To Instill v a మనసున పట్టేటట్టు చేసుట, లగించేటట్టు చేసుట. he *led some doubts into their minds వాండ్ల మనసులో కొన్ని సందేహములనుపుట్టేటట్టు చేసినాడు
To Institute v a ఏర్పరుచుట, నియమించుట, నిర్ణయించుట. to * a law suit వాజ్యము వేయుట. to * an enquiry విచారణకు ఆరంభించుట.
To Instruct v a నేర్పుట, శిక్ష చెప్పుట, ఆజ్ఞాపించుట. he *d them wellవాండ్లకు బాగా నేర్పినాడు. he *d them in geography వాండ్లకు భూగోళశాస్త్రమును బాగా శిక్ష చెప్పినాడు. he *ed me to sell his house తనయింటిని అమ్మమని నాకు వుత్తరవు యిచ్చినాడు.
To Insult v a తిరస్కరించుట, ధిఃకరించుట, పరాభవము, అవమానము చేసుట, దూషించుట.
To Insure v a బీమాచేసుట, నూటికింతయని తీసుకొని అపాయము వస్తేఅచ్చుకుంటానని పూటబడుట. I will * your success నీకు అనుకూలమౌతున్నది,దానికి నేను వున్నాను. he *ed my ship నా వాడకు అపాయమువస్తేదాని నష్టమును తాను అచ్చుకొనేటట్టు పూటబడ్డాడు.
To Intend v a and v. n. అనుకొనుట, ఉద్దేశించుట, ఉద్యుక్తముగా వుండుట, ఎంచుట, తలచుట, భావించుకొనుట, యత్నముగా వుండుట. he *s to doso అట్లా చేయవలెనని వున్నాడు. do you * to go back ? మళ్ళీ పోవలెననివున్నావా. I went there *ing to call him వాణ్ని పిలవవలెనని అక్కడకుపోతిని. what to do these words ? ఈ మాటలకు అభిప్రాయమేమి.he *ed this book for you ఈ పుస్తకము నీకోసరమని అనుకున్నాడు.
To Inter v a to bury పాతిపెట్టుట, పూడ్చుట, యిది శవమును గురించినమాట.
To Intercept v a అడ్డగించుట, అడ్డపడి కొంచపోవుట. the cloud *ed therays of the sun మేఘము సూర్యకిరణములకు అడ్డమైనది. the robbers *ed the money on its way here ఆ రూకలు యిక్కడికి వస్తూవుండగా నడిదోవలో దొంగలు అడ్డుపడి దోచుకున్నారు. they *ed our letters మాకువచ్చిన జాబులను అడ్డుపడి పెరుక్కున్నారు.
To Interchange v a పరివర్తన చేసుకొనుట, మార్చుకొనుట, వినిమయముచేసుకొనుట. they *d compliments వొకరినొకరు దండము పెట్టుకున్నారు.they *d blows వొకరిని వొకరు గుద్దుకున్నారు.
To Interdict v a నిషేధించుట, కూడదనుట, అడ్డగించుట. they *ed his return వాడిని మళ్ళీ రాకూడదని నిషేధించారు. the doctor *ed me waterనేను నీళ్ళు తాగగూడదని వైద్యుడు చెప్పినాడు.
To Interest v a అక్కర పట్టేటట్టుచేసుట, ఆశపుట్టించుట, శ్రద్ద కలుగచేసుట, to * him in this I offered him a reward ఇందులో వాడికి అక్కరపట్టేటట్టు చేయడానికి బహుమానము యిస్తానన్నాడు. they tried to * mein his favor వాడిపని అక్కర పట్టేటట్టు చేయడానికి శానా పాటుపడ్డారు.the story of Harischandra *s the reader very much హరిశ్చంద్ర కథచదివే వాడికి మరీ మరీ ఆశ కలుగచేస్తున్నది. the marriage *s the whole town ఈ పెండ్లి వూళ్ళో అందరికీ సంతోషమే. the misfortunes he suffered*ed the whole town వాడికిచ్చిన తొందర్లు వూరికంతా వ్యాకులమైనది. the story *ed them much ఈ కథ వాండ్లను మహావ్యాకులము చేసినది, ఆహ్లాదమును చేసినది. it will * you to know that they have a son వాండ్లకు యిప్పుడు సంతానము కలిగినది, యిది నీకు తెలిసి సంతోషింతువు కదా. I do not * myself in that affair ఆ పని నాకు అక్కర లేదు. he *ed himselfvery much in the affair ఆ పనిలో నిండా అక్కరగా వున్నాడు. what wasit made you at first * yourself in this business మొదట దీంట్లో నీకుఎట్లా ప్రవర్తించినది, నీకెట్లా ఆశపుట్టినది. he *s himself very much about natives ఈ దేశస్థులకై నిండా పాటుపడ్డాడు. they *ed themselves muchabout him వాడి కోసరము నిండా పాటు పడ్డారు.
To Interfere v n జోలికి పోవుట, నడమదూరుట, మధ్యప్రవేశించుట, అడ్డిచేసుట, కుందకము చేసుట. they were fighting when he *d and separated them వాండ్లు పోట్లాడుతూ వుండగా వీడు నడమపడి వాండ్లనుతొలగ దీసినాడు. why do you * with him ? వాడి జోలికి ఎందుకు పోతావు,వాడి తెరువుకు ఎందుకు పోతావు. this business *d with my going out ఇందుచేత బయటపోడానకు కుందకమైనది. his wife *s with him in every thing ఏ పనికిన్ని వాడి పెండ్లాము కూడాకూడా వస్తున్నది. his chain *dwith his walking వాడు నడవడానికి సంకెళ్ళు యిబ్బంది చేస్తున్నవి.
To Interlace v a కలుపుట, మిశ్రమముచేయుట, కూర్చు కొనుట. he *d hisfingers with her's వాడు అది చేతులు కూర్చుకున్నారు. this Telugu is *d with Sanscrit ఈ తెలుగు సంసృత జటిలముగా యున్నది, మణిప్రవాళముగా యున్నది. Interlard, v. a. కలుపుట, మిశ్రమము చేసుట. he *s his language withvulgarisms వాడి మాటలలో నడమనడమ నీచకూతలు వస్తున్నవి. Interlarded, adj. మిశ్రమమైన, మణిప్రవాళముగా వుండే. Tamil * with Sanscrit మణిప్రవాళముగా వుండే, అరవము అనగా అరవము సంసృతముకలసి వుండేటిది. he speaks Telugu * with Hindusthani. వాడు తెలుగుసగము తురకము సగముగా మాట్లాడుతాడు. his speach was * with curses వాడు చెప్పడములో నడుమ నడుమ తిట్టుతూ వచ్చినాడు.
To Interleave v a కాగితపుస్తకములో నడుమనడుమ వట్టి కాగితములుతగిలించుట.
To Interline v a హంసపాదిపెట్టి నడమ వ్రాయుట.
To Intermeddle v n జోలికి పోవుట, తెరువుకు పోవుట.
To Intermingle v a కలుపుట, మిశ్రమము చేయుట.
To Intermit v n నిలుచుట, విడుచుట. the feaver did not * జ్వరమునడుమ విడువలేదు, జ్వరము విడువకుండా కాచినది. when the rain*ted వాన తెరప యిచ్చినప్పుడు.
To Intermix v a కలుపుట, మిశ్రమము చేయుట.
To Interpolate v n స్వకల్పనను నడుమచేర్చుట. he *d this verse in the Ameracosa వాడు యీ శ్లోకమును చేసి అమరకోశము నడుమ చేర్చినాడుthe poem is *d యీ కావ్యములో కొన్ని కొత్త శ్లోకములు కలిసి వున్నవి.
To Interpose v a నడమబెట్టుట, అడ్డము బెట్టుట. he *d his shield డాలును అడ్డము పెట్టినాడు. the king *d his authority to prevent thefight ఆ జగడమును అడ్డుపెట్టడానికి రాజు తన అధికారములును అడ్డుపెట్టినాడు. at this place he has *d some remarks ఈ స్థలములో నడుమకొన్ని విశేషములను చెప్పినాడు. God has *ed a sea between these countries దేవుడు ఈ రెండు దేశములు మధ్య ఒక సముద్రమును పెట్టినాడు. To Interpose, v. n. అడ్డపడుట, నడమపడుట, మధ్యస్థము చేయుట. I *d tostop the dispute ఆ జగడమును ఆపడానికి అడ్డుపడ్డాను. unless you *they will die నీవు నడమ పోకుంటే వాండ్లు చత్తురు. he was going onto use more violent language when I *d to stop him వాడు యింకానిండా తిట్టపోగా నేను అడ్డుపడి నిలిపినాను. he *d between my brotherand me మా అన్నకు నాకు మధ్యస్థముచేసినాడు. a sea *s between these two countaries ఈ రెండు దేశముల నడుమ వొక సముద్రమున్నది.
To Interpret v a తెలియ చేయుట, వివరించుట, అర్ధముచెప్పుట, బోధపరచుట. or to translate భాషాంతరముచేసుట. to * a dreamకలకు ఫలము చెప్పుట, కలవిచ్చుట, కలవిడచి పెట్టుట. he *d these wordswrongly ఈ మాటలకు అపార్ధము చేసినాడు. will you * for me ? నాకుదుబాసితనము చేస్తావా.
To Interrogate v a అడుగుట, ప్రశ్నచేసుట.
To Interrupt v a అడ్డగించుట, అభ్యంతరము చేసుట do not * him whilehe is talking వాడు మాట్లాడేప్పుడు అడ్డము పోకు. that tree *s the view ఆ చెట్టు దృష్టికి అడ్డముగా యున్నది.
To Intersect v a విభజించుట. the road *s the forest ఆ యడవి నడుమబాట బోతున్నది. there is a hedge that *s the field ఆ పొలానికినడమ వొక వెలుగు పోతున్నది.
To Intersperse n s అక్కడ వేసిపెట్టుట.
To Intervene v n నడుమవచ్చుట. he intended to marry but death *d పెండ్లి చేసుకోవలనని వుండినాడు నడుమ చావువచ్చినది. a week *s between Christmas-day and New Year's day ఖ్రైష్టుమసుకున్ను సంవత్సరాదికిన్నీ వారమురోజులు వస్తవి.
To Interweave v a కలసినేసుట, కలుపుట, కూర్చుట. he interwove the cotton with silk నూలు పట్టుతో కలిపి నేసినాడు. he interwove his fingers with her's దాన్ని చెయ్యి గూర్చుకొన్నాడు.
To Interwine, To Intertwist v a. నడమ పెట్టిపేనుట, నడమ పెట్టిజడవేసుట. she *d her hair with flowers పువ్వులు పెట్టి జడ వేసినది.
To Inthral v a చిక్కించుకొనుట, దాసుణ్నిగా చేసుకొనుట, స్వాధీనము చేసుకొనుట, బంధించుట, యిది కావ్యశబ్దము. her beauty *led him దాని అందానికి లోబడ్డాడు.
To Inthrone v a సింహాసనము మీద కూర్చుండ బెట్టిన, పట్టాభిషేకము చేసుట, పట్టము గట్టుట.
To Intimate n s ఎరికచేసుట, జాడగా ఎరుకచేసుట, తెలియచేసుట.
To Intimidate v a జడిపించుట, దిగులు పట్టేటట్టు చేసుట.
To Intomb v a పూడ్చుట, సమాధిలో పెట్టుట, యిది శవమును గురించిన మాట. Intonation, n. s. పెద్ద గొంతు. in reading ఉదాత్త స్వరము. they readwith an unpleasent * పెద్ద గొంతు పెట్టి వికారముగా చదువుతారు.
To Intone v a ఉదాత్త స్వరముతో చదువుట.
To Intoxicate v a మయకమును కలుగచేసుట, మత్తు కలుగచేసుట.పొక్కించుట. this wine *d him ఈ సారాయి చేత వాడికి మైకము వచ్చింది.pride *d him గర్వము చేత వాడికి వొళ్ళు తెలియలేదు.
To Intreat v a బతిమాలుకొనుట, వేడుకొనుట.
To Intrench v a కందము తొవ్వుట, చుట్టూరు పల్లముగాతవ్వుట. he *ed the camp ఆ శిబిరము చుట్టూ కందకము త్రవ్వినాడు. to invade అధిక మించుట. this *ed upon my time ఇందుచేత నాకు వృధా కాలహరణఔవుతున్నది. he *ed upon our rights మా స్వతంత్రములను ఆక్రమించుకున్నాడు.
To Intrigue v a కుట్రచేసుట, కృత్రిమము చేసుట.
To Introduce v a In line 5. for beed read bead.
To Intrude v n అమర్యాదగా జొరబడుట, పిలువకవచ్చుట, పిలువక పోవుట, ప్రవేసించుట. this business *s on my time ఇది నాకాలానికి వట్టి భంగము, కందకము. she *d upon him while he was talking with hiswife వాడు పెండ్లాముతో మాట్లాడుతూ వుండగా అది అమర్యాదగా జొరపడ్డది.అనగా వాండ్లకు ఇబ్బంది చేసినది. thoughts of death will * in the middle of happiness సంతోషముగా వుండేటప్పుడు నడుమ నడుమ చావునుగురించి జ్ఞాపకము వస్తూ వున్నది. why should you * into their affairs?వాండ్ల సంగతికి నీవు యెందుకు పోతావు, ప్రవేశిస్తావు. why should you * upon him ? నీ వెందుకు పిలువనిదే వాడివద్దకు పోయినావు. But I *!అపరాధ క్షమము.
To Intrust v a ఒప్పగించుట, పరముచేసుట, వశముచేసుట.
To Intwine v a పేనుట, మెలిపెట్టుట.
To Inundate v a వెల్లువ వచ్చి ముంచుకొనిపోవుట. the river *d the fields ఏరు పొంగి ఆ పొలము మునిగిపోయినది.
To Inure v a అభ్యాస పరచుట, అలవాటుపరచుట, పనుబరచుట, వాడికబరచుట.
To Inurn v n పూడ్చుట, యిది శవమును గురించిన మాట.
To Invade v a దండు యెత్తుకొని పోయి పడుట. they *d this country వాండ్లుదండు యెత్తికొనిపోయి యీదేశము మీద వచ్చి పడ్డారు. he cove tously *d estate వాడు దురాశపడి యీ ఆస్తిని ఆక్రమించుకున్నాడు. నోట్లోవేసుకున్నాడు.
To Invalidated adj దుర్బలమై పోయిన, బలహీనమైన. the law is * by this custom ఈ వాడికచేత ఆ చట్టము దుర్బలమై పోయినది, చెల్లలేదు.
To Inveigh v a దూషించుట, నిష్ఠూరము లాడుట.
