Monday, February 7, 2011

To Tarnish

To Tarnish v a కాంతిని పోగొట్టుట. the fire *ed the silver ఆ మంటచేత వెండియొక్క కాంతి పోయినది. this *ed her good name దీని వల్ల దాని పేరుచెడిపోయినది.
To Tarry v n to stay; to continue in a place ఉండుట, నిలిచివుండుట. theytarried there all night వాండ్లు రాత్రంతా అక్కడ నిలిచినారు.
To Task v a తొందరపెట్టుట. he *ed them severely వాండ్లను నిండాతొందరపెట్టినాడు. It *ed his patience to hear all this nonsense యీ పిచ్చిమాటలు విని వాడి ప్రాణము విసికినది.
To Taste v a రుచి చూచుట, చవిచూచుట. I have not *d food to-day నేడంతానేను అన్నము తినలేదు. he has *d many afflictions వాడు నానా కడగండ్లు పడ్డాడు.he has *d prosperity వాడు భాగ్య మనుభవించినాడు.
To Tattle v n వదురుట, పేలుట, ముచ్చట లాడుట.
To Tattoo, or Tattow v a. పచ్చ పొడుచుట. his arm was tattooed వాడి చేతిమీద పచ్చ పొడిచి వుండినది.
To Taunt v a to reproach; to insult యెత్తిపొడుచుట, కుత్సితముగా చెప్పుట,ఎగతాళిగా చెప్పుట, ఎగతాళి చేసుట, నిందించుట, తక్కువగా మాట్లాడుట.
To Tax v a పన్ను వేసుట. to accuse నింద పెట్టుట. they *ed the land at ahundred rupees a year ఆ నేలకు సంవత్సరానికి నూరు రూపాయలు పన్ను వేసినారు.they *ed him with theft వాడి మీద దొంగతనము పెట్టినారు. he *ed me withthis యిందున గురించి నన్ను ఆక్షేపించినాడు. he *ed me with going there నేనుఅక్కడికి పోయినానని నా తల మీద పెట్టినాడు. he was obliged to * his ingenuityto devise a means of escape యెట్లా తప్పించుకొని పోదామని యెన్నెననోయుక్తులు చేసినాడు. I *ed my recollection in vain for his words నేను యెంతజ్ఞాపకము చేసుకొన్నా వాడు చెప్పిన మాటలు జ్ఞాపకానికి రాలేదు.
To Teach v a నేర్పుట, చెప్పి యిచ్చుట, చదువు చెప్పుట. he taught my son నాకొడుక్కు చదువు చెప్పినాడు. he taught me Telugu నాకు తెలుగు చెప్పినాడు. he *ed dancing ఆట నేర్పుతాడు.
To Tear v a to rend చించుట, చింపుట, గీచుట, బరుకుట. the tiger tore thegoat పులి మేకను చీల్చినది. the cat tore my hand పిల్లి నా చేతిని బరికినది. totake away by violence పెరుక్కొనుట, వూడ గుంజుకొనుట. he tore the childfrom me నా దగ్గర వుండిన బిడ్డను పెరుక్కొన్నాడు. the storm tore the trees గాలివాన చెట్లను ఛిన్నాభిన్నము చేసినది. he tore up the tree చెట్టును పెరికినాడు. hetore up the letter జాబును చించి వేసినాడు. they tore down the wallsగోడలను పగలగొట్టినారు. they tore out his eyes వాడి గుడ్లు పెరికి వేసినారు.
To Tease v a పీడించుట, బాధించుట, తొందర పెట్టుట, యేడ్పించుట, పోరుపెట్టుట.or comb wool బొచ్చును దువ్వుట. or rub between the fingers నలుపుట. ormince నజ్జునజ్జుగా నరకుట.
To Teem v n to be full నిండి వుండుట, సంపూర్ణముగా వుండుట. this book *swith beauties యీ పుస్తకము దివ్యమైన శ్లోకాలపుట్టగా వున్నది. this commentary *s with blunders యీ వ్యాఖ్యానము అబద్ధాల తడకగా వున్నది.
To Telegraph v n దూరమునుండి సంకేతము చేత తెలియచేసుట, మాట్లాడుట. he *ed to me to come నన్ను రమ్మని సంజ్ఞా యంత్రము చేత తెలియచేసినాడు.
To Tell, tell v a. చెప్పుట, అనుట, తెలియచేసుట, ఎరుక చేసుట. he told me thisstory యీ కథ నాతో చెప్పినాడు. he told me their names వాండ్ల పేళ్ళను నాకుయెరుక చేసినాడు, తెలియచేసినాడు. I * you he is gone పోయినాడంటానే. when a *child can * his letters బిడ్డకు అక్షరాలు చెప్పే శక్తి వచ్చేటప్పటికి. Don't ! I *you ! వద్దంటే. to * fortunes యెరుక చెప్పుట, గద్దె చెప్పుట, సోదె చెప్పుట. to *money రూకలను యెంచుట, లెక్కపెట్టుట. to * off or count యెంచుట, లెక్క పెట్టు.
