Monday, February 7, 2011

Thrasher

Thrasher n s నూర్చేవాడు. a kind of fish వొక పెద్ద చేప.
Thrashing n s నూర్చడము. beating కొట్టడము, బాదడము.
Thrashing floor n s కళ్ళము, పంటకళ్ళము. threshing instrument నూర్చేకొయ్య.
Thread n s దారము, నూలు, తంతువు, పోగు. gold or silver * సరిగె. red *తొగరు. a ball of * నూలుకండె. silk * పట్టు నూలు. the sacred * worn bybramins &c జంధ్యము. connection of a tale సరణి, క్రమము. I lost the * ofhis discourse వాడు మాట్లాడే క్రమము యేదో నాకు తప్పిపోయినది. a cloth wovenwith a double * గంటెన, గింటెన, జమిలిపోగున నేసిన గుడ్డ. a * paper నూలుచుట్టిపెట్టే కాకితము. she is a mere * paper బక్కపలాచటి పడుచు. he has become amere * paper సన్న నూలు వడికినాడు. his fortune hangs by a * వాడి ఐశ్వర్యమువుర్రట్లూగుతున్నది.
Threadbare adj worn to the naked threads, worn out పాతగిలిన,శిథిలముగా వుండే. a * story అందరు యెరిగిన కథ.
Threaden adj made of thread దారముతో చేసిన.
Threat n s బెదిరింపు, బెదురు, అదురు, భయము. by persuasion and by *sనయాన భయాన.
Three adj and n. s. మూడు, ముగ్గురు. * cornered త్రికోణమైన, మోచేతివంపుగావుండే, మూడుమూలలుగల. * fold మూడింతలు. * quarters ముప్పాతిక. In *words, they will never pay the money వెయిమాట లేల వాండ్లు ఆ రూకలుచెల్లించరు.
Three decker n s పెద్దవాడ, నూరుపిరంగులు గల పెద్ద వాడ.
Threshold n s గడప, గడపకమ్మి వాకిలి. at the very * of the business ఆ పనియొక్క ప్రారంభములోనే.
Threw past tense of To throw
Thrice adj మూడు మాట్లు, ముమ్మాటికి. * as much మూడింతలు. * five isfifteen మూడు అయిదులు పదిహేను. * blessed అతి దివ్యమైన.
Thrift n s parsimony; frugality మితవ్రయము, పోణిమి, పొదుపు. she showedgood * in the management of her family అది సంసారము నిండా పోణిమిగాజరిపించు కొంటున్నది. they have no * వాండ్లు రూకలను పట్టి చూడరు వాండ్లుదూబరదిండితనము చేస్తారు.
Thriftily adv carefully పదిలముగా, పోణిమిగా.
Thriftiness n s frugality, parsimony మితవ్రయము పోణిమి, పొదుపు.
Thriftless adj extravagant దూబరదిండియైన, దుగారుబగారుచేసే.
Thrifty adj frugal మితవ్రయము చేసే, పోణిమిగల, పొదుపుగల.
Thrill n s piercing sound చెవులు అడుచుకొని పొయ్యేధ్వని. a * of joyఆనందము యొక్క దెబ్బ. when he said these words a * of horror wentthrough the room యీ మాటలు చెప్పేటప్పటికి అందరి గుండెలు ఝల్లుమన్నవి.
Thrilling adj piercing పొడిచే, దూశే. * cold ప్రాణమును కుంగతీసే చలి. * newsగుండెలు పగిలే సమాచారము.
Thriving adj పెరిగే, అభివృద్ధి అయ్యే, వర్ధిల్లే. a * family అభివృద్ధి అయ్యేసంసారము, బాగా పెరిగే బిడ్డలు. they are in a * state వాండ్లు శ్రేయస్సుగా వున్నారుI saw that she was in a * way అది గర్భముగా వుండినదని కనుక్కొన్నాను.
Throat n s గంతు, కుత్తి, కంఠము, గళము. he set up his * అరిచినాడు. or voiceకంఠ స్వరము. a fine * దివ్యమైన శారీరము. he has got a sore * వాడి గొంతురాశినది, వాడి గొంతు పచ్చి పుండుగా వున్నది.
Throb n s heave కొట్టుకోవడము, సళుపు, తీపు.
Throbbing adj సళిపే, ఆట్లు పోట్లుగా వుండే. * of the head తలపోట్లు. * of theheart through fear భయము చేత గుండెలు వణకడము.
Throe n s the pain of travail ప్రసవవేదన, నొప్పులు.
Throne n s సింహాసనము, గద్దె. the prince now on the * ఇప్పుడు రాజ్యమేలుతుండే రాజు.
Throng n s గుంపు, ఒత్తుడు.
Thronged adj ఒత్తుడుగా వుండే, నిండా గుంపుగా వుండే.
Throstle v s a singing bird కోకిలవంటి వొక పక్షి.
Throttle n s the windpipe గొంతుపీక.
Through (prep) గుండా,మూలముగా,ద్వారా,నుంచి,పూర్వకమ, * error భ్రమిశి. * design ఆలోచన పూర్వకముగా. he did this * wantఅన్నానికి గడవక యిది చేసినాడు. we settled the dispute * him ఆ వ్యాజ్యముఅతని గుండా తిర్చుకొన్నాము. the king did this * his minister రాజు దీన్ని మంత్రిగుండా చేసినాడు. he put a ring * her ear దాని చెవిలో కమ్మి దూర్చినాడు. all * thecountry they believed this దేశమంతా దీన్ని నమ్మినారు. he entered *the window గవాక్షి గుండా వచ్చినాడు. we came * the village ఆ వూరిగుండావచ్చినాము, ఆ వూరి మీదుగా వచ్చినాడు. as they came * the passకనమగుండారాగా, కనమదాటగా. he went * the river యేట్లో దిగి నడిచి ఆ గట్టుకుపోయినాడు. the dog bit * the rope ఆ కుక్క దారమును తీరా కొరికి వేసినది. the ratmade a hole * the wall పందికొక్కు గోడలో యీ తట్టునుంచి ఆ తట్టుకు బొక్కచేసినది. a river runs * the forest యేరు అడివి నడమ పారుతున్నది. * the dayదినమంతా. * the night రాత్రి అంతా. * the month నెల అంతా. to look * పారచూచుట, కడవెళ్ళా చూచుట. he carried the business * ఆ పనిని నెరవేర్చినాడు. hegot * his troubles వాడి తొందరలు విముక్తి అయినవి. he did this * ill willద్వేషము చేత చేసినాడు. * fear భయము చేత. * cold చలిచేత. * and *కూలంకషముగా, సమమకముగా. he studied Sanscrit * and * సంస్కృతమునుసమముకముగా చదివినాడు. he looked * and * the account ఆ లెక్కను ఆమూలాగ్రముగా విచారించినాడు, పద్దుకు పద్దు విచారించినాడు. * all generations పుత్రపౌత్ర పారంపర్యముగా. Note : `Through' is derived from the sanscrit rootTru తృ See Wilson's Sanscrit Grammar $ 203.
Throughout adv అంతా, అంతటా. * the year సంవత్సరము పొడుగున. * theworld ప్రపంచమంతటా. * the day దినమెల్లా, సాయంకాలము దాకా.
Throve past tense of the verb ToThrive
Throw n s a cast వేత, వేయడము. or throes ప్రసవవేదన, నొప్పులు.
Thrown past participle of the verb to throw వేశిన,వేయబడ్డ,పారవేయబడ్డ, * silk వొక విధమైన పట్టు వస్త్రము. labour * away వ్యర్థమైన తొందర,వృథాయాసము : the time was * away కాలము వృథాగా పోయినది. he was * offhis guard -భ్రమపడ్డాడు, భ్రమిశినాడు. the dogs were * out in the chase కుక్కలుతరుముకొనిపోతూ వుండగా వాటికి జాడ తప్పినది.
Throwster n s one whose business is to prepare the materials forthe weaver నేశేవాడికి పడుగు జాగ్రత చేశి యిచ్చేవాడు.
Thrum n s బద్దె.
Thrush n s a small singing bird ఒక పిట్ట. name of a certain diseaseగొంతులో లేచే చెడ్డ పుండ్లు, దీనివల్ల చావడము కూడా కద్దు.
Thug n s ( Indian word for an assasin ఠగ్గు వాడు, టక్కుమనిషి, పచ్చెపువాడు,ఫాసీగరు, భాటసార్లను గొంతు పిసికి చంపే దొంగ. These Telugu words areprobable enough, and are specified in Sleeman's book on Thugs, but Inever met with any Telugu man who had ever heard of Thugs.
Thuggism n s (Times, London paper) i. e. murder by fraud తగ్గుపని మాయజేసి మెడపిసికి చంపడము.
Thuggist n s ( an Assassin ) ఠగ్గువాడు, టక్కుమనిషి, పచ్చెపువాడు, ఫాసీగరు.Quarterly Review Dec. 1840, p. 153.
Thumb n s అంగుష్ఠము, చేతి బొటన వ్రేలు he has them under his * వాండ్లనుతన చేతి కింద అణిచి పెట్టుకొని వున్నాడు he has it under his * అది వాడిస్వాధీనములో వున్నది
Thumbed adj చేతనలిగిన. a well * book నిండా వాడడము చేత నలిగిన పుస్తకము.( Quarterly Review. clxi. 169.)
Thumbscrew n s కిట్టికోళ్ళవలె చేతికి తగిలించి హింస పెట్టేటిది.
Thumbstal n s a thinble; a sheath of leather to put on the thumbఅంగుళత్రాణము, విల్లు వేశేవాడు వేలికి కట్టుకొనే తోలు.
Thump n s a blow with the fist &c. అడుపు, దెబ్బ, గుద్దు. a light * మొట్టికాయ.
Thumper n s కొట్టేవాడు. any thing huge బ్రహ్మాండమైనది. the child is a * ఆబిడ్డ మొద్దు వలె వున్నది.
Thumping adj huge బ్రహ్మాండమైన. a * lie పెద్ద అబద్ధము.
Thunder n s ఉరుము. a loud noise గర్జన, అరుపు. they trembled at the *of his voice వాడు వురుమువలె అరిచినందుకు వాండ్లు వణికినారు. it came upon himlike a clap of * ఇది వాని మీదికి పిడుగువలె వచ్చినది. the *s of the Vaticanగురువు చేసిన గద్దింపు మాటలు.
Thunderbolt n s పిడుగు.
Thunderclap n s పిడుగు యొక్క ధ్వని.
Thunderer n s the power that thunders ఇంద్రుడు.
Thundering adj vast, huge, great బ్రహ్మాండమైన. the alarm set off witha * noise బ్రహ్మాండముగా ధ్వనించినది. Wesley 4. 292. " In two * large folios" బ్రహ్మాండమైన రెండు పుస్తకములుగా. ( Dibdin's Libr. Companion. ) They madea * attack పిడుగువలె పయిబడ్డారు.
Thunderingly adv అతి బ్రహ్మాండముగా.
Thunderplump, Thundershower n s. జడివాన.
Thunderstone n s a stone fabulously supposed to be emitted bythunder మేఘములో నుంచి పడ్డ నల్లటి రాయి.
Thunderstruck adj భయబ్రాంతమైన, మానుపడ్డ, వితాకుపడ్డ. he was * at thisఇందుకు ఆశ్చర్యపడ్డాడు.
Thursday n s గురువారము, బృహస్పతి వారము, లక్ష్మివారము.
Thus adv ఇట్లా, అట్లా, ఇవ్విధముగా, అవ్విధముగా, ఈలాగున, ఆలాగున,ఈ ప్రకారముగా, ఆ ప్రకారముగా. * far ఇంత దూరము, అంత దూరము, ఈ మట్టుకు, ఆమట్టుకు. I know thus much నాకు తెలిశినది యింతే, ఇంతమట్టుకు నేను యెరుగుదును.
Thwack n s దెబ్బ, (ఇది నీచ మాట.)
Thwart n s a cross beam అడ్డదూలము.
Thwarting n s విఘాతము, విఘ్నము.
Thwartingly adv విఘాతముగా, అడ్డంకిగా.
Thy pronoun నీ,నీయొక్క
Thyine-wood n s సుగంధమైన చెక్క. Thyme, n. s. a plant మరువమువంటి వొక చెట్టు.
Thyself (pronoun) నిన్నే
Tiar, Tiara n s. ముకుటము, కిరీటము, మస్తకాభరణము, శిరోభూషణము.
Tical n s టంకమనే లోహము.
Ticca adj ( Indian word for serving for hire ) కూలి. * bearersకూలిబోయీలు.
Tick n s the louse of dogs or sheep పిణుజులు, గడువుకు యివ్వడము. theshound of a watch or clock నిమిషానికి వొక మాటు టిక్కు టిక్కుమేన గడియారముయొక్క ధ్వని. the cloth of which a bed is made మెత్తకు వేశే వొక ముతక గుడ్డ. hebough these goods on * యీ సరుకులను చెయ్యప్పుగా కొనుక్కొన్నాడు. he willgive no * వాడు గడువుకు యివ్వడు.
Ticken, Ticking n s. మెత్తగుడ్డ, మెత్తలు కుట్టే గుడ్డ.
Ticket n s చీటి. * in a lottery లాటరి చీటి.
Tickling n s చక్కిలిగింత. pleasing సంతోష పెట్టడము.
Ticklish adj చక్కలిగింతగా వుండే. tottering; uncertain అస్థిరమైన, నిలకడలేని.her health is in a * state దాని వొళ్ళు వొక విధముగా వుండలేదు. niceసున్నితమైన. In these * times యీ విషమ సంధిగా వుండే కాలములో. this is a very* affair ఇది నిండా సున్నితమైన పని, యెటుపోయినా మోసము వచ్చే పని. thisbridge is in * state యీ వంతెన నమ్మరాణిదిగా వున్నది. the * parts of the bodyచక్కలిగింతగా వుండే చోటు, కళల యిక్కువలు. she is not * దానికి చక్కిలిగింత లేదు.
Ticklishness n s చక్కిలిగింతగా వుండడము, సూక్ష్మము, సున్నితము, మెళుకువ.from the * of his circumstances వాడి పని వుర్రట్లూగుతున్నది గనక, వొక నిలకడలేకుండా వున్నది గనక. Paley on Col. IV. 5. says, Suiting yourselves to thedifficulty and * of the times కాలోచితముగా.
Tidbit n s a dainty సారము, మెరికె, మంచి పదార్థము.
Tide n s time కాలము, సమయము, వేళ. the * ( a meaning a stream, ariver ) యేరు, ప్రవాహము, నది. the * in a river పోటు, పాటు. at high *పోటువేళ. at low * పాటు వేళ. against the * ప్రవాహమునకు యెదురుగా. * up theriver పోటు. * down the river పాటు. it is now full * యిప్పుడు యేరు నిండాపారుతున్నది. the freshes in spring *s కొత్త నీరు. at noon * మధ్యాహ్న వేళ. atevening * సంధ్య వేళ. he worked double *s రాత్రింబగులు ప్రయాసపడ్డాడు.
Tidewaiter n s an officer who watches the landing of goods at thecustom house సరుకులు దిగుమతి అయ్యేటప్పుడు కావలి వుండే బంట్రోతు.
Tidily adv neatly, prettily ముద్దుగా, సొంపుగా, సొగసుగా, గరాగరికగా, బాగా,పరిష్కారముగా.
Tidiness n s గరాగరిక, పరిష్కారము. from the * of her hosue దాని యిల్లుపొంకముగా వున్నది గనక.
Tidings n s news సమాచారము, వర్తమానము వదంతి. there are no * of hiscoming ఆయన వస్తాడనే మాట లేదు.
Tidy adj ముద్దుగా వుండే, సొంపుగా వుండే, సొగసుగా వుండే, పరిష్కారముగా వుండే.
Tie n s కట్టు, ముడి, బంధము. the * of a girdle నీవి, పోకముడి. the * ofa jacket బొందె. the marriage * వివాహమనే బంధము. family *s సంసారబంధకములు. he had formed many *s there వాడికి అక్కడ నిండా నిర్బంధమయివున్నది. death severs all *s చావుతో అన్ని నిర్బంధములున్ను పోతవి. freedfrom all earthly *s ఐహికపాశ విముక్తుడైన.