To Inveigle v a రుచిచూచి వచించుట, మోసబుచ్చుట. they *d him intothe wood అడవిలోకి వాణ్ని బిలుపులు పెట్టి యీడ్చుకొని పోయినారు.Maricha *d Rama away మారీచుడు రాముణ్ని బులుపులు పెట్టి వచించిదూరముగా తీసుకొని పోయినాడు.
To Invent v a నవీనముగా కల్పించుట. they say that mercury *ed thelute నారదుడు మొదట వీణెను కల్పించి నాడంటారు.
To Inventory v a జాబితావ్రాసుట.
To Invert v a తలకిందులు చేసుట, బోర్లించుట, వెనుక ముందు చేయుట.
To Invest v a to enclose చుట్టుకొనుట. or to place వేసుట. or to confer ఇచ్చుట. the troops *d the town దండు ఆ పట్టణమును చుట్టువేసుకున్నది. clouds *ed the mountain మేఘములు పర్వతమునుఆవరించుకొన్నవి. he *ed his money in the funds వాడి రూకలుకుంపణిలో వేసినాడు. he *ed his money in land వాడి రూకలను భూమిమీద వేసినాడు. they *ed him with royal authority వాడికి పట్టముకట్టినారు. they *ed him with the braminical thread వాడికి ఉపనయనము చేసినారు.
To Investigate v a విచారించుట, విమర్శించుట, పరిశీలనచేసుట.
To Invigorate v a బలము కలుగ చేయుట. bathing *s us స్నానము త్రాణను కలుగచేయుచున్నది. an invigorating medicine సత్తువనుకలుగ చేసే మందు.
To Invite v a పిలుచుట, రమ్మనుట, విందుకు పిలుచుట. they *d me నన్నుపిలిచారు. they *d me to take a share in the business ఆ పనిలోనీవున్నూ కలుస్తావా అని అడిగినారు. or to allure ఆశ కొలుపుట, ఆశపెట్టి ప్రేరేపించుట. she *d him to sit down by her తన దగ్గర కూర్చుంటావా అని అడిగినది. the pleasentness of this story *s us to read further on ఈ కథ యొక్క మాధుర్యము యింకా పైన పైన చదివేటట్టు మాకు ఆశను పుట్టిస్తున్నది.
To Invoke v a ప్రార్ధించుట, ప్రార్ధించి పిలుచుట, మొరబెట్టుట, వేడుకొనుట,యిది దేవుణ్ని గురించిన మాట.
To Involve v a కలుపుట, చిక్కించికునుట, చిక్కుల బెట్టుట, లోబరచుట. why do you * your self with such people ? ఇటువంటి వాండ్లతో యెందుకుకలుస్తావు. this *d me in difficulties ఇందుచేత సంకటములో చిక్కుకున్నాడు. they *ed it in obscurity దాన్ని మరగుపరచినారు. this*d an expense of ten rupees యిందుకు పది రూపాయలు శలవు పట్టింది.this *d me much expense దీని వల్ల నిండా రూకలు శలవైనది. his argument *s a contradiction వాడు చెప్పే న్యాయమే విరుద్ధముగా వున్నది.this *d me in a quarrel ఇందువల్ల నేను జగడములాడవలసివచ్చినది.his ruin *d that of many అతని చెరుపు పరుల చెరుపుకున్ను కారణమైనది.
To Inweave v a కలపివేసుట.
To Inwrap v a చుట్టుట.
To Irk v a చీదరచేసుట. it *s his heart to see this దీన్ని చూడడమువాడికి అసహ్యముగా వున్నది.
To Iron v a to shackle with irons సంకెళ్ళు వేసుట. he was * వాడికిసంకెళ్ళువేసినారు. or to smoothlinen with iron ఇస్త్రీ చేసుట. Iron-bound, adj. కొండలమయమైన, అతిదుర్ఘటమైన. this is an * coastఇది కొండలమయముగా వుండే సముద్రతీరము, అనగా శత్రువులకుఅసాధ్యమైనది.
To Irradiate v a ప్రకాశించుట.
To Irrigate v a నీళ్ళు కట్టుట, నీళ్ళు పోటుట.
To Isolate v a ( a foolish French word ) ప్రత్యేకము చేసుట, ప్రత్యేకముగా వుండుట. he *d himself ఏకాకిగా వుండినాడు.
To Issue v a ఇచ్చుట. the megistrate *d a summons పోలీసు వాండ్లు సమ్మను చేసినారు. the court *d an order కోర్టులో వుత్తరము పుట్టినది.he *d payment జీతము యిచ్చినాడు.
To Italicize v a to print a work in Italics ఆదొకపాటుగా వుండే సన్నఅక్షరములతో అచ్చువేయబడి యున్నది. the *d words in the Bible areinterpolations హీబ్రూబైబులులో లేని శబ్దములు ఇంగ్లిషు బైబులులోఅదొకపాటుగా వుండే సన్న అక్షరములతో అచ్చు వేయబడి యున్నవి.
To Itch v n దురదగా వుండుట, దురద యెత్తుట, నవగావుండుట, నవయెత్తుట.my eye *es నా సన్ను నవగా వున్నది. to * in the throat గొంతులో నసగా వుండుట. having *ing ears ( 2 Tim. IV. 3. కర్ణకండూయనవిశిష్టాస్సంతః ) చెవులు దోరపెట్టుకొని తిరిగే, యెవరు యేమి చెప్పుదురా యనితిరిగే.
To Iterate v a పునఃపునః చేయుట, మళ్ళీ మళ్ళీ చెప్పుట.
To Jagg, jagg v a. to cut into indentures, to cut into teeth like those of a saw పండ్లుగా చేసుట, కక్కు పెట్టుట, మొర్రిచేసుట.
To Jam, jam v a. అణుచుట, ఇరికించుట, ఒత్తుట, నలుచుట. he *med the books into the box ఆ పుస్తకములను పెట్టెలో యిరికించినాడు.
To Jangle v a గలగల లాడించుట, గంటను లొడలొడమని వాయించుట.
To Japan v a మెరుగు నూనె పూసుట, వార్నిసు వేసుట.
To Jar v n పరస్పరము విరోధించుట, విరుద్ధముగా వుండుట, సుతి కలియకపోవుట. this arrangement *red with interests of his family ఈయేర్పాటు వాడి వాండ్లకు సరిపడి వుండలేదు. this *s with his former statement వాడు మునుపు చెప్పిన దానికి యిది విరోధిస్తున్నది.these two fiddles * ఈ రెండు పిడీళ్లున్ను సుతికూఢి వుండలేదు. there are always jarring వాండ్లు యేవేళా వాగ్వాదమాడుతూ వుంటారు. *ring పరస్పరా విరోధమైన, అసంబంధమైన, అసందర్బముగా వుండే. a * ring sound అపస్వరము, విరుద్ధమైన స్వరము.
To Jaunt v n విహరించుట, సంచరించుట.
To Jeer at v a అపహాస్యము చేసుట, ఎగతాళి చేసుట.
To Jeopard v a to put in danger to hazard బడ్డుట, తెగించుట. he *ed his life in this undertaking ఈ పనిలో తన ప్రాణాన్ని వొడ్డినాడు. why do you * your life? విషపరీక్ష యెందుకు చేస్తావు. See To Jeopardy.
To Jeoperdy v a ఒడ్డుట, తెగించుట, సాహసము చేసుట. the thieves jeopardied their lives and broke into the house ఆ దొంగలు ప్రాణానికి తెగించి ఆ యింట్లో జొరబడ్డారు.
To Jerk v a చివుక్కున లాగుకొనుట, లటుక్కున గుంజుకొనుట. the fish took the hook and I *ed it upon the bank ఆ చేప గాలములో పడ్డందున దాన్ని చివుక్కున కట్ట మీదికి లాగుకొన్నాను. or to lash చురుక్కున దెబ్బవేయుట.
To Jest v a ఎకసక్కెమాడుట, పరిహాసము చేసుట.
To Jet v n See To Jut.
To Jib v n తలవంచుట.
To Jilt v a ఆడితప్పుట, మోసముచేసుట. She *ed him పెండ్లి ఆడుతానని వాణ్ని మోసము చేసినది.
To Jingle v n గలగలలాడుట, ఘల్లుఘల్లుమనుట. I heard the money * in his pocket వాని జేబులో రూకలు గలగలమనగా విన్నాను. jingling bracelets కంకణములు. * anclets గజ్జ గొలుసు.
To Job v n కూలినాలిచేసుకొని పొట్ట బోసుకొని బ్రతుకుట. a * bring carpenter చిల్లర పని చేసి పొట్ట బోసుకొనే వడ్లవాడు.
To Jockey v a వంచించుట, మోసము చేసుట. he *ed me in this business పితలాటకముగా నన్ను తొలగదోసి ముందు మించుకొన్నాడు.
To Jog v n ఊగులాడుతూపోవుట. he was *ging along the road వాడు వూగులాడుతూ వస్తూ వుండినాడు. the work now *s on very well పని యిప్పుడు బాగా జరుగుతున్నది, సాగుతున్నది. this table *s ఈ మేజ ఆడుతున్నది కదులుతున్నది. they *ged on after him వాని వెంట పోయినారు.
To Join v n చేరుట, కలుసుట, కూడుట. the two roads * here ఇక్కడ రెండు దారులు కలుస్తవి. they *ed hand in hand వాండ్లు వొక చేయ్యిగా వుండినారు. these two houses *ed ఈ రెండు యిండ్లు కలిసివున్నవి, చేరివున్నవి. they all *ed in abusing him వాణ్ని తిట్టడానకు అందరు వొకటిగా కలిసినారు, చేరినారు. * hand గొల్సు అక్షరము.
To Joint v a గెణుపు, గెణుపులుగా తేగ నరుకుట.
To Joke v n ఎగతాళిచేసుట, పరిహాసము చేయుట. I thought he was joking వాడు యేగతాళి చేస్తాడనుకొంటిని.
To Jolt v a కుదిలించుట, ఎత్తివేసుట.
To Jostle v n తోసుకొనిపోవుట, పైనబడుట. he *d me and the box on my head fell down వాడు నన్ను తోసుకొనిపోయి నందున నా తలమీది పెట్టే దిగువబడ్డది. they *d me and robbed me నన్ను అటూ ఇటూ తోసి దోచుకొన్నారు.
To Jot v a టూకిగా వ్రాసుకొనుట. he *ted down a memorandum టూకిగా యాదాస్తువ్రాసుకొన్నాడు.
To Journalize v a దినచర్యవ్రాయుట, యిది సుశబ్దము కాదు.
To Journey v n ప్రయాణము పోవుట.
To Joust v n బల్లెములతో వేడుకకు పోట్లాడుట, మృషామృధము చేసుట.
To Joy v a సంతోషపెట్టుట, సుఖపెట్టుట.
To Judaize v n యూదియా మతము అనుసరించి ప్రవర్తించుట.
To Judge v a and v. n. తీర్పుచేసుట, విమర్శించుట, విచారించుట, ఆలోచించుట. he *d between them and me వాండ్లకు నాకు వుండిన వ్యాజ్యాన్నితీర్చినాడు. do as you * best నీకు యెట్లా యుక్తమని తోస్తే అట్లా చేయుము. this is best if I * right నా బుద్ధికి యిది మేలని తోస్తున్నది. whether this or that is the wisest you must * ఇది మంచిదో అది మంచిదో నీవే ఆలోచించవలసినది. God will * the wicked దుర్మార్గుణ్ని దేవుడు విచారించును.In Matt. VII. ఈ. " * not " అన్యం దోషినం మాకృథాః A+.
To Juggle v n గారడివిద్యలాడుట, కనుకట్టువిద్య చేసుట, చమత్కారము చేసుట, మాయలు చేసుట.
To Jumble v a కలగూరగంపగా చేసుట, గందరగూళముచేసుట, గలిబిలిచేసుట, రసాభాసము చేసుట, సంకరముచేసుట.
To Jump v n దుముకుట, దాటుట. he *ed up దిగ్గున లేచినాడు. he *ed out of the carriage బండిలోనుంచి దుమికినాడు. he *ed over the wall గోడను దాటినాడు. he *ed into the estate ఆ యాస్తి వాడికి అకస్మాత్తుగ వచ్చినది to agree totally, to join (johnson) సందర్శించుట. his judgement *s with yours నీకు తోచినట్టే వాడికి తోస్తున్నది.
To Justify v a పునీతుణ్నిగా చేసుట, నిర్దుష్టుణ్నిగా చేసుట, దోషవిమోచనము చేసుట, దోషములేదని తీర్పిచ్చుట. he justified his conduct by shewing your orders మీ ఆజ్ఞను అగుపరచి తాను తన తప్పును బాపుకొన్నాడు. the even justified my prediction ఇట్లా సంభవించడము చేత నేను చెప్పినది నిజమైనది.
To Justle v a తోసుట, గుంపులో పైనబడుట. why do you * me నన్నేలతోస్తావు, నామీద యేల పడుతావు. he *d them out of the estate ఆ సొత్తును వాండ్లకు అబ్బకుండా చేసినాడు.
To Jut v n ముందరికి వచ్చివుండుట. there was a stone *ting a foot out of the wall ఆ గోడలో నుంచి వొకరాయి వొక అడుగు ముందరికి వచ్చి వున్నది.
To Keelhale v a వాడకింద వేసియీడ్చుట అనగా తప్పుచేసిన వాణ్ని తాడుతో కట్టి సముద్రములో వేసి ఆ తట్టునుంచి యీ తట్టుకు వాడ కిందుగా యీడ్చుట.
To Keep v n ఉండుట. this fruit will not * till to-morrow ఈ పండ్లు రేపటిదాకా వుండవు, అనగా మురిగిపోను. the weather still *s very hot ఇంకా వూరికే యేండలు కాస్తున్నవి. will this water * hot all day? దినమంతా ఆ నీళ్ళు వేడిగానే వుండునా. the door will not * shut unless you bolt it ఆ తలుపు గడియ వేస్తేగాని తేరుచుకోకుండా నిలువదు. * still ఊరికే వుండు. (with ing) he kept kissing her cheeks దాన్ని వూరికే ముద్దు పెట్టుకొంటూ వుండినాడు. (with prepositions) he kept from doing so అట్లా చేయక మానినాడు. they kept away from him వాండ్లు వాడి జోలికి పోలేడు. this peg will not * in ఆ మేకు నిలువదు. they kept in favour with him వాండ్ల దయ అతని యందు తప్పలేదు. I kept in bed పడ్డపడకగా వుంటిని. they kept off వాండ్లు కడగా వుండిరి. he kept on his course unaltered. ఏమి అభ్యంతరము లేకుండా వూరికే పోయినాడు. he kept on talking ఉరికే మాట్లాడుతూ వుండినాడు. she kept on abusing them వాండ్లను వూరికే తిట్టుతూ వుండినది. he kept up the whole night or he kept awake all night రాత్రి అంతా మేలుకొని వుండినాడు. you must * up వేనకపడక. he kept with in due bounds వాడు మితముగా వుండినాడు. he must * within doors వాడు బయటపోరాదు.
