Monday, February 7, 2011

To Oppose

To Oppose v a యెదిరించుట, విరోధించుట, అడ్డముతగులుట. whyshould you * your father ? తండ్రితో యెందుకు యెదురాడుతావు.he *d his umbrella to the wind గాలికి గొడుగునుఅడ్డముపట్టినాడు. I *d my sword to his వాని కత్తికి నాకత్తిని అడ్డముపట్టినాను. tha rule *s is one ఆ సూత్రము యీసూత్రమునకు విరోధిస్తున్నది.
To Oppress v a అన్యాయముచేసుట, దౌర్జన్యముచేసుట, హింసచేసుట,వేధించుట, బాధపెట్టుట, కడగండ్ల బెట్టుట.
To Oppugn v a యెదిరించుట, అడ్డమాడుట, అడ్డగించుట.
to Ordain v a నియమించుట, నిర్ణయించుట. స్థాపించుట. they*ed him a priest అతణ్ని గురువుగా నియమించినారు. the death *edthem వాండ్లకు విధించబడ్డ చావు. (a)
To Order v a ఆజ్జాపించుట, క్రమపరుచుట, దిట్టపరచుట. he *edthese troops differently ఆ పటాళానకు వేరే వొకబందోబస్తుచేసినాడు. * my footsteps by thy word తమ చిత్తప్రకారమునక్నునడిపించండి. he *ed them out of the town వాండ్లను వూరువిడిచిపొమ్మన్నాడు. the business was *ed very well ఆ పని దిట్టముగావుండినది. well *ed దిట్టముగా వుండే, బందోబస్తుగా వుండే.బందోబస్తుగా వుండే. ill *ed అబందరగా వుండే.
To Organize v a నిమి్ం చుట, కుదుర్చుట, ఏర్పరచుట,పొందికచేసుట. he *d the rebellion వాడు యీ కలహమునుకలగజేసినాడు.
To Originate v a పుట్టించుట, ఉత్పత్తిచేసుట, కల్పించుట,కలగజేసుట.
To Ornament v a శృంగారించుట, అలంకరించుట.
To Oscillate v a వూగడము, ఆందోళన, యిటూ అటూ వూగులాడడము.his mind was in a stake of * వాడి మనసు డోలాయ మానముగావుండినది. the earth was in a state of * భూమి ముందుకు వెనక్కువూగుతూ విండినది. the swing made ten *s ఆ వుయ్యాల పది వూగులువూగినది.
To Ossify v n మాంసము యెముకవలె ఘట్టిగా కట్టుకొనుట,ఘనీభవించుట.
To Ostracise v a To banish by the popular voiceవూరు వెళ్ళకొట్టుట.
To Oust v a వెళ్ళగొట్టుట, తోసివేయుట. they *ed him fromthe appointment ఆ వుద్యోగములోనుంచి వాణ్ని తీసివేసినాడు.
To Outact v a అతిగా చేసుట.
To outarage v a దౌజ ్ న్యము చేసుట. these stories * decencyఈ కథలచేత మానము పోతున్నది.
To Outargue v a నోరెత్తకుండాచేసుట. he *d them తాను చెప్పేన్యాయములవల్ల వాండ్లు చెప్పేదాన్ని అణిచివేసినాడు.
To Outbalance v a అధికరించుట, మించుట. I *d him వాని కంటేనేను బరువుగా వుంటిని. this one reason *s all that you cansay నీవు యెన్ని చెప్పినా యీ వొక మాటలో కౌట్టుబడిపోతున్నది.
To Outbid v a పైగా అడుగుట, హెచ్చుగా అడుగుట. he outbade meవేలములో నేను అడిగిన దాని మీద హెచ్చుగా అడిగినాడు. they * eachother అహమహమికగా వున్నారు.
To Outbrave v a మించుట. beauty that *d the moonచంద్రుణ్ని తిరస్కరించే సౌందర్యము.
To Outbrazen v a యెదిరించి తిరస్కరించుట. she *ed himవాణ్ని యెదిరించి తిరస్కరించినది.
To Outdo v a మించుట. he has outdone his brother అన్ననుమించినాడు.
To Outface v a యెదిరించుట.
To Outgaze v a చూడడములో మించుట. she *d him చూడడములోవాణ్ని గెలిచినది.
To Outgo v a మించిపోవుట. he outwent me నన్ను మించిపోయినాడు. he outwent them in wickedness దుర్మార్గములోవాండ్లును మించినాడు.
To Outgrow v a యెదగడములో మించుట. he outgrew his strengthతన బలానికి మించి పెరిగినాడు అనగా అధికముగా పెరిగి నందునచిక్కినాడు. the child outgrew its clothes ఆ బిడ్డ పెరిగిని ఆవుడుపు పట్టదు.
To Outlast v a ఆటిపుచ్చుట. a silk-dress will * a cottondress గుడ్డుకన్న పట్టుకట్టు తాళుతున్నవి. my patience *ed hisవాడికి విసికినది నాకు విసకలేదు, నేను తాళినాను వాడు తాళలేకపోయినాడు.
To Outleap v a దుమకడములో మించుట, యెక్కువగా దుముకుట.
To Outlive v a or survive వొకడు ఇచ్చిన తరువాతబ్రతికియుండుట. he *d his borther only two months వాడు అన్నచనిపోయిన వెనక రెండు నెలలే బ్రతికివుండినాడు. he *d his sonకౌడుకు చచ్చి అతను బ్రతికివుండినాడు.
To Outmarch v s ముందుమించి పోవుట. we *ed them వారికిముందు మించి పోయినాము.
To Outmeasure v a కొలతలో మించుట. this tent *s the old oneపాత డేరా కన్న యిది పెద్దది.
To Outnumber v a సంఖ్యలో మించుట. they * us మాకంటె వాండ్లుశానా మంది.
To Outpour v a పోసుట. an outpouring n. s. ప్రవాహము,ఉద్ద్రేకము.
To Outrival v a మించుట. a face that *s the moonచంద్రుణ్ని మించిన ముఖము.
To Outroar v a అరవడములో మించుట,the guns *ed the thunder ఆ ఫిరంగులు వురుములను మించినవి.
To Outroot v a పెల్లగించుట, నిమూ ్లము చేసుట.
To Outrum v a పరుగెత్తడములో మించుట. he outran his fundsఅస్తికిమించిన వ్యయము చేసినాడు.
To Outsail v a ముందుమించుట. that ship *ed us ఆ వాడ మమ్మునమించి పోయినది.
To Outshine v a ప్రకాశములో మించుట, అధికముగా ప్రకాశించుట.he *s all the other poets కవుల నందరిని మించినాడు.
To Outsit v a కూచు ్ండడములో మించుట. I outsat him వాడులేచేమట్టుకు నేను లేవలేదు వాడు లేచిన తరువాత నేను లేచినాను.
To Outsleep v a నిద్రలో మించుట. the child outslept me.బిడ్డ నా కంటె అధికముగా నిద్రపోయినది.
To Outstare v a రెప్పవేయక వూరికె చూడడములో మించుట. she *dhim వాణ్ని వూరికె చూచి తల వంచుకౌనేటట్టు చేసినది.
To Outstrip v a మించుట, పరుగెత్తడములో మించుట. he has *ped them in wickedness దు ్మా్గములో వాండ్లను మించినాడు.
To Outswear v a ప్రమాణము చేయడములో మించుట. his witnessoutwore mine ప్రమాణము చేయడములో వాడి సాక్షులు నాసాక్షులనుమించినారు.
To Out-talk v a నోరెత్తనియ్యకుండా మాట్లాడుట.
To Outvie v a ప్రకాశించడములో మించుట, తిరస్కరించుట,గెలుచుట.
To Outvote v a బహుమంది వొక పక్షములో పలికి వోడకొట్టుట.they *d us బహుమందిలో వొకటిగా పలికిన మా మాటను పడకొట్టినారు.
To Outwalk v a నడవడములో మించుట.
To Outwear v a అధికముగా కట్టు తాళుట, silk * s cottonనూలుకొన్న పట్టుకట్టు తాళుతున్నది.
To Outweigh v a అధికముగా తూగుట ధారములో అతిశయించుట. iron*s wood కొయ్య కన్న యినుము బరువుగా వుంటున్నది. this argument*s all be could say వాడు చెప్పేదానికంతా యీ వొక న్యాయమేచాలును. this *s all objections ఆ యాక్షేపణలకంతా యిది చాలు.
To Outwit v a మోసపుచ్చుట, దగాచేసుట. they *ted me in thisఇందులో నన్ను గడ్డి తినిపించినారు.
To Oveflow v n పొలి ్ పోవుట, ఉబుకుట. the river *ed ఆ యేరుకట్టలను పొలి ్ పారినది. her eyes *ed ఏడ్చినది. her heart *edదానికి అత్యుల్లాసము వచ్చినది, అతివ్యాకులమైనది.
To Overact v a అధికముగా చేసుట, అమితముగా చేసుట.
To Overawe v a బెదిరించుట, భయపరచుట.
To Over-balance v a and v. n. మొగ్గుట.వౌరుగుట-వౌరిగేటట్టుచేసుట, they *d the boat వాండ్లు వొకతట్టువుండినందున పడవ వౌరిగినది. the boat *d ఆ పడవ వొకతట్టువొరిగినది. the evil of this *s the advantage దీని లాభమునకన్ననష్టము అధికము.
To Over-bear v a కిందికి పడతోసుట.
To Overboil v a అధికముగా వండుట, చెడివండుట, చిమడకౌట్టుట.
To Over-burden v a అధిక బరువు యెక్కించుట, యెక్కువబరువువేసుట. *ed అధిక బరువుచేత సంకటపడే. I am *ed withbusiness నాకు అధికపనివచ్చి సంకటముగా వున్నది. this tree is*ed with fruit ఆచెట్టు విరగపండి వున్నది. he *ed his stomachవాడు వెక్కసముగా తిన్నాడు. he is not *ed with informationజ్ఙాన శూన్యుడు.
To Overcharge v a అధికముగా కట్టుట, అధికముగా వేసుట. he *dthe gun ఆ ఫిరంగికి అధికమందు వేసినాడు. he *d the accountఅధికలెక్క కట్టినాడు.
To Over-cloud v a ఆవరించుకొనుట, మూసుకొనుట. grief *ed herface దాని ముఖమును వ్యసనము మూసుకొన్నది.
To Overcome v a గెలచుట, జయించుట.
To Overdo v a అధికముగా చేసుట, ఎక్కువగా చేసి చెరుపుట. youhave overdone this అధికముగా చేసి చెరిపినావు.
To Overdress v a అధికముగా శృంగారించుట.
To Over-drive v a అధికముగా తరుముట. he overdrove thehorses గుర్రాలను పేగులు తెగతరిమినాడు. the horse wasoverdirven ఆ గుర్రము అధికముగా తరమబడ్డది.
To Overfeed v a అధికముగా తినిపించుట. she overfed herchild రాని బిడ్డకు అధికముగా అన్నము పెట్టినది.
To Overflow v a ముంచివేసుట. the river *ed the field ఆపొలము యేటివరదలో ముణిగినది.
To Overhale (Johnson) see Overhaul
To Overhaul v a to examine with care, inspect పదిలముగావిచారించుట, పునర్విమర్శ చేసుట, పరీక్షించుట, పరిశోధించుట.
To Over-load v v అధిక బరువు యెక్కించుట, ఎక్కువబరువుయెత్తుట. he *ed the stomach వెక్కసముగా తిన్నాడు.
To Overlook v a పైనుంచి చూచుట, ఉపేక్షచేసుట. the hill *s thetown ఆ కొండమీదనుంచి చూస్తే ఆ వూళ్ళో అంతా కండ్లపడుతున్నది.his house *s my garden వాడి యింటిమీద నుంచి చూస్తే మా తోటలోయావత్తు బాగా కండ్లబడుతున్నది. he *ed the fault ఆ తప్పునువుపేక్షచేసినాడు, అశ్రద్ధచేసినాడు. I *ed that fact దాన్నికనుక్కోలేకపోతిని. I hope you will * this fault తమరు యీతప్పును జాడగా పోనివ్వవలెను అనగా క్షమించవలెను.
To Over-match v a అణుచుట, అణగగొట్టుట. they *ed me వారునన్ను అణగగౌట్టనారు. I was *ed at chess చదరంగములో నా చెయ్యిసాగలేదు, నాఫణము సాగలేదు. they were *ed by him వాడికి వాండ్లువోడినారు, వాడి ముందర వాండ్ల ఫణము సాగలేదు.
To Over-pass v a అతిక్రమించుట, మించుట, మీరుట. he *ed theboundary సరిహద్దును మించినాడు.
To Overpeer v a ఎత్తుగా వుండుట, పొడుగుగా వుండుట,వున్నతముగా వుండుట. this house *s all the others అన్నికండ్లకన్న యీ యిల్లు యెత్తుగా వున్నది.
To Overpoise v a మొగ్గేటట్టు చేయుట. his authority *d theobjection అతని అధికారము ఆ ఆక్షేపణను తూలకౌట్టనది. అధికారమునకు ఆ ఆక్షేపణ యెదురుకాదు.
To Over-power v a గెలుచుట, వోడగొట్టుట, అణుచుట. grief *edhim వ్యసనముతో కుంగినాడు.
To Overpress v a నిర్బంధించుట, బాధించుట, పీడించుట.
To Overprice v a అధిక వెలకట్టుట.
To Over-prize v a అల్పమును అధికముగా యెంచుట,ఎక్కువగా యెంచుట. you * the advantage దాన్ని నీవుఅతిశయముగా యెంచుతావు, అది అంత లాభము కాదు,అది వౌక విశేషము కాదు.
To Over-rate v a అధిక వెలకట్టుట, అల్పమును అధికముగాయెంచుట.
To Over-reach v a or cheat మోసపుచ్చుట. he *ed himself andfell down అది అందుకోబోయి తప్పి కిందపడ్డాడు.
To Over-ripen v a మాగేటట్టుచేసుట.
To Over-rule v a ఉపేక్షచేసుట. he made an objection whichthe judge *d న్యాయాధిపతి వాడి ఆక్షేపణను పడి వుండనిమ్మన్నాడు.God *d this misfortune for my good నాకు వచ్చిన చెరుపు దేవుడిదయవల్ల మంచిదై పోయినది. that affliction was *d for his good ఆవ్యాకులము అతనికి క్షేమముగా పరివసించినది. his evil intentwas *d to his own punishment వాడి దురాలోచనే వాడికి శిక్షగాఫలించినది. he was *d by his wife to do this పెండ్లాము యొక్కబోధనవల్ల దీన్ని చేసినాడు.
To Over-run v a or ravage పాడు చేసుట, ధ్వంసముచేసుట,దవుడుచేసుట, మూసుకొనుట. the robbersover ran the country ఆదేశమును దొంగలు పాడుచేసినారు. creepers overran the garden ఆతోటను తీగలు మూసుకొన్నవి. the house was * with rats ఆ యింట్లోయెలుకలరాయడిగా వుండినది.
To Over-set v a బోర్లతోసుట, పడదోసుట, తలకిందుచేసుట.
To Overshade v a మూసుకొనుట, కమ్ముకొనుట.
To Overshadow v a నీడచేసుట. the trees * the road ఆ చెట్లుదోవకు నీడగా వున్నవి. or to shelter రక్షించుట, కాపాడుట.
To Overshoot v a గురిదాటుట, అతిక్రమించుట, మితిమీరుట.he overshot himself తాను చేసిన యుక్తే తన మెడకు తాడు అయినది.
To Overskip v a దాటుట, లంఘించుట.
To Oversleep himself v a అధికముగా నిద్రపోవుట,అతినిద్రచేసుట.
To Over-sotck v a అధికముగా నించుట, అధికముగాచేర్చిపెట్టుట. he *ed hios library వాడు పుస్తకములను అధికముగాచేర్చి పెట్టుకొన్నాడు.
To Over-spread v a కమ్ముకొనుట, కప్పుకొనుట, మూసుకొనుట.clouds * the heaven మబ్బు మూసుకొన్నది.
To Over-strain v a అతిశయించి చేసుట, అధికముగా ఆయాసపెట్టుట.he *ed the law చట్టానికి అధికముగా చేసినాడు. he *ed himslefin raising the box పెట్టెను యెత్తడములో వాడికి యిలుకుపట్టుకొన్నది. do not * you eyes కండ్లకు అధికశ్రమ యివ్వక.
