Monday, February 7, 2011

To Scale off

To Scale off v n పొట్టుగా రాలిపోవు, పక్కుకట్టి రాలిపోవుట. when the skin *d off పక్కు కట్టి రాలినప్పుడు.
To Scalp v a నణ్నెత్తి చర్మమును కోసుట.
To Scamble, or Scramble v n. పోర్లాడుట, పీకులాడుట.
To Scamp v n (add,) To Flee, ఉరుకుట.
To Scamper v n పారిపోవుట, వురుకుట. the boys *ed away పిల్లకాయలు వురికినారు, పారిపోయినారు.
To Scan v a to measure verse పద్యములో గణములు సరిగ్గా ఉన్నావాఅని చూచుట, పరిశోధించుట. on scanning the verse I found it wasarchilochain గణములు కట్టి చూస్తే ఆ పద్యము ఇంద్ర వజ్రమైనట్టు తెలిసినది.
To Scandalize v a to offend by some action supposed criminal to shock to disgust అసహ్యమును కలగచేసట, చీదరచేసుట. his behaviour *d all his neighbours వాడి నడత వల్ల అక్కడి వాండ్లకంతా వాడిమీద అసహ్యము పుట్టినది.
To Scape v a See Escape.
To Scare v a భయపెట్టుట, బెదిరించుట. he *d away the birds ఆ పక్షులను తరిమినాడు. he put up a figure to * the birds పక్షులు బెదిరేలాగు అక్కడ వొక బొమ్మను పెట్టినాడు.
To Scarify v a కత్తివాటు వేసుట.
To Scate v n కత్తిపావుకోళ్లు వేసుకొని జరుగుట, a scaterకత్తిపావుకోళ్లు తొడుగుకొని పేరిన మంచుమీద జరిగేవాడు. scatingకత్తిపావుకోళ్లు వేసుకొని పేరిన మంచుమీద జరగడము.
To Scath v a చెరుపుట, ధ్వంసము చేసుట, పాడుచేసుట.
To Scent v a to know by the smell వాసన చేత జాడబడ్డుట. the dog soon *ed him out వెంటనే పోలీసువారు వాడి జాడ పట్టినారు.to perfume వాసనవేసుట, వాసన కలగచేసుట. she *ed her handkerchiefwith ottar అత్తరు వేశి రుమాలకు వాసన కలగచేసినది.
To Schedule v a అప్పులవాండ్ల పట్టీలో పేరు వ్రాసుట.
To Scheme v a యోచించుట, కల్పించుట, యుక్తిచేసుట. he is always scheming something or other వాడు ఏదైనా కొత్త కొత్త యుక్తులు చేస్తూ వస్తాడు.
To School v a to reprove బుద్ది చెప్పుట, చీవాట్లుపెట్టుట.he was *ed by adversity దౌర్భాగ్యమువల్ల వాడికి బుద్ది వచ్చినది.
To Scoff v n తిరస్కరించుట, వెక్కిరించుట, పరిహాసముచేసుట.they *ed at him వాన్ని వెక్కిరించినారు. they * at decency వాండ్లు మానమును తొక్కి పారవేస్తారు.
To Scold v n తిట్టుట.
To Scoop v a తోడుట, పల్లముగా తోడుట, తొలుచుట, బైటచల్లుట.he *ed out the kernel of the cocoanut టెంకాయలోని కొబ్బెరనుతొలిచి తీసినాడు. they *ed his eyes out వాడి గుడ్లను తోడివేసినారు.to * up water పల్లములోని నీళ్లను చేతితో బైటికి చల్లుట.
To Scorch v a కందేటట్టుచేసుట, కమిలేటట్టుచేసుట, కాల్చుట, దహించుట. the fire *ed the walls నిప్పుశగకు గోడలు కాలినవి.the sun *ed my face ఎండకు నా ముఖము కందినది. I savedthe child from the fire, but my hands were much *ed ఆ బిడ్డను నిప్పులో పడకుండా ఎత్తినాను అయితే నా చేతులు నిప్పుశగకు కమిలిపోయినది.
To Score v a to make a mark గీత గీచుట, గురుతువేసుట. he *d the board all over ఆపలక మీద ఏకముగా గీచినాడు.they *d it off దాన్ని పాటా కొట్టినారు. they *d his backవాడి వీపులో గురుతు చేసినారు, అనగా దెబ్బలు కొట్టినారు. they*d up this against him ఈ పద్దును వాడిమీద వ్రాసినారు, వాడిమీదశలవు వ్రాసినారు.
To Scorn v a తిరస్కరించుట, నిరాకరించుట, అలక్ష్యముచేసుట, ఛీ అనుట. the wife *ed her hunband's commands మొగుడి వుత్తరువులను నిరాకరించినది, అలక్ష్యము చేసినది. he *s telling lies వాడికి అబద్దము చెప్పడము గిట్టదు. all men * a thief దొంగను అందరు చీ అంటారు. Scorn, n. s. తిరస్కారము, అలక్ష్యము. they treated him with * అలక్ష్యము చేసినారు. they held his commands in * వాడి ఉత్తరువునుఅలక్ష్యము చేసినారు. to laugh to * ఎగతాళీ పట్టించుట.
To Scotch v a to chap, to cut slight రవంత గాయముచేసుట. you have *ed the snake you have not killed it పామును కొంచెము గాయముచేసి విడిచి పెట్టినావు గాని తీరా చంపక పోయినావు, అనగా రవంత ఆక్షేపించి విడిచిపెట్టినావు గాని చక్కగా ఖండించక పోయినావు.
To Scour v a to cleanse, to purge శుద్దిచేసుట. she *ed the kettle అభోగుణుని శుద్దిచేసినది. this medicine * the bellyఈ మందు కడుపును శుద్ధి చేస్తున్నది. after the horse is well *edఆ గుర్రానికి చక్కగా పవర్తురైన తర్వాత the troops *ed the streetsఆ సిపాయిలూ వీధులలో ఒక మనిషినైనా లేకుండా చేసినారు. she *ed the silver వెండిపాత్రను శుద్ది చేసినది. they *ed the country ఆ దేశముమీద దౌడు చేసినారు, దోపిడి చేసినారు.
To Scourge v a to whip; to punish కొరడాతో కొట్టుట, శిక్షగా దెబ్బలు కొట్టుట, శిక్షించుట, దండనచేసుట. God *s men for their sins మనుష్యులు చేసే పాపమును గురించి వాండ్ల దేవుడు శిక్షిస్తాడు.
To Scout v a to scorn, to deride తిరస్కరించుట, వెక్కిరించుట, అపహాస్యము చేసుట.
To Scowl v n to frown చిరచిరలాడుట, ముఖము చిట్లించుట, మండిపడుట.
To Scramble v n పాకుట, పాకులాడుట. I *d up the hill నేనుఆ కొండమీదికి పాకినాను. the beggars *d for the money which he threw down వాడు వెదచల్లిన రూకలను ఎత్తుకోవడమునకై బిచ్చగాండ్లు పాకులాడినారు.
To Scrape v a గోకివేసుట, గీచివేసుట. she *d the thereshold clean గడపమిది మురికిని గోకి వేసినది. he *d the gold leap off the back of the book ఆ పుస్తకం వెనక తట్టువేశి ఉండిన బంగారు రేకును గీచి ఎత్తి వేసినాడు. he *d his tongue నాలికెను గీచుకున్నాడు.he *d acqusaintance with me ఏదో ఒక సాకుపెట్టుకొని నన్ను విహితముచేసుకొన్నాడు. he *d on the fiddle for three hours జాము సేపుదాకాపీడీలు వాయించినాడు, వికారముగా పీడీలు వాయించడమును గురించి ఇది తిరస్కారమైన మాట. he *d the dirt off his hands పరిష్కారముగా చేతుల మురికిని గోకివేశినాడు. he *d the paint off the board ఆ పలకమీది వర్ణమును గోకివేశినాడు. he *d out the kernel of a coconut టెంకాయలోని కొబ్బెరను తురిమినాడు. he *d much money together దుడ్డూకాసుగా సంపాదించి నిండా రూకలు కూడబెట్టినాడు.
To Scratch v a గోకుట, గీచుట, గీరుట, బరుకుట. the cat *ed hishand పిల్లి వాడి చేతిని బరికినది. to * out గోకి ఎత్తి వేసుట. he *edout four letters in one line ఒక పంజ్తిలో నాలుగు అక్షరములను గీచి ఎత్తివేసినాడు.
To Scrawl v a to draw irregularly కొక్కిరి గీతలుగా వ్రాసుట. వంకరటొంకరగా వ్రాసుట.
To Screak v n that is, creak అరుచుట, కీచుమనుట.
To Scream v n అరుచుట, కేకవేసుట, కూసుట. when she sawthe wolf she *ed తొడేలును చూచి వొక కేక వేసినది. she *ed to her daughter to come కూతురిని రమ్మని ఒక కూత వేసినది. I heard the parrot * ఆ చిలక కూసినది విన్నాను.
To Screech v n to scream గీ పెట్టుట, కీచు కీచుమని కూసుట. I heard the owl screeching కీచుకీచుమని గుడ్లగూబ కూయగా విన్నాను.
To Screen v a మరుగుకట్టుట, మరుగు చేసుట, దాచుట. she *edher face with her hands చేతితో మూతిని మూసుకన్నది. she *ed her face with a fan విసనకర్రను ముఖానికి అడ్డముగా పెట్టుకొన్నది. with a view to * this fraud ఈ మోసాన్ని కమ్ముదల చేయవలెననేయత్నము చేత. to * wheat in అ riddle గోధుమలను జల్లించుట.
To Screw v a మరతిప్పుట. he *ed the lock on the door ఆ బీగమును మరచుట్లతో తలుపులో బిగించినాడు. they *ed the cotton ఆ దూదిని అదిమి బిగించి కట్టినారు. to press అదుముట, ఒత్తుట. to డేఙోర్మ్ by contortions వంకరలు చేయుట. to oppress by extortion దండగలుబట్టుట. he *ed a thousand rupees out of them వాండ్ల దగ్గిర వెయ్యి రూపాయలు దండగ తీసినాడు. they tried to * ten rupees outof me నా దగ్గిర పది రూపాయలను వూడపీక వలెనని చూచినారు. she *edup her mouth to keep from laughing నవ్వు రాకుండా నోటిని బిగబట్టుకొని ఉండినది. he *ed himself into the box దేహమును ముడిచి ఆ పెట్టెలో యిముడ్చుకొన్నాడు.
To Scribble v a to write badly వంకర టొంకరగా వ్రాసుట.he *d a letter కొక్కిరి గీతలుగా వొక జాబు వ్రాసినాడు. he *d a poem ఒకచిన్న కావ్యమును చెప్పినాడు.
To Scrub v a తోముట, రాచుట. he scrubbed the elephant with a piece of stone ఏనుగును ఒక రాతితో తోమి కడిగినాడు.
To Scruple v n to doubt; to hesitate సందేహించుట, శంకించుట,అనుమానించుట. I *d to tell him అతనితో చెప్పడానకు వెనక్కు తీసినాను.the Musulmans have not *d టో borrow some customs from the Hindusతురకవాండ్లు రవంతైనా జంకులేకుండా హిందువుల యొక్క ఆచారములలో కొన్నింటిని అనుసరించినారు. Scrupulosity, n. s. జంకు, శంక. Age looks with anger on ట్హేtemerity of youth, and youth with contempt on the * of age" (Johnson, Rasselas, chap. 26) "Scrupulosity is a degeneration ఓఙ్moral sense, arising from an erroneous method of reasoning" Hartley on Man, Part I Sect. 6.
To Scrutinize v a పరిశోదించుట, పరిశీలన చేసుట.
To Scud (add,)v a. To whirl down, `He collected somewithered spray scudded by the winds from a lofty tree.'పొడుగాటి చెట్టులో నుంచి గాలికి కౌట్టుబడిపడ్డ కొన్ని మండలనుపోగు చేసినాడు.
To Scuffle v n పోట్లాడుట, జగడమాడుట. The same as to struggle; thus; "poor creature who manage to scuffle through the week in hopes of a dinner on Sunday." See Johnson quotation from King Charles.
To Sculk v n దాగుట, నక్కుట.
To Scum v a See to Skim.
To Scuttle v a to cut a small hole వాడలో బొక్కచేసుట. they*d ట్హే ship and sunk it వాడలో బొక్కచేసి ముంచినారు.
To Seal v a ముద్ర వేసుట. he *ed the bond ఆ పత్రము మీదముద్ర వేశినాడు. he *ed the letter ఆ జాబును మడిచి ముద్ర వేశినాడు.
To Search v a వెతుకుట, పరిశోధించుట. I *ed the dictionaryfor his word నిఘంటువులో ఈ మాటను వెతికినాను. they *ed the housefor him వాణ్ని ఆ ఇంట్లోనే వెతికినారు. they *ed the river for his body or they *ed for his body in the river ఆ పీనుగకోసమైయెట్లో దేవులాడినారు. the police *ed the theif ఆ దొంగ వద్ద ఏదైనావున్నదా అని వెతికి చూచినారు. they *ed for the thief ఆ దొంగనువెతికినారు. he *ed into the matter ఆ వ్యవహారమును పరిశోధించినారు.they *ed out a proper man తగిన మనిషి వొకడు కావలెనని వెతికినారు.
To Season v a తాళింపుచేసుట, తిరగబోసుట, మసాలాపెట్టుట,మసాలా కట్టుట. she *ed it with salt and pepper అందులోఉప్పుకారము వేసినది. to * timber మానుకు ఎన్నటికి పుప్పి పట్టకుండామసాలాకట్టుట.
To Seat v a కూర్చుండపెట్టుట. he *ed himself కూర్చున్నాడు.
To Secede v n చీలిపోవుట, ఒకమతములోనే కొత్తమార్గమును అవలంభించుట.the Jangams *d from the Bramins బ్రాహ్మణులలో నుంచి జంగాలు చీలిపోయినారు.they *d from the Hindu religion హిందువుల మతములోనుంచి చీలి వేరే మతస్తులైనారు.
To Seclude v a to set apart ప్రత్యేకముగా ఉంచుట, ఏకాంతముగాఉంచుట, దాచుట. the Musulmans * their wives తురకలు పెండ్లాలనురాణివాసములో పెట్టుతారు. he *d himself ఏకాంతవాసిగా ఉండినాడు. he *d his children తన పిల్లకాయలను పరులతో సహవాసము లేకుండా పెట్టి పెట్టినాడు.
To Second v a to assist సహాయపడుట, సహాయము చేసుట.
To Secrete v a to keep private దాచుట. he *d the letter జాబును మరుగు పరిచినాడు. he *d himself వాడు దాగినాడు. to secern or separate పరిణమింపచేసుట, కలగచేసుట, ప్రత్యేకముగా చేసుట, తినే ఆహారము రక్తమాంసముల మూత్రకఫస్వేదోర్ణ నిర్యాసాధులుగా పరిణమిమచేటట్టు చేసుట. serpents * venom out of food పాము తినే ఆహారములోనుంచి దాని విషము కలుగుతున్నది. the udder *s milk పొదుగులో పాలు వుద్భవిస్తున్నది.
To Secularize v a to convert form spiritual appropriationsto common use to make wolrdly లౌకికముగా చేసుట.
To Secure v a భద్రముచేసుట, భద్రపరుచుట, జాగ్రత్తచేసుట,సంపాదించుట. they *ed the thief దొంగను పట్టుకొన్నారు, వాండ్లకుదొంగ చిక్కినాడు. he *d the money వాడా రూకలను జాగ్రత్తచేసుకొన్నాడు.వానికి రూకలు చిక్కినవి. this *s his salvation ఇందువల్ల వాడి మోక్షము సిద్ధము.
