To Truck v. a. to give in exchange సాటా కోటి బేరము చేసుట, వొక సరుకును యిచ్చి దానికి ప్రతిగా మరి వొక సరుకును తీసుకొనుట, he *ed the cloth for riceగుడ్డను యిచ్చి దానికి ప్రతి బియ్యము తీసుకొన్నాడు.
To Truckle v n to act meanly లోబడి యుండుట, లోనై యుండుట.
To Trudge v n to jog on heavily, to labour నడుచుట, ఇది నడవడమునుగురించి తిరస్కారమైన మాట. you must * నీవు లేచిపో.
To Trump up v a to support by empty pretence కట్టి విడుచుట. they *edup a story about him వాణ్ని గురించి వొక కథ కట్టి విడిచినారు. a *ed up storyకట్టివిడిచిన కథ, కల్పించిన కథ.
To Trumpet v a తుత్తారవూదుట, ప్రకటన చేసుట, చాటించుట. they *ed hispraise వాని ఖ్యాతిని ప్రచురము చేసినారు. they *ed this abroad దీన్ని ప్రకటనచేసినారు.
To Trundle v a to make it run దొల్లించుట. he *d the barrow ఒంటి చక్రపుచెయి బండిని తోసుకొని పోయినాడు.
To Truss v a to pack up close together కట్టుట. to * up వురిదీసి చంపుట.
To Trust v a నమ్ముట, విశ్వసించుట. if he tells lies will they * him ? వాడుఅబద్ధీకుడైతే వాణ్ని నమ్ముదురా. I * in God that he will deliver me నన్నురక్షించునని దేవుణ్ని నమ్ముకొని వున్నాను. * me, you are mistaken నా మాట నమ్మునీవు తప్పినావు.
To Try v a to examine; to make experiment of శోధన చూచుట. toexperience; to assay పరిక్షించుట. he tried the gold on a touch stoneబంగారును వొరిశి చూచినాడు. on trying his feet he found he could not standనిలవబోతే నిలవలేక పోయినాడు. the doctor tried this medicine in cases offever ఆ వైద్యుడు యీ మందును జ్వరాలకు యిచ్చి పరిక్ష చూచి వున్నాడు. to examineas a judge విచారణ చేసుట, విమర్శ చేసుట, పరిశీలన చేసుట. he tried theprisoners for murder ఖూనిని గురించి కయిదీలను విచారణ చేసినాడు. this roadtried a horse much యీ దారి కష్టమైనందున గుర్రానికి నిండా తొందర అవుతున్నది.this weather tries health యీ కాలము దేహానికి నిండా తొందరను కలగచేస్తున్నది.this small type tries the eyes to read manuscripts written on palmleaves దృష్టి తాటాకు మీద మోపుగా వున్నది, అనగా తాటాకు మీది అక్షరాలు చదవడముకండ్లకు వుపద్రవముగా వుంటున్నది. this climate tries the constitution muchయీ భూమి వొంటికి కాలేదు. will you * this dish ? దీన్ని తిని చూస్తావా. will you * a cheroot ? చుట్ట తాగుతావా. he tried his hand at poetry కవనముచేయయత్నపడ్డాడు, తన చేత అవుతున్నదో కాదో అని చూచినాడు.
To Tuck v a చెక్కుట, దోపుట, కూరుట. he *ed the handkerchief into hispocket రుమాలును జేబులో దోపుకొన్నాడు. she put the child to bed and *edthe clothes in బిడ్డను పండబెట్టి పక్కన గుడ్డలు దోపినది. to * in ( meaning togobble or eat; a low word ) గతుకుట, తినుట.
To Tug v a ఈడ్చుట, గుంజుట, లాగుట.
To Tumble v n దొర్లుట, దొర్లిపడుట, జారుట, జారిపడుట. the fishes weretumbling about in the pond గుంటలో చేపలు తుళ్ళుతూ వుండినవి. the childwas tumbling about in the bed ఆ బిడ్డ పడకలో పొర్లుతూ వుండినది. to * heelsover-head లాగులు వేసుట. they *d over the wall గోడ దుమికి లోనికి వచ్చిరి. to* as a buffoon దొమ్మరవాండ్లవలెలాగులు వేసుట.
To Tumefy v n ఉబ్బుట, వాచుట.
To Tup v n to cover, ( as a ram does ) పొట్టేలు యెక్కి చూలు చేసుట.
To Turn v a తిప్పుట, మళ్ళించుట. a very little will * the scales రవంతలోమొగ్గేటట్టు చేసును. this *ed the scale in his favour యిందు వల్ల అతనిపక్షమైనది. this *ed the scale against him యిందువల్ల వానికి చెరుపు అయినది.to * in a lathe తరిమెను బెట్టుట. he *ed the money to other purposes ఆరూకలను వేరే పనిలో వినియోగము చేసినాడు. he *ed this in his mind for threedays దీన్ని మూణ్నాళ్లు ఆలోచించినాడు. such witnesses can * black into whiteయిటువంటి సాక్షులు నలుపును తెలుపు చేయగలరు. he *ed the corner and ranaway ఆ మూల తిరిగి పారిపోయినాడు. he *ed a deaf ear to my advice నామాటను పెడచెవిన పెట్టినాడు. cutting wood with a razor will * it's edgeమంగల కత్తితో కొయ్యను కోస్తే మొండి అయిపోను. wine *s a man's head తాగడముచేత తల తిరుగుతున్నది, తెలివి తప్పుతున్నది. riches and pride will * a man'shead ధనము చేతనున్ను గర్వము చేతనున్ను మనిషి తెలివి తప్పుతున్నది. as soon as he *ed his mind to study వాడు చదువు మీద మనసు పెట్టగానే. this physic *ed his stomach యీ మందు చేత వాడికి వాంతి అయినది. they have now *ed the tables upon him వాడు చేసిన దానికి ప్రతి చేసినారు. he accused me, but I soon *ed the tables upon him నా మీద తప్పు పెట్టవచ్చినాడు, అయితే నేను దాన్ని తిప్పి వాడి తల మీద పెట్టినాను. he *ed his face aside ముఖము తిప్పుకొన్నాడు, మళ్లించుకొన్నాడు.he *ed them away వాండ్లను తోసివేసినాడు. he *ed them back వాండ్లను మళ్లించినాడు.they *ed their back upon him వాని ముఖము చూడకుండా వుండినారు. he *ed his handback చేతిని వెనక్కు తీసుకొన్నాడు. he *ed the leaf down ఆకును మడిచినాడు. he *ed the bag inside out ఆ సంచి లోతట్టును పైకి తిప్పినాడు. he *ed the cloth intomoney ఆ గుడ్డలను రూకలు చేసినాడు. he *ed this letter into ridicule యీజాబును యెగతాళి కింద పెట్టినాడు. he *ed the earth into several shapes ఆమట్టిని నానా ఆకారములుగా చేసినాడు, ఆ మట్టితో నానా రూపములు చేసినాడు. he *edthe poem into Telugu ఆ కావ్యమును తెనుగించినాడు. they *ed his words intoridicule వాడి మాటలను యెగతాళి కింద బెట్టినారు. he *ed off his servants తనపనివాండ్లను తోశివేసినాడు. he *ed off the subject వేరే ప్రస్తాపము యెత్తినాడు. he*ed them out of the house వాండ్లను యిల్లు వెళ్లగొట్టినాడు. he *ed the leafover ఆ పత్రాన్ని తిరగవేసినాడు. he *ed the money to his own purposes ఆ రూకలను తన పనిలో వినియోగపరచుకొన్నాడు. he *ed the money to advantage ఆ రూకలవల్ల లాభము కలిగేటట్టు చేసుకొన్నాడు. he *ed up his nose at this ఇందుకు అసహ్యపడ్డాడు, ముఖము చిట్లించినాడు, ధూత్ అన్నాడు.