Tied adj కట్టిన, కట్టబడ్డ. I would willingly do it, but my hands are *నాకు చేయవలెనని వున్నది సరేగాని నాకేమిన్ని అధికారము లేకుండా చేయబడి యున్నది.the estate was * up ఆ యాస్తి బందు చేయబడి యుండినది.
Tier n s a row; a rank వరస, సరుణి, శ్రేణి. * upon * దొంతులుగా.
Tierce n s చిన్నపీపాయి.
Tiff n s ( a low word ) a fit of peevishness or sullenness చిరాకు,కోపము. to take * మండిపడుట ఇది ఆడంగులమాట.
Tiffany n s very thing silk నిండా సన్నమైనపట్టు, నాణ్యమైనపట్టు.
Tiffin n s (an Indian word) ఫలాహారము.
Tift n s ( or tantrum ) sudden anger, అలక, కోపము ( Smollett. 3. 207.)
Tiger n s పులి, వ్యాఘ్రము. a royal * పెద్ద పులి. a hunting * చురితపులి.
Tight adj బిగువైన. air * గాలి చొరడానకు రంధ్రము లేకుండా వుండే. that box isair * ఆ పెట్టెలో గాలి దూరదు. water * నీళ్ళు కారకుండా బిగువుగా వుండే. this boatis not water * యీ పడవలో నీళ్ళు వూరుతున్నది. this roof is not water * యీపై కప్పు వురుస్తున్నది. *s or breeches చల్లడము.
Tightened adj బిగువుగావుండే.
Tightly adv బిగువుగా, గట్టిగా.
Tightness n s బిగువు.
Tigress n s ఆడపులి.
Tile n s పెంకు. the house was roofed with *s ఆ యింటికి పెంకులు కప్పివుండినది
Tiled adj పెంకులుమూసిన. a * house పెంకుటిల్లు.
Tiler n s పెంకులు మూసేవాడు.
Tiling n s the roof covered with tiles పెంకులు, పెంకులపై కప్పు.
Till n s a money box in a shop అంగళ్ళలో రూకలు పెట్టుకొనే పెట్టే. a smallshelf with a lid inside a chest పైన మూత వుండే పెట్టెలోని చిన్న అర.
Tillable adj దున్నడానకు అర్హమైన.
Tillage n s దుక్కి, కృషి, వ్యవసాయము, సాగుబడి. these fields are under *యీ పొలములు దుక్కి అవుతున్నవి. a field for * సాగుబడి అయ్యే పొలము.
Tiller n s దున్నేవాడు, పయిరు చేసేవాడు. the * of a boat చుక్కాణి.
Tilt n s over a common cart నాటుపురపు బండిమీద మరుగుగా కట్టే గుడ్డ. over anative palanqueen పన్నాగము. over a boat మేలుకట్టు. a military game atwhich the combatants run against each other with lances onhorseback వొక విధమైన సాము, గుర్రము మీద యెక్కి చేత బల్లెములు పట్టుకొని వొకనిమీది కొకడు దూరే వొక విధమైన దండు వాండ్ల ఆట. Inclination forward ముందుకువంగడము. he set the barrel a-tilt that the liquor might run out ఆపీపాయిలోని సారాయి కారేటట్టు వొ తట్టు వంచినాడు. a thrust ఒక పోటు. he ran atme full * నా మీద వచ్చి దఢాలుమని పడ్డాడు.
Tilter n s one who tilts; or fights సాము చేసేవాడు.
Tilth n s husbandry కృషి, వ్యవసాయము, దున్నుకోవడము.
Timber n s మాను, ఇండ్లువాడలు మొదలైన వాటికి పనికి వచ్చే మాను. ( a Madrasphrase ) మాదిరి, సింహపలక. the main trunk of a tree చెట్టు యొక్క అడుగుమొద్దు. the main beams of a fabric దూలములు. the beech is not a * treebeing soft and liable to worms బీచు అనే చెట్టు మెత్తటిదిన్ని పురుగులు పట్టేటిదిన్ని గనుక యిండ్లు మొదలైన వాటికి పనికి వచ్చే మాను కాదు.
Timbrel n s a kind of musical instrument వొక విధమైన తప్పెట.
Time n s కాలము, వేళ, సేపు, పొద్దు, మాటు, మారు, విడుత, సారి, తూరి,పర్యాయము. in the night * రాత్రి పూట. at this * tomorrow రేపు యీ వేళకు. ator by this * ఆ మధ్య, యింతలో. up to the present * he has four sons యీవేళకు వాడికి నలుగురు కొడుకులు వున్నారు. in my grandfather's * మా తాతలనాడు.after a * కొంచెము సేపు తాళి, కొన్నాళ్ళకు తర్వాత. at one * వొకప్పుడు. another *మరివొకప్పుడు. he came another * మరివొక సారి వచ్చినాడు. at any * యెప్పుడైనా. they have held this land * out of mind ఆ నేలను అనాదిగా అనుభవిస్తున్నారు. In old *s పూర్వకాలమందు. seed time విత్తేతరి. Time, as opposed to eternity ఇహము. both in * and in eternity ఇహమందు, పరమందు, ఉభయత్ర. the enjoyments of * ఐహిక సుఖములు. I was not in * for the post నేను తపాలు వేళకు రాకపోతిని, నాకు తపాలు సమయము తప్పినది. he built the house in no * ఆ యింటిని ఆవలీలగా కట్టినాడు. in * you may be rich క్రమేణ నీవు భాగ్యవంతుడవు కావచ్చును. from * to * అప్పుడప్పుడు. have you * now ? మీకు యిప్పుడు తీరునా. I have not * నాకు తీరదు.from that * తుదారభ్య, అది మొదలు. he came in due * or in proper * సమయానికి వచ్చినాడు. you must lose no * in going ఆలస్యము చేయకు వెళ్ళు. * in music తాళము, లయ. beating * in music తాళము కొట్టడము. Times ఇది వొక సమాచార పత్రిక యొక్కపేరు. at *s అప్పుడప్పుడు. at all *s యెల్లప్పుడున్ను, సర్వదా. he accommodates himself to the *s యెప్పుడైనా. four at a * తడవకు నాలుగేశి. four *s నాలుగు మాట్లు. four *s ten is forty నాలుగు పదులు నలభై. three *s as large మూడింతలు పెద్దదైన. you are ten *s bad as he వాడి కంటె నీవు పదింతలు చెడ్డవాడవు, యేడాకులు యెగవేసిన వాడవు. once upon a * there was a king వొక రాజు కలడు. you should read these books one at a * యీ పుస్తకములను వొక టొకటిగా చదవవలసినది. send for them two at a * ఇద్దరిద్దరినిగా రమ్మను. speak one at a * వొకడొకడుగా మాట్లాడండి. the magistrates here sit * and * about ఇక్కడ పోలీసు దొరలు పూటకు వొకరు వచ్చి కూర్చుంటారు. she is near her * ఆపెకు యిప్పుడు కనపొద్దులు. at the same * మెట్టుకు, అయినప్పటికిన్ని. in the mean * అంతట, యింతలో.
Timed adj as well-timed కాలోచితమైన, సమయోచితమైన. ill * అసమయమైన,సమయోచితము కాని.
Timekeeper n s a watch or clock that keeps good time సరిగ్గా కాలముతప్పకుండా తిరిగే గడియారము.
Timely adj seasonable సమయోచితమైన. they gave him * notice వానికితగుబాటి సావకాశము వుండేటట్టుగా తెలియచేసినారు. * assistance saved his liveసమయానికి ఆదుకొన్నందున వాడి ప్రాణము తప్పినది. a * birth సంపూర్ణ గర్భముగావుండి ప్రసవించడము.
Timeous adj this is timely, reasonable సమయోచితమైన, కాలానుగుణ్యమైన.
Timeously adv ( a bad word for seasonably ) సమయానికి, అదునుకు.
Timepiece n s an excellent watch దివ్యమైన గడియారము.
Timepleaser n s one who complies with prevailing opinions whateverthey be మా బాగంటే మా బాగనేవాడు.
Timeserver n s one who meanly complies with present powerసమయోచితముగా నడిచేవాడు, ఇచ్చకాలమారి.
Timeserving n s mean compliance with present power సమయోచితముగానడవడము, ఇచ్చకాలమారితనము.
Timid adj పిరికియైన, భయస్థుడైన. she is not at all * దానికి జంకు లేదు. *glances చకితేక్షణములు.
Timidity n s జంకు, పిరికితనము, సంకోచము.
Timorous adj పిరికిగా వుండే, సంకోచపడే.
Timorously adv భయముగా, పిరికితనముగా, జంకుగా.
Timorousness n s పిరికితనము.
Tin n s తగరము, సత్తు. articles made of * are called at Madras చీనాసామాను as యెట్లాగంటే. a * box చీనాపెట్టే. a * mug చీనా జోడు తపిలె. a * dishచీనా రేకుతో చేసిన తట్ట. * plate చీనారేకు, కళాయి చేసిన యినప రేకు. a * of waterజీనా జోడ్తపిలెడు నీళ్లు. a * of biscuits మిఠాయీల చీనా డబ్బి.
Tincal or Borax n s వెలిగారము టంకణము.
Tincture n s colour or taste super added by something మరి వొక వస్తువుయొక్క సంసర్గము చేత కలిగిన వర్ణము, లేక, రసము, రుచి, కషాయము, ద్రావకము.there is a * of malice in his letter వాని జాబులో కొంచెము ద్వేష రసము వున్నది. * of cloves లవంగ ద్రావకము, లవంగ కషాయము. * of pepper మిరియాలద్రావకము, మిరియాల కషాయము.
Tinctured adj imbued వ్యాపించిన, ప్రసరించిన, ఎక్కిన. water * with saffronపసుపు వర్ణము గల నీళ్లు. remarks * with malice చలము యభక్క వాసన గలమాటలు అనగా చలము అగుపడే మాటలు. the manners of the pupils weresoon * by the discipline of the teachers ఉపాధ్యాయుల గుణములుపిల్లకాయలకు ప్రసరించినవి.
Tindal n s ( Indian word for a boatswain ) తండేలు, అనగా పడవలవాండ్లమేస్త్రీ.
Tinder n s చెకుముకి దూచి. burnt cloth కాలి చెక్కు చెదరకుండా వుండే గుడ్డ.China paper is a mere * చీనా కాకితము యేమి బలము లేక వుల్లి పొరవలె వుండేటిది.the cloth was burnt to * ఆ గుడ్డ కాలి గుడ్డ రీతిగానే వుండినది. the book wasburnt to * ఆ పుస్తకము కాలిపోయినది.
Tinderbox n s చెకిముకి దూదిబుర్ర.
Tinge n s రవంతాచాయ, లేచాయ, ఈషద్వర్ణము. these mangoes have a red *యీ మామిడి పండ్లు కొంచెము యెర్రగా వుంటవి. at night there was a * of red inthe west రాత్రి పడమట కొంచెము యెర్రదాళువుగా వుండినది.
Tingling n s గలగలమనే ధ్వని, జలపరించడము, కింకిణీ స్వనము. they heard the* of bells గంటలు గణగణమనగా విన్నారు. the * of the ears చెవుల దిమ్ము. the *of the skin వొళ్లు జలపరించడము, గగుర్పొడవడము.
Tinker n s తపిలె చెంబులు మాట్లు వేసే కంచరవాడు.
Tinkerin gadj mean, pitiful, paltry, wretched నీచమైన, క్షుద్రమైన,దిక్కుమాలిన, దిబ్బైన.
Tinkering n s మాటువేయడము, దిద్దడము.
Tinkle n s or tinkling గలగల, గణగణ, శింజితము.
Tinman n s సత్తపిలెలు చేసేవాడు, చీనాతపిలెలు చేశేవాడు, చీనా రేకుల పని చేశేవాడు.
Tinning n s సీసము పూయడము. by * the kettles he made them as goodas new ఆ తపిలెలకు కళాయి పూశి కొత్తదిగా చేసినాడు.
Tinsel n s కాకి బంగారు. this is mere * ఇది వట్టి పై జంభము. in poetry పిచ్చిఉత్ప్రేక్ష.
Tint n s వర్ణము, చాయ, రంగు. a reddish * చెంగావి, నీరుకావి. a changing blue* వైడూర్యవర్ణము, పిల్లిగుడ్డు వర్ణము. a bluish * ఆకాశవర్ణము. a dark * కప్పు,మేఘవర్ణము. a lighter * లేజాయ.
Tiny adj little; small చిన్న, స్వల్పమైన, కొద్ది, రవంత, యిసుమంత. a * birdరవంత పిట్ట. the muskito ( that * wolf ) preys on man at pleasure మిక్కిలిస్వల్పాకారము గల గోద అనే తోడేలు మనుష్యులను పెరుక్కొని తింటున్నది.
Tip n. s. top; end; point కొన, మొన,చివర,అగ్రము, the * of the noseనాసాగ్రము. the * of the tongue కొన నాలుక. the * of the ear కొన చెవి. thelower * of the ear చెవి మొదలు. deer's horn's *s జింక కొమ్ముల మొనలు. Ihave it at the * of my tongue ఆ మాట నోట్లో ఆడుతున్నది గాని చెప్పడానకురాలేదు. a ferrule on a stick కర్రకు వేసిన పొన్ను.
Tippet n s something worn about the neck మెడకు కట్టుకొనేటిది, మెడమీదకప్పుకొనే వస్త్రము, జాతి స్త్రీలు భుజము మీద వేసుకొనే వస్త్రము, సుప్రీం కోర్టు జడ్జీలు, బిషప్పులు ధరించుకొనే వస్త్రము.
Tippler n s తాగుబోతు, కల్లు తాగేవాడు, సురాపాయి.
Tipsiness n s సొక్కు, మత్తు, మయికము.
Tipstaff n s an officer బంట్రోతు.
Tipsy adj మత్తెక్కిన, తాగి మైకముగా వుండే.
Tiptoe n s the end of the toe కాలి వేలి మొన. to stand on * కాలి కొన వేలిమీద నిలుచుట. to walk on * కాలి కొన వేలిమీద నడుచుట. they were all on *with delight వారందరు వుల్లాసముగా యెదురు చూస్తూ వుండినారు.
Tirade n s a discharge of guns చివచివలేచే వేట్లు శరపరంపరలు. a * ofabuse శరపరంపరలుగా తిట్టే తిట్లు.
Tire n s ( head dress ) శిరోభూషణము, అవతంసము.
Tired adj డస్సిన, విసికిన, అలసిన, వేసారిన. being * of this business యీ పనిమీద విసుకు పుట్టినది గనక.
Tireless adj విసకని.
Tiresome adj wearisome; fatiguing విసుకుపుట్టించే, అలసట పుట్టించే, తొందరైన,సంకటమైన. a * task పీకులాటపని. a * hussey తుంటగొడ్డు.
Tiresomeness n s act or quality of being tiresome ప్రాణమును విసికించేగుణము. from the * of the business అది ప్రాణము విసికే పని గనక.
Tirewoman n s a woman whose business is to make dresses for thehead సైరంధ్రి, దొరసాని తలదువ్వి శృంగారించే పనికత్తె.
Tis (contraction of itis) Tiswrongతప్పినది, tishisఅతనిది
Tisan n s తాగే నీళ్ళు, వేణ్నీళ్ళు, గంజి, కషాయము, పానకము.
Tissue n s cloth interwoven with gold or silver, or figured withcolours సాదరా, తగిడి, జరీబట్ట. It is a * of blunders ఇది వట్టి తప్పుల తడక.
Tissued adj చిత్రవిచిత్రమైన.
Tit n s a small horse చిన్న గుర్రము. a small bird చిన్న పిట్ట. * for tatసరికిసరి, యీడుకు యీడు, ప్రతికి ప్రతి.
Titan n s రాక్షసుడు.
Titania n s తిలోత్తమ ( Says Gilchrist ) చిత్రరేఖ.
Titbit n s nice food సుభోజ్యము, ఉత్తమ భోజ్యము, మంచి పదార్థము.
Tithe, Tithes n s. దశమాంశము, పదో భాగము, దశబంధము, అనగా వాడివాడికి వుండేజంగమ సొత్తులలో గురువుకు యివ్వవలసిన పదో భాగము, కాపులు గురువుకు యిచ్చేసర్వాదాయ దశమ భాగము.
Tithing n s తుకిడి, తాలూకా.