To Seduce v a చెరుపుట. he *d her దాన్ని చెరిపినాడు. have I*d her husband? దాన్ని మొగుణ్ని నేను వలలో వేసుకొన్నదాననా? the godssent a fairy to * the hermit ఆ ముని యొక్క వ్రతమును చెరపడానకు రంభను పంపిరి. he *d all my servants నా పనివాండ్ల నందరిని బుద్ధి చెరిపి చీల దీసినాడు. he *d my wintnesses నా సాక్షులను చెరిపి తనపక్షము చేసుకొన్నాడు.
To See v a చూచుట, దర్శించుట, కనుక్కొనుట, విచారించుట, జాగ్రత్తచేసుట. a cat can * in the dark పిల్లికి చీకట్లో కండ్లు తెలుస్తున్నది.he cannot * with his eyes వాడికి కండ్లు తెలియవు. will యోఉ let me* the letter? ఆ జాబును నన్ను చదవనిస్తావా. Do you * ? D'ye * ? చూస్తివి గదా, సుమీ. these men were relations, you * వీండ్లు బంధువులుగారా.they are gone I * వాండ్లు వెళ్లినారు సుమీ. I * it is broken విరిగిందిలే, తెగిందండి. లోఓక్ అన్డ్ యోఉ తిల్ల్ * చూస్తే తెలుసును. ఈ looked butI saw nothing చూస్తినిగాని వొకటి కండ్లబడలేదు. The governor *s people on Saturdays గౌనరు ప్రతి శనివారము దర్శనమిస్తాడు. he cannot * you to-day ఈ వేళ నీకు ఆయన దర్శనము కాదు. can you * it ? అదినీకు తెలుస్తున్నదా, అది నీకు అగుపడుతున్నదా. No తెలియలేదు. If you * ittell me మీకు తెలిస్తే చెప్పండి. you must * this done దీన్ని జాగ్రత్తచేయించు. I will * it done జాగ్రత్త చేయిస్తాను. I will * him paid వానికి రూకలు ముట్టేటట్టు జాగ్రత్త చేయిస్తాను. I first saw the light atMasulipatam నేను పుట్టినది బందరులో. I will * you down stairs మెట్లుదిగే దాకా కూడా వచ్చి సాగనంపుతాను. I saw him out of the gardenతోటబయిటిదాకా అతన్ని సాగనంపిస్తిని. I saw him through the townఅతణ్ని వూరిబయిటిదాకా సాగనంపితిని. this regiment has never seen service ఈ పటాళము ఎప్పుడు యుద్దమునకు పోలేదు. He is young but he has seen service వాడు పశివాడైనా యుద్దానికి పోయివున్నాడు. this knife has seen service యీ కత్తి పాతగిలినది.
To Seek v a and v. n. to solicit వెతుకుట, బతిమాలుకొణుట, వేడుకొనుట. he sought the king's favour రాజానుగ్రహమును కోరినాడు.he sought comfort in drinking ఆ తొందరతీరడమునకై వాడు తాగినాడు.he sought relief in bathing ఆరోగ్యము కావడమునకై వాడు స్నానము చేసినాడు.he sought forgiveness మన్నించుమని బతిమాలుకొన్నాడు. he sought a way to escape తప్పించుకొని పోవడానికు వొక దోవ వెతుక్కొన్నాడు. when he sought his home తిరిగీ ఇల్లు చెరేటప్పటికి. he sought an opportunityfor going పోవడానకు సమయము చూస్తూ వుండినాడు. he sought a wife thereఅక్కడ ఒక పెండ్లాన్ని సంపాదించుకోవలెనని యత్నము చేసినాడు. he soughtrefuge on the hill పర్వతమును ఆశ్రయించినాడు. he sought God in prayer పూజ చేసినాడు, వేడుకొన్నాడు. he sought for the book ఆ పుస్తకమునువెతికినాడు. they sought for the thief ఆ దొంగను వెతికినారు. he soughtout a horse వొక గుర్రమును సంపాదించుకొన్నాడు. he is much to * that is, he is a fool వాడు వట్టి పిచ్చివాడు. he is to * దిక్కుమాలినవాడై వున్నాడు. in these qualities he is still to * ఈ గుణములు ఇప్పటికివానివద్ద లేవు.
To Seel v a to close the eyes: of a hawk with stiches డేగమొదలైన వాటి కంటిరెప్పలు మూసి కుట్టుట.
To Seem v n అగుపడుట, కనుపడుట, తోచుట. It *s he wentthere పోయినాడట, పోయినట్టున్నది. so it *s అట్లా తోస్తున్నది, అలాగేవుండను, అట్లా వుండగలదు. if it *s good to you, you may remain here మీకు యుక్తమని తోస్తే మీరు ఇక్కడ వుండవచ్చును. it *s they arebrothers వీండ్లు తమ్ములవలె వున్నది. it *ed like a stone చూస్తే రాయివలె కనుబడ్డది. he *ed to be their friend but he wastheir enemy చూడడానికి విహితుడివలె వుండినాడుగాని వాడు వారికి శత్రువు.he *ed to be angry వాడికి కోపము వచ్ఛినట్టు తోచినది. he *s to be in a fever వాడికి జ్వరము వచ్చినట్టు ఉన్నది. it does not * to be right అది న్యాయమని తోచలేదు.
To Seeth v a to boil వండుట, ఉడకవేసుట.
To Seize v a పట్టుకొనుట, చిక్కించుకొనుట, దొరికించుకొనుట.he *d my hand నా చేయి పట్టుకొన్నాడు. they *d my goods నా సరుకులనుపట్టుకొన్నారు. when fever *s a man వొకడికి జ్వరము తగిలేటప్పుడు. he *d an opportunity to speak to them సమయము చూచి వాండ్లతో మాట్లాడినాడు.to take possession of స్వాధీనము చేసుకొనుట. they *d his land వాడి నేలను ఆక్రమించుకొన్నారు. he *d the meaning in a moment ఆ అర్థమును నిమిషములో గ్రహించుకొన్నాడు. in seamen's language it means to bind కట్టుట.
To Select v a ఏర్పరచుకొనుట, యుక్తాయుక్తములు విచారించి యేర్పరచి యెత్తుకొనుట, యేరి యెత్తుకొనుట, వరించుట, పసందుచేసుట. he examined twenty horses and at last *ed two ఇరువై గుర్రాలలో యేర్పరచి రెంటినియెత్తినాడు. I did not * this horse I could get no other ఇది నేను యేర్పరచి యెత్తుకొన్న గుర్రము కాదు, అయితే దీన్ని విడిస్తే వేరే చిక్కదు. he *ed one fruit ఆ పండ్లలో యేర్పరచి వొకటిని యెత్తుకొన్నాడు. to * an auspicious hour ముహూర్తము పెట్టుట.
To Sell v a అమ్ముట, విక్రయించుట. he sold himself to do evilపాపబద్దుడై వున్నాడు, పాపమునకు దాసుడై వున్నాడు.
To Sell, sell v n. విక్రయమవుట, వెలపోవుట. rice *s verywell just now బియ్యము ఇప్పట్లో బాగా విక్రయమవుతున్నది.
To Send v a పంపుట. he sent word that he would come వస్తున్నాననిచెప్పి పంపినాడు. they sent him a message వాడికి వర్తమానము పంపినారు.If God * life దేవుడు ఆయుస్సుయిస్తే * he sent a bullet at me నామీద ఒక గుండును విడిచినాడు. I sent a spear at him వాడిమీద బల్లెమును వేశినాను.he sent an arrow at me నా మీద వొక బాణమును విడిచినాడు. they sent his away వాణ్ని పంపివేసినారు. వెళ్లగొట్టినారు. they sent me away నన్ను పొమ్మన్నారు, నన్ను పంపించివేసినారు. the flowers * forth semll పుష్పములు వాసన కొట్టుతున్నవి. the sea *స్ forth a sound సముద్రము ఘోషిస్తున్నది. the plant sent forth leaves ఆ చెట్టు ఆకులను విడిచినది. she sent a devil into him వాడిమీద పంపుచేసినది. they సేన్ట్ him to Coventry వాడితో యెవడున్ను మాట్లాడకూడదని సమాఖ్య చేసుకొన్నారు.
To Sentence v a to contempt, to judge తీర్పుచెప్పుట, తీర్పు విధించుట. he *d them to death వాండ్లను చంపవలశినదని తీర్పు చెప్పినాడు.
To Separate v a భిన్నపరుచుట, ప్రత్యేకముచేసుట, విభాగించుట. they *d man and wife ఆలును మొగుణ్ని యెడబాపినారు. in writing,the English * the words, the Telugus do not ఇంగ్లీషువారు వ్రాయడములో మాటలను విడవిడ వ్రాస్తారు తెలుగువాండ్లు తెలుగును అట్లా వ్రాయరు. a wall *s his garden from mine వాడి తోటను నా తోటను ప్రత్యేకము చేయడానకు నడమ వొక గోడ వున్నది. she *d the cotton into thread ఆ పత్తిని నూలుగా వడికినది. he *d the diamonds into large and small ఆ వజ్రములను చిన్నది వేరే పెద్దదివేరే యేర్పరచినాడు.they did not * the prisoners from the witness సాక్షులను వేరే కయిదీలను వేరే పెట్టలేదు. nothing but death shall * her and me చావడము తప్ప మరి దేనివల్లనున్ను అదీ నేను యెడబాయవలశినదిలేదు. he *d himself from his family వాడు వేరుపోయినాడు.
To Sepulchre v a సమాధిలో పెట్టుట, గుంటలో పెట్టుట.
To Sequester v a that is, to conceal దాచుట. to seize by warrant & c. ఆక్రమించుకొనుట, జప్తీచేసుట.
To Sequestrate n a to seize by warrant &c. ఆక్రమించుకొనుట. they *d the lands ఆ భూములను కట్టివేశినారు, నగర కలుపుకొన్నారు.జప్తీ చేసుకొన్నారు. the property that was *d ఆక్రమించుకోబడ్డసొత్తు, జప్తీచేసుకోబడ్డసొత్తు.
To Serenade v a to entertain with nocturnal musick రాత్రికాలములోసంగీతము వాయించి నాయకిని బుజ్జగించుట.
To Serve v a కొలుచుట, ఊడిగము చేసుట, పరిచర్య చేసుట, ఉపయోగించుట. they *d him వాడివద్ద కొలువుగా వుండినారు, వాడి కొలువులో వుండినారు. those who * God దేవుణ్ని కొలిచేవాండ్లు, భక్తులు. those who * the temple గుడి పనివాండ్లు. they bought salt to * them on the journey వాండ్లు దోవకు వుప్పు కొనుక్కున్నారు. he *d them cruelly వాడియెడల క్రౌర్యము చేసినాడు. do you know how *d he them? వాండ్లకు వాడు చేసినది చూస్తివా. the cave *d him for a house ఆ గుహ వాడికి ఇల్లుగా వుపయోగపడ్డది. his hand *d himfor a cup వాడికి చెయ్యి గిన్నె అయినది. to * out పంచిపెట్టుట, వినియోగము చేసుట. they *d out the rice that was wanted for the troops దండువాండ్లకు బియ్యమును పంచిపెట్టినారు. this *d him right ఇది వానికి తగిన శిక్ష. what? you have caught a fever? it *s you right వోహో నీకు జ్వరము వచ్చినదా, ఇది నీకు కావలశినదే. he *d them very well వాండ్లకు లెస్సగా వుపచరించినాడు, వాండ్లకు తగిన బుద్ది చెప్పినాడు. to * up a meal వడ్డించుట. dinner was *d at noon మధ్యాహ్న మన్నము వడ్డించబడ్డది. to * a gun పిరంగిని బారు చేసుట, మందు వేశి గట్టించుట.
