Monday, February 7, 2011

Reason English to Telugu free online dictionary

Reason n s the faculty of judging వివేకము, జ్ఞానము, బుద్ధి. cause హేతువుకారణము. for this గనక, కాబట్టి, ఇందు నిమిత్తము, ఇందు వల్ల. by * of my beinghis relation నేను అతనికి బంధువైనందున. I have good * to know that someof them are excellent doctors వాండ్లల్లో కొందరు ఘనమైన వైద్యులు వున్నట్టు నాకుఅనుభవము మీద తెలిసి యున్నది. a motive నిమిత్తము. justice, right న్యాయము.without say * ఊరికె, నిర్నిమిత్తముగా. It stands to * that he must pay themoney వాడు సిద్ధముగా ఆ రూకలను చెల్లించవలసినదే. this does not stand to *ఇది హేతువు కానేరదు. he beat his wife and children and it stands to *that they hate him పెండ్లాన్ని, బిడ్డలను కొట్టినాడు గనక వాండ్లు వాడి మీదఅసహ్యపడడానకు హేతువు అయినది. devoid of * as a brute అజ్ఞానియైన,అవివేకియైన, పశుప్రాయుడైన. or moderation మితము. this price is out of all*ఇది అపరిమితమైన వెల. In Acts VI 2. ఉచితము. A+ తగును, తగిన పని. P +. Thegoddess of * ( nature or Venus ) లలితా, శ్యామలా, శక్తి. + The following words are given as the observation of a correspondent,but printed (and thus sanctioned) by Wesley. "perhaps what the best heathens called Reason,and " Solomon called Wisdom, St.Paul called Grass in "general: and St.John calls Righteousness, or love: "what Luther denominetes Faith,and Fenelon Virtue "may be only different expressions for one and the "selfsame blessing, the light of Christ shining in "different degrees under different dispensations" " Southey's Life of Wesley Chapter IV.Compare the various interpretations,by different translators,of all these Words the present day Dictionary.
Reasonable adj జ్ఞానము గల, తెలివిగల, న్యాయమైన, తగిన, యుక్తమైనయోగ్యమైన. A +. a * man న్యాయస్థుడు. man is a * creature మనుష్యులుతెలివిగలవాండ్లు, వివేకము గల వాండ్లు. * beings మనుష్యులు. he paid a * sum forit దానికి తగు బాటి వెల యిచ్చినాడు. ( In Rom. XI.1.) అనుభావిష్యతే. A +.బుద్ధిగల. R+.)
Reasonableness n s న్యాయము, ఔచిత్యము. I willshew you the * of hisdemand వాడడిగినది, విహితమేనని అగుపరుస్తాను.
Reasonably adv న్యాయముగా. I * expected you to come నీవు వత్తువని నేనుసహజముగా యెదురు చూస్తూ వుంటిని.
Reasoner n s తర్కించేవాడు, తార్కికుడు. few women are *s స్త్రీలలో వివేకులరుదు.
Reasoning n s ఊహ, తర్కము, యుక్తి. by force of * he discovered this దీన్నివూహ మీద తెలుసుకొన్నాడు, దీన్ని వితర్కించి తెలుసుకొన్నాడు. logic is the art of *తర్కము, అనగా హేతువాద శాస్త్రము.
Reasonless adj నిర్నిమిత్తమైన.
Reassumption n s పునః గ్రహించడము, తిరిగీ తీసుకోవడము.
Rebeck n s మూడు తంతులు గల వీణె.
Rebel n s తిరిగబడేవాడు, ఎదిరించేవాడు, రాజు మీద తిరగబడేవాడు, అధికారి మీదతిరగబడేవాడు.
Rebellion n s రాజద్రోహము, తన యజమానుడి మీద తిరగబడడము, ఎదిరించడము.
Rebellious adj తిరగబడే, ఎదిరించే, అణగని, రాజద్రోహియైన, స్వామిద్రోహియైన,రాజుకు విరుద్ధముగా నడిచే. a * wife మాట వినని ఆలు. hot and * liquors నిండావుగ్రముగా దేహమును తారుమారు చేసే సారాయీలు.
Rebelliously adv తిరగబడి, ఎదిరించి, స్వామి ద్రోహముగా.
Rebelliousness n s దుర్మార్గము.
Reboud n s ఎగరడము, అనగా వొక దాని మీద తగిలిన వురువడిని మళ్ళీ యెగరడము.IN the * the ball hit his face తగిలి యెగిసే వురువడిలో ఆ చెండు వాడి ముఖముమీద తాకినది. he caught the ball in the * తగిలి యెగిసిన చెండును పట్టుకొన్నాడు.
Rebuff n. s. తిరస్కారము, అపజయము,చీవాట్లు,ఎగరగొట్టడము,కసురుకోవడము, heattacked them but he met with a * వాండ్ల మీదికి దూరినాడు గాని అపజయమునుపొందినాడు.
Rebuffed adj వోడిన, ఎగరగొట్టబడ్డ, తిరస్కరించబడ్డ.
Rebuild v a తిరిగీ కట్టుట.
Rebuke n s తిరస్కారము, చీవాట్లు, కసురుకోవడము.
Rebuked adj కూకలు పెట్టబడ్డ, చీవాట్లుపెట్టబడ్డ, కసురుకోబడ్డ. he felt much * atthe child's behaviour ఆ పిల్ల యొక్క నడకను చూచి వాడు బుద్ధి తెచ్చుకొన్నాడు.
Rebus n s ఆకారము వ్రాయడము చేత తెలియచేయబడే శబ్దము. I, Eye, ఈ రెండుశబ్దములకున్ను అర్థము వేరైనా ఉచ్చారణ వొకటిగా వుండడమును పట్టి, కన్ను యొక్క eyeఆకారము వ్రాస్తే దానికి నేను అని అర్థమౌతున్నది.
Rebutter n s or Rejoinder ఆక్షేపణ, ప్రత్యుత్తరము.
Recall n s తిరిగీ పిలవడము, తీసివేయడము, నివారణము.
Recantation n s తిప్పుకోవడము, తిరగబడడము. he made a public * వాడుబాహాటముగా తిప్పుకొన్నాడు, అనగా తాను చెప్పినది తప్పని బాగాటముగా చెప్పినాడు.
Recapitulation n s సంగ్రహించి చెప్పినది, క్రొడీకరించి చెప్పినది, అశ్వాస గర్భము.
Recapture n s మళ్ళీ చిక్కించుకోవడము, పట్టుకోవడము. after the * of thegun పరులు అంటుకొని పోయిన పిరంగిని మళ్లీ చిక్కించుకొన్న తరువాత.
Receipt n s పుచ్చుకోవడము, వరవు, వచ్చుబడి. arrival ప్రవేశము, చేరడము. onthe * of the letter ఆ జాబు చేరినందు మీదట. please to acknowledge the *ప్రవేశం చిత్తగించవలెను. he gave a * నాకు చెల్లు చీటి యిచ్చినాడు. a * in fullపరిష్కార పత్రిక. * or credit side in an account లెక్కలో జమకట్టే పక్క. the first*s of the day బోణి. the place of receiving సుంకము పుచ్చుకొనే స్థలము. hisexpenses exceeded his *s వాడి శలవులు వచ్చుబడికి మించినవి. Medical * orrecipe ఈ మందులను తీసుకోవలసినదని వైద్యుడు వ్రాసి యిచ్చే చీటి.
Received adj తీసుకొన్న, పుచ్చుకొన్న, చేరిన, ముట్టిన, పరిగ్రహించిన, పొందిన. thegrain * వచ్చిన ధాన్యము. the hurt I * నాకు తగిలిన గాయము. he was * up intoheaven స్వర్గ మెక్కినాడు. the * opinion అందరు నమ్మిన సంగతి అందరు అనుకొన్నది.a * word or proper expression లోక రూఢిగా వుండే మాట.