To Temper v a to mix so as that one part qualifies the other కలిపిమట్టుపడేటట్టు చేసుట. to mingle కలుపుట. to * mortar సున్నమును మెదుపుట. he*ed his advice with kindness తాను బుద్ధి చెప్పడములో నిండా దయారసమునుఅగుపరుస్తూ వచ్చినాడు. to beat together to a proper consistence మెదిగేటట్టుదంచుట. to * metal లోహమును పదును చేసుట. to modify మట్టుపరచుట, మట్టుచేసుట.
To Temporize v n to act according to circumstances కాలానుసారముగానడుచుట. to procrastinate నేడు రేపని జరుపుట. he *d with his creditorsఅప్పులవాండ్లకు నేడు రేపు అని కాలహరణము చేస్తూ వచ్చినాడు.
To Tempt v a to try పరిక్షించుట. to entice to ill, to allure ఆశ చూపి తప్పుదోవకు యీడ్చుట. the fine weather *ed us to go out వానాగాలి యిటువంటిదియేమిన్ని లేక హాయిగా వుండినందున మాకు బయిట పోవలెననే బుద్ధి పుట్టినది. he sawher pass and this *ed him to follow her అది పోతూ వుండగా చూచి దాన్నివెంబడించవలెననే బుద్ధి వాడికి పుట్టినది. the devil *ed him to commit this crimeవాణ్ని ఆ నేరము చేయుమని సైతాను పురికొలిపినాడు, వాడి గ్రహచారము వాణ్ని ఆనేరము చేయుమన్నది. they *ed her to run away దాన్ని పారిపొమ్మని యెక్కొలిపినారు.her beauty *ed him to go there దాని అందము వాణ్ని అక్కడికి యీడ్చినది. to provoke రేచుట, ఎక్కొలుపుట, ఉశికొలుపుట. why should he * the precipice? ఆ వొడిదుడుకైన కొండ యెక్కవలెనని వాడి కేల బుద్ధి పుట్టినది. thou shalt not * Godదేవుణ్ని పరిక్ష చేయరాదు.
To Tenant v a కాపురము వుండుట, కాపురము చేసుట. I *ed his house వాడియింట్లో బాడిగెకు వుండినాను. foxes * the pagoda ఆ గుడిలో నక్కలు కాపురముచేస్తున్నవి.
To Tend v a to watch; to guard కాచుట, కాపాడుట, పోషించుట, సంరక్షించుట,మేపుట.
To Tender v a to offer ఇవ్వవచ్చుట, యివ్వడమునకు చెయిచాచుట. they *edhim the money చెయి చాచి రూకలు యివ్వవచ్చినారు. I *ed them your apologyనీ వడగవలసిన మన్నింపును నేను వాండ్ల వద్ద మనివి చేసినాను, నీవు బతిమాలుకొన్నట్టువాండ్లతో చెప్పినాను. he *ed his resignation రాజీనామా యిచ్చినాడు, ఉద్యోగముఅక్కరలేదని మనివి చేసినాడు. he *ed his services in the business యీ పనికితానున్ను సహాయపడుతానన్నాడు. they *ed him this oath నీవు యీ సత్యముచేస్తావా అని అడిగినారు. I *ed him my hand but he refused it నేను చెయ్యియివ్వబోతే వాడు పట్టుకోలేదు. I *ed him the house ఆ యింటిని వానికియిస్తానన్నాను. he *ed him the house ఆ యింటిని వానికి యిస్తానన్నాను. he *edthe shawl for sale ఆ శాలువను అమ్మజూపినాడు.
To Tenter v a to twist మెలి పెట్టుట. learned men can * any thing into any thing ( Prideaux Connect.3. 30.) విద్వాంసులు తృణమును మేరువుగాని మేరువును తృణముగాను చేయగలరు.
To Term v a " పేరుపెట్టుట, అనుట. they * this a marriage దీన్ని పెండ్లిఅంటారు. do you * this an explanation? దీన్ని వ్యాఖ్యానమంటావా."
To Terminate v a ముగించుట, సమాప్తి చేసుట.
To Terrify v a బెదిరించుట, వెరపించుట.
To Test v a పరిక్షించుట, శోధించుట.
To Testify v n to witness; to give evidence సాక్షి చెప్పుట, సాక్షి పలుకుట.they testified that he was gone వాడు పోయినాడని సాక్షి చెప్పినారు. thistestified great diligence దీనివల్ల అత్యంత శ్రద్ధ వున్నట్టు తెలుస్తున్నది. theytestified to the marriage ఆ పెండ్లి జరిగినట్టు సాక్షి చెప్పినారు. I can * to that అది సంభవించినట్టు నేను యెరుగుదును, దానికి నేను సాక్షి. I can * to his goingthere వాడు అక్కడికి పోయిన దానికి నేను సాక్షి చెపుతాను.
To Tether v a మేయడానకై నిడుపుగా దారము కట్టి విడుచుట.
To Thank v a ఉపకార స్వీకారము చేసుట, చేశిన మేలును యెంచుట, వందనముచేసుట. we have come to * you for our new dresses మేము కొత్త బట్టలనుకట్టుకొని మీకు దండము పెట్టవచ్చినాడు. * you తమ దయ, తమ పుణ్యము. * God Isucceeded దైవాధీనము నాకు అనుకూలమైనది.
To Thatch n s ఇంటికి పూరివేసుట, పై కప్పువేసుట, ఇంటికి గడ్డివేసుట. they *edthe rick ఆ కసువు వామికి పైన గుడిసె వేసినారు. in that village half of thehouses are tiled, and half are *ed ఆ వూళ్ళో సగము పెంకుటిండ్లు సగముపూరిండ్లు.