Tithingman n s కరణమువంటి వొక విధమైన వుద్యోగస్థుడు.
Titillation n s tickling చక్కిలి గింత. the snuff caused a * in his noseపొడివల్ల వాడి ముక్కులో గురుగురమని వుండినది.
Titlark n s a bird చిన్న వొక పిట్ట పేరు.
Title n s a name పేరు, నామము, ఆఖ్య. * of honour పట్టపు పేరు, కితాబు. whatis the * of this book ? యీ పుస్తకము పేరు యేమి. how do they write his *? వాడికి పై విలాసము యెట్లా వ్రాస్తారు. the king gave him this * రాజు వాడికి యీపేరు యిచ్చినాడు. Hyder was his name, Bahadur was his * వాడికి పేరుహైదరు, బహదరు అనేది కితాబు, బిరుదు. toconfer a * అధికార పత్రిక యిచ్చుట,పట్టము కట్టుట. a claim of right బాధ్యత, స్వతంత్రము. he has no * to the landఆ నేలకు వాడికి బాధ్యత లేదు. an inscription పీఠిక.
Titled adj పేరుగల.
Title-page n s ముఖపత్రిక, పుస్తకము యొక్క నా మాది సూచక ప్రథమ పత్రిక. the* of this book is gone యీ గ్రంథము యొక్క పేరు మొదలైనవి తెలిశే మొదటికాకితము పోయినది. at this time the Hindus do not use *s ఇప్పట్లోహిందువులు గ్రంథములకు నామాది సూచక ప్రథమ పత్రికలు పెట్టేదిలేదు.
Titmouse n s a small bird పికిలిపిట్ట, గిజిగాడువంటి వొక చిన్న పక్షి.
Titter n s a restrained laugh ముసిముసి నవ్వులు.
Tittle n s పొల్లు, స్వల్పగురుతు, రవంత గురుతు. there was not a * ofevidence సాక్ష్యము రవంతైనా లేదు. he performed it to a * తూచా తప్పకచేసినాడు, అరకొరలేకుండా నెరవేర్చినాడు. In Matt. V. 18. ఏకామాత్రాబిందురేకశ్చ. A+.
Tittle-tattle n s idle talk పిచ్చి సుద్దులు.
Titular, Titulary adj nominal పేరుకు మాత్రముగా వుండే. a * bishop పేరుకుబిషపుగా వుండేవాడు. he is the * baron పేరుకు మాత్రము జమీందారుడుగా వున్నాడు.
To v n మొలుచుట, చిగిరించుట. after the rice *edవడ్లు, మొలిచిన తర్వాత. sprouting corn మొలక యెత్తే పైరు. sprouting breasts మొలక చన్నులు.
To Disarm v a ఆయుధాలు తీసివేసుట, నిరాయుధుణ్నిగా చేసుట.చెయ్యెత్తకుండా చేసుట, పండ్లు పెరుకుట. they *ed him అతని ఆయుధాలుతీసివేసినారు. these words *ed him అతని ఆయుధాలు తీసివేసినారు.these words *ed him యీ మాటలు విని అణిగిపోయినాడు, చెయ్యెత్తలేకపోయినాడు.యీ మాటలు విని వెనక్కు తీసినాడు. this behaviour of hers *ed himఆమె యిట్లా చేసేటప్పటికి అట్టే అణిగి వూరికె వుండినాడు. at thisvillage the peacocks * the people by confiding in them యీ వూళ్లోనెమళ్లు మనుష్యులను నమ్మినందున వాండ్లు వాటి తెరుపు పోవడములేదు. this medicine *ed the fever యీ మందు జ్వరమును అణుస్తున్నది.
To Disinfect v a అంటురోగమును పొగొట్టుట. to * thelinen they put it on the fire అంటురోగ సంబంధములేకుండా చేయడమునకై గుడ్డను వెల్లాయిలో పెట్టుతారు.
To Accede v n సమ్మతించుట, ఒప్పుట, అంగీకరించుట.
To Despoil v a కొల్ల బెట్టుట, దోచుకొనుట. they *ed him of hisgoods వాడి ధనమును దోచుకున్నారు.
To Detract v n హానిచేసుట, తక్కువ చేసుట, నిందకట్టుట, దూరుచేసుట, గేలిచేసుట, చాడి చెప్పుట. this *s from his merit యిది వాడి యోగ్యతకు హానిచేస్తున్నది. why should you * fromhis merit వాడి యోగ్యతను గురించి తక్కువగా యేలమాట్లాడుతావు.
To Devise v a to contrive యుక్తిచేసుట, కల్పించుట, పన్నుట.to bequeathor to bestow by will మరణశాసన పూర్వకముగా యిచ్చినది.
To Devote v a వొప్పగించుట, ఆర్పించుట, సమర్పించుట.వినియోగపరుచుట, మీదికట్టుట, నియమించుట. he *d his son to thearmy కొడుకును దండువుద్యోగానికి నియమించినాడు. he *d his estateto the poor వాడి ఆస్తిని బీదలపాలు చేసినాడు. he *d his nightsto study వాడు రాత్రిళ్లు చదువేగతిగా వుండినాడు. he *d himself to her వాడికి దానిమీదనే ధ్యానము, దాని మీదనే లోకము. they *dtheir talents to acquiring science తమ యావత్తు శక్తిన్నిన్ని శాస్త్రాభ్యాసములోనే వినియోగపరిచినారు.
To Dibble n a తవ్వుట, తవ్వాటము పెట్టుట, కుళ్లగించుట.
To Disabuse v a భ్రమనివారణముచేయుట, పొరబాటు తీర్చుట.he *d me regarding them వాండ్లను గురించి నేను పడ్డ భ్రమతీర్చినాడు.I will * you about it దాన్ని గురించి నీకు వుండే కళంకమునునివారణము చేస్తాను, నీవు పడ్డ భ్రమను అగుపరుస్తాను, నీవుపడ్డపొరపాటును తెలియచేస్తాను.
To Disbelieve v a నమ్మకపోవుట, అపనమ్మికపడుట.
To Disburse v a శెలవుచేసుట, వ్రయము చేసుట, వినియోగముచేసుట.
To Discharge v a వేయుట, విసర్జించుట. to performనెరవేర్చుట. he is very punctual in *ing his duty తన పనినిబహుక్రమముగా చూచేవాడు. To * a servent తోసివేసుట. To *a debt చెల్లించుట, తీర్చుట. to * a gun కాల్చుట. he *d an arrow at me నా మీద బాణము వేసినాడు. he *eda blow at me, but it did not touch me నన్ను గుద్దవచ్చినాడుగాని ఆగుద్దు నాకు తాకలేదు. this acid *d the colour యీ పులుపుచేత ఆవన్నె యెత్తిపోయినది. he *d hius wrath on them వారిమీద వుండే ఆగ్రహమును వెళ్లకక్కినాడు. the ship *d her cargo hereఆవాడ సరుకు యిక్కడ దిగుమతి యైనది. the boil *d much matterఆపుంటిలోనుంచి చీమునిండా కారినది. the flood *d itself intoa cavern ఆ ప్రవాహము గుహలో చొచ్చినది, ప్రవేశించినది.the blood *d from the wound ఆ గాయములో నుం చి కారిన నెత్తురు.
To Discourse v n మాట్లాడుట, సంభాషించుట, ప్రసంగముచేసుట.
To Discredit v a నమ్మకపోవుట. they *ed this story యీ కథనువాండ్లు నమ్మలేదు. he *ed us అతడు యీమాటను నమ్మలేదు.
To Discriminate v a భేదమేర్పరచుట, వ్యత్యాసమగుపరుచుట,వివేచించుట. how do you * between these two యీ రెంటిలోభేదమేమి అగుపరుస్తావు. you must * between these twoయీ రెంటికన్న వుండ భేదమును కనుక్కోవలసినది.
To Disenchant v a దిగదుడుపు చేసుట, ప్రతిమంత్రము చేత నివారణముచేసుట, భ్రమ నివారణముచేసుట. this has quite * ed him యిందు చేత వాడికి వివేకము వచ్చినది. poverty *ed him దరిద్రముచేతవాడి ధనమదము పోయినది.
To Disencumber v a యిబ్బంది లేకుండా చేసుట, చిక్కులేకుండాచేసుట, సుళువు చేసుట.
To Disengage v a విడతీయుట, విడిపించుట, ప్రత్యేకముచేయుట.I cannot * this knot యీముడిని నేను విచ్చలేను. he *d himselffrom these pursuits వాడు ఆ పనులను మానుకొన్నాడు.
To Dish v a పళ్లెములో వుంచుట, వడ్డించుట. she *ed thedinner ఆహారాన్ని తట్టలో వడ్డించి నది. he was completely* వాడు బొత్తిగా చెడిపోయినాడు, వాడి పుట్టి ముణిగినది.
To Dishearten v a ధైర్యమును చెడగొట్టుట, అధైర్యపరుచుట.
To Disincline v a అసహ్యము పుట్టించుట, మనసువిరుచుట.this *d me to assist him యిందువల్ల వాడికి సహాయముచేయడానకు నా మనుసు విరిగిపోయినది. he is *d to comeవాడికి రావడానకు సమ్మతిలేదు.
To Disinthral v a నివారణముచేసుట, విమోచనము చేసుట.
To Dismantle v a విప్పుట, పెళ్లగించుట, ఛిన్నాభిన్నముచేసుట,చెడగొట్టుట, పాడుచేసుట. they *d the fort ఆకోటను పడకొట్టినారు.
To Dismast v a స్తంభరహితము చేసుట, స్తంభములను కొట్టి పాడుచేసుట.they *ed the vessel వాడ స్తంభములను దించివేసినాడు. the strom*ed the vessel గాలివాన చేత ఆ వాడ స్థంభములు విరిగి పాడైనవి.
To dismay v a భయపెట్టుట, బెదిరించుట, దిగులుపరుచుట.
To dismember v a ఛిన్నాభిన్నము చేసుట. they have *ed thisstory యీకథలో యిక్కడ వొక ముక్క అక్కడ వొక ముక్కనుచెప్పినారు. the Mahomedan empire is now *ed తురక రాజ్యముఛిన్నాభిన్నమైపోయినది. his estate was *ed వాడి ఆస్తి చిన్నాభిన్నమైపోయినది.
To Dismount v a దించుట. the ball *ed thisstone ఆ గుండు తగిలి యీ రాతిని కిందికి తోసినది. the general*ed the cavalry సేనాధిపతి గుర్రపు సవార్లకు గుర్రము మీద నుంచిదిగమని వుత్తరవు చేసినాడు.
To Dispeople v a నిర్మానుష్యము చేసుట, ప్రజాక్షయము చేసుట,పాడుచేసుట.
To Disperse v a చెదరగొట్టుట, యదాయదలుచేసుట, వెదచల్లుట.he *d the enemy శత్రువులను పటాపంచలై పొయ్యేటట్టు చేసినాడు.the wind *s the clouds గాలి మేఘములను చెదరకొట్టుతున్నది.newspapers * intelligence throughtout the country సమాచారపత్రికలుసమాచారమును దేశమంతా ప్రకటింపచేస్తుంది. he *d his goods to thepoor తన సొత్తులను పేదలకు వెదచల్లినాడు.
To Disport v n ఆడుట, క్రీడించుట.
To Distill v n కారుట, స్రవించుట. tears *led from hereyes దాని కంట్లో నీళ్లు బొట్లు బొట్లుగా కారినది.
To Divaricate v a ద్విభాగముచేసుట.
To Diverge v n వ్యాపించుట, అనగా సూర్యకిరణములవలె వకచోటనుండి నాలుగుతట్లా వ్యాపించుట, ప్రసరించుట, పాయలుగాపోవుట, చీలుట, వేరుపడుట. the road here * s యీ దారియిక్కడ చీలుతున్నది. the poet here *s into a new subject కవి యిక్కడ కొత్త ప్రస్తావమును ఆరంభించినాడు. the rays of the sun * సూర్యకిరణములు నల్దిక్కులా వ్యాపిస్తున్నవి.
To Double v n ద్విగుణమౌట, రెట్టింపౌట, రెండింతలౌట,the noise *d ధ్వని రెండింతలైనది. the rat *d to elude thecat పిల్లిని తప్పించుకోవడమునకై ఆ యెలుక లటుక్కున మళ్లుకొనిపరుగెత్తినది.
To Doubt v n సందేహపడుట, సంశయపడుట, అనుమానపడుట.I *ed if he was gone వాడు పోయినాడో, లేదో నాకు సంశయముగావున్నది. why should you * about this యిందుకు నీ వేల శంకిస్తావు.
To Drain v a వడియకట్టుట, వడియజేసుట, అలుగుతీసుట,తూముతెరుచుట. he *ed the well ఆ బావిలో నీళ్లంతా వడియచల్లినాడు. he *ed the treasury ఖజానాలో దుడ్డు లేకుండాచేసినాడు. the war *ed their resources ఆ యుద్దముచేతవాండ్లదగ్గెర వుండిన దుడ్డంతా వడిసిపోయనది.
To Embrue v a తడుపుట. he *d his hands in blood ఘాతకుడైనాడు.I will not * my hands in their blood ఆఘాతుకానికి నేను వొడికట్టను.
To Fire v a to kindle. నిప్పుబెట్టుట, రగలబెట్టుట, తగలబెట్టుట.to * a gun ఫిరంగి కాల్చుట. dirnking *s the blood తాగడముచేతకాక పుట్టుతున్నది. he *d the horse గుర్రమునకు వాతవేసినాడు.
To Fix v a స్థాపించుట, నాటుట, నిలుపుట, నియమించుట, నిశ్చయించుట.he *ed his eyes upon her దాన్ని నిదానించి చూచినాడు. he *ed his thoughtsupon her వాడి మనసునంతా దాని మీదనే పెట్టినాడు. he *ed the post inthe ground ఆ స్తంభమును పాతినాడు. he *ed a nail in the wall గోడలలోచీలను కొట్టినాడు. I *ed the hook to the door ఆ తలుపుకు చిలుకునుకొట్టినాను. they *ed a price upon the rice ఆ బియ్యానికి వొక వెల నిర్ణయించినారు. they *ed upon Monday for the marriage ఆ పెండ్లికి సోమవారమునునిశ్చయించుకొన్నారు.
To Forejudge v a ముందాలోచనచేసుట, ముందు విమర్శ చేసుట.
To Forswear v n శపథము చేసి తప్పుట, తప్పుసత్యము చేసుట, తప్పు వొట్టుపెట్టుకొనుట. they forswore wine యికను సారాయి తాగేదిలేదని శపథముచేసుకొన్నారు. I * eating with him యికను వాడితోకూడా భోజనముచేసేదిలేదని శపథము చేసుకొన్నాను. they forswore themselvesవాండ్లు ప్రమాణము తప్పినారు.
To Garrison v a దండును పెట్టుట, ఠాణా పెట్టుట. he *edthe town ఆ వూరిలో దండును పెట్టినాడు.
To Gather v a కూర్చుట, చేర్చుట, పోగుచేసుట, కూడబెట్టుట.సంగ్రహించుట. he *ed some news in the town వూరిలోకొంచెము సమాచారములను తెలుసుకొన్నాడు. I do not * the senseఆ తాత్పర్యము నాకుచిక్కలేదు. to * flowers or fruits కోసుట.he stopped to * breath గుక్కతిప్పుకోవడానకై నిలిచినాడు.the tailor *ed up the cloth కుట్రపువాడు ఆ గుడ్డనుకుచ్చె పట్టినాడు, చుంగుపట్టినాడు. he *ed himself upకాళ్లూ చేతులంతా ముడుచుకొన్నాడు, ముణుక్కొన్నాడు.
To Gee v n to go on to proceed చెల్లుట,సాగుట.(Johnson)యిది నీచమాట.
To Gem v a రత్నఖచితముచేసుట, మణిమయముచేసుట.
To Giggle v n ముసిముసినవ్వులు నవ్వుట. you must not * in school పల్లెకూటములో ముసి ముసి నవ్వులునవ్వరాదు.
To Glare v n కండ్లుచెదిరేటట్టు, మెరుసుట, కండ్లుమిరిమిట్లుకొనేటట్టు మెరుసుట, తళతళలాడుట.the tiger *d at him ఆ పులి వాన్ని వురిమి చూచినది.
