Monday, February 7, 2011

To Clash

To Clash v n voVkati mIxa voVkati koVttukoVnuta, viroXiMcuta. this clashed with the other statement yI mAtaku A mAtaku viroXamugA vunnaxi, yI mAta A mAtawo saMbaMXiMcalexu.
To Clasp v a koVliki wagiliMcuta, ciliki vesuta. to embrace kOgiliMcuta, aliMganamu cesukoVnuta. to * the hands in prayer aMjali cesuta. he clasped her hands vyasanamu cewa xAni ceVyyi pattukoVnnAdu. Class, n. s. vargamu, kulamu, weVga, jAwi, waragawi, waramu, Bexamu. All classes pinnA peVxxA aMxaru. the higher classes SreRTulu, SreRTamEna kulasWulu, kulInulu. the middle * sAmAnyulu. the lower classes nIculu.
To Class v a waragawigA yerparacuta. they * us as foriegners mammuna anyulanugA vicAriswAru, anyaxeSasWulEnattu anupiMcu koVnnAmu.
To Classify v a waragawigA yerparacuta.
To Clatter v n catacatamani cappudOta, vaxaruta, peluta. the doors were clattering in the wind gAlilo walupulu catacatamani koVttukoVMtUvuMdinavi. As the horse galloped I heard the clattering of horse's hoofs, and that of the sword of the rider A gurramu parugeVwwuwuMdagAxAni goVriSeVla yoVkkAnunnu savAri kawwi yoVkkAnunnu cappudu vinnAnu.
To Claw v n golYlawo barukuta.
To Clay v a as sugar బంకమట్టికట్టి పంచదారను బాగుచేసుట.
To clean v a SuBramu cesuta, bAgu ceyuta, uwukuta, kaduguta, womuta,wuducuta. to * arms cikili ceyuta. to * cotton yekuta. a cotton cleaner xUxekulavAdu. to * the head xuvvuta, xixxuta. * my horse nA gurramunu womu. to clean rice biyyamu malucuta.
To Clear v n wetapaduta, weruta, welipovuta, wIripovuta. to * out a room KAlicesuta, yemi lekuMdA cesuta. the ship will * out tomorrow repu hasIlu ceVlliMcabadi vAda viduxala avunu. to * up as rain veVlisipovuta.
To Clearstarch v a minaminalAdetattu cikkagA guddaku gaMji peVttuta.
To Cleave v a to split cIlcuta, pagalakoVttu, pagulYlu pAretatattu cesuta, baxxalu cesuta. His arms * the stream vAdu nIlYlanu BexiMci vaswunnAdu, anagA yIxuwAdu.
To Clench or Clinch v a loniki maducuta. he clenched the nail aNini koVtti koVnanu loniki vidicinAdu. he clenched his fist pidakiliMcinAdu.
To Clense v a Subramu cesuta, SuxXi cesuta, bAgucesuta, kaduguta.vide To Clean.
To Clew up v a vAdacApalu madici veyuta.
To Click v n కటుక్కుమనుట.
To Climb v a యెక్కుట. he climbed a tree గుట్టుమీదికి యెక్కినాడు. to * over a wall గోడ మీదికి యెక్కుట, లగ్గయెక్కుట. to * up a rope దారము పట్టుకొని యెక్కించాడు.
To Clinch v a అణినికొట్టి దాణికొనను వెనకకు మడుచుట. the clinched hand పిడికిలి ముష్టి.
To Cling v n అతుక్కొని వుండుట, అంటుకొని వుండుట, కరుచుకొని వుండుట,పట్టుకొని వుండుట. I clung to the rock నేను కొండను కరుచుకొని వుంటిని. the child clung to his mother ఆ బిడ్డ తల్లిని కరుచుకొని వుండెను. they * to their relations బంధువులను విడవక కరుచుకొని వుంటారు.
To Clink v n ఖంగుఅని వాగుట, అనగా అందెలు, మెట్టెలు, రాతి మీద వేసిన రూపాయి, సుత్తితో దాగిలి మీద కొట్టే దెబ్బ. వీటి యెక్క ధ్వనికి యీ మాట చెల్లుతున్నది. Stonecutters make a clinking noise రాతి కమ్మరవాండ్లు ఖంగుఖంగుమని శబ్దము చేస్తూ వుంటారు.
To Clip v a కత్తిరించుట. he clipped their accounts వాండ్ల లెక్కలనుతగ్గించినాడు. he clips the king's English యాచగా మాట్లాడుతాడు.
To Cloak v a కప్పుట, మూసుట, మరుగుచేసుట. he cloked his wickedness under the guise of piety తన దుర్మార్గము దాగేటందుకు భక్తుడనే వేషము వేసుకొన్నాడు.
To Cloake v a కప్పుట, మూసుట, మరుగు చేసుట. She was ready cloakedభైరవాసము వేసుకొని సిద్ధముగా వుండినది. he cloaked his pleasure under the appearance of anger కోపముగా వుండినట్టు అగుపరచి సంతోషమును దాచినాడు.
To Clog v a అభ్యంతర పరచుట, ఆటంకము చేసుట, యిబ్బంది పెట్టుట. thislarge family clogs him యీ పెద్ద కుటుంబము వాడి కాళ్ళకు బందాలుగా వున్నది.Gluttony clogs the intellect అతి భోజనము మనసుకు యిబ్బంది చేస్తుంది.
To Close v n మూసుకొనుట, ముకుళించుకొనుట, ముగుసుట, సమ్మతించుట,వొప్పుట, కలుసుట, కలుసుకొనుట. the enemy closed upon him శత్రువులు వాడిపై బడ్డారు, దూరినారు. when the wound closed గాయము ఆరినప్పుడు, పూడినప్పుడు. he closed up to me వాడు నాతో కలుసుకొన్నాడు. to * with సమ్మతించుట. he closed with the offer ఆ మనివికి సమ్మతించినాడు. the robbers closed in with me దొంగలు నా మీదికి కవిసినారు. closing or half shut ముకుళితమైన. the closing ceremony క్రియాంతము,నాగవల్లి.
To Cloud v a చీకటి చేయుట, నల్లపరచుట. this clouded his prospectsయిందువల్ల వానికి ఆశ తప్పినది. when sorrow clouds the face ముఖము వ్యసనాక్రాంతముగా వుండేటప్పుడు.
To Clout v a అతుకు వేసుట.
To Cloy v a ముఖము కొట్టుట, చీదర చేసుట.
To Club v a చందా వేసుట చందా వేసుకొని భోజనానకు రూకలు యిచ్చుట. we * ten rupees మేము పది రూపాయీలు చందా వేసుకొన్నాము. they cannot * tenbooks among them వాండ్లలో పది పుస్తకాలైనా దొరకనేరవు.
To Cluck v n కోడి ఆహారమును చూచినప్పుడు పిల్లలను రమ్మనుమని తెలిసేలాగున కూసుట, లొట్టలు వేసుట.
To Cluck eggs v a to hatch eggs గుడ్లను పొదుగుట.
To Cluster v n గెల వేసుట. the locks that clustered round her face దాణి ముఖము మీది ముంగురులు. clustering locks కుచ్చుకుచ్చుగా వుండే వెంట్రుకలు.
To Clutch v. a. గట్టిగా పట్టుట, బిగ్గెరపట్టుట
To Coageal v a పేర పెట్టుట, పేరేటట్టు చేసుట.
To Coagulate v n పేరుట.
To Coalesee v n కూడుట,కలిసి పోవుట, కలుసుకొనుట, చేరుకొనుట, వకటిగా వుండుట, ఏకీభవించుట, క్షీరోదకన్యాయముగా వుండుట.
To Coast v n వాడ మీద యెక్కి రేవు ఒడ్డుననే పోవుట. As we coasted along మేము తీరము నంటి వాడలో పోతూ వుండగా. coasting vessels లోని సముద్రమునకు పోలేని చిన్నవాడలు.
To Coat v a పూసుట. he coated the wall with clay గోడకు మన్నుపూసినాడు. they coated the floor with cowdung నేలను పేడతో అలికినారు. He coated the copper vessel with tin రాగి పాత్రకు కళాయి పూసినాడు. the fumes of the mercury coated the glass రసము పతంగించినది. See Incrust.
To Coax v a పుసలాయించుట, చెల్లించుట. coaxing expressions పుసలాయింపుమాటలు, బెల్లింపు మాటలు.
To Cobble v a పాత చెప్పులు బాగుచేయుట, అయిన మట్టుకు చక్కపెట్టుట.
To Cock v a తుపాకి గుర్రాన్ని బొట్టన వేలుతో వెనకకు యీడ్చుట. He cocked the gun but did not fire it తుపాకి గుర్రమును బొట్టన వేలుతో వెనకకు యీడ్చినాడు గాని అడుగుబిసను వొత్తి కాల్చలేదు. the horse cocked his ears. ఆ గుర్రము చెవులను నిక్కబొడుచుకొన్నది.
To Cocker v a లాలించుట.
To Coerce v a నిర్బంధము చేయుట, బలవంతము చేయుట, బలత్కారము చేయుట.
To Coexist v n ఏకకాలమందు వుండుట. How can anger and pleasure *? కోపమున్ను సంతోషమున్ను వొకటే కాలమందు యెట్లా కలుగును.
To Coffer up v a దాచి పెట్టుట.
To Cog v n పితలాటకము చేసుట. to * the dice తనకు పందెము పడేటట్టు పితలాటకముగా పాచికలు దొర్లించుట.
To Cogitate v n యెంచుట, యోచించుట, తల పోసుకొనుట.
To Cohabit v n సంసారము చేయుట, సంగమము చేయుట. he cocohabitedwith her దానితో పోయినాడు. the woman with whom he cohabited అతడువుంచుకొన్నది.
To Cohere v n అతుక్కొనుట, అంటుకొనుట, సంలగ్నమౌట. This sentence does not * properly యీ మాట సంబంధించదు, అన్వయించదు.
To Cohobate v a పునఃపాకము చేసుట, పునఃపచనము చేసుట, ఒక ద్రవములోనుంచి తీసిన ధృతిని ఆ పిప్పిలోనే పోసి మళ్లీ కాచుట.
To Coil v a చుట్టుట. he coiled the rope ఆ దారమును చుట్టగా చుట్టినాడు. the snake coiled itself up ఆ పాము చుట్ట పెట్టుకొని పండుకొన్నది.
To Coin v a నాణ్యములను చేసుట, రూపాయలు మొదలైన వాటిని చేసుట. or to invnent, excogitate కల్పించుట. a coined word కల్పిత శబ్దము, బనాయించిన మాట.
To Coincide v n సందర్భించుట, సంధించుట, సంబంధించుట, లగించుట, సరిపడుట, వొప్పుట, సమ్మతించుట. the two dates do not * ఆ రెండు తేదులు వొకటికొకటి సరిపడవు.
To Collapse v n అంటుకొనిపోవుట, యెండుకొనిపోవుట. after delivery,the belly is collapsed బిడ్డ కన్న తరువాత కడుపు వెన్నున అంటుకొని పోయినది.
To Collar v a మెడగుడ్డను పట్టుకొనుట, అనగా మెడపట్టి గెంటుట.
To Collate v a సంప్రతించుట, సరిచూచుట, మొకాబిలా చేసుట. he was collated to that living ఆ మాన్యమును అనుభవించుకొని ఆ గుడికి పాదిరిగా వుండేటట్టు వాణ్ని నియమించినారు.
To Collect v n కూడుట, చేరుట, పోగౌట. the clouds collected మబ్బు వేంనది. a boil collected కురుపు లేచినది.
To Collide v n తాకుట, వొకటి మీద వొకటి కొట్టుకొనుట.
To Collocate v a వుంచుట, పెట్టుట, ప్రవేశపెట్టుట.
To Colouize v a పేటచేయుట, కొత్తగా వచ్చి కాపురము చేయుట, అడివి కొట్టి కొత్తగా వూరు కట్టుకొని కాపురము వుండుట. See Colony.
To Colour v n సిగ్గు చేత ముఖము యెర్రపారుట.
To Comb v a దువ్వుట. to * out nits ఈర్చుట.
To Combat v n పోరాడుట, జగడమాడుట, యెదిరించుట, అడ్డమాడుట, వికటించుట, తలపడుట, తాకుట.
To Combine v a చేర్చుట, కలుపుట, కూర్చుట, జోడించుట, సంధించుట.