Receiver n s పుచ్చుకొనేవాడు. or Collector రూకలు తండేవాడు. a * to theestate ధర్మకర్త. a * of stolen goods దొంగ సొమ్ములు తీసేవాడు. or vesselకుండ, భాండము, తొట్టి.
Recency n s కొత్తరికము, నవీనత. from the * of the marriage కొత్త పెండ్లి గనక,ఇటీవల జరిగిన పెండ్లి గనక.
Recent adj కొత్తదైన, నూతనమైన, నవీనమైన. In a * marriage ఇటీవల జరిగినపెండ్లిలో.
Recently adv కొత్తగా, ఇటీవల.
Recentness n s కొత్తరికము, నవీనత.
Receptacle n s అధారము, కోశము, స్థానము. thestomach is a * for foodకడుపు ఆహారము వుండే స్థానము. the shawl is a * for fleas శాలువ పురుగులకుపుట్నిల్లు. that hut is a * for beggars అది బిచ్చగాండ్లు కూడే చోటు.
Reception n s అదానము, గ్రహణము, స్వీకారము, సమ్మతి. the house wasprepared for his * ఆయన దిగడానకు ఆ యిల్లు సిద్ధపరచి వుండినది. after the * ofthese people into hospital వీండ్లను ఆస్పత్రిలో పెట్టుకొన్న తరువాత. he gave mea good * నేను పోయినందుకు నిండా సన్మానించినాడు. after this unkind * I wasafraid to speak about the business నేను పోయినందుకు అనాదరణ చేసినాడుగనక ఆ సంగతిని యెత్తడానకు సంకోచించినాను.
Recess n s గూడు. In the * or * es of the conscience అంతర్మానసము నందు,అంతరాత్మ యందు. In the rural * అడవిలో దాగే పట్టున స్థానము నందు. as of acourt or parliament వొక సంవత్సరములో విచారణ లేని దినములు. after the *విచారణ లేని దినాలు అయిన తరువాత.
Recipe n s a medical prescription యోగము, రోగి పుచ్చుకోవడమునకై వైద్యుడువ్రాసి యిచ్చే మందుల చీటి.
Recipeint n s he who recieves పుచ్చుకొనేవాడు, గ్రహించేవాడు.
Reciprocally n s ఈడుకు యీడు, ప్రతికిప్రతి.
Reciprocation n s వొకరి కొకరు చేయడము. * of injuries వొకరికొకరు చేసినవుపద్రవములు. * of kindness పరస్పరము చేసిన వుపకారము.
Reciprocity n s పరస్పరం జరిగించడము, సరికి సరిగా నడిపించడము.
Recital n s చదవడము, చెప్పడము. at the * of history వాడి కథ చెప్పినప్పుడు.
Recitation n s చదవడము, చెప్పడము, ముఖపాఠముగా చెప్పడము.
Recitative n s a kind of tuneful pronunciation, more musical thancommon speech వచనము రాగయుక్తముగా చదవడము.
Reciter n s చదివేవాడు.
Reckless adj చింతలేని, వ్యాకులము లేని.
Recklessly adv నిశ్చింతగా, అలక్ష్యముగా.
Recklessness n s పిచ్చిసాహసము, వెర్రి ధైర్యము, అలక్ర్యము.
Reckoner n s ఎంచేవాడు, లెక్క పెట్టేవాడు.
Reckoning n s ఎన్నిక, లెక్క. he is gone to his చచ్చినాడు. off *s తేలిననికరము, ఇది దండు భాష.
Reclaimed adj reformed పనుబడ్డ, దోవకుతేబడ్డ, దిద్దబడ్డ. land * from forestఅడివి కొట్టి చేసిన పొలము.
Recluse adj retired ఏకాంతమైన. he leads a * life ఏకాంతవాసిగా వుంటాడు.
Reclusely adv ఏకాంతవాసముగా, ఏకాంతముగా, సన్యాసిగా.
Recluseness n s మునివృత్తి, సన్యాసివృత్తి.
Recognisable adj that may be known or acknowedged గురుతుపట్ట తగ్గ,వొప్పుకోతగ్గ. there is no * signature ఇక్కడ గురుతుపట్టగల చేవ్రాలు లేదు. thils is not a * authority ఇది ప్రసిద్ధమైన సాధకము కాదు.
Recognition n s విచారణ, పరిశోధన. he made a * of the prisoner వాడి అట్టుపుట్టు ఆనవాలు చూచుకొన్నాడు.
Recognizance n s సఫరు జామీను చీటి. he forfeited his *s వాడు యిచ్చినజామీను తప్పినాడు.
Recognized adj అంగీకరించిన, ఒప్పుకొన్న.
Recoil n s తగిలిన వురువడి చేత వెనక్కు యెగరడము. In the * the ball struckme ఆ గుండు వెనక్కు యెగిసే వురువడిలో నా మీద తగిలినది. In the * of passionకోపమణిగి శాంతము వచ్చేటప్పటటికి.
Recollection n s జ్ఞాపకము, స్మరణము. loss of * విస్మృతి. beyond all *అనాదిగా.
Recommencement n s పునరారంభము, మళ్ళీ మొదలు పెట్టడము.
Recommendation n s That which secures a kind reception స్తుతి, శ్లాఘనశిఫారసు. at your * I bought the horse తమరు ఆ గుర్రము మంచిదనడము వల్లనేను కొనుక్కొన్నాను. her beauty is one * her high birth is another దానికివుండే అందము వొక విశేషము, అది మంచి కులములో పుట్టినదన్నది మరి వొకవిశేషము. the situation of the house is its principal * ఆ యింటికి వుండేవిశేషము అది మంచి స్థలములో వుండడము వొకటే. at your * I employed him వాడుమంచివాడని నీవు తెచ్చి విడిచినందున వాడికి నేను పని యిచ్చినాను. at your * I gavethis medicine to the horse తమరు మంచిదన్నందున ఆ గుర్రానికీ మందుయిచ్చినాను.
Recommendatory adj శ్లాఘవగా వుండే. a * letter శిఫారసు, జాబు.
Recommended adj శ్లాఘించబడ్డ, శిఫారసు చేయబడ్డ. he was * by my brotherవాణ్ని మా తమ్ముడు శిఫారసు చేసినాడు. this poem is * by its harmony ఈకావ్యమునకు వుండే విశేషము శ్రావ్యత. he is much * by his humility వాడియందుముఖ్యముగా వుండే సద్గుణమేమంటే నమ్రత.
Recompense n s బహుమానము, ప్రతికిప్రతి, చెల్లుకుచెల్లు.
Reconcileable adj సమాధానము చేయకూడిన.
Reconciled adj శాంతపడ్డ, సఖ్యపడ్డ, అనుకూలపడ్డ, వొద్దికచేయబడ్డ, ఇమిడిన. howcan these two statements be * ? ఈ రెండు సంగతులకు యెట్లా పొందిక అవునుసరిపడును.
Reconcilement n s సమాధానము, వొద్దిక, పొందిక, ఉపశమనము, శాంతి. aftertheir * వాండ్లిద్దరు సఖ్యపడ్డ తరువాత.
Reconciler n s సమాధానపెట్టేవాడు, వొద్దిక చేసేవాడు.
Reconciliation n s సమాధానము, ఐకమత్యము, వొద్దిక. after his * with hisfather తండ్రికిన్ని అతనికిన్ని వొద్దిక అయిన తరువాత. In Rom. V.10 . and Col. I.20 . మేలనము A +.
Recondensed adj పునఃఘనీభవించిన, మళ్ళీ పేరుకొన్న.