To Grasp v a పట్టుకొనుట.
To Guggle v n to See to Gurgle.
To Illume v a ప్రకాశింపచేయు, జ్ఝానముకలుగచేయుట.
To Link v a జోడించుట, తగిలించుట. (Milton's L' Allegro line 140)
To Lodge v a వుంచుట, పెట్టుట, దించుట. I *d the money with him ఈ రూకలను వాడి దగ్గెర పెట్టినాను. I *d them in my house వాండ్లను నాయింట్లో దించుకొన్నాను. వాండ్లకు నాయింట్లో చోటు యిచ్చినాను. he *d a complaint against me నామీద ఫిర్యాదు చేసినాడు.he *d the box on the wall ఆ పెట్టెను గోడమీదికి యెక్కించినాడు,గోడమీద పెట్టినాడు. he *d his spear in the hog's neck బల్లెమును పంది మెడమీద వేసినాడు.
To Loll v n సోమారితనముగా వౌరుగుకౌని వుండుట. do not * sit up సోమారితనముగా వొరుక్కొని వుండక బాగా కూర్చుండు.
To Smuggle v a to import or export goods without playingthe customs సుంకము చెల్లించకుండా దొంగతనముగా సరుకును తీసుకొని పోవుట. To manage or convey secretely. They *ed these things into the country ఈసరుకులకు సుంకము చెల్లించకుండా దొంగతనముగా వూళ్ళ మీద తీసుకొని పోయినారు. they *d the woman into the house దాన్ని దొంగతనముగా లంకించుకొని వచ్చినారు.
To Sweep v n to pass with violence వడిగా పోవుట. the armyswept along దండు వడిగా పోయినది. the breeze that *s along the hill కొండమీదికి కొట్టే గాలి. the meadow that *s down to the edge of the lake ఆ మడుగు దాకా పొయ్యే పసరికబయలు.
To .Alienate v a తిప్పుట, పరాధీనము చేసుట, మనస్సు విరుచుట. they alienatedhim from me అతనికి నామీద మనస్సు విరిగేటట్టు చేసినారు.
To ????? v a చేతితో కొట్టుట. he slaped her on the shoulderదాని భుజము మీద చేతితో తట్టినాడు, కొట్టినాడు.
To ?????? v n పారిపోవుట, ఉరుకుట. the ship was scudding along వాడ బహువడిగా పోతు ఉండెను.
To ????????? n a to throw lossely about to sprinkle చల్లుట,వెదచల్లుట. to dissipate or disperse పోగొట్టుట, వెళ్లగొట్టుట, పారదోలుట. this *ed the thieves ఇందువల్ల దొంగలు మూలకొకరుగా పారిపోయినారు.
To ????????????? v n to sparkle, to emit sparks ప్రకాశించుట.
To 0Kid v n ఈనుట, పిల్ల వేసుట, యిది మేకను గురించినమాట. the goat has *ded ఆ మేక యీనింది.
To Abalienate v a పరాధీనము చేసుట. Abalienation, n. s. పరాధీనము.
To Abandon v a విడిచిపేట్టుట, పరిత్యాగము చేసుట, వర్జించుట, త్యజించుట,మానుకొనుట. She abandoned herself to grief అని వ్యసనమునకు పాలైనది. heabandoned her దాన్ని చెయి విడిచినాడు.
To Abase v a వంచుట, అణుచుట, అవమానపరచుట, భంగపరచుట.
To Abate v a తగ్గించుట, తక్కువచేసుట.
To Abbreviate v a సంక్షేపము చేసుట, సంగ్రహము చేసు, సంకేతాక్షరముగా వ్రాసుట,అనగా, రాజమాన్య రాజశ్రీ అని వ్రాయడమునకు బదులుగా, రా|| రా|| అని వ్రాసినట్టు.
To Abdicate v a త్యజించుట, వర్జించుట, విడిచిపేట్టుట, వదులుకొనుట. the king *dthe kingdom రాజు రాజ్యమును త్యజించి పోయినాడు, విడిచిపెట్టిపోయినాడు.
To Abet v a సహాయము చేసుట, అనగా దుర్మార్గమునకు సహాయము చేసుట.
To Abhor v a అసహ్యపడుట, చీదర పడుట. he *s it అది వాడికి చీదర, అది వాడికిఅసహ్యము.
To Abide v n ఉండుట, నివాసము చేసుట, కాపురము వుండుట. or to remainస్టాయిగా వుండుట, స్టిరముగా వుండుట. his grace abode upon them ఆయనఅనుగ్రహము వారియందు వుండెను. he abode at home యింట్లో వుండినాడు. theearth abideth for ever భూమి శాశ్వతముగా వుంటున్నది, స్థిరముగా వుంటున్నది. heabode with them వాండ్లతో కూడా వుండినాడు, కాపురము వుండినాడు. I shall * byyour decision తమ తీర్పు ప్రకారము నడుచుకొంటాను. he abode by his formerdecision వాడు మనుపు చెప్పిన తీర్పులోనే నిలిచినాడు.
To Abjure v a to renounce upon oath, to reject, పరిత్యాగము చేసుట.ప్రమాణ పూర్వకముగా విడిచిపెట్టుట, శపథముచేసుట.
To Abolish v a ఎత్తివేసుట, తోసివేసుట.
To Abominate v a అసహ్యపడుట.
To Abound v n విస్తారముగా వుండుట. this country *s with mangoes ఈదేశములో మామిడిపండ్లు విస్తారము.
To Abridge v a సంగ్రహము చేసుట, సంక్షేపము చేసుట. or to diminish తగ్గించుట.he *d the statement వాడు ఆ సంగతిని సంగ్రహము చేసినాడు. this rule *d thepower of the Magistrate యీ చట్టము చేత పోలీసువారికి అధికారము తగ్గినది.
To Abrogate v a కొట్టివేసుట, తోసివేసుట.
To Abscond v n ముఖముతప్పించుట, పారిపోవుట, పలాయనమవుట.
To Absent v a లేకుండా చేసుట. he *ed himself లేకుండా వుండినాడు.
To Absolve v a విమోచనము చేసుట, విముక్తిచేసుట. the priest *ed him పాదిరివాడి పాపవిమోచనము చేసినాడు.
To Absorb v a పీల్చుట, ఈడ్చుట, ఆకర్షించుట. the sand *ed the waterయిసుక నీళ్ళను యీడ్చుకొన్నది.
To Abstain v n మానుకొనుట, వదులుకొనుట, వర్జించుట. he *ed from drinkingfor two days రెండు దినములుగా తాగడమును మానుకొన్నాడు.
To Abstract v a సంక్షేపము చేసుట, క్రోడికరించుట, ఉటంకించుట. or to stealఅపహరించుట. or to separate ప్రత్యేకించుట. he *ed the book ఆ గ్రంథమునుసంక్షేపముగా చేసినాడు. he *ed his mind from earthly affairs ఐహికవ్యాపారముల మీద మనస్సును పారకుండా చేసినాడు.
To Abuse v a or to revile తిట్టుట, దూషించుట. or to use improperlyదుర్వినియోగము చేసుట. they * the charity funds అధర్మరూకలనుదుర్వినియోగము చేస్తారు, అన్యాయ వ్యయము చేస్తారు. he *d the opportunitygiven him చిక్కిన సమయాన్ని చెరుపుకొన్నాడు.
To Abut v n అనుకొనివుండుట. his house *s upon mine అతని యిల్లు నాయింటిని అనుకొని వున్నది, యిది యెప్పుడున్ను వెనక తట్టున వుండేదాన్ని గురించినది.
To Accelerate v a త్వరపెట్టుట, తీవ్రించుట.
To Accent v a ఒత్తిపలుకుట, ఊనిపలుకుట, ఒత్తుపలుకుకు గురుతు వేసుట.
To Accentuate v a ఉచ్చారణ క్రమముగా గురుతులు వేసుట.
To Accept v a అంగీకరించుట, పుచ్చుకొనుట, పరిగ్రహించుట, ఒప్పుకొనుట. he *edthe bill or draft ఉండిని వొప్పుకొని చేవ్రాలు చేసినాడు. he *ed homage దండముగైకొన్నాడు.
To Accommodate v a వసతి చేసుట, అనుగుణ్యపరచుట, సమాధానము చేసుట. Ican * you in my house మా యింట్లో నీకు వొక గుర్రము యిస్తాను. we must *ourselves to the times మనము కాలానికి తగినట్టు నడుచుకోవలెను. they *ed theaffair ఆ సంగతిని రాజీచేసినారు. the matter was *ed ఆ సంగతి రాజీఅయిపోయినది. Can you * men with ten rupees ? నాకు పది రూపాయలుసహాయము చేస్తావా, వొదుగుతావా. he *d himself to the customs of thesepeople వీండ్ల మర్యాడలకు అనుగుణ్యముగా ప్రవర్తించినాడు, వొద్దికగా నడుచుకొన్నాడు.
To Accompany v a వెంబడించుట, అనుసరించుట, కూడాపోవుట. I accompaniedhim to his house అతనితో కూడా అతని యింటికి పోతిని. his friendsaccompanied him for a short way out of the town అతని స్నేహితులుఅతణ్ని వూరిబయటికి సాగనంపిరి. a translation accompanies the letters ఆజాబులతో కూడా భాషాంతరము వున్నది. fever accompanies ague చలివెంట జ్వరమువస్తున్నది. he came accompanied by his wife భార్యాసమేతుడై వచ్చినాడు. aRamayanam accompanied by a commentary సవ్యాఖ్యానముగా వుండేరామాయణము.
To Accomplish v a నెరవేర్చుట, నిర్వహించుట, ఈడేర్చుట. he *ed the ancientprophecy పూర్వికులు జరగబోతున్నదన్నట్టు వీడివల్ల సంభవించినది.
To Accord v a or to bestow దయ చేసుట, ఆమోదించుట, అనుకూలించుట. he*ed his permission ఆయన సెలవు దయచేసినారు.
To Accost v a ఎచ్చరించుట, మందలించుట, పలకరించుట.
To Account v a యెంచుట, తించుట. they accounted him a fool వాణ్నిపిచ్చివాణ్నిగా యెంచినారు. they account him a prophet. అతణ్ని భవిష్యద్వక్తఅంటారు.
To Accountre v a ముస్తీబుచేయించుట. I accountred myself with a swordకత్తిని ధరించినాను, తొడిగితిని, సన్నద్ధము చేసుట. being accountred with a swordఖడ్గమును ధరించినవాడై. he accountnred his men తన సిపాయీలకు కావలసినముస్తీబు యిచ్చినాడు, అనగా పుడుపు ఆయుధములు మొదలైనవి.
To Accrue v n సంభవించుట, కలుగుట. the profits accruing therefromఅందువల్ల వచ్చే లాభము.
To Accumulate v a పోగుచేసుట, చేర్చుట. he accumulated much wealthనిండా రూకలు కూడ బెట్టినాడు.
To Accuse v a నిందమోపుట. they accused me of going there అక్కడికిపోయినానని నా మీద ఫిర్యాదు చేసినారు.
To Accustom v a అభ్యాసము చేసుట, అలవాటు చేసుట, వాడిక చేసుట, మరుపుట.he accustomed his son to swim కొడుకుకు యీత వాడిక చేసినాడు. heaccustomed himself to drink సారాయి తాగమరిగినాడు.
To Ache v n నొచ్చుట, సళుపుట, తీపుతీసుట. my legs * నా కాళ్లు నొస్తవి,తీపులు తీస్తవి.
To Achieve v a సాధించుట, పొందుట. he achieved the victory జయముపొందినాడు.
To Acknowledge v a వొప్పుట, అంగీకరించుట. Please to * the receiptప్రవేశము కనవలెను. I * that he is theif father but అతడు వాండ్ల తండ్రి వాస్తవ్యమేగాని.
To Acquaint v a యెరుక చేసుట, తెలియచేసుట. I acquainted him with thisదీన్ని అతనికి తెలియచేసినాను. * thyself with god దేవుణ్ని తెలుసుకో.
To Acquiesce v n వొప్పుకొని వుండుట, సమ్మతించుట, అంగీకరించుట. heaquiesced in this decision యీ తీర్పుకు సమ్మతించినాడు.
To Acquire v a సంపాదించుట, ఆర్జించుట. or to learn గ్రహించుట, నేర్చుకొనుట.he acquired a name మంచి పేరెత్తినాడు.
To Acquit v a దోషము లేదనుట, నేరము లేదని తీర్చుట. or to behave onesself నడుచుకొనుట. he acquitted himself very well బాగా నడుచుకొన్నాడు. heacquitted them of the robbery వాండ్ల మీద ఆ దొంగతనము లేదని తీర్పుచెప్పినాడు. I * you of a wrong intention in this యిందులో నీ దగ్గెరదురాలోచన వున్నదని నేను అనలేదు. he acquitted them of the murder but hedid not release them వాండ్ల మీద ఖూని నేరము లేదని తీర్పు చెప్పినాడుగాని విడుదలచేయలేదు.
To Act v a నటించుట, వేషము కట్టి ఆడుట. he acted the fool పిచ్చి వేషమువేసుకొన్నాడు, పిచ్చివాడుగా నటించినాడు. Last night she acted the queen అదిరాత్రి రాణివేషము కట్టింది. he acted the part of a father to them వాండ్లకు వాడుతండ్రివలే ప్రవర్తించినాడు. నడుచుకొన్నాడు. he acted the friend but in reality hewas an enemy of mine వాడు స్నేహితుడుగా నటించినాడుగాని వాడు నిజముగా నాకుశత్రువు.
To Actuate v a ప్రేరేపించుట. this actuated him to found a school వాడుపల్లెకూటము పెట్టడానకు యిది ప్రేరేపకమైనది.
To Adapt v a పొసగించుట, సరిపరచుట. he adapted his speech to theirminds వాండ్ల మనస్సుకు తగినట్టు మాట్లాడినాడు.
To Add v a చేర్చుట, కూర్చుట. he added that they will come tomorrowవాడు మరిన్ని చెప్పినదేమంటే వాండ్లు రేపు వత్తురు. he added that he wasastonished at this వాడు మరిన్ని చెప్పినదేమంటే, అందుకు తనకు ఆశ్చర్యమైనది. headded up the figures లెక్కకూర్చినాడు, వెరశివేసినాడు. Add to this, or besidesall this యింతేకాకుండా.
To Addict v a అలవరచుట, మరుపుట. he addicted himself to drinking, orto the bottle తాగ మరిగినాడు.to drinking, or to the bottle తాగ మరిగినాడు.they are addicted to stealing దొంగిలించ మరిగినారు. One who is addictedto women స్త్రీలోలుడు.
To Address v a to prepare ఉద్యోగించుట, ఆయత్తపడుట, వకణ్నిచూచి, లేక, వకణ్నిగురించి చెప్ప నుద్యోగించుట. I addressed my remarks to my brother, but Itook care that the rest should hear me మా అన్నను చూచి యీ మాటలుచెప్పినాను అయితే నేను చెప్పినది యితరులు వినవలెననే సుమీ. they utter abusewithout addressing any one ఫలానివారని నిర్దేశించక తిట్టుతారు, మొత్తముగాతిట్టుతారు. he addressed us and spoke for an hour మాకే మళ్ళి ఘడియ సేపుమాట్లాడినాడు. Men * their prayers to God దేవుణ్ని గురించి మనుష్యులు ప్రార్ధనచేస్తారు. To whom did he * the letter ఆ జాబుకు పై విలాసము యెవరి పేరటవ్రాసినాడు. he addressed a letter to me నాకు వక జాబు వ్రాసుకొన్నాడు. thebeggar addresses his cries to you బిచ్చగాడు నిన్ను చూచి మొరబెట్టుతాడు. thepriest addressed the congregation పాదిరి గుడికి వచ్చివుండే జనమును చూచిప్రసంగించినాడు. She spoke for a long time but addressed nobody శానాసేపు మాట్లాడింది గాని వకరిని చూచి మాట్లాడిందని లేదు. To whom did she * hersong యెవరు వినవలెనని పాడింది. he addressed a petition to them వాండ్లకుఅర్జి వ్రాసుకొన్నాడు, లేక మనివి చేసుకొన్నాడు. I addressed myself to him andasked aid అతణ్ని చూచి సహాయము చేస్తావా అని అడిగినాను, లేక, సహాయముచేయవలెనని అతనికి వ్రాసుకొన్నాను. they addressed themselves to cross theriver యేటిని దాటనుద్యోగించిరి, యత్నపడిరి. Being engaged he did not * me ; orhe did not * himself to me పనిలో వుండినందున నన్ను తల యెత్తి చూడలేదు. thisbook is addressed to children యిది పిల్లకాయలను గురించి చెప్పిన గ్రంధము.All these words are addressed to you యీ మాటలంతా నిన్ను గురించే.