To Tutor v a to instruct; to teach నేర్పుట. they gave their evidence asthey were *ed యెట్లా నేర్పబడ్డారో అట్లా సాక్షి పలికినారు.
To Twaddle v n to talk foolishly వెర్రివెర్రిగా మాట్లాడుట. or walk weaklyas an infant ( Wilberforce, Memoirs, chap. XXXIX ) దుర్బలముచేతతొట్రుపాటుగా నడుచుట.
To Twang v n ఝంకారము చేసుట, ఖంగుమని ధ్వనించుట. to * through thenose ముక్కుతో మాట్లాడుట.
To Twattle, or Tattle v n. to prate వదురుట, పేలుట.
To Tweak v a to pinch మెలిబెట్టుట.
To Tweedle v a చేతులతో యిటూ అటూ ఆడించుట. to tickle చక్కిలిగింతలుపెట్టుట.
To Twiddle v a to tickle చక్కిలి గింతలు పెట్టుట.
To Twine v a మెలిబెట్టుట, పేడుట, అల్లుట.
To Twinge v n నొచ్చుట, పోట్లోపొడుచుట, సళుపుట.
To Twinkle v n to sparkle to shine with intermitted light మిణుకుమిణుకుమనుట, తళతళమని మెరుసుట. to open and shut the eye by turns కండ్లార్చుట,కండ్లు మూశిమూశి తెరుచుట.
To Twire v n to peep తొంగి చూచుట.
To Twirl v a to turn round గిరగిరతిప్పుట.
To Twist v a పేడుట, మెలిబెట్టుట, పురిబెట్టుట, తాల్చుట.
To Twit v a to reproach నిందించుట, దూషించుట, గేలి చేసుట. it properlymeans to irritate రేచుట. he twitted then with falsehood వాండ్లుఅబద్ధాలాడినారనియెగతాళి చేసినాడు. twitted at these remarks she repliedsharply యీ మాటలకు రేగి నిండా కరుకుగా మాట్లాడినది.
To Twitch v a to pluck, to snatch, to twinge పెరుకుట, గుంజుట,లాగుట, మెలిపెట్టుట, నులుముట, కోసుట.
To Twitter v n కీచుకీచుమనుట.
To Tye v a to bind కట్టుట, See To Tie.
To Typify v a to show in embelm తెలియచేసుట బావేణ అగుపరచుట.
To Tyrannize v n to act with rigour క్రౌర్యము చేసుట, దౌర్జన్యము చేసుట.
To Ulcerate v a to make sore పుండు చేసుట ప్రణము చేసుట, పొక్కించుట.the hot water *d his hand వేణ్నీళ్లు తగిలి వానిచెయ్యి పొక్కినది, బొబ్బలు లేచినది.
To Unbar v a to open తెరుచుట.
To Unbend v a to set at ease, to slacken వదిలించుట, సడలించుట. to * ahow అల్లెను దించి విల్లును వదిలించుట. amusement *s the mind ఆట్లాడడము చేతమనసులోని వ్యాకులమునకు కొంచెము వోదార్పుగా వుంటున్నది.
To Unbind v a to loose; to unite విప్పుట, విడుచుట.
To Unbolt v a తెరుచుట, గడియతీసుట.
To Unbosom v a to reveal మనోభావమును చెప్పుట, కడుపులో మాటను చెప్పుట.he *ed himself to me తన మర్మమును నాతో చెప్పినాడు.
To Unbrace v a to loose; to relax వదిలించుట, సడలించుట. to * & a bowఅల్లెను దించుట.
To Unbuckle v a to loose from buckles విచ్చుట, విప్పుట.
To Unburden n a బరువును దించుట. they *ed the bullocks పెరకెలనుదించినారు. he *ed his heart మనసులో వుండే దుఃఖాన్ని వెల్ళబోసుకొన్నాడు.
To Unbutton v a విచ్చుట, విప్పుట.
To Uncase v a విచ్చుట, విప్పుట.
To Unchain v a విడుచుట, విప్పుట, గొలుసును వదిలించుట.
To Unchristianize v a ఖ్రిస్తు మతములో నుంచి తోసివేసుట.
To Unclench v a పిడికిలించిన చేతిని విచ్చుట, విడిపించుట.
To Unclose v a to open తెరుచుట.
To Uncoil v a చుట్టు విప్పుట. he *ed the rope ఆ తాడు చుట్టును విచ్చినాడు.when the snake *ed itself పాము చుట్టవిచ్చి బయిలుదేరగానే.
To Uncord v a to unbind విచ్చుట, కట్లువిచ్చుట.
To Uncouple v a to loose dogs from their couples, to set looseపెనవిచ్చుట, విడిచి పెట్టుట, విప్పి విడిచిపెట్టుట.