To Thaw v n కరిగిపోవుట, అనగా రాయిగా పేరిన నీళ్ళు కరుగుట.
To Thicken v a చిక్కగా వుండేటట్టు చేసుట. she *ed the milk ఆ పాలను చిక్కగాచేసినది. to * hedge he planted more trees వెలుగు దట్టముగా వుండడానకై కొన్నిచెట్లు నాటినాడు. water thickened with sugar బెల్లము కలిపినందున చిక్కగా వుండేనీళ్లు.
To Thieve v n దొంగపని చేసుట, దొంగిలించుట, కొల్లబెట్టుట.
To Thin v a వెలికిచేసుట, తగ్గించుట. he thinned the trees అక్కడక్కడా వొకచెట్టును కొట్టి వెలితి చేసినాడు. when age had thinned his locks వృద్ధాప్యము చేతబహుశా వెంట్రుకలు రాలిపోయినప్పుడు. this disease thinned the people యీరోగము వల్ల జనము తగ్గిపోయినది.
To Think v a ఎంచుట, విచారించుట, యోచించుట. he does whatever he *sfit వాడికి యుక్తమైనట్టు చేస్తాడు. as you * proper నీకు యుక్తమైనట్టు. If you *proper you may come నీకు యుక్తమైతే రా. why did she * proper to abuseme ? నన్ను తిట్టడానకు దానికేమి పట్టినది.
To Thirst v n దాహమెత్తుట. I * నాకు దాహమవుతున్నది. to be eager ఆశపడుటు.they * for his blood చంపవలెనని నిండా ఆతురముగా వున్నారు.
To Thou (pronoun) నీవు నీవు అని అమర్యాదగాచెప్పుట
To Thrash v a నూర్చుట. to beat కొట్టుట, దెబ్బలు కొట్టుట.
To Thread v a గుచ్చుట, చొప్పించుట. she *ed the needle సూదిలో దారముగుచ్చినది, సూదిలో దారమును చొప్పించినది. I *ed the crowd ఆ గుంపును తోసుకొనిపోయినాను.
To Threap v a ( to affirm or urge; an old word, Wesley ) రూఢిగాచెప్పుట, స్థిరముగా చెప్పుట.
To Threaten v a బెదిరించుట, గదమాయించుట, గద్దించుట. the cholera wasthen threatening the town అప్పుడు ఆ వూళ్ళో వాంతి భ్రాంతి సంభవించేటట్టుగావుండినది. a *ing letter బెదిరించే జాబు. *ing weather వాన వచ్చేటట్టుగా వుండేకాలము. it looks *ing వర్షము వచ్చేటట్టుగా వున్నది. a *ing night వాన వచ్చేటట్టువుండే రాత్రి.
To Thresh (SeeThrash)నూర్చుట
To Thrill v a to pierce; to drill రంధ్రము చేసుట, ఈ అర్థము యిప్పట్లో చెల్లదు.the cold *ed them చలి వాండ్లను తొలిచినది, అనగా వాండ్ల ప్రాణమును కుంగ తీసినది.the sound *ed through the hills ఆ ధ్వని కొండలు దూసుకొని పోయినది. whenjoy *s the heart మనసు ఆనందపరవశమైననప్పుడు. when grief *s the heartవ్యసనము మనసులో శూలముగా నాటినప్పుడు. these words *ed his soul యీమాటలు వాడి గుండెల్లో గాలముగా నాటినవి.
To Thrive v n to prosper; to grow rich బాగుపడుట, వర్ధిల్లుట. the child *s well బిడ్డ బాగా పెరుగుతున్నది. the work does not * పని బాగా సాగలేదు. theseplants do not * here యీ చెట్లు యిక్కడ పెరగలేదు. ( The past tense of thisverb is Thrived, or, Throve. Sir Joshua Reynolds says, Thrived. )
To Throb v n to heave ఆడుట, కొట్టుకొనుట, సళుపుట. when the pulse *sధాతువు ఆడేటప్పుడు. at these words her heart throbbed ఆ మాటలకు దానిగుండెలు వణికినవి. this boil *s యీ పుండు సళుపుతున్నది.
To Throng v n to crowd గుంపులై వచ్చుట. the people who *ed themarket అంగడి వీధిలో గుంపులు గుంపులుగా వచ్చిన ప్రజ.
To Throttle v a to kill by stopping the breath ఊపిరి బిగబట్టి చంపుట, కుతికెపిసికి చంపుట.
