To Rap v a and v. n. మొట్టుట. he rapped at the door తలుపు తట్టినాడు. herapped out an oath నోరు జారి వొక తిట్టు వచ్చినది.
To Rarefy v a పలచన చేయుట " సూక్ష్మము చేయుట, తపద్వారా విస్తరింపచేయుట" Dx.
To Rase v a గీచియెత్తివేసుట, గోకియెత్తి వేసుట, దుంపనాశనము చేసుట, మూలధ్వసము చేసుట.
To Rasp v a బలుపాకు రాయితో కొయ్యను రాచుట, జాజికాయను పొడి అయ్యేటట్టురాచుట.
To Rat v a to act treacherously స్వామి ద్రోహము చేసుట, అపత్కాలమందుచెయి విడిచి శత్రువుతో కలుసుకొనుట.
To Ratan v a పేముతో కొట్టు, పేములతో అల్లుట.
To Rate v a to value at a certain price క్రయము కట్టుట, వెలకట్టుట. he*d this ruby at 10 rupees ఈ కెంపును పది రూపాయలకు మతించినాడు. they *dthe village at a thousand rupees ఆ వూరికి వెయ్యి రూపాయలు మతింపువేసినారు. or to esteem ఎంచుట, తలచుట. they * this very high దీన్ని నిండాఘనముగా యెంచుతారు. they * Sanscrit above Telugu తెలుగు కంటెసంస్కృతమును ఘనముగా యెంచుతారు.they * the * parias as the lowestcaste మాలవాండ్లను నిండా తక్కువ కులస్థులనుగా యెంచుతారు. or to chideకూకలుబెట్టుట, గద్దించుట, దండించుట. she *d him for this ఇందున గురించి వాడిమీద నిండా కోపము చేసినది, వాణ్ని కూకలు పెట్టినది.
To Ratify v a అంగీకరించుట, ఆమోదించుట, ఒప్పుకొనుట, సమ్మతించుట, ఊర్జితముచేసుట, రూఢిచేసుట, స్థిరపరచుట.
To Rattan v a బెత్తముతో కొట్టుట, బెత్తాలల్లుట. he *ed the chairఆ కురిచీకి బెత్తా లల్లినాడు.
To Rattle v n గడగడ అనుట, గలగల అనుట, దడదడ మనుట, పటపట అనుటబడబడ అనుట. the windows *d in the wind కిటికీలు గాలికి పటపట అనికొట్టుకొన్నవి.
TO Ravage v a చెరుపుట, ధ్వంసము చేయుట, పాడుచేయుట, హతము చేయుట,కొల్లబెట్టుట.
TO Rave v n తబ్బిబ్బులాడుట, భ్రమమాట లాడుట, వెర్రి కూతలు బెట్టుట,పలవరించుట, ప్రలాపిమచుట.
To Raven v n ఆకలికొని యేది చిక్కునా అని తిరుగుట. a ravening wolf దేన్నినోట్లో వేసుకొందామా అని తిరిగే తోడేలు.
To Ravish v a బలాత్కారము చేసుట, వొకతెను చెయి పట్టుట చెరుచుట. he *eda kiss from her దాన్ని బలాత్కారముగా ముద్దు పెట్టుకొన్నాడు. to seize to catchఅపహరించుట. ravishing the hearts of the beholder చూచే వాండ్లకుమనోహరమైన.
To Raze v a చెరుపుట, నాశనము చేసుట, ధ్వంసము చేసుట.
To Reach v a అందుకొనుట, అందించుట. when we *ed the end of the workఆ పని కడ వెళ్లా సాగవేశినప్పుడు. the arrow *ed the mark బాణము గురిమీదతగిలినది. he *ed the town by noon మధ్యాహ్నానికంతా పట్టణము పోయి చేరినాడు.the child could not * the fruit ఆ బిడ్డకు ఆ పండు అందదు. my letter did not* him నా జాబు వాడికి చేర లేదు. when this * ed his ears ఇది వాడి చెవులోపడ్డప్పుడు. when .he *ed the proper age తగిన వయసు వచ్చినప్పుడు. here thebreeze does not * మనకు యిక్కడ గాలి రాదు. when the shadow *ed thestone నీడ ఆ రాతి మీదికి వచ్చినప్పుడు. the sword *ed the bone కత్తియెముకదాకా దూసి పోయినది. I could not * his meaning వాడి భావ మెట్టిదో నాకుతగలలేదు. thought cannot * it అది దురవగాహమైనది. the branched * acrossthe road కొమ్మలు దోవకు అడ్డముగా పెరిగి వున్నవి. he * ed forth his hand చెయిచాచినాడు.
To React v n to act again ప్రతీకారము చేసుట, ప్రతిఘాతము చేసుట, ప్రతికృతిచేసుట, వైపరీత్యము చేసుట.
To Read v a చదువుట, పారాయణము చేసుట, పఠించుట. he * the letter to meఆ జాబును నాకు చదివి వినిపించినాడు. he * the letter to himself ఆ జాబునుచూచుకొన్నాడు. to * him a lesson a severe lesson or a good lessonశిక్షించుట దండన చేసుట, చీవాటలు పెట్టుట.
To Reagale v a తృప్తి పొందించుట, ఉల్లాసపరచుట, ఆప్యాయమానము చేసుట
To Realize v a సఫలపరచుట, చెల్లుపుచ్చుకొనుట, తండుట, నిజపరచుట,నిశ్చయపరచుట. this *d all my hopes ఇందువల్ల నా కోరికే సఫలమైనది. do youthink he will * any thing by this trade ? ఈ వర్తకములో వాడికేమైనా ఫలముకలుగు ననుకొన్నావా. the house was sold for whatever it might * ఆ యింటినివచ్చినకాడికి అమ్మివేశినాడు. they are too idle to * the wealth that isbountifully thrown at their feet దేవుడు యిచ్చునే గాని వండి పెట్టునా. he soldthe house for two thousand rupees but he *d only one thousand ఆయింటిని రెండు వేల రూపాయలకు అమ్మినాడు గాని వెయ్యి రూపాయలే చేతికి వచ్చినవి.The unconverted heart cannot * the glories of heaven అజ్ఞానులకువైకుంఠము యొక్క మహిమగ్రాహ్యము కానేరదు.
To Reap v a కోతకోసుట. or to obtain పొందుట, అనుభవించుట. if you willstudy six months you will * the effects ఆరు నెలలు చదివితే దాని ఫలము నీకుకలుగును. the benefit he * ed from this ఇందువల్ల వానికి కలిగిన ఫలము. a *edfield కోతకోసిన పొలము.
To Re-appear v. n. మళ్ళీ అగుపడుట, తిరిగిసంభవించుట, the fever *ed afterten days పది దినాలకు జ్వరము మళ్ళీ వచ్చినది. he disappeared at Madrasand *ed at Arcot చెన్న పట్టణములో కానకపోయి మళ్ళీ ఆరికాడులో అగుపడ్డాడు.
To Rear v a or nourish పెంచుట, పోషించుట, సాకుట. or raise పై కెత్తుట. he*ed his head తలను పొడుగ్గా యెత్తినాడు.
To Reason v n తర్కించుట, ఊహించుట, న్యాయము చెప్పుట. I *ed with themabout this ఇందున గురించి వారిలో తర్కిస్తిని, వాదిస్తిని. how can you * with adrunken man ? తాగిన వాడితో న్యాయములు మాట్లాడేది యెట్లా.
To Reassemble v a మళ్లీ కూర్చుట, తిరిగి పోగుచేసుట.
To Reassert v a మళ్లీ చెప్పుట, తిరిగీ వుదాహరిమచుట.
To Reassume v a మళ్లీ గ్రహించుట, మళ్ళీ ధరించుట.
To Reassure v a వోదార్చుట, ధైర్యము చెప్పుట.
To Reave v a అపహరించుట.
To Rebel v n తిరగబడుట, ఎదిరించు, రాజుకు విరుద్ధముగా నడుచుట.
To Rebellow v n తిరిగీ మోగుట.
To Rebound v n ఎగియుట, వొక దాని మీద తగిలిన వురువడిని మళ్ళీ యెగుసుట. theball *ed from the rock ఆ చెండు రాతి మీద తగిలి వెనకకు యెగిసినది.
To Rebuff v a తిరస్కారము చేసుట, ఎగరగొట్టుట.
To Rebuke v a తిరస్కరించుట, గద్దించుట, కూకలు బెట్టు, కసురుకొనుట.
To Rebut v a ఎగరగొట్టుట. he tried to * my arguments but could not నేనుచెప్పిన న్యాయములను యెగరగొట్టవలెనని చూచినాడు గాని వాడి చేత కాలేదు.
To Recall v a మళ్ళించుట, తిప్పుట. he wished he could * his words ఆడినమాటలను తిప్పించేటందుకు లేకపోయినదే అని యేడ్చినాడు. the government *ed theorder అధికారులు ఆ వుత్తరవును కొట్టివేసినారు. I cannot * his name వాడి పేరు నాకుజ్ఞాపకము రాలేదు. to * to memory జ్ఙాపకము చేసుకొనుట. when I *ed this totheir memory వాండ్లకు దీన్ని జ్ఙాపకము చేసినప్పుడు. he *ed them to lifeచచ్చిన వాండ్లను బ్రతికించినాడు. when they *ed him from office వాణ్నివుద్యోగములో నుంచి తీశివేసినప్పుడు.
To Recant v a తిప్పుకొనుట, తిరగబడుట. we made the witness * hisstatements ఆ సాక్షి చెప్పినది సరికాదని వాడినోటి గుండానే మళ్ళీ పలికించినాము. Iwill not * what I said నేను చెప్పిన మాటను మళ్ళీ తిప్పను. he *ed the faithhe had embraced వాడు కొత్తగా ప్రవేశించిన మతమును మళ్లీ విడిచిపెట్టినాడు.
To Recapitulate v a చెప్పిన దాన్ని మళ్ళీ సంగ్రహముగా చెప్పుట, క్రోడీకరించిచెప్పుట.
To Recast v a మళ్ళీ కరగిపోసుట, పునర్విమర్శ చేసుట.
To Recede v n తొలగుట, వెనక తీసుట. he *d from the bargain చెప్పిన మాటతప్పినాడు.
To Receive v a తీసుకొనుట, పుచ్చుకొనుట, అంగీకరించుట, గ్రహించుట, కైకొనుట. I*d it అది నాకు చేరినది ముట్టినది. I *d a wound నాకు వొక గాయము తగిలినది. he*d his pay జీతము పుచ్చుకొన్నాడు, వాడి జీతము వాడికి ముట్టినది. he *d thispunishment వాడికి యీ శిక్ష అయినది. he *d hundred stripes నూరు దెబ్బలుతిన్నాడు. I *d the money ఆ రూకలు నాకు ముట్టినవి చేరినవి. I *d assistancefrom his ఆయన సహాయము నాకు దొరికినది. he *d no benefit from thisఇందువల్ల నాకేమి లాభము లేదు. I failed to * any advantage from it అందువల్లనాకేమిమ్ని ఫలము లేదు. after the sheath *d the sword వొరలో కత్తి చొరబడ్డతరువాత. they *d the king in silence రాజు వాండ్ల వద్దకి వచ్చేటప్పటికినిశ్శబ్దముగా వుండినారు. they refused to * his testimony అతని సాక్షి అక్కర లేదన్నారు. he *d applause for it అందువల్ల వాడికి కీర్తి వచ్చినది, కీర్తిని పొందినాడు. you shall * do denial నీకు లేదనడము లేదు. I *d no favoursfrom him ఆయన వుపకారము నాకేమిన్ని లేదు. he *d me into his house నన్ను తన యింట్లో దించుకొన్నాడు.he *d me kindly అతని వద్దికి పోయినప్పుడునన్ను విశ్వాసముగా సన్మానించినాడు. the jailor refused to * the prisonerచెరశాలాధ్యక్షుడు ఆ కైదీని అంగీకరించుకోలేదు. those who have nothing shall *nothing ఏమి లేని వారికి యేమిన్ని దొరకదు. a receiving house తెచ్చే జాబులను తీసుకొనే నిమిత్తమై ఆయా పేటలలో వుండే తపాలు చావడి.
To Reciprocate v a పరస్పరము చేసుట, వొకరి కొకరు జరిగించుట. they *d goodoffices పరస్పరము వుపకారములు చేసుకొన్నారు, వొకరికొకరు వుపకారములుచేసుకొన్నారు.
To Recite v a చెప్పుట, చదువుట, వివరించుట, వర్ణించుట. he *d the lessonపాఠమును అప్పగించినాడు.
To Reck v a తలచుట, చింతించుట. he *s not he shame వానికి శిగ్గనే చింతలేదు. you will * this ఇందున గురించి చింతపడబోతావు.
To Reckon v a ఎంచుట, లెక్కబెట్టుట. he *ed up the sums పద్దులుకూర్చినాడు. to think తలచుట, భావించుట. they * him an honest man వాణ్నిపెద్ద మనిషిగా యెంచుతారు. I *ed upon him as a friend వాడు స్నేహితుడనియెంచినాను. I *ed upon him as my enemy వాడు నాకు శత్రువని యెంచినాను. thisis *ed the best ఇది మంచిదంటారు. they are *ed among his progressవాండ్ల తని పోష్యవర్గమున బడుతారు. his family ( recokoning gardenersandgrooms ) was forty souls తోటవాండ్లు గుర్రపు వాండ్లతో కూడా వాడిసంసారము నలభై మంది. not reckoning the gardenerns తోటవాండ్లు కాక, తోటవాండ్లు వినాగా. he *ed without his host తన ముక్కుకు సరిగ్గా యోచన చేసుకొన్నాడు.
To Reclaim v a to reform to correct దిద్దుట, పనుపరచుట, దిద్ది దోవకు తెచ్చుట సన్మార్గమునకు తెచ్చుట. at last he *ed the boy తుదకా పిల్లకాయను దోవకుతెచ్చినాడు. he *ed the land or brought it under the plough అడివి కొట్టి పొలముచేసినాడు.
