To Stoop v n వంగుట. she *ed and looked into the cave ఆ గుహలో తొంగిచూచినది. he made me * and put the palanqueen on myshoulder నన్ను వంగపెట్టి పాలకీదండెను నా భుజము మీద పెట్టినాడు. the hawk *ed on the antelope ఆ డేగ లేడిమీద వాలినది. deign, condescend లొంగుట. will the government * to make a bargain with the shopkeeper యీ అంగటి వానితో బేరము చేయడమునకు గౌనరుమెంటువారు లొంగుదురా. he *ed to ask money for his daughter తన కూతిరికై రూకలు పుచ్చుకునేంత దైన్యము వానికి వచ్చినది. I would not *for to do this యింతపని చేయడానికి నేను లొంగను.
To Stop v a నిలుపుట, అడ్డగించుట. he stopped the work ఆ పనినిలిపినాడు. he stopped me from speaking నన్ను మాట్లాడనియ్యకుండానిపిలినాడు. he stopped me from going నన్ను పోకుండా నిలిపినాడు.he stopped the stream పారేనీళ్ళను అడ్డకట్టినాడు. this soonstopped his breath యిందువల్ల చచ్చినాడు. the pain stopped mybreath ఆ నొప్పిచేత వూపిరి పట్టుకొన్నది. he stopped the holewith earth ఆ బొందను మన్నువేసి పూడ్చీనాడు. he stopped the bottleఆ బుడ్డీకి బిరడా వేసినాడు. he stopped my mouth with his hand నన్ను మాట్లాడవద్దని తన చేతితో నా నోరు మూసినాడు. this remark ofmine stopped their mouths నేను యీ మాట చెప్పేటప్పటికి వాండ్లునోరు మూసినారు. they stopped the road, or they stopped up theway ఆ దోవను కట్టివేసినారు. they stopped the leak వోడును మూసినారు.he stopped his ears చెవులు మూసుకొన్నాడు. why do you * his wages?వాడి జీతమును యెందుకు నిలిపినావు, బిగబట్టినావు. the merchant has stopped payment ఆ వర్తకుడు దివాలెత్తినాడు.
To store v a కూడబెట్టుట, చేర్చిపెట్టుట, సంగ్రహము చేసి వుంచుట. he *d the town with grain ఆ వూళ్ళో నిండా ధాన్యముచేర్చి పెట్టినాడు, సంగ్రహము చేసి వుంచినాడు.
To Storm v a to attack by open force దొమ్మిచేసుట.
To Stow v a to lay up చేర్చిపెట్టుట, కూర్చి పెట్టుట, పోగుచేసిపెట్టుట, సంగ్రహించిపెట్టుట.
To Straddle v n to stand or walk with the feet removed far from each other to the right and left అంగలువేసుట. to part the legs wide కాళ్ళు పంగటించుట.
To Straggle v n to wander dispersedly చెదిరిపోవుట, చెదిరిమూలకొకటిగా తిరుగుట.
To Straighten v a to make not crooked వంకరలు తీర్చుట, చక్కచేసుట, దిద్దుట. can you * a crooked stick? వంకరకొయ్య యొక్క వంకరలు తీర్చగలవా. to reduce దీనదశలోకి తెచ్చుట.this loss *ed his circumstances యీ నష్టము వచ్చినందున వాడు బీదవాడై పోయినాడు. he *ed himself to assist me నాకు సహాయము చేయడమునకై నిండా ప్రయాసపడ్డాడు.
To Strain v a to purify by filtration వడికట్టుట, వడియకట్టుట, వస్త్రఘాలితము చేసుట. to * water from impuritiesనీళ్ళను వడికట్టుట. to * off the water from boiled rice అన్నము వార్చుట. rice that is *ed till dry వడియవేసినబియ్యము, వార్చిన అన్నము. he *ed the rope till it broke ఆ దారము తెగేటట్టుగా బలముగా పట్టిలాగినాడు. he *ed the eyes to read books written on palm leaves తాటాకు పుస్తకాలు చదవడము కంటికి వుపద్రవముగా వుంటున్నది. we *ed our eyesto see it అది కంటికి అగుపడి అగుపడకుండా పోయినది. my eyeswere *ed in reading this దీన్ని చదవడమువల్ల నా కంటికి వుపద్రవము వచ్చినది. he *ed his hand వాని చెయ్యి బెణికినది.he had *ed his neck వాని మెడ యిరుకు పట్టుకొన్నది. he *ed his voice అరిచినందున వాని గొంతు పగిలినది. వాని గొంతు కమ్మినదివాని గొంతు రాసినది. he *ed his lungs నిండా అరిచినాడు. the judgeshould never * the law to gratify himself న్యాయాధిపతిగా వుండేవాడుతన యిష్టప్రకారము చేయడమునకై చట్టమునకు అపార్థము చేయరాదు. this isa *ed meaning of the word యిది సహజమైన అర్దము కాదు, యిది నిండపీకులాడి చేసిన అర్థము.
To Straiten v a to distress ఇబ్బందిచేసుట, సంకటము చేసుట.this *ed his circumstances యిందువల్ల వాడికి తొందర వచ్చినది.
To Strand v a ఒడ్డుతట్టేటట్టుచేసుట. the storm *ed theship గాలి వాడ వొడ్డు తట్టి చెడిపోయనది.
To Strangle v a గొంతుపిసికి చంపుట, ఊపిరి బిగబట్టి చంపుట. to suppress అణిచివేసుట, అణగ్గొట్టుట. these weeds *d the corn యీ కలుపుఆ పయిరును తలఎత్తనివ్వలేదు. he *d the evidence ఆ సాక్ష్యమును అణిచివేసినాడు. she was almost *d with laughing వూరికె నవ్వడములో దాని ప్రాణము పొయ్యేటట్టుగా వుండినది.
To Strap v a to bind with a strap వారుతో బిగించికట్టుట.to beat with a strap వారుతో కొట్టుట.
To Stray v n to wander, to rove తప్పిపోవుట, దారి తప్పిపోవుట.the cattle *ed from the road గొడ్లు దోవ తప్పిపోయినవి, చెదిరిపోయినవి.
To Streak v a చారలు వేసుట, పట్టెలు తీర్చుట, రేఖలు వేసుట.
To Stream v n ప్రవహించుట, పారుట. the sweat *ed down his faceవాడి ముఖము వెంట చెమటలు కారినవి. the people *ed out of the townప్రజ పట్టణములో నుంచి ప్రవాహమువలె బైలుదేరినది.
To Strenghten v n బలమవుట. the wind is strengthening గాలిమరి మరి బలమవుతున్నది.
To Strengthen v a బలపరుచుట, బలము చేసుట, దృఢపరుచుట.this *s his claim యిది వాడి వ్యాజ్యానికి బలమవుతున్నది.
To Stretch v a to extend చాచుట, పరచుట, విస్తరింపచేసుట.he *ed the mat on the floor చాపను పరిచినాడు. he *ed the rope ఆ తాటిని సాగతీశినాడు. he *ed out his arm చేయిచాచినాడు. to * the limbs on awaking ఒళ్ళు విరుచుకొనుట. he walked about to * his legs కాళ్ళు తిమురు తియ్యడానకై నడిచినాడు.
To Strew v a చల్లుట. he *ed a carpet రత్నకంబళి పరిచినాడు. she *ed the hall with flowers ఆ కూటములో పుష్పములను చల్లినదిthe hall was *ed with flowers ఆ కూటములో పుష్పములు చల్లివుండినవి.
To Stride v n అంగవేయుట.