To Ken v a దూరాన వుండేదాన్ని కనుక్కొనుట, తెలుసుకొనుట. you * what అల్లది ఫలానిది, అనగా పేరు గుర్తించరానిది.
To Kennel v n దాగుట, యిది కావ్య శబ్దము.
To Kick v n తన్నుకొనుట, నీచభాషలో పీకులాడుట అడ్డములాడుట, చచ్చుట. to resist or object ఆక్షేపించుట.
To Kidnap v a బిడ్డలను దొంగిలించుట, మనుష్యులను దొంగిలించుట.
To Kill v a చంపుట, వధించుట, సంహరించుట. he *ed himself హత్యచేసుకొన్నాడు. the tortoise is hard to * తాబేలుది మొండి ప్రాణము. to * quicksilver రసమును విరుచుట.he did this merely to * time ప్రొద్దుబోక యింతపనిచేసినాడు, ఊరికే కాలహరణానికై దీన్ని చేసినాడు. the horses came alongat a *ing pace ఆ గుర్రాలు పేగులు తేగేటట్టు పరుగెత్తి వచ్చినవి.
To kindle v n అంటుకొనుట, రగులుకొనుట.
To Kiss v a ముద్దుబేట్టుకొనుట. he *ed the earth నేలకు దండము పెట్టినాడు, అనగా పడ్డాడు. to * the rod బతిమాలుకొనుట.
To kitten v a పిల్లలను వేసుట, యిది పిల్లిని గురించిన మాట.
To Knead v a పిసుకుట, పిండిపిసుకుట.
To Kneel v n మోకారించుట, మోకాలించుట.
To Knight v a నైట్ అనే పట్టము యిచ్చుట.
To Knit v a అల్లుట, ముడివేసుట. to * a stocking మేజోడును అల్లుట. to * the brows బొమలు ముడిబెట్టుట.
To Knock v n కొట్టుకొనుట. my head *ed against the wall నా తల గోడను కొట్టుకొన్నది. he *ed at the door తలుపు తట్టినాడు. death was now *ing at the door ఇంతలో చావు తటస్థమైనది. he walked ten miles but at last he *ed under పదిగడియల దూరము నడిచి తుదకు వెనక్కు తీసిపోయినాడు. on shewing him these documents he *ed under ఈ దస్తావేజులను చూపించేటప్పటికి వాడి నడుములు పడ్డవి.
To Knoll v a ఘంట వాయించుట.
To Knot, nit v a. ముడి వేసుట.
To Know v a ఎరుగుట, తెలుసుకొనుట. do you * him? వాణ్ని యెరుగుదువా. he does not * his own mind వాడు చపలచిత్తుడు, వాడికి బుద్ధి నిలకడలేదు. the skilful, those who * వ్యకతులు.men who * trade వ్యవహారవ్యక్తులు. we ought to * ourselves ఆత్మజ్ఞానము కలగవలశినది, జ్ఞానమార్గము అవలంబించవలశినది. do you * Tamil? nIku arvmu తెలుసునా. I do నాకు తెలుసును. I knew it was him by the voice వాడి కంఠధ్వని చేత వాడని తెలుసుకొంటిని. it is here you *; or, don't you *? అది యిక్కడ వున్నదిగదా. this is the knife I bought you * ఇదినేను కొన్న కత్తి కదా. do you * he talks Tamil very well వాడు అరవము బాగా మాట్లాడుతాడు గదా. he perceived you * what వాడు ఆ సంగతిని కనుక్కొన్నాడు గదా. ఆ సంగతి అనగా పేరేత్తి చెప్పరానిది. he said something. I * not what వాడేమో చేప్పినాడు నాకు తెలియలేదు. somebody came there, I * not who ఏవరో వచ్చినారు, యిట్టివారని నాకు తెలియలేదు. as I knew not what to do నాకు యెటూ చేయడానకు తోచలేదు గనుక, తేలియలేదు గనుక. he is gone I * not where ఎక్కడికి పోయినాడో తెలియదు, ఏక్కడికో పోయినాడు.he stayed I * not how long ఎన్నాళ్ళు వుండినాడో. I do not* who *s not a woman స్త్రీ ముఖము యెరగని పిల్లకాయ. men who do not * business అవ్యక్తులు. he knew her (carnally) దానితో పోయినాడు. Him who knew no sin (2 Cor. V. 21. కలుషస్యకోపి సంపర్కోనాసీత్ A+.) నిష్కల్మషమైనవాణ్ని, పాపరహితుణ్ని. See Known.
To Knuckle donw v n ఓడిపోవుట, లొంగుట, లోబడుట.
To Kriss v a to stab కటారితో పొడుచుట.
To Label v a విలాసము తగిలించుట.
To Labour v a and v. n. శ్రమపడుట, కష్టపడుట, ప్రయాసపడుట. he *s for hire వాడు కూలి చేసుకొంటాడు. he was then *ing under fever వాడు అప్పట్లో జ్వరముచేతసంకటపడుతూ వుండెను. he was *ing under great excitment వాడు నిండా కోపావేశముగలవాడై వుండినాడు. they * under a delusion regarding this ఇందున గురించి వాండ్లుభ్రమపడి వున్నారు. he was then *ing under the king's displeasure వాడు అప్పట్లో రాజుయొక్క కోపమునకు పాత్రుడై వుండినాడు. an asthmatic man *s much in speaking ఉబ్బసరోగి మాట్లాడడానకు మహాసంకట పడుతాడు . he has *ed this poem very muchఈ కావ్యమును మహాకష్టపడి రచించినాడు. a *ing man కూలివాడు.
To Lace v a అల్లుట. he *d his fingers in her's దాని చెయితో చెయిగూర్చుకొన్నాడు. to * a bed మంచమల్లుట. he *d the jacket with gold ఆ చొక్కాకు సరిగగోటువేసినాడు.
To Lacerate v a గీచుట బరుకుట.
To Lack v a or to want కావలసివుండుట, తక్కువ పడుట. what does he * ? వాడికి కావలసినది యేమి, వాడికి తక్కువగా వుండేది యేమి. he *s sense వాడికి తెలివితక్కువగా వున్నది. he *s money వాడికి రూకలు కావలసివున్నవి. వాడికి రూకలు లేవు.he *s knowledge వాడు విద్యావిహీనుడు. he *eth one thing వానికి వొకటి తక్కువగావున్నది. they * house and home వాండ్లకు యిల్లూ లేదు వాకిలి లేదు. *ing senseబుద్ధిలేని జ్ఙానవిహీనమైన.
To Lade, lade v a. or to load బశువు యెక్కించుట. or to throw out చల్లుట. they *d the vessel with rice ఆ వాడ మీద బియ్యమెక్కించినారు.
To Lag v n వెనకపడుట, జబ్బుగా నడుచుట. the work *s very much ఆ పని మహాజబ్బుగా నడుస్తున్నది. my horse *ged నా గుర్రము వెనక పడ్డది.
To Lame adj కుంటిగాచేసుట. the fall *d me పడడముచేత కుంటివాణ్ని అయినాను.
To Lament v a and v. n. to be sorry for ఏడ్చుట, శోకించుట. to express sorrowfor పలవరించుట, ప్రలాపించుట. his *ed father అతని చనిపోయిన తండ్రి. it is muchto be *ed that you quarrelled with him అయ్యో అతనితో యెందుకు జగడమాడినావు.
To Lampoon v a ఒకరి మీద యెగతాళి పద్యము చెప్పుట.
To Lance v a కత్తివాటువేసుట, కోసుట. the doctor *d the wound వైద్యుడు ఆ పుంటిని శస్త్రము చేసినాడు.
To Lanch v a వేయుట. See To launch.
To Land v n గట్టున దిగుట, రేవున దిగుట. ten soldiers *ed yesterday నిన్న వాడమీదినుంచి పదిమంది శిపాయీలు దిగినారు.
To Languish v a క్షమించుట, క్షీణించుట, కృశించుట, ఉడుగుట. he *ed for ten mouths and then died పది నెలలు కృశిస్తూ వుండి చచ్చినాడు.he is *ing for her దాని మీదనే మోహముగా వున్నాడు.
To Lap v a as a dog నాలికతో తాగుట, గతుకుట. to wrap చుట్టుట. he *ped the diamond in a piece of paper ఆ రవను కాగిదములో పెట్టి మడిచినాడు. thecover of the cartouche box *s over తోటా పెట్టెయొక్క పయిమూత ఆపెట్టెను మూసుకొనికొంచెము మించజారి వుంటున్నది.
To Lapse v n గడుచుట, జరుగుట. after two lives *d ఇద్దరు గడిచిన తరవాత,అనగా యిద్దరు చనిపోయిన తరువాత.
To Lard v a పందికొవ్వు వేసుట, పందినెయ్యి చమురుట.
To Lash v a కొట్టుట, జాటితో కొట్టుట. the waves that * the shore కట్టమీదకొట్టే అలలు. this affair was *ed in the newspapers ఈ సంగతిని ప్రసిద్ధ పత్రికలలో యెగతాళిగా వ్రాసినారు. he *ed the box to the mast ఆ పెట్టెను స్తంభముతో అంటకట్టినాడు, యిది సముద్రభాష.
To Last v n జరుగుట, ఉంచుట. the trial *ed ten days ఆ విచారణ పది దినములదాకా జరిగినది. his patience *ed very long వాడు బహుదూరము వోర్చినాడు. his patience *ed no honget వాడికి విసుకు వచ్చినది. this grain *ed them fora year ఆ ధాన్యము వాండ్లకు వొక సంవత్సరానికి ఆటి వచ్చినది. as long as life *edప్రాణమువుండే వరకు. this cloth will not * long ఈ గుడ్డి దినాల పేరట వుండదు,కట్టు తాళదు.
To Latch v a గడియవేసుట.
To Lather v a నురుగును చమురుట. the barber *ed his chin మంగలవాడువాడి గడ్డానికి నురుగు పట్టించినాడు.
To Laugh v n నవ్వుట. he *s at you నిన్ను యెగతాళిచేస్తాడు, పరిహాసము చేస్తాడు.
To Launch v a to push to sea సముద్రము లోకి తోసుట. the boat was on the shore and he *ed it పడవ కట్టమీద వుండినది దాన్ని నీళ్ళలోకి తోసినాడు. he *ed his spearat them ఈటెను వాండ్ల మీద విసిరివేసినాడు. he *ed curses at them వాండ్లను తిట్టినాడు, శపించినాడు. he *ed the bamboos into the Ganges గంగలో వెదుళ్ళను విడిచినాడు. the ship was *ed ఆ వాడను సముద్రలోకి తోసినారు. he was *ed into eternity వురితీయబడ్డాడు.
To Lava v a కడుగుట, స్నానముచేయించుట.
To Lavish v a అతివ్రయముచేసుట. he *ed his money వాడు తన రూకలనుదుగారుబగారు చేసినాడు వెదచల్లినాడు.
To Lay v n పండుకొని వుండుట, ఉంచుట. he *s about him with a whip చబుకుతో తన చుట్టు విసురుతాడు. the ships * to for onee day వాడలువొకదినమంతా పోకుండా నిలిచి విండినవి. See to Lie.
To Lead, led v a. తీసుకవచ్చుట, తీసుకపోవుట. he led the lefant ఆ బిడ్డను చెయిపట్టి నడిపించినాడు, నడిపించుకొని పోయినాడు. he led the water of the river into the village ఆ యేటి నీళ్లు వూరికి పారేటట్టుచేసినాడు. he led the road through the jungel ఆ అడవి నడమబాట వేసినాడు. he led me into the house నన్ను యింట్లోకితీసుకపోయినాడు. this led me to consent ఇందువల్ల సమ్మతించినాను. this *s me to think that he is dead వాడు చచ్చినాడని యిందువల్ల నాకు తోసున్నది. this road *s to the town ఈ దారి పట్నానికి పోతున్నది, ఈ దారి పట్టణములోకి తీసుకపోయి విడుస్తున్నది. he *s a laborious life వాడు మహాకష్టపడు తున్నాడు. he *s an easy life సుఖజీవనము చేస్తున్నాడు. the life he is *ing will end in ruin వాడు నడిచే నడత వాడి నాశనములో పరివసించును. he led the creepers over the house ఆ తీగెలను యించిమీదకి యెక్కించినాడు. he led me through the grammar వ్యాకరణము కడవెళ్లా నాకు చెప్పినాడు. he led the army వాడు సేనాధిపతిగా వుండినాడు. he led his army into the country తన దండును ఆ దేశములోకి తీసుకవచ్చినాడు.
To League v n కట్టుగా వుండుట, బందుకట్టు చేసుకొనుట, సంకేతముచేసుకొనుట,సమాఖ్య చేసుకొనుట. they *d together to destroy him వాణ్ని చెరపవలెనని సంకేతము చేసుకొన్నారు.
To Leak v n ఉరియుట, కారుట. this house *s much or, the water *s through the roof ఈ యిల్లు నిండా వురుస్తున్నది. the ship *ed ఓడు అయినందున ఆ వాడలోకినీళ్లు వచ్చినది. the cask * ఆ సీపాయి కారుతున్నది.
To lean v a అనిపించుట. they *t the separs against the wall ఈటెలను గోడకు ఆనించినారు.
To Leap v a దాటుట. he *ed the wall గోడను దాటినాడు. he *ed four yards నాలుగు గజాల దురము దాటినాడు. the bull *ed the cow ఆ యెద్దు ఆవుమీద యెక్కినది.ఆ యెద్దు ఆవును దాటినది.
To leap, lep v n. దుముకుట. the stag *ed over the wall ఆ జింక గోడమ దాటినది. thefish *t into the boat చేపలు పడవలోకి మిడిసిపడినవి, తుళ్ళిపడినవి. they *ed out on the enemy లటుక్కున శత్రువుల మీద పోయి పడ్డారు. on seeng him her heart *ed withjoy వాణ్ని చూచి దాని మనసు సంతోషముచేత వుప్పొంగినది. the dog *ed at the tree ఆ కుక్క చెట్టుమీదికి పాకినది.