To Uncover v a to strip, to make naked, to remove any coveringfrom, బట్టలు విచ్చివేసుట, దిసమొలచేసుట, మూతతీసుట, తెరుచుట, ముసుకు తీసుట.when he *ed the dish మూత తీయ్యగానే. when he *ed her breast దానిపైతొలగ తీయగా.
To Uncreate v a వినాశనము చేసుట.
To Uncrown v a to dethrone రాజ్యభ్రష్ఠుణ్ని చేసుట. they *ed their king రాజుకు ప్రభుత్వము లేకుండా వెళ్లగొట్టినారు.
To Undam v a మడవయెత్తుట. after they *ed the pond ఆ గుంట కట్టను తొవ్వియెత్తి వేసిన తర్వాత.
To Undeceive v a to free from mistake భ్రమ నివారణము చేసుట, కల స్థితినితెలియ చేసుట. at last he *d them తుదకు వుండే నిజస్థితిని తెలియచేసినాడు. he *d me నిజస్థితిని తెలియచేసి నాకు వుండిన భ్రమ నివారణము చేసినాడు. let me * youవుండే వైఖరిని నీతో చెప్పుతున్నాను. this letter *d me యీ జాబు చేత నాకు దీయుట,కల స్థితి తెలిసినది.
To Undeify v a to reduce from the state of deity దేవత్వము లేకుండాచేసుట, పూజ్యత లేకుండా చేసుట, అగౌరవము చేసుట.
To Undergird v a to tie round the bottom అడుగున కట్టుట. they *ed theship ఆ వాడకు మొలతాడువలె వొక దారము వేసి కట్టినారు.
To Undergo v a to endure; to suffer సహించుట, పడుట. he under-wentgreat afflictions నిండా కడగండ్లు పడ్డాడు. the silk worm *es three changesపట్టుపురుగు మూడు అవస్థలను పొందుతున్నది. the house is undergoing repairs ఆయిల్లు మరమ్మతులో వున్నది.
To Underline v a to mark with a line below the words మాటల కిందగీతగూచుట, యీ మాటలను వొత్తి పలుకుతారు.
To Undermine v a to sap; to excavate beneath కింద తొవ్వుట, సురంగముచేసుట. they *d the wall ఆ గోడ పడేటట్టుగా కింద పల్లము తొవ్వినారు. the river *d the rock ఆ కొండ కూలేటట్టు ఆ యేరు కింద కోశివేసినది. grief *s the strengthవ్యసనము చేత బలము కుంగుతున్నది.
To Underrate v a to value very low తక్కువ వెల కట్టుట, అల్పముగావిచారించుట. they *d his power వానికి యింత బలము వుండినది వాండ్లకు తెలియకవుండినది. he *d the difficulties of the task ఆ పని యింత కష్టముగా వుండబోతున్నదని వాడికి తోచకుండా వుండినది.
To Underscore v a to underline, to draw a mark under అడుగున గురుతువేసుట, అడుగున గీత గీచుట.
To Undersell v a to sell the same articles at a lower price thananother merchant ఒకడి మీది పోటికి వెల తగ్గించి అమ్ముట, వూరి వెలకు నిండాతక్కువగా అమ్ముట.
To Understand v a తెలుసుకొనుట, గ్రహించుట. he *s English వానికి ఇంగ్లిషువచ్చును. he does not * accounts వానికి లెక్కలు రావు. I do not * thisbusiness ఆ పని నాకు తెలియదు, అది యెటిపనో నాకు తెలియదు. by this I * thathe will not come యిందువల్ల వాడు రాడని తోచినది. do you * me ? yes నీకుఅర్థమైనదా, అర్థమైనది. do you* me ? నేను చెప్పినది నీకు తెలిసినదా, నా మాటకునీకు అర్థమైనదా. I do not * your going there without permission నా సెలవులేక నీవు అక్కడికి పోవడము యెటువంటిది. I * that he is gone వాడు వెళ్ళినాడట. hegave them to * that he would complain against them మీ మీద ఫిరియాదుచేయబోతానని వాండ్లకు యెరుక చేసినాడు. in this verse we must * the wordking యీ శ్లోకములో రాజు అనే పేరును అధ్యాహారము చేసుకోవలసినది. here wemust * the nominative case యిక్కడ కర్తను తెచ్చుకోవలసినది, యిక్కడ కర్తభావిస్తున్నది. that word is understood, not expressed యిక్కడ ఆ శబ్ధముభావిస్తున్నది గాని కంఠరవేణ చెప్పబడలదు. By " Relations " I do not * hisbrothers బంధువులు అనే శబ్దము వున్న గాని అన్నదమ్ములని నాకు భావము కాలేదు.on understanding that he would pay the money I went away వాడు ఆరూకలు చెల్లిస్తాడని తెలిశినందు మీదట వెళ్ళిపోయినాను.
To Understate v a to state or represent less strongly than the truthwill bear నిజముగా వుండే బలాన్ని తగ్గించి చెప్పుట.
To Undertake v a to engage in పూనుకొనుట, ఉద్యోగించుట, పైనవేసుకొనుట.soon after he undertook the study of law వాడు ధర్మశాస్త్రముచదువుకోవడానకు పూనుకోగానే.
To Undervalue v a to rate, or estimate below the real worth, toesteem lightly, to despise తక్కువ వెలకట్టుట, స్వల్ప మతింపు వేయుట,అలక్ష్యపెట్టుట.
To Underwrite v a పూటబడుట, అనగా వాడకు నూటికి యింత అని తీసుకొని దానికిమోసము వస్తే ఆ నష్టమును యిస్తానని పూటబడేవాడు.
To Undo v a to loose or open విచ్చుట. she undid the knot ఆ ముడినివిచ్చినది. to ruin చెరుచుట. this undid him ఇది వాణ్ని చెరిచినది.
To Undress v a బట్టలను విచ్చివేసుట. Hughes says, in Spectator 91, end,The ladies undressed to go out. Perhaps this is a comic use of theword.
To Undulate v a to mope up and down; to wave అలలవలె కదులుట.
To Unearth v a to drive from the earth పెళ్ళగించుట.
To Unfasten v a to loose విప్పుట.
To Unfetter v a to free from bonds సంకెళ్ళు తీసివేయుట. they *ed himవాని సంకెళ్లు తీసివేసినారు.
To Unfit v a to disable అనర్హుణ్నిగా చేసుట, అయోగ్యుణ్నిగా చేసుట. hispride unfitted him for the duty వాడి గర్వము ఆ పనికి వాణ్ని అనర్హుణ్నిగా చేసినది.