To Come v n వచ్చుట, చేరుట, సంభవించుట, తగులుట. * what will I will do this యెట్లా అయినా సరే నేను చేస్తాను. when the butter comes వెన్నపడేటప్పుడు. Come ! మంచిది, సరి Come ! Come ! సరేసరే, మెట్టుకు. Come ! what's the use of doing so ? మంచిది దానివల్ల యేమి ప్రయోజనము.Come ! you are wrong మెట్టుకు తప్పినావు. Come ! you must obey సరే నీవు అట్లా చేయవలె. Come ! tell me మంచిదిచెప్పు. to * across అడ్డము తగులుట, అడ్డము వచ్చుట. to * ashore గట్టుకు తట్టుట. the rope come as under తాడు తెగినది, మెలి వీడిపోయినది. to * at అందుట, దొరుకుట, చిక్కుట. I could not * at it అది నా చేతికి అందలేదు, చిక్కలేదు. to * away యివతలికి వచ్చుట, వూడివచ్చుట. matter came away from the wound పుంటిలో మంచి చీము బయిటికి వచ్చినది. all her hair came away దాని తల వెంట్రుకలన్ని రాలిపోయినవి. the juice came away రసము కారిపోయినది. to * back మళ్లుకొనుట, తిరుక్కొనుట, మళ్ళివచ్చుట. he came behind us in nothing యే విషయములో నన్ను మాకు వాడు తక్కువ కాలేదు. the board came between ఆ పలక అడ్డపడ్డది. to * by ఓరగావచ్చుట. How did he * by that money ? ఆ రూకలు వాడికి యెట్లా వచ్చినది. How did he * by this sword? వాడికియీ కత్తి యెట్లా వచ్చినది. to * down ఊడిపోవుట దిగుట. when the house came down ఆ యిల్లు పడ్డప్పుడు. he came down to my house నాయింటి దాకా వచ్చినాడు. he came down with the price వాడు దానికి క్రయము చెల్లించినాడు. to * forth బయిటికి వచ్చుట. Forthcoming (as money) చేత వుండే, సిద్ధముగా వుండే హాజరుగా వుండె. the money is forth coming లేని, లేకపోయిన, సిద్ధముగా వుండని. the money is not forthcoming రూకలు హాజరులేదు. when they came to trial the prisoner was not forthcoming విచారణ చేయవచ్చేటప్పటికి కైది హాజరు లేక పోయినాడు. to * forward ముందుకు వచ్చుట, చక్కపడుట. or thrive బాగుబడుట, రక్కొనుట. to * in or agree సమ్మతించుట, ఒప్పుకొనుట. when the ships came in contact వాడలు ఒకటితో వొకటి కొట్టుకొన్నప్పుడు. His fathers death came in the way తండ్రి చావు వచ్చి అడ్డుపడ్డది. he came in for a reward వాడికి వొక బహుమానము చిక్కినది. he came in for punishment వాడికి శిక్ష తగిలింది. when they came in front యెదట పడ్డప్పుడు. to * into చొరబడుట కలుసుకొనుట, కూడుకొనుట. they came into the plot వాండ్లు ఆ కుట్రలో చేరినారు, కలిసినారు. to * into power అధికారాన్ని పొందుట. It came into his head యిది వాడికి స్పురించినది, తోచినది. they came into my views నా బుద్ధి విన్నారు. when they came into possession of the property ఆ యాస్తి వాండ్లకు చిక్కినప్పుడు, స్వాధీనమైనప్పుడు. these poets do not * near him యీ కవులు వాడికి సరితూగలేక పోయిరి. when it came near దగ్గిరించినప్పుడు. I told you what would * of this యిందువల్ల యేమి కలుగునో దాన్ని నీతో చెప్పి వున్నాను. To * off ఊడుట వదులుట, తప్పించుకొనుట,విడిపించుకొనుట. he came off loser వోడినాడు. he came off with a slight punishment స్వల్ప శిక్షతో తప్పించుకొన్నాడు. To * on ఆరంభించుట, కనిపించుట, సంభవించుట, తగులుట, పట్టుట. Fever came on జ్వరము తగ్గినది. Rain came on వాన పట్టింది. How does the work * on ? పని యెట్లా జరుగుతున్నది. when the storm came on గాలివాన పట్టినప్పుడు. To * out బయిటపడుట, ప్రచురమౌట, తెలిసిపోవుట, దేశము నుంచి బయలుదేరుట,వూడుట. when the tooth came out పల్లు వూడివచ్చినప్పుడు. the book came out ten years ago ఆ పుస్తకము ప్రచురమైన పది యేండ్లైనది. when he came out with this story వాడు యీ కధను చెప్పినప్పుడు. To * over పక్షమౌట, పక్షములో చేరుట. they came over to us మా పక్షములో చేరినారు. To * right సరిపడుట, కుదురుట. They came round me నన్ను చుట్టుకొన్నారు. at last they came round తుదకు వొప్పుకొన్నారు. To * short of or fail తప్పుట. he came short of it వాడు అది తప్పినాడు. To * TO దగ్గరికి వచ్చుట, వాడ నిలిచిపోవుట. To * to or amount to ఔట, వెరసి తేలుట.the account came to ten rupees ఆ లెక్క పది రూపాయల దాకా అవుతున్నది. To come to the point ముఖ్యము యేమంటే. how came you to know this? యిది నీ కెట్లా తెలిసినది. what is * to you ? నీకేమి పట్టినది. In time to * యిఖను, ఉత్తరోత్తర, మీదటికి, రాబొయ్యే కాలమందు. To * about or happen తటస్థించుట, సంభవించుట. at last they came to blows తుదకు పోట్లాడసాగిరి. I came to the same conclusion నాకున్ను అట్లాగే తోచినది. To * to an end ముగియుట, తీరుట, శాంతించుట. when the business came to an end పని ముగియగానే. they came to evil చెడిపోయినారు. they came to extremities పోట్లాడినారు, కొట్లాడినారు. To *to good చక్కబడుట, ఫలించుట, నెరవేరుట, పనికివచ్చుట. To * to hand అందుట, దొరుకుట, చేరుట, చేతికి వచ్చుట. when the letter came to hand ఆ జాబు చేతికి అందినప్పుడు, చేరినప్పుడు. To * to a head as a boil మొనగా తేలుట. when the boil came to a head గెడ్డ తేలినప్పుడు. as the small pox నేతులు పోసుట. To * to himself స్మారకము వచ్చుట, తెలివివచ్చుట. when he came to himself వాడికి స్మారకము వచ్చినప్పుడు, వొళ్లు తెలిసినప్పుడు. he came to his senses or to himself వాడికి తెలివి వచ్చినది, వాడికి స్మారకము వచ్చి వచ్చినది. If his father comes to the knowledge of this or If this comes to the knowledge ofhis father యిది వాడి తండ్రికి తెలిస్తే. To * to life పుట్టుట, అవతరించుట. Before they came to life వాండ్లు పుట్టక మునుపే. To * to light బయటపడుట, ప్రసిద్ధమౌట. when this came to light యిది బయట పడ్డప్పుడు. It came to nothing అది వ్యర్ధమైనది, తప్పిపోయినది. To * to an opinion తీర్పు చెప్పుట, శాసనముగా చెప్పుట, భావించుకొనుట. they came to this opinion యిట్లా నిశ్చయించిరి. the opinion you came to మీకు తోచిన అభిప్రాయము. when they came to particulars వాండ్లు వయనము చెప్పినప్పుడు. To * to pass or to * about తటస్థించుట, సంభవించుట. It came to pass that his brother died సంభవించిన దేమంటే అన్న చచ్చినాడు. To * to terms సమాధాన పడుట, రాజీపడుట. at lastthey came to terms తుదకు సమాధానపడ్డారు. It comes to the same thing యెటైనా వఖటే, రెండూ ఒకటే, రెండూ సరే. when it came to view అది అగుపడ్డప్పుడు, కండ్లపడ్డప్పుడు. To * undone ఊడిపోవుట. the string came undone దారము వూడిపోయినది. To * up or equal సమానమౌట. they do not up to him in learning వాండ్లు చదువులో వాడికి సమానము కాలేరు. when the grain comes up పయిరు మొలిచినప్పుడు. that topic cameup ఆ సంగతి బయటపడ్డది. To * up with వచ్చి చేరుట, అందుకొనుట. when they came up with me నన్ను వచ్చి కలుసుకొన్నప్పుడు. the spirit came upon him వాడికి ఆవేశేము వచ్చినది. when old age comes upon him వాడికి ముదిమి వచ్చినప్పుడు. the thieves cameupon them దొంగలు వాండ్ల మీద వచ్చి పడ్డారు.
TO Comfort v a వోదార్చుట, వూరడించుట, ఆదరించుట, ధైర్యము, చెప్పుట,రక్షించుట.
To Command v a ఆజ్ఞాపించుట, విధించుట, నియమించుట. he commands thearmy ఆ సేనకు అధిపతిగా వున్నాడు, ఆ దండు వాడి చేతి కింద వున్నది. this hillcommands the fort ఆ కోట యీ కొండకు పల్లున వున్నది, యీ కొండ మీద నుంచిగుండు వేస్తే కోటలో పడుతున్నది. the hill commands the pass ఆ కొండ మీదనుంచి గుండు వేస్తే ఆ కనమలో పడుతున్నది, ఆ కొండ మీద నుంచి చూస్తే ఆ కనమకనపడుతున్నది. a servant cannot * his time పనివాడికి సమయము చిక్కదు. a child cannot * money బిడ్డకు రూకలు స్వాధీనము లేదు. You must * yourpassions నీవు కామక్రోధాదులను స్వాధీనములో వుంచవలెను. he cannot * moneyబిడ్డకు రూకలు స్వాధీనము లేదు. You must * your passions నీవు కామక్రోధాలనుస్వాధీనములో వుంచవలెను. he cannot * his temper వాడు కోపమును పట్టలేడు, అణచలేడు. Those who are commanded to be punished శిక్ష విధించబడ్డ వాండ్లు. The Brahmins are commanded by their books not to eat flesh బ్రాహ్మణులు తమ గ్రంధములవల్ల మంసభక్షణ చేయకూడ దని విధించబడి వున్నారు.
To Commemorate v a ఆచరించుట, కొనియాడుట, అనగా ఒక విశేషకార్యము గాని, మనిషిగాని వీటి యొక్క జ్ఞాపకము వుండేటట్టుగా ఒక క్రియను ఆచరించుట.they commemorated the feast వారు వుత్సవము జరిగించినారు. he commemorateshis father's death tomorrow రేపు తండ్రికి తద్దినము పెట్టపోతాడు. hecommemorated his childs birth every year ప్రతి సంవత్సరము కుమారుడికిపుట్టిన దినము చేస్తాడు.
To Commence v a ఆరంభించుట, మొదలు పెట్టుట.
To Commend v a మెచ్చుకొనుట, పొగుడుట, స్తుతించుట, అంగీకరించుట. to recommend సిఫారసు చేసుట. to rntrust అప్పగించుట. his master commended him for this వాడు చేసిన దాన్ని యజమానుడు మెచ్చుకొన్నాడు. As for a dictionery, commend me to Wilson's! నిఘంటు అంటివా, వుల్సనుది, దివ్యము. as for mangoes * me to the graft sort మామిడిపండ్లు అంటివా కట్టు మామిడిపండ్లు దివ్యము.
To Comment v a వ్యాఖ్యానము చేసుట, ఆక్షేపణ చేసుట, ఆక్షేపించుట. hecommented upon the text సూత్రమునకు వ్యాఖ్యానము చేసినాడు. he commentedvery unfavourably on this యిందున గురించి నిండా ఆక్షేపించినాడు.
To Commingle v a కలుపుట, మిశ్రమము చేసుట, మేళనము చేసుట.
To Commiserate v a జాలిపడుట, పరితాపపడుట. he commiserated the thief who was going to be hanged వురి దీయబోయే దొంగను గురించి జాలిపడ్డాడు.
To Commission v a అధికారమిచ్చుట, ఉత్తరమిచ్చుట, నియమించుట,అధికారమిచ్చి పంపుట. he commissioned me to go there అక్కడికి పొమ్మని అజ్ఞాపించినాడు.
To Commit v a to deliver ఒప్పగించుట, అధీనము చేయుట. I * it to you దాన్ని నీపరము చేస్తాను, నీకు ఒప్పగిస్తాను. they committed his body to the earth వాణ్ని భూస్థాపనము చేసినారు. they committed the body to the deep వాడలో చచ్చినవాణ్ని సముద్రములో పడవేసినారు. he committed the letter to the flames ఆ జాబును తగల పెటటినాడు. or to do చేయుట, దుష్కర్మము చేయుట, జరిగించుట. to * to memory వల్లించుట, పాఠము చేసుట. he committed his thoughts to paper తోచినదాన్ని కాకితము మీద వ్రాసి పెట్టినాడు. he committed an error తప్పినాడు. they committed him to jail కయిదులో పెట్టినారు. he committed himself greatly in that matter ఆ పనిలో పిచ్చి అయిపోయినాడు, ఆ పనిలో గడ్డి తిన్నాడు. you must not * yourself with him నీవు వాడి దగ్గెర బహు జాగ్రతగా వుండి తప్పించు కోవలెను.
To Commune v a ముచ్చట్లాడుట, సల్లాపములాడుట, కలిసి మాట్లాడుకొనుట. In the Christian religion the literal meaning is to eat together పొత్తుగా భోజనము చేసుట, కూడి భోజనము చేసుట.
To Communicate v a to impart యిచ్చుట, పంచి యిచ్చుట. intercoursecommunicates bad habits సహవాసము చేత దుర్వాడికలు పట్టుబడుతున్నవి. he communicated his wealth to the poor తన భాగ్యమును బీదలకు యిచ్చినాడు. or to make known తెలియచేసుట, యెరుక చేసుట. I communicated the intelligence to him by a sign యీ సమాచారమును వాడికి సౌజ్ఞ చేత తెలియ చేసినాను. to * a disease తగిలించుట, అంటించుట.