To Adduce v a ఉదాహరించుట, తెచ్చుట. he adduced ten authorities forthis word యీ మాటకు పది ఉదాహరణములు తెచ్చినాడు. Can you * one proofof this యిందుకు ఒక రుజువు యివ్వగలవా.
To Adhere v n అంటుకొనుట, అనువర్తించి వుండుట. the paint adheres to theskin ఆవణ ్ము చర్మములో అంటుకొంటుంది. they adhered to him through allhis troubles వాడికి వచ్చిన పాట్లకంత వాణ్ని కరుచుకొనే వుండిరి. he adhered to therule చట్టమును అనుసరించినాడు.
To Adjoin v n చేరివుండుట, యిరుగు పొరుగుగా వుండుట. his ground adjoins tomine వాడి నేల నా నేలకు చేరికగా వున్నది.
To Adjourn v a మరి ఒక వేళ జరిగిస్తామని తత్కాలానికి నిలుపుట, నిలిపిపెట్టుట.they adjourned from the house to the market ఆ యింట్లో చాలించి అంగట్లోపోయికూర్చుని జరిగించినారు. this debate was adjourned to the next day యీప్రసంగమును మరునాడు జరిగిస్తామని నాటి దినానికి నిలిపినారు.
To Adjudge v a తీర్పుచేసుట, తీర్పు యిచ్చుట, విధించుట. they adjudged himthis punishment వాడికి యీ శిక్ష విధించినారు.
To Adjudicate v a తీర్పుచేసుట, తీర్పు యిచ్చుట, విధించుట.
To Adjure v a ఒట్టు పెట్టుట, ఆనబెట్టుట. he adjured me to do this నీవు యిట్లాచేయకపోతే నీకు వొట్టు అన్నాడు.
To Adjust v a దిద్దుట, సవరించుట, క్రమముగా పెట్టుట.
To Administer v a యిచ్చుట, చెల్లించుట, జరిగించుట. he administered thegovernment ప్రభుత్వమును చెల్లించినాడు. to * an oath ప్రమాణము చేయించుట.they administered punishment శిక్షచేసినారు. to * medicine మందు యిచ్చుట.to * consolation వోదార్చుట. to * justice న్యాయమును నడిపించుట. headministered to the estate చచ్చినవాని ఆస్తిని గురించి అతను విచారించుకొన్నాడు.
To Admire v a ఆశ్చర్యపడుట.
To Admit v a చేరనిచ్చుట, లోనికి రానిచ్చుట, అంగీకరించుట, ప్రవేశపెట్టుట. thishole would not * my hand యీ రంధ్రములో నా చెయ్యిపట్టదు. I admitted himinto my house వాణ్ని నా యింటిలోకి రానిస్తిని. I * that he is your son but youhad no authority to do this వాడు నీ కొడుకైనది సరే అయినప్పటికిన్నీ నీవు దీన్నిచేయడానికి అధికారము లేదు. the roof admits water యింటికప్పులోనుంచి నీళ్లులోనికి దిగుతుంది. the boat admits water ఆ పడవలోకి నీళ్లు యెక్కుతుంది. thecurtain admits mosquitos ఆ తెర గుండా దోమలు లోనికి వస్తవి. he admitteda scholar ఒక పిల్లకాయను చేర్చుకొన్నాడు. Justice will not admit of this యిదిన్యాయానికి వొప్పదు. the time will not * of this యిందుకు ఆ కాలము చాలదు.this admits of no excuse యిందుకు సాకు పనికిరాదు. this admits ofsuspicion యిందుకు అనుమానము తట్టుతుంది. this admits of hope యిందుకు ఆశకద్దు. this cannot be admitted యిది కారాదు, యిది కూడదు. Admitting forargument's sake that what you said was correct, still you had noauthority to punish her నీవు చెప్పినది న్యాయమని పెట్టుకున్నప్పటికిన్ని దాన్నిదండించడానకు నీకు అధికారము లేదు. Admitting that you wanted the house,was that any reason for your taking it by force ? ఆ యిల్లు నీకు యెంతకావలసి వుండినా సరే, నీవు బలాత్కారముగా దాన్ని తీసుకోవడానకు అది ఒక కారణమౌనా.Admitting that he had no right to beat his wife, still you have nobusiness to interefere వాడి పెండ్లాన్ని వాడు కొట్టడానికి స్వతంత్రము లేదనేపెట్టుకొన్నప్పటికిన్ని నీవు ఆ జోలికి పోవడానికి నిమిత్తము లేదు.
To Admonish v a బుద్ది చెప్పుట, బోధించుట.
To Adonize v. n. సింగారించుకొనుట, సొగసుగాబట్టలుఆభరణాలుతొడుక్కొనుట
To Adopt v a దత్తు చేసుకొనుట, అవలంబించుట. You have adopted hishabits వాడినడతలు నీకు పట్టుబడ్డవి. he adopted my advice నేను చెప్పిన బుద్ధినిఅవలంబించినాడు. I adopted another method నేను మరి ఒక మార్గమును పట్టినాను.
To Adore v a పూజ చేసుట, పూజించుట.
To Adorn v a అలంకరించుట, శృంగారించుట, she adorned herself withdiamonds రవల సొమ్ములు శృంగారించుకొన్నది. he adorned the room withpictures ఆ గదిని పటములతో శృంగారించినాడు.
To Adulterate v a కలిపి చెరుపుట. the meal was adulterated with chalkఆ పిండి సీమసున్నము కలిపి చెరపబడ్డది. the silver is greatly adulterated యీవెండినిండా కలపడమైపోయినది. this Telugu is adulterated with Hindustaniయీ తెలుగు తురకభాషా సంకరముగా వున్నది. adulterated silver కందువెండి.
To Advance v n ముందుకు వచ్చుట, ముందుకుసాగుట, అభివృద్ధియౌట. headvanced some steps కొన్ని అడుగులు ముందరికి వచ్చినాడు, పోయినాడు. the daywas now advancing యింతలో శానా ప్రొద్దాయెను.
To Advantage v n లాభము కలగచేసుట, ఫలము కలగచేసుట.
To Adventure v n తెగించుట, సాహసము చేసుట. See To Venture.
To Afford v a యిచ్చుట, కలుగచేసుట, నిర్వహించుట, నిభాయించుట. will you *me time నాకు సావుకాశమిస్తావా. I cannot * it so cheap నేను యింత చవుకగాయివ్వలేను. this afforded me an opportunity of reading the book ఆపుస్తుకమును చదవడానకు యిందువల్ల నాకు సమయము చిక్కింది. this food affordsno nourishment యీ ఆహారము బలము కలగచేసేటిది కాదు. this hill affords agood view of the town యీ కొండ మీద నుంచి చూస్తే ఆ పట్టణము బాగాఅగుపడుతుంది. It afforded his eyes a charming treat అది వాడి కండ్లకు పండుగఅయినది. this afforded him, some consolation యిది వాడికి కొంచేమువోదార్పును కలగజేసింది. this affords a reason for trusting him యిందువల్లవాడి మాట నమ్మడానికి హేతువ కలిగినది. this field affords or yields much riceయీ పొలము వరి బాగా పండుతుంది. I cannot * the money నేనంత రూకలుయివ్వలేను. he can afford to lose it అదిపోతే వాడికి బాధకము లేదు. the poorcannot * to buy fine clothes పేదవాండ్లు మంచిబట్టలు కొని నిర్వహించలేరు.
To Affranchise v a విడుదల చేసుట, విమోచనము చేసుట, బాపుట.
To Affright v a వెరిపించుట, జడిపించుట, భయపెట్టుట.
To Affront v a అవమానము చేసుట, తిరస్కరించుట, రేగేట్టట్టు చేసుట. Your letteraffronted him very much నీ జాబు అతనికి నిండా ఆయాసమును చేసినది.
To Agglomerate v a గుండుగా చేసుట, వుంటగా చేసుట, చేర్చుట, కూర్చుట.
To Agglutinate v a అంటించుట.
To Aggrandize v a గొప్పచేసుట.
To Aggravate v a అతిశయము చేసుట, అధికము చేసుట. this excuseaggravates your crime యీ సాకు నీ తప్పును అతిశయము చేస్తుంది. Or toirritate, egg on to a quarrel, tuant, యెత్తిపొడుచుట.
To Aggrieve v a దుఃఖపెట్టుట, బాధించుట.
To Agitate v a కదిలించుట, కలియబేట్టుట, కలవరబెట్టుట. this news agitatedhim యీ సమాచారము చేత కలవరపడ్డాడు. when they agitated this matter యీసంగతిని వాండ్లు కదిలించి నప్పుడు.
To Agonize v n వేదనపడుట, బాధపడుట, సంకటపడుట. But అల్లాడుట. is theexact word.
To Agree v n ఇముడుట, సరిపడుట, పొసగుట, గిట్టుట. they do not * wellవాండ్లకు ఒకరికొకరికి పొసగలేదు. he did not * with us వాడికి మాకు సరిపడలేదు,గిట్టలేదు. this place does not * with him or with his health యీ భూమి వాడివొంటికి సరిపడలేదు. we at last agreed upon one thing తుదకు ఒకటికిసమ్మతించినాము. the day is agreed on దినము యేర్పడ్డది, దినము కుదిరింది.
To Aid v a సహాయము చేసుట, ఉపకారము చేసుట, ఆదరించుట.
To Aim v n and v. a. లక్ష్యము పెట్టుట, గురి పెట్టుట, యత్నపడుట. when you *your gun you must hold it properly నీ తుపాకిని గురి పెట్టేటప్పుడు క్రమమముగాపట్టవలెను. what are you aiming at నీ యత్నముమేమి. these words * at youయీ మాటలు నిన్ను గురించినవి. he aimed at the bird but shot the beast పక్షిమీద గురి పెట్టి మృగమును వేసినాడు.
To Air ఆరబెట్టుట,గాలికిఆరబెట్టుట,గాలిసోకనిచ్చుట, he aired the wet paperby the fire అతడి కాగితమును శెగన కాచినాడు.
To Ake v n వొచ్చుట, తీపులుతీసుట, సళుపుట. See To Ache.
To Alarm v a భయపెట్టుట, ఎచ్చరిక చేసుట.
To Alight v a దిగుట, వాలుట.
To All v a నొప్పిచేసుట, బాధించుట, పీడించుట. something ails him that hecannot sit still వాడి వొంటికి యేమో వచ్చింది వాడు కుదురుగా కూర్చుండలేడు. whatails him వాడికి వొళ్లు యేమి. Nothing ails me నా వొళ్లు యేమిలేదు. what ailedyou to tell him వానితో చెప్పడానికి నీకు యేమి రోగము, నీకేమి పట్టింది.
To Allay v a ఉపశమనము చేసుట, శాంతి చేసుట, ఆర్చుట, మాన్పుట. thisallayed the pain యిందుచేత నొప్పి తగగింది, మట్టుపడింది.
To Allege v a చెప్పుట.
To Allegorize v n రూపకముగా చెప్పుట.
To Alleviate v a ఉపశమనము చేసుట, శాంతిచేసుట, లఘువుచేసుట.
To Allot v a విధించుట, నిర్ణయించుట, నిశ్చయించుట.
To Allow v a అంగీకరించుట, వొప్పుకొనుట, యిచ్చుట. they allowed me tenrupees a month for this యిందున గురించి నెలకు పది రూపాయలు నాకుశెలవిచ్చినాడు. why did you * him to go there వాణ్ని అక్కడ యేల పోనిచ్చినావు.I * that Iam his brother but why am I to pay this money నేను అతనితమ్ముణ్ని సరే గాని నేను ఆ రూకలు యివ్వవలసినది యెందుకు will you * that I amyour master నీకు నేను యజమానుణ్ని అవునా కాదా. If you pay me the principalI will * the interest నీవు అసలు చెల్లిస్తివా వడ్డి విడిచిపెట్టుతాను,తోసివేస్తాను. you must * for my being a stranger నేను కొత్త వాణ్ని గనుక మీరు మన్నించ వలసినది. I will buy the horse but you must * mefor the saddle గుర్రాన్ని కొనుక్కొంటాను గాని పల్లము నాకు వూరికే యివ్వవలేను.Do you * of this యిట్లా చేయనిస్తారా. such language is allowed is allowedof in women యిట్లా అనడము స్త్రీలకు సహజము. Calidasa has an allowedsuperiority over other poets యితర కవులకన్నా కాళిదాసు అతిశ్రేష్ఠుడని ప్రసిద్ధము.
To Alloy v a మట్టము చేసుట, కలపడము చేసుట, వన్నె తక్కువ చేసుట.
To Allude to v a సూచించుట, ఉద్దేసించుట. the story that he alluded toవాడు సూచించిన కధ. Do you know what he alluded to వాడి వుద్దేశ్య మేమో నీకుతెలుసునా.
To Allure v a ఆకర్షించుట, మోహింప చేసుట, మరులు కొలుపుట, రుచి చూపియీడ్చుకొనుట. a bait allures fish యెర చేపలను ఆకర్షిస్తుంది. the dog wasallured by the thieves to leave his master దొంగలు ఆ కుక్కకు రుచి చూపిదాని యజమానుణ్ని విడిచి అవతలికి పొయ్యేటట్టు చేసినారు. I was allured by hispromises అతని మాటలకు మోసపోతిని.
To Ally v a కూర్చుట, చేర్చుట, సంబంధము చేసుట. he allied himself to ourfamily మాతో సంబంధము చేసినాడు, వియ్యమందినాడు. five allied powersattacked France అయిదుమంది రాజులు వకటిగా కూడుకొని ఫ్రెంచిదేశము మీదికిపోయిపడ్డారు. this is allied to robbery దీన్ని దొంగతన మనవచ్చును.
To Alter v n మారుట, మారిపోవుట, వ్యత్యాసమవుట. his countenance alteredవాడికి మారుముఖము పడ్డది. his health altered for the better వాడికి వొళ్లుకొంచేము గుణముగా వున్నది. his health altered for the worse వాడికి వొళ్లుకొంచేము అవగుణముగా వున్నది.
To Altercate v a వాదించుట, పోరాడుట, జగడమాడుట.
To Alternate v n మార్చి మార్చి చేసుట, ఒకటి విడిచి ఒకటి చేసుట. In thisnecklace pearl alternates with coral యీ దండులో ఒక ముత్యము ఒకపగడముగా గుచ్చివున్నవి.
To Amalgamate v a మిశ్రమము చేసుట, లోహములను రసముతో మిశ్రమముచేసుట.
To Amass v a కూర్చుట, చేర్చుట, కూడబెట్టుట. he amassed much moneyనిండా రూకలు కూడబెట్టినాడు.
To Amaze v a ఆశ్చర్యపరచుట.
To Amble v n కుచ్చినడగానడచుట. an ambling nag కుచ్చినడగా నడిచేఅచ్చుమట్టము, గునుకునడగల గుర్రము. an ambling nymph ముద్దుగా నడిచే చిన్నది,గనగున నడిచే పడుచు.
To Ameliorate v a గుణపరచుట, బాగుపరచుట. Bathing ameliorated hishealth స్నానము చేత వాడికి వొళ్ళు గుణమైనది.
To Amend v a దిద్దుట, చక్కబెట్టుట, దోవకు తెచ్చుట, గుణపరచుట. this is wrongit must be amended యిది తప్పు దీన్ని దిద్దుపాటు చేయవలెను, చక్కబెట్టవలెను.
To Amerce v a విధించుట, శిక్షవిధించుట, అపరాధము విధించుట. they amercedhim in the sum of 10 rupees వాడికి పది రూపాయలు అపరాధము విధించినారు.