To Throw v a to fling వేసుట, రువ్వుట, విసిరివేసుట. in wrestling పడదోసుట.this threw light on the subject ఇందువల్ల అది విశదమైనది. he threw itaside దాన్ని మూలపడవేసినాడు. to * away పారవేసుట. he threw away histime కాలమును వ్యర్థముగా పోగొట్టినాడు. he threw away his money రూకలనుదువ్రయము చేసినాడు. he threw the work by ఆ పనిని వొక మూల పడవేసినాడు.he threw down the wall గోడను పడగొట్టినాడు. he threw himself into theriver ఏట్లో దుమికినాడు. he threw himself into the crowd గుంపులోపోయిపడ్డాడు. the troops threw themselves into the fort దండు కోటలోకిదుమికినది. he threw off his clothes తన బట్టలను తీశి పారవేశినాడు. he threwoff the mask మారువేషమును తీశి వేశినాడు, నిజస్వరూపమును చూపినాడు. I *myself on your kindness మిమ్మున శరణు జొచ్చినాను. he threw himself onthe enemy శత్రువుల మీదికి దుమికినాడు. they threw the door open తలుపు తెరిచిపెట్టినారు. she threw a veil over her head ముసుకు వేసుకొన్నది. he threwout a hint that his father would consent తన తండ్రి సమ్మతించునని జాడగాతెలియచేసినాడు. this threw out the dogs ఇందువల్ల కుక్కలు పట్టుకొనిపోతూవుండిన జాడ తప్పిపోయినది. this letter completely threw me out యీజాబు వల్ల నాకుయెటూ తోచకపోయినది. the tree threw outshoots ఆ చెట్టుగురెత్తినది, ఆకులు విడిచినది. he threw himself under the tree చెట్టు కిందపండుకుకొన్నాడు. to * up an employment ఉద్యోగమును మానుకొనుట.
To Thrum v a to play coarsely తెలిశీ తెలియక వికారముగా వీణె వాయించుట.
To Thrust v a తోసుట, పొడుచుట, గెంటుట. they * him in వాణ్ని లోగాతోసినారు. he * his hand into the bag సంచిలో చెయి వేశినాడు. he * himselfinto the business ఆ పనిని తానుగా యెత్తి పైన వేసుకొన్నాడు. to * out the tongueనాలికె చాచుట. they * him out వాణ్ని బైటికి గెంటినారు.
To Thumb v a వేలితో పట్టిపట్టి మాపుట. a book spoilt by thunbing చేతితోపట్టిపట్టి చెరిపిన పుస్తకము.
To Thump v a కొట్టుట, అడుచుట, గుద్దుట.
To Thunder v n ఉరుముట, గర్జించుట. when it *ed ఉరిమినప్పుడు. he *ed atthem వాండ్లను నిండా తిట్టినాడు.
To Thwack v a కొట్టుట, బాదుట, పులుముట.
To Thwart v a to cross చీవాట్లు పెట్టుట, విఘాతము చేసుట, భంగపరచుట, పనిచెరుపుట విచ్ఛిత్తు చేసుట, అడ్డంకి చేసుట.
To Tick v n గడియారము, టిక్కుటిక్కుమనుట.
To tickle v a చక్కిలిగింతలు పెట్టుట. or to please సంతోషపెట్టుట.
To Tie v a కట్టుట, బంధించుట, ముడివేసుట. this ties his hands ఇందువల్ల వాడుకాలు చెయి ఆడించేటందుకు లేదు, అనగా వాడికి యేమిన్ని సాగదు. he *d him downto pay the money in three days మూడు దినములలో ఆ రూకలను చెల్లించుమనివాణ్ని నిర్బంధము చేసినాడు. he *d himself down to pay the money ఆ రూకలకుతాను పూట బడ్డాడు. to * on a turband పాగా చుట్టుట. he *d two cowstogether రెండావులను పెనవేశినాడు. he *d up the cow ఆవును కట్టినాడు.
To Tiff v n ( an Indian word ) to lunch or take a slight mealఫలాహారము చేసుట.
To Tighten v a బిగించుట.
To Tile v a పెంకులుమూసుట. they *d the house ఆ యింటికి పెంకులు.
To Till v a దున్నుట.
To Tilt v a to set it leaning forward వంచుట. he *ed the barrel ఆపీపాయిని వొక తట్టు వంచి పెట్టినాడు.
To Time v a కాలమేర్పరచుట, కాలానుసారముగా చేసుట. he *d his visit veryproperly సమయానికి వచ్చినాడు. you *d your letter very ill నీ జాబు ఆసమయములో వ్రాయరాదు.
To Tin v a కళాయి చేసుట, సీసము పూసుట. he tinned the kettle ఆ తపిలెకుకళాయి పూసినాడు.
To Tincture v a to imbue వర్ణమును వ్యాపింపచేసుట, రసమును వ్యాపింప చేసుట.this spite *d all his letters యీ చలము వాని జాబులలో నంతా వ్యాపించియున్నది, ప్రసరించి వున్నది.
To Tinge v a to colour కొంచెము వర్ణ మెక్కించుట. he *d the cloth red ఆగుడ్డకు చెంగావి వేసినాడు. the dier *d the clother blue బట్టలకు కొంచెము నీలివేశినాడు.
To Tingle v n గల్లుగల్లుమనుట, దిమ్ముపట్టుట, జలపరించుట. I heard the bell *ఆ గంట గణగణమనగా విన్నాను. while his ears *ed with the sound of thethunder ఆ వురుము చేత వాని చెవులు దిమ్ముపట్టినప్పుడు. this news made ears *యీ మాటలు వాని చెవులలో శూలములై నాటినవి.
To Tinker v a తపిల చెంబులకు మాట్లు వేయుట. a patch of metal intinkering మాటు, అతుకు. to alter a letter or poem &c. వొక జాబును గానికావ్యమునుగాని దిద్దుట. Hannah Moe says " I needs must go atinkering the poem till I spoilt it" ఆ కావ్యమును యిటు అటు దిద్ది చెరిపినాను.