To Recline v a అనిపించుట. they *d their spears against the wallఈటెలను గోడకు ఆనించిరి.
To Recognize v a గురుతుపట్టుట, ఆనవాలు పట్టుట. I *d him by his voiceవాడి గొంతు విని వాణ్ని గురుతుపట్టినాను. to acknowledge వొప్పుకొనుట. If you dothis the Government will not * your acts నీవు దీన్ని చేస్తే గౌవరుమెంటు వారుఆమోదించరు. they * him as their teacher అతను తమ గురువని వొప్పుకొంటారు.
To Recoil v n వెనక్కు యెగసుట, వెనక్కు చెదరుట. the ball struck the walland *ed ఆ చెండు గోడ మీద తగిలిన వురువడిని వెనక్కు యెగిసినది. to shrinkజంకుట, వెనక్కు తీసుట. they *ed from such a marriage అటువంటి పెండ్లి మాకుఅక్కరలేదని వెనక్కు తీసినారు. this scheme will * on his own head వాడు చేసినతంత్రము వాడి తల మీదికే వచ్చును.
To Recoin v a పాత నాణ్యమును చెరిపి కొత్త నాణ్యమును వేయుట.
To Recollect v a జ్ఞాపకము చేసుకొనుట, స్మరించుట. do you * this ? ఇది నీకుజ్ఞాపకమా. I dont' * it అది నాకు జ్ఞాపకము లేదు. ever since I can * నాకు బుద్ధితెలిశిన నాటనుంచి. when he *ed himself వాడికి స్మారకము వచ్చేటప్పటికి తెలివివచ్చేటప్పటికి. ( Swift says of Stella's jets ) I will * as many as Iremember నాకు యేవేవి జ్ఙాపకము వున్నవో వాటిని వ్రాస్తాను.
To Recommence v a మళ్ళీ ఆరంభించుట.
To Recommend v a to advance by praise ; to the kindness of anotherశ్లాఘించుట, శ్లాఘించి పుచ్చుకొమ్మనుట, మంచిదనుట, శిఫారసు చేసుట. you may readthis book if you like but I do not * it నీ కోర్టమైన యీ పుస్తకమును చదువు నేనుమంచిదనను. he *s bathing స్నానము చేస్తే మంచిదంటాడు. her beauty *ed herto him as a wife దాని అందమే వాణ్ని దాన్ని పెండ్లి చేసుకొమ్మన్నది. I followedthe course which you *ed మీరు యే పని మంచిదన్నారో నేను దాన్నే చేసినాను.the garden in front *s the house; it has not other recommendation ఆయింటికి యెదట తోట వుండడము ఆ యింటికి వొక గుణమే తప్ప వేరే వొక గుణమున్నులేదు. do you think that I would * you a thief ? వొక దొంగను మంచివాడని మీవద్ద తీసుకొని వచ్చి విడుతునా. can you * me a house and two servants and ahorse ? వొక యిల్లు, యిద్దరు పనివాండ్లు, వొక గుర్రము వీటిని శిఫారసు చేయగలవా.you *ed them and I bought them అవి మంచివే కొనుక్కోవచ్చునని నీ వన్నందున నేనుకొనుక్కొన్నాను. you may buy this but I do not * it నీవు కొనుక్కొంటే కొనుక్కోనేను మంచిదనను. he *ed himself to his master by diligence and honestyవాడి జాగరూకతవల్ల నున్ను, పెద్ద మనిషి తనము వల్ల నున్ను, తన యజమానుడి దయసంపాదించుకొన్నాడు. I shall * my son to your care నా కొడుకును తమ వశముచేస్తున్నాను. I * my soul to God and my honour to the king ప్రాణమునుదేవుడికిన్ని మానమును రాజుకున్ను అర్పించినాను. will you * me to that gentlemanfor employment ? వుద్యోగమును నాకు యిచ్చేటట్టు ఆ దొరగారికి నా యోగ్యతనుతెలియచేసి వొప్పగింత పెట్టుతారా. I * you not to do this again దీన్ని నీవు మళ్ళీయిట్లా చేయడము మంచిది కాదు.
To Recompense v a To Repay బహుమానము చేసుట, చెల్లుకు చెల్లు చేసుటప్రతికి ప్రతి చేసుట. If you do this God will * you దీనికి ప్రతి నీకు దేవుడుచేసును. ( ఇది మంచిని గురించిన్ని చెడును గురించిన్ని ప్రయోగించబడును. )
To Recompose v a to settle or quiet a new మళ్లీ కుదిరించుట, మళ్లీసవరించుట. when she *d herself దాని మనసు మళ్ళీ కుదటపడగానే.
To Reconcile v a సమాధానము చేసుట, శాంతపరచుట, ఇమిడికచేసుట, వొద్దికచేసుట. they quarreled but I *d them వాండ్లు జగడమాడినారు, అయితే నేనుసమాధాన పరచినాను, సయ్యోధ్య చేసినాను. to * the medicine to the child'sstomach she added some sugar బిడ్డ కడుపులో ఆ మందు యిందడానకు కొంచెముశర్కర కలిపినది. a few days residence will * him to the coldness of thepalce అక్కడ కొన్నాళ్ళు వుంటే ఆ దేశపు చలి వాడికి వొప్పిపోను యిమిడి పోను. theencouragement of his ministers *d him to this treacherous act మంత్రులుపురికొలిపి నందున యింత పాపిష్ఠి పనికి వొప్పినాడు. this benefit *d me to thedifficulties of the task ఆ పనిలో వుండే లాభమువల్ల దాని కష్టము నాకువొప్పిపోయినది. he at last *d himself to the business తుదకా పనికివొప్పుకొన్నాడు. I must * myself to my lot ఇది నా విధియని అనుభవిస్తూవుండవలసినది మేలనము చేయించుట. A+.
To Recondense v n మళ్లీ ఘనీభవించుట, తిరగీ పేరుకొనుట. See ToCondense.
To Reconnoitre v a పరిశోధించుట, వేగుచూచుట, వైపుచూచుట, ఉండే వైఖరినిపరిశోధించుట.
To Reconquer v a మళ్ళీ జయించుట.
To Reconsider v a పునర్విమర్శ చేసుట, మళ్ళీ విచారించుట.
To Record v a వ్రాసిపెట్టుట, గ్రంథములో వ్రాసుట. the judge awarded thispunishment and the clerk *ed it న్యాయాధిపతి యీ శిక్షను విధించినాడు మునిషీదాన్ని గ్రంథములో వ్రాసుకొన్నాడు.
To Recount v a చెప్పుట, వర్ణించుట, వివరించుట.
To Recover v a or get back తిరిగీ పొందుట, మళ్ళీ చిక్కుట. he *ed theking's favour రాజానుగ్రహమును మళ్ళీ సంపాదించుకొన్నాడు. the tree has now *ed it's beauty ఆ చెట్టుకు పోయిన అందము మళ్ళీ వచ్చినది. to regainరాబట్టుకొనుట. he *ed the money ఆ రూకలు వాడికి మళ్ళీ వచ్చినవి. when she *ed the child దానికి మళ్ళీ బిడ్డ చిక్కినప్పుడు. he fell from his horse but *edhis appetite వాడికి మళ్ళీ ఆకలి పుట్టినది. he could not * his breath ఊపిరితిప్పుకో లేకపోయినాడు. she was shocked but she soon *ed herselfభయపడ్డది అయితే యింతలో తెలివి వచ్చినది. he *ed his spirits ధైర్యముతెచ్చుకొన్నాడు. he did not * his spirits for a week ఎనిమిది దినాల వరకు వాడుధైర్యము తెచ్చుకోలేదు. he *ed his strength వాడికి మళ్లీ సత్తువ వచ్చినది.
To Recreate v a ఉల్లాసపరచుట.
To Recriminate v n నీవంటే నీవనుట, రంకుకు ప్రతిరంకు కట్టుట, పరస్పరందోషారోపణము చేసుకొనుట, వొకరిని వొకరు దూషించుకొనుట, నేరము మోపిన వాని మీదప్రతికి వొక నేరమును మోపుట. they *d తప్పు నీ వల్ల వచ్చినదని చెప్పినందుకు కాదు,నీవల్లనే వచ్చినదని వాడు అన్నాడు.
To Recruit v a and v. n. కుదురుబాటు చేసుట, కొత్తగా శిపాయీలను చేర్చుకొనుట,కోలుకొనుట, తేరుకొనుట, కొత్తగా సిపాయీలు చేరుట. the regiment stayed theresix months to * కొత్తగా సిపాయీలను చేర్చుకోవడానకు ఆ పటాలము అక్కడ ఆరునెలలు వుండినది. he sold his land to * his pocket రూకలు చేర్చడానకై నేలనుఅమ్ముకొన్నాడు. bathing *s the spirits స్నానము చేయడము చేత వొళ్ళుకుదురుతున్నది. after his health was *ed వాడి వొళ్ళు కుదురిన తరువాత, వాడుకోలుకొన్న తరువాత.
To Rectify v a దిద్దుట, సవరించుట, చక్కబెట్టుట. he rectified the account ఆలెక్కను చక్కపెట్టినాడు, సవరించినాడు. he rectified the rum రం అనే సారాయిని తిరిగీదించి పరిశుద్ధము చేసినాడు.
To Recur to v a to come back to the thought మళ్ళీ తోచుట, మళ్లీజ్ఞాపకానకు వచ్చుట. when any word has been used to signify an idea thatold idea will * in the mind when the word is heard సంస్కారోద్బోధకమైనశబ్దమును ప్రయోగించినట్టయితే ఆ శబ్దమును వినగానే ఆ సంస్కార జన్యమైన స్మృతికలుగుతున్నది. he recurred to this subject దాన్ని మళ్ళీ తలచుకొన్నాడు. at thatmoment I did not * to his being your relation అతడు మీ బంధువుడైనట్టుఅప్పట్లో నాకు జ్ఞాపకము రాకపోయినది.
To Redden v a ఎర్రబడేటట్టుచేసుట, ఎరుపును చరుముట. when the rise of thesun *ed the hills కొండ మీద నీరెండలు కాయగా.
To Redeem v a విడిపించుట, విడుదల చేసుట, విమోచనము చేసుట, కడతెర్చుటరూకలిచ్చి శత్రువుల వద్ద నుంచి విడిపించుట. he * ed them from their sins వాండ్లపాప విమోచనము చేసినాడు. he who died to * us మనల కడతేర్పడము నకైచచ్చినవాడు. "redeeming the time because the days are evil " Ephes. V.16. కాలా అశు భాస్తస్మాద్దినం సఫలంకురుత A+. he * ed the jewels from pawn నగలను విడిపించినాడు. he has * ed his promise వాడు చెప్పిన మాటను నెరవేరచినాడు. he *ed his reputation పేరు దక్కించుకొన్నాడు. to * land from forestఅడవిని కొట్టి పొలము చేసుట. this is one redeeming point అన్నిటికి వుండే గుణముయిది వొకటే.
To Redouble v a రెట్టింపు చేసుట, రెండింతలు చేసుట. she *d her cries అదిమరిమరి అరిచి నది, మరింత అరిచినది.
To Redound v n ఫలించుట, ఉపయోగించుట, అతిశయించుట, కలుగుట. the evil *ed on those from whom it sprung వారి పాపమే వాండ్లను కొట్టినది. this *s tohis credit ఇందువల్ల వాడికి గౌరవము కలుగుతున్నది. this *s to his shame ఇదివాడికి అవమానములో పర్యవసానమౌతున్నది, ఇందువల్ల వానికి అవమానము వస్తున్నది.this *s to the glory of God ఇందువల్ల దేవుని మహిమ అతిశయిస్తున్నది.
To Redress v a to set right, to amend పరిహారము చేసుట, నివారణముచేసుట, గతి కలగచేసుట, దిద్దుబాటు చేసుట, కదురుబాటు చేసుట, సరిపుచ్చుట. themagistrate *ed their grievances వాండ్లకు వుండే బాధలను పోలీసువారునివారణము చేస్తున్నారు.
To Reduce v a తగ్గించుట, తక్కువ చేసుట, మట్టుపరచుట, అణచుట, స్వాధీనముచేసుకొనుట. he *d the strength of the spirit with water సారాయిలో నీళ్ళనుకలిపి దాని కారమును మట్టు చేసినాడు. he *d the size of the bag ఆ సంచినికురచచేసినాడు. he *d their pay వాండ్ల జీతమును తక్కువ చేసినాడు.to * a fortకోటను పట్టుట. he *d the tree to a log by cutting off the branches ఆచెట్టు కొమ్మలను నరికి వొక మొద్దుగా చేసినాడు. he *d the sugar to a liquid ఆబెల్లమును నీళ్ళు చేసినాడు. he *d the pearls to powder ముత్యాలను చూర్ణముచేసినాడు. they *d the house to ruins ఆ యింటిని పాడు చేసినారు.they *d itto nothing దాన్ని సున్న చేసినారు, నూత కలిపినారు. he *d them to obedienceవాండ్లను అణచినాడు; సాధించినాడు, లోపరచుకొన్నాడు. he *d them to povertyవాండ్లను బీదలనుగా చేసినాడు. he *d me to a servant నన్ను వొక బంటుగాచేసినాడు. they *d it to method దాన్ని దారికి తెచ్చినారు, క్రమపరచినారు. he *dthese words to rule ఈ శబ్దములకు సూత్ర మేర్పరచినాడు. he *d these treesinto classes ఈ చెట్లను జాతివారిగా యేర్పరచినాడు. he *d the pagodas torupees వరహాలను రూపాయలు చేసినాడు.
To Reduplicate v a రెండింతలు చేసుట, రెట్టించుట.
To Re-echo v n ప్రతిధ్వనిచేసుట. they *ed his sentiments వాడేమి చెప్పినాడోదాన్నే వీండ్లున్ను చెప్పిరి.
To Reed v a ( in carpentry ) జవకట్టుట. *ed work నాముపని.
To Reef v a to make a fold in a sail ల వాడ చాపలో వొక మడత మడుచుట.