To Learn v a and v. n. తెలుసుకొనుట, నేర్చకొనుట, అభ్యసించుట. I *t this fromhim అది వాడివల్ల నాకు తెలిసినది. you should * of him నీవున్ను వాడివలెనడుచుకోవలసినది. I * that they are coming వాండ్లు వస్తారని నాకు తెలిసినది.he *s Telugu తెలుగు చదువుతున్నాడు. I *ed it దాన్ని అభ్యసిస్తిని. he *t it byheart వాడికి అది ముఖస్థమైనది. he *t me Telugu (this is bad English) వాడునాకు తెలుగు నేర్పినాడు.
To Lease v n to glean, to gather what the harvese men leave మడిలో రాలిపోయిన గింజలను యేరుట. or to tell lies అబద్ధాలాడు బొంకుట.
To Leather v a to thresh పులుముట, బాదుట. యిది నీచశబ్దము.
To Leavae v n బయలుదేలుట వెళ్లుట. I arrived after he left వాడుబయలుదేరిన తరువాత నేను వచ్చిచేరినాను.
To Leave v a విడుచుట, విడిచిపెట్టుట, వదులుట, మానుకొనుట. I have left the book at home నేను పుస్తకమును యింట్లోబెట్టి వచ్చినాను. * that there అది అక్కడ వుండనీ. you must not * it here దాన్ని యిక్కడపెట్టక. I wish you would * me alone నా జోలికి రావద్దు, నా తెరువుకు రావద్దు. when he left the house వాడు యింట్లోనుంచిబయలు దేలినప్పుడు. he will * no stone unturned to effect this దీన్ని సాధించడానకువాడు చేయని ప్రయత్నము లేదు సకల ప్రయత్నములు చేస్తాడు. he left the school పల్లె కూటాన్ని విడిచిపెట్టినాడు. I * it to your consideration దాన్ని తమరేఆలోచించవలె. God will never * them that trust in him తన్ను నమ్మినవాండ్లను దేవుడు చెయ్యి విడువడు. his father left him some property వాడి తండ్రి వాడికికొంచెము ఆస్తి పెట్టి చచ్చినాడు. he left him his property by will తన ఆస్తినివాడికి వ్రాసి చచ్చినాడు. why did you * the child alone? ఆ బిడ్డను యెందుకువొంటిగా విడిచిపెట్టినావు. he left off eating fruit పండ్లు తినడము మానుకొన్నాడు.here you have left out a word. నీవు యిక్కడ వొకమాటను విడిచిపెట్టినావు. we will * this out of the question ఆ ప్రమేయమును మానుకొందాము. he left it undone(Luke XI. 42.) చేయక మానినాడు. o See Left.
To Leaven n s పులుసుబెట్టుట, రొట్టె వుబ్బడఖై పులిసిన పిండిని వేసి కలుపుట.history *ed with falsehood ఈషదనృత మిశ్రిత చరిత్రము, కొంచెము అబద్ధము కలసిన కథ.
To Lecture n s ప్రసంగించేవాడు, ప్రాసంగికుడు.
To Leer v n ఓరచూపుచూచుట, కడగంటిచూపుచూచుట, కీగంట చూచుట, కనుసైగచేసుట.
To Legalize v a శాస్త్రసమ్మతపరచుట శాస్త్ర సిద్ధముచేసుట. to * a bond, withnessare necessary ఒక పత్రము యథావిధిగా వున్నదనడమునకు సాక్షులు అగత్యము. thesewitnesses *d the marriage ఈ సాక్షులవల్ల అది న్యాయమైన పెండ్లి అనబడ్డది.
To Legislate v n ధర్మశాస్త్రమును యేర్పరచుట, చట్టములు యేర్పరచుట. Manu *d forthe bramins మనువు బ్రాహ్మలకు ధర్మశాస్త్రమును విధించినాడు.
To Lend v a ఇచ్చుట, ఎరువు యిచ్చుట, అప్పుయిచ్చుట. he lent me his book for a week వాడికి అప్పు యిచ్చినాడు. they lent him money వాడికి అప్పు యిచ్చినారు.he lent himself to their views వాండ్లకు అన్నివిధాల సహాయపడ్ఢాడు.* me your attention or * me an ear ఆలకించండి. * me you hand నాకు చెయ్యి యియ్యి, సహాయము చెయ్యి.
To Lengthen v a నిడివిగా చేసుట, పొడుగ్గా చేసుట, అతివిస్తారము చేసుట. he *ed the story ఆ కథను పెంచినాడు.
To Lessen v a తగ్గించుట మట్టుపరచుట, అణచుట. this *ed the heat ఇందువల్ల కాక మట్టు పడ్డది.
To Let v a or hinder ఆటంకము చేసుట, అడ్డిచేసుట.
To Letter v a కాగిదపుస్తకము వీపున పేరు వేసుట. these books are *edwith his name ఈ పుస్తకము వీపున అతని పేరు వేసి వున్నది.
To Level v a సమముచేసుట, మిట్టాపల్లము లకసుదుట. he levelled the groundఆ నేలను సమము చేసినాడు. he levlld his gun at them తుపాకిని వాండ్లమీదికి గురిపట్టినాడు. he levelled this reemark at us ఈ మాటన మనకు తాకనాడినాడు.
To Levigate v a పొడిచేసుట, చూర్ణము చేసుట.
To Levy v a కూర్చుట, చేర్చుట, వసూలు చేసుట, గణించుట. he levied a fine from them వాండ్లవద్ద అపరాధము తీసినాడు. he levied five rupees from every shop అంగడికిఅయిదు రూపాయలు దండుగ తీసినాడు. he levied a great army పెద్దదండను కూర్చినాడు.he levied a great deal of money శానా రూకలు కూడబెట్టినాడు, పోగు చేసినాడు.they levied a large tax from our village మావూళ్ళో శానా రూకలు వసూలు చేసినారు.
To Libel v a దూషించుట.
To Liberate v a విడుదలచేసుట, విడిచిపెట్టుట, వదులుట.
To Lick, lick v a. నాకుట. his foes shall * the dust వాడి శత్రువులు గడ్డితిందురు, వొడిపోదురు. pride that *s the dust కుంగిన గర్వము, he *ed his chaps at this దాన్ని చూచి గుటకలు మింగినాడు. or to cudgel బాదుట, పులుముట.
To Lie v n (or tell falsehood) అబద్ధము చెప్పుట, కల్లలాడుట See Lying.
To Lift v a ఎత్తుట, లేవనెత్తుట, పొడుగ్గా యెత్తుట. he *ed up the box పెట్టెను పైకి యెత్తినాడు. she *ed up her voice and wept ఎలుగెత్తి యేడ్చినది. పెద్దగొంతు పెట్టి యేడ్చినది. now thou art *ed up ఇప్పుడు నీకు నిండా పొడిగిపోయినది.
To Light v n to alight, descend దిగుట, వాలుట. he *ed from the horseగుర్రముమీది నుంచి దిగినాడు. a bird *ed on the cow ఒక పక్షి ఆవుమీద వాలినది.when we fell I *ed on my నేను నిలిచినట్టుపడ్డాను, వాడు తలకిందుగా పడ్డాడు.at last I *ed on the word తుదకు ఆ మాట చిక్కినది, తగిలినది. the curse *ed uponhim ఆ శాపము వాడికి తగిలినది, అతనికి మా వుసురు తగిలినది.
To Lighten v a సుళువుచేసుట, తేలికచేసుట, ఉసలుచేసుట, బళువులేకుండా చేసుట.Aid *s toil సహాయముచేత శ్రమతక్కువ అవుతున్నది.
To Like v n ఇష్టముగా వుండుట. this dog *s to be here ఈ కుక్కకు యిక్కడ వుండవలెనని మనసుగా వున్నది. I do not * to there అక్కడకి పోవడమునకు యిష్టములేదు. I I should * to go నాకు పోవలెనని వున్నది. take as much as you * నీకు కావలసినంత యెత్తుకో. I should * to know who she was అది యెవతె, ఆబిడ యెవరు.
To Liken v a పోల్చుట. he *ed the elephant to a mountain ఆ యేనుగను కొండతో పోల్చినాడు.
To Lime v a జిగురు తగిలించుట, జిగురుకర్రతో పట్టుట.
To Limit v a హద్దుయేర్పరచుట, పొలిమేర యేర్పరచుట. he *ed his expensesవాడి ఖర్చులను మట్టు చేసినాడు. he *ed his studies to English యింగ్లీషు మట్టుకే చదువుతాడు. I * my request to this నేను అడిగేటిది యింతే.
To Limn v a చిత్రము వ్రాసుట.
To Limp v n కుంటుట.
To Line v a అస్త్రివేసుట. he *d the coat with silk ఆ చౌక్కాయకు పట్టు అస్త్రి వేసినాడు. he *d the box with tin పెట్టెకు లోగా సీసపురేకు వేసినాడు. a *d coat జమిలిచొక్కాయి, రెట్టచొక్కాయి. the trops *d the walls గోడకు లోతట్టు చుట్టుదండు వరసగా నిలిచినది. the trops *d the streets ఆ వీధికి రెండు ప్రక్కల దండువరసగా నిలిచినది. his purse is well *d (Johnson) వాడి తిత్తి నిండినది, అనగామహరాజు అయినాడు. a tank *d with stone రాళ్లుకట్టిన గుంట. the dog *d the bitch ఆ కుక్క ఆడుకుక్కను చూలుచేసినది.
To Linger v n నవియుట, జాగుచేసుట, తామసముచేసుట. he *ed ten months పదినెలలు నవిశినాడు. why do you * without going? పోకుండా యెందుకు జాగుచేస్తావు.he *ed two hours at her door దాని యింటి వాకిట రెండు గడియలు తారాడుతూ వుండినాడు.
To Liquefy v n కరుగుట.
To Liquidate v a తీర్చుట, చెల్లించుట. he *d the whole debts అప్పంతాతీర్చినాడు.
To Lisp v a బిడ్డవలె నోట పట్టీపట్టక మాట్లాడుట, నోరుతిరగక దద్దా బిద్ధా అనిమాట్లాడుట.
To List v n ఆశించుట, యిచ్ఛయించుట. or Listen ఆలకించుట. whatever you * నీవు యేమి కోరినా.
To Listen v n ఆలకించుట, ఆలకించి వినుట. he *ed to my persuasion నా మాట విన్నాడు. Listener, n. s. ఆలకించేవాడు, వినేవాడు. his *s ఆయనబోధ వినేవాండ్లు ఆయన శిష్యులు.
To Litigate v a వాజ్యమాడుట. the litigating parties వ్యాజ్యగాండ్లు.
To Live v n and v. a. జీవించుట, బ్రతుకుట ప్రాణముతో వుండుట. or dwell కాపురమువుండుట, నివసించుట, వుండుట. he *s by trade వర్తకము చేసి జీవిస్తాడు. short *d అల్పాయువుగా చచ్చిన. long *d దీర్ఘాయుస్సుగా వుండిన. No boat can * insuch a raging sea యింత అఘోరమైన అలలో పడవ నిల్వనేరదు. he now *s lowపథ్యముగా వున్నాడు, మితాహారము చేస్తాడు. he *s from hand to mouth నానాటికి తెచ్చుకొని పొట్టపోసుకొంటాడు. O king * for ever ! చిరంజీవిగా వుండవలెను.Thy * upon rice వాండ్లకు ఆహారము బియ్యము.
To Load v a బరువువేసుట, బళువు యెక్కించుట. to * a gun బారుచేసుట, గెట్టించుట.they *ed the cart with bricks ఆ బండికి యిటికిరాళ్లు వేసినారు. they *ed the oxen ఎద్దులమీద పెరికెలను వేసినారు. they *ed him with abuse వాణ్ని మహా తిట్టినారు. they *ed him with blows వాణ్ని నిండా కొట్టినారు. they *ed me with kindnessనాయందు నిండా విశ్వాసము చేసినారు. the ship was *ed with cotton వాడమీద దూదినియెక్కించినారు. *ed dice మాయపాచికలు, అనగా తనకు కావలసిన పందెము పడేటట్టులోగా సీసము పోశిన మాయపాచికలు.
To Loath v a అసహించుకొనుట.
To Locate v a పెట్టుట, ఉంచుట, ఏర్పరచుట. he *d a shop in this streetఈ వీధిలో వొక అంగడి పెట్టినాడు. the trops were *d there ఆ పటాళమును అక్కడపెట్టినారు.
To Lock v a బీగము వేసుట, తాళము వేసుట. to * a chain or staple గొళ్ళెము వేసుట. he *ed his arm in mine నారెట్టన వాని రెట్టను గూర్చుకొన్నాడు. he *ed hisfingers in mine నాచెయి గూర్చుకొన్నాడు. he *ed her in his embrace దాన్ని కౌగలించుకొన్నాడు.
To Lodge v n దిగుట, బసచేసుట. he *d in my house నా యింట్లో దిగినాడు.much dirt *d on the shelf అల్మారా పలకలో శానా మురికిచేరినది.
To Loiter v n ఆలస్యముచేసుట, జాగుచేసుట, కాలయాపనముచేసుట.
To Loll (the tongue v a నాలికెను) వేలాడ వేసుకొనివుండుట, నాలికె వెళ్లపెట్టుట.the dog *s it's tongue దడచేత కుక్క నాలికెను వెళ్ళబెట్టుకొని వున్నది.
To Long v n ఆశపడుట, ఆపేక్షించుట. he *ed to see you నిన్ను చూడవలెననిబహు ఆశగా వుండినాడు. he *s for it దానిమీద మహా వాంఛగా వున్నాడు.
To Longe v a See To Lauge.