To Tinkle v n గలగలమనుట, గణగణమనుట.
To Tip v a కొనకువేసుట, కొనకు తగిలించుట. a staff tipped with iron ఇనపపొన్ను వేసిన కర్ర. he tipped the staff with silver ఆ కర్రకు వెండి పొన్నువేసినాడు. she tipped the string with tin ఆ దారము కొనకు సీసము తగిలించినది.
To Tipple v n తాగుట, లొట్టితాగుట, కల్లుతాగుట, మధుపానము చేసుట.
To Tire v a to fatigue అలసట పెట్టుట, విసికించుట, డస్సేట్టు చేసుట. this *dhim soon ఇందువల్ల వానికి కొంచెములో అలుపు పుట్టినది.
To Titter v n to laugh with restraint ముసిముసి నవ్వులునవ్వుట. SeeGiggle.
To Tittle-tattle v n వదురుట, పిచ్చి సుద్దులు పలుకుట.
To Toast v a నిప్పున వాడ్చుట, సెగ చూపుట. he *ed the bread ఆ రొట్టెనునిప్పు మీద వేసి పొల్లించినాడు. they * the roots and then reduce them topowder వాండ్లు ఆ వేళ్ళను గ్రాహిచేశి పొడిచేస్తారు. to name when a health isdrunk, they *ed her దానికి మంగళమవుగాక అని చెప్పి వొయిను తాగినారు.
To Toddle v n నడుచుట, తప్పుటడుగులు వేసుట, ఇది క్షుద్రమాట. he *d homeagain వాడు మళ్ళీ, యింటికి పోయినాడు. after they *d వాండ్లు వెళ్ళిన తర్వాత. Ishould like to come, and have a cottage in your park, toddle about &c( Johnson in Boswell, May. 1783. ) యిటు అటు తిరుగుట.
To Toil v n శ్రమపడుట, కష్టపడుట, పాటుబడుట.
To Tolerate v a సహించుట, తాళుట, పడుట. the Musulmans would not *any other religion తురకలకు వేరే మతమంటే గిట్టదు. they will not * the sightవాండ్లు దీన్ని చూచి తాళలేరు, సహించరు. Will the British Government *infanticide? బ్రిటిషు గౌనరుమెంటు వారు శిశు హత్యను సహింతురా. killing childrenis not *d in the country యీ దేశములో శిశు హత్యను సహించరు. customswhich are not *d among them వాండ్లకు నిషేధమైన నడవడికలు. In Madras allreligions are *d చెన్నపట్టణములో యేమతమునకున్ను అడ్డము చెప్పేవాండ్లు లేరు.
To Toll v n గంట వాయించుట.
To Tope v n to drink, or to become drunk తాగుట, తాగుబోతవుట.
To Topple v n దొల్లుట, జారిపడుట, పొల్లుట.
To Torment v a to put to pain బాధించుట, వేధించుట, ఆయాసపెట్టుట,నొప్పించుట. why should you * yourself about it ? దానికి యెందుకుబాధపడుతావు.
To Torture v a బాధపెట్టుట, హింసించుట. he *d out a meaning అట్లా యిట్లావొక అర్థము వెళ్ళదీసినాడు.
To Toss v a to throw with the hand వేసుట, యెగరవేసుట, యెగరగొట్టుట. tothrow with violence రువ్వుట. to agitate అల్లరి చేసుట, కళ వెళ పెట్టుట. to* away చిమ్మివేసుట, పారవేసుట, తోశివేసుట. to * up చెరుగుట. to * aboutకుదిలించుట. she *ed up her head తల యెగర వేసినది.
To Totter v n గెంటుసలాడుట, అల్లాడుట, కదులుట. a child that *s alongతప్పుటడుగులు పెట్టుతూ వచ్చే బిడ్డ. this table *s యీ మేజా కదులుతున్నది. whenhealth *s వొళ్ళు జబ్బుగా వుండేటప్పుడు, అధైర్యముగా వుండేటప్పుడు.
To Touch v a తాకుట, ముట్టుట, అంటుట, స్పర్శించుట, ముట్టుకొనుట. theborders of Madras * here those of Nagapoor చెన్న పట్టణపు రాజ్యము యొక్కపొలిమేరానున్ను నాగపూరు దేశము యొక్క పొలిమేరానున్ను యిక్కడ కలుస్తున్నది. hisland does not * mine వాడినేలా నా నేలా కలియలేదు, చేరివుండలేదు. It is so hardthat a file will not * it యిది నిండా గట్టియైన వస్తువు గనక ఆకురాయి కూడా -పట్టదు,ఆకురాయికి కూడా తెగదు. to try as gold with a stone ఒరయుట. this *ed hisheart యిది వాడి మనసున తాకినది. it *ed his conscience యిది వాడి మనసుకేపుండుగా వుండినది. this will * his life యిందువల్ల వాడి ప్రాణానికి వచ్చును. to *up ( finish ) చక్కపెట్టుట, బాగుచేసుట, తీర్చుట. he *ed up the carriage ఆబండిని చక్కపెట్టినాడు, బాగుచేసినాడు. * me not నన్ను తాకబోకు, నన్ను అంటవద్దు.