Recondite adj గోప్యమైన, గుప్తమైన, మర్మముగా వుండే. a * sense గూఢార్థము. a* book రహస్యమైన గ్రంథము.
Reconnoissance n s enquiry విచారణ, విమర్శ, అనగా పోయి, వుండే వైఖరినిచూచుకొని రావడము. he made a * of the place అక్కడికి పోయి వుండే వైఖరినిచూచుకొని వచ్చినాడు.
Reconsideration n s పునర్విమర్శ.
Record n s గ్రంథము, చరిత్ర, జ్ఞాపకార్థము వ్రాసి పెట్టినది. he placedit on * దాన్ని గ్రంథములో వ్రాసి వుంచినాడు. the greatest battle on *అన్నిటికంటె మహత్తయిన యుద్థము.
Recorder n s he who writes గ్రంథములో వ్రాసుకొనేవాడు, మునిషి. he whojudges న్యాయాధిపతి. a lute వీణ.
Recourse n s ఉపాయము, ఆశ్రమము, అవలంబనము. he had * to me నన్నాశ్రయించినాడు. he had * to the bottle తాగినాడు. he had * to his purse సంచిలోనుంచి రూకలు యెత్తినాడు.they had * to this method ఈమాగ ్మును పట్టినారు,అవలంబించినారు. they had * to stratagem తంత్రము చేయడానికి మొదలుపెట్టినారు.he had * to entreaties బతిమాలుకో మొదలుపెట్టినాడు.
Recoverable adj సాధ్యమైన.
Recovered adj కుదిరిన. the money was * పోయిన రూకలు వచ్చినవి.
Recovery n s కుదరడము, అనుకూలము కావడము, స్వస్థము కావడము. thisprevented his * ఇది వాడి వొంటిని కుదరనీయలేదు. after the * of the money ఆరూకలు మళ్ళీ వాడి చేతికి వచ్చిన తరువాత.
Recreant adj cowardly, meanspirited పిరికైన, పందైన.
Recreation n s ఆట్లాట, ఉల్లాసము, క్రీడ, లీల, వినోదము.
Recrimination n s నీవంటే నీవనడము, రంకుకు ప్రతిరంకు కట్టడము, వొకరిని వొకరునిందించుకోవడము, నేరము మోపిన వాని మీద బదులుకు వొక నేరమును మోపడము.mutual *s took place నీ వంటే నీవని పరస్పరం దూషిమచుకొన్నారు, తప్పుమోపినారు.
Recriminatory adj నీవంటే నీవనే, వొకరిని వొకరు తప్పులు పట్టే. several *letters passes నీవల్ల వచ్చిన దంటే నీవల్ల వచ్చిందని కొన్ని జాబులు జరిగినవి.
Recruit n s కొత్తగా చేరిన సిపాయి, కొత్తగా కొలువులో పెట్టుకోబడ్డవాడు.
Rectangle n s ఇటికె రాయివలె నిడుపువాటుగా వుండే చౌకము.
Rectangular adj ఇటికె రాయివలె నిడుపువాటి చౌకముగా వుండే.
Rectification n s దిద్దుబాటు, సవరించడము, చక్కబెట్టడము. after the * ofthese accounts ఈ లెక్కలను దిద్దిన తరువాత. the * of spirits మళ్ళీ మళ్ళీ దించిధృతులను శుద్ధి చేయడము.
Rectified adj దిద్దుబాటు చేయబడ్డ, చక్క పెట్టబడ్డ. after the account was *ఆ లెక్క దిద్దుబాటు అయిన తరువాత. * spirits మళ్ళీ మళ్లీ దించి శుద్ధి చేయబడ్డధృతులు.
Rectilinear adj consisting of right lines బుజువైన, వంకరలేని. a square isa * figure చదరము బుజువైన గీతలు గల ఆకారము.
Rectitude n s uprightness ఆర్జవము, యథార్థత, సరళత. this proves the *of his conduct అతను చేసినది సరియని యిందువల్ల తెలుస్తున్నది. a man of *ఖండావాది, నిజస్థుడు, పెద్ద మనిషి.
Rector n s గ్రామపాదిరి.
Rectory n s గ్రామపాదిరి వుండే మఠము.
Recturm n s the great gut కడుపులో పురీషము వుండే స్థానము.
Recumbent adj lying down పండుకొన్న, శయనించిన.
Recurrence n s పునఃసంభవించడము, మళ్ళీ తటస్థించడము. from the frequent* of this word ఈ మాట తేపతేపకు రావడము వల్ల. to prevent the * of sucherrors ఈగ గంటి తప్పులు మళ్ళీ సంభవించకుండా.
Recusant adj refusing కాదనే, అక్కరలేదనే. the Jangams are * s ordissenters జంగములు తిరగబడ్డవాండ్లు అనగా బ్రాహ్మణ్య మత విరోధులు.
Red adj ఎర్రని, కావి కెంపు. the ruby is * కెంపు, యెర్రనిది. she wears a markon her forehead అది నొసట కుంకుమ పెట్టుకొంటున్నది. the pomegranateflower is * and the seeds in the fruit are also * దాడిమ పువ్వును యెర్రనిదిదాని పండులో వుండే విత్తులున్ను యెర్రనివి. bright * జపాపుష్పపు యెరుపైనదాసానిపువ్వు యెరుపైన. light * నీరు కావియైన. pale * పాటలమైన. * sandy soilగరపనేల. * pepper మిరపకాయల పొడి. * lead సిందూరము. a * cow లక్క వన్నెఆవు. * hair లోహిత కేశము, పల్ల వెంట్రుకలు. a * heat కాపు, అనగా యినుము పండకాగిన కాపు మడ్డు. a * hot iron పండ కాగిన యినుము, యెర్రగా కాగిన యినుము. *thread .తొగరు. * wine యెర్రని వైను సారాయి. the * lotus కెందామర, చెంగల్వ. a *eyed giant తామ్రాక్షుడు. * wood చేవమాను. * wood used in dying మద్దిచెక్క. toturn * ఎర్రబడుట. * letter days పంచాంగములో యెర్రగురుతు పెట్టిన దినములు,అనగా పండుగలు. * sea ఇది వొక సముద్రము యొక్క పేరు. Yates in Psalm .C VI .8.uses the Hebrew word సూఫ్ సాగరము. Red hills ( a village near Madras) is called Pozhil near మాధవరం.
Red coat n s ( a cant word for a soldier ) శిపాయి.
Redbreast n s గోరింకవంటి వొక పిట్ట.
Reddish adj కొంచె మెర్రగా వుండే. * hair పల్ల వెంట్రుకలు. * brownపింగళవర్ణము, పింజర వర్ణము.
Reddishness n s కొంచెము యెరుపు, ఎర్రదాళు, నీరుకావి.
Redeemed adj విడిపించబడ్డ, విడుదలచేయబడ్డ, విమోచనము చేయబడ్డ, కడతేర్చబడ్డthe * ముక్తులు, విముక్తులు, విమోచనము చేయబడ్డవాండ్లు. In Ps. CVII.2 . పరదేశమోచితా లోకాః. A+.
Redeemer n s రక్షకుడు, మోచకుడు, తారకుడు, మోక్షప్రదుడు. A + says త్రాణకర్తముక్తిదాత. A + In Jer.50.34. ముక్తి దాత. D+.
Redemption n s ముక్తి. A+ విముక్తి, విమోచనము, మోక్షము. In Hebr. IX.12 .ముక్తి. A+. the * of a promise చెప్పినట్టు జరిగించడము, చెప్పిన మాటను నెరవేర్చడము. In * of my promise I now write to say that చెప్పిన మాటనుకాపాడుకోవడమునకై నేను యిప్పుడు వ్రాసేది యేమంటే. * jewels from pawn కుదవవిడిపించడము. their credit is sunk beyond * వాండ్ల యెడల నమ్మకము యికనుయెన్నటికిన్ని లేకుండా పోయినది.
