Monday, February 7, 2011

Trembling

Trembling adj వణికే, చలించే, కదిలే, అదిరే. a * voice గద్గద స్వరము.
Tremblingly adv గడగడ, దడదడ, వణుకుతూ.
Tremendous adj అఘోరమైన, భయంకరమైన, బ్రహ్మాండమైన, అతిశయమైన.
Tremor, Tremour n s. trembling వణుకు, దడ, కంపనము.
Tremulous adj trembling వణికే, కదిలే.
Tremulously adv గడగడ, దడదడ, వణుకుతూ.
Tremulousness n s వణుకు, దడ, కంపనము.
Trench n s కందకము, అగడ్త, కాలవ. *es, in battle ఉక్కడము, దండుకు చుట్టూరునేసిన కాట్రగడ. they opened the *es యుద్ధానికి ఆరంభము చేసినారు. our troopslay in the *es four months మా దండు నాలుగు నెలలు అక్కడ నిలిచి యుండినది.
Trenchant adj sharp; cutting తీక్ష్ణమైన, వాడియైన.
Trencher n s కొయ్యతట్ట, కప్పెర, కంచము.
Trencherman n s a great eater తిండిబోతు.
Trepan n s a circular saw for perforating the skull కపాలము కోశేగుండ్రని రంపము.
Trepidation n s trembling దడ, వణుకు, కంపనము.
Trespass n s తప్పు, నేరము, ఆజ్ఞోల్లంఘనము. unlawful entrance onanother's ground ఆక్రమణము. in the Lord's prayer, debts రుణములు,అప్పులు.
Trespasser n s he who offends నేరము చేసేవాడు, అపరాధి, తప్పేవాడు,అతిక్రమించేవాడు.
Tress n s plu. Tresses, n.s. వెంట్రుకలు, కురులు.
Tressed adj వెంట్రుకలుగల. dark * నీలికేశియైన fair * దివ్యమైన వెంట్రుకలుగల.
Trestle, or Tressel n s. the frame of a table బల్ల కింది చట్టము.
Tret n s an allowance to purchasers, for waste or refuse matter, offour pounds on the hundred of suttle weight జట్టీవర్తకులు చిల్లర వర్తకులకుసరుకులో చెడుపడు వాటికి చెల్లుగా 104 పౌనులకు నాలుగు పౌనుల వంతున తోశియిచ్చేటిది.
Trevet n s anything that standson three legs మూడు కాళ్లు గలముక్కాలుపీట మొదలైనది.
Trey n s three, at dice తిగ. trey-ace తిగవంచ.
Triad n s ( A Platonic phrase ) three united, the union of threeత్రయము. the * of deities మూర్తిత్రయము.
Trial n s test; examination పరిక్ష, శోధన, విమర్శ విచారణ. difficulty తొందర,ఇబ్బంది, సంకటము. you must give the medicine a fair * ఆ మందు తీసుకొనిఅపథ్యము చేయరాదు. this was a great * to him యిది వాడికి నిండా యిబ్బందిగావుండెను.
Triangle n s a figure of three angles త్రికోణము, ముక్కోణము, మోచేతివంపుa musical instrument తాళమువలె వాయించడమునకై వుక్కుతో మోచేతి వంపుగా చేశివుండేటిది. the triangles, plu. or a whipping post దొంగలను కట్టి కొట్టేముక్కోణము.
Triangular adj త్రికోణముగా వుండే, ముక్కోణముగా వుండే, మోచేతి వంపుగా వుండే.
Tribe n s కులము, జాతి, వర్ణము, వంశము, గోత్రము. the feathered *s పక్షులు.the finny *s చేపలు. Note -- Tribe in the Bible means గోత్రము. but incommon life it means వృత్తి.
Tribulation n s distress ఉపద్రవము, బాధ, సంకటము, ఇబ్బంది, దురవస్థ.
Tribunal n s a court of justice ధర్మాసనము, న్యాయాసనము, న్యాయస్థలము.they brought him before the * వాణ్ని న్యాయాధిపతి యెదుటికి తెచ్చినారు.
Tribune n s a certain Roman officer రోమన్ దేశములో వొక అధికారి.
Tributary adj paying tribute పన్ను కట్టే, కప్పము కట్టే. or subject కిందివాండ్లుగా వుండే. * princes పన్ను కట్టే రాజులు, పన్ను చెల్లించే రాజులు, స్వల్ప రాజులు. the streams which are * to the Ganges గంగలో వచ్చి కలిశే చిన్న నదులు.
Tribute n s పన్ను, కప్పము, కరము. praise is a just * to meritగుణవంతుడికి మెప్పులు కలగడము సహజ ధర్మమే. they paid him the * of theirtears వాణ్ని గురించి వీండ్లు యేడవడము సహజ ధర్మమే.
Trice n s an instant; a moment క్షణము, నిమిషము. in a * లటక్కున,తక్షణము, నిమిషములో.
Trick n s యుక్తి, కుయుక్తి, చమత్కారము. or evil device మోసము, వంచన. or illhabit దుర్గుణము, పితలాటకము. this horse has a bad * of biting యీ గుర్రానికికొరికే దుర్గుణము వున్నది. a * at cards meaning one time కాకితాలు ఆడడములోవొక పట్టు.
Tricked adj defruaded మోసబోయిన, వంచించబడ్డ. * out శృంగారించబడ్డ.
Trickery n s fruad, guile మోసము, వంచన పితలాటకము, టక్కు.
Trickling n s బొట్లు, బొట్లుగా కారడము.
Tricksiness n s or prettiness, చమత్కారము.
Tricksome adj చమత్కారియైన.
Tricksy adj చమత్కారియైన.
Tricolor n s త్రివర్ణము, అనగా the flag of the French republic ప్రెంచి దేశపుప్రజా ప్రభుత్వము చేసేవారి ధ్వజము, మువ్వన్నెకొడి.
Trident n s a three forked sceptre of Neptune వరుణుడి చేతి త్రిశూలము,శూలము, మూడుపంగలు గల యీటె.
Tried pastpart పరిక్షించబడ్డ, విమర్శించబడ్డ, విచారణ చేయబడ్డ, పరిక్షకు నిలిచిన. * in the furnace ముక్కాకలు తీరిన.
Triennial adj మూడేండ్లకు వొక మాటు వచ్చే.
Triennially adv మూడేండ్లకు వొక మాటుగా.
Trier n s పరిక్షించేవాడు, న్యాయాధిపతి, తగవరి.