To Toughen v a గట్టిపరచుట. they * the skins by soaking themనానపెట్టడము చేత తోలుకు బిరుసును కలగచేస్తారు.
To Touse, or ToTouzle v a. to pull about, to disorder the hair గొర్రెబొచ్చును పీకుట. to tear బరుకుట. after touselling the wool they spin it ఆబొచ్చు పీకిన తర్వాత వడుకుతారు.
To Tow v a to draw by a rope తాటితో కట్టి నీళ్ళలో యీడ్చుకొని పోవుట.
To Tower v n ఎత్తుగా వుండుట, పొడుగుగా వుండుట, ఆకాశమంటుట. mountainsthat * to the clouds మేఘమండలమును అంటివుండే కొండలు. she *s aboveher sex అది స్త్రీ తిలకముగా వున్నది.
To Towzle, or ToTouse v a. to pull about, to disorder the hair గొర్రెబొచ్చును పీకుట. to tear బరుకుట. after towzling the wool they spin it ఆబొచ్చు పీకిన తర్వాత వడుకుతారు.
To Toy v n to trifle, to play ఆట్లాడుట.
To Trace v a జాడతీయుట, జాడలు పట్టుకొని పోవుట, గురుతులు పట్టుట. they *dthe thief to the mountain ఆ దొంగ కొండ మిదికి పోయినట్టుగా జాడలు పట్టినారు.
To Track v a జాడలుపట్టి వెంబడించుట. he *ed them home జాడ పట్టుకొనివాండ్ల యింటికి పోయినాడు.
To Trade v n వర్తకము చేసుట, వ్యాపారము చేసుట బేరము చేసుట. he went to *in grain ధాన్యపు బేరము చేయబోయినాడు.
To Traduce v a to censure నిందించుట, దూరుపెట్టుట, దూషించుట, అపవాదముచెప్పుట.
To Traffick v n వర్తకము చేసుట, వ్యాపారము చేసుట. she *ed in her charms అది వేశ్యా వృత్తిలో వుండినది.
To Train v a to educate నేర్పుట, మరుపుట, అలవరుచుట.
To Trammel v a to confine, hamper, shackle చిక్కించుకొనుట. to confineby cords బందాలు వేసుట, చిక్కుల బెట్టుట, ఇబ్బంది చేసుట.
To Tramp v n to travel, to wander or stroll వలసపోవుట, తిరుగుట,తొక్కుట.
To Trample v a and v.n. to tread with contempt తొక్కుట, అణగతొక్కుట.they *d upon him వాణ్ని అణగ దొక్కినారు. it was destroyed by tramplingకాళ్ళతో తొక్కి చెరపబడ్డది.
To Transact v a చేసుట, నడిపించుట, జరిపించుట.
To Transcennd v a to raise above; to surmount; to surpass; to excelమించుట, అతిశయించుట, మీరుట.
To Transcribe v a to copy ఎత్తి వ్రాసుట, ప్రతి వాసుట. he *d the letter ఆజాబుకు వొక ప్రతి వ్రాసినాడు.
To Transfer v a to make over from one to another మరి వొకనిపరముచేసుట, మరి వొకని పేరిట చేసుట. he transferred the picture to hisbook ఆ పటమును చూచి దాని ప్రకారముగా తన పుస్తకములో వ్రాసుకొన్నాడు.
To Transfigure v a to transform, to change with respect to outwardappearance మారురూపు చేసుట.
To Transfix v a to pierce through ఈ తట్టు నుంచి ఆ తట్టుకు దూయగుచ్చుట,పొడుచుట.
To Transform v a to metamorphose మారు రూపు చేసుట, మారువేషముచేసుట, రూపాంతరము చేసుట.
To Transfuse v a to pour out of one into another పాత్రాంతరము చేసుట,పోసుట, వొకటిలో నుంచి మరి వొకట్లో పోసుట. in this translation he hascompletely *d the spirit of the original యీ భాషాంతరములో మూలముయొక్క యావత్తు నిగ్గును తీసుకొనివచ్చి పెట్టినాడు.
To Transgress v a to pass over or beyond any limit; to surpassమించుట, అతిక్రమించుట, మేరమీరుట, క్రమము తప్పుట. to break, or violate alaw శాస్త్రభంగము చేసుట. they *ed his law ఆయన చేసిన విధిని తప్పినారు.
To Tranship v a ఒక వాడలో నుంచి మరి వొక వాడలోకి యెక్కించుట.
To Translate v a భాషాంతరము చేసుట. to * into Telugu తెనిగించుట. to *into English ఇంగ్లిషు చేసుట. * this word యీ మాటకు అర్థము చెప్పు. atranslated poem భాషాంతరము చేయబడ్డ కావ్యము. he did not die but wastranslated వాడు చావలేదు గాని సశరీర స్వర్గమును పొందినాడు, జీవమ్ముక్తుడైనాడు.
To Transmigrate v n to pass from one place or country into anotherదేశాంతరమునకు పోవుట, రూపాంతరము పొందుట, మారు దేహమును యెత్తుట. he *dinto the form of a bird వాడు పక్షి శరీరమును యెత్తినాడు.
To Transmit v a to send పంపుట, పంపించుట. glass *s light అద్దమువెలుతురును రానిస్తున్నది, అద్దము వెలుతురుకు అడ్డము కాదు.