To Amount v n అవుట, వెరశియౌట. It amounted to a hundred rupees వెరశినూరు రూపాయలైనది, మొత్తము నూరు రూపాయలైనది. this amounts to murderయిది ఖూనిపని అవుతున్నది. this amounts to a permission యిది వుత్తరవైనట్టే,యిది వుత్తరవుకు సమానమై. this amounts to a refusal యిందువల్ల వోపనన్నట్టుతేలుతుంది, ఓప ననడములో పరివసిస్తున్నది.
To Amplify v a విస్తరించుట, పెంచి చెప్పుట.
To Amputate v a ఛేదించుట, అంగ ఛేదము చేసుట, వైద్యుడు కాలు చెయ్యి మొదలైనఅంగమును ఛేదించుటను గురించిన మాట.
To Amuse v a సంతోషపేట్టుట, ఉల్లాసపరచుట, వినోదపరచుట, వేడుకపరచుట. or tobeguile యేమార్చుట, బేలుపుచ్చుట. he is not in earnest; he is only amusingyou వాడు నిన్ను గురించి చేసేది వాస్తవ్యము కాదు, ఆట్లాటకు. he amused himselfwith her దానితో ప్రొద్దుపుచ్చు కొన్నాడు. I was much amused at hearing thisదీన్ని విని మహా నవ్వినాడు. an amusing book వినోదమైన పుస్తకము, నవ్వించేపుస్తకము.
To Analyze v a విభజించుట, పరిశీలించుట.
To Anathematize v a శపించుట.
To Anatomize v a అంగఛేదము చేసి విమర్శించుట, విభజించి విమర్శించుట.
To Anchor v a లంగరు వేసుట. the ship anchored here yesterday నిన్నఆవాడ యిక్కడ లంగరు చేసినది.
To Anger v a కోపము వచ్చేటట్టు చేసుట, రేచుట.
To Angle v n గాలపు చువ్వతో చేపలు పట్టుట. he angled in vain వాడు చేసినప్రయత్నము విఫలమైపోయినది.
To Animadvert v n ఆక్షేపించుట, ఖండించుట, చీవాట్లు పెట్టుట. I did not * tohis being there అతడు అక్కడ వున్నాడనే జ్ఞాపకము నాకు లేకపోయినది.
To Animate v a ప్రాణమును కలగచేసుట. the soul animates the body ప్రాణముదేహమునకు చైతన్యమును కలగచేస్తున్నది.to urge ప్రేరేపించుట, ప్రోత్సాహపరచుట.Love animated to do this మోహము చేత ప్రేరేపించబడ్డవాడై దీన్నిచేసినాడు. gratitude animates me to do this దీన్ని చేసేటట్టు కృతజ్ఞతనన్ను ప్రోత్సాహ పరస్తున్నది.
To Anneal v a గాజును నిప్పు కాకను చూపి పదును చేసుట.
To Annex v a కూర్చుట, చేర్చుట, జంటించుట.
To Annihilate v a నాశము చేసుట పాడుచేసుట, నిర్మూలము చేసుట.
To Announce v a చాటించుట, ప్రసిద్ధ పరచుట, తెలియచేసుట. he announcedtheir arrival to me వాండ్లు వచ్చి చేరినారని నాకు తెలియచేసినాడు.
To Annoy v a బాధించుట, వేధించుట, పీడించుట, తొందర పెట్టుట, ఉపద్రవపెట్టుట.
To Annul v a రద్దుచేసుట, కొట్టివేసుట, తోసివేసుట.
To Anoint v a చరుముట, అంటుట, అభ్యంజనము చేసుట, అభిషేకము చేసుట.
To Answer v a ఉత్సరము చెప్పుట, జవాబు చెప్పుట, ప్రత్యుత్తరము వ్రాసుట. Icalled and the echo answered నేను పిలిచినందుకు ప్రతిధ్వనే పలికినది అనగా వేరేపలికేవారు యెవరున్ను లేక పోయిరి. his son completely answered hisexpectations వాడి కోరికకు తగినట్టు వాడి కొడుకు ప్రయోజకుడైనాడు.
To Antedate v a ముందుతేది వేసుట. he antedated his letter వాడి జాబుకుముందు తేది వేసినాడు, అనగా పదోతేది వ్రాసి అయిదో తేది వేసినాడు.
To Anticipate v a ముందుగా తలచుట, ముందుమించుట, ముందుతీసుకొనుట,ముందుగ్రహించుట. I did not * this నా కిది తోచనేలేదు. the mother anticipatesthe child's wants బిడ్డకు కావలసిన దాన్ని తల్లి ముందుగా యెరిగి జాగ్రతచేసిపేట్టుతుంది. I * the objections which you may raise నీవు చేయబొయ్యేఆక్షేపణలను ముందుగానే గ్రహించినాను. why should you * evil యెన్నడో రాబొయ్యేదానికి యిప్పుడే యెందుకు యేడుస్తావు. we * happy results అనుకూలముకాబోతుందని యెదురు చూస్తున్నాము. he wanted to buy the horse but Ianticipated him ఆ గుర్రమును వాడు కొనుక్కోవలెనని వుండినాడు అయితే నేనుముందు మించుకొంటిని. he anticipated the income of the next year వచ్చేసంవత్సరపు వచ్చుబడిని ముందుగా తీసుకొన్నాడు.
To Ape v a అనుకరించుట. She apes the behaviour of an old womanముసలిదానివలే నటిస్తున్నది.
To Apologize v a అపరాధక్షమ చేసుకొనుట, సమాధానము చెప్పుట. apologizingfor the freedom I take అపరాధక్షమము.
To Apostatize v n మతభ్రష్టుడౌట. they apostatized వాండ్లు స్వమతమునువిడిచి భ్రష్టులైరి.
To Apostrophize v a ఒకడితో ప్రసంగిస్తూ వుండగా లటక్కున తిరిగి మరి ఒకడితోప్రసంగించుట.
To Appal v a భయపెట్టుట, దిగులు పరచుట, అడలేటట్టు చేయుట.
To Apparel v a తొడుగుట.
To Appeal v n మొరబెట్టుకొనుట, చెప్పుకొనుట, ఫిర్యాదు చేసుకొనుట, చేసిన తీర్పుసమ్మతి లేక పై న్యాయాధిపతి వద్ద ఫిర్యాదు చేసుకొనుట, ఉత్తర సభకు పోవుట. I * to youor to your justice or to your meryc తమరే నాకు గతి. I appeal to you doyou approve his conduct మీరు వినండి వాడు చేసినది మీకు బాగా ఉన్నదా. Iappeal to Johnson జా ్స ్ నిఘంటును చూతాము దాంట్లో యేట్లావుంటే అట్లా వొప్పుకొంటాను.
To Appear v n అగుబడుట, కనుబడుట, ప్రత్యక్షమౌట. It appears that they arenot there వాండ్లు అక్కడ లేనట్టు అగుబడుతున్నది తోస్తున్నది. the small poxappeared అమ్మవారు కన్పించినది. So it appears అలాగే అగుబడుతుంది. thedefendant did not * ప్రతివాడి హాజరుకాలేదు. a curious book appeared lastyear పోయిన సంవత్సరము వక చోద్యమైన గ్రంధము పుట్టింది.
To Appease v a శాంతిచేసుట, ఉపశమనముచేసుట. this water appeased histhirst యీ నీళ్ళు వాడి దాహమును అణిచింది, మాన్పింది. these words appeasedhis anger యీ మాటలు వాడి కోపమును అణిచింది.
To Append v a తగిలించుట, చేర్చుట, కూర్చుట.
To Appertain v n సంబంధించుట. that house appertains to him యీ యిల్లుఅయినది. this appertains to medicine యిది చికిత్స సంబంధమైనది. all these *to the same affair యివి అన్ని ఆ వ్యవహారముతో చేరినవి. It appertains to amaster to protect his servants సేవకులను రక్షించవలసినది యజమానుణ్నిపట్టినది.
To Applaud v a స్తుతించుట, కొనియాడుట, మెచ్చుకొనుట. they all applaudedwhat he said వాడు చెప్పిన దాన్ని అందరున్ను శ్లాఘించినారు.
To Apply v n సరిపడుట, ఉపయోగించుట, చెల్లుట, తాకుట. If you will not * youcannot learn శ్రద్ధలేకుంటే నీకు రాదు. he applied to me for the money నన్ను ఆరూకలు అడిగినాడు. that proverb does not * to him యీ సామిత వాడికి తగదు. orto request అడుగుట కోరుట or to study మనసు వుంచుట, ఆసక్తమై వుండుట. thisrule does not * here ఆ సూత్రము యిక్కడ వుపయోగించదు. he does not * tobusiness పనిలో వాడు శ్రద్ధగా వుండటము లేదు. your remarks do not * to meనీవు చెప్పిన మాటలు నాకు తాకలేదు.
To Appoint v a నియమించుట, నిష్కర్షచేసుట, విధించుట, యేర్పరచుట.
To Apportion v a పంచిపెట్టుట, పంచియిచ్చుట.
To Appraise v a వెలమతించుట, వెలయేర్పరచుట.
To Appreciate v a యెంచుట, గణించుట, న్యాయముగా విచారించుట. you do not* the advantages you enjoy నీకు వుండే క్షేమమును నీవు యెంచలేదు. I fully *his merits వాడి యోగ్యత నాకు బాగా తెలుసును.
To Apprehend v a to seize on or arrest పట్టుట, పట్టుకొనుట. tounderstand తెలుసుకొనుట, గ్రహించుట, కనుక్కొనుట. or to fear సందేహించుట,అనుమానించుట, భయపడుట. I * he is gone వాడు పోయినాడని తోస్తుంది. you havenothing to * నీవు భయపడవలసింది లేదు, నీకు మరేమి చింత లేదు.
To Apprentice v a పని నేర్చుకొనే కొరకై పిల్లకాయను వకడివద్ద విడుచుట.
To Apprize v a తెలియచేసుట, యెరుకచేసుట. when I apprized him of thisనేను దీన్ని వాడికి తెలియ చేసినప్పుడు. I was not apprized of this యిది నాకుతెలిసివుండలేదు.
To Approach v a దగ్గిరికి వచ్చుట, దగ్గిరికి పోవుట, సమీపించుట, తటస్థించుట.this approaches to a lie యిది అబద్ధము రీతిగా వున్నది.
To Appropriate v a to set apart నియమించుట, యేర్పరచుట. heappropriated this house to himself and the next one to his sister యీయింటిని తనకు పెట్టుకొన్నాడు పొరుగింటిని తన అక్కకు నియమించినాడు. heappropriated the money unlawfully ఆ రూకలను ఆక్రమించుకొన్నాడు. heappropriated the money to other purposes ఆ రూకలను అన్యధావినియోగపరచినాడు. they * this name to a particular tree ముఖ్యముగా ఒకచెట్టుకు యీ పేరు రూఢిగా చెప్పుతారు. the English * the word bird to a partridge యింగ్లిషువాండ్లు పక్షియనే శబ్దమునకు కవుంజుకు రూఢిగా చెప్పుతారు.
To Approve v a అంగీకరించుట, మెచ్చుట, సమ్మతించుట. he will never * thisఅతడు దీనికి యెన్నటికి వొప్పడు. he approved himself a good servant మంచిపనివాడని పేరు పడ్డాడు.
To Approximate v n సమీపించుట, అభిముఖమౌట, అనురూపమౌట, సదృశమౌట.
To Arbitrate v n తీర్చుట, తీర్పు చేసుట.
To Arch v a విలువంపుగా చేసుట. he arched his brows ఆశ్చర్యపడ్డట్టు పెద్దకండ్లు చేసినాడు. the cat arched her back పిల్లి వీపును విలువంపుగా వంచినది.
To Argue v n తర్కించుట, వాదించుట, న్యాయము చెప్పుట. Logic is the art ofarguing తర్కము, న్యాయశాస్త్రము, హేతువాదము చేసే శాస్త్రము.
To Arise v n లేచుట, ఉదయించుట, పట్టుట, కలుగుట, సంభవించుట. the birdarose పక్షి పైకి యెరిగింది. the sun arose సూర్యుడు వుదయించెను. the westwind arose పడమటి ఘాలి యెత్తింది. a poet arose ఒక కవి బయలుదేరినాడు. aquestion arises ఒక సందేహము పుట్టుతుంది. this arises from another causeయిది మరివొక హేతువుల్ల కలిగినది. they arose against him వాడి మీదికిలేచినారు. hearose from the dead చచ్చి బ్రతికినాడు.
To Arm v. a. ఆయుధమును ధరింపచేసుట, ఆయుధమిచ్చుట, he armed hisservants తన సేవకులకు ఆయుధము లిచ్చినాడు. he armed the cock with spursఆ కోడికి కత్తి కట్టినాడు. I armed him with a letter వాడికి ఒక జాబును రక్షకముగాఇచ్చినాను. the officer was armed with a warrant ఆ బంట్రోతు వారంటు అనేఆయుధము గలవాడై వుండెను. the Magistrate is armed with authorityagainst criminals ఖయిదీలను శిక్షించడమునకు మేజిస్త్రీటు వారికి అధికారము కద్దు. Acudgel armed with brass విత్తళిపొన్ను వేసిన కర్ర. the hawk is armed withclaws డేగకు గోళ్ళే ఆయుధముగా ఉన్నవి. he armed himself కవచముతొడుక్కొన్నాడు ఆయుధమును ధరించినాడు. he armed himself with a clubదండమును ధరించినాడు. he armed himself with patience శాంతమునుఅవలంబించినాడు. as the dog attacked him he armed himself with a chairకుక్క పైబడ వచ్చేటప్పటికి కుర్చీతో కొట్టపోయినాడు.
To Arouse v a లేపుట, నిద్రలేపుట, ప్రేరేపించుట, రేచుట. this aroused him toa sense of his duty యిది వాడు చేయవలసిన పనిని చేసేటట్టు ప్రేరేపించినది. hewent on till he aroused me i.e. enraged me నాకు కోపము వచ్చే వరకు చేస్తూవచ్చినాడు.
To Arraign v a తప్పు మోపుట. he arraigned them as thieves వాండ్ల మీదవాండ్లు దొంగలనే ఫిర్యాదు తెచ్చినాడు.
To Arrange v n ఏర్పడుట, క్రమపడుట, పరిష్కారమౌట. we arranged to gonext day మరునాడు పొయ్యేటట్టు యేర్పరచుకొన్నాము.
To Arrest v a నిలుపుట, అడ్డగించుట, ఆటంకముచేసుట, అడ్డము తగులుట,పట్టుకొనుట. this arrested my attention యిందుకు వెరగుపడితిని, ఆశ్చర్యపడితిని.
To Arrive v n చేరుట, ప్రవేశించుట. he arrived at this result తుదకు యిట్లానిశ్చయము చేసుకొన్నాడు.
To Arrogate v a వహించుకొనుట, తెచ్చుకొనుట. he arrogated this authority యీ అధికారమును నెత్తి పైన వేసుకొన్నాడు.
To Article v a వుంచుట, వొడంబడిక మూలముగా వుంచుట. I articled the boyto him వొడంబడిక మూలముగా ఆ పిల్లకాయను వాడి దగ్గెర విడిచినాడు.
To Articulate v n ఉచ్చరించుట. he could not * వాడు వుచ్చరించ లేడు.
To Ascend v a యెక్కుట, పైకి యెక్కుట, యెగురుట. they ascended the rockకొండ మీది కెక్కిరి. the balloon ascended to a great height పొగ గుమ్మటముబహు పొడుగుకు యెగిరింది. this history ascends to the flood యీ కథ జలప్రళయ పర్యంతము పోతుంది. the smoke ascends పొగ లేస్తున్నది.
To Ascertain v a తెలుసుకొనుట, కనుక్కొనుట, నిశ్చయించుట, విచారించుట.
To Ascribe v a ఆరోపించుట, సంభవించినదనుట. they * this to you యిది నీచేతవాండ్లకు సంభవించిన దంటారు. they * this book to him యె పుస్తమును అతడుచెప్పినదంటారు. they * the cure to this medicine యీ మందుచేత గుణమైనదంటారు. he ascribed the glory to God యీ మహిమ దేవుడిదే నంటారు. a poemascribed to him అతడు చెప్పినాడన్న ఒక కావ్యము.