Trifle n s a slight thing, nonsense అల్పము, స్వల్పము, కొంచెము, కాస్త. lendme a * నాకు కొంచెమియ్యి. he spent all his time in *s వాడి కాలమునంతావృథాగా పోగొట్టినాడు. is this a * ? ఇది స్వల్పము కాదు. for such a * ఇంతకొంచెమునకు, యింత స్వల్పమునకు. he paid but a * for the cloth ఆ గుడ్డకు వాడు యిచ్చినది కొంచెమే. this house is a mere elegant * యీ యిల్లు వట్టి సొగసేగాని పనికిమాలినది. a * kind of food ఆహారభేదము.
Trifler n s పనికిమాలిన మాటలాడేవాడు, వ్యర్థముగా ప్రొద్దుబుచ్చేవాడు.
Trifling n s పనికిమాలినమాట, లేనిపోని పని, నిర్థకమైన పని.
Trigger n s of a gun తుపాకి గుర్రము పడేటట్టుగా అదిమే తుపాకి కట్టే కింది బిస.
Triglott n s a book written in three languages త్రిభాషగ్రంథము.
Trignometry n s the measuring of triangles మహాగణితములో వొక భాగము.Drz. says త్రికోణ వస్తు పరిమాపణ విద్య, త్రికోణమును కొలిచే శాస్త్రము.
Trigon n s a triangle త్రికోణము.
Trigonometrical adj త్రికోణ వస్తువులను కొలిచే శాస్త్ర సంబంధమైన.
Trilateral adj having three sides మూడు పక్కలు గల.
Trill n s a quaver, shake of the voice in singing or of the sound ofan instrument కలస్వనము, స్వరము యొక్క కంపనము, రవ, కులుకు.
Trilling part,uttering with a quaveror shake కలస్వనమయిచ్చే,రవలుపలికే,* notes కలస్వనములు, మధుర స్వనములు, రవలు పలికె స్వరములు.
Trillion n s వెయ్యిలక్షలు.
Trim n s dress, state, condition వేషము, అలంకారము, స్థితి, అవస్థ, దశ.
Trimly adv nicely, properly ఒప్పుగా, ముద్దుగా, సిద్ధముగా.
Trimmed adj put in good order; dressed; ornament; clipped; shaved :balanced ; rebuked సవరించబడ్డ, దిద్దబడ్డ, అలంకరించబడ్డ, కత్తిరించబడ్డ, గభరగబడ్డ,డోలాయమానపడే, చీవాట్లు పెట్టబడ్డ, గదమాయయించబడ్డ.
Trimmer n s ఈ మతమున్ను గాక అ మతమున్నుగాక వుభయ భ్రష్టత్వముగావుండేవాడు.
Trimming n s ornamental appendages to a garment, as lace ribbons,and the like వస్త్రానికి అలంకారార్థముగా పెట్టి కుట్టే సరిగఠ గోటు నాడా మొదలైనది.he gave them a hand some * వాండ్లను బాగా చీవాట్లు పెట్టినాడు, గద్దించినాడు.
Trimness n s neatness విలక్షణము, గరాగరిక. the state of being close andin good order క్రమము, యేర్పాటు, సన్నాహము.
Trine n s an aspect of plants placed in three angles of a trigon, inwhich they are supposed by astrologers to be eminently benignత్రికోణముగా వుండేనక్షత్ర త్రయము, ఇది జ్యోతిశ్శాస్త్రములో వచ్చే మాట.
Trinity n s త్రిత్వము, మూర్తిత్రయము the Hindu * త్రిమూర్తులు. Drz. says ఈశ్వరత్రిత్వభావము, త్రైకత్వము. the Bangali prayer book says త్రిత్వము.
Trinity-house n s an institution in london వర్తకమును అభివృద్ధి చేసే వొకకార్ఖానా, యిందులో వాడ వాండ్ల వ్యాజ్యములను విచారించే న్యాయాధి పతులు విచారణనుజరిగిస్తారు.
Trinket n s a jewel; a toy, a thing, or furniture of little value నగ,పిల్లలు ఆట్లాడుకొనే సామాను, అల్ప వస్తువు. It is a mere * ఇది వట్టి పనికిమాలినవస్తువు. *s worth of a thousand rupees వెయ్యి రూపాయల నగలు. aconjure's *s మంత్రగాడు పెట్టుకొనే సామాను. *s నగానట్ర, గుల్లాగుర్ర. worthless*s పనికి మాలిన సొమ్ములు.
Trio n s three; a piece of music requiring three performers మూడు,ముగ్గురుకూడి పాడేటి. a * of fools ముగ్గురు పిచ్చివాండ్లు. the * ఆ ముగ్గురు, ఇదియెగతాళి మాట.
Trip n s a stumble కాలు జారడము, స్ఖలనము, తప్పడము, జారడము, జరగడము.this was a * of the tongue యిది నోరు జారి వచ్చిన మాట. there is a * in thisaccount యీ లెక్కలో వొక తప్పు వున్నది. a short journey స్వల్ప ప్రయాణము, నడ,తడవ. the cart made four *s ఆ బండి నాలుగు తడవలు పోయివచ్చినది. the boatmade three *s ఆ పడవ మూడు తడవలు పోయివచ్చినది. he took a * toConjeveram కంచికి వొక ప్రయాణము పోయివచ్చినాడు.
Tripartite adj having three corresponding parts or copies మూడుప్రతులుగా వుండే, పరస్పరం వ్రాసుకోబడ్డ. indentures * మూడు ప్రతులుగా వ్రాసి ముచ్చిలి కాలు.
Tripe n s the intestines; the guts పేగులు.
Triphthong n s a coalition of three vowels to form one sound; as,eye (sounded as I :) or in French eau : which three are sounded asone letter O మూడు అచ్చులు కలిసి పుట్టే వొక శబ్దము.
Triple adj threefold; consisting of three conjoined మూడింతలైన,మూడువిధములైన * headed త్రిశిరస్కుడైన. this was a * reward యిది మూడువిధములుగా వుండే బహుమానము. a * crown వొకటి మీద వొకటి మూడుగా వుండేకిరీటము. his relations, his religion, and his trade formed a * tie వాని చుట్టములు వాని మతము వాని వృత్తి అనే త్రివిధ సంబంధము కలిగినది.
Triplet n s three verses rhyming together మూడు చరణములు గలశ్లోకము, మూడు పాదములు గల పద్యము.
Triplicane n s ( a part of Madras so called by the English )తిరువల్లిక్కేణి.
Triplicate adj ఒకటే సంగతిని గురించి పేళ్ళు మాత్రము మార్చి ముగ్గురి పేరిటమూడు ప్రతులు వ్రాసిన. a document written in * వొకటే సమగతిని గురించి ముగ్గురిపేరిట మూడుగా వ్రాసిన దస్తావేజు.
