Monday, February 7, 2011

To Decry

To Decry v a దూరుట, దూషించుట, నిందించుట.
To Dedicate v n సమర్పించుట, అర్పణ చేసుట, మీదుకట్టుట.he *d the poem to the king ఆ కావ్యములో రాజుమీద అంకితముపెట్టినాడు. to * an image సంప్రోక్షణ చేసుట. he *d his land to thetemple వాడినేలను గుడికి యచ్చినాడు. he *d himself to this work వాడు అదే పనిగా వున్నాడు. she *s herself entirelu to her childern ఏవేళ చూచినా దానికి బిడ్డమీదనే లోకము.
To Deduce v a వూహించుట, నిదానించుట, అనుమేయించుట. HenceI *d that he was wrong వాడు తప్పినాడని యిందువల్ల ఊహిస్తిని.
To Deduct v a తోసివేయుట, తీసివేయుట, భాగారించుట. * 8 from 10పదింటిలో యెనిమిది తొయ్యి. the balance after deducting payment చెల్లుపోగా నిలువ.
To Deem v a తలచుట, యెంచుట. it is *ed wrong అదిన్యాయము కాదని అంటారు.
To Deepen v a లోతౌట, హెచ్చుట. at this place the river *sయిక్కడ యేరు లోతుగా వుంటుంది. the darkness now *ed యింతలోచీకటి అధికమైనది. Deeply, adv. మిక్కిలి, మహా. I am * convinced of thisదీన్ని చాలా నమ్మినాను. I am * ashamed నాకు మహా సిగ్గైనది.I was greived మిక్కిలి వ్యాకులముగా వుంటిని.
To Deface v a చెరుపుట, చెడగొట్టుట, విరూపము చేసుట. he *dthe bond పత్రమును తుడిచి చెరిపినాడు. he *d the rupees ఆ రూపాయమీద ముద్రను చెడగొట్టినాడు. the Musulmans *d all the pagodasగుళ్ళ మీది ప్రతిమల యొక్క ముక్కుమూతి పగలకొట్టి అందము చెరిపినారు.విరూపముచేసినారు.
To Defame v a నిందించుట, దూరుట, ఏకుట. they * d him వాణ్నియేకి కాకులను పెట్టినారు.
To Defeat v a వోడకొట్టుట, అపజయమును పొందించుట. భంగపరుచుట, చెరుపుట. your argument *s itself నీవుచెప్పే న్యాయముదానికి అదే విరోధముగా వున్నది, యిది స్వవాక్యవిరోధముగా వున్నది.
To Defecte v a నిర్మలము చేసుట, శుద్ధిచేసుట, వడియకట్టుట,తేరబెట్టుట.
To Defend v a రక్షించుట, కాచుట, కాపాడుట. the wall *s usfrom the sun ఆ గోడ చేత మనకు యెండ లేకుండా వున్నది. the glass*s the watch గడియారమునకు అద్ధము సంరక్షకముగా వున్నది. theseguns * the fort కోటకు యీ ఫిరంగులు రక్షకముగా వున్నవి, యీ ఫిరంగులుకోటను కాపాడుతున్నవి. he *ed himself తనమీద వచ్చిన దెబ్బనుతప్పించుకున్నాడు. he *ed his wife 's conduct పెండ్లాముచేసినదాన్ని రక్షించినాడు, అనగా పెండ్లాము చేసిన దానికి తాను వహించుకొనివచ్చినాడు. I do not * my conduct in this యిందులో నాయందు తప్పులేదనిఅనను.
To Defer v a నిలిపి పెట్టుట. he *red the business tillnext day ఆ పనిని మరునాడు చేతామని నిలిపి పెట్టినాడు. he *redhis dinner అప్పట్లో భోజనము మానుకున్నాడు. he *red going తక్షణముపోకుండా కొంచెము మానినాడు. I *red asking him అప్పుడుఅతన్ని అడగక మానినాను, తరువాత అడుగుదామని వూరకవుంటిని. they *red going till next month అవతలమాసము పోదామనిప్రయాణము మానుకున్నారు. you may * marrying till he was oldవృద్దాప్యము దాక పెండ్లి చేసుకోకుండా మానినాడు. hope long *redచాలాకాలము నుంచి వుండిన ఆశ.
To Defile v n ( marching in file ) బాగుగా నడచుట.వకడి వెనుక వకడు నడుచుట.
To Define v a నిర్దారణ చేసుట, నిర్దేశించుట, వగదెంచుట.వివరించుట, విశదపరుచుట. how do you * a jury జూరీ అనగాయేమి జూరీ అనేమాటకు వివరము చెప్పు. * India యిండియా ఖండమునకుపోలిమేరలు చెప్పు.
To Deflour, ToDeflower v a. కన్యపడుచును చెరుపుట, కన్యపడుచుతో పోవుట.
To Deform v a వికారము చేసుట, అందవికారముచేసుట,కురూపము చేసుట.
To Defraud v a మోసముచేసుట, మాయ చేసుట, వంచించుట.
To Defray v a శెలవు పెట్టుకొనుట, వ్రయము పెట్టుకొనుట.they *ed his expenses అతనికి పట్టిన ఖర్చును వీండ్లు పెట్టుకున్నారు.this money will * the expeneses of the wedding ఆపెండ్లి వ్రయమునకుయీ రూకలు సరిపోను. If you undertake the business I will *the expenses నీవు ఆ పనికి పూనుకుంటే రూకల వ్రయము నేను పెట్టుకుంటాను.who will * the expense of the boys schooling ఆ పిల్లకాయలుచదివేటందుకు సంబళము యెవరు యిత్తురు. this will not be *ed by your wagesఆ ఖర్చునీ సంబళముతో తీరదు.
To Defy v a తిరస్కరించుట, అలక్ష్యముచేసుట, నీచేతకాదనుట.చెయ్యి చూతామనుట వొక చెయి చూతాము రమ్మనుట.I * you to do this యిది యెంతమాత్రము నీచేత కాదు. the scenedefied all description వర్ణించశక్యముకాని వ్యాపారము.their misery defies description వాండ్లు పడ్డ ప్రయాసచెప్పనలవికాదు, యింతింతనరాదు. In Numb XXIII .8. తిరస్కరించుట.H+ అభిశాపము. B + while E + uses a word similar to యీసడించుట.In 1 Sam. XVII. 45. సొడ్డు H + నిందించుట E + తుచ్ఛకరించుట.D+.
To Degenerate v n హీనమైపోవుట, జబ్బే పోవుట. they have *dfrom their ancestors వాండ్ల పెద్దలు వుండే యోగ్యతకు వీండ్లు మహాజబ్బై పోయినారు, మహాపిదప వాండ్లయి పోయినారు.
To Degrade v a పరువుతక్కువ చేసుట, పరువుచెడగొట్టుట, చిన్నపరుచుట,మానహాని చేసుట, అవమానము చేసుట. to * a priest గురు పీఠములోనుంచి తోసివేసుట, భ్రష్టుచేసుట, వెలివేసుట. he *edhimself అవమానము పొందినాడు.
To Deify v a దేవుణ్నిగా యెంచుట, దేవుణ్నిగా పూజించుట.he deifies his mother తల్లిని దేవతగా విచారిస్తాడు.
To Deign v n దయచేసుట, అనుగ్రహించుట, కృపచేసుట. he deignedto come to my house ఆయన మాయింటికి దయచేసినాడు. he didnot deign to go there అక్కడికి పోవడము మహా తక్కువని పోలేదు.* to hear us O Lord యీశ్వరా అనుగ్రహించి వినుమా.
To Delay v a అడ్డి చేయుట, అభ్యంతరముచేయుట, ఆటంకపరుచుట,జాగుచేయించుట.
To Delegate v a పంపించుట, రాయబారిగా పంపుట, అధికారమిచ్చుట.అప్పగించుట. In this business he was *d to speak for them యీ పనికివాణ్ని కార్యస్తున్ని చేసి పంపినారు.
To Deliberate v n ఆలోచించుట, యోచించుట.
To Delight v n సంతోషించుట, ఆహ్లాదించుట, ఉత్సాహపడుట, ఉల్లాసపడుట,ఆనందించుట. I * in her దాన్ని చూస్తే నాకు ముద్దువస్తుంది. he *edin this వాడు దీన్ని యిచ్ఛయించినాడు.
To Delineated v a వ్రాసుట, చిత్రము వ్రాసుట. or to describeవర్ణించుట, వివరించుట.
To Deliver v a to set free విడుదలచేసుట, విడిపించుట, విడిచిపెట్టుట,విముక్తిచేసుట. or to save రక్షించుట, కడతేర్చుట. or to surrender వొప్పగించుట, వొకనిపరము చేసుట, వొకని స్వాధీనము చేసుట, యిచ్చుట.he *ed a sermon వాడు ప్రసంగము చేసినాడు. I have a message to * to youనాతో చెప్పిపంపిన మాట మీతో ఒకటి చెప్పవలసి వున్నది. she *edthis woman (in child-bed) దానికి యీమె కానుపు చేసినది, మంత్రసానితనముచేసినది. she was lately *ed అది యిటీవల ప్రసవించింది.
To Delude v a మోసపుచ్చుట, వంచించుట.
To Deluge v a జలమయముచేసుట, ముంచివేయుట, వెల్లువపారి ముంచుట.the rain *d the garden వానకు తోటంతా వెల్లువైనది. her cheekswere *d with tears అది కన్నీరు మున్నీరుగా యేడ్చినది.
To Delve v a తవ్వుట, గుంటచేయుట.
To Demand v a అడుగుట, వ్యాజ్యము చేసుట, విల్లంగము చేసుట.what do they * for this cloth యీ గుడ్డకు యేమి వెల అడుగుతారు.they *ed admission మమ్ము లోనికి రానియ్యండని అన్నారు,లోనికి విడవండని అన్నారు . I * your proofs of this దీనికివుదాహరణ యేమి చెప్పు. he *ed my name నా పేరు అడిగినాడు. he*ed satisfaction of them వాండ్లను దానికి సమాధానము చెప్పుమనిఅడిగినాడు. this *s attention దీనికి జాగ్రత్త వుండవలసినది.this *s proof యిందుకు ఉదాహరణ వుండవలసినది. this *s all my time నేను యేవేళ ఆపనిలోనే వుండవలసి వున్నది.
To Demean v a to behave నడుచుకొనుట. he *ed himself proudlyవాడు గర్విష్టుడుగా వుండినాడు. he degrade himself ( a wronguse of * ) అలక్ష్యము పొందినాడు, అవమానము పొందినాడు.
To Demolish v a ఇడియకొట్టుట, పడగొట్టుట, పాడుచేసుట.or devour తినివేయుట.
To Demonstrate v a దృష్టాంతముగా కనపరుచుట, నిజపరుచుట.నిరూపించుట ప్రత్యక్షముగా చూపుట.
To Demoralize v a చెరుపుట, బుద్దిచెరుపుట, నీతిభంగముచేసుట.
To Demur v n సందేహించుట, సంశయించుట, అనుమానించుట.
To Denominate v a పేరు బెట్టుట.
To Denote v n సూచించుట, సూచనచేసుట, తెలియచేసుట, యెరుకచేసుట.this denotes that he is gone పోయినాడని యిందువల్ల తెలుస్తున్నది.
To Denounce v a చాటించుట. he *d punishment to them వాండ్లకు శిక్షచేస్తామని చాటించినాడు. he *d the thief to the magistrate వీడు దొంగని అధికారికి తెలియచేసినాడు.
To Denude v a గందిబరచుట, నిర్వాణము చేసుట.
To Deny v a కాదనుట, లేదనుట, లేదని సాధించుట, అపలాపించుట,వర్జించుట. he denied me the money ఆ రూకలు నాకు యివ్వనన్నాడు.I hope you will not * me this యిది నాకు కావలెదీన్ని యివ్వనకుండాతమరు దయచేయవలెను. he denied me leave నాకు సెలవు యిచ్చేదిలేదన్నాడు. he denied me the smallest trifle యెంత కొంచెమడిగినాయివ్వలేదు, రవంతైనా లేదన్నాడు, లేశమైన లేదన్నాడు. his fatherdenied him nothing తండ్రి కొడుకు మనసు వచ్చినట్టెల్లా పోనిచ్చినాడు.he denied my request నా మనివిని అంగీకరించిపోయినాడు. he denied them his favour అతడు వారి మీద దయచేయలేదు.he denied his child తన బిడ్డను త్యజించినాడు. he denied hischildren nothing and thus spoiled them బిడ్డలు కావలెనన్నదెల్లా వాండ్లకిచ్చి చెరిపినాడు. I * that అదికాదు, అట్లాలేదు. he denied the charge తాను అట్లా చేయలేదని యెగరగొట్టి మాట్లాడినాడు.నేను దాన్ని అచ్చుకోవలసినది లేదన్నాడు. he denied the statementmade in his letter తనజాబులో వ్రాసిన సంగతి నిజముకాదన్నాడు.he says that they are brothers ! this I * ! వాండ్లు అన్నదమ్ములనివాడంటాడు, నేను కాదంటాను. he says the thieves are there :this she denies ఆ దొంగలు అక్కడ వున్నారని వాడంటాడు అది లేదంటున్నది. they denied the marriage ఆ పెండ్లి జరిగినదేలేదని సాధిస్తారు. he denies all knoweldge of them వాండ్లనుబొత్తిగా యెరగనన్నాడు. he would not deny his appetite వాడు కడుపుకట్టడు. he denied his religion స్వమత ద్రోహియైనాడు. he denieshaving done so తాను అట్లా చేయలేదని అన్నాడు. they * havingthe money ఆ రూకలు తమవద్దలేనది సాధిస్తారు. they * that thisdeed ever existed యీ పత్రము పుట్టనేలేదంటారు. he denied that thiswas his letter యిది తాను వ్రాసిన జాబు కాదన్నాడు. to * himselfor to * his lusts విరక్తిగా వుండుట, జితేంద్రియుడుగా వుండుట,తనకు యేదిన్ని వద్దనివుండుట, వైరాగ్యముగా వుండుట.a mink denied his lusts వాడు కామాన్ని వర్జించినాడు. he deniedhimself clothes that he might buy books తనకు పైకిబట్టలు లేకపోయినా పోతున్నది పుస్తకములు కొంటేచాలు నన్నాడు.he denied himself nothing తనకు ఒకటిన్ని కాదనలేదు, వాడికికాదనేటిది ఒకటిన్ని లేదు, వాడికి అన్నిన్ని యిష్టమే, అనగా తనకు యిష్టమైనదాన్ని వొకటినైనా వొద్దనలేదు అన్ని తిన్నాడు,అనగా తనకిష్టమైనదంతా తీసుకున్నాడు. One who denies hisGod దేవద్రోహి. One who denies his father పితృద్రోహి.God denied them children దేవుడు వాండ్లకు సంతానమునుయివ్వలేదు.
To Depart v n and a. పోవుట, వెళ్లుట, తరలుట. he *ed the townపట్టము విడిచి తర్లినాడు. from this rule you must never *యీ నిబంధనను నీవు యెన్నటికి తప్పరాదు. he *ed form his agreementవాడు చేసిన వొడంబడిక తప్పినాడు. he will not * from his evilcourses వాడు తనదుర్మార్గములను విడవడు. he *ed this lifeచచ్చినాడు. God *d from him దేవుడు వాణ్ని చెయ్యి విడిచినాడు.
To Depatch v a కాచేయుట, జాగ్రత్త చేయుట. or to send పంపుట,రవాణా చేయుట , సాగించుట. or to do quickly త్వరగా చేయుట.or to eat తినివేయుట. or to drink తాగుట. or to kill చంపుట
To Depend v n వాలుట, వేలాడుట. the branches *ed low ఆ కొమ్మలుకిందికి వేలాడుతూ వుండినవి. the cause is still depending ఆ వ్యాజ్యముయిప్పటికి జరుగుతూ వున్నది. the suit now depending యిప్పుడు వారికిన్నివుండే వ్యాజ్యము.
To Depend upon v a అవలంబించుట. they * upon me వాండ్లునన్ను నమ్ముకొని వున్నారు. the crops * upon the rain పంటకు వర్షమేగతి. success *s upon prudence కార్యము కావడమునకు వివేకమేకారణము. I cannot * upon him నేను అతన్ని నమ్మను. shall I examinethe accounts ? that depends upon his permission ఆ లెక్కలనునేను విమర్శచేతునా అందుకు అతని వుత్తరవుకావలసివుంటున్నది.My going depends upon his arrival అతను వస్తేనే కాని నేను పోవల్లలేదు. this depends upon circumstances అప్పుడు పని యెట్లాగోదానికి తగినట్టు. you may * upon it this is false యిది అబద్దమనినీవు రూఢిగా నమ్మవలసినది. I will come * upon it నేను వత్తునునీవు గట్టిగా నమ్మవలసినది.
To Depict v a వర్ణించుట, చిత్తరువు, వ్రాసుట. this poet*s the gods as fools యీ కవి దేవుండ్లను వెర్రవాండ్లనుగా వర్ణిస్తాడు.
To Deplore v a దుఃఖపడుట, వ్యసనపడుట. I * your state నీవు వుండేస్థితిని గురించి నాకు వ్యసనముగా వున్నది. we much *d his death వాడి చావనుగురించి నిండా వ్యసనపడితిమి.
To Depopulate v a నిర్మానుష్యముచేసుట, పాడుచేసుట, నాశనముచేసుట.
To Deport v a నడుచుకొనుట, ప్రవర్తించుట. he *ed himselflike a king వాడు రాజు వలె నటించినాడు.
To Depose v a తోసివేయుట. they *d the king రాజును తోసివేసినారు. ot to state as a witness వాజ్మూలమిచ్చుట. four witness *d to thisయిందున గురించి నలుగురు సాక్షులు పలికినారు.
To Deposit v a వుంచుట, పెట్టుట. the river *s much sand in thisplace ఆ యేరు యిక్కడ నిండా యిసుకను కొంచవచ్చి చేరుస్తున్నది.this water *s lime యీనీళ్లలో సున్నము దిగుతున్నది. they *edthe corpse here ఆ పీనుగను యిక్కడ భూస్థాపితము చేసినారు.he *ed the money in the bank ఆ రూకలను కౌఠీలో వేసి పెట్టినాడు.
To Deprave v a చెరుపుట, భ్రష్టుచేసుట. drinking *s manతాగడముచేత మనుష్యులు చెడిపోతారు.
To Deprecate v a వద్దని బతిమాలుకొనుట, నివారించమని మొరపెట్టుకొనుట.they *d his anger నీకు కోపము కారాదని వాణ్ని బతిమాలుకొన్నారు.I * the idea of my being his enemy అతనికి నేను శత్రువుఅనే తలంపే నాకు వొద్దురా అబ్బా.
To Depreciate v a తక్కువ చేసుట, నికృష్టము చేసుట, చులకనగా యెంచుట, అలక్ష్యముగా యెంచుట. they *d him వాన్ని తక్కువగా మాట్లాడినారు. he *d their family వాండ్లను నికృష్టులుగా యెంచుతాడు.
To Depress v a అణుచుట, అదుముట, మట్టుపరుచుట, మట్టగించుట,భంగపరుచుట. this news *ed his spirits యిందువల్ల వాడు దుఃఖమునుపొందినాడు, వ్యాకులమును పొందినాడు. Depressed, adj. అణిగిన, మట్టుపడ్డ. a * spot in the plainబయలులో పల్లముగా వుండే స్థలము. they were in * circumstancesవాండ్లు మహాదీనదశలో వుండినారు. he was much * at this దీన్ని గురించిమహావ్యాకులపడ్డాడు.
To Deprive v a లేకుండా చేయుట, పొగొట్టుట. he *d me of my bread నా అన్నము పెరుక్కున్నాడు, నా కూటిలో రాయి వేసినాడు. I was *dof sight of the book ఆ పుస్తకము నాకండ్లపడలేదు. he was *dof the opportunity వాడికి సమయము లేకపోయినది. he was *d ofintellect వాడికి తెలివితప్పినది. *d of his father తండ్రిలేని, పితృవిహీనుడైన.by his coming I was *d of leisure అతడు వచ్చినందున నాకుసావుకాశము లేకపోయినది. after he was *d of his master అతనికి ధణీమనిపోయినందున. he was *d of strength by illness రోగముచేతబలహీనుడైనాడు.
To Depute v a అధికారము యిచ్చుట, రాయబారిగా పంపుట, వకీలుగాపంపుట. as I could not go I * d my brother నేను పోగూడనందుకునాకు బదులుగా మా తమ్ముణ్ని పంపించినాను.
To Derange v a కలుపుట, కలవరపరుచుట, గందరగోళము చేసుట.the children have * d all the books పిల్లకాయలు ఆ పుస్తకమునంతాగందరగోళము చేసినారు. his wife 's death *d all his plans పెండ్లాముచచ్చినందున వాడి యోచనలన్ని వ్యర్థమైనవి. this *d his schemesయిందువల్ల వాడి యోచనలు చెడిపోయినవి. drinking *s the health తాగడముచేత దేహము తారుమారౌతున్నది, వొళ్లుచెడుతున్నది.
To Deride v a యెగతాళిచేసుట, నవ్వుట, గేలిచేసుట. they *dhim వాణ్ని పరిహాసము చేసినారు, వాణ్ని నవ్వినారు.
To Derive v a తెప్పించుట, తెచ్చుకొనుట. to be derviedకలుగుట, ఉద్భవించుట. what advantage did you * from this ? యిందువల్లనీ కేమిలాభము కలిగింది. I dervied my information from his bookయీ పుస్తకము వల్ల నాకీ సమాచారము తెలిసినది. they * this wordfrom Sanscrit యిది సంస్కృతము లోనుంచి పుట్టిన శబ్దమంటారు, సంస్కృతతద్భవము అంటారు. . they dervied their originfrom him వీండ్లు ఆయన యొక్క సంతతి అంటారు. this derviesits origin from fever యిది జ్వరము వల్ల కలుగుతుంది. they * theirfamily from Pandavas తాము పాండవుల వారి వంశమందు పుట్టిన వారుఅంటారు, తమకు మూలపురుషులు పాండవులంటారు.
To Derogate v n లాఘవమౌట, గౌరవహాని యౌట, అపవాదమౌట. thisderogates from his dignity యిది వాడి గౌరవమునకు హాని.this marriage *d greatly from his dignity యీ పెండ్లివల్లవాడి గౌరవమునకు హాని వచ్చినది.
To Descant v a పదముపాడుట. to * on వర్ణించుట, విస్తరించిచెప్పుట.he *s upon his own deformity తన అందవికారమును వూరికే వర్ణిస్తాడు.
To Descend v a దిగుట. he *ed the hill కొండ దిగినాడు.
To Describe v a వర్ణించుట, వివరించుట. to * circleకైవారము చేసుట, చక్రము వేసుట, వలయాకారముగా గీచుట.
To Descry v a దూరమునుంచి కనుక్కొనుట. from the hill they descriedthe ship కొండమీదనుంచి ఆవాడను కనుకొన్నారు, కనిపెట్టినారు.
To Desecrate v a చెరుపుట, భ్రష్టుపరుచుట. he *d the Sabbathఆదివారమును చెరిపినాడు, అనగా ఆ దినమందు జరిగించవలసిన నియమములు తప్పినాడు. the Musulman *d the temple తురకలు ఆగుడినిఅశుచిచేసినారు.
To Desert v a and n. విడిచిపెట్టుట, చెయ్యి విడిచిపెట్టుట,పరిత్యాగము చేసుట. he *ed his wife భార్యను విడిచిపెట్టినాడు.they *ed the village ఆ వూరిని విడిచి పారిపోయినారు. they *edus మమ్ములను విడిచిరి, త్యజించిరి. they *ed to us తమ దండువిడిచి మా దండులో వచ్చిచేరిరి. Ten men *ed from the regimentఆపటాళమును విడిచి పదిమంది సిపాయలు పారిపోయినారు.
To Design v a ఉద్దేశించుట, యత్నముచేసుట, ప్రయత్నముచేసుట, నిశ్చయించుట. he *ed a picture వొక పటము వ్రాయవలెననిరేఖలు యేర్పరచుకొన్నాడు. he *ed the house but his son builtit వాడు ఆ యిల్లు కట్టవలెనని మొదట యత్నము చేసినాడు గానికొడుకుకు కట్టినాడు. he designed going పోదలచినాడు. Do you* returning మళ్లీ పోతావా, మళ్లి పోవలెనని వున్నావా. Design, n. s. ఉద్దేశము, యత్నము, యోచన, ఆలోచన. he did it by *వాడు దాన్ని బుద్ధి పూర్వకముగా చేసినాడు, వాడు దాన్ని కావలెననిచేసినాడు. he did it without * వూరికే చేసినాడు. they formeda * upon his life వాణ్ని చెరపవలెనని యోచించిరి. evil * దుర్బుద్ది,దురాలోచన.
To Designate v a పేరుబెట్టుట.
To Desire v a to wish, to long for, to covet కోరుట,యిచ్ఛయించుట, ఆశించుట. I * no more నాకు కావలసినది యింతే. what do you * నీకేమీ కావలె, నీవు కోరేది యేమి. to express wishesఅభీష్టమును తెలియచేసుట. to ask అడుగుట. he *d me to gothere నన్ను అక్కడికి పొమ్మన్నాడు. to entreat or request అడుక్కొనుట.he *d this of God. దీన్ని దేవుణ్ని అడుక్కొన్నాడు.
To Desist v n మానుకొనుట, చాలించుట, వదులుట, విడుచుట. If you won't * you will be ruined మానుకోకుంటే చెడిపోతావు.they * ed from speaking వాండ్లు మాట్లాడడము నిలిపినారు.when he *ed from eating they brought water వాడు తినడమునిలిపేటప్పటికి వాండ్లు నీళ్లు తీసుకొని వచ్చినారు.
To Desolate v a పాడుచేసుట, నిర్మానుష్యముచేసుట.
To Despair v n నిరాశచేసుట, ఆశ విడుచుట. his life is *edof యిఖను వాడు బ్రతుకుతాడనే ఆశ లేదు.
To Despise v a అలక్ష్యముచేసుట, నిర్లక్ష్యము చేసుట, అగుపడ్డచేసుట. he whom all * వూరురోసినవాడు. he *d the difficultyకష్టాన్ని లక్ష్యపెట్ఠలేదు.
To Despond n s నిరాసగావుండుట.
To Destine v a ఉద్దేశించుట, విధించుట, నియమించుట, నిర్ణయించుట,యేర్పరచుట. he *d his daughter to me తన కూతురిని నాకు యివ్వవలెననినిశ్చయించినాడు.