To Unfix v a to loosen వూడదీయుట, విప్పుట, పెళ్ళగించుట. he *ed thepost ఆ గుంజను పెళ్ళగించినాడు.
To Unfold v a to expand; to spread out, to disclose విచ్చుట,వికసింపచేసుట, తెరుచుట, విశదపరుచుట, తెలియచేసుట.
To Unfurl v a to unfold; to expand; to open తెరుచుట, విచ్చుట.
To Unglue v a బంకతో అంటించిన దాన్ని వీడ్చుట.
To Ungrid v a to loose the waist band నడికట్టు విచ్చుట. then they *edతరువాత వాండ్లు నడికట్లు విచ్చినారు, బట్టలు తీశివేశినారు.
To Unhand v a to let go విడిచిపెట్టుట, పోనిచ్చుట. See To Release.
To Unhang v a ( to disfurnish) ఉత్తదిగా చేసుట. they unhung the house ఆ యింట్లో వుండే పటాల నంతా తీసి వుత్తదిగా చేసినారు.
To Unhinge v a to make useless భంగము చేసుట. this news completely*d his plans యీ సమాచారమువల్ల వాని యత్నము భంగమైపోయినది. I feel quite*d at present ప్రస్తుతము నాకు యెటూ తోచక యున్నది.
To Unhook v a to loose కొలికితీసుట, గొళ్ళెము తీసుట.
To Unhorse v a గుర్రము మీద నుంచి పడతోసుట. this blow *d him యీ దెబ్బవాణ్ని ఆ గుర్రము మీద నుంచి తోసినది.
To Unite v a to put together, to join సంధించుట, చేర్చుట, కలుపుట. he *dhis army with theirs తన దండును వాండ్ల దండుతో కూడా కలిపినాడు. when they *d their strength they succeeded వాండ్ల బలమునంతా కూడా చేర్చేటప్పటికిగెలిచినారు.
To Unkennel v a to drive from his hiding place దాగిన స్థలములో నుంచిబైటికి వెళ్ళగొట్టుట. they unkennelled the fox నక్క దాగి వుండిన స్థలములో నుంచివెళ్ళగొట్టినారు.
To Unknit v a to open, to loose విచ్చుట, విప్పుట.
To Unlace v a to loosen విచ్చుట, వీడ దీసుట.
To Unlade v a to make empty వాడ సామాను దించి వుత్తదిగా చేసుట, ఖాలీచేసుట.
To Unlearn v a to forsake విడిచిపెట్టుట. you must * those customs ఆమర్యాదలను మాను కోవలసినది.
To Unlink v a to loose, to unfasten వీడదీసుట, వీడ్చుట.
To Unload v a to empty సరుకులు దించి ఖాలీ చేసుట. when they *ed thecart బండి మీది సామాను దించేటప్పటికి he *ed his grief to me in these wordsయీ మాటలు చెప్పి వాడి దుఃఖమును నాతో వెళ్లబోసుకొన్నాడు.
To Unlock v a to lay open తాళము తీసుట. he *ed the box పెట్టె తెరిచినాడు.
To Unloose v a to open; to set free విచ్చుట. when he *d the cordదారమును విచ్చగానే. when he *d his tongue వాడు నోరు తెరిచి మాట్లాడేటప్పటికి.
To Unlute v a to open; to loose; to separate విప్పుట.
To Unmake v a to destroy హతము టసుట, పాడుచేసుట, చెరుపుట. he hathunmade himself by this act యీ పని చేసినందున తనకు తానే చెడ్డాడు.
To Unman v a to take away his courage ధైర్యమును పోగొట్టుట. this newsquite unmanned him యీ సమాచారము వల్ల వాడి ధైర్యము పోయినది.
To Unmask v a to lay open what is concealed బయిటపెట్టుట, కనుపరుచుట,అగుపరుచుట, చూపుట. at last he *ed himself తుదకు నిజరూపమునుఅగుపరచినాడు. he *ed their plot వాండ్ల కుట్రను బయిట పెట్టినాడు.
To Unmoor v a to loose a ship లంగరు తీసుట. they *ed the ship వాడలంగరు తీసినారు.
To Unmuffle v a to take a covering from the face మూత తీసుట, ముసుకుతీసుట, గవిసెన తీసుట.
To Unmuzzle v a to set the mouth free మూతి చిక్కమును తీసివేసుట. whenhe *d the dogs కుక్కల మూతి చిక్కములు తీశివేసినప్పుడు.
To Unnerve v a to weaken; to enfeeble దుర్బలము చేసుట. this newscompletely *d him యీ సమాచారము విని కుంగిపోయినాడు.
To Unorder v a ( an American word ) to forbid, countermand, todecline వద్దనుట, అక్కరలేదనుట.
To Unpack v a to open విచ్చుట, విప్పుట, మూట విప్పుట.
To Unpeople v. a. to ruin నిర్జనము చేసుట'నిర్మానుష్యముచేసుట
To Unpile v a to take down దించుట. they piled the shot, and then they*d it పిరంగి గుండ్లను పోగుగా పేర్చి మళ్ళీ ఆ పోగును వీడదీశినారు.
To Unpin v a to loose గుండు సూదులను తీశివేసుట, విచ్చుట. she unpinnedher dress తన వుడుపుకు గుచ్చి యుండిన గుండు సూదులను తీశివేసినది.
To Unqualify v a అనర్హుణ్నిగా చేసుట. his passioned tempter unqualifiedhim for the duty of a magistrate వాడు కోపిష్ఠి గనక పోలీసు పనికి అర్హుడుకాడు.
To Unravel v a to extricate; to clear వీడ్చుట, వీడదీయుట, విప్పుట. sheunravelled the cloth ఆ బట్టను పోగుపోగుగా వీడదీసినది. she unravelled thethread ఆ దారము చిక్కు తీసినది. he unravelled the difficulty or the secretఆ చిక్కుకు లేక, మర్మమును వీడదీశినాడు.
To Unriddle v a to solve or explain విడి కథను విప్పుట, వివరించుట,విశదపరచుట, మర్మమును భేదించుట.
To Unrig v a to strip of both standing and running rigging వాడ తాళ్ళుమొదలైన వాటిని విప్పి బోడిచేసుట. they unrigged the ship వాడ తాళ్ళు మొదలైనవాటిని విప్పి బోడిచేసినారు.