To Commute v a మార్చుట, పరివర్తన చేసుట, బదలాయించుట.
To Compare v n పోలుట, సాటువౌట. cad I * with him? నేను వాడికి దీటా, సమానమా, యీడా.
To Compass v a చుట్టుకొనుట, ఆవరించుకొనుట. the hills that * the town ఆ వూరును చుట్టుకొని వుండే కొండలు. or to effect సాధించుకొనుట.I cannot * this యిది నాకు అసాధ్యము, యిది నాకు అగోచరము. he could not * the business ఆ పనిని సాధించలేడు. the mind of man cannot * the counsels of God దేవుని సంకల్పము మనుష్యులకు అగోచరము. they * sea and land (Matt xxii 15.) సంచరిస్తున్నారు, ప్రదక్షిణము చేస్తున్నారు A +.
To Compassionate v a జాలిపడుట, పరితాపపడుట, కరుణించుట.
To Compel v a నిర్బంధించుట, బలవంతము చేసుట. they compelled him to sign it వాణ్ని చేవ్రాళు చెయ్యమని బలవంతము చేసినారు. I was compelled to go నేను పోవలసి వచ్చినది. I was compelled to ask him నేను అతణ్ని అడగ వలసి వచ్చినది.
To Compensate for v n ప్రతి చేసుట, ప్రతికారము చేసుట, యీడు చేసుట, పడ్డ నష్టమునకు చెల్లు యిచ్చుట. Its utility will * for its difficulty ప్రయాసకు తగిన ఫలము కలుగును. this compensates for the labour యిందువల్ల ప్రయాసకు తగిన ఫలము కలుగుతున్నది.
To Compete v a పోరాడుట, ఊడాడుట antelopes * with the wind in speedజింకలు వేగములో వాయువును తిరస్కరిస్తున్నవి.
To Compile v a సంగ్రహించుట, చేర్చుట పోగుచేసుట, రచించుట.
To Complain v n మొరబెట్టుట, ఫిర్యాదు చేసుట, (H). he is alwayscomplaining of his ill luck వాడు యెప్పుడున్ను తన దౌర్భాగ్యమును గురించియేడుస్తూ వుంటాడు. the child is complaining బిడ్డకు వొళ్లు కుదురులేదు. he is always complaining వాడికి యెప్పుడున్ను రోగము. I have no reason to * of his conduct వాడు చేసినది అన్యాయ మనరాదు. he complains of head-ache and fever వాడికి తలనొప్పి జ్వరము వచ్చినదట. he complained against me to the police నా మీద పోలీసులో ఫిర్యాదు చేసినాడు. they * of thirst వాండ్లకు దాహమౌతుందట.
To Complete v a to accomplish సంపూర్ణముచేసుట, సమాప్తి చేసుట,ముగించుట, నెరవేర్చుట, తీర్చుట, కాచేయుట.
To Compliment v a ఉపచరించుట. in words ప్రియోక్తులు చెప్పుట. by actsఉపచారములు చేసుట. or to praise స్తుతించుట, మెచ్చుకొనుట. the magistrate *ed me with a chair అధికారి నాకు కురిచి యిచ్చి మర్యాద చేసినాడు. I cannot* these people upon their probity వాండ్ల పెద్ద మనిషితనమును గురించి ప్రస్తాపము చేయడము యెందుకు, అనగా పెద్దమనుష్యులు కారు. I cannot * her on her beauty but she is a very good woman ఆమె అందము పడివుండనీ గాని మెట్టుకు ఆమె మహా యోగ్యురాలు.
To Complot v a దురాలోచన చేసుట, కుట్ర చేయుట, కృత్తిమము చేయుట, కుయుక్తిచేయుట.
To Comply with v a సమ్మతించుట, ఒప్పుకొనుట, అంగీకరించుట. he complied with this యిందుకు సమ్మతించినాడు.
To Comport with v a సరిపడుట, అనుకూలించుట, తగుట, ఒప్పుట.
To Compose v a to make or form చేయుట, కల్పించుట, యేర్పరచుట,కుదిరించుట, రచించుట, కట్టుట. the crow *s her nest of sticks కాకులు పుల్లలతో గూండ్లు కట్టుకొంటవి. he *ed a basket of bulrushes తుంగతో వొక గంప అల్లినాడు. he *ed a council of four priests నలుగురు గురువులను ఆలోచన సభగా యేర్పరచినాడు. four priests * the council నలుగురు గురువులు ఆలోచనకర్తలుగా యేర్పడివున్నారు. or to compound కూర్చుట, చేర్చుట. to * in printing అక్షరాలు కూర్చుట, జోడించుట. in music స్వరకల్పన చేసుట. he mixed these four things to * the medicine యీ నాలుగు వస్తువులు కలిపి ఆ మందు చేసినాడు. he *ed a poem ఒక కావ్యము చెప్పినాడు. these * his family వాడికి వుండే సంసారము వీండ్లే. or to calm or quiet శాంతపరచుట అణుచుట. * yourself భయపడవద్దు, ధైర్యముతెచ్చుకో, కోపము చాలించుకో, శాంతము తెచ్చుకో. he *ed her fears దానిభయమును నివారణము చేసినాడు. these words composed her grief యీమాటలవల్ల దానికి దుఃఖోపశమన మైనది. to * a quarrel రాజీ చేసుట, సఖ్యపరచుట, సమాధానము చేసుట.
To Compound v a కులుపుట, మిశ్రమము చేసుట, కూర్చుట, కలియనూరుట.or to settle amicably రాజీ చేసుట, సమాధానము చేసుట. he *ed their difference వారి కలతను సమాధాన పరచినాడు. to * a felony or to * for a felony దొంగకు లంచమిచ్చి పోయిన సొమ్మును రాబట్టుకొనుట.
To Comprehend v a to understand గ్రహిమచుట, తెలుసుకొనుట, ఆకళింపుచేసుకొనుట. I dont * it అది నాకు భోదకాలేదు, అది నాకు అర్థము కాలేదు. or to contain కలిగివుండుట, అణిగి వుండుట, యిమిడి వుండుట. this housecomprehends a school and a shop యీ యింటిలో పల్లె కూటమున్ను అంగడిన్నికూడా వున్నది. this district comprehends two hundred villages యీతాలూకాలో యిన్నూరు గ్రామములు వున్నవి. this dictionary *s a grammar యీడిక్షనేరిలో వ్యాకరణము కూడా వున్నది. the light shone in the darkness and the darkness *ed it not వెలుతురు చీకటిలో ప్రకాశించినది గాని చీకటి వెలుతురును గ్రహించలేదు, అనగా వెలుతురుకు యెడము యివ్వలేదు. (నజగ్రాహ SNT.)
To Compress v a అణుచుట, యిముడ్చుట, కుంచించుట, సంగ్రహము చేసుట.he compressed one hundred rules in one chapter నూరు సూత్రములను వొక అధ్యాయములో యిమిడ్చినాడు. he *ed all this story in one verse ఆ కధనంతా వొక శ్లోకములో యిమిడ్చినాడు.
To Comprise v a కలిగి వుండుట. this paper comprises three accountsయీ దస్తావేజులో మూడు లెక్కలు కలవు, వున్నవి. His estate *s two villages and a lake వాని ఆస్తిలో రెండు గ్రామములున్ను వొక చెరువున్ను చేరివున్నవి. See Comprehend and Contain.
To Compromise v a రాజీచేసుట, సమాధానము చేసుట, పరిష్కరించుట. theycompromised the matter ఆ సంగతిని రాజి చేసినారు. or to peril హాని చేసుట,అపాయము చేసుట. he *ed himself in this business యీ పనిలో తనకు హానితెచ్చుకొన్నాడు, యీ పనిలో మోసపోయినాడు. in this business my brother *edme యీ పనిలో మా అన్న వల్ల మోసపోతిని. do not * yourself మోసబొయ్యేవుసుమీ. to avoid compromising you I did this నీకు హాని రాకుండా దీన్ని చేసినాను. in this business he *ed his character very much యీ పనిలో వాడి పేరుకు నిండా తక్కువ వచ్చినది. you have compromised me very much in this business యీ పనిలో నీ వల్ల నాకు నిండా హాని వచ్చినది. he was sadly *ed in this affair యిందులో వాడికి చెడ్డ తక్కువ వచ్చినది, చెడ్డ నష్టము వచ్చినది.
To Compute v a లెక్కపెట్టుట, యెంచుట, మతించుట.
To Con v a వల్లించుట, గట్టి చేయుట.
To Conceal v a దాచుట, మరుగు చేసుట. he concealed himself దాగినాడు.
To Concede v a to admit ఒప్పుట, సమ్మతించు, అంగీకరిమచుట, అనుకూలించుట, మెచ్చుట. to grant or make over ఒప్పగించుట, విడిచిపెట్టుట. I * this సరే దీన్ని ఒప్పుకొన్నాను.
To Conceit v a or suppose తలచుట, యెంచుకొనుట, యిది ప్రాచీన శబ్దము యిప్పుడు చెల్లదు.
To Conceive v n తలచుట, తోచుట, కడుపుతో వుండుట. I conceived so నాకు అట్లా తోస్తున్నది. Before she *ed అది గర్భము కాక మునుపు.
To Concentrate v a కూర్చుట, నడిమికి కూర్చుట, ఒక చోట కూర్చుట. heconcentrated his forces upon this village నాలుగుతట్లను వుండె సేనను ఆ వూళ్లో ఒకటిగా కూర్చినాడు. to concentrate the essence ధృతి తీసుట, తైలము దించుట. It is necessary to * your attention upon the work నాలుగు తట్ల పోనియ్యకుండా నీ మనసునంతా దాని మీద పెట్ట వలసినది.
To Concern v a to relate to సంబంధించుట. to affect with వ్యసనపడుట. It concerns me to hear of this యిది వినగా నాకు చింతగా వున్నది. this does not * you యిది నీకు సంభంధము లేదు, యిది నీకు పని కాదు. he was *ed in the theft ఆ దొంగపనిలో వాడున్ను కలిసినాడు. Be it known to all whom it may * యిది యెవరికి అక్కరో వాండ్లకు తెలియవలసినది. (this concerns every one యిది అందరికిన్ని కావలసినది, అందరికిన్ని అక్కర పట్టినది. he *ed himself in thebusiness ఆ పనికి వాడున్ను పూనుకొన్నాడు. as far as I am *ed there is no difficulty నా వల్ల ఒక తొందర అక్కరలేదు, నా వల్ల అయితే అడ్డి లేదు. It *s him nearly అది వాడికి అతిముఖ్యము, యిదే వాడికి ప్రాణపదము. that does not * me అది నా జోలి కాదు. why should you * yourself in this business దీన్ని యెందుకు యెత్తి నీ తల మీద వేసుకొంటావు. why do you * yourself about his family వాడి సముసారము యొక్క యేడ్పు నీకేమి. this *s the school యిది పళ్లి కూటముతో చేరినది.
To Concert v s to plan ఆలోచన చేసుకొనుట, బందుకట్టు చేసుకొనుట, యేర్పాటు చేసుకొనుట. they *ed a marriage ఒక పెండ్లిని కుదిరించినారు.
To Conciliate v a to gain సంపాదించుట. to reconcile సఖ్యపరచుట, సమాధాన పరచుట, వోదార్చుట. he conciliated their affection వారి ప్రీతిని సంపాదించు కొన్నాడు. he *ed them వారిన సమాధానము చేసినాడు.
To Conclude v a and v. n. to end ముగించుట, నెరవేర్చుట, తీర్చుట. before he concluded his letter జాబు ముగించక మునుపే. or to decide తీర్పు చేసుట, నిష్కర్ష చేసుట. they *d the bargain ఆ బేరమును కుదిర్చినారు. they *d a peace రాజీ చేసినారు, సమాధానము చేసినారు, పరచినారు. or to infer భావించుకొనుట, యెంచుకొనుట. I *ed that he was dead వాడు చచ్చినాడనుకొంటిని. I * he is gone బహుశా పోయి వుండును. to * (or in conclusion) తుదకు, చివరకు, కడకు.
To Concneive v a to comprehend కనుక్కొనుట, తెలుసుకొనుట. or to imagine భావించుట, ఊహించుట, తలచుట, యెంచుకొనుట. I conceived it was wood అది కొయ్య అనుకొన్నాను. to admit in the womb గర్భం ధరించుట. she *ed a child అది గర్భమైనది. to * hatred అసహించుట. to * love మోహించుట. to * mischief ద్రోహము తలచుట. He *ed displeasure against them వాండ్ల మీద వాడికి ఆయాసము పుట్టినది.
To Concoct v a to fabricate కల్పించుట. or to digest జీర్ణము చేసుట, అరిగించుట. in chemistry పక్వము చేసుట, శుద్ధి చేసుట. or to ripen పండపెట్టు. he *ed a story ఒక కధ పన్నినాడు.
To Concur v n ఒప్పుట, సమ్మతించుట, ఉపయోగించుట, అనుకూలించుట. or to join చేరుట, కూడుట, కలుసుట.