Triply adv త్రివిధములుగా, ముమ్మారుగా. this is * unlawful ఇది ముమ్మాటికిఅన్యాయము. * fertile ముక్కారులు పండే.
Tripod n s a seat with three feet ముక్కాలిపీట.
Tripoly n s a sharp cutting sand మెరుగు యిసుక.
Tripos n s ప్రశ్న, సమస్య.
Tripping adj quick; nimble వడిగల, త్వరయైన. * accents రవలు, కులుకు. *steps వడిగా పెట్టే అడుగులు, త్వరగా నడిచే నడ.
Trippingly adv సరసర, బిరబిర, వడిగా, త్వరగా.
Trireme n s a galley or vessel with three benches or ranks of oarson a side ఒక విధమైన పెద్ద పడవ.
Trisyllable n s మూడు అక్షరములు గల శబ్దము.
Trite adj worn out; common; not new పాతగిలిన, జబ్బుపడ్డ, లోకరూఢియైన,వింతకాని. a * story అందరు యెరిగిన కథ, అనగా వింత లేనిది. that is a * sayingఅది కొత్త మాట కాదు. it is a * observation అది వాడుకగా అనే మాట, లోకరూఢిగావుండేమాట.
Triteness n s staleness; commonness పాతతనము, వింతలేనిది, సామాన్యత.from the * of this saying ఇది లోకరూఢిగా చెప్పేమాట గనక, యిది విని వినివుండేమాట గనక.
Tritheism n s the opinion which holds three distinct gods ముగ్గురుదేవుండ్లు కద్దనే మతము.
Triton n s a sea god; half man and half fish సగము మనిషి సగము చేపగావుండే సముద్ర దేవత.
Triturated adj నూరిన, నూర్చిన.
Trituration n s నూరడము.
Triumph n s pomp for success, pomp with which a victory ispublickly celebrated జయము, గెలుపు, జయోత్సవము, జయోత్సాహము,జయించినవాడు వొడ్డోలగముగా వూరేగడము. the * of Adonis శశాంక విజయము. thiswas a great * over their pride దీనివల్ల వాండ్లకు గర్వ భంగమైనది. patience isa * over passions శమనము పంచేంద్రియములకు భగ్నకారి.
Triumphal adj జయమును గురించిన, జయ సంబంధమైన. a * processionజయోత్సవము. a * arch జయోత్సవములో కట్టిన తోరణము.
Triumphant adj victorious జయించిన, గెలిచిన. he rode * through the cityజయమును పొంది వొడ్డోలగముగా ఆ వూరిగుండా పోయినాడ. this was a * proofయిది దివ్యమైన వుదాహరణ.
Triumphantly adv జయోత్సాహము గలవాడై దివ్యముగా. he sat * in publicవాడు వొడ్డోలగముగా కూర్చున్నాడు.
Triumvirate n s a coalition or concurrence of three men ముగ్గురుశూరులుగా కూడి చేసిన ప్రభుత్వము.
Triune adj త్రైకమైన.
Trivet n s any thing supported by three feet ముక్కాలుపీట. right as a *స్థిరమైనది, దృఢమైనది, కదలనిది, చలనము లేనిది, ముక్కాలిపీట వలె నిబ్బరముగావుండేటిది.
Trivial adj trifling, small, inconsiderable స్వల్పమైన, కొద్ది, కొంచెపాటి,విముఖ్యమైన. the * or vulgar name of a herb ఒక మొక్కుకు గ్రామ్యమైన పేరు.
Trochee n s ఛందస్సులోగలం, అనగా వొక గురువు వొక లఘువుగల గణము.
Trod,Trodden past participle of the verb ToTread తొక్కిన the new road is not yet trodden smooth యీ కొత్త మార్గము యింకా నడిచి అరగలేదు
Trode past tense of To Tread
Troglodyte n s ఒక దేశస్థుల నామము వీండ్లు భూమిలో తొవ్విన గుహలలో నివాసముచేసేది.
Troinbands n s the militia కట్టుబడి వాండ్లు.
Troinbearer n s అనుచరుడు, సహచరుడు, వెంట వచ్చేవాడు.
Trollop n s a dirty vile woman తొత్తు, యేబ్రాసిలంజ.
Trollopping adj base, mean, nasty, contemptible దిక్కుమాలిన, తుచ్ఛమైన,వ్యర్థమైన. (This word is used by Jonathan Oldbuck in his first speech.)
Trombone n s a trumpet పెద్దతుత్తార. like a death trumpet తారవంటి వొకతుత్తార.
Troop, Troops n s. a company గుంపు, దళము, సైన్యము. a * of horseగుర్రపు స్తోమము. *s of friends బంధు సమూహము.
Trooper n s a horse soldier గుర్రపు రవుతు, తురుపు సవారు.
Trope n s a figure of rhetoric గౌణీవృత్తి. change of a word from itsoriginal signification : as "the clouds foretell rain, instead offoreshew rain " ( Johnson ) చిత్రప్రయోగము, భావార్థము, గభిర్తార్థము.
Trophied adj adorned with trophies శృంగారించిన, జయప్రకాశికచిహ్నవిశిష్టమైన, యుద్ధ జయ చిహ్నవిభూషితమైన.
Trophy n s something shown or treasured up in proof of victoryజయసూచక చిహ్నము, బలము చేత శత్రువు వద్దనుంచి పెరుక్కొన్న వస్తువు.
Tropic n s the line at which the sun turns back, of which the northhas the * of Cancer, and the south the * of Capricorn ఉత్తర దాక్షిణాయనసీమ, తత్సూచక రేఖ, యెండ మెండుగా వుండే దేశము. those who live within the *s ఉష్ణదేశస్థులు.
Tropical adj placed near the tropic ఉత్తర దక్షిణాయన సీమాస్థితమైన,ఉష్ణదేశోత్పన్నమైన. * countries యెండ మెండుగా వుండే దేశములు. under a * sunయెండ అధికముగా వుండే ప్రదేశములో. * fruits ఉష్ణదేశములో పండే పండ్లు. *diseases ఉష్ణదేశములో కలిగే వ్యాధులు.
Tropology n s రూపకాలంకారము.
Troth n s fidelity సత్యము, ప్రతిజ్ఞ. thereto I plight thee my * వివాహకాలములో స్త్రీ పురుషులు యిది సత్యము అనే మాట. also Troth! అనగా సుమీ,సుండి, లెండి.
Trotter n s పరుగెత్తే గుర్రము.
Trotters n s గొర్రెకాళ్ళగిట్టలు.