To Set v a ఉంచుట, పెట్టుట, నిలుపుట. to * a broken boneవిరిగిన యెముకను సరిగ్గా పెట్టి కట్టుట. to * a joint తొలగిన కీలును సరిగ్గా పెట్టుట, to * gems రత్నములు చెక్కుట. he * the ruby ఇన్ gold ఆ కెంపును కుందనముతో చెక్కినాడు. she * her heartupon this ఆపె మనస్సంతా దాని మీద పెట్టినది, దానిమీదనే ఆశగా వుండినది. to * a pattern మేలు బంతి పెట్టుట, మాదిరి చూపుట. he * them the pattern and they all became డ్రున్కర్డ్స్ వాడు తాగుబోతైనాడు గనక వాణ్ని చూచి అందరు తాగుబోతులైనారు. I * him ట్హే pattern and he wove the cloth వాడికి మాదిరి చూపినాను, ఆ ప్రకారము వాడు ఆ గుడ్డ నేసినాడు.he * them a good example తాను చక్కగా నడిచి వాండ్లునున్ను అట్లా నడిచేటట్టుచేసినాడు. to * a picture or frame it పటమునకు చట్టము వేసుట. to * a plant చెట్టు పెట్టుట. he * the plants thick ఆ చెట్లను దట్టముగానాటినాడు. he * a post at the door వాకిటి దగ్గెర స్థంభము నాటినాడు.to * a price on that rice ఆ బియ్యీనికి అధిక వెల కట్టినారు. to * a razor మంగళ కత్తి సానపెట్టుట. to * a saw రంపముకు కక్కుపెట్టుట. he * a snare వల వొడ్డినాడు. he * the troops in battle array ఆ దండును యుద్ధానకై సిద్ధముగా నిలిపినాడు. he * himself to search for the dagger ఆ కటారిని వెతక నారంభించినాడు. he * himself to reconcile them వాండ్లను సమాధానము చెయ్యడానకు పూనుకున్నాడు. he * his face against them వాండ్లకు వాడు ప్రతికూలము చేసినాడు. (This verb is oftenjoined with various words, particularly prepositions, which will now be given in alphabetical order.) he * about building a houseఇల్లు కట్టడానికి మొదలు పెట్టినాడు. he * the ree afloat ఆ చెట్టును నీళ్లలో కొట్టుకొని పోయ్యేటట్టు వేసినఅడు. they * him against me వాడికి నా మీద ద్వేషము పుట్టేటట్టు చేసినారు, పగ పుట్టించినారు. she * him against me అది వాణ్ని నా మీద రేగేటట్టు చేసినది, వాడికి నా మీద విరోధము పుట్టేటట్టు చేసినది. he * himself against them వాండ్లమీద తిరగబడ్డాడు, వాండ్లకు విరుద్ధముగా వుండినాడు. he *s the rent of the house against the debt ఆ యింటి అద్దెను అప్పుకు చెల్లుపెట్టినాడు. he * the business agoing ఆ పనికి మొదలుపెట్టినాడు. he * the clock a-గోఇన్గ్ ఆ గడియారాన్ని తిరిగేటట్టు చేసినాడు. to * apart or to * aside యెత్తిపెట్టుటఇ, నిలిపి పెట్టుట. హే * apart ten rupees for this business యీ పనికని పది రూపాయలు యెత్తి పెట్టినాడు. they * apart Sunday for worship ఆదివారాన్ని పూజకని నియమించినారు. they * the suit a side ఆ వ్యాజ్యమును తోశివేసినారు. can you * aside the law? చట్టమును తోసివేయగలవా. they * his commands at nought వాడి ఆజ్ఞను తిరస్కరించినారు. this *s the question at rest ఇందువల్ల ఆ సందేహము తీరుతున్నది. this letter * me at ease యీ జాబువచ్చినందున నాకు నెమ్మది అయినది, నా వ్యాకులము తీరినది. he not setting God before his eyes committed this crime తలమీద దేవుడు వున్నాడని యెంచక యీ నేరమును చేసినాడు. he * the money by రూకలను దాచినాడు. to * by దాచుట. he * them by the ears వాండ్లకు కలహము పెట్టినాడు. he *the load down తలమూటను దించుకున్నాడు. he * this down in his accountయీ పద్దును తన లెక్కలో వ్రాసుకొన్నాడు. they * down this as false దీన్ని అబద్ధము కింద కట్టినారు. they * him down as a fool వాణ్ని వెర్రి వాండ్లలోచేర్చినారు. I * him down properly వాణ్ని బాగా ఝాడించినాను. to * forth ప్రకటన చేసుట. they * him at liberty వాణ్ని విడుదల చేసినారు. to * in order సవరించుట, దిద్దుట. he * the books in order ఆ పుస్తకములను వరసగా పెట్టినాడు, క్రమముగా పెట్టినాడు. to * off శృంగారించుట. he * the house off with pictures ఆ ఇంట్లో పటములు కట్టి శృంగారించినాడు. he *her off with jewels దానికి సొమ్ములు పెట్టి శృంగారించినాడు. he * the dogs on or upon కుక్కలను వుశికొలిపినాడు. this news * her all on fire ఈ సమాచారము విని దాని మనసు భగ్గుమన్నది. he * the jungle on fire ఆ యడవిని తగలబెట్టినాడు. he * an expedition on foot ఆ పనికి మొదలు పెట్టించినాడు. he has * his heart upon her దానిమీద ప్రాణములు విడుస్తూ వుండినాడు. వాడి మనసంతా దానిమీద వుండినది. he has * his heartupon victory గెలవపోతామా అని అదే మనసుగా వుండినాడు. these sour oranges* the teeth on edge యీ పుల్లనికిచ్చిలిపండ్లు తిని నాపండ్లు పులిశిపోయినది,the sound of the saw *s one's teeth on edge ఈ రంపము యొక్క ధ్వనివింటే పండ్లకు తొందరగా వుంటున్నది. they * a high value upon chastity పాతివ్రత్యమును ఘనముగా విచారిస్తారు. they * no value upon cleanlinessవాండ్లకు పారిశుధ్యము వొక లక్ష్యము లేదు. he * ten guineas upon the dice నూరు రూపాయలు వొడ్డినడు, పెట్టినాడు. when he * his eyes upon her. దానిమిద కన్ను వేశినప్పుడు. I have not * eyes upon him thismonth నెల్లాండ్లుగా వాణ్ని కానము, నెల్లాండ్లుగా వాడు కండ్లబడలేదు. he * the door open తలుపు తెరిచిపెట్టినాడు. he * the watch out of viewఆ గడియారమును కడగా పెట్టినాడు, దాచినాడు. he * these accounts out of view యీ లెక్కలను బయటపెట్టలేదు. setting his relations out of viewవాడి బంధుత్వమును విచారించకుండా. he * me right నేను పడ్డ భ్రమను పోగొట్టినాడు. he * the house to rights ఆ ఇంటిని చక్కపెట్టినాడు, దిద్దుబాటు చేసినాడు. he * the books to rights ఆ పుస్తకములను క్రమముగా పెట్టినాడు. that medicine * him to rights ఆ మందువల్ల వాడి వొళ్లు కుదిరినది. to * sail వాడ చాపలను యెత్తుట, అంకారించుట. the ship * sail or I * sail వాడ బయిలుదేరినది, నేను వాడ ఎక్కి పోయినాను they * great store by this medicine యీ మందును నిండా శ్లాఘిస్తారు, కొనియాడుతారు. they * no store by him వాన్ని లక్ష్యపెట్టరు. he * the song to music యీ పద్యమును పాటగా పాడేటట్టు యేర్పరచినాడు. he * up an image వొక విగ్రహాన్ని పెట్టినారు, ప్రతిష్టచేసినాడు. he * up a shop కొత్తగా అంగడి పెట్టినాడు. they * him up as the heir వాణ్ని బాధ్యుణ్నిగానిర్ణయించినారు. they * him as a creditor వాడు వొక అప్పుల వాడనికృత్రిమముగా యేర్పరచినారు. he * up a claim to the money ఆ రూకలుతనకు రావలసినదని వ్యాజ్యము తెచ్చినాడు. last year he * up a carriageపోయిన సంవత్సరము వొకబండి పెట్టుకొన్నాడు. he * up a loud cryబిగ్గరగా అరిచినాడు. they * up a laugh పకపక నవ్వినారు.
To Settle v a తీర్చుట, పరిష్కారము చేసుట. he *d the disputeఆ వ్యాజ్యమును తీర్చినాడు. he *d this money upon his wife ఈ రూకలనుపెండ్లానికి ఆస్తిగా పెట్టినాడు.
To Sever v a తెంచుట, చించుట, వించుట, ఖండించుట, చీల్చుట,విడదీయుట. he *ed the branch from the tree ఆ చెట్టులో ఆ మండనుచీల్చినాడు. a quarrel *ed him from his parents వొక జగడమువల్ల వాడు తల్లిదండ్రులను విడిచి వేరు పోయినాడు.
To Sew v a to work with అ needle కుట్టుట. she *ed the cotton up ఇన్ the pillow ఆ దూదిని తలగడలో వేశి కుట్టినది.
To Shackle v a సంకెళ్లు వేసుట.
To Shade v a కప్పుట, అడ్డముగా పెట్టుట. she *d her eyes withher hand కండ్లకు చేతిని అడ్డము పెట్టుకొన్నది. this tree *s usfrom the head ఈ చెట్టు మనకు ఎండకు మరుగుగా ఉన్నది.
To Shadow v a మరుగుచేసుట, సంరక్షించుట. to * out లీలగాతెలియచేసుట, అస్పష్టముగా అగపరుచుట, జాడగా కనపరుచుట.
To Shake v a కదిలించుట, కుదిలించుట, ఆడించుట. the fevershook him very much ఆ జ్వరము వాణ్ని కుంగగొట్టినది. the earhtquakeshook down the house భూకంపముచేత ఇల్లు పడ్డది. he shook down the tamarinds from the boughs చింతపండ్లను రాలగొట్టినాడు, రాల్చినాడు.they shook hands వొకరి చెయ్యి వొకరు పట్టుకొని మర్యాధ చేసుకున్నారు,ఇది ఇంగ్లీషు వారిలో వాడుక. he shook off the dog నోటితో పట్టుకొన్నకుక్కను విదిలించి వేశినాడు. he shook the cotton out of the bagఆ గోనెలో వుండే దూదిని బయిటికి విదిలించినాడు. he shook it to piecesదాన్ని ఆడించి తుత్తుమురు చేసినాడు, బద్దలు చేసినాడు. she shook up the bed పడకను దులిపి వేసినది.
To Sham v a to trick మోసము చేసుట, కపటము చేసుట.
To Shame v a సిగ్గుపడేటట్టుచేసుట, అవమానము చేసుట. they *d him into paying the money వాణ్ని ఆ రూకలు చెల్లంచేటట్టు అవమానముచేసినారు.
To Shampoo v a an Indian word meaning to rub the limbs (toclap is the word in old English) కాళ్లుపిసుకుట, వొళ్లుపట్టుట.
To Shape v a ఆకారముగా చేసుట, ఆకారమేర్పరుచుట. he *d it likea wheel దాన్ని చక్రాకారముగా చేసినాడు. he *d it like a bird పక్షిఆకారముగా చేసినాడు. he *d his conduct according to thier pleasure వారి యిష్టప్రకారము ప్రవర్తించినాడు. he *d his course towards the hill కొండతట్టుకై వెళ్లినాడు.
To Share v a పంచిపెట్టుట, విభాగించుట, పాళ్లు పెట్టుట, అనుభవించుట.he *d out the work ఆ పనిని అందరికీ పంచి పాళ్లువేసినాడు. I *d his fate వాడిదీ నాదీ వొకటే గతి అయినది. he was murdered and she *d his fate ఆయనతోటి పాటుగా ఆపె చచ్చినది.
To Sharp v n చమత్కారము, చేసుట, దొంగయుక్తులు చేసుట, కయుక్తులుచేసుట. (Cowper Task. 3. 86. i. e. play the rogue.)
To Sharpen v a పదును పెట్టుట, నూరుట, కక్కువేసుట. to * theirwits they రేఅడ్ logic బుద్ధికౌశల్యతను గురించి తర్కము చదువుతారు. cold wind *s the appetite చలిగాలివల్ల ఆకలి చురుకు పుట్టుతున్నది.
To Shatter v a పగులకొట్టుట, పడగొట్టుట, ఇడియగొట్టుట, బద్దలు చేసుట.
To Shave v a గొరుగుట, క్షౌరముచేసుట. he *d me నాకు క్షౌరముచేసినాడు.I *d myslef నేను గొరుక్కున్నాను. I got myself *d క్షౌరము చేయించుకొన్నాను.he *d the wood ఆ కొయ్యను చివ్వినాడు, చెక్కినాడు. he *d the grass with a sickle కసువు కోశినాడు. he *d the ground with a spade దోకుడు పారత కసువును దోకినాడు, చెక్కినాడు. the ship *d the rock ఆ వాడ కొండ మీద వొరుసుకొని పోయినది, రాచుకొని పోయినది.
To Shear v a బొచ్చులేకుండా పొయ్యేటట్టు కత్తిరించుట. he *ed thesheep ఆ గొర్రె యొక్క బొచ్చును కత్తిరించినాడు. the lawyer *ed themఆ లాయరు వాండ్లను క్షౌరము చేసినాడు, అనగా వాండ్లను దోచుకొన్నాడు. he wentout shearing and came home shorn గొరగబోయి గొరించుకొని వచ్చినాడు.అనగా గెలువబోయి గెలువబడి వచ్చినాడు.
To Sheathe v a ఒరలో వేసుట. to cover or conceal కప్పుట,దాచుట. when the sword is *d సమాధానపడ్డప్పుడు.
To Shed v a కార్చుట, రాల్చుట. the clouds * rain మేఘము వర్షిస్తున్నది.they * his blood వాన్ని చంపినారు. she * tears కన్నీళ్లు విడిచినది,కన్నీళ్లు కార్చుకొన్నది. the horse * his teeth ఆ గుర్రానికి పండ్లుపడిమొలుస్తున్నవి. after the child * his teeth ఆ బిడ్డకు పండ్లు పడ్డ తర్వాత.the antelope *s it's horns every year దుప్పులకు ప్రతి సంవత్సరము కొమ్ములు రాలుతవి. the bird * it 's feathers ఆ పక్షికి రెక్కలు రాలినవి.the shedde of blood ఘాతకుడు, బ్రహ్మహత్యగాడు.
To Sheer off v n to retreat, to steal away తొలిగిపోవుట, మరుగైపోవుట, పారిపోవుట.
To Shell v a ఒలుచుట, పొట్టుతీసుట. to * almonds బాదంగింజలనునలగగొట్టి పప్పుతిసుట they *ed the town all night రాత్రి అంతా ఆ వూరి మీద బొంబాసు గుండ్లను కాల్చినారు.
To Shelter v a to cover from external violence రక్షించుట, కాచుట.he *ed the thieves దొంగలను దాచినాడు, దొంగలకు చోటు యిచ్చినాడు. the tree that *s me నాకు మరుగ్గా వుండే చెట్టు. he had no place to * himself in from the storm ఆ గాలివానకు దాగ చోటు లేక పోయినది.
To Shield v a రక్షించుట, కాచుట, కాపాడుట. to * off బాపుట, అడ్డగించుట.
To Shift v n మారుట, తిరుగుట. I *ed to that house వుండినయిల్లు విడిచి వేరే యింటికి కాపురము పోయినాను. I *ed from that houseఆ ఇంట్లో కాపురము చాలించుకొని లేచి వచ్చినాను. the wind *ed గాలి తిరిగినది. I cannot * without this ఇది లేకుంటే నాకు గడవదు. I must * for myself నా గతి నేను విచారించుకోవలసినది. they *ed forthemselves తమ కూటికి తాము సంపాదించుకొన్నారు, వేరే దిక్కులేక తమంతట తాము జీవించినారు. the boy is now old enough to * for himself వాడుపెద్దవాడైనాడు, వాడి పొట్ట వాడు పోసుకోగలడు. I cannot assist you, you must * for yourself నేనేమీ సహాయము చేయలేను, నీ గతి నీవు విచారించుకోవలసినది. an infant cannot * for itself పరుల పోషణలేక వొక బిడ్డ తనకు తానే బ్రతకనేరదు. a dog can always * for itselfవొక కుక్క పరుల సహాయము లేక తనకు తానే బ్రతుక గలదు.
To Shill-i-shall-i v n డోలాయమానపడుట.
To Shimmer v n to shine to gleam ప్రకాశించుట, తళతళమనుట,నిగనిగలాడుట.
To Shine v n ప్రకాశించుట, మెరుయుట, వెలుగుట. to * forth or be mainfested విలసిల్లుట, సాక్షాత్కరించుట. the sun *s యెండ కాస్తున్నది. the moon *s వెన్నెల కాస్తున్నది. the stars * నక్షత్రాలు తెలుస్తవి, ప్రకాశిస్తున్నవి. to * into (irradiate to enlighten) ప్రకాశింపచేసుట, వెలిగేటట్టు చేసుట.
To Shiver v n వణుకుట. I am shivering నాకు చలి వణుకుతున్నది.
To Shock v a అదరగొట్టుట, అదిరేటట్టుచేసుట, ఆయాస పెట్టుట.this news *ed him ఈ సమాచారమును విని అదిరిపడ్డాడు.
To Shoe v a లాడము కట్టుట.
To Shol v n to become shallow లోతు తగ్గుట. in this place thewater *s rapidly యిక్కడ అడుగు నీళ్లు తక్కువవుతున్నది.
To Shoot v a వేసుట, విడుచుట. he స్హోట్ an arrow వొక బాణమువిడిచినాడు. they shot him dead వాడిమిద వేటువేసి చంపినారు. he shotme by accident వాడు పరాకున వేసిన వేటు నా మీద తగిలినది. he shot me in the arm వాడు వేసిన వేటు నా చేతికి తగిలినది. before the sunshot forth his rays సూర్యుడు కిరణములను ప్రసరింప చేయడానకు మునుపు,వ్యాపింప చేయడానకు మునుపు. after the tree short forth branches ఆచెట్టు కొమ్మలు విడిచిన తర్వాత. the snake shout out its tongue పాము నాలికెను వెళ్ళబెట్టినది. to * a bolt గడియ వేసుట.
To Shore or prop v a. పోటుబెట్టుట, ముట్టు యిచ్చుట. a *d treeకొమ్మలకు పోట్లు యివ్వబడ్డ చెట్టు.
To Shorten v a. తక్కువచేసుట, కొంచెము చేసుట, సంక్షేపించుట. this*ed his days యిందువల్ల వాడి ఆయుస్సు తగ్గిపోయినది, అనగా వాడు చచ్చిపోయినాడు.
To shoulder v a to put upon the * భుజముమీద పెట్టుకొనుట.they *ed thier arms తుపాకులను భుజముమీద పెట్టుకొన్నారు. he *edme నన్ను భుజముతో తోసినాడు.
To shout v n అరుచుట, కేకలు వేసుట, బొబ్బలు పెట్టుట. the people *ed joy జయంజయమని అరిచినారు.
To Shove v a తోసుట, నూకుట, గెంటుట.
To Shovel v a గరిటెతో యెత్తుట.