To Destroy v n నాశనము చేసుట, ధ్వంసము చేసుట, హతము చేసుట.పాడుచేసుట, చెరుపుట, చెడగొట్టుట, సంహరించుట, చంపుట. he *ed thechild బిడ్డను చంపినాడు. rats * books యెలుకలు పుస్తకములనుకొట్టివేస్తవి, పాడుచేస్తవి. he *ed the letter జాబును చించివేసినాడు.he *ed his eyes by reading చదివి కండ్లను పోగొట్టుకున్నాడు. he *edmy hopes నా యాశలు చెరిపినాడు, నా నోట్లో మన్ను వేసినాడు. to * apoison విషమును దించే మంత్రము. he *ed himself హత్య చేసుకోనివచ్చినాడు, తనకు తానే చెడ్డాడు.
To Detach v a to separate ప్రత్యేకపరచుట, విడతీయుట,వేరుచేయుట. to * troops దండులో వొక తుకుడిని పంపుట. he *edhimself from the world లోకమును త్యజించినాడు, సన్యసించినాడు,విరక్తుడైనాడు.
To Detail v a వివరించుట, వివరముగా చెప్పుట, సవిస్తారముగాచెప్పుట. he *ed some troops కొందరు సిఫాయలను పంపినాడు.
To Detain v a నిలుపుకొనుట, పట్టుకొనుట, వుంచుకొనుట, ఆటంకముచేయుట. business *ed me పనివల్ల రాకపోయినాను. I was *ed bythe rain నాకు వాన అభ్యంతరమైనది.
To Detect v a కనుక్కొనుట, కనిపెట్టుట. he *ed the theft ఆ దొంగతనాన్ని కనుక్కొన్నాడు. I *ed him in this యిందులో వాడుచేసిన మోసమును కనుక్కొన్నాడు. it was detected అది బయటపడ్డది.
To Deter v a భయపెట్టుట. this *red him యిందుచేత వాడుభయపడ్డాడు. I wished to buy the horse but the price *red meఆ గుర్రాన్ని కొనుక్కోవలెనని వుంటిని గాని దాని వెలచూస్తేభయమైనది.
To Deteriorate v n చెడుట, దిగుడౌట, their customs have *dవారి యొక్క మర్యాదలు కొంచెము చెడిపోయినవి.
To Determine v n and v. a. నిశ్చయించుట, నిర్ధారణచేసుట, నిర్ణయించుట, తీర్చుట, తీర్పుచేసుట. how have you *d నీవు యెట్లా నిశ్చయించినావు.Unable to * how to write the passage omitted it ఆ వాక్యము యెట్లావ్రాయవలెనో పాలుబోక విడిచిపెట్టినాను. this *s nothing యిందువల్లవొకటీ తీరదు. he *d to go పోవలెనని నిశ్చయించినాడు. this *d him togo దీనివల్ల వాడికి పోవలెననే నిశ్చయము కలిగినది.. he *d on going పొయ్యేటందుకు నిశ్చయించినాడు.
To Detest v a అసహించుట, రోసుట. I * it అది నాకు గిట్టదు.she *s them దానికి వాండ్లు గిట్టరు.I * this horse నేను యీ గుర్రము ముఖము చూడను.
To Dethrone v a ఛత్రభంగము చేసుట, సింహాసన త్యాగము చేయించుట,సింహాసనమునకు అర్హుడుకాడని తోసివేసుట, రాజ్యభ్రష్టుణ్నిగా చేసుట.they *d him అతనికి ప్రభుత్వము లేకుండా చేసినాడు.
To Detonate v n ఉరుమువలె ధ్వనించుట, పిడుగువలె మ్రోసుట.పఠీలుమనుట, ఢమీలుమనుట. like crackers పటాసులవలె పఠీలుమని ధ్వనించుట.
To Devastate v a పాడుచేసుట, నాశనము చేసుట.
To develope v a తెరచిచూచుట, మర్మమును బయటపెట్టుట, తెలియచేసుట.education *d his talent అతని శక్త చదువులో బయటపడ్డది. time * s thetruth నిజము నిలకడ మీద తెలుస్తుంది. Madness *d itself పిచ్చిబయటపడ్డది.
To Deviate తప్పుట,ఉల్లంఘనముచేసుట, not * from thisorder యీ ఆజ్ఞను తప్పరాదు. this *s from the rule యిది సూత్రభంగము.he *ed from the truth సత్యము తప్పినాడు, అబద్దమాడినాడు.
To Devolve v n వచ్చుట, నిర్వహించవలసి వచ్చుట. the estate*d to them, ఆయాస్తి వాండ్లకు వచ్చినది. In the absence of kingthe government *d on the minister రాజు లేనప్పుడు ఆప్రభుత్వమును మంత్రి నిభాయించవలసి వచ్చినది. these duties*d upon me. ఆపనులు చేయవలసిన వచ్చినది. It *s uponyou to explain this యిందుకు సమాధానము చెప్పవలసినభారము మీది.
To Devour v a కబలించుట, కబళీకరించుట, నోట్లోవేసుకొనుట,తినివేసుట, పాడుచేసుట, నాశనము చేసుట, ధ్వంసము చేసుట.fire *ed the forest అగ్ని అడివిని పాడుచేసినది.
To Dictate v a యెరుకచేయుట, బోధించుట, విధించుట, చెప్పివ్రాయించుట.they write while he *s చెప్పతూ వుండగా వీండ్లు వ్రాస్తున్నారు,వాడు చెప్పడము వీండ్లు వ్రాయడము.
To Diddle v n మోసము చేసుట, పితలాటకము చేసుట,వంచించుట.
To Die v n చచ్చుట, చనిపోవుట, గతించుట, పడిపోవుట,కాలంచేసుట, వాడిపోవుట, మృతిపొందుట. as leaves యెండిపోవుట.వాడిపోవుట. to * away as light or fire ఆరిపోవుట, మలిగిపోవుట.his hopes *d away వాడి ఆశ నానాటికికి క్షీణించిపోయినది. the sound*d away ఆ శబ్దము క్రమశః తగ్గిపోయినది. the breeze diedfor her దానిమీద ప్రాణములు విడుస్తున్నాడు . they died offవకడొకడుగా అందరు చచ్చినారు.
To Diet v n పథ్యము, భోజనము చేయుట . he *s poorlyవాడు బాగా భోజనము చేసేదిలేదు.
To Differ v n భేదించుట, ప్రత్యేకపడుట, విరోధించుట. this *s fromthe old one మునుపటిది వేరు యిది వేరు. మునుపటి దానికి దీనికి భేదముగావున్నది. these two books * ఆ పుస్తకములో చెప్పేరీతి వేరు. యీ పుస్తకములో చెప్పేరీతివేరు. they *ed వాండ్లు ఘర్షణ పడ్డారు, వాండ్లకు వ్యాజ్యము వచ్చినది. I * fromyou నీవు చెప్పినది కాదు, నీ అభిప్రాయము వేరు నా అభిప్రాయము వేరు.
To Diffuse v a వ్యాపింపచేయుట, విస్తరింపచేయుట. this flower*d its smell through the house యీ పుష్పము యొక్క వాసన యిల్లంతావ్యాపించినది, యిల్లంతా యీ పుష్పము వాసన కొట్టినది. this *djoy through the town యిది పట్టణములో వుండే వారందరికీఆనందమును కలగచేసినది.
To Dig v a తవ్వుట, to * a well బావితియ్యుట, నుయ్యి వేసుట. to * a pit పల్లముతవ్వుట. to * down యిడియకొట్టుట. thieves dug into my house దొంగలు నా యింట్లో కన్నము వేసినారు.to * through తోలుచుట. to * up తవ్వి పెళ్లగించుట.
To Digest v n జీర్ణమౌట, అరుగుట, హరించిపోవుట. this food *s easily యీ ఆహారము సులభముగా జీర్ణమౌతున్నదిwhen the wound was digesting ఆ పుండు చీముపోస్తున్నది. silverdigest easily easily in this liquid యీ ద్రావకములోవెండి సులభముగా హరించిపోతున్నది, అనగా కరిగినీరై పోతున్నది.
To Dight v a శృంగారించుట, అలంకారముచేసుట, దిద్దుట.
To Dignify v a గౌరవపరుచుట, గొప్పచేయుట, గణ్యపరుచుట,ఘనపరుచుట.
To Digress v n అడ్డదారితొక్కుట, మాట్లాడుతూ వుండే సంగతి విడిచి వేరే సంగతి యెత్తుట, అప్రస్తుత ప్రశంసచేసుట.the poet has hesre *ed into another subject యిక్కడ కవివేరేప్రసంగము తెచ్చినాడు, అనగా వేరే ప్రస్తాపాన్ని చెప్పినాడు.
To Dilacerate v a కొందుట, శరీరమును చిన్నాభిన్నముచేసుట. the tiger *d the man ఆ పులివాణ్ని చిన్నాభిన్నముచేసినది.
To Dilate v a వుబ్బేటట్టుచేసుట, వూరించుట. they *d theballoon గుమ్మటమును పొగతో నిండించినారు.this disease *sthe body యీ రోగముచేత శరీరము వుబ్బుతున్నది. the water *dhis belly నీళ్లచేత వాడికి కడుపు వుబ్బినది.
To Dilute v a తొర్లించుట, పలచనచేసుట, పాటుచేసుట.he *d the milk with water పాలులోనీళ్లు పోసి పలచన చేసినారు.*d brandy నీళ్లు కలిపిన బ్రాంది, అనగా జబ్బైన బ్రాంది.*d ( as style) పేలవమైన. a poor *d style జబ్బుగానీరసముగా వుండే కావ్యము.
To Dim v a మెరుగుమాపుట, కాంతినిచెడగొట్టుట, మకమకలాడేటట్టుచేసుట. age *s the eyes వృద్ధాప్యముచేత దృష్టి మందమౌతున్నది.
To Diminish v n తగ్గుట, తరుగుట, మట్టుపడుట, తీసిపోవుట. when the wind *ed గాలి మట్టుపడ్డప్పుడు.
To Dimple v n పల్లముపడుట, అనగా నవ్వేటప్పుడు బుగ్గలు,గడ్డముమీద సొగసుగా పల్లము పడుట. the lake*d when I threw thestone is to it ఆ చెరుపులో రాయి వేయగానే అది తరంగితమైనది.
To Din v n అరుచుట, మొరబెట్టుట. he dinner that in my ears చెప్పినదే వూరికె చెప్పినాడు.
To Dine v n భోజనము చేసుట, పగటిభోజనము చేసుట.I *d there yesterday నిన్న అక్కడ భోజము పెట్టుట, విందుచేసుట.this rice was enough to forty people యీ అన్నము నలభైమందిభోజనము చేయడమునకు చాలును.
To Dip v a ముంచుట, అద్దుట. he dipped in the bag or hedipped his hand in the bag సంచిలో చేయివేసినాడు.
To Direct v a to aim in a strait line లక్ష్యము పెట్టుట, గురివుంచుట. he *ed the gun at them ఫిరంగిని వాండ్లమీదికి పారేటట్టు తిప్పిపెట్టినాడు. he *ed his discourse to me వాడు నాతట్టు తిరిగిమాట్లాడినాడు. he *ed his remarks at me వాడు నన్ను గురించి మాట్లాడినాడు.he *ed his eyes at me వాడి దృష్టిని నా మీదికి తిప్పినాడు. it *edits flight to the hill కొండమీదకి యెగిరినది. to regulate క్రమపరుచుట.he *ed his steps thither or course thither అక్కడికిపోయినాడు. an all * ing providence సర్వరక్షకుడైన దేవుడు. to order అజ్ఞాపించుట. I *ed him to go వాన్ని పొమ్మని సెలవు యిచ్చినాను. to guide దోవచూపుట.they *ed me to his house వాడి యింటికి నాకు దారి చూపినాడు .to * a letter పై విలాసము వ్రాసుట. they * ed the letter to meఆ పై విలాసము నాపేరట వ్రాసినారు.
To Dirt v a మురికిచేసుట, మైలచేయుట, మాపుట. he *edall the table ఆ మేజనంతా రోత చేసినాడు.
To Dirty v a మురికిచేయుట, మైలచేసుట, మాపుట. I willnot * my hands with the business నేను ఆ జోలికి రాను.
To Disable v a దుర్బలపరుచుట, బలహీనము చేసుట.this wound *d him ఆ గాయముతో వాడు మూలకుముట్టుగా పడ్డాడు.
To Disagree v a to differ భేదించుట, విరోధించుట, వికటించుట,వొంటపడకుండా వుండుట. these accounts * యీ లెక్కలు ఒకటికొకటిగాసరిపడలేదు . this food *d with him వాడికి యీ ఆహారము గిట్టలేదు.వాడికి యీ ఆహారము విరోధించినది. he *d with them వాడికివీడికి సరపడలేదు.
To Disallow v a వొప్పుకోకపోవుట, కూడదనుట, నిషేధించుట.they *ed this item యీ పద్దును వాండ్లు వొప్పుకోలేదు.
To Disannul v a కొట్టివేసుట, రద్దుచేసుట.
To Disappear v n మరుగై పోవుట, దాగుట, పారిపోవుట, మాయమౌట.they*ed in the forest అడవిలో మాయమైనారు, దాగినారు. the demon *edఆ దయ్యము మాయమై పోయినది, అంతర్ధానమైన పోయినది. the thiefhas *ed దొంగముఖము తప్పించినాడు, పారిపోయినాడు. the moskitoshave now *ed ఆ దోమలు యిప్పుడు కనపడడం లేదు . the star has now *edఆ చుక్క యిప్పుడు కనపడడము లేదు. the fever *ed జ్వరముతీరినది,తేలిపోయినది.
To Disappoint v a ఆశ చెడగొట్టుట, వంచించుట, మోసము చేసుట.he says he will do it , I will * him తాను చేస్తానంటాడు గానివాన్ని భంగపరుస్తాను చూడు, మొక్క చెరుస్తాను చూడు.
To Disapprove v a అంగీకరించకపోవుట, సమ్మతించకపోవుట.వొప్పకపోవుట. he *d it or he *d of it దాన్ని వొప్పుకోలేదు. they* this custom యీ మర్యాద వాండ్లకు సరిపడదు.
To Disavow v a వొప్పుకోకపోవుట, తనదికాదనుట, నిరసించుట.he *ed the letter యీ జాబు తాను వ్రాసినదే కాదన్నాడు. he *ed them నా వాండ్లు కారన్నాడు. he *ed his wife and child ఆలుబిడ్డలను త్యజించినాడు. he disavowed the thought నేనుఅట్లా తలచనే లేదన్నాడు.
To Disband v a to dismiss from military service సైన్యమునుతిసివేసుట, పటాలాన్ని పగలకొట్టుట, దండును యెత్తివేసుట.he *edthe troops ఆ సైన్యమును యెత్తివేసి వారి వారిని పొమ్మనిసెలవిచ్చినాడు. they *ed themselves and returned homeదండులో వుద్యోగమును మానుకుని తమ దేశమునకు వెళ్లినారు.
To Disburden v a దించుట, బళువుదించుట. they *ed the shipవాడను కాలిచేసినారు, వాడ సరుకు దింపినారు. he *ed the bullocksపెరికెలను దించినాడు. he *ed his mind or his conscience మనసులోవుండే దుఃఖాన్ని బయట చెప్పినాడు. this made him * his stomachయిందుచేత వాడికి వాంతి అయినది.
To Discard v a to dimiss from service వుద్యోగములోనుంచితోసివేసుట, తీసివేయుట, యెత్తివేసుట. or to cast off విడిచిపెట్టుట,పరిహరించుట. he *ed two line s in this letter యీ జాబులోరెండు పంక్తులను పనికి రాదని కొట్టివేసినాడు, యెత్తివేసినాడు. I * the thought ఆ తలంపే విడిచి పెట్టినాను. out of theseten books they respect eight but they * the other twoయీ పది పుస్తకాలలో యెనిమిది మంచివేగాని కడమ రెండు పనికిరానివంటారు.
To Discern v a కనుక్కొనుట, చూచుట, నిదానించుట. I *edthe difference ఆ భేదమును కనుక్కొన్నాను.
To Discipline v a శిక్షించుట, ఉపదేశించుట, నేర్పుట. well* troops బాగా చెయి తీరిన దండు.
To Disclaim v a యెరుగననుట, తెలియదనుట. I him వాడునావాడు కాడు. he *ed all knowledge of the business ఆ జోలి తనకుతెలియదన్నాడు.
To Disclose v a తెరుచుట, విచ్చుట, బయటపెట్టుట, విశదపరుచుట,తెలియచేయట.
To Discolour v a వర్ణమును పోగోట్టుట, వివర్ణముచేసుట.
To Discomfit v a వోడగొట్టుట, అపజయపరుచుట.
To Discommode v a ఆయాసపెట్టుట, తొందరపెట్టుట.
To Discompose v a ఆయాసపెట్టుట,కలుచుట. this discomposedhim much యిందు చేత వాడికి చాలా ఆయాసము వచ్చినది.
To Disconcert v a to disappoint భంగపరుచుట.మొక్కపరుచుట, వెక్కిపోయ్యేటట్టుచేసుట. to confound కలతపరుచుట, కలవరపెట్టుట.
To Discontinue v n నిలిచిపోవుట. the road *s hereదారి యిక్కడ నిలిచిపోతున్నది, దీనికి అవతల దారిలేదు.
To Discount v a తోసుకునియిచ్చుట, ధరాతుతోసుకుని యిచ్చుట,అనగా హుండి గెడువుకు మునుపే రూకలు చెల్లించే పక్షమందుతరుగు తోసుకుని యిచ్చుట, వట్టము తోసుకుని యిచ్చుట. the merchant*ed the bill వర్తకుడు ఆ హుండికి ధరాతుతోసుకునికడమ రూకలు చెల్లించినాడు.
To Discountenace v a వుపేక్షించుట, నిగ్రహించుట, నిరాకరించుట, they *d this business యీ పనిని వారు ఉపేక్షచేసినారు.
To Discourage v a అధైర్యపరుచుట. they *ed me in thisbusiness యీ పనినీచేతకాదన్నారు. the weather *d me from goingకాలము వుండే వైఖరిని చూచిపోవడము మానుకొన్నాను. I tried to * him but he would not listen to me నేను యెంతవద్దన్నా వాడు వినలేదు.
To Discover v a to find out కనిపెట్టుట, తెలుసుకొనుట. I *edhis house వాడి యింటిని కనిపెట్టినాను. I cannot * that wordఆ మాట నాకుచిక్కలేదు. he *ed a new star కొత్తగా వొక నక్షత్రమునుకనిపెట్టినాడు. when *ed the tiger he took to flight ఆ పులినిచూడగానే పరుగెత్తి పోయినాడు . to shew చూపుట, కనపరుచుట, అగుపరుచుట. he *ed his friendship in this యిందులో వాడి స్నేహమును అగుపరిచినది. he *ed the secret ఆ మర్మమును బయటపెట్టినాడు.బయటవేసినాడు. at last insanity *ed it self తుదకు వెర్రిబయటపడ్డది.
To Discumber v a బరువుదించుట. they *ed him of the load వాడికి బరువు దింపినారు. he* ed the cattle పెరికెను దించినాడు.he *ed himself of his coat వాడు చొక్కాయను తీసివేసిహాయిగావున్నాడు.
To Discuss విమర్శించుట,విచారించుట,తర్కించుట,వాదించుట, they *ed the question అందున గురించితర్కించినారు. t o dissolve కరగకొట్టుట. this oil has a virtuein *ing tumuors యీ తైలములో వాయువుగెడ్డలను కరగకొట్టే గుణమువున్నది. Vulgarly to eat or drink ( see Don Juan. XVI.34. )తినివేయుట, కాచేయుట, తాగివేయుట.
To Disdain v a అలక్ష్యముచేసుట, అనాదరణచేసుట, ఉపేక్షచేసుట. he *ed telling a falsehood అబద్దమాడుట, నిండాతక్కువనియోచించినాడు. as he *ed telling a falsehood he acknowledgesthis అబద్దమాడడము హేయమని దాన్ని వొప్పుకొన్నాడు.
To Disease v a రోగము తగిలించుట, నొప్పి తగిలించుట. thiswater *d them యీ నీళ్ల చేత వాండ్లకు రోగము వచ్చినది.
To Disembark v a దించుట, వాడలోనుంచి దించుట, దిగుమతి చేసుట.
To Disembogue v n సముద్రగామీయౌట, సముద్రములోపోయిచేరుట.సముద్రసంగమౌట. the river krishna *s into the sea near masulipatamబందరు దగ్గెర కృష్ణ సముద్ర గామియౌతున్నది.
To Disembowel v a కడుపును చీల్చి పేగులు వెళ్లదీసుట.
To Disentagle v a విడిపించుట, వదిలించుట, చిక్కుదీయుట.he *d himself form these follies యీ దుర్మార్గములనువదులు కొన్నాడు.
To Disesteem v a అలక్ష్యము చేసుట, అగౌరవముగా యెంచుట.
To Disfigure v a వికారముచేసుట, అందవికారముచేసుట.కురూపము చేసుట, విరూపము చేసుట.
To Disfrachise v a అధికారము తోసివేసుట, యిది వక గ్రామమునుగురించిన మాట అనగా parliament మెంబరుని నియమించి పంపేఅధికారము లేకుండా తోసివేయుట.
To Disgorge v a కక్కుట, వెళ్లగక్కుట. they forcedhimto * the money వాడి దగ్గెర ఆరూకలము కక్కించినారు.
To Disgrace అవమానముచేసుట, this conduct *s him యిట్లాచేసుట చేత వాడికి అవమానము వస్తుంది.
To Disguise v a వేషము వేసుకొనుట, మారువేషము వేసుకొనుట,మరుగు చేసుట. he *d himself వాడు మారువేషము వేసుకొన్నాడు.he *d me as his servent తన పనివాడి వేషము నాకు వేసినాడు.she *d him as a woman వాడికి ఆడవేషము వేసినది. he *d hishandwriting తన అక్షరాలని తెలియకుండా వ్రాసినాడు. In thisletter he*d his hand యీ జాబులో తన వ్రాలని తెలియకుండావుండేటట్టు వ్రాసినది. he *d his voice మారు గొంతుగామాట్లాడినాడు.
To Disgust v a అసహ్యమును కలగచేసుట, చీదరపుట్టించుట.this *ed him యిందుచేత వాడికి చీదరపుట్టింది, యిందుచేత వాడికిఅసహ్యము వచ్చినది.
To Dishinherit v a బాధ్యత లేకుండా చేసుట. he *ed his sonతన ఆస్తిని తన కొడుకుకు సంబంధము లేకుండా చేసినాడు.
To dishonor v a అవమానపరుచుట, అగౌరవముచేసుట. to * thesabbath ఆదివారమును అగౌరవముచేసుట , అనగా లౌకిక పనులలోప్రవర్తించుట. he *ed his profession వాడిచేత వాడికులానికితక్కువ వచ్చినది. he did not * his profession వాడిచేత వాడి కులానికి పేరు వచ్చినది. to * a woman స్త్రీ ని చెరుపుట.he *ed the bill ఆ హుండిని వాడు ఆ గౌరవమును చేసినాడు, అనగాదానికి రూకలు చెల్లించలేదు.
To Disinter v a పాతిపెట్టిన దాన్ని పెళ్లగించి యెత్తుట, పాతిపెట్టినశవమును మళ్లీ పెళ్లగించి యెత్తుట. they *red a few imagesభూస్థాపితము చేయబడియుండిన కొన్ని విగ్రహములను కనిపెట్టియెత్తినారు. he *rd the letter చిక్కకుండా వుండిన జాబునుకనిపెట్టినాడు.
To Disjoin v a విడదీయుట, ప్రత్యేకముచేసుట, యెడబాపుట.the sea *s the two countries సముద్రము ఆ రెండుదేశములను ప్రత్యేక పరుస్తుది.in writing English we always* the words యింగ్లిషు వ్రాయడములో వకటితో వొకటి కలియకుండాప్రతిశబ్దమునున్ను ప్రత్యేకముగా వ్రాస్తున్నాము. I *edthier hands వాండ్లు కూర్చుకొన్న చేతులు విడదీసినాను.he *ed the two estates ఆ రెండు స్థితులునున్ను ప్రత్యేకముగాచేసినాడు. in this sentence all the words are *ed యీ వాక్యములోశబ్దములన్ని వ్యస్తపదములుగా వున్నవి, మాటలు విడివిడిగా సంధిలేకుండావున్నవి.
To Disjoint v a బెసికించుట, కీలుతప్పించుట. the fall*ed his arm పడినందున వాడిచెయ్యి తొలగినది.
To Dislike v a అసహించుట, యీసడించుట. I * thisయిది నాకు అసహ్యము, గిట్టదు. they * it యిది వాండ్లకుసమ్మతికాదు, యిది వాండ్లకు అసహ్యము.
To Dislocate v a బెసికించుట, కీలుతప్పించుట, పట్టువదిలించుట,తొలిగించుట. he fell and *d his arm వాడు పడినందునవాడి చెయ్యి బెసికినది.
To Dislodge v a స్థానము తప్పించుట, వెళ్లగొట్టుట, లేవదీసుట.he *d the snake ఆ పామును పుట్టలో నుంచి బయటికి వెళ్లకొట్టనాడు.
To Dismiss v a పంపుట, శెలవు యిచ్చి పంపుట, తోసివేసుట. * these fears! యీ భయము విడిచిపెట్టు. they *ed meon my journey వాండ్లు నన్ను సాగనంపినారు. he *ed us withhis blessing మమ్ములను దీవించినాడు. he *ed the caseఆ వ్యాజ్యమును తోసివేసినాడు.
To Dismount v n దిగుట, గుర్రము, సవారి, చెట్టు, గోడమీదమొదలైన వాటిమీదనుంచి దిగుట.
To Disoblige v a అసహ్యముచేసుట, ఆయాసముచేసుట,చీదరచేసుట . he *d then వాండ్లకు అసహ్యమును చేసినాడు.
To Disown v a తనది కాదనడము, యె రుగననుట, వొప్పుకోకపోవుట.he *ed the child ఆ బిడ్డను తనది కాదన్నాడు. I * the thoughtఆ తలంపే అక్కరలేదు.
To Disparage v a అలక్ష్యము పెట్టుట, తిరస్కరించుట,రవ్వచేసుట, అవదూరు పెట్టుట, దూషించుట . they *d my effortsనేను చేసిన యత్నములు పనికిరావన్నారు.
To Dispatch v a see To Despatch.
To Dispel v a చెదరకొట్టుట, పోగొట్టుట, నివారించుట,బాపుట, యెడబాపుట. the sun *s the fogs and darkness సూర్యుడుమంచునున్ను చీకటినిన్ని పొగొట్టుతున్నాడు. he *led their earsవారి భయమును పోగొట్టినాడు.
To Dispense v a యిచ్చుట, పంచిపెట్టుట,వినియోగము చేసుట. God *s his favors to men దేవుడు తలావొకటి కృపచేస్తాడు. judge *s justice న్యాయాధిపతి న్యాయమునునెరవేరుస్తున్నాడు. I cannot * with his attendance వాడు కూడాలేకుంటే నాకు కూడదు. I cannot * with this యిది లేకుంటే నాకు జరగదు.you must * with them వాండ్లు లేకుండా నీవే జరుపుకోవలసినది.you may * with going there అక్కడికి నీవు పోవలసిన అక్కరలేదు.can you * with this యిది ప్రస్తుతము మీకు అక్కరలేదా . I caneasily * with this యిది లేకుంటే నాకు లక్ష్యము లేదు.