To Condemn v a to find guilty తప్పు కద్దని విధించుట. they *ed him to death వాణ్ని చంపవలసినదని తీర్చినారు. or to doom to punishment దండనకు అర్హమని విధించుట. the prisoner was *ed ఆ దొంగకు శిక్ష విధించబడ్డది. or to pronounce unfit కాదనుట, నిషేధించుట, పనికి రాదని తీర్చుట, తోపుడు చేసుట. they *ed this దీన్ని పనికిరాదని చెప్పినారు. I * your conduct నీవు చేసినది తప్పు. hisfriends *ed his false వాడి పిచ్చితనాన్ని గురించి నలుగురున్ను ఛీ అన్నారు.or to censure దూషించుట. they *ed him వాణ్ని శిక్షించవలసిదని విధించినారు. your own words * you నీ మాటలే నిన్ను నేరస్తుణ్నిగా చేస్తున్నవి. he *ed their accounts వాండ్ల లెక్కలను పనికిరావన్నాడు, నిషేధించినాడు. hatch no man *ed thee నిన్ను గురించి యెవరున్ను తీర్పు చెప్పలేదా neither do I * thee నేనున్ను నిన్ను గురించి తీర్పు చెప్పును. In John VIII. 2. దండించుట. A+ B+ ఆజ్ఞకు లోబడెటట్టు చేయను. G+, K+, విధించుట. P+. దోషయామి. C+. Hukum Kardan. N+.
To Condense v n ఖనీభవించుట, సంగ్రహమౌట, పతంగించుట. steam is *ed into water ఆవిరి నీళ్లు అవుతున్నది.
To Condescend v n to deign దయచేయుట, అనుగ్రహించుట. * to tell me దయచేసి చెప్పండి. I spoke to him but he did not * to answer నేను మాట్లాడినాను గాని వాడు లొంగి వుత్తరువు చెప్పలేదు, అణిగి వుత్తరవు చెప్పలేదు. to bend or yield లొంగుట, అణుగుట. In Romans XII. 16. * to men of low state, మార్దవంవ్యహరతః. A+.
To Condole v n కూడా యేడ్చుట, ఒకరి దుఃఖమును చూచి తానున్ను కూడాదుఃఖపడుట, విచారించుట, ఉపచారము చెప్పుట. they went to * with him on his wife's death వాడి పెండ్లాము చచ్చినందుకు వుపచారము చెప్పపోయినారు, విచారించ పోయినారు.
To Conduce a n. సహాయమౌట, అనుకూలమౌట, ఉపయోగమౌట, ఉపబలమౌట.bathing conduces to health స్నానము దేహానికి అనుకూలమౌతున్నది. solituded conduces to pride ఒంటరిగా వుండడము గర్వానికి వుపబలమౌతున్ణది.
To Conduct v a నడిపించుకొని పోవుట, దారి చూపుట, పిల్చుకొని పోవుట, తీసుకొని పువుట, నడిపించుట, జరిగించుట. he conducts the school very well ఆ పల్లె కూటమును చక్కగా జరిగిస్తాడు. he *ed himself very well నిండా చక్కగా నడుచుకొన్నాడు. he *ed himself very ill నిండా దుర్మార్గముగా నడిచినాడు.
To Confabulate v a ముచ్చట్లాడుట.
To Confer v n మాట్లాడుకొనుట, ఆలోచించుకొనుట. he *ed with his friends తన స్నేహితులతో మాట్లాడు కొన్నాడు.
To Confess v n ఒప్పుకొనుట, కద్దనుట, బయలుపరచుట. the prisoner *d that he was guilty కయిది నేరమును ఒప్పుకొన్నాడు. he *ed his sins తాను చేసిన పాపమును చెప్పినాడు. (అంగీకరించుట, A+.) I * I was annoyed నాకు అసహ్యము వచ్చినది సుమీ. all those who *ed this religion యీ మతమును అంగీకరించిన వాండ్లందరు, యీ మతస్థులందురు. the priest *ed me నేను చేసిన పాపములన్ని గురుపు ఆలకించి ప్రాయశ్చిత్తము విధించినాడు, యిది రోమన్ కేతోలిక్కు మతములో వుండే వొక ఆచారము.
To Confide v n నమ్ముట, విశ్వసించుట. he *s in GOd దేవుని యందు నమ్మిక వుంచినాడు భరవసా వుంచినాడు.
To Confine v a or to shut up ఆడుచుట, బంధించుట, కట్టుట. to imprison కావలిలో వుంచుట. he *d the cow with a rope ఆ యావును తాటితో కట్టినాడు. he *d the water నీళ్లను కట్టినాడు. he *d the bird to acage ఆ పక్షిని పంజరములో వేసినాడు. he *d the smoke in a balloon ఆ పొగను గుమ్మటములో ఆడిచినాడు. or to restrain నిర్బంధించుట. he *d himself to this statement వాడు యీ మాటకంటే వేరే యేమిన్ని చెప్పలేదు. he *d himself to the house వాడు యిల్లు విడిచి కదలలేడు. he to limit మట్టుపరచుట, మితము చేయుట. he did not * his anger to me వాడు నన్ను మాత్రము కోపించుకోవడముతో విడలేదు. he *d his expenses to 100 rupees వ్రయమును నూరు రూపాయలలోనికి దించినాడు. I * my remarks to him నేను కేవలము అతణ్ని గురించే చెప్పినాను. he did not * his abuse to you వాడు నిన్ను మాత్రమే తిట్టలేదు. he did not * his kindness to this వాడు చేసిన విశ్వాసము యిది మాత్రమే కాదు. they *d him to this book యీపుస్తకము కాక వేరే తాకకూడదన్నారు. * yourself to this one business యీపనే చూడు.
To Confirm v a నిశ్చయించుట, రూఢి చేసుట, దృఢము చేసుట, స్థాపించుట,బలపరచుట. this *ed my suspicions యిది నా సందేహమును దృఢపరచినది.
To Confiscate v a సర్కారులో చేర్చుకొనుట, జప్తిచేసుట.
To Conflict v. n. పోరాడుట, విరోధించుట,విరుద్ధమౌట, his account *s with your's నీవు చెప్పేదానికి వాడు చెప్పేది విరుద్ధముగా వున్నది.
To Conform v n వొప్పుట, లోబడుట, అనుసరించుట, అనువర్తించుట, అనుగుణముగా నడుచుకొనుట. they *ed to the custom మామూలు ప్రకారము జరిగించినారు. he *ed to the order ఆజ్ఞ ప్రకారము చేసినాడు.
To Confound v a or to mingle కలుపుట, మిశ్రమము చేసుట. or to dismay or stupify భ్రమ పరచుట, వెరుగుపడేటట్టు చేసుట, వెక్కి పొయ్యేటట్టు చేసుట. or to disorder తారుమారు చేసుట, కలవర పెట్టుట, చీకాకు పరచుట. or to overthrow or destroy అపజయము పొందించుట. they * right with wrong మంచిని చెడు, చెడును మంచి అంటారు. In this book the confounds the Hindus with the Musulms గ్రంధములో హిందువుల నున్ను తురకలను ఒకటి చేసినాడు, భేదము తెలియక భ్రమపడ్డాడు.
To Confront v a యెదురెదురుగా నిలుపుట. I *ed them and asked themవాండ్లను యెదురెదురుగా పెట్టి అడిగినాను.
To Confuse v a కలుపుట, భ్రమపరచుట, చీకాకు పరచుట, కలవర పెట్టుట.
To Confute n s ఖండించుట ఆక్షేపించుట, నుజము కాదని చూపుట.
To Congeal v n పేరుట, పేరిపోవుట, ఖనీభవించుట, గడ్డ కట్టుట.
To Conglomerate v a and v. n. ఖణిభవింప చేసుట, ఖనీభవించుట, గడ్డ కట్టేటట్టు చేయుట, గడ్డ కట్టుట, కరుడు కట్టుట, వుంటగా చుట్టుట.
To Conglutinate v a అంటించుట, బంకతో అంటించుట.
To Congratulate v a శుభము కొనియాడుట, సంతోషము కొనియాడుట, దీవించుట.he *d himself upon this యిందున గురించి వాడు అహంకరించినాడు.
To Conjecture v a ఊహించుట, అనుమేయించుట, యెంచుట, తలచుట. I * thatthey are brothers వాండ్లు అన్నదమ్ములని వూహించినాను, తలచినాను.
To Conjoin v a కూర్చుట, చేర్చుట, సంతన చేసుట.
To Conjugate v a (verbs) క్రియా రూపనిష్పత్తి చేయుట. he cannot * thatverb ఆ క్రియకు రూపములు చెప్పలేడు.
To Conjure v a or to entreat వొట్టు పెట్టుట, ఆనపెట్టుట, ప్రార్థించుట, బతిమాలుకొనుట. I * you to do this దీన్ని చేయకపోతే నీకు ఒట్టు, దీన్ని నీవు అవశ్యము చేయవలసినది.
To Connect v a చేర్చుట, సంబంధించుట, సంధించుట, సంతన చేసుట, పొందించుట.
To Conngregate v n గుంపు కూడుట, చేరుట.
To Connive at v a చూచి చూడనట్టుగా వుండుట, ఉపేక్ష చేసుట. they *ed at this villainy యీ దుర్మార్గమును వుపేక్ష చేసినారు, చూచి చూడనట్టుగా వుండినారు.
To Conquer v a గెలుచుట, జయించుట, సాధించుట, దేశము కట్టుకొనుట.
To Consecrate v a సమర్పించుట, సమర్పణ చేసుట, వినియోగపరచుట, ప్రతిష్ఠ చేసుట, స్థాపించుట. he *d the rice or the bread ఆరగింపు చేసినాడు, నైవేద్యము చేసినాడు. they *d the temple to the god దేవాలయ ప్రతిష్ఠ చేసినారు. The bishop *d the ground or the church ఆ నేలను గాని లేక ఆ గుడిని గాని దేవుడి కని నియమించినాడు. she consecrated this garland to the god ఆ దండను దేవుడికి సమర్పించినది. they usually * the first calf to the god మొదటి దూడను దేవుడికి విడుస్తారు. he *d himself to the business వాడికి అదే పని అయిపోయినది. he consecrated every morning to prayer ప్రతి దినమున్ను ప్రాతః కాలమును దేవుని ప్రార్థనలోనే వినియోగపరుస్తాడు. she consecrates all her time to her child దానికి యేవేళ బిడ్డతోనే పని.
To Consent v a ఒప్పుట, సమ్మతించుట, అంగీకరించుట.
To Conserve v a See To Reserve, Retain.
To Consider v a ఆలోచించుట, యెంచుట, తలచుట, విచారించుట. he *ed me as a brother నన్ను తమ్ముణ్నిగా భావించినాడు. I *ed this wrong యిదితప్పనుకొంటిని యిది తప్పని నాకు తోచినది.
To Consign v a వొప్పగించుట, యిచ్చివేయుట, పరము చేసుట, స్వాధీనము చేసుట. they *ed his body to the deep వాడి కళేబరమును సముద్రముపాలు చేసినారు.
To Consist v n కలిగివుండుట. property *ing of real and personal goods స్థావరజంకమాత్మకమైన ఆస్తి. his property *s of three fields and two houses వాడి ఆస్తి యేమంటే మూడు పొలములున్ను రెండు యిండ్లున్ను. his family *ing of seven persons యేడుమంది గల అతని సంసారము. to * with సరిపడుట, ఒప్పుట, సంబంధించుట. this does not * with what you said before ముందర చెప్పిన దానికిన్ని వెనక చెప్పిన దానికిన్ని సరిపడలేదు.
To Console v a వోదార్చుట, వూరడించుట, సముదాయించుట, దుఃఖోపశమనముచేసుట, ఆదరించుట.
To Consolidated v a ఖనీభవింప చేసుట, గట్టిచేసుట, గట్టిపడేటట్టు చేసుట, కూర్చుట, చేర్చుట, ఒకటిగా చేసుట. the cold weather *s the butter చలి కాలములో వెన్న గట్టిపడుతున్నది. they *d the charges of these schools యీ పల్లె కూటముల యొక్క ఖర్చులు యావత్తు ఒక లెక్కగానే చేర్చినారు. he *d the four regiments ఆ నాలుగు రిజమెంట్లను ఒకటిగా కలిపినాడు.
To Consort v n or to agree సంబంధించుట, సహవాసము చేసుట.
To Conspire v n to plot కుట్ర చేసుట, దురాలోచన చేసుట. or to unite in good సహాయపడుట అనుకూలించుట. they all *d to praise him అందరు ఒకే మాటగా అతణ్ని పొగడినారు.
To Constitute v a to produce కలగచేయుట, కల్పించుట. to establishస్థాపించుట. to appoint యేర్పరచుట, నియమించుట. as king పట్టాభిషేకము చేసుట. the king *d or made him minister రాజు వాణ్ని మంత్రినిగా నియమించినాడు. five individuals * this family యీ సంసారములో వుండేవాండ్లు అయిదు మంది, అయిదు మంది చేరి యిది ఒక సంసారముగా వున్నది.
To Constrain v a బలవంతము చేయుట, కడ్డాయము చేయుట, నిర్బంధించుట.terror *ed her to fly భయము చేత పారిపోయినది.