To Show v a చూపుట, అగపరుచుట, కనపరుచుట, యెరుకచేసుట, తెలియచేసుట. he *ed his strength తన బలమును చూపినాడు. he *ed favour to them వాండ్ల యెందు దయచేసినాడు, అనుగ్రహము చేసినాడు.he *ed them politeness వాండ్లను సన్మానించినాడు, మర్యాదచేసినాడు. he *ed his prudence in staying quiet తెలిసినవాడై వూరికె వుండినాడు.he *ed himself a fool in this యిందులో పిచ్చివాడై పోయినాడు. the heavens * forth the glory of God దేవుడి మహిమ ఆకాశములో తెలుస్తున్నది. they * themselves his friends వాడికి స్నేహితులుగాప్రవర్తించినారు. he *ed himself to be my enemy నాకు శత్రువు అయినట్టు అగుపడ్డాడు. next day fever *ed itself మర్నాడు జ్వరము కనిపించినది. they did not * themselves అగుపడ్డారు కారు, దాగినారు.
To Shower v a కురిపించుట. God *ed blessings upon them దేవుడు వాండ్లకు అనేక క్షేమములను కలగచేసినాడు. they *ed darts against us మామీద అనేక బాణములు వేసినారు. to * blows అనేక దెబ్బలుకొట్టుట.
To Shred v a నజ్జునజ్జుగా కోసుట, తరుగుట. Shred, past p|| తరిగిన, నజ్జునజ్జుగా కోసిన.
To Shriek v n కీచుమని అరుచుట, కేకవేయుట.
To Shrive v a గురువు మన్నించుట.
To Shrivel v n ముడుచుకొని పోవుట, శుష్కించుట. To Shrivel, v. a.to contract into wrinkles; the heat shrivelled the leaves ఆ యెండకుఆకులు ముడుచుకొని పోయినవి.
To Shroff v a to garble నాణ్యము చూచుట, పరఖావణీ చేసుట.
To Shroud v a to cover కప్పుట, మూసుట.
To Shrug the shoulders v a కోతివలె భుజములను యేగబెట్టుకొనుట,ఇది దీనత్వమునకు గాని వ్యసనమునకు గాని సూచకమైన అభినయము. at seeingthem he shrugged his shoulders వాండ్లను చూడగానే ఖేధపడ్డట్టు భుజమునుయెగబెట్టుకొన్నాడు.
To Shudder v n వణుకుట, కంపించుట. he *ed with horror భయమువల్ల వణికినాడు, వాడి వొళ్లు జలపరించినది.
To Shuffle v n to mix కలుపుట. he *d the cards ఆడే కాగితాలనుకలిపినాడు. she *d her feet అది ఆటలో అడుగు వేసినది. to * offవిడిచిపెట్టుట. he did to * off (i. e. to evade) my demand నేనుఅడిగినదాన్ని యివ్వకుండా పులిమి పుచ్చడమునకై దీన్ని చేసినాడు. he *d offhis shoes కాళ్ళ జోళ్ళను విడిచిపెట్టినాడు. when the snake *d off it's skin పాము కుసుమ విడిచినప్పుడు.
To Shun v a to avoid మానుట, తప్పించుట, వర్జించుట. he shunned the blow ఆ దెబ్బను తప్పించుకొన్నాడు. he went the otherroad to * the police పోలీసు వాండ్లను తప్పించుకోవడమునకై వేరే దారిన పోయినాడు. believing him a rogue she shunned him వాడు దొంగ అని వాడి తెరువుకు పోలేదు. women * adulterers ఆడవాండ్లు జారులను వర్జిస్తారు. they* wine సారాయీని వర్జిస్తారు. I have not shunned to declare the whole truth నిజస్థితి యావత్తు నేను చేప్పకమానలేదు.
To Shut v a మూసుట, వేసుట. * the door ఆ తలుపు వెయ్యి. he * the knife ఆ కత్తిని మడిచినాడు. he * his hand చేతిని ముడుచుకొన్నాడు. he * the purse ఆసంచి మూతిబిగ్గట్టినాడు. * your mouth నోరుముయ్యి. he * themin వాండ్లను లోగావేసి తలుపు మూసినాడు. he * them out వాండ్లను లోనికి రానియ్యకుండా తలుపు మూసుకొన్నాడు. he * his eyes to the truth వాడు చూచీచూడక వుండినాడు, ఉపేక్షగా వుండినాడు. he * up shop వాడు అంగడి విడిచి పెట్టినాడు, వర్తకమును చాలించుకొన్నాడు. he * up the shop అంగడి మూశినాడు, అంగడి యెత్తినాడు. they * up the road వాండ్లు ఆ దోవను మూశివేసినారు, కట్టివేశినారు. he * himself up యింట్లో కూర్చుండి తలుపు వేసుకొన్నాడు, దాచుకొన్నాడు. they * him up in a house వాణ్ని వొకయింట్లోవేశి మూశిపెట్టినారు.
To Shy v n to start బెదురుట. his horse shied at a dogand threw him గుర్రము కుక్కను చూచి బెదిరి వాన్ని కింద తోసినది.
To Sicken v a to disgust చీదరచేసుట, అసహ్యమును పుట్టించుట.his behaviour *ed me వాడినడతవల్ల నాకు అసహ్యము వచ్చినది.
To Side v n పక్షమవుట. they *d with హిమ్ అతని పక్షమైనాడు.
To Sidle n s పక్కవాటుగా పోవుట. the snake *s it's crest పాము పడిగెను పక్కవాటుగా పెట్టుకొని పోతున్నది.
To Sift v a జల్లించుట, తూర్పారబెట్టుట, నేముట, గాలించుట.or examine well చక్కగా పరిశోధించుట, బాగా విమర్శించుట.
To Sigh v n నిట్టూర్పు, విడుచుట, పెద్దవూపిరి, విడుచుట.he *ed for it అది కావలెని పెద్ద వూపిర్లు విడుస్తూ వుండినాడు.he *ed for హేర్ return అదెప్పుడు రాబోతున్నదని పెద్ద ఊపిర్లువిడుస్తూ వుండినాడు. In London and on the stage this is pronounced sithe Lit. Pan. 1811 : p. 687.
To Sign v a చేవ్రాలు చేసుట. he *ed the paper ఆ కాకితములోచేవ్రాలు చేసినాడు. he *ed them with the cross వాండ్లకు కొరతముద్ర వేసినాడు. *ed Rama Chandra Rao రామచంద్రరావు అని చేవ్రాలుచేసి వున్నది.
To signalize v a ప్రసిద్ధిపరచుట. he *d himself ప్రసిద్ధుడైనాడు,పేరెత్తినాడు.
To Signify v a to declare by some token or sign సూచనగాతెలియచేసుట. to mean; to express అర్ధమిచ్చుట, అర్ధమవుట. thisague signifies fever యీ చలిని చూస్తే జ్వరానికి సూచకముగా వున్నది. Iwill tell you what it signifies అందుకు అర్థమేమంటే, దాని అర్ధము నీకుచెప్పుతాను. sometimes simply to declare తెలియచేసుట, ఎరుకచేసుట.the word Achalam signifies a mountain అచల మంటే పర్వతమని అర్ధమవుతున్నది. It does not * చింతలేదు, అక్కరలేదు, భయము లేదు. It signifies nothing whether he comes or stays away వాడు వచ్చినా రాకున్నా చింతలేదు. It signigifies nothing your putting yourself ina passion నీవు కోపముచేయడము వ్యర్థము. the rain signifies nothing:you must go వాన లక్ష్యము లేదు నీవు పోవలసినది. weeping signifies nothing యేడవడము నిష్ఫలము.
To Silence v a నోరు మూయించుట, నోరెత్తకుండా చేసుట. this *d his enemies యిందువల్ల వాడి శత్రువులు నోరెత్త లేకుండా వుండినారు. he*d them వాండ్ల నౌరు మూయించినాడు, వాండ్లను నోరెత్తకుండా చేసినాడు. he*d their objections వాండ్ల ఆక్షేపణలను ఆణిచి వేసినాడు.
To Silt v n or become filled with silt రొంపియవుట, అడుసవుట.the river *ed యేరంతా యేక బురద అయినది. a silting process took place in the river i. e. it became full of mud ఏరంతా యేక బురదగా వుండినది.
To Silver v a వెండి మొలాము చేసుట, రసము వేసుట. he *ed the glass ఆ అద్దానికి రసము వేసినాడు. when age *ed his headముదిమిచేత వాడితల నెరిసినప్పుడు.
To Simmer v n to boil gently; to boil with a gentle hissingతిన్నగా కాగుట, తుకతుకమని వుడుకుట. Johnson shews that this is thesame as Simper; and Swift uses it thus; Wks. XI. 356.
To Simper v n to smile; generally to smile foolishly చిరునవ్వు నవ్వుట.
To Sin v n పాపము చేసుట, తప్పుట.
To Sing v n పాడుట, గానము చేసుట. as birds or cricketsకూసుట. I heard the crickets singing యిలకోళ్ళు కూస్తూవుండగావిన్నాను. the kettle was singing on the hearth పోయిమీద కుండ తుకతుకమని వుడుకుతూ వుండినది. to * out (or roar, shout) కేకలువేసుట, బొబ్బలు పెట్టుట. to * small i. e. to submit or be timidహీన స్వరమవుట, అనగా కుంగిపోవుట, దీనత్వమును పొందుట. a singingbird సుస్వరముగల పక్షి.
To Singe v a to scorch; to burn slightly or superficiallyనిప్పున కాల్చుట. they *d the pig పందిని చంపి దానిమీద వెంట్రుకలుపొయ్యేటట్టుగా నిప్పున కాల్చినారు, లేక వుడుకునీళ్ళు పోసినారు. they *dthe sheep మేక తోలుమీది వెంట్రుకలు పొయ్యేటట్టు నిప్పున కాల్చినారు.
To Single out v a that is, to choose, select, pick out యేర్పరచుట. he *d out one sword వెయ్యింటికి వొకటిగా వొక కత్తిని యేర్పరచి యెత్తుకొన్నాడు.
To Sink v n ముణుగుట, ముణిగిపోవుట. when the river sunkయేట్లో నీళ్ళు తీసిపోయినప్పుడు. his pulse is sinking వాడి ధాతువుఅణిగిపోతున్నది, వెనక్కుతీస్తున్నది. his heart sunk వాడి మనసుకుంగిపోయినది. the tree sunk into the water ఆ చెట్టు నీళ్ళలోముణిగిపోయినది. here the earth sunk యిక్కడ భూమి కుంగినది. herethe earth *s యిక్కడ భూమి పల్లుగా వున్నది. as price తగ్గుట. theprice of rice has sunk బియ్యము వెలతగ్గినది. this paper *s, that is in the ink *s in this paper యీ కాకితము వూరుతున్నది. he sunk down కూలినాడు, పడ్డాడు. sunk in sleep అది నిద్రపోయినది. the stone sunk in the water ఆ రాయి నీళ్ళలో మునిగిపోయినది, అడుక్కుపోయినది. these words sunk into his mind యీ మాటలు వాడి మనసులో నాటినవి. she sunk upon her knees మోకారించినది,మోకరించుకోని పడ్డది, మండివేసుకొన్నది, మండివేసుకొని పడ్డది. sunken eyes గుంటకండ్లు.
To Sip v a కొంచెము కొంచెముగా తాగుట. the bee that *s honeyform the flower పుష్పములోనుంచి తేనెను కొంచెము కొంచెముగా నోట్లోకి తీసుకొనే తేనె యీగ.
To Sit v n కూర్చుండుట. the court sat సభ కూడినది. this bird *s for ten days యీ పక్షి గుడ్లను పది దినాలు పొదుగుతున్నది. in whatquarter does the wind * గాలియే తట్టునుంచి వస్తున్నది, యే గాలి వస్తున్నది.* down కూర్చో. they made him * down కూర్చుండబెట్టినారు. when the enemysat down before the town శత్రువులు పట్నాన్ని ముట్టడి వేసుకొన్నప్పుడు. when the wind *s fair మంచిగాలి తిరిగినప్పుడు. to * on the hams గొంతు కూర్చుండుట. they sat up all night రాత్రి అంతా పండుకోలేదు. they sat up in bed అది పడకలో నుంచి లేచి కూర్చుండి వుండినది. while he spoke I was sitting upon thorns lest he should discover me వాడుమాట్లాడుతూ వుండగా నన్ను కనుక్కోపోతాడని నేను పిడికిట ప్రాణములు పెట్టుకొనివుంటిని. the medicine did not * upon his stomach ఆ మందు వాడి కడుపులో యిందలేదు. he that sitteth upon the throne సింహాసనా సీనుడైవాడు.
To Sketch v a to trace the outline చూచాయగా వ్రాసుకొనుట.
To Skewer v a to fasten with pins ముల్లుతో గుచ్చుట, పుడకతోగుచ్చి పెట్టుట.
To Skim v a and v. n. to take off the scum, or creamపయిపయిగా యెత్తివేసుట, పొంగిన నీళ్ళనుగాని మీగడనుగాని పయిపయిగాయెత్తివేసుట. she skimmed the milk పాలమిది మీగడను పయిపయిగా యెత్తివేసినది. the barge skimmed the lake ఆ పడవ త్వరగా పోయినది.the martins * along the waves పక్షులు నీళ్ళను అనుకొన్నట్టుయెగురుతవి. I merely skimmed the book ఆ పుస్తకమును పయిపయిగాచదివినాను, గచ్చత్తుగా చదివినాను.
To Skin v a to flay తోలొలుచుట. they skinned the deerలేడి తోలు వొలిచినాడు.
To Skip v n గంతులువేసుట, దుముకుట, తుళ్లుట. the skipping lambs గంతులు వేసే గొర్రెపిల్లలు.
To Skirmish v n to fight loosely, to fight on parties before or after the shocks of the main battle జగడానికి కొంచెము కొంచెము ఆరంబించుట.
To Skirt v a ఆనుకొని ఉండుట, చేరినట్టు ఉండుట. the fields that * this mountain ఈ పర్వత ప్రాంతములయందు వుండే భూములు, యీ పర్వతమును ఆనుకొని ఉండే భూములు.
To Skulk v n దాగుట, నక్కుట, జంకుట. he *s like a fox నక్కరీతిగా దాగుతాడు.
To Slabber, or Slobber v n. to let the spittle fall from the mouth;to drivel చొంగకార్చుట. the child *ed all over the cloth ఆ బిడ్డ చొంగకార్చి ఆ గుడ్డనంతా చెరిపినది.
To Slack v a వదిలించుట, సళ్ళించుట, వదులుచేసుట, మట్టుపరుచుట. he *ed the rope దారమును సళ్ళించినాడు. he *ed the fire నిప్పును కొంచెము చల్లార్చినాడు. to *lime సన్నమును విరియబోసుట.
To Slacken v a వదిలించుట, సళ్ళించుట, వదులుచేసుట, మట్టుపరుచుట. he *ed the cord తాడును సళ్ళించినాడు. he *ed the fire నిప్పును కొంచెము ఆర్చినాడు. they*ed not their hand వాండ్లు వెనకతీయలేదు, వాండ్లు తక్కువగా పాటు బడలేదు, వాండ్లు అశ్రద్ధచేయలేదు. to * lime సున్నము విరియబోయుట.
To Slake v a మట్టుచేసుట, అణచుట. he *d his thirst with water నీళ్ళతో వాడి దాహమును అణచినాడు. he *d the fire ఆ మంటను కొంచెము ఆర్పినాడు. to * lime సున్నమును విరియబోసుట.
To Slam v a to shut a door &c. violently దభాలుమని కొట్టుట.
To Slander v a దూరుట, అపదూరుచేసుట, అభాండము చేసుట. he *ed them వాండ్ల మీద లేని అపవాదమును పెట్టినాడు. they *ed him to the king రాజు వద్ద వీడిమీద అపవాదములు చెప్పినారు, అభాండములు పెట్టినారు.