Trouble n s తొందర, శ్రమ, సంకటము, కష్టము, బాధ. he is in * వాడుశ్రమపడుతున్నాడు. my *s are over నా తొందర తీరినది. will you take the * tocome to his house ? వాని యింటి దాకా వచ్చే శ్రమను యెత్తుకొంటారా.
Troubled adj శ్రమపడ్డ, తొందరపడ్డ. at these words he was * యీ మాటలకునిండా వ్యాకులపడ్డాడు, యీ మాటలకు నిండా ఆశ్చర్యపడ్డాడు. * water కలిశిన నీళ్లు.being * with headache she laid down తలనొప్పి తొందరచేత పండుకొన్నది.
Troubledly adv వ్యాకులముగా, తొందరగా.
Troubler n s తొందరపెట్టేవాడు, శ్రమపెట్టేవాడు.
Troublesome adj తొందరైన, శ్రమయైన, కష్టమైన. a * boy దుష్టపిల్లకాయ.
Troublesomeness n s తొందర, ఇబ్బంది, సంకటము.
Troublous adj ఆయాసకరమైన, తొందరైన, వ్యాకులకరమైన.
Trough n s any thing hollowed and open longitudinally on the upperside గాడి, దోనె. in the * of the sea యీ అలకు నడమ గాడివలె వుండే పల్లములో.
Trousers n s ఇజారు, చల్లడము, పైజామా.
Trousseau n s ( French) the bride's wardrobe &c. పెండ్లి కూతురికి యిచ్చేవస్త్ర భూషణములు.
Trout n s a kind of fish జల్లచేప, లేక బేడిస, చేపవంటి వొక మత్స్యము.
Trover n s an action for goods found ఒకని వద్ద అగుపడ్డ సొత్తును గురించితెచ్చే వ్యాజ్యము.
Trowel n s కొల్లేరు. he spread the mortar with a * కొల్లేరుతో గచ్చునుసరిదినాడు.
Trowsers n s ఇజారు, పైజామా.
Troy-weight n s the weight by which gold and silver, medicines,bread are weighed మందులు బంగారు వెండిరొట్టెలు వీటిని తూచడమును గురంచినవొక లెక్క. In this weight, 20 grains = a scruple, 3 scruples = a dram, 8 drams - an ounce, and 12 ounces = one pound ( Johnson. )
Truant adj idle, lazy; loitering సోమారియైన, వూరుతిరిగే. a * boy పల్లెకూటానికి పోకుండా వూరి మిద తిరిగే దుష్ట పిల్లకాయ.
Truce n s a cessation of hostilities సంధి, యుద్ధము లేకుండానిలిచివుండడము, కొంత కాలము వరకు యుద్ధము చేయకుండా వుందామని చేసుకొన్ననియమము. they made a * for ten days యుద్ధాన్ని పది దినాలు నిలిపిపెట్టినారు.they quarrelled for sometimes but at present there is a * కొన్నాళ్లుపోట్లాడుతూ వుండినారు గాని యిప్పట్లో కొంచెము నిమ్మళించి యున్నారు. a * to thesereflections ! యీ ఆలోచనలు యింత మట్టుకు చాలును.
Truce-breaker n s నియమోల్లంఘనము చేసినవాడు, A+ పాటి తప్పేవాడు.
Trucient adj cruel క్రూరమైన, నిర్దయాత్మకుడైన.
Truck n s సాటా కోటిబేరము, వొక సరుకును యిచ్చి దానికి ప్రతి మరివొక సరుకునుతీసుకోవడము. a little carriage సామాను తీసుకొని పొయ్యే వొక విధమైన బండి.
Trucklebed n s a little bed చిన్న మంచము.
True adj నిజమైన, సత్యమైన, యథార్థమైన, నిబద్ధియైన, నిశ్చయమైన, వాస్తవ్యమైన.he is a * poet వాడు సాక్షాత్ కవి. those of the * faith సన్మతస్థులైన. this is a *saying ఇది సద్వాక్యము. this is a * pearl, the other is false ఇది మంచిముత్యము అది చిప్ప ముత్యము. this is * gold, the other is not ఇది అచ్చమైన బంగారు అది కాకిబంగారు. this was * generosity, the other was mere waste ఇది నిజమైన దాతృత్వము అది పాడులో వేయడము, ఇది సద్వినియోగము అది దుర్వినియోగము. honest పెద్దమనిషియైన. these are the * men and those are the rogues వీండ్లు పెద్దమనుష్యులు వాండ్లు దొంగలు. she was ever * to him, అది ఆయన వద్ద యెప్పుడున్ను సత్యముగా నడుచుకొంటున్నది, అనగా అది పతివ్రతగావున్నది. exact సరియైన. this level is not * యీ నీరు మట్టపలక కరారైనది కాదు, దీనితో నీరు మట్టము కట్టితే సరిగ్గా వుండేది లేదు. these scales are not * యీ త్రాసు సరిగ్గా వుండలేదు అనగా యీ త్రాసులో వారడి వున్నది. his words were made * వాడి మాటలు నిజమైనవి. he has spoken to them; * ! but they will not hear వాడు వాండ్లతో మాట్లాడినదివాస్తవ్యమేగాని వాండ్లు వొప్పరు. they are his brothers, * ! but will they help him ? వాండ్లు వాని తోడ బుట్టినవాండ్లయినది నిజమే గాని వానికి వాండ్లు సహాయముచేతురా. a * copy యథామాతృకగా వ్రాసిన ప్రతి. he is a * born Englishman వాడు నిజమైన ఇంగ్లిషువాడు. In astronomy the * place of a planet స్ఫుటగ్రహము.
Truebred adj of a right breed సంకరజాతి కాని, అచ్చమైన.
Truehearted adj honest; faithful ధీరుడైన, ధైర్యశాలయైన, నిష్కపటమైన.
Truelove n s a sweetheart ప్రాణనాయకి, ప్రాణనాయకుడు, ఇది నీచమాట. she ishis * అది వాని ప్రాణనాయకి.
Trueloveknot n s lines drawn through each other with manyinvolutions, considered as the emblem of interwoven affectionయంత్రభేదము.
Truest adj అతి నిశ్చయమైన, మిక్కిలినిజమైన. they are your * friends whoshow you your errors నీ తప్పులను నీకు తెలియచేసే వారే నీ స్నేహితులు.
Truffle n s a subterraneous vegetable production a kind ofmushroom, of a fleshy, fungous structure and roundish figure; anesculent substance, much esteemed మంటికింద వుద్భవించే వొక శాక భేదము.