To Overtake v a తరిమి పట్టుట, వెంబడించి పట్టుకొనుట. heovertook the thief దౌంగను తరిమిపట్టుకొన్నాడు. you go on Iwill * you మీరు పొండి నేను కలుసుకొంటాను. night overtook uson the road వూరు దోవలో చీకటి పడ్డది. vengeance overtook himవాడి పాపము వాణ్ని చుట్టుకొన్నది. the misfortunes whiteovertook him వాడికి సంభవించిన ఆపదలు, వాణ్ని పట్టినగ్రహచారము.
To Overtask v a అధికపనిపెట్టుట, శక్తికి మించినపనిపెట్టుట, మోయలేని బరువును పెట్టుట. he *ed the horse ఆగుర్రాన్ని నిండా గాసి చేసినాడు.
To Overtax v a అధికపన్నువేసుట.
To Overthrow v a పడదోసుట, నాశము చేసుట, గెలుచుట, జయించుట.the earthquake overthew the houses భూకంపుముచేత యిండ్లుబోర్లపడ్డవి.
To Overtop v a యెత్తుగా వుండుట, ఉన్నతముగా వుండుట. thishill *s all the others యీ కొండ అన్నిటికంటె పొడుగ్గా వున్నది.
To Overturn v a పడదోసుట, పాడుచేసుట.
To Over-value v a అధిక వెలకట్టుట, అతిశ్లాఘన చేసుట.
To Overweigh v a మొగ్గేటట్టు చేసుట, అధిక బళువు చేసుట.they *ed that side of the boat పడవ యొక్క ఆ తట్టునుమొగ్గేటట్టు చేసిరి.
To Overwhelm v a ముంచివేసుట. the storm *ed the vessel ఆగాలివాన వాడను ముంచివేసినది. sorrow *ed him దుఃఖములోముణిగినాడు.
To Overwork v a అధిక పనిపెట్టుట. you * your self నీవుఅధిక శ్రమపుచ్చుకొంటావు.
To Owe v a అచ్చివుండుట, ఋణపడి వుండుట, యివ్వవలసి వుండుట.he *d me ten repees వాడు నాకు పది రూపాయలు బాకి వుండెను. I *you an apology for this యిందున గురించి తనకు నేను అపరాధక్షమచేసుకోలసి వున్నది. with at the respect I * you I must saythis was unjust తమ మాట నా తలమీద వున్నదిగాని మెట్టుకు యిదిఅన్యాయ మనవలసి వున్నది. I * him my life నా ప్రాణము దక్కినదిఅతని పుణ్యము. I * this misfortune to you నాకు యీ సంకటమువచ్చినది నీ వల్ల. the college *s its origin to him యీ కాలీజుకలిగినది అతని పుణ్యము. I * him a grudge for this నేను యిందునగురించి వాడిమీద కసిదీర్చుకోవలసి వున్నది.
To Own v a వౌప్పుకొనుట. he *ed his fault తనతప్పునువొప్పుకొన్నాడు. he *ed the sword ఆ కత్తి తన దనివొప్పుకొన్నాడు. he *s this house యీ యిల్లు అతనిది. I must *I thought so నాకు అట్లా తోచింది సుమీ. I * that I bought thehorse but &c. నేను ఆ గుర్రమును కొనుక్కొన్నది సరే గాని.
To Pace v n నడుచుట. he *d the tall ఆ కూటములో పచారు చేసినాడు.
To Pacify v a సమాధానము చేసుట, సముదాయించుట, ఉపశాంతి చేసుట. shecould not * the child ఆ బిడ్డను సముదాయించ లేకపోయినది.
To Pack v a కట్టుట, మూటకట్టుట. he *ed the box in wax cloth. ఆ పెట్టెలనుమయనపుగుడ్డ వేసి కట్టినాడు. or to send in a hurry తీవరముగా పంపించుట. he *ed them cff వాండ్లను సాగనంపినాడు. *ing_ cloth రెట్టు. * ing needle దబ్బనము.
To Pad v a or stuff దూది పెట్టి కుట్టుట. he padded the coat with cotton ఆచొక్కాయకు దూది పెట్టి కుట్టినాడు. to * the hoof పరుగెత్తుట, నడుచుట.
To Paddle v n తెడ్డుతో తోసుట. to play in water నీళ్ళలో దేవులాడుట. orstroke with the fingers వేళ్లతో తడుపుట. in rowing, the face is towardsthe stern, but in paddling the face is towards the prow ఆల్లీస కర్రతోతోసేవాడి ముఖము పడవ వెనక తట్టుకై వుంటున్నది తెడ్డుతో తోసేవాడిముఖము పడవ ముందరి తట్టుకై వుంటున్నది.
To Padlock v a కప్ప తాళము వేసుట.
To Page v a పుట సంఖ్య వేసుట, పొరటకు అంకెలు వేసుట.
To Pain v a నొప్పించుట, వేధించుట, బాధించుట, పీడించుట, ఆయాసపెట్టుట.the wound * s me ఆ పుండు నొత్తున్నది it * ed me to see this దీన్నిచూడడానికి నాకు వ్యాకులమైనది his language *ed them వాడు చెప్పినదానికివ్యసనపడ్తారు.
To Paint v a వ్రాసుట, చిత్తరువు వ్రాసుట, పూనుట. he *ed the wall red గోడకుయెర్ర వర్ణము పూసినాడు. she * ed her eyes black అది కండ్లకు కాటుక పెట్టుకొన్నది.he *ed he king riding రాజు గుర్రము మీద వుండేటట్టు వ్రాసినాడు. the poet has* ed this battle very well ఆ కవి ఆ యుద్ధమును బాగా వర్ణించినాడు. v.neut. awoman who *s ముఖమందు మకరికా పత్రాదులు వ్రాసుకొన్న స్త్రీ.
To Pair v n జతగా చేరుట, జతగా కూడుట. birds * in spring వసంతరుతువులోపక్షులు జంటగా కూడుతవి. the Hindus * early హిందువులు బాల్యములో పెండ్లిచేస్తారు.
To Pall v n నిస్సారమౌట, నీరసమైపోవుట. honey * s upon the taste తేనెకొంచెము తాగితే ముఖము కొట్టుతున్నది.
To Palliate v a పూసిపెట్టుట, మరుగు చేసుట, తేలికగా చెప్పుట, ఉపశమనము. thisis a * of his offence వాడు చేసినదానికి యిది వొక సాకు.
To Palm v a మోసముగా యిచ్చుట, పితలాటముగా యిచ్చుట. he * ed off thatleaden rupee as silver ఆ సీనపు రూపాయిన వెండి రూపాయి అని మోసముగాయిచ్చినాడు. he * ed the poem off as his own ఆ గ్రంథము తానుచెప్పినదని మోసముగా యిచ్చినాడు.
To Palpitate v s ధాతువు, ఆడుట, కొట్టుకొనుట, అదురుట.
To Palter v a మోసము చేసుట, పితలాటకము చేసుట.
To Pamper v a అధిక తిండి పెట్టుట, కూరుట. she * ed her child బిడ్డకు అధికతిండి పెట్టి చెరిపినది. he who *s himself తిండిబోతు.
To Pandar or Pander n s బడవాతనము చేసుట, దుర్మార్గమునకు సహాయపడుట.this poet *s to the vices of the people లోకుల దుర్మార్గములకు యీ కవిప్రోద్బలము చేస్తాడు. a preacher should not * to the vanity of his hearersసభలో మాట్లాడేవాడు వినేవాండ్ల గర్వమునకు ప్రోద్బలమయ్యేటట్టు మాట్లాడరాదు.
To Pander v s See ToPandar.
To Panegyrize v a శ్లాఘించుట.
To Pant n s రోజుట, యోగరోజుట. or to * for ఆశకొట్టుకొనుట they * for hisarrival అతడు యెప్పు డెప్పుడు వచ్చునాయని ఎదురు చూస్తారు.
To Paper n a కాగితమును అంటించుట he * ed the room with red paer ఆయింటి గోడలకు యెర్రకాకితములను అంటించినాడు.
To Parade v a అగుపరుచుట, జంభముగా అగుపరుచుట. she *d her childrenతన బిడ్డలను జంభముగా అగుపరచినది. he *d the troops దండును జంభముగానిల్పినాడు.
To Parallel v a or compare సమానము చలేసుట సాదృశ్యముగా చెప్పుట.ఉపమానముగా చెప్పుట. do you * this book with that ? యీ పుస్తకమును ఆపుస్తకమునకు సమాన మంటావా.
To Paralyze v a విస్త్రాణ చేయుట, దుర్బలము చేయుట. fear * d him భయముచేత మానుపడ్డాడు.
To Paraphrase v a భావమును పెంచి చెప్పుట, శబ్దతః కాకుండా వివరించి చెప్పుట.
To Parry v a తప్పించుట. he parried the blow కత్తి దెబ్బను తట్టినాడు. heparried the question అడిగిన మాటకు వుత్తరవు చెప్పక జార విడిచినాడు.
To Parse v a " శబ్దలక్షణమును వివరించి చెప్పుట, శబ్ద సమాన కర్తశబ్ద సమాస కర్తృ కర్మ క్రియా అన్వయాకాంక్షలుచెప్పుట. Parases, n. s. పార్శీవాండ్లు, వీండ్లు బొంబాయిలో విస్తారము."
To Part v n వీడుట, వూడుట, ఎడబాయుట. when we *ed he gave me thisమేము యెడబాసేటప్పుడు దీన్ని నాకు యిచ్చినాడు. at ten feet from the groundthe tree *ed into three branches భూమి నుంచి పది అడుగులకు పైన ఆ చెట్టుమూడు పంగలుగా పోయి వున్నది. here the road *s ఇక్కడ దోవ చీలుతున్నది.in the earth quake the wall *ed భూకంపములో గోడ విచ్చినది బీటిక బాసినది. whenthe rope *ed తాడు తెగినప్పుడు. to prevent the paper from *ing he usedgum ఆ కాకితము వూడి రాకుండా గోదువేసినాడు. he *ed with the house ఆయింటిని విడిచిపెట్టినాడు, అమ్మివేసినాడు, యిచ్చివేసినాడు. she was unwilling to *with her child బిడ్డను యెడబాయడానికి దానికి మనసు లేదు. he will not * withthe horse వాడు ఆ గుర్రాన్ని యివ్వడు, విడవడు.
To Partake v n భాగరి అవుట. they partook of my joy నాతోటిపాటుసంతోషించిరి. they partook of my sorrow నాతో కూడా వ్యసన పడిరి. theypartook of my food నాతో కూడా భోజనము చేసినారు. he partook of the food ఆరగించినాడు తిన్నాడు. this * s of the nature of oil ఇది కొంతమట్టుకు నూనెవలెవున్నది. they who love God * of his nature దేవుణ్ని విశ్వసించేవారికి దైవాంశమువస్తున్నది. they who * of labour share the prize కష్టానికి యెవరు పాలుడుతారోవాండ్లు కీర్తి కిన్ని పాలు పడుదురు. I do not * of your sentiments regardingthis ఇందున గురించి నీకు అట్లా తోచినది గాని నాకు అట్లా తోచలేదు the cat * s ofthe nature of the tiger పిల్లి పులిజాడగా వున్నది. they partook with himవాడితోటిపాటు అనుభవించినారు.
To Participate v n అనుభవించుట, భాగరి, అవుట. they * d in his kindness వీరియందున్ను వాడి అనుగ్రహము వచ్చినది. he *d in the profits of this దీని యొక్కలాభము అతనికిన్నీ చెందినది. he *d my joy నా తోటి పాటు సంతోషించెను.
To Particularize v a వివరించుట, విశదపరచుట. he did not * any one streetఫలాని వీధియని వుద్దేశించలేదు.
To Partition v a విభజించుట, భాగించుట.
To Pass v n పోవుట, వెళ్లుట, గడుచుట, జరుగుట, దాటుట, చెల్లుట. as I was *ing by this road నేను యీ దోవను పోతూ వుండగా before one week * ed వొకవారము కాకమునుపే. much money *es through his hands వాడి చేతి గుండాబహురూకలు ప్రయమౌతున్నవి. this money *es there యీ రూకలు అక్కడచెల్లుతున్నవి. this story will not * యీ కథకు పనిరాదు. he *ed for her sonదాని కొడుకు అనిపించుకున్నాడు. he *es for a learned manపండితుడనిపించుకొంటాడు. do you know what *ed between the parties ?వారికీ వీరికీ యేమి జరిగినదో నీకు తెలుసునా. he let the opportunity * సమయాన్నివిడిచిపెట్టినాడు. let it * కాని చింతలేదు. the fever * ed away జ్వరమువిడిచిపోయినది. when youth *ed away యౌవనము తీరేటప్పటికి గడిచేటప్పటికిafter the law *ed చట్టము పుట్టిన తరువాత. God brought this to * దేవుడుదీన్ని జరిపించినాడు. it came to * that he broke his arm వాడి చెయ్యి విరిగేటట్టుసంభవించినది, ఘటించినది. his words came to * వాడు చెప్పినట్టే ఆయెను. he *edover the field ఆ పొలము దాటినాడు the army * ed over the river ఆ దండుయేరు దాటినది. the water *es through the cloth గుడ్డలో నీళ్ళు దిగుతున్నది.they * es close under wall ఆ గోడ వోరగా పోయినారు. hey * హూ మంత్రక్కాళిమాయక్కాళి.
To Paste v a అంబలితో అంటించుట, బందనతో అంటించుట.
To Pasture v n మేపుట.
To Pat v a తట్టుట. she was patting the child బిడ్డను తట్టుతూ వుండినది.
To Patch v a అతుకువేసుట, మాసికవేసుట. he *ed the old cloth with newపాతగుడ్డకు కొత్తగుడ్డను అతుకు వేసినాడు. he *ed up this business యీ పనినిపిచ్చిగా బనాయించినాడు. he *ed up the business wretchedly ఆ పనినిదిక్కుమాలిన రీతిగా కుదిర్చినాడు.
To Patrol v n పారా తిరుగుట, గస్తు వచ్చుట.
To Patronise v a సంరక్షించుట, కాపాడుట.
To Patter v n చినుకులు పటపటమని పడుట.
To Pause v n రవంత నిలుచుట, కొంచెము తాళుట,నిదానించుట. the ant *s ingoing along చీమ నిలిచి నిలిచి పోతున్నది.
To Pave v a రాళ్ళు పరుచుట, తలవరుస వేయుట. he *d the room ఆ యింటికిరాళ్ళు పరిచినాడు. this letter *d the way to a reconcilliation యీ జాబు వల్లసమాధానమునకు వొక దోవ యేర్పడ్డది. this *d the way to victory జయించడానకుయిది సాధనము అయినది.
To Paw v a కాళ్లతో కొట్టుట. the cat *ed and killed the snake ఆ పిల్లిపామును కాలితో కొట్టి చంపినది. the horse *ed the ground ఆ గుర్రమును నేలనుకాలితో గీచినది. do not * this book యీ పుస్తకాన్ని నలిపి పాడుచెయ్యక.
To Pawn v a కుదువబెట్టుట, తాకట్టుపెట్టు. I will * my reputation upon it అట్లాకాకుంటే నన్ను ఛీయను. I will * my life this is the case యిది అబద్ధమైతే నా తలయిస్తాను.
To Pay v a చెల్లించుట, యిచ్చుట. he paid the debt అప్పు తీర్చినాడు. he didnot * the revenue వాడు ఆ పన్ను కట్టలేదు. did he * the fine ? వాడుఅపరాధమును యిచ్చినాడా. he paid was servants నౌకరులకు జీతాలిచ్చినాడు. didhe * you ? నీకు యివ్వవలసినది యిచ్చినాడా. I will * him for this trick వాడుచేసిన మోసానికి తగిన శిక్ష చేస్తాను. he paid attention to this దీన్ని బాగావిచారించినాడు. I will * implicit obedience to your orders తమ ఆజ్ఞనుశిరసావహింతును. if you do not do this you will * the penalty నీవు దీన్నియిట్లా చేయకుంటే వచ్చినదాన్ని అనుభవించు. you will * the penalty of your lifeనీ ప్రాణానికి వచ్చును.he paid for his folly వాడి అవివేకానికి తగిన ప్రాయశ్చిత్తముకలిగినది. I went to * him my respects ఆయన దర్శనానికి వెళ్ళినాను. they paidthis tribute to his virtues ఆయన యోగ్యతను యెరిగి దీన్ని చేసినారు. he paidthe debt of nature చచ్చినాడు. they paid him on his own coin బదులుకుబదులు చేసినారు. to * or daub with pitch కీలు పూసుట. this business willnot * యీ పని నిషల్ఫము.