To Ask v a అడుగుట, వేడుకొనుట, విచారించుట. * yourself if this is justయిది న్యాయమో అన్యాయమో నీవే చెప్పు. I asked him to dinner వాణ్ని భోజనానికిపిలిచినాను. he asked them for a dinner అన్నము పెట్టుమని వారిని అడిగినాడు.they asked for their lives చంప వద్దని బతిమాలుకొన్నారు. I asked for himవాడు యెక్కడని విచారిస్తిని. She asked God for children సంతానము కావలెననిదేవుణ్ని కోరింది.
To Asperse v a దూషించుట, దూరుట.
To Aspirate v a ఒత్తిపలుకుట.
To Aspire tov n. ఆశపడుట, అపేక్షించుట, కోరుట.
To Assail v a పయిబడుట, చొరబడుట, దూరుట. his enemies assailed himవాడి శత్రువులు వాడి మీదికి పోయి బడిరి. when danger * us మా కాపద వచ్చినప్పుడు.
To Assassinate v a చంపుట, హత్య చేసుట, రహస్యముగా చంపుట.
To Assault v a పైబడుట, చొరబడుట, దూరుట, దౌర్జన్యము చేసుట.
To Assay v a పరీక్షించుట, శోధించుట, వన్నె చూచుట, వొరసి చూచుట. of coinsనాణెము చూచుట.
To Assemblage v n కూడుట, సమూహము చేరుట.
To Assemble v a కూర్చుట, సమూహము చేర్చుట.
To Assent v n సమ్మతించుట, ఆమోదించుట, ఒప్పుట.
To Assert v a చెప్పుట, స్థిరముగా చెప్పుట.
To Asservate v a చెప్పుట, స్థిరముగా చెప్పుట.
To Assess v a పన్ను వేసుట, పన్ను కట్టుట, మతించుట. they assesseddamages for this దీనికి నష్టము కట్టినారు.
To Assign v a నిర్ణయించుట, నియమించుట, ఏర్పరచుట, ఉదాహరించుట. or toalleger to show చెప్పుట, అగుపరచుట. to transfer ఒప్పగించుట.
To Assimilate v a సదృశము చేసుట, సమము చేసుట.
To Assist v a సహాయము చేసుట, అనుకూలము చేసుట.
To Associate v n కూడుట, సహవాసము చేసుట.
To Assort v a తరగతిగా యేర్పరచుట, తరము లేర్పరచుట.
To Assuage v a ఉపశమనము చేసుట, శాంతి చేసుట, అణుచుట, ఆర్చుట.
To Assume v a వహించుకొనుట, దాల్చుట, ఆరోపించుకొనుట. he assumed thepower ఆ యధికారమును చెందినాడు. he assumed consequence గర్వించినాడు. heassumed their name వాండ్ల పేరును పెట్టుకొన్నాడు. he assumed a sleepingattitude నిద్రపొయ్యే రీతిగా వుండినాడు. he assumed the shape of a serpentసర్పాకారమును దాల్చినాడు. he assumed the airs of a Prince రాజఠీవినివహించినాడు. It assumed consistency అది ఘనీభవించినది. the woundassumed a healthy appearance ఆ గాయము ఆరబార వచ్చినది. here we * astraight line యిక్కడ సరిగ్గా ఒక గీత వున్నదని అనుకోవలసినది.
To Assure v a స్థిరముగా చెప్పుట, రూఢిగా చెప్పుట. I * you he will punishyou for this యిందున గురించి వాడు నిన్ను సిద్ధముగా శిక్షిస్తాడు.I * you I will gothere నేను అక్కడికి పొయ్యేది సిద్ధము. how can I * you of it అందున గురించి నీకునేను యెట్లా స్థిరముగా చెప్పేది.
To Astonish v a ఆశ్చర్యపరచుట.
To Astound v a మానుపరచుట, దిగ్ర్భమపరచుట, గాబరా చేసుట.
To Atone forv a. పాపపరిహారము చేసుట, పాపనివృత్తి చేసుట, ప్రాయశ్చిత్తముచేసుట. he atoned for this fault with his life యీ తప్పును తన తలతోచెల్లించినాడు. he atoned for our sins with his life తన ప్రాణములను యిచ్చిమన పాపములను పరిహరింప చేసినాడు.
To Attach v a అంటించుట, కూర్చుట, చేర్చుట. he attached the string to thestone రాతికి తాడు కట్టినాడు. he attached the paper to the wall ఆ కాకితమునుగోడకు అంటించినాడు. Love attached them to her మోహము చేత దానికిబద్ధులైనారు. this behaviour attached his friends to him యిట్లానడుచుకొన్నందున వాడి స్నేహితులు వాడికి వశ్యులైనారు. Fear attached them to me భయము చేత వాండ్లు నన్ను కర్చుకొని వుండినారు. I attached another meaningtoyour words నీ మాటలకు వేరే అర్థము చేసినాను. I * no weight to what hesays వాడి మాట నాకు లక్ష్యము లేదు. they attached him to me as a teacherఅతణ్ని నాకు చదువు చెప్పడానకై యేర్పరచినారు. to seize జప్తిచేసుట, అంటుకొనుట,పట్టుకొనుట. he attached their property for the debt అప్పుకుగాను వాండ్లసొత్తులను జప్తి చేసినాడు. he attached himself to the prince రాజును అనుసరించివుండినాడు. to gain over వశ్యము చేసుకొనుట.
To Attack v a పైబడుట, పైబడి కొట్టుట, దూరుట. they attacked me withabuse తిట్టసాగినారు. they attacked his reputation వాన్ని దూషించిననారంభించినారు. If you don't * the snake it will not * you నీవు పాము మీదికిదూరకుంటే అది నీ మీదికి దూరదు. they attacked the town ఆ పట్టణము మీదపడ్డారు. the robbers attacked the house దొంగలు ఆ యింటి మీద పడ్డారు. whiteants attacked the wood ఆ కొయ్యకు చెదుళ్ళు పట్టింది. Fever attacked himsuddenly వాడికి అకస్మాత్తుగా జ్వరము వచ్చినది, జ్వరము తగిలింది. they attackedthe loaf తినసాగినారు.
To Attain v a చేరుట, చెందుట, పొందుట. he attained the top of the hill ఆకొండ కొనకు చేరినాడు. he attained fame వాడికి కీర్తి లభించినది, యశస్సునుపొందినాడు. he attained to a great age వృద్ధాప్యమును చెందినాడు. he attainedhis object అతని అభిమతము చెయి కూడినది, సిద్ధించినది. he attained learningవిద్యను సంపాదించినాడు.
To Attemper v a to mingle కలుపుట, మిశ్రమము చేసుట. to weakenవేగమణుచుట, తీక్ష్ణమణచుట. to soften శాంత పరచుట.
To Attempt v a యత్నము చేసుట. thieves attempted my house నా యింట్లోచొరబడేటందుకు దొంగలు యత్నము చేసినారు.
To Attend v n to give attention వినుట, లక్ష్యపెట్టు, గమనించుట. to bepresent వచ్చుట, హాజరౌట. he attended at court కోర్టులో హాజరైనాడు. theconstable who attends on the Judge జడ్జి దగ్గిర తైనాత్తుగా వుండే బంట్రోతు. Ihave ten patients to * to నేను పది మందికి వైద్యము చేస్తాను. why dont you *to me when I speak to you నీతో నేను చెప్పుతూ వుంటే దాని మీద నీకెందుకులక్ష్యము లేదు. If you do not * or if you do not * to me నీవు వినకుంటే. I will* to it దాన్ని జాగ్రత చేస్తాను.I will * to your orders తమ ఆజ్ఞను శిరసావహిస్తాను.he attended at church but did not * to the preacher గుడికి వచ్చినాడు గానిగురువు చెప్పిన దాని మీద వాడి మనసును యెంత మాత్రమును పెట్టలేదు. he camethere attended by five people అయిదుమందితో కూడా వచ్చినాడు.
To Attest v a ప్రయాణముగా చెప్పుట, సాక్షి చెప్పుట, సాక్షిచే వ్రాలు చేసుట.I can * the truth of this యిది యధార్ధమని నేను పలకగలను. I can * the efficacy of this medicine యిది గుణమైన మందని ప్రమాణముగా చెప్పగలను.
To Attire v a అలంకరించుట, తొడుగుట. she attired herself in silkపట్టుబట్టలు అలంకరించుకొన్నది. he attired his family splendidly యింట్లోవాండ్లందరికి మంచి వుగుపు లిచ్చినాడు.
To Attitudinize v a అభినయించుట. ( Johnson uses it in Boswell.1784. ).
To Attract v a ఆకర్షించుట, ఈడ్చుట. the magnet attracts ironసూదంటురాయి యినుమును ఆకర్షిస్తున్నది. It attracted my attention నా మనసుదాని మీద పోయింది.
To Attribute v a ఆరోపించుట. I * my illness to bathing జ్వరము స్నానముచేసి నందువల్ల వచ్చినదని తోస్తుంది. Why do you * your misfortunes to him నీకువచ్చిన ఆపదలను వాడి మీద యెందుకు ఆరోపిస్తావు. they * this to you యిది నీవల్లకలిగిన దంటారు, దీన్నినీమీద పెట్టుతారు.
To Attune v a సుతి కూర్చుట.
To Audit v a లెక్కను విమర్శించుట, తనకీ చేసుట.
To Augment v a పెంచుట, అభివృద్ధి చేసుట.
To Augur v n శకునము చేత వూహించుట, వూహించుట. On meeting anelephant he augured good luck on his journey వాడు ప్రయాణమయ్యేటప్పుడుయేనిగ వచ్చినందున మంచి శకునమనుకొన్నాడు. From this wind I * rain యీ ఘాలివల్ల వాన వస్తుందని వూహిస్తిని. From this I should * his recovery యిందుచేతవాడికి రోగము కుదురుతుందని వూహిస్తాను.
To Authenticate v a నిజపరచుట, నిశ్చయపరచుట, రూఢిచేసుట, ప్రమాణపూర్వకముగా సిద్ధపరచుట.
To Authorize v a అధికారమిచ్చుట. I authorize you to receive the moneyఆ రూకలను పుచ్చుకోవడానకు నీకు అధికారము యిచ్చినాను. Johnson's Dictionaryl authorizes this word యీ మాటకు జాన్ సన్ నిఘంటు అధరవును కలగచేస్తున్నది,యీ మాటకు జాన్ సన్ నిఘంటు వుదాహరణగా వున్నది.
To Avail v n ఉపయోగమౌట. this will not * యిది వుపయోగము కాదు,పనికిరాదు.
To Avenge v a పగదీర్చుకొనుట, కసిదీర్చుకొనుట, శాస్తిచేసుట, శిక్షించుట. Godavenged me నాకు విరోధము చేసిన వాండ్లకు దేవుడు శాస్తి చేసినాడు. * me of myadversary నన్ను వాడు చేసిన అన్యాయమునకు వాడికి శాస్తి చెయ్యి. God avengedtheir crimes వాండ్లు చేసిన దానికి దేవుడు శాస్తి చేసినాడు.
To Aver v n స్థిరముగా చెప్పుట, దృఢముగా చెప్పుట.
To Average v n సరాసరి యౌట, సగటు మీద నౌట. the schools * at onehundred boys each ఆ పిల్ల కాయలనంతా సరాసరి చేస్తే పల్లె కూటము ఒకంటికి నూరుపిల్లకాయ లవుతారు.
To Avert v a వారించుట, నివారించుట, తొలగ దోసుట, తిప్పుట. he averted hisface మూతిని తిప్పుకొన్నాడు, ముఖమును మళ్ళించుకొన్నాడు. he averted the blowతన మీద వచ్చిన దెబ్బను తట్టి వేసినాడు. he did this to * the king's anger రాజుకోపమును నివారించడానకై దీన్ని చేసినాడు.
To Avoid v a తప్పించుకొనుట, మానుకొనుట, వర్జించుట. I avoided the blow ఆదెబ్బను తప్పించుకొన్నాను. he avoided the sight of the corpse ఆ శవమునుచూడక తప్పించుకొన్నాడు. I avoided going there అక్కడికి పోవడము మానుకొన్నాను.I could not avoid going there నేను అక్కడకు పోక విధిలేదు.
To Avouch v a నిశ్చయముగా చెప్పుట స్థిరముగా చెప్పుట, రూఢీగా చెప్పుట. I *for this యిది నిశ్చయ మనేటందుకు నేను వున్నాను.
To Avow v a నిశ్చయముగా చెప్పుట. he avowed the letter యీ జాబు తానువ్రాసినదేనని వొప్పుకొన్నాడు. I * that this is true యిది వాస్తవ్యమని నేనునిశ్చయముగా చెప్పుతాను.
To Await v a యెదురుచూచుట, నిరీక్షించుట, కనిపెట్టుకొనివుండుట. I will * yourreturn మీ రాకను నిరీక్షిస్తూ వుంటాను they awaited his orders ఆయన వుత్తరవునుయెదురు చూస్తూ వుండినారు. Punishment awaits you నీకు శిక్ష కనిపెట్టుకొని వున్నది,కాచుకొని వున్నది. victory awaits you నీకు జయము కనిపెట్టుకొని వున్నది.
To Awake v n మేలుకొని వుండే, జాగ్రతగావుండే,ఎచ్చరికగావుండే. I was * alllast night రాత్రి అంతా మేలుకొని వుండినాను.
To Awaken v a లేపుట. this awakened them to a sense of their follyఇందువల్ల వాండ్ల తప్పు వాండ్లకు తెలిసింది.
To Award v a విధించుట, యివ్వమని తీర్చుట. they awarded this estate tohim ఆ యాస్తిని వాడికి యిమ్మని తీర్చినారు.
To Baa a n. బా అని మేక కూసుట.
To Bable v n వదరుట, పేలుట, రహస్యమును బయట చెప్పుట.
To Back v a to mount a horse గుర్రమెక్కుట. to support వొదుగుట, సహాయము చేసుట his friends backed him వాణ్ని బంధువులు ఆదుకొన్నారు. his friends and backersవాడి స్నేహితులున్ను సహాయులున్ను. to * or, break in a horse గుర్రమును మరుపుట.
To Backbite v a చాడీచెప్పుట, కొండెముచెప్పుట, దూషించుట.
To Backslide v n వెనక్కు తీసుట, తగ్గుట. they who * భక్తిలో వెనక్కుతీసినవాండ్లు.
To Badger v a or plague రచ్చబెట్టుట, ప్రాణమువిసికించుట.
To Baffle v a విఘాతముచేసుట, భంగముచేసుట, నిష్ఫలముచేసుట. he baffled me in this business యీ పనిలో నాకు భంగము చేసినాడు. or to confound కలతబెట్టుట, చీకాకుపరచుట. the style of this book baffles all my endeavours to understand it యీ గ్రంధము యొక్కశయ్య తెలుసుకోవడానికి నాకు నిండా కలతగా వున్నది. the scene baffled all description ఆ వేడుక వర్ణనకు అలవికాలేదు. this baffles all my conjecture యిందువల్లవూహించనలవి కాలేదు.
To Bag v a సంచిలోవేసుట. he bagged three birds మూడు పక్షులనుకొట్టి సంచిలో వేసుకొన్నాడు.
To Bait v n మజిలిలో దిగి భోజనముచేసుట. the men and their cattle were baiting మజిలిలో దిగి గొడ్లకు మేతవేసి తామున్ను భోజనము చేస్తూవుండినారు. a baiting place దిగి భోజనముచేసే మజిలి.
To Bake v a కాల్చుట. to * bread రొట్టెలను కాల్చుట. to * potsor bricks & c. ఆనము కాల్చుట. sugar baking బెల్లము కాచడము.
To Balance v n అనుమానించుట,సందేహించుట.he balanced a long timeశానాసేపు సందేహించినాడు.
To Bale v a చల్లుట, బయిటికిచల్లుట, అనగా పడవలో, లేక, వాడలోవూరిననీళ్ళను బయటికి చల్లుట.
To Balk v a భంగముచేసుట, వ్యర్ధముచేసుట, నిష్ఫలముచేసుట.నిరర్ధకము చేసుట. he balked my endeavours నా యత్నమును భంగముచేసినాడు. Ball, n. s. గుండు, ఉండ, గోళము. or bullet గుండు.a * of thread కండె, నూలుండ. a * of flowers or clothsబంతి, చెండు. or dancing entertainment ఆట, విందుచేసిదొరలు దొరసానులు ఆడడము. he has now the * at hisfeet యిఖమీదట వాడిదెబ్బే దెబ్బ, యిఖమీద వాడిమాటకు యెదురులేదు.