Truism n s a self-evident and undeniable truth సర్వసమ్మతమైన వాక్యము,అందరున్ను వొప్పుకోతగ్గమాట, లోక ప్రసిద్ధము. it is a mere * that a man mustpay his debts ప్రతిమనిషిన్ని తన రుణమును చెల్లించవలె ననేది అందరున్నువొప్పుకోతగ్గమాటేను. " Quly. Rev. Oct. 1844 page 491 says " Dr. Arnoldhad greatly modified the truism ( Or FALSISM ) about ( history )philosophy teaching by example " Here it implied vulgar notion, i.e.లోక ప్రతీతి -- It is a * that all women are curious, talkative and fickle;whereas it is not true సిద్ధాంతము సరే గాని వాస్తవ్యము కాదు = లోక ప్రతీతి =వదంతి, అందరు చెప్పేది.
Trull n s తొత్తు, లంజ.
Truly adv నిజముగా, వాస్తవ్యముగా. he is * a poet వాడు కవీశ్వరుడే. * I don'tcare నాకు చింత లేదు సుమీ. your's very * అంతర్యానికి తేవలెను, మనసుకుతేవలెను, ఇది జాబులో కడాపట వ్రాశే మాట.
Trump n s తుత్తార, వూదే కొమ్ము. a winning card కాకితాల ఆటలో త్రుంపు అనేకాకితము.
Trumpery n s nonsense, empty stuff వట్టి పితలాటకము, వట్టి బూటకము, లేనిపోని పని. a * reason పనికిమాలిన హేతువు.
Trumpet n s కొమ్ము, బాంకా, శృంఖము. the long *s used at Hindufunerals తారలు. an ear * (or simply) a * మాటలు వినడమునకై చెవిటివాడుచెవినపెట్టుకొనే చిన్న తుత్తార. See Cowper 14th Jan 1786.
Trumpeted adj ప్రకటన చేయబడ్డ, చాటించబడ్డ.
Trumpeter n s కొమ్ము వూదేవాడు, చాటించేవాడు.
Trumpet-flower n s ఫాటలీపుష్పము, కలిగొట్టు పువ్వు, పాదిరిపుష్పము. Bignoniachelonoides Ains 2.272. కృష్ణవృంత.
Trumpet-tongued adj జంబూరా గొంతుగల.
Truncated p|| broken,cutoff మొండియైన, a * pillar విరిగిన స్తంభము,మొండి స్తంభము.
Truncheon n s a staff of command, a club గద, ఆజ్ఞాదండము, వేత్రము.
Trunk n s of an elephant తొండము, శుండము, గజహస్తము. of a treeస్తంభము, మోడు, అడుగు మొద్దు. the body without the limbs or head చేతులుకాళ్ళు తల లేని మొండెము. the main body of any thing as the * pipe తల్లిగొట్టము. a chest for clothes ; sometimes a small chest; commonly linedwith paper బట్టలపెట్టె.
Trunkey n s a jailor చెరశాల బంట్రోతు, చెరశాల బీగాలు పెట్టుకొని వుండే బంట్రోతు.
Trunnions n s పిరంగిదిండ్లు, అనగా బండియొక్క పారులో పెట్టడమునకై పిరంగికిరెండు పక్కలా వుండే గుబ్బెలు.
Trust n s charge or care పరము, వశము, స్వాధీనము, నమ్మిక, విశ్వాసము,ప్రత్యయము. the * they repose on you వాండ్లు నీ మీద వుంచి వుండే నమ్మకము. togive goods on * నమ్మకము మీద యిచ్చుట. I took these statements on *కూలంకషముగా విచారించకుండా వూరికె చెప్పిన దాన్ని ఆమోదించినాను. he tooknothing on * ప్రతి సంగతినిన్ని బాగా విమర్శించకుండా ఆమోదించలేదు. breach of *విశ్వాస ఘాతకము, స్వామి ద్రోహము, నమ్మి యిచ్చి పెట్టినదాన్ని నోట్లో వేసుకోవడము. he holds the estate in * ఆ యాస్తి వాని పరంగా వున్నది.
Trusted adj నమ్మబడ్డ, విశ్వసించబడ్డ.
Trustee n s a person to whom property is legally committedఅప్పగింత పెట్టబడ్డ, సొత్తును పెట్టుకొని యుండేవాడు.
Trustiness n s honesty; fidelity; faithfulness పెద్దమనిషితనము,నమ్మకము, సత్యసంధత్వము, ప్రామాణికము. on account of the * of the dogకుక్కలను యెంతకైనా నమ్మవచ్చును గనక. give me some proof of his * వాడియోగ్యతను గురించి యేదైనా వొక వుదాహరణ చూపు.
Trustworthiness n s ప్రామాణికత్వము, నాణ్యము.
Trustworthy adj విశ్వసనీయమైన, ప్రామాణికమైన, నమ్మతగ్గ.
Trusty adj honest faithful నమ్మతగిన, విశ్వసించతగిన. a * man పెద్దమనిషి. a * sword మంచి ఖడ్గము.
Truth n s నిజము, యథార్థము, సత్యము, వాస్తవ్యము, తథ్యము, నిబద్ధి, తత్వము.this is a primary * ఇది సిద్ధాంతము, సూత్రము. to tell you the * I don'tbelieve him ముఖ్యముగా నేను అతని మాట నమ్మను. cannot you tell me the * ?జరిగినది జరిగినట్టు చెప్పలేవా. God's * రామ వాక్యము, వేద వాక్యము. in * of a *నిజముగా, సత్యముగా, తథ్యముగా, న్యాయతః, ముఖ్యముగా. " It may be said,what is humility ? a British Peer put this question to Wesley; herepleid My lord, Humility consists in a man's thinking the truth abouthimself. " Rom. XII. 3.
Truthful adj సత్యసంధుడైన, మాయలు లేని, నిష్కాపట్యమైన, ప్రామాణికము గల.
Truthfully adv యథార్థముగా, సత్యసంధుడుగా, పెద్దమనిషిగా.
Truthfulness n s పెద్దమనిషితనముగా, యథార్థ్యము, సత్యత.
Trying adj. ఉపద్రవకరమైన, హానికరమైన,తొందరను,కలగచేసే,ఆయాసకరమైన, *circumstances దురవస్థ. a * climate దేహానికి వుపద్రవకరమైన దేశము.
Trysting place n s సాంకేతిక స్థలము.
Tsar or Szar or Tzar it is pronounced చూరు or త్సారు,రషియాదేశపు సార్వభౌముడు,చక్రవర్తి
Tub n s తొట్టి. a meal * పిండి పోసి పెట్టే తొట్టి. a tale of a * పిచ్చిసుద్దులు. Ainswroth says Anilis fabula.
Tube n s a pipe గొట్టము, కోవి, నాళము.