To Strike v a కొట్టుట. to * with the open hand అరిచచేతితో చరుచుట. to * with the fist గుద్దుట. to * a bell or drum వాయించుట.the mud struck my face బురద నా ముఖము మీద చెదరినది. he struck ten blows పది దెబ్బలు కొట్టినాడు. it *s me he is gone వాడు వెళ్ళినాడని తోస్తున్నది. does it not * you this is wrong? యిది తప్పు అని మీకు తోచలేదా. this struck me as very strange యిది నాకు వింతగా తోచినది. one thing *s me నాకు వోకటి తోస్తున్నది. it *s seven యేడుగంటలు కొట్టుతున్వవి. to * a balance లెక్కతీర్పుచేసుట.to * a bargain బేరముతట్టుట, బేరము చేసుట. to * coin నాణ్యము వేసుట. the horse's shoes struck fire గుర్రము యొక్క లాడములు తగిలి నిప్పు మిణుగురులు లేస్తవి. they struck their flag కోడిని దించినారు. he struck light a చెకుముకి వేసి నిప్పును కలగచేసినాడు.he struck a line గీత గీసినాడు. they struck a peace సమాధానము చేసినారు. to * sail వాడ చాపలను దించుట. to * the strings of a lute వీణె వాయించుట, తంబుర మీటుట. to * a tent గుడారమును పడగొట్టుట, గుడారమును పెరుకుట. to * a total వెరశికట్టు. the labourers struck work పని వాండ్లు పనిచేసేది లేదని తిరిగబడ్డారు. thelightning struck him dead పిడుగుపడి చచ్చినాడు. these words struckhim dumb యీ మాటలతో వాడి నోరు అణిగినది. to * with fear భయపరుచుట.he struck off the item ఆ పద్దును కొట్టివేసినాడు. they struck off his head వాని తలను కొట్టివేసినారు. they struck off 2000 copies of the book ఆ పుస్తకమును రెండు వేల ప్రతులు అచ్చు వేయించినారు. he struck out a new rule కొత్త సూత్రమును కనిపెట్టినాడు. the drums * up a march ప్రయాణతంబుర కొట్టుతారు. they struck up a new plan కొత్తగా వొక యుక్తి చేసినారు. they struck up a marriage నిమిషములోవొక పెండ్లి చేయించినారు.
To String v a to prepare a fiddle పిడీలుకు నరాలు వేసుట.to file on a string కూర్చుట, గుచ్చుట. to * pearls ముత్యాలుకూర్చుట he strung several stories together కొన్ని కథలనుమాలికగా చేర్చినాడు.
To Strip v a to make bare నిర్వాణము చేసుట. they stripped the tree of its bark చెట్టుపట్టను వొలిచి వేసినారు. when a storm *s the tree గాలికి ఆకులంతా రాలిపోయినప్పుడు. he was stripped to hisshirt వాణ్ని గోచితో విడిచిపెట్టినారు. to rob దోచుకొనుట. the thieves stripped him దొంగలు వాణ్ని నిలువు దోపు దోచుకొన్నారు. his creditors stripped him అప్పుల వాండ్లు వాణ్ని గుల్లచేసి విడిచిపెట్టినారు. they stripped him of his goods వాని సొత్తును అపహరించుకొన్నారు.
To Stripe v a గీతలు గీచుట, గీతలువేసుట, పట్టెలు వేసుట. he *d the wall with red గోడకు యెర్రపట్టెలు వేసినాడు.
To Strive v n to endeavour యత్నము చేసుట. to struggleపోట్లాడుట. or contend పోరాడుట.
To Stroke v a జవురుట, దువ్వుట.
To Stroll v n to walk idly సోమారిగా తిరుగుట, విహరించుట.he *ed into the house అట్లా తిరిగి యింట్లో జొరపడ్డాడు. a strolling beggar వూరు తిరిగే బిచ్చగాడు. strolling playersవూళ్ళమీద తిరిగే వేషగాండ్లు.
To Strow v a చల్లుట.
To Struggle v n పోరాడుట, పెనుగులాడుట, గుంజులాడుట, మల్లాడుటశ్రమపడుట, ప్రయాసపడుట, పాటుబడుట. Struggle, n. s. పోరాటము, పెనుగులాట, ప్రయాస, శ్రమ, మల్లాటము.in its *s the horse struck him గుర్రము తన ప్రాణానికై తన్నుకలాడుతూవుండగా దాని కాలు వాడిమీద తగిలినది.
To Strum v a వీణె మీటుట, యిది నీచశబ్దము.
To Strut v n to walk with affected dignity అతిగర్వముగానడుచుట, అహంకారముగా నడుచుట, నిక్కుతూ నడుచుట. to projectపైకి వుబ్బుట.
To Stub up v a పెళ్ళగించుట, పెరిగివేసుట.
To Stud v a గుబ్బ మేకులు కొట్టుట. studded with gems రత్నఖచితమైన.heaven is studded with stars ఆకాశము నక్షత్రములచేత అలంకరింపబడివున్నది. that country is studded with fortresses ఆ దేశములో అడుగుకు వొక కోట వున్నది. his face was studded with pimples వాడి ముఖమంతామొటిమలుగా వుండినది.
To Study v a to apply the mind to, to consider attentivelyఆలోచించుట, విచారించుట. the dog studied the man's face వాని భావమెట్టిదో అని కుక్క వాడిముఖాన్ని వూరికే చూచినది. she studied the picture a long time ఆ పటాన్ని శానా సేపు గురుతుగా చూచినది, ఆ పటాన్నిఆనికిగా చూచినది. they * his wishes ఆయన యిష్టమునే విచారిస్తారు.to learn by application చదువుట, అభ్యసించుట, నేర్చుకొనుట.he studied English for two years రెండు యేండ్లు ఇంగ్లీషుచదివినాడు.
To Stuff v a to fIll నించుట, నింపుట, కూరుట. he *ed twelevehandkerchiefs into his mouth to conceal his laughter నవ్వునుఅణుచుకోవడమునకై నోట్లో రుమాలగుడ్డను కూరుకున్నాడు. she *ed the pillowwith cotton ఆ తలగడలో పత్తిని అడిచినది, కూరినది. he *ed himselfకడుపునిండా మెక్కినాడు. if a sick man *s himself how can he live?రోగిగా వుండేవాడు అధిక తిండి తింటే యెట్లా బ్రతుకును. she *s her childఅది బిడ్డకు అధిక తిండి పెట్టుతున్నది. he shot the birds and *ed them పక్షులను తుపాకితో కాల్చి వాటి పొట్టలో వుండే దాన్ని తీసివేసి బొచ్చుతోలేక దూదితో నించినాడు. the channel was *ed with sand ఆ కాలవలో యిసుకకూరుకొన్నది.
To Stultify v a to make him a fool వెర్రివాణ్నిగా చేసుట.వ్యర్ధము చేసుట. such treahcery would * the proceedings of Governmentయిటువంటి ద్రోహమువల్ల గౌనరుమెంటువారి ఆలోచన నిరరర్ధకమైపోను. you havestultified in the business. యీ పనిలో గడ్డితిన్నావు.
To Stumble v n తడబడుట, తప్పుట, పొరబడుట. this horse *s యీ గుర్రము కాలు జారిపడుతున్నది. I *d and nearly fell కాలుజారి పడక తప్పినాను. he *s in speaking మాట్లాడడములో వాడికి నోరు తడబడుతున్నది.I *d upon this passage in the poem ఆ కావ్యములో యీ శ్లోకము అడ్డము వచ్చినది. I *d upon him in the road దారిలో వాడు నాకు అడ్డుపడ్డాడు, యెదురుపడ్డాడు. in this town you * on Europeans at every step యీ వూరిలో అడుగడుగుకు యూరోపు దేశస్థులు యెదురుపడతారు.
To Stun v a దిమ్ముపట్టేటట్టుచేసుట. the blow stunned himఆ దెబ్బచేత వాడి తల దిమ్ముపట్టినది. the stench stunned him ఆ కంపువాడి ప్రాణానికి వచ్చినది.
To Stunt v a గిటకపారేటట్టు చేసుట, పెరగ నియ్యకుండా చేసుట.
To Stupify v a తెలివితప్పించుట, స్మారకము తప్పేటట్టుచేసుట.
To Stutter v n నత్తిగా మాట్లాడుట.
To Style v a పేరు పెట్టుట. they *d him minister, but he is not such in reality వాడికి మంత్రియని పేరు పెట్టినది మాత్రమేగాని వాడు నిజముగా మంత్రి కాడు.
To Subdivide v a భాగమును భాగించుట.
To Subdue v a జయించుట, గెలుచుట, అణచివేసుట.
To Subject v a to put under చేతికింద వుంచుట, లోపరుచుట. he *ed the account to trial యీ లెక్కను విమర్శించినాడు. he *ed the gold to fire ఆ బంగారును నిప్పులో పెట్టినాడు.