To Slant v n ఏటవాలుగా వుండుట. because the roof *s యింటిపైకప్పు ఏటవాలుగా వుండడమువల్ల.
To Slash v a నరుకుట, ఛేదించుట.
To Slaughter v a to kill సంహరించుట, వధించుట, పశుప్రాయముగా చంపుట.
To Slave v n to dradge, to labour, to toil పాటుపడుట,శ్రమపడు.
To Slay v a చంపుట, సంహరించుట.
To Sleep v n నిద్రపోవుట, నిద్రించుట. the business thanslept for three years ఆ పని మూడేండ్లదాకా నిద్రపోతూ వుండినది,అనగా వూరికె పడి వుండినది.
To Sleet v n మంచుతో కలిశినట్టుగా వాన కురుసుట.
To Slice v a బద్దలుగా కోసుట, తునకలుగా కోసుట. the sword *doff his ear కత్తి వాడి చెవిని కోసివేసినది.
To Slide v n జారుట, జరుగుట. when her veil slid off దానిపైట జారేటప్పటికి. she slid into the house యింటిలోనికి జరిగినది. ten years slid away యింతలో పదియేండ్లు అయిపోయినవి. they passed the day in sliding నా డంతా మంచు మీద జారుతూ ప్రొద్దు బుచ్చినారు. a table with sliding drawers యీడ్పుగల మేజా,అరలుగల మేజా.
To Slight v a to scorn ఉపేక్షచేసుట, అగౌరవము చేసుట.he *ed my advice నా మాటను అలక్ష్యము చేసినాడు.
To Sling v a వడిశలతో వేసుట, వడిశలతో రువ్వుట. they slunghim up on a pole and a carried him along వాణ్ని దుప్పట్లో వేశిబొంగుకు కట్టి యిద్దరుగా మోసుకొని పోయినారు, వచ్చినారు.
To Slink v n నక్కుట, జణుగుట, దాగుట. he slunk into the houseరెండో మనిషికి తెలియకుండా యింటిలోనికి జరిగినాడు. the snake slunkinto the bush పాము పొదలోకి జరిగినది.
To Slip v n జారుట, జారిపడుట, జరుగుట. his foot slippedవాడికాలు జారినది. his knee is slipped వాడి మోకాలు బెణికినది.his ankle joint slipped వాడి చీలమండ తొలిగినది. the knot slipped ఆ ముడి జారిపోయినది, వూడిపోయినది. he let the opportunity* సమయాన్ని పోగొట్టుకొన్నాడు. the time slipped away very fast కాలము తెలియకుండా జరిగిపోయినది. I slipped down జారిపడ్డాను. she slipped out of the house ఆ యింటిని విడిచి వుపాయముగా అవతలికి పారిపోయినది. the hook slipped out of the fish'smouth గాలము చేప నోట్లోనుంచి జారివచ్చినది. the fish slipped outof his hand చేప వాడిచేతిలోనుంచి జరిగిపోయినది. you have let the business * through your fingers ఆ వుద్యోగమును నీకు అందకుండాపోగొట్టుకొన్నావు. this slipped out of his memory దీన్ని వాడు మరచినాడు. the bolt slipped back గడియ వూడిపోయినది.
To Slit v a చీల్చుట, కోసుట, నిడువుగా కోసుట, నిడువుగాకత్తితో గీచుట, కత్తివాటు వేసుట. he * the pen కలమునకుపాళివిడిచినాడు. they * his nose వాడిముక్కు బొందలో కత్తినిదూర్చి రెండు బద్దలుగా కోసినారు. he * the drum ఆ తంబురచర్మమును నడమ నిడువుగా కోసినాడు. the doctor * the skin over the boil వైద్యుడు ఆ పుంటిని నిడువుగా కోశినాడు.
To Sliver v a చీల్చుట, చించుట.
To Slop v a నీళ్లు కుమ్మరించి తడిచేసుట. she slopped herselfనీళ్లు వొలకపోసుకొని బట్ట అంతా తడిపి అధ్వాన్నము చేసుకొన్నది.
To Slope v n ఏటవాలుగా వుండుట, ఆదోకపాటుగా వుండుట. the land *s down from the house to the river ఆ యింటి దగ్గిర నుంచి యేటిదాకాభూమి ఆ దోకపాటుగా వున్నది. the elephant's back *s down towardsthe tail యేనుగ వీపు తోకవైపుకు యేటవాలుగా వున్నది.
To Slouch v a వికారముగా వేసుకొనుట. he *ed his hat మూతి మూసుకొనిపొయ్యేటట్టు టోపిని వికారముగా వేసుకొన్నాడు.
To Slough v n to part from the sound flesh కుళ్ళుట, అవిసిపోవుట.the wound *ed away and at last the bullet came out ఆ పుండు చీముపోసిన మీదట గుండు బయిట వచ్చినది. a sloughing sore కుళ్ళేపుండు, లొట్టె పుండు.
To Sluice v a or flood తూమెత్తి నీళ్ళు పారించుట. he *d the land ఆ నేలకు తూమెత్తి నీళ్ళు పారించినాడు.
To Slumber v n తూగిపడుట.
To Slur v a to pass over with neglect మబ్బుతాళమువేసుట, ఉపాయముగా దాటవేసుట. he slurred the note పాడడములోఆ స్వరమును చక్కగా పాడక వుపాయముగా దాటవేసినాడు.
To Smack v n to taste రుచిగా వుండుట, రుచించుట. this *s of honey యిందులో తేనె రుచి వున్నది. this *s of enimity యిందులో చలము వుండే జాఢగా వున్నది.
To Smart v n మండుట, నొచ్చుట, జలపరించుట. while he was yetsmarting under the king's displeasure రాజానుగ్రహము తప్పి వాడు యింకాబాధపడుతూ వుండగా. the wound *s (or) it *s ఆ పుండు మండుతున్నది, జలపరిస్తున్నది.
To Smash v a to break in pieces ఛిన్నాభిన్నముచేసుట. he *ed his arm వాడి చెయ్యి విరిగినది. I will * your head నీ తల పగలగొట్టుతాను, నీ తల బద్దలు చేస్తాను.
To Smear v a చరుముట, వూయుట, అలుకుట. some Hindus * their foreheads with ashes హిందువులలో కొందరు నొసట బూడిదె పూసుకుంటారు.they * the floors with cowdung to keep away insects పురుగులు రాకుండా వుండడమునకై పేడవేసి అలుకుతారు. he *ed the wall with red paint గోడకు యెర్రవర్ణము పూశినాడు. she *ed her face withyellow paint అది ముఖానికి అరిదళము పూసుకొన్నది. he *ed the oilall over the table బల్లమీద నూనె పూశినాడు, చరిమినాడు.
To Smell v a వాసన చూచుట, అఘ్రాణించుట. she *ed the flowerఆ పువ్వును వాసన చూచినది. the dog *s rat కుక్కకు యెలుక వాసన తెలుస్తున్నది. I * a rat నాకు వొక అనుమానము కలిగినది. I *ed acorpse పీనుగ కంపు వచ్చినది. I *ed out his design వాడి యత్నమునుకనిపెట్టినాను. I *ed out the truth తుదకు నిజమును కనిపెట్టినాను.
To Smelt v a టో extract metal from ore మంటితో కలుసుకొన్నలోహమును కరిగి శుద్ధము చేసుట. he *ed the copper ore మట్టితో కలుసుకొన్న రాగిని కరిగి శుద్ధము చేసినాడు. a smelting furnace ముద్ద కొలిమి. an iron smelter ముద్ద కమ్మరవాడు.
To Smile v n చిరునవ్వునవ్వుట, మందహాసము చేసుట. the child*d on seeing her దాన్ని చూచి బిడ్డ చిరునవ్వు నవ్వినది. heaven *don his efforts వాడి యత్నమునకు దేవుడు అనుకూలించినాడు. fortune *dupon him వాణ్ని లక్ష్మి పొందినది.
To Smirch v a మాసిపొయ్యేటట్టు చేసుట, మకిల చేసుట.
To Smirk v n వికారముగా నవ్వుట. he *s like a monkeyకోతివలె పండ్లిగిలిస్తాడు.
To Smite v a కొట్టుట, మొత్తుట. these words smote his heartయీ మాటలు వాడి గుండెలలో గాలముగా తగిలినవి. he smote him under the fifth rib (a proverbial expression) వాణ్ని డొక్కలో పొడిచినాడు.she smote him i. e. he became amorous of her వాడు దాన్ని మోహించినాడు. వాడు దాని మొహములో పడ్డాడు. a very smiting woman మనోహరమైన స్త్రీ. to kill చంపుట. God smote him దేవుడు వాణ్ని హతము చేసినాడు. the disease smote him వాడికి ఆ రోగము తగిలినది.the lightning smoke the tree ఆ చెట్టుమీద పిడుగుపడ్డది. his heart smote him, or his conscience smote him పరితాప పడ్డాడు,వెనక చింతించినాడు.
To Smoke v a పొగవేసుట, పొగలో కట్టుట. they *d the house to rid it of gnats దోమలు పోవడానికై ఆ యింట్లో పొగవేసినారు. theykilled a wild hog and *d it's flesh పందిని కొట్టి దాని మాంసమునుపొగలోకట్టి పక్వము చేసినారు. they *d the milki in boiling it ఆ పాలును కాచడములో పొగచూర గొట్టినారు. to * tobacco చుట్టపట్టుట, గుడుగుడు తాగుట. they * opium వాండ్లు నల్లమందును వేశి హుక్కా తాగుతారు.they * ganja గంజాయి తాగుతారు. I *d a lie అబద్ధము వున్నదని అనుమానించినాను, సందేహించినాను. * the doctor! (Addison's Drummer)ఆహా యేమిశాస్త్రి.
To Smooth v a నున్నగా చేసుట. the carpenter *ed the woodవడ్లవాడు కొయ్యను నున్నగా చేసినాడు. to make easy సులభము చేసుట.to soften శాంతపరుచుట. these words *ed the difficulty యీ మాటలవల్ల ఆ తొందర తీరినది. his assistance *ed the taskఅతడి సహాయమువల్ల ఆ పని సులభమైనది.
To Smother v a ఉడ్డుకుడుచు కొనేటట్టు చేసుట. the dust and smokeare enough to * us మనమున వూపిరి తిప్పనియ్యకుండా చేయడమునకు యీ దుమ్ముపొగ చాలును. she *ed the child ఆ బిడ్డకు గుక్క తిరగకుండా చేసి చంపినది.he *ed the bird in the box ఆ పక్షిని పెట్టెలోవేశి మూశినాడు అది గుక్కతిప్పుకోలేకుండా చచ్చినది. to suppress అణచివేసుట. they *ed the evidenceఆ సాక్షులను పలకకుండా చేసినారు. they *ed the intelligence యీ సమాచారమునుఅణిచివేసినారు.
To Smoulder v n గనగనలాడుతూ వుండుట, జ్వాల లేకుండా నిగురుగా వుండుట. the fire *ed for three days ఆ నిప్పు మూడు దినములదాకా గనగనలాడుతూ వుండినది. Smoulderand Smother are the same word "They smouldered the princes betweentwo feather beds." Lord Orford's Historic Doubts.
To Smut v a to dirt మురికిచేసుట, మయిల చేసుట.
To Smutch v a to dirty మురికిచేసుట.
To Snap v n to break short పుటుక్కున తెగుట, పెళుక్కుమని విరుగుట.they pulled the rope till it snapped వాండ్లు యీడ్చేటప్పటికి ఆ తాడు పుటుక్కున తెగినది. to attempt to bite కరవవచ్చుట, కరవబోవుట. the dogsnapped a me ఆ కుక్క నన్ను కరవవచ్చినది.
To Snare v a to entrap వలలో చిక్కించుకొనుట, వలలో వేసుకొనుట.
To Snarl v n (as a dog) గుర్రుమనుట, ఉర్రుమనుట. he may * at you but he cannot injure you వాడు యెంత రేగినా నీకు హాని లేదు.
To Snatch v a పెరుక్కొనుట, పీక్కొనుట. the monkey *ed the bread out of my hand. ఆ కోతి నా చేతి రొట్టెను పెరుక్కొని పోయనది. he *ed anopportunity to tell me the truth సమయము చూచుకొని నాతో నిజము చెప్పినాడు.If I can * a moment to-morrow I will write to you రేపు నాకు రవంత సావకాశము చిక్కితే తమకు వ్రాస్తాను. to * a kiss యేమార చూచి ముద్దు పెట్టుకొనుట.when a fever *ed away his mother తల్లిని జ్వరము తుంచుకపోయినప్పుడు.
To Snatch at v n పెరుక్కోపోవుట, పెరుక్కోవచ్చుట.
To Sneak v n నక్కుట. he was ashamed and *ed away అతడుశిగ్గుపడి మెల్లిగా అవతలికి పోయినాడు. he *ed into the house ఆ యింట్లోకి దొంగతనముగా జొరబడ్డాడు.
To Sneer v n నసుకుట, పరిహాసము చేసుట. they *ed at hisletter వాడి జాబును చూచి నవ్వి యెగతాళిలో పెట్టినారు.
To Sneeze v n తుమ్ముట.
To Sniff v n to draw breath audibly up the nose ఆఘ్రాణించుట.
To Snip v a కత్తిరించుట.
To Snipe v a పిట్టలవేటాడుట. we heard a few sniping shots టుప్పుటప్పుమనికాల్చడమును విన్నాము. they were exposed to a sniping fire వాండ్లు అప్పుడప్పుడు టుప్పుటప్పుమని కాల్చబడ్డారు.
To Snivel v n to cry as children బిడ్డల వలె యేడ్చుట, ఇది యెగతాళిమాట. a snivelling hypocite నీలి యెడుపులు యేడ్చేవాడు.
To Snooze v n that is, to sleep నిద్రపోవుట, ఇది నీచ శబ్దము.
To Snore v n గురక పెట్టుట.
To Snort v n as a horse బుస కొట్టుట. the horse *ed with prideగుర్రము వుల్లాసముగా బుసలు పెట్టినది. he *ed with rage కోపము చేత బుసలు కొట్టినాడు.
To Snow v n మంచు కురుసుట. it *ed very hard last night రాత్రి నిండామంచు కురిసినది.
To Snub v a to rebuke చీవాట్లు పెట్టుట, కూకలు పెట్టుట. (Chancer uses this verb in Prologue to Tales, line 525 spelt snibbe.)
To Snuff v a to draw in with the breath ఆఘ్రాణించుట, ముక్కుతోపీల్చుట. the vulture *ed the smell of a corpse ఆ గూళి పీనుగ కంపునుపట్టినది. to crop a candle దీపపు కొడి కత్తిరించుట.
To Snuffle v n to speak through the nose ముక్కుతో మాట్లాడుట.snuffling words ముక్కుతో మాట్లాడే మాటలు.
To Soak v n నానుట.
To Soar v n పైకి యెగుసుట, ఆకాశానికి యెగురుట. the eagle *ed over thecliff గూళి పర్వతమునకు పైగా యెగిరినది. a liberality that *s above all praiseపొగడనలవిగాని దాతృత్వము. in these verses the poet *s very high యీ పద్యమువల్లఆ కవి నిండా ఘనత కెక్కినాడు.
To Sob v n వెక్కి వెక్కి యేడ్చుట. she wept much, but I did not hear her * అది యేడ్చినది గాని అది వెక్కి వెక్కి యేడవడము నేను వినలేదు.