To Disperse v n చెదిరిపోవుట, యదాయదలై పోవుట. the assembly *d ఆ సభ కలిసిపోయినది.
To Dispirit v a అధైర్యపరుచుట, కుంగకొట్టుట, భయపెట్టుట,వ్యాకులపెట్టుట.
To Displace v a స్థలము తప్పించుట, తోసివేయుట, తీసివేయుట.he *d the stones ఆ రాళ్లను లేవనెత్తినాడు. the king *d the ministerఆ రాజు మంత్రిని తోసివేసినాడు.
To Display v n చూపుట, తెలియచేసుట, అగుపరుచుట, జంభము,అగుపరుచుట. God *ed his mercy on this ఈశ్వరుడుతన కృపను యిందులో అగుపరిచినాడు. the peacock *s his tailతన ఫించమును జంభముగా అగుపరుస్తున్నది. she *ed herjewels తన సొమ్ములను జంభముగా చూపినది. the flower *s itsbosom to the sun సూర్యోదయమైతే పుష్పము వికసిస్తున్నది.
To Displease v a అసహ్యపరుచుట, అయాసము చేసుట.
To Dispose v a to set in order యేర్పరచుట, క్రమపరుచుట,క్రమముగా వుంచుట. at chese we * the men in two lines చదరంగములో కాయలను రెండు వరసలుగా పెట్టుతాము. he *dhis hands in this manner వాడి చేతులను యిట్లా పెట్టుకున్నాడు.this * d him to be my friend యిందుచేత వాడికి నాతో స్నేహముచేయవలెననే బుద్ధి పుట్టినది. this *d him to consentయిందువల్ల వాడికి వొప్పుకోవలెనని తోచినది. God *d him to dothis యిట్లా చేసేటట్టు వాడికి దేవుడు ప్రేరేపించినాడు, బుద్ధిపుట్టించినాడు.my submission *d him to pardon me నా నమ్రత నన్నుమన్నించేటట్టువాణ్ని చేసినది. to * of వినియోగపరుచుట, అమ్ముట. how did you * of the money ఆరూకలను యేమిచేసినావు?how did you * of this దీన్నియేమి చేస్తావు, దీనికి యేమిగతి చేస్తావు.he *d of his daughter in marriage వాడు కూతురిని పెండ్లిచేసి యిచ్చి ఆ బరువు తీర్చుకున్నాడు. how did he * of his sonవాడి కొడుక్కు యేమిదోవచేసినాడు. he cannot * of his daughterవాడి కూతురికి పెండ్లి అయ్యే గతి కానము. I shall soon * of your queen ( at chess ) నీ మంత్రిని త్వరగా కాజేస్తాను.as soon as I have * d of this work I will comeయీ పనిని తీర్చివేసి వస్తున్నాను. how am I to * of myselfto-morrow? నేను రేపు యెట్లా నడుచుకోవలసినది, నేనుయేమి చేయవలసినది. how did you * of your time నీవు యెట్లా పొద్దుపుచ్చినావు. he did not know how to * ofhis time యెట్లా పొద్దుపుచ్చేదో వాడికి తోచలేదు. he * d of the dog ఆ కుక్కను నివర్తి చేసినాడు, అనగా తరిమివేసినాడు,అమ్మివేసినాడు, చంపివేసినాడు. he *d of his horseఆ కుక్కను నివర్తిచేసినాడు, అనగా తరిమివేసినాడు, అమ్మివేసినాడు, చంపివేసినాడు. he *d of his horse వాడు గుర్రమును అమ్మివేసినాడు.I have not yet *d of the books ఆ పుస్తకములను నేనుయింకా అమ్మలేదు. the cat soon *d of the rat పిల్లి యెలుకనుకాజేసినది. I did not know how to * of the childrenబిడ్డలను యేమి చేసేదో నాకు తోచలేదు. I laid down upon onestone and *d of my feet on another వొక రాతిమీద పరుండిమరివొక రాతిమీద కాలుపెట్టుకొంటిని.
To Dispossess v a వెళ్లగొట్టుట, ఉద్వాసనము చేసుట, లేవనెత్తుట.అస్వాధీనము చేసుట, అపహరించుట . to * the white-ants he pouredin some oil చెదుళ్లను లేకుండా చేయడానకై కొంచెము నూనెపోసినాడు.he *ed them వాండ్లను వెళ్లగొట్టినాడు. he *ed me of the propertyనా సొత్తును అపహరించినాడు. After the enemy was *edశత్రువులు వూరు వెళ్లకొట్టబడ్డ తరువాత.
To Dispraise v a నిందించుట.
To Disprove v a కొట్టివేయుట, ఖండించుట, కాదని సాధించుట,లేదని సాధించుట. this *s what he said before దీనిచేత వాడు మునుపుచెప్పినది ఖండించబడ్డది. this * the marriage యిందువల్లపెండ్లి జరగలేదనేది రూఢమౌతున్నది. the disproving evindence ఈ నేరము తాను చేయనట్టు పలికించే సాక్షి.
To Dispute v a తర్కించుట, వివాదముచేసుట, ఘర్షించుట,పోరాడుట. he *s this యిట్లా కాదని అంటారు. he *d thierauthority వాండ్లకు అధికారము లేదంటాడు. I * this అట్లా కాదు. I did not * his orders వాడి వుత్తరవుకు నేను అడ్డము చెప్పలేదు.they* d his passage వాన్ని పోనియ్యకుండా అడ్డగించినాడు. they* your right నీకు స్వతంత్రము లేదంటారు.
To disqualify v a అనర్హముగా చేసుట, అనుపయుక్తముచేసుట,అయోగ్యపరుచుట. his age disqualifies him for the business వృద్దాప్యముచేత వాడు యీ పనికి తగడు. drunkeness disqualifies himfor thebusiness తాగడము చేత వాడు అయోగ్యుడైనాడు.
To Disquiet v a ఆయాసపెట్టుట, వ్యాకులపెట్టుట, కలవరముచేసుట, తొందరచేసుట.
To Disrate v a to dismiss, turn out వుద్యోగములో నుంచి తోసివేసుట,తీసివేసుట.
To Disregard v a ఉపేక్షచేసుట, అనాదరణచేసుట, అలక్ష్యమువేసుట.he *ed this దీన్ని వాడు విచారించలేదు. he * ed my orders వాడునా వుత్తరవును ఉపేక్ష చేసినాడు. they * him అతన్ని అలక్ష్యముచేస్తారు.
To Disrelish v a అరుచిచేసుట, అసహించుట. he *ed my advice నామాటలు వాడికి అపథ్యముగా వుండినవి, విషముగావుండినవి. I * it అది నాకు అరుచి , అది నాకు అయిష్టము.a sick man *es everything రోగికి అన్నిన్ని అరోచకము.
To Disrespect v a ఉపేక్షించుట, అనాదరణచేసుట, అమర్యాదచేసుట, అలక్ష్యము చేసుట.
To Disrobe v a వస్త్రము తీసివేసుట, వుడుపును తీసివేసుట,బట్టలను విచ్చివేసుట. this wind *d the trees యీ గాలికిచెట్ల ఆకులన్ని దూసుకొనిపోయినవి.
To Dissatisfy v n అసమాధానమును కలగచేసుట, అసహ్యమునుకలగచేసుట, అయాసపరుచుట.
To Dissect v a ఛేదించి పరిశోధించుట, తునకలు తునకలుగాకోసుట. or to examine శోధించుట, పరిశీలనచేసుట. they *ed the body ఆ పీనుగను కోసి చూచినారు.
To Disseize v a to dispossess or deprive అపహరించుట,దోచుకొనుట. he of the estate వాడి ఆస్తిని దోచుకున్నారు.he was *d of his paternal inheritance వాడి పితురార్జితమునుఅపహరించినారు.
To Dissemble v n మారీచము చేసుట, మాయలుచేసుట, టక్కులుచేసుట.they *d with God దేవుని యడల మాయ చెయ్యడానకు ఆరంభించినారు.why should you * with me నా దగ్గరయెందుకు మాయలు చేస్తావు.టక్కులు చేస్తావు.
To Disseminate v a వ్యాపింపచేసుట, ప్రచురణముచేసుట.this stench of the drains *s disease యీ జలదారులకంపురోగమును కలగచేస్తుంది, వ్యాపింపచేస్తుంది. thisnewspaper *d his doctrines thro' the country యీ సమాచారపత్రికచేత వాడియొక్క మతము దేశమంతా వ్యాపించినది, విత్తబడ్డది.
To Dissent v n సమ్మతించకపోవుట, భిన్నఅభిప్రాయపడుట. I * withthem వారి అభిప్రాయము నాకు సరిపడలేదు. the Jangams * form theBramins జంగములు బ్రాహ్మణ్యమును వొప్పక భిన్నమతమునుఅవలంబించిన వాండ్లు. I entirely * from this యిది నామతమేకాదు, నా అభిప్రాయమే వేరు.
To Dissever v a వియోగముచేసుట, వీడకొట్టుట, వేరుచేసుట,భిన్నపరుచుట, ఖండించుట, కోసివేసుట. they *ed the head తలకోసివేసినారు.
To Dissipate v a చెదరగొట్టుట, పోగొట్టుట, పాడుచేసుట.this *d his doubts యిదివాడి సందేహమును పోగొట్టినది. he *dhis estate ఆస్తిని పొగొట్టుకొన్నాడు, పాడుచేసినాడు.
To Dissolve v n కరిగిపోవుట. the sugar*d బెల్లము నీరైపోయినది. she *d in tears అది యేడ్చినది. he *d in sweat వాడికి చెమట నీళ్లుగా వడిసినది.
To dissuade v a కూడదనుట, వద్దని బోధించుట. I tried to * himbut I could not నేను యెంతవద్దన్నా వాడు వినలేదు. His wifetried to * his but in vain వాడి పెండ్లాము వాడి మనసునుతిప్పవలెనని చూచిందిగాని పనికిరాలేదు. they *d me from going నేను పోకూడదన్నారు, నేను పోవడము మంచిది కాదన్నారు, వాండ్లువద్దన్నందున నేను పోలేదు. I was *d by them from writingthe letter వాండ్లు వద్దన్నందున ఆ జాబు వ్రాయక మానుకొన్నాను.I will not be *d by him వాడు యెంత వద్దన్నా నేను వినను.am I to be *d by them ? వాండ్లు వద్దంటే నేను వింటానా.
To Dissyllable adj ద్వ్యక్షరియైన, రెండుఅక్షరములుగల.a * word రెండు అక్షరములు గల పదము, అనగా bul-lock Rea-son,Moun-tain &c. Dissyllable, n. s. ద్వ్యక్షరములు. the word సీతా sitais a * సీతా అనే శబ్ధము ద్వ్యక్షరము.
To Distain v a మరకచేసుట, కళంకపరుచుట. tears *ed hercheeks దాని ముఖమంతా కన్నీరు మరుకలైనవి. Distance, n. s. దూరము, యెడము, అవకాశము. some * కొంతదూరము.కొంతమేర. or difference వ్యత్యాసము, బేధము. * or reserveబెరకు, సంకోచము. or coldness మట్టు, మర్యాద, దాపు.అదబు. he kept his * or he kept at a * form me వాడుదూరంగానే వుండినాడు. I wish you would keep your * హద్దుమించేవు సుమీ. he keeps his wife at a * వాడు పెండ్లానికియెడమిచ్చేదిలేదు, చొరవలేదు. * in pictures పరస్థలము.there is a church in the * పరస్థలములో వొక గుడినివ్రాసి వున్నది, అనగా పటములో వొకదానికి అవతల మరివొకటిఅగుపడే భావముగా వ్రాసియున్నదని అర్థము.
To Distance v a మించుట. he *d them వాండ్లను కిందికితొక్కినారు, వాడి ముందర వాండ్లు నిలువలేక పోయినారు, వాడితో వాండ్లు నిగ్గలేకపోయినారు, ఆయన యెక్కడ వీండ్లెక్కడ.this *d all the rest యీ చిన్నవాడు అందరినిన్ని మించినాడు. వీడి ముందర కడమవాండ్లు వేరే యెత్తవలసినది లేకపోయినది.
To Distend v a ఉబ్బించుట. he *ed his cheeks వాడు బుగ్గలనువుబ్బించినాడు.
To Distill v a బట్టిలో ధృతిదించుట. to * liquo's ధృతిదించుట. the mango tree *s gum మామిడి చెట్లనుంచి బంక కారుతుంది.
To Distinguish v a భేదమును అగుపరుచుట, భేదమును ను కనుక్కొనుట,న్యూనాధిక్యములను కనుక్కొనుట. or to judge వివేచించుట. how do you * between these two fruits యీ రెండు పండ్లకుబేధమేమి. I cannot *his featurs at this distance యింత దూరములోనుంచివాణ్ని గురతుపట్టలేదు. he * ed himself వాడు ప్రసిద్దుడైనాడు.పేరెత్తినాడు. he *ed his servants by a particular garb తన పనివాండ్లనిస్పష్టముగా తెలిసేటట్టు వొక విశేషమైన వుడుపుయిచ్చినాడు. the king *ed him with a sword రాజు అతనికివొక కత్తి బహుమాన మిచ్చి గొప్పచేసినాడు.
To Distort v a వికారము చేసుట, విరూపముచేసుట. To *the meaning అపార్ధముచేసుట. pain*ed his face నొప్పిచేతవాడి ముఖము వికారమై పోయినది.
To Distract v a తెలివితప్పించుట, తెలివిపోయ్యేటట్టచేసుట,కలవరపెట్టుట, దిగ్భ్రమచేసుట, చీకాకు పరుచుట. It *edmy attention అందుచేత నా బుద్ధి కలవరపడ్డది.
To Distrain v a జప్తిచేయుట, అప్పును గురించి సొత్తులనువిక్రయించుట. they *ed for rent బాడిగకై సామానునుఅడ్డగించినారు.
To Distress v a తొందరపెట్టుట, శ్రమపెట్టుట, కష్టపెట్టుట,దుఃఖపెట్టుట.
To Distribute v a పంచిపెట్టుట, భాగించియిచ్చుట, వినియోగముచేసుట. I * d it among them దాన్నివాండ్లకు పంచిపెట్టినాను. he *d hisfavours among them వారి యందు దయచేసినాడు. to * justice న్యాయవిమర్శచేసుట, న్యాయము జరిగించుట.
To Distrust v a సందేహించుట, అపనమ్మికపడుట. I *edthem నేను వారిని నమ్మలేదు.
To Disunite v a యెడబాపుట, విడదీయుట, వేరుచేసుట, ప్రత్యేకించుట,ఊడగొట్టుట. I *d their hands వాండ్లు కూర్చుకొన్న చేతులనువిడదీసినాను.
To Disuse v a మానుకొనుట. he *d writing for one monthనెలదినములు వ్రాయడము మానుకొన్నాడు. they *d milkవాండ్లు పాలుతాగడము విడిచిపెట్టినాడు.
To Ditch v a అగడ్త తవ్వుట, కందకము తవ్వుట, పల్లము తవ్వుట.
To Divaricate v n ద్విభాగమౌట.
To Dive v n ముణుగుట, ముణిగి దేవులాడుట. he *d in search of pearls ముత్యాలకై ముణిగినాడు. to * intoa secret మర్మమును భేదించుట లో చొచ్చిచూచుట. I triedto * into business ఆమర్మమను తెలిసికొనవలెనని యత్నపడ్డాడు.
To Diversify v a నానావిధముచేసుట, చిత్రవిచిత్రము చేసుట.he *ed the poem with many incidents ఆ కావ్యములోనిండా చిత్ర కథలు పెట్టినాడు.
To Divert v a తిప్పుట, మళ్లించుట, విడదీసుట. they *ed my attentionనన్ను భ్రమపడే లాగు చేసినారు, నన్ను యేమార్చినారు. this *edhim from his purpose యిందుచేత వాడు చేయవలెనని వుండిన పనిచేయక మానినాడు. they *ed the money to another purposeఆ రూకలను మరివొక పనికి వినియోగపరిచినారు, అన్యధా చేసినారు.they *ed the water to another village ఆ నీళ్లను మరివొకవూరికి తిప్పినారు. or to amuse సంతోషపెట్టుట, ఉల్లాసపరుచుట.వేడుకచూపుట, ప్రొద్దుపుచ్చుట, నవ్వించుట. or to draw the mindయేమార్చుట, యేమరించుట, మరిపించుట. to * the child she tolda long story ఆ బిడ్డను మరిపించడానకై వొక పెద్దకథనుచెప్పినది. he *ed himself with a book వాడు వొక పుస్తకముతోప్రొద్దుపుచ్చుకున్నాడు.
To Divest v a లేకుండా చేసుట, దోచుట, అపహరించుట.he *ed the tree of its bark ఆ చెట్టుపట్టను వొలిచివేసినాడు. he *ed himself of his coat వాడు చొక్కాయ తీసివేసినాడు. weshould * ourselves of prejudice మనము దురభిమానమును విడిచిపెట్టవలెను.the question is now *ed of difficulties సరే ఆ సంగతిలో వుండేసంకటములు తీరిపోయినవి. To divide, v. a. భాగించుట, రెండుగా చేసుట, ఖండించుట, తుండించుట, తెంచుట, పృథక్కుచేసుట, ప్రత్యేకముగాచేసుట.he *d the people into two parts వాండ్లను రెండు భాగములుగాచేసినాడు. or to deal out పంచిపెట్టుట. he *d it amongthe children దాన్ని బిడ్డలకు పంచిపెట్టినాడు, వినియోగముచేసినాడు. they *d themselves into three bodies వాండ్లు మూడు తెగలైనారు.in arithmetic భాగహారించుట, పాలుపుచ్చుట . * 100 by 4 నలుగురికినూరియ్యి, నూటిని నాలుగింట భాగించు.
To Divide v n విభాగమౌట, వేరౌట, చీలుట. the river here *sinto branches ఆ నది యిక్కడ రెండుపాయలుగా చీలుతున్నది.
To Divine v n జోశ్యము చెప్పుట, శకునము చెప్పుట. to * byplamistry సాముద్రికము చెప్పుట. to * by lots చీట్లువేసి చూచుట.
To Divorce v a పరిత్యాగము చేసుట, విసర్జించుట, విడిచిపెట్టుట,తోసివేసి ఘటశ్రాద్ధముచేసుట. he *d his wife వాడు పెండ్లాన్నితోసివేసి ఘటశ్రాద్ధము చేసినాడు. you have *d yourself from us నీకు నీవే మమ్మున త్యజించినావు.
To Divulge v a మర్మమును బయట విడుచుట, రహస్యమునుబయటపెట్టుట. he *d the secret ఆ మర్మమును బయట విడిచినాడు.
To Dizen v a శృంగారించుట, యిది యెగతాళిమాట . *ed out,or bedizened శృంగారించిన.
To Do v n ఆడుట, అనుట. how * you * ? నీకు యెట్లా వున్నది.యిది వూరక మర్యాదను గురించి చెప్పేమాట. did you go other? I did అక్కడికి పోయినావా, పోయినాను. I did not నేను పోలేదు.Tell him do that I will come నేను వస్తున్నానని వాడితో చెప్పవోయి.come her do ! యిక్కడ రావోయి. I cannot * without thisయిది లేకుండా నాకు జరగదు, నాకు గడవదు. you must * withoutthe horse for one day నీవు యీ పూటకు గుర్రము లేకుండాజరుపుకోవలేను. he did so with his hand వాడు చేతిలో యిట్లా అన్నాడు.this will * or suffice సరి, యిది చాలును , యిది పనికివచ్చును,యిది సరిపడును. will mere talking * ? వట్టిమాటల చేత యేమౌను.either way will * యెట్లా చేసినాసరే, యే విధమైనా సరే. this will never * యిది పనికిరాదు, యిది కారాదు. It will 'not* to omit this :or, it will not * for you to omit thisయిది మానుకోకూడదు, యిది విడిచిపెట్టకూడదు. what a to-do! యేమిరచ్చ.what a to do about this triffle యీ అల్పానికేమి యింత రచ్చ.a do little or do nothing పనికిమాలినవాడు, సోమారివాడు.
To Doat v n తేరుపుమరుపుగా వుండుట, తెలివితప్పివుండుట,పిచ్చిగా వుండుట, భ్రాంతిగా వుండుట, మోజుగా వుండుట. he *s upon herదాని మీద పడిచస్తాడు, దానిమీద ప్రాణం విడుస్తాడు. I * uponthis book నా ప్రాణమంతా ఈ పుస్తకము మీద వున్నది.
To Dock v a to cut off a tail గుర్రము యొక్కతోకనునరుకుట. to cut anything short దేన్నైన తగ్గించుట,మట్టుచేసుట, తగ్గించుట. he *ed the accounts ఆ లెక్కలనుతగ్గించినాడు. In this map Madras is *ed of some milesof its territory యీ పటములో చెన్నపట్టణపు దేశములోకొన్ని ఘడియల మేరను తోసివేసి వ్రాసియున్నది. to lay theship in a dock దాచిపెట్టుట. they docked the ship వాడను దొరువులో వుంచి మరమత్తు చేసినారు.
To Doctor v a వైద్యము చేసుట, చికిత్సచేసుట, యిది నీచమాట,యీ మాటకు చంపుట అని యెగతాళిగా ప్రయోగిస్తారు.
To Dodge v n and v. a. తొలిగితప్పించుకొనుట మోసముచేసుట.he *d to avoid the blow ఆ దెబ్బను తప్పించుకొన్నాడు.he *d to elude the question ప్రశ్నకు వుత్తరము చెప్పకుండామాయచేసినాడు. he *d the boy in his lesson వాడి పాఠములోయిక్కడ వకటి అక్కడ వకటి అడిగినాడు.
To Doff v a తీసివేసుట. he doffed his hat టొప్పి చేతతీసుకున్నాడు, అనగా దండము పెట్టినాడు. he *edhis coat చొక్కాయ తీసివేసినాడు.
To Dog v a కుక్కవలె మనిషి జాడపట్టుట. I saw two mendogging me యిద్దరు నన్నుపొంచుకినిరాగా కనుక్కొన్నాను.I doggedhim to his brother house నేను పోంచు వేసుకోనిపోయి వారుతన అన్న యింట్లో చొరబడగా చూస్తిని.
To Dogmatize v n పిడివాదముగా మాట్లాడుట, చెప్పుట.
To Dole out v a పంచిపెట్టుట, వినియోగముచేసుట, వడ్డించుట.she *d out a mess to each అది తలా కొంచెము వడ్డించినది.
To Dominate v n అధికారముచేసుట, యేలుట, ప్రభుత్వము చేసుట.
To Domineer v a ధూర్తప్రభుత్వము చేసుట, దౌర్జన్యముగా ప్రభుత్వము చేసుట.
To Don v a ( i.e. do-on ) తొడుక్కొనుట, యిది కావ్యమందువచ్చేమాట.
To Doom v a విధించుట, ఆజ్ఞాపించుట. they *ed him to deathవాణ్ని చంపవలసినదని విదించినారు.
To Dose v a మందు యిచ్చుట.
To Dot v a బొట్టు పెట్టుట, చుక్కపెట్టుట.
To Dote v n తెరుపుమరుపుగా వుండుట, తెలివితవుండుట.భ్రాంతిగా వుండుట, మోజుగా వుండుట, పిచ్చిగా వుండుట. she * uponher child అది దాని బిడ్డమీద ప్రాణములు విడుస్తున్నది.
To Double v a రెట్టించుట, రెట్టింపుగాచేయుట, మడుచుట.he * d the guard అపారాను రెట్టింపుగా పెట్టినాడు. he *d hisfist వాడు పిడికిటిని బిగపట్టినాడు. the thief *d the wallఆ దొంగ గోడమూల తిరిగి పరుగెత్తినాడు. the hare *d the hillఆ కుందేలు కొండను తిరిగి పరుగెత్తినది. we *d the cape కేపు అనే దేశమును చుట్టుకుని పోయినాము. he *d down the leaf అది తెలియడానకు వక కాకితపు కొనను మడిచిపెట్టినాడు.he *d up the handkerchief వాడు రుమాలను మడత పెట్టినాడు.
To Double-lock v a బీగము చెవిని రెండుమాట్లు తిప్పుట.
To Doubt n a సందేహించుట, సంశయించుట, అనుమానించుట.I * him అతని యెడల నాకు నమ్మిక లేదు. I * this యిది నిజముకాదని నాకుతోస్తున్నది. I * the rule ఆ సూత్రాన్ని నేను నమ్మలేదు.I *his doing so వాడు అట్లా చేస్తాడని నాకుతోచలేదు. why shouldyou * me నాయందు యెందుకు అనుమానపడతావు.
To Douse v a దించుట, వాడచాప కొడి మొదలైన వాటినిదించుట, యిదితుచ్ఛ శబ్దము.
To Dovetail v a పెట్టె మొదలైనవాటి మూలలనుకుసులతో సంతన చేసుట.
To Down v a to overset అణుచుట, అణగకొట్టుట.
To Doze v a to stupify మైకమిచ్చుట.
To Draft v a చిత్తు కదిరించుట, యీడ్చుకొనుట. he *ed tenmen into this regiment యీ పటాళములోకి పదిమందినియెత్తుకున్నారు, యీడ్చుకున్నారు.
To Drag v a యీడ్చుట, లాగుట. I cannot * my legs along నాకాళ్లు తీపులుగా వున్నది నడవలేను. he is dragging a miserablelife వాడు మహాకష్టముగా జరుపుకొంటువున్నారు, వాడికి మహాయిబ్బందిగా వున్నది.
To Dragoon v a దౌర్జన్యము, జరిగించుట, పండారి దౌడుచేసుట.అల్లరిచేయుట..Drain, n,s., జలదారి,కాలవ, తూము. mere are *s oneach side of the streetవీధికి రెండు పక్కల జలదారులున్నవి. this purging in s uo * onhis health ఈ ప్రవర్తులు జలక్షీణకరము . this is a * upon hispayయిది వాడి జీతానికి వృదా గెలుపు.
To Drain v n వడిసిపోవుట, యిగిరిపోవుట, వట్టిపోవుట.the water *ed out or *ed away నీళ్లు తీసిపోయినది, వడిసిపోయినది.
To Dramatize v a నాటకముచెప్పుట. Drank, (that past tense ) Drink అనే క్రియకు భూతాకాలము.