To Unrip v a to open by cutting కోశి తెరుచుట. he unripped the bed andfound the jewel in it ఆ మెత్తను కోస్తే దాంట్లో నగలు చిక్కినవి.
To Unrivet v a to loose from nails చీలలు వూడగొట్టి విచ్చుట.
To Unrobe v a to strip బట్టలను విప్పుట. when they *d the king రాజువుడుపులను విప్పి వేశేటప్పటికి.
To Unrol v a to open; to display చుట్ట విచ్చుట. when they unrolled theturban పాగా విచ్చేటప్పటికి.
To Unroof v a to take off the covering of a house ఇంటి పైకప్పునువిప్పుట.
To Unroot v a to tear up the roots పెళ్ళగించుట, వేరుతో పెరుకుట.
To Unsay v a to retract, to deny what he said మళ్ళీ తిప్పుకొనుట,చెప్పినదాన్ని లేదనుట.
To Unscrew v a to unfasten by turning the screws ఇస్కోలాండ్లనుతీశివిప్పుట, మలుచుట్లను తీశివిప్పుట.
To Unseal v a to open what is sealed ముద్ర తీశివిప్పుట. a bribe *ed hislips లంచము యిచ్చినందున బయిట పలికినాడు.
To Unseam v a to open కుట్లు విచ్చుట.
To Unsettle v a to disturb అల్లరి చేసుట, తొందర పెట్టు, కలవరపెట్టుట. this *dhim entirely యిందువల్ల వాడు చెడుకలవరములో బడ్డాడు.
To Unsex v a to change the sex స్త్రీత్వమును పోగొట్టి పుంస్త్వమునుకలగచేసుట, మగటమిని కలగ జేయుట.
To Unshackle v a to unfetter; to set free from restraintసంకెళ్ళను తీసివేయుట, విడుదల చేయుట.
To Unsheath v a to draw from the scabbard దూసుకొనుట, ఒరలోనుంచి బైటతీసుట. the sword was *ed కత్తి దూయబడి వుండినది, ఆ యుద్ధము ఆరంభమైవుండినది.
To Unship v a to take out of a ship వాడలో నుంచి దించుట, దిగుమతిచేయుట. this unshipped the rudder యిందువల్ల చుక్కాణి వూడిపోయినది.
To Unskin v a to flay తోలు దోచుట. they *ed the tiger ఆ పులి తోలునుదోచినారు.
To Unsphere v a to release విడిచి పెట్టుట, విడుదల చేసుట.
To Unstitch v a to open the stitches కుట్టు విచ్చుట.
To Unstop v a to open బిరడా తీసుట.
To Unstring v a to loose విప్పుట. to * a bow ఆల్లెయెక్కు దించుట. thisunstrung his nerves యిందువల్ల వాడి ధైర్యము కుంగినది.
To Unswathe v a to relieve from a bandage గాయము యొక్క కట్టు విచ్చుట.they *d the broken arm విరిగిన చేతికి కట్టిన కట్టును విచ్చినారు.
To Unthrone v a to cast down పడదోసుట, రాజ్యభ్రష్టుణ్నిగా చేసుట.
To Untie v a to loosen విచ్చుట, విప్పుట.
To Untile v a to remove the tiles from పెంకులు విచ్చుట, పై కప్పును తీసుటthey *d the house ఆ యింటి పెంకులు తీసినారు.
To Untuck v a to loosen విచ్చుట.
To Untwine, ToUntwist v a. to loosen విచ్చుట, మెలివిచ్చుట.
To Unveil v a to display to show openly అగుపరచుట, బాహాటముగాతెలియచేసుట. when the clouds *ed the moon మబ్బు విచ్చి చంద్రుడు అగుపడేటప్పటికి.
To Unwind v a to loose విచ్చుట. she unwound the thread off the ballనూలు చుట్ట విచ్చినది.
To Unwrap v a to open by taking off the covers కప్పినదాన్ని తీసుట.when she unwrapped the child బిడ్డ మీద కప్పిన గుడ్డలు తీశేటప్పటికి.
To Unyoke v a to set loose from a yoke కాడిలోనుంచి యెడ్లను విచ్చుట. topart; to disjoin వియోగము చేసుట.
To Upbraid v a to reproach, to chide దూషించుట, గద్దించుట, కసురుకొనుట.
To Uphear v a to lift పైకి యెత్తుట, మోసుట.
To Uphold v a to elevate, to support పైకి యెత్తుట, ఆదుకొనుట, సంరక్షించుట.
To Uplift v a to lift పైకి యెత్తుట.
To Upraise v a to lift పైకి యెత్తుట.
To Uprear v a to raise పైకి యెత్తుట.
To Uprise v n to rise from bed or from a seat లేచుట. at last uprosethe sun తుదకు సూర్యుడు వుదయించెను.
To Uproot v a to tear up the roots పెళ్ళగించుట, పెరుగుట.
To Upset v a to overthrow తల్లకిందులుగా తోసుట బోర్లతోసుట, బోర్లించుట,పొల్లించుట.
To Urge v a to incite, to provoke, to press ప్రేరేపణ చేసుట, బుద్ధి పుట్టించుట. I *ed him to pay the debt అప్పు చెల్లించమని వాడికి బుద్ధి చెప్పినాను. fear *d him to go back but hunger *d him to go on భయము వల్ల మళ్లు కోవలెనని తోచినది గాని ఆకలి అనేది వాణ్ని పొమ్మన్నది. this *d me to tell him the truth యిందు వల్ల వాడితో నిజము చెప్పవలసి వచ్చినది. necessity *d him to sell the property అగత్యము వల్ల సొమ్మును అమ్ముకోవలసి వచ్చినది. he *d his way forwards అవతల సాగిపోయినాడు.
To Urine v n లఘుశంక చేసుట, ఉచ్చపోసుట. he went to * జలబాధకుపోయినాడు.
To Use v a to employ, to frequent, to treat వాడుట, ఉపయోగించుట,వినియోగపరచుట, ప్రయోగించుట, సెలవు చేసుట. he *d his hand as a spadeవాడి చేతినే పారగా పెట్టుకొన్నాడు. I do not * that room ఆ గదిని నేను వాడుకోవడములేదు, ఆ యిల్లు విడిగా వున్నది. he *ed this word in that sense యీ పదమునుఆ అర్థములో ప్రయోగించినాడు. he *d the stone as a pillow ఆ రాయిని తలగడగాపెట్టుకొన్నాడు. he *ed me as a son నన్ను వొక కొడుకుగా విచారించినాడు. he *dup the paper ఆ కాకితాలను కాజేసినాడు.