To Look v n చూచుట. how can you see it you won't * చూడకుంటే నీ కెట్లాతెలుసును. when I *ed I saw him do this నేను చూచేటప్పటికి వాడు దాన్ని చేసేదితెలిసినది. I *ed ag in but I did not see him నేను మళ్లీ చూచేటప్పటికి వాడు కానము. * at it దాన్ని చూడు. I *ed at the letter but I did not see the meaningఆ జాబు చూచినానుగాని అర్థముకాలేదు. I *ed but it was too dark to see any thingనేను చూచినాను అయితేనిండా చీకటి అయినందువల్ల వొకటీ అగుపడలేదు. I *ed for the word in the dictionary ఆ మాటను నిఘంటులో వెతికినాను. I *ed out a horsefor him అతనికై వొక గుర్రమును విచారించినాను. he *sup to you as a master నిన్ను యజమానుణ్నిగా విచారిస్తాడు. they * down upon him వాణ్ని వుపేక్ష చేస్తారు. he *s after my horses నా గుర్రాలను అతడు విచారించుకొంటాడు, పరామర్శించుకొంటాడు. అతని కాపుదారిలో వున్నవి. I * upon this as the truth ఇది నిజమని తోస్తున్నది. they * upon him as a thief వాణ్ని దొంగ అని అంటారు. I *ed over this letter ఆ జాబును పార చూచినాను. you must * to this నీవు దీన్ని చూచుకోవలసినది,విచారించుకో వలసినది. they *ed to God for aid దేవుడే దిక్కు అనుకొన్నాను. If your son takes this I shall * to you for payment దీన్ని నీకొడుకు తీసుకుపోతే రూకలు చెల్లించేటందుకు నీవు వున్నావనుకొన్నాను. do not * to me for money రూకలతోటి మాట నాది కాదు. this is the point to * to ముఖ్యముగా విచారించవలసిన విషయము యిదే. They may forward to having a nily వాండ్లకు బిడ్డలు కలగవచ్చును. you must * about you నీవు పదిలముగా వుండవలసినది, అజాగ్రతగా వుండరాదు. to * after విచారించుట. I *ed hard at him వాణ్ని నిదానించి చూస్తిని. when we * back to childhood బాల్యదశను తలచుకొంటే. why don't you * before you ముందు రాబొయ్యేదాన్ని యేల విచారించవు. he *s very big వాడు మహా గర్విష్ఠుడుగా అగుపడుతాడు. we long *edfor his arrival అతని రాకకు బహుదినాలు యెదురు చూస్తిమి. he *ed into the wellబావిలో తొంగిచూచినాడు. I *ed into the accounts ఆ లెక్కలను పరిశోధించినాను. will you * in tomorrow ? రేపు మా యింటికి వస్తావా. he is much *ed up to in this town ఈ వూరిలో వాడు నిండా గౌరవము పొందివున్నాడు. To * or seem తోచుట, అగుపడుట.It *ed like a snake ఇది పామువలె వుండినది. he *s well to-day నేడు వాడి యొక్క ముఖము తేటగా వున్నది. his doing this *s well వాడు దీన్ని చేయడము మంచిదనితోస్తున్నది, అగుపడుతున్నది. he *s like a fool పిచ్చివాడివలె వున్నాడు.she *s ill దానికి వౌళ్లు కుదురులేనట్టు తోస్తున్నది.
To Loom v n or appear అగుపడుట.
To Loose v a విప్పుట, వదిలించుట, వదులుట.
To Loot (Indian word) See To Plunder, Loot, n. s See Plunder.
To Lop v a కొమ్మలను నరుకుట, తెగకొట్టుట. they lopped off his hands వాడిచేతులనునరికినారు.
To Lord v n బెస్తపెత్తనము చేసుట, విజృంభించి తిరుగుట.
To Lose v a and n. ఓడుట, ఓడిపోవుట, పోగౌట్టుకొనుట, కోలుబోవుట. I have lost my knife కత్తి కానక పోయినది. I have lost the place అది తప్పినది. he lost the game ఆటలో వోడినాడు. he lost his bet పందెమును వోడినాడు. he has lostcaste కులభ్రష్టుడైనాడు. he lost the day or battle అపజయమును పొందినాడు.he lost his eyes వాడికి కండ్లుపోయినవి. he lost his balance, and fell వొరిగినిలువలేక పడ్డాడు, సమాళించుకోలేక పడ్డాడు. he lost his appetite వాడికి ఆకలి అణిగిపోయినది. he lost all presence of mind గాబరా పడ్డాడు, భ్రమపడ్డాడు.In this business he lost himself very much ఈ పనిలో వాడి గౌరవము పోయినది.he lost his patience రేగినాడు. he lost himself in the wood అడివిలో తప్పిపోయినాడు. he lost himself in the wood అడవిలో తప్పిపోయినాడు. he lost heart వాడికి ధైర్యము తప్పినది. y have no time to * కాలహరణము చేయవద్దు, ఆలస్యముచేయక. you must * no time in going there తక్షణము పోవలసినది. he has lost his senses వాడికి స్మారకము తప్పివున్నది. she lost colour దాని వర్చస్సు పోయినది. he has lost his healh వాడికి వొళ్ళు కుదురులేదు. It has lost it's scent దాని వాసన పోయినది. I lost sight of itఅది నాకు అగుపడలేదు. you must not * sight of this నీవు దానిమీద దృష్టి వుండవలసినది. you must not * sight of him నీవు వాణ్ని వుపేక్ష చేయవద్దు.this knife has lost it's edge ఈ కత్తిపదును పోయినది. It lost it's colourదాని రంగు మాశినది. the river here *s itself in the sand ఆ యేరు యీ యిసుకలోఅంతర్వాహినియై పోయినది. the hill *s itself in the clouds ఆ పర్వతము మేఘములోమరిగిపోయినది. all traces of it are lost దాని పొలుకువ లేకపోయినది.the apportunity was lost సమయము తప్పినది. a passage lost in a poem గ్రంథపాతము. Iwas lost in astonishment నాకు అత్యాశ్చర్యమైనది. he is lost to all shame వాడికిలజ్జేలేదు. he was lost in thought తదేక ధ్యానముగా వుండినాడు. Loser, n. s. ఓడినవాడు, పోగొట్టుకొన్నవాడు, కోలుపడ్డవాడు. they came off *s ఓడినారు.
To Louden v n అధికముగా మోగుట, అధికముగా ధ్వనించుట. the sound *edఆ ధ్వని మరీ యెచ్చినది.
To Lounge v n సోమారిగా తిరుగుట, బద్ధకముగా పడియుండుట. I saw him loungingabout వాడు సోమారిగా తిరుగుతాడు. I saw him lounging about వాడు సోమారిగా తిరుగుతాడు. he was going along at lounging pace సోమారితనముగా అసియాడుతూపోతూ వుండినాడు.
To Love v n (or be in love) మోహముగా వుండుట.
To Low v n కూసుట, అరుచుట, యిది అవును గురించినమాట. the cow * ఆవు అరుస్తున్నది.
To Lower v a తగ్గించుట, తాడుకట్టి కిందికి దించుట. he *ed the bucket into the well తొట్టిని భావిలోకి విడిచినాడు. the ship *ed her sails వాడ చాపలను కిందికిదించినారు. he lowered his voice స్వరమును తగ్గించినాడు. they *ed the price వెలనుతగ్గించినారు.
To Lubricate v a నునుపు చేసుట, మెరుగుచేసుట, మెరుగుపట్టించుట.
To Luff v a వాడ భాషలో వాడమొనను గాలికి కొంచెము అభిముఖముగా తిప్పుట.
To Lug v a గుంజుట, లాగుట. he *ged the man out వాణ్ని బయటికి యీడ్చినాడు.he *ged the nail out ఆ చీలను వూడ పెరిగినాడు.
To Lull v n ఉపశాంతియౌట, అణుగుట. the storm *ed for an hour గాలి గడియసేపు అణిగివుండినది.
To Lump v a ఏకముగా చేసుట, కలుపుట. he *ed these three accounts together ఆ మూడు పద్దులను వౌకటిగా కలిపినాడు.
To Lunge v a గుర్రమును గుడితిప్పుట, కావాదిప్పుట, రవుండుకౌట్టుట.
To Lurch v n పొర్లుట.
To Lure v a చిక్కించుకోవడానకై తీపి చూపుట, ఆశచూపి వంచించుట. he put a bait in the trap to * the rat బోనులో యెలుకను పట్టడానకై మేతను పెట్టినాడు.she *d him in vain దాని మాయలో వాడు పడలేదు. he *d me with vain promisesలేనిపోని ఆశలుపెట్టి మోసపుచ్చినాడు.
To Lurk v n నక్కుట, పొంచువుండుట, వొడ్డు వేసుకొని తిరుగుట.
To Lust v n ఆశపడుట, వాంఛపడుట, దుర్భ్రాంతిపడుట. he *ed for this దీనిమీద భ్రాంతిపడ్డాడు.
To Lustrate v a ప్రోక్షించుట.
To Lute v a చీలమన్ను చేసుట.
To Luxuriate v n విహరించుట.
To Macadamize i e. To level, to smooth, to facilitate.
To Macerate v. a. రుబ్బుట, నూరుట,కృశింపచేసుట, or to steep నానవేసుట.
To Madden v n పిచ్చిచేసుట. a *ing head-ache వెర్రి తలనొప్పి.
To Magnify v a గొప్పచేసుట, ఘనపరచుట, స్తుతించుట, పొగడుట. this glass magnifies objects యీ అద్దములో చిన్నది గొప్పగా అగుపడుతున్నది. a magnifying glass భూత అద్దము. he magnified the difficulties కొద్దికష్టమును మహాకష్టముగాతెలియచేసినాడు.
To Maim v a కుంటిచేసుట, మొండిచేసుట, భిన్నముచేసుట. the fall*ed him పడడంవల్ల మొండి అయినాడు. he *ed the idol విగ్రహమును భిన్నము చేసినాడు.
To Maintain v a and n. కాపాడుట, పోషించుట, భరించుట. his uncle *s him వాణ్ని వాడిమామ పెట్టుకొని పోషిస్తాడు. he *s many servants వాడు శానా పనివాండ్లను పెట్టుకొని భరిస్తాడు. exercise *s us in health కసరతు రోగమును రానివ్వదు. the government *s the hospital గవనరు మెంటువారు యీ సత్రమును జరిపిస్తూ వస్తున్నారు. he now *s himself వాడు యిప్పట్లో స్వయముగా జీవనము చేస్తాడు. they *ed the fort against us మాకు స్వాధీనము కానియ్యక ఆ కోటను నిర్వహించుకొన్నారు, సమాళించుకొన్నారు.he *ed his post వాడు తనస్థానములో నుంచి కలదలేదు. he *ed his brother's story తమ్ముడి మాటనే సాధిస్తాడు, స్థాపిస్తాడు. I *ed the conversation till he returned వాడు మళ్ళీ వచ్చేదాకా మాటలతో జరుపుతూ వుంటిని. these witnesses *ed his claim ఇతని వ్యాజ్యమును ఆ సాక్షులు వూర్జితపరచినారు. they * that he is wrong వాడు తప్పినాడంటారు. they* that he wrote the letter ఆ జాబును వాడే వ్రాసినట్టు సాధిస్తారు.
To Make v n పోవుట, వచ్చుట. the tide made at noon మధ్యాహ్నవేళకుపోటు ఆరంభమైనది. they made towards me నాకై వచ్చిరి. they made off towards the hill కొండపై పారిపోయినారు. they made towards me నాకై వచ్చిరి. they made off towards the hill కొండకై పారిపోయినారు. they made back వెనక్కు పోయిరి, వెనక్కు తీసిరి. they made up to him వాడివద్దికి పోయినారు. this *s against him యిది వాడికి విరుద్ధమౌతున్నది. he made across the fields పొలములో అడ్డము తొక్కిపోయినాడు. do not * or meddle నీవు చేయవద్దు చెందవద్దు. she made believe to strike him వాణ్ని కొట్టేటట్టు అభినయించినది. he made believe to be angry కోపముగావున్నట్టు నటించినాడు. that business is all a * believe అది అంతా వట్టిటక్కు.
To Maltreat v a దౌర్జన్యము చేసుట, రచ్చపెట్టుట.
To Man v a మనుష్యులను పెట్టుట. he *ned his ship తన వాడకు మనుష్యులను పెట్టినాడు. he *ned the walls ఆ గోడలమీద సిఫాయీలను పెట్టినాడు.
To Manacle v a చేతికి సంకెళ్లు వేసుట.
To Manage v n నిగ్గుట, జరుగుట. I cannot * without you నీవు లేకనాకు నిగ్గదు, జరగదు, సాగదు. he *d to get the esate into his handsఆ యాస్తిని తన స్వాధీనము చేసుకోవడానికై యుక్తి చేసినాడు. how did you * to get into the house? ఆ యింట్లోకి పోవడానకు యేమి వుపాయము చేసినావు. I couldnot * without telling him వాడితో చెప్పక విధిలేదు.
To Manauvre v a సేనావిన్యాసమును చేసుట, వ్యూహములు పన్నుట, దండును నానా విధముఉలుగా నిలుపుట.
To Manducate v a నమలుట.
To Manifest v a అగుపరుచుట, విశదపరచుట, స్పష్టముచేసుట, తేటపరచుట. he *ed anger కోపమును అగుపరచినాడు.
To Manipulate n a పిసుకుట.
To Mantle v n ఉల్లసించుట, వ్యాపించుట, విస్తరించుట, అల్లుకొనుట.the mantling vine విస్తరించి అల్లుకొన్న ద్రాక్షతీగె.
To Manufacture v a చేసుట, వేసుట, అల్లుట. they * gunpowder తుపాకిమందు చేస్తారు. they * silks పట్టునేస్తారు. they * mats చాపలు అల్లుతారు.
To Manumit v a దాసత్వవిమోచనము చేసుట.
To Map v a వ్రాసుట, పటముగా వ్రాసుట. he *ped Bengal బంగాళాను పటముగా వ్రాసినాడు.
To Mar v a చెరుపుట. he *red our porospects మా పనులను చెరిపినాడు. This is used in some ludicrous compounds. Thus Mar Prelate గురువైరి Sir Maritin Mar-all సర్వధ్వంసకుడు, ఊరు కొల్లపుచ్చేవాడు.
To Maraud v a దవుడుచేసుట, కొల్లబెట్టుట, బందిపోటుచేసుట.
To March v a నడిపించుట. he *ed his troops into the town తన దండునుపట్టణములోకి నడిపించుకొని పోయినాడు.
To Mark v a గురుతు, వేసుట. or to take notice కనిపెట్టుట. he *ed out a circle on the plain ఆ బయిలులో గురుతుగా గిరిగీచినాడు. did you * or notice his expressions వాడనే దాన్ని కనిపెట్టినావా, చూస్తివా. he does not * what we say మనము చెప్పేదానిమీద వాడికి దృష్టిలేదు. he *ed where they are gone వాండ్లు పోయిన జాడ పట్టినాడు. * my words నా మాటలు స్థిరముగా నమ్ము. *ye, that is what he said వాడు చెప్పినది యిదేసుమీ. to read, * and learn చదవడము, కనుక్కోవడము, పాఠముచేయడము.
To Marry v n పెండ్లాడుట. when did he *? యెప్పుడు పెండ్లాడినాడు.
To Marshal v a యేర్పరచుట, దారి చూపుట.
To Marvel v n ఆశ్చర్యమైన, అద్భుతమైన, వింతైన.
To Mash v a కలుపుట, మిశ్రమముచేసుట, మెదుపుట, రుబ్బుట, తొక్కుట, నలగకొట్టుట. she *ed mangoes in mild మామిడిపండ్లను పాలలో కలిపెను. he *ed the bran in water నీళ్లలో తవుడు కలిపినాడు.he *ed the plaster సున్నము కలిపినాడు. his bones were *ed వాడి యెముకలు పొడి అయినవి, పిండి అయినవి.