To Transmute v a to change మార్చుట. he tried to * metals into goldలోహములను బంగారు చేయవలెనని చూచినాడు.
To Transpierce v a to pierce through పొడుచుట, దూయపొడుచుట.
To Transpire v n to become known బయిలు పడుట, తెలిశిపోవుట. also ( awrong sense ) to happen సంభవించుట, జరుగుట.
To Transplant v a to remove a tree or plant నారు పీకి అవతల నాటుట,పెళ్ళగించి నాటుట. he *ed himself ఆ దేశము విడిచి మరి వొక దేశానికి పోయినాడు.
To Transport v a to convey by carriage from place to place తీసికొనిపోవుట. he *ed the cattle into another town ఆ పశువులను యింకొక వూరికితోలుకొని పోయినాడు. to put into extasy పరవశమును పొందించుట. this news*ed him యీ మాటలు విని పరమానందమును పొందినాడు. as a convict దేశాంతరమునకు తీసుకొని పోవుట. they *ed him for life వాణ్ని ఆయుస్సు వరకుపరదేశమునకు పంపినారు. to sentence as a felon to banishmentదేశాంతరమునకు పంపేటట్టుగా తీర్పు చేసుట.
To Transpose v a to put each in the place of other ఇక్కడిది తిసి అక్కడఅక్కడిది తీసి యిక్కడ పెట్టు, మర్చుట. he *d the words అక్కడి మాటను యిక్కడ,యిక్కడి మాటను అక్కడ పెట్టినాడు.
To Trap v a to catch in a snare బోనులో చిక్కించుకొనుట. he trapped thetiger ఆ పులిని బోనులో చిక్కించుకొన్నాడు.
To Travail v n to labour ప్రయాసపడుట, శ్రమపడుట, బాధపడుట. while shewas travailing in labour ప్రసవవేదన పడుతూ వుండగా.
To Travel v n పోవుట, ప్రయాణము పోవుట, వెళ్లుట.
To Traverse v a to cross దాటుట, అడ్డముగా పోవుట, అడ్డమవుట. those who* the sea సముద్రములో సంచరించేవాండ్లు.
To Tread v a తొక్కుట, అడుగు బెట్టుట, నడుచుట. they trod his laws underfoot ఆయన ఆజ్ఞను తొక్కి పారవేసినారు. those who * the stageనాటకమాడేవాండ్లు, వేషగాండ్లు. they trod in the manure ఎరువుకు ఆకుఅలము వేసిఅణగదొక్కినారు. he trod out the spark మిణుగురులను కాలితో తొక్కి ఆర్పివేసినాడు.to * out grain ధాన్యము నూర్చుట, ఒబ్బిడి చేసుట. to * as fowls మొగ పక్షిఆడపక్షి కలుసుట, సంగము చేసుట.
To Treasure v a to hoard; to lay up కూడబెట్టుట, పోగుచేసుట. he *d thesewords up in his mind యీ మాటలను తన మనసులో దాచిపెట్టినాడు.
To Treat v a to handle; to manage, to use నడిపించుట, జరిపించుట,విచారించుట. he *ed them alike అందరిని సమముగా విచారించినాడు. he *edthem lightly వాండ్లను చులకనగా విచారించినాడు, అలక్ష్యము చేసినాడు. he *edthem honorably వాండ్లకు గౌరవముగా నడిపించినాడు. he *ed me as a sonనన్ను కొమారుణ్నిగా విచారించినాడు. he *ed me as an enemy నన్ను శత్రువుగావిచారించినాడు. they *ed him ill వాని విషయమైన అన్యాయముగా జరిగించినారు. he*s the prisoners ill కయిదీలను హింసపెట్టుతున్నాడు. they *ed him kindlyవాని యందు విశ్వాసముగా నడిపించినారు. to give food or drink విందు చేసుట. he*ed us with fruit వాడు తినడానికి కొన్ని పండ్లు యిచ్చినాడు. he took away theworkmen and *ed them పని వాండ్లను పిలుచుకొనిపోయి వాండ్లకు విందు చేసినాడు.this is the room where he *ed his friends ఇది వాడు స్నేహితులకువిందుచేసిన గది.
To Treble v a మూడింతలు చేసుట.
To Tremble v n to shake వణుకుట, అదురుట, కంపించుట, కదులుట.
To Trench v a to cut a ditch గాడిగా తవ్వుట, అగడ్తగా తొవ్వుట, కాలవగాతొవ్వుట. this *es upon his privileges ఇది వానికి హాని చేస్తున్నది.
To Trend v n to extend పోవుట. from Madras the coast *s southwardsచెన్నపట్టణము దగ్గర నుంచి వాగర్త దక్షిణముగా పోతున్నది. we *ed along the coastసముద్రతీరము వెంబడిగా పోయినాము.
To Trepan v a to saw the skull అపాయము వచ్చిన కపాలమును వైద్యుడు కోశికుదురుగా పెట్టుట. to seize, catch మనిషిని చిక్కించుకొనుట.
To Trepass v n to transgress; to offend అతిక్రమించుట, ఉల్లంఘనముచేసుట, మీరుట. to enter unlawfully on another's ground ఆక్రమించుకొనుట,తప్పుట, నేరము చేసుట.