Tuber n s a knob in roots గుండ్రని గడ్డ, కందము.
Tubercle n s గడ్డ, కురుపు. a pimple మొటిమ.
Tuberose n s a flower ఒక పుష్పము.
Tubular adj resembling a pipe or trunk గొట్టముగా వుండే, నాళమురీతిగావుండే.
Tuck n s a kind of fold in a dress మడుపు. there are three *s in hergown ఆ దొరసాని పావడలో మూడు మడుపులు పెట్టి కుట్టి యున్ణది. the * in front ofa Hindu woman's dress దీన్ని అరటికాయ, లేక, మామిడికాయ అంటారు. the five*s used in a bramin's dress పంచకచ్ఛలు.
Tucker n s రవిక, కంచుకము.
Tuesday n s మంగళవారము, అంగారకవారము, జయవారము.
Tuft n s a number of threads or ribbands, flowers, leaves, or anysmall bodies, joined together గుప్పెడు, పిడికెడు. bramins shave theirheads retaining a * in the back బ్రాహ్మణులు జుట్టు విడిచిపెట్టి కడమగొరిగించుకొంటారు. a * of flowers పూలగుత్తి. a * of feathers పిడికెడు యీకెలు.a * of feathers forms the crest of a bird శిఖ, చూడము, తురాయీ. a * ofgrass or hair పిడికెడు కసువు, లేక, వెంట్రుకలు. a cluster వొక గుంపు. a * oftrees గుంపుగా వుండే కొన్ని చెట్లు.
Tufted adj growing in tufts or clusters శికగల, జుట్టుగల, గుంపుగా వుండే.this bird is * with white hair యీ పక్షి తల మీద తురాయివలె కుచ్చుగా తెల్లవెంట్రుకలు వున్ణవి.
Tug n s pull ఈడ్పు, లాగు. a boat built for the purpose of pullinganother boat along మరి వొక పడవను లాగేటందుకై చేసిన పడవ.
Tuition n s guardianship సంరక్షణ, పోషణ. instruction ఉపదేశము, శిక్ష.
Tulip n s a flower చిత్రవర్ణములు గల వొక పుష్పము.
Tulip tree n s గంగరావి చెట్టు. this is the name given to the trees alongthe Mount Road.
Tumble n s a fall జారడము, జారిపడడము, దొర్లడము, పొర్లడము. thewrestlers tried a * వొకలాగు వేసినారు. as of pigeon లాగులు. as those ofa tottering infant విద్దెములు.
Tumbler n s he who tumbles దొమ్మరివాడు, జెట్టివాడు. a glass పెద్దగిన్నె. Inold days a * was made of silver చెంబు.
Tumbling n s a certain play దొమ్మరి ఆట. feats in * లాగులు, పల్లటీలు,కన్నాతలు.
Tumbrel n s a kind of cart బండి, దండుసామాను బండి. a dung cart కుప్పబండి.
Tumefaction n s swelling ఉబ్బు, వాపు.
Tumid adj ఉబ్బిన, వాచిన.
Tumor n s గడ్డ, కరుడు, నెరి, ఉబ్బు. venereal * మేహగడ్డ.
Tumult n s commotion గలిబిలి, అల్లరి. disturbance or agitation of amultitude కలత, కలహము, గల్లత్తు, రచ్చ. the * of love విరహము.
Tumultuous adj అల్లరిగా వుండే, సందడిగా వుండే, రచ్చగా వుండే, దొమ్మిగా వుండే.
Tumultuously adv అల్లరిగా, సందడిగా, రచ్చగా.
Tumultuousness n s అల్లరి, సందడి, రచ్చ.
Tumulus n s an artificial hillock raised over those who were buriedపుర్వ కాలమందు పాతి పెట్టిన వాండ్ల మీద యేర్పరచిన తిప్ప.
Tun n s a large cask, the measure of four hogsheads పెద్ద పీపాయి.
Tunable adj harmonious సరళమైన, శ్రావ్యమైన.
Tunably adv సరళముగా, శ్రావ్యముగా.
Tune n s రాగము, సంగీతము, గానము. when the band is in * మేళముకుదిరినప్పుడు. out of * సుతితప్పిన, వికారమైన. to the * of a hundred rupeesనూరు రూపాయల పర్యంతము, నూరు రూపాయల కాడికి.
Tuneful adj harmonious సరళమైన, శ్రావ్యమైన.
Tunefully adj సరళముగా, శ్రావ్యముగా.
Tuneless adj విరసమైన, వికారమైన.
Tunic n s an under garment worn by both sexes in ancient Rome andthe East reaching to or below the knees కట్టుబట్ట, లోని వుడుపు.
Tunicle n s పొర. the * of the eye కంటి పొర.
Tunnage n s the contents of a vessel measured by the tun కేవు. SeeTonnage.
Tunnel n s a pipe or tube గొట్టము. the shaft of a chimney పొగగూడు. aroad dug through a hill or under a river వొక కొండలో తొలిచిన, లేక, వొక యేటికింద సురంగముగా చేశిన మార్గము.
Tunny n s a certain fish గొరక చేపవంటి వొక చేప.
Turban, Turband n s. పాగా, తలపాగా.
Turbid adj not clear మడ్డి, కలకబారివుండే, బురదగావుండే, కలుషమైన.
Turbidness n s బురదగా వుండడము, అస్వచ్ఛత. from the * of the waterనీళ్ళు నిర్మలముగా వుండ నందున.
Turbinated adj twisted; spiral, like a shell ఆ వర్తకములు గల.
Turbith mineral n s the yellow subsulphate or disulphate of mercuryపసుపుపచ్చగా వుండే వొక విధమైన రసభస్మము.
Turbith root, or Turpethroot n s. తెల్ల తేగడ వేరు.
Turbot n s a certain delicate fish ఒక చేప పేరు, మేవ చేప, చందువాయి,మాగ, బొచ్చె. The pomflet [ thus spelt in Brit. Ind. Analyzed vol. 3. p. 659, printed about 1790] " much resembles the * if it be not the same in miniature. "
Turbulence n s tumult; confusion కలత, గత్తర, దౌర్జన్యము, అల్లరిపని కలహము,దొమ్మి.
Turbulent adj అల్లరిగావుండే, గలిబిలిగా వుండే, దౌర్జన్యముగా వుండే.
Turbulently adv tumultuously అల్లరిగా, తొందరగా, దొమ్మిగా, కలతగా.
Turf n s a clod covered with grass గరిక చెక్క, కరుడు. a part of thesurface of the ground పచ్చికపట్టు, గరికనట్టు. he is on the * i.e. he is agambler regarding races గుర్రపు పందెపు పనిలో ప్రవర్తించి యున్నాడు. he was a patron of the * గుర్రపు పందెముల పరిపాలకుడు.