To Subjoin v a చేర్చుట, జంటించుట. he wrote a letter to which he *ed an account వొక జాబు వ్రాసి దానితోకూడా వొక లెక్కను జంటించినాడు.I * their declaration వాండ్లు చెప్పిన మాటలను యీ కింద వ్రాస్తున్నాను. the subjoined account యీ కింద వ్రాసిన లెక్క.
To Subjugate v a to conquer జయించుట, గెలుచుట, స్వాధీనము చేసుకోవడము.
To Sublimate v a to raise by the force of chemical fire కాల్చుట, పుటము వేసుట, భ he *d the mercury రసమును భస్మము చేసినాడు.
To sublime v a భస్మము చేసటు, సున్నము చేసుట.
To Subminister v a to supply; to afford ఒదుగుట, ఉపచరించుట, సహాయము చేసుట.
To Submit v a అప్పగింతపెట్టుట. they submitted the gold to fire బంగారును నిప్పులో పెట్టినారు. I * it to you whether this can be right యిది న్యాయమో అన్యాయమో మీరే చెప్పండి. I have the honour to * the accounts లెక్కలను తమ సముఖానికి పంపించి వున్నాను.
To Suborn v a to procure such a false oath as constitutes perjury తప్పుసాక్షి చెప్పడమునకై మనుష్యులనను సంపాదించుట. he *ed three witnesses తప్పుసాక్షి చెప్పడమునకై ముగ్గురిని పిలుచుకొని వచ్చినాడు.
To Subpana v a to serve with a subpana సాక్షిసమ్మను యిచ్చుట.
To Subscribe v a to sign చేవ్రాలు చేసుట, వ్రాలు పెట్టుట. they *d the paper ఆ కాకితములో చేవ్రాలు చేసినారు. he *d his name తన వ్రాలు పెట్టినాడు. I do not * to his opinion వాడి అభిప్రాయమునునేను అంగీకరించను. to contribute money చందా వేసుకొని రూకలు యిచ్చుట, చందాపట్టీలో చేవ్రాలు చేసుట. each of them *d ten rupeesfor this business యీ పనికై తలా పది రూపాయలు యిచ్చేటట్టు చేవ్రాలు చేసినారు, తలా పది రూపాయీలు యిచ్చినారు. a subscribing witness చేవ్రాలు చేసినందుకు సాక్షీ.
To Subside v n అణుగుట, అణగిపోవుట, తీశిపోవుట, ఉపశమించుట. afterthe river *d యేట్లో నీళ్లు తిశిపోయిన తర్వాత. when the tumult *edఆ అల్లరి అణిగిన తర్వాత. when the fever *ed జ్వరము తీశిపోయిన తర్వాత.
To Subsist v n to live జీవించుట, జీవనము చేసుట, బ్రతుకుట.how am I to *? నేను యెట్లా బ్రతికేది, నేను యెట్లా జీవించేది. they* upon rice వాండ్లకు బియ్యము ఆహారము. they * upon alms వాండ్లు బిచ్చమెత్తుకొని జీవిస్తున్నారు, బిచ్చమెత్తి కాలక్షేపము చేసుకొంటున్నారు.
To Substantiate v a to prove నిరూపించుట, నిజపరుచుట.
To Substend v a to be opposite ఎదురుగా వుండుట.
To Substitute v a to put in the place of another బదులుగా పెట్టుట, ప్రత్యామ్నాయముగా వుంచుట. they *d him for me నాకు బదులుగావాణ్ని పెట్టినారు, నాకు ప్రత్యామ్నాయముగా వాణ్ని పెట్టినారు. he *d lead for silver వెండికి బదులుగా సీసము పోశినాడు.
To Substract v a to take away part from the whole కొంత తీశి వేసుట, తోశివేసుట. if you * ten from a hundred it leavesninety నూటిలో పది తోశివేస్తే తొంభై వుంటున్నది. he *ed one paper out of the bundle ఆ కట్టలో వొక కాకితము పెరుక్కొన్నాడు.
To Subtilize v a to make thin సూక్ష్మము చేసుట, పొడి చేసుట.to refine పుటము వేసుట.
To Subtract v a తోశివేసుట, తీశివేసుట, బాగారించుట. if you* ten from a hundred ninety remain నూటిలో పది తోసివేస్తే తొంభైవుంటున్నది.
To Subvert v a చెరుపుట, నాశనము చేసుట.
To Succeed v n to obtain one's wish సిద్ధించుట, అనుకూలించుట,నెరవేరుట. I have *ed నా యత్నము సిద్ధించినది. he *ed in thisundertaking యీ పని వానికి అనుకూలించినది, సిద్ధించినది. if they * in gaining heaven వాండ్లకు మోక్షము చేకూరినట్టయితే. when we * in gaining the shore మనము సుఖముగా గట్టుకు చేరినట్టయితే. he *ed in catching them వాటిని పట్టుకోవలెనని చేసిన యత్నము సిద్ధించినది. he did not * in trade వాడు వర్తకములో బాగుపడలేదు, వానికి వర్తకము కూడిరాలేదు. he *ed to his father's estate తండ్రి ఆస్తికి కర్త అయినాడు. did you *? నీకు దొరికినదా, నీకు జయమైనదా నీ పని అనుకూలమైనదా.
To Succour v a to help, to assist in difficulty or distressరక్షించుట, కాపాడుట, ఆదరించుట, సహాయము చేసుట, ఉపకారము చేసుట.
To Succumb v n లొంగుట, లోబడుట, వోడుట.
To Suck v A పాలుకుడుచుట, పీల్చుట. the leech *s blood జెలగ రక్తమును పీలుస్తున్నది. a sucking calf పాలుకుడిచేదూడ.a sucking child చంటిబిడ్డ.
To Suckle v a పాలుయిచ్చుట, చన్ను యిచ్చుట.
To Sue v a to prosecute by law వ్యాజ్యము చేసుట, దావాచేసటు.
To Suffer v a to bear అనుభవించుట, పడుట, సహించుట. to *pain శ్రమపడుట. will you * me to go? నన్ను పోనిస్తారా. this vowel *s elsion యీ అచ్చు లోపిస్తున్నది. the hardships he *ed వాడు పడ్డ కష్టములు. he *ed a great loss నిండా నష్టపడ్డాడు, నష్టమును పొందినాడు. he *ed punishment శిక్షను పొందినాడు. will God * them to perish? దేవుడు వాండ్లను చెడిపోనిచ్చునా.
To Suffice v n and v. a. to be enough చాలుట. to satisfy తృప్తిచేసుట.to be equal to the want or demand ఒదుగుట. this *d him for a bed యిదివాడికి పడకకు వొదిగినది, వుపయోగించినది. this *d him యిందువల్ల వాడికి తృప్తిఅయినది. * it to say that they are brothers వాండ్లు అన్నదమ్ములు యింకా యేమిచెప్పవలసినది.
To Suffocate v a ఉడ్డు గుడుచు కొనేట్టు చేసుట, ఊపిరి తిప్పుకోనియ్యకుండా చేసుట.to * with smoke as a torture ముంత పొగవేసుట. I am *d with this smoke యీపొగలో నేను వూపిరి తిప్పుకోలేక పోతిని, ఉడ్డుగుడుచు కొంటిని. he was *d with passion ఆగ్రహముచేత బిర్ర బిగుసుకొని యుండినాడు.
To Suffuse v a to spread వ్యాపింప చేసుట, నించుట. a face *ed with tearsకన్నీళ్ళతో నిండిన ముఖము. a blush *d her face దాని ముఖము యెర్రపారినది.
To Sugar v a చెక్కెర వేసుట.
To Suggest v a to hint; to intimate జాడచూపుట, తెలియచేసుట, తోపింపచేసుట. he *ed this plan to me నాకు వాడు యీ యుక్తిని చెప్పినాడు.he *ed to me that it would be better to pay the money ఆరూకలను చెల్లించి వేస్తే మంచిదని నాకు ఆలోచన చెప్పినాడు. I beg to *another plan మరి వొక యుక్తి మనివిచేస్తాను. God *ed this to himవాడికి దీన్ని దేవుడు ప్రేరేపణ చేసినాడు. another thought *s itself వేరేవొక తలంపు వచ్చినది.