To Peach v n బయిట వేసుట, అనగా తనకు తెలిసిన మర్మమును ద్రోహముగాబయిటపెట్టుట. Carlyle uses the word in Cromwell. Vol.2, p.447 .
To Peal v n మోగుట, వాగుట the *ing echoes మహత్తెన ప్రతిధ్వని.
To Peck v n పక్షి ముక్కుతో పొడుచుట, పక్షి ముక్కుతో యేరుకొని తినుట. the bird *ed at my hand ఆ పక్షి ముక్కుతో నా చేతి మీద పొడిచినది. the bird was *ing upthe grain ఆ పక్షి గింజలను యేరుకొని తింటూ వుండినది.
To Peculate n a అపహరించుట.
To Peddle or peddle out v a. to sell or retail: usually by travelling about the country ఊరూరు తిరిగి చిల్లరగా అమ్ముకొనుట.
To Peel v a తోలువొలుచుట, తోలుతీసుట.
To Peel off v n తోలువూడుట. the mortar * ed off the wall గార లేచిపోయినది.
To Peep v n తొంగిచూచుట. he *ed into the well భావిలో తొంగిచూచినాడు. he *ed out of the well భావిలో నుంచి పైకి తొంగి చూచినాడు. a corner of thehandkerchief *ed out రుమాళుకొన బయిటికి వచ్చినది, బయిటికి అగుపడ్డది. whenthe corn *s out of the ground మొలక లెత్తేటప్పుడు, మోసులెత్తేటప్పుడు thechild's teeth are just *ing బిడ్డకు యిప్పుడే పండ్లు మొలుస్తవి. the tree *edout of the well ఆ చెట్టు బావిలోనుంచి పైకి కండ్లబడుతున్నది. he did not * abroadagain for a week వారం దినాలుగా వాడు మళ్ళీ తలబయిట చూపలేదు.
To Peer v n అగుపడుట, కనుబడుట, తొంగి చూచుట. that tree *s above thewall ఆ చెట్టు గోడకుపైగా కండ్లబడుతున్నది. the mountains *ed above theclouds ఆ కొండలు మేఘాలకు పైగా కండ్లబడుతవి. he * ed into the well బావిలోతొంగిచూచినాడు.
To Peg v a గూటము కొట్టుట, కొయ్యచీలతో బిగించుట. or cast a top బొంగరమువేసుట. or work పూనుకొని చేసుట.
To Pelt v a రాళ్ళతో కొట్టుట. they *ed him with stones వాడి మీద రాళ్లురువ్వినారు. he was *ing along the street వీధివెంట దబదబ పరుగెత్తుతూవుండినాడు. a *ing shower జడివాన. *ing or trifling, petty స్వల్పమైన,అల్పమైన.
To Pen v a or to confine దొడ్డిలోకి తోలి మూసుట. or to write వ్రాసుట. havethey any part in * ning those laws ? యీ చట్టములు వ్రాయడములో వీండ్లేమైనాకలిసినారా.
To Pencil v a వ్రాసుట, చిత్రము వ్రాసుట.
To Penetrate v a ప్రవేశించుట, చొచ్చుట, దూరుట. the axe *d the wood గొడ్డలికొయ్యలో దిగినది. rust * s into iron తుప్పు యినుముకు పట్టుతున్నది, యినుమునుతింటున్నది. the water * d the wood ఆ కొయ్యలో నీళ్ళు వూరుతున్నది. we couldnot * the forest మేము అడవిలో చొరలేకపోతిమి. I cannot * into the meaningఆ యర్థము నాకు అవగాహన కాలేదు. I could not * his meaning వాడి భావము నాకుతెలియలేదు. his words *d their hearts వాడి మాటలకు వాండ్ల మనస్సు కరిగినది.
To pension v a to support by an arbitrary allowance. జీవనోపాధియేర్పరచుట, పని పుచ్చుకోక జీతమిచ్చేటట్టు నిర్ణయించుట, కొలువు కొలిచితొయ్యనివాడుగా వుండేవాడికిగాని, దివాణమునకు నిండా మేలు చేసిన వాడికిగాని భరణమేర్పరచుట.
To People v a ప్రజలతో నిండించుట. the nations that * the earth భూమిలోవుండే జాతులు.
To Pepper v a మిరప్పెడిచల్లుట, మిరియాలు పెట్టుట. he *ed them soundlyవాండ్లను బాగా కొట్టినాడు, బాగా తిట్టినాడు.
To Perambulate v a చుట్టూరు, తిరుగుట, సంచరించుట. to * or beat thebounds పొలిమేర తొక్కుట. he *d the town వూరంతా తిరిగినాడు.
To Perch v n పక్షి కూర్చుండుట. the people were *ing on the top of thehouse వాండ్లు కొంగలవలె ఆ యింటి మీద వుండిరి. there was a sentinel *ed onthe rock ఆ కొండ మీద వొంటిగా వొకడు పారావుండెను. he *ed his troops on thewall వాడి దండును గోడమీద కెక్కించినాడు.
To Percieve v a కనుక్కొనుట, తెలుసుకొనుట, గ్రహించుట. I did not * him నేనువాణ్ని కనుక్కోలేదు. when they *ed me వాండ్లు నన్ను కనుక్కొన్నప్పుడు.
To Percolate v a and v. n. వడికట్టుట, వస్త్రకాళితము చేసుట.
To Perfect v a సంపూర్తిచేసుట.
To Perform v a చేసుట, నెరవేర్చుట. he * edthe part of the king and I the part of the minister వాడురాజుగా వుండినాడు నేను మంత్రిగా వుంటిని. she * ed the part of amother to them అది వాండ్లకు తల్లివలె వుండినది.
To Perfume v a పరిమళింపచేసుట. this flower *s the whole house యీపుష్పము యిల్లంతా వాసన కొట్టుతున్నది. she *d her clothes అది బట్టలకు వాసనవేసినది.
To Perish v n చెడుట, చెడిపోవుట, చచ్చుట, నశించుట, క్షయించుట. he * ed withhunger ఆకలితో చచ్చినాడు. that poem has * ed ఆ కావ్యము యిప్పుడు లేదు.
To Perjure himself v a తప్పు సత్యము చేసుట, అసత్యము చేసుట. he * edhimself తప్పు సత్యము చేసినాడు.
To Perk v a కులుకుట.
To Permit v a శలవు యిచ్చుట, ఉత్తరువు యిచ్చుట, అనుజ్ఞ యిచ్చుట. they dugdown the bank and *ted the water to flow కట్టను తవ్వి నీళ్ళనుపోనిచ్చినారు. he *ted me to go నన్ను పోనిచ్చినాడు. I will never * this దీనికినేను యెంత మాత్రము ఆమోదించను. God * ted him, to kill them వాండ్లనుచంపితే చంపనీయని వుండినాడు. why did you * them to do so ? వాండ్లను అట్లాయేల చేయనిస్తివి. * me to say one thing నేను వొకటి చెప్పనియ్యండి. the Hindulaw * s of polygamy. హిందు ధర్మశాస్త్ర పరకారము పెండ్లి మీద పెండ్లిచేసుకోవచ్చును. time does not * me to write any more యింకా వ్రాయడానికిసావకాశము లేదు.if time * s సావకాశము వుంటే.
To Perpetrate v a చేసుట, యిది దుష్కృత్యమును గురించిన మాట. he * d thismurder యీ ఖూనిని చేసినాడు, హత్య చేసినాడు. he * d a rape చెరబట్టినాడు.
To Perpetuate v a శాశ్వతముగా వుండేటట్టుచేసుట. this poem * s his fameయీ కావ్యము అతని కీర్తిని శాశ్వత పరచినది.
To Perplex v s చిక్కులబెట్టుట, కలవరపరచుట, గాబరాచేసుట, చీదరబెట్టుట.
To Persecute v a or tease మత ద్వేషమును పట్టి హింసించుట, పీడించుట,బాధించుట. the mosquitoes * the infant ఆ బిడ్డను దోమలు హింసపెట్టుతవి.
To Persevere v n వొకటే పట్టుగా వుండుట. he * s in study వొకటే పట్టుగాచదువుతాడు.
To Persist v n పట్టినపట్టు వదలకుండా వుండుట, మూర్ఖము చేసుట, వొకటేపట్టుగావుండుట, పట్టుదలగా వుండుట, హఠము చేసుట. he *s in drinking యెంత చెప్పినావినక వూరికె తాగుతాడు.
To Personate v a వొకడికి బదులుగా ప్రవర్తించుట. he *d the king వాడు రాజుగానటించినాడు. a layer *s his client వ్యాజ్యగాడికి బదులు లాయరు వ్యవహరిస్తాడు.
To personify v a or represent నటించుట, బదులుగా వుండుట. he personifiedthe king. I personified the minister వాడు రాజుగా నటించెను నేను మంత్రిగానటిస్తిని. the poet has personified the earth as a woman కవి భూమిని వొకస్త్రీగా వర్ణించినాడు.he danced like a personified Bolero (Don Jaun XIV.39.) తాండవమే వచ్చి అవతరించినట్టు ఆడినాడు. Death is personified as Yama చావు యముడి యొక్క అవతారము.
To Perspire v n చెమటబోసుట, చెమర్చుట.
To Persuade n a బోధించుట, బోధించి లోపరచుకొనుట. I spoke a long timebut could not * him నేను యెంత చెప్పినా వాడు నాకు వంగలేదు. I wish I could *you to do this అయ్యో నేను యెంత చెప్పినా వినవు. he *d me to do this వాడిబోధనకు లోబడి దీన్ని చేస్తిని. he could not * himself to drink the medicine ఆమందు తాగేటందుకు వాడికే మనసు రాలేదు. I am * d that these men arebrothers వీండ్లు అన్నదమ్ములని నాకు రూఢిగా వున్నది. I am *d that this iswrong యిది తప్పని నాకు రూడి. he was at last *d తుదకు వొప్పినాడు.
To Pertain v n సంబంధించుట. this handle *s to that hammer యీ పిడి ఆసుత్తె సంబంధమైనది, ఆ సుత్తెది. these men * to that regiment యీ సిఫాయిలు ఆపటాళముతో చేరిన వాండ్లు. the finger *s to the hand ఆ వేలు చేతితో చేరినది.it *s to a master to protect his servants యజమానుడు సేవకులనురక్షించడము ధర్మము.
To Peruse v a చదువుట, పారాయణము చేసుట.
To Pervade v a వ్యాపించుట, నెరయుట. the scent * d the grove ఆ వాసనతోపంతా నిండినది, వ్యాపించినది.
To Pervert v a చెరుపుట, మారుబాటుచేసుట, వ్యత్యాసము చేసుట. he *ed theirwinds వాండ్లు మనస్సును చెరిపినాడు.
To Pester v a తొందరబెట్టుట, పీడించుట, హింసించుట.
To Pet v a ముద్దుగా పెంచుట, గారాబముగా పెంచుట. *tedగారాబముగా పెంచిన.
To Petition v a మనివి చేసుకొనుట,విజ్ఞాపనము చేసుకొనుట, విన్నపముచేసుకొనుట, అర్జియిచ్చుకొనుట. he * ed me to do this దీన్ని చేయవలెనని నన్నుఅడుక్కొన్నాడు. he *ed them for his life తన్ను చంపవద్దమని వేడుకొన్నాడు. he *ed them in vain యితని మనివిని వాండ్లు వినలేదు.
To Petrify v a రాయిగా చేసుట, శిలగా చేసుట. this water petrified woodయీ నీళ్ళలో వేసిన కభయ్య రాయి అయిపోతున్నది.
To Philander v n వొకతెను వృథాగా చుట్టుకొని తిరుగుట. he *ed there alongtime బహు దినాలు దాన్ని వృథాగా చుట్టుకొని తిరిగినాడు.
To Philosophize v n వితర్కించుట, కారణమును విచారిమచుట. he * d muchregarding his యిందున గురించి బహుదూరము తర్కించినాడు.
To Physick v a to give medicine బేదికి యిచ్చుట మందు యిచ్చుట. she * edher children బిడ్డలకు బేదికిపోసినది. he * ed himself మందు పుచ్చుకొన్నాడు.
To Piaffer v n to brag. తన సామర్ధ్యము చూపించుట, తన జంభమునుఅగుపరుచుట.
To Pick v a to choose or select యేర్పరచి యెత్తుకొనుట, యేరుట. he *ed away through the jungle ఆ యడవిలో తడమాడుతూ పోయినాడు. the thief * edmy pocket ఆ దొంగ నా జేబులో వుండినదాన్ని దొంగిలించినాడు. he was *ing highis teeth with a straw గడ్డిపోచతో పండ్లుకుట్టుకొంటూ వుండినాడు. to cleanచక్కబెట్టుట, వొలిచివేసుట, గీచివేసుట, గీచియెత్తివేసుట. she * ed the cotton cleanదూదిని పింజతీసినది. the barber *ed their ears మంగలవాడు వాండ్లకు గుబిలితీసినాడు. she *ed her child's head clean తలచూచినది, పేలు చూచినది. she *ed the rice quite clean ఆ బియ్యాన్ని రాళ్ళు రప్పలు లేకుండా బాగా యేరినది. he *ed the fowl కోడి బొచ్చును పీకినాడు. to pick ముక్కుతో పొడుచుట. the crow * edthe flesh out of the wound ఆ కాకి పుంటిలోని మాంసమును పీకినది, పెరికినది.they * ed a quarrel with him వాడితో వొక జగడము పెటటుకొన్నారు. to robదొంగిలించుట. he kept his hands from * ing and stealing చెయిదుడుకులేకుండా వుండినాడు. to open a lock ఆయుధముతో తెరుచుట. he *ed the lock ఆబీగమును ఆయుధముతో తెరిచినాడు, మారుతాళము వేసి తెరిచినాడు. to eat slowlyపుణికి పుణికి తినుట. he had no appetitie but *ed a little ఆకలి లేనందున రెండుమెతుకులు కొరికినాడు. the crow * ed the fruit to pieces ఆ కాకి పండునుముక్కుతో తునకలు తునకలుగా పొడిచివేసినది. he * ed a hole in the wood ఆకొయ్యలో బొక్క తొలిచినాడు. they tried to * a hole in my coat నా మీద తప్పుమోప చూచినారు. he tried to * a hole in the evidence ఆ సాక్షికి వొక సభంటువెతకడమునకు చూచినాడు. he *ed the mud off his feet కాలిలో అంటుకొన్నబురదను తీశివేసినాడు. he *ed the piant off the wall వర్ణమును గిచివేసినాడు. he* ed outone fruit ఆ పండ్లలో వొకటి యేర్పరచి యెత్తుకొన్నాడు. he *ed out thekernel with his knife కత్తితో పప్పును తీసివేసినాడు. he tried to * out thesecret ఆ రహస్యమును వెళ్ళదీయవలెనని చూచినాడు. to take up యెత్తుకొనుట. he *ed up the stick ఆ కట్టెను యెత్తుకొన్నాడు. where did you * him up ? వీడునీకెక్కడ చిక్కినాడు. the bird *ed up the corn ఆ పక్షి గింజలను యేరుకొని తిన్నది. fter the fever, he soon * ed up flesh జ్వరము విడవగానే వాడికి వొళ్ళుపెట్టినది. they * ed up intelligence వాండ్లకు సమాచారము చిక్కినది. he *ed up a little of the language వాడు ఆ భాషను కొంచెము తెలుసుకొన్నాడు.
To Pickle v a వూరుగాయ వేసుట, వుప్పులో వేసుట.
To Picture v a వర్ణించుట.
To Piddle v s or to trifle పర్యాయముగా చేసుట. he * d a little in tradebut he did not do much వాడికి వర్తకము పర్యాయముగా జరిగినదిగాని బాగా జరగలేదు. or to feed squeamishly and without appetite పుణికి పుణికి తినుట.
To Pierce, or perce v n. దూరుట, యెక్కుట. the arrow *d into his heart ఆబాణము వాని రొమ్ము దూసుకొని పోయినది. the torn *d into his foot వాడికాలిలోముల్లు యెక్కినది, నాటినది. I could not * into his meaning వాడి భావమును భేదించలేకపోతిని. he *d into their secret వాండ్ల మర్మమును భేదించినాడు.
To Pierce, or perce v a. పొడుచుట, గుచ్చుట. a thorn * d my foot నా కాలిలోముల్లు గుచ్చుకొన్నది, ముల్లు యెక్కినది. he *d the hogs head ( or cask ) andfound the liquor was bad ఆ సీపాయిని పొడిచి చూస్తే సారాయి చెడిపోయి వుండినది.these words *d his heart యీ మాటలు వాడి మనసున గాలముగా నాటినది.