To Usher in v a to introduce, to bring in ప్రవేశపెట్టుట, దర్శనముచేయించుట. this road *ed us into a garden యీ దోవ మమ్మున వొక తోటలోకితీసుకొని పోయి విడిచినది. this wind *ed in rain వానను యీ గాలి తెచ్చినది. he *ed me into the governor's presence గౌనరు యెదటికి నన్ను తీసుకొనిపోయివిడిచినాడు. the morning was *ed in with rain ఉదయ కాలము వానను కూడపిలుచుకొని వచ్చినది, తెల్లవారగానే వాన వచ్చినది.
To Usurp v a to hold without right ఆక్రమించుకొనుట, అపహరించుట,అన్యాయముగా గుంజుకొనుట. he *ed the kingdom ఆ రాజ్యమును అన్యాయముగాఆక్రమించుకొన్నాడు.
To Utter v a to speak చెప్పుట, పలుకుట, ఉచ్చరించుట, వచించుట. to * criesబొబ్బలు పెట్టుట. to * bad money తప్పు నాణెమును మార్చుట.
To Vacate v a to quit possession విడిచిపెట్టుట, శూన్యముచేసుట, ఖాలీచేసుట. he *d the house ఆ యిల్లు విడిచి లేచి పోయినాడు. he *d the throne సింహాసనమును విడిచిపెట్టినాడు, రాజ్య భారమును మానుకొన్నాడు.
To Vaccinate v a to inoculate with vaccine matter అమ్మవారు పోయకుండా వుండడమునకు పాలుతెచ్చి పొడిపించుట. after the child was *d ఆ బిడ్డకు అమ్మవారు పోయకుండా వుండడమునకు పాలుతెచ్చి పొడిపించిన తర్వాత.
To Vacillate v n to waver, to change backwards and forwards ఊగుట, ఆడుట, కదులుట, డోలాయమానపడుట. he *d for two days రెండు దినాలు డోలాయమానముగా వుండినాడు, యెటూ తోచక వుండినాడు.
To Vail v a See To Veil.
To Value v a to esteem, to hold in respect గొప్పగా యెంచుట, గణ్యముచేసుట. he does not * the pain వాడు శ్రనము లక్ష్యపెట్టలేదు. he does not * their opinion వాండ్ల మాటలను వాడు లక్ష్యపెట్టలేదు. to * highly గొప్పగా యెంచుట. I do not * him a straw వాణ్ని తృణానికి సమానముగా కూడా నేను యెంచలేదు. he *s himself upon this యిందున గురించి నిండా గర్వించి వున్నాడు. to fix a price, to estimate మతింపువేసుట, వెలకట్టుట.
To Vamp up v a to repair బాగుచేసుట, చక్కపెట్టుట. he *ed up the old carriage and sold it పాతబండిని చక్కబెట్టి అమ్మివేసినాడు. he *ed up a story వొక కథ కట్టి విడిచినాడు.
To Vanish v n to disappear, to pass away అంతర్ధానమైనపోవుట, అదృశ్యమైపోవుటి, మాయమైపవోటు. they *ed మాయమైపోయిరి, పారిపోయిరి. these difficulties will * యీ తొందరలు యేమీ లేకపోవును. so saying the serpent king *ed యీ మాట అని ఆదిశేషువు అంతర్ధానమైపోయేను. all these doubts *ed యీ సంశయములన్నీ లేకపోయినవి. he bid them * లేచి పొండి అన్నాడు.
To Vanquish v a to conquer ; to subdue జయించుట, గెలుచుట, సాధించుట.
To Vapour v n to bully, ; to brag జంభాలు కొట్టుట, గచ్చులుకొట్టుట.
To Variegate v a to diversify with colours చిత్రవిచిత్రములు చేసుట, నానా ప్రకారములు చేసుట.
To Varnish v a to make bright with oil మైరుగునూనె పూసుట.
To Vary v a to make different భేదపరుచుట, మార్చుట. they sometimes * their dress వాండ్లు అప్పుడప్పుడు వేరేవేరే వొక విధమైనపుడు పులువేసుకొంటాడు. To Vary, v. n. to differ భేదపడుట, భిన్నపడుట. the wind soon varied యింతలో గాలి తిరిగినది. he did not * from what he first said వాడు మొదట చెప్పినట్టే యిప్పుడూ చెప్పినాడు. యేమీ భేదములేదు. they * in their story వాండ్లు మనిషికి వొక విధముగా చెపప్పుతారు.
To Vaticinate v n to prophesy ; to foretell భవిష్యత్తును చెప్పుట, యికను నడవపొయ్యే దాన్ని చెప్పుట.
To Vaunt v n to boast, to brag జంభాలు నరుకుట, స్వస్తోత్రముచేసుట, తన్నుతానే పొగడు కొనుట. he *ed of his wealth తన భాగ్యమును తానే పొగిడినాడు.
To Veer v n to turn తిరుగుట. the ship *ed about వాడ అభిముఖమైనది, యీ తట్టు తిరిగినది. when the ship *ed towards us వాడ మా తట్టుకై తిరిగేటప్పటికి.
To Veer out v a to lengthen the cable దారమును విడుచుట. we *ed out fifty fathoms of cable వృక్షాదులు, మానికూరలు, as greens కూరాకులు.
To Vegetate v n to grow as plants మొలచుట, పెరుగుట. he merely *s there అక్కడ వృథా కాలక్షేపము చేస్తున్నాడు. పనికిమాలి కూర్చున్నాడు.
To Veil v a to cover, to conceal, to hide అచ్ఛాదనముచేసుట, మరుగుచేసుట, కప్పుట, తెర మరుగుచేసుట, ముసుకువేసుట. he *ed his meaning తన భావమును దాచినాడు.
To Vend v a to sell అమ్ముట, విక్రయించుట. * hawkers who * books యింటింటికి పుస్తకాలు తెచ్చి అమ్మే వాండ్లు.
To Veneer v a to inlay (common wood) with thin slices of a better wood లోగా ముతక చెక్క వేశి పైన సన్నపాటి నాణ్యమైన చెక్కను వేసుట. he *ed the table with ivory ఆ మేజామీది తట్టుకు దంతము వేసినాడు.