To Reek v n అధికమౌట. See Recking.
To Reel v a in spinning or weaving నూలును పరిటెన చుట్టుట.
To Re-embark v a and v. n. మళ్లీ వాడ యెక్కుట, మళ్ళీ వాడ యెక్కించుట.
To Re-enact v a మళ్లీ ఆజ్ఞాపిమచుట మళ్లీ విధించుట మళ్లీ యేర్పరచుట.
To Re-enforce v a ఉపబలము చేసుట, బలకట్టుట.
To Re-enter v a మళ్లీ ప్రవేశించుట, తిరిగీ లోనికి వచ్చుట.
To Re-enthrone v a మళ్లీ పట్టాభిషేకము చేసుట.
To Re-establish v a మళ్ళీ స్థాపించుట, మళ్ళీ యేర్పరచుట, మళ్ళీ కుదురుబాటుచేసుట, మళ్ళీ నిర్ణయించుట.
To Reeve v a బొందలో పగ్గమును దూర్చుట, ఇది సముద్ర భాష.
To Re-examine v a పునర్విమర్శ చేసుట, మళ్ళీ విచారించుట.
To Refer v a and v. n. to direct to another person వొకని వద్దకి పంపుట. hereferred me to his brother for information తన తమ్ముణ్ని పోయిఅడుగుమన్నాడు. I referred the case to him for trial ` వ్యాజ్యమునువిచారించుమని వాడి వద్దకి పంపినాను. to have connection or bear relationసంబంధించుట. these words * to the same affair ఈ మాటలున్ను ఆప్రమేయమును గురించినవే. I do not know what this *to ఇది యెందున గురించినదోనాకు తెలియదు. I referred to his father for the money అతని తండ్రిని పోయిరూకలు అడిగినాను. he referred me to his father for the money రూకలనుగురించి తన తండ్రిని అడుగుమన్నాడు. I referred again to that account ఆ లెక్కనుమళ్లీ చూచుకొన్నాను. when I referred tot he Dictionary for this word Icould not find it నేను యీ మాటను నిఘంటువులో చూస్తే చిక్కలేదు. I referredhim to the Dictionary for this word యీ మాట నిఘంటువులో పోయిచూచుకొమ్మని వాడితో చెప్పినాను.
To Refine v a శుద్ధి చేసుట, సుష్ఠుపరచుట, పరిష్కారము చేసుట, నిర్మలము చేసుట,నాగరీకము చేసుట. to * gold బంగారును చొక్కము చేసుట. he *d the language ఆభాషను పరిష్కరించినాడు. he *d his style అలంకారముగా చెప్పినాడు. he *dupon the verse until he ruined the meaning ఆ శ్లోకము మీద వూరికెవుపన్యసించి చెప్పి దాని అర్థమును చెడగొట్టినాడు.
To Refit v a మళ్ళీ చక్కబెట్టుట. after refitting the ship ఆ వాడను మళ్లీచక్కబెట్టిన తర్వాత.
To Reflect v a ప్రతిఫలింపచేసుట. the glass *s your face అద్దములో నీముఖము తెలుస్తున్నది. this *s much credit on them ఇందువల్ల వాడికి మంచి పేరువస్తున్నది.
To Reform v a ( to change from worse.) దిద్దుబాటు చేసుట, పరిష్కరించుటచక్కబెట్టుట.
To Refract v a తిప్పుట, వంచుట, వక్రము చేసుట.
To Refrain v n మానుట, ఆగుట, తాళుట. she could not * any longer sheburst into tears తాళ చాలక యేడ్చినది దుఃఖమును అణుచుకోలేక యేడ్చినది. he *ed from food తినక మానుకొన్నాడు. he *ed from speaking మాట్లాడడముమానుకొన్నాడు. being unable to * from sleep నిద్రను పట్టలేక.
To Refresh v a సేదదేర్చుట, ఆప్యాయమును పొందించుట, ఊరట చేసుట, ఉపశాంతిచేసుట. he bathed to * himself ఆప్యాయమానముగా వుండడమునకై స్నానముచేసినాడు. he did this to * his memory మళ్ళీ జ్ఞాపకము రావడమునకై దీన్నిచేసినాడు. I will * your memory తమకు జ్ఞాపకము చేస్తాను.
To Refrigerate v a చల్లబడేటట్టు చేసుట, శీతలము చేసుట.
To Refuge v a రక్షించుట, కాచుట. Swift use this word. Works.Vi.86 .
To Refund v a మళ్లీ చెల్లించుట, తిరిగీ యిచ్చుట.
To Refuse v a తిరస్కరించుట, వద్దనుట, కాదనుట, కూడదనుట. his stomach *dnourishment వాడికి వొకటీ యిందలేదు.you cannot * punishment నీవు శిక్షను పడితీరవలెను he *d advice యెంత చెప్పినా వినడు. God *d his prayer వాడిమనవిని దేవుడు గైకొనలేదు. he *d the money ( meaning he did not give it. )వాడు రూకలు యివ్వనన్నాడు. ( but meaning he did not take it ) వాడు రూకలుపుచ్చుకోనన్నాడు. he *d to come రానన్నాడు. he *d to accept it దాన్నితీసుకోనన్నాడు.
To Refute v a ఖండించుట, కొట్టివేయుట. can you * what I say ? నేనుచెప్పేదాన్ని కాదనగలవా, ఖండించగలవా.
To Regain v a మళ్లీ పొందుట. when he *ed the shore వాడు మళ్లీ గట్టుకువచ్చి చేరినప్పుడు. he *ed his health వొళ్లు కుదిరినది. he *ed his spirits వాడికిదైర్యము వచ్చినది, ధైర్యమును తెచ్చుకొన్నాడు.
To Regard v a చూచుట, విచారించుట, లక్ష్యపెట్టు, కటాక్షించుట,దయచేసుట,పాటించుట. he *ed the children with astonishment ఆ బిడ్డలను ఆశ్చర్యముగాచూచినాడు. they do not * him వాణ్ని లక్ష్య పెట్టరు.I *ed him as friendవాణ్ని నా స్నేహితుడని యెంచినాను. we must * decency మానము విచారించవద్దా.he does not * punishment వాడికి శిక్ష లక్ర్యము లేదు. they do not * omens వాండ్లు శకునము చూడడము లేదు. this law *s that custom యీ సూత్రము ఆ ఆచారమును గురించినది.
To Regret v a to be sorrow for చింతించుట. I * his departure ఆయనపోయినది నాకు వ్యాకులముగా వున్నది. we * to mention the death of &c పాపంవాడు చనిపోయినాడు.
To Regulate v a క్రమపరచుట, దిట్టపరచుట. he *s his conduct by theirpleasure వారి యిష్ట మెట్లాగో అట్లా నడుచుకొంటాడు. he *d his watch by the sunసూర్యగతిని బట్టి తన గడియారమును సరిగ్గా తిప్పుకొన్నాడు.
To Rehear v a పునర్విమర్శ చేసుట, మళ్ళీ విచారణ చేసుట
To Rehearse v a పునః వుచ్చరించుట, తిరిగీ చదువుట. a comedy అరలో ఆడడము,అనగా వొక నాటకమును సభలో చదవక మునుపు తమలో తామే చదివి చూచుకొనుట
To Reign v n ఏలుట, ప్రభుత్వము చేసుట. to prevail ప్రబలమౌట. the reigningprince ప్రభుత్వము చేస్తూవుండే రాజు, అప్పట్లో యేలుతూ వుండే రాజు. at midnightwhen darkness *s అర్ధ రాత్రిలో చీకటి బలముగా వుండేటప్పుడు. now silence *sఇప్పుడు అంతటా నిశ్శబ్దముగా వున్నది. discontent *s among them వాండ్లకు నిండాఅసమాధానముగా వున్నది. plenty *s around అంతటా నిండా సుభిక్షముగా వున్నది.where famine *s కరువు ముమ్మరముగా వుండే చోట. pride is the reigningpassion among them వాండ్లలలో గర్వము అధికము.
To Re-imbody v a తిరిగీ దోవకు తెచ్చుట, ఏర్పరచుట. he re-imbodied thetroops చెదిరిపోయిన దండును మళ్లీ కూర్చినాడు.
To Reimburse v a నష్టముకట్టి యిచ్చుట, చెల్లుగా యిచ్చుట that business didnot * me ఆ పనిలో నా పెట్టుబడి నాకు రాలేదు in the war his loss was * d himయుద్ధములో వాడి యిల్లు తగలబడిపోయినది, అయితే ఆ నష్టమును రాజు వాడికికట్టియిచ్చినాడు.
To Rein v a or curb అణుచుట.he did not * his passions వాడుమనసుపట్టలేదు, కామక్రోధాదులను అణచలేదు. he *ed up his horse కళ్ళెమునుబిగించి గుర్రాన్ని నిలిపినాడు. she was laughing but when I came in she * edup అది నవ్వుతూ వుండినది, అయితే నేను లోగా పోగానే నవ్వును నిలిపి గంభీరముగావుండినది.
To Reinforce v a బలపరచుట, బలకట్టుట. he *d us మాలో జనం తక్కువఅయ్యేటప్పటికి వాండ్లు వచ్చి చేరి ముక్కు నిలిపినారు. this letter *d the formerorder ఈ జాబు మునుపటి వుత్తరువుకు వుపబలమైనది.
To Reinsort v a మళ్లీ పెట్టుట, తిరిగీచేర్చుట. he *ed the thread ఆ దారమునుమళ్ళీ గుచ్చినాడు.
To Reinstal, or Reinstate v a. తిరిగీ ప్రవేశపెట్టుట.
To Reiterate v a మళ్ళీమళ్ళీ చెప్పుట, తిరిగీతిరిగీ చేసుట. he * d hisorders మునుపు చేశిన వుత్తరువునే మళ్ళీ చేశినాడు.he * d the crime ఆ తప్పునేమళ్లీ చేసినాడు.
To Reject v a తోసివేసుట, నిరాకరించుట.he * ed my advice నా మాట వినలేదు.the stomach *ed the food ఆహారము కడుపులో యిమడలేదు.
To Rejoice v n సంతోషించుట, ఉల్లసించుట, ఆనందించుట, ఉప్పొంగుట.
To Rejoin v a తిరిగీచేర్చుట, మళ్ళీ పొందించుట. he *ed the broken boneవిరిగిన యెముకకు మళ్లీ చేర్చినాడు. he *ed the army మళ్ళీ దండులో వచ్చికలిశినాడు. when he *ed us మాలో మళ్ళీ వచ్చి చేరేటప్పటికి.
To Relapse v n మరకపాటుబడుట, మళ్లుకొనుట. the sick man again * d వాడికిరోగము మళ్లుకొన్ణది. he *d into carelessness కాస్త దోవకు వచ్చేటట్టు వుండి మళ్ళీమడ్డితనములో పడ్డాడు.
To Relate v a చెప్పుట, వివరించుట, ఎరుక చేసుట. he *d the story to me ఆ కథ యావత్తు నాతో చెప్పినాడు.
To Relax v a to loosen సళ్లించుట, వదిలించుట, సుళువు చేసుట. to remitమట్టుపరచుట. he *ed his endeavours తన ప్రయత్నమును జబ్బు చేశినాడు. If you* your care the business will be ruined జాగ్రతగా మాంద్యము చేస్తే పనిచెడిపోను. he * ed his studied వాడు చదవడము మట్టుపడ్డది. he did not * hisseverities వాడి క్రౌర్యము తగ్గలేదు మట్టుపటలేడు. conversation *es the mindమాటలవల్ల వ్యాకులము మట్టుబడుతున్నది. castor oil *es the bowels ఆముదముతాగితే ప్రవర్తులు అవుతున్నవి.
To Release v a విడుదల చేసుట, విడిచిపెట్టుట, విముక్తి చేసుట, విమోచనము చేసుట.he * d the prisoners కయిదీలను విడిచిపెట్టినాడు he * d me from theobligation నాకు ఆ బుణ విముక్తి చేసినాడు. whe she * d my hand అది నా చెయ్యినివదిలినప్పుడు.
To Relent v n మనసుకరుగుట, దయవచ్చుట. at last his enemy * ed తుదకువాడి శత్రువు మనస్సు కరిగినది. he slew them without relenting నిర్దయాత్మకుడైవారిని చంపినాడు.
To Relieve v a ఉపశమనము చేసుట, ఉపశాంతి చేసుట, నివారణము చేసుటమార్చుకొనుట, కావలి మర్చుకొనుట. the medicine failed to * me ఆ మందువల్లనాకు గుణము లేదు. I willl * you from paying the money ఆ రూకలు నీవుచెల్లించవలసినది లేకుండా చేస్తాను. he *d the poor పేదలకు సహాయము చేసినాడు.he *d my distress నా శ్రమ నివారణము చేసినాడు. to * thirst he washed hismouth దాహమణగడానకై పుక్కిలించి వుమ్మి వేసినాడు. he *d the guardపారమార్చుకొన్నాడు. he remained on guard until I *d him నేను పోయిమార్చుకొనేదాకా వాడు పారా మీద వుండినాడు. he *d me at noon మధ్యాహ్న వేళకువచ్చి మార్చుకొన్నాడు.
To Relinquish v a మానుకొనుట, చాలించుకొనుట, వదులుట, విడిచిపెట్టుట, విసర్జించుట. he *ed all hopes of it ఆయాశను విడిచి పెట్టినాడు.
To Relish v a రుచికలగచేసుట, యిష్టపడుట, ఆశపడుట. sauce *es food వ్యంజనము అన్నానికి రుచిని కలగచేస్తున్నది. he did not * this news యీ మాట విని వాడికి అసహ్యము వచ్చినది. he did not * the food ఆ యాహారము వాడికి యిష్టము లేదు. no man *es physic మందంటే యెవరికిన్నీ అసహ్యమే. he *es nothing but poems వాడికి కావ్యములే యిష్టము.
To Rely v n నమ్ముట. they * upon you తమ్మునే నమ్ముకొని వున్నారు.