To Pig v n or produce *s పిల్లలు వేసుట. or to lie పండుకొనుట, యిదితుచ్చమాట.
To Pile v a కుప్పవేయుట, పోగుచేసుట.
To Pilfer v a and v. n. స్వల్ప దొంగతనము చేసుట, ముచ్చిలించుట.
To Pillage v a కొల్ల బెట్టుట, దోచుట.
To Pillory v a అరతూకు వేసుట, అవమానము చేసుట.
To Pilot v a వాడకు దారి చూపుట. he * ed me through the grammar వాడునాకు వ్యాకరణము చెప్పినాడు.
To Pimp v n బడవాతనము చేసుట.
To Pin v a గుండుసూదితో తగిలించుట. he *ned the paper to the wallగుండుసూదులతో ఆ కాకితమును గోడకు తగిలించినాడు. she * ned his hand tothe wall with a dagger బాకుతో వాడి చేతిని గోడకు అంటపొడిచినది.
To Pinch v a గిల్లుట, నులుముట. he *ed himself to support his childrenబిడ్డలను పోషించడానకై తన కడుపు కట్టినాడు. his hand was *ed between thetable and the wall గోడకు బల్లకు సందున వాడి చెయ్యి నలిగినది. they were *edwith poverty దరిద్రము చేత పీడుతులైనారు, వేధించబడ్డారు. they were * edwith hunger ఆకలి చేత పీడితులైరి. I was *ed for time నాకు సావకాశములేకపోయినది. he was in *ing circumstances దరిద్రుడుగా వుండెను.
To Pine v n కృశించుట శుష్కించుట, క్షయించుట. she *d with sorrow దుఃఖముచేత కృశించినది.
To Pinion v a విరిచికట్టుట, పెడరెక్కలు విరిచికట్టుట. they *ed him వాణ్ని విరిచి కట్టినారు.
To Pink v s బెజ్జాలు పొడుచుట.
To Pipe v n పిల్లంగోవి వూదుట.
To Pique v a గర్వించుట. he himself upon his she had in music తనకేసంగీతములో సామర్థ్యము కద్దని గర్విస్తాడు. they * themselves upon spellingTelugu in a particular way వాండ్లు గర్వించి తెలుగును వొకవిజాతీయముగా వ్రాస్తారు.
To Pirate v n వాడలను దొంగలించడానకై సముద్రము మీద తిరుగుట.
To Pish v n ఛీయనుట, ఛీపొమ్మనుట.
To Piss v n వుచ్చ పోసుట.
To Pit v a (cocks) కోళ్ళను జగడమునకు విడుచుట. we *ted those twodoctors ఆ యిద్దరు వైద్యులను ప్రసంగానికి విడిస్తిమి his face is *ted with thesmall pox వాడి ముఖము అమ్మవారు మచ్చలుగా వున్నది.
To Pitch v a వేసుట, కొట్టుట. he *ed the spear at me ఆ బల్లెమును నా మీదికిరువ్వినాడు. they *ed him from the wall వాణ్ణి గోడమీద నుంచి తల్లకిందులుగాతోసినారు. * me that ball ఆ చెండును యిట్లా యెగరవెయ్యి. he * ed his dogagainst mine వాడి కుక్కను నా కుక్క మీద విడిచినాడు. to * a musical note సుతి కూర్చుట. he *ed the tent గుడారము వేసినాడు, డేరా కొట్టినాడు. orto smear with * కీలుపూసుట. he *ed the ceiling తారుసుకు కీలు పూసినాడు. there was a *ed battle మహత్తైన యుద్ధము జరిగినది.
To Pity v a జాలిపడుట. I * you అయ్యో నీకేమివచ్చినది. why do you * herignorance ? దాని అజ్ఞానానికి యేల యేడుస్తావు.
To Placard v a యిస్తియారునామా మూలముగా ప్రకటన చేసుట.they * ed the town with his name వాడి మీద కాకితాలు వ్రాసి ఆ వుళ్ళో అంటించినారు.
To Place v a వుంచుట, పెట్టుట. he *d the guard పారావుంచినాడు. they *dthe spears against the wall ఈటెలను గోడకు ఆనించినారు. they *d thepikes upright వాసములను నిలువబెట్టినారు. he * d the arrow on the bowబాణమును తొడిగినాడు. we *d ourselves in ambush మేము పొంచివుంటిమి. youare to * yourself under his orders నీవు అతనికి అణిగి నడుచుకోవలసినది. ifyou * yourself in my situation you will see the difficulty నా గతి నీకు వస్తేఅప్పుడు తెలుసును.
To Plain v n మొరబెట్టుట. See To Com. Plain.
To Plait v a మడుచుట, పింజపెట్టుట, అల్లుట, జడవేసుట.to * and sew మడిచికుట్టుట. to * rattan పేము లల్లుట.
To Plalgue v a తొందరపెట్టుట, ఆయాసపెట్టుట.
To Plan v a ఆలోచించుట, యోచించుట, యుక్తిచేసుట, యత్నము చేసుట.he planned the house ఆ యింటికి ప్లాను వ్రాసినాడు.
To Plane v a చిత్రికపట్టుట, తోపుడు పట్టుట.
To Plank v a పలక వేసుట, బల్లలు కూర్చుట. he *ed the floor with teakతళవరస టేకు పలకలు వేసినాడు.
To Plant v a నాటుట, వేయుట, పెట్టుట. he *ed a tree చెట్టు పెట్టినాడు.he *ed a grove తోపువేసినాడు. he *ed corn విత్తనము చల్లినాడు. God *ed love in theheart of a mother దేవుడు తల్లికి బిడ్డలయందు వ్యామోహమును కలగచేసినాడు. he *ed a blow దెబ్బకొట్టినాడు. he *ed the cannon at the ఆ ఫిరంగులను వాండ్ల మీదసూటిగా పెట్టినాడు. he * ed four cannons on the wall ప్రాకారము మీద నాలుగుఫిరంగులను పెట్టినాడు. he *ed himself in a corner వొక మూల వుండినాడు. theEnglish * ed a colony in Bencoolen యింగ్లిషువాండ్లు కొందరు బంకోలులో పోయివొక ఖండ్రిక కట్టుకొని వున్నారు.
To Plash v n నీళ్ళను కదిలించి చప్పుడు చేసుట.
To Plaster v a గచ్చుపూసుట. they *ed their foreheads with ashesవిభూతి పూసుకొన్నారు.they *ed the floor with cow _ dung అలికినారు.
To Plat v a అల్లుట, జడవేసుట. she * ted her hair దాణికి జడవేసినది.he *ted a mat of bulrush తుంగచాప అల్లినాడు.
To Plate v a వెండి మొలాము చేసుట.
To Play v n ఆట్లాడుట, ఆడుట. he *ed at marbles గోలిగుండ్లాడినాడు. he *edat cards కాకితాలాడినాడు. they * ed the whole night రాత్రి అంతా ఆడిరి. thefire engines *ed for a long time against the house which was on fireకాలుతూ వుండే యింటి మీద జలయంత్రములు శానా సేపుదాకా నీళ్ళు చల్లినవి. the guns*ed ఫిరంగులు కాలినవి. they *ed at soldiers సోజరుల ఆట ఆడినారు.
To Plead v a మనవి చేసుట వాదించుట. he *ed payment చెల్లించినానని మనవిచేసినాడు. he *ed guilty తప్పు వొప్పుకొన్నాడు. he *ed not guilty తన యందుతప్పు లేదని మనవి చేసినాడు. they *ed for him వాడికై మనవి చేసుకొనిరి. he *edignorance యెరగనన్నాడు. the prisoner *ed a former acquittal కైదీ తన మీద విచారణ అయి మునుపే విడుదలై వున్నదని మనవి చేసినాడు.
To Please v a సంతోషపెట్టుట, సంతుష్టి చేసుట,ఆనందింప చేసుట. he *ed withthe news he brought యీ సమాచారము తెచ్చి నన్ను సంతోష పెట్టినాడు. he *dthem with promises నోటి మాటల చేత వాండ్లను సంతోషపెట్టినాడు. this does not *him యిది వాడికి సమ్మతము కాదు. no food can * him long వాడికి యేఆహారమున్ను నిండా దినాలు సయించదు. no one can * him long వాడికి యెవడిమీదనున్ను నిండా దినాలు విశ్వాసము వుండడము లేదు. flowers * the sight andsmell పువ్వులు కంటికిన్ని ముక్కుకున్ను యింపుగా వుంటవి. he *d himself withthinking that he had now succeeded తుదకు జయిస్తిని కదా అని సంతోషపడుతూవుండెను. if it * God that I live ten years longer దేవుడి దయవల్ల నేను యింకాపది యేండ్లు బ్రతికి వుంటే. will you * to come here ? యిక్కడికి దయచేస్తారా. ifyou * you may go there తమకు యిష్టమైతే అక్కడికి పోవచ్చును. I will do asyou * నీ యిష్ట ప్రకారము చేస్తాను. give it me if you * దాన్ని నాకు దయ చేయండి.call her what name you * she certainly lives with him దాన్ని నీవుయేమన్నాసరే మెట్టుకు అది వాడి యింట్లో కాపురమున్నది, అనగా అది వాడికి లంజ అన్నా సరే, పెండ్లాము అన్నా సరే, బానిస అన్నాసరే, మెట్టుకు వాడింట్లోకాపురమున్నదని అర్థము. say what you * you must pay the money నీవు యేమిచెప్పినా సరే ఆ రూకలు చెల్లించక విధిలేదు. the prince was *d to go there రాజుగారు అక్కడికి విజయము చేసిరి. he was *d at this యిందుకు సంతోషించినాడు.she told whomsever she *d కన్నవాండ్లతో చెప్పినది. he is *d with their conductవాండ్లు చేసేది వాడికి యిష్టమే. * your honor I went there నేను అక్కడికి పోయినాను స్వామీ నేను అక్కడికి పోయినాను అయ్యా. * to excuse me క్షమించండి,తమరు క్షమించవలెను.
To Pledge v a కుదువపెట్టుట, తాకట్టు పెట్టుట. he *d his word to do this దీన్ని చేస్తానని మాట యిచ్చి వున్నాడు. I * my honour to do this దీన్ని చేయకుంటేయేమోయి పెద్ద మనిషి అను.
To Plight v a or to pledge యిచ్చుట. I * thee my troth నీకు నా వాక్కిచ్చినాను యిది వివాహ సూత్రములో వొక వాక్యము.
To Plod v n వూగుతూ నడుచుట, కాళ్లీడుచుకొంటూ నడుచుట, పరిశ్రమపడుట,పాటుపడుట. he plodded at this dictionary for twenty years యీనిఘంటువుకై యిరువై యేడ్లు పాటుబడ్డాడు. I saw him plodding along వాడువూగుతూ నడుస్తూ వుండెను.
To Plot v n కుట్రలు పన్నుట, కుయుక్తులు చేసుట.
To Plough v a దున్నుట. a *ed field దుక్కి పొలము.
To Pluck v a పెరుకుట, పీకుట, వూడదీయుట, కోసుట. to * a flower పూలుకోసుట. he *ed some ears of corn వడ్లు దూసినాడు. he *ed up heartధైర్యము తెచ్చుకొన్నాడు. a to * a fowl పుంజును కాల్చడమునకు ముందుగా దానిబొచ్చును పెరికివేయుట.
To Plug v n బిరడా వేసుట.
To Plumb v a or to sound సీసపుగుండు విడిచి లోతు చూచుట.
To Plume himself v n గర్వించుట, తనకు మించిన వాడు లేడని వెర్రి గర్వపడుట.
To Plump v a పుష్టి చేసుట, బలిసేటట్టు చేసుట.
To Plunder v a కొల్లపెట్టుట, దోచుకొనుట, చూరగొనుట.
To Plunge v a ముంచుట. he *d his hand into the waterచెయ్యి నీళ్ళలో ముంచినాడు. this *d me in difficulties యిందువల్ల నేను సంకటములలోతగులుకొంటిని. he *d the dagger into his heart బాకుతో రొమ్మున పొడిచినాడు.
To Ply v a ఆడించుట. he plied the whip కంచీతో వూరికె కొట్టినాడు. he pliedthe pen till evening సాయంకాలము దాకా వ్రాసినాడు. he plied them withflattery వాండ్లను వూరికె స్తోత్రము చేసినాడు. he plied the spade పారతోత్రవ్వినాడు. he plied them with wine వాండ్లకు వూరికె సారాయి పోసినాడుI plied the fire all night long రాత్రి అంతా నిప్పును మంట చేస్తూ వుంటిని.
To Poach v n or to prowl, ఒడ్డు వేసుకొని తిరుగుట, పొంచు వేసుకొని తిరుగుటకట్టు చేసివుండే పక్షులు, మృగాలు, చేపలు మొదలైన వాటినిదొంగలించడానికై వొడ్డు వేసుకొని తిరుగుట.
To Pocket v a జేబులో వేసుట అపహరించుట. he *ed the moneyఆ రూకలను అపహరించినాడు, ఆ రూకలను నోట్లో వేసుకొన్నాడు, he *edthe insult ఆ దూషణను యెరిగిన్ని యెరగనట్టు వుండినాడు.
To Point v a చూపుట. he *ed his finger at them వాండ్లను వేలితో చూపినాడు.he *ed the gun at the fort ఆ ఫిరంగిని కోటకు సూటిగా పెట్టినాడు. or sharpen వాడి చేసుట పదును పెట్టుట కూచిగా చెక్కుట. he *d the stakeఆ వాసమును కూచిగా చెక్కినాడు. he *ed out the difference భేదమును చూపినాడు. I will * out another way వేరే వుపాయము చెప్పుతాను.
To Poise v a సరిగ్గా తూచుట, సరి బరువు వేసుట, సరిగ్గా నిలుపుట. he seated hiswife on one side of the bullock and *d her with a bag of grain ఆ యెద్దు మీద వొక తట్టు పెండ్లాన్ని కూర్చుండబెట్టి మరి వొక తట్టు వడ్లమూటను వేసి సరితూగేటట్టు చేసినాడు. he *d a pole on his nose ముక్కు మీదస్తంభాన్ని వొరగకుండా నిలిపినాడు. he *d these arguments యీ న్యాయములకుతారతమ్యమును విచారించినాడు.
To Poison v a విషము బెట్టుట. he *ed himself విషము తాగినాడు. he *edthe arrow ఆ బాణానికి విషము పట్టించినాడు. this poem *ed him mind యీ గ్రంథము వాడి మనస్సును చెరిపినది. she *ed his mind against me వాడికి నా మీద కారము పుట్టించినది, వాడికి నన్నంటే విషముగా వుండేటట్టు చేసినది.
To Poize v a See To Poise.
To Poke v a తడువులాడుట, పొడుచుట. he *d me with his elbow నన్ను మోచేతితో పొడిచినాడు. do not * the sore ఆ పుంటిని పొడవక. he *d us all intoone room మమ్ము నంతా వొక యింట్లో అడిచినాడు. he *d the fire నిప్పునుకుళ్ళగించినాడు. he *d out his way తడువులాడుతూ బయిటికి పోయినాడు. I *d outthe sense తడమాడి తడమాడి దాని భావము వెళ్లదీస్తిని. all the clothes were *dinto one box బట్టలనంతా వొక పెట్టెలో వేసి కూరినాడు.
To Polish v a మెరుగుబెట్టుట, మెరుగుయెత్తుట, నాగరీక పరచుట. he *ed thelanguage ఆ భాషను దిద్ది చక్కబెట్టినాడు. a polishing stone మెరుగురాయి.
To Poll v a the head వెంట్రుకలను కత్రించుట. or trees కొమ్మలను నరుకుట orelectors పేర్లు వ్రాయించుట. one whose head is not *ed తల పెంచుకొన్నవాడు.
To Pollute v a చెరుపుట, భ్రష్టుచేసుట, అపవిత్రము చేసుట, అంటు చేసుట.
To Pommel v a కొట్టుట, గుముకుట, పులుముట.
To Ponder v n తలబోసుకొనుట, యోచించుట, పర్యాలోచన చేసుట.
To Pop n s to move suddenly లటక్కున దూరుట లేక బయిలు వెళ్ళుట. thebird popped into its nest ఆ పక్షి లటక్కున దూరినది. he popped outలటక్కున లేచిపోయినాడు, దిగ్గున లేచి పోయినాడు, లటక్కున బైటికి పోయినాడు. the thought popt into his head లటక్కున వొకటి తోచినది. he popt intoa chair లటక్కున కూర్చున్నాడు. they were popping at him with their guns వాండ్లు అదాటున వాడి మీద వొకొక వేటు వేస్తూ వుండినారు.