To Construct v a కట్టుట, నిర్మాణము చేసుట, కల్పించుట, యేర్పరచుట, విరచించుట.they *ed a fort here యిక్కడ ఒక కోట కట్టినారు. he *ed a new system కొత్తపద్ధతి కల్పించినాడు.
To Construe v a అర్థము, చెప్పుట, అన్వయించుట, అర్థము చేసుట, భావముచేసుకొనుట.
To Consubstantiate v a ఏకీభూతము చేసుట.
To Consult v n ఆలోచించుకొనుట, విచారించుకొనుట, మాట్లాడుకొనుట. they *edabout the marriage పెండ్లి జరిగించడానకై యోచించినారు.
To Consume v a హరించుట, భక్షించుట, కాజేసుట, వ్రయము చేసుట, దహించుట.fire consumed the house నిప్పు ఆ యింటిని దహించి వేసినది. diseaseconsumes the body రోగము దేహమును క్షయింప చేస్తున్నది. these dictionaries *d years of my life నా ఆయుస్సులో యీ నిఘంటువులకై పన్నెండేండ్లు పోయినవి.he *d his property in gambling తన ఆస్తిని జూదములో పాడు చేసినాడు.
To Consummate v a కాజేయుట, తీర్చుట, పూర్తి చేయుట.
To Contain v n అణుచుట. he could not * any longer but burst into tears వ్యసనమును అణచలేక యేడ్చినాడు.
To Contaminate v a అంటుచేసుట, అపరిశుద్ధము చేసుట, చెరుపుట, భ్రష్టుచేసుట.the touch of a dead body is supposed to * శవమును తాకితే అంటు అంటారు.
To Contemn v a అలక్ష్యము చేసుట, తృణీకరించుట, తిరస్కరించుట, ఉపేక్షించుట,చులకనగా యెంచుట.
To Contemplate v a to view or behold చూచుట, యోచించుట, ఆలోచించుట,తలచుట. he *d his children with pleasure బిడ్డలను కండ్లచల్లగా చూచినాడు.when he *d this deed వాడు యీ కార్యమును గురించి యోచించినప్పుడు. I at thattime *d going to Calcutta నేను అప్పట్లో కలకత్తాకు పోవలెనని యోచిస్తూ వుంటిని.do you * going there అక్కడికి పోవలెనని యోచనా.
To Contend v a పోరాడుట, కలహించుట. I * that this is false యిది అబద్ధమనివాదిస్తాను. I * that this is impossible యిది అసాధ్యమని వాదిస్తున్నాను. they *edwith him వాడితో పోరాడిరి.
To Content v a తృప్తి పొందించుట, సంతుష్టి చేసుట, సంతోష పెట్టుట, సమ్మతిపరచుట, ఒప్పించుట. a little milk cantented the child రవంత పాలుతో ఆ బిడ్డవూరక వుండినది. will cakes * a man? మనిషికి ఫలహారము ఒక ఆహారమా. he *ed them వాండ్లను సమ్మతి పరచినాడు. do you think that this answer will *them ? యీ జవాబు వాండ్లకు సమ్మతి పడననుకొన్నావా. do you think that hisconduct will * your master నీవు యిట్లా చేస్తే నీ యజమానుడు వూరకవుండుననుకొన్నావా. as all I said did not * them I came away నేను యెంతచెప్పినా వాండ్లు ఒప్పనందున లేచివస్తిని. I do not want a new dress I shall *myself with this one నాకు కొత్తవుడుపు యెందుకు యిదే చాలును. he *edhimself with writing one letter ఒక జాబు వ్రాసి యింతే చాలు ననుకొన్నాడు. he *ed himself with dry rice యీ వట్టి కూడైనా దొరికిందే చాలు ననుకొన్నాడు.
To Contest v a పోరాడుట, జగడమాడుట, వ్యాజ్యమాడుట, యెదురాడుట,తస్కరించుట. I do not contest this దీన్ని కాదనను.
To Continue v n వుండుట, యెడతెగకుండా వుండుట. you must * to write నీవుయింకా విడవకుండా వ్రాస్తూ వుండవలసినది. the weather *s cold యింకాచలివిడవలేదు. the work still *s యింకా ఆ పని జరుగుతూ వున్నది. letters * tobe received జాబులు విడవకుండా వచ్చి చేరుతున్నవి. It *s in a line అది విడవకవరసగానే వుంటూ వున్నది. besides, *ed he, I do not know whether this istrue యిది కాకుండా అది నిజమో అబద్ధమో నాకు తెలియదనిన్ని అన్నాడు. and I *edhe , will help you మరిన్ని నీకు సహాయము చేస్తాననిన్ని అన్నాడు.
To Contract v a కుంచించుట, సంకోచింప చేసుట, యిముడ్చుట, యిమిడించుట,అణుచుట, తగ్గించుట, తక్కువచేసుట, ఒడంబడిక చేసుకొనుట, ఒప్పందము చేసుట,జట్టీకి యిచ్చుట. to * marriage పెండ్లి చేసుకొనుట. to * alliance సంబంధము చేసుట,వియ్యమందుట. he *ed friendship with them వాండ్లతో స్నేహము చేసినాడు. youhave *ed his habits వాడి గుణాలు నీకు పట్టుబడ్డవి. I *ed a loan or debt నేనుఅప్పు చేసినాను. I *ed a disease రోగము తగిలించుకొన్నాను. disease contractsthe growth of a child రోగము బిడ్డను పెరగనియ్యదు. he *ed all this into onechapter దీన్ని అంతా ఒక అధ్యాయములో యిమిడ్చినాడు. when you * the eyes నీవుకండ్లను చీకరించినప్పుడు. to * the belly అక్కలించుట. he *ed his browsబొములుముడి పెట్టినాడు. It is advisable to * his means of doing mischiefదుర్మార్గము చేయడమునకై వుండే సాధనమును సంకోచము చేయడము యుక్తము. the snake *ed itself into a small compass ఆ పాము రవంతలో ముడుచుకొన్నది.
To Contradict v a కాదనుట, లేదనుట, విరుద్ధముగా చెప్పుట, ప్రతిషేధించుట,అడ్డమాడుట. he *ed me నేను చెప్పినది కాదన్నాడు. he *ed himself స్వవాక్యవిరోధము చేసినాడు, ముందుగా ఒకటి వెనక ఒకటి చెప్పినాడు. these letters * one another యీ జాబులు ఒకటికొకటి విరుద్ధముగా వున్నవి. the apocryphal or *ed books ప్రక్షిప్తకాండలు, అప్రసిద్ధమైన కాండలు.
To Contradistinguish v a భేదమగుపరుచుట, విశదపరుచుట.
To Contrast v a భేదము చూపుట, పరస్పరభేదమగు పరచుట, తారతమ్యమునువిచారించుట, వ్యత్యాసమగు పరచుట, వైపరీత్యమగు పరచుట, సమత్వము లేదనిఅగుపరచుట. I will not * the conduct of these two men వీండ్ల యిద్దరియోగ్యతలో తారతమ్యము విచారిస్తాను, వాడి నడక యేలాగంటిదో వీడి నడక యేలాగంటిదోవిచారిస్తాను, చూపిస్తాను. your conduct contrasts (v. neut.) strangely with his నీ నడక యెక్కడ వాని నడక యెక్కడ.
To Contravene v a ప్రతికూలించుట, ప్రతికూలము, చేసుట, కొట్టుట. theyfabricated that bond to * this one దీనికి ప్రతిగా వేరే పత్రము కల్పించినారు, యీ పత్రమును కొట్టేటట్టుగా వేరే పత్రమును కల్పించినారు.
To Contribute v a యిచ్చుట, ఒదుగుట, సహాయము చేయుట. they *d muchmoney towards this యిందుకు బహురూకలను సహాయము చేసినారు. he *d hisaid అతను సహాయము చేసినాడు. all these books * their aid యీ పుస్తకాలన్నిఒదుగుతవి. all these things *d to ruin him వాణ్ని చెరపడానకు అన్ని కూడినవి,మూడినవి. all these * to show that he is your friend యీ వ్యాపారములన్నివాడు నీకు హితుడనడమునకు వుపబలమౌతవి.
To Contrive v a యుక్తి చేసుట, కల్పించుట, పన్నుట. how did you * to getinto the house నీవు యేమి వుపాయము చేసి ఆ యింట్లోకి పోయినావు.
To Control v a యేలుట, అణుచుట, స్వాధీనము చేసుకొనుట, కట్టుబాటులో వుంచుట,ఖండించుట. he controlled the family very well ఆ సంసారాన్ని చక్కగా పట్టుకొని వచ్చినాడు. * your passions కోపమణుచు. he controlled himselfఅణుచుకొన్నాడు.
To Controvert v a లేదని వాదించుట, కాదని వాదించుట.
To Convene v a కూర్చుట, చేర్చుట. he *d an assembly వాడు వొక సభనుకూర్చినాడు. he *d his forces in the village నాలుగు తట్లా వుండిన వాడి సేననంతాఆ వూళ్లో చేర్చినాడు.
To Converge v n ఒక చోట కూడుట, ఒక చోట చేరుట. in the middle of aspider's web all the lines * సాలె పురుగు వేసే వలలో అన్ని పోగులున్ను నడమపోయి కూడుతవి.
To Converse v n మాట్లాడుట, సంభాషించుట. they *d with me వాండ్లు నాతోమాట్లాడినారు, వాండ్లకు నాకు సంభాషణ జరిగినది. or to associate or to keepcompany సహవాసము చేసుట. he *d with men for 33 years ముప్పై మూడుసంవత్సరముల దాకా మనుష్యులలో మెలిగినాడు.
To Convert v a కూర్చుట, చేయుట. he *ed many people బహుమందిని తనమతస్థులుగా చేసినాడు, బహుమంది తన మతమును అవలంబించేటట్టు చేసినాడు. hiswords *ed them వీడి మాటల వల్ల వాండ్లు తిరిగిరి, దోవకు వచ్చిరి. he *ed thehouse into a school ఆ యింటిని పళ్ళికూటముగా చేసినాడు. he converted thehat into a bag ఆ టోపిని సంచిగా చేసుకొన్నాడు. he *ed the jewel into moneyసొమ్ము అమ్మి రూకలు చేసుకొన్నాడు. he says he can * iron into goldయినుమును బంగారు చేస్తానంటాడు. he *ed them to his over opinions తనకుతోచినట్టుగా వాండ్లకున్ను తోచేటట్టు చేసినాడు. he *ed the charity found to his ownpurposes ఆ ధర్మరూకలను స్వంత వ్రయము చేసుకొన్నాడు. he is *ed to theiropinions వాడికిన్ని వీండ్ల బుద్ధే పట్టుబడ్డది.
To Convey v a తీసుకొనిపోవుట, తీసుకొని వచ్చుట, మోసుకొని పోవుట, సాగించుట.this conveys another meaning యిందుచేత వేరే వొక అర్థమౌతుంది. I will *them by sea వాటిని సముద్రము మీదుగా తీసుకవస్తాను. do these words * thatmeaning యీ మాటలు ఆ యర్థమును యిస్తున్నదా ? he *ed me across theriver నన్ను యేరు దాటించినాడు. the post will * this letter to you యీ జాబునీకు తపాలులో వచ్చును. he *ed the estate to his brother ఆ యాస్తితమ్ముడిపరము చేసినాడు. the wind *ed the smell to me ఆ వాసన నాకుగాలివాటుగా వచ్చినది. he *ed the intelligence to me నాకు తెలియచేసినాడు.
To Convict v a నేరము స్థాపించుట, తప్పు మోపుట. your words * yourself నీమాటలే నిన్ను నేరస్థుణ్నిగా చేస్తున్నవి.
To Convince v a నమ్మేటట్టు చేసుట, వొప్పించుట, వొప్ప చెప్పుట. these words*d me that they were dead యీ మాటలవల్ల వాండ్లు చచ్చినారని నాకునిశ్చయమైనది. I will * you that this is true యిది యథార్థమేనని నీవువొప్పుకొనేటట్టు చేస్తాను. my words did not convince him of the truth నా మాటవాడికి నిజపడలేదు. his oath did not * me వాడు యెంత ప్రమాణము చేసినా నాకునిశ్చయము లేదు, నేను నమ్మను.
To Convoke v a సభ కూర్చుట.
To Convulse v a విలవిలలాడించుట, గడగడవణీకించుట. pain *d his faceనొప్పివాడి ముఖమును వంకరటొంకరలుగా యీడ్చినది. anger *d him కోపము చేతతన్నుకొన్నాడు. the war that now convulses that country యిప్పట్లో ఆదేశమును గడగడలాడించే యుద్ధము.
To Conycatch v n మోసము చేసుట, పితలాటకము చేసుట.
To Coo v n కూసుట, యిది పావురాయిని గురించినమాట. at cooing soundకపోతహూంకృతి, పావురాయిస్వనము.
To Cook v a వండుట, వంట చేసుట, పచనము చేసుట. he cooks for -himselfతానే వంట చేసుకొంటాడు. he cooked up a story వొక కధను కల్పించినాడు, కట్టివిడిచినాడు.
