *he was here now అయ్యో వాడు యిక్కడ లేకపోయినాడే. I * it wereso అయ్యో అట్లా కాకపోయెనే. I * I was dead అయ్యో నాకు చావు రాకపోయెనే. I * I had the money to pay for it అయ్యో అందుకు చెల్లించేటందకు నా వద్ద రూకలు లేకపోయెనే. when he was married all his relations wished him joy వానికి పెండ్లి కాగానే వాని చుట్టాలందరు వాని శుభమును కొనియాడిరి. I * you well నీకు క్షేమము కలుగుగాక,నీక్షేమము కోరుతున్నాను. I * he may hold out tillnext year వచ్చే సంవత్సరముదాకా వాడు బ్రతికితే గొప్ప.
To Wit adv (in law language) namely, that is అనగా, అవియేమంటే. (ఇది కోర్టు భాష.) he carried off the plaintiff'sclothes; to *, twelve jackest వాని బట్టలను దోచుకొన్నాడు, అవియేమంటే పన్నెండు చొక్కాయలు.
To Withdraw v a to take back, to recall మళ్ళీ తీసుకొనుట,వెనక్కు తీసుకొనుట. he withdrew his charge తాను యిచ్చిన ఫిరియాదును మళ్లయీ తీసుకొన్నాడు. he withdrew his troops తన దండను వెనక్కు మళ్ళించినాడు. he withdrew his assertions తాను అన్న మాటనుతన మాటను లేదన్నాడు. he withdrew his hand తన చేతిని యీడ్చుకొన్నాడు, వెనక్కు తీసుకొన్నాడు. he withdrew his eyes తన దృష్టిని మళ్ళించినాడు, చూడడము మానుకొన్నాడు. the king withdrew his conutenance from the scheme రాజు దాన్ని ఆదరించడము విడిచిపెట్టినాడు.
To Wither v n to fade వాడుట, వాడి పోవుట, ఎండిపోవుట.
To Withhold v a to restrain; to keep back బిగబట్టుట, ఈడ్చిపట్టుట.he withheld payment చెల్లించక బిగబట్టినాడు. he withheld his favor from them వానికి వాండ్లయుందు దయతప్పిటనది. he withheld his assent to it దానికి వాడు వొప్పలేదు. the sun does not * his light యెండ బాగా కాస్తున్నది. when God *s rain దేవుడు వానను వెనక్కు యీడ్చి పట్టినప్పుడు.
To withstand v a to oppose ; to resist అడ్డగించుట, అడ్డపడుట, నిలుపుట. he was going there, but they withstood him వాడు పోబేతే వాండ్లు నిలిపినారు. I would have consented but he withstood me నేను వొప్పుదును గాని వాడు వద్దన్నాడు.
To Witness v a to see, to know, to attest చూచుట, ఎరుగుట,చేవ్రాలు వేసుట. they * ed the fight ఆ జగడమును కండ్లార చూచినారు. he * ed the bond ఆ పత్రమునకు వాడు సాక్షి చేవ్రాలు వేశినాడు. I call upon you to * this దీన్ని మీరు యెరిగి వుణ్నండి. * my hand Rangaya రంగయ్య యెరుగుదును, or రంగయ్య సాక్షి. * my hand, T. Munro మండ్రోగారి వ్రాలు, or మండ్రోగారి చేవ్రాలు.
To Wive v a to marry పెండ్లాడుట, వివాహము చేసుకొనుట. he is now *d వాడికి యిప్పు పెండ్లి అయినది ( ఈ మాట యిప్పుడు చెల్లదు.)