To Pore v n రెప్పవేయకుండా చూచుట, వూరికె నిదానించి చూచుట. he wasalways poring upon books వాడు యేవేళా తల వంచుకొని పుస్తకాలు చూస్తూవుండినాడు.
To Porte, or The Sublime Porte n s. Constantinople అనే సంస్థానము.Constantinople లో వుండే పాదుషాగారు the Sublime Porte has permitted itsministers to do this పాదుషాగారు యిట్లా చేయమని తమ మంత్రులకుఆజ్ఞాపించినారు.
To Portend v a రాబొయ్యే దాన్ని తెలియచేసుట, సూచించుట. this *s fever యిదిజ్వరము రాబోతున్నదని తెలియచేస్తున్నది.
To Portion v a భాగించుట, పంచుట. he * ed his daughter richly కూతురికినిండా రూకలు పెట్టినాడు.
To Portray v a వర్ణించుట, చిత్తరువు వ్రాసుట. he * ed their conduct వాండ్లనడకను తద్వత్తుగా వర్ణించినాడు. he * ed her on horse back అది గుర్రము మీదకూర్చున్నట్టు వ్రాసినాడు. he is * ed as a saint అతడు మహాముని యైనట్టువర్ణింపబడ్డాడు.
To Pose v a కలతబెట్టుట, భ్రమపెట్టుట. this * s me యిందువల్ల నాకు వొకటితోచలేదు.
To Possess v a కలిగివుండుట, స్వాధీనము చేసుకొనుట, పొందుట, అనుభవించుట.he *ed the land వాడికి నేల వుండినది. man *ed reason మనుష్యులకు వివేకము కద్దు. the enemy *ed the land ఆ నేల శతృవుల స్వాధీనములో వుండినది. he *ed me of the particulars ఆ వివరములు నాకు తెలియచేసినాడు. the devil *ed him వాడికి దయ్యము పట్టినది. what * edyou to do this ? దీన్ని చేయడానికి నీకు యేమి పట్టినది. he *ed himself ofthe land ఆ నేలను ఆక్రమించుకొన్నాడు, స్వాధీనము చేసుకొన్నాడు.
To Post v n తపాలు పెట్టుకొని హుటాహుటిగా ప్రయాణము పోవుట. or run వడిగాపరుగెత్తిపోవుట. do you go slowly or do you * ? మెల్లిగా పోతావా తపాలు పెట్టుకొని పోతావా.
To Postdate v a వెనక తేది వేసుట. he *d the letter అయిదో తేదికి పదో తేదివేసినాడు.
To Postpone v a నిలుపుట, నిలిపివేసుట.
To Pot v a కుండలో వేసి పక్వము చేసుట. potted fish మసాలా వేసి కుండలోపక్వము చేసి పెట్టిన చేపలు.
To Potter, or piddle or trifle పర్యాయముగాచేసుట, he * ed a little intrade but he did not do much వాడికి వర్తకము పర్యాయముగా జరిగినదిగాని బాగా జరగలేదు.
To Pouch v a సంచిలో పోసుకొనుట.
To Poultice v a పుండు పగలడానకై పిండిని వుడకబెట్టి కట్టుట.
To Pounce v n తన్నుకొని పోవుట. the hawk *d on the sparrow ఆ డేగపిచ్చికను తన్నుకొనిపోయినది. the cat * d on the rat పిల్లి యెలుక మీద దూరినది.to * paper కాకితము మీద పిండి చల్లుట.
To Pound v a or beat దంచుట, కొట్టుట. తొక్కుట, పొడిచేసుట. or confineబందెగొడ్లను దొడ్డిలోకి తోలి మూసుట.
To Pour v n పోసుట, వంచుట, కుమ్మరించుట. to * drop by drop బొట్టు బొట్టుగా విడుచుట. he *ed forth his sorrows తన దుఃఖమును వెళ్ళబోసుకొన్నాడు.
To Pourtray v a భావమును వ్రాసుట, వర్ణించుట. he *ed me నా భావమునువ్రాసినాడు, నా వలెనే వ్రాసినాడు. he *ed the king as a tyrantరాజును క్రూరుణ్నిగా వర్ణించినాడు. his countenance *ed his feelings వాడి ముఖముచూస్తే వాడి వ్యాకులము తెలిసినది.
To Pout v n మూతి ముడుచుకొనుట, ముఖము చిన్న బుచ్చుకొనుట.her pouting lip వుబ్బుగా వుండే దాని పెదవి, మొద్దుపెదివి.
To Powder v a or to pound పొడిచేసుట, చూర్ణము చేసుట. or sprinkle . she *ed his head వాడి తలకు వాసన పొడి చల్లినది.
To Practise v a వాడుకగా చేసుట, వాడుక చేసుట, అభ్యాసము చేసుట.he *d deception మోసము చేసినాడు. you must * patience నీవు సహనమువహించవలెను. he *s medicine వైద్యము చేస్తాడు. he * d himself in swordplay సాము నభ్యసించినాడు. you must * yourself in talking నీవు మాట్లాడడానికి అభ్యాసము చేయవలెను.
To Praise v a స్తుతించుట, స్తోత్రము చేసుట, శ్లాఘించుట.
To Prance v n యెగిసియెగిసి దుముకుట, కుప్పిగంతులు వేసుట.
To Prank v a శృంగారించుట, అలంకరించుట.
To Prate v n వదురుట, వాగుట, పేలుట. a parrot *s చిలక మాట్లాడుతున్నది.a prating fool వదురుబోతు.
To Prattle v n ముచ్చట్లాడుట.
To Pray v n ప్రార్థించుట, వేడుకొనుట. they * every morningప్రతి దినము తెల్లవారి జపము చేస్తారు. what did you * for ? నీవు యెందుకు ప్రార్థన చేస్తివి. I * for your safe arrival నీవు క్షేమముగా వచ్చిచేరవలెనని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను . he *ed over the book పారాయణము చేసినాడు. It is often a mere expression of civility; as ( Wesley 1.390.) * can you tell me where he is gone ? వాడు యెక్కడికి పోయినాడోయి. * give it meదయచెయ్యి. * who is that man ? అతను యెవడోయి. * why did you do thiswithout my orders ? నా వుత్తరవు లేక దీన్ని యెందుకు చేస్తివోయి * look sir చూడండి అయ్యా. * come here and help me అయ్యో నాకు వచ్చి సహాయము చేయండి.
To Preach v n ప్రసంగించుట, మత విషయమును గురించి ప్రసంగించుట.he *es there అక్కడ మత విషయమును గురించి వుపన్యసిస్తాడు.
To Precede v a ముందుగా పోవుట, మించుట. the fever was *d by agueజ్వరానికి ముందు చలి వచ్చినది. he was *d by a guard సిపాయీలు ముందు తాను వెనకపోయినాడు.
To Precipitate v a తల్లకిందులుగా తోసుట, ఆతురముగా చేసుట, అవసరము చేసుట. they *d him from the top of the houseవాణ్ని యింటిమీద నుంచి తల్లకిందులుగా తోసినారు. the clearing nut *s the impurities of water చిల్ల గింజచేత నీళ్లలో వుండే మురికిఅడుగుకు దిగుతున్నది. he *d his daughter's marriage ఆతురపడికూతురికి పెండ్లి చేసినాడు. they *d themselves upon him ఆతురముగావాడిమీద పోయిపడ్డారు. he *d himself into the street గబగబవీధిలోకి పరుగెత్తి పోయినాడు.
To Preclude v a అడ్డగించుట, నివారించుట, నిషేదించుట. this *d my comingయిందు వల్ల నేను రావడమునకు అభ్యంతరమైనది. to * suspicion he paid themoney సందేహ నివారణమునకై రూకలను చెల్లించినాడు.
To Predestinate v a సంకల్పించుట. God *d him to be a king వాడు రాజుగా వుండేటట్టు దేవుడు సంకల్పించినాడు.
To Predetermine v a ముందుగా సంకల్పము చేసుకొనుట, ముందుగా నిర్ణయించుట.
To Predicate v a స్థిరముగా చెప్పుట, సిద్దముగా చెప్పుట, నిశ్చయముగా చెప్పుట.nothing can be *d regarding this యిందున గురించి వొకటిన్ని నిశ్చయించరాదు.
To Predict v a రాబొయ్యేదాన్ని ముందుగా చెప్పుట, సూచించుట. they *ed hisruin వాడు చెడిపోతాడని ముందుగానే చెప్పిరి.
To Predispose v a సిద్ధపరచుట, ఆయత్తపరచుట, ఉద్యుక్తపరచుట.this food *s them to fever యీ ఆహారము వాండ్లకు జ్వరము రావడానకుఆయత్తపరుస్తున్నది. this was a predisposing circumstance to make them friends వాండ్లు స్నేహితులు కావడానకు యిది ప్రేరేపకముగా వుండెను.
To Predominate v n ప్రబలమౌట. Sanscrit words * in Telugu తెలుగులో సంస్కృత శబ్దములు విస్తారము.
To Preengage v a ముందుగా మాట్లాడుకొనుట. my thoughts were *d and Idid not hear him నా బుద్ధి వేరే ప్రవర్తించి వుండినది వాడు చెప్పినదాన్ని వినలేదు.
To Preexist v n ముందుగా కలిగి వుండుట.
To Preface v n అవతారికగా పెట్టుట. he *d the book with praises of the king రాజ స్తుతిని ఆ గ్రంధమునకు అవతారికగా పెట్టినాడు.
To Prefer v a ముఖ్యముగా యెంచుట, పసందుచేసుట, మెచ్చుట. they * cottonto silk పట్టుకన్న బట్టను ముఖ్యముగా యెంచుతారు. of the two brothers I * theeldest వాండ్లన్నదమ్ములిద్దరిలో పెద్దవాడే వాసి అని నాకు తోస్తున్నది, theking * red him over his servants రాజు అందరికి వీణ్నే యజమానునిగా చేశినాడు. they * salt to sugar చక్కెరకన్న వుప్పు ముఖ్యమంటారు. I * thisనాకు యిదే వాసి. I * Sanscrit above Telugu; or before ( or to )Telugu తెలుగుకన్న నాకు సంస్కృతమే ముఖ్యము. they * death to dishonorఅవమానానికంటే చావు మేలంటారు. he may go if he likes I * stayinghere వాడికి యిష్టమైతే పోనీ నాకు యిక్కడ వుండడమే వాసి. to * a requestor petition మనివి చేసుకొనుట. they * red a charge against him వాడి మీద ఫిర్యాదు చేసినారు. the king * red him tothe post of Minister రాజు వాడికి మంత్రి వుద్యోగము యిచ్చినాడు. had I been *red him to the post of Minister రాజు వాడికి మంత్రి వుద్యోగము యిచ్చినాడు.had I been * red to a higher officer నాకు వుద్యోగము పొడిగితే.
To Prefigure v a రాబొయ్యేపనిని దృష్టాంతపూర్వకముగా అగుపరచుట.sleep *s death చావు యిట్లాగే వుండునని నిద్ర అగుపరుస్తున్నది.
To Prefix v a ముందుగా వుంచుట. the article a is *ed tosubstantives ఏ అనే ఉపపదము నామవాచకములను ముందుగావుంచబడుతున్నది. By prefixing అ sanscrit words becomenegative : thus న్యాయము. justice, అన్యాయముinjustice.
To Prejudge, To Prejudicate v a. విచారించకమునుపే తీర్పు చెప్పుట.
To Prejudice v a విరోధమును కలగ చేసుట. he *d the king against meరాజుకు నా మీద విరోధము పుట్టేటట్టు చేసినాడు.
To Prelude v n ఆరంభించుట, మొదలు బెట్టుట.
To Premeditate v a యోచించుట, ఆలోచించుట.
To Premise v a ముందుగా చెప్పుట, ముందుగా తెలియచేసుట.
To Preordain v a ముందుగా నియమించుట.
To Prepare v a సిద్ధపరచుట, తయారు చేసుట. to * food వండుట.
To Preponderate v n అధిక బళువుగా వుండుట, అధికముగా తూగుట. he wasweighed against me and I *d వాణ్ని నన్ను తూచడములో నేను అధికబళువుగావుంటిని. the reason that he mentioned *d అతడు చెప్పిన హేతువు బలముగావుండినది.
To Prepossess v a పక్షముకలగచేసుట, అభిమానము కలగచేసుట. he *ed theking against me రాజుకు నా మీద విరోధము పుట్టేటట్టు చేసినాడు.
To Presage v a ముందుగా సూచించుట. I * d ill of thisయిందుచేత చెరుపురాబోతున్నదని వూహిస్తిని.
To Prescribe v a ఆజ్ఞాపించుట, విధించుట. the doctor *d this medicineవైద్యుడు యీ మందుకు చీటి వ్రాసి యిచ్చినాడు, యీ మందును పుచ్చుకోమన్నాడు.
To Present v a or to give యిచ్చుట, సమర్పించుట, దానముగా యిచ్చుట.బహుమానము చేసుట. he * ed his hand to me నాకు చెయ్యి యిచ్చినాడు. he * edme this book ఆ పుస్తకమును నాకు బహుమానముగా యిచ్చినాడు. he *ed me hismaster's compliments తన దొర యొక్క సలాములు చెప్పినాడు. he * ed apetition ఆర్జీ యిచ్చినాడు. he *ed a petition ఆర్జీ యిచ్చినాడు. his wife *ed him with a child వాడికి వొక బిడ్డను కన్నది. or shew చూపుట, అగుపరచుట.వుండిరి. When this hope *ed itself to my mind నా మనస్సున యీ కోరిక కలిగినప్పుడు. this house * s a curious appearance యీ యిల్లు వింతగా అగుపడుతున్నది. this book * s many subjects for our consideration యీ గ్రంథములో మనము ఆలోచించవలసిన విషయములు శానా వున్నవి. On every occasion that *s సమయము వచ్చినప్పుడంతా.the guard * ed arms to the General పారావాండ్లు సేనాధిపతి రాగానే తుపాకీలనుముందుకు నిలవబట్టుకొని మర్యాద చేసిరి. he *ed his gun at me తుపాకిని నా మీదికి పట్టినాడు. he *ed the needle to the magnet కాంత రాయికి సూదిని చూపినాడు.the king *ed me to this living రాజు నాకు యీ మాన్యమును దయచేసెను. the grandjury *ed this nuisance గ్రాండ్జూరీలు యీ లోకోపద్రవమును గురించి మనవి చేసుకొనిరి.
To Preserve v a కాపాడుట, రక్షించుట, పోషించుట, భద్రముచేసుట. God * yourmajesty దేవుడు తమ్మును రక్షించుగాక. he *d silence మౌనముగా వుండెను. they *this in memory దాన్నిజ్ఞాపకము పెట్టుకొన్నారు. she *d the fruit in honey ఆపండ్లను మురిగిపోకుండా తేనెలో వేసి పెట్టినది.
To Preside v n అధ్యక్షుడుగా వుండుట, ముఖ్యుడుగా వుండుట.he *d in the school ఆ పల్లె కూటములో అధ్యక్షుడుగా వుండినాడు.the goddess who *s over learning విద్యాధిష్ఠాన దేవత, సరస్వతి.
To Press v a అణచుట, అదుముట. or to squeeze పిండుట, పిడుచుట, వొత్తుట. * the clothes down ఆ బట్టలను కిందికి అణచు అదుము. he *ed the point of his sword against my breast కత్తి మొనను నా రొమ్ము మీద పెట్టి అణచినాడు. to * seed for oil గానుగ ఆడుట. or to distressబాధించుట, వేధించుట, పీడించుట, తొందరబెట్టుట. he *ed his house upon me or he *ed me to take his house వాడి యింటిని నాకు బలవంతముగా తగల గట్టినాడు. being *edby poverty he sold the house దరిద్రము యొక్క తొందర చేత ఆ యింటిని అమ్మినాడు.when they are much *ed వాండ్లకు సంకటము వచ్చినప్పుడు. to * for paymentతరువుచేసుట. to * soldiers or sailors బలాత్కారముగా కొలువులో పెట్టుకొనుట.he * ed them as workmen into the business యీ పనికి వాండ్లను వెట్టికి పట్టినాడు. I *ed this point very much యిందున గురించి నేను నిండా బలవంతము చేస్తిని.