Rediments n s The first principles; the first elements of a science మూలాధారములు, మూల సూత్రములు. In schools they teach the * of learning పల్లె కూటములో మొదట చదువుకు మూలాధారములను నేర్పుతారు. the * of grammar వ్యాకరణ సూత్రములు.
Redlead n s సిందూరము.
Redness n s రక్తిమ.
Redolent adj fragrant సుగంధముగల, సువాసనగల. * of joy and youthఆనంద యౌవనభరితమైన.
Redoubled adj మిక్కిలి అధికమైన. * kindness హెచ్చిన ప్రేమ, మరిమరి అభివృద్ధిఅయిన దయ. * efforts పదే పదే చేసిన ప్రయత్నములు.they killed him with *blows దెబ్బ మీద దెబ్బ కొట్టి చంపినారు, వూరికె కొట్టి చంపినారు.* echoes పదేపదేకలిగిన ప్రతిధ్వనులు.
Redoubt n s కోటగోడ మీద వుండే బురుజు.
Redoubtable adj అఘోరమైన, భయంకరమైన.
Redounding adj అతిశయించిన.
Redress n s పరిహారము గల. he was ruined without * వాడు వొక గతీ లేకచెడ్డాడు. he is quite without * వాడు గతి మోక్షములు లేకుండా పడి వున్నాడు.
Redstart n s నూనె బుడ్డిగాడు అనే పిట్ట.
Redstreak n s a kind of apple వొక పండు.
Reduced adj తగ్గిన,తగ్గించిన, మట్టుపడ్డ, అణిగిన, లోబడ్డ. the * stream of riverమట్టుబడ్డ ప్రవాహము. a family in * circumstances ఎత్తుబడ్డ సంసారము. a * fort పట్టుకోబడ్డ కోట. he is in circumstances దీన దశలో వున్నాడు. he was * togreat misery దీనావస్థను పొందినాడు, బీదవాడయిపోయినాడు. the house was * toashes ఆ యిల్లు మండి కుప్పబడ్డది. our fifty horses were * to thirty మనకువుండిన యాభై గుర్రాలు ముప్పైకాడికి వచ్చినవి. they were * to nothing అది యేమిలేకపోయినది, క్షీణించినది. he was * to sell his house వాడికి యిల్లుఅమ్ముకోవలసిన గతి వచ్చినది.
Reduction n s the act of reducing తగ్గడము, తగ్గించడము, మట్టుపరచడము,స్వాధీనపరచుకోవడము. after the * of the fort ఆ కోట పట్టుబడ్డ తరువాత. thefever caused great * of strenght ఆ జ్వరము చేత బలము కుంగిపోయినది.every thing tended to the * of his majesty ఆయనకు అన్ని విధాల క్షీణగతివచ్చినది. these different sums by * equal one hundred rupees ఆయానాణ్యములు మొత్తములను మార్పు ప్రకారము వేసుకొంటే నూరు రూపాయలు అవుతవి.
Redundance, Redundancy n s. విస్తీర్ణత, విస్తారత, పెంపు, అభివృద్ధి, ఆధిక్యముఅతిశయము.
Redundant adj విస్తరించిన, విస్తారమైన, అధికమైన.
Redundantly adv విస్తారముగా, విస్తరించిన.
Reduplication n s ఇబ్బడిగా చేయడము.
Redwing n s వొక విధమైన పక్షి.
Redwood n s చేపమాను.
Reechy adj smoky పొగ చూరిన.
Reed n s రెల్లు, కుందురెల్లు, కాకివెదురు, జమ్ము బెత్తము. a * pen కలము. theplant called Indian * మెట్ట తామర. unstable as a * నిలకడలేని నమ్మరాని. heis a mere broken * వాణ్ని నమ్మడము బుడ్డను నమ్మియేట్లో దిగినట్లే. he does notlean on a mere broken * అతడు పట్టినది చింత కొమ్మేగాని మునగ కొమ్మ కాదు. *of a clarionet సన్నాయి యొక్క పీకె. a weaver's * పన్నె.
Reedy adj జమ్ముగల. a * brook జమ్ము మూసుకొని వుండే కాలవ.
Reef n s a fold in a sail వాడ చాపలో మడిచే వొక మడత. a chain of rockslying near the surface of the water చట్టు.
Reek n s పొగ, ఆవిరి.
Reeking adj నిండారిన. he came * with blood నెత్తురుతో దొప్పదోగుతూవచ్చినాడు. * with sweat చెమట వడుస్తూ వుండే. when a man was * withfever వొకడికి జ్వరము పెట్టుతూ వుండేటప్పుడు. he came * from the brothelముండ యింట్లో నుంచి రోతగా బయిలుదేరి వచ్చినాడు. * with sin పాపమగ్నుడైన. * hotఅంటుకొనేవేడి, నిండా వేడి.
Reeky adj పొగ చూరిన.
Reel n s a frame to wind yarn on పరిటె. a kind of dance వొక విధమైననాట్యము.
Re-election n s మళ్ళీ యెర్పరచడము, మళ్లీ కోరుకోవడము. after his * అతడుమళ్ళీ యేర్పరచబడ్డ తరువాత.
Re-embarkation n s మళ్లీ వాడ యెక్కడము.
Re-enforced adj ఉపబలము కలిగిన. after the Regiment was * ఆ పటాళానికివుపబలముగా కొందరు వచ్చి చేరిన తరువాత.
Re-enforcement n s ఉపబలము, పైబలము, పైగా వచ్చి చేరిన దళము. this *was of no use ఉపబలముగా వచ్చినవాండ్ల వల్ల వుపయోగము లేదు, పైగా వచ్చినజనము వల్ల ప్రయోజనము లేదు.
Re-entrance n s మళ్లీ ప్రవేశించడము. after his * అతడు తిరగీ వచ్చి చేరినతరువాత.
Reer-mouse n s or bat గబ్బిలము.
Re-established adj మళ్ళీ స్థాపించబడ్డ, మళ్లీ యేర్పరబడ్డ, మళ్ళీ కుదురుబాటుచేయబడ్డ. his health was * or was cured వాడి వొళ్ళు కుదిరినది.
Re-establishment n s పునరుద్దారము, మళ్ళీ కుదురుబాటు చేయడము.
Refardlessness n s అలక్ష్యము, పరాకు, అసడ్డ.
Refection n s ఫలాహారము, ప్రాశనము.
Refectory n s the place where they take their meals in a conventభోజన శాల, భోజనము చేశే యిల్లు.
Referee n s మధ్యవర్తి, మధ్యస్థి, తటస్థుడు.
Reference n s relation సంబంధము. what he said has * to this వాడుచెప్పినది దీనికి సంబంధిస్తున్నది, వాడు చెప్పిన మాట యిందున గురించినదే.ిhe gave me * no for payment ఆ రూకలు యిట్టివారు యివ్వవలసినదని అతనునాకు చెప్పలేదు. before * to the higher authorities పై అధికారుల వద్దకిపంపక మునుపు. with * to your letter నీవు నా పేరట జాబు వ్రాసి వుంటివి గదా.with * to what you formerly mentioned మునుపు మీరు చెప్పి యుండిన సంగతిని గురించి.
Referendary n s మధ్యవర్తి, అధికారి.
Referrible adj సంబంధించే. this fever is * to his bathing యీ జ్వరముతలంటు సంబంధమైనది, అనగా వాడు తలంటుకొన్నదే యీ జ్వరమునకు కారణముగావున్నది. to what is this * ? ఇది యెందువల్ల కలిగినది, యిది కలిగినందుకు కారణమేమి.