To Suit v a to agree జతపడుట, సరిపడుట. such expressions as * theoccasion సమయోచితమైన మాటలు. this does not * me యిది నాకు సరిపడలేదు.he wrote so as to * his purposes తనకనుకూలమైనట్టు వ్రాసుకొన్నాడు. such a house as *ed him అతనికి అనుకూలమైన వొక యిల్లు. to * the action to the word అభినయించుట.
To Sulk v n ముఖము మాడ్చుట, మండిపడుట, చిరచిరలాడుట, కోపముగా వుండుట. to be idle to be lazy సోమారిగా వుండుట.
To Sully v a to tarnish; to spot కళంక యుక్తముగా చేసుట. time sullies silver దినాల పేరిట వెండి నల్లబడిపోతున్నది. these stories * his good name యీ మాటలచేత వాడి మంచి పేరుకు వొక కళంకము వచ్చినది.
To Summer v n to pass the summer ఎండ కాలమును గడుపుట. they *edthere యెండాకాలమును అక్కడ గడిపినారు.
To Summon v a పిలుచుట, పిలిపించుట, పిలవనంపుట. I was *ed home by my mother'sillness తల్లిగారికి దేహము ఆశక్తముగా వున్నందున నేను వూరికి పోవలసివచ్చినది.
To Sun v a ఎండ పెట్టుట. he sunned himself హాయిగా యెండలో తిరిగినాడు.
To Sunder v a to part; to separete; to divide ఎడబాపుట పృథక్చేసుట, విభిన్నము చేసుట, ఖండించుట, తుండించుట. until death *ed them మరణముచేత వాండ్లకు వియోగము వచ్చే వరకు. he *ed the head from the body తలను శరీరమునువేరుచేసినాడు. this blow *ed the branch యీ దెబ్బతో ఆ కొమ్మ రెండు తునకలై పోయినది.he cut it in * తునకలు చేసినాడు.
To Sup v a to drink by mouthfuls గుక్కెడు గుక్కెడుగా తాగుట. to drink by little at a time; to sip జుర్రుట.
To Superabound v n to be stored with more than enough అధికముగా వుండుట, అపరిమితముగా వుండుట.
To Superadd v a to add over and above అధికముగా చేర్చుట, పైగా చేర్చుట. he *ed another injustice వాడు మరిన్ని వొక అన్యాయము చేసినాడు.
To Superinduce v a to add పైగా చేర్చుట. this *d fever యిందుచేత జ్వరము కూడా వచ్చినది.
To Superintend v a to oversee, to manage పై విచారణచేసుట.he who *s twenty schools యిరువై పల్లెకూటములకు పై విచారణచేసేవాడు.
To Superscribe v a to write on the outside పై విలాసము వ్రాసుట.
To Supersede v a to set aside కొట్టివేసుట, నిషేధించుట. thenew rule *s the old one కొత్త సూత్రముచేత పాత సూత్రము కొట్టుబడి పోయినది.
To Supervene v n to come as an extraneous addition సంభవించుట, తటస్థించుట. a swelling *d వాపు కనిపించింది. fever*d జ్వరము వచ్చినది.
To Supervise v a to oversee పై విచారణ చేసుకొనుట.
To Supplant n a to trip up heels బోర్లతోసుట. to displaceby stratagem తంత్రములుచేసి స్థానభ్రష్టునిగా చేసుట, కయుక్తులుచేసివెళ్లగొట్టి ఆ భాగ్యమును తాను వాడుకొనుట. he *ed me నామీద కుయుక్తులు చేసి నన్ను గొట్టి నా వుద్యోగములో ప్రవేశించినాడు. *ed me in the king'sfavour ప్రభువుకు నా మీద విరోధము పుట్టించి తాను మంచేవాడైనాడు.
To Supplicate v a వేడుకొనుట, బతిమాలుకొనుట. they *d him for justice న్యాయము మజరిగించవలెనని వేడుకొన్నారు.
To Supply v a to fill up as any deficiencies happen పూర్తిచేసుట. to furnish అమర్చుట, జాగ్రతచేసుట. he supplied the army with provisions దండుకు కావలసిన రస్తు సిద్ధముచేసినాడు. they supplied him with food వాడికి అన్నము పెట్టినారు.the baker who supplies me with bread నాకు రొట్టెలు వేశేవాడు. to afford ఇచ్చుట. you must the ellipse to discover the senseఅర్ధము తెలిసేటట్టుగా ఆలోపమును పూర్తిచేయవలసినది.
To Support v a మోసుట, వహించుట. to sustain ఆదరించుట, రక్షించుట, కాపాడుట. he *s his sister వాడు తోడబుట్టినదాన్ని కాపాడుతాడు. the pillar that *s the beam ఆ దూలమును ఆదుకొనివుండే స్థంభము, ఆ దూలమునకు పోటు యిచ్చి వుండే స్థంభము. he *edthe weight for four hours నాలుగు గడియలదాకా ఆ బరువును మోసుకొని వుండినాడు. to endure సహించుట, పడుట, వోర్చుట. I cannot * this torment నేను యీ వుపద్రవమును పడలేను, తాళలేను,సహించలేను.
To Suppose v a and v. n. to lay down without proofఎంచుట, తలచుట, భావించుట, అనుకొనుట, ఊహించుట. I * he didthis వాడు అట్లా చేసివుండును. so I * అవునేమో, కాబోలు. I came because I *d they were here వాండ్లు యిక్కడఉన్నారని అనుకొన్నాను.I * there are two hundred యిన్నూరు వుండును. he *s there are two hundred యిన్నూరు వుండునంటాడు. I * he went there వాడు అక్కడికిపోయినాడేమో. I * you are going there మీరు అక్కడికి పోతారేమో, మీరుఅక్కడికి పోతారనుకొంటిని. I *d he would do so వాడు అట్లా చేసుననియెంచుకుంటిని. you would have *d it to be pearl అది ముత్యమని భ్రమసి వుందురు. it cannot be *d that they consented వాండ్లు సమాధాన పడ్డారనుకోరాదు. well * he omitted it సరే వాడు విడిచిపెట్టినప్పటికిన్ని. * you do so నీవు అట్లా చేసినట్టయితే. * you goand tell him నీవు వాడితో పోయి చెప్పితే యేమి. * there are two hundred యిన్నూరు వుండే పక్షమందు.
To Suppress v a to conceal అణుచుట, అణగగొట్టుట. he *ed his anger కోపమును అణచుకొన్నాడు. suppressing his feelings దుఃఖమును అణచుకొని. they *ed the evidence ఆ సాక్షిని మరుగు పరిచినారు. she *ed her tears కన్నీళ్ళను కడుపులోకి దించుకొన్నది. she *ed her laughter నవ్వునుఅణచుకొన్నది. they*ed the letter ఆ జాబును బయిటపెట్టలేదు.
To Suppurate v n to generate pus or matter చీముపట్టుట, చీముపోసుట.
To Surcease v n to be at an end; to stop తీరుట, ముగియుట,మానుట.
To Surfeit v a to make sick with eating, &c. ముఖముకొట్టుట,వెక్కసము చేసుట, వెగటు చేసుట. pleasures that never * తనివిదీరనిసుఖములు. he first *ed himself with pleasure and then became a monk మొదట యావత్తు సుఖములను అనుభవించి విసుకు పుట్టిన తర్వాత సన్యసించినాడు. why should you * yourself with pleasure? విసుకుపుట్టేటట్టు వూరికే నీకు యిన్ని సుఖము లెందుకు. he went on eating till he *ed himself వెక్కసము పుట్టేదాకా తిన్నాడు, ముక్కుమోయ తిన్నాడు.
To Surge v n to swell; to rise high అలలు వచ్చుట, ఉల్లోలకల్లోలముగా వుండుట.
To Surmise v a and v. n. to suspect సందేహించుట,సంశయించుట. I * that this is false యిది అబద్ధమనితోస్తున్నది.
To Surmount v a సాధించుట. all the difficulties that he *ed వాడు సాధించిన కష్టమైన పనులు.
