Simoniac n s one who buys or sells preferment in the churchపాదిరి వుద్యోగమును క్రయవిక్రయములు చేశేవాడు.
Simony n s the cirme of buying or selling church prefermentపాదిరి వుద్యోగమును క్రయవిక్రయములుచేసే పాపము