Turgid adj swelling, foolish ఉబ్బిన, వాచిన.
Turgidity n s ఉబ్బు, వాపు.
Turk n s తురకవాడు. vulgArly, a cruel wretch అతి క్రూరుడ, పచ్చి తురకవాడు.as proud as a * మహాగర్వి.
Turkey n s a bird సీమ కోడి.
Turkish adj తురక సంబంధమైన. a * dress తురక వేషము.
Turkois n s a mineral, called also Calaite, brought from Persia; of apeculiar bluishgreen color. It is susceptible of a high polish, and isused in jewelry, and when highly colored is much esteemed as a gemనీలమణి.
Turmeric n s పసుపు, హరిద్ర.
Turmoil n s trouble; disturbance శ్రమ, అల్లరి, ఆయాసము, తొందర.
Turn n s తిరగడము, సారి, తేప, మాటు, ఆ వృత్తి వంతు, కృత్యము, క్రియ, పని. hedid me a bad * నాకు అపకారము చేసినాడు. matters took a bad * పనిచెడిపొయ్యేగతిగా వున్నది. matters took a good * ఆ పని దోవకు వచ్చినది. he didme a good * వాడు నాకు వుపకారము చేసినాడు. the * the affair took ఆ పనికివచ్చిన గతి. he took as much as served his * వానికి కావలసినది యెంతో అంతతీసుకొన్నాడు. the tide is on the * యిప్పుడు పోటు సమయముగా వున్నది, పాటుసమయముగా వున్నది. the disease is on the * వ్యాధి తిరుగు ముఖముగా వున్నది,అభిముఖముగా వున్నది. this was a * of the times యిది కాలము చేత వచ్చినవైపరీత్యము. the * of an epigram పద్యము యొక్క స్వారస్యము. do you observethe * of this verse ? యీ పద్యము యొక్క శయ్య చూచినావా. he took a *and came back అట్లా తిరిగి మళ్లీ వచ్చినాడు. his * వాని వంతు. my * is to-day,his * is to-morrow నేడు నా వంతు రేపు వాని వంతు. they were all of themkings in their * వాడివాడి వంతు వచ్చినప్పుడు వాడు వాడు రాజుగా వుండినాడు.
Turncoat n s a renegade ద్రోహి.
Turned adj తిరిగిన, తిప్పిన, తరిమెన పెట్టబడ్డ. a well * saying సుశిక్షితమైనవాక్యము, సలక్షణమైన వాక్యము. a well * foot అందమైన పాదము. wood * intoearth మన్నుగా పోయిన కొయ్య. a * up nose నడ్డి ముక్కు. a silk cap * up withvelvet అంచుకు మోహములు వేసిన కుళ్లాయి.
Turner n s తరిమెన పెట్టేవాడు.
Turning n s తరిమెన పెట్టడము, తరిమెన పెట్టేపని.
Turnip n s a white esculent root తెల్లని వొక దుంప.
Turnpike n s a gate set across a road to stop travellers andcarriages till toll is paid for keeping the road in repair రుసుము రూకలుతీశే చోట బాటసారులను నిలపడమునకై బాటకు అడ్డముగా వేశి యుండే తడక, మనుష్యులుపొయ్యేటట్టుగా నున్ను పశువులు పోగూడకుండా వుండేటట్టుగా నున్ను దోవకు అడ్డముగా వేశేదిడ్డిమాను. a * road రాజమార్గము.
Turnscrew n s ఇస్కోరు ఆణిని తిప్పే ఆయుధము, మలుచుట్టును తిప్పే ఆయుధము.
Turnsole n s a plant గురుగుచెట్టు, భూరుండీ వృక్షము, తేలుమణి చెట్టు.
Turnspit n s చిన్న పొట్టి కుక్క.
Turnstile n s ఎటు తిప్పితే, అటు తరిగే యిరుకుమాను.
Turpentine n s the gum exuded by the pine గుగ్గిలమువంటి దేవదారు చెట్టుయొక్క బంక, శ్రీవాసము, వృక్షధూపము.
Turpitude n s badness, vileness, నికృష్టత్వము, అధమత్వము, క్షుద్రత. fromthe * of these acts యివి నిండా నీచ కృత్యములు గనక, యివి అతి పాపిష్ఠి పనులుగనక.
Turquoise n s మణివిశేషము, ఫిరోజారాయి.
Turret n s a little tower బురుజు మీది చిన్న గది. sometimes it signified ahut or shed in a garden గుడిసె.
Turtle n s a dove పావురాయి. a tortoise తాబేలు.
Tush interj an expression of contempt ఛీ పో అన్నట్టు కసురుకొనే మాట.
Tusk n s కోర, దౌంష్ట్ర, విషాణము. the *s of an elephant యేనుగు దంతములు,యేనుగు కొమ్ములు.
Tusked, Tusky adj కోరలుగల. a tusky elephant కొమ్ములుగల యేనుగ.
Tusker n s a boar or elephant పెద్ద పంది, పెద్ద యేనుగు.
Tussle n s struggle పోట్లాట, యత్నము.
Tut Interj a particle nothing cntempt ఛీ పో.
Tutanag n s a certain metal తుత్తినాగము.
Tutelage n s guardianship రక్షణ, పోషణము. they were in his * వారు వాడిసంరక్షణలో వుండినారు.
Tutelar adj protecting సంకరక్షించే, పోషించే. the * God యిష్టదేవుడు,యిలువేల్పు.
Tutenague n s a certain metal composed of copper, zinc, nickel, andiron తుత్తినాగము.
Tutor n s a teacher or instructor గురువు ఉపాధ్యాయులు, చదువులయ్యవారు.
Tutorage n s the authority or solemnity of a turor అధికారము, రక్షణ.
Tutty n s a sublimate of zinc or calamine collected in the furnace ఒకవిధమైన సత్తు.
Tuz n s a tuft of hair కుచ్చు.
Twaddle n s పిచ్చిసుద్దులు.
Twaddling adj జబ్బుగా మాట్లాడే.
Twain adj two రెండు, యిద్దరు. which of the * ? యిద్దరిలో యెవడు.
Twang n s ఝంకారము, ఖంగుమనే నాదము. he pronounced the word with a* that made the peopel start ఆ మాటను వాడు ఖంగుమని చెప్పినందున అందరువులికిపడ్డారు. he has a * of the hawk countenance వాడి ముఖము రవంత గరుడముఖమువలె వున్నది. there was a * of garlick in this యిందులో రవంత వెల్లుల్లివాసన వస్తున్నది.