To Cool v n చల్లారుట, ఆరుట, చల్లబడుట. after the fire cooled a littleనిప్పు కొంచెము చల్లారిన తరువాత. before the milk cooled పాలారక మునుపు.
To Coop v a గిడ్డంగిలో వేసి మూసుట. they cooped him up in a small cellవాణ్ని ఒక గిడ్డంగిలో వేసి మూసినారు.
To Co-operate v a ఒక పనికి కూడా సహాయపడుట అనుకూలపడుట. bathingco-operated in the cure స్వస్థము కాపడానకు స్నానమున్ను అనుకూలించినది.
To Cope v n అడ్డమాడుట, యెదిరించుట, యెదురాడుట. can a child * with aman బిడ్డ పెద్దవాడితో పోరాడగలుగునా, ఒక బిడ్డ పెద్దవాడికి యీడౌనా. no Telugu poetcan * with Bhattumurti భట్టుమూర్తి ముందర ఒక తెలుగు కవి నిలువలేడు, భట్టుమూర్తికి యే తెలుగు కవి యీడౌను ?
To Copulate v n సంభోగము చేసుట.
To Copy v a యెత్తి వ్రాసుట, వేరే ప్రతి వ్రాసుట. to * fair చిత్తును చూచి చక్కగాయెత్తి వ్రాసుట. or to imitate అనుకరించుట. I see that boy copies you నీ నడతవాడికి పట్టుబడ్డది.
To Coquet v n to act the lover, to entice by blandishments తుసుకులుచేసుట, వలపించుట, తేలించుట, లాలించుట, మోహము చూపి యేమార్చుట, మరులు,కొలిపి మాయచేసుట. she coquetted with him, a long time and disappointedhim at last బహుదూరము వాడికి మోహము చూపి తుచకు వాణ్ని మోసపుచ్చినది.
To Cord v a కట్టుట, దారముతో కట్టుట.
To Cork v a బెండుబిరడా వేసుట. he corked the bottle ఆ బుడ్డికి బిరడావేసినాడు.
To Corn v a or to salt flesh ఉప్పు వేసి పక్వము చేసుట, అనగా మాంసముశానా దినములు చెడకుండా వుండేటట్టు వుప్పు వేసి పక్వము చేసుట.
To Correct v a దిద్దుట, చక్కబెట్టుట, సవరించుట. he corrected this abuseయీ దురాచారమును మాన్పినాడు. or to counteract విరుచుట. buttermilkcorrects the ill effects of mangoes మజ్జిగ మామిడిపండ్ల యొక్క దోషమునువిరుస్తున్నది. they use brandy to * the bad properties of the water అక్కడినీళ్ల దోషము విరిచేటట్టుగా బ్రాందిని కలుపుతున్నారు. or punish శిక్షించుట. hecorrected the boy ` పిల్ల కాయను శిక్షించినాడు, అనగా కొట్టినాడు.
To Correspond v n to agree సరిపడుట, యిముడుట, పొందుట. this pillardoes not * with that యీ స్తంభానికి ఆ స్తంభము దీటు పడలేదు. In the Englishlanguage there is no word that corresponds with the word braminయింగ్లిషులో బ్రాహ్మణుడనే శబ్దమునకు సరియైన శబ్దము లేదు. he corresponds withme అతనికి నాకు వుత్తర ప్రత్యుత్తరములు జరుగుతున్నవి.
To Corroborate v a బలపరచుట, దృఢపరుచుట. this * my belief that he isdead యిందువల్ల అతను చచ్చినాడని నాకు బాగా రూఢి అయినది.
To Corrode v a తినివేసుట, హరించుట. constant dropping of water will *a rock సదా నీళ్లు పడడము చేత రాయి అరిగి పోతున్నది. rust *s iron తుప్పుయినుమును తినివేస్తున్నది. grief *s the heart వ్యసనము చేత మనసుకుందిపోతున్నది.
To Corrupt n s చెరుపుట, భ్రష్టుచేసుట. these books * the mind యీపుస్తకములు బుద్ధిని చెరుపుతున్నవి. evil communications * good manners ( 1 Cor. XVI. 32 ) కుసంసర్గేణ లోకానాం, శుభంకర్మవినశ్యతి A+ or to bribeలంచమిచ్చి చెరుచుట. he tried to * the judge న్యాయాధిపతికి లంచమిచ్చిలోపరుచుకోవలెనని చూచినాడు.
To Cost v a పట్టుట, తగులుట. what did it * ? అందుకు యెంత పట్టినది ? itwill * 10 rupees అందుకు పది రూపాయీలు పట్టును * what it may అందుకుయెంత పట్టినా పట్టనియ్యి, అందుకు యేమి వచ్చినా రానియ్యి. it * him his life అదివాడి ప్రాణమునకు వచ్చినది. it * very little అది చవకగా వచ్చినది. it * a great dealఅది ప్రియముగా వచ్చినది.
To Couch v n పండుకొనుట, దాగుట.
To Cough ofv n. దగ్గుట. to * up దగ్గి గేళ్లను వుమ్మి వేయుట. he coughed upblood వాడికి దగ్గితే నెత్తురు పడినది.
To Counsel v a బుద్ధి చెప్పుట, ఆలోచన చెప్పుట, యోచన చెప్పుట. theycounselled him వాడికి దుర్బోధన చేసినారు.
To Count v a యెంచుట లెక్క పెట్టుట, యెన్నిక పెట్టుట. he *ed his beadsజపమాలికతో లెక్క పెట్టుకొన్నాడు. they *ed this his doing యిది అతను చేసినట్టుఅనుకొన్నారు, యెంచినారు. I *ed it worng యిది అన్యాయమైనట్టు నాకు తోచినది. we*ed upon his kindness అతని యొక్క విశ్వాసమును గట్టిగా నమ్ముకుని వుంటిమి. I *ed it unjust అది అన్యాయ మనుకొన్నాను.
To Countenance v a ఆదరించుట సహాయము చేసుట, కటాక్షించుట, పక్షీకరించుట,అభిమానించుట. he countenanced the fraud ఆ మోసాన్ని చూస్తూ వీరికె వున్నాడు ఆకృత్తిమమును అనుకూలించినాడు.
To Counteract v a ప్రతికూలించుట, ప్రతిఘటించుట, విరుచుట, అడ్డగించుట. themilk *ed the poison పాలు చేత విషము విరిగినది.
To Counterbalance v a సరితూగ చేసుట, సరియెత్తు చేసుట. his kindnesscounterbalances the injury he did you వాడు పూర్వము చేసిన అపకారానికిన్నియిప్పుడు చేసిన వుపకారానికిన్ని సరిపోయినది. this evil counter balances all thegood యీ ఆయాసమునకు ఆ మంచికి సరిపోయినది.
To Counterfeit v a వొకనివలె నటించుట. he counterfeited my brother andreeived the money నా తమ్ముడని పేరు పెట్టుకొని ఆ రూకలను తీసుకొన్నాడు. or toforge సృష్టించుటు he counterfeited the coin తప్పు నాణెము వేసినాడు. theycounterfeited his signature వాడి చేవ్రాలు వలె తప్పు చేవ్రాలు చేసినాడు. hecounterfeited the document వొక తప్పుదస్తావేజు సృష్టించినాడు. hecounterfeited her voice దాని గొంతువలె మాయగా మాట్లాడినాడు.
To Countermand v a తిప్పివేయుట మార్చివేసుట, కొట్టి వేసుట. he *ed theorder ఆ వుత్తరువును కొట్టివేసినాడు. he *ed the goods తెమ్మన్న సరుకులను మళ్లీవద్దని పంపించి వేసినాడు. they *ed the troops ఆ దండును ముందర పొమ్మని మళ్లీవద్దన్నారు.
To Countermarch v a మళ్లుకొని పోవుట, తిప్పుకొని పోవుట. I *ed the thievesదొంగలకు అడ్డము తగిలినాను. they past the whole day in marching and *ing వారు ఆ దినమంతా రావడము పోవడముతోనే సరిపోయినది. he *ed his booksయిక్కడి పుస్తకములనుఅక్కడ, అక్కడి పుస్తకములను యిక్కడ పెట్టినాడు.
To Countermine v a ప్రతియుక్తి చేయుట, ప్రతికల్పన చేయుట, శత్రువులు తవ్వినసొరంగమునకు ప్రతి సొరంగము తవ్వుట.
To Counterpoise v a సరితూగేట్టు చేసుట, సరితూగడానకై బళువు పెట్టుట.
To Countersign v a పయివ్రాలు పెట్టుట.
To Countervail v a యీడౌట, తుల్యమౌట. this evil does not * the advantageఅంతఫలానికి యీ చెరువు వొక యీడు కాదు.
To Counterwork v a ప్రతియత్నము చేసుట, అడ్డగించుట, ప్రతిహతి చేసుట,ప్రతిఘాతము చేసుట.
To Couple v n కూడుట, చేరుట, సంగమము చేసుట. some birds * in May కొన్నిపక్షులు వసంత ఋతువులో కూడుతవి సంగమము చేస్తవి.
To Course v a ( in hunting ) తరుముట. I coursed the hare కుందేలు మీదకుక్కను వుసుకొలిపినాను, విడిచినాను. the dog coursed the hare కుక్క కుందేలునుతురుముకొని పోయినది.
To Court v a ఉపసర్పించుట, అనుసరించుట.
To Courtsey v a ( Pronounciation kurchy ) ఇంగ్లీషు స్త్రీలు వందనముచేసుట.
To Covenant v n ఒడంబడిక చేసుకొనుట, నియమించుకొనుట, నిర్ణయము చేసుకొనుట.I convenanted with myself to do this దీన్ని చేయవలెనని నిర్ణయముచేసుకొన్నాను.
To Cover v a మూసుట కప్పుట, కమ్ముట, దాచుట, పొదుగుట. he *ed the bookwith paper ఆ పుస్తకానికి మురికి తగలకుండా పైన కాకితము వేసినాడు. he *ed thebox with leather ఆ పెట్టెకు పైన తోలు వేసినాడు. they *ed their bodies withpaint ఒంటికి వర్ణము పూసుకొన్నారు. the flies *ed the food అన్నము మీదయీగలు ముసురుకొన్నవి. they *ed him with dirt వాడి ఒళ్లు అంతా మురికిచేసినారు. they *ed him with curses వాన్ని తిట్టి శపించినారు. they *ed himwith blessings వాణ్ని పదివేల విధములుగా ఆశీర్వదించినారు. forests * thecountry ఆ దేశమును అడివి మూసుకొన్నది. to * a house in యింటికి పై కప్పువేసుట. he *ed the wall in గోడకు మదురు పోసినాడు. he *ed the wall inగోడకు మదురు పోసినాడు. he *ed the walls of his house with pictures వాడియింటి గోడలకంతా పటములు తగిలించినాడు. to cover over ముసుకు వేసుకొనుట. to* up కప్పుట, పూడ్చుట. the money will * the expense ఆ ఖర్చులకు యీ రూకలుచాలును. he *ed himself with glory కీర్తిభరితుడైనాడు. he *ed himself withshame నిందలపాలైనాడు. charity shall * the multitude of sins ధర్మము చేతఅన్ని పాపములు కప్పిపోను, మరిగిపోను. to * ( in copulation ) యెద్దు గుర్రము,మరిగిపోను to * ( in copulation ) యెద్దు గుర్రము, మొదలైనవి పలము చేసుట, యిదిసంభోగమును గురించిన మాట.
To Covet v a ఆశించుట, సరధనము, పరస్త్రీలను ఆపేక్షించుట.
To Cow v a బెదిరించుట, అదలించుట.
To Cower v n ఒదుగుట, తొలుగుట. he *ed to avoid the blow దెబ్బతప్పించుకోవడానికై వంగినాడు.
To Cozen v a వంచించుట, మోసము చేసుట.
To Crack v a పగలకొట్టుట, విరుచుట. he *ed the almonds బాదాం గింజలనుపగలకొట్టినాడు. the flame *ed the glass మంట చేత ఆ గాజు పగిలినది. the sun *s the earth యెండకు నేల బీటికలు బాసినది, పగళ్లు బారినది. he *ed a cocoanutటెంకాయ కొట్టినాడు. she *ed a louse పేనుకుక్కింది. to * the fingers మెటికెలువిరుచుట. if you do so I'll * your crown అట్లా చేస్తే నీ తలమీద కొట్టుతాను. noman can * logic without a teacher ( Wesley's works XII 393. ) గురువులేని తర్కము బోధకాదు. to * jokes హాస్యము చేసుట, యెగతాళి చేసుట.
To Crackle v n చిటపట కాలుట, చురుచురుమని మండుట, సుఞ్ యని శబ్దించుట. apaper or biscuit పెళపెళమనుట, చప్పుడౌట.
To Cradle v a పోషించుట, కాపాడుట సంరక్షించుట.
To Cram v n అడుచుకొనుట, కూరుకొనుట, బొక్కుట.
To Cramp v a సంకుచితపరచుట, ఆటంకము చేయుట. poverty cramps hisendeavours వాడి ప్రయత్నములను దరిద్రము ఆటంకము పరుస్తున్నది.