Refined adj శుద్ధి చేసిన, శుద్ధి చేయబడ్డ, నిర్మలము చేయబడ్డ, పుటము వేయబడ్డ,పరిష్కృతమైన, నాగరీకమైన. * sugar తెల్ల చక్కెర. * gold అపరంజి. * silver చొక్కపువెండి. this is a * stroke of malice యిది చలము యొక్క చమత్కారము.this isa meaning of the word ఆ మాటకు యిది వొక చమత్కారమైన అర్థము. * languageనాగరీకమైన మాట. a * stroke of wit బుద్ధి చమత్కారము. this is a * sense ofthe word యిది ఆ శబ్దమునకు వుండే సూక్ష్మమైన అర్థము, ఇది సాధారణమైన అర్థముకాదు. a man of * parts కుశాగ్ర బుద్ధి గలవాడు.
Refinedly adv నాగరీకముగా ఉపన్యసించి.
Refinement n s పరిశుద్ధము చేయడము, పరిష్కారము చేయడము. from the * ofhis style వాడిది అందమయిన పాకము గనక. this is a mere useless * ఇది వట్టిపనికిమాలిన చమత్కారము.
Refiner n s బంగారును చొక్కము చేసేవాడు, శుద్ధి చేసేవాడు.
Refining n s శుద్ధిచేయడము, బంగారును చొక్కముచేయడము, పరిష్కరించడము.In Rhetrick అలంకారము దీర్ఘోపన్యాసము.
Reflected adj ప్రతిఫలించిన. like a purse * in a mirror అద్దములో అగుపడేరూకల సంచివలె.
Reflection n s In a glass ప్రతిఫలనము, ప్రతిబింబము. In the mind తలంపు.యెన్నిక, ఆలోచన, ధ్యానము. on * I see that I was wrong నేను యోచనచేసేటప్పటికి నేను తప్పినట్టు కనుక్కొన్నాను. he is a man of no * వాడు ఆలోచనపరుడుకాడు. remark or reviling ఆక్షేపణ, తిరస్కారము, నింద. Ward on Hindus. says. " Indeed in those departments of learning which requirethe deepest * and the closest application the Hindu literati have beenexceeded by none of the ancients." The deepest * దూరపాలోచన, దీర్ఘాలోచన.
Reflective adj. the reflective verb ఆత్మనేపదక్రియ, తెలుగులో తెచ్చుకొనుట, చెప్పుకొనుట, తీసుకొనుట, వ్రాసుకొనుట మొదలయినవి
Reflector n s అద్దము.
Reflex adj ప్రతిఫలించే, ప్రతిబింబించే.
Reflexion n s See Reflection.
Refluent adj వెనక్కు మళ్ళీపారే.
Reflux n s నీళ్లు వెనక్కు మళ్ళు కోవడము, ప్రవాహము వెనక్కు మళ్ళి పారడము.
Reformation n s మళ్ళీ చక్కబడడము, పునరుద్ధారణము కావడము, కుదురుబాటుకావడము బాగుపడడము దోవకు రావడము. the Protestant *ప్రోటస్టాంటు మతోద్ధారణము. అనగా Roman Catholic మతమును చాలించి Pope అనేగురువు యొక్క అధికారమును తిరస్కరించడము. Sankara Chari made a * amongthe bramins శంకరాచార్యులు బ్రాహ్మణమతోద్ధారణ చేసినాడు. Hebr. IX.10 .సిద్ధీకరణం. A +.
Reformed adj చక్కబడ్డ, దిద్దుబాటైన, దోవకు వచ్చిన.
Reformer n s దిద్దుబాటు చేసేవాడు, పరిష్కరించేవాడు, ఉద్దారకుడు. the *sకాతోలిక్కు మతమును పోగొట్టి ప్రోటస్టాంటు మతమును స్థాపించిన గురువులు. SankaraChari is considered a * among the bramins బ్రాహ్మణులు శంకరాచార్యులనుమతోద్ధారకుడంటారు.
Refraction n s వక్రీకరణము, వక్రగతి, ఋజు రేఖాభంగము, అనగా కిరణముల మొనవొక దాని మీద ప్రసరించడములో కొంచెము వంగడము.
Refractoriness n s మూర్ఖత, మొండితనము, ముష్కరము, హటము.
Refractory adj పెడసరమైన, మొండియైన, మూర్ఖమైన, ముష్కరమైన. he was *తిరగబడ్డాడు. the horse was * ఆ గుర్రము మొండి చేస్తూ వుండినది.
Refreshed adj విశ్రాంతి పొందిన, ఆయాసము తీరిన, అలసట తీరిన, ఉపశమించిన.flowers * by rain వాన చేత బాగా వుండే పుష్పములు. the colours that are *by applying oil నూనె చరిమి నందున బాగా వుండే వర్ణములు.
Refreshing adj ఆప్యాయమాణమును చేసే, సేద దీర్చే, ఉపశమింపచేసే. a * sleepఆరోగ్యకరమైన నిద్ర, హాయిని కలగచేసే నిద్ర
Refreshment n s ఫలాహారము, ప్రాశనము, అల్ప భోజనము. *s అన్నపానాదులు.
Refrigeration n s చల్లబడడము, చల్లబడేటట్టు చేయడము, శీతలము చేయడము.
Refrigerative adj సుశీతలకారి యైన.
Reft adj ( that is bereft.) reft of sense తెలివి తప్పిన. * of his childrenబిడ్డలను పోగొట్టుకొన్న, బిడ్డలను కోలుపుచ్చుకొన్న.
Refuge n s దిక్కు, శరణము, రక్షకము, ఆశ్రయము, అవలంబనము. to seek *ఆశ్రయించుట, మరుగుజొచ్చుట. a place of * దాగే స్థలము.
Refugee n s శరణాగతుడు, వలసలేచి వచ్చి చేరినవాడు. a Persian * primeaccompanied our troops తన దేశములో నుంచి తప్పించుకొని మన దండుతో కూడావచ్చే పెర్షియా దేశపు యువరాజు.
Refulgence n s ప్రకాశము, కాంతి, వెల్తురు.
Refulgent adj ప్రకాశించే, తళతళమనే.
Refusal n s వద్దనడము, వోపననడము, లేదనడము. on his * వాడుఅంగీకరించినందున, వొప్పుకోనందున. on his * of the money రూకలుపుచ్చుకోనన్నందుమీదట, రూకలు యివ్వనన్నందు మీదట. I called him but on his * Iwent by muself వాణ్ని రమ్మంటే రానందున నేను మాత్రము పోయినాను. when Iasked him for the money I did not expect a * రూకలు అడిగితే వాడులేదంటాడని నేను అనుకోలేదు. he couched the * in gentle language తియ్యనిమాటలతో పందిలిపెట్టి పంపినాడు. I have the * of that house నేను వద్దంటేనే గానిఆ యింటిని వాడు పరులకు యివ్వకూడదు. he gave me the * of that horse నీకుఅక్కరలేదనేదాకా ఆ గుర్రమును నేను మరివొకరికి యిచ్చేది లేదని నిష్కర్ష చేసి వున్నాడు.
Refuse n s తోసివేశినది, పనికిమాలినదని, పరిహరించబడ్డది. * of the victualsఎంగిలి the * of the rice పనికిమాలిన బియ్యము. these wretches are the * ofthe people వీరు వూరు రోసినవాండ్లు.
Refutation n s ఖండనము. what he said is a * of their account వాడుచెప్పినది, వాండ్లు చెప్పినదానికి ఖండనము, వాండ్లు చెప్పినది వాడు చెప్పినదానివల్లకొట్టబడిపోయినది.