To Remain v n ఉండుట, నిలుచుట. you must * here till tomorrow రేపటి దాకా నీవు యిక్కడ వుండవలసినది. if I pay this how much will *? ఇది చెల్లిస్తే అవతల మిగిలేది యెంత, నిలవ యెంత. none of that family now * యిప్పట్లో వాండ్లలో యెవరున్నూ లేరు. they *ed behind వాండ్లు వెనక దిగబడ్డారు, వెనకచిక్కినారు. nothing *s but for you to do this దీన్ని నీవు చేయక విధిలేదు. the food did not * in the stomach ఆహారము దక్కలేదు. the medicine did not * on the stomach మందు కడుపులో యిందలేదు.
To Remake v a మళ్ళీ చేసుట, పునఃసృష్టి చేసుట. he remade the box ఆ పెట్టెను మళ్ళీ సంతన చేసినాడు.
To Remand v a కడమ విచారణ పిమ్మట చేస్తామని నిలిపిపెట్టుట. the magistrate *ed the prisoner ఆక యిదీని మళ్ళీ విచారిస్తామని నిలిపిపెట్టినాడు.
To Remark v a to note or observe కనుక్కొనుట, కనిపెట్టుట, జ్ఞాపకముగా వినుట, గురుతుగా చూచుట. to distinguish తెలుసుకొనుట. or point out అగుపరుచుట, చూపుట. I did not * any difference between the two ఆ రెంటికి నాకు భేదము అగుపడలేదు. did you * what he said? వాడు చెప్పినది కనుక్కొన్నావా, వాడు చెప్పినది చూస్తివా. I *ed two people with him అతనితో కూడా యిద్దరు వున్నట్టు కనుక్కొన్నాను. I saw two men but I did not * who they were యిద్దరినీ చూచినాను గాని వాండ్లెవరో నేను గురుతుగా చూడలేదు. I did not * what he said వాడు చెప్పిన దాన్ని నేను జ్ఞాపకముగా వినలేదు. he *ed that they had come there వాండ్లు వచచినారని అన్నాడు, వాండ్లు వచచినట్టు కనుక్కొన్నాడు. he *ed that I might go if I liked నీ కిష్టమైతే పోవలశినదన్నాడు.
To Remedy v a నివారణము చేసుట, స్వస్థము చేసుట, పరిహరించుట, ఉపశమనము చేసుట. he tried to * the mischief he had done తాను చేసిన అపకారమును దిద్దుకో చూచినాడు.
To Remember v a జ్ఞాపకము చేసుకొనుట, జ్ఞాపకములో వుంచుట, మనసులోవుంచుట. do you *? నీకు జ్ఞాపకము వున్నదా. yes నాకు జ్ఞాపకము వున్నది. no జ్ఞాపకము లేదు. as long as I can * నాకు బుద్ధి తెలిశిన నాటనుంచి. * what you said just now నీవు అన్న మాటను మరిచేవు సుమీ? * they Creator in the days of the youth Eccles. XII. 1. స్మరణచేసుట.D+.
To Remind v a జ్ఞాపకము చేసుట, తోచేటట్టు చేసుట. I *ed him about this యిందున గురించి అతనితో యెచ్చరించినాను. let me * you that you have a mother తల్లి వొకతె వున్నదనే జ్ఞాపకము వుండనీ.this *s me of him దీన్ని చూస్తే నాకు వాడి జ్ఞాపకము వస్తున్నది. this *s one of a monkey యిది కోతివలె వున్నది.
To Remit v a to forgive or excuse punishment క్షమించుట, మన్నించుట. to sent money to a distant place రూకలను పంపడము, ముఖ్యముగా హుండీ చేసి పంపడము. he remitted the revenues to Madras పన్ను రూకలను చెన్న పట్నానికి పంపినాడు.
To Remonstrate v n న్యాయము చెప్పుట, ఆక్షేపిమచుట, ఖండించుట.
To Remove v a తీశివేసుట, తోశివేసుట, నివృత్తి చేసుట, నివారణ చేసుట, యెత్తి వేసుట, పోగొట్టుట, తీసుకొనిపోవుట. he *d the horses ఆ గుర్రాలను వున్న చోట నుంచి మరివొక చోటికి తీసుకొని పోయినాడు. when he *d the boxes to another room ఆ పెట్టెలను అక్కడ నుంచి తీశి మరివొక గదిలో వుంచినారు. he *d the skin of the orange కిత్తిలిపండు తోలు వొలిచినాడు. when death *d them వాండ్లు చచ్చిన తరువాత. when he *d the third bandage మూడోకట్టు విచ్చేటప్పటికి. soap *s dirt సబ్బు మురికిని పోగొట్టుతున్నది. he *d her fears దాని భయమును పోగొట్టినాడు.butter milk *s ill effects of eating mangoes మామిడిపండ్లకు మజ్జిగవిరుగుడు. this *s the pain యిందువల్ల ఆ నొప్పి లేకుండా పోతున్నది. he did this to * the effects of the spell దీన్ని చేసి ఆ మంత్రమును పారకుండా చేసినాడు. do you think this will * the sin? దీనివల్ల ఆ పాపము పోననుకొన్నావా. this *d my doubts దీనివల్ల నా సందేహము తీరినది, నివారణమైనది.
To Remunerate v a to reward; to repay; to recompense బహుమానము చేసుట, చెల్లుకు చెల్లు చేసుట, ఈడుకు యీడు చేసుట, ప్రతికి ప్రతి చేసుట. he *d them with ten rupees వాండ్లకు పది రూపాయలు బహుమాన మిచ్చినాడు. If you sell the cloth at five rupees per piece will this * you? ఈ గుడ్డను అయిదు రూపాయలకు అమ్మితే నీకు కట్టివచ్చునా. he built the house and sold it, but the price did not * him ఆ యింటిని కట్టి అమ్మినాడు గాని వాడికి పట్టిన శలవుకు ఆ వెల కట్టిరాలేదు.
To Rend v a చించుట, చింపుట, గీరుట, గీచుట. she rent the air with her cries ఆకాశము తూటుపొయ్యేటట్టు అరిచినది. the people rent the air with their acclamations వాండ్ల జయజయ ధ్వనులవల్ల దిక్కులు పిక్కటిల్లినవి. this news rent his heart దీన్ని విని వాడి గుండెలు పగిలినవి. heart rending news గుండెలు పగిలే సమాచారము.
To Render v a ఇచ్చుట, చేసుట. this *ed him very angry యిందువల్ల ఆయనకు నిండా కోపము వచ్చెను. to * accounts లెక్కలు యిచ్చుట. he *ed them their due వాండ్లకు తగినట్టు జరిగించినాడు.this *ed it necessary for me to go there యిందువల్ల నేను అక్కడికి పోవలసి వచ్చినది. this *s it useless to write to him యిందు వల్ల వాడికి వ్రాయడము వ్యర్ధమైనది. to * a reason హేతువు చెప్పుట, సమాంధానము చెప్పుట. to * like for like సరికిసరిచేసుట, యీడుకు యీడు చేసుట. to * good for evil అపకారమునకు వుపకారము చేసుట.to * kindness for kindness ప్రత్యుపకారము చేసుట. Oh * thanks to God above దేవుణ్ని మ్రొక్కండి. to * into another language భాషాంతరము చేసుట. he *ed it into Telugu దాన్ని తెనిగించినాడు. he *ed it into English దాన్ని యింగ్లిషు చేసినాడు. this *ed the medicine ineffectual ఇది ఆ మందును నిష్ఫలము చేసినది. this *ed the poison harmless యిందువల్ల విషము విరిగినది. this *s his story falseయిందువల్ల వాడు చెప్పినది అబద్ధమవుతున్నది. to * glorious పరసిద్ధపరచుట, ప్రకాశము చేసుట. this act *ed him glorious ఈ పని వల్ల వాడు ప్రసిద్ధుడైనాడు. salt *s food wholesome వుప్పు ఆహారమును ఆరోగ్యకరముగా చేస్తున్నది.
To Renew v a పునః చేసుట, మళ్ళీ చేసుట. she *ed her cries మరిమరి అరిచినది. spring *s vegetation వసంత కాలములో చెట్లు మళ్ళీ చిగిరిస్తవి. they *ed the dispute వాండ్లు మళ్ళీ జగడానికి ఆరంభించినారు.
To Renounce v a మానుకొనుట, వదులుకొణుట, పరిత్యజిమచుట, వర్జించుట. I * him వాడికీ నాకు తీరినది. he *d the world సన్యసిమచినాడు, ప్రపంచమును పరిత్యాగము చేసినాడు. having *d his country స్వదేశత్యాగియై. do this, or I shall * you యిట్లా చేస్తే చెయ్యి, లేకుంటే యిందుతో నీకు నాకు సరి.
To Renovate v a కొత్తగా చేసుట పునర్నిర్మాణము చేసుట, దిద్దుబాటు చేసుట. this *d his health యిందువల్ల వాడి వొళ్లు కదురినది.
To Rent v a to lease or hire బాడిగెకు విడుచుట, బాడిగెకు తీసుకొనుట.
To Reordian v a that is, to appoint a priest a second timeపునఃనియమించుట, మళ్ళీ పెట్టుట.
To Reorganize v a పునర్నిర్మాణము చేసుట, తిరిగీ చక్కబెట్టుట.
To Repair v a చక్కపెట్టుట, బాగుచేసుట. this *ed his health యిందువల్ల వాడి వొళ్ళు కుదిరినది.
To Repass v a తిరిగిపోవుట, మళ్ళీ దాటుటు. to pass and * పోతూ వస్తూవుండుట. passing and repassing పోతూ వస్తూ వుండడము.
To Repay v a మళ్ళీ చెల్లించుట, మళ్ళీ యిచ్చుట, తిరిగీ యిచ్చుట.he repaid the money తీసుకొన్న రూకలు చెల్లించినాడు.
To Repeal v a కొట్టివేసుట, తోసివేసుట. they *ed the law అ చట్టమును కొట్టివేసినారు.
To Repeat v a మళ్ళీ చేసుట, మళ్లీ చెప్పుట. he *ed the attempt మళ్ళీ ప్రయత్నము చేసినాడు. he *ed the crime ఆ నేరమును మళ్ళీ చేసినాడు. he *ed his visit మళ్ళీ దర్శనమునకు పోయినాడు. to * a lesson by rote పాఠమును వొప్పగించుట. * the words after me నేను చెప్పే మాటలను మీరు చెప్పుతూ రండి. he *ed a prayer ప్రార్థనా శ్లోకములను చెప్పినాడు. he *ed the story ఆ కథను మళ్ళీచెప్పినాడు. he *ed the story ఆ కథను మళ్ళీ చెప్పినాడు. can you * that poem? ఆ కావ్యము నీకు ముఖస్థమా? I can * some verses of it అందులో కొన్ని శ్లోకాలు నాకు ముఖస్థముగా వున్నవి.
To Repel v a వెనకకు తోసుట, వెళ్ళగొట్టుట, తరుముట, నివారణము చేసుట. she repelled these temptations ఆ దురాశలను నిరాకరించినది. they repelled the enemy శత్రువులను వెళ్ళకొట్టినారు.
To Repent v a and v. n. పశ్చాత్తాపపడుట, అనుతాపపడుట, నొచ్చుకొనుట, యేల చేస్తినని దుఃఖపడుట. you will * this దీన్ని యేల చేస్తినని రేపు యేడవబోతావు. if you do so you will never * it but once! (that is, you will lament all your life) నీవు అట్లా చేస్తే యిట్లా యేల చేస్తినని నీయావదాయుస్సున్ను యేడవబోతావు. I * having told him అయ్యా వాడితో యేల చెప్పితిని. In Matt. III. 2. పరావర్తయత A+ పశ్చాత్తాపపడుట P+ మనసు తిప్పుట R+.
To Repine v n విచారపడుట, దుఃఖపడుట, చింతించుట, అసూయపడుట.he *d at this loss నష్టము వచ్చినందున గురించి వాడు వ్యాకులపడ్డాడు.he did not * at the death of his child because &c. బిడ్డ చచ్చినందుకు వాడు యేడవలేదు, యెందుకంటే. he *s at their prosperity వాండ్ల శ్రేయస్సుకు యేడుస్తాడు.
To Replace v a మళ్ళీ పెట్టుట, యథారీతిగా వుంచుట.
To Replenish v a నించుట, నింపుట, సంపూర్ణము చేసుట.
To Reply v n ప్రత్యుత్తరము చెప్పుట. when I said this, she replied saying it was impossible నేను యిట్లా అనేటప్పటికి అది వల్ల కాదని వుత్తరము చెప్పినది. to these words he merely replied with a smile యీ మాటకు నవ్వి వూరికె వుండినాడు. he did not * to my letter నా జాబుకు ప్రత్యుత్తరము వ్రాయలేదు.
To Report v a చాటించుట, తెలియచేసుట, యెరుకచేసుట.
To Repose v a to place ఉంచుట. he *d faith upon them వాండ్ల యందు భక్తిని వుంచినాడు. I *d confidence in him వాని యందు నమ్మిక వుంచినాను. they *d their spears against the wall ఈటెలను గోడకు ఆనించిరి.
To Repossess v a మళ్ళీ పొందుట, మళ్ళీ స్వాధీనము చేసుకొనుట.
To Reprehend v a to chide చీవాట్లు పెట్టుట, గద్దించుట, బుద్ధిచెప్పుట,దూషించుట.
To Represent v a చూపుట, అగుపరచుట, తెలియచేసుట, చెప్పుట. the pleader *s the party వకీలు కక్షివాడికి ప్రత్యమ్నాయముగా వుంటాడు. what does this picture *? a battle ఈ పటములో వ్రాసివుండేది యేమి, వొక యుద్ధము. whom does this actor *? యిది యెవరి వేషము. he *s Krishna వాడు కృష్ణ వేషము కట్టినాడు. he *ed the king sitting on a chariot రాజును రథములో కూర్చున్నట్టుగా చిత్రములో వ్రాసినాడు, వర్ణించినాడు. the poet *s the king as a lion కవి ఆ రాజును సింహముగా వర్ణించినాడు. they *ed their case wrongly వాండ్లు తమసంగతిని పొరబాటుగా తెలియచేసినారు. In parliament her father *ed york యార్కు దేశస్థులకు ప్రతినిధిగా దాని తండ్రి పార్లేమెంటుకు పోయినాడు.