To Draw v n తీసిపోవుట, యింకిపోవుట, యిగిరిపోవుట.the boil *s పుండు చీము కూరుస్తున్నది, పండు తీపుతీస్తున్నది.the matter is *ing to a close ఆపని ముగియవచ్చినది. the marriageis now * ing near పెండ్లి దగ్గరికొస్తున్నది. he drew a sideవొత్తినాడు తొలగినాడు. to * back వెనక్కు తీసుట. they drew near him వాడి దగ్గరికి వచ్చినారు. the feast *s nigh పండగసమీపిస్తున్నది, పండుగ దగ్గిరించినది. the people drew togetherజనము కూడినది. It is *ing towards evening అస్తమానముకావచ్చినది. he drew up to me నా సమీపమునకు వచ్చినాడు. they drew up in a line వాండ్లు వరుసగా నిలిచినారు. I drewup at his door వాడి యింటిదగ్గిర గుర్రమును నిలిపినాను. he drewupon me కత్తిదూసుకొని నాపైకి వచ్చినాడు . he drew uponme for money నాపేరట హుండి వ్రాసినాడు.
To Drawl v n దీర్ఘాలుగా మాట్లాడుట, దీర్ఘములుగా చదువుట.
To Dread v a భయపడుట, దిగులుపడుట. I * fever నాకు జ్వరమువచ్చునని భయముగా వున్నది. he *s this greatly వాడు యిందుకు మహా దిగులుపడుతాడు.
To Dream v a కలలో చూచుట. you must have dreamt thisనీవు దీన్ని కలలో చూచివుండవలెను, అనగా భ్రమపడివుందువు.
To Dredge v n వలవేసుట, v. a. పిండి చల్లుట, ముగ్గుపెట్టుట.
To Drench v a తడుపుట, ముంచుట. a *ing rain జడివాన. he *ed me with water నీళ్లు పోసి నన్ను తడిపినాడు. to * a horsewith physic గుర్రానికి భేదికి యిచ్చుట. to * a horse or tomake it drink గుర్రానికి నీళ్లు చూపుట.
To Dress v n బట్టలు తొడుక్కొనుట. they * in white వాండ్లుతెల్లబట్టలు తొడుక్కొంటారు. she *es ill అది వికారముగా బట్టలుతొడుక్కొంటున్నది.
To Dribble v n బొట్లుబొట్లగా కారుట. the estate *d awayఆ యాస్తి కొంచెము కొంచెముగా కరిగిపోయినది.
To Drift v a గట్టుకు తోసుట. the waves *ed the corpseto the shore ఆ పీనుగ అలల్లో గట్టుకు కొట్టుకొని వచ్చినది.
To Drill v a to pierce బెజ్జము వేసుట, రంధ్రముచేసుట, తొలుచుట. (troops) శిక్షించుట, కవాయిత్తు చేసుట.
To Drink v a తాగుట, దాహము పుచ్చుకొనుట. they gave himto * వాడికి దాహానికి యిచ్చినారు. fever *s up their strengthజ్వరము చేత వాండ్ల బలము అణిగిపోతున్నది. to absorb యీడ్చుకొనుటపీల్చుట. they drank in his histories వాడు చెప్పే కథలనుమహా ఆదరముగా విన్నారు. the ground *s in the rain వాన నీళ్లు భూమిలో యింకిపోతున్నది. *ing horn పానపాత్రము, చషకము.
To Drip v a కారనిచ్చుట.
To Drive v n కొట్టుకొనిపోవుట, పోవుట. he drove homeబండిమీద యెక్కి తానే తోలుకొని యింటికి పోయినాడు. the ship drove ashore ఆ వాడ దరి తట్టింది. we let the ship * ఆ వాడను గాలి పోయిన దోవను విడిచినాము. the wind was driving along గాలి వడిగా కొట్టుతూ వుండినది. a driving rain గాలి తేచ్చే వాన. what are you driving at నీ అభిప్రాయ మేమి, నీ భావమేమి.
To Drivel v n జొల్లుకారుట. he *s or he talks like a fool వెర్రివాడివలె మాట్లాడుతాడు.
To Drizzle v n చినుకుట. it is drizzling సన్న చినుకులు పడుతూ వున్నవి.
To Drone v n కాలహరణము చేసుట, జాగు చేసుట.
To Droop v n and v. a. శుష్కించుట, క్షీణించుట, దుర్బలమౌట,కుంగుట, కుందుట, వాడిపోవుట, వాలిపోవుట, వేలబడుట, చెడుట,వేల వేసుట. he *ed from the day he heard this యిది విన్ననాటినుంచి వాడు కుంగిపోయివున్నాడు. he *ed his head తల వేలవేసినాడు.this revived his *ing spirit యిందు చేత వాడికి వుండిన ఆయాసము తీరినది.
To Drop v a పడనిచ్చుట, జారవిడుచుట, విడిచిపెట్టుట, వదులుకొనుటరాల్చుట. they *ped milk on the bread రొట్టేమీద పాలు చిలకరించినారు.she *ped a tear అది యేడిచినది. he *ped the subject ఆ ప్రస్తాపముమానుకోన్నాడు. he *ped the persuit ఆ యత్నమును మానుకున్నాడు. he has now quite *ped me నన్ను యిప్పుడు బొత్తిగా చేయ్యి విడిచిపేట్టినాడు. they *ped the conversation ఆ సంభాషణ మానుకొన్నాడు. you must * me a letter నీవు నాపేరట వొక జాబు వ్రాయవలసింది. the cow has *ped a calf ఆ యావు యీనింది. she *ped or drooped her eyes అది తల వంచుకొన్నది. the ship dropped anchor లంగరు వేయబడ్డది.
To Drown v a ముంచుట, నీళ్లలో ముంచి చంపుట. he *edhis grief in study వాడివ్యసనము మరిచి పొయ్యేటట్టుగా గ్రంథశోధనను చేస్తూ వుండినాడు.
To Drub v a పులుముట, మొత్తుట, బాదుట.
To Drudge, drudge v n. దాసుడుగా పాటు పడుట, వెట్టికి పని చేసుట, గులాపుపనిచేసుట. he *s at writting వాడు వెట్టికి వ్రాస్తాడు, అనగా జీమూతముగా వ్రాస్తాడు.
To Drug v a మందు బెట్టుట. they * ged the wine to stupify him వాడికి తెలివి తప్పిపొయ్యేటట్టు సారాయిలో మందు కలిపినారు.
To Drum v a దండోరా వేసి వెళ్ళకొట్టుట, చాటించుట. they *med him out దండోరావేసి వాణ్ని వెళ్ళకొట్టినారు. he *med the story in my ears నాతో ఆసంగతిని నచ్చుపెట్టి వూరికె చెప్పుతూ వచ్చినాడు.
To Dry v n యెండుట, యెండిపోవుట, ఆరుట, యింకిపోవుట. he put the clothes to *దోవతులు ఆరవేసినాడు. she spread the corn to * అది వడ్లను యెండబోసినది.
To Dub v a కొట్టుట, తట్టుట, పేరు యిచ్చుట, కితాబు యిచ్చుట.the king *bed him knight రాజు వాడికి knight అనే కితాబును యిచ్చినాడు.
To Duck v n తలవంచుట.
To Dull v a మాంద్యమకలుగచేసుట. the picture is *ed ఆపటము,.మెరుగుమాసిపోయనది. పాతగిలిపోయినది. his taste is *ed bydrunken. s. తాగుబోతైనందున వాడికి రుచిపచి తేలియలేదు.
To Dun v a గోజాడుట. తరువుచేసుట. నక్షత్రతరుపుచేసుట.కక్కసించుట. (తగాదా చేసుట H)
To Dung v n ఎరుగుట. regarding sheep or goats పెంటికలువేసుట. of cows or buffaloes కడిబేట్టుట,. పేడవేసుట. to manurea field ఏరుపువేసుట. of birds of fishes రెట్టవేసుట. of horesesor elephan. s. లద్దివేసుట. to * the filed by penning sheepon it మేకలమంద కట్టుట.
To Dupe v a ఏమరించుట, మోసపుచ్చుట. he *d them అతడిచేత వాండ్లు గడ్డితిన్నారు.
To Dust v a తట్టుట, తుడుచుట, దులుపుట, విదిలించుట.he *ed the fruit with sugar ఆ పండ్లలో చక్కెర చల్లినాడు.
To Dwell v n నివాసము చేసుట, కాపురముండుట. he dwell upon thesubject for a long time అందున గురించి బహుదూరము మాట్లాడినాడు,వుపన్యసించినాడు. he dwelt long on the weakness of this evidenceయీ సాక్షిని నమ్మకూడదని బహుదూరము మాట్లాడినాడు. why should you * uponthis subject యిందున గురించి అడుగడుక్కు యెందుకు వూరక మాట్లాడుతావు.
To Dwindle v n శుష్కించిపోవుట, సన్న నూలు వడుకుట, వుడుగుట, వూచపోవుట, క్షయించి పోవుట, తక్కౌవుట.
To Dye v a ( with colour ) చాయ వేసుట, అద్దుట.అద్దకము చేసుట, రంగువేసుట.
To Dye, or die v a. చాయవేసిన, అద్దిన, తడిపిన, తడిసిన.
To Ear v a దున్నుట, కృషిచేసుట, వ్యవసాయము చేయుట.
To Earn v a ఆర్జించుట, సంపాదించుట, గణించుట.unable to * his bread there, he went away అక్కడ కూటికి గడవనందున లేచిపోయినాడు.
To Earth v a మంటికింద దాచుట, భూమిలో దాచుట. to uneartha fox నక్కనుబొక్కలో నుంచి వెళ్లదీసుట.
To Ease v a శాంతపరుచుట, ఉపశమనము చేసుట, సుళువు చేసుట,లఘువు చేసుట. this *d his mind యిందువల్లవాడికి నెమ్మది అయినది. he *d offthe rope. ఆ తాడును వదిలించినాడు, ఆ తాడును సళ్లవిడిచినాడు. this *dthe pain యిందుచేత ఆ నొప్పి నివారణమైనది . to * nature శంకానివర్తికిపోవుట to * himself శంకానివర్తికి పోవుట, లఘుశంకకు పోవుట .
To Eat v n తినివేసుట, భోజనముచేసుట, హరించుట. they * together వాండ్లుకూడా భోజనము చేస్తారు. rust *s into the sword తుప్పు కత్తిని తినివేస్తున్నది. leprosy *s into the flesh పెద్ద రోగము మాంసము తినివేస్తున్నది.Sorrow *s into the soul వ్యసనముచేత ప్రాణము కుంగిపోతున్నది, ప్రాణము విసికిపోతున్నది.
To Ebb v n తగ్గుట, తగ్గిపోవుట, క్షమించుట, వట్టిపోవుట.the water is *ing యిది పాటు సముయము. his strength *ed away వాడి బలము క్షీణించిపోయినది.
To Echo v n ప్రతిధ్వనించుట. they laughed so that the house *ed యిల్లు యెగిసిపొయ్యటట్టు నవ్వినారు.
To Eclipse v a మరుగుచేసుట . the moon *d the star ఆ నక్షత్రము చంద్రుడిమరుగునపడ్డది. they *d him వాండ్ల ముందరవాడు దీవిటికింది దీపమైపోయినాడు .
To Economize v a పోణిమిగా జరుపుకొనుట మితముగా జరుపుకొనుట, పాటిగాజరుపుకొనుట. he *s his time వాడు క్రమముగా కాలక్షేపము చేస్తాడు, వాడు ప్రొద్దునువృధా పోగొట్టడము లేదు.
To Edge v a వారగా పెట్టుట. I * d my chair up to him నా కురిచినిపక్కవాటుగా వాడివద్దకు జరుపుకొన్నాను.
To Edify n s నిష్టకలుగచేసుట, బోధించి శ్రద్ధకలగచేసుట. they were much edifiedat this యిందుచేత వాండ్లకు మంచినిష్ట కలిగినది .
To Edit v a గ్రంథమును సవరించి అచ్చు వేయించుట. Johnson *ed Shakspear'splays షేకుస్పీరు చెప్పిన నాటకములను జా్స ్ సవరించి అచ్చువేయించినాడు.
To Educate v a to instruct youth విద్యాభ్యాసము చేయించుట, విద్యాబుద్దిచెప్పుట, చదువుసంధ్య నేర్పుట, శిక్షచెప్పుట, చదువు చెప్పుట. he *d his son shamefully.కొడుక్కు దుర్భుద్ధులు నేర్పినాడు.
To Educe v a See Infer Deduce.
To Eek v a See To Eke.
To Efface v a తుడిచివేసుట, చెరిపివేసుట, కొట్టివేయుట, మాపుట. he *d thesewords యీ మాటలను గోకి యెత్తివేసినాడు. the fever *d this from his memory.జ్వరముచేత యిది వాడికి జ్ఞాపకము తప్పినది. his kindness *d his formerseverity from my mind అతడు చేసే విశ్వాసముచేత మునుపు అతను చేసిన క్రౌర్యమునా మనస్సులో లేదు.
To Effect v a సఫలముచేసుట, యీడేర్చుట, వొనగూర్చుట, నెరవేర్చుట, నిర్వహించుట,కాజేసుట, కొనసాగించుట. I cannot * this నేను దీన్ని నిర్వహించలేను. shouldyou fail in *ing దీన్ని నీవు నెరవేర్చినట్టయితే. he wrote so as to * his object వాడు తన కోరిక సఫలము అయ్యేలాగు వ్రాసినాడు. Bathing *ed a cure స్నానముఆరోగ్యతను కలగ వేసినది. he *ed a cure తుదకు స్వస్తము చేసినాడు.
To Effervesce v n పొంగుట, బుస్సుమనిపొంగుట.
To Egg v a (to urge incite) పుల్లలు బెట్టుట, పురికొలుపుట.
To Egotize v n to talk much of one"w self వూరికే తన వృత్తాంతమే అతిశయముగాచెప్పుకొనుట.
To Ejaculate v a and v. n. హరి హరీ, రామరామా, అయ్యోయ్యో అనుట.he *d a curse గొణుగుతూ శపించినాడు. he *d a prayer వాడు తనలో తాను ప్రార్థనచేసుకొన్నాడు.
To Eject v a బయటికితోసుట, వెళ్లకొట్టుట, నివర్తిచేసుట. they *ed him fromthe office వాణ్ని వుద్యోగములోనుంచి తోసివేసినారు. they *ed him from thehouse. వాణ్ని యింట్లోనుంచి వెళ్లకొట్టినారు.
To Elaborate v a శృంగారించుట, పరిష్కరించుట, తీర్చుట.
To Elapse v n గడుచుట, గడిచిపోవుట, జరుగుట, అతిక్రమించుట.
To Elasticity v a స్థితిస్థావకము is thus spelt in Colebr. Essay on Philosophy.
To Elate v a ఉల్లాసపరుచుట.
To Elbow v n మోచేతితో పొడుచుట. do not * me నన్ను మోచేతితో పొడవవద్దు. they were *ing with one another తోదోపుళ్లుగా వుండినారు.
To Elect v a యేర్పరచుట, యేర్పరచి, యెత్తుట. they *ed him as their representatives పదిమంది కూడి విమర్శించి వాన్ని యేర్పరచి తమ గుమస్తాగా పంపించినారు.
To Electrify v a రాపిడిచేత నిప్పును కలుగచేసుట. Rubbing woodelectrifies it కాష్టమును మధిస్తే అందులో అగ్ని పుట్టుతున్నది, అనగా అదేఇంధనాగ్ని. the sight electrified him దాన్ని చూచుట చేత వానికి రోమాంచముకలిగినది. By the jolting of the horse I was so throughly electrified thatthe rheumatic pain in my breast was quite cured ( Wesley's Works. 4. 98.)గుర్రము వూరక యెత్తివేసుటచేత నా వొళ్లు అగ్నిజ్వాలైపోయినది గనక నా రొమ్మునొప్పి బొత్తిగాపోయి విడిచినది. See Wesley's Works. 4. 98.
To Elevate v a పైకి యెత్తుట, పొడిగించుట, గొప్పపరుచుట. he *d his handsచేతులను పైకి పొడుగ్గా యెత్తినాడు. Don't * your voice అరవవద్దు,కుయ్యవద్దు, పెద్దగొంతు యెత్తవద్దు. Poetry *s the mind కావ్యము మనసుకుఉల్లాసమును కలగచేస్తున్నది.
To Elicit v a బయటతీసుట, ఉపాయముగా వెళ్లతీసుట. I *ed thissecret from him యీ మర్మమును వాడి కుండా బయటతీస్తిని. I at last *ed the sense తుదకు దాని అర్ధము వెళ్లదీసినాను.
To Elide v a లోపించుట, లోపమౌట.
To Eliminate v a బహిష్కరించుట, తోసివేసుట, యిది మహాగణితసంబంధమైన మాట. Elimination, n. s. (banishment , rejection ) బహిష్కరణము, తొయ్యడము.
To Elongate v a పొడుగుచేసుట, దీర్ఘము చేసుట, సాగ కొట్టుట,సాగదీయుట.
To Elope v n పారిపోవుట. she *d with him form her father's houseవాణ్ని యెత్తుకొని తండ్రి యింట్లోనుంచిపారిపోయినది. Tara *d with chandra( Venus and Mars) తార చంద్రుణ్ని అంటుకొని పోయినది.
To Elucidate v a వివరించుట, విశదపరుచుట, తటపరుచుట.
To Elude v a తప్పించుట, తప్పించుకొనుట, యేమార్చుట, వంచించుట.he *d the blow దెబ్బ తప్పించుకొన్నాడు. he *d the question ప్రశ్నకువుత్తరము చెప్పకుండా యేమార్చినాడు. he *d their notice వాడు వాండ్లకుఅగుపడకుండా తప్పించుకొన్నాడు .
To Emaciate v a యెండగొట్టుట, కృశింపచేసుట, శుష్కింపచేసుట,చిక్కగొట్టుట.
To Emanate v n కలుగుట, పుట్టుట, ఉద్భవించుట. light *s fromthe sun ప్రకాశము సూర్యుడిలోనుంచి పుట్టుతున్నది. this order *s from the Minisiters యిది మంత్రులుగా చేసిన వుత్తరవుఅనగా, యీ ఆజ్ఞకు కారకులు మంత్రులు.
To Emancipate n a దాస్య విమోచనము చేసుట, బంధవిముక్తిచేసుట.he *d his slaves తాను రూకలను పెట్టి కొనుక్కొన్న లంపతాలనువిడిచిపెట్టినాడు, దాసత్వ విముక్తి చేసినాడు.
To Emasculate v a విత్తులు తీసుట, వృషణాలు కొట్టుట, కాలుపట్టుట.పుంస్త్వమును పోగొట్టుట, ఖొజ్జాగా చేసుట. By leaving out all the Sancritwords he * d the Telugu సంస్కృతలనంతా విడిచిపెట్టినందున తెలుగును నిస్సారము చేసినాడు, నీరసము చేసినాడు, జబ్బుచేసినాడు.
To Embalm v a శవము కుళ్లిపోకుండా వుండేటట్టు పరిమళద్రవ్యములను నించి కాపాడుట.
To Embank v a కట్ట వేసుట, మడవ వేసుట.
To Embark v a వాడిమీద యెక్కించుట, వాడకెక్కించుట. he *ed his moneyin this business వాడిరూకలను యీ వ్యాపారములో పెట్టినాడు.
To Embarrass v a చిక్కుల పెట్టుట, చీకాకుపరుచుట, యిబ్బందిపరుచుట,కలతబెట్టుట, తొందరబెట్టుట.
To Embellish v n శృంగారించుట, అలంకరించుట, వర్ణించుట.
To Embezzle v a అపహరించుట, తినివేసుట, యజమాన ద్రోహముచేసి రూకలనునోట్లో వేసుకోనుట, స్వామి ద్రోహము చేసుట, సిద్దాయము చేసుట.
To Embitter v a నీరసపరుచుట, విషమైపొయ్యేటట్టుచేసుట.
To Emblazon v a శృంగారించుట.
To Embody v a చేర్చుట. I embodied his vocabulary in my dictionaryఅతని యొక్క భాషా మంజరిని నా నిఘంటులో చేర్చుకొన్నాను.
To Embolden v a ధైర్యపరచుట, ధైర్యమును కలగచేసుట. this *ed me tospeak to him అతనితో మాట్లాడడానకు యిందుచేత నాకు ధైర్యము వచ్చినది.
To Embowel v a కడుపుచీల్చి పేగులను వెళ్లదీసుట.
To Embrace v a కౌగిలించుకొనుట, ఆలింగనము చేసుకొనుట, అంగీకరించుట.they *d each other ; or they *d కౌగిలించుకొనిరి. he *d their opinionవీడికిన్ని వాండ్ల అభిప్రాయమే కలిగినది. they *d the Christian religion వాండ్లుక్రిస్టియన్ మతమును అవలంబించినారు. he *d their offer వాండ్లు యిస్తామన్నదాన్ని అంగీకరించినాడు. this *s three separate heads దీంట్లో ప్రత్యేకముగామూడు పద్దులు వున్నవి. I *d the opportunity to tell him this సమయముచూచి దీన్ని అతనితో చెప్పినాను.
To Embrangle v a to entagle చిక్కుపెట్టుట, చీకాకుపరుచుట.
To Embrocate v a తైలము పట్టించి తోముట, మర్ధించుట.
To Embroidler v a శృంగారించుట, గుడ్డమీద పూలువేసుట, బుట్టాలు వేసుట.
To Embroil v a కలతబెట్టుట,తొందరపెట్టుట, చీకాకుపరుచుట.
To Emend v a దిద్దుట, సవరించుట, చక్కచేసుట.
To Emerger v a పైకి తేలుట, బయలు దేలుట. when this island *dనీరు పట్టి ఆ లంక పైకి అగుపడేటప్పటికి. the moon *d froma cloud చంద్రుడు మేఘమునుంచి బయలుదేరినాడు. or Johnson *d from obscurityఅజ్ఞాతకుల గోత్రుడైవుండి అతి ప్రసిద్ది కెక్కినాడు.
To Emigrate v n వలసపోవుట, దేశముమీద పోవుట.
To Emit v a బయటికి విడుచుట, బయట వేసుట, బయలు దేర్చుట.the diamond *s light వజ్రము మెరుస్తున్నది. to * sound మ్రోగుట.the cloud *ted lightning మేఘములోనుంచి మెరుపు పుట్టినది. the stone *ted sparks ఆ రాతిలోనుంచి మిణుగురులు బయలుదేరినవి. thiswood *s a scent ఈ కొయ్యలో వొక వాసన వస్తున్నది. the wound*ted matter ఆ పుంటిలోనుంచి చీము కారినది. he *ted groans వాడు మూలిగినాడు.
To Empale v a or impale, to put to death కొరతను వేసుట.he who is *d on a stake కొరతను వేయబడ్డవాడు.
To Empannel v a యేర్పరచుట, నియమించుట. the jury was *eld జూరీ వాండ్లు నియమించబడ్డారు.
To Employ v. a. పనిలోబెట్టుట, పనిబెట్టుట,ఉద్యోగమునుయిచ్చుట, I *ed him in writing this దీన్ని వ్రాసే పనిలో వాన్ని బెట్టినాను. he *ed himself in carrying stories చాడీలుచెప్పేదే పనిగా వుండినాడు. he *ed himself doing this యీ పనిలో ప్రవర్తించినాడు. he *ed himself in running about వాడు వూరక యిటు అటు తిరిగేదే పనిగా వుండినాడు.
To Empoison v a విషము బెట్టుట, చెరుపుట, యిది కావ్యములో వచ్చేమాట.
To Empower v a అధికారమిచ్చుట. I *ed him to sell the house. ఆ యింటిని అమ్మడమునకు వానికి శలవు యిచ్చినాను.
To Empty v a యేమిలేకుండా చేసుట, ఖాలీచేసుట. She emptied the bottle on his head ఆ బుడ్డితో వాడినెత్తిన పోసినది. he emptied his pockets on the table వాడి జేబులో వుండినదంతా యెత్తి మేజమీద పెట్టినాడు.when the monkey emptied his chicks బుగ్గలలో వుండినది కాగానే.
To Empurple v a యెర్రగా చేసుట, యిది కావ్యమందు వచ్చేమాట.
To Emulate a v. పోటీచేసుట, పైబడుట. they *d him వాడిమీద పోటీచేసినారు. Writers of dictionaries * Johnson నిఘంటుకర్తలు జాన్వసుతో సరికావలె నంటారు.
To Enable v a శక్తి గలగచేసుట. this money * d him to build the house ఈ రూకల వల్ల ఆ యిల్లు కట్టడమునకు వానికి శక్తి కలిగినది. I will * him to do it వాడు దాన్ని చేయడమునకు కావలసిన సహాయము చేస్తాను.I *d him to get the house వాడికి ఆ యిల్లు వచ్చేటట్టు చేసినాను. By this means I was *d to do it free of cost యిందువల్ల ఖర్చులు లేకుండా దాన్ని చేయించుకోనలవియైనది.
To Enact v a ఆజ్ఞాపించుట, విధించుట, యేర్పరచుట. to * a law చట్టము పుట్టించుట, చట్టము కలగ చేసుట.
To Enamel v a శృంగారించుట, చిత్రపనిచేసుట.
To Enamour v a మోహింపచేసుట, మరులు కొలుపుట, వలపించుట, సొక్కించుట, సొలపించుట. her beauty *d him దాని అందమును చూచి మోహించినాడు.
To Encage v a పంజరములో పెట్టుట.
To Encamp v n దండుదిగుట, ముకాముచేసుట, నిలుచుట.
To Encase v a పొదుగుట, లోగావుంచుట. the pod *s the seeds విత్తులను కాయ కప్పుకొని వుంటున్నది.
To Enchance v a అతిశయింపచేసుట, అభివృద్ధిచేసుట, హెచ్చించుట,పొడగించుట. the scarcity *d the price of grain కరువుచేత ధాన్యము వెల పొడిగిపోయినది. his poverty *d the difficulty దరిద్రముచేత వాడికి తొందర అతశయమైనది. this *d his merit యిందుచేత వాడి పుణ్యము అతిశయించినది.
To Enchant v a మంత్రించుట, అభిమంత్రించుట, మంత్రముచేత కట్టుట,వశ్యము చేసుట, అత్యుల్లాసపరుచుట, ఆశ్చర్యపరచుట, వ్యామోహపరచుట.
To Enchase v a శృంగారించుట, పొదుగుట, చెక్కుట. rubies *d in gold కుందనములో చెక్కిన కెంపులు.
To Encircle v a చుట్టుకొనుట, చుట్టవేసుకొనుట, పరివేష్టించుట. to* in the arms కౌగిలించుకొనుట.
To Enclose v a లోగా పెట్టుట, ఆవరణ మేర్పరచుట, చుట్టుకొనుట,బిడాయించుట, మలుపూపుచేసుట.
To Encompass v a చుట్టుకొనుట, ఆవరించుకొనుట, ముట్టడివేసుట.
To Encore v a మళ్లీఆడవలెనని ఆపేక్షించుట, మళ్లీ పాడవలెనని ఆపేక్షించుట.