Refuted adj ఖండించబడ్డ, వోడిన, అపజయమును పొందిన.
Regal adj రాజసంబంధమైన. * power రాజాధికారము. * race రాజవంశము. hemarched with * state వాడు రాజ్యాంగముతో బయిలు దేరినాడు.
Regale n s విందు, షడ్రసాన్నము, సుభోజనము
Regallia n s plu. The crown royal &c. కిరీటాదిరాజచిహ్నములు.
Regard n s లక్ష్యము, గురుత్వము, గణ్యము, గౌరవము, దయ,అంతఃకరణ,అభిమానము. tender * కటాక్షము. in this * యీ విషయమందు. In some *s he isa good man కొన్ని విషయములలో వాడు మంచివాడు. in that * ఆ విషయమునందుwith * to this ఇందున గురించి, యీ విషయమందు with * to him వాణ్ని గురించిgive him my *s ఆయనకు నా దణ్నములు చెప్పు.
Regarding propo గురించి. a book * grammar వ్యాకరణ విషయమైన గ్రంథము.వ్యాకరణ సంబంధమైన గ్రంథము. without * my objections నా యాక్షేపణలనులక్ష్యపెట్టక.
Regardless adj లక్ష్యము లేని, లక్ష్యపెట్టని, పరాకుగా వుండే
Regardlessly adv అలక్ష్యముగా, పరాకుగా, ఉపేక్షగా
Regatta n s a kind of boat race పడవల పందెము, అనగాపదిమంది చేరి వారివారి పడవలను విడవడములో యెవడి పడవ ముందర పోయి చేరుతున్నదో వాడిది గెలుపుఅనే ఆట్లాట.
Regency n s ఏలుబడి రాజ్యభారము, అనగా రాజుకు గాని యువరాజుకుగాని బదులుగాచేసే రాజ్య భారము. during the * రాజుకు బదులుగా వొకడు వుండి రాజ్యభారముజరిగించే సమయములో. the * gave this law రాజు లేక ఆయన పని చూస్తూ వుండినవారు యీ శాసనమును చేసినారు.
Regenerate v a మళ్లీ పుట్టించుట, పునర్జన్మమును కలగచేసుట. God *d himదేవుడు వానికి రెండో జన్మమును కలగచేసినాడు, అనగా వాణ్ని జ్ఞానవంతుణ్నిగాచేసినాడు. Regenerate, adj. పునర్జన్మముగల, రెండో జన్మముగల, అనగా జ్ఞానమార్గమునుఅవలంబించిన. * reason జ్ఞానమార్గమును అవలంబించిన ఆత్మ. (Milton.)
Regeneration n s పునర్జన్మము, జ్ఞానోత్పత్తి, అనగా దుర్మార్గత్యాగము,సన్మార్గావలంబనము. This word is sometimes used for Reformation orRestoration.
Regent n s అధిపతి, రాజుకు బదులుగా రాజ్యభారం చేశేవాడు. the eagle as the *of birds గరుడుడు, పక్షిరాజు. the eight *s of the quarters of the skyఅష్టదిక్పాలకులు. a prince * రాజ్యభారము చేసే యువరాజు.
Reggularity n s క్రమము, నియమము, నిర్ణయము.
Regicide n s Murder of a king రాజహత్య. he who kills a king రాజహత్యచేసేవాడు.
Regime n s ( French word for Government ) దొరతనము. under theancient * పూర్వపు రాజ్యభారములో.
Regimen n s rules regarding food పథ్యము. a breach of * అపథ్యము. ( ingrammar ) arrangement of words శబ్ద ప్రయోగక్రమము. in Regimineఅన్వయక్రమముగా.
Regiment n s దళము, బారు, ముఖ్యముగా వెయ్యిమంది సిపాయీలు గల దళము a* of beggars బిచ్చగాండ్ల గుంపు. a * of white ants చెదళ్ళ బారు. this word isoften omitted : thus he belongs to the third వాడు మూడో రిజమెంటువాడు.he commands the second of the fifteenth, i.e. he commands the secondbattalion of the fifteenth * పదిహేనో రిజమెంటు రెండో పటాలము సుబేదారుడుగావున్నాడు.
Regimental adj belonging to a regiment పటాలపు సంబంధమైన.
Regimentals n s plu. దండువుడుపు. I saw by his * that he belonged tothe cavalry వాడి వుడువు చూచి వాడు గుర్రపురౌతని తెలుసుకొన్నాను, తురుపు సవారనితెలుసుకొన్నాను.
Region n s రాజ్యము, దేశము, ప్రదేశము. the skyey * ఆకాశము. in the * ofthe belly గర్భ ప్రదేశమందు. the polar *s ధృవ సమీప ప్రదేశము. the infernal *sనరకము.
Register n s a book లెక్క పట్టి. or person లెక్క వ్రాసేవాడు లెక్కపెట్టేవాడు.
Registrar n s ( officer who keeps a register ) లెక్క పెట్టేవాడు.
Registration n s లెక్కలో వ్రాసుకోవడము. after the * of the will ఆమరణశాసనమును పుస్తకములో వ్రాసుకొన్న తర్వాత.
Registry n s an office where names are written పేళ్ళు వ్రాయించే కచ్చేరి.
Regnant adj ( ie reigning ) the Queen * ప్రస్తుతము ప్రభుత్వము చేస్తూ వుండేరాణిగారు.
Regress n s going back again తిరుక్కోవడము, మళ్లీ పోవడము.
Regret n s పశ్చాత్తాపము, చింత, వ్యాకులము.
Regular adj క్రమమైన, వరసగావుండే, నియమముగా వుండే downright actualచెడ్డ అచ్చమైన. he is a * thief వాడు పచ్చి దొంగ. this is a * lie యిది వట్టిఅబద్ధము. he is a * fool వాడు వట్టి వెర్రివాడు. a * verb to see is an irregularverb.
Regularly adv క్రమముగా, నియమముగా, బాగా.
Regulated adj క్రమపరచబడ్డ, నియమమైన. a man of well * passionsజితేంద్రియుడు, ఇంద్రియములు తన స్వాదీనములో పెట్టుకొని వుండేవాడు.
Regulation n s or arrangement క్రమము. without of expense no moneyis sufficient వ్రయమునకు క్రమము లేకపోతే యెన్ని రూకలయిన చాలవు. he made anew * వాడు కొత్తగా వొక క్రమము యేర్పరచినాడు. or Law చట్టము, విధి.
Regulator n s వ్యవస్తాపకుడు, నిరూపకుడు, నియమకర్త, విధాయకుడు
Regulus n s the finest part of metals ధాతు సారాంశము, లోహము యొక్కసారాంశము.
Rehearsed adj చదివి వినిపించబడ్డ.
Rehearsel n s preparation for a public play అరలో ఆడడము. after the *of this Law ఈ చట్టమును చదివి వినిపించిన తర్వాత.
Rei plu Reis, n. s. ( Spanish ) a penny వొకరూక.
Reief n s సహాయము, ఉపశమనము, ఉపశాంతి, ఊరట. he was in pain allnight but obtained some * in the morning రాత్రి అంతా అవస్థ పడ్డాడు, తెల్లవారికొంచెము వాసిగా వుండినది. my obtaining ten rupees at that moment wassome* ఆ వేళకు పది రూపాయలు చిక్కడము నాకు నిండా సహాయమైనది. this shadeis a * to the eyes యీ నీడ కండ్లకు కొంచెము హాయిగా వున్నది. you cannot travelpost without *s అక్కడక్కడ మార్చుకొనే వాండ్లు లేకుండా తపాలులో పోకూడదు. tensoldiers were sent as a * మారచుకోవడమునకై పదిమంది సిపాయీలుపంపించబడ్డారు. * in plainting or sculpture ఉబ్బెత్తుపని అనగా చిత్రములోప్రతిమలు మొదలైనవి పైకి వుబికినట్టుగా వ్రాశిన లేక మలిచిన పని. this throws hischaracter into ఇందువల్ల వాడి యోగ్యత బయిటపడుతున్నది.