To Sober v a to make calm, to bring him to his senses శాంతపరుచుట,స్మారకము వచ్చేటట్టు చేసుట. the shock *ed him యీ భయము చేత వాడికి స్మారకమువచ్చినది.
To Soften v a మెత్తగా చేసుట, మెదుపుట, మెత్తపడేటట్టు చేసుట. these words*ed his heart యీ మాటలవల్ల వాడి మనసు కుదుటపడ్డది. all that cheers or*s life ప్రాణానికి సుఖముగానున్ను నెమ్మదిగానున్న వుండేటివియెల్లా. wishing to * these bitter tidings చావమర చెప్పవలెనని. you must * your language నీవు యింత క్రూరముగా మాట్లాడరాదు. this *ed the pain యిందు వల్ల ఆ నొప్పి ముట్టుబడ్డది. milk and sugar * tea తేయాకు యొక్క వెగటును బెల్లమున్ను పాలున్నుఅణుస్తున్నది. fire *s iron నిప్పు యినుమును మెత్తగా చేస్తున్నది, అనగా నిప్పున కాగిన ఇనుము యెట్లా కొట్టితే అట్లా సాగుతున్నది.
To Sohisticate v a కుతర్కములు చెప్పి చెరుపుట.
To Soil v a మురికచేసుట, మాపుట. I will not * my hands with this businessనేను ఆ పీడ పనికి పోను.
To Sojourn v n ఉండుట, నివాసము చేసుట, నివసించుట.
To Solace v a to comfort వోదార్చుట, ఊరడించుట, ఊరార్చుట. he *d himselfwith a pipe అట్లాచుట్ట తాగుతూ ప్రొద్దుబుచ్చినాడు.
To Solder v a పొడిపెట్టి అతుకుట. it booteth not them to * up a broken cause (Hooker) వాండ్లు యెన్నిపాట్లుబడ్డా చెడిపోయిన పనివాండ్లకుకలిసిరాలేదు.
To Sole v. a. అట్టవేసుట. thin *d shoes పాదరక్షలు, వొకటిరెండుఅట్టలువేసినతేలికైనజోడు
To Solemnize v a to celebrate, to perform religiously యథావిధిగాజరిగించుట, ఆచరించుట, కొనియాడుట, చేసుట. to * a marriage యథావిధిగా పెండ్లి చేసుట.
To Solicit v a to entreat ప్రార్ధించుట, వేడుకొనుట, బతిమాలుకొనుట. he *edmy aid నన్నుసహాయపడుమని బతిమాలుకొన్నాడు. I * your attention to this matterయీ సంగతిని తమరు విచారించవలెనని కోరుతున్నాను. he *ed their favour వారి దయనుకోరినాడు. temptations * men దురాశలు మనుష్యులను చెడుదోవకీడ్చే యత్నములోనే వుంటవి.
To Soliloquize n s తనలో తాను మాట్లాడుకొనుట.
To Solve v a to explain తీర్చుట, లీడ్చుట, పొగొట్టుట, నివారణము చేసుట, పరిష్కరించుట. this *s the difficulty యిందువల్ల ఆ సంకటము తీర్చుకున్నది. he*d the riddle ఆ విడి కథను విడిచినాడు.
To Soothe v a to calm ఉపశాంతి చేసుట, ఉపశమనము చేసుట, ఓదార్చుట,ఊరార్చుట. she did this to the * pain ఆ నొప్పి ఉపాశాంతి కావడమునకై యిట్లా చేసినది. to * the cild she gave it some milk ఆ బిడ్డను వోదార్చడమునకై కొంచెము పాలు యిచ్చినది. they flattered him to * his pride వాని గర్వభంగమునకు వోదార్పుగా వాన్ని పోగిడినాను.
To Sop v a to steep in liquor నానవేయుట.
To Sorrow v n చింతపడుట, వ్యసనపడుట, జాలిపడుట, పొక్కుట.
To Sort v a తరగతులుగా యేర్పడుట, క్రమముగా యేర్పరచుట, విభజించుట. he *ed the cloth ఆయా మచ్చుగడ్డలను వేరేవేరే పెట్టినాడు. they *ed the goods ఆయా సరుకులనుయేర్పరచి వేరేవేరేగా పెట్టినారు. this was an ill *ed marriage ఇది వికారమైన పెండ్లి, అనగా యీ ఆలు మొగుడికి సయోధ్యగా వుండలేదు.
To Sound v a to make a noise ధ్వనిచేసుట, వాయించుట. he *d the trumpetతుత్తార వూదినాడు. they *ed the drums తంబురలు కొట్టినారు. they *ed the cymbalsతాళములు వాయించినారు. he *ed the harp వీణె వాయించినాడు. they *ed his praise వాణ్ని శ్లాఘించినారు. to try the depth with a plummet సీసపు కడ్డిని దారానికి కట్టి నీళ్ళలో విడిచి లోతును చూచట. I *ed him about this వాడి అభిప్రాయమును యుక్తిగా పరిశోధించినాను. he tried to * me about this యిందున గురించి నా అభిప్రాయమును కనుక్కో చూచినాడు.
To Souse v a to dip, to plunge, (a low word) ముంచుట, నీళ్ళలో ముంచుట.
To Sow v a to scatter seed విత్తుట, విత్తనాలు చల్లుట. before you * the seed విత్తడానకు ముందు. when he *ed the field చేనును విత్తినప్పుడు. he *ed dissensions among them వాండ్లకు కలహము పెట్టినాడు.
To Span v a జెన వేసుట, జేనతో కొలుచుట. he spanned the silkఆ పట్టును జేనతో కొలిచినాడు. the bridge that *s stream యేటికికట్టి వుండే వంతెన.
To Spar v n to fight with prelusive strokes దెబ్బ తాకకుండాసాములో గుద్దులాడుట. to contend in words, to wrangle, squabble వాదులాడుట.
To Spare v a " to frugally పట్టిచూచుట, మన్నించుట, తప్పించుట, తప్పవిడుచుట,శిక్షించక విడుచుట, చంపకవిడుచుట, రక్షించుట, కాపాడుట. if you * your money you will ruin the business నీవు రూకలను పట్టి చూస్తే ఆ పని చెడిపోను.he *d no money in building the house యీ యింటిని కట్టడములో వాడు రూకలను పట్టి చూడలేదు. he did not * a single soul వొక ప్రాణినైనా విడవలేదు. he always *s his servants but he never *s his wifeపనివాండ్లకు దయగా నడిపిస్తాడు గాని పెండ్లాన్ని వేయించి బొక్క లాడుతాడు. he never *s me నా మీద యెప్పుడు దయలేదు. can you *me that book ఆ పుస్తకమును నాకు యివ్వడములో తమకేమీ తొందరలేదుగదా, ఆ పుస్తకాన్ని యివ్వడములో తమకేమీ యిబ్బంది లేకుండా వుంటే యివ్వండి. I could ill * the money but I gave it to him ఆరూకలను వాడికి యివ్వడమువల్ల నాకు నిండా సంకటమైనప్పటికిన్ని యిచ్చినాను. I havethree horses I can easily * one నాకు మూడు గుర్రాలు వున్నవి వొకటిని యిస్తే నాకేమీ తొందరలేదు. the king *d him రాజు వాణ్ని చంపక విడిచినాడు. the king *d his life but seized his wealth రాజు వాడి ప్రాణాన్ని మన్నించి వాడి ధనమును గుంజుకొన్నాడు. he used my horse and *d his own నా గుర్రాన్ని సవారిచేశి తనగుర్రాన్ని వూరికే వుంచినాడు. to * my horse I went two miles on foot నా గుర్రానికి తొందరలేకుండా నేను రెండు గడియల దూరము నడిచి పోయినాను. you ought to punish the boy; why do you * him ? వాణ్ని శిక్షించక యేల వురికే విడిచిపెట్టుతావు. I will * you the trouble of doing it; I will do it myself తమ కేందుకు తొందర నేనే చేస్తాను. God *d my life దేవడు నా ప్రాణాన్నిమన్నించినాడు. I cannot * him to-morrow వాడు లేకుండా రేపు నాకు గడవదు. if you will * me an hour I will explain the account to you తమరు గడియసేపు తీరికచేసుకొంటే ఆ లెక్కను తమకు తెలియచేస్తాను. if you will * mefor an hour I will go నన్ను గడియసేపు విడిస్తే నేను పోతాను, నాకు గడియసేపుశలవు ఇస్త పోతాను. I cannot * a moment to-day నేడు నాకు నిమిషమైనా తీరదు.the post *s us a great deal of trouble యీ తపాలువల్ల మాకు అనేక తొందరలులేకుండా పోతున్నవి. he that *s the rod spoils the child యెవడైతే శిక్షించడో వాడుబిడ్డను చెరుపుతాడు. he *d neither trouble nor time in doing this దీన్ని చేయడములో యెంత తొందరగా వుండినా యెంత సావకాశము అయినా కానియ్యని వుండినాడు. * my blushes I cannot tell that story ఆ సంగతిని చెప్పడానకు నాకు సిగ్గుగా వున్నది.wishing to * him I did not tell the story పడి వుంటాడని నేనా సంగతిని చెప్పలేదు.if God *s me another year దేవుడు యింకొక సంవత్సరము భూమిలో నన్ను వుండనిస్తే. Iwish to * you in this business తమకు యీ తొందర యెందుకో. he *s no one వాడు వొకరినీ విడవడు. O * me this sad story ఆ పాడు కథను నాతోచెప్పవద్దు. I wished to * her feelings and threfore I did not tell this story అది దుఃఖ పడబోతున్నదని యీ సంగతిని దానితో చెప్పలేదు. you, may * your censrues he is dead నీ చివాట్లు యెందుకు వాడు చచ్చినాడే, వాడు చచ్చినాడు యిక నీ చీవాట్లు మానుకో. God has *d him దేవుడు వాన్ని రక్షించినాడు, బ్రతికించినాడు. * your jokes నీ యెగతాళిచాలించు. to have unemployed అధికముగా వుండుట. I *d the horsebecause I wanted him next day రేపటికి కావలసి వున్నది గనుక నేడుగుర్రానికి నిండా తొందర యివ్వలేదు. he lent me all the money he could * వాడికి వుపయోగము లేకుండా వుండే రూకలనంతా నాకు యిచ్చి పెట్టినాడు.he did not * himself in this business యిందులో వంచన లేకుండా పాటుబడ్డాడు. his coming *d me the trouble of going ఆయన రావడమువల్ల నేను పోవలసిన తొందర తప్పినది. we might have *d our comingమనము వచ్చిన్నీ వ్యర్థము.' I have no horse to * నా దగ్గిర గుర్రము అధికముగా లేదు. if you have pens to * give them to me నీ దగ్గిరపేనాలు అధికముగా వుంటే నాకు యియ్యి. if you have ten rupees to * lend it me మీ దగ్గిర మిగతగా పదిరూపాయిలు వుంటే నాకు యివ్వండి. I have a room to * నాకు అధికముగా వొక గది వున్నది. there is cloth enough but there is none to * గుడ్డలు యెన్ని కావలసినవో అన్నే వున్నవి గాని అధికముగా లేవు. to * his eyes he used green glasses కంటికి తొందర లేకుండా వుండడానకై పచ్చ అద్దములు వేసుకొన్నాడు. to * my horses's feet I shod them గుర్రాల కాళ్లకు తొందర లేకుండా వుండడానకై లాడములు కట్టించినాను. by saving and sparing he colleceted much money కడుపు పట్టి దుడ్డుదుడ్డుగా నిండా రూకలు చేర్చినాడు."
To Sparkle v n to emit sparks నిప్పులు రాలుట to shine;to glitter ధగధగలాడుట, మినమినలాడుట, తళతళమని మెరుసుట. with eyes sparkling with fury కోపముచేత కడ్లలో నిప్పులురాలుస్తు.
To Spatter v a to sprinkle with dirt మురికిచేసుట, బురదచేసుట.as the carriage passed by, it *ed us బండిపోతూ వుండగా బురదమామీద చెదిరినది. they *ed his character with many storiesకొన్ని కథలు చెప్పి వాడి పేరును చెరిపినారు.
To Spawn v n గుడ్లుపెట్టుట, ఇది చేపలను కప్పలను గురించినమాట.these fishes * in spirng యీ చేపలు వసంత రుతువులో గుడ్లు పెడతవి.wretches *ed nobody knows where గోత్ర సూత్రములేని నీచులు. follies*ed by idleness సోమారితనముచేత కలిగిన పిచ్చితనములు.
To Spay v a to castrate female animals ఆవులు, ఆడ పందులుమొదలైనవి చూలు కాకుండా వుండేటట్టు గర్భకోశమును తీసివేసుట.
To Speak v n చెప్పుట, ఆడుట, మాట్లాడుట. he *s fairవాడి మాటలు బాగా వున్నవి. this act *s for itself యీ పని తనకుతానే దాని కార్యమును తెలియ చేస్తున్నది. his superiority *s for itself అతని ఘనతే పదివేలు. this *s well for him వాడియందు యిదొకసద్గుణము వున్నది. to * in sleep కలవరించుట. he and she do not* అతనికి ఆమెకు మాటలు లేవు. I can * to his having been there వాడు అక్కడ వుండినాడని నేను చెప్పగలను, అందుకు నేను సాక్షి.
To Spear v a ఈటెతో పొడుచుట, బల్లెముతో పొడుచుట.
To Specify v a వివరముగా తెలియచేసుట, వయనముగా చెప్పుట,స్పష్టముగా విశదపరుచుట.
To Speculate v a a to meditate to cotemplate యోచించుట, ఆలోచించుట, ఎన్నికలు పెట్టుట. in merchandizE వొక వొడ్డువొడ్డుట,తెగించి వొక వర్తకము చేసి చూచుట.
To Speed v n త్వరగాపోవుట, త్వరగా నడుచుట, త్వరగ జరుగుట. he *ed away పారిపోయినాడు. it *ed very well అది చక్కగా జరిగినదిసఫలమైనది. this can never * అది యెన్నటికీ ముందుకురానేరదు. he *ed ill in this business యీ పనిలో వానికి జయము కాలేదు. how canthe work * without attention? జాగ్రత్త లేకుంటే ఆ పని యెట్లా చక్కపడును.
To Spell v a and v. n. ఆయా శబ్దములకు వుండవలసిన అక్షరములను వ్రాసుట, చెప్పుట, అక్షరాలు కూర్చుట. he writes English but he cannot * వాడు ఇంగ్లీషు వ్రాస్తాడుగాని ఆయా శబ్ధములకు వుండవలసిన అక్షరములు యెరిగి సుబద్ధముగా వ్రాయలేడు. you havespelt this word wrong యీ మాటలో అక్షరాలు తప్పుగా వ్రాసినావు. how can he * when he does not know his letters? వాడికి అక్షరాలేతెలియకుండా వుండేటప్పుడు వాడు యెట్లా అక్షరాలు కూర్చును. how do you *his name? వాని పేరుకు అక్షరాలు యేవి, వాని పేరును యే యే అక్షరాలతోవ్రాస్తావు. can the child *? ఆ బిడ్డకు అక్షరాలు కూర్చడానకు వచ్చునా.words spelt with a K క కారముగల శబ్దములు.
To Spend, spend v a. వ్రయము చేసుట, సెలవు చేసుట. he spenthalf the money సగము రూకలను కాజేసినాడు, పాడుచేసినాడు. he spenthis money in good deeds వాడు తన రూకలను సత్కార్యములో వినియోగపరిచినాడు, స్వద్రయము చేసినాడు. he spent his labour in vain వృధాగా ఆయాసపడ్డాడు, వృథా తొందరపడ్డాడు. he spent all hisstrength in this task తన బలమునంతా యీ పనికి వొప్పగించినాడు.when he had spent all his fury వాని కశిఅంతా తీరిన తర్వాత, వాని చలమంతా తీరిన తర్వాత. we spent two days there అక్కడ రెండునాళ్ళు గడిపినాము.