To Wonder v n to be astonished ఆశ్చర్యపడుట, వెరగుపడుట, విస్మయము పొందుట. I * where that is అది యెక్కడ వున్నదో. I * what you meant by telling him వాడితో పోయి యేమని చెప్పితివో. I * whose horse that is ఆ గుర్రము యెవరిదో, ఆ గుర్రము యెవరిదిగా వుండునో. I * you beat your wife నీ పెండ్లాన్ని నీవు కొట్టడము ఆశ్చర్యము. after you have behaved in this manner I should * if he was to come నీవు యిట్లా చేసిన తర్వాత వాడు వచ్చునా, వాడేమి వచ్చేదేమి. I * if the village he means was Kanchi వాడు చెప్పేది కంచియేమో, కంచికాబోలు. I should not * if they were to come వాండ్లు వచ్చేది వింత కాదు.
To Woo v a to court ; to sue in marriage ఉపసర్పించుట. they *ed him in vain వాండ్ల వుపసర్పణము వ్యర్థమైనది, వాడు వేడుకొన్నది పనికి రాకపోయినది. he *ed her for six months తన్ను పెండ్లాడమని ఆరునెలలు దాన్ని వుపసర్పించినాడు, బతిమాలు కొన్నాడు, వేడుకొన్నాడు. the infant *es him well ఆ బిడ్డ వాణ్నిబతిమాలు కొంటున్నది. the gentle gale that *es us here ఇక్కడ మన ప్రాణానికి హితముగా కొట్టే మందమారుతము.
To Wood v n to go for wood కట్టెలకు పోవు. "the girl wasacccidentally shot while wooding" ఆ పిల్ల కట్టెలకు పోతూవుండగా లటక్కున వొక గుండు వచ్చి తగిలినది.
To Word v a to express మాటలను ప్రయోగించుట, పదములను పెట్టుట. he *ed the letter severely ఆ జాబులో క్రూరమైన మాటలు ప్రయోగించినాడు. he has *ed it differently but the sense is the same మాటలు మాత్రం వేర పెట్టి వున్నవిగాని తాత్పర్యము అదే.
To Work v a to labour, to toil చేసుట, పనిచేసుట. these things *ed his ruin ఇందువల్ల వాడు చెడ్డాడు. this medicine at last *ed a cure తుదకు యీ మందు గుణ మిచ్చినది. the troops *ed their way through the hills ఆ దండుదాటినది. this *ed wonders for him ఇందువల్ల వానికి అయిన సహాయము యింతంత కాదు. to embroider కుట్టుట. she *ed the handkerchief with red silk ఆరుమాల గుడ్డను పట్టునూలుతో కుట్టినది, పూలు వేసినది. he *ed the bellows with a string కొలిమితిత్తిని దారముపట్టి ఆడించినాడు. he *ed the groove smooth with a flint పలకలో కట్టిన గీతను చెకుముకి రాతితో నునుపు చేసినాడు. he *ed his boat between these rocks వాని పడవను ఆ రాళ్ళ నడమ బహుజాగ్రత్తగా తీసుకొని పోయినాడు. he *ed out the sum ఆ లెక్కను వేశినాడు. he *ed up the picture admirably ఆ పటమును దివ్యముగా తీర్చినాడు. the poet has *ed this up admirably కవి దీన్ని దివ్యముగా వర్ణించినాడు. To Work, wurk, v. n. to be in action ఆడుట. in the the storm the ship *ed terribly ఆ గాలిలో వాడ అతలకుతల మైణది, నిండా తొందర పడ్డది. these scissors do not * easily యీ కత్తెర నిండా బిగువుగా వున్నది, యీ కత్తెర సుళువుగా ఆడదు. these people * at the anvil వీండ్లు కరమల పని చేస్తారు. to operate వ్యాపించలేదు. to ferment పొంగుట, పులుసుట. he let the liquor* for one day day ఆ కల్లును వొక దినమంతా పులియనిచ్ఛి నాడు. the sea *ed terribly సుమర్దములో అలలు నిండా అధికముగా వుండినది. all things * together for their good ఇవన్ని చేరి వాండ్లకు అనుకూలము చేస్తున్నది, ఇది అంతా వాండ్లకు అనుకూలమే. these words *ed upon him so that he went mad ఈ మాటలు వాడి మనసులో నాటినందున వాడు వెర్రివాడై పోయినాడు. he *ed himself up into a fury వాడు కోపము తెచ్చుకొన్నాడు. this lake * resembles a sea when *ed up by storms గాలికి అలలు కొట్టేటప్పుడ యీ చెరువు సముద్రములవలె ఉంటున్నది. ***** Rom. VIII. 28. A+ says మంగలంజనయంతి. A. సహకుర్వంతి C+. కూడా జరుగుతున్నవి. F+.