To Mask v a కృత్రిమ ముఖమును కట్టుకొనుట, వేషము వేసుకొనుట.or to hide దాచుట, మరుగు చేసుట. he *ed his design వాడి అభిప్రాయమును దాచినాడు. the infantry *ed the cannon సిఫాయీలు ఫిరంగులకు మరుగ్గా వుండిరి. he *ed the wall with plaster గోడకు సున్నము పూసినాడు. *ing or acting with *s మారుముఖాలు కట్టుకొని ఆడేఆట.
To Massacre v a ప్రజలను సంహరించుట, వధించుట, పశుప్రాయముగాచంపుట, గొడ్లను నరికినట్టు దూరి నరుకుట.
To Masticate v a నమలుట.
To Mat v a చాపవేసుట. he *ted the house ఆ యింటికి చాపలువేసినాడు. See Matted.
To Match v n యీడుపడుట, సరిపడుట, తగివుండుట. these tables* very well యీ జల్లలు జతగా వున్నవి. or to be married పెండ్లి యౌట. birds * in spring వసంతకాలములో పోతూ పెంటీ కలుస్తవి.
To Mate v n ఆడుపక్షి మొగుపక్షి కలియుట.
To Matriculate v n పాఠశాలలో ప్రవేశించుట, అనగా యింగ్లండులో వుండే పాఠశాలలో మాన్య మనుభవించగలందులకై విద్యార్థిగా ప్రవేశించుట.
To Matter v n లక్ష్యముగా వుండుట, ముఖ్యముగా వుండుట. It *s not whether you go or stay నీవు పోయినా వుండినా చింతలేదు. that *s not to me అది నాకు లక్ష్యము కాదు.
To Mature v a పండేటట్టు చేసుట, పకవము చేసుట. Maturely, adv. పూర్ణాలోచన చేసి, పూర్ణముగా.
To Maul v a బాదుట మద్దించుట, నల్లగొట్టుట.
To Maunder v a గొణుగుట, సణుగుట.
To May v n వనవిహసము చేసుట.
To Mean v a and v. n. తలచుట, యెంచటు, భావించుకొనుట, అర్థమౌట. he knows perfectly well what I * నా తాత్పర్య మేమిటిదోవాడికి బాగా తెలుసును. "Sila" *s stone శిల అనగా రాయి. by thesewords he *s that they are gone యీ మాటలచేత వారు పోయినారనిభావిస్తాడు. do they * me? నన్ను గురించి అన్నారా. where is he, (I * the writer?) వాడెక్కడ, అనగా రైటరు. he (meaning my brother) అతడు అనగా మా యన్న. do you * to go there? అక్కడికి పోవలెనని వున్నాను. do you * to kill me? నీకు నన్ను చంపవలెననిభావమా. what can he * by doing so? అట్లా చేయడములో వాడి భావమెట్టిదో.a well * man సద్భావము గలవాడు.
To Meander v n తిరుగుడు, సంచరించుట, వంకరటొంకరగా పారుట. there were many pilgrims *ing among the rocks ఆ కొండలలో అనేక మంది యాత్ర పొయ్యేవాండ్లు తిర్లాడుతూ వుండిరి. the gnats were *ing about in the breeze ఆ గాలిలో దోమలు యిటుఅటు పారకాడుతూ వుండినవి.
To Measure v n కొలగా వుండుట. this cloth *s ten yards. ఆ గుడ్డ పది గజాలు వున్నది. this room *s 30 feet యీ యిల్లు ముప్ఫైయడుగలు వున్నది.
To Meddle v n అంటుట, చెయిపెట్టు కొనుట. do not * with this దీన్ని అంటక. I did not * with him వాడి తెరువుకు నేను పోలేదు, వాడి జోలికి నేను పోలేదు. a meddling fool అధిక ప్రసంగి.
To Mediate v n మధ్యస్థముచేసుట, సంధిచేసుట.
To Meditate v a ఆలోచించుట, తలచుట, యోజించుట, ధ్యానించుట.
To Meet v a and v. n. సంధించుట, సందర్భించుట, సంఘటించుట, యెదురుపడుట. I met him on the road వాడు దోవలో యెదురుపడ్డాడు. సందర్భించినాడు. my letter met him on the road నా జాబు దోవలో వాడికి అందినది, ముట్టినది. he appointed to * to-day యీ వేళ నాతో కలిసి మాట్లాడుతా నన్నాడు. the people went to * the king రాజును యెదురుకొనడానకు పోయినారు. after his *ing me ఆయనా నేను కలిసిమాట్లాడిన మీదట. he met his death there వాడికి చావు అక్కడ వుండినది. this rule does not * the case యీ మాత్రము ఆ సంగతికి వుపయోగించదు. as I fell down my head met the stone పడడములో నా తల రాయికి తగిలినది. I will * that objection అందుకు నేను సమాధానము చెప్పుతాను. the prisoner did not * the charge ఖైది తనమీదవచ్చిన ఫిర్యాదుకు సమాధానము చెప్పలేదు. at night the two armies met రాత్రి రెండు సేనలు ఢీ కొన్నవి, కలియబడ్డవి. the council met in the evening సాయంకాలము సభ కూడినది. I put a rope of a fathom long round the tree, but the ends would not * ఆ చెట్టుకుచుట్టూ బారెడుతాడు వేస్తే రెండు కొనలు అందలేదు. with this money I couldnot make both ends * యీ రూకలతో దాన్ని గడపలేను. as the boards did not * the water came through పలకలు సంతనగా వుండనందున దానిగుండా నీళ్లు కారినవి. when their eyes met వొకరిని వొకరు చూచినప్పుడు. have you met with that book? ఆ పుస్తకము నీకు చిక్కినదా. he met with an accident వాడికి వొక అపాయము సంభవించినది. he met with a rebuff భంగమును పొందినాడు. he met with a rebuff భంగమును పొందినాడు. he met with his deserts ఆ శిక్ష వాడికి కావలసినదే.
To Mell v v కలియుట, పోరాడుట.
To Mellow v a పరిపక్వముచేసుట.
To Melt v a కరిగించుట. these words *ed his heart యీ మాటలు వాడి మనస్సును కరగచేసినవి.
To Memorialize v a మనివిచేసుకొనుట. he *ed the government సర్కారులో మనివిచేసుకొన్నాడు, అర్జీయిచ్చుకొన్నాడు.
To Menace v a బెదిరించుట, భయపెట్టుట. the country was *d with famine ఆ దేశానికి కరువువచ్చేటట్టు వుండినది.
To Mend v n గుణపడుట, స్వస్థమౌట. his health is *ing వాడికి వొళ్లు కుదురుగా వున్నది. matters are *ing యిప్పుడు వాసిగావున్నది.
To Mention v a ఉదాహరించుట, చెప్పుట, వ్రాసుట. he *ed you నిన్ను గురించి మాట్లాడినాడు, నీప్రస్తావము చేసినాడు. do not * my nameనా పేరు యెత్తవద్దు. he did not * this in his lettes దీన్ని అతని జాబులో వ్రాయలేదు.
To Merge v a ముంచుట. the question where in all others *d is this: were they the sons or not వాండ్లు ఆయన కొడుకులా కారా అనే ప్రశ్నలో అన్ని అణిగిపోయినది. Meridian, n. s. మధ్యాహ్నము, ఉచ్చము. Anti * మధ్యాహ్నాత్పూర్వము. Post * మధ్యాహ్నాత్పరము. at this time his glory reached it's * యిది అతని కీర్తికి వుఛ్రాయదశగా వుండెను. or the line on the globe భూగోళము నడమ వుత్తర దక్షిణముగా వుండే రేఖ. Hyderabad is nearly in the * of Trichinopoly హైద్రాబాదున్ను తిరుచినాపల్లిన్ని సుమారు వుత్తర దక్షణాలుగా వుంటవి. The remark that he made was calculated for their * వాడు చెప్ప్పినమాట వాండ్ల యోగ్యతకు అనుగుణ్యముగా వున్నది.
To Merit v a పాత్రుడౌట, అర్హుడౌట, యోగ్యుడౌట. he *s punishment వాడికి శిక్ష కావలసినదే. he *s reward వాడికి బహుమానము కావలసినదే.one who *s favor అనుగ్రహానికి అర్హుడైనవాడు. this *s enquiry యిది విచారించనర్హమైనది. this *s attention యిది విమర్శించవలసినదే. they were punished as their crimes *ed వాండ్ల తప్పుకు తగినట్టు శిక్షించబడ్డారు. he *s well వాడు యోగ్యుడే, గుణవంతుడే.
To Mess v n భోజనము చేసుట, పొత్తుగా భోజనము చేసుట. we *ed together for ten days పది దినాలు పొత్తుగా భోజనముచేస్తూ వుంటిమి.
To Metamorphose v a రూపాంతరముచేసుట, మారురూపుచేసుట. the curse *d her into a rock శాపముచేత అది రాయి అయినది.
To Mete v a కొలుచుట, కొలతవేసుట. he *ed out equal justice to them యిద్దరికిన్ని సరిగ్గా విధించినాడు. * yard కొలగోల, గజకోల. he *d out the corn ఆ ధాన్యమును కొలిచి యిచ్చినాడు.
To Methodise v a క్రమపరచుట, యేర్పాటుచేసుట.
To Mew v a గూట్లో వేసుట, దొడ్డిలో తోలుట, లాయములో కట్టుట.
To Miche v n దాగుట. (a provincial word still in use: See Christian Observer, 1834. p. 116.)
To Migrate v a వలసపోవుట, దేశము విడిచి మరి వొక దేశానికి పోవుట, యిది ముఖ్యముగా పక్షులను గురించినమాట.
To Militate v n విరోధించుట, ప్రతికూలమౌట, అడ్డమౌట. this *s against the rule యిది సూత్రానికి విరోధిస్తున్నది, విరుద్ధముగా వున్నది.this *s in their favour యిది వారికి సానుకూలముగా వున్నది.
To Milk v a పిండుట, పితుకుట.
To Mill v a విసురుట, పిండిచేయుట, నల్లగ్గొట్టుట. to * cloth ఉగ్గించుట.
To Mimick v a అనుకరించుట, వెక్కిరించుట.
To Mince v n కులుకుట. a *ing gait కులుకునడ. *ing language కొంకుమాటలు. a *ing smile ముసిముసినవ్వు. a *ing voice సన్నగొంతు,కీచుగొంతు.
To Mind v a వినుట, లక్ష్యపెట్టుట. you must * what he tells you వాడు చెప్పేదాన్ని నీవు వినవలసినది. he does not * వినడు, లక్ష్యపెట్టడు. I wish you would * what I say నేను చెప్పేమాట యెందుకు వినవోయి. you must not * what he tells you వాడు చెప్పేదాన్ని నీవు వినబోకు. he did not * the punishment ఆ శిక్షను వాడు లక్ష్యపెట్టలేదు. * or you will spill the ink భద్రము, నీవు శిరా వొలకపోసేవు. what is the good of telling you if you do not * ? వినకపోతే, నీతో యెందుకు చెప్పేది. * to tell him వాడితో చెప్పను మరిచేవు సుమీ. never * చింతలేదు, పరవాలేదు. never * where యెక్కడ నైతేనేమి.never * the names ఆ పేర్లేందుకు, ఆ పేర్లు అక్కరలేదు. If you won't tell me, never * నీవు చెప్పకుంటే మానె. I do not * his going there వాడు అక్కడికిపోతే నాకు చింతలేదు. do not playwhen you should * your book నీవు పుస్తకము మీద ధ్యానము వుంచవలశి నప్పుడు ఆట్లాడక.
To Mine v n గని తవ్వుట, సురంగము తవ్వుట. while we were *ing there అక్కడ మేము గనులు తవ్వుతూ వుండగా. he *d all round the hill కొండచుట్టూ గనులు తవ్వినాడు.
To Mingle v a కలుపుట, మిశ్రమము చేసుట, చేర్చుట. he *d his tears with their's వాండ్లతోకూడా తానున్ను యేడ్చినాడు.
To Minish v a తగ్గించుట, సంకోచింపచేయుట.
To Minister v a ఉపచరించుట, పరిచర్యచేసుట. he *ed consolation to them వాండ్లను వోదార్చినాడు. he *ed to thepoor బీదలకు ఉపచారము చేసినాడు. *ing spirits దేవతూతలు.
To Minute v a యాదాస్తు వ్రాసుకొనుట జ్ఞాపకానికి వ్రాసుకొనుట.
To Misapply v a తప్పుగా ప్రయోగించుట, దుర్వినియోగముచేసుట, దుర్వ్రయము చేసుట.
To Misapprehend v a అపార్థముచేసుట, తప్పుగా గ్రహించుట.
To Misappropriate v a దుర్వ్రయముచేసుట, దుర్వినియోగముచేసుట.
To Misbecome v a అనుచితముగా వుండుట, కూడకుండుట, కారాకవుండటు.this *s you యిది నీకు అనుచితము, కూడదు, కారాదు.
To Misbehave v n దుర్మార్గము చేసుట.
To Miscall v a తప్పు పేరు బెట్టుట.
To Miscarry v n తప్పుట. the plan miscarried ఆ యుక్తి తప్పినది, విఫలమైనది. she miscarried దానికి కడుపు దిగబడ్డది.the undertaking miscarried ఆ కార్యము వ్యర్థమైపోయినది.
To Mischief v a హానిచేసుట.
To Misconceive v a తప్పుగా గ్రహించుట, భ్రమించుట.
To Misconduct v a తప్పుగా నడిపించుట, అవివేకముగా జరిపించుట. the lawyer *ed my cause ఆ లాయరు నా వ్యాజ్యమును క్రమముగా, జరిపించినాడు కాడు.
To Misconsture v a అపార్థము చేసుట. do not * me నేను చెప్పిన దానికి అపార్థము చేయవద్దు.
To Misemploy v a దుర్వ్రయము చేసుట, దుర్వినియోగముచేసుట.
To Misgive v a సందేహము, కలుగుట, అనుమానము తట్టుట. my mind misgave me నాకు అనుమానము తట్టినది, సందేహిస్తిని.
To Misgovern v a పిచ్చిగా యేలుట. he *ed his family వాడు తనసంసారాన్ని పిచ్చిగా పట్టుకవచ్చినాడు. a *ed familiy నాధుడు లేని యిల్లు, దక్షతలేని యిల్లు.
To Misguide v a తప్పు దారికి యీడ్చుట, భ్రమపరచుట.
To Misinform v a తప్పు సమాచారము చెప్పుట. I was *ed నేను విన్నది తప్పు.
To Misinterpret v a అపార్థము చేసుట.
To Mislay v a ఎక్కడనో పెట్టి మరచుట. he mislaid the paper ఆ కాకితమును యొక్కడనో పెట్టి మరచినాడు.