To Crash v n గభీలున శబ్దించుట, ఫెళ్లుమని శబ్దించుట, ఫెళఫెళమనుట. I heardthe thunder crashing over my head నా తల మీద పిడుగు దడదడ మన్నది.
To Craunch v a కరకరమని నములుట.
To Crave v a బతిమాలుకొనుట, ఆడుక్కునుట, వేడుకొనుట. I * your pardonఅపరాధము.
To Crawl v n పాకుట, దోగాడుట, జరుగుట, పారకాడుట. the sight made me *all over యిది చూడగా నా ఒళ్లు ఝల్లుమన్నది.
To Creak n s కిర్రుమనుట, కిరకిరలాడుట. the oil mill creaks గానుగకిర్రుమంటుంది. creaking shoes కిర్రుమెట్లు, కిరుకు చెప్పులు. a creaking doorకిర్రుకిర్రుమని కూసే తలుపు. a creaking sound కిర్రుమన్న ధ్వని.
To Cream v n మీగడ కట్టుట. creaming oil నురుగు కట్టిన బీరుసారాయి.
To Crease v a మడత చేయుట, మడిచి గురుతు యేర్పడేటట్టు చేసుట. don't *your paper కాకితాన్ని మడిచి చెరపవద్దు.
To Create v a సృష్టించుట, నిర్మించుట ఉత్పత్తి చేసుట, కలగచేసుట, కల్పించుట.this will * a great confusion యిందువల్ల మహాకలవరము సంభవించును. this *s the difficulty యిందు చేత ఆ తొందర సంభవిస్తుంది. the king *ed him abaronet రాజు అతనికి బారోనెట్టు ఆఖ్యను యిచ్చినాడు.
To Credit v a నమ్ముట, విశ్వసించుట, జమకట్టుట. I will * you with the moneyఆ రూకలను నీ పేరట జమకట్టుకొంటాను.
To Creek v n కిర్రుమనుట, కిరుక్కుమనుట. See to Creak
To Creep v n పాకుట, పారాడుట, జరుగుట, జారుట, మెల్లిగా పోవుట. they creptupon him మెల్లిగా వాడి దగ్గరకు వచ్చినారు. the plant crept over the wallసంపంగతీగె గోడమీద పారినది, యెక్కినది, అల్లినది. as a child దోగాడుట. they creptinto his confidence వుపాయముగా వాణ్ని నమ్మించినారు. delight and terrormake the flesh * ఆనందము చేత భయము చేత ఒళ్లు జలపరిస్తున్నది, గగ్గురుపొడుస్తుంది.
To Crepitate v n (in burning) పటపటమనుట, చిటచిటమనుట.
To Crib v a అపహరించుట. or confine మూసివేయుట, అడుచుట.
To Criminate v a పాపారోపణము చేసుట. this letter criminates you యీజాబు వల్ల నీ మీద నేరము వస్తుంది. they tried to * me ఆ పాపము నా తలమీద కట్టిచూచినారు.
To Crimp v a కొందుట, నజ్జునజ్జుగా కోసుట.
To Cringe v n నక్క నైచ్యము చేయుట, పండ్లిగిలించుట. he was found cringedup like a ball చెండువలె ముడుచుకొని వుండి దొరికినాడు.
To Cripple v a కుంటిపరచుట, మొండి చేయుట. this crippled his endeavoursయిందు చేత అతని యత్నములు చెడిపోయినవి.
To Criticise v a విమర్శించుట, పరిష్కరించుట, ఒక గ్రంధమును పరిశోధీంచితప్పులు వొప్పులు కనిపెట్టుట. he *d their conduct severely వాండ్లు చేసిన పనినిగురించి క్రౌర్యముగా మాట్లాడినాడు.
To Croak v n కప్పలు కూసుట, మాలకాకులు కూసుట. or grumble మూల్గుట, పిచ్చిమొరపెట్టుట, అఘోరించుట.
To Crook v a వంచుట. he *ed his finger వేలు వంచినాడు.
To Crop v a కోసుట, కోతకోసుట, పయిరు కోసుట, కత్తిరించుట.
To Crop out v n (To Project) ముందుకు తోసుకొని వచ్చివుండుట. a largestone cropping out of the wall ఒక పెద్ద రాయి గోడలో నుంచి ముందుకు తోసుకొనివచ్చి వున్నది.
To Cross v a అడ్డమాడుట, అడ్డగించుట, విఘ్నము చేసుట, యెదిరించుట. to * awall గోడ యెక్కి దిగుట. he *ed his arms చేతులు కట్టుకొన్నాడు. a thought *edme నాకు ఒక మాట తోచినది. the bridge that crosses the river ఆ యేటికి కట్టివుండే వారధి. they *ed the river ఆ యేటికి దాటినారు. draw a line and * it ఒకనిడుపు గీత గీచి దానిమీద ఒక అడ్డగీతవేయు. he has not *ed a horse this monthయీ నెలలో వాడు గుర్రము మీద యెక్కనే లేదు. to * out writing పాటా గొట్టుట,గీచివేసుట, కొట్టివేయుట. to * over దాటుట, తప్పించుట.
To Cross-question v a అడ్డసవాలు వేసుట, అడ్డ ప్రశ్నలు అడుగుట.
To Crouch v a నక్కుట, దాగుట, అణుగుట, పొంచుట. the dog *ed under mychair ఆ కుక్క నా కురిచి కింద దాగినది.
To Crow v n కోడికూసుట. to exult or be delighted ఆనందించుట, ఉప్పొంగుట.
To Crowd v n గుంపు చేరుట, కిక్కిరుసుట.
To Crown v a కిరీటము పెట్టుట, పట్టము గట్టుట, పట్టాభిషేకము చేసుట. or finishసంపూర్ణము చేసుట. these endeavours were *ed with success యీయత్నములు సఫలమైపోయినవి.
To Crucify v a శిలువ వేసి చంపుట, కొరతను వేసి చంపుట.
To Cruise v a సముద్రములో వొక ప్రయాణము పోవుట, వొక సబురుపోవుట.
To Crumble v a వలిచి పొడిచేసుట.
To Crumple v a నలుపుట. she crumpled her handkerchief బాగా వుండినరుమాల గుడ్డను నలిపి వేసినది. he crumpled the newspaper ఆ న్యూస్పేపరునునలిపి వేసినాడు.
To Crunch v a or cranch కరకరమని నమలుట.
To Crush v a నలుచుట, నలగకొట్టుట, అదుముట, అణచుట, అణగగొట్టు,అణగదొక్కుట, ముంచుట.
To Crust v n పక్కుకట్టుట.
To Cry v n అరుచుట, యేడ్చుట, కూసుట, కేకపెట్టుట. or say అనుట. come herecried he యిక్కడికి రాఅని అన్నాడు. I * you mercy ! అయ్యో, అయ్యో అపరాధము. to* out మొర బెట్టుట. to * out upon కాదనుట, ఛీ పొమ్మనుట, కూకలు పెట్టుట. to *avaunt ఛీ పొమ్మనుట, కూకలు పెట్టు. to * bo ! హుమ్మని ధిక్కరించుట. to * shame on నీ భవిష్యమారా అనుట, బయిసిమార అని అనుట, ధిక్కరించుట, తిర్స్కరించుట. to * down దూషించుట. she was crying herbs through the town అది పట్ణములో వీధివీధి తిరిగి కూరాకో కూరాకో అని అమ్మినది. to * up పొగడుట. ( as the seller at an action )యేలము పాడుట.
To Crystallize v a స్ఫటికము రీతిగా గడ్డకట్టుట. *d salt పూచిన వుప్పు.
To Cub v n పిల్లలు వేసుట, ఈనుట, యిది పులి, యేనుగ, సింహము, తోడేలు, నక్కయింకా కొన్ని క్రూర జంతువులను గురించిన మాట. a cubbed tigress పిల్ల వేసిన పులిఅనగా రేగి చిరచిర లాడుతూ వుండే పులి.
To Cuckold v a ఒకడి పెళ్లాన్ని చెరిపి దాని మగనికి తలవంపు చేసుట. he *edthat man వాడి పెళ్లాన్ని చెయ్యిపట్టి వాడికి తలవంపు చేసినాడు.
To Cuddle v n కౌగిలించి పండుకొనుట, దొబ్బుట, యిది నీచమాట.
To Cudgel v a కర్రతో కొట్టుట, బాదుట.
To Cuff v a గుద్దుట. on the head మొట్టుట.
To Cull v a or to choose, select యేర్పరచుట, యేర్పరచి యెత్తుకొనుట.
To Culminate v n ఉచ్చమౌట, సూర్యాది గ్రహములు నడి ఆకాశమునకు వచ్చుట. thestar that was then culminating అప్పట్లో వుచ్చమైన నక్షత్రము.
To Cultivate v a కృషిచేయుట, పయిరు పెట్టుట, వ్యవసాయము చేయుట, సాగుబడిచేసుట, సేద్యము చేసుట. he *d heir acquaintance వాండ్లను సెళవు చేసుకొన్నాడు,వాండ్లతో పరిచయమును అభివృద్ధి చేసినాడు.
To Cumber v n తొందరపెట్టుట, సంకట పెట్టు, చిక్కులు పెట్టుట, యిబ్బంది చేసుట.
To Cumulate v a పోగుచేసుట.
To Cup v a రాగి గిన్నెతో వొక తరహా చిటికె వేసుట, గిన్నె కరిపించి నెత్తురు తీసుట.
To Curb v a అణచుట, నిలుపుట, ఆంక్షచేసుట. I cannot * the horse ఆ గుర్రాన్నికళ్లెము యీడ్చిపట్టి నిలుపలేను, అనగా అది నాకు స్వాధీనము కానేరదు. to * theappetite కడుపు కట్టుట, ఆకలిని అణుచుట. he *ed his feelings వాడు దుఃఖాగ్నికడుపులో పెట్టుకొన్నాడు.
To Curdle v a పేరబెట్టు, తోడుబెట్టుట. *d milk పేరుకొన్న పాలు. the *d bloodగడ్డ కట్టుకొన్న రక్తము.
To Cure v n మానుట, మానిపోవుట, స్వస్థమౌట, వాసియౌట, గుణమౌట.
To Curl v n చుట్టుకొనుట, మెలిబడుట. the hair of children *s naturallyబిడ్డల వెంట్రుకలు తనకు తానే చుట్టలు బడుతవి. paper *s by reason of heatయెండకు కాకితము ముడుచుకొంటున్నది.
To Curry v a to dress leather తోలును పదును చేసుట. to beat or thrashబాదుట. or to rub a horse గుర్రాన్ని తోముట, గొరపముతో తోముట. or to try togain favour తడికలు తోసి దయసంపాదించుట, బుజ్జగించుట.
To Curse v a తిట్టుట, దూషించుట, శపించుట. to afflict వేధించుట, బాధించుట,దుఃఖపెట్టుట. * this rain యీ వాన మండ. curse them వాండ్ల కడుపు కాల.
To Curtail v a తగ్గించుట, మట్టు పరచుట. you must * your expenses నీవువ్రయమును తగ్గించవలసినది.
To Curve v a వంచుట, వంపు చేయుట.
To Curvet v n దుముకుట దూకుట, యిది గుర్రమును గురించిన మాట.
To Cushion v a కురిచి మొదలైన వాటికి మెత్తలు వేసుట విచారణకు రాకుండా అణిచివేసుట. they *ed his arguments వాడు చెప్పిన న్యాయములను అణగదొక్కి వేసినారు.
To Cut v n మెలుచుట, యిది పంటిని గురించిన మాట. he * across the fieldsవాడు పొలములో అడ్డముగా పడి పారిపోయినాడు. they have * వారి యిద్దరికి మాటలులేవు పగ వచ్చినది. when the teeth are ready to * పండ్లు మొలిచే సమయములో.the horse *s యీ గుర్రము నడవడములో ఒక కాలు ఒక కాలికి తాకిన గాయముఅవుతున్నది.
To Cutlaw v a పట్టుకౌన్నవాడికి బహుమానమిస్తామని చాటించుట.the magistrate *ed him మేజస్త్రీటువారు వాణ్ని చంపినవాడికిబహుమానమిస్తామని ప్రకటన చేసినారు.
To Dab v a ఒత్తుట. he inked the seal and babbed it on the paper .ముద్రకు మశి చరిమి ఆ కాకితము మీద ఒత్తినాడు. he dabbed the types with ink. అచ్చు అక్షరాలమీద మశి పొట్లమును ఒత్తినాడు.
To Dabble v n to play in water నీళ్లలో ఆటాడుట, నీళ్లలో దేవులాడుటబాగాతెలియని పనిని చేయపోవుట, చేతకాని పనికి తలపెట్టుకొనుట.he dabbles a little in poetry కొంచనంచము కవిత్వము చెప్పుతాడు.he dabbles in medicine తెలిసీ తెలియక వైద్యము చేస్తాడు.I see he has been dabbling with these accounts వాడు యీ లెక్కలలో కొంచెము అధిక ప్రసంగము చేసినట్టు తోస్తున్నది.
To Dally v n ముద్దులాడుట, సరసమాడుట. or to delay కాలహరణము చేసుట, జాగుచేసుట, జాప్యము చేసుట. to play the fool పిచ్చివాణ్నిగా చేసుట. they merely dallied withhim వాణ్ని వూరికె పిచ్చివాణ్నిగా ఆడించినారు.