Twas contractedfromitwas
Tweezers n s చిమటా.
Twelfth adj పన్నెండో.
Twelfthday n s ఖ్రిష్టుమస్సు పండుగ పోయిన పండ్రెండో నాడు వచ్చే వొక పండుగపేరు.
Twelve adj పన్నెండు. * men పన్నెండు మంది. * o' clock మధ్యాహ్నము.
Twelve month n s a year సంవత్సరము. About a twelve month ago, the house was sold ఆ యిల్లు అమ్మి సంవత్సర మవుతున్నది.
Twelvemonth n s సంవత్సరము.
Twelvepence n s or one shilling అర రూపాయి.
Twelves n s duodecimo, a book in which a sheet is folded intotwelve leaves చిన్న కాకితపు పుస్తకము వొక తావు కాకితమును పండ్రెండు పత్రములుగామడిచి చేయబడ్డ పుస్తకము.
Twelvescore n s ఇన్నూటనలభై.
Twentieth adj ఇరువయ్యో. on the * యిరువయ్యో తేదిన.
Twenty adj ఇరువై, వింశతి. the 24 hours అరువై గడియలు. 25 as a quarterof a 100 పాతిక. * yards పది బారలు.
Twere contracted from It were
Twice adv రెండు మాట్లు, రెండు తేపలు. * as much రెండింతలు, రెట్టింపుగా. hecalled * రెండు పిలుపులు పిలిచినాడు. bramins are styled by themselves *born బ్రాహ్మాణులు ద్విజులు అంటారు.
Twig n s a small shoot of a branch : a switch బరికె, చివుకు, మల్లె, చువ్వ.limed *s జిగటాంట్లు, అనగా పక్షుల కాళ్ళకు అంటుకొని యెగరకుండా వుండేటట్టువేటగాండ్లు పెట్టే బంధనగల పుల్లలు.
Twilight adj జీకటిగా వుండే, సందెచీకటిగా వుండే.
Twinborn adj born at the same birth అమడలుగా పుట్టిన, జతగా పుట్టిన.
Twine n s దారము, సూత్రము, పురి. a twist మెలి.
Twinge n s పోటు, సళుపు, నొప్పి.
Twinkle, Twinkling n s. a sparkling intermitting light తళతళ, తళుక్కు,రెప్పపాటు, నిమిషము. in a * క్షణములో.
Twins n s children born at the same birth అమడలు, అమడబిడ్డలు, కవలవాండ్లు. his twin brother వాడితో కూడా అమడగా పుట్టినవాడు. twin almonds జంటబాదం కాయలు. these are twin schemes వొక జతగా వుండే యుక్తులు. geminiమిధునరాశి.
Twirl n s rotation : circular motion తిరగడము, సుడి, వట్రువసుడి.
Twist n s మెలి, మెలికె, పురి. * and turnings తిరుగుళ్ళు.
Twisted adj crooked మెలివేయబడ్డ, వంకరైన, వికారమైన.
Twitch n s ఈడవడము, పెరకడము, మెలి, పోటు, శూల. he had a * of goutవాడికి వాయువు కనుపించినది. a * conscience made him tell the truth తనతప్పు తన మనసుకే తాకి నందున నిజము పలికినాడు.
Twitter n s కీచుకీచుమనడము. or slight giggle ( a titter ) ముసిముసి నవ్వు.
Twittering n s కీచుకీచుమనడము. or giggling చిరినవ్వు.
Twixt Contraction of the word Be twixt మధ్య,నడమ
Two adj రెండు, యిద్దరు. * hundred యిన్నూరు. in a day or * రేపు యెల్లుండిలో.a day or * ago నిన్ననో మొన్ననో.
Twoedged adj ఇరువాయిగల, రెండు ధారలు గల, రెండు పక్కలాకోసే.
Twofold adj రెండింతలైన, ద్విగుణమైన.
Two-handed adj పొడుగుపిడిగల. a * sword పట్టాకత్తి. a * argumentఅటుయిటు పనికివచ్చే యుక్తి.
Twopence n s నాలుగు పయిసాలకు మారే వొక నాణ్యము.
Tyburn n s లండన్ పట్టణము దగ్గిర వుండే వొక పొలము, పూర్వము యిది శ్మశానభూమిగనక యిప్పటికిన్ని శ్మశానమనే అర్థము.
Tye n s a knot : a bond కట్టు, బంధము. See Tie n.s.
Tyger n s పులి. See Tiger.
Tyke n s a dog కుక్క ( ఇది తిరస్కారమైన మాట.)
Tympanum n s the drum, of the ear చెవిలో వుండే గూడు, శ్రోత్రేంద్రియము.
Tympany n s flatulent distention of the belly మహోదరము, కడుపువాపు.
Type n s emblem చిహ్నము, గురుతు. the * of a disease రోగలక్షణము. orinstance, example, illustration ఉదాహరణము. he is the * of a classవాండ్లకు వీడు మాదిరిగా వున్నాడు, వాండ్లందరు వీడివంటి వాండ్లే. a mark లక్షణము. aprinting letter అచ్చు అక్షరము.
Typhus fever n s కృష్ణదోషము.
Typical adj అనవాలుగా వుండే, చిహ్నగా వుండే. this is a * expression యిదిరూపక శబ్దము. the ties of the flesh is a * expression పంచేంద్రియ పాశమనేదివొక రూపక శబ్దము.
Typically adv ఆనవాలుగా, చిహ్నముగా, రూపకముగా. sinners are * prisonersof their lusts పాపులు రూపకముగా పంచేంద్రియ బుద్ధులుగా వున్నారు.
Typographer n s a printer అచ్చువేశేవాడు.
Typographical adj అచ్చు సంబంధమైన. * errors అచ్చులో పడే తప్పులు.
Typography n s అచ్చు వేశే పని.
Tyrannic adj cruel క్రూరమైన.
Tyrannical adj క్రూరమైన, కంటకమైన, నిర్దయాత్మకమైన, దౌర్జన్యమైన.
Tyrannically adv క్రూరముగా, దౌర్జన్యముగా.
Tyrannous adj arbitrary, cruel, severe, నిర్దయాత్మకమైన, క్రూరమైన.
Tyranny n s దౌర్జన్యము.
Tyrant n s క్రూరశాసనీకుడు, నిర్దయాత్మకుడు, క్రూరుడు.
Tyre n s (Indian word) for a sort of curds పెరుగు. It is Tamil "Curdled milk, curds " (Rottler.)
Tyro n s a learner అక్షరాలు నేర్చుకొనే పిల్లకాయ.

No comments:

Post a Comment