To Trial v a to hunt by the track వాసన పట్టి పోవుట, జాడలు పట్టి పోవుట.she was trailing her dress along దాని బట్టలు జీరాడుతూ వుండినవి.
To Trick v a మోసపుచ్చుట, వంచించుట. to trick out; to dress; to adornదిద్దుట, శృంగారించుట.
To Trickle v n to fall in drops బొట్లు బొట్లుగా కారుట. trickling tearsబొట్లుబొట్లుగా రాలే కన్నీళ్ళు.
To Trifle v n to act or talk with levity వ్యర్థముగా ప్రవర్తించుట, నిరర్థకముగామాట్లాడుట. to indulge in light amusements వృథాగా పొద్దుబుచ్చుట. do not *with me, give me a plain answer నా దగ్గిర పనికిమాలిన మాటలు ఆడకుండాపరిష్కారము చెప్పు. he is trifling with us మా దగ్గిర పనికిమాలినమాటలాడుతున్నాడు. he *d away his time కాలమంతా వ్యర్థముగా పోగొట్టినాడు.
To Trill v a కలస్వనముగా పాడుట, రవలు పలుకుట. or flow పారుట, కారుట. InChaucer foot, to trill a pin is, to turn a peg బిరడాను తిప్పుట.
To Trim v a to put in due order దిద్దుట, సవరించుట. to dressశృంగారించుట, పరిష్కరించుట. to clip or to shave కత్తిరించుట, గొరుగుట. to * thebeard, గడ్డమును కత్తిరించి బాగు చేసుట. to * a hedge వెలుగు యొక్క కొమ్మలనుకత్తిరించి బాగు చేసుట. he trimmed the board ఆ పలకను చెక్కి సవరించినాడు. tolop off as superflous branches అధికముగా పెరిగిన కొమ్మలను నరికివేసుట. todecorate with extra ornaments బట్టకు సరిగె గోటునున్ను శాలువను బుట్టాలనున్ను అంచులు మొదలైన వాటిలో అలంకారార్థముగా పెట్టి కుట్టుట. she trimmed thegown with lace అది పావడకు సరిగె గోటు పెట్టి కుట్టినది. he trimmed her wellదాన్ని బాగా శిక్షించినాడు, గద్దించినాడు.
To Trip v n to error fail; to stumble తప్పుట, జారుట. he tripped andfell జారిపడ్డాడు. my horse tripped and fell నా గుర్రము కాలు జారి పడ్డది. hetripped in saying these words యీ మాటలు చెప్పడములో తప్పినాడు. she wastripping along అది బిరబిర వస్తూ వుండినది.
To Trip up v a to make him fall కాలు జారి పడేటట్టు చేసుట. he ran awaybut I tripped him up వాడు పరుగెత్తబోతే వాణ్ని కాలు జారి పడేటట్టు చేసినాను.
To Triple v a మూడింతలు చేసుట, మునుమడించుట.
To Tripse v n to run idly and sluttishly about దిక్కుమాలిన తొత్తుగాతిరుగుట.
To Triturate v a to thrash, to pound నూర్చుట, నూరుట.
To Triumph v n to obtain victory జయమును పొందుట. at last he *edతుదకు జయమును పొందినాడు.
To Troll v a to play, to roll ఆడించుట, తిప్పుట.
To Troop v n to go or run hastely దబదబ పరుగెత్తుట. the beggars cametrooping to his door బిచ్చగాండ్లు వాడింటి ముందరికి గుంపులుగుంపులుగా వచ్చినారు.
To Trot v n to move with a high jolting pace దాట్లు వేసుకొంటూ పరుగెత్తుట,యిది బండి గుర్రపు పరుగును గురించిన మాట. she was always trotting aboutఅది యిటూ అటు తిరుగుతూ వుండినది. a hard trotting horse అధికముగా కుదిలిస్తూపరుగెత్తే గుర్రము.
To Trouble v a తొందరపెట్టుట, శ్రమపెట్టుట, హింసించుట. he *d the waterనీళ్ళను కలిపినాడు. I will * you for the book ఆ పుస్తకము రవంత యియ్యండి. Iwill * you for the money ఆ రూకలు చెల్లించవోయి, ఆ రూకలు యియ్యరా. I amsorry to * you for the money ఆ రూకలు యివ్వవలసినది. I will * youfor a reason దీనికి సమాధానము చెప్పవోయి.
To Troul v a to play to roll ఆడించుట, తిప్పుట.
To Trounce v a to punish శిక్షించుట, దుండించుట, గద్దించుట.
To Trow v n to know, to suppose ( this is an old word ) ఎంచుట,తలచుట, ఎరుగుట, తెలుసుకొనుట. what then you get the ring and I am topay the money : I * వుంగరాన్ని నీవు అంటుకొనిపొయ్యేది రూకలు నేను అచ్చుకొనేదిగదా. I * not నే నెరగను, కాదుసుమీ. * you what she did అది చేసిన పని చూస్తివా.you * what ! ( the thing I won't mention ) అల్ల అది, నీ వెరిగిన ఆ సంగతి.* you ? నీకు తెలుసునా, నీవు యెరుగుదువా. Sometimes you is omitted, who isthat was drowned * ? ( as in Spectator No. 152.) అక్కడ ముణిగిపోయినదియెవరో తెలుసునా.

No comments:

Post a Comment