To Encounter v a యెదిరించుట, అడ్డపడుట, యెదుటబడుట. I *ed him in my way home నేను యింటికి పోతూ వుండగా యెదురుపడ్డాడు. I *ed this difficulty నాకు ఈ తొందర వచ్చి తగిలినది. he *ed many difficulties అతనికి అనేక తొందరలు వచ్చినవి. the evils he *ed అతడుపడ్డ కష్టములు.
To Encourage v a ధైర్యపరచుట, ప్రేరిపించుట, ప్రోత్సాహపరుచుట.
To Encroach v a ఆక్రమించుట, అతిక్రమించుట. they *ed on his field వాడి పొలమును ఆక్రమించుకొన్నారు. this business *ed much upon my time.
To Encumber v a బళువు యెక్కించుట, తొందరపెట్టుట, చిక్కులబెట్టుట,ఆటంకపరుచుట. these boughs * the tree ఈ కొమ్మల బరువుచేత చెట్టుకు నిండా తొందరగా వున్నది.
To End v n ముగియుట, తీరుట, సమాప్తిచేయుట, సంపూర్ణమౌట, అయిపోవుట.It *s here అది యిక్కడితో సరిపోతున్నది, ముగిస్తున్నది. this *ed in a quarrel యిది ముదిరి జగడమైనది, జగడములో పర్యవసించినది.
To Endanger v a అపాయములోకి తెచ్చుట, ప్రమాదములోకి తెచ్చుట.
To Endear v a దయను కలగచేసుట, ప్రీతిని కలగచేసుట. this book belonged to my brother; this circumstance *s it to me ఈ పుస్తకము నా అన్నదిగా వుండిన దన్న సంగతిచేత దానియందు నాకు నిండా ప్రీతిగా వున్నది.
To Endeavour v n ప్రయత్నము చేసుట, యత్నపడుట, పాటుపడుట, కష్టపడుట.
To Endorse v a వెనుకతట్టు వ్రాసుట, పీఠిని వ్రాసుట, పైన వ్రాసుట.He *d my bill నేను పంపించిన హుండికి రూకలు చెల్లించేటట్టు చేవ్రాలు పెట్టినాడు. Do you imagine that the Government will * (sanction) your statements అధికారస్థులు ఆమోదింతురనుకొన్నావా.
To Endow v a యిచ్చుట, దానమిచ్చుట, వరమిచ్చుట, కలగజేయుట. he *ed the temple with lands ఆ గుడికి మాన్యమును విడిచినాడు. God *ed man with wisdom దేవుడు మనుష్యులకు జ్ఞానమును యిచ్చినాడు.
To Endue with v a కలగచేయుట, యిచ్చుట, దయ చేసుట. God *d man with reason దేవుడు మనుష్యులకు వివేకమును యిచ్చినాడు.
To Endure v n నిలిచివుండుట. this cloth will not * యీ గుడ్డ దినాల పేరట నిలవదు. this house will * for a century యీ యిల్లు నూరేండ్ల దాక నిలుచును. they went on abusing him till his patience *d no longer వాడి వోర్పు తప్పిపొయ్యేదాక వాణ్ని తిట్టుతూ వచ్చినారు. not enduring to see their cruelty వాండ్ల క్రౌర్యమును చూడలేక.
To Energize v a శక్తిని అగుపరుచుట.
To Enervate v a దుర్బలము చేయుట, బలహీనము చేయుట.
To Enfeeble v a దుర్భలము చేసుట, జబ్బు చేసుట, నీరసము చేసుట.
To Enfeoff v a కర్తగా యేర్పరచుట, అధీనకర్తగా యేర్పరచుట.
To Enforce v a జరిగించుట, నడిపించుట, చెల్లించుట. they *d the bond వాండ్లు ఆ పత్ర ప్రకారము నడిపించినారు. he *d the decree passed against them వాండ్లమిద అయిన తీర్పు ప్రకారము జరిపించినాడు. he *d the law against them వాండ్లను గురించి చట్టప్రకారము జరిపించినాడు, వాండ్లమీద చట్టమును చెల్లించినాడు. he *d payment రూకలను వసూలు చేసినాడు.
To Enfrachise v a విడిపించుట, విమోచనము చేసుట, ఖులాసా చేసుట, అధికారమిచ్చుట. he *d his slaves వాండ్ల దాసత్వము విమోచనము చేసినాడు.the town was *d ఆ వూరికి అధికారము వచ్చినది, అనగా పార్లేమంటుకు మెంబరును పంపించే అధికారము.
To Engage v n పూటబడుట, బాధ్యపడుట, జామీనువుండుట, ప్రవర్తించుట,ప్రవేశించుట. he *d in this business వాడు యీ పనిలో పూనుకొన్నాడు.they *d in conversation వాండ్లు మాట్లాడుతూ వుండినారు. they *d in combat వాండ్లు పోరాడినారు. he *d in merchandise వాడు వర్తకములోప్రవేశించినాడు. I will * for it అందుకు నేను వున్నాను.
To Engender v a కలగచేసుట, పుట్టించుట. gluttony *s maladiesఅతిభోజనము రోగమును కలగచేస్తున్నది. this *ed ill-will యిందువల్ల క్రోధము పుట్టినది. mirth *ing హాస్యకరమైన.
To Engird v a See To Gird.
To English v a ఇతర భాషను ఇంగ్లీషు భాషాంతరము చేసుట.
To Engraft v a అంటించుట. See To Ingraft.
To Engrave v a చెక్కుటలో నాటు పని చేసుట. he *d this picture upon copper అచ్చువేయడానికై యీ రూపమును తామ్రపు రేకులో చెక్కినాడు. he *d my name upon the ring ఆ వుంగరము మీద నా పేరు చెక్కినాడు. her face was *d on the ring ఆ వుంగరము మీద ఆమె ముఖమును చెక్కి వుండినది. these words were *d in thier minds యీ మాటలను వాండ్ల మనసులో నాటి వుండినవి. the wood was *d in flowers ఆకొయ్య మీద పూలు చెక్కి వున్నది.
To Engross v a ఆక్రమించుకొనుట, అపహరించుట. his attention is *ed in that business వాడి బుద్ధినంతా ఆ పని ఆక్రమించుకొన్నది, అనగా వాడి బుద్ధి అంతా ఆ పనిలో లయించివున్నది, లగ్నమై వున్నది అని భావము.his attention is *ed by the illness of his wife వాడి పెండ్లాము యొక్క వ్యాధి బుద్ధినంతా ఆక్రమించుకొన్నది, అనగా వాడి పెండ్లానికి వొళ్లు కుదురు లేనందున వాడికి అదే చింతగా వున్నదని భావము. the winter *es half the year వర్షాకాలము సగం సంవత్సరమును ఆక్రమించుకొంటున్నది. The lawyer *ed the will (or wrote it in law text) ఆ లాయరు ఆ వుయిల్కాకితమును సామాన్యమైనలిపితో వ్రాయకుండా పెద్ద అక్షరములతో వ్రాసినాడు.యిది లాయరు యొక్క మర్యాద.
To Enjoin v a విధించుట, ఆజ్ఞాపించుట, నిరూపించుట.
To Enjoy v a or to possess అనుభవించుట, పొందుట. he *s the kings favour వాడి యందు రాజు దయకలిగి వున్నది. he now *s the estate వాడు యిప్పుడు ఆ యాస్తిని అనుభవిస్తున్నాడు. he now *s nothing యిప్పుడు వానికి వకటిన్ని సుఖములేదు, వకటిన్ని యిష్టముకాదు. do you * good health? నీకు వొళ్లు కదురుగా వున్నదా? we *ed the breeze for two hours రెండు ఘడియలు దాకా గాలిలో తమాషాగా వుంటిమి. you now * the advantages of study నీవు వల్లించినందుకు ఫలము నీకు యిప్పుడు తెలుస్తున్నది. this place being on a hill *s low temperature కొండమీద వున్నందున యీ ప్రదేశము చల్లగా వున్నది. I *ed his society for 10 days పది దినములు అతనితో కూడా హాయిగా వుంటిని. he *ed himself వాడు సుఖించినాడు. he *ed the wives of his enemies వాడు శత్రువుల యొక్క భార్యలను పొందినాడు. he *s the book very much వాడికి ఆ పుస్తకమందు బహు ఆహ్లాదము.
To Enkindle v a వెలిగించుట, ముట్టించుట, రగిలించుట, రాజబెట్టుట,యిది కావ్యమందు వచ్చేమాట.
To Enlarge v n విస్తారముగా మాట్లాడుట, వుపన్యసించుట. he *d uponthis subject యిందున గురించి విస్తారముగా మాట్లాడినాడు.
To Enlighten v a వెల్తురుచేయుట, వెలుగును కలగచేయుట, ప్రకాశమును చేయుట, విశదపరుచుట. God *ed thier minds దేవుడు వాండ్లకు జ్ఞానమును కలగచేసినాడు.
To Enlist v a పట్టిలో దాఖలు చేసుకొనుట, లావణము చేసుకొనుట.I *ed him on my side వాడు నాకు సహాయుడయ్యేలాగు మాట్లాడుకొన్నాను.I have *ed the poets on my side కావ్యములను వుదాహరించినాను.
To Enliven v a వుల్లాసపరుచుట, రంజింపించుట. the sun *ed the landscape సూర్యుడు బయలుదేరేటప్పటికి అక్కడివాండ్లకు వుల్లాసమైనది.
To Enlivened adj రమణీయమైన, సరసమైన, రంజకమైన, వుల్లాసకరమైన.a landscape * with many pleasing objects సరసమైన పదార్థములతో రమనియ్యమైన భూమి.
To Ennoble v a గౌరవపరుచుట, గొప్పచేయుట. the king *d the family of Nelson, నెల్సన్ అనే ఆయనకు Lord అనే కితాబును యిచ్చినాడు.he was *d by his actions వాడు చేసిన పనులచేత వాడు గొప్పబడ్డాడు,ప్రసిద్ధిపొందినాడు.
To Enquire v n అడుగుట, విచారించుట, విమర్శించుట, పరిశోధించుట.I *d about it of him అందున గురించి అతణ్ని అడిగినాను. I *d about the money ఆ రూకలను గురించి అడిగినాను. I *d for it అది నాకు కావలెనని విచారించినాను. I *d it, I * d him అని అనకూడదు. he *d into the case ఆ వ్యాజ్యమును విమర్శించినాడు.
To Enrage v a కోపము వచ్చేటట్టు చేయుట, ఆగ్రహము వచ్చేటట్టు చేయుట,రేచుట.
To Enrapture v a ఆనందపరచుట.
To Enrich v a సంపన్నముగా జేయుట, సారవత్తుగా చేయుట, భాగ్యవంతుణ్నిచేయుట, సత్తువను కలగచేయుట. the trade *ed him యీ వర్తకముచేత భాగ్యవంతడైనాడు. this stream *es the land యీ ప్రవాహముచేత ఆ భూమికిసత్తువ కలుగుతున్నది.
To Enroll v a లావణములో దాఖలు చేసుకొనుట, పట్టీలో దాఖలు చేయుట.
To Ensconce v a దాచుట. he *d himself వాడు దాగినాడు.
To Enshield v a See to shield.
To Enshrine v a See to shrine ప్రతిష్ట చేయుట.
To Enslave v a దాసుణ్నిగా చేయుట, గులాముగా చేయుట.
To Ensnare v a చిక్కించుకొనుట, తగిలించుకొనుట.
To Ensue v n సంభవించుట, ఘటించుట, కలుగుట, అనుసరించుట, వెంబడిగా సంభచవించుట. a famine *d after the war ఆ యుద్ధమువెంటనే కరువు వచ్చినది. Silence *d యింతలో నిశ్శబ్దమైనది. the ensuing statement యీ క్రింద వ్రాసిన సంగతి.
To Ensure v a See To Insure.
To Entail వంశపరంపరగాఅనుభవించేటట్టుయేర్పరచుట, this *ed much embarrassment తుదకు యిందుచేత మహాసంకటము సంభవించినది. this *ed much misery యిందుచేత మహత్తైన ఆపద సంభవించినది. this will * his ruin యిమదుచేత వాడు వుత్తరోత్తర చెడిపోతాడు. this law-suit *ed another యీ వ్యాజ్యములో నుంచి మరివకవ్యాజ్యము కలిగినది. this estate is *ed యీ ఆస్తి దానవిక్రయాద్యనర్హముగా వంశపరంపరగా అనుభవించేటట్టు నిర్ణయించబడ్డది.
To Entangle v a చిక్కుచేయుట, కలవరపరచుట. you have *d the rope ఆదారమును చిక్కుపరచినావు.
To Enter v a ప్రవేశపెట్టుట, ప్రవేశింపచేయుట, ప్రవేశించుట. he *ed the house లోనికి వచ్చినాడు, లోనికిపోయినాడు. this spear *ed his side బల్లెము వాడిపక్కను దూసిపోయినది. I *ed his name in the book. వాడి పేరును పుస్తకములో దాఖలు చేసినాను. he *ed the service నవుకరిలోప్రవేశించినాడు.
To Enterprise v a తెగించుట, ధైర్యముచేయుట.
To Entertain v a పెట్టుకొనుట, వుంచుకొనుట. (as a guest) యింట్లోచోటిచ్చుట. he *ed me for a month నన్ను నెల్లాండ్లు తన యింట్లో పెట్టుకొన్నాడు. he yesterday *ed his friends నిన్న వాడి స్నేహితులకు విందు బెట్టినాడు. (as a servent) కొలువులో బెట్టుట. this history *edhim యీ కథలో వాణ్ని వుల్లాసపరిచినది. I *ed doubt నాకు అనుమానముగా వున్నది. I *ed no fears of his death వాడు చస్తాడని నాకు తోచనేలేదు.he *ed hatred పగపట్టి వుండినాడు. I *ed no idea that he woulddo so వాడు అట్లా చేయపోతాడని నాకు యెంతమాత్రము తోచనేలేదు. he *s thisoipinion వాడు ఆ యభిప్రాయమును పట్టివున్నాడు. he *ed himself with the book వాడు ఆ పుస్తకముతో కాలక్షేపము చేసినాడు.
To Enthrall v a చిక్కించుకొనుట, దాసుణ్నిగా చేసుకొనుట, బద్ధుణ్నిగా చేసుకొనుట. యిది కావ్య శబ్దము. See Inthrall.
To Enthrone v a సింహాసనము మీద కూర్చుండబెట్టుట, పట్టముగట్టుట, పట్టాభిషేకము చేయుట.
To Entice v a to allure, to draw by blandishements or hopes ఆశ చూపి యీడ్చుకొనుట, తీపి చూపి వలలో వేసుకొనుట, పుసలాయించియీడ్చుకొనుట, నయవంచన చేయుట. he *d me into the house నన్ను పుసలాయించి యింట్లోకి తీసుకొని పోయినాడు. to * the rat he put some bread in the trap యెలుక ఆశపడి వచ్చి పడడానకు బోనులో కొంచెం రొట్టె వేసినాడు.
To Entitle v a to qualify అర్హత కలగచేయుట, యోగ్యత కలుగచేయుట.this *s him to praise యిందుచేత వాడు స్తోత్రమునకు అర్హుడైనాడు. this*s him to advancement యించుచేత వాడు అభివృద్ధి పొందడానకు అర్హత కలిగివున్నది. this *d him to a share యిందువల్ల వాడికి వొక భాగానికి బాధ్యతకలిగినది.
To Entomb v a భూస్థాపితము చేయుట, పాతిపెట్టుట, పూడ్చుట.
To Entrap v a బోనులో చిక్కించుకొనుట, వలలో వేసుకొనుట, మాయలుచేసి చిక్కించుకొనుట, పుసలాయించి లోపరుచకొనుట.
To Entreat v a బతిమాలుకొనుట, వేడుకొనుట, ప్రార్థించుట.
To Entrust v a వొప్పగించుట, అధీనము చేయుట. I *ed this to himదీన్ని వాడి పరము చేసినాను.
To Entwine v a చుట్టుకొనుట, మెలివేసుకొనుట. the snake *d thetree with his tail ఆ పాము చెట్టును చుట్టుకొన్నది. the vine *d the tree ఆ ద్రాక్ష తీగెలు చెట్టును చుట్టుకొన్నవి.
To Enucleate v a సందేహనివారణము చేయుట, చిక్కులు తీయుట, వీడ్చుట.
To Enumerate v a వివరించుట, యెంచుట, లెక్కబెట్టుట.
To Enunciate v n ఉచ్చరించుట. he *s well వాడు బాగా వుచ్చరిస్తాడు.
To Envelope v a చుట్టుట, కప్పుట, మరుగుచేయుట, దాచుట బిడాయించుట,లిఫాఫాచేయుట. he *d the letter in silk ఆ జాబుకు పట్టుగవిసెనవేసినాడు. clouds *d the mountain మేఘములు పర్వతమును కప్పుకొన్నవి.darkness *d the country చీకటి ఆ దేశమంతా వ్యాపించినది. Envelope, n. s. పైకాకితము, లిఫాఫా, చంద్రిక.
To Environ v a చుట్టుకొనుట, ముట్టడి వేసుకొనుట.
To Envy v a అసూయపడుట, కడుపుమంట పడుట. they * his situationవాడి వుద్యోగమును గురించి అసూయపడుతున్నారు. I * his talents వాడి ప్రజ్ఞనాకు లేకపోయెనే.
To Epitomise v a సంక్షేపముగా చెప్పుట, సంగ్రహముగా చెప్పుట.
To Equal v a సమమౌట, సమానమౌట, సరియౌట, యీడౌట. they *led him in learning చదువులో వాడితో సమానమైనారు.
To Equalise v a సమము చేయుట, సరి చేయుట. he *d the expense in different months ఆయా నెలల ఖర్చును సరిసమముగా చేసినాడు.
To Equalize v a సరిచేయుట, సమపరచుట, సమానము చేయుట. he *d the two battalions but he could not * the expenses ఆ రెండు పటాలములనున్ను సరిసమముగా చేసినాడు గాని వ్రయమును సరిచేయలేకపోయినాడు.
To Equip v a సన్నాహము చేయుట, సిద్దము చేయుట, జోడించుట. he *ped himself for the journey వాడు ప్రయాణమునకు సిద్ధమైనాడు. she *ped herself for the dance అది ఆటకు శృంగారించుకొన్నది.
To Equivocate v n సందిగ్ధముగా చెప్పుట. the witness *s ఆ సాక్షి సందిగ్ధముగా చెప్పుతాడు, వడు చెప్పేది యిటూ పడుతుంది అటూ పడుతుంది.
To Eradicate v a సమూల నాశనము చేయుట, దుంపనాశనము చేయుట,నిర్మూలనము చేయుట.
To Erect v a to raise యెత్తుట, నిక్కబట్టుట, నిలుపుట. to buildకట్టుట, నిర్మించుట. to establish ఏర్పరచుట, నిర్ణయించుట, స్థాపించుట.to * a house యిల్లు కట్టుట. Government *ed a college గవర్నమెంటువారు కాలీజును పెట్టినారు. they *ed a pole వొక స్తంభమును నాటినారు.they *ed a tent గుడారము వేసినారు. he *ed his head తలనునిక్కబట్టినాడు. the cow *ed her tail ఆవు తోకనెత్తుకొన్నది. the snake *ed its crest పాము పడిగ యెత్తినది. to * a mathematicalfigure చక్రము వేసుట.
To Err v n తప్పుట, పొరబడుట, తప్పుదారినిబడుట, భ్రమపడుట.
To Escape v n తప్పుట, తప్పించుకొని పారిపోవుట. Four were killedand three *d నలుగురు చచ్చి ముగ్గురు తప్పినారు. the ball passed me and I narrowly *d గుండు నా పక్కన పారినది గాని చావక తప్పినాను.
To Escheat v n నగరగలిసి పోవుట. these lands *ed యీ భూములునగరగలిసి పోయినవి.
To Eschew v a మానుకొనుట, విడుచుట, వర్జించుట. you must * bathing నీవు స్నానమును మానుకో. he *ed thier company వాండ్ల సహవాసమును మానుకొన్నాడు.
To Escort v a దోవసాగనంపుట. she *ed me upstairs నన్ను మిద్దెమీదికి తీసుకొనిపోయినది. he *ed her home ఆమెను యింటికి తీసుకొని పోయి విడిచిపెట్టినాడు. they *ed the prisoners through the town ఆ కైదీలను పట్నములో గుండా తీసుకొనిపోయినారు. we *ed the prisoners to Madras ఆ ఖైదీలను పట్నానికి తీసుకొనిపోయినాము.
To Espouse v a వరించుట. he *d her దాన్ని వరించినాడు. he *d their cause వాండ్ల పనిని తాను వహించుకొన్నాడు. why did you * his quarrel వాడి జగడము నీ వెందుకు పైన వేసుకొన్నావు.
To Espy v a దూరమునుంచి చూచుట, అ దాటుగా చూటుట, కనుక్కొనుట,వేగుచూచుట. I espied a snake in the grass కసువుసందున వొకపాము వుండినది. I espied a fruit among the leaves ఆకుల మరుగుననాకు వొక పండు కనబడ్డది.
To Essay. v. a. యత్నముచేసుట, ప్రయత్నపడుట
To Establish v a నియమించుట, నిర్ణయించుట, ఏర్పరచుట, స్థాపించుట,కదురుచుటర, నిలుపుట. they *ed a rule వాండ్లు వొక చట్టమును యేర్పరచినారు. they *ed a school పల్లెకూటము పెట్టినారు. they *ed a road వాండ్లు కొత్తదోవ యేర్పరచినారు. they have *ed a custom వాండ్లు వొక వాడిక పెట్టుకొన్నారు.
To Esteem v a యెంచుట, గొప్పగా యెంచుట, విచారించుట. they did not * him వాణ్ని గొప్పగా యెంచలేదు. they * him much వాణ్ని మహాగొప్పగావిచారిస్తాను. I do not * him వాణ్ని అల్పుణ్నిగా యెంచుతాను. they * a poet వాణ్ని కవిగా యెంచుతారు.
To Estimate v a యెంచుట, మతించుట, వెలమతించుట, మతింపువేయుట,అంచనవేయుట.
To Estrange v a మిత్రభేదము చేయుట, వేరుబంధము చేయుట, వేరుపరచుట,యెడబాపుట, విడదీయుట. his bad conduct *d him from his father వాడి దుర్మార్గముచేత వాడికి వాడి తండ్రికి మనస్తాపము కలిగినది. they *d the money ఆ రూకలను పరాధీనము చేసినారు. My brother has *d himself from us మా అన్న మాలోనుంచి వేరుపోయినాడు.
To Etch v a పటములు అచ్చువేయడమునకై రాగి రేకులమీద అచ్చు చెక్కించుట.
To Eulogize v a స్తుతించుట, స్తోత్రము చేసుట, శ్లాఘించుట.
To Evacuate v a విసర్జించుట. he *d the bullet ఆ గుండు మలముతోకూడా ఆసనము గుండా పడిపోయినది. after the belly is *d భేది అయిన తరువాత, కడుపు పూడ్చిపెట్టిన తరువాత. the enemy *d the town శత్రుసేన పట్టణమును విడిచిపెట్టి అవతలికి పోయినది.
To Evade v a తప్పించుకొనుట. he *d the blow ఆ దెబ్బను తప్పించుకొన్నాడు. he *d the question అడిగినదానికి వుత్తరము చెప్పకుండా టక్కు చేసినాడు. he *d payment చెల్లించకుండా మోసము చేసినాడు.
To Evangelize v a ఖ్రైస్టుమతమును ప్రచురరము చేసుట. they attemptedto * the Hindus హిందువులలో ఖ్రైస్టు మతమును ప్రచురము చేయవలెననిప్రయత్నము చేసినారు.
To Evanish v n మాయమైపోవుట, అదర్శనమౌట. See to vanish.
To Evaporate v a పొగై యెగసి పొయ్యేటట్టు చేసుట. by boiling యిగురగొట్టుట, యిగిరిపొయ్యేటట్టు చేసుట, యినికిపొయ్యేటట్టు చేసుట. the sun *dthe moisture యెండకు తడి ఆరిపోయినది.
To Even v a సమముగా చేసుట. Can you * man with God?దేవుడితో మనిషిని సరిపోల్చగలవా?
To Evidence v a రూపించుట, సాక్షి చెప్పుట, అగుపరుచుట, తెలియ చేసుట.
To Evince v a చూపించుట, అగుపరుచుట, తెలియచేసుట. he *d friendship స్నేహభావములను అగుపరిచినాడు. he *d anger వాడికికోపము వచ్చినట్టువుండినది. he *d no surprise వాడు ఆశ్చర్యపడలేదు.
To Eviscerate v a పొట్టను చీలిచి పేగులను బయటతీసుట.
To Evoke v a రప్పించుకొనుట.
To Evolve v n వికసించుట, వీడుట.
To EXacerbate v a రోగమును పొడిగించుట. this *d the pain యిందుచేత ఆ నొప్పి అధికమైనది.
To Exact v a పట్టి అడుగుట, నిర్భందించి అడుగుట, కక్కసించి అడుగుట,తరువుచేసుట. he *ed payment నిర్భందించి రూకలు తీసికొన్నాడు. he appointed a man to * the money from me ఆ రూకలు పుచ్చుకొమ్మని నామీద వొకన్ని తరువు పెట్టినాడు. to * service వెట్టికి పనితీసుట. he *ed the fine దండుగ తీసెను. he *ed thier daily attendance ప్రతిదినము కనిపెట్టి వుండేటట్లు వాండ్లను నిర్భంధించినాడు. what is the use of a command if you do not * obedience? నీ వుత్తరవు ప్రకారము నడిచేటట్టు చేయనట్లైతే నీవు వుత్తరవుకు యేమి ఫలము.
To Exaggerate v a పెంచిచెప్పుట, విస్తరించుట, వొకటిని పదింతలుగాచెప్పుట, ఉల్లేఖించి చెప్పుట. they *d his faults యింత తప్పును అంత తప్పుగా చెప్పినారు, గోరంతను కొండంతగా పెంచి చెప్పినారు. Exaggerated, adj. పెంచిచెప్పిన, వొకటిని పదింతలుగా విస్తరించి చెప్పిన. the story was greatly * ఆ కథను మహా పెంచి చెప్పినారు.this is an * description యిది గోరంతను కొండంతగా పెంచి చెప్పి వున్నది.
To Exalt v a to raise on high పైకి యెత్తుట, గొప్పచేసుట, పొడగించుట. this *s his merit యిందుచేత వాడి యోగ్యత మరిన్ని అతిశయిస్తున్నది. they *ed him as a God దేవుణ్నిగా విచారించినారు. they *ed him upon their shoulders వాణ్ని భుజము మీద యెత్తుకొన్నారు.or to praise స్తుతించుట, స్తోత్రము చేసుట.
To Examine v a పరిక్షించుట, పరిశోధించుట, విమర్శించుట, విచారించుట.