To Worm out v a మర్మమును భేదించుట, బైటతీసుట. he wormedout the secret వాడ మర్మను బైట తీశినాడు.
To Worry v a to trouble, to torment, to tear; to mangleతొందరపెట్టుట, ఆయాసపెట్టుట, చిందరవందరచేసుట, హింసచేసుట. the dogs worried the fox కుక్కలు ఆ నక్కను చిందర వందర చేశినవి. his creditiors worried him till he committed suicide అప్పులవాండ్ల తొందర పడలేక వాడు ప్రాణము విడిచినాడు. Worried adj. harassed కడగండ్లు పెట్టబడ్డ. the horse is worried by these flies యీ యీగలతచే ఆ గుర్రము నానాకడగండ్లు పడ్డది. Worrying adj. harassing తొందరపెట్టే, హింసించే, సంకటపెట్టే, a worrying task చీదరగా వుండే పని. Worse, adj. more bad మరీ చెడ్డ, మిక్కిలి చెడ్డ. he had alittle fever yesterday, he is * to-day వాడికి నిన్న కొంచెముజ్వరముగా వుండినది, నేడు మరీ అధికముగా వున్నది. what are you the * for that? అందువల్ల నీకేమి తొందర. he is none the * forthis ఇందువల్ల వాడికి కేమి తొందరలేదు, తక్కువలేదు. theseclothes are the * for wear ఈ గుడ్డలు కట్టి పాతగిలినవి. youare ten times * than him వానికంటె నీవు యేడాకులు యెగ చదివినవాడవు.
To Worship v a to honor, to adore పూజించుట. theyworshipped God దేవుణ్ని పూజించినారు.
To Worst v a to defeat ; to overthrow తోడ గొట్టుట,భంగపరుచుట.
To Wot v a to know (this word is not used ) ఎరుగుట,తలుసుకొనుట. * you what he did ? వాడు చేసినది నీకు తెలిసెనా,వాడు చేసినది చూస్తివా. God wot ! దేవునికి తెలుసును, అనగా నే నెరుగను. I * not నే నెరుగను. the matter you * of నీవు యెరిగిన ఆ సంగతి, అనగా బయిట చెప్పరాని పని. See Addison Tatler No. 15. page 3.
To Wound v a to hurt, to injure, గాయము చేసుట. this *edhis heart ఇందువల్ల వాని మనసుకు పుండైనది. this *ed his prideఇందువల్ల వాని గర్వమునకు హానియైనది.
To Wrangle v n to dispute peevishly పీకులాడుట, మల్లగుల్లాలుపడుట, పోరాడుట.
To Wrap v a to roll together చుట్టుట. he wrapped up theshawl శాలువను మడతపెట్టినాడు. he wrapped himself up in a shawlశాలువను కప్పుకొన్నాడు. when night wrapped up all things ప్రపంచము అంధకార గ్రస్తమైన తర్వాత. he wrapped up the meaning in obscure language అర్థము బయిటపడకుండా గూఢముగా మాట్లాడినాడు.
To Wreak v a to revenge, to execute తీర్చు కొనుట, కశిదీర్చుకొనుట, చలము దీర్చుకొనుట. the viper *ed his rage on the file ఆ పాము తన ఆగ్రహమును ఆకురాయిమీద చూపినది. as he could not catch her he *ed his rage upon her child ఆమెను వాడు పట్టుకోలేక పోయినందున ఆపె మీది ఆగ్రహమును ఆపె పిల్లమీద చూపినాడు, తీర్చుకొన్నాడు.