To Mislead v a తప్పుదారిని తీసుట, భ్రమింపచేసటు. this circumstance misled me యిందువల్ల భ్రమసినాను. you should not * them వాండ్లను దుర్భోధన చేయక.
To Mismanage v a తప్పుగా యేలుట, తప్పుగా నిర్వహించుట. you *d the business పనిని చెరిపినావు.
To Misname v a తప్పుపేరు బెట్టుట.
To Mispel v a గుణితము తప్పుగా చెప్పుట, గుణితమును తప్పుగా వ్రాసుట.
To Mispend v a దుర్వ్రయము చేసుట, వృథాగా పోగొట్టుట.
To Misplace v a చోటు మారాటముగా పెట్టుట, తప్పుస్థలములో బెట్టుట. he *d the words ఆ మాటలను ముందు వెనకగా పెట్టినాడు.
To Misprise v a అలక్ష్యము చేసుట.
To Mispronounce v a తప్పుగా వుచ్చరించుట, అపస్వరముగా చెప్పుట.
To Misquote v a తప్పుగా వుదాహరించిటు. he *d the verse ఆ శ్లోకము వుండేది వొకవిధము యితడు వుదాహరించినది వొక విధము.
To Misreckon v a తప్పుగా యెంచుట, తప్పుగా లెక్క పెట్టుట.
To Misrepresent v a తప్పుగా తెలియ చేసుట. they * him as a tyrant క్రూరుడు కాని వాణ్ని క్రూరు డంటారు.
To Miss v n తప్పుట. my arrow *ed నా బాణము తప్పినది. the letter *ed ఆ జాబు చేరలేదు. I wonder how you *ed seeing him వాడు నీకండ్ల బడకపోవడము నాకు ఆశ్చర్యముగా వున్నది. whether you succeed or whether you * నీవు జయించినా సిరి వోడినా సిరి. the book is *ing ఆ పుస్తకము కానము, లేదు.
To Misstate v a తప్పుగా చెప్పుట, భ్రమపడి వ్రాసుట.
To Mistake v a తప్పుట, తప్పుగా గ్రహించుట, భ్రమసుట, పరాకుపడుట.I mistook him for you అతణ్ని చూచి నీ వనుకొన్నాను. he mistook whatI said నేను చెప్పినది వొకటివాడు గ్రహించినది వొకటి. I mistook thehouse ఆ యిల్లని వస్తని. if I * not, he is dead చచ్చివుండ వచ్చును,చచ్చినాడేమో. If I * not, this is his house యిది వాడిల్లేకదా. I wAs mistaken తప్పితిని, భ్రమిస్తిని, పరాకుపడితిని.
To Mistrust v a అపనమ్మిక పడుట, అనుమానించుట, సంశయించుట, సందేహించుట. I did not * him వాణ్ని నమ్మినాను.
To Misunderstand v a పొరబాటుగా గ్రహించుట, తప్పుగా గ్రహించుట. they * me నన్ను గురించి తప్పినారు, భ్రమిసినారు.
To Misuse v a దుర్వినియోగము చేసుట, అన్యాయముగా వాడుట.
To Mitigate v a తక్కువచేసుట, శాంతిచేసుట, ఉపశాంతిచేసుట. this *d the pain యిందు వల్ల ఆ నొప్పి శాంతియైనది. in this murder thereare no *ing circumstances యీ ఖునిలో మన్నించతగ్గ పనులు కానము.
To Mix v n కలుసుట, మిశ్రమ మౌట.
To Mizzle v n సన్నగా తూరుట. because it was *ing సన్నతూరగా వుండినందున.
To Moan v a n. మూలుగుట, గోలపెట్టుట.
To Mob v a దొమ్మిగాపై బడుట. the crows *ed the owl గుడ్లగూబమీద కాకులు గుంపుగా పోయి పడ్డవి.
To Mock v a హాస్యముచేసుట, యెగతాళి చేసుట, వెక్కిరించుట. or cheat, delude వంచించుట, యేమార్చుట. an agony that *s descriptionచెప్పనలవిగగాని దుఃఖము. the door *ed all his efforts వీడు యెంత పాటుబడ్డా తలుపు తియ్య కూడలేదు. be not deceived God is not *ed మోసపోకండి దేవుణ్ని వంచించ వల్ల కాదు.
To Model v a ఆకారముగా యేర్పరచుట, సృష్టించుట, కల్పించుట. he *led the figure in wax ఆ ప్రతిమను మయనముతో చేసినాడు.
To Moderate v a మట్టుపరచుట, తగ్గించుట, మతముచేసుట. * your anger కోపమును అణుచుకో.
To Modernize v a మునుపటిదాన్ని యిప్పటి మాదిరిగా చేసుట. he *d the house పూర్వకాలపు యింటిని యిప్పటి తరహాగా కట్టినాడు.
To Modify v a దిద్దుట, సవరించుట, ప్రకారాంతరముగా యేర్పరచుట, మితపరచుట, మట్టుపరచుట.
To Modulate v a సుతిగూర్చుట.
To Moil v n పాటుపడుట. See To Labour.
To Moisten v a తడుపుట, తడిచేసుట.
To Molest v a తొందరబెట్టుట, వేధించుట, బాధించుట, హింసపెట్టుట.
To Mollify v a శాంతిపరుచుట, ఉపశమనము చేసుట.
To Monish v a See To Admonish.
To Monopolize v a జట్టిబేరము చేసుట, వచ్చిన సరుకును మొత్తముగా తానే ఆక్రమించుకొనుట.
To Moor v a లంగరువేసి నిలుపుట, లంగరు చేసుట.
To Moot v a ప్రసంగము చేసుట, వాదాడుట.
To Mop v a బూజుకొట్టుట, వూడ్చుట.
To Mope v a ఏకాంతముగా వుండుట, అఘోరిస్తూ వుండుట, వ్యాకకులముగా వుండుట.
To Moralize v n నీతులు మాట్లాడుట, నీతులుచెప్పుట. to make long reflections ఉపన్యసించుట, ప్రసంగించుట. or ponder తలపోసుట.
To Mortgage v a కుదువబెట్టుట, తాకట్టుబెట్టుట.
To Mortify v n కుళ్లుట, యిది గాయము పుండును గురించినమాట. the wound mortified and he died ఆ పుండు కుళ్లి చచ్చినాడు.
To Motion v a చేతితో సంజ్ఞ చేసుట. he *ed me to go away నన్ను అవతలికి పొమ్మని చేతితో సంజ్ఞ చేసినాడు.
To Mould v a to shape రూపముగా యేర్పరచుట, ఆకారముగా యేర్పరచుట. he *ed the wax like her face మయనమును దాని ముఖము వలె చేసినాడు.
To Moulder v n మన్నైపోవుట, మగ్గిపోవుట, చివికిపోవుట. theirbodies * in the ground వాండ్ల శరీరములు, మన్ను తోమన్నైపోతవి.
To Moult v n రెక్కలురాలి మొలుచుట. the bird *ed last month యీ పక్షి రెక్కలు రాలి మళ్ళీ మొలిచినది. after *ing కొత్త రెక్కలు మొలిచిన తరువాత.
To Mount v a యెక్కుట, యెక్కించుట. he *ed the horse గుర్రముమీద యెక్కినాడు. he *ed his wife on the horse పెండ్లాన్ని గుర్రము మీద యెక్కించినాడు. when he *ed the ladder వాడు నిచ్చెనమీద యెక్కినప్పుడు. he *ed the hill కొండమీద కెక్కినాడు. he *ed the tree చెట్టెక్కినాడు. he *ed the table:or he *ed on the table బల్ల మీది కెక్కి నిలిచినాడు. ofter he *ed the throne సింహాసన మెక్కిన తరువాత. he *ed the maps or pictures ఆ పటాలకు చట్టములువేసినాడు. while he *ed guard వాడు పారామీద వుండగా, పారాయిస్తూవుండగా. to * a cannon ఫిరంగిని దాని చట్టముమీది కెక్కించుట, పరముమీదికెక్కించుట.
To Mourn v a and n. విచారపడుట, దుఃఖపడుట. you will * this యిందున గురించి వ్యాకులపడబోతావు.
To Mouse v n యొలుకనుపట్టుట, యిది పిల్లిని గురించినమాట. she *ed in vain ఆ పిల్లి యెలుకను పట్టపోయినది చిక్కలేదు.
To Mouth v a and n. వికారముగా అరిచి చదువుట, పెద్దగొంతుపెట్టుకొని మాట్లాడుట. or to chew నమలుట, తినుట, చప్పరించటు.
To Move v n కదలుట, ఆడుట, జరుగుట, స్థలాంతరమునకుపోవుట. she *s elegantly అది సొగసుగా నడుస్తున్నది. the army *d into the plain ఆ దండు మైదానానికి పోయినది. the hands of the clock * గడియారపు ముండ్లు తిరుగుతవి. he *d on సాగినాడు. he *d off అవతలికి జరిగినాడు లేచిపోయినాడు, అనగా పారిపోయినాడు. he *d up to me నా వద్దకి వచ్చినాడు. * out of the way తొలుగు, వొత్తు, దోవ తియ్యి. he *d in the royal circle రాజసభలో వొకడుగా వుండెను. in him they live and * and have their being ఆయనయందు బ్రతుకుతున్నారు మెలగుతున్నారు వుంటున్నారు.
To Mow v a కోసుట, కోతకోసుట, కొడవలితో కోసుట. the cannon *ed down the multitude ఫిరంగి దెబ్బకు జనులు చాపచుట్టుగా పడ్డారు.
To Mscalculate v a తప్పుగా యెంచుట.
To Muddlle v a మయకముచేసుట, కైపు చేసుట.
To Muffle v a కప్పుట, మూసుట, ముసుకువేసుట. to * a drum తంబుర బాగా మోగకుండా తోలు మీద అడ్డముగా దారమును కట్టుట.
To Mulct v a అపరాధమువేసుట, అపరాధముతీసుట.
To Mull v a వైనుసారాయిని వెచ్చబెట్టి బెల్లమువేసి పక్వముచేసుట.*ed wine వెచ్చబెట్టి కొంచెము బెల్లము వేసిన సారాయి.
To Multiply v n విస్తారమౌట. the rats multiplied much యెలుకలు విస్తారమైనవి.
To Mumble v a గొణుగుట, సణుగుట. or chew బొక్కి నోటితో నమలుట.
To Munch v a బొక్కుట.
To Murder v a చంపుట, హత్యచేసుట, ఖూనిచేసుట. or to destroy చెరుపుట. he has *ed the business ఆ పనిని చెరిపినాడు (అధ్వాన్నము చేశినాడు.) you have *ed this story completely యీ కథను శుద్ధముగా పాడుచేసినావు, అధ్వాన్నము చేసినావు.
To Murmur v n గొణుగుట, సణుగుట. they *ed against him అతని మీద సణిగినారు. they * at this యిందున గురించి గొణుగుతారు.the river *s ఆ యేరు జలజలమని పారుతున్నది. the wind *s గాలి బుస్సుబస్సుమని కొట్టుతున్నది.
To Muse v n వెరగుపడుట, వితాకుపడుట, పరాకుగావుండుట, పరధ్యానముగా వుండుట. he *ed on these words యీ మాటలను తలపోసుకొంటూ వుండెను.
To Muster v n కూడుట. the people *ed very strong జనము బహుబలముగా కూడినది.
To Mute v a విష్టించుట, రెట్టవేసుట.
To Mutilate v a అంగమును చేదించుట, భిన్నము చేసుట, వూనము చేసుట. he *ed the account ఆ లెక్కలో కొంత కోసి కొంత విడిచి పెట్టినాడు.
To Mutiny v s తిరిగబడడము, యెదిరించడము.
To Mutter v. a. గొణుగుట'సణుగుట
To Muzzle v a మూతికి చిక్కమువేసుట, మూతిని కట్టుట.
To Mystify v a మాయచేసుట, పితలాటకము చేసుట, కృత్రిమము చేసుట.
To Nab v a దొంగిలించుట, మనిషిని పట్టుకొనుట.
To Nail v a చీలకొట్టి బిగించుట, ఆణి కొట్టి బిగించుట. he *edthe paper on the wall గోడ మీద ఆ కాకితాన్ని పెట్టి చీలలతో బిగించినాడు. I *ed his hand to the table with the dagger వాడిచెయ్యి మేజతో కర్చుకొని పోయ్యేటట్టు బాకుతో పొడిచినాను. I *ed him withthis question యీ మాట అడగడముతో వాడి ఆట అణిగినది.
To Name v a పెరు పెట్టుట, చెప్పుట, అనుట, ఉదాహరించుట. he *edthe child Thomas ఆ బిడ్డకు తామసు అనే పేరు పెట్టెను. do not *me to him ఆతని వద్ద నా పేరు యెత్త వద్దు. he *ed the sum he wanted వాడికి కావలసిన మొత్తమును చెప్పినాడు. what do they *this? దీన్ని యేమంటారు. can you * the street where you methim? వాడు నీకు కనుపడ్డ వీధి పేరును చెప్పగలవా. Named, adj. అనే పేరుగల, ఉదాహరించిన, అనే. a poet * Miltonమిల్టననే కవి. at the time * చెప్పిన వేళకు, నియమించిన వేళకు. the sum * by him అతడు చెప్పిన లెక్క.
To Nap v n రవంత నిద్రపోవుట.
To Narrate v a చెప్పుట, విన్నవించుట.
To Narrow v n వెడల్పు తక్కువౌట, యిరకటమౌట.
To Nauseate v a గోండ్రించుకొని వచ్చుట, వాకర వచ్చుట, చీదర పడుట, అసహ్య పడుట. he *s flattery అతనికి స్తుతి యంటే చీదర.
To Navigate v n పోవుట, ఇది వాడలను గురించిన మాట. a sea *d by all nations సమస్త దేశాస్థుల వాడలున్ను సంచరించే సముద్రము.
To Near v a దగ్గరించుట, సమీపించుట, దగ్గరికి పోవుట ఇది సముద్ర భాష. when we *ed the town మాకు పట్టణము దగ్గరించినప్పుడు.
To Necessitate v a నిర్బంధించుట. this * his dismissal ఇందువల్ల వాణ్ని తోసివేయవలసి వచ్చినది.
To Need v a కావలసి వుండుట, అక్కర వుండుట. this *s timeయిందుకు కాలము కావలసి వున్నది. as the houses *ed repairs ఆయింటికి మరమ్మతు కావలసి వుండినందున. you * not doubt it అందుకునీవు సందేహించవలసిన అక్కరలేదు. you * not come to-morrow నీవు రేపు రావలసినది లేదు. Needful, adj. అగత్యమైన, ఆవశ్యకమైన, కావలసిన. take as much as * కావలసినంత తీసుకో.