To Repress v a అణచుట, అణగ్గొట్టుట.
To Reprieve v a to delay or remit capital punishment ఇప్పుడు సధ్యా వురి తీయకుండా నిలిపి పెట్టవలసినదని ఆజ్ఞాపించుట.
To Reprimand v a చీవాట్లు పెట్టుట, కూకలుపెట్టుట.
To Reprint v a మళ్ళీ అచ్చు వేసుట.
To Reproach v a నిందించుట, దూషించుట, తిరస్కరించుట, ఎత్తిపొడుచుట.he *ed them with their cruelty వాండ్ల క్రౌర్యమును యెత్తి దూషించినాడు.
To Reproduce v a మళ్ళీ కలగచేసుట, మళ్ళీ పుట్టించుట, పునరుత్పాదనము చేసుట.
To Reprove v a కూకలు పెట్టుట, గద్దించుట, బుద్ధిచెప్పుట.
To Repudiate v a పరిత్యాగము చేసుట, పెండ్లాన్ని తోసివేసుట. he *d the debt ఆ అప్పు నాకు అక్కరలేదన్నాడు. to * a debt (in Pennsylvania) denotes that the debt is due but that it is inconvenient to pay it (London Examiner newspaper)+ అప్పులవాడికి నామము వేసుట. he who *s principle నీతిని విడిచినవాడు, నీతి నిలకడ లేనివాడు.
To Repulse v a వోడకొట్టుట, వెళ్ళకొట్టుట. she *d his endeavours వాడి ప్రయత్నములకు అడ్డము లాడినది. she *d his endeavours effectually వాడి ప్రయత్నము కాకుండా చేసినది.
To Repute v a ఎంచుట, ఎంచుకొనుట, తలచుట. he *d this to be wrong ఇది తప్పని అనుకొన్నాడు.
To Request v a అడుగుట, వేడుకొనుట, ప్రార్థించుట, మనవి చేసుకొనుట. in conveying a command "I * you to go" &c. నీవు పోవలసినది. you are *ed to do so నీవు అట్లా చేయవలసినది.
To Require v a అడుగుట, కోరుట, కావలసివుండుట, ఆజ్ఞాపించుట. I * this ఇది నాకు కావలెను. I do not * it అది నాకు వద్దు, అది నాకు అక్కరలేదు. what do you *? నీ కేమి కావలెను, నీవు కోరేది యేమి. he *s payment రూకలు చెల్లించుమంటాడు. he *s payment రూకలు చెల్లించుమంటాడు. he *s your presence మీరు వచ్చి వుండవలసిన దంటాడు.this business *s your presence యిందుకు మీరు వచ్చి వుండవలసి వున్నది.these accounts * comparison యీ లెక్కలను సంప్రతించ వలసి వున్నది.this *s much time యిందుకు నిండా సావకాశము వుండవలెను. this work will * ten days యీ పనికి పది దినములు పట్టును. they *d the money of me నన్ను ఆ రూకలను యిమ్మని అడిగినారు. you say you have been there; who *d this of you? నీవు అక్కడికి పోయినానంటావు, నిన్ను పొమ్మని కోరినది యెవరు.
To Requite v a to retaliate good or ill ప్రతికి ప్రతిచేసుట, యీడుకు యీడు చేసుట.
To Rescind v a కొట్టివేసుట, తోశివేసుట. they *ed the rule ఆ చట్టమును కొట్టివేశినారు.
To Rescue v a కాపాడుట, తప్పించుట, రక్షించుట.
To Reseat v a and v. n. తిరిగీ కూర్చుండుట, మళ్ళీ కూర్చుండబెట్టుట.
To Resemble v n పోలుట a man who *s you నీవంటి వాడొకడు, నీ పోలికగా వుండే వాడొకడు. he *s your father నీ తండ్రి పోలికగా వున్నాడు. this * a sword యిది కత్తివలె వున్నది. It *s leather యిది తోలువలె వున్నది, తోలు లాగున వున్నది. It *s nothing I never say యిటువంటిదాన్ని నే నెన్నడు చూడలేదు.
To Resent v a to take ill తప్పుగా యెంచుట, నేరముగా యెంచుకొనుట, తన యెడల చేసిన దౌర్జన్యమును గురించి కోపపడుట, ఆగ్రహపడుట. If you cheat him will he not * it? వాణ్ని మోసము చేస్తే వాడికి కోపము రాదా. he did not * their insults వాండ్లు చేసిన అవమానానికి వాడు ఆగ్రహపడలేదు. as this was not a timeto * those acts అందుకు యిప్పుడు మేము యేమీ అనవలసిన కాలము కాదుగనక, ఆ పనులను గురించి ఆగ్రహపడడమునకు యిది సమయము కాదు గనక.
To Reserve v a to keep in store నిలిపిపెట్టుట, సంచితముగా వుంచుట, నిలుపుచేసి పెట్టుట, ఎత్తిపెట్టుట. he sold one horse and *డ్ one వొక గుర్రాన్ని అమ్మి వొకటిని నిలుపుకొన్నాడు. he *d the grain until my return నేను వచ్చేదాకా ఆ ధాన్యమును కట్టిపెట్టినాడు. I will * the rest of the story till tomorrow కడమ కధను రేపటికి పెట్టిపెడుతాను, అనగా కడమ కధను రేపు చెప్పుతాను.
To Re-ship v a దిగుమతి చేసిన సరుకును మళ్ళీ యెగుమతి చేసుట.
To Reside v n కాపురము చేసుట, నివాసము చేసుట, వుండుట.
To Resign v a వదులుకొనుట, మానుకొనుట, విడిచిపెట్టుట, త్యజించుట, అప్పగించుట. he *ed the service ఉద్యోగమును మానుకొన్నాడు చాలించుకొన్నాడు. I *ed the money to him, ఈ రూకలు యికను నాకు వుపయోగము లేదని వాడికి అప్పగించినాను. he *ed his breath or life చచచినాడు. I * myself to the will of God దేవుడి మీద భారము వేసి అన్నీ మానుకొని వున్నాను. he is quite *ed అన్నిటికీ లోబడివున్నాడు, యెది వచ్చినా రానిమ్మని వున్నాడు. she *ed herself to him ఎటు చేసినా నీ భారమని వాడికి లోబడ్డది.
To Resist v a అడ్డి చేసుట, అడ్డమాడుట, ఎదురాడుట, విరోధించుట, ఆటంకము చేసుట, ప్రతిరోధము చేసుట. I opposed him but I could not * him వాడితో తిరగబడి యెదిరించలేకపోతిని. I wanted to go into the house but they *ed met నేను యింట్లోకి పోబోతే పోనిచ్చినారు కారు. If you * the Government you will meet with punishment అధికార్లను యెదిరిస్తే నీకు శిక్ష వచ్చును. can a child * a man? వొక మొగవాణ్ని బిడ్డ యెదిరించగలదా. this wood *s the axe ఈ కొయ్య గొడ్డలికి తెగదు, యిది గొడ్డలికి అభేద్యము. this wood *s fire ఈ కొయ్యకు నిప్పు భయము లేదు, ఈ కొయ్యను నిప్పు కూడా అంటదు. a resisting medium అడ్డముగా వుండేటిది.
To Resolve v a to settle a question పరిష్కరించుట, తీర్చుట, తేటపరచుట. he *d the riddle ఆ విడి కధను వీడ్చినాడు. this *s nothing ఇందువల్ల వొకటీ తీరదు. this *s the question ఇందువల్ల ఆ సందేహ నివారణ మవుతున్నది. to melt కరిగించుట. this *s itself into two questions ఇది రెండు విధములు అయినవి. a quarrel between two kings *s itself into a question of strength బలోరాజా పృధ్వి, యెవడికి బలమధికమో వాడి పక్ష మవుతున్నది. he *d on going there అక్కడికి పొయ్యేటట్టు నిశ్చయించినాడు. he *d it to powder చూర్ణము చేశినాడు, పొడిచేసినాడు. It was *d into smoke అది పొగ అయిపోయినది. are you *d? నీవు నిశ్చయించుకొన్నావా.
To Resort v n పోవుట, సంచరించుట, పట్టుట, అనుసరించుట, అవలంబించుట, శరణుజొచ్చుట. many * to this pagoda ఈ గుడికి బహుమంది వస్తూ పోతూ వుంటారు. they *ed to another plan వేరే వొక యుక్తిని పట్టినారు. in their distress they *ed to him వారికి ఆపద వచ్చినప్పుడు వాణ్ని ఆశ్రయించినారు. many * to brandy as a medicine బహుమంది బ్రాందిని మందుగా యెత్తుకొంటారు. they *ed to violence దౌర్జన్యమునకు మొదలుబెట్టినారు.
To Resound v a to echo మోగుట, వాగుట. they * his praise వాణ్ని స్తుతిచేస్తారు.
To Respect v a గౌరవము చేసుట, లక్ష్యపెట్టుట, గురించుట. this *s the army ఇది దండును గురించినది. this letter *s you ఇది నిన్ను గురించిన జాబు. this does not * you ఇది నిన్ను గురించినది కాదు. he does not * their authority వాండ్ల అధికారమును లక్ష్యపెట్టడు. not respecting his oath వాడి ప్రమాణము మీది గౌరవము వుంచక.
To Respire v n ఊపిరివిడుచుట, శ్వాసము విడుచుట. we * once more అయ్యో బ్రతికినాము, అంతమట్టుకు యీ గండము తప్పినది.
To Respite v a to delay సావకాశము చేసుట, నిలిపి పెట్టుట. to delay or remit punishment యిప్పుడు సధ్యాశిక్ష జరిగించకుండా నిలిపి పెట్టవలసినదని ఆజ్ఞాపించుట.
To Respond v n ప్రత్యుత్తరము చెప్పుట.
To Rest v n నిద్ర పోవుట, విశ్రమించుట, శయనించుట, పండుకొనుట.the bees *ed upon him తేనెయీగెలు వాడి మీద వాలినవి. I *ed there ten days అక్కడ పది దినములు నిలిస్తిని. to lie dead చచ్చి పడివుండుట.It *s with you to do this దీన్ని చేయవలశిన భారము మీదే. I * your humble servant Sitaramaya తమ శేవకుడైన సీతారామయ్య, ఇది జాబు కడాపట వ్రాశేమాట. I * assured that he will come వాడు వస్తాడని గట్టిగా నమ్మి వుంటిని. you may * assured he will do this ఆయన దీన్ని చేసునని గట్టిగానమ్ము.
To Restore v a మళ్లీ యిచ్చుట, స్వస్థము చేసుట, కుదిరించుట. they *d him to power వాడికి మళ్లీ అధికారము యిచ్చిరి. he *d the money ఆ రూకలను తిరిగీ యిచ్చినాడు. bathing *d his health స్నానము చేత వాడికి వొళ్లు కుదిరినది. this medicine *d him యీ మందు వాణ్ని బ్రతికించినది.he *d and beautified the house ఆ యింటిని చక్క జేసి శృంగారించినాడు.
To Restrain v a కట్టులో వుంచుట, కట్టులో పెట్టుట, బిగబట్టుట, అడ్డగించుట, అణుచుట. he *ed his horse గుర్రాన్ని యీడ్చి పట్టినిల్పినాడు.he *ed his son కొడుకును కట్టులో వుంచినాడు. he would have gone but fear *ed him వాడు పోనుగాని భయము వాణ్ని నిలిపినది. he *ed his passions కామక్రోధాదులను అణిచినాడు. he *ed his tongue మాట్లాడక నోరు మూసుకొన్నాడు. she *ed her tears యేడ్పును అణుచుకొన్నది. you must * your appetite నీవు నోరు కట్టవలసినది. he could not * his indignation వాడికి కోపము పట్టకూడక పోయినది. * yourself సహించుకో, తాళుకో, రేగవద్దు. rain *ed me from coming వాన నన్ను రానియ్యకుండానిలిపినది.
To Restrict v a To limit; to confine నియమము చేసుట, నిర్బంధన చేసుట, కట్టుచేసుట. the doctor *ed me in my diet వైద్యుడు నాకు పథ్యము పెట్టినాడు, ఆహార నియమము చేసినాడు. Johnson *s this word to one sense జాన్సన్ యీ శబ్దమును వొకటే అర్థము పెట్టినాడు.
To Result v n తీరుట, ఫలించుట, సంభవించుట. a quarrel *ed from this యిందువల్ల వొక కలహము పుట్టినది.
To Resuscitate v a మళ్లీ బ్రతికించుట.
To Retail v a to sell in small quantities చిల్లరగా మారుబేరము చేసుట, చిల్లరగా అమ్ముట. he *ed the story తాను విన్న కధను చెప్పినాడు.
To Retain v a to keep పెట్టుకొనుట, ఉంచుకొనుట, ఉంచుట, నిలుపుకొనుట. you must * your hold నీవు పట్టినపట్టు విడవరాదు.this cloth *s the colour well యీ గుడ్డ చాయ పోదు. he did not * possession of the country పట్టిన వూరును తన స్వాదీనములో పెట్టుకోలేదు. a child's memory will not * such a long word అంత నిడుపుమాట ఆ బిడ్డ యొక్క జ్ఞాపకములో నిలవదు. he did not * the medicine on his stomach తిన్న మందు వాడి కడుపులో యింద లేదు, నిలవలేదు. he *ed ten new servants కొత్తగా పదిమంది పని వాండ్లను పెట్టుకొన్నాడు.
To Retake v a to take again మళ్లీ పుచ్చుకొనుట. they took the village but we re-took it వాండ్లు ఆ వూరిని పట్టినారు గాని మేము మళ్లీ తీసుకొన్నాము.