To Dam up v a మడవకట్టి నీళ్లు నిలుపుట. Damage, n. s. నష్టము, హాని, చెరుపు, మోసము, చెడిపోవడము.damages బహువచనమందు, వచ్చిన నష్టమును గురించి అచ్చవలసినరూకలు. a suit for damages నష్టమును గురించి తెచ్చిన వ్యాజ్యము.
To Damage v a నష్టపరుచుట, హానిచేయుట, చెరుపుట.
To Damn v a to condemn కాదనుట, అపరాదగ్రస్తుడ్నిగా చేసుట.దోషగ్రస్తునిగా చేసుట. or to ruin నాశనము చేసుట, దుర్గతిపొందించుట, అధోగతి చేసుట. or to curse తిట్టుట, దూషించుట,ధిఃకరించుట. your letter completely damns your conductనీవు వ్రాసిన జాబువల్లనే నీవు చేసినది మిక్కిలి తప్పౌవుతున్నది.
To Damnify v a నష్టపరుచుట. this is a bad word.This damnified them యిందువల్ల వారికి హాని సంభవించినది.
To Damp v a తేమచేసుట, చెమ్మచేసుట. his spirits were *edవాడు ఆయాసపడ్డాడు. their ardour was not *edవాండ్లకు ధైర్యము తప్పలేదు.
To Dance v n ఆడుట, నటించుట, తాండవమాడుట. v. a. ఆడించుట.అనగా చంటిబిడ్డను చేతలమీద యెత్తుకుని ముద్దుగా కిందికీ పైకిఆడించుట. to * attendance వృధాగా తిరుగుట, నిష్ఫలముగాతిరుగుట. wind dances the boughs గాలి కొనలను పూస్తవి.
To Dandle v a ( a child) ముద్దుగా చేత యెత్తుకుని ఆడించుట.
To Dangle v n వేలాడుట, వేలకాడుట, వికారముగా , వేలాడుట.to dance attendance ముడ్డిచుట్టుకుని తిరుగుట. she had adangling ornament at her nose ఆమె బులాకి పెట్టుకుని వున్నది.
To Dare v a పంతమాడుట, రా చూతామనుట. I * you to provethis దీన్ని నీవు రుజువు చెయ్యి చూతాము. I * you to comein లోగా వస్తివా చూడు. he dared me to strike himనన్ను కొట్టు చూతామన్నాడు.
To Darken v n చీకటిపరుచుట, the somke *ed the place పొగచేతఆ స్థలము చీకటి కమ్ము కొన్నది., this murder *ed ( or sullied ) thefame of Bonaparte యిందువల్ల అతని పేరు మాసిపోయినది.
To Darn v n రప్పుచేసుట.
To Dart v n దూరుట, లటుక్కున పైన పడుట. as lightning'మెరుసుట. the dog *ed at me కుక్క నామీద లటుక్కున వచ్చిపడ్డది.he *ed across the road, ఝరాలున దోవకు అడ్డము పోయినాడు.
To Dash v n దూరుట, లటుక్కున పోవుట,తాకుట. they * ed forward ( in the attack) వాండ్లు ముందరగా దూరినారు. the horse*ed into my garden ఆ గుర్రము నాతోటలో జొరబడ్డది.the ship *ed against a rock ఆ వాడ ఒక కొండమీద తగిలినది.కొట్టుకున్నది. the ships *ed against one another ఆ వాడలుఒకటి మీద ఒకటి కొట్టుకున్నవి. the waves *ed over us మామీదఅలలు కొట్టినవి. he *ed into the water నీళ్లల్లో దుమికినాడు.Here the poet dashes into another subject యిక్కడ కవి వేరేసంగతిలో దూకినాడు. he *ed thro'the river యేటిలో అడ్డముపడిపోయినాడు.
To Date v a తేది వేసుట. I * my recovery fromlast sunday పోయిన ఆదివారము మొదలు నాకు స్వస్థము కావడానకు ఆరంభము. this war dates from 1840 యీ యుద్దము1840 సం//లో ఆరంభమైనది. Dated, adj. తేదిగల.
To Daub v a పూసుట, అలుకుట. to paint corsely వికారముగా చిత్రము వ్రాసుట. he *ed me with praiseనన్ను పిచ్చి స్త్రోత్రములు చేసినాడు.
To Daunt v a భయపరుచుట, దిగులుపరుచుట.బెదిరించుట, జడిపించుట.
To Dawdle v n జాప్యముచేసుట, ఆలస్యము చేసుట, జాగుచేసుట.
To Dawn v n తెల్లవారుట, అరుణోదయమౌట. as soon as it *ed తెల్లవారగానే.before it *ed or before day *d తెల్లవారక మునుపే.when this hope *ed up him వాడికి యీ ఆశ పుట్టేటప్పటికి.
To Dazzle v a కండ్లు చెదిరేటట్టు చేయుట, మిరమిట్లు కొనేటట్టు,చేయుట. the sun *ed me సూర్యుణ్ని చూచేటప్పటికి నాకండ్లుమిరమిట్లు కొన్నది, చెదిరినది.
To Deaden v a మాన్పరుచుట, కొరడు పారేటట్ఠుచేసుట, దుర్భలముచేయుట, తక్కువ పరుచుట.
To Deafen v a చెవుడు పరుచుట.
To Deal v n వర్తకము చేయుట, వ్యాపారము చేసుట. he dealsin precious stones వాడు రత్నాల వర్తకము చేస్తాడు. he dealsin silks వాడు పట్టుబట్టల బేరము చేస్తాడు. he deal in abuse తిట్టుతాడు.he dealt ( pronounced Delt) graciously with them వారి యందుదయగా జరిగించినాడు. he dealt hardly or harshly withthem వాండ్ల యందు క్రూరముగా జరిగించినాడు. death -dealing (murderous ) సంహారక శక్తిగల, మారకమైన, పాడు.
To Debak v n వాడ మీదనుంచి దిగుట.
To Debar v a నివారించుట, అడ్డిచేసుట, అభ్యంతరము చేసుట,రాయివేసుట.
To Debark v a వాడమీదనుంచి దించుట.
To Debase n a అవమానముచేసుట, హీనపరుచుట, హానిచేసుట, సుంకరముచేసుట. he debased himself అపకీర్తి పాలైనాడు.he debased them వాండ్ల గౌరవమును చెరిపినాడు. he debasedthe gold with copper రాగిని కలిపిన బంగారమును చెరిపినాడు.
To Debate v n ఆలోచించుట, పర్యాలోచన చేసుట, చర్చించుట. he long*ed with himself వాడు చాలదూరము ఆలోచించుకున్నాడు. they *ed regardingthis దీన్ని గురించి వ్యాజ్యమాడినారు. he *ed whether he should gothere అక్కడికి పోదామా వద్దా అని ఆలోచనగా వుండినాడు.
To Debauch v a చెరుపుట, స్త్రీని చెరుపుట. They *ed the witnesswith bribes లంచమిచ్చి చెరిపినారు.
To Debilitate v a దుర్బలపరుచుట, నీరసపరుచుట, నిస్త్రాణపరుచుట.
To Debit v a ఒకరి ఖర్చువ్రాసుట.
To Debouche v n బయలుదేరుట, కోట దిడ్డిదారిగుండా గాని అడవిసందిలోనుంచిగాని లటుక్కున బయలుదేరివచ్చి శత్రువులమీద పడుట. this road debouchesat a village యీ దోవ వొక వూరికి కొంచపోయి విడుస్తున్నది.
To Decamp v a లేచిపోవుట, పారిపోవుట. the dog *edకుక్క పారిపోయినది. she *ed అది పారిపోయినది.
To Decant v a పైపై తేటగా వంచుట, వైను సారాయిని వొక బుడ్డీలోనుంచిమరిఒక బుడ్డిలోకి తేటగా పోసుట.
To Decay v n నశించుట, క్షయించుట, క్షీణించుట, కుళ్లిపోవుట.పుచ్చిపోవుట, శిధిలమైపోవుట, వుడిగిపోవుట. when the teeth *పండ్లు పుచ్చేటప్పటికి. the fruit *ed ఆ కాయలు కుళ్లిపోయినవి.
To Decease v n తీరిపోవుట, ముగుసుట, చచ్చుట. Beforethe lease *d గెడువు తీరక మునుపే.
To Decide v a తీర్పుచేసుట, తీర్చుట, నిశ్చయము చేసుట.వగదెంచుట. he *d the question ఆ సంగతిని వగదెంచినాడు.this *s nothing యిందువల్ల, ఒకటిన్ని తీరదు. unable to * howto write this passage I omitted it యీ వాక్యమును యెటూవ్రాయడానకుతోచక విడిచిపెట్టినాడు. he *d in his mind to go there అక్కడికిపోవలెనని మనస్సులో నిశ్చయించుకున్నాడు.
To Decimate v a పదోదాన్ని కొట్టుట, పదోభాగమును కొట్టివేయుట. the cholera has *d the people వాంతి భ్రాంతి పదింటికి ఒకణ్నితీసుకోనిపోయినది. he *d his army వాడు సేనలో చీట్లు వేసి పదింటికిఒకన్ని కొట్టివేసినాడు, అనగా చంపినాడని భావము.
To Decipher v a భేదించి మర్మమును తెలుసుకొనుట, గూఢబావమునుతెలుసుకొనుట, వీడతీయుట. I could not * it దాన్ని చదవలేకపోయినాను.దాన్ని విడతీయలేకపోయినాను.
To Deck v a or to adorn అలంకరించుట, శృంగారించుట. or to floor వాడకు తలవరుస సంతన చేసుట.
To Declaim v n ప్రసంగించుట, ఉపన్యసించుట, వుగ్గళించుట. thelawyer *ed for two hours about this letter ఆ లాయరు యీ జాబునుగురించి రెండు ఘడియలు వుపన్యసించినాడు. to * against దూషించుట. దూరుట. they *ed against him వాణ్ని దూషించినారు. they *ed inthis favour వాణ్ని శ్లాఘించినాడు.
To Declare v a చాటించుట, బయటపెట్టుట, తెలియచేసుట. they *dthemselves my enemies నాకు శత్రువులని బహిరంగముగా చెప్పినారు.I * he reads well బాగా చదువుతాడు సుమీ. అదుగో బాగా చదువుతాడు.I * I will go and tell him యిదుగో పోయి అతనితో చెప్పుతాను. God*d himself in their favour దేవుడు వాండ్లపక్షమైనాడు. God *d himselfagainst us దేవుడు మాకు ప్రతికూలమైనాడు, మాకు దైవానుకూలముతప్పినది. Fortune *d herself in their favor వారికి జయమైనది.
To Decline v a అక్కరలేదని చెప్పుట, వద్దనుట, మానుకొనుట.విడిచిపెట్టుట. he *d answering the question ఆ మాటకు వుత్తరముచెప్పనన్నాడు. he *d sitting down కూర్చోనన్నాడు, కూర్చుండేదిలేదన్నాడు. he *d writting about it అందున గురించి వ్రాయనన్నాడు.he *d the examination తనకు పరీక్ష అఖ్కరలేదన్నాడు. I askedthem to come but they *d నేను రమ్మన్నాను, అయితే వారు రామన్నారు. In grammar to * a noun "శబ్దమునకు రూపబేధముల క్రమము చెప్పుట.శబ్దము యొక్క విభక్తులు చెప్పుట. how do you * this noun ? యీశబ్దానకు రూపభేదక్రమము యెట్లా చెప్పుతావు, యీ శబ్దానకు విభక్తియెట్లా చెప్పుతావు.
To Decoct v a కషాయము కాచుట, యిగరకాచుట . he *ed the gingerశొంఠికషాయము కాచినాడు.
To Decompose v a విడతీయుట, చిరకచేసుట, శిథిలపరుచుట.water *s many substances నీళ్లచేత కొన్నిపదార్థములు కుళ్లిపోతవి. rust *siron తుప్పు యినుమును తినివేస్తున్నది, శిథిలము చేస్తున్నది.
To Decoy v a తీపుచూపి వలలో వేసుకొనుట, ఆశ చూపి వంచించుట.the antelope that was sent to * Rama రామున్ని వంచించుటకై సంతోషింపబడ్డజింక. they *ed him into the house and killed him వాన్ని వుపాయముగాయంట్లోకి పిలిచి చంపినారు. this bird *s the others into the snareయీ పక్షిమాయచేసి కడమపక్షులను వలలో పడేటట్టు చేస్తున్నది.
To Decrease v n తగ్గుట, క్షయించుట, తక్కువౌట, మట్టుపడుట.when the fever *s జ్వరము మట్టుపడేటప్పటికి. on the 4th day of the decreasing moon బహుళచతుర్థి, కృష్ణ చతుర్ధి.
To Decree v a తీర్పుచేసుట, నిశ్చయించుట. they *d thatthe army should return సేనమళ్ళీ రావలసినదని ఆజ్ఞాపించినారు.
To Decrepitate v a వేయించుట, బొరుగులు చేసుట.

No comments:

Post a Comment