To Surname v a విశేషనామమును యిచ్చుట. and Simon he *d Peter మరిన్ని సైమోను అనే వానిక పీతరు అనే పేరు పెట్టినారు, సీమోనేపీతర యిత్యుపనామ దదౌ. A+. Surnamed, adj. విశేషనామముగల. Wm * Rufus రూఫస్ అనే శేషనాముగల ఉల్లియము. Simon * Peter పీతరనే విశేషనామముగల సీమను. పితరనామ్నావిఖ్యాతోయః సీమోను. A+.
To Surpass v a మించుట, అతిశయించుట. he *ed them in learning చదువులో వాండ్లను మించినాడు. he *ed them in glory వాండ్లకంటే మించిన కీర్తినిపొందినాడు.
To Surprise v a to astonish ఆశ్చర్యపరుచుట, భ్రమింపచేసుట. this *d them యిదీ వాండ్లకు ఆశ్చర్యమైనది. I *d him వానికి ఆశ్చర్యమైనది. I *d him వానికి ఆశ్చర్యమయ్యేటట్టు చేసినాను, వాణ్ని లటక్కున పట్టుకొన్నాను. you * me! హా! హా! to take unawares యేమరిపాటుగా వచ్చి పట్టుకొనుట. they *d him at his brothers house అన్న యింట్లో వాడు వాండ్లకు చిక్కినాడు, దొరికినాడు.
To Surrender v a to yield, to give up అప్పగించుట, యిచ్చివేసుట.he *ed the fort కోటను శత్రువుల చేతికి అప్పగించినాడు. he *ed his life తనప్రాణమును అప్పగించినాడు, చంపితే చంపండని వుండినాడు.
To Surround v a చుట్టుకొనుట, ఆవరించుకొనుట, పరివేష్టించుకొనుట.the enemy *ed him శత్రువులు వచ్చి వాణ్ని చుట్టుకొన్నారు. when difficulty *s us మనకు నానాందాలా కష్టము వచ్చినప్పుడు. Surrounded, adj. చుట్టుకోబడ్డ, పరివేష్టించబడ్డ. a town* by forests నాలుగుతట్లా అడవి మూసుకొని వుండే పట్టణము,అడివి నడమ వుండే పట్టణము.
To Survey v a to view, look at చూచుట, విచారించుట,ఆద్యంతముగా చూచుట. he *ed the garden and admired it ఆ తోటను చూచి ఆశ్చర్యపడ్డాడు. he *ed me with astonishment నన్ను యెగాదిగా చూచినాడు. to measure and estimate land or buildings కొలుచుట, భూములను కొలుచుట. he *ed the district ఆ తాలూకా భూములను కొలిచి లెక్క యేర్పరచినాడు.
To Survive v a చావక మిగిలి వుండుట. he *ed his brother three years అన్న చచ్చిన మూడేండ్లకు వాడు చచ్చినాడు.Alas! I shall never * her loss అయ్యో ఆమె చచ్చి నేను బ్రతికి వుండరాదు. he is very ill, but I think he will * itనిండా అశక్తముగా వున్నప్పటికిన్ని యిందువల్ల వాడు చావడని తోస్తున్నది.he will not * this punishment యీ శిక్ష చేస్తే వాడు బ్రతకడు, ఆ శిక్షతో వాడు చచ్చును. he did not * the blow ఆ దెబ్బతో చచ్చినాడు.
To Suspect v a to fear, to doubt; think guilty అనుమానపడుట, సందేహపడుట, సంశయించుట, సంశయపడుట. I * he is gone వెళ్ళినాడేమో. I * నాకు అనుమానముగా వున్నది.I * this is wrong యిది తప్పు అని నాకు తోస్తున్నది. you should not * him అతన్ని గురించి సందేహించరాదు, వాడు దొంగ అని తలచరాదు.
To Suspend v a to hang వేలవేసుట, వేలాడవేసుట. they *ed a light over the gate గడపలో వొక దీపమును వేలాడకట్టినారు.to make to stop for a time నిలిపిపెట్టుట. they *ed him fora month వాణ్ని వుద్యోగములో నుంచి నెల్లాండ్లు తోసిపెట్టినారు.
To Suspire v n పెద్ద వూపిరి విడుచుట.
To Sustain v a to bear భరించుట, మోసుట, ఆదుకొనుట.the pillars which * the beam దూలమును ఆదుకొని వుండే స్తంభములు.God *s the world దేవుడు లోకమును సంరక్షిస్తున్నాడు. this wall isnot strong enough to * the flood యీ గోడ ఆ ప్రవాహమునకు తాళేంతబలము గలది కాదు. they *ed the weight on their shoulders ఆ బరువు భుజాన మోసుకొన్నారు. I cannot * this weight any longer యీ బరువునికమోయలేను. God *ed us in need దారిద్య్రములో దేవుడు చెయ్యిచ్చినాడు. he *ed the office of minister for ten years పది సంవత్సరములు మంత్రిగా వుండి నిర్వహించినాడు. support, maintain, help సంరక్షించుట,కాపాడుట, నిర్వహించుట. he *ed all the family ఆ కుటుంబమునంతా రక్షించినాడు. to endure సహించుట, తాళుట, ఓర్చుకొనుట. he *ed much persecution for this యిందు నిమిత్తము నానా పాట్లుబడ్డాడు. the poor * many difficulties బీదలు బహు సంకటపడుతారు. I could not* the sight of her misery దాని కష్టమును చూచి భరించలేను. he *ed a loss in this యిందులో వాడు నష్టపడ్డాడు.
To Swab v a నారకట్టతో వాడలో తట్టును నీళ్లుపోశి కడిగి శుద్ధిచేసుట.
To Swaddle v a to swathe అప్పుడు పుట్టిన బిడ్డలకు కాళ్ళు చేతులు కదలకుండా బట్టలు చుట్టుట, యిది యిప్పటి మర్యాద కాదు.
To Swag v n swag, వేలాడుట. a * belly వేలాడే పొట్ట. Ganesa has a * belly పిళ్ళారి వేలాడే పొట్టగల వాడు.
To Swagger v n గప్పాలు కొట్టుట, జంభాలు కొట్టుట, జల్లికొట్టుట.
To Swallow v a మింగుట, భక్షించుట. to engross అపహరించుట,నోట్లో వేసుకొనుట. this business *ed up all his wealth యీ పనివాని రూకలనంతా ఆకర్షించి వేసినది. the waters *ed him up నీళ్ళువాణ్ని లోనికి యీడ్చుకొని పోయినది.
To Swamp v a to whelm or sink as in a swamp ముంచుట.the rain *ed the field ఆ పొలము వాన నీళ్ళలో మునిగి పోయినది,ఆ పొలము మీద వాననీళ్ళు నిలిచి వుండినది.
To Swap v a మార్చుట, మార్చుకొనుట, పరివర్తన చేసుకొనుట, ఇది నీచశబ్దము. (Redgauntlet Letter 4, page 59.)
To Swarm v n to collect and depart from a hive by fight in a body as hive by flight in a body, as bees, ముసురుకొణుట.Bees * in warm clear days in summer తేనీగలు వలసపోతవి. the children *ed around him బిడ్డలు వాణ్ని చుట్టుకొన్నారు. lice * thereఅక్కడ పేలమయముగా వున్నది. the town *s with beggars or beggars * in this town యీ పట్టణము బిచ్చగాండ్లమయముగా వున్నది. his body *ed with lice, or lice *ed on his, body వాడి వొంటిని పేలుముసురుకొని వున్నది. this book *s with errors or errors * in this book యీ పుస్తకము అబద్ధాలపుట్టగా వున్నది. * to up a tree, or to climb up a tree చెట్టు యెక్కుట.
To Swathe v a to bind కట్టుకట్టుట, గాయము కట్టుట.
To Sway v a to wave in the hand విసురుట, తిప్పుట, ఆడించుట. to manage నిర్వహించుట. to * the sceptre అధికారముచేసుట, పరిపాలనము చేసుట, యేలుట. a man who is *ed by passion కామక్రోదవశ్యుడు, పంచేంద్రియబద్ధుడు.