To Presume v n అనుకొనుట, యెంచుకొనుట, తెగించుట, తెంపుచేసుట,అహంకరించుట, గర్వపడుట. I * your father gave you leave to sell the horseఆ గుర్రాన్ని అమ్మడానకు మీ తండ్రి శలవు యిచ్చి వుందురుగదా. May I * to pointout * a fault in this అపరాధము క్షమించవలెను యిందులో వొక తప్పు చూపిస్తాను.Never * అహంకరించక, గర్వపడక. how did you * to sell my horse withoutmy orders ? నా వుత్తరవు లేకుండా నా గుర్రాన్ని యెట్లా తెగించి అమ్మినావు. he *supon your kindness తమ దయవుందని అహంకార పడుతాడు, గర్వపడుతాడు.
To Presuppose v a to suppose beforehand పూర్వభావిగా వుండుట, ముందుగాయెంచుట. I recommend you to sell your father's horse immediately ; this* s his permission నీ తండ్రి యొక్క గుర్రాన్ని యిప్పుడే అమ్మివేయవలసినది,యిందుకు మీ తండ్రి యొక్క వుత్తరవు పూర్వభావిగా వున్నది. they boys learnSanscrit in four years but this * s talent and application ఆ పిల్లకాయలునాలుగు యేండ్లలో సంస్కృతము నేర్చుకొంటారు అయితే యిందుకు ప్రజ్ఞానున్నుఆసక్తిన్ని పూర్వభావిగా వుండవలెను. the witnesses are sworn upon the Koran;this *s that they are Musulmans ఆ సాక్షులు ఖురాను మీద ప్రమాణము చేస్తారుయిందువల్ల వాండ్లు తురకలనే వూహించుకోతగ్గదిగా వున్నది. this rain will makethe corn grow; this *s that the field is sown యీ వానవల్ల పయిరు బాగా పెరుగును యిందువల్ల ఆ పొలము విత్తి వుండవలెననేదిపూర్వ భావిగా వున్నది.
To Pretend v a పైన వేసుకొనుట, వేషము వేసుకొనుట. he *s madnessవెర్రితనము పైన వేసుకొన్నాడు. he *ed anger కోపము వచ్చినట్టు నటించినాడు.she *ed sorrow నీలియేడ్పు యేడిచినది. he *s that he cannotsee తనకు కండ్లు తెలియలేదని మాయ చేస్తాడు.
To Prevail v n ప్రబలముగా వుండుట, విస్తారముగా వుండుట, చెల్లుట, నడుచుట. toovercome జయించుట. they and we contended for four years, at last we*ed వాండ్లు మేము నాలుగేండ్లు పోరాడినాము తుదకు మేము గెలిస్తిమి. an opinion *sthat he is dead వాడు చచ్చినాడని నిండా వదంతిగా వున్నది. the Musulmans * inthat town ఆ పట్టణములో తురకలు మెండు. they *ed against him అతనికంటేవీండ్లు బలవంతులైనాడు. Fever *s there అక్కడ జ్వరము ప్రబలముగా వున్నది. thiscustom *s in that country ఆ దేశములో యీ వాడిక పూర్జితముగా వున్నది. to *upon వొప్పించుట. I *ed on him to go వాణ్ని పొయ్యేటట్టు చేస్తిని. Bribes never *ed upon him to do wrong లంచానికి లోబడి అతను దుర్మార్గము చేయలేదు. I wishI could * upon you to do this అయ్యో నా మాట విని దీన్ని చేయవా.
To Prevaricate v n సందిగ్ధముగా చెప్పుట, గడియకు వొక మాట చెప్పుట,తారుమారుగా చెప్పుట, తప్పు మాటలాడుట. the witness * s ఆ సాక్షి అటూగాక యిటూగాక చెప్పుతాడు.
To Prevent v a ఆటంకము చేసుట, అభ్యంతరము చేసుట. I *ed his comingవాణ్ని రాకుండా చేస్తిని. this *ed the marriage యిందు చేత ఆ పెండ్లి ఆటంకమైనది. there is nothing to * you నీకేమిన్ని అభ్యంతరము లేదు, అటంకము లేదు, అడ్డిలేదు. to * his return I shut the door వాడు తిరిగి రాకుండా తలుపు మూస్తిని to *him from falling I caught his hand వాడు పడకుండా చెయి పట్టుకొంటిని. he didthis to * their saying so వాండ్లు అట్లా అనకుండా దీన్ని చేసినాడు. or to guideరక్షించుట. * us O lord in all our undertakings ఓ దేవుడా సమస్త కార్యములకున్నుమాకు సహాయము చెయ్యి.
To Prey on v a కొట్టుకొని తినుట. or to plunder కొల్లగొట్టుట, దోచుట. the tiger*ed on him వాణ్ని పులి భక్షించినది. Fever *s upon him వాణ్ని జ్వరము పీక్కునితింటున్నది. Robbers *ed upon the village దొంగలు ఆ వూరిని కొల్లగొట్టిరి. thedisease * ed on his vitals ఆ రోగము వాడికి ఆయపట్టున తగిలినది. the wolveshave *ed ( Shak.) తోడేళ్ళ పొట్టలు నిండినవి.
To Price v a ధరకట్టుట, వెలకట్టుట.
To Prick v a పొడుచుట, గుచ్చుట, గుచ్చుకొనుట. this business *s hisconscience తాను చేసినది తనకే పొడుస్తున్నది. shame *ed him on వాడికిసిగ్గుతోచినది. they *ed him on to quartrel జగడము ఆడడానకు వాణ్నిపురికొల్పినారు, యెత్తివిడిచినారు. he *ed his horse on తన గుర్రాన్ని కాలిజోడుముల్లుతో పొడిచినాడు. the horse *ed up his ears ఆ గుర్రము చెవులను పైకియెత్తుకొన్నది. this wine is *ed యీ సారాయి చెడిపోయినది. the pin *s సూదిగుచ్చుకొంటున్నది. + The price in England when varying is thus stated. Corn has risen from 50 to 60 shillings:[per Quarter, being understood] rice has fallen from thirty to 25 shillings.but the Indian expression assumes the rupee as criterion:thus, Corn has risen from 20 to fifteen seers: rice has risen from 16 to 12 seers: (" PER RUPEE,"being understood.) A news paper says, " As the merchants refused selling grain at reason- able price,and rice at present is 14 or 13 seers the raja directed that the duty on grain should be remi- tted on condition that they would agree to sell at 16 seers." In these phrases 14 or 13 seers "per rupee" must be understood.- Again the price of wheat has risen to 14 seers" -meaning, per rupee. Prick, n. s. or point మొన, or hole పొడిచిన రంధ్రము. at the * of the spurకాలిజోడు ముల్లుతో పొడిచేటప్పటికి. the *s of conscience వేదన, పరితాపము. orpenis లింగము, యిది పోకిరి మాట.
To Pride n a. one's self,గర్వపడుట, అహంకరించుట. she *d herself on herbeauty తన అందమును గురించి గర్వపడ్డది, తానే అందకత్తె యని విరగబడ్డది. I * myselfon being your servant తమ పనిలో వుండడమే నాకు గొప్ప.
To Prime v a తుపాకి చెవికి మందు పెట్టుట, రంజకము పెట్టుట. or to smestమొదటివర్ణము పూసుట. the witnesses were ready *d ఆ సాక్షులు నేర్పి తయారుచేయబడ్డారు.
To Prink v a శృంగారించుట, అలంకరించుట.
To Print v a అచ్చువేసుట, ముద్రవేసుట, గురుతువేసుట. he *ed a flower onthe skin of her arm దాని చేతి మీద వొక పుష్పమువలె పచ్చ పొడిచినాడు. to *cloth చీటి అద్దుట. he *ed the mark of his foot on the sand యిసుక మీదవాడి కాలి అడుగు గురుతుకు పెట్టినాడు. he *ed a kiss on her cheek దాని చెక్కిలిముద్దు పెట్టుకొన్నాడు.
To Prize v a గొప్పగా యెంచుట.
To Prize up v a సన్నవేసి లేవనెత్తుట.
To Probe v a పుంటిలో శలాకు వేసి చూచుట, శలాకుపరిక్ష చేసుట, సమర్మకముగావిచారించుట, తెలుసుకొనుట.
To Proceed v n సాగుట, జరుగుట, నడుచుట,కలుగుట. he *ed to the courtసభకు పోయినాడు. this *s from head యిది కాక వల్ల పుట్టినది, కలిగినది. he * edto ask a question వొక ప్రశ్నను అడగసాగినాడు, అనగా అడిగినాడు. he *ed asfollows తరువాత వాడు చెప్పినది యేమంటే, చేసినది యేమంటే. the story *s asfollows అవతల ఆ కథ యేమంటే. " To proceed " ( a phrase used insermons, &c. ) యింతే కాకుండా, యిదిగాక, మరిన్ని.
To Proclaim v. a. చాటించుట, ప్రకటనచేసుట
To Procrastinate v a ఆలస్యము చేసుట, జరుపుట, నేడు రేపని జరుపుట.
To Procreate v a కలగచేసుట, ఉత్పత్తిచేసుట.
To Procure v a సంపాదించుట, జాగ్రత చేసుట.
To Produce v. a. to offer to the view చూపుట, అగుపరచుట, It *s a verycurious appearance అది వొక వింతగా అగుపడుతున్నది. she *d her child to me బిడ్డను తెచ్చి నాకు చూపినది. the marriage *d a quarrel ఆ పెండ్లి వల్ల వొకకలహము పుట్టినది. he *d his witnesses తన సాక్షులను తెచ్చి హాజరు చేసినాడు.this field *d nothing last year పోయిన సంవత్సరము యీ చేను పండలేదు. It iscalculated to * a bad effect యిది చెరువును తెచ్చేటట్టుగా వున్నది. or tobearకనుట, కలగచేసుట. the cow *d a calf ఆ యావు వొక దూడను వేసినది. land that*s salt వుప్పు పండే భూమి. he *d a poem అతడు వొక కావ్యమును చెప్పినాడు,రచించినాడు. In Mathematics నిడుపు చేసుట. he *d the line ఆ గీతను యింకానిడుపు చేసినాడు.
To Profane v a చెరుపుట, అపవిత్రము చేసుట, అశుచి చేసుట. he *d the temple గుడిలో అపచారము చేసినాడు.
To Profess v a చెప్పుట, అనుట, బాహాటముగా చెప్పుట. those who * themselves house keepers గృహస్థుల మని పేరు బెట్టుకొన్నవాండ్లు.a monk *es poverty సన్యాసి దరిద్రుడని పేరు బెట్టుకొని తిరుగుతాడు.they * Christianity తాము ఖ్రిష్టీయన్ వాండ్లంటారు. I do not * Sanscritనాకు సంస్కృతము వచ్చునని చెప్పును. these people * the Musulman Faithతాము తురక మతస్థులని చెప్పుతారు. he *es medicine వైద్య వృత్తిలో వున్నాడు.he *es the law లాయరు వుద్యోగములో వున్నాడు. he *es to be my friendనా స్నేహితు డంటాడు. I do not * to know నేను యెరుగుదు ననను.
To Proffer v a యివ్వవచ్చుట, ఉద్యుక్తమౌట, యత్నపడుట. he *ed me his horse తన గుర్రాన్ని నాకు యివ్వవచ్చినాడు.
To Profit v a ఫలము చేసుట, లాభము చేసుట, ఉపయోగించుట. this medicine *ed him nothing యీ మందువల్ల వాడికి యేమి ఫలము లేదు, గుణము లేదు.
To Prog v a కొల్లబెట్టుట, అపహరించుట.
To Prognosticate v a ముందరి యష్యమును చెప్పుట, రాబొయ్యే దాన్నిసూచించుట. from this head we may rain యీ యెండ చేత వర్షము వచ్చుననివూహించవచ్చును.
To Prohibit v a నిషేధించుట, కూడదనుట, వద్దనుట.
To Project v a యుక్తి చేసుట, యోచించుట, చాచుట. the elephant *ed its trunk యేనుగ తొండమును చాచినది. the tree *s its branches over the wall ఆ చెట్టు యొక్క కొమ్మలు గోడ మిదికి పారివున్నవి. he *ed a school వొక పల్లె కూటము పెట్టవలెనని యోచించినాడు.
To Prolong v a వృద్ధి చేసుట, నిడివి చేసుట, పెంచుట. medicines are given to * life ఆయుర్వృద్ధికి అవుషధములు యివ్వబడుతవి. he *ed his studies చదువును వృద్ధి చేసినాడు. he *ed his journey మరీ దూరము పోయినాడు.
To Promenade v n పచారి చేసుట.
To Promise v a మాట యిచ్చుట, వాగ్దత్తము చేసుట. he *d himself successజయింతుననుకొన్నాడు.
To Promote v a వృద్ధి చేసుట, పొడిగించుట, హెచ్చించుట. the king *d him రాజు అతణ్ని ముందుకు తెచ్చినాడు.
To Prompt v a అంచిచ్చుట, యెత్తిచ్చుట, ప్రేరేపించుట, బోధించుట. Love *ed him to do this ఆశ చేత ప్రేరితుడై దీన్ని చేసినాడు. I will * your memory నీకు జ్ఞాపకము చేస్తాను. Do not * him in repeating the lesson పాఠము అప్పగించడములో వానికి యెత్తి యివ్వవద్దు.
To Promulgate, ToPromulge v a. చాటించుట, ప్రకటన చేసుట, ప్రచురము చేసుట, ప్రసిద్ధము చేసుట.
To Pronounce v a ఉచ్చరించుట, పలుకుట, చెప్పుట, విధించుట, నిర్ణయించుట. he *d sentence తీర్పు చెప్పినాడు, తీర్పు విధించినాడు. he *d this word wrong యీ మాటను తప్పుగా వుచ్చరించినాడు. he *d this to be wrong యిది తప్పని విధించినాడు.
To Prop v a పోటు యిచ్చుట, ముట్టు యిచ్చుట, అనిక పెట్టుట. he *ed his mother as she was falling తల్లి పడకుండా అనుకొన్నాడు. he *ed up the table with stones ఆ మేజకు రాళ్ళను యెత్తడము పెట్టినాడు. they *ed up the wall, with bamboos గోడకు వెదుకు బొంగులను పోటు పెట్టినారు. he called four witnesses to * up his cause తన వ్యాజ్యమును నిగ్గించడానకు నలుగురు సాక్షులను తెచ్చినాడు.
To Propagate v a ఉత్పత్తి చేసుట, వృద్ధి చేసుట, వ్యాపింప చేసుట. they * the sugar cane by slips చెరుకు తుంటెలను నాటి వృద్ధి చేస్తారు. they *d their religion in that country ఆ దేశములో తమ మతమును అభివృద్ధి చేసినారు. Thus error is *d యిట్లా తప్పు మాట అంతటా వ్యాపించినది. This disease is *d by dirtiness కశ్మలము చేత యీ రోగము ప్రబలమైనది.
To Propel v a ముందరికి తోసుట, ముందరికి నెట్టుట. this vessel is propelled by steam యీ వాడను పొగ తోసుకొని పోతున్నది, యీ వాడ పొగ చేత పోతున్నది.
To Prophesy v a రాబొయ్యేదాన్ని ముందుగా చెప్పుట, భవిష్యత్తును తెలియచేసుట. from this heat we may * rain యీ యెండను చూస్తే వర్షము వచ్చేటట్టు వున్నది. I prophesied that this would happen యిట్లా కాబోతున్నదని మునుపే అంటివి. But in 1 Cor. XIII. 9. and in 1. Sam. X. 6. it means as in Matt. 26. 68. ప్రకటన చేసుట, చాటించుట, యెరుక చేసుట. to make known A+ says in Matt. 26. 68. గణయత్వాత్వం అస్మభ్యంకథయ.
To Propitiate v a శాంతి చేసుట, అనుగ్రహము పుట్టేటట్టు చేసుట, అనుకూలపరచుకొనుట, వశ్యము చేసుకొనుట. he *d the god with praise స్తోత్రము చేత దేవుడు ప్రసన్నమయ్యేటట్టు చేసినాడు. he *d the judge with bribes and flattery లంచము చేతనున్ను ప్రియ వచనముల చేతనున్ను తగవరిని అనుకూల పరచుకొన్నాడు, లోపరచుకొన్నాడు. he gave his wealth to * the king రాజుకు అనుగ్రహము వచ్చేటందుకై తన ద్రవ్యమును యిచ్చినాడు. I did this to * him దీన్ని ఆయనకు ముఖోల్లాసముగా చేస్తిని.
To Proportion v a సరుదుట, సరిపరచుట, పొందికపరచుట, పొంకాయింపు చేసుట.