To Exasperate v a ఆగ్రహము పుట్టేటట్టు చేసుట, కోపము వచ్చేటట్టు చేసుట, రేచుట. do not * him వాడికి కోపము వచ్చటట్టు చేయవద్దు,వాణ్ని రేఛవద్దు.
To Excavate v a తొలుచుట, పల్లముగా తొలుచుట, తవ్వుట. he *dthe stone and made a cup ఆ రాతిని తొలిచి మరిగచేసినాడు. they *d the hill కొండలో బిలము చేసినాడు. they *d a path in therock కొండలో తవ్వి మార్గము చేసినారు. the white ants *d the treeచెదుళ్లు ఆ చెట్టులోపల తొర్ర చేసినవి.
To Exceed v a మించుట, అతిక్రమించుట, అధికరించుట, మీరుట. his army *s ours మన దండుకంటే వాడిది అధికముగా వున్నది.
To Excel v a అతిశయించుట, అధికరించుట, మించుట. he *led them in learning చదువులో వాండ్లను మించినాడు. the mango *s other fruits కడమ పండ్ల కన్నా మామిడి పండు శ్రేష్టము.
To Except v a విడిచిపెట్టుట, వినాయించుట, తప్పనిచ్చుట.
To Exchange v a మార్చుట, పరివర్తన చేసుట, వినిమయము చేసికొనుట.they *d garlands మాలికా వినిమయము చేసుకొన్నారు. he *d houses with me వాడు నేను యిండ్లను మార్చుకొన్నాము. when they *d looks of angerవొకరినొకరు కోపముగా చూచినప్పుడు.
To Exchquer v a to seize జఫ్తి చేసుట.
To Excise v a అధికతీర్వ వేసుట, దొంగ సరుకులను యేలము వేసినగర కలుపుకొనుట, దండుగ పట్టుట. they *d him వాడి ఆస్తిని నగరకలుపుకొన్నారు.
To Excite v a ప్రేరేపణ చేసుట, రేచుట, పురికొల్పుట, పుల్లలుబెట్టుట.to * desire అక్కర బుట్టించుట. Bathing *s appetite స్నానము ఆకలిని కలిగిస్తున్నది. to * hopes ఆశను కలగచేసుట. these words *d remorsein his mind వాడు యీ మాటలచత నిండా పశ్చాత్తాపపడ్డాడు. these words *d them to the combat యీ మాటలు వాండ్లను యుద్ధమునకు బయలుదేరేటట్టు చేసినది.
To Exclaim v a మొరబెట్టుట, కూసుట, అరుచుట, కేకవేసుట, అనుట.`Now we shall see him' they *ed యిదుగో వాడి దర్శనము కాబోతున్నదనిఅన్నారు. Alas! she *ed అయ్యో అని అరిచింది, అయ్యో అన్నది.
To Exclude v a బహిష్కరించుట, వెలివేసుట, తోసివేసుట, చేరకుండా చేసుట. they *d him from the caste వాణ్ని కులములో వెలివేసినారు. they *d me from the house నన్ను ఆ యింట్లోకి చేరనియ్యలేదు. her marriage *s her from inheriting her father 's estate పెండ్లి కావడముతో తండ్రి ఆస్తిలో దానికి బాధ్యత లేకపోయినది. he *s me fromhis confidence వాడు నాకు మర్మమును యివ్వలేదు.
To Excogitate n s యోచించుట, యోచించి కల్పించుట.
To Excommunicate v a బహిష్కారము చేసుట, వెలివేసుట, మత భ్రష్టుణ్నిగాచేసుట, త్యజించుట.
To Excoriate v a తోలుసుదొగకొట్టుట. the boiling water *d his legవేడినీళ్లచేత వాడికాలుతోలు దొగిపోయినది. in the fall his arm was *dపడడములో వాడి చెయ్యి తోలు దోగిపోయినది.
To Excruciate v a వేధించుట, బాధించుట, యాతనపరచుట, ఉపద్రవము చేసుట, హింసించుట.
To Exculpate v a తప్పులేదని అగుపరుచుట. he tried to * himselfతన మీద తప్పు లేదని అగుపరచడమునకై యత్నపడ్డాడు. this letter *s you ఈ జాబు వల్ల నీమీద తప్పులేదని యేర్పడుతున్నది.
To Excuse v a మన్నించుట, క్షమించుట. he tried to * himselfతన మీద తప్పులేదని తప్పించుకోను ప్రయత్నపడ్డాడు. he *d me fromthe bargain వొడంబడిక ప్రకారము నేను నడుచుకోవలసినది లేదని విడచి పెట్టినాడు. I *d him payment వాడి దగ్గెర రూకలు పుచ్చుకోకుండావిడిచిపెట్టినాను. he asked me to dinner but I *d myself అతడు భోజనమునకు రమ్మన్నాడు అయితే నేను రావడము లేదని మనవి చేసుకొన్నాను.pray * me from coming to day నేను నేడు రాకుండా వుండేటట్టు దయచేయవలసినది. * me you told me yourself నాతో చెప్పినావుసుమీ, యిది గద్దించే మాట. you must * me I will not pay the money నేను ఆ రూకలను బొత్తిగా యిచ్చేదిలేదు సుమీ. * me this is false ఛీ యిది అబద్ధము.
To Execrate v a శపించుట, తిట్టుట.
To Execute v a జరిగించుట, జరుపుట, నెరవేర్చుట, చేసుట. he *da bond పత్రమును వ్రాసి యిచ్చినాడు. he *d his trust very well తనకు పెట్టిన పని బాగా జరిగించినాడు. they *d a dance వాండ్లు నటించినారు, తాండవమాడినారు. he *d a picture పటమును వ్రాసినాడు. they *d the thief ఆ దొంగను వురి దీసినారు.
To Exemplify v a దృష్టాంతమువల్ల అగుపరుచుట, ఉదాహరణమిచ్చుట.this phrase exemplifies the rule యీ వాక్యము ఆ సూత్రమునకు వుదాహరణమౌతున్నది. what you now suffer *ies the truth of what he said నీవు పడేది వాడు చెప్పిన దానికి అనుభవముగా వున్నది.
To Exempt v a వినాయించుట. this *ed him from punishment యీహేతువచేత వాడికి శిక్ష తప్పినది. they *ed him వాణ్ని వినాయించినారు.as he was the king's son they *ed him from examination అతడురాజకొమారుడై నందున కడమవాండ్లను పరిక్షించి యతణ్ని పరిక్షించక విడిచి పెట్టినారు.
To Exercise v a to empty ఉపయోగపరచుట, వినియోగపరుచుట, అభ్యాసముచేయించుట, అభ్యసింపచేసుట, సాధకముచేయించుట, పనుపరుచుట, అలవరుచుట.the Governor *d his discretion in this యిందున గురించి గవనరు తనకు వుండే స్వతంత్రమును వుపయోగపరచినాడు, అనగా యిమదులో గవనరు స్వతంత్రించినాడని యర్ధము. he *d the boy in figures పిల్లకాయకు లెక్కలో వాడిక చేసినాడు. he *d the horse ఆ గుర్రమును తిప్పినాడు. this*d his patience greatly యిందుచేత వాడు చాలా ఆయాసపడ్డాడు, విసికినాడు. his wife's misconduct *d (or tried) his patience greatly వాడి పెండ్లాము యొక్క దుర్నడతచేత వాడికి చాలా ఆయాసము వచ్చినది, వాడికి ప్రాణము విసికినది. he *d patience సహనము పెట్టినాడు. he *d himself in walking on the parapet చెయి గోడమీదుగా నడిచేటట్టుగా సాధకము చేసినాడు. he *d his authority వాడి అధికారమును చెల్లించినాడు. he *d the boys in Sanscrit ఆ పిల్లకాయలకు సంస్కృత శిక్ష చెప్పినాడు. you should * your reason in this యిందులో నీ వివేకమను వుపయోగపరచవలెను, వినియోగపరచవలెను. he *d the horse in leaping ఆ గుర్రములకు దాటేటట్టు అలవాటు చేసినాడు. the priests do not now * this power గురువులు యిప్పట్లో యీ అధికారమును చెల్లించడము లేదు.
To Exert v a ఉపయోగపరచుట, వినియోగపరుచుట, ప్రయత్నముచేసుట.he *ed his authority to save me నన్ను సంరక్షణ చేసేటందుకు వాడిఅధికారమును వుపయోగపరచినాడు. he *ed all his strength in doing this యిది చేయడములో వాడి యావచ్ఛక్తినిన్ని చూసినాడు. when you are illyou should not * yourself అశక్తుడవై వుండేటప్పుడు నీవు నిండా శ్రమ పడవద్దు. he *ed himself to please me నన్ను సంతోషపెట్టడమునకు చాలా ప్రయాసపడినాడు. when *ed himself he could do twice as much నిండు ప్రయాసపడితే రెండింతలుగా చేయగలడు.
To Exfoliate v n యెముకలోనుంచి పెళ్లగా వూడివచ్చుట, యెముక చచ్చి పెట్లుట, పేడుగా లేచివచ్చుట.
To Exhale v a బయటవిసురుట, బయట విడుచుట. the rose *s a sweet scent రోజా పుష్పము మంచి వాసన కొట్టుతున్నది. the tank *s a cloud of mist ఆ గుంటలోనుంచి పొగమంచు లేస్తున్నది.
To Exhaust v a వ్రయము చేసుట, పొగొట్టుట, శోషింపచేసుట, క్షీణింపచేసుట, తరగొట్టుట. he *ed the treasury బొక్కసమును గుల్లచేసినాడు.these troubles *ed his strength యిందు చేత వాడి బలము కుంగిపోయినది.this behaviour at last *ed my patience యీ నడక చేత తుదకు నాసహనము పోయినది, ప్రాణము విసికినది. he *ed the air from the bottle ఆ బుడ్డిలో గాలి లేకుండా చేసినాడు. this *ed his spirits యిందుచేత వాడి ధైర్యము పోయినది. this burning wind *s the spirits యీ వడగాడ్పుకళలను పీలుస్తున్నది, శోషింపచేస్తున్నది. the long walk *ed me verymuch బహుదూరము నడవడవముచేత నిండా అలిసినాను. do not * yourselfశ్రమపడవద్దు.
To Exhibit v a చూపుట, అగుపరుచుట, కనపరుచుట.
To Exhilarate v a ఉల్లాసపరచుటు.
To Exhort v a బుద్ధిచెప్పుట, బోధించుట. I *ed them to be friends మీరు అనుకూలముగా వుండండని బుద్ధి చెప్పినాను. I * you toobey him నా మాట విని అతనికి అణిగి నడుచుకో.
To Exhume v a పాతిపెట్టిన దాన్ని తవ్వి యెత్తుట.
To Exile v a దేశములోనుంచి వెళ్లకొట్టుట, వూరువెళ్లకొట్టుట.
To Exist v n వుండుట, కలిగివుండుట, జీవించుట, బ్రతుకుట. The Hindus say the devil does not * హిందువులు సైతానేది లేదంటారు. the book you want is not *ed నీవు కావలననే పుస్తకము లోకములో లేనేలేదు.
To Exonerate v a నివృత్తి చేసుట, నివారణము చేసుట. this *syou from paying the money యిందుచేత నీవు ఆ రూకలు చెల్లించవలసినదిలేకపోతున్నది. her consent does not * you అది యెంత సమ్మతించినప్పటికిన్ని నీ యందు తప్పులేకపోలేదు. he *d himself వాడు నివృత్తిచేసుకొన్నాడు. he did this to * himself తన దోషమును బాపుకోవడమునకై దీన్ని చేసినాడు.
To Exorcise v a దయ్యములను తోలుట, ఉచ్చాటనము చేసుట. to * ademon దయ్యమును తోలుట.
To Expand v n వికసించుట, విస్తరించుట. the flower *ed పుష్పమువికసించినది, మొగ్గ పూచినది.
To Expatiate upon v a ఉపన్యసించుట, విస్తరించి చెప్పుట, వివరించుట, పెంచిచెప్పుట. he *d much upon this యిందున గురించి బహుదూరము మాట్లాడినాడు. or to walk about సంచరించుట.
To Expatriate v a to transport పరదేశమునకు పంపుట.
To Expect v a యెదురుచూచుట, నిరీక్షించుట, కనిపెట్టుకొని యుండుట.I * him అతడు వస్తాడని యెదురు చూస్తాను. he *ed death చస్తాననుకొన్నాడు.Government *s your obedience నీవు ఆజ్ఞ ప్రకారము నడుచుకొనేవాడవనిగవనరుమెంటువారు నమ్ముతున్నారు. I * a fever నాకు జ్వరము వచ్చేటట్టువున్నది. they * you there to-morrow నీవు రేపు అక్కడికి వత్తువనుకొన్నారు.I * you here to-morrow రేపు నీకే యిక్కడ యెదురు చూస్తూ వుంటాను. If aman marries, he *s children పెండ్లి ఆడితే బిడ్డలు కలుగనే కలుగుతారుఅని నమ్ముతాడు. I * I shall find him there బహుశా వాడు అక్కడ వుండును. I * my son to obey me నా కొడుకు నా మాట వినకుంటే యెట్లా. I * you to do this యిది నీవు చేయకపోతే చూడు, యిది గద్దింపు మాట. She *s to be confined next month వచ్చేనెలలో తాను ప్రసవింతు నంటున్నది. she, as I *ed, told me the truth నేను అనుకొన్నట్టే నాతో కలిగినది చెప్పినది.
To Expectorate v a కేకరించుట.
To Expedite v a త్వరితపరుచుట, తీవ్రించుట, సుళువు చేసుట, వుసులు చేసుట.
To Expel v a వెళ్లగొట్టుట, తరమగొట్టుట, బహిష్కారముచేసుట, తరుముట. to * a demon దయ్యమును తోలుట. they use milk to * poisonవిషము విరగడమునకు పాలును యిస్తారు. they *ed him from the casteవాణ్ని వెలివేసినాడు.
To Expend v a వ్రయము చేసుట, శలవు చేసుట. they *ed this money within ten days యీ రూకలను పది దినములలో కాజేసినారు.
To Experience v a to try శోధించుట, పరీక్షించుట. to sufferto come in for to enjoy అనుభవించుట, పడుట, పొందుట. thehardships which he *d అతడు పడ్డ శ్రమలు. to know by practiceఅనుభవమువల్ల తెలుసుకొనుట. he *d much trouble శానా వ్యాకులముపొందినాడు. he *d much satisfaction వాడికి నిండా సంతోషమైనది.he *d a change of fortune వాడు దుర్దశను పొందినాడు. I often *d their kindness అడుగడుక్కు వాండ్ల విశ్వాసమునకు పాత్రుడైనాను. this I have often *d యిది నాకు పదేపదే సంభవిస్తూ వచ్చినది. we *d a storm గాలివాన కొట్టినది.
To Expiate v a ప్రాయశ్చిత్తముచేసుట. he offered sacrifice to* the crime ఆ పాపమునకు ప్రాయశ్చిత్తహోమము చేసినాడు. he died to* their sins వాండ్ల పాపములు పరిహారము కావడమునకై తాను చచ్చినాడు.he *d his crimes on the sacffold వాడి పాపము వురిదియ్యడముతో పరిహారమైనది.
To Expire v n చచ్చుట, తీరిపోవుట, ముగుసుట, ఆరిపోవుట. when the period *d గడువు తీరినప్పుడు. or to breath out వూపిరి విడుచుట, యిది యిప్పట్లో వాడిక లేదు. the lamp *d దీపము ఆరిపోయినది.
To Expiscate v a (not a good word) సాధించుట, యత్నము మీద సాధించుట.
To Explain v a అర్థము చెప్పుట, విశదపరుచుట, తెలియ చేసుట. how can he * this conduct? యీ పనికి యెట్లా సమాధానము చెప్పబోతాడు. * yourself నీవు చెప్పిన మాటలకు భావము నీవే చెప్పు.
To Explode v a వెళ్లగొట్టుట, తరమగొట్టుట. Formerly it was supposed that the cholera was communicated by the touch but that idea is now *d మునుపు వాంతిభ్రాంతి స్పర్శచేత తగులుతుందని అంటూవచ్చినారు గాని యిప్పట్లో ఆ అభిప్రాయము పోయినది.
To Explore v a వెతుకుట, పరిశోధించుట, గాలించుట. he *d the poem for this verse యీ శ్లోకమునకై ఆ గ్రంథమంతా వెతికినాడు.
To Export v a యెగుమతిచేసుట, సరుకును పంపడము, సరుకునుతీసుకొని పోవడము.
To Expose v a బయలుపరుచుట, బయటపెట్టుట, చూపుట, తెరిచి చూపుట,తెరచిపెట్టుట. the Hindu women * their faces, but the Musulman women do not హిందు స్త్రీలు ముఖమును బయట అగుపరుస్తారు తురక స్త్రీలు అగుపరచరు. he *d his head to the rian వానలో తల తెరచి పెట్టుకొనివుండినాడు. she *d the grain to the sun అది ధ్యానమును యెండబోసినది.the Malayala women * thier breasts మళయాళ స్త్రీలు రొమ్ముల మీద బట్ట వేయరు. In china some people * thier children సీనా దేశములోకొందరు తమ శిశువులను వీధిలో పారవేస్తారు. they did not burry the body, they *d it పీనుగను పూడ్చకుండా కుక్కల నక్కల పాలుచేసినారు. this letter *d him shamefully యీ జాబువల్ల వాడి మానము బయటపడ్డది.you are now going to speak do not * yourself నీవు అతనితో మాట్లాడపోతావునీ మానము కాపాడుకో. In fever you ought not to * your feet జ్వరములోకాళ్లను తెరుచుకొని వుండరాదు. If you do this I will * you నీవుదీన్ని చేస్తివా నిన్ను బయటవేస్తాను. he *d himself greatly in this యిందులో వాడి మానము బట్టబయలైనది. while you are taking in this foolish wayyou are merely exposing your wife నీవు యిట్లా పిచ్చితనముగా మాట్లాడడములో నీ పెండ్లాన్ని యీడ్చి బయటవేయడమే కాని వేరే యేమి లేదు. In this battle he *d himself much యీ యుద్ధంలో వాడు బహుశా ముందు నిలుస్తూ వచ్చినాడు. he *d the gold to the fire ఆ బంగారును కాచి చూచినాడు. he *d my work to a severe test నేను చేసిన పనిని వాడు మహా కఠిన పరీక్ష చేసినాడు. he *d himself to much inconvenience వాడు చాలా యిబ్బంది పడ్డాడు. your conduct *d you to blame నీవు చేసిన పనివల్ల నీకు మాట వచ్చినది.he *d the goods to sale ఆ సరుకులను అంగట్లో పెట్టినాడు. he *d it to view దాన్ని కనుపరిచినాడు.
To Expostulate v n బుద్ధిచెప్పుట, బహుదూరము బతిమాలుకొని బుద్ధి చెప్పుట, బహుదూరము కీడు మేలు తెలియచేసి అడుక్కొనుట. I *d with him in vain నేను యెంతదూరము యుక్తాయుక్తములు చెప్పి బతిమాలుకొన్నా వాడు వినలేదు.
To Expound v a తెలియజేసుట, విశదపరచుట, అర్థము చెప్పుట.
To Exprobrate v a దూషించుట.
To Expugn v a జయించుట.
To Expunge v a కొట్టివేసుట, పాటా కొట్టుట, కుండలీకరణముచేసుట,తోసివేసుట, పరిహరించుట. after those items were *d ఆ పద్దులనుకొట్టివేసిన తరువాత. In that poem he *d ten verses ఆ కావ్యములోపది శ్లోకములను యెత్తివేసినాడు.
To Exsude v a కార్చుట, స్రవింపచేసుట.
To Extend v n వ్యాపించుట, విస్తరించుట, నిగుడుట. the Ramayanam*s to severn books రామాయణము యేడు కాండలుగా పెరిగినది. her age *d to a hundred years అది నూరేండ్ల దాకా బ్రతికినది. his studies *ed to Logic తర్కము మట్టుకు చదివినాడు. the power of the Judge *ed to death వురితీసేదాకా ఆ జడ్జికి అదికారము వుండినది. the troops *ed for a mile ఆ సేన గడియదూరము దాకావ్యాపించి వుండినది. the scent *ed through the house ఆ వాసన యిల్లంతా కమ్ముకొన్నది. his house *s to the end of the street వాడి యిల్లు ఆ వీధి కొనదాకా పోతున్నది. this trial *ed ten days యీ విచారణ పది దినముల దాకా జరిగినది.
To Extenuate v a తగ్గించుట, అనగా న్యాయములను అగుపరచి నేరమునుతగ్గించుట, పరిహారము చేసుట. what can you say to * your fault నీ నేరము పరిహారము కావడమునకు యేమి చెప్పగలవు. he said this to * his fault తన తప్పును పరిహరించుకోవడమునకు దీన్ని చెప్పినాడు. this does not * the crime దీని చేత ఆ పాపము పరిహారముకాదు.
To Exterminate v a దుంపనాశనము చేసుట, నిర్మూలనము చేసుట, ధ్వంసం చేసుట. he *d them దేశములో వాండ్ల పొళుకువ లేకుండా చేసినాడు.
To Extinguish v a ఆర్చుట, చల్లార్చుట, మలుపుట. to * a lampదీపమును పెద్దచేసుట, అనగా ఆర్చుట. this *ed all his hopes యిందుచేత వాడి కోరికలంతా పోయినవి.
To Extirpate v a నిర్మూలనము చేసుట, దుంప నాశనము చేసుట.this *d disease దీనిచత ఆ రోగము బొత్తిగా పోయినది.
To Extol v a స్తుతించుట, పొగుడుట, కొనియాడుట.
To Extort v a బలవంతముగా తీయుట. they *ed the moneyfrom him ఆ రూకలను వాడి దగ్గెర బలవంతముగా తీసుకొన్నారు.they *ed this answer from him వాణ్ని నిర్భందించి యీ వుత్తరమునువాడి గుండా చెప్పించినారు.
To Extract v a తీసుట, పీకుట, పెరుకుట. he *ed the tooth ఆ పంటిని పెరికివేసినాడు. they * oil from this seed యీ విత్తులో నూనె తీస్తారు. they * toddy from the palm తాటిచెట్లో నుంచి కల్లు దించుతారు.he *ed a rule from this book యీ గ్రంథములోనుంచి వొక సూత్రమునుయెత్తి వ్రాసినాడు. I *ed this from his letter అతని జాబులో నుంచి యీ అంశమును యెత్తి వ్రాసినాను.
To Extricate v a విడిపించుకొనుట, తప్పించుట, నివారణము చేసుట, విడుదల చేసుట.
To Extrude v a To push out వెళ్లబెట్టుట. he *d his tongueనాలికెను వెళ్లబెట్టినాడు.
To Exude v n స్రవించుట, కారుట.
To Eye v a వూరకచూచుట, కనిపెట్టుట, దృష్టివుంచుట, సాభిప్రాయముగా చూచుట.he *d them fiercely వాండ్లను మహాక్రూరముగా చూస్తూ వుండినాడు.he *d her affectionately దాన్ని విశ్వాసముగా చూస్తూ వుండినాడు.the dog *ed the bone wishfully ఆ కుక్క యెముక మీద ఆశగా చూస్తూవుండెను.
To Fable v n కథ కల్పించుట, అబద్దాలాడుట.
To Fabricate v a కట్టుట, పుట్టించుట, కల్పించుట,సృష్టించుట,నిర్మించుట.
To Face v n to come in front యెదురుగా వచ్చుట, యెదురుగా పోవుట,అభిముఖమౌట. which way does the house * ? ఆ యిల్లు యే ముఖముగావున్నది.
To Facilitate v a సులభముచేసుట, వుసులు చేసుట.
To Fade v n వర్ణము తప్పుట, వాడిపోవుట, క్షయించుట. the colourof the cloth *d away ఆ గుడ్డచాయ పోయినది. the stars * at the approachof day తెల్లవారేప్పటికి చుక్కలు మాసిపోతవి. his hopes *d awayవాడికి నిరాశ అయినది.
To Fag v n శ్రమపడుట, దాసుడుగా ప్రవర్తించుట. he *ged hard tofinish this దీన్ని ముగించడానకు నిండా పాటుపడ్డాడు, అనగావొళ్లు దాచకుండా కష్టపడి ముగించినాడని అర్థము.
To Faggot v a కట్టలు కట్టుట, దిండ్లు కట్టుట.
To Fail v a తప్పుట. do not * me నాకు తప్పక. God willnot * those who trust in him తన్ను నమ్మినవాండ్లను దేవుడు చెయ్యి విడువడు.he *ed me నన్ను వుపేక్షించినాడు, నన్ను చెయ్యి విడిచినాడు. my strength*ed me నాకు దార్ఢ్యము తప్పినది. on receiving the blow on my headmy eyes *ed me తల మీద దెబ్బ తగలగానే నా కండ్లు తిరిగినవి. my legs*ed me and I fell నాకు కాళ్లు నిలవక పడ్డాను. when we had been amonth at sea our water *ed us నెల దినములు నీళ్లమీద వుండేటప్పటికిమాకు మంచినీళ్లు అయిపోయినది.
To Faint v n మూర్ఛపోవుట, శోషపోవుట. his soul *ed within himవాడికి ప్రాణము విసికినది.