To Retaliate v a సరికి సరి చేసుట, ప్రతికి ప్రతిచేసుట, పగదీర్చుకొనుట, కొదవతీర్చుకొణుట. he *d on them వాండ్లు చెప్పినదానికి ప్రతి చెప్పి తీర్చినాడు. why should you *? వాడు చేసిన దుర్మార్గమునకు ప్రతిగా నీవెట్లా చేస్తివి.
To Retard v a to hinder; to delay ఆటంకపరచుట, అభ్యంతరపరచుట. all this examination *s the work యింత విమర్శనున్ను పనికి అభ్యంతరమైనది.
To Retch v n ఓకరించుట. he *ed a great deal but he threw up little నిండా వోకరించినాడు గాని వమనమైనది కొంచెమే.
To Retire v n తిప్పుకొనిపోవుట, మళ్లుకొనిపోవుట, వెనకకు పోవుట. you may * లేచిపో. the army *d దండు మళ్లుకొన్నది, తిరుక్కొన్నది. they *d into the house యింట్లోకి పోయినారు. he *d into his bed room పడకటింటికి పోయినాడు. he *d into his heart తదేకధ్యానముగా వుండినాడు.he *d from business వుద్యోగము చాలించుకొన్నాడు.
To Retort v n ప్రతికి ప్రతి అనుట, తిప్పికొట్టుట. he *ed saying you are a worse thief than me అతను నీవు దొంగ అంటే నీవు నాకంటే మరీ దొంగ అని ప్రతిగా చెప్పినాడు. she *ed upon him వాడు చెప్పిన మాటనే అది తిప్పికొట్టినది.
To Retouch v a " చక్కపెట్టుట, దిద్దుట. after he *ed the picture it appeared new పటమును వాడు చక్కపెట్టిన తర్వాత కొత్తదిగా వుండినది."
To Retrace v a వచ్చిన దోవనే మళ్ళుకొనుట. he *d his foot steps వచచిన దోవనే మళ్లుకొన్నాడు. they *d his genealogy for a thousand years గతం వెయ్యేండ్ల పర్యంతము వాని వంశావళిని విచారించినారు.I gradually *d his father's features in his face వాని ముఖములో వాని తండ్రి పోలికను క్రమేణ కనిపెట్టినాను.
To Retract v a తిప్పుకొనుట. he *ed what he first said వాడు మొదట చెప్పినదాన్ని మళ్లీ తిప్పుకొన్నాడు. I will not * what I said నేను చెప్పిన మాటను తిప్పను.
To Retreat v n to fly or retire పలాయన మవుట, తిప్పుకొని పారిపోవుట, వెనక్కు మళ్ళుకొనుట. the army *ed from Canjeveram to Madras దండు కంచిలో నుంచి చెన్న పట్నానికి మళ్ళుకొని వచ్చినది.
To Retrench v a తగ్గించుట, మట్టుచేసుట. after he became poor he *ed his expences దరిద్రము వచ్చిన తర్వాత వ్రయమును మట్టు చేశినాడు. the judge *ed their accounts న్యాయాధిపతి వాండ్ల లెక్కలో నిండా తోసివేశినాడు.my leisure is much *ed నాకు సావకాశము నిండా తక్కువైనది.
To Retrieve v a మళ్లీ తెచ్చుకొనుట, మళ్లీ సంపాదించుకొనుట. he *d the money ఆ రూకలను మళ్లీ రాబట్టుకొన్నాడు. he *d his time వాడు కాలమును వృధాగాపోనివ్వలేదు. he *d his character పోయిన మానమును మళ్లీ వచ్చేటట్టు చేసుకొన్నాడు,తిరిగీ పెద్దమనిషి అనేపేరును సంపాదించుకొన్నాడు.
To Return v a To Give back తిరిగీ యిచ్చుట. he *ed an answerప్రత్యుత్తరము చెప్పినాడు. he struck it but it *ed no sound దాన్ని తట్టినాడు గాని అది శబ్దించలేదు. they *ed railing for railing తిట్టినందుకు ప్రతితిట్టినారు. the rock *ed his cries వాడు అరిచిన దానికి కొండ ప్రతిధ్వని చేసినది. he *ed their salutation ప్రతి వందనము చేసినాడు. he *ed my thrust నేను పొడిచిన దానికి యెదురుగా పొడిచినాడు. he *ed my visit నేను వాడి దర్శనానికి పోయినందుకు ప్రతివాడు నా దర్శనానికి వచ్చినాడు. he *ed evil for good వుపకారమునకు ప్రతిగా అపకారమును చేసినాడు. he *ed evil for evil అపకారమునకు ప్రతి అపకారమును చేసినాడు. * this to them దీన్ని వాండ్లకు మళ్లీ యిచ్చి వెయ్యి. he *ed (I will not come) నేను రానని ప్రత్యుత్తరము చెప్పినాడు. I praised her child's beauty and she *ed he complimentనేను దాని బిడ్డను పొగిడితే అది నా బిడ్డను పొగిడినది. he set our ship on fire but we *ed the compliment వాడు మా వాడను తగలబెట్టితే మేము వాడి వాడను తగలబెట్టినాము, మేమున్ను ప్రతికి ప్రతి చేసినాము.
To Reunite v a సంధిచేసుట, తిరిగీ కూర్చుట. after the bones were *d ఆ యెముకలు మళ్లీ కూడిన తర్వాత.
To Reveal v a మర్మమును బైట చెప్పుట, బైట పెట్టుట, తెలియచేసుట. he *ed themeaning of the riddle ఆవిడి కధను విచ్చినాడు. time *s all things దినాల పేరట అన్నీ బయిటపడుతవి. If you tell me I will never * it నాతో చెప్పితే నేన నెంత మాత్రము బైటవేయను.
To Revel v n to feast with loose and clamorous merriment యథేషటముగాతిని తాగి తుళ్ళుట, విందులో తిని వుల్లసించుట.
To Revenge v a పగతీర్చుకొనుట, చలము సాధించుట, కసితీర్చుకొనుట. God *dme నన్ను పరచిన పాట్లకు దేవుడు వానికి శాస్తి చేసినాడు. I will * you నీవు వూరికే వుండు, నిన్ను చేసిన దానికి నేను శిక్షిస్తాను. he *d himself upon me నా మీది పగ తీర్చుకొన్నాడు. they could not catch him, so they *d themselves upon his house వాణ్ని పట్టలేకపోయినారు గనక ఆ చలమును వాని యింటిమీద చూపినారు.he did this to * himself దీన్ని చలమువల్ల చేసినాడు. he was angry with his wife and he *d himself on the child పెండ్లాము మీది కశిని బిడ్డ మీద తీర్చుకొన్నాడు.
To Reverberate v a ప్రతిధ్వని చేసుట. the wall *d his words వాడు చెప్పిన మాటలను ఆ గోడ ప్రతిధ్వని చేసినది. the wall *d heat ఆ గోడ మీది కాక విసిరినది.
To Revere v a ఆదరణ చేసుట, సన్మానించుట, గౌరవము చేసుట, గురుత్వముచేసుట. they * the sabbath ఆదివారము యందు వాండ్లకు గురుత్వము. he did not * his parents తల్లిదండ్రుల యందు వాడికి గురుత్వము లేదు. they * this book very much యీ పుస్తకమందు వాండ్లకు నిండా గురుత్వము. a *d place మహాస్థలము, పూజ్యమైన స్థలము. he *s them వాడికి వాండ్లు పూజ్యులు. they * the Ramayanam వాండ్లకు రామాయణమందు గురుత్వము. In Mark XII. 6.
To Reverse v a తిప్పుట, మార్చుట. he *d the picture ఆ పటమును ముందువెనకగా తిప్పినాడు, తల్లక్రిందులు చేసినాడు. he *d the decree ఆ తీర్పునుమార్చినాడు. he *d the rule; instead of his being my servant he mademe his servant నిబంధనను తల్లకిందులు చేసి నాకు సేవకుడుగా వుండవలసినది పోగొట్టినన్ను తన సేవకుణ్నిగా చేసినాడు.
To Revert v n to return మళ్ళుట. when he *ed to the subject వాడు మళ్లీ ఆ ప్రస్తాపము చేసినప్పుడు. the estate *ed to him వేరేకర్తలు లేక ఆ సొత్తు వాడికి పోయి చేరినది. If the son dies without heirs his wealth *s to the father సంతులేక చచ్చిన కొడుకు యొక్క సొత్తు తండ్రిని చెందుతున్నది. the land *ed to the Government ఆ నేల నగర కలి పోయినది.
To Review v a to examine again విచారించుట, పునర్విమర్శ చేసుట,వుండచూచుకొనుట, సరిచూచుట. when he *ed his conduct తాను చేశిన పనినితానే యోచించుకొన్నప్పుడు. the general *ed the troops సేనాపతి ఆ దండునుయథారీతిగా వుంచ చూచుకొన్నాడు.
To Revile v a తిట్టుట, తిరస్కారము చేసుట, దూషించుట.
To Revise n s a second proof of a printed sheet వొకసారి దిద్ది మళ్లీ అచ్చువేశిన కాకితము.
To Revisit v a మళ్లీ దర్శనము చేసుట.
To Revive v n మళ్లీ ప్రాణము వచ్చుట. she *d దానికి ప్రాణము వచ్చినది,స్మారకము వచ్చినది.
To Revoke v a కొట్టుట, తోసివేసుట. he *d his order చేసిన వుత్తరువునుకొట్టివేసినాడు.
To Revolt v n తిరస్కరించుట, తిరగబడుట. the troops *ed ఆ దండు తిరగబడ్డది.
To Revolutionize v a to change entirely తల్లక్రిందులు చేసుట. they *d the country ఆ దేశమును తల్లక్రిందులు చేసినారు. this completely *d the art of shipping ఆ గ్రంథము పుట్టినందున వాడ వ్యవహారము యావత్తు చెడి వేరే వొక తీరుఅయినది.
To Revolve v n to turn round తిరుగుట, చుట్టుట. when the wheel *sచక్రము తిరుగుతూ వుండేటప్పుడు. at every revolving hour గడియగడియకు. IN each revolving year ప్రిత సంవత్సరము.
To Reward v a బహుమానము చేసుట, బహుమాన మిచ్చుట. they *ed him with a bookవాడికి వొక పుస్తకము బహుమాన మిచ్చినారు. he *ed my kindness with treacheryనేను చేసిన వుపకారమునకు అపకారము చేసినాడు.
To Rhapsodize v n and v. a. తలాతోకా లేక వొక కావ్యమును చెప్పుట.
To Rhyme v n ప్రాసచెల్లుట, ప్రాసకలిగి వుండుట. the word night *s to the word light లైటు అనే శబ్దమునకున్ను నైటు అనే శబ్దమునకున్ను ప్రాసచెల్లుతున్నది. to write poetry కావ్యము చెప్పుట.
To Ribroast v n (Johnson) పులుముట, బాదుట, పూజలిచ్చుట.
To Riddle v a విచ్చుట, విడి కధను విచ్చుట. can you * me this? దీని భావము నాకు చెప్పగలవా. this corn is not properly *d దీన్ని బాగా జల్లించి చక్క పెట్టలేదు. the board was *d full of holes ఆ పలకలో జల్లెడ కంతలు బడ్డవి.
To Ride v n to travel on horseback, to travel in a vehicle; tobe borne గుర్రము మొదలైన వాహన మెక్కి వెళ్ళుట. the boy rode upon a stick ఆ పిల్లకాయ కర్ర గుర్రము మీద సవారి చేసినాడు. he rode to town సవారెక్కి పట్నానికి వెళ్ళినాడు. he left the child ride upon his shoulder ఆ బిడ్డను భుజము మీద కూర్చుండ బెట్టుకొన్నాడు. to * on horseback గుర్రమెక్కి పోవుట.he rode at me గుర్రాన్ని నా మీద విడిచినాడు. to * in a palankeen పల్లకెక్కిపోవుట, పల్లకీలో పోవుట. he rode in a carriage బండెక్కి పోయినాడు.he rode away వాడు సవారెక్కి పోయెను. he rode round the hil గుర్రమెక్కి ఆ కొండను చుట్టుకొని వచ్చినాడు. (regarding vessels it means standing still)the ship rode out the storm ఆ గాలికి వాడలంగరు వేశినది వేశి నట్టే వుండినది, కదలకుండా వుండినది. the ships * at anchor ఆ వాడలు లంగరుచేశి వున్నవి.
To Ridicule v a పరిహాసము చేసుట, ఎగతాళి చేసుట, అపసహ్యాము చేసుట.
To Rifle v a to plunder, rob, pillage దోచుకొనుట, ప్రాబల్యము, అధికము. Rifle, n. s. or gun లోనాముగొట్టపు తుపాకి, గాడి తుపాకి, పలకల తుపాకి. a *man పలకల తుపాకీ వాడు.
To rig v a to deck శృంగారించుట, అలంకరించుట, సన్నాహము చేసుట, సిద్ధముచేసుట. to fit with tackling పగ్గాలు చాపలు కట్టి సిద్ధము చేసుట. the ship was completely rigged ఆ వాడకు కావలసిన పగ్గాలు చాపలుకట్టి సిద్ధముగా వుండినది. he rigged a board on the wall as a stage for the painters వర్ణము పూశేవాండ్లు నిలిచేటందుకు మంచెగా వొక పలకను గోడకు తాళ్ళతో కట్టినాడు. the tumblers rigged a pole and played on it దొమ్మరివాండ్లు వొక గడకు నాలుగుతట్లా దారాలు కట్టి బిగించి దాని మీద ఆడినారు.a square rigged vessel చౌక చాపలవాడ.
To Right v a to restore a ship to her upright position వొక వాడ మళ్లీ యథాస్థితిని కుదురుగా నిలుచుట. the ship *ed herself or the ship *ed వొరిగిన వాడ మళ్లీ యెప్పటివలె సరిగ్గా నిలిచినది. he is *ed వాడు న్యాయమును పొందినాడు.