To Wreath v a to twist ; to encircle as a garland ; tocurl మేలిపెట్టుట, చుట్టుట, వడివేసుట, పెనుచుట.
To Wreck v a to break, to destroy ఛిన్నా భిన్నముచేసుట, బద్దలుచేసుట, పాడుచేసుట. the storm *ed the ship ఆ గాలివాన వాడను ఛిన్నా భిన్నము చేసినది. they *ed the house in searching for the property ఆ సొమ్మును వెతకడములో ఆ యింటిని తవ్వి పాడుచేసినారు.
To Wrench v a to take by force, to sprain, to strain పీకుట, పెరుకుట. he *ed the nail out of the wood ఆ మానికి కొట్టిన చీలను వూడ పెరికినాడు.
To Wrest v a to twist by violence పీకుట. లాగుట, గుంజుట.this commentary *s the sense of the word యీ వాఖ్యానములో యీమాటకు అపార్థము చేసినాడు. in doing this he *ed justiceన్యాయవిరుద్ధముగా దీన్ని చేసినాడు, దీన్ని అన్యాయముగా చేసినాడు. Wrest, n. s. distortion, twist మెలిపెట్టడము, బలాత్కారము.
To Wrestle, resle v n. to struggle పెనుగులాడుట పోరాడుట. helong *d with the miseries of of indigence వాడు కూటికిలేనిసంకటము చేత బహదినాలు తొందరపెడుతూ వుండెను.
To Wriggle v n to move to and fro ఇటు అటు ఆడుట, కదులుట, తుళ్ళుట. the fish *d on the hook ఆ చేప గాలములో తగులుకొని తుళ్లుతూ వుండినది. It seems to be sometimes used as an active verb : thus, in sawing you must keep the saw in the line without wriggling on either side * (Johnson) కోయడములో నూలుకు యివతల అవతల తొలగకుండా సరిగ్గా కోయవలసినది.
To Wring v a to twist, to squeeze ; to harass to torture మెలిబెట్టుట, పిండుట, పిడుచుట, బాధించుట, పీడించుట. as the cloth was wet he wrung it dry ఆ గుడ్డ తడిగా వుండినందున యెండడానికై పిడిచినాడు. he wrung my hand in grief వ్యసనము చేత నా చేతిని గట్టిగా పట్టుకొన్నాడు. he ran about wringing his hands చేతులు పిసుక్కొంటూ పరుగెత్తినాడు. thisnews wrung his heart యీ సమాచారమ వాని మనసుకు సంకటము చేసినది. ఆయాసము చేసినది. he wrung this evidence from them వాండ్ల నోట యీ మాటలు పలికించినాడు. the king began to find where the shoe did *him * (Lord Bacon in Johnson) రాజుకు యిప్పుడు కల్మషము తెలియవచ్చినది. రాజుకు యిప్పుడు యీ తొందరకు కారణము తెలియవచ్చినది.
To Wrinkle v a to cause folds ముడతలు పడేటట్టుచేసుట. whenage *d her face వృద్ధాప్యముచే దాని ముఖములో ముడతలు పడేటప్పటికి.
To Write v a to express in wirting, to indite వ్రాసుట,లిఖించుట. he worte a few verses వాడు కొన్ని పద్యములను చెప్పినాడు, రచించినాడు అల్లినాడు. they wrote off the sum వాండ్ల లెక్కలో యీ పద్దును కొట్టివేసినారు.
To Writhe v n to twist గిజగిజలాడుట, తుళ్ళుట, తన్నుకలాడుట,కొట్టుకాడుట. the worm *d on the hook ఆ గాలముమీది పురుగుగిజగిజలాడుతూ వుండినది. I chancer 1. 281, to Writhe a pin isto turn a screw మలుచుట్టును తిప్పుట.