To Fall v n పడుట. his countenance fell (In Gen. iv. 6. విషణ్నవదనుడాయెను.)వాడి ముఖము పెంకువలె అయినది. dew or rain *s కురుస్తున్నది. the price of rice fell బియ్యము వెల తరిగినది.the wind fell గాలి అణిగినది. the stream or tide fell ప్రవాహముతీసిపోయినది, పోటు అణిగినది, పాటు వచ్చినది. the leaves fellఆకులు రాలినవి. when the shadow fell upon this line ఆ నీడయీ గీతమీదకి వచ్చినప్పుడు. he fell in the field యుద్ధరంగంలో చచ్చినాడు.he fell a victim to love మరుబారిపడ్డాడు. It fell to his lot tobreak his leg వాడి అదృష్టము వాడి కాలు విరిగినది. It fell to my shareఅది నాపాలిటికి వచ్చినది. the estate fell to him ఆ యాస్తికి వాడికివచ్చనది.he fell asleep నిద్రపోయినాడు. they fell down at his feetin homage సాష్టాంగదణ్నములు బెట్టినారు, వాడి కాళ్లమీద పడ్డారు. he has *ena away చిక్కిపోయినాడు, కృశించిపోయినాడు, సన్ననూలు వడికినాడు.his face has *en away వాడి ముఖము పీల్చుకపోయినది. the family has *en awy ఆ కుటుంబం నశించిపోయినది. he fell awayfrom God ఆ రూఢ పతితుడైనాడు. they fell away from him అతనియందు భక్తిని విడిచినారు. his friends fell away from him స్నేహితులుఅతణ్ని చేయి విడిచినారు.the troops fell back ఆ బారు వెనక్కు వెనక్కేఅడుగు బెట్టుకొని జరిగినది, ఆ బారు వెనక్కు నడిచినది.the army fell back to the village ఆ వూరికి వచ్చినది.our troops fell back upon the wood మా సేన మళ్లి తిప్పుకొని ఆ యడవికివచ్చినది. అనగా ముందు మించిదాటిపోయిన ఆ యడవి కే వచ్చినదనుట. hefell back from his promise వాడు ఆడిన మాట తప్పినాడు.the boy fell back in learning ఆ పిల్లకాయ చదువులో జబ్బుఅయినాడు వెనక్కుపడ్డాడు. he walked on and she fell behind.వాడుముందు మించిపోయినాడు. అది వెనక చిక్కినది, వెనకబడ్డది. his boat fellclear of mine వాడి పడవ నా పడవమీద తగలకుండా తొలిగిపోయినది.the boat fell down the river పడవ ప్రవాహమును అనుసరించి పోయినది.when the bill *s due హుండి గడువు నాటికి. his boat fell foul of mineవాడి పడవ నాపడవ వొకటితో వొకటి కొట్టుకొన్నది. his carriagefell foul of mine వాడి బండి నా బండి వొకటితో వొకటి కొట్టుకొన్నది.he fell foul of them వాండ్ల మీద తిరిగినాడు, అనగా రేగినాడు.he fell in debt వాడు అప్పులపాలైనాడు. the roof has *en inఆ యింటి పై కప్పు కూలినది. the well has *en in ఆ బావి పడిపోయినది.the horse has *en in flesh ఆ గుర్రము చిక్కిపోయినది, బక్కచిక్కినది.he fell in love with her దానియందు వ్యామోహపడ్డాడు. he fell in withthem వాండ్లలో అయిక్యమైనాడు, వాండ్లతో కలుసుకొన్నాడు. his opinion *sin with mine వాడి అభిప్రాయమున్ను నాదిన్ని వొకటిగానే వున్నది. he fellin with them on the road దోవలో వాడికి వాండ్లు అడ్డుపడ్డారు, యెదురు పడ్డారు.where did you * in with the horse ఆ గుర్రము నీకు యెక్కడ చిక్కినది.తగిలినది. they fell into conversation మాటల్లో పడ్డారు, మాట్లాడసాగారు.the river *s into the sea ఆ యేరు సముద్రగామి అవుతున్నది. he fell intothe procession ఆ వూరేగింపులో కలుసుకొని పోయినారు. he fell into thesnare వాడు వలలో చిక్కినాడు, తగులుకొన్నాడు, మోసపోయినాడు. he fell in to the hands of the enemy శత్రువులచేత చిక్కినాడు. he fell intosin పాపగ్రస్తుడైనాడు. he fell into apostasy మత భ్రష్టుడైనాడు. he fell into disgrace అవమానపడ్డాడు. the horse fell lame గుర్రముకుంటిది అయినది. the rope fell loose దారము వదిలింది, ఆ కట్టు వదిలింది.when it fell night చీకటి కాగానే, చీకటి పడగానే. In age the hair *soff యేండ్లు చెల్లితే వెంట్రుకలు రాలిపోతవి, వూడిపోతవి. his hat felloff వాడి టోపి పడిపోయినది. his health begins to * off వాడికి ఆరోగ్యముమట్టు పడడమునకు ఆరంభించినది. the school is now *ing off ఆ పల్లె కూటము యిప్పట్లో క్షీణగతిగా వున్నది. they fell on their kneesవాండ్లు మోకాలించినారు. he fell on his back వెల్ల వెలికలపడ్డాడు.he fell on his belly బోర్లపడ్డాడు. the feast *s on the 5th ఆ పండుగఅయిదో తేదీ వస్తున్నది. when my eye fell upon him వాడి మీదనాదృష్టి పారినప్పుడు. the truth fell out నిజము బయటపడ్డది. it fell out that the house was vacant ఆ యిల్లు వూరకవుండేటట్టుసంభవించినది. they fell out or wrangled వాండ్లకు కలహమువచ్చినది. he fell sick రోగముతో పడ్డాడు. to * to మొదలుబెట్టుట,ఆరంభించుట. the whole party then fell to అందరు భోజనముచేయసాగినారు, మొదలుబెట్టినారు. this word *s under that ruleయీ శబ్ధమునకు ఆ సూత్రము ఆధారముగా వున్నది. to let * జారవిడుచుట.some words that he let * వాడి నోరు జారివచ్చిన మాటలు. wemust take care of lambs at their first *ing గొర్రెపిల్లలనువేసేటప్పుడు మనము జాగ్రత్తగా వుండవలసినది.
To falsify v a అబద్ధము చేసుట, నిజముకాదని అగుపరుచుట.this paper falsifies what he said యీ సాధనముచేత వాడు చెప్పినదిఅబద్ధమౌతున్నది. he made this prediction but the event falsified itయిట్లా జరగకపోతుందన్నాడు గాని అది జరగడముతో వాడు చెప్పినది అబద్ధమైపోయినది.
To Falter v n తడబడుట, తొట్రుబడుట, సంకోచించుట, వెనక్కుదీసుట.she *ed through shame సిగ్గుచేత దానికి నోటు తడబడ్డది. he *ed outa few words తడబడుతూ కొన్నిమాటలు చెప్పినాడు. he *ed out " I killed her "నేను దాన్ని చంపినానని నోరు తడబడుతూ చెప్పినాడు. *ing accentsగద్గదస్వరములు.
To Familiarize v a అలవరచుట, మరపుట, వాడుకచేయించుట. a residenceat Madras *d him with Tamil చెన్నపట్టణములో వుండడముచేత వాడికిఅరవము అలవాటు అయినది.you should * him to danger వాడు పడి చెడితేరేటట్టు చేయవలసినది. you should * your self to translationనీవు భాషాంతరము చేయడమునకు వాడిక చేయవలసినది.
To Famish v a కడుపుకు వేయకుండా చంపుట, పస్తువేసి చంపుట.
To Fan v a విసురుట. seeing him angry she *ned the flameవాడు కోపముగా వుండేది కనుక్కొని మరిగేటట్టు చేసినది.he *nedher to sleep దాన్ని విసిరి నిద్ర పుచ్చినాడు.
To Fancy v n తోచుట, తలచుట, యెంచుట, భావించుకొనుట.I * so నాకు అట్లా తోస్తున్నది. they fancied that he is goneవాడు పోయినాడనుకొన్నారు.
To Fare v n సాగుట, జరుగుట, వెళ్లుట. how did you * నీ పనియేమైనది, నీకు మంచి భోజనము దొరికినదా. he *d sumptuouslyevery day వాడికి ప్రతిదినమున్ను మంచి భోజనము చిక్కుతూ వచ్చినది.he * d hand నానాకడగండ్లున్ను పడుతూ వచ్చినాడు. they * d better thanme నా కంటే వాండ్లు మేలే. who *s best వీండ్లలో యెవరి అదృష్టముమంచిది.
To Farm v a to let out to tenants at a certain rent or to takeat a certain rate గుత్తకుయిచ్చుట, గుత్తచేసుకొనుట. the landsare farmed out to various persons ఆ పొలములు వాండ్ల వాండ్లకుగుత్తకు యివ్వబడ్డవి.
To Farrow v a పంది పిల్లలను వేసుట.
To Fart v a పిత్తుట, శ్రద్దించుట.
To Farther v a ఉపబలముచేసుట. his going there *ed thierdesigns వాడు అక్కడికి పోవడము వాండ్ల యత్నమునకు అనుకూలమైనది.
To Fasccinate v a మంత్రకట్టు కట్టుట. metaphorically మోహింపచేసుట.సొక్కించుట, వ్యామోహ పరుచుట, మరులు కొలుపుట.
To Fashion v a ఆకారమేర్పరచుట,రూపమేర్పరుచుట. he *edit like a horn దాన్ని శృంగారముగా చేసినాడు. he *edhis laws according to the customs of the people లోకాచారమునకుఅనుగుణముగా చట్టములను యేర్పరచినాడు.
To Fast v n ఉపవాసమువుండుట, , ఉపోష్యముండుట, పస్తువుండుట.నిరాహారముగా వుండుట. to * by reason of illnessలంఖణము వుండుట, లంఖణము చేసుట. to ( as a religiousact నిర్జలము చేసుట.
To Fasten v n కరుచుకొనుట, అంటుకొనుట. the leech *ed uponhis hand వాడి చేతిలో జలగ కరుచుకొన్నది. the dog *ed upon thepigs neck కుక్క పంది గొంతును పట్టుకొన్నది. the snake *ed uponhis hand పాము వాడి చేతిలో కరుచుకొని వున్నది. the four children*ed upon him ఆ నలుగురు బిడ్డలు వాన్ని కరుచుకొని వున్నారు,అనగా చుట్టుకొని వున్నారు. on opening the book he *ed upon thisverse ఆ పుస్తకమును తెరవగానే యీ శ్లోకము చిక్కినది. In readingthe letter he *ed upon this word కాగితమును చదవడములోయీ మాటను పట్టుకొన్నాడు. he *ed upon an expression of mineనేను చెప్పడములో వొక మాటను గట్టిగా పట్టుకొన్నాడు. he *edupon the ship వాడను పట్టుకొన్నాడు.
To Fat v a see to Fatten, v. a.
To Father v a to ascribe to any one as his offspring or productionతన సంతానమని చెప్పుట, తనవల్ల పుట్టినదనుట. he *ed the childఆబిడ్డ తనకు పుట్టినదంటాడు, ఆ బిడ్డకు తండ్రి తానంటాడు. she has*ed the child upon you ఆ బిడ్డను నీకు కన్నాను అంటున్నది.they *ed this letter upon me యీ జాబుకు నేను కారకుణ్ని అంటారు.I would not * such a foolish book as this యింత పిచ్చి పుస్తకమునావల్ల పుట్టినదని వొప్పుకొందువా.
To Fathom v a లోతు చూచుట, ప్రమాణమును తెలుసుకొనుట. they*ed the water తాళ్లు వేసి ఆ నీళ్లలోతును చూచినారు. I cannot * hismeaning వాడి భావము అగాధముగా వున్నది తెలుసుకోలేను.
To Fatigue v a ఆయాసపెట్టుట, శ్రమ పెట్టుట. this work *s meయీ పనిచేత నాకు మహా ఆయాసమౌతున్నది.
To Fatten v a కొవ్వు విడుచుట, కొవ్వేటట్టుచేసుట, సత్తువ చేసుట.he *ed the sheep with salt వుప్పు వేసి గొర్రెను కొవ్వ విడిచినాడు.
To Faulter v n మాట్లాడడములో నోరుతడబడుట, తొట్రుబడుట.See To Faulter, v. n.
To Favour v a దయచేసుట, ఆదరించుట, అభిమానించుట, అనుకూలముచేసుట. the judge never ought to * the prosecutor న్యాయాధిపతిఫిర్యాదియందు అభిమానించరాదు. I think the witness *ed the prisonerయీ సాక్షికై దిపక్షము వున్నట్టు తోస్తున్నది. * me with this bookయీ పుస్తకము నాకు దయచేయండి . * me with your company to-morrowదయచేసి రేపటిదినము యిక్కడికి రావలెను. he *ed thier views వాండ్లకోరికకు సహాయపడ్డాడు. this ground *s cavalry యీ బయలు తరుపుసవార్లకు వుపయోగముగా వున్నది. these hills donot * the passage ofguns యీ కొండలమీద ఫిరంగులు పోవడానకు అనుకూలము లేదు.when the ships engaged, the wind *ed the enemy వాడలు యుద్ధానికిఆరంభించగానే గాలి శత్రువు వాడలకు అనుకూలముగా కొట్టినది.
To Fawn v n నక్క, నైచ్యములుచేసుట, నక్క వినయము చేసుట, యిచ్చకమాడుట,ఉపసర్పించుట. the beggar naturally *s upon the rich man మహారాజుదగ్గిర బిచ్చగాడు సహజముగా నక్క నైచ్యములు చేస్తాడు. he *ed upon theGovernor to get this appointment యీ వుద్యోగమునకై గవర్నరునువుపసర్పించినాడు.
To Fear v a and v. n. భయపడుట, శంకించుట. (usually governing a dative) he *s his father తండ్రికిభయపడుతాడు . Do you not * God దేవునికి భయపడవా. I now * feverనాకు యిప్పుడు జ్వరము వచ్చేటట్టు వున్నది. I * నాకు తోస్తున్నది.I * he is dead వాడు చచ్చి వుండును, వాడు చచ్చినాడేమో. I * youare wrong నీవు తప్పినావని తోస్తున్నది, నీవు తప్పివుందువుసుమీ. *ingthe sin పాపమునకు వెరచి.
To Feast v a విందు పెట్టుట. the king *ed them రాజు వాండ్లకువిందుచేసినాడు. at last his native country *s his eyes తుదకుతనదేశమును కండ్ల పండుగగా చూచినాడు, చూచి ఆనందించినాడు. atlast his child *ed his eyes తుదకు వాడి బిడ్డను కండ్లచూచి సంతోషించినాడు.
To Feather v a బొచ్చునుపరుచుట. the bird *s her nest ఆ పక్షిగూడుకట్టిలోగా బొచ్చు మెత్తగా పరుచుకొన్నది. he had *ed his nest wellవాడు మంచి భాగ్యవంతుడైనాడు, నిండా ఆస్తి చేర్చినాడు.
To Fee v a ఫీజు యిచ్చిపెట్టుకొనుట. he *d the lawyer ఫీజుయిచ్చిన లాయరును పెట్టుకొన్నాడు. the lawyer was *d ఫీజు తీసుకొనిలాయరుగా యేర్పడ్డాడు.
To Feed v n మేసుట, తినుట, భోజనము చేసుట. they fedunder the wall గోడపక్కను భోజనము చేసినారు. the Hindu * themselveswith the hand హిందువులు చేతిలో తింటారు. horses * on cornగుర్రములు గోధూమములు తింటవి. Elephants * on leaves యేనుగులుఆకులు తింటవి. the child *s only on milk ఆ బిడ్డపాలతో ప్రాణములుపెట్టుకోనివున్నది. the goats fed on bushes on the mountain మేకలుకొండమీద పొదలను మేస్తూ వుండినవి.
To Feel v a స్పర్శించుట, స్పర్శచేత తెలుసుకొనుట, అంటి చూచుట,తాకి చూచుట,ఎరుగుట, అనుభవించుట, పడుట. I you * (handle) ityou will know whether it is hor or cold అది వేడో చల్లనో తాకిచూస్తే తెలుసును. I do not * the breze here యిక్కడ గాలి కొట్టలేదు.he *s (experiences) the consequences of his conduct వాడుచేసుకొన్నదాన్ని అనుభవిస్తాడు. he felt agitation కలవరపడ్డాడు.I did not * the blow ఆ దెబ్బ తాకినది,నాకు తెలియలేదు. he feltanger వాడికి కోపము వచ్చినది. he felt compassion వాడికి కోపమువచ్చినది. he does not * the crime he committted తాను చేసినదితప్పు గదా అని వాడికి తోచలేదు. he felt fear భయపడ్డాడు. he felt(suffered) grief దుఃఖించినాడు.she felt joy సంతోషపడ్డది.he felt joy at this అందున గురించి సంతోషపడ్డాడు. I * pain in myleg నా కాళ్లు నొస్తున్నవి. the death was sudden and he did not * itspangsఅకస్మాత్తుగా చచ్చినందున వాడు మరణ వేదనపడలేదు. she felf shameసిగ్గుపడ్డది. I felt sorrow వ్యాకులపడ్డాను. he felt these wordsto be true యీ మాటలు వాస్తవ్యమనుకొన్నాడు. he felt these wordsయీ మాటలు వాడికి తాకినది. he did not * what I said to him నేనుచెప్పిన దానికి వాడు వ్యాకులపడలేదు, నేను చెప్పినది వాడికి తాకలేదు.I felt his head and found it swollen వాడి తలను ముట్టి చూస్తే వాచి వుండినది. he felt her pulse దాని చెయ్యి చూచినాడు, దానికిధాతువ చూచినాడు. he spoke in this manner merely to *theirtemper వూరక వాండ్ల గుణము కనుక్కోవడమునకై యిట్లా మాట్లాడినాడు.
To Feign v n బేడిజము చేసుట, మారీచము చేసుట, దొంగవేషము వేసికొనుట.he *ed to be a friend. స్నేహితుడైనట్టు నటించినాడు.
To Feliciate v a to congratulate. శుభమును కొనియాడుట, సంతోషమునుకొనియాడుట. she *d me on the birth of my son నాకు బిడ్డపుట్టినసంతోషమును కొనియాడడమునకు వచ్చినది. నాకు బిడ్డపుట్టనదని చూడవచ్చినది.
To Fell v a నరుకుట,నరికితోసుట. to * a tree చెట్టును నరికి తోసుట.to * an ox యెద్దును నరుకుట.
To Fence v n గరడి చేసుట, సాము చేసుట.
To Ferment v n పులిసిపొంగుట. his brains *ed with drinking తాగినందునమయకము తలకెక్కినది. his heart was * ing with rage ఆగ్రహముచేత వాడి మనసు పొంగుతూ వుండినది.
To Ferry v a పడవలో దాటించుట, అనగా పడవ, పుట్టి, తెప్ప మొదలైనవాటిమీద యేరు మొదలైన వాటిని దాటించుట. he ferried them acrossవాండ్లను పడవలో తీసుకపోయి ఆ గట్టున విడిచినాడు.
To Fertilize v a భూమికి సత్తువను కలగచేసుట. the rain*d the landఆ వర్షము చేత భూమికి సత్తువ కలిగినది.
To Fester v a చీము పోసుట, చీము పట్టుట. the thorn remained * ingin the wound ఆ ముల్లు గాయములో చీము పోసుకొని వుండినది.
To Festoon v a తోరణములు కట్టుట, హరములతో అలంకరించుట.జాలరుకట్టుట, గోటు వేసుట.
To Fetch v a పోయి తీసుకొని వచ్చుట. * me the horse పోయి గుర్రమునుతీసుకరా. he *ed a leap వాడు వొక గంతు వేసినాడు. the stag *ed a boundఆ జింక దుమికినది. ఆ జింక వొక కుప్పి గంతు వేసినది. he *ed a compassచుట్టూరుగా వచ్చినాడు. he *ed a sigh పెద్ద వూపిరి విడిచినాడు. I cannot *my breath నాకు వూపిరి తిరగలేదు. the horse may * a thousandrupees ఆ గుర్రమును అమ్మితే వెయ్యి రూపాయలు వచ్చును. these things * a good price వీటికి మంచి వెల వచ్చును. the ship *dthe post వాడ ఆ రేవుకు వచ్చి చేరినది. he sold them for whateverthey might * వాటిని వచ్చిన వెలకు అమ్మినాడు.
To fetter v a సంకిళ్లు వేసుట. metaphorically నిర్భంధపరుచుటthey *ed him వాడికి సంకిళ్లు వేసినారు.
To Fettle v n see to Fidget and to fiddle.
To Fib n s అబద్దాలాడుట, కల్లలాడుట, బొంకుట.
To Fiddle v n పిడీలు వాయించుట, సారంగి వాయించుట.
To Fidget v n కదులుట, అనగా చేతులు కాళ్లు కుదరుగా పెట్టుకొని వుండక వెర్రివెర్రిగా కదులుట. you never should * at church గుడిలో చెయ్యి కాలుకదలించక అమరికగా వుండవలసినది. how this horse *s ! ఆ గుర్రము నిలిచినచోటనిలువదుచూడు.the dog *s because he smells a rat యెలుక వాసనవచ్చినందుకు ఆ కుక్క నిలిచిన చోట నిలువలేదు.
To Fight v a జగడమాడుట, పోరాడుట, యుద్ధము చేసుట. he foughtthem and conquered వాండ్లతో పోరాడి జయించినాడు. they did not * itout వాండ్లు దాన్ని నెగ్గించలేదు, తుదముట్ఠ సాధించలేదు. he foughtthe cause of the poor వాడు పేదలకై పోరాడినాడు. I fought your causewith him అతనితో నీ పక్షముగా మాట్లాడినాను. he fought off the is accusationయీ తప్పును నివారణము చేసుకొన్నాడు.
To Figure v n నటించుట. he *d as a learned man వాడు వొక పండితుడుగానటించినాడు,యిది నీచమాట. he would * well at their side వాడికిన్నివాండ్ల కేసరి.I don't think that book *s well by the side of this ఆ పుస్తకము యెక్కడ యీ పుస్తకము యెక్కడ. she *d very well at hisside అతని గౌరవము యెంతో దాని గౌరవము అంతే, అది వాడికి తగినదిగావుండెను.
To Filch v a తస్కరించుట, స్వల్పదొంగతనముచేసుట. he *ed part of theirproperty which was in his charge తన వద్ద వుండిన వాండ్ల ఆస్తిలోకొంచెం నోట్లో వేసుకున్నాడు.
To File v a to rasp ఆకురాయితో లోహమును రాచుట . to string కూర్చుట.as a law suit దాఖలు చేసుట. he *d a petition వాడు వొక అర్జిదాఖలుచేసినాడు.
To Fill v n నిండుట. the ship *ed and sunk ఆ వాడ నీళ్లతో నిండి మునిగిపోయినది. the balloon *ed with smoke and rose ఆ గుమ్మటముపొగతో నిండి పైకి లేచినది.
To Fillip v a మీటుట, చిటక వేసి రమ్మని సంఙ్ఞ చేయుట, వేలితో గీటుట.
To Filter v a వడియకట్టుట, వస్తగాళితము చేసుట.
To Filtrate v a వడియకట్టుట.
To Find v a కనుక్కొనుట, కనిపెట్టుట,పొందుట. I found it అది నాకుదొరికినది, చిక్కినది. I found much assistance from this యిందు చేతినిండాసహాయమును పొందినాను. I found two books there నాకు అక్కడ రెండుపుస్తకములు అగుపడ్డవి. I could not * the word ఆ మాట నాకు చిక్కలేదు.I found him at home యింట్లో దొరికినాడు. I found he went there వాడుఅక్కడికి వెళ్లినాడని తెలిసినది. he found no opportunity వాడికి సమయముచిక్కలేదు.how could he * it in his heart to say this ? యిట్లా చెప్పేటందుకువాడికి యెట్లా నోరాడినదో ? how could he * it in his heart to beat her ?దాన్ని కొట్టేటందుకు వాడికి యెట్లా చేతులయినవో? as he could not * it in hisheart to do so అట్లా చేసేటందుకు వాడికి మనసు రానందున . I now * that themoney is his ఆ రూకలు వాడివని నాకు యిప్పుడు తెలిసినది. how do you * your selfto-day నేడు నీకు వొళ్లు యేట్లా వున్నది ? I found it cold to-day .యీ వేళ నాకు చలిగా వున్నది. he found it difficult వాడికి అది కష్టముగావుండినది. you will * it easy అది నీకు సులభముగా వుండును. I found itbetter to pay the money రూకలు చెల్లించడమే మేలని నాకు తోచినది. the jury found him guilty జూరీలు వాడు నేరస్థుడన్నారు. the juryfound this a true bill యిది విమర్శకు తేవలసిన ఫిర్యాదని జూరీలుఅన్నారు. the water found it's way through the bank ఆ నీళ్లు కట్టగుండాదారి చేసుకొని బయలుదేరినవి. he found fault with me నా మీద తప్పుపట్టినాడు, నన్నుకూకలు పెట్టినాడు. after ten years the letter found it's way into my hands పది యేండ్లకు తరువాత ఆ జాబు తనంతటనే నాచేతికివచ్చినది. did you * the account ? ఆ లెక్క సరిగ్గా వున్నదా? No : I foundit wrong అది తప్పనితెలిసినది. he gave me a room but I found myselfతన యింట్లో చోటు మాత్రము యిచ్చినాడు గాని భోజనము నాకు నేనే జాగ్రత్త చేసుకొన్నాను.they found the ship in provisions ఆ వాడకు కావలసిన భోజనసామగ్రీలనుజాగ్రత్త చేసినారు. you write the book and I will * you in paperand pen నీవు ఆ పుస్తకము వ్రాయి, కాగిదాలు పేనాలు నేను జాగ్రత్త చేస్తాను.the ship was completely found for six months ఆ వాడలో ఆరు నెలలకుభోజన సామాగ్రి యధేష్టముగా వుండినది. I found out the meaningఆ అర్ధమును కనుక్కొన్నాను. I found out the puzzle. ఆ విడకథనువిచ్చినాను, ఆ మర్మమును భేదించినాను. I found him out వాని కుట్రనుకనుక్కొన్నాను, వాన్ని కనిపెట్టినాను. he found out this medicineయీ మందును కల్పించినాడు, యీ మందును కొత్తగా కలగచేసినాడు.
To Fine v a (to refine) శుద్ధిచేసుట, పుటము వేసుట, అపరాధము వేసుట.they *d him ten rupees. వాడికి పదిరూపాయలు అపరాధము వేసినారు. To Finedraw, v. a. పోగులు తీసుట,రప్పుచేసుట. (H.rafu)
To Finger v a to touch lightly స్పృశించుట, ముట్టుట, తాకుట, అంటుట.(the harp or lute &*c.) మీటుట, వాయించుట . if you * the food who willeat it ? నీవు ఆ అన్నమును తాకితే యెవరు తింటారు? he *ed the book tillhe spoiled it ఆ పుస్తకమును చేత పట్టి పట్టి చెరిపినాడు.
To Finis v a ముగించుట, సమాప్తిచేసుట, కాజేసుట, తీర్చుట,నెరవేర్చుట. he *ed writing it దాన్ని వ్రాసి ముగించినాడు.
To Finish v n ముగియుట, సమాప్తియౌట, తీరుట.
To Fire v n to take * అంటుకొనుట, రగులుకొనుట. they *d upon usమా మీద కాల్చినారు. the battalion *d twice ఆ పటాలము రెండుమాట్లు కాల్చినది. at these words he *d up యీ మాటలు విని భగ్గునమండిపడ్డాడు.
To Fish v n చేపలను పట్టుట, చేపల వేటాడుట. you may * for thatappointment ఆ వుద్యోగానికి నీవు అల్లాడడము వ్యర్ధము. I saw what hewas * ing for వాడు యెందుకు అల్లాడుతాడో అది కనుకౌన్నాను. I *ed outthe secret ఆ మర్మమును వెళ్లదీసినాను. I *ed up the bag ఆ సంచినికర్రతో అందుకొన్నాను.
To fit v n తగుట, సరిపడుట, యిముడుట, పొసగుట.
To Fix v a నాటుకొనుట, పాదుకొనుట. the hook *ed in his fleshఆ గాలము వాడి కండలో చిక్కుకొన్నది. his eyes * ed వాడికి నిలువు గుడ్లుపడ్డవి.
To Fizz v n చుంయిమనుట.
To Flag v n to fail, to tire డస్సుట, అలుసుట. without * goingడస్సిపోకుండా.
To Flagellate v a చబుకుతో కొట్టుట.