To Propose v a చెప్పుట, అనుకొనుట. they *d peace సమాధానము చేస్తామని మాట్లాడినారు. he *d an entertainment విందు చేస్తానన్నాడు, తలచినాడు. he *d marriage to her నన్ను పెండ్లి చేసుకొంటావా అని దాన్ని అడిగినాడు. he *d a doubt యీ సందేహానికి యేమి చెప్పుతావనిఅడిగినాడు. I will * you a question నిన్ను వొక మాట అడుగుతాను. in afflioting men God *s their god క్షేమమును చేయగోరి దేవుడు మనుష్యులను సంకట పరుస్తాడు.
To Propound v a అడుగుట, చెప్పుట, దీనికేమి గతి యని అడుగుట. to exhibit విశదపరచుట, తెలియచేసుట. It is easy to * question but it is not as easy to solve it యీ సందేహము యెట్లా అని అడగడము సులభమేగాని దాన్ని నివారణ చేయడము సులభము కాదు.
To Propugn v a రక్షించుట, కాపాడుట.
To Prorogue v a నిలిపిపెట్టుట.
To Proscribe v a నిషేధించుట, కూడదని విధించుట.
To Prosecute v a పట్టుకొని పోరాడుట, జరిగించుట, నడిపించుట. he *dhis studies for three years మూడు సంవత్సరముల దాకా చదువును సాగించినాడు.to pursue by law వ్యాజ్యము చేసుట. he *d me నా మీద ఫిర్యాదు చేసినాడు.
To Prosper v a వర్ధిల్లచేసుట, వృద్ధి పొందించుట, కృతార్థుణ్నిగా చేసుట. God *ed him దేవుడు అతణ్ని కృతార్థుణ్ని చేసినాడు.
To Prostitute v a చెరుపుట, భ్రష్టు చేసుట. she *s herself పడుచుకొంటున్నది, వ్యభిచరిస్తున్నది. she *s her daughter కూతురిని కూర్చియిస్తున్నది. he *s his talents in writing foolish verses పిచ్చి పద్యములను వ్రాసి తన యోగ్యతను దుర్వినియోగ పరుస్తాడు. they * law and government to private and selfish ends నీతియని చూడక దొరతనమని చూడక స్వకార్యమునునే ముఖ్యముగా చూచుకొంటారు.
To Prostrate v a పడదోయుట, సాగిలపడుట, సాష్టాంగముగా పడుట. the blow *d me ఆ దెబ్బకు బోర్లపడ్డాను. they *d themselves before him అతని యెదుట సాగిలపడ్డారు. the storm *d the trees ఆ గాలి వాన చెట్లను పండబెట్టినది, పడదోసినది. this fever *d his strength యీ జ్వరము వాడి బలమును పండబెట్టినది, కుంగ కొట్టినది. a prostrating fever పండబెట్టే జ్వరము.
To Protect v a రక్షించుట, కాపాడుట, ఆదరించుట.
To Protest v a రూఢముగా చెప్పుట, ఘట్టిగా చెప్పుట, సిద్ధముగా చెప్పుట. to * against కూడదనుట, కారాదనుట. I * against this యిది యెంత మాత్రము కూడదు. to * a mercantile bill హుండి మిదగాని పత్రము మీద గాని రూకలు చెల్లలేదని పెద్ద కోర్టు లాయరు వ్రాసుట.
To Protract v a ఆలస్యచేసుట, కాలవిడంబము చేసుట.
To Protrude v a బయిటికి తోసుట. he *d his tongue నాలికె వెళ్లబెట్టినాడు.
To Prove v a నిరూపించుట, నిజపరుచుట, పరిక్షించుట. he *d the case ఆ వ్యాజ్యమును నిరూపించినాడు. (the word రుజువు చేసుట is wretched cant : it isno language.) I have *d the goodness of this medicine యీ మందుమంచిదని నాకు అనుభవము. he *d himself a man మగవాడుగా బయిలుదేరినాడు. he *dthe gun-powder తుపాకి మందును పరిక్షించినాడు.
To Provide v a జాగ్రత చేసుట, సిద్ధము చేసుట, అమర్చుట, సంపాదించుట. God *s for us దేవుడు మనకన్నిటికి సిద్ధము చేస్తాడు. ants * food against winter చీమలు వాన కాలము వస్తున్నదని ఆహారమును జాగ్రత్త చేసుకొని పెట్టుకొంటవి. you must * a horse for yourself నీవు వొక గుర్రమును సంపాదించుకోవలసినది. he *d against this misfortune యీ అపాయము రాకుండా జాగ్రతగా వుండినాడు. the bird *s its young with food or the bird *s for its young పక్షి పిల్లకు మేత తెచ్చి పెట్టుతున్నది. or tostipulate ఒడంబరుచుట. the law *s that the son shall take care of hismother తల్లిని కొడుకు పోషించవలెనని ధర్మ శాస్త్రము విధిస్తున్నది.
To Prowl v n పొంచు పేనుకొని తిరుగుట, ఒడ్డు వేసుకొని తిరుగుట, యిది దొంగలనునక్కలను గురించిన మాట.
To Prune v a దిద్దుట, చక్కబెట్టుట, అనగా అధికముగా పెరిగిన కొమ్మలనునరికి చక్కబెట్టుట. he *d the tree చెట్టులో అధికముగా వుండే కొమ్మలను నరికివేసినాడు. he *ed the book from many mistakes ఆ పుస్తకములో తప్పులను దద్దిసవరించినాడు. he *d the style of its luxuriance పిచ్చి ఉత్ప్రేక్షలు లేకుండాచేశినాడు.
To Pry v a తొంగి చూచుట, జాడగా చూచుట. It is base to * into secretsమర్మములను దొంగతనముగా కనిపెట్టడము కారాదు. P. S. n. s. Contraction of Postscript తాజా కలము. a Hindustani phrase. Psalm, n. s. కీర్తన, భజన, గీతము.
To Publish v a ప్రచురము చేసుట, ప్రకటన చేసుట, చాటించుట. he *ed the bookఆ గ్రంథమును ప్రచురము చేసినాడు.
To Pucker v a కుచ్చె పెట్టుట, పింజె పెట్టుట, మడతలు పెట్టుట. his face was *edup with cold చలి చేత వాడి ముఖము మడతలు పడ్డది.
To Puff v n ఉబ్బుట. he *ed with faitgue అలిసి యెగరోజినాడు. he came*ing up the hill యెగరోజుతో కొండ మీదికి వచ్చినాడు. he was *ing with rage భుస్సు భుస్సుమని మండి పడుతూ వుండినాడు.
To Puke v n వాంతి చేసుట.
To Pule v n గోలపెట్టుట, మూలుగుట.
To Pull v a యీడ్చుట, లాగుట, గుంజుట, తీసుట, పెరుకుట, కోసుట. he *ed thebell తాడు యీడ్చి గంటను వాయించినాడు. he *ed the branch on one side thathe might peep తాను తొంగి చూచేటట్టు ఆ కొమ్మను పక్కకు యీడ్చి వంచినాడు. they *ed the flowers ఆ పుష్పములను కోసినారు. they *ed the oars వాండ్లు తెడతోపడవను తోసినారు. they * ed the house down ఆ యింటిని పెరికివేసినారు, పాడుచేశినారు, యిడియ గొట్టినారు. this illness *ed him down much యీ రోగము చేతనిండా చిక్కిపోయినాడు. he *ed in his hand చేతిని యివతలికి తీసుకొన్నాడు. he *edin his horns అణిగినాడు,వెనక్కు తీసినాడు. he *ed off his hatతలమీది టోపిని చేత తీసుకొన్నాడు. he *ed the hair off వెంట్రుకను పెరికినాడు,చిమటా తీసినాడు. they *ed his teeth out వాడి పండ్లను పెరికివేసినారు.he *ed the wire out కమ్మినికమ్మి అచ్చులో వేసి సాగదీసినాడు. they * together oragree వాండ్లు అన్యోన్యముగా వున్నారు, అనుకూలముగా వున్నారు. they do not *together వాండ్ల కొకరికొకరికి పొసగదు. he *ed the tree up by the rootsఆ చెట్లును వేళ్లతో పెరికినాడు, పెళ్లగించినాడు. he *ed up or *ed his horse up కళ్లెమును యీడ్చిపట్టి గుర్రమును నిలిపినాడు. he *ed up the bucket తొట్టినిపైకి చేదినాడు. after he *ed up the weeds కలుపు తీసిన తరువాత.
To Pulverize v a చూర్ణము చేసుట, పొడి చేసుట.
To Pummel v a See To Pommel.
To Pump v n జలయంత్రమును ఆడించుట. he *ed along time but got nowater శానా సేపు జలయంత్రమును ఆడించినాడు గాని నీళ్ళు రాలేదు.
To Pun v n శ్లేషగా చెప్పుట, ద్వ్యర్థిగా చెప్పుట.
To Punch v a బెజ్జము వేసుట. he *ed ten holes in an iron plate వొకయినుప రేకులో ఆణి పెట్టి కొట్టి పది బెజ్జములు వేసినాడు.
To Puncture v a బెజ్జము పొడుచుట. figures *d with a needle on leavesఆకులమీద సూదితో పొడిచిన చిత్రము.
To Punish v a శిక్షించుట, శాస్తి చేసుట, దండించుట. they *ed him with deathవాణ్ని చంపవలసినదని శిక్ష విధించినారు.
To Punt v n to go in a small boat చిన్న పడవ వేసుకొని పోవుట.
To Pup v n పిల్లలు వేసుట, యిది కుక్కను గురించిన మాట.
To Purchase v a కొనుట, తీసుట. he *d his life by committing treacheryద్రోహము చేసి ప్రాణము దక్కించుకొన్నాడు.
To Purge v a పరిశుద్ధము చేసుట, నిర్మలము చేసుట, శుద్ధిచేసుట. he *d himselfby oath ప్రమాణము చేసినందున నిర్దోషి యైనాడు. this medicine *s యీ మందుబేది అవుతున్నది, యీ మందు విరోచనకారి. they use this ceremony to * thehouse from uncleanness యింటికి శుద్ధి పుణ్యాహవాచనము చేస్తారు.
To Purify v a పరిశుద్ధము చేసుట, నిర్మలము చేసుట, పవిత్రము చేసుట, శుద్ధిచేసుట.
To Purl v n జలజలమని పారుట.
To Purloin v a దొంగిలించుట, ముచ్చిలించుట, అపహరించుట.
To Purport v a భావమును తెలియ చేసుట. *ing భావమును తెలియచేసే.
To Purpose v a యత్నము చేసుట, యోచించుట, ఉద్దేశించుట. do you * goingthere అక్కడికి పోవలెనని యత్నముగా వున్నావా.
To Purr v n పిల్లి సంతోషము చేత మూలుగుట.
To Pursant adj అనుసారమైన. * to your orders మీ యాజ్ఞ చొప్పున, మీ యాజ్ఞప్రకారము.
To Purse v a ముడుచుకొనుట. she *d up her mouth మూతిని ముడుచుకొన్నది,బుంగవలె పెట్టుకొన్నది.
To Pursue v a వెంబడించుట, వెంటతగులుట, అనుసరించుట. they *d the thief దొంగను వెంబడించి పోయిరి. they * this trade యీ వ్యాపారము జరిగిస్తారు. he *dthe subject very far అందున గురించి బహుదూరము వుపన్యసించినాడు. they *dtheir studies with him ఆయన వద్ద చదువుతూ వుండిరి.
To Purvey v a సంపాదించుట, జాగ్రత చేసుట, సరఫరా చేసుట.
To Push v a తోసుట, నూకుట, నెట్టుట. he *ed me very hard for an answer నన్ను వుత్తరము చెప్పమని నిండా నిర్బంధించినాడు. this ox * ed wickedly యీయెద్దు మహా పొడిచేటిది he *ed the curtain aside తెరను పక్కగా తోసినాడు,తీసినాడు. he *ed my hand away నా చేతిని అవతలికి తోసినాడు. he *ed thework very far ఆ పనిని బహుదూరము నిగ్గించినాడు. he *ed his scholarsforward very fast తన విద్యార్థులను బహుదూరము ముందరికి తెచ్చినాడు.he *ed his hand in చేతిని లోపలికి దూర్చినాడు. he *ed him into the room by theneck వాణ్ని లోపలికి మెడబట్టి గెంటినారు. he *ed his horse on గుర్రాన్ని బహుత్వరగా తరిమినాడు. this rain will * on the crops యీ వాన ఆ పయిరును బాగాపెంచును. they *ed on the conversation till morning తెల్లవార్లు మాట్లాడిరి. he*ed his tongue out నాలికెను చాచినాడు. the child's teeth are now * ingthrough the gum ఆ బిడ్డకు యిప్పుడే పండ్లు యిగురులో నుంచి బయిలుదేరుతున్నవి.I was *ed for time నాకు యెంత మాత్రముసావకాశము లేక సంకటపడితిని. being *ed to extremities he sold his house అవసరము వచ్చి యిల్లు అమ్ముకొన్నాడు.