To Spew v a కక్కుట, వమనము చేసుట, వాంతి చేసుట.
To Sphacelate v n to mortify; to suffer the gangrene శరీరములో వొక భాగము కుళ్ళుట, మురుగుట.
To Spice v a సంబారము చేర్చుట, మసాలా వేసుట.
To Spike v a చీలగొట్టుట. to * a gum పీరంగి చెవిలోమేకుకొట్టి పిరంగిని పనికిరానిదిగా చేసుట.
To Spill v a to shed; to lose by shedding ఒలకబోయుట,చిందబోయుట. she *ed the milk అది పాలును వొలకబోసినది, చిందబోసినది. you must * none of this dose యీ మందులో రవంతైనా చిందబోయరాదు. he *ed their blood వాండ్లను చంపినాడు.
To Spin v a వడుకుట. she spun all this thread యిది అంతాఅది వడికినదారము. he spun a top వాడు బొంగరమును ఆడించినాడు. he spun out the story ఆ కథను పెంచి చెప్పినాడు. he spun out his days here యిక్కడ శానాదినాలు గడిపినాడు.
To Spirit v a ఝరీలుమని బైలుదేలుట, చిమ్మన గొట్టముతోచిమ్మినట్టు ఝరీలుమని బైలుదేరుట. the milk *ed out చంటినుంచి పాలు చిమ్మినట్టుగా బైలుదేలినది. the blood *ed out of thewound ఆ గాయములో నుంచి నెత్తురు ఝరీలుమని వచ్చినది.
To Spirit away v a మాయముచేసుట. they *ed the girl awayఆ పడుచును మాయము చేసినాడు.
To Spiritualize v a మనశ్శుద్ది, చేసుట, సన్నిష్టను కలగచేసుట,పరమార్ధమందు మనస్సును లగింపచేసుట, జ్ఞానమును కలుగచేసుట.
To Spirt v a చిమ్ముట.
To Spit v a to pierce or put upon a spit శలాకతో గుచ్చుట.he spitted the flesh and roasted it ఆ మాంసమును శలాకతో పొడిచియెత్తి నిప్పున వాడ్చినాడు. the bird spitted the worm upon the thornపక్షి ఆ పురుగును ముంటిలో గుచ్చినది. the serpent *s venom పాము విషమును కక్కుతున్నది. in this disease they * blood యీ రోగులకు వుమ్మితో నెత్తురు పడుతున్నది.
To Spitchcock v a to roast మాంసమును నిప్పున వాడ్చుట.
To Spite v a to treat maliciously విరోధముగా వుండుట, చలపట్టివుండుట. he did it to * me నా మీద చలముచేత దీన్ని చేసినాడు. he *s me నా మీద విరోధముగా వున్నాడు. the mungoose *s the snakeముంగిసకు పాముకు విరోదము every wife *s rival ఆడవాండ్లకు చవితిపోరుసహజమే కదా. he will * you if he catches you నీవు చిక్కితే వాడికినీమీద వుండే చలము తీర్చుకొనును.
To Splash v n and v. a. చెదురుట, చెదిరేటట్టు చేసుట.the dog was splashing about in the water ఆ కుక్క నీళ్ళలోఆట్లాడుతూ వుండినది. he *ed me with mud నా మీద బురదనీళ్ళు చేదిరేటట్టు చేసినాడు.
To Splice v a to join the two ends of a rope without aknot అతకపెట్టుట, రెండు పగ్గముల మొనను ముడివేయకుండా వొకటితోవొకటిని అతక పెట్టుట.
To Splinter v a బద్దలుచేసుట, తునకలు తునకలు చేసుట.
To Split v a బద్దలు చేసుట, చీలగొట్టుట, చీల్చుట, వక్కలుచేసుట,పగలగొట్టుట. he was ready to * his sides with laughing పక్కలుపగల పకపకా నవ్వాడు. the noise was enough to * the head ఆ ధ్వనివింటే తల రెండు వక్కలవును. all that he says is merely spliting hairs; or hair-splitting వాడు యింత ప్రయాస పడిచేసే వుపన్యాసమంతా కొండను తవ్వి యెలుకను పట్టినట్టు వున్నది. he ran full * దబదబమని పరుగెత్తినాడు. a splitting headache తలబద్దలయ్యే తల నొప్పి.
To Splutter v n తొందరపడుట, ఆయాసపడుట, అల్లరిబడుటగతరబడుట.
To Spoil v a to seize by robbery; to take awayby force దోచుకొనుట, కొల్లబెట్టుట. they *ed him of hiswealth వాడిరూకలను కొల్లబెట్టుకొని పోయినారు. to corrupt;to mar; to make useless చెరుపుట, చెడగొట్టుట. why do you * the child? యీ పిల్లకాయ బుద్ధిని యేల చెరుపుతావు. he *ed my market నా బేరమును చెరిపినాడు.
To Spoliate v a కొల్లబెట్టుట.
To Sponge v a తుడుచుట, పరిశుద్ధము చేసుట. he *d the gunసముద్రపు పాచివేసి ఆ తుపాకి గొట్టములో బాగా తుడిచినాడు.
To sponge out v a తుడిచివేసుట.
To Sport v n ఆట్లాడుట, గంతులువేసుట, ఉల్లసించుట. this was hissporting, name (or alias) యిది వాడికి ముద్దుపేరు. meaning to hunt or shoot వేడుటాట.
To Spout v a ఝరీలుమని చిమ్ముట. the vein *ed blood ఆ నరములోనుంచి ఝరీలు మని నెత్తురు బైలుదేరినది.
To Sprain v a ఇలుకుపట్టేటట్టు చేసుట, బెణికించుట. I * edmy hand నా చెయ్యి బెణికినది, నా చెయ్యి యిలుకుపట్టినది.
To Sprawl v n కాళ్లు చేతులు పారజాపుకొని పడివుండుట. the childwas asleep sprawling on the ground కాళ్ళుచేతులు పోయినది తెలియకఆ బిడ్డ పండుకొని నిద్రపోతూ వుండెను. there was a frog sprawling on the bank కప్ప చేతులు కాళ్లు చాపుకొని పడివుండినది.
To spread v a పరుచుట, చాచుట. he * the paper before meఆ కాకితాన్ని విచ్చి నాకు చూపినాడు. the bird * its wings పక్షి రెక్కలను విచ్చినది. he * his arms చేతులు బారచాచినాడు. he * his hand or his fingers ముడుచుకొన్న చేతిని తెరిచినాడు. he * the cloth గుడ్డ పరచినాడు. he * the mat చాప వేసినాడు. he * the umbrella వాడు ఆ గొడుగును విచ్చినాడు. after the flower * its bosomపుష్పము వికసించిన తర్వాత. she * the butter on the bread రొట్టె మీద వెన్న చరిమినది. he * the earth over the rock ఆ రాతి మీద మన్ను పరచినాడు, నెరపినాడు. he * the plaister on the cloth గుడ్డకు ప్లాస్త్రి చరిమినాడు. the cobra snake * it's crest పాముపడగ యెత్తినది.this * the disease యిందువల్ల యీ రోగము వ్యాపించినది. she * (or * out)the corn on the floor అది ధ్యానమును నేలపోసి నెరపినది. he * the table మేజ వేసినాడు, భోజనము వడ్డించినాడు. they * the news ఆ సంగతిప్రచురము చేసినారు.
To Spring v n as a plant మొలుచుట, చిగురుపెట్టుట. when themine sprung భూమిలో పూడ్చి పెట్టిన తుపాకిమమదు భగ్గున పైకిలేచేటప్పటికి.to be born పుట్టుట, ఉద్భవించుట, కలుగుట. those who * form royalfamilies రాజవంశములో పుట్టేవాండ్లు. to bound or leap దుముకుట. on seeing the snake he sprung back ఆ పామును చూచి వెనక్కు తుళ్లిపడ్డాడు.a thought sprung up in his mind వాడికి వొకటి స్ఫురించినది, వాడి మనస్సులో వొకటి తోచినది. a quarrel sprung up వొక కలహము పుట్టినది.a school Sprung up there last year పోయిన సంవత్సరము అక్కడ వొక పల్లెకూటము కలిగినది. as he entered the wood four birds sprungup వాడు అడవిలో పొయ్యేటప్పటికి నాలుగు పక్షుల బుర్రుమని యెగిరినవి. the tiger sprung at him పులి వాడిమీద దుమికినది. they sprang forward to assist him వాండ్లు సహాయము చేయుడమునకు ముందుపడ్డారు.
To Sprinkle v a చిలకరించుట, చల్లుట, ప్రోక్షించుట. they *dsand on the floor నేల మీద యిసుకను చల్లినారు. she *d salt overthe bread, or she *d the bread with salt రొట్టె మీద వుప్పుపొడిచల్లినది. she *d flowers over the ground or she *d the groundwith flowers నేలపై పుష్పములను చల్లినది.
To Sprunt v n to spring up; to germinate. To spring forwardదుముకుట, గంతులువేసుట, మొలుచుట.
To Spunge v a సముద్రపుపాచితో తుడుచుట. he *d the gunతుపాకి గొట్టములో సముద్రపు పాచి వేసి తుడిచినాడు.
To Spurn v a to kick, to strike or drive with the foot.To reject: to scorn తన్నుట, తన్ని తోసుట, తిరస్కరించుట. the bull*ed the sand ఆ యెద్దు యిసుకదిబ్బను కాళ్ళతో తన్ని తోసినది. he *edthe bribe ఆ లంచము నాకు అక్కరలేదని నిరాకరించినాడు.
To Sputter v n to emit moisture in small flying dropsమాట్లాడడములో తుంపుర్లు రాలుట. he *s in talking వాడు మాట్లాడడములోతుంపుర్లు బడుతవి. to speak indistinctly తెలియకుండా లొడలొడమనిమాట్లాడుట.
To Spy v a కనుక్కొనుట. he spied a defect in this యిందులోవొక తప్పు కనుక్కొన్నాడు. he sent four persons to * out the thieves ఆ దొంగలను కనుక్కోవడానకై నలుగురిని పంపినాడు.
To Squabble v n జగడమాడుట, కొట్లాడుట, వాదాడుట.
To Squail v a to fling stones రాళ్ళు రువ్వుట. this is a rustick word. Southey says in "The Doctor" 5. 270. you * at us మీరు మా మీద రాళ్లు రువ్వుతారు.
To Squall v n to scream అరుచుట, గీపెట్టుట.
To Squander v a దుర్వ్రవయము చేసుట, దూబరదిండి సెలవు చేసుట.
To Square v a చచ్చౌకము చేసుట, చతురస్రము చేసుట, చౌకముచేసుట. to adjust or regulate క్రమపరుచుట, దిట్టపరుచుట,సరిగ్గా పెట్టుట. this ten rupees will * the accounts యీ పదిరూపాయిలతో ఆ లెక్క తీరిపోతున్నది.
To Squash v a నలగ్గొట్టుట, చితగ్గొట్టుట. the eggswere *ed ఆ గుడ్లు నలిగిపోయినవి.
To Squat v n పద్మాసనము వేసుకొని కూర్చుండుట, గొంతు కూర్చుండుట.to sit as a tailor దర్జీరతీగా కూర్చుండుట. to * as a toadకప్పవలె కూర్చుండుట.
To Squeak v n కీచుమని అరుచుట, ఇది ఎలుకను పందిపిల్లను గురించిన మాట.
To Squeal v n కీచుమని అరుచుట, ఇది పందిని గురించిన మాట.
To Squeeze v a to press; to crush between two bodiesఅదుముట, పిండుట, పిడుచుట, చిదుముట, పిసుకుట, నలుపుట, she *d the lime నిమ్మపండును పిండినది. he *d my hands నా చేతులు పట్టుకోన్నాడు. he *d all the cltohes into the box ఆ బట్టలనంతా పెట్టెలో వేశి అదిమినాడు, కూరినాడు. he *d the cloth dry ఆ గుడ్డలో నీళ్ళు లేకుండా పిడిచివేసినాడు. they *ed ten rupees out of him వాడి దగ్గిర పదిరూపాయిలు వెల్లపెరికినారు.
To Squint v n to look obliquely వోరచూపుగా చూచుట, పక్కచూపుగాచూచుట. he *s వాడికి మెల్లకన్నుగా వున్నది. in this remark I thinkhe *s at the Government ఈ మాట చెప్పడములో వాడకి దృష్టి గౌనరుమెంటువారిమిదనని తోస్తున్నది.
To Squir v a రువ్వుట. he squirred stones at me నా మీద రాళ్ళు రువ్వినాడు.
To Squire v a దాసుడుగా కూడావచ్చుట, బంటుగా వెంబడివచ్చుట.
To Squirt v a చిమ్మన గొట్టముతో చిమ్ముట.
To Stab v a పొడుచుట.
To Stable v a to put in a stall లాయములో కట్టుట.
To Stablish v a to establish నియమించుట, నిర్ణయించుట,కుదురుచుట, నిలుపుట.
To Stack v a కుప్పవేసుట, వామివేసుట. their arms were *ed i. e. piled వాండ్ల ఆయుధములను పోగువేసినారు.
To Stagger v n to reel; not to stand or walk steadily తత్తరపడుట, తడబడుట. he *ed under the load ఆ మూట యెత్తుకొనివాఢు తక్కిరిబిక్కిరిగా నడిచినాడు. to faint సోలుట. to begin tolose courage ధైర్యము తప్పుట. to hesitate అనుమానపడుట, నమ్మకముతప్పుట.
To Stagnate v n to lie motionless; to have no course or streamపారకుండా నిలుచుట, కదలకుండా వుండుట. when the water *s నీళ్ళు పారకుండా నిలిచి చెడిపోయినప్పుడు.
To Stain v a to blot మరకచేసుట. to dye చాయ అద్దుట,అద్దకము చేసుట. she *ed the cloth with red, black and yellowఆ గుడ్డకు నలుపు పసుపు చాయ అద్దినది. some of them * their facesyellow కొందరు ముఖానికి పసుపు పూసుకొంటారు. this act *ed his name ఈ పని చేత వాడి పేరుకు హాని వచ్చినది.
To Stake v a to wager; to hazard పందెము వొడ్డుట, పందెము పెట్టుట, పందెము వేసుట. he *d ten rupees upon this దీనికిపది రూపాయలు పందెము వేసినాడు. I will * my life upon thisయిది తప్పితే నా తల యిస్తాను. the bear *ed himself or ran on the * ఆ యెలుగొడ్డు తనకు తానే పోయి ఆకూచిగా వుండే కూచము మీద పొడుచుకొని చచ్చినది. they *ed up the river ఆ యేట్లో అడ్డముగా గసికలు పాతినాడు. he *ed the cattle in చుట్టూరు గుంజలు పాతి నడమ పశువులును తోలినాడు. they *ed down the bull ఆ యెద్దు కొమ్ములను గుంజకు కట్టినాడు. they *ed the tent firmly ఆ డేరాను బలముగా మేకుపాతికట్టినారు.
To Stale v n to piss to make water ఉచ్చపోసుట,ఇది గుర్రమును గురించిన మాట.
To Stalk v n to walk with high and superb steps ఒయ్యారముగానడుచుట. I saw a crane stalking along వొక కొంగ వయ్యారముగానడుస్తూ వుండినది. to walk behind a stalking horse or coverవేటలో జంతువులు బెదరకుండా తనకు మరుగుగా దేన్నైనా పెట్టుకొనినడుచుట.