To Ball v a పూటబడుట, జామీనుయిచ్చుట.
To Ballot v a ఉండలు వేసుట, చీట్లు వేసుట.they ballotted for him వాణ్నిసభలో ప్రవేశ పెట్టడమును గురించి చీట్లువేసినారు. See Ballot, n. s.
To Bamboozle v a మోసపుచ్చుట, దగాచేసుట.
To Bandy v a పుట్ల చండాడుట, బదులుకు బదులు చేసుట, ప్రతికిప్రతిచేసుట, యిదిదండము, తిట్టు, కొట్లనుగురించినమాట.theybandied the balls about చెండ్లాడిరి. they bandied complimentsఒకరిని ఒకరు వందనముచేసుకొన్నారు. they bandied blowsఒకరిని ఒకరు కొట్టుకున్నారు.
To Bang v a కొట్టుట, మోటుతనముగా మొట్టుట, బాదుట, ప్రహరించుట. he banged me నన్ను బాదినాడు. he went out and banged the door after him బయిటికిపోతూ తలుపును దఢాలున మూసినాడు.
To Banish v a వెళ్ళగొట్టుట, దేశములోనుంచి వెళ్ళగొట్టుట, దేశాంతరమునకుపంపివేసుట, త్యజించుట. they banished him వాణ్ణి పరదేశములో తీసుకొనిపోయి పెట్టినారు. he banished his wife పెండ్లాన్ని త్యజించినాడు. he banished these hopes యీ ఆశలను విడిచిపెట్టినాడు.he banished himself from society అందరిని త్యజించి యేకాంతముగావుండినాడు. smoke banishes mosketoes పొగచేత దోమలు పోతవి.
To Bank v a కట్ట వేసుట. they banked up the water నీళ్ళను అడ్డ కట్టినారు.
To Banter v a యెగతాళిచేసుట, పరిహాసముచేసుట.
To Baptise v a బాప్తీజించుట, బాటీజించుట, బాప్తిస్మమును చేయించుట,మజ్జనము చేయించుట. The usual phrase in South జ్ఙానస్నానము చేయించుట. is quite wrong. See Matt. 3. 11. Mark, 1. 4.
To Baptize v a బాప్తిస్మమును చేయించుట, జ్ఙానస్నానము చేయించుట.
To Bare v a తెరిచివేసుట. she bared her breast రొమ్ము మీద బట్ట తీసివేసినది.he bared his arm చేతిమీది చొక్కాయను తీసినాడు, తొలగ తోసినాడు. he bared the sword కత్తిని దూసుకొన్నాడు. the Surgeon bared the veinనరము మీది తోలును దోచివేసినాడు.
To Bargain v a బేరము చేసుట. he bargained with me but settled nothingనాతో బేరము చేసినాడుగాని ఒకటీ కుదరలేదు. I will employ you; but I *one thing, that you must come early నిన్ను పనిలో పెట్టుకొంటాను అయితేఒకమాట; నీవు వుదయాన రావలెను. I cannot * with you నీతో నేను బేరముచేయలేను.
To Bark v a పట్టవోలుచుట, పట్టకొట్టుట.
To Barrel v a గొట్టములో వేసుట.
To Barricade v a అడ్డుచేసుట, ఆటంకము చేసుట, అడ్డకట్టుట, దోవనుమూసుట. he barricaded the door with empty boxes లోగా యెవరినిరానియ్యకుండా దారికి పెట్టెలను వేసి మూసినాడు. he barricaded thestreet యెవరిని పోనియ్యకుండా వీధికి అడ్డకట్టినాడు.
To Barter v a మార్చుకొనుట, వినిమయము చేసుకోవడము.
To Base v a అస్తి భారము వేసుట, ఆధారముగా చేసుట. this objectionis based on the law యీ ఆ క్షేపణకు చట్టము ఆధారముగా వున్నది. they based the pillar on the rock ఆ స్తంభమును రాతిమీద నిలిపినారు.
To Bask v a చలికాచుకొనుట. cats * in the sun పల్లులు యెండలో చలికాచుకొంటవి. he basked by the fir నిప్పుదగ్గెర చలికాచుకొన్నాడు.those who * in the royal favour రాజు యొక్క అనుగ్రహము గలవాండ్లు. Basket, n. s. గంప, బుట్ట, గూడ. a flower * పూలబుట్ట. a very large and high * for storing grain గాదె, పొణక. a small * పుటిక.a * box మేదరపెట్టె. a round flat * తట్ట. a * for catching fishచేపలుపట్టేతిర్రి. a fish * చేపలువేసే బుట్ట. a winnowing * చేట, శూర్పము. a large winnowing * దాగర. a small winnowing * used by children మొరిటె. a * boat పుట్ట, పోరగోలు. the * makerscaste మేదరకులము.
To Bastardize v a జారజుడని రుజువు చేసుట, పెట్టుకొన్న దానికి పుట్టినవాడని రుజువుచేసుట. they attempted to * the childపెండ్లి చేసుకోని దానికి పుట్టిన బిడ్డని రుజువు చేయను యత్నపడ్డారు.
To Baste v a పచనమౌతూవుండే మాంసము మీద మిళ్లితో కొంచెము కొంచెముగా నెయ్యిపోసుట. to sew slightly కుట్టు పోయుట,పోగు పోసుట, టాకావేసుట. to beat కర్రతో పులుముట, బాదుట.
To Bate v a తగ్గించుట, తోలసుట. I cannot * a penny నేను ఒకకాసుతోయను, విడవను.
To Bathe v n స్నానము చేసుట. To Bathe, v. a. స్నానము చేయించుట, తడుపుట. he bathed the wound పుంటిని తడిపినాడు. he bathed his hands in milk పాలులో చేతులు ముంచినాడు.
To Batten v a See To Fatten, v. n.
To Batter v a కొట్టుట, యిడియగొట్టుట, పడగొట్టుట. he battered thekettle with a stone రాతితో ఆ బానఅను పగలకొట్టినాడు. they battered thewalls with their guns గోడలను ఫిరంగులతో యడియగొట్టినారు. the rams battered each others heads పొట్టేళ్ళు ఢీకొట్టు కొన్నవి.
To Battle v n యుద్ధము చేసుట, జగడము చేసుట, పోట్లాడుట.
To Baulk v a వ్యర్ధము చేసుట, నిష్ఫలము చేసుట, నిరర్ధకము చేసుట.
To Bawl v n అరుచుట, కూసుట, బొబ్బలిడుట.
To Bay v n మొరుగుట. the dogs * at the moon చంద్రుణ్ని చూచి కుక్కలుమొరుగుతవి.
To Be v n ఉండుట, ఔట. I am a merchant నేను వర్తకుణ్ని. who is heవాడెవడు. this is often understood, not expressed; as is shewn in theTelugu Grammar: thus.) this is his యిది అతనిది. there is a littlewind కొంచెము ఘాలి వస్తుంది. there is a sound చప్పుడు అవుతుంది.There was a marriage here yesterday నిన్న పెండ్లి జరిగినది, సంభవించినది.this is to be gin to him యిది అతనికి యివ్వవలసింది. you are to writeit అది నీవు వ్రాయవలసింది. am I not to write నేను అది వ్రాయవద్దా. Is he there వున్నాడా. he is wise బుద్ధిమంతుడు. how old are you నీ కెన్నేండ్లుwhile matters were thus యిట్లావుండగా. I have been there నేను అక్కడికి పోయివచ్చినాను. Have you been to him వాడి ద్గరికి పోయివుంటివా. there hasbeen a dispute ఒక వాజ్యము జరిగినది. there was a question ఒక ఆక్షేపణసంభవించినది. to be in pain సంకటపడుట, దుఃఖపడుట, చింతపడుట, Be it so అట్లా అయినప్పటికిన్నీ. Well be it so మంచిది అట్లాగే కానీ, Be it night or be it day రాత్రి అయినాసరే, పగులు అయినా సరే. he is no more వాడు వచ్చెను. I will be off పోతాను, వెళ్ళుతాను. come, be off!మంచిది పో. It is over అఅయిపోయినది, the suit is over ఆ వ్యాజ్యముతీరినది. Be pleased to do this దయచేసి దీన్నీ చేయండి.
To be Born (v n. past) పుట్టుట, జన్మించుట. he was * there అక్కడపుట్టినాడు. After a son was * to him వాడికి వక పుత్రుడు కలిగిన తరువాత.
To Beam v n ప్రకాశించుట. beaming ప్రకాశించే. a beaming smile చిరునవ్వు.
To Bear v n ఉండుట, పడుట, సహించుట. (in the sea language)పోవుట, వచ్చుట. this tree does not * యీచెట్టు కాయదు. the shipbore north of us ఆ వాడ మాకు వుత్తరముగా వుండినది. the ship boretowards us, or, bore down upon us ఆ వాడ మాకై రావడానకు ఆరంభించినది.he bore up against these difficulties యీ కష్టములను పడ్డాడు, సహించేనాడు.this does not *upon the subject యిది అంతా అందుకు సంబంధించదు.the gun bore upon them ఆ ఫిరంగి వాండ్ల మీద పారడానికి వాటముగా వుండినది.
To Beard v a దాడినిపట్టి యీడ్చుట. to face యెదిరించుట. are you goingto * the government రాజరికము చేసేవానిని యెదిరించపోతావా.
To Beat v n ఆడుట, కొట్టుకొనుట. the heart beats గుండెలు అదురుతుంది, రొమ్ముకొట్టు కొంటుంది. the puse beats ధాతువు ఆడుతుంది, నడుస్తుంది. the watchbeats ఘడియారము కొట్టుకొటుంది. the waves * against the shore కట్ట మీదఅలలు కొట్టుతున్నవి. he was beating about తారాడుతూ వుండినాడు. he wasbeating about for an answer జవాబు చెప్పడానకు మిణకరిస్తూ వుండినాడు.Why are you beating about the bush? కావలసినదాన్ని ఫళిచ్చుమని చెప్పకయెందుకు గురికలు మింగుతావు, నీళ్ళు నములుతావు?
To Beautify v a అలంకరించుట, శృంగారించుట.
To Becalm v s ఘాలి లేకుండా చేసుట. the hill becalmed our ship ఆ కొండవల్లమా వాడకు ఘాలి లేక పోయినది.
To Beckon v a సైగచేసుట, చెయిసౌజ్ఙ చేసుట. she beckoned him to go వాణ్నిరమ్మని చెయిసైగ చేసినది.
To Becloud v a మందారము వేసుట. the sun was beclouded సూర్యుణ్నిమబ్బు మూసుకొన్నది. grief beclouded her mind దానిమనసు వ్యసనగ్రస్తమైనది
To Become v a తగుట, తగివుండుట, ఒప్పుట. this conduct does not * themయీ నడత వాండ్లకు తగదు.
To Bedaub v a పూసుట, చరుముట, అలుకుట.
To Bedeck v a అలంకరించుట, శృంగారించుట.
To Bedew v a తడుపుట.
To Bedim v a మబ్బుకమ్మేటట్టు చేసుట, మకిలచేసుట, మసకచేసుట. age bedimmed hiseyes వృద్ధాప్యముచేత వాడికండ్లు మబ్బు కమ్మినవి.
To Bedizen v a శృంగారించుట, అలంకరించుట, యిది హాస్యములో వచ్చేమాట.
To Bedrench v a తడుపుట.
To Bedung v a యేరిగి చెరుపుట, విష్ట వేసి చెరుపుట. the rats have bedunged all the place ఆ స్థలము నంతా యెలుకలు పింటికలు వేసి చెరిపినవి.
To Bedust v a దుమ్ముచేసుట. My face is all bedusted నా ముఖమంతా దుమ్మైనది.
To Befall v a సంభవించుట, తటస్థించుట, ఘటించుట, పొసగుట, this has befallen us మాకిది సంభవించినది, తటస్తించినది.
To Befit v a తగుట, తగివుండుట. this does not * you యిది నీకు తగదు, యోగ్యము కాదు.
To Befool వెర్రివాణ్నిగాఆడించుట
To Befoul v a మురికిచేసుట, రోతచేసుట.
To Befriend v a ఆదరించుట, పోషించుట, కాపాడుట, రక్షించుట.God befriends the poor దేవుడు బీదలను రక్షిస్తున్నాడు, దేవుడు బీదల పక్షముగా వుంటాడు.
To Beg v n భిక్షమెత్తుట. he was driven to * వాడికి భిక్షమెత్తుకోవలసివచ్చినది.I begged off మన్నించవలెనని వేడుకొంటిని.
To Beget v a కనుట, కలగచేసుట, పుట్టించుట. this begat a doubt యిందుచేతఒక అనుమానము పుట్టంది. mirth begetting సంతోషజనకమైన.
To Beggar v a పేదవాణ్నిగా చేసుట దరిద్రుణ్నిగా చేసుట. this splendourbeggars all description యీడంభము వర్నింప నలవికానిది. they played at * my neighbour పరులను దోచుకోవడమనే ఒక తరహా కాకితాల ఆట.
To Begin v n ఆరంభమౌట, మొదలుబెట్టుట, తలపడుట. he began to runపరుగెత్తసాగినాడు. the fruits began to ripen పండబారింది. the poembegins with these words ఆ కావ్యము యీ మాటలతో ఆరంభమౌతున్నది.
To Begird v a చుట్టుకొనుట, ఆవరించుకొనుట. they begirt the town ఆ వూరిని ముట్టడి వేసుకొన్నారు. he was begirded or begirt with a beltనడికట్టును కట్టుకొన్నాడు. he was begirt with a sword కత్తిని నడుముకుకట్టుకొన్నాడు. he was begirt with a sword కత్తిని నడుముకు కట్టుకొన్నాడు.
To Begrime v a మురికిచేసుట, మలినము చేసుట.
To Begrudge v a పోతుందని యేడ్చుట. See To Grudge.
To Beguile v a వంచించుట, మోసముచేసుట. he beguiled his timewith reading చదువుతో ప్రొద్దుపుచ్చినాడు. he beguiled her దాన్నివంచించినాడు.
To behave v n నడుచుకొనుట, ప్రవర్తించుట. he behaved himself properlyచక్కగా నడుచుకొన్నాడు. he behaved kindly towards her దానియందు విశ్వాసముగానడుచు కొన్నాడు. a well behaved child సన్మార్గమైన బిడ్డ. an ill behavedchild దుర్మార్గమైన బిడ్డ.
To Behead v a తలకొట్టుట, శిరచ్ఛేదము చేసుట.
To Behold v a చూచుట, వీక్షించుట, దర్శించుట.
To Behove, ToBehoove v a. తగివుండుట, యుక్తముగా వుండుట. It doesnot behove you to do this దీన్ని నీవు చేయడానికి తగదు. It behoves youto go there ణీవు అక్కడికి పోవడము యుక్తము.
To Belabour v a దుడ్డుకర్రతో బాదుట, పులుముట.
To Belay v a తాటిని యీడ్చి జారకుండా కట్టుట. or to waylay దోచుకోవడానకైదోవకట్టుట. or to thrash బాదుట, పులుముట.
To Belch v n తేపుట, తేణుపుట. a mountain belching flames జ్వాలలనుకక్కుతూ వుండే పర్వతము.
To Beleaguer v a ముట్టడి వేసుకొనుట, చుట్టుకొనుట.
To Belie v a అబద్ధము చేసుట, అపదూరుపెట్టుట. he belied me నన్నుఅపదూరు పెట్టినాడు. this proof belied his story యీ దృష్టాంతముచేతవాడు చెప్పినది అబద్ధమైపోయినది. My tongue belied my thought నేను తలచినదిఒకటి నా నోట వచ్చినది ఒకటి.
To Believe v a నమ్ముట, యెంచుట, తలచుట. I * he is gone పోయినాడనితోస్తున్నది. Do you * so నీకు అట్లా తోచిందా . * me he is gone వాడుపోయినాడు సుమీ. those who * or the faithful భక్తులు. I * so or perhaps soబహుశా, కాబోలు, యేమో . he made * to strike her దాన్ని కొట్టినట్టు అభినయించినాడు. he made * to assist me నాకు సహాయము చేసే వాడివలె నటించినాడు.this was all a make believe యిది అంతా వట్టి మాయ.

No comments:

Post a Comment