To Put v a వేసుట, వుంచుట, పెట్టుట. he * me four questions నాకు నాలుగుప్రశ్నలు వేసినాడు. he * this story about యీ మాట పుట్టించినాడు. he * thebooks away ఆ పుస్తకములను భద్రము చేసినాడు, చాచిపెట్టినాడు. he * his wifeaway పెండ్లాన్ని తోసివేసినాడు. his death * back our business వాడి చావు మాపనికి ఆటంకమైనది, అభ్యంతరమైనది. he * by the money ఆ రూకలను భద్రముచేసినాడు. she * by the curtain and looked out తెరను తొలగ దోసి చూచినది. to * down కిందపెట్టుట, దించుట. they * the palankeen down పల్లకీని దించిరి. thesoldiers * their arms down సిఫాయీలు తుపాకులను నేల పెట్టివేసిరి. * thisdown in your account దీన్ని నీ లెక్కలో వ్రాసుకో. the soldiers * down themob or * down the tumult సోజర్లు ఆ గుంపును చెదరగొట్టిరి, ఆ గల్లత్తును అణిచిరి.he * these arguments down వాడు యీ న్యాయములను ఖండించినాడు. the judge* the witnesses down న్యాయాధిపతి సాక్షులను చీవాట్లు పెట్టినాడు, అవమానముచేశినాడు. he * an end to it దాన్ని నిలిపినాడు, మాన్పినాడు. he * an end to theirlives వాండ్లను చంపినాడు. the tree * forth leaves ఆ చెట్టు చిగిరించినది. thestatement which he * forth or forward వాడు ప్రచురము చేసిన సంగతి. he *forth his hand చెయి చాచినాడు. he * his hand in his pocket తన జేబిలో చెయివేసినాడు. they * the law in force ఆ చట్టమును చెల్లించినారు, జరిగించినారు. he * the stones in contact ఆ రాళ్ళను చేరబెట్టినాడు, కదియబెట్టినాడు. he * the plough in use ఆ నాగేటితో దున్నినాడు. he has * the business in train ఆ పనినడిచేటట్టు వాడికి జ్ఞాపకము చేస్తిని. these words * him in a passion యీమాటలకు వాడికి కోపము వచ్చినది. he * the business in hand ఆ పనిని ఆరంభముచేయించినాడు. she * the earrings in her ears చెవులు కమ్మలు పెట్టుకొన్నది.the wind * the boughs in motion గాలికి కొమ్మలు కదిలినవి. who * you in jail ?నిన్ను పారాలో పెట్టినది యెవరు. he * the jewels in pawn వాడు ఆ సొమ్ములను కుదువపెట్టినాడు, తాకట్టు పెట్టినాడు. he * the army in array దండును మోహరముగా యేర్పరచినాడు. I will * you in the way to do it దాన్ని చేయడానికి నీకు దోవచూపుతాను, క్రమము చెప్పుతాను. he * the statement in writing దాన్ని వ్రాసినాడు. this * her in a fright దానికి యిందుకు భయమైనది. he * in remarkవొక మాట అడ్డము వేసినాడు. he * in his claim తన దావా చేసినాడు. he *the letter into Telugu ఆ జాబును తెనిగించినాడు. I * the business into his hand ఆ వ్యవహారము అతని పరము చేస్తిని, అతనికి అప్పగిస్తిని. he * himself into the hands of the enemy తానేశత్రువులకు చిక్కుపడ్డాడు. he * the business off for a month ఆ పనిని నెల్లాండ్లదాకా చేయక జరిపినాడు. he tried to * the goods off ఆ సరుకులను విక్రయముచేసివేయవలెనని చూచినాడు. this is a mere * off or pretext అది వట్టి సాకు. he *off his clothes బట్టలు తీసివేసినాడు. the snake * off its skin ఆ పాముకుసుము విడిచినది. to * on వహించుట. what did he * on ? యేమి తొడుక్కొన్నాడు.he * his clothes on బట్టలు తొడుక్కొన్నాడు. he * irons on the prisonersహండ్లకు సంకెళ్లు కొట్టినాడు. he * a cover on the lette జాబుకు పైన లిఫాఫావేసినాడు. he * the picture on the nail ఆ పఠాన్ని చిలుక్కు తగిలించినాడు. he * onthe character of a saint బుషివలె నటించినాడు, అభినయించినాడు. she * onpaint ముఖానికి వర్ణము పూనుకొన్నది. he * varnish on the palankeen ఆ పల్లకీకివార్నీసు వేసినాడు, మెరుగునూనె పూసినాడు. he was pleased but * on angerలోపల సంతోషమేగాని బయిటికి కోపము వచ్చినట్టు నటించినాడు. he * the baggage ona cart సామానులు బండిమీది కెక్కించినాడు. he * a bold face on it పయికి బహుధైర్యముగా వున్నట్టు నటించినాడు. he * a good face on the matter ` సంగతినిగురించి బయిటికి సహజముగానే వున్నట్టు అగుపరచినాడు. this piety is merely * onయిది పట్టి దొంగభక్తి. they * a slight upon him వాణ్ని అలక్ష్యము చేసినారు. he *out the fire ఆ నిప్పును చల్లార్చినాడు. they * his eyes out వాడి కండ్లనుపొడిచివేసిరి. * out the light ఆ దీపాన్ని ఆర్పివేయుము. మలిపివేయుము,నిలిపివేయుము. he * this matter out of view ఆ సంగతిని దాచినాడు, మరుగుచేసినాడు. If you talk to me while I am writing you will * me out నేనువ్రాసేటప్పుడు మాట్లాడితివంటే నాకు తప్పిపోను. Your coming at that moment *the matter out of my head ఆ సమయములో నీవు వచ్చినందున ఆ సంగతి నాకుమరిచిపోయినది. he fell and * out his shoulder వాడు పడి భుజము తొలిగినది,కీలు వూడినది. Putting that out of the question దాన్ని విడిచిపెట్టి, దాన్నివిచారించక. he was * out of countenance at this అది వాడికి తలవంపైనది. whydo you * yourself out of your way to abuse them ? వాండ్లను తిట్టడానికినీవెందుకు పైన వేసుకొని పోతావు,వాండ్లను తిట్టడానికి నీకేమి పట్టినది. he * himselfout of his way to abuse them తాను పైన వేసుకొని పోయి వాండ్లను తిట్టినాడు. he* himself out of his way to serve me నాకు సహాయము చేయడానికి తాను పైనవేసుకొని వచ్చినాడు. he * out his hand చెయి చాచినాడు. he * the money out atinterest ఆ రూకలను వడ్డికి వేసినాడు. I * him out in his story వాడు చెప్పే కథనుకలవర పెట్టినాను. he * she cord through the ring ఆ వలయములో తాటినిదూర్చినాడు. he * the horses he * the horses to గుర్రాలను బండికి వేసినాడు,కట్టినాడు. she * her hand to her cheek చెక్కిటచెయి పెట్టుకొన్నది. she * thechild to bed but could not * it to sleep ఆ బిడ్డను పండబెట్టినది, దాని నిద్రబుచ్చలేదు. he * the enemy to flight శత్రువులను తరమగొట్టినాడు. పలాయనమయ్యేటట్టు చేసినాడు. he * them to death వాండ్లను చంపినాడు. I * it to youwhether this is right యిది న్యాయమో అన్యాయమో సివే చెప్పు. he * them tothe sword వాండ్లను నరికినాడు. he * them to the sword వాండ్లను నరికినాడు he* them to silence వాండ్లను నోరెత్తకుండా చేసినాడు, నోరు మూసుకొనేటట్టు చేసినాడు.these words * me to a stand యీ మాటలకు నాకు వొకటీ తోచక మానైపోతిని.when I * all these acts together వీటినంతా కూడా ఆలోచించేటప్పటికి.he * up his sword కత్తిని వరలో వేసినాడు. I could not * up withhis conduct వాడి నడక నాకు సరిపడదు. they * him up to do thisదీన్ని చేసేటట్టు వాడికి పుల్లలు పెట్టినారు, పురికొలిపినారు. he * the silk upin paper ఆ పట్టుకు పైన కాకితను వేసి కట్టినాడు. he * up daily prayersfor their good వాండ్ల క్షేమమును గురించి నిత్యమున్నుప్రార్థిస్తూ వచ్చినాడు.they * this up to auction దీన్ని వేలానికి పెట్టినారు.they * up a fox నక్కను లేపినారు. they * him upon his trail వాణ్ని విచారణకు తెచ్చిరి. he was much * to it for food అన్నానికి లేక మహా కష్టపడ్డాడు.
To Putrefy v a కుళ్ళబెట్టుట, మురగగొట్టుట.
To Puzzle v a చీకాకు పరచుట, చిక్కుల బెట్టుట, కలవరబెట్టుట, భ్రమపరచుట, యెటూతోచనియ్యకుండా చేసుట. why do you * yourself about it ? అందున గురించియేల కలవరబడుతావు.
To Quack v n కూసుట, యిది పొట్టిబాతులను గురించిన మాట. the ducks * పొట్టిబాతులు అరుస్తవి. to * as a doctor కూరగాయ వైద్యము చేసుట, బూటకపు వైద్యముచేసుట.
To Quadrate v n సరిపడుట, తగివుండుట. his conduct does not * with thelaw వాడి నడక చట్టానికి తగివుండలేదు, విరుద్ధముగా వున్నది.
To Quaff v a తాగుట, యిది కావ్య శబ్దము.
To Quake v n వణుకుట, కంపించుట.
To Qualify v a యోగ్యతకలగ చేసుట, అర్హత కలగచేసుట. his learning qualified him to be a teacher వాడి విద్య చేత వాడు వుపాధ్యాయములు కావడానకు యోగ్యత కలిగినది. or to abate తక్కువ చేసుట, న్యునము చేసుట. he qualified his confession by saying that he had been beaten till he confessed వొప్పుకొనేవరకు కొట్టబడ్డానని వాడు అనడమువల్ల వాడు వొప్పుకొన్న దాన్ని దుర్బలపరచినాడు. he is very learned, but he is very proud ; this is aqualifying circumstance వాడు నిండా పండితుడే అయితే బహుగర్వి, యిదే వొకతక్కువ. he has committed, the fault but he did it through necessity;this is a qualifying circumstance వాడు ఆ తప్పు చేసినాడు అయితే దాన్నిచేయవలసిన అగత్యము వచ్చి చేసినాడు, యిందులో యిది వొక గుణము వున్నది.
To Quarrel v n జగడమాడుట, పోట్లాడుట, వివాదపడుట, కలహపడుట. or to find fault తప్పులు పట్టుట, ఆక్షేపించుట. or to disagree గిట్టక వుండుట, విరోధించుట.
To Quarry v a గనిలో కత్తెర రాళ్ళు తవ్వి యెత్తుర. quarried stone కత్తెర రాయి,నల్ల రాయి.
To Quarter v a నాలుగు భాగములుగా చేసుట, నాలుగు పాళ్ళుగా చేసుట, చోటిచ్చుట,వుంచుట. he *ed his troops here తన దండును యిక్కడ పెట్టినాడు. in heraldryధరించుట. he *ed a lion in his coat of arms అతనిది సింహ ముద్ర. the chiefof Vencataghery * a dagger in his coat of arms వెంకటగిరి వారిది కటారిముద్ర.
To Quash v a తోసివేసుట, కొట్టి వేసుట. the judge *ed the objection ఆ యాక్షేపణను కొట్టివేసినాడు.
To Quaver v n కంపితస్వనము చేసుట, వణుకుగా పలుకుట.
To Quell v a అణచుట, హతమణుచుట.
To Quench v a ఆర్చుట, చల్లార్చుట, అణచుట, శాంతి చేసుట. to * the thirstదాహమును అణచుట.
To Quest about v n to hunt, search or seek for వెతుకుట.
To Question v n విచారించుట, ప్రశ్న చేసుట, పృచ్ఛ చేసుట. he who *s muchwill learn much యెవడు నిండా విచారిస్తాడో వాడు అంత నిండా నేర్చుకొంటాడు.
To Quibble v n ద్వ్యర్థిగా చెప్పుట, శ్లేషగా చెప్పుట, సందిగ్ధముగా చెప్పుట, ఆకున పోకన అంటకుండా చెప్పుట.
To Quicken v a త్వర చేసుట, తీవ్రించుట.
To Quiet v a శాంతపరచుట, సముదాయించుట. I *ed his apprehensions వాడిభయాన్ని శాంతపరచినాను.
To Quit v a విడుచుట, విడిచిపెట్టుట, నివృత్తి చేసుట. before he quitted theplace వాడు ఆ స్థలమును విడిచిపోక మునుపు. I could not get * of him నేను వాణ్నినివారణము చేసుకోవలెను. he got * of those debts ఆ ఋణములు విముక్తి చేసుకొన్నాడు.
To Quiver v n వణుకుట, కంపించుట.
To Quiz v a కుచోద్యములు చేసుట, యెకసక్కెము చేసుట, యెగతాళి పట్టించుట. I donot believe him, he is quizzing us అతడు మమ్మున యెగతాళి పట్టిస్తాడుఅతణ్ని నమ్మను. a quizzing glass వొంటి కంటితో చూచే అద్దపు బిళ్ళ.
To Quote v a ఉదాహరించుట. In mercantile phrase ధర చెప్పుట, వెలచెప్పుట.
To Rabbet v a జోడించుట, చేర్చుట, కూర్చుట, అనగా నడమ కుసులు తగిలించిపలకతో పలకను జోడించుట.
To Race v n పందెము వేసుకొని పరుగెత్తుట.
To Rack v a వేదనపెట్టుట, వేదించుట, చిత్రహింసచేసుట. they * ed him tillhe confessed వొప్పుకొనేదాకా వాణ్ని చిత్ర హింస చేసినారు.to strain offవడియకట్టుట. they *ed the wine సారాయిని తేరనిచ్చి వంచుకొన్నారు. he *ed hisinvention for an excuse ఏ సాకు చెప్పుదామని సంకటపడ్డాడు. they *ed hisestate వాడి ఆస్తిగా వుండే భూమి మీద దండగలు పెట్టి యాస్తిని పాడు చేసినారు.to * rent అధికముగా పన్ను కట్టుట.
To Racket v a గల్లంతు చేసుట, రచ్చ చేసుట, అరుచుట, సందడి చేసుట.
To Radiate v n సూర్యకిరణములవలె నల్దిక్కుల వ్యాపించుట, వెలుగుటప్రకాశించుట radiating heat నల్దిక్కుల వ్యాపించే కాక. radiated నక్షత్రాకారము గల.
To Rage v n ఆగ్రహపడుట, మండిపడుట, భగ్గున రేగున. the battle * d all nightరాత్రి అంతా యుద్ధము నిండా ముమ్మరముగా వుండెను.
To Rail v a గ్రాది వేసుట, కటకటాలు కట్టుట or use harsh languageదూషించుట, తిట్టుట, నిందించుట. she * ed at him వాణ్ని దూషించినది. railingacquisition దూషణ.
To Rain v n వాన కురియుట. It *s వాన కురుస్తున్నది.
To Raise v a యెత్తుట, లేవనెత్తుట. excite or stir పుట్టించుట, కలగచేసుట. this *d his anger యిందువల్ల వాడికి కోపము వచ్చెను. this *d his hopes యిందువల్లవాడికి కోపము వచ్చెను. this *d his hopes యిందువల్ల వాడికి ఆశ పుట్టినది. whenhe * d his voice పెద్ద గొంతు పెట్టినప్పుడు. he *d a difficulty ఆక్షేపించినాడు,ఆక్షేపణ కద్దన్నాడు, సందేహించినాడు. they *d cries బొబ్బలు పెట్టినారు. he *d acrop పయిరు వేసినాడు. he *d a tower గోపురము కట్టినాడు. he * d a bank కటట వేసినాడు. the wind *d the dust గాలికి దుమ్ము లేచినది. the king *d him tobe a minister రాజు అతణ్ని గొప్ప జేసి మంత్రి వుద్యోగమిచ్చినాడు. he *d the deadbody to life పీనుగకు ప్రాణము వచ్చేటట్టు చేసినాడు. he *s vegetablesకూరగాయల చెట్టు వేస్తాడు. he *d a bettalion కొత్తగా వొక పటాళమునుయేర్పరచినాడు. he *d a fire there అక్కడ నిప్పుమంట చేసినాడు. he *d thesiege ముట్టడిని చాలించినాడు,తీసివేసినాడు. he *d a blister on my arm నా చేతిమీద పొక్కు మందు వేసి పుండు చేసినాడు. he *d or disturbed the bees తేనెయీగలను రేచినాడు. he *d all the house with his cries కూకలు వేసి నిద్రబొయ్యేవారి నందరిని లేచేటట్టు చేసినాడు. he *d all th neighbourhood అక్కడివాండ్ల నందరిని పిలిచినాడు. he *d a wall వొక గోడ వేశినాడు, పెట్టినాడు. they * daa hymn పాడినారు. they *d supplies in the villages గ్రామాల మీద సరంజామానుతెప్పించినారు. they *d a contribution among them చందా వేసుకొన్నారు. they *d a thousand rupees in one hour వొక గడియలో వెయ్యి రూపాయీలు పోగుచేసినారు. he tried to * the wind by selling his clothes పై బట్ట లమ్మిరూకలు చేర్చవలెని యత్నపడ్డాడు. he tried to * the wind అప్పుసప్పు తియ్యవలెననిపాకులాడినాడు. he *d the price of grain ధాన్యపు వెల పొడిగించినాడు. he *d adoubt సందేహము కద్దని చెప్పినాడు. they *d him from sleep వాణ్ని నిద్రలేపినారు.
To Rake v a దండెతో పోగు చేసుట, మలారముతో పోగు చేసుట he * d the corntogether కోసిన పయిరును దండెతో పోగు చేసినాడు. to* up a forgotten affairమానిపోయిన పుండును మళ్ళీ కెలుకుట మరిచిపోయిన సంగతిని మళ్ళీ ప్రస్తావము చేసికలహము పెట్టుట.
To Rally v a or joke యెగతాళి చేసుట. or encourage ప్రోత్సాహము చేసుట. herallied his troops విరిగిపొయ్యే దండును మంచితనము చేసి పిలుపించినాడు. whenhe rallied his strength మళ్ళీ ప్రాణము కుదటపడేటప్పటికి.
To Ram v a యిడియగొట్టుట, పడగొట్టుట, గట్టనవేయుట. to * down a catridgeతుపాకి లోని తోటాను శలాకతో గట్టించుట. they rammed the road బాటను గట్టనచేసినారు.
To Ramble v n తిరుగుట, అల్లాడుట. they * d through the town పట్టణములోసంచరించిరి, ఇటు అటు తిరిగిరి. In dreams the mind * s స్వప్నములో మనస్సుపరిపరి విధముల పారుతున్నది. we went a rambling ( Tatler No. )విహరించపోయినాము.
To Ramp v n తాండవమాడుట, తుళ్లుట, యెగసిపడుట, దుముకుట.
To Range v a or arrange యేర్పరచుట, సవరించుట, దిద్దుట. he *d his armyin two lines తన దండును రెండు వరసలుగా యేర్పరచినాడు.
To Rank v n తరగతిగా వుండుట, అనిపించుకొనుట. he *s as a gentlemanపెద్దమనిషి అనిపించుకొని వున్నాడు. he *s as a noble poet గొప్ప కవిఅనిపించుకొని వున్నాడు. this *s among the noblest poems యిది మహాకావ్యములలో వొకటి అని అనిపించుకొని వున్నది. this *s above the rest కడమవాటి కన్న యిది వుత్తమముగా వున్నది.
To Rankle v n మెరమెరలాడుట. hatred *s in his breast వాడి మనస్సులోచలము వూరికె మెరమెరలాడుతున్నది.
To Ransom v a పయిక మిచ్చి చెర విడిపించుట, అపరాధ మిచ్చి శిక్ష లేకుండాచేసుట.
To Rant v n కూయుట, పెద్ద గొంతు పెట్టుకొని భట్రాజువలె పద్యములు చదువుట.a ranting poet జంభముగా పెద్ద గొంతు పెట్టుకొని పద్యములు చదివే కవి.

No comments:

Post a Comment