To Stall v a చేతి మేతవేసి కాపాడుట.
To Stammer v n నోరు తడబడి మాట్లాడుట, నత్తిగా మాట్లాడుట.when the magistrate questioned him he *ed అధికారి వాణ్ని అడిగేటప్పటికి వాడి నోరు తడబడిపోయినది.
To Stamp v a to strike by pressing the foot hastily downwardsకాలితో నేల తన్నుట. to pound or beat as in a mortar దంచుట. to make by impressing a mark ముద్రవేసుట, అచ్చువేసుట. he *ed the coinwith the king's face ఆ నాణ్యములో రాజు ముఖమును ముద్రవేసినాడు. he *edthe king's face upon the coin ఆ నాణ్యము మీద రాజు ముఖమును ముద్రవేసినాడు. he *ed this on my recollection దీన్ని నా మనసులో నాటేటట్టు చేసినాడు.
To Stanch v a నిలుపుట. this *ed the blood దీనివల్ల నెత్తురుకారడము నిలిచినది.
To Stand v n నిలుచుట, నిలవబడుట, ఉండుట. the groundon which the trees * ఆ చెట్లు వుండే నేల. this will * you in good stead యిది నీకు సహాయమవును, అనుకూలమవును. he *swell with the governor వీడియందు గౌనరు వారి దయ నిండా వున్నది.he *s as plaintiff వాడు వాదిగా వున్నాడు. he *s charged with theft వాడి మీద దొంగతనము వచ్చినది. they stood back వెనకకువొదిగినారు. if you will * by me I will do this తమ అండ వుంటే నేను దీన్ని చేస్తాను, తమ ఆదరువు వుంటే దీన్ని చేస్తాను. they use that Dictionary as a * by వాండ్లకు ఆ నిఘంటువే ఆధారము. he is thier great * by అతడే వాండ్లకు ఆధారము, పట్టుకొమ్మ. they stoodforward ముందరికి వచ్చినారు, సహాయముగా వచ్చినారు. this house *sby itself అది వొంటి ఇల్లుగా వున్నది. * down sir! పోరా, అవతల పోరా.that pole stood erect గడ నిలవబెట్టి వుండినది. E. I. C. stands for East India Company ఇ. ఐ. సి. అంటే ఈష్టిండ్య కంపినీ అనిఅర్ధము. in this sentence he *s for Rama and she *s for Sithaయీ వాక్యములో వాడు అనగా రాముడు, ఆమె అనగా సీత. త|| stands for తర్వాత,తావేశి రెండు గీట్లు గీస్తే తర్వాత అని అర్ధము. this will * for a longtime యిది శానా దినాలకు వుండును. they * in awe of him వాడి భయమువీండ్లకు వున్నది. the *s in need of food and clothing వాడికి అన్న వస్త్రములు లేకుండా వున్నవి. the ship stood on and off ఆ వాడ కొంచెములో సముద్రము తట్టుగానున్ను కొంచెము రేవు తట్టుగానున్ను పోతూ వస్తూ వుండినది. his hair stood on end వాడి వొళ్ళు జలపరించినది. theship stood out to sea వాడలో సముద్రానికి పోయినది. they stood out of the way తొలగినారు. this account must * over యీ లెక్కను నిలిపి పెట్టవలసినది. if you have taken the house it *s to reasonthat you must pay for it ఆ ఇంటిని నీవు కొనుక్కొనివుంటే దానికినీవు రూకలు చెల్లించవలసినది న్యాయమే. the water stood still నీళ్ళు కదలకుండా వుండినది. he stood up for his wife's relationఆలివంక వాండ్లకై పోరాడినాడు, యెదురాడినాడు. he *s upon trifles కొంచానికి పట్టుకొని పోరాడుతాడు. he *s in need of punishmentవాడికి శిక్ష కావలెను. the help you * in need of నీకు కావలసి వుండే సహాయము.
To Starch v a గంజి పెట్టుట. he *ed the cloth ఆగుడ్డకుగంజి పెట్టినాడు. a clear starcher (Pick wick 328) ఇస్త్రి చేసేవాడు.
To Stare v n పెద్దకండ్లు చేసుట, తేరిచూచుట. death now*d him in the face వాడికి చావు ప్రత్యక్షమైనది, తటస్థమైనది.poverty *d him in the face వాడికి దరిద్రము ప్రత్యక్షమైనది,వాడికి దరిద్రము వచ్చేటట్టు వుండినది.
To Start v n ఉలికిపడుట, అదిరిపడుట, బెదురుట. to begin a journey బైలుదేరుట, ప్రయాణమవుట. or begin to run బరుగెత్త మొదలు బెట్టుట. when will you *? యెప్పుడు బైలుదేరుతారు. the wood*ed ఆ పలక బీటిక బాసినది. the nail *ed ఆచీల వూడివచ్చినది. tobegin in a business ఆరంభించుట, ఉపక్రమించుట. to * up లటుక్కున లేచుట. to grow rapidly రవంతలో నిండా పెరిగిపోవుట. within oneyear the tree *ed up one cubit ఆ చెట్టు సంవత్సరములో మూరెడు పెరిగినది. within two years he *ed up and was a man నిన్నటిపిల్లకాయ రెండు యేండ్లకంతా పెద్దవాడైనాడు.
To Startle v n ఉలికిపడుట.
To Starve v n ఆకలితో చచ్చుట, పస్తుతో శ్రమపడుట.
To State v a to describe చెప్పుట. he *d the fact clearlyజరిగిన పనిని విశదముగా చెప్పినాడు.
To Station v a ఉంచుట, పెట్టుట. I *ed two men at his gate వాడి యింటి వాకిట యిద్దరిని పెట్టినాను.
To Stave v a to break పగులకొట్టుట, తునకలు చేసుట, బద్దలు చేసుట.he *ed the cask ఆ పీపాయి చెక్కలను వేరేవేరగా తీసినాడు. the blow *edin the boat ఆ దెబ్బచేత పడవ బద్దలైనది. he *d off the objectionఆ యాక్షేపణను తొలగదీసి వేసినాడు. he *d off the blow with his cane చేతులో వుండే బెత్తముతో ఆ దెబ్బ తనమీద తగలకుండఅ తట్టివేసినాడు. Stave, n. s. in musik, పాటలో వొక పాదము. a verse పద్యము.
To Stay v n ఉండుట, కాచుకొని వుండుట, తాకుట, నిలుచుట. themedicine did not * on his stomach ఆ మందు వాడి కడుపులో యింద లేదు. they came but they did not * వచ్చినారు గాని వాండ్లు యిక్కడనిలువలేదు. I *ed for you నీవు వస్తావని కనిపెట్టుకొని వుంటిని.two came but the other three *ed away యిద్దరు వచ్చినారు కడమముగ్గురు రాక నిలిచినారు. why do you * away from his house? వాడియింటికి యెందుకు రాకుండా వున్నావు. they *ed behind వాండ్లు వెనక చిక్కినారు. you should not * up so late నీవు అంతసేపు నిద్ర మేలుకొని వుండరాదు. he *ed up all night రాత్రి అంతా మేలుకొనివుండినాడు.
To Steady v a కదలకుండాపట్టుట, దృఢ పరుచుట. these misfortunessteadied him యీ ఆపదవల్ల వాడికి స్థిరబుద్ది వచ్చినది. he put a stoneunder the box to * it ఆ పెట్టె కదలకుండా వుండేటట్టు అడుగున వొకరాయి పెట్టినాడు.
To Steal v a దొంగిలించుట, ముచ్చిలించుట, అపహరించుట, అంటుకోనిపోవుట,లంకించుకొని పోవుట. to * a glance దొంగ చూపులు చూచుట. to * a kissఆదాటున వొక ముద్దు పెట్టుకొనుట. he stole a march upon me నన్నుమోసపుచ్చినాడు, నన్ను ముందు మించి పోయినాడు. If I can * a moment I will come to you నాకు రవంత సావకాశము చిక్కితే మీ వద్దకి వస్తాను.
To Steam v n ఆవిరిలేచుట. a steaming dish of rice పొగలులేస్తూ వుండే అన్నము. in cold weather the lakes * చలికాలములోగుంటలలో ఆవిర్లులేస్తవి. they *ed from Madras to Calcuttaపట్టణములో నుంచి బంగాళాకు పొగ వాడ యెక్కిపోయినారు.
To Steel v a to change into steel ఉక్కుగా చేసుట. to makehard or firm కఠినముగా చేసుట. he *ed the iron ఆ యినుమునువుక్కుచేసినాడు. this *ed his heart యిందువల్ల వాడి మనసు రాయిఅయిపోయినది.
To Steep v a నానవేసుట.
To Steer v a to direct; to guide in a passage నడిపించుట.to * a ship వాడను నడిపించుట, చుక్కాణిపట్టుట.
To Stem v a ఎదిరించుట, ఎదురాడుట, విరోధించుట.
To Step v n అడుగుపెట్టుట, తొక్కుట. to go పోవుట, నడుచుట.when he stepped ashore గట్టున దిగేటప్పటికి. he stepped asideతొలిగినాడు. he stepped down into the pond గుంటలో దిగినాడు.they stepped forward వాండ్లు ముందరికి వెళ్లినారు, ముందరికినడిచినారు. they stepped forward to assist him వాడికి సహాయముచేయడానకై బైలు దేరినారు. * in లోనికిరా. they stepped into his estate వాడి ఆస్తి వీండ్లకు వచ్చినది. they stepped out of doorsయింట్లోనుంచి బైటికి వెళ్ళినారు. they stepped over the stair మెట్లెక్కి దిగిపోయినారు. when he stepped up to me నా వద్దికి వచ్చేటప్పటికి. they stepped up to him వాడి వద్దకి వచ్చినారు.
To Stereotype v a అటువంటి అచ్చు అక్షరములతో అచ్చువేసుట.
To Stew v a వెచ్చచేసుట.
To Stick v a to fasten on so as that it may adhere అంటించుట,అతికించుట. he stuck the fruit upon his knife ఆ పండును కత్తి మొననదోపినాడు. she stuck a wafer on her forehead తన ముఖములో వొక బొట్టునుఅతికించుకోన్నది. or to stab పొడుచుట. to * in దోపుట, గుచ్చుట. she stuck flowers in her hair అది కొప్పులో పుష్పములను దోపినది.
To Stickle v n to contest పోరాడుట, జగడమాడుట, పీకులాడుట.they are always sticking for caste వాండ్లు యేవేళా కులాన్ని గురించిపోరాడుతారు.
To Stiffe v a ఊపిరి బిగబట్టి చంపుట. he *d his prisonersతనవద్ద వుండే యిదీలను వూపిరి తిప్పుకోనియ్యకుండా చేసి చంపినాడు.by shutting the doors they *d the flame గాలి రాకుండా తలుపులుమూశివేసినందున ఆ మంట అణిగిపోయినది. this stench is enough to * us మనమున వూపిరి తిరగకుండా చేసి చంపడానకు యీ కంపు చాలును.a stifling smell ప్రాణముపొయ్య కంపు. two children were *din the smoke యిద్దరు బిడ్డలు పొగలో వుడ్డుగుడుచుకొని చచ్చిరి,ఊపిరి తిరగక చచ్చిరి. to conceal దాచుట. they scattered rose water to * the smell ఆ కంపు అణగడానకే పన్నీరు చల్లినారు. he *ed the story ఆ సంగతిని బైట పడకుండా దాచినాడు. you should not * conviction చేసిన పాపమును గురించిన పశ్చాత్తాపమును నశింపచేయరాదు. grief *s the appetite వ్యసనమువల్ల ఆకలి తెలియదు.by stifling her sorrow she died దుఃఖమును కడుపులో దించుకొన్నందున చచ్చినది.
To Stiffen v a గట్టిపరుచుట, బిరుసు చేసుట. she *ed thecloth with starch గంజిపెట్టి ఆ గుడ్డ బిర్రుగా వుండేటట్టు చేసినది.when age *s the limbs ముదిమిచేత అవయవములు కట్టె పారిపోయినప్పుడు.
To Stigmatize v a దూరు పెట్టుట. they * him as a thiefవాడు దొంగ అని దూరు పెట్టినారు.
To Still v a to silence నోరు మూయించుట, అరవకుండా వుండేటట్టుచేసుట. to appease అణిగించుట, శాంతపరుచుట. at last she *edthe children పిల్లలను అరవకుండా చేసినది, బిడ్డలను నోరు మూయించినది.this *ed the tumult యిందువల్ల ఆ కలత అణిగినది. to make motionlessచలనము లేకుండా చేసుట, స్తబ్ధము చేసుట.
To Stimulate v a ప్రేరేపణ చేసుట, పురికొల్పుట, రేచుట,దీపనము పుట్టించుట. her beauty *d his desires దాని అందమువానికి మరులు కొలిపినది. this *d his curiosity యిందువల్లఆ సంగతిని విచారించవలెనని బుద్ధి వానికి పుట్టినది. these *d his rage యీ మాటలవల్ల వాడికి మరీ ఆగ్రహము పుట్టినది.
To Sting v a to bite as an ant or a serpent కొరుకుట, కరుచుట. the snake stung him వాన్ని పాము కరిచినది. the ant stung him వాణ్ని చీమ కుట్టినది. the scorpion or bee stung him తేలు లేక తేనెటీగ వాణ్ని కుట్టినది. this thought *s his heart దీన్ని తలచుకొంటే వాడి మనసుకు నింఢా ఖేదముగా వుంటున్నది.
To Stink v n కంపుకొట్టుట.
To Stint v a to bound, to restrain మట్టు యేర్పరచుట, మితమేర్పరచుట. he *ed me to rice నాకు చప్పిడిపత్థ్యము పెట్టినాడు.
To Stipulate v a ఏర్పాటు చేసుట, ఒడంబడిక చేసుట.
To Stir v a to move కదిలించుట, ఆడించుట, కలుపుట, కలియపెట్టుట,కుళ్లగించుట. stand still do not * your feet వూరికె నిలువు అడుగు కదలనియ్యకు. * the fire ఆ నిప్పును కుళ్ళగించు. * the ink యింకినికలుపు. he stirred up the medicine and drank it ఆ మందును కలిపితాగినాడు, కుదిలించి తాగినాడు. why did you * this matter? ఆ ప్రస్తాపముయెందుకు చేసనావు. they stirred him up to rebellion వాణ్ని కలహానికిరెక్కొలిపినారు. to incite రేచుట, పురికొలుపుట. she was stirring (orrocking) the cradle అది తొట్లోను కదిలిస్తూ వుండినది, వూచుతూ వుండినది. To Stir, v. n. to move one's self కదులుట, మెదులుట. I cannot* నేను కదల మెదలలేను.
To Stitch v a to sew కుట్టుట. he did not finish the dress;he merely *ed it ఆ బట్టను కుట్టకుండా వూరికె పోగువేసినాడు. some ofthe books were bound; the others were only *ed కొన్ని పుస్తకములనుజిల్దుచేసి కొన్నిటిని వూరకె కుట్టిపెట్టినారు. to join; to unite అంటవేసుట.
To Stomach v a తాళుట, సహించుట. he *ed it very ill వాడుదాన్ని సహించలేదు, తాళలేదు.
To Stone v a to kill by throwing stones వొకని మీద రాళ్లురువ్వి చంపుట, గింజలు తీసుట. she *d the raisins అది ద్రాక్షపండ్లలోనివిత్తులు తీసివేసినది. she *d the tamarinds ఆ చింతపండు గింజలనుతీసివేసినది. the raisins are stoned విత్తులుతీసి ద్రాక్షపండ్లు అమ్ముతారు.

No comments:

Post a Comment