To Rince v a నీళ్ళు పోశి కుదిలించి కడుగుట. to * the mouth పుక్కిలించుట. he *d the bottle ఆ బుడ్డిలో నీళ్లు పోశి కుదిలించి కడిగినాడు.
To Ring v a వాయించుట, గంట వాయించుట. he rung the bell గంటవాయించినాడు. he rang for a servant పనివాడు రావలసినదని గంట వాయించినాడు. they rang it in his ears that he has suffered injustice అన్యాయమును పొందినానని వాని చెవిలో యిల్లు కట్టుకొని చెప్పినారు. what is the good of your ringing that in my ears ఆ మాటను నాతో పదేపదే యెందుకు చెప్పుతావు.
To Rinse v a నీళ్లు పోశి కుదిలించి కడిగిపోసుట. to * the mouth పుక్కిలించుట.
To Riot v n అల్లరి పని చేసుట, రచ్చ చేసుట.
To Rip v a to cut open with a knife కత్తితో చీల్చుట. he ripped up the pillow తలగడను చించినాడు. they ripped up his belly వాడి పొట్టను చీల్చినారు. what is the good of ripping up old grievances? పోయిన యేడ్పును మళ్లీ యెందుకు కెళ్లగిస్తావు.
To Ripen v n పండుట, పరిపక్వమవుట. it began to * పండబారినది.
To Ripple v n నీళ్ళు జలజలమని పారుట.
To Rise v n లేచుట, మొలుచుట, పుట్టుట, ఉదయమగుట. when the balloon rose పొగగుమ్మటము పైకి పొయ్యేటప్పటికి. the kite does not * ఆ గాలి పటము పైకి యెక్కేది లేదు. when the wind rose గాలెత్తేటప్పటికి. behind the house a bill *s ఆ యింటికి వెనక వొక కొండ వున్నది. beyond the hills, a wood *s ఆ కొండకు అవతల వొక అడవి వున్నది. the water is rising in the well బావిలో నీళ్ళు వూరుతూవున్నది. the river *s in this hill యీ కొండలో ఆ యేరు పుట్టుతున్నది. the tide is rising పోటు కాలముగా వున్నది. as soon as he rose నిద్ర లేవగానే, కూర్చున్నవాడు లేవగానే.the sun rose ప్రొద్దు పొడిచినది. in consequence of this execution the whole country rose యిట్లా వురితియ్యడము వల్ల దేశములో వుండే ప్రజలంతా తిరగబడ్డారు. when the assembly rose సభ కలిశేటప్పటికి. the rpice of corn rose very much ధాన్యపు వెల నిండా పొడిగినది. he rose again from the dead మళ్ళీ పుట్టినాడు.he rose in the service వుద్యోగములో అభివృద్ధి అయినాడు. the people rose against their ruler ప్రజలు రాజు మీదికి తిరగబడ్డారు. this act rose up in judgement against him యీ పని వల్ల వాడు మునుపుచేసిన దుర్మార్గము బైటపడ్డది. Paumben is a rising port పాంబెన్ అనే వూరు నానాటికి అభివృద్ధి అవుతున్నది. the stench rose కంపెత్తినది.when the bread rose రొట్టెవుబ్బేటప్పటికి. they rose against us మా మీదికి రేగినారు.
To Risk, Risque,risk v a. సాహసము చేసుట, తెగించుట. he *ed ten rupees upon the dice పాచికెలలో పది రూపాయలు తెగించి పెట్టినాడు.Will you * your veracity on this assertion? యీ మాట తప్పితే నీవు అబద్ధీకుడవేగదా. If you * your money in the lottery you deserve to lose it లాటరీలో వేస్తే ఆ రూకలు నీది కాదు.
To Rival v a పోటి చేసుట, సరితూగుట, సరిపోరుట. her face rivalled the splendour of the moon దాని ముఖము చంద్రుణ్ని తిరస్కరిస్తున్నది. they * Mars in war like skill యుద్ధ కౌశల్యములో ద్రోణాచార్యులతో సరితూగుదురు.
To Rive v a చీల్చుట, బద్దలు చేసుట.
To Rivel v a See Shrivel. Rivelled See Shrivelled.
To Rivet v a చీలను వెనకతట్టు మణగకొట్టుట. they *ed the fetters upon his legs వాడు కాళ్ళకు సంకెళ్లు కొట్టినారు. his attention was *ed on this వాడి మనసు దాని మీద లగించి వుండినది, లగ్నమై వుండినది. we were *ed to the spot all day నాడంతా అక్కడనుంచి కదలలేదు, అనగా ఆ వేడుకను చూస్తూ యివతలికి పోయినాము.
To Roam v n చుట్టుట, తిరుగుట, సంచరించుట. the madman was roaming about the village ఆ వెర్రివాడు వూరంతా తిరుగుతా వుండినాడు.
To Roar v n అరుచుట, కూసుట, గర్జించుట, ఘోషించుట, మొరబెట్టుట,బొబ్బలుపెట్టుట. to * with laughter పకపక నవ్వుట. to * in weeping బోరున యేడ్చుట.
To Roast v a కాల్చి పక్వము చేసుట, వేయించుట. to ridicule గేలి చేసుట, పరిహాసము చేసుట, కోడిగము చేసుట.
To Rob v a దోచుకొనుట, అపహరించుట. they robbed the house and the garden ఆ యింటిని తోటను కొల్లబెట్టినారు. they robbed him of his clothes వాడి బట్టలను దోచుకొన్నారు." They robbed the property, they robbed the cards to * money." all this is bad English; `They robbed me of the property,they robbed him of the cattle, they robbed her of the money' is correct. They robbed him of his character వాడి భవిష్యమును పోగొట్టినారు. he robbed me of my time నా కాలమును వృధాగా పోగొట్టినాడు. a fever *s a man of his strength జ్వరము మనిషి యొక్క బలమును పోగొట్టుతున్నది. his pride *s the deed of all merit గర్వము చేత పుణ్యము లేక పోయినది.
To Robe v a ఉడుపు వేసుట, వేషము వేసుట. the robing chamber బట్టలు తొడుగుకొనే గది.
To Rock v a ఊచుట. she *ed the child to sleep బిడ్డను వూచి నిద్ర బుచ్చినది.
To Rolick SeeForlick
To Roll v a పొర్లించుట, దొర్లించుట. he *ed up the death ఆ గుడ్డను చుట్టగా చుట్టినాడు. he *ed it round his head as a turband దాన్ని తలలో పాగాగా చుట్టుకొన్నాడు. she *ed the thread round the nut ఆ నూలును కాయమీద చుట్టినది. to * between the fingers నులుముట. they *ed the road పొత్తరము వంటి బ్రహ్మాండమైన రాతిని దొర్లించి బాటను గట్టన చేసినారు. he *ed the lime towards me ఆ నిమ్మపండును నాకై దొర్లించినాడు. the man was rolling his eyes ఆ వెర్రివాడు గుడ్డలు తిప్పుతూ వుండినాడు, మిణకరిస్తూ వుండినాడు.the baker *ed the flour ఆ పిండిని అప్పడముగా వొత్తినాడు. the ceremony of rolling cocoanuts at a wedding పచ్చకల్యాణము, టెంకాయలు దొర్లించడము.
To Rollick SeeFrolick
To Romance v n కధలను కల్పించుట, లేనిపోని కధలు అల్లించుట.
To Romanize v a i. e. to write Hindi Telugu, &c. in English characters తెలుగు మొదలఐన వాటిని యింగ్లీషు అక్షరములలో వ్రాసుట. a *d Koran యింగ్లీషు అక్షరములతో వ్రాశిన కురాను.
To Romp v n to play rudely, or boisterously అల్లరిగా ఆడుట, పిల్లకాయలు అల్లరిగా గంతులు వేసుట, మోటు చేష్టలు చేసుట.
To Roof v a ఇంటికి పై కప్పు వేసుట. they *ed in the house ఆ యింటికి పై కప్పు వేసినాడు. a flat *ed or terra *ed house మిద్దె యిల్లు.
To Roost v n పక్షి నిద్రపోవుట. three birds *ed upon this బరన్చ్హ్ యీ కొమ్మ మీద మూడు పక్షులు నిద్రించినవి. (in joke) to sleep or lodge మనిషిని గురించి యెగతాళిగా చెప్పే మాట. where does he *?వాడు యెక్కడ పండుకొంటాడు.
To Root out or Root up v a పెళ్ళగించుట, వేళ్ళతో పెళ్ళలగించుట.
To Rosin v a గుగ్గిలము పూసుట, చరుముట.
To Rot v n కుళ్లుట, మురుగుట, పుచ్చుట, పుచ్చిపోవుట, చివికిపోవుట.
To Rough v a పడుట, సంకటపడుట. they *ed it దాన్ని పడుకొన్నారు. I have no bed, so I must * it మంచము లేదు గనక, నేను సంకట పడవలసివున్నది. I can * it well enough యెంత సంకటము వచ్చినా నాకు చింత లేదు.
To Roughen v a నిమ్నోన్నతముగా చేసుట, మిట్టా పల్లముగా చేసుట. the storm *ed the water గాలి చేత నీళ్ళు వుల్లోలకల్లోలమైనది.
To Roughhew v a మొదట ఆకృతిగా యేర్పరచుకొనుట. a roughhewn statue మొదట మొద్దుగా యేర్పరచుకొన్న ప్రతిమ.
To Round v a చుట్టుకొనుట.
To Rouse v a రేచుట, లేపుట, నిద్రలేపుట. he *d the bees తేనె యీగలను లేపినాడు. to * himself he walked about నిద్రని పొగొట్టడానకైయిటు అటు తిరిగినాడు. the noise *d the guard యీ సందడివల్ల పారావాండ్లు లేచినారు.
To Rout v a or put to flight వెళ్ళగొట్టుట, తరమకొట్టుట, విరగ్గొట్టుట.
To Rove v n తిరుగుట, సంచరించుట, విహరించుట.
To Row v n and v. a. తెడ్లతో పడవను తోసుట. they *ed to the ship తెడ్లతో పడవను తోసుకొని వాడ వద్దకి పోయినారు. they *ed the boat to the ship పడవను వాడ వద్దకి తీసుకొని పోయినారు. they *ed me to the ship నన్ను పడవలో యెక్కించి వాడ వద్దకి తీసుకొని పోయినారు.
To Rub v a తోముట, రాచుట, రుద్దుట. to polish తోముట, మెరుగువేయుట.she was rubbing his feet వాడికి కాళ్ళు పిసుకుతూ వుండినది. she was rubbing the child's head with oil ఆ బిడ్డకు తల అంటుతూ వుండినది. he was rubbing down the horse గుర్రాన్ని తోముతూ వుండినాడు. he rubbed the oil into the leather ఆ తోలుకు నూనె వేసినాడు. he rubbed the paint off his face వాడి ముఖానికి పట్టించిన వర్ణమును తుడిచి వేసినాడు. he rubbed out what was written on the slate రాతి పలకమీద వ్రాసినదాన్ని తుడిచి వేసినాడు. to * to pieces నలిచిపొడి చేసుట. I will * up your memoryనీకు జ్ఞాపకము వచ్చేటట్టు చేస్తాను.
To Rue v a చింతపడుట, దుఃఖపడుట, తలచుకొని యేడ్చుట. I * the day that ever I told him this అయ్యో నాడు వానితో దీన్ని యెందుకు చెప్పితినో. you shall * this యిందున గురించి నీవు యేడవబోతావు చూడు. they will * his return వాడు మళ్ళీ వస్తే అప్పుడు యేడవపోతారు. you will * your neglect నీ జాగ్రతను గురించి రేపు యేడవబోతావు సుమీ.
To Ruffle v a అల్లరి చేసుట, కలతపెట్టుట, చీకాకుపరచుట.the wind that *s the water అలలను కలుగచేసే గాలి, నీళ్ళను కలిపే గాలి. I am loath to * the skin of old sores (PinkertVIII. 410.) మానిపోయిన పుండును మళ్ళీ యెందుకు కెళ్ళగించేది,యెన్నడో పోయిన యేడ్పును మళ్ళీ యెత్తేది యెందుకు. this *d her temper యిందువల్ల అది రేగినది.
To Rule v a to govern ఏలుట, పాలించుట. when mirth *d the hour ఉత్సాహపరుడై వున్నప్పుడు. he *d the country ten years పది యేండ్లు రాజ్యభారము చేసినాడు. he *d the paper ఆ కాకితము మీద కర్రను పెట్టి గీతలు వేసినాడు.
To Rumble v n ఉరుముట, గర్జించుట. a rumbling sound గుడుగుడుమనే ధ్వని, గడగడమనే ధ్వని.
To Ruminate v n or chew the cud నెమరువేయుట. to muse or think యోచన చేసుట, తలపోసుట.
To Rummage v a లొడపెట్టుట, గందరగోళము చేసుట. he *d all the boxes for this ring యీ వుంగరము కోసరమై ఆ పెట్టెలనంతా లోడపెట్టినాడు. the thieves *d the house దొంగలు ఆ యింటిని గుల్ల చేసినారు.
To Rumple v a నలుపుట. the *d the cloth ఆ గుడ్డను నలిపివేసినది.he * the paper ఆ కాకితాన్ని నలిపివేశినాడు.