Reign n s ఏలుబడి, దొరతనము. during his * అతని యేలుబడిలో అతనురాజ్యభారము చేశేటప్పుడు. they rejected his * అతనికి ప్రభుత్వము కూడదన్నారు.
Rein n s plu. Reins, కళ్లెపుపగ్గము, కళ్లెపువారు.the * s of her horse weremade of silk దాని గుర్రము యొక్క కళ్ళెమునకు పట్టుదారము వేశి వుండినది. hegave the * to his horse గుర్రాన్ని దాని మనసు వచ్చినట్టు పోనిచ్చినాడు. he gavethe * to his passions కామక్రోధాది పాశబద్ధుడయి వుండినాడు. authorityప్రభుత్వము, అధికారము. he held the *s for ten years పది యేండ్లు ప్రభుత్వముచేశినాడు. The *s ( kidneys ) పక్కెర గుండెకాయ, లంఖము, అనగా మూత్రమునుకలగచేసే కడుపులో వుండే మాంస గ్రంధి విశేషము. in Jerem. XII.2. అంతరింద్రియము F+. అంతఃకరణము. D+. హృదయము H+. in job XVI.13.యకృత్ D+. in Rev. II.23. అంతరింద్రయము. G+.
Reinforcement n s ఉపబలము, సహాయముగా వచ్చి చేరిన బలము. after the *పైగా కొంచెము దండు వచ్చి చేరిన తర్వాత.
Reiteratedly adv పదేపదే, మళ్ళీమళ్లీ, తిరిగీ తిరిగీ
Reiteration n s మళ్ళీమళ్ళీ చెప్పడము, తిరిగీతిరిగీ చేయడము.
Rejected adj తోసివేయబడ్డ, నిరాకరించబడ్డ. * paper తోసివేసిన కాకితాలు.
Rejection n s నిరాకరణము, విసర్జనము, తోసివేయడము.
Rejoicing n s వేడుక, సంబరము. there were great *s in consequence ofthis దీన్ని గురించి అందరున్ను సంబరములు చేసుకొన్నారు.
Rejoinder n s or answer ప్రత్యుత్తరము. but in law it meansప్రత్యుత్తరమునకు ప్రత్యుత్తరము, ప్రతివాది, రెండో మాటు యిచ్చే వుత్తరువు, కడపటివుత్తరువు.
Relapse n s of disease మరకపాటు, మళ్ళీ తిప్పుకోవడము. he had a * offever వాడికి పోయిన జ్వరము మళ్ళీ వచ్చినది. of vice orsin మళ్ళీ తప్పుదోవనుపడడము అరూఢపతితత్వము.
Related adj that is connected సంబంధించిన. all those * to him అతనిసంబంధు లందరున్ను. or told చెప్పిన. the story * by him అతడు చెప్పిన కథ.
Relating adj regarding సంబంధించిన, చేరిన. the letter * this దీన్ని గురించినజాబు. * to this ఇందున గురించి.
Relation n s connection సంబంధము, బాంధవ్యము. what * is he of your's? వాడు నీకేమి కావలెను. he stood to them in the * of a teacher వాండ్లకు వాడువుపాధ్యాయులుగా వుండినాడు. a kinsman బంధువు. she is a * of mine అది మాచుట్టపుది. or story చెప్పడము, వివరించడము. during the * of this story ఈకథను చెప్పుతూ వుండగా.
Relationship n s చుట్టరికము, బాధ్యవ్యము, బంధుత్వము. he proved his * తనకుబంధుత్వము కద్దని నిరూపించినాడు.
Relative adj సంబంధించిన, సంబంధము గల. * position ఉభయులకు వుండేఅంతరాంతరము, తారతమ్యము. * merit దాని దానికి వుండే గుణము. * to this ఇందునగురించిన జాబులు. In grammar the words who where what when arecalled *s, or * pronouns. The * pronoun who which what యెవడు, యెది,యేమి, మొదలయినవి. the * participles వుండిన వుండే పోయిన పొయ్యే వచ్చినవచ్చే మొదలయినవి.
Relatively adv with regard something else తారతమ్యము చొప్పున. this is* good కడమవాటి కంటె యిది మంచిది. a tree seven feet high is * very short: but a man seven feet high is * very tall కడమ చెట్ల పొడుగునుపట్టిచెట్లల్లోయేడడుగుల పొడుగుపొట్టి యనబడుతున్నది, అయితే కడమ మనుష్యుల యెత్తునుపట్టి మనుష్యులలో యేడడుగుల పొడుగు మహా వున్నత మనబడుతున్నది.
Relaxation n s సళ్ళడము, వదలడము. play is a * but to play all night ismere labour ఆట వొక వేడుకేగాని రాత్రి అంతా ఆడడము వట్టి శ్రమ అవుతున్నది. *from labour ఆటవిడుపు, విశ్రాంతి. after the* of this law ఈ చట్టమునుకొంచెము సులభము చేసిన తర్వాత he did this as a mere * దీన్ని వూరికె వేడుకకుచేసినాడు.
Relaxed adj సళ్ళిన, సళ్ళించబడ్డ, వదిలించబడ్డ. In old age the nerves are *వృద్ధాప్యములో దేహము సళ్ళుతున్నది. when the bowels are *ప్రవర్తులయ్యేటప్పటికి.
Relay n s తపాలు. there were three * s of bearers and four * s ofhorses మూడు చోట్ల బోయీలు, నాలుగు చోట్ల గుర్రాలు తపాలు వుంచినారు.
Release n s విడుదల, నివృత్తి. her death was happy * అంతమట్టుకు చచ్చిసుఖపడ్డది.
Released adj విడిచిపెట్టబడ్డ, విడుదలచేయబడ్డ. he who is * from all tiesబంధవిమోచనము గలవాడు, సర్వసంగపరిత్యాగి. those who are * from sinపాపవిముక్తులు.
Releived adj ఉపశమించిన, ఉపశమనము చేయబడ్డ, నివారణము చేయబడ్డ, కావలిమార్చుకోబడ్డ. the pain is not yet * ఆ నొప్పి యింకా తీరలేదు, స్వస్థము కాలేదు. no beggars are * by him వాడి వల్ల పేదలకు వుపకారము లేదు. I cannot go till Iam * నా స్థానానికి వేరే మనిషి వచ్చేదాకా నేను పోగూడదు.
Relentless adj అతిక్రూడైన, నిర్దయాత్మకుడైన.
Relevance, Relevancy n s. సంబంధము, సాంగత్యము, పొందిక, సహాయము.show me the relevancy of this letter to your statement నీవుచెప్పేదానికిన్ని ఆ జాబుకున్నుయేమి సంబంధము వున్నదో దాన్ని అగుపరచు. I do notsee the relevance of this దీనికి దానికి యేమి సంబంధమో నాకు తెలియలేదు.
Relevant adj సంబంధించిన, సాంగత్యముగల. the proof you have producedis not * to the case ఆ వ్యాజ్యమునకున్ను, నీవు తెచ్చిన సాక్షికిన్ని సంబంధము లేదు.
Reliance n s నమ్మిక, పట్టు, విశ్వాసము. I place no * on his word వాడి మాటలోనేను నమ్మకము వుంచలేదు. I have little * on this medicine ఈ మందులో నాకుఅంత నమ్మకము లేదు.