To Swear v n ప్రమాణము చేసుట, బాస చేసుట. he swore byRama రాముడి మీద వొట్టు పెట్టుకొన్నాడు. he swore that it was true యిది నిజమని ప్రమాణముగా చెప్పినాడు. he swore at them వాండ్లను తిట్టినాడు, దూషించినాడు.
To Sweat v n చెమర్చుట, చెమటపట్టుట. his head *ed వాడితల చెమట పట్టినది. the marable *ed ఆ రాయి చెమర్చినది. the gum that *ed out బయట బయలుదేరిన బంక. the salt that *sout of the ground నేలమీద పూచేవుప్పు. the sweating sickness వాంతిభ్రాంతివంటి రోగము.
To Sweep v a ఊడ్చుట. to * and trim a house యింటినివూడ్చి చక్క పెట్టు. tresses that * the ground గుదికాళ్ళదాకాపడే వెంట్రుకలు. the sow's belly *s the ground పంది కడుపునేలజీరాడుతున్నది. boats that * the water నీళ్ళమీద వడిగా పొయ్యే పడవలు. they swept the water with their oars అ ల్లీసుకర్రలతో నీళ్లను చివచివ తోసినారు. to * a chimney పొగగూటినితుడుచుట, పొగగూటిలో కరదూపమును తుడిచి శుభ్రము చేసుట. the gunsswept the walls గుండు గోడల మీద పారినది. the eye *s the country దృష్టి ఆ దేశముమీద పారుతున్నది, ఆ దేశమంతా కంటికి తెలుస్తున్నది. she swept away the dust దుమ్మును వూడ్చివేసినది. the flood swept away several trees ప్రవాహము శానా చెట్లను వూడ్చుకొనిపోయినది. the cholera swept off one thousand people వాంతి భ్రాంతివెయ్యి మందిని కొంచపోయినది. she swept out the house యింటిని వూడ్డ్చి శుద్ధిచేసినది.
To Sweeten v a తీపు చేసుట, యింపు చేసుట, ప్రియము చేసుట. she *ed the milk పాలలో శర్కర వేసినది.
To Swell v n వాచుట, ఉబ్బుట, వూదుకొనుట, అధికమవుట, హెచ్చుట.when the flood *ed its height వెల్లువ నిండా అతిశయించేటప్పటికి.the ditches *ed with the rain వానచేత అగడ్తలలో నీళ్ళు వుబికినవి.his debts *ed to a large amount వాడికి అప్పు నిండా పెరిగినది.
To Swelter v n that is to Sweat చెమటబట్టుట, చెమర్చుట.
To Swerve v n to depart, to bend, to incline తప్పుట,వంగుట. the line of troops *d towards the hills వరసగాపొయ్యే దండు కొంచెము కోండల తట్టుకై పోయినది. they never *from this rule యీ సూత్రమునకు విరుద్ధముగా నడవరు. you mustnot * from this rule నీవు యీ సూత్ర భంగము చేయరాదు. In 1 Tim.1. 6. ********** ఏతత్పరాజ్ముఖాభూత్వా A+.
To Swig, or ToSwill v a. తాగుట, జుర్రుట, ఇది నీచమాట.
To Swim v n ఈదుట. or float తేలుట. the bottle wasswimming ఆ బుడ్డి తేలుతూ వుండినది. to be dizzy తిరుగుట,తిప్పుట. to * as the eyes కండ్లు తేలుకొని పోవుట, చెక్కుకొని పోవుట. my eyes were swimming నాకు కండ్లు చెక్కుకుని పోయినవి.my head *s నా తల తిరుగుతున్నది. she came swimming along అది కులుకుతూ వచ్చినది. To Swim, v. a. ఈది దాటుట, ఈతగొట్టి దాటుట. he swam the riverయేరు యీది దాటినాడు. every fish that *s the sea సముద్రములో సంచరించేప్రతిమత్స్యము.
To Swindle v a మాయచేసుట పచ్చెపు పని చేసుట. he *d me out of the money నన్ను మాయచేసి ఆ రూకలను అపహరించినాడు.
To Swing v n ఊగుట, ఊగులాడుట, ఉర్రట్లూగుట. the branch swung in the storm కొమ్మ గాలికి వూగులాడుతూ వుండినది. at this Hindu feast some people *; that is, they are swung by hooks in their backs యీ తిరునాళ్ళలో కొంద రుశిళ్లు ఆడుతారు. To Swing, v. a. ఊచుట. to whirl round in the air గిరగిరతిప్పుట. he swung the club round his head ఆ కర్రను తలచుట్టువిసిరినాడు. there he comes swinging his arms చేతులు వూచుకుంటూ వస్తున్నాడు.
To Swinge v a to whip; to punish కొరడాతో కొట్టుట,శిక్షచేసుట. the serpent *d his tail పాము తోకను జాడించినది.
To Swink v n to labour; to toil పాటుబడుట, కష్టపడుట.
To Switch v a బరికెతో కొట్టుట, కొయ్యతో కొట్టుట. the horse *ed his tail about గుర్రము తోకను యిటుఅటు విసిరినది.
To Swoon v n మూర్ఛపోవుట.
To Swoop v n to seize by falling at once as a hawk upon his prey దూరుట, తన్నుకొనిపోవుట. the hawk *ed and carried off the chicken డేగ లటుక్కున కోడిపిల్ల మీద పడి తన్నుకొని పోయినది.
To Swop, or ToSwap v a. to change or give a thing inexchange మార్చుకొనుట. I Swopped a horse with him నా గుర్రముయిచ్చి వాడి గుర్రమును తిసుకొన్నాను, ఇది నీచమాట.
To Symbolize v n to represent, to resemble దృష్టాంతద్వారా యెరుకచేసుట, ఉపమానముచేత తెలియచేసుట, తుల్యమవుట, సాదృశ్యమవుట. the Canarese and the Telugu languages * తెలుగు, కన్నడికి సంబంధము వున్నది.
To Sympathize v n to feel with another దుఃఖపడే వాణ్ని చూచి దుఃఖపడుట, నవ్వేవాణ్ని చూచి నవ్వుట, సంతోషపడేవాణ్ని చూచి సంతోషపడుట. I * with you regarding this sad event ఆ దుఃఖముమీకెంతో మాకు అంతే. they *d with me నేను యేడ్చేదాన్ని చూచి వాండ్లున్నుయేడ్చినారు, నేను సంతోషపడడము చూచి వాండ్లున్ను సంతోషపడ్డారు.
To Syringe v a to wash with a syringe చిమ్మన గొట్టముతోనీళ్ళు చిమ్మి శుభ్రము చేసుట.
To Taboo v a to guard by prohibition నిషేధము చేసుట. they *ed theground ఆ స్థలమునకు యెవరున్ను పోకూడదని నిషేధించియున్నారు. HIndu custom *s widows హిందువుల మరియాద విధవలను నిషిద్దము చేస్తున్నది, అనగా యే పనికిన్నివిధవలు కూడదు.
To Tack v a to join తగిలించుట, పోగుబోసుట, టకాలువేసుట, చేర్చుట,జంటించుట. she *ed the cloths together రెండు గుడ్డలను చేర్చి టాకాలు వేసినది.the carpenter *ed the boards together వడ్లవాడు పలకలను జోడించినాడు. he *ed on a bit of cloth మరి వొక గుడ్డను అతక పెట్టినాడు. he *ed on anotheraccount యిందాకటి లెక్క చాలక మరి వొక లెక్కను చేర్చినాడు.
To Tag v a to fit any thing with an end కొనకు తగిలించుట. he tagged thestrings with gold ఆ దారముల యొక్క కొనకు బంగారు రేకులు అతికించినాడు. to *a lace తాటికొనకు లోహమును తగిలించుట. he tagged the verses with rhymes ఆ పద్యములకు అంత్యనియమములు పెట్టినాడు.
To Taint v a to poison, to stain, to sully, to corrupt కళంకపరచుట,కళంకయుక్తముగా చేసుట, చెరుపుట, మైలచేసుట. putrid things * the air మురిగినవస్తువులవల్ల కంపు కలుగుతున్నది.