To Run v n పరిగెత్తుట. the lines * smoothly ఈ పద్యము లలితముగా వున్నది, సరళముగా పారుతున్నది. when the silver ran వెండి కరిగే టప్పటికి. this paper *s యీ కాకితము వూరుతున్నది. they say madness *s in that family ఆ వంశములో అందరికి కొంచెము వెర్రి కద్దని అంటారు. the river *s slowly యేట్లో నీళ్ళు తిన్నగా పారుతున్నది. the river *s westwards యేరు పశ్చిమ వాహినిగా వున్నది. we were running south మా వాడ దక్షిణముగా పోతూ వుండినది. this road *s, northwards యీ బాట వుత్తరముగా పోతున్నది. this story *s that he conquered them వాండ్లను జయించినాడట, వాండ్లను జయించినాడని మాట కద్దు. I know the story that *s in your head నీకు అప్పుడప్పుడు తోచే మాట నాకు తెలుసును.they ran after the thieves దొంగలను వెంబడించి పరిగెత్తినారు. the ship ran around ఆ వాడ దరితట్టినది. the bull ran at him ఆ యెద్దు వాణ్ని పొడవబోయినది. he ran away వాడు పారిపోయినాడు. they have * away వాడు పారిపోయినాడు. they have * away with the story that the man is still alive వాడు యింకా బ్రతికి వున్నాడనే పిచ్చికధను నమ్ముకొని వున్నారు. his blood ran cold at hearing this దీన్ని విని వాని గుమడె ఝల్లుమన్నది. the sweat * down his face వాడి ముఖములో చెమట వడిసినది, చెమటనీళ్ళు కారినది. he ran from one subject to another వొక సంగతిని విడిచి మరి వొకటి చెప్పినాడు. the sea *s high today సముద్రములో నేడు అలలు అధికము. words ran very high between them వారిద్దరికి మాటలు నిండా పొడిగినవి. he ran in debt అప్పుల వాడైనాడు. they ran off వాండ్లు పారిపోయిరి. he ran off with it దాన్ని లంకించుకొని పారిపోయినాడు. the work *s on still ఆ పని యింకా జరుగుతున్నది, నడుస్తున్నది. the ship ran on a rock ఆ వాడ కొండకు తగిలినది. at time *s on కాలక్రమేణ, దినాల పేరట. the water ran out నీళ్ళు వడిశిపోయినది, నీళ్ళు తీసిపోయినది. the money ran out very fast రూకలు త్వరలో వ్రయమైపోయినవి. he ran over thepaper ఆ కాకితమును పార చూచినాడు. the water ran over the field ఆ పొలము నీళ్ళల్లో ముణిగినది. the vine ran over the wall ఆ తీగెలు గోడ మీద అల్లినవి. the water ran over the banks నీళ్ళు కట్ట పోర్లిపోయినది. he ran over the different heads of the indictmentఆ ఫిర్యాదును సంగ్రహముగా చెప్పినాడు, టూకిగా చెప్పినాడు. the sand *s slowly through the hour glass యిసుక గడియారములో యిసుక తిన్నగా జారుతున్నది. he ran through his whole property within one year వొక సంవతసరములో ఆస్తినంతా పాడుచేసినాడు. he ran through many dangers వాడికి అనేక గండములు గడిచినవి. these indigo ran to seed యీ నీలిచెట్లు యెన్ను విడిచినది, అనగా యికను పనికిరాదని భావము. the plantain trees * up fast అరిటిచెట్లు వడిగా పెరుగుతవి, శీఘ్రముగా పెరుగుతవి. the monkey ran up the rope ఆ కోతి తాడు పట్టుకొని యెక్కినది, పాకినది. her mind was running upon her child దాని మనసంతా బిడ్డ మీద వుండినది.
To Rupture v a విరుచుట, పగలగొట్టుట, చించుట. this *d the skin యిందువల్ల తోలు చినిగినది.
To Ruralize v n to take an excursion విహరించుట, వనవిహారము చేసుట, ఇది నీచశబ్దము.
To Rush v n to pass quickly చొరబడుట, చొచ్చుట, దూరుట. he *ed at me నా మీదికి వచ్చినాడు. he *ed into the house యింట్లోకి చొరబడ్డాడు. he *ed upon the enemy శత్రువుల మీద పోయిపడ్డాడు. are you rushing upon destruction? నీకు వినాశకాలము వచ్చినదా.
To Rust v n తుప్పుపట్టుట. the knife *ed కత్తికి తుప్పుపట్టినది. his mind *ed వాడి మనసు చెడిపోయినది.
To Rusticate v n నాటుపురములో వాసము చేసుట.
To Rustle v n చటచటమనుట. I heard the leaves * ఆకులు చటచటమనగా విన్నాను. I heard the flames * అగ్ని చటత్కారము విన్నాను, చటచటమని నిప్పు మండేది విన్నాను. I heard the wings * రెక్కలు చటచటమని కొట్టుకోగా విన్నాను.
To Sabe v a కత్తితో నరుకుట.
To Sack v a to pillage కొల్ల పెట్టుట.
To sacrifice v a బలిఇచ్చుట, బలిపెట్టుట. to * to a rustick deity గావు ఇచ్చుట. they *d him వాణ్ని గొడ్డువలె చంపినారు. he *d his life for his friends వాడి ప్రాణమును స్నేహితులకే వొప్పగించినాడు. why should you * your time to this ? నీ కాలమునంతా దీంట్లోనే ఎందుకు వృధాగా పోగొట్టుతావు.
To Sadden v a to grieve దుఃఖ పెట్టుట, వ్యాకుల పెట్టుట, క్లేశమును పొందించుట.
To Saddle v a పల్లము కట్టుట, గుర్రానికి జీనివేసుట. he *d the horse గుర్రానికి జీని కట్టినాడు. they *d him with the expenses యీ లెక్కను వాడిమీద మోపినారు. he has *d himself with his brother's family అన్న సంసారాన్ని కాళ్ల కట్టుకొన్నాడు.
To Sail v n నడుచుట, వెళ్లుట, ఇది వాడను గురించిన మాట. theship *s well ఆ వాడ వేగముగా పోతూఉన్నది. this is mere plain sailing ఇది ఒక అతిశయము కాదు. ఇది సామాన్యమే, సాధారణమే, ఇందులో ఒక చిక్కులేదు.
To Salivate v a చొంగను పుట్టించుట, నోట్లో నీళ్లు కారేటట్టు చేసుట, అనగా he was *d రసముతో మందు ఇచ్చి వాడికి నోట్లో నీరు కారేటట్టు చేసినారు.
To Sally forth v n బయిలుదేరుట.
To Salt v a ఉప్పువేసుట.
To Salute v a దండము పెట్టుట, నమస్కరించుట, వందనము చేసుట.we * you దీవి స్తిమి, దీవించినారము. or to kiss ముద్దుపెట్టుకొనుట.the ship *d the fort వాడ కోటకు మర్యాదచేసినది అనగా కోట వద్దికివచ్చి వాడలో ఉండే వాండ్లు మర్యాదకుగాను పిరంగులు కాల్చినారు. as soon ashis voice *d thier ears శ్రవణానందముగా వాడి గొంతును వినగానే.
To Salve v a మందుపట్టించుట.
To Sanctify v a పరిశుద్దముచేసుట, పావనము చేసుట, పవిత్రము చేసుట. they sanctified this place to him యీ స్థలము ఆయనకనిప్రతిష్టచేసి ఉంచినారు.
To Sanction v a to పేర్మిట్, to ratify, to confirm స్తిరపరుచుట, రూఢీచేసుట.
To Sand v a ఇసుక చల్లుట, ఇసుకపరచుట. She *ed the house ఆ ఇంటిలో ఇసుక పరిపించినది. ఆ ఇంటిలో సన్నగా ఇసుక చల్లినది.
To Sap v a కింద తవ్వుట, సురంగము చేసుట, they sapped thewall గోడ పడేటట్టు కింద పల్లము తవ్వినారు. the river sapped the rockఆ కొండ కూలేటట్టు ఏరు అడుగున కోసినది. grief *s the strength వ్యసనము చేత బలము కుంగుతున్నది.
To sate v a తృప్తిచేసుట.
To Satiate v a తృప్తిచేసుట, తనివిదీర్చుట, సంతుష్టి చేసుట. he could not * his eyes with lookinjg at her దాన్ని చూచివాడితనివి తీరలేదు.
To Satirize v a పరిహాసము చేసుట, ఎగతాళిచేసుట, దూషించుట.
To Satisfy v a తృప్తిచేసుట, తుష్టిచేసుట, సంతోషపెట్టుట.the money he received satisfied him ఆ రూకలను తీసుకొనిసంతోషించినాడు. this food did not * his hunger ఈ అన్నముతోవాడి ఆకలి తీరలేదు. I will * you నిన్ను తృప్తి చేస్తాను. all that I could say did not * him నేనెంత చెప్పినా వాడుఒప్పలేదు.
To Saturate v a తడిముద్దచేసుట, నించుట, ముంచుట. he *d the field with water ఆ పొలమునకు కావలసినంత నీళ్లు కట్టినాడు.he *d the cloth with water ఆ గుడ్డను తడిముద్ద చేసినాడు.
To Satyrize See Satirze
To Saunter v n తిరుగుట, వూరిమీద తిరుగుట, అల్లాడుట, విహరించుట,the boy *ed so long on the road that it was night beforehe arrived ఆ పిల్లకాయ దోవలో శానాసేపు సోమరితనముగా తిరుగుతూ వుండి అస్తమానానికి వచ్చి చేరినాడు. Krishna was sauntering in the woods with the milk maids కృష్ణుడు గోపికలతో కూడా వనములో విహరిస్తూ వుండినాడు.
To Save v a to preserve from danger or destruction రక్షించుట,కాపాడుట, తప్పించుట. the doctor lost two patients but he *d four ఆ వైద్యుడు వైద్యము చేసిన వాండ్లలో ఇద్దరు చచ్చినారు, నలుగురుబ్రతికినారు. he was in great trouble but God *d him వాడు నిండాసంకటపడుతూ ఉండగా దేవుడు రక్షించినాడు. he *d his character మానము దక్కించుకొన్నాడు. he *ed his life but lost his estate ఆస్తిని పోగొట్టుకొన్నాడు మెట్టుకు ప్రాణము దక్కినది. he would not do it to * his life వాడు చచ్చినా చేయడు. he *d their lives or he *d them alive వాండ్లను బ్రతికించినాడు. the baggage was lost but the guns were *d మూటలు పోయినవిగాని పిరంగులు తప్పినవి. four died and three ware *d నలుగురు చచ్చినారు, ముగ్గురు తప్పినారు. he punished all the other boys but I *d my brother కడమ పిల్లకాయలందరికిన్నీ దెబ్బలు తగిలినవి అయితే నా తమ్ముణ్ని నేను తప్పించినాను. to preserve finally from eternal death కడతేర్చుట. God * the king దేవుడు రాజును చిరంజీవి చేసుగాక. D+ రాజును దేవుడు రక్షించుగాక, రాజుకు శుభముశుభము. they imagine that if they die here they will be *d ఇక్కడ చస్తే మోక్షమట. not to spend or lose వ్రయము కాకుండా నిలుపుకొనుట, మిగిలించుకొనుట, దక్కించుకొనుట. he lost much money but he *d a little వాడు పొగోట్టుకోన్నది నిండా నిలిచినది కొంచెము. you ought to * time నీవు కాలమును వృధాగా పొగొట్టరాదు. if I can * time I will do this to-day నాకు సావకాశము చిక్కితే ఈ వేళ చేస్తాను. he *d himself by running away పారిపోయి ప్రాణము తప్పించుకున్నారు. to * appearances he consented వొప్పుకొని మానము దక్కించుకొన్నాడు. what is the use of asking him? you will not * yourself any trouble by asking him వాణ్ని అడగడము యేమి ప్రయోజనము, వాణ్ని అడగడమువల్ల నీకు నీవే తొందర తీసుకోక విధిలేదు. this will * you the trouble ఇందువల్ల నీకు ఆ తొందర లేకపోను. he got there in time to * his passage వాడ మించిపోకమునుపే సమయానికి పోయిచేరినాడు.
To Savour v n to taste రుచిగా ఉండుట, ఇష్టముగా ఉండుట. this*s of malice ఇందులో మాత్సర్యరసము వున్నట్టుఉన్నది. this *s ofroguery ఇందులో మోసము ఉండేటట్టు ఉన్నది.
To saw v a రంపముతో కోసుట. he *ed his hand up and down inspeaking చామరము వేసినట్టు చేయి ఆడిస్తూ మాట్లాడినాడు.
To say v. a. చెప్పుట, అనుట,పలుకుట,ఉచ్చరించుట, all I could* was of no use నేను ఎంత చెప్పినా వ్యర్ధమైనది. to * a lessonపాఠమును వొప్పగించుట. If he pays them some money * ten rupeesవాడు కొన్ని రూకలు చెల్లిస్తే అనగా పది రూపాయీలూ ఇచ్చినట్టయితే. he has a great deal to * to the prince వాడికి రాజు దగ్గిర నిండా చొరవకలిగి ఉన్నది, వాడి మాట నిండా సాగుతున్నది. I can * that poem throughout ఆ కావ్యమును కడవెళ్లా వాచోవిధేయముగా చెప్పగలను, పుస్తకము చూడకుండా చెప్పగలను. "He said &c." in English comes at the beginning of a speech: in common Telugu prose at the end: but in verse the words are arranged as in English: thus అనిన శెట్టిని జూచి యతిన ఇట్లనియె Somavara mahat, Dwip. p. 52. He said:and the woman looking at the merchant spoke thus.
To Scald v a వేన్నీళ్లు పోసి బొబ్బలు చేసట. she *ed her hand దాని చేతిమీద వేణ్నీళ్లు తగిలి బొబ్బలైనవి. you will * yourself if you touch this rice ఈ అన్నాన్ని తాకితే అంటుకొనును. I have *ed my mouth అధిక వేడి అయినందున నోరుబొబ్బలయినది. tears have *ed her cheeks కన్నీళ్ల వేడికి దాని చెక్కిళ్లు బొబ్బలు పోయినవి. they killed the hog and *ed it పందిని చంపి దానిపై వెంట్రుకలు పొయ్యేటట్టు మసల కాగిన నీళు పోసినారు. she *ed the pot ఆ కుండలో వుడుకు నీళ్లు పోసి కడిగినది. to * paddy వుప్పుడు చేసుట. *ed rice వుప్పుడు బియ్యము.
To Scale v a (with ladders) లగ్గలెక్కుట. scaling ladderలగ్గలెక్కే నిచ్చెన, దీన్ని canger అంటారు. he *d the wall గోడ ఎక్కిదుమికినాడు. to * fish చేప పొలుసును కడుగుట.
No comments:
Post a Comment