Relick, Relicks n s. that which is left afte the loff or decay of therest అవశిష్టము. that which is kept in memory of another with .a .kindof religious veneration చనిపోయిన గురువు మొదలయిన పెద్దల ప్రసాదముగాపెట్టుకొని పూజ చేసే పాదుకలు మొదలయినవి. his *s ( that is his remains ) arestill exhibited at Rome రోం దేశములో యిప్పటికిన్ని ఆయన శవమును పెట్టుకొనిపూజిస్తూ అక్కడికి పోయ్యే వాండ్లకు చూపిస్తారు. In Ceylon the tooth * ofGuatamais called దంతధాతువు.
Relict n s a widow చనిపోయినవాడి భార్య, విధవ.
Religion n s మతము. Dz says ధర్మము, మతము, పరమార్థసాధనము,ఉపవాసనకాండ, ఈశ్వరారాధనాది సేవ. Knight says సమయము, మతము,మార్గము, వైదికము. charity, fasting and prayer are three parts of * ధర్మోపవాస ప్రార్థనలు మతమునకు మూడు అంశములుగా వున్నవి. this is the true * ఇది సమ్మతము. there are many false *s in the world ప్రపంచములో అనేక దుర్మతములు కలవు. their * is a very foolish oneవాండ్లది పిచ్చి మతము. the Musulman * తురక మతము. a man of no * or, an irreligious man భక్తీహీనుడు. In James I. 6. ధర్మము A+ C+. భక్తి F+ G+ k+ p+, In Acts XXVI. 7. A+ omits the word. In James I. 26. Martyn's Persian version says, Din; while his Hindustani version says, Ibadat but Koda parasti, and dindnari are the words in two other Hindustani versions.
Religionist n s మతస్థుడు, వైదికుడు (ఇది కొంచెము యెగతాళి మాట.)
Religious adj భక్తుడైన, భక్తిగల, మతసంబంధమైన. a * man భక్తుడు.a * woman భక్తురాలు. a * book మత విషయక గ్రంథము. * conversation మత విషయమైన ప్రసంగము. he leads a life వాడు నిండా నిష్ఠగా వున్నాడు.a * act ధర్మము పుణ్యము. he considers it a * act to feed the poorబీదలకు అన్నము పెట్టడము పుణ్యమంటాడు. the Hindoos consider it a * act to feed hawks హిందువులు గరుత్మానులకు మేత వేయడము పుణ్యమంటారు. the * as meaning the faithful భక్తులు. the * as meaning monks or nuns సన్యాసులు. In James. I. 26. ధార్మికుడు A+ C+ దేవభక్తుడు F+ k+ G+. Dz. says ధర్మ సంబంధీయ, పారమార్థిక, ధర్మనిష్ఠ, ఈశ్వర పరాయణ.
Religiously adv భక్తిగా.
Relinquished adj విడిచిపెట్టిన, మానుకొన్న, విసర్జించకోబడ్డ.
Relish n s రుచి, సారము, రసము, అభిరుచి, యిష్టము. salt and pepper give a * to food వుప్పు కారము తగిలితే కూటికి వొక రుచి కలుగుతున్నది. a * eaten with food వ్యంజనము, సాధకము. to eat without * is miserable ఆశలేని తిండి యేమి తిండి. to study without * is of no use ఆశ లేని చదువు పనికిరాదు. a want of * for food అన్న ద్వేషము.
Relishing adj agreeable రుచిగా వుండే, భోగ్యముగా వుండే.
Reluctance n s అసమ్మతి, అయిష్టము.
Reluctant adj అయిష్టమైన, అసమ్మతమైన.
Reluctantly adv అయిష్టముగా, అసమ్మతముగా.
REM 947Removed adj తీశివేయబడ్డ, తోశివేయబడ్డ. he is far * from blame ఆ నేరమును వాడి మీద చెప్పరాదు. he is my cousin twice * రెండు తరాలు విడిచిన దాయాది వాడు.
"REM 945 Remarkable" adj ఆశ్చర్యమైన, అతిశయమైన, వింతైన. It is * that they say he is still alive అతడు యింకా బ్రతికి వున్నాడంటారు, యెమి వింత.
Remainder n s మిగత, మిగిలినది, పోగా నిలిచినది. the * of the book కడమ గ్రంథము. some were killed the * fled హతశేషులు పారిపోయినారు.
Remaining adj కడమ, కొదవ, లోతక్కువ, మిగిలిన, అవశిష్టమైన.
Remains n s plu. that which is left శేషము, నిలిచినది. the *of food ఉచ్ఛిష్టము, యెంగిలి. meaning a corpse శవము.
Remark n s a thing said మాట, విశేషము. he made no *s వాడు వొకమాటా అన లేదు. he made some *s about this యిందున గురించిన ఆయన కొన్ని విశేషములు చెప్పినాడు. there were some *s written upon the bond ఆ పత్రము మీద కొన్ని మాటలు వ్రాశి యుండినవి. the commentatormakes no * on this word ఆ వ్యాఖ్యాత యీ శబ్దమునకు టీక చెప్పలేదు. this is deserving of * యిది ముఖ్యము, యిది చోద్యము.
Remarkably adv ఆశ్చర్యముగా, అతిశయముగా, వింతగా. It is * hot today నేడు యెండ విశేషముగా వున్నది.
Remebrance n s జ్ఞాపకము, జ్ఞాపకానికి తెచ్చుకోవడము. a token by which any one is kept in the memory జ్ఞాపకము వుండే నిమిత్తమైన కార్యము, లేక వస్తువు. he did this in * of his father తండ్రి యొక్క జ్ఞాపకము వుండేటట్టుగా దీన్ని చేసినాడు. they celebrate this feast in *of that battle ఆ యుద్ధము యెన్నటికి జ్ఞాపకము వుండే నిమిత్తమై యీ పండుగను ఆచరిస్తారు.
Remediless adj అసాధ్యమైన, తీరని, దిక్కుమాలిన.
Remedy n s a medicine ఔషధము, మందు. they say this juice is a * for poison యిది విషానికి విరుగుడు అంటారు. this is no * for it దానికి యిది పరిహారము కాదు. there is no * for this యిందుకు యే వుపాయమున్ను లేదు. That which removes an evil నివృత్తి పరిహారము, ప్రతిక్రియ. this disease is without * యిది తీరని రోగము. If he wrongsyou, you have your * at law వాడివల్ల నీవు అన్యాయమును పొందితే అది కోరట్టువారివల్ల నీకు పరిహార మవును. this disease is beyond * యిది అసాద్యమైన రోగము. a * for lust మోహోపశాంతి, మోహోపశమనము. a * for madness ఉన్మాదశమనము.
Remembered adj జ్ఞాపకము చేసుకోబడ్డ, మనసులో వుంచిన.
Remembrancer n s an officer of the exchequer రాజభండారములో వుండేవొక వుద్యోగస్థుడు.
Reminiscence n s జ్ఞాపకము.
Remiss adj జబ్బుగా వుండే, అశ్రద్ధగా వుండే, అజాగ్రతగావుండే. he became * in his accounts లెక్కలు వ్రాయడములో జబ్బైనాడు.
Remission n s abatement తగ్గించడము, తగ్గడము, ఉపశమనము, ఉపశాంతి. relaxation ఎడ, విరామము. there was a * of the pain at night రాత్రి నొప్పి కొంచెము వాసిగా వుండినది. pardon క్షమించడము. pardon implies a * of punishment క్షమించడమనగా శిక్షను మన్నించడము.
Remissly adv అజాగ్రతగా, అశ్రద్ధగా, ఉపేక్షగా, జబ్బుగా.
Remissness n s అజాగ్రత, అశ్రద్ధ.
free dictionary English to Telugu

No comments:

Post a Comment