To Flame v n మండుట, రగులుట, to shine ప్రకాశించుట.
To Flank v a పక్కను వుండుట. that garden's my house ఆ తోట మా యింటికిపక్కగా వున్నది. our army *ed the town మా సేన ఆ వూరి పక్కన వుండినది.our army was *ed with four guns మన సేనకు రెండు పక్కల రెండేసి ఫిరంగులువుండినవి. the hill is *ed with towers ఆ కొండ పక్కను బురుజులు వున్నవి.
To Flap v n రెక్కలవలె కొట్టుకొనుట. the handkerchief *ped in thewind రుమాల గాలిలో పటపటమని కొట్టుకోన్నది. the hat *ped overhis eyes వాని టోపి కండ్లకు అడ్డముగా జారినది. the sails were*ping about in the breeze గాలులో వాడ చాపలు తెరవలె యిటు అటు కొట్టుకొని ఆడుతూ వుండినవి.the flags make a *ping noise జెండాలుపటపటమని కొట్టుకొంటవి. the cock made a *ping noise with its wingsకోడిపుంజు రెక్కలను చటచటమని కొట్టుకొన్నది. some dogs have *ping earsకొన్ని కుక్కలకు చెవులు వేలాడుతూ వుంటవి.
To Flare v n జ్వలించుట, మండుట, ప్రకాశించుట.
To Flash v n మెరుసుట, తళుక్కుమనుట.
To Flatten v a చదరపరుచుట, సమము చేసుట. the blow *ed the ballఆ దెబ్బచేత ఆ చెండు తప్పటైపోయినది.
To Flatter v a పొగుడుట, బుజ్జగించుట, ముఖస్తుతిచేసుట, వూరక వుబ్బించుట.he *ed me a great deal but it was of no use నన్ను వూరికె యెత్తిపెట్టినాడుగాని అది నిష్ప్రయోజనము. he *ed me to the skies నన్ను వూరికె ఆకాశముమీద యెత్తిపెట్టినాడు, గోపురము మీద యెత్తిపెట్టినాడు. the dog *ed me forthe bread ఆ కుక్క రొట్టెకై నన్ను వుపసర్పించినది. I * myself you will find this correct యిది తమకు సరిగ్గా వుండుననుకొన్నాను. he *ed himselfthat the money would be engough but it was not ఆ రూకలు చాలుననుకొన్నాడుగాని అది యెంత మాత్రము చాలకపోయినది.
To Flaunt v n కులుకుట, విర్రవీగుట.
To Flay v a తోలును దోచుట, చర్మమును వొలుచుట. his back wasall *ed వాని వీపు తోలు పోయినది.
To Flea v a మిణ్ణల్లులను దులుపుట.
To Flee v n a. పారిపోవుట, వురుకుట. or emigrate వలసపోవుటhe fled the town పట్నము విడిచి పారిపోయినాడు. he fled the townపట్నము విడిచి పారిపోయినాడు. he fled their face వాండ్ల ముఖముముందర నిలువలేక పారిపోయినాడు. in I cor. VI. 18. తప్పించుకొనుట.దూరే తిష్టతి A+.
To fleece v a నిలువెల్ల దోచుకొనుట, నిలువుదోపు, దోచుట.
To Fleer v n యెగతాళిచేయుట, వెక్కిరించుట.
To Fleet away v n తీవ్రములో ముగుసుట. life *s awaylike a cloud ఆయుస్సు మేఘమువలె నిమిషములో మటుమాయమౌతున్నది.
To Flick v a విదిలించుట, చిమ్ముట, he *ed the water from his fingersవెళ్లనీళ్లను విదిలించినాడు.
To Flicker v n to move with uncertain and hasty motion యిప్పుడో యింక నిమిషానికో పొయ్యటట్టు అల్లాడుట. a * ing flame అణగారిపొయ్యే జ్వాల.
To Flinch v n వెనక్కుదీసుట, సంకోంచించుట, జంకుట. he gave hisevidence without * ing జంకకుండా సాక్షి చెప్పినాడు.
To Fling v n దూరుట. she flung into the room అది రేగి యింట్లోకిచొరబడ్డది. the door flung open తలుపు తెరుచుకొన్నది. the horseflung out at him ఆ గుర్రము వాణ్ని తన్నపోయినది.
To Flirt v a విదిలించుట, ఝాడించుట. as water చల్లుట, చిలకరించుట.to * a fan విసనకర్రను విదిలించుట. to * a handkerchief రుమాలనుఝాడించుట.
To Flit v n మిడిసి మిడిసి యెగురుట, యిది గబ్బిలము, పక్షులు, మేఘములనుగురించిన మాట. or to decamp వలసపోవుట. they * ted from the village ఆ వూరు విడిచి వలసపోయినారు.
To Float v a తేలవిడుచట. they *ed the trees down the riverఆ చెట్లను యేట్లో కొట్టుకొనిపొయ్యేటట్టు విడిచినారు. he *ed his field మడికి నీళ్లు కట్టినాడు.
To Flog v a కొట్టుట, శిక్షవిధించి కొట్టుట, కొరడాతో కొట్టుట.
To Flood v a నీళ్లతో ముంచుట, ప్రవహించుట, వెల్లువ పారుట. the riverhas *ed the field యేటి వెల్లువ ఆ చేనుమీద ప్రవహించినది.
To Floor v a తళ వరస వేసుట, కింద రాళ్లు పరుచుట. he *ed thehouse with stones తళవరసకు రాళ్లు పరిచినాడు. the house is not yet *edఆ యింటికి యింకా తలవరస వేయలేదు. this *ed him పడకొట్టినది. he was*ed వోడినాడు.
To Flounce v n నీళ్లలోనే మిడిసిపడుట. she *d into the room అదిబహు ఆగ్రహముతో యింట్లోకి చొరబడ్డది. she *d the dress with laceదాని బట్టలకు సరిగెజాలరు వేసినది.
To Flounder v n తన్నుకొనుట, గిజగిజలాడుట.
To Flourish v n శృంగారముగా వుండుట, అభివృద్దయౌట, క్షేమముగావుండుట, తేజరిల్లుట. the garden *es ఆ తోట నవనవలాడుతూ వున్నది.the work *es well ఆ పని చక్కగా జరుగుతున్నది.he *es in writingఅక్షరములు చిన్నెలుగా వ్రాస్తాడు. to * in music అలాపన చేసుట.he *ed a thousand years ago అతడు వెయ్యేండ్ల కిందట వుండినాడు.
To Flout v a తిరస్కరించుట, కసురుకొనుట, యెగతాళిమాటలు.
To Flow v n కారుట, స్రవించుట, పారుట, ప్రవహించుట.rivers that * into the sea సముద్రగామి అయ్యే నదులు.the sea that * s between these countries యీ దేశముల మధ్యవుండే సముద్రము. that river *ed over its banks ఆ యేరు కట్టలమీదపొర్లిపారినది. her hair *ed over her shoulders దాని వెండ్రుకలుభుజములమీద జీరాడినవి . this *s from another cause యిది వేరే కారణముచేత కలుగుతున్నది. as life *s on men became wiser వయసురాగా రాగా మనుష్యులకు బుద్ధి వస్తున్నది. his life *s on smoothlyవాడికి వొనరుగా జరుగుతున్నది హాయిగా జరుగుతున్నది. at these wordsher tears *ed యీ మాటలు విని కండ్లనీళ్లు పెట్టుకొన్నది.
To Flower v n పుష్పించుట, పూచుట. this tree *ed yesterday ఆ చెట్టునిన్నటి దినము పూచినది, పుష్పించినది.
To Fluctuate v n అల్లాడుట, డోలాయనముగా వుండుట, చాంచల్యముగావుండుట. the price of silk * s much పట్టువెలకు వొక స్థిరము లేదు.
To Flush v n యెర్రబారుట.
To Flute v a in carpentry పట్టెలు తీర్చుట, గీతలు కట్టుట. *d workనాముపని. a *d jug పట్టెలు తీర్చిన చెంబు.
To Flutter v a రెక్కలను తాటించుట. the bird *ed its wingsపక్షి రెక్కలను కొట్టుకొన్నది. she *ed her fan అది విసనకర్రను చటచటమనిఆడించినది.
To Flux v a to melt కరిగించుట. silver is *ed with lead వెండినిసీసము బెట్టి వూదుతారు.
To Fly v a to shun మానుకొణుట, విడిచిపెట్టుట. he flew the kiteగాలిపటము విడిచినాడు.he fled the enemy శత్రువువద్ద నుంచి పారిపోయినాడు.the rat fled me ఆ యెలుక నా వద్దనుంచి పరుగెత్తిపోయినది, నన్నుచూచిపరుగెత్తిపోయినది.
To Foal v n పిల్లవేసుట, యిది గుర్రము గాడిదె వీటిని గురించిన మాట.
To Foam v n నురుగుకట్టుట. the man *ed with rage వాడికిచెడుఆగ్రహము వచ్చినది.
To Fob, off v n. మోసపుచ్చుట, వంచించుట.
To Fodder v a పశ్వాదులకు మేతవేసుట, మేత చేర్చిపెట్టుట. *ed leavesపండుటాకులు.
To Foil v a వొడకొట్టుట, విరగ్గొట్టుట, భంగపరుచుట, తట్టివేసుట.తప్పించుట. I * ed him అతని యత్నమును భంగపరిచినాను. to * a mirror(see below) అద్దమునకు రసము పోసుట.
To Foin v n సాముచేసుట, యీమాట యిప్పుడు వాడికలేదు.
To Foist v a దొంగతనముగా దోపుట, దొంగతనముగా చొప్పించుట.he *ed this into the account దీన్ని దొంగతనముగా లెక్కలో యెక్కించినాడు.
To Fold v n మడుచుకొనుట, ముకుళించుట. in the evening the flowers *సాయంకాలమందు పుష్పములు ముకుళించుకొంటవి.
To Follow v a వెంబడించుట, అనుసరించుట, వెంటపడుట, తరుముకొనిపోవుట.they *ed the traces of the thieves దొంగలజాడపట్టి పోయినాడు.the dog *s the scent of the hare ఆ కుక్క కుందేలు వాసనపట్టిపోతున్నది.you go before and I will * you soon నీవు ముందర పో నేనున్ను వెంబడిగానే వస్తాను. I will * your direction తమ ఆజ్ఞప్రకారము నడుచుకొంటాను.he *ed their advice వాండ్లు చెప్పిన బుద్ది ప్రకారము నడుచుకొన్నాడు. he *ed the profession of a doctor వాడికి వృత్తి వైద్యము. Queen Victoria *ed William the Fourth ఆయనకు తరువాత యీమె రాణిఅయినది. One misfortune *s another ఆపద మీద ఆపద వస్తున్నది. Ten verses * in which there is not a word about this వచ్చే పదిశ్లోకములలో యిందున గురించి వొకమాట లేదు. he bathed in the eveningand a fever *ed సాయంకాలము స్నానముచేసినాడు వెంటనే జ్వరమువచ్చినది. they * the doctriness of Sankara chari శంకరాచార్యులమతమును ఆవలంబించినారు, అనుసరించినారు. he *ed another teacherమరి వొక గురువును ఆశ్రయించినాడు. they all * this customవాండ్లందరు యీ వాడికను పట్టించినారు. he *s their exampleవాండ్లు చేసే ప్రకారము చేస్తాడు. he *s the sea యితను వాడ వ్యాపారములోకలిసినవాడు, వాడసంబంధమైనవాడు. he *s the camp వాడు దండు సంబంధమైనవాడు . all metals * this principle అన్ని లోహములకున్ను యీ గుణముకద్దు. it *s that you must pay the money యిందు చేత నీవు ఆ రూకలుచెల్లించవలసి వస్తున్నది. he is a rich man but it does not * that he is wiseవాడు పదార్ధవంతుడైనందువల్లనే బుద్ధిమంతుడని భావించరాదు. It *s తోస్తున్నది, తెలుస్తున్నది. he sold the house, whence it *s that he wasthe owner అతడు ఆ యింటిని అమ్మినందున దానికి అతడే సొంతగాడనితోస్తున్నది, భావిస్తున్నది. he spoke as * or what he said was as *s అతను చెప్పినది యేమంటే. he gave me the account the particulars are as *sవాడు యీ లెక్కను యిచ్చినాడు. దాని వివరమేమంటే.
To Foment v a వొత్తడము వేసుట. కాపడము వేసుట. they *ed the woundwith warm water ఆ పుంటికి వేడినీళ్లు కాపడమిచ్చినారు. he *ed a quarrelకలహము పెట్టినాడు, పుల్లలు బెట్టినాడు, యెత్తివిడిచినాడు.
To Fondle v a ముద్దులాడుట, బుజ్జగించుట, మురుసుట, లాలించుట.she *d me to pay the money ఆ రూకలు యిచ్చేటట్టు నన్ను బుజ్జగించినది.the child *s its mother బిడ్డ తల్లితో మురుస్తున్నది, ముద్దులు కుడుస్తున్నది.
To Fool v n పిచ్చివాడుగా ప్రవర్తించుట.
To Foot v a నాట్యము తొక్కుట. he *ed it well వాడు బాగా తాండవమాడినాడు,బాగా ఆట ఆడినాడు.
To Forage v a ఆహారనికై తిరుగుట, దండుకురస్తు నిమిత్తమై వూళ్ళమీదకిపోవుట, కొల్లకై తిరుగుట. the people were foraging about in vainవాండ్లు భోజనసామాగ్రీ నిమిత్తమై వృధాగా తిరిగినారు. he went outto * but he brought in nothing కొళ్లకు పోయినాడు గాని ఒకటిన్నీతేలేదు.
To Forbear v a మానుకొనుట, విడిచిపెట్టుట, he forbore speaking పలకలేదు, మాట్లాడడు మానినాడు, మౌనము ధరించినాడు. he forborehis dinner పగటి భోజనము చాలించినాడు.
To Forbit v a కూడదనుట, వద్దనుట, నిషేధించుట, కట్టుచేసుట.shame *s him to go there సిగ్గు వాణ్ని అక్కడికిపోనియ్యలేదు. the law*s us to do this యిట్లా చేయకూడదని శాస్త్రము నిషేధిస్తున్నది. the law *ssuch conduct అట్లాకారాదని శాస్త్రనిషిద్ధము. consanguinty *sthier marriage సగోత్రము వివాహమునకు ప్రతిబంధకము. I * you togo నీవు పోకూడదు. the doctor *s me food వైద్యుడు లంఘనమువేసినాఢు. the Magistrate forbade him my house వాడు మా ఇంటికిఅడుగుపెట్టకూడదని మేజిస్ట్రేటువారు ఉత్తర్వు చేసివున్నారు. Labouringmen among the Hindus are naked unless where decency *s కూలివాండ్లుమానమును తప్ప కడమ వొళ్లు తెరుచుకోని వుంటారు, కూలివాండ్లకుగోచీతప్ప వేరే లేదు. I said your brother is dead he replied God!మీ అన్న చచ్చినాడన్నందుకు శివశివా అన్నాడు. In Rom. VII. 7. ఇత్ధంనభవతు.A+. If my father dies ( first which God * !)వొకవేళ మాతండ్రి చనిపోతే మటుకు అట్లా దేవుడు సంకల్పించరాదు. theordinary phrases are రామ రామ ! శివశివ! హరిహరి.
To Force v a to compel బలవంతముచేసుట, బలాత్కారముచేసుట,నిర్భందించుట. he *ed some tears పైకి కండ్లలో నీళ్లు తెచ్చుకొన్నాడు.he *d a smile పైకి నవ్వినాడు. the police *d the house పోలీసువాండ్లుయింట్లో జొరబడ్డారు. the prisoners *s the guard and escaped ఖైదీలుపారావాండ్లను తోసుకొని పారిపోయినారు. they *d the guard and rushedin పారావాండ్లను తోసుకొని లోగా చొరబడ్డారు. he was charged withhaving *d a woman వొక ఆడదాన్ని బలాత్కారము చేసినాడన్న ఫిర్యాదువాడిమీద వచ్చినది. he *d them to do it వాండ్లను నిర్భందించి చేయించినాడు.his bad behaviour *d me to dismiss him వాడి దుర్నడతవల్ల వాన్నితోసివేయవలసివచ్చినది. this *s me to tell you the truth యిందువల్లనీతో నిజము చెప్పవలసి వచ్చినది. the low roof *d me to stoop ఆ యిల్లుకురచగా వున్నందున వంగవలసివచ్చినది. he *d them apart వాండ్లనుతొలగదీసినాడు, వీడదీసినాడు. they *d her from him దాన్ని అతడి దగ్గెరనుంచి యీడుచుకొనివచ్చినారు. he *d the purse from her hand దానిచేతసంచిన పెరుక్కున్నాడు. I could not * a word form him వాడి దగ్గెరవొక మాటనైనా వెళ్లదీయలేకపోతిని. he *d the ball into the gunతుపాకిలో గుండువేసి గెట్టించినాడు. he *d his hand into the holeఆ బొందలో చెయ్యిని బలవంతముగా దూర్చినాడు. he *d the cltohesinto the box ఆ పెట్టె లో గుడ్డలను కూరినాడు. It *d myselfinto the room ఆ యింట్లో వుండే జవాన్ని తోసుకొని పోయినాను.he *d the door open ఆ తలుపును గెంటి తెరిచినాడు. they *d him outof the house వాన్ని యింట్లోనుంచి బయిటికి గెంటినారు, నూకినారు.he *d the nail out ఆ చీలను వూడ పెరికినాడు, పెళ్లగించినాడు.he *d up the stone రాతిని పెళ్లగించినాడు. to * a plant దోహదముచేసి అకాలమందు పుష్పఫలములు కలిగేటట్టు చేసుట.
To Ford v a నీళ్లలో దిగిపోవుట. he *ed the river but it was upto his middle యేటిలో దిగిపోయినాడు అయితే మొలమట్టు నీళ్లు వుండినవి. water that may be *ed దిగిపో కూడిన నీళ్లు.
To Forebode v a పురస్సూచన చేసుట. I * evil from thisతొందర వచ్చునని యిందుచేత నాకు అగుపడుతున్నది. I *d as muchయిట్లా కాబోతున్నదని మునుపే నాకు తెలుసును. this heat *s rain యీ వుక్క చూస్తే వాన వచ్చేటట్టు వున్నది.
To Foredo v a చెరుపుట, చంపుట, యిది ప్రాచీనకావ్యశబ్దము.
To Foredoom v a విధించుట.
To Forefend v a నివారించుట, నిషేధించుట, ఆటంకముచేసుట.See To forbid.
To Forego v a మానుకొనుట, విడిచిపెట్టుట, వదులుట, పరిత్యజించుట.
To Foreknow v a రాబొయ్యేదాన్ని ముందుగా యెరుగుట, ముందుగాతెలుసుకొనుట. God *s our actions మనము చెయ్యపొయ్యే పనులుఈశ్వరుడికి ముందుగానే తెలుసును.
To Fore-ordain v a సంకల్పించుకొనుట, ముందుగా నియమించుకొనుట. GOd *ed this యీశ్వరుడు యిట్లా సంకల్పించుకున్నాడు.
To Fore-run v a సూచించుట. this wind *s rain యీ గాలివానను సూచిస్తున్నది. యీ గాలిని చూస్తే వానవచ్చేటట్టు వున్నది.
To Foresee v v ముందుగా కనుక్కొనుట, ముందుగా తెలుసుకొనుట.I foresaw this యిట్లా సంభవించకపోతుందని మునుపే కనుక్కున్నాను.
To Foreshew v a రాబొయ్యేదాన్ని ముందుగా అగుపరచుట, ముందుగాతెలియచేయుట, పురోసూచన చేసుట.
To Foreshorten v a to shorten figueres in drawing for the sakeof shewing those behind వెనుకవుండేటట్టు అగుపడేలాగు పైన కురచగావ్రాసుట, యిది చిత్రపనిని గురించిన మాట.
To Foreshow v a రాబొయ్యేదాన్ని ముందుగా అగుపరచుట, ముందుగా తెలియచేసుట.
To Forestal v a ముందుమించుకొని మోసపుచ్చుట. I intended to buy thehouse but he *n led me ఆ యింటిని నేను కొనుక్కోవలెనని వుండగా వాడుముందుమించి కొనుక్కొన్నాడు. he has *led you in that discoveryఆ మర్మము నీవు కనుక్కొన్నావు , సరే నీకు ముందే వాడు కనుక్కొని నీకు కరక్కాయ పెట్టినాడు. these merchants *led the market ఆ వర్తకులుఅంగళ్లవాండ్లకు వచ్చే సరుకును ముందుమించి తాము తిప్పుకొన్నారు.he *led the goods ఆ సరుకులు తాను ముందుమించి మళ్లించుకొన్నాడు.ఆ సరుకులను తాను నడమవచ్చి అంటుకొని పోయినాడు.
To Foretel v a రాబొయ్యేదాన్ని ముందుగా చెప్పుట, భవిష్యత్తును తెలియచేయుట.I think I may * a storm గాలివానకొట్టపోతున్నదని నాకు తోస్తున్నది.I always foretold you this యిట్లా కాబోతున్నదని నేను మునుపే చెప్పుతూవుంటిని.
To Foretoken v a రాబొయ్యేదాన్ని తెలియచేసుట, ముందుగా తెలియచేసుట.పురోసూచన చేసుట. this heat *s rain యీ యెండ యిదుగో వర్షమువచ్చెనని తెలియచేస్తున్నది.
To Forewarn v a యెచ్చరికచేసుట, ముందుగా హెచ్చరించుట.
To Forfeit v a పోగొట్టుకొనుట, అచ్చుట. By drinking he * ed his characterతాగడముచేత పేరు పొగొట్టుకొన్నాడు. By so doing he would * his life యిట్లా చేయడముచేత వాడి ప్రాణానికి వచ్చును. he *ed the pledgeదాన్ని అవధిక్రమము చేసివేసినాడు. By his not coming in time his appoinmentwas *ed వాడు సమయములో రానందుచేత వాడి వుద్యోగము పోయినది, వుద్యోగమునుపొగొట్టుకొన్నాడు. I will * my life if this is not the caseయిది నిజముకాకపోతే నా ప్రాణాన్ని యిస్తాను.
To Forge v a (smith's work) కమ్మరపనిచేసుట. he *d a new keyకొత్తబీగముచేసినాడు.he *d the iron well ఆ యినుమును బాగా సాగకొట్టినాడు.( in writing ) కల్పించుట, సృష్టించుట. he *d a bond తప్పు పత్రముసృష్టించినారు. he *d my signature నా చేవ్రాలువలె తప్పుచేవ్రాలుచేసినాడు.
To Forgive v a మన్నించుట, క్షమించుట. Forgiveness, n. s. మన్నింపు, క్షమ.
To Form v n యేర్పడుట, రూపీకంరించుట. after the court *ed సభకూడిన తర్వాత. after the fruit *ed అది కాయగా యేర్పడ్డ తరువాత.
To Fornicate v n రంకాడుట, వ్యభిచరించుట, పెండ్లికానివాండ్లతోపోవుట.
To forsake v a విడిచిపెట్టుట, చేయివిడుచుట, దిగనాగుట, ఉపేక్షించుట.
To Fortify v a బలపరుచుట, దృఢపరుచుట, కోటకట్టుట, కోటకట్టిబలముచేసుట. he *ed the city ఆ పటాన్ని బలముచేసినాడు.అనగా చుట్టూ గోడగాని అగడ్తగాని వేసి, దాన్ని బలముచేసినాడనిభావము. he *ied his heart with wine సారాయి తాగి మనసునుధైర్యపరుచుకొన్నాడు. he *ied himself with the hope of successఅది అనుకూలమౌనని ధైర్యముగా వుండినాడు. Madras is a *ied townచెన్నపట్టమునకు చుట్టూ ప్రహరి గోడ వున్నది.
To Forward v a to send రవాణా చేసుట, పంపుట. or to pronoteసహాయము చేసుట, రక్షించుట.
To Foster n s పెంచుట, సాకుట, పోషించుట, కాపాడుట, ఆదరించుట. he *s ill-will against them వాండ్ల మీద చలముపట్టి వున్నాడు. why do you * bad dispositions in the child ఆ బిడ్డకు వుండే దుర్గుణాన్నిఎందుకు అభివృద్ది చేస్తావు? A+. father దాది మగుడు, పెంపుడుతండ్రి. * mother దాది,పెంపుడుతల్లి. he is my * brother వాడు నేను వొక చన్నుతాగి కూడా పెరిగినవాండ్లము. * child పెంపుడుబిడ్డ. sita was the* child of Janaka సీత జనకుడి పెంపుడు కూతురు.
To Foul v a మయిలచేసుట, మాపివేసుట, మురికిచేసుట, రోతచేసుట.
To Found v a కలగచేసుట, నిర్మించుట, యేర్పాటుచేసుట, స్థాపించుట, కట్టుట.అస్తిభారమువేసుట. he *ed his house upon the rock బండమీద యింటినికట్టినాడు. the governor *ed the college గవనరు కాలీజును యేర్పరచినాడు. he *s his claim upon the regulation వాడి వ్యాజ్యమునకు చుట్టమేఆధారము. he *ed the image in brass ఆ విగ్రహమును పిత్తళితో పోసినాడు.
To Founder v n మునిగిపోవుట. the ship *ed సముద్రములో వాడమునిగిపోయినది.
To Fowl v n పక్షులను చంపుట, పక్షుల వేటాడుట.
To Fracture v a విరగగొట్టుట, పగలగొట్టుట. he *d his scullవాడితల విచ్చినది, పగిలినది.
To Frame v a to form యేర్పరచుట, కదుర్చుట, సృష్టించుట, కల్పించుట,చేయుట.
To Framp v a కసురుట, చీవాట్లు పెట్టుట.
To Franchise v a స్వతంత్రమును యిచ్చుట, విమోచనము చేసుట.
To Frank v a తపాలు రూకలు మాపు అని జాబుమీద చేవ్రాలుచేసుట.
To Fraternize v n అన్నదమ్ములరీతిగా వుండుట, ఐకమత్యముగావుండుట.
To Fray v a అరగ్గౌట్టుట. to * away birds తరమగొట్టుట, వెళ్లగొట్టుట.
To Free v a విడుదల చేసుట, విడిపించుట, విమోచనము చేసుట, వదిలించుట.నివర్తిచేసుట, నివారణము చేసుట. he *d them from prison వాండ్లనుచెరలోనుంచి విడిపించెను. he *d them from difficulties వాండ్లతొందరను నివారణము చేసినాడు. he *d the press కావలసినదాన్నిఅచ్చు వేసుకొమ్మని స్వతంత్రము యిచ్చినాడు.
To Freeze v n చలిచేత పేరుకొనుట, చలిచేత గడ్డగా కట్టుకొనుట.
To Freight v a నించుట, నిండించుట. I *ed the ship with cottonand rice ఆ వాడను దూదిన్ని బియ్యమున్ను యెక్కించి నిండించినాను.

No comments:

Post a Comment