To Venerate v a to regard with respect and reverence పూజ్యతచేసుట, గౌరవము చేసుట, సన్మానించుట.
To Vent v a to publish, emit, let off ప్రచురము చేసుట, బయట చెప్పుట. he *ed his spleen on me వాడి కడుపుమంటను నా మీద చూపించినాడు.
To Ventilate v a to cool or purify by the admission of wind వాయు ద్వారా సీతళము చేసుట, నిర్మలము చేసుట, గాలి కొట్టడము చేత చల్లగా గాని నిర్మలముగా గాని వుండేటట్టు చేసుట. to a room or cellar వొక గదిలో లేక నేల మాళిగలో బాగా గాలికొట్టేటట్టుగా దారిచేసుట. this house is not properly *d యీ యింట్లో గాలి వచ్చేటట్టు దారి బాగా లేదు. or publish ప్రచురము చేసుట, చాటించుట.
To Venture v n to dare, run a hazard, or risk తెగించుట, సాహసము చేసుట. he *d upon the tiger with a spear బల్లె మెత్తుకొని పులిమీదికి తెగించి దూకినాడు.he did not * to go there వాడు అక్కడికి పోవడానికి తెగించలేదు. I *d to tell him the truth తెగించి వాడితో నిజము చెప్పినాను.
To Verge v n to approach, draw near సమీపించుట. the story now *s to aclose కథ ముగియ వస్తున్నది, సమాప్తము కావస్తున్నది. this *s upon reason యిది ద్రోహముతో చేరిక అవుతన్నది. he is verging on sixty వానికి షష్టిపూర్తి కావస్తున్నది.
To Verify v a to justify, confirm, prove true నిజపరచుట, నిశ్చయపరుచుట నిరూపించుట, స్థిరపరచుట. to * accounts లెక్కలను సంప్రతించుట. to test, prove పరీక్షించుట. this verified his words యిందువల్ల వాడి మాటలు నిజమైనది.
To Versify v a to write in verse శ్లోకములుగా రచించుట, పద్యములుగా చెప్పుట. this is a common story but he has versified it well అది సామాన్యమైన సంగతి దీన్ని బాగా పద్యాలుగా రచించినాడు.
To Vesicate v a to blister పొక్కు మందువేశి పొక్కేటట్టు చేసుట.
To Vest v a to place ఉంచుట, వేసుట. he *ed the ;money in land ఆ రూకలను మంటి మీద వేశివున్నాడు, అనగా ఆ రూకలను వేశి భూస్థితిని కొన్నాడు. he *ed them with authority వాండ్లకు అధికార మిచ్చినాడు.
To Vex v a. to tease, to beset ఆయాస పెట్టుట, తొందరపెట్టుట, అసహ్యపెట్టుట, వేధించుట, బాధించుటగ, this *ed him much but he said nothing ఇందువల్ల వాడికి నిండా చీదర వచ్చినది అయితే వాడు వొకటీ అనలేదు. you have nothing to * you తమకు వొక తొందరలేదు. he has nothing to * him ; he may live for a hundred years ఆయనకేమి తొందరలేదు ఆయన నూరేండ్లు బ్రతుకవచ్చును.
To Vibrate v a to brandish ; to move to and fro, to swing ఝళిపించుట, ఊచుట. he *d the spear బల్లెమును ఆడించినాడు. the pendulum of this clock *s seconds పెద్ధ గడియారము వెనకతట్టు ఆడేబిన నిమిషానికి వొకమాటు వూగుతున్నది.
To Victimize v a to sacrifice or destroy ఘాతచేసుట, హతముచేసుట, వంచించి చంపుట, పచ్చపు పనిచేసి దోచుకొనుట.
To victual v a to provide with food ఆహారము, జాగ్రత్త చేసుట, భోజనసామగ్రిచేర్చి పెట్టుట. they victualled the fort for one month ఆ కోటలో వుండేవాండ్లకు నెల్లాండ్ల భోజనసామగ్రి జాగ్రత్త చేసినారు.
To vie v n to contend అడ్డములాడుట, తిరస్కరించుట. contest, strive with పోరాడుట, సరిపోరుట. in war like skill he *s with (or rivals) Mars యుద్ధములో ద్రోణాచార్యులతో సరి పోర తగిన సామర్థ్యము గలవాడు. her face *din brightness with the summer moon దాని ముఖము శరశ్చంద్రుణ్ని తిరస్కరిస్తున్నది.
To View v a to survery ; to examine, to see చూచుట, పరీక్షచేసుట, విచారించుట he *ed the lands ఆ పొలమునంతా పార చూచినాడు, విమర్శించినాడు. he*ed this business in another light యిందున గురించి వాడికి వేరే భావమైనది.
To Vilify v a to debase, to defame, to abuse నిందించుట, దూషించుట, అవమానము చేసుట, అన్యాయము చేసుట.
To Vindicate v a to justlfy ; to clear పునీతుణ్నిగా చేసుట, నిర్ధుష్టుణ్నిగా చేసుట, దోషవిమోచనము చేసుట, దోషము లేదని తీర్చుట. they *d him అతనిమీద తప్పులేదనిఅగుపరచినారు. he *d himself తనమీద తప్పులేదని నిరూపించినాడు. this receipt *d him అతనిమీద తప్పు లేదని యీ రశీదుచేత తెలిసినది. the event *d his conduct యిట్లా సంభవించినందువల్ల వాడు చేసినది తప్పు కాదని యేర్పడ్డది.
To viod v a to evacuate విసర్జించుట, యేరుగుట. he *ed several worms వాడి కడుపులో నుంచి శానా యేటిక పాములు పడ్డవి.
To Violate v a to injure, to infringe, ravish చెరుపుట, భ్రష్టుచేసుట, అతిక్రమముచేసుట, బలాత్కరించుట. he *d the law in doing this దీన్ని చేయడములో శాస్త్ర భంగము చేసినాడు. he * this oath ప్రమాణ భంగము చేసినాడు. they *d his tomb in which he reposed ఆయనను పూడ్చిన సమాధిని చెరిపినారు.