To Wrong v a to injure అన్యాయము చేసుట. you * him in saying this అతణ్ని గురించి యీ మాట నీవు చెప్పడము అన్యాయము.
To Yawn v n gape, to open wide ఆవలించుట, నోరు వెడల్పుగా తెరచుట.
To Yean v a to bring forth, or bear young ఈసుట, ఇది గొర్రెలు వాటి గురించిన మాట.
To Yearn v n to feel pain నోచ్చుట. his bowels *ed for them వాండ్లను గురించి వాడికి కడుపులో నిండా వేదనగా వుండినది.
To Yell v n to make a howling noise అరచుట, బొబ్బలిడుట.
To Yelp v n to bark as a hound వేటకుక్క రీతిగా మొరుగుట.
To Yield v a and v.n. to produce కలగ చేసుట, ఫలింప చేసుట. to afford ఇచ్చుట. to concede or accede to ఒప్పుకొనుట, సమ్మతించుట. to give up విడుచుట. I *ed him the victory నేను అడ్డము లాడకుండా విడిచి పెట్టినాను, వొప్పుకొన్నాను. this tree *s no fruit యీ చెట్టు కాయదు. this country *s much rice యీ దేశములో వడ్లు నిండా పండుతున్నవి. he *ed up the ghost ప్రాణము విడిచినాడు, చచ్చినాడు. to submit లొంగుట, లోబడుట. if neither will *, the quarrel can never end ఇద్దరిలో వొకరు వొయిదొలగ కుంటే ఆ జగడము యెన్నటికీ తీరదు. he *ed to necessity కాలాను సారముగా చేసినాడు. he *ed to necessity కాలాను సారముగా చేసినాడు. he *ed to anger కోప పరవశు డాయెను. in beauty they must * to her అందములో వాండ్లు యీమెకు సరిపోల లేరు.
To Yoke v a to couple together కాడికి కట్టుట, జతచేసుట, జంటించుట, కూర్చుట. they are ill *d వాండ్ల యిద్దరికీ యిమడలేదు, పొసగ లేదు, సరిపడలేదు.
Toad n s గోదురు కప్ప, మండూకము, తిట్టడములో గొడ్డు, హరంజాదా.
Toadeater n s a mountebank's zany, who at his bidding, pretends toswallow toads; heance, a mean sycophant రోసుబడి.
Toadstool n s కుక్క గొడుగు.
Toady n s sycophant రోసుబడి.
Toadying adj రోసుబడియైన, క్షుద్రుడైన.
Toadyism n s Sycophancy రోమబడితనము.
Toast n s నిప్పున వాడ్చిన రొట్టె. * and water బొగ్గులాగు కాల్చిన రొట్టె నానవేశిన నీళ్లు, దీన్ని రోగులకు యిస్తారు.
Tobacco n s పొగాకు. * cake గుడాకు.
Tobacconist n s పొగాకు, పొడి, చుట్టలు మొదలైనవి అమ్మేవాడు.
To-Cavil v a దురాక్షేపణ చేసుట, పనికి మాలిన ఆక్షేపణ చేసుట, నెరుసులు వెతుకుట.
ToConcentre v a See To Concentrate.
Tocsin n s ( Cumming Apoe Sk. 70 ] An alarm bell : the ringing of abell for the purpose of alarm ( Webster ) యేదైనా ఆపద సంభవించినప్పుడుఅందరు భయపడి పరుగెత్తేటట్టు వాయించే గంట, గంటవాయించడమున్ను.
To-day v n adv. నేడు.
Toddler n s నడిచేవాడు, తప్పటడుగులు వేశే బిడ్డ, ఇది క్షుద్రమాట. Memoirs ofWilberforce, Vol. 5. 329.
Toddy n s కల్లు, మద్యము, సారాయి. to draw * కల్లు గీచుట. a * drawerఈండ్రవాడు. the toddy-bird గిజివాడు. ( See proof in Encycl. Brit. )
Toe కాలివేలు, the great * కాలి పెద్ద వేలు బొటనవ్రేలు. the little * కాలి చిటికినవేలు. from top to * ఆపాదమస్తకము, నిలువెల్లా. * rings చుట్లు, పిల్లాండ్లు,బొబ్బిలికాయలు.
Together, or Together with adv కూడా, సహితముగా, సమేతముగా, జతగా. theywent * వాండ్లు జతగా పోయినారు. to pound * కలియనూరుట. to tie * అంటగట్టు.this boy gave him more trouble than all the rest * కడమ అందరి తొందరవొకయెత్తు వీడి తొందర వొక యెత్తుగా వుండినది.
Toil v s శ్రమ, కష్టము, తొందర, పాటు, గాసి. one who lives by * కష్టముచేసుకొని బ్రతికేవాడు. *s or nets వల, వాగుర. or trap బోను.
Toilet n s a dressing table బట్టలు తొడుక్కొనే బల్ల. the * of the mouth ( aFrench phrase ) ముఖప్రక్షాళనము. the duties of the * బట్టలు తొడుక్కోవడము,శృంగారించుకోవడము.
Toilsome adj laborious శ్రమమైన, కష్టమైన, తొందరైన.
Token n s a sign గురుతు, ఆనవాలు, చిహ్నము. by this * this boy willcertainly die యీ గురుతువల్ల ఆ పిల్లకాయ సిద్ధముగా చస్తాడు. a piece of moneycurrent by sufferance, not coined by authority; this was formerly ofvery small value; but in modern times, for the convenience of change,it is of higher value. సాధారణముగా వర్తకులు మొదలైన వాండ్లు రూపాయికి మారేటట్టుగా యిచ్చే నోటువంటి వొక వస్తువు, ఇప్పట్లో యీ వాడుక లేదు.
Tolah n s ( the weight of one rupee ) రూపాయి యెత్తు.
Told past tense of the verbToTell చెప్పబడ్డ, these stories are * in theBharata యీ కథలు భారతములో చెప్పబడి యున్నవి. I was * by him వాడు నాతోచెప్పినాడు. I am told that he went there వాడు అక్కడికి పోయినాడట.
Toledo n s ఇది వొక వూరి పేరు, యీ వూళ్ళో చేసే ఖడ్గములు మహా శ్రేష్టమైనవిగనక. a * అనగా ఖడ్గము.
Tolerable adj that may be endured or borne తాళగూడిన, సహ్యమైన,పడగూడిన. not excellent పరిపాటిగా వుండే, మధ్యస్థమైన, సామాన్యముగా వుండే. thisis a * horse యీ గుర్రము కొంచెము వాసి. his hand-writing is * వాడి చేవ్రాలుఅంత చెడ్డది కాదు. he is in * health వాడికి వొళ్ళు కొంచెము వాసి. there isa * supply of water నీళ్ళు చాలీచాలములుగా వున్నవి.
Tolerably adv మట్టుగా, జబ్బుగా, కొద్దిగా, పరిపాటిగా. he is * skilful వాడుఅయినమట్టుకు గట్టివాడు. this old fort is * complete యీ పాత కోట అంతశిథిలమైనది కాదు, అంత జబ్బుగా వుండలేదు. this house is * large యీ యిల్లుఅంత పెద్దది కాదు. she is * fat అది అంత చిక్కి వుండలేదు, అది అంత లావాటిది కాదు.he is but * skilled in sanskrit వానికి సంస్కృతములో పాండిత్యము మట్టు, వానికిసంస్కృతము వచ్చీ రానట్టుగా వున్నది.
Tolerance n s act of enduring అన్యమత ద్వేషము లేమి, సహిష్ణుత, సహనము,శాంతము, వోర్పు, క్షమ.
Tolerant adj enduring, indulgent పరమత ద్వేషము లేని, అన్య మత ద్వేషములేని, సహిష్ణువైన, వోర్పు గల, శాంతమైన, సహించే, తాళే. the Musulmans werenot * the English are * తురకలకు పరమత ద్వేషము కలదు. ఇంగ్లీషు వారికి పరమతద్వేషము లేదు.
Toleration n s సహనము, తాళిమి వోర్పు, మతద్వేషము లేమి. he showed no *క్రూరుడై ప్రవర్తించినాడు. "Error in religion is the very ground and subject of* " మత విషయమందు వచ్చే పొరబాటే మతద్వేషము లేమికి కారణముగా నున్నువిషయముగా నున్ను, వున్నది అనగా మత విషయమమందు పొరబాటు వస్తే తాళుకోవడమేమతద్వేషము లేమి అవుతున్నది. ( Dr. Shipley in House of Lords 1776.)
Toll n s an excise of goods; సుంకము, హాసీలు, తీరువ. a seizure of somepart, for permission of the rest రుసుము, తరుగు. a * station or * gateసుంకపుచావడి. a particular sounding of a bell వొక విధమైన గంటానాదము, ధ్వని.
Tollbooth, Tolbooth n s. a place where goods are weighed toascertain the duties సుంకము నిర్ణయించేటందుకై సరుకులు తూచే చావడి.
Tollgatherer n s the officer that takes toll సుంకము తీసే బంట్రోతు.
Tomahawk n s ( an Indian hatchet ) గండ్ర గొడ్డలి.
Toman n s a coin worth ten rupees, used in Persia పది రూపాయలకు మారేపెరిషియా దేశపు వొక నాణెము.
Tomato n s a plant and its fruit, it is sometimes called theLoveapple సీమబుడ్డ బూసరకాయ, మొలక్కాయ, దీన్ని కర్పూరపు వంకాయ అనిన్నిసీమతక్కాళి అనిన్ని అంటారు.
Tomb n s గోరి, సమాధి, ప్రేతగృహము.
Tomboy n s a wild coarse girl మోటది, తుంటచిన్నది, ధూర్తురాలు.
Tombstone n s సమాధి మీద పాతిన రాయి.
Tomcat n s గండుపిల్లి.
Tome n s one volume of a book ఒక గ్రంథములో వొక సంపుటము, పుస్తకము,గ్రంథము.
Tomfool n s హాస్యగాడు.
Tomfoolery n s హాస్యము. this is mere * ఇది వట్టి వెర్రి, పిచ్చితనము. by thispiece of * he quarrelled with his father యీ వెర్రి పని చేత తండ్రికీ వాడికీకాకపోయినది. the tomfooleries of the Moharram అల్లాపండుగలో చేసే కోణంగిచేష్టలు.
To-morrow adv రేపు. the day after * యెల్లుండి.
Tomtit n s a small bird పిచ్చికవంటి వొక చిన్న పిట్ట.
Tomtom n s (an Indian word for a drum) తుడుము, తప్పెట, మేళము.
Ton n s the weight of 2240 pounds 2240 పౌనుల యెత్తు. a ship of sixhundred *s ఆర్నూరు టన్నుల బరువు మోసేవాడ. the prevailing fashion వాడిక,వాశి, సరసత, నాగరీకము. people of the * సరసులు.
Tone n s note sound స్వరము, నాదము, ధ్వని, స్వనము. manner రీతి, క్రమము.then they changed their * వేరే భావముగా మాట్లాడినారు, విరసముగా మాట్లాడినారు.his stomach has lost it's * వానికి ఆకలి మందగించి వున్నది. the medicinerestored the * of the stomach యీ మందు చేత యెప్పటివలె ఆకలి పుట్టినది.
Toned adj స్వనము గల, ధ్వనిగల. deep * గంభీర రవము గల. high * nobleఘనమైన.
Tongs n s పటకారు, నీరుకారు, శ్రావణము.

No comments:

Post a Comment