To Nees v n తుమ్ముట.
To Neglect v a అశ్రద్ధ చేసుట, ఉపేక్ష చేసుట, అలక్ష్యము చేసుట, అసడ్డచేసుట.
To Negotiate v a సంధి చేసుట, రాయబారము చేసుట, మాట్లాడుట. or to excange హుండిని మార్చుట. he *d the marriage అతను పెండ్లి మాట్లాడి కుదిర్చినాడు. he *ed a peace రాజీ చేసినాడు. I *d the money bill ఆ హుండిని మార్చినాను.
To Neigh v n సకిలించుట, యిగిలించుట.
To Nestle v n దాగి వుండుట, వొదుగుకొని వుండుట, చేరుకొని వుండుట. Nestling, n. s. పక్షి యొక్క లేత పిల్ల.
To Net v a వలను అల్లుట, వల వేసి పట్టుట. what did you * in this bargain? యీ బేరములో నీకేమి నికరము తేలినది?
To Nettle v a రేచుట, రేగేటట్టు చేసుట.
To Neutralize v a నీరసము చేసుట, దుర్బలము చేసుట. this order *sthat regulation యీ ఆజ్ఞ వల్ల ఆ చట్టము యొక్క బలము పోతున్నది.
To Nib v a పేనాటాకొత్తుట. a broad * bed pen మొద్దు పేనా.
To Nibble v a కొంచెము కొంచెముగా తినుట. the fish *d the bait and left it ఆ చేప గాలము మీది యెరను కొంచెము కొంచెముగా తిని పోయెను. Nice, adj. మంచి, లక్షణమైన, సొగసైన, చక్కని, నాణ్యమైన, సూక్ష్మమైన, మెళకువైన, సున్నితమైన, నాజూకైన. this is a * bread యిది భోగ్యమైన రొట్టె. a * turband నాణ్యమైన పొగ. a very * enquiry అతి సూక్ష్మమైన విమర్శ. if you are so * you will never get a horse నీవు యిట్లావంకరలు చెప్పితే నీకెన్నటికి గుర్రము చిక్కదు.
To Nick n a కాటు బెట్టుట. he *ed the time exactly వేళకు వచ్చిదుమికినాడు.
To Nickname v a యెగతాళి పేరు బెట్టుట.
To Nip v a గిల్లుట, కొరుకుట, కరుచుట, తుంచుట. the cold nipped the fruit in the bud చలి చేత ఆ కాయ పిందెలోనే చచ్చిపోయినది. nipping cold కరిచే చలి.
To Nod v a and n. తల వూచుట, శిరఃకంపము చేసుట. he *ed assent మంచిదని తలవూచినాడు. to be drowsy తూగిపడుట.
To Noise v n అరచుట, చప్పుడౌట.
To Nominate v a నియమించుట, నిర్ణయించుట, యేర్పరచుట, పేరు పెట్టుట.
To Nonplus v a చీకాకు పరచుట, కలవర పెట్టుట, వెనుకా ముందు తోచనీయకుండా చేసుట.
To Nonsuit v a వ్యాజ్యమును కొట్టివేసుట, వ్యాజ్యమును తోశివేసుట.he *ed me నా వ్యాజ్యమును తోసివేశినాడు.
To Noose v a ఉచ్చురుకు వేసిపట్టుట, ఉరి వేశిపట్టుట.
To Nose v a వాసన చేత కనిపెట్టుట. he *d the mangoes in the other room మరివొక గదిలో మామిడి పండ్లు వున్నట్టు వాసన చేత కనిపెట్టినాడు.
To Notch v a కాటు బెట్టుట, గీత వేసుట, నక్కు బెట్టుట.
To Note v a చూచుట, తెలుసుకొనుట, విచారించుట, లక్ష్యములోపెట్టుట, జ్ఞాపకార్ధము సంగ్రహముగా వ్రాసుకొనుట.
To Notify v a ప్రకటన చేసుట, ప్రసిద్ధి చేసుట.
To Nourish v a పెంచుట, పోషించుట, సాకుట, కాపాడుట. the water *es the tree నీళ్లు చెట్టును సాకుతున్నది. they *ed hopes of his return అతను మళ్ళీ రాబోతాడనే ఆశను పెట్టుకొనివుండిరి. he *ed hatred against them వాండ్ల మీద ద్వేషమును పెట్టుకొని వుండినాడు.
To Nudge v a to push slightly తిన్నగా తట్టుట, జాడగా పొడుచుట.
To Nullify v a రద్దు చేసుట, కొట్టివేసుట.
To Numb v a తిమురు పట్టేటట్టు చేసుట. the blow *ed his arm ఆ దెబ్బ చేత వాడి చేతికి తిమురు పట్టినది.
To Number v a యెంచుట, లెక్క పెట్టుట. he *ed the houses ఆ యిండ్లను యెంచినాడు, ఆ ఇండ్లకు నెంబరు వేశినాడు. we * him among our friends వాణ్ని మాలో వొకణ్నిగా యెంచుతాము. his days are *ed అతనికి నేడో రేపో అని వున్నది.
To Nurse v a పెంచుట, సాకుట, పోషించుట, చనుబాలిచ్చుట. a nursing father సాకిన తండ్రి. he put his estate in the bank to * for ten years వృద్ధి చేయడానకై తన రూకలను పదియేండ్లు బాంకిలో వేసి పెట్టినాడు. he *ed hopes of success అనుకూలమవునని ఆశపడి వుండినాడు.
To Nurture v a పెంచుట, పోషించుట.
To Nuzzle v n వొదుగుకొనుట, దూరుకొనుట, చేరుకొనుట.
To Obey v a అణిగి నడుచుకొనుట, లోబడి నడుచుకొనుట. I *ed with alacrity పరమ సంతోషమని అలాగే చేసినాను. they did not * him ఆయన మాట వారు వినలేదు.
To Object v n ఆక్షేపించుట. he *ed to this యిందుకు ఆక్షేపించినాడు, యిది కూడదన్నాడు. when I * his going there నేను అతణ్ని అక్కడికి పోకూడదన్నప్పుడు.
To Objurgate v a కూకలు బెట్టుట.
To Oblige v a to force నిర్బంధించుట, బలాత్కారము చేసుట. or to favour దయచేసుట. he *d me to go నను పొమ్మని నిర్బంధించినాడు. his poverty *d him to sell his house అతను దరిద్రముచేత యిల్లు అమ్ముకోవలసి వచ్చినది. will you * me by going there tomorrow?నా మీద దయ వుంచి రేపు అక్కడికి పోతావా.
To Obliterate v a తుడుచుట, మాపుట, చెరుపుట. this *d his former offences from my mind యిది వాడు ముందు చేసిన దుర్మార్గములను నా మనసులో నుంచి పోగొట్టినది, యిందు వలన వాడు మునుపు చేసిన దుర్మార్గములను మరిచిపోయేటట్టు అయినది.
To Obscure v a చీకటికమ్ముట. this error *d the sense యీ తప్పుచేత అర్థము కలవరించినది.
To Observe v n తెలుసుకొనుట, చెప్పుట. he *d that this belonged to his father యిది తన తండ్రిదన్నాడు.
To Obstruct v a అడ్డు కట్టుట, అడుచుట, ఆటంకము చేసుట,విఘాతము చేసుట. these bushes *ed the road ఆ దోవను యీ పొదలుఅడుచుకొన్నవి. the water *ed the passage ఆ దారికి నీళ్ళు అడ్డమైనది, పోవడానికి నీళ్లు ఆటంకము చేసినవి. the mud *ed the passage of the water through the drain ఆ తూములో నీళ్ళు పోకుండా మన్ను అడుచుకొన్నది. the tree *ed my sight ఆ చెట్టు నా దృష్టికి అడ్డమైనది. the troops *ed the passage పోవడానికి దండు అడ్డమైనది. Obstructed, adj. అడ్డుపడ్డ, ఆటంకమైన, విఘాతమైన.
To Obtain v n జరుగుట, నడుచుట. this custom still *s among them యీ వాడిక యింకా వాండ్లలో జరుగుతున్నది, నడుస్తున్నది.
To Obtrude v a చొరబెట్టుట, అధిక ప్రసంగముగా చెప్పుట. they *d their advice upon him వాడికి అధిక ప్రసంగముగా బుధ్ధి చెప్పబోయినారు. I did not wish to * myself upon them నేను వాండ్ల వద్దికి అధికప్రసంగముగా పోరాదు. I did not wish to * my children upon him నా బిడ్డలను వాడింట్లో కొంచబోయి తొయ్యడముమర్యాద కాదు. he *d several remarks వడు అధిక ప్రసంగముగా కొన్ని మాటలు చెప్పినాడు.
To Occasion v a కలగచేయుట, పుట్టించుట. this *ed a quarrel ఇందువల్ల వొక జగడము కలిగినది. this *ed me to tell him ఇందువల్ల అతనితో చెప్పవలశి వచ్చింది.
To Occupy v n అనుభవించుట. * until I come నేను వచ్చేదాకా వ్యాపారము చేసుకొండి. Luke 19. 13. (వాణిజ్యము కురుతే A+.)
To Occur v n సంభవించుట, కలుగుట, తోచుట, స్ఫురించుట. a death occurred there to-day అక్కడనే డొక చావు సంభవించినది. this occured to his thaughts ఇది అతనికి తోచినది. when it occured to me అది నాకు స్ఫురించినప్పుడు. the name does not * to me just now ఆ పేరు నాకు యిప్పుడు జ్ఞాపకము రాలేదు. this tree rarely *s ఈ చెట్టు దొరకటం అపురూపము. this word *s in that verse ఆ శ్లోకములో యీ శబ్దము వస్తున్నది. if elision *s లోభము వస్తే.
To Offend v a ఆగ్రహము పుట్టించుట, ఆయాసము చేసుట, ఉపద్రవముచేసుట. this *ed them ఇందువల్ల వాండ్లకు ఆగ్రహము పుట్టినది.
To Offer v a ఇస్తాననుట, ఇవ్వవచ్చుట, కావలెనా అనుట,యత్నపడుట. he *ed ten rupees for this book but Ideclined it ఆ పుస్తకానికది పది రూపాయలు యిస్తానన్నాడుగాని నాకు వద్దన్నాను. he *ed himself వుద్యుక్తుడాయెను.he *ed me employment నాకు వుద్యోగము కావలిస్తే యిస్తానన్నాడు.he *ed this excuse ఈ సాకు చెప్పినాడు. he *ed worship పూజ చేసినాడు.he *ed civility సన్మానము చేసినాడు. he *ed the shawl for saleఆ శాలువను అమ్మ జూపినాడు. he *ed it for my acceptance ఇందాదీన్ని తీసుకొంటావా అని అన్నాడు. he *ed violence దౌజ ్న్యముచేశినాడు. he *ed me his hand నాకు చెయ్యి ఇచ్చినాడు. he *edhis respects మర్యాద చేశినాడు. he *ed his opinion తనఅభిప్రాయమును చెప్పినాడు. he *s a reason for this ఇందుకు వొకన్యాయము చెప్పుతాడు.he *ed his advice తనకు తోచిన ఆలోచననుచెప్పినాడు. to * as sacrifice నై వేద్యము చేసుట బలియిచ్చుట.they *ed a sheep to the goddess అమ్మవారికి వొక మేకను బలియిచ్చినారు. when the idea of returning *ed itself to histhoughts వాడికి మళ్ళీ పోవలెనని తోచినప్పుడు. when anopportunity occurs or *s itself సమయము వచ్చినప్పుడు.he *ed to riese but fell down లేవబోయి పడ్డాడు. he *edto strike me నన్ను కౌట్టవచ్చినాడు. he *ed to buy the house యిల్లు కొనేటందుకు యత్నపడ్ఢాడు. they *ed to break into the houseతలుపులు పగలకౌట్టపోయినారు. I did not * to go awayలేచిపోవలెననే యత్నమే నేను చేయలేదు. the dog *ed to bite meకుక్క నన్ను కరవవచ్చినది.
To Officiate v n అన్యుడి పనిని చూచుట. while he wasofficiating as priest వాడు పౌరోహిత్యము చేయిస్తూ వుండగా.in his absence * *d for him అతడు లేనప్పుడు అతడి పనినినేను చేస్తు వుంటిని.
To Ogle v a కీకంటలాచుట, కీకంటితో సైగచేసుట.
To Oil v a నూనె పూసుట, నూనె చమరుట, పట్టించుట. they *edhis palm వాడికి లంచము యిచ్చినారు.
To Omit v a తప్పుట, విడిచిపెట్టుట. you must not * to dothis అది చేయక తప్పేవు సుమీ.o you * ted to come నీవు రావడానకుతప్పిపోతివి. he * ted it intentionally దాన్ని కావలెననిమానుకౌన్నాడు.
To Ooze v n కారుట, స్రవించుట, వురుసుట. th water *s fromthe ceiling పై నుంచి నీళ్లు వురుస్తున్నది.
To Open v a తెరుచుట, విచ్చుట, ఆరంభించుట. he *ed the doorతలుపు తీసినాడు. In this garden he *ed a well యీ తోటలో బావితవ్వినాడు. he *ed the the letter జాబును విచ్చినాడు. to * amine గని తవ్వడానికి మొదలు పెట్టుట. he *ed the cocoanutటెంకాయను పగలకొట్టినాడు. he *ed the soil తవ్వినాడు,దున్నినాడు. this medicine *ed the bowels యీ మందుచేత బేదిఅయినది. the sun *s the flower సూర్యుడు పుష్పములనువికసింపచేస్తాడు. I did not * my lips నేను నోరు తెరవలేదు. he*ed a shop అంగడి పెట్టినాడు. he *ed the matter to me ఆసంగతిని నాకు సమర్మకముగా చేసినాడు. he *ed a head in theaccout for this ఆ లెక్కలో యీపద్దు కట్టడానకు ఆరంభమువ్రాసినాడు. he *ed a path through this forest యీ అడవిలోవౌకదారి చేసినాడు. the surgeon *ed the head and then the bodyవైద్యుడు తలకోసి చూచి తర్వాత కడుపును కోసి చూచినాడు. my eyesare *ed కృత్రిమము తెలుసుకొన్నాను, నాకు బుద్ధి వచ్చినది, నాకువివేకము వచ్చినది.
To Operate v n వ్యాపించుట. the medicine did not * ఆ మందువ్యాపించలేదు, బేది కాలేదు. this letter *d to hisdisadvantage యీ జాబు వాడికి కుంఠనము చేసినది.
To Opine v n See To Think, To Judge or To Suppose.
No comments:
Post a Comment