To Visit v a పోయిచూచుట, వచ్చిచూచుట. he *ed the place అక్కడికిపోయి ఆ స్థలమును చూచినాడు. I *ed his house అతని యింటికి పోయి చూస్తిని. the doctor *s his patients ఆ వైద్యుడు రోగుల యిండ్లకు పోయి చికిత్స చేస్తున్నాడు. to touch as the breeze does a flower సోకుట, తాకుట, తగులుట. in the theological sense to punish శిక్షించుట, ప్రాయశ్చిత్తము చేసుట. his sins have *ed him, he is severely *ed for those sins వాడి పాపములే వాణ్ని చుట్టుకొన్నవి, వాడు చేసినదే వాణ్ని కట్టి కుడుపుతున్నది. when God *ed them with sickness దేవుడు వాండ్లకు రోగమును కలగచేసినప్పుడ. the town was *ed by a storm ఆ పట్టణమునకు గాలివాన వుపద్రవము తగిలినది. the city was *ed with dissease రోగము ఆ వూళ్ళో తగిలినది, సంభవించినది. their sorrows shall be *ed on thy head వాండ్ల వుసురు నీకు తాకును. he hath *ed adn redeemed his people ఆయన వాండ్లను చూచి రక్షించినాడు, విలోకించి రక్షించెన్.
To Vitiate v a to deprave, spoil, corrupt చెరుపుట, భ్రష్టుచేసుట, దుర్బలముచేసుట. this is *s his evidence యిందువల్ల వాడి సాక్షి దుర్బలమైపోయినది.
To Vitrify v n to become glass గాజు అవుట. after the bricks vitrified ఆ యిటికెలు చిట్టెము కట్టిన తర్వాత.
To Vituperate v a to censure, to blame దూషించుట, నిందించుట, తిట్టుట.
To Vivify v a to make alive, to animate జీవము వచ్చేట్టుచేసుట, బ్రతికించుట, after the heat vivified the eggs యెండచేత గుడ్లకు ప్రాణము వచ్చిన తర్వాత.
To vociferate v n to utter with a loud voice అరుచుట, బిగ్గరమట్లాడుట, పెద్దగొంతు పెట్టి అరుచుట.
To Volunteer v a to give without beiging asked అడగక వుండగా తానుగా చెప్పుట. he *ed an opinion about this తన్ను అడగక వుండగా తనకు తానే దీన్ని గురించి తన అభిప్రాయమును చెప్పినాడు.
To Vomit v n to cast up the contents of the stomach వమనమవుట, వాంతియవుట.
To Vote v a and v. a. to choose, or give by vote సమ్మతిని తెలియచేయడమువల్ల నిర్ధారణ చేసుట, సమ్మతిని చిహ్నమూలముగా, నిర్ధారణ చేసుట, నమాట చెప్పుట, తన అభిప్రాయమును తెలియచేసుట. I * this worng యిది తప్పినదని నా అభిప్రాయము. I * for him నేను అతని పక్షముగా వున్నది. I * for returning మళ్లుకోవడమే వుత్తమ మనేది నా మాట.
To Vouch v a to state as an opinion ; to attest, to maintain ప్రమాణముగా చెప్పుట, సాక్షిచెప్పుట, రూఢిగా చెప్పుట. can you * for this ? యిందుకునీవు వుత్తరవాదిగా వుండగలవా. I will * for it, that he paid the money రూకలు చెల్లించినాడని నేను గట్టిగా నమ్మినాను.
To Vouchsafe v a to condescend, to grant దయచేసుట, అనుగ్రహించుట, కృపచేసుట.
To Vow v n to make solemn promises ప్రార్థనచేసుకొనుట, మొక్కుకొనుట.
To Voyage v n to go by sea నీళ్ళమీద పోవుట, వాడయెక్కిపోవుట,సముద్రముమీద పోవుట.
To Vye v n to contend, to emulate పోటీచేసుట, పై బడుట, పోరాడుట. they *d with him వానితో సరిపోరినారు. the stags * with the wind in speed లేళ్ళువడిలో గాలికి సిరూగవలెనని చూస్తవి. no person can * with him in welath భాగ్యములో వానికి యెవరూ సరితూగలేదు.
To Waddle v n to walk like a duck పొట్టి బాతువలె వికారముగా నడుచుట.
To Wade v n to walk through water &c. నీళ్ళలో నడుచుట. I *d through the papers నిండా కష్టపడి ఆ కాకితాలను చదివినాను. I *d through the book in two months రెండు నెలలో ఆ పుస్తకమును నిండా కష్టపడి చదివి ముగించినాను.
To Waft v a to carry through the air, or on the water కొట్టుకొనిపోవుట. ఆకాశములో కొట్టుకొనిపోవుట, నీళ్ళమీద కొట్టుకొనిపోవుట. the breeze that *ed us to Madras మమ్మున చెన్న పట్నానికి తీసుకొని పోయిన గాలి. the wind *ed the clouds estward గాలి మేగములను తూర్పు తట్టుకై కొట్టుకొని పోయినది. the wind that *ed the vessel to the island ఆ వాడను ఆ దీవికి కొట్టుకొని పోయిన గాలి.
To Wag, wag v a. to shake కదిలించుట, ఆడించుట. the dog wagged his tail కుక్క తోకను ఆడించినది. they wagged their heads at him వాణ్ని చూచి వాండ్లు యెగతాళిగా తల ఆడించినారు.
To Wage v a to engage in war చేసుట. they *d war against us మాతో యుద్ధము చేసినారు.
To WAil v n to lament, to grieve ఏడ్చుట, రోదనము చేసుట.
To Wait v n to attend, watch కాచుకొని వుండుట, కనిపెట్టుకొని వుండుట, నిదానించుట, తాళుట. you must * a little కాస్త తాళ వలసినది they *ed till next day మర్నాటిదాకా కాచుకొని వుండిరి. to * at table వడ్డించే పనిలో వుండుట. they *ed for him a long time వాని కోసరము శానాసేపుదాకా కనిపెట్టుకొని వుండిరి. the sevants that * on him అతని దగ్గిర కని పెట్టుకొనివుండే పని వాండ్లు. when they *ed upon him or visited him వాండ్లాయన దర్శనమునకు పోయినప్పుడు. I will * upon you to the court కచ్చేరిదాకా తమతోకూడా పని కొంటాను. I *ed on him to their house వాండ్లయింటిదాకా పనికొంటిని. Wait, I say, on the Lord పరమేశ్వర మహపేక్షస్వ, దేవుణ్ని అపేక్షించు. A+ to lie in * పొంచి వుండుట.
No comments:
Post a Comment