To Take v a to receive తీసుకొనుట, పుచ్చుకొనుట. he took a coach-manబండివాణ్ని పెట్టుకొన్నాడు, అనగా కొలువులో పెట్టుకొన్నాడు. he took an impressionof the seal ఆ ముద్రతో ముద్ర వేసినాడు. I took him along with me నాతో కూడాపిలుచుకొని పోయినాడు. he took them aside and gave them this adviceవాండ్లను అవతలికి పిలుచుకొనిపోయి యీ బుద్ధి చెప్పినాడు. he took her in marriageదాన్ని పెండ్లాడినాడు. she took the child over the bridge ఆ బిడ్డను వారధిదాటించినది. he took me through the wood నన్ను అడివి దాటించినాడు. you may* your own time in paying the money నీకిష్టమయినప్పుడు చెల్లించవచ్చును. itwill * ten days to finish this యిది ముగియడానకు పది దినాలు పట్టును. itwill * ten rupees to repair the box ఆ పెట్టెను చక్కపెట్టడానకు పది రూపాయలుపట్టును. it will * much time దీనికి నిండా కాలము పట్టును. it will * much timeదీనికి నిండా కాలము పట్టును. they * the fish in baskets చేపలను వూతలలోపట్టుతారు. the seize, to catch పట్టుకొనుట, లంకించుకొనుట. they took the thief ఆ దొంగను పట్టుకొన్నారు. he does not think God will * account of this దీన్నిదేవుడు విచారించునని వాడు యెంచలేదు. he took their advice వాండ్ల బుద్ధి విన్నాడు. he took aim and shot the bird వాడు గురిపెట్టి ఆ పక్షిని వేసినాడు. he took anairing గాలిసవారి పోయినాడు. he stopped to * breath వూపిరి తిప్పుకోవడమునకైనిలిచినాడు. to * care జాగ్రతగా వుండుట. * care భద్రము. he took care of hischildren బిడ్డలను విచారించుకొన్నాడు, బిడ్డలను తన విచారణలో వుంచుకొన్నాడు. shedoes not * care of her children అది తన బిడ్డల జోళి విచారించదు. I will * mychance of finding him at home వాడు యింట్లో వుండునేమో చూతాము. he tookcold వానికి జలుబు చేసినది. he took counsel with them వాండ్లతో ఆలోచించినాడు. what course did they * ? వాండ్లేదోవ పట్టి పోయినారు, వాండ్లు యేపని చేసినారు.he took a dislike to her వాడికి దాని మీద అసహ్యము పుట్టినది. he took a drinkof water కొంచెము నీళ్ళు తాగినాడు. the poison did not * effect ఆ విషమెక్కలేదు. as the spell did not * effect upon him యీ మంత్రము వాడిమీదపారలేదు గనక. he took the field యుద్ధానికి బయిలుదేరినాడు. to * fireరగులుకొనుట. they took fight పారిపోయిరి. the birds took flight పక్షులుయెగిరిపోయినవి. he took fright at the sight of a snake పామును చూచిభయపడ్డాడు. he took heart ధైర్యము తెచ్చుకొన్నాడు. he took heed to hisconduct జాగ్రతగా నడుచుకొన్నాడు. he took the hint I gave and went awayనేను చేసిన జాడ తెలుసుకొని పోయినాడు. to * hold of పట్టుకొనుట. he took hold ofher hand దాని చెయిపట్టుకొన్నాడు. he took a jump or skip వొక గంతు వేసినాడు.he took a kiss ముద్దు పెట్టుకొన్నాడు. he took the law of me నా మీదవ్యాజ్యము తెచ్చినాడు. when he took leave తాను శలవు పుచ్చుకోగానె. may I * theliberty to tell you one thing ? నేను అమర్యాదగా వొకటి చెప్పుతానుక్షమించవలెను. never * the liberties అమర్యాద చేయరాదు. the painter tookhis likeness very well చిత్రకారుడు వాణ్ని సరిగ్గా వ్రాసినాడు. they * their mealsin this place యీ స్థలములో భోజనము చేస్తారు. he does not * my meaningright వాడు నా భావము సరిగ్గా గ్రహించలేదు. do you * ? నీకు అథర్మమైనదా, నీకుభావము తెలిసినదా. he took the measure of the stone ఆ రాయిని కొలిచినాడు.he took measures to do this దీన్ని చేయడమునకు వుపాయములు వెతికినాడు. hetook the medicine ఆ మందు తిన్నాడు. he took a mouthful బొక్కెడు తిన్నాడు.he took his uncle's name మామ పేరు పెట్టుకొన్నాడు. he took no notice of us ఆయన మమ్మున కండ్లెత్తి చూడ లేదు. he took an oath ప్రమాణము చేసినాడు. hetook occasion to say this సమయము చూచుకొని యీ మాట చెప్పినాడు. he tookoffence at this దీని మీద అసహ్యము వచ్చినది. he took the opportunity tosay this సమయము చూచుకొని యీ మాట చెప్పినాడు. he took pains to masterit దాన్ని సాధించడమునకై బహు ప్రయాసపడ్డాడు. he took my part నాపక్ష మైనాడు.God took their part వాండ్లకు దైవ సహాయము వుండినది. you must takepatience నీకు తాళిమి వుండవలసినది. he took pity upon them వాండ్లను గురించిజాలిపడ్డాడు. to * place కలుగుట, సంభవించుట. a marriage took place పెండ్లితటస్థమైనది. if elision *s place లోపము వస్తే. a suit cannot * placeవ్యాజ్యము రారాదు. what more took place ? యింకా యేమి సంభవించినది, యింకాయేమి జరిగినది. he *s a pride in doing this యిది చేయడము వాడికి వొక గర్వము.they took a resolution వొక నిశ్చయము చేసిరి. to * revenge పగదీర్చుకొనుట.the plant did not * root ఆ చెట్టుకు యింకా వేళ్లు పారలేదు. these words tookroot in his mind యీ మాటలు వాని మనస్సులో పాదుకొన్నవి or నాటుకొన్నవి. hetook a run and leapt over the well పరుగెత్తి ఆ బావి దాటినాడు. * a seatకూరర్చుణ్నుండి. to * shame సిగ్గుపడుట. the demon took the shape of ahorse ఆ రాక్షసుడు అశ్వరూపమును వహించినాడు. he took shelter there అక్కడదాగినాడు. he took ship వాడ యెక్కినాడు. he took snuff పొడి వేసుకొన్నాడు, పొడిపీల్చినాడు. why should you * thought about this ? యిందున గురించి యేలవిచారపడుతావు. come and * turn in the garden వచ్చి తోటలో తిరుగు. she tookthe veil కాషాయాలు పుచ్చుకొన్నది, సన్యసించినది. he took a view of the villagefrom the hill ఆ కొండ మీద నుంచి ఆ వూరిని బాగా చూచినాడు, ఆ కొండ మీద నుండి ఆ వూరివలె కాకితము మీద వ్రాసినాడు. he took a voyage వాడ యెక్కి పోయినాడు. the dog took the water or took to the water కుక్క నీళ్ళలో దుమికి యీదినది. he took his may దోవ బట్టినాడు, he took a wife పెండ్లి చేసుకొన్నాడు. he took her to wife దాన్ని పెండ్లాడినాడు. the story took wind ఆ కథ బయిట పడ్డది. I took his word and went there వాడి మాట నమ్మి అక్కడికి పోతిని. he took them at their word వాండ్ల మాట పట్టుకొని వాండ్లనే చెరిపినాడు. he took it ill యిది అన్యాయముగా యెంచినాడు, I * it he is wrong వాడు తప్పినట్టు నాకు తోస్తున్నది. I took it in another sense నేను వేరే అర్థము చేసుకొన్నాను. I * it he went పోయినాడని తోస్తున్నది. he will * it very kindly if you go there నీవు అక్కడికి పోతే వాడికి సంతోషముగా వుండును. he took it very unkindly that you should say this నీవు యీ మాట అనడమువల్ల వాడికి నిండా అసహ్యము వచ్చినది. he certainly was angry, but ( * this along with you ) he has reason వాడు కోపము చేసినది సరే దానికి హేతువు వున్నది సుమీ. it is true that he was in debt, but ( * this along with you ) he has paid his debts వాడు అప్పులు పడ్డది వాస్తవమేకాని ఆ అప్పులను చెల్లించివేసినాడు సుమీ. he will * amiss if you speak to his wife వాడి పెండ్లాముతో నీవు మాట్లాడితే నీ మీద వాడికి ఆయాసము వచ్చును. why should you * thisamiss ? దీనికి యెందుకు ఆగ్రహపడుతావు. he took away the chair కూర్చీ అవతలికి తీసుకపోయినాడు. to * away a man's bread వొకని కూటిలో రాయి వేసుట. God took away her child దేవుడు దాని బిడ్డను తీసుకొని పోయినాడు, అనగా దానిబిడ్డ చచ్చిపోయినది.the cold or fright or tickling took away my breath నాకు వూపిరి తిరగక పోయినది, వుడ్డు గుడుచుకొన్నాను. he took her by the hand దాన్ని చెయి పట్టుకొన్నాడు. he took it by force of my hands నా చేతులో నుంచి దాన్ని తీసుక్కొన్నాడు. they took down the beam దూలమును దించినారు. he took down what they said వాండ్లుచెప్పినదాన్ని వ్రాసుకొన్నాడు, will * down his pride వాడి కొవ్వును అణుస్తాను. they took down the roof of the house ఆ యింటి పై పూరిని విచ్చివేసినారు. theytook down the wall ఆ గోడను పడగొట్టినారు. to suppose యెంచుకొనుట,అనుకొనుట. I took the tree for a man చెట్టును చూచి మనిషి అనుకొంటిని. I tookthe wood for stone ఆ కొయ్యను చూచి రాయి అనుకొంటిని. I took it for grantedhe would come వాడు వచ్చుననుకొంటిని. you must pay for it; I * itfor granted that you have the money దానికి నీవు రూకలు చెల్లించవలసినది నీదగ్గర రూకలు వుండవలెను. I was a stranger and he took me in నేనుపరదేశస్థుణ్ని అయినందున నాకు తన యింట్లో స్థలము యిచ్చినాడు. he took me in about this horse యీ గుర్రము విషయములో నన్ను మోసబుచ్చినాడు. after he tookthe work in hand ఆ పనికి మొదలుపెట్టిన తర్వాత, పూనుకొన్న తర్వాత. he *s inthe gazette వాడికి నిత్యము సమాచార పత్రిక వస్తున్నది. he took in a piece ofground కొంత నేలను తన నేలతో చేర్చుకొన్నాడు. he took in sail వాడ చాపనుదించినాడు. thou shalt not * God's name in vain వృథాగా దేవుడి పేరు యెత్తరాదు.they took it into consideration దీన్ని విమర్శించినారు. he took this into his head that I was his enemy నేను తనకు శత్రువునని పిచ్చిగా అనుకొన్నాడు, భ్రమపడ్డాడు. he took her into his arms దాన్ని కౌగలించుకొన్నాడు, ఆలింగనము చేసుకొన్నాడు. he took the law into his own hands దివాణము మూలకముగా కాకుండా తానే శిక్ష చేసినాడు. to * off తీసివేసుట, విడిచివేసుట, వీడ్చుట. he took off his clothes బట్టలు విడిచివేసినాడు. he took off the tiger's skin పులి తోలును దోచినాడు. a fever took him off జ్వరము వాణ్ని కొంచపోయినది. the boy took off hisfather's way of walking ఆ పిల్ల కాయ తండ్రివలె యెగతాళిగా నడిచినాడు. the school boy took off his master's way of talking పల్లె కూటపు పిల్లకాయ వుపాధ్యాయులవలె యెకసక్యముగా మాట్లాడినాడు. * off your hands చేతులు అవతలికి తియ్యి. I took it offhis hands అతని వద్ద కొనుక్కొన్నాను. to * off an impression అచ్చువేసుట, ముద్ర వేసుట. they took off a thousand impressions of the book వెయ్యి ప్రతులు అచ్చువేయించినారు. he took himself off i.e. he went away వాడు వెళ్ళినాడు. he took the ring off his finger తన వేలి వుంగరమును తీసినాడు. he took off his hat తల మీది టోపిని చేత తీసుకొన్నాడు. the surgeon took off his leg వయిద్యుడు వాని కాలు కోసివేసినాడు. she took on very much about this యిందున గురించి చాలా వ్యసనపడ్డది. he took out the nail ఆ చీలను పెరికినాడు, వూడదీసినాడు. he took the loom to pieces ఆ మగ్గమును వేరే వేరేగా వీడ్చివేసినాడు. this took the pride out ofthem యిందువల్ల వాండ్లకు గర్వభంగమైనది. taking these things together I believed the story వీటినంతా యోచించి ఆ మాటను నమ్మినాను. the bearers took up the palanqueen బోయీలు పాలకీని యెత్తుకొన్నారు. he took me up very angrily నా మీద కోపము చేసినాడు, చీవాట్లు పెట్టినాడు. they took the matter up ఆ సంగతిని విమర్శ చేసినారు. to * up quarters దిగుట, బసచేసుట. he took up his quarters in the lodge చావట్లో దిగినాడు. he took too much upon himself నిండా గర్వించినాడు. I will * upon myself to say that they are wrong వాండ్లు తప్పినారు అందుకు నేను వున్నాను these goods took very well here యీ సరుకులు యిక్కడ బాగా అమ్ముడుబోతవి.
To Talk v n మాట్లాడుట, సంభాషించుట. before the child could * బిడ్డకుమాటలు వచ్చేటందుకు మునుపు. he *ed with me about it అందున గురించి నాతోమాట్లాడినాడు, సంభాషించినాడు. to * in sleep కలవరించుట. he *ed very bigజంభాలు నరికినాడు, గబ్బాట్లు కొట్టినాడు. a talking fool వదురుబోతు. he is *ed ofas a thief దొంగ అని పేరుపడ్డాడు.
To Tally v n to fit, to suit సరిపడుట, జతపడుట, పొసగుట. these twoaccounts * ఆ లెక్కకు యీ లెక్కకు వ్యత్యాసము లేదు. his evidence does not *with yours వాడు చెప్పినది వొక దోవ నీవు చెప్పినది వొక దోవ.
To Tame v a to reduce from wildness; to make gentle మనుష్యులలోవాడుక చేసుట, మనుష్యులలో అలవాటు చేసుట. affliction *s pride వ్యాకులమునుగర్వమును అణస్తున్నది.
To Tamper v n to meddle జోలికి పోవుట, జోలికి వచ్చుట. he *ed with mywitnesses నా సాక్షులను చెరపజూచినాడు. he *ed with his watch until hespoiled it యిటూ అటూ యీడ్చి గడియారమును చెరిపినాడు. if you * with thedisease it will kill you నీవు ఆ రోగముతో చెల్లాటము చేస్తే అది నిన్ను చంపును. Isee they have been tampering with this document యీ దస్తావేజులో వాండ్లుకొంచెము వేలు పెట్టినట్టు వున్నది.
To Tan v a పదును చేసుట, ఇది చర్మమును గురించినమాట. the sun tanned herface యెండ చేత దాని ముఖము కందినది.
To Tantalize v a ఏమార్చుట, ఆశాభంగము చేసి ప్రాణము విసికేటట్టు చేసుట. hemerely *d me with promises యిదో అదో అని వట్టి ఆశలు పెట్టినాడు.
To Tap v a to strike gentle తట్టుట. the squirrel *s the ground withit's paw ఉడత కాలితో నేలను తట్టుతున్నది. to * palm tree తాటి చెట్టును గీయుట.they tapped him for the dropsy పాండు రోగము చేత వాచి వుండే వాడి కడుపులోవొక పక్క గీచి నీళ్లు కారేటట్టు చేసినారు. he tapped the cask పీపాయిలో రంధ్రముచేసి నీళ్లు యివతలికి వచ్చేటట్టు చేసినాడు.
To Taper v n to grow gradually smalller ఆదోకపాటుగా వుండుట, కూచిగావుండుట. the hill *s to a point ఆ కొండ కూచిగా వున్నది. a bamboo *stowards the top వెదురు అడుగు లాగు కొన సన్నగా వుంటున్నది, వెదురు ఆ దోకపాటుగా వుంటున్నది.
To Tar v a కీలుచరుముట.
No comments:
Post a Comment