Monday, February 7, 2011

Tongue

Tongue n s నాలుక, జిహ్వ. the * of a bell గంటనాలికె. he held his *నోరెత్తలేదు, వొకటీ చెప్పలేదు. hold your * నోరు ముయ్యి. to give * నోరుచేసుకొనుట, నిండా అరుచుట, నిండా కూసుట. a trip of the * వాతప్పు. alanguage భాష. speech మాట. mother * స్వభాష. a foreign * అన్యభాష. doubletongued ద్విజిహ్యుడైన, కొంతసేపు యిట్లా కొంత సేపు అట్లా మాట్లాడే, నిలకడలేని,కపటియైన. smooth tongued కపటియైన.
Tonguetied adj అడుగున అంటుకొన్న కొన నాలుకగల, అట్లా అంటుకొన్నదాన్ని కోశి వేస్తే బాగా మాట్లాడుతారు .
Tonic, or stomachic n s. అజీర్ణమును కొట్టేముందు, ఆకలి పుట్టించే మందు.
To-night adv నేటిరాత్రి.
Tonjon n s a kind of litter borne by men నాలకీ.
Tonnage n s the weight of goods carried in a ship వాడసరుకు యొక్కబరువు, వొకవాడ పట్టే బరువు ఎక్కించే సరుకుకు యిచ్చే వాడ కూలి, కేవు. a dutypayable on goods per ton సుంకము, హాసీలు, టన్నుల యెత్తు మీద వాడ సరుకులకుతీసే సుంకము. vessels of small * కొద్ది వాడలు.
Tonsil, Tonsils n s. ( or almonds ) are two round glands, placed onthe sides of the basis of the tongue, under the common membrancesof the fauces జిహ్వా మూలమందు వుండే వొక విధమైన రెండు మాంస గ్రంధులు.
Tonsor n s a barber మంగళవాడు. ( ఇది యెగతాళిగా చెప్పే లాటిన్ శబ్దము.)
Tonsure n s చూడా మండనము, నణ్నెత్తి గొరిగించుకోవడము, ఇది కాతోలిక్కు పాదిరీలుఆచారము. he assumed the * పాదిరియైనాడు. a tonsured monk నడినెత్తిగొరుక్కొన్న కాతోలిక్కు సన్యాసి.
Too adv కూడా, సహితము, నిండా, అధికముగా, అతి, బహు, విస్తారముగా. he *went వాడున్ను పోయినాడు. he is * small to play with them వాండ్లతోఅట్లాడేటందుకు వీడికి యీడు చాలదు. he is * wise a man to say so అంతబుద్ధిమంతుడు యిట్లా అనునా. the child is * young to learn figures లెక్కలునేర్చుకొనే టందుకు యీ బిడ్డకు యీడు లేదు. we are * poor to but it అది యెక్కడమన మెక్కడ, దాన్ని మనము కొనలేము. you are * good to them నీవు అంత దయచేయరాదు. it is * little అది నిండా కొంచెముగా వున్నది. he eats * much వాడుఅమితముగా తింటాడు, అతి భోజనము చేస్తాడు. he sleeps * much అంత నిద్ర వాడికిమంచిది కాదు. he speaks with * much confidence వాడు అతి ధైర్యముతోమాట్లాడుతాడు, వాడు యింత సాహసముగా మాట్లాడరాదు. he came * late to see theplay ఆట మించిపోయిన తర్వాత వచ్చినాడు. it is * late సమయము మించిపోయినది.he went away * soon to finish this యిది ముగిశేంతలో పోయినాడు, యిదిముగియకమునుపే పోయినాడు. he died * soon to get the money ఆ రూకలువచ్చేంతలో చచ్చినాడు. it is * soon యింకా సమయము కాలేదు, యింకాసావకాశమున్నది. * soon he died వాడికి అకాలమరణము సంభవించినది.
Took past tense of the verb ToTake he*hisdinnerభోజనముచేసినాడు, he * leave సెలవు తిసుకొన్నాడు. See to Take.
Tool n s an instrument ఆయుధము, కొరముట్టు. carpenter's వడ్లవానిఆయుధములు. he is a mere * of the lawyers వీడు లాయరుల బంటు, లాయరులభృత్యుడు. am I a * of his నేను వాడు యెట్లా చెప్పితే అట్లా ఆడేవాణ్నా ?
Toon n s ( an Indian timber tree ) దూలములకు వుపయోగమయ్యే వొక చెట్టు.Haughton says నంది వృక్షము. which Sc. says is వటము.
Tooth n s పల్లు, రదనము, దంతము plu. Teeth పండ్లు. eye teeth కోరలు. thedouble teeth or jaw teeth దవడపండ్లు, పక్కపండ్లు. the first teeth or milkteeth పాలపండ్లు. to speak between the tenth నోరు బాగా తెరవకుండా పండ్లసందున కసిబిసుమని మాట్లాడుట. he is one who would steal the very teethout of your head యెటువంటి వాణ్నిన్ని నిమిషములో తన వలలో వేసుకొనేవాడు.can't you keep your tongue between your teeth ? నోరు మూసుకొని వూరికెవుండలేవా. the teeth of a saw ఝపము యొక్క పండ్లు. teeth of a key బీగముచెవి యొక్క కక్కులు. teeth of a wheel in a watch &c. గడియారము మొదలైనవాటిలో వుండే చక్రముల మీది నొక్కులు, కక్కులు, పండ్లు. he did his teeth వాడుగోముఖ వ్యాఘ్రముగా వున్నాడు. at last he showed his * తుదకు తన నిజస్వరూపమును బైట పెట్టినాడు. they flung this story in his teeth యీ సంగతివాని ముఖము ముందర తాకనాడినారు. I had the rain in my teeth the whole wayదోవకడాకు నాకు యెదురు వానే కొట్టినది. they cast this business in this teethయీ పనిని గురించి వాణ్ని దెప్పినారు యెత్తి పొడిచినారు. in the teeth of విరుద్ధముగా, అడ్డముగా, యెదురుగా. in the teeth of the wind గాలికి యెదురుగా. in the teeth of the law శాస్త్ర విరుద్ధముగా. he gave them the lie in their teeth మీరు చెప్పినది అబద్ధమని వాండ్ల ముఖము ముందర అన్నాడు. he paid it in spite of his teeth యెంత మనసు లేకపోయిన తుదకు చెల్లించినాడు. he sold the house in spiteof his teeth వానికి యెంత మనసు లేకపోయినా తుదకు ఆ యిల్లు అమ్మినాడు. theyfell upon him * and nail సర్వప్రయత్నముతో వాడి మీద పడ్డారు. he tried * andnail to find out the secret ఆ మర్మమును కనుక్కోవలెనని తన హరణభరణ శక్తిచూచినాడు. he was armed to the teeth సర్వాయుధ సన్నధ్ధుడైనాడు. she had asweet * for this ఆపె మనసు దానిమీద పారినది, ఆపెకు దాని మీద మనసుపోయినది.
Toothache n s పండ్లనొప్పి.
Toothdrawer n s a dentist దంతవైద్యుడు.
Toothed adj పండ్లుగల.
Toothless adj తొర్రియైన, బోసిగా వుండే. a * mouth బొక్కినోరు.
Toothpick n s పల్లుకుట్టుకొనే పుల్ల. a * case డబ్బి, బరిణె.
Toothsome adj pleasing to the taste మధురమైన, మాధుర్యమైన.
Top n s the highest part of any thing కొన, శిఖరము. the * of the treeవృక్షాగ్రము, చెట్టు యొక్క కొన. the * of the box పెట్టె మూత. the * of the headనణ్నెత్తి, మాడు, మాడు పట్టు. the * of the head నణ్నెత్తి, మాడు, మాడు పట్టు. the * of a hill పర్వత శిఖరము. the * of a bed మంచము మీది పందిలి. the * of acarriage బండి యొక్క పయి మూత. the * of a native palanqueen పన్నాగము.the * of a roof ఇంటి కొప్పు. the * stone మీది రాయి. they filled it to the *దాన్ని పైదాకా నిండించినారు. she looked at him from * to toe వాణ్ని యెగాదిగాచూచినది. they talked at the * of their voice పెద్ద గొంతు యెత్తి మాట్లాడినారు.on the * మీద, పైన. a toy బొంగరము.
Top sawyer n s కోయడములో రంపమును పైకి యీడ్చేవాడు వీడు మానులు కోసేపనిలో నిండా తెలివిగలలవాడుగా వుంటాడు గనక దీన్ని పట్టి వ్యక్తుడు, నిపుణుడు, గట్టివాడు మేస్త్రి అనే అర్థము వస్తున్నది.
Topaz n s a precious stone గోమేధికము, పీతాశ్మ, పుష్యరాగము.
Topful adv నిండా.
Topgallant n s వాడ స్తంభమునకు కట్టే మూడో చాప, వాడ స్తంభమునకు కట్టే మొదటిదిరెండోదిగాక మూడో చాప. the * mast వాడ స్తంభము యొక్క మూడో అతుకు. themainmast మొదటి స్తంభము, అడుగు స్తంభము. the top mast రెండో స్తంభము,మొదటిదానికి పై స్తంభము, పై అతుకు. the * mast మూడో స్తంభము, మూడో అతుకు.
Top-heavy adj having the upper part too weighty for the lowerఅడుగు దానికంటె పైది బరువుగా వుండే, తల బరువుగా వుండే. the cart is * it willtopple over యీ బండికి కొన బరువు అధికముగా వున్నది గనక దొల్లిపోను.
Tophet n s place of burning శ్మశానము, శిశుదహన పీఠము. hell నరకము.
Topic n s సంగతి, విషయము, కార్యము, ప్రమేయము. they spoke on this * fora long time యీ విషయమును గురించి నిండా సేపు మాట్లాడినారు. he entered onthis * యీ సంగతిని ప్రస్తాపము చేసినాడు. he changed the * వేరే ప్రస్తాపముయెత్తినాడు. this became the general * అందరు యిదే సంగతి మాట్లాడినారు.
Topical adj In surgical cant, local, not all over the body స్థానికమైన, ఒక ప్రదేశ సంబంధమైన. a * disease వొక అంగమందు వ్యాపించియుండే రోగము, దేహములో వొక ప్రదేశమందు వుండే రోగము. * applications ఆయా చోట పెట్టి కట్టినమందు. by means of * friction తదంగ మర్దనము చేత, యెక్కడ నొప్పో అక్కడరాచడము చేత.
Topically adv with application to some particular part యెక్కడ నొప్పోఅక్కడ, యెక్కడ రోగమో అక్కడ, ఆయా అవయవమందు.
Topknot n s శిఖ, కొప్పు.
Topmast n s వాడ స్తంభములో రెండో అతుకు; వాడ స్తంభములో అడుగు స్తంభము.the main mast అనబడుతున్నది, దానికి పైది the * అనబడుతున్నది.
Topmost adj the highest అన్నిటికంటె పైగా వుండే, మీదుగా వుండే.
Topographer n s స్థలవర్ణన చేసేవాడు, ఆయా దేశములను వర్ణించేవాడు.
Topography n s దేశా దేశముల యొక్క వివరణము, స్థలవర్ణనము, ప్రదేశ వృత్తాంతము.
Topped adj కొనగల, శిఖరముగల.
Topper n s a drinker తాగుబోతు.
Topping adj fine, noble ఘనమైన, దొడ్డ ( ఇప్పుడు యిది నీచ శబ్దమై పోయినది.)
Topsail n s రెండో చాప, వాడ స్తంభమునకు కట్టే రెండో చాప.
Topsyturvy adv తలకిందులుగా, అకటవికటముగా.
Torch n s దివిటీ, కాగడా, పంజు.
Torch-bearer n s దివిటీవాడు.
Torchlight n s దివిటీ వెలుతురు. this was performed by * ఇది దివిటీవెలుతురులో జరిగినది.
Tore past tense of the verb ToTear he*theletterupఆకాకితాన్నిచించివేసినాడు
Torment n s pain, torture బాధ, హింస, వేధ, ఉపద్రవము.
Tormented adj ఉపద్రవించబడ్డ, బాధించబడ్డ, వేధించబడ్డ.
Tormenting adj వేధించే, బాధించే నొప్పించే, ఆయాసపెట్టే.
Tormentor n s బాధ పెట్టేవాడు వేధించేవాడు, నొప్పించేవాడు.
Torn past participle of the verb toTear చించిన,చినిగిన, a * garmentచింపిగుడ్డ.
Tornado n s గాలివాన, గాలికసురు, ప్రచండమారుతము.
Torpeddo n s a fish that benumbs the hand by touch తాకితే చేతులకుతిమురుపట్టే వొక చేప, యీ చేపను తాకితే చేతులు మానైపోతవి.
Torpid adj numbered, not active, dull తిమురుబట్టిన, స్తబ్ధమైన, మందమైన. heis so * nothing can wake him వాడికి అంత మబ్బుగా వున్నందున దేనికిన్ని వాడికిమెళుకువ రాలేదు. the leg is * కాలు తిమురుగా వున్నది.
Torpidity, Torpor n s. numbness, dullness తిమరు, మాంద్యము, స్తబ్ధత,మబ్బు.
Torrent n s ప్రవాహము, వరద. a * of rain జడివాన. the rain fell in *s కుంభవర్షముగా కురిసినది. to weep in *s కన్నీరు మున్నీరుగా యేడ్చుట. a * of abuseశరపరంపరలుగా తిట్టిన తిట్లు, లక్షతిట్లు. the blood flowed in *s నెత్తురువెల్లువలైనది.
Torrid adj burning; violently hot ఉష్ణమైన, నిండా యెండగల. * heat మహత్తైనయెండ, బిర్రెండ, తీక్ష్ణమైన యెండ. * zone అధిక యెండగల భూమి.
Torso n s తల కాళ్ళు మొదలైనవి లేక భిన్నముగా వుండే విగ్రహము
Tortoise n s తాబేలు, కచ్చపము, కూర్మము. a land * దాసరి తాబేలు.
Tortoiseshell n s తాబేటి పెంకు, దీన్ని కచ్చుకడా అనిన్ని అంటారు.
Tortuosity n s crookedness వంకర, మెలికె.
Tortuous adj twisted; winding వంకరగా వుండే, మెలికెగా వుండే. mischievousకుటిలమైన.
Torture n s బాధ, హింస, వ్యధ, యాతన.
Torturing adj బాధించే, హింస పెట్టే, ఉపద్రవించే.
Tory n s one who adheres to the ancient constitution of the stateand the apostolical hierarchy of the Church of England: opposedto a whig. An advocate for royal power రాజపక్షపాతి పెద్దలదారే సరి అనేవాడు,పుర్వ సంప్రదాయము తప్పరాదనేవాడు, కొత్త కాలవ తవ్వరాదు పాత కాలవ పూడ్చ రాదనేవాడు.
Tossed, or Tost adj వేయబడ్డ, యెగరవేయబడ్డ, రువ్వబడ్డ. * aboutకలగూరగంపగా వుండే. tempest tost గాలికి కొట్టుకపోయిన.
Tosspot n s తాగుబోతు.
Total adj యావత్తు, సమస్తమైన, శుద్ధ కటిక. the * expense మొత్త వ్రయము. thesum * మొత్తము, వెరసి. * darkness నిండా చీకటి, శుద్ధ చీకటి. * eclipseపూర్ణగ్రహణము. * blindness వట్టి గుడ్డితనము.
Totally adv శుద్ధముగా, బొత్తిగా, వడసారముగా, వడారముగా, నెరియా. this is *wrong యిది అంతా తప్పు. these are * different బొత్తిగా యిది వేరు అది వేరు. itis * insufficient యిది యెంత మాత్రము చాలదు.
Tottering adj కదిలే, గెంటెసలాడే, అల్లాడే, నిలకడ లేకుండా వుండే. his health isin a * state వొళ్ళు వొక విధముగా వుండలేదు.
Toty n s ( an Indian word for a scavenger ) పెరటివాడు.
Toucan n s a bird రెండు ముక్కుల పిట్ట.
Touch n s స్పర్శ, తాకు. the act of touching తాకడము, ముట్టడము, అంటడము.soft to the * చేతికి మెత్తగా వుండే. he tried the gold by * ఆ బంగారును వొరసిచూచినాడు. * of gold వన్నె gold of five *es అయిదువన్నె బంగారు. he put thelast *es to the statue ఆ విగ్రహానికి జీవరేఖలు తీర్చినాడు. before he put thelast *es to this picture యీ పటానికి జీవరేఖలు కట్టక మునుపే. at a single *he broke the glass వొక మాటు తాకడములో ఆ చిప్పను పగలగొట్టి నాడు. he has a* of insanity వాడికి రవంత వెర్రి పట్టి వున్నది. వాడికి కొంచెము వెర్రికళలున్నవి.a * of nature ఈషద్వాంఛ, రవంత ఆశ.
Touched adj తాకిన, అంటిన, స్పర్శించిన. * with sorrow దుఃఖపడే.
Touch-hole n s తుపాకి చెవి, పిరంగి చెవి.
Touchiness n s peevishness ముంగోపము, చిరచిర, మండిపడడము, ముసురుమూతితనము.
Touching prep regarding, concerning గురించి. * that matter ఆ సంగతినిగురించి. * his having said this అతడు దీన్ని చెప్పిన దాన్ని గురించి.
Touchingly adv movingly వ్యసనకరముగా. he spoke very * regarding theirmisery వాండ్ల కడగండ్లను చెప్పడములో గుండెలు అవిశిపోయినవి.
Touchness n s బిర్రు, బిరుసు. from the * of the bambu వెదురుకర్రకొంచెములో వంగదు గనక.
Touchstone n s ఒరగల్లు, కషణోపలము. this grammar is the * of theirlearning యీ వ్యాకరణము వల్ల వాండ్ల విద్యా ప్రౌఢిమ తెలుస్తున్నది.
Touchwood n s చెకుముకిదూదివలె చూపిస్తే రగులుకొనే కొయ్య, పుప్పిపట్టిన కొయ్య.the tree is mere * ఆ చెట్టు బొత్తిగా పుప్పి పట్టి చెడిపోయినది.
Touchy adj easily hurt, peevish, irritable ముంగోపియైన, మండిపడే,రవంతలో రేగె. why should you be so * ? కాస్తకు కూస్తకు యెందుకు రేగుతావు.
Tough, tuf adj దృఢమైన, శక్తిగల, బిర్రుగా వుండే, కష్టమైన. a * bow వంచితేవంగని ధనుస్సు. copper is more * than lead సీసానికంటె రాగి గట్టి. steel ismore * than iron ఇనుము కంటె వుక్కు గట్టి. the bambu is * వెదురును వంచితేకొంచెములో వంగరు. a * job కష్టమైన పని. a * word కఠినమైన శబ్దము. the stonewas so * that he could not break it ఆ రాయి నిండా గట్టిది గనక వాడుపగలగొట్టలేక పోయినాడు. she is very *; she wont die this twenty years దానిదిగట్టి శరీరము యిరువై యేండ్లకు అది చావదు.
Toupet, or Toupee n s. అందానికి అంటించుకొనే వెంట్రుకలు ( యీ వాడుక యిప్పట్లోలేదు.)
Tour n s ramble సంచారము, తిరగడము, పరిభ్రమణము, ప్రయాణము. to make a* వేడుకగా అట్లా పోయి తిరిగి రావడము. I took a * to Canjeveram వేడుకగా కంచికిపోయివచ్చినాను.
Tourist n s వేడుకగా దేశము తిరగపోయినవాడు, దేశసంచారి.
Tourmaline n s ( a sort of gem ) తొవరమల్లి.
Tournament n s మృషామృధము, వేడుకకు చేసే యుద్ధము.
Tourney See Tournament
Tourniquet n s a bandage కట్టు, గాయము మీద కట్టే కట్టు.
Tow n s flax or hemp beaten and combed into a filamentoussubstance పీచు, జనపనార పీచు. we took her in * మా వాడకు ఆ వాడకు పగ్గముకట్టి మా వెంటనే యీడ్చుకొని వెళ్ళినాము.
Toward adj ready to do or learn, clever సమర్థమైన, పనికివచ్చే, పనుపడతగ్గ.docile విధేయమైన. a * child కాగలబిడ్డ, ముందుకు రాగలబిడ్డ.
Toward, Towards prep తట్టుకై, పక్కగా, దిక్కుగా, కూర్చి. reverence *s histeacher గురువుపట్లభక్తి. love *s her దాని మీది మోహము. draw the board *syou ఆ బల్లను నీ తట్టుకై యీడ్చుకో. *s the river యేటివైపుకు. look *s me నాపక్కగా చూడు. *s the north ఉత్తరముగా, ఉత్తరపు తట్టుకై. he went *s the rightకుడితట్టుగా వెళ్ళినాడు. *s morning తెల్లవారగట్ట, తెల్లవార వచ్చేటప్పటికి. he paid ten rupees *s that account ఆ లెక్కకు చెల్లుగా పది రూపాయలు చెల్లించినాడు. *s the thousand rupees three of his friends contributed six hundred వెయ్యిరూపాయలు కావడానకై వాని విహితులు ఆర్నూరు రూపాయలు యిచ్చినారు. *s me నాపక్కగా, నా పట్ల. they showed favour *s me నా పట్ల దయచేసినారు. *s theend of the month నెల అయ్యేటప్పటికి. *s understanding this ఇదితెలిశేటందుకు. with a view *s doing this యిది చేయడానకై. *s noonమధ్యాహ్నము కావచ్చేటప్పటికి.
Towardliness n s docility; compliance విధేయత, నమ్రత.
Towardly adj ready to do or learn కాగల, ముందుకు వచ్చే పనికి రాతగ్గ.
Towardness n s docility విధేయత, నమ్రత.
Towel n s తళువము, తుండుగుడ్డ. ( the word used is touaille pronouncedతువాలు. ) he rubbed them down with an oaken * వాండ్లను దుడ్డుకర్రతోబాదినాడు.
Towelling n s ముతక రేకు.
Tower n s a high edifice, citadel బురుజు, కోట. the * of a pagodaగోపురము. a certain prison in London లండను పట్టణములో వుండే వొక చెరశాల.
Towering adj lofty ఉన్నతమైన, పొడుగైన. a * imagination అత్యుత్ప్రేక్ష. he isa * character అతడు నిండా ఘనుడు. she was in a * fury దానికి అత్యాగ్రహమువచ్చినది, దానికి కోపము కొండలు గోపురాలుగా వచ్చినది.
Towery adj బురుజులుగల.
Towline n s a rope for pulling పడవను కట్టి యీడ్చే దారము.
Town n s పట్టణము, వూరు, గ్రామము. all the * know it వూరంతా యెరుగుదురు.a woman of the * బోగముది. she is on the * అది పడుచు కొని తింటున్నది.
Townbred adj నాగరీకముగల.
Townclerk n s గ్రామకరణము.
Townhall n s చావడి, రచ్చకూటము.
Townhouse n s చావడి, రచ్చకూటము.
Townly adj నాగరీకమైన.
Town-major n s కోటఅధికారి, కల్లేదారుడు.
Townsfolk n s గ్రామస్థులు, వూరివాండ్లు.
Township n s the district belonging to a town గ్రామకంఠము, అనగా ఆవూరి కింద చెందే పొలములు, ఆయకట్టు.
Townsman n s వూరివాడు. he is a * of mine, or we are townsmen వాడుమా వూరివాడు, నేను వాడు వొక వూరు.
Towntalk n s వూళ్ళో వుండే వదంతి, వుళ్ళో వాడుకొనే మాటలు.
Towrope n s దేన్నైనా కట్టి నీళ్ళలో యీడ్చే తాడు.
Toy n s అట్లాడుకొనే వస్తువు. tops, balls, dolls and other *s బొంగరములుచెండ్లు బొమ్మలు మొదలైన అట్లాడుకొనే వస్తువులు. a trifle, or trinket పిచ్చి సొమ్ము, గుల్లాగుట్ర. he wasted his money in mere *s పనికిమాలిన పిచ్చి సొమ్ములు కొని తన దుడ్డును పాడుచేసినాడు. or jewel నగ, సొమ్ము.
Toying n s ఆట్లాట.
Toyish adj trifling, wanton, idle, empty [ Baxter on Catechising,Chap XLVI. ] వ్యర్థమైన , నిరర్థకమైన, అల్పమైన. + In Asiatic Journal April 1816, Vol. 1. page 362, in a review ofPaul's Letters to his Kinsfolk; "We observe that Scott uses civilianin the sense of citizen or townsman; a barbarous Scotticism as we suppose, which is at least in genral use in our colonies. A civilian, is a professor of civil law: while the oppostion between the termssoldier and citizen is never mistaken in English. We have it thus even in Colman's modern ballad; Little thinks the townsman's wife, While at home she tarries, What must be the lass's life Who a soldier marries". Probably the term civilian , originally meaning Lawyer, is now misapplied to one in the un military service, just as the wordsశాస్త్రి and ఆచారి formerly limited, like Doctor, to men of learningare now used at random for men who read. Toyman, n. s. నగలు అమ్మేవాడు.
Toyshop n s నగల అంగడి.
Tp Shave v n గొరుక్కొనుట. he *s every day నిత్యము గొరుక్కొంటాడు,నిత్యము గొరిగించు కుంటాడు. they never * గడ్డము పెంచుతారు.
Trace n s mark, vestige జాడ, గురుతు, ఆనవాలు. *s of a carriage &cబండి మొదలైన వాటికి కట్టి గుర్రానికి రెండు పక్కలా తగిలించేవారు, పలుపు.
Tracery n s ornamental stone work చిత్రవిచిత్రమైన పని.
Tracings n s rafters వాసములు.
Track n s mark left upon the way by the foot or otherwise జాడ. hefollowed the * of their footsteps వాండ్లడుగుల జాడ పట్టుకొని పోయినాడు.
Trackless adj జాడ మాడలేని. a * forest దోవ డొంక లేని అడవి, అధ్వాన్నపుఅడవి.
Tract n s a small book చిన్న పుస్తకము. a religious book మత విషయమైనచిన్న గ్రంథము. a * of arable land కృషి చేసే పొలము. a * of country దేశము,కొంత భూమి, కొంత లెక్క భూమి.
Tractable adj manageable; docile సాధువైన, విధేయమైన this child is * ఇదినిండా విధేయమైన బిడ్డ, చెప్పినట్టు వినేబిడ్డ. a mad man is not * వెర్రివాడు చెప్పినట్టు వినడు, అస్వాధీనుడు.
Tractableness n s సాధుత్వము, సాధుభావము.
Trade n s traffick వర్తకము, వ్యాపారము, బేరము, కులకాయకము, వృత్తి. thepeople of the * ఆ వ్యాపారములో వుండేవాండ్లు. all the * resent this as aninjustice పంచాణము వాండ్లందరున్ను దీన్ని అన్యాయమంటారు. the poet's * కవి వృత్తి.the * of prostitution వేశ్యావృత్తి. he carried on the * of carousal and riotతాగితుళ్లి దుమికి నానారచ్చలు చేసే వ్యాపారములో వుండినాడు. or, bookseller'sbusiness పుస్తకాలమ్మే వ్యాపారము. the * of compliments స్తోత్రము చేసేవ్యాపరము. a jack of all *s పాట్లమారి.
Trader n s వర్తకుడు, వ్యాపారము చేసేవాడు.
Tradesfolk n s వర్తకులు.
Tradesman n s వర్తకుడు.
Trade-wind n s the monsoon; the periodical wind between thetropicks వాణిజ్యోపకారి వాయువు, భూమధ్యమందు కొట్టే వాయువు, ఆరేశి నెలలువొకేతట్టుగా కొట్టేగాలి, ఆయన వాయువు.
Tradition n s any thing delivered orally from age to age ఐతిహ్యము,పరంపరగా చెప్పుతూ వచ్చే సంగతి. Droz says ధారగా వచ్చే వ్యవహారము, మతము,రీతి, పరంపరాశ్రు తేతిహాసాదులు, పరంపరాగతధార, పరంపర్యము. * of pupils i.e.series of informants, Wilson Sankhya, page 191. శిష్యపరంపర. In 2Thes, II. 15. ఉపదేశము A+. In Mark VII. 13. ********* స్వప్రచారిత పరంపరాగతవాక్యము A+.
Traditional, Traditionary adj delivered orally from father to sonపెద్దలు చెప్పే, పరంపరాగతమైన, ఇతిహాసముగా వుండే, పరంపరాశ్రుతమైన, ప్రాచీనోక్తమైన, పురాణోక్తమైన.
Traditionally adv according to old stories పరంపరగా, ఐతిహ్యముగా. theArabs are * robbers అరబ్బీ దేశస్థులు అనాదిగా దొంగలు, పరంపరగా దొంగలు.
Traducer n s నిందకుడు, దుషకుడు, కొండెములు చెప్పేవాడు.
Traffick n s trade వర్తకము, వ్యాపారము, బేరము.
Tragacanth n s a gum ఒకబంక, నిర్యాసభేదము.
Tragedian n s శోకరస భరితమైన నాటక మాడేవాడు, వేషగాడు.
Tragedy n s a dramatick representation of a serious actionవ్యసనకరమైన నాటకము, శోకరసభరితమైన నాటకము. a dreadful act of eventఅఘోరమైనపని, మహోత్పాతము. Dorz says కరునా జనక నాటకము, ఖేదజనక యాత్ర. "Without ... a God regulating ... destiny, the history of the world wouldbe a mighty tragedy " ( Schlegel, in Elliot's Horae Apocalypt 4. 267. ) అఘోరకర్మము.
Tragic, Tragical adj mournful దుఃఖకరమైన, ప్రాణనాశకమైన, అఘోరమైన. a *event నిండా అఘోరమైన పని. a * end దుర్గతి, దుర్మరణము. he came to a * endi.e. he was murdered ఉరిదీయబడ్డాడు. a * poet వ్యసన రసముగల నాటకమునుచెప్పిన కవి.
Tragically adv sorrowfully, miserably దుఃఖముగా, దౌర్భాగ్యముగా.
Tragi-comedy n s a drama compounded of merry and serious eventsశోకరస శృంగార రసములు గల నాటకము. this business was quite a * ఇందులోయేడ్పుపనీ వున్నది, నవ్వేపనీ వున్నది.
Tragi-comical adj శోక రసశృంగార రసములు గల.
Trail n s track followed by the hunter జాడ, పోయినజాడ, గుర్తు.
Train n s the tail of a bird, or of gown తోక, జిరాడే వస్త్రము. retinueపరిజనము, పరివారము. * of artillery or * of guns పిరంగుల వరస. seriesక్రమము, వరస, శ్రేణి. matters are now in * ఇప్పుడు అంతా సిద్ధముగా వున్నది.
Trained adj మరబడ్డ, అలవరచబడ్డ, మరిగిన, సుశిక్షితమైన. the horse is well *యీ గుర్రము బాగా మరపడ్డది.
Train-oil n s చేప కొవ్వుతో చేసిన నూనె.
Trait n s a stroke; a touch గురుతు, చిహ్నము. this was a * offriendship ఇది స్నేహమునకు గురుతుగా వుండెను. this was a * of characterఇది వాని గుణమునకు గురుతుగా వుండెను, యిందువల్ల వాని గుణము తెలుస్తున్నది. thiswas a pleasing * ఇది సల్లక్షణము. In his letter I see no *s of anger వానిజాబులో కోప సూచకములు వొకటీ కానము.
Traitor n s one who being trusted betrays ద్రోహి, విశ్వాసఘాతకుడు,మోసగాడు.
Traitorous adj treacherous;perfidiousద్రోహియైన,మోసగాడైన,వంచకుడై
Traitorously adv ద్రోహముగా, వంచనగా.
Traitress n s ద్రోహియైన స్త్రీ.
Tram n s a kind of cart ఒక విధమైన బండి. a * road or * way యీ బండ్లుపోవడానకై కట్టిన యీనప దారి.
Trammelled adj surrounded by difficulties చిక్కులో బడ్డ, ఇబ్బందిలోచిక్కుకొన్న. those who are * by debt అప్పుల చేత సంకటపడే వాండ్లు.
Trammels n s a kind of shackles in which horses are taught to paceగుర్రానికి నడనేర్పడమునకై ముందు కాలికి వెనక్కాలికి కట్టే బంధము, చిక్కు, సంకటము,తొందర. used while milking a cow ఉరితాడు, he broke from the * of aclerical life వైదిక మనే పీకులాటను వదిలించుకొన్నాడు. It anciently was usedfor housings or horse cloths గుర్రము మీద శృంగారముగా వలవలె అళ్లికుచ్చులు కట్టి వేసే గుడ్డ.
Trance n s an exstasy; a state in which the soul seems to havepassed out of the body into celestial regions; or to be rapt into visionsపరవశత, ఆశ్చర్యము చేత గాని జ్ఞానన నిద్ర చేత గాని సంభవించే వితాకు. in a *పరవశుడై.
Tranquil adj శాంతమైన, నెమ్మదియైన.
Tranquillity n s నెమ్మది, శాంతము, ఉపశాంతము.
Transaction n s negotiation; dealing between man and man పని,కార్యము, వ్యవహారము, వ్యాపారము.
Transalpine adj lying or being beyond the Alps అల్ పను అనే కొండలకుఅవతలి. * Gaul ఆ కొండలకు ఆవల వుండే వొక దేశము పేరు.
Transamigration n s వేరే జన్మ మెత్తడము, దేశాంతరమునకు పోవడము.
Transcendent adj supremely excellent అతిశయమైన, సర్వోత్కృష్టమైన,మహనీయమైన.
Transcendental adj supereminent శ్రేష్టమైన, సర్వోత్కృష్టమైన. the * systemసాంసిద్ధికము. ( See proof in Wilson on Sankhya p. 141 ) andAsiatic Journal Spetember 1883 p. 42.
Transcendently adv అతిశయముగా, సర్వోత్కృష్టముగా, మహనీయముగా.
Transcriber n s ఒకటిని చూచు యెత్తి వ్రాశేవాడు, ప్రతి వ్రాశేవాడు.
Transcript n s ప్రతి, పుత్రిక.
Transcription n s ఎత్తి వ్రాయడము, ప్రతి వ్రాయడము, పుత్రిక వ్రాయడము.
Transfer n s a delivery of property to another మరి వొకని పరముచేయడము, మరి వొకని పేరిట చేయడము. after this * యీ సొత్తును అతని పేరిటచేసిన తర్వాత.
Transfiguration n s change of form మారురూపు, వేషము మారడము,రూపాంతరము. C+. అవతారము. A+ says ముర్త్యంతరము.
Transfigured adj మారు రూపును ధరించిన, రూపాంతరమును వహించిన. C+. A+.says మూర్త్యంతర ధృతవాన్.
Transfixed adj literally, pierced through ఈ తట్టు నుంచి ఆ తట్టుకు దూసిన.horrow-struck ఆశ్చర్యపడ్డ వితాకుపడ్డ, మాన్పడ్డ. * with amazementఆశ్చర్యము చేత మానై నిలచిన. she stood * నిశ్చేష్టితురాలై వుండెను.
Transformation n s a change of shape మారురూపు, రూపాంతరము.
Transformed adj మారురూపు అయిన, రూపాంతరముగల. Ravana was * intothe shape of a hermit రావణుడు ఋషి ఆకారమును ధరించినాడు.
Transfused adj పోశిన, వొకట్లో నుంచి వొకట్లో పోశిన, పాత్రాంతరము చేయబడ్డ.
Transfusion n s పాత్రాంతరము చేయడము, వొకట్లో నుంచి మరి వొకట్లో పోయడము.
Transgression n s violation of a law తప్పు, ద్రోహము, నేరము, దోషము,ఉల్లంఘనము. (A+.) అతర్కణము, అతిక్రమము.
Transgressor n s an offender నేరస్థుడు, ద్రోహి, అతిక్రమము చేసినవాడు. InJames II. 11. ఆజ్ఞోల్లంఘి. A+.
Transient adj momentary; not lasting నిలకడలేని, అస్థిరమైన, అశాశ్వతమైన,క్షణభంగురమైన.
Transiently adv అశాశ్వతముగా, అస్థిరముగా. he was * grieved at thisఇందున గురించి రవంత సేపు దుఃఖపడ్డాడు.
Transition orn s. passing మారడము అవస్థాంతరమును పొందడము. rust is the* state between metal and earth తప్పు లోహమునకున్ను మృత్తుకున్నుమధ్యావస్థగా వుంటున్నది. Sanscrit words by an easy * become Hindustaniసంస్కృత శబ్దములను కొంచెము మార్చడము వల్ల సులభముగా హిందుస్తాని శబ్దములుఅయిపోతవి. after his * into a merchant వాడు వర్తకుడు అయిన తర్వాత.
Transitive adj సకర్మకమైన. a * verb సకర్మకక్రియ.
Transitorily adv with short continuance అస్థిరముగా. he was * pleasedat this ఇందున గురించి రవంత సేపు సంతోషముగా వుండినాడు.
Transitory adj speedily vanishing అస్థిరమైన, అశాశ్వతమైన, చంచలమైన,నిలకడలేని. here every thing is * and imperfect ఇహమందు అన్నిన్నిఅశాశ్వతములు, అపూర్ణములు.
Translateable adj భాషాంతరము చేయగూడిన.
Translation n s భాషాంతరము. what is the * of this word ? యీ మాటకుఅర్థ మేమి. I want the English * of this word ఇందుకు ఇంగ్లిషు యేమి. ordecease; as of Enoch అంతర్ధానము, అంతర్ధానమై పోవడము. A+. జీవన్ముక్తుడుకావడము, సశరీరస్వర్గి కావడము.
Translator n s భాషాంతరము చేశేవాడు.
Translucency n s స్ఫటికాదుల యందలి స్వచ్ఛత. from the * of glassఅద్దమును అడ్డముగా పట్టితే అవతలి వస్తువు తెలుస్తున్నది గనక.
Translucent adj transparent స్పటికము వలె స్వచ్ఛమైన.
Transmarine adj సముద్రమునకు అవతలి గట్టున వుండే దేశాంతరమందుండే. *goods వాడ సరుకులు.
Transmission n s sending పంపడము. after the * of these letters యీజాబులను పంపిన తర్వాత.
Transmogrified adj changed in appearance మారు రూపును ధరించిన,వికారమైన. ( ఇది నీచ శబ్దము. )
Transmutation n s change మారడము. * of metals రసవాదము.
Transmuted adj changed మార్చబడ్డ, మారు రూపైన.
Transom n s beam over a door గడపపై అడ్డ కమ్మి.
Transparency n s clearness స్ఫటికాదుల యందలి స్వచ్ఛత. from the * ofthe water ఆ జలము నిమ్మల మైనది గనక.
Transparent, Transparently adj స్వచ్ఛమైన, నిర్మలమైన అనగా స్ఫటికాదులవలె స్వచ్ఛమైన. glass is * అద్దాన్ని అడ్డము పెట్టుకొని చూస్తే అవతలి వస్తువుతెలుస్తున్నది. the wings of the dragon fly are * తూనీగల రెక్కలు అద్దాలవలెవుంటవి. a * petticoat అవయవాంగములు తెలిసే బట్ట. he thinks the device acunning one, but it is quite * యిదేమో మహా మర్మమైన యుక్తి యని అనుకొన్నాడుగాని బాగా బట్టబయిలుగానే వున్నది. he is a * man వాడు నిష్కల్మషమైన వాడు. aruby set transparently యీ తట్టు చూస్తే ఆ తట్టు కండ్లబడేటట్టుగా కట్టిన కెంపు.
Transpierced adj దూసిన. his heart was * at these words యీ మాటలతోవాడి గుండెలు పగిలినవి.
Transplantation n s removal of a tree or plant నాటడము, పీకి నాటడము.of corn వూడుపు, నాట్నము.
Transport n s extasy ఆనందము, పరవశత. also a criminal దేశాంతరమునకుపంపబడ్డి కయిది. ( Johnson ) a ship for carrying troops &c. వాడ a sort ofcarriage బండి.
Transportation n s carrying తీసుకొనిపోవడము. before the * of thesegoods యీ సరుకులను తీసుకొని పోవడానకు ముందు. as a felon దేశాంతరమునకుతీసుకొని పోవడము. a sentence of * దేశాంతరమునకు పంపేటట్టుగా చేసిన తీర్పు.
Transported adj తీసుకొనిపోబడ్డ. * convicts నీళ్ళ మీదికి పంపబడ్డ కైదీలు. * with joy or sorrow ఆనందభరితుడైన, పరవశడుడైన, మెయిమరచిన. he was * withastonishment ఆశ్చర్యము చేత మెయిమరచినాడు.
Transporting adj astonishing అత్యాశ్చర్యకరమైన, అత్యానందకరమైన. * joyమెయిమరచేటట్టు చేశే ఆనందము.
Transposition n s ఇక్కడిది తీశి అక్కడ అక్కడిది తీశి యిక్కడ పెట్టడము,మార్చడము. by * of the letters instead of form they printed from అక్షరాలుముందు వెనక పడడము వల్ల యీ మాటకు ఆ మాట పెట్టినారు.
Transubstantitaion n s change of substance ఒక వస్తువు వేరే వస్తువుకావడము. In the Roman Catholic theology, the supposed conversion ofthe bread and wine in the eucharist into the body and blood of Christకాతలిక్కు మత ప్రకారము రొట్టె మాంసము కావడము. See Gibbon ( IX. 112 note ) "The learned Selden has given the history of * in a comprehensive andpithy sentence.....This opinion is only rhetoric turned into logic---" Selden's Table Talk.
Transverse adj being in a cross direction అడ్డముగా వుండే. the viper ismarked with * black lines కట్లపాముకు నల్లని అడ్డగీట్లు వుంటవి. the elephant'strunk has * wrinkles యేనుగ తొండములో అడ్డముడతలు వున్నవి.
Trap n s బోను. an elephant * వారి. tiger * పెద్దపులిమీటు. he fell into her *దాని మాయలో బడ్డాడు, *s or kit ( a vulgar word much used at present )సామాను. Trap, a species of rock నాపరాతి భేదము.
Trapdoor n s a door in a floor, which shuts close like a valveనేలతలుపు, అనగా నేల మాశిగతలుపు, గోపురములో వొక అంతస్తులో నుంచి మరియొకఅంతస్తుకు పొయ్యే దారికి మూత వలె వేశే తలుపు, వీధులలో జలదారలు మొదలైన వాటిమూత.
Trapes n s a slut తొత్తు.
Trapped adj caught in a trap బోనులోబడ్డ, బోనులో చిక్కిన. ornamentedశృంగారించిన.
Trappings n s ornament of horses or elephants గుర్రములు యేనుగులు వీటిమిద వేశే శృంగారమైన బట్ట, వూరేగింపుకు ముందుర వచ్చే గుర్రాల మీద వలవలెఅళ్ళికుచ్చులు కట్టి శృంగారముగా వేశే గుడ్డ.
Trapstick n s a stick used by boys at some games పిల్లకాయలు వొకఆటలో వుపయోగించే కొయ్య.
Trash n s any thing worthless పనికిమాలిన వస్తువు, కుప్పాకూళము,తుక్కాముక్క. these books are mere * ఇవి వట్టి పనికిమాలిన కాయా గడుసుతినబోకు. indigo * నీలిఆకు పిప్పి. sugar cane * చెరుకు పిప్పి.
Trashy adj worthless; useless పనికిమాలిన, కుప్పా కూళముగా వుండే,తుక్కాముక్కగా వుండే.
Trasit n s passage, passing పోవడము, దాటిపోవడము. during the * ofthese goods యీ సరుకులు దాటిపోతూ వుండగా. * duties దాటిపొయ్యే సరుకులకుతీశే సుంకము. during their * through Egypt వాండ్లు ఇజిప్టు దేశమును దాటగా. the* of a planet across the sun's disk వొక గ్రహము సూర్య బింబమును దాటడము.the time of * సంక్రమణ కాలము.
Travail n s ప్రసవ వేదన.
Travancore n s ( Quilon ) name of a country కొల్లము, మళయాళము.
Travel n s దుఃఖము, శ్రమము. Travels, plural దేశాంతరము పోవడము, యాత్రయాత్ర సంగతులు. Bruce's *s బ్రూసనేవాడు వెళ్ళి ఆయా దేశములను చూచి వ్రాశినచరిత్ర. *s to Benares కాశీయాత్ర.
Traveller n s దేశాంతరము పొయ్యేవాడు, బాటసారి, పథికుడు, దేశము తిరిగేవాడు. heis a great * వాడు బహు దేశములు తిరిగినవాడు. or merchant's servant వర్తకులమనిషిగా దేశము తిరిగేవాడు.
Travelling adj దేశము, తిరిగే, వూరూరు తిరిగే, సంచారము చేసే. a * tinkerబయిటి కమ్మరవాడు.
Traverse adv crosswise అడ్డముగా.
Travesty n s a burlesque performance హాస్యకావ్యము, వొకగొప్ప కావ్యమునకుపటాంతరముగా హాస్యముగా చెప్పిన కావ్యము.
Tray n s తట్ట, తబుకు. name of a dog కుక్కకు వొక పేరు.
Treacherously adv ద్రోహముగా, వంచనగా.
Treacherousness n s ద్రోహము, వంచన.
Treachery n s ద్రోహము, విశ్వాస ఘాతకము, మోసము.
Treacle n s పాగు, బెల్లపుపాగు.
Tread n s footing అడుగు. walking నడ. I heard the * of soldiersసిపాయీలు వేశే అడుగుల చప్పుడు విన్నాను. she who has the graceful * of anelephant గజగామిని.
Treadle, Treadless n s. a part of an engine on which the feet act toput it in motion గుడ్డలు నేశేవాడు కాలితో అణిచేటిది.
Treadmill n s a mill worked by persons treading on steps upon theperiphery of a wide horizontal wheel. It is used chiefly as a means ofprison discipline తొక్కడమువల్ల తిరిగే యంత్ర విశేషము చెరశాలలో దొంగలకు యిట్లాతొక్కే ప్రాణసంకటమైన పని పెట్టుతారు, దీన్ని యాతనాచక్ర మనవచ్చును.
Treason n s the highest crime againt a state; violation of allegianceద్రోహము, రాజ ద్రోహము, స్వామి ద్రోహము. high * రాజును చంపేటందుకు చేసే యత్నము. petit * బర్తృ ద్రోహము, యజమాన ద్రోహము. "If a British subject"is found in arms or in a hostile manner" aiding and assisting aforeign power against his " own country he can be brought to trial for" High Treason " Lord John Russell's Letter of 18th Dec. 1846.
Treasonable adj ద్రోహమైన. he wrote a * letter రాజ్యాంగానికి విరోధమైన వొకజాబు వ్రాసినాడు.
Treasure n s wealth accumulated, riches : something valued ధనము,ద్రవ్యము. కూడబెట్టిన ధనము, ఐశ్వర్యము. or store, treasury కోశము, భాండాగారము, బొక్కసము. In Mw. XII. 35. A+ says భాండాగారము. * chest హుండి.
Treasurer n s కోశాధ్యక్షుడు, బొక్కసగాడు.
Treasury n s కోశము, భాండాగారము, బొక్కసము. a book called the * of witచమత్కారమంజరి. that commentary is a * of learning ఆ వ్యాఖ్యానమువిద్యానిధిగా వున్నది. first lord of the * రాజ మంత్రులలో నొకడు, ప్రధాని.
Treat n s an entertainment విందు. this was a great * to them ఇదివాండ్లకు నిండా ఆనందముగా వుండినది.
Treated adj నడిపించబడ్డ, విచారించబడ్డ, జరిగించబడ్డ. those who are * by theking రాజుతో సమపఙ్తిగా భోజనము చేశేవాండ్లు. those who are * ill అవమానమునుపొందినవాండ్లు. those who are * well సన్మానమును పొందినవాండ్లు. those whowere * to cakes ఫలాహారము దొరికినవాండ్లు. he who was * to a kiss ముద్దుచిక్కినవాడు.
Treatise n s a tract; a written composition on a particular subjectచిన్న పుస్తకము, గ్రంథము, ప్రబంధము. scientific * శాస్త్ర గ్రంథము. a * on music సంగీత రత్నాకరము. a * on prosody వృత్తరత్నాకరము. a medical * వైద్య గ్రంథము.
Treatment n s manner of using; good or bad behaviour towardనడిపించడము, జరిగించడము, విచారణ, విచారించడము, వ్యవహారము. favourable *ఉపచరణ, ఆదరణ. gentle * తిన్నగా నడిపించడము. cruel * క్రౌర్యముగా నడిపించడము.his * of his servants is shameful వాడు తన నవుకర్లను గురించి నడిపించేది నిండాఅన్యాయముగా వున్నది. from his * of this question I see that he is alogician యీ విషయమును గురించి వాడు వ్రాశినదాన్ని చూస్తే తార్కికుడువలె అగుపడుతున్నది. manner of applying medicine చికిత్స వైద్యము. he describedthe doctor's * of this case యీ విషయములో వైద్యుడు చేసిన చికిత్సను వివరించిచెప్పినాడు.
Treaty n s negotiation సంధి, సమాధానము, సమాధాన పత్రిక, ఒడంబడిక.
Treble adj sharp of sound. ( A musical term ) అనుదాత్తస్వరము,పంచమస్వరము. threefold మూడింతలు. * gilt బంగారు మూడు పూతలు పూసిన.
Trebled adj మూడింతలైన.
Trebly adv మూడింతలుగా, అతిశయముగా.
Tree n s చెట్టు, మాను, వృక్షము.
Trefoil n s ఒక విధమైన గడ్డి, యిది మూడాకులు గలిగి బంగి ఆకురీతిగా వుంటున్నది.
Trellice, Trellis n s. పాకుడు, పందిలి, తీగెలు పారడానకు పెట్టే తడక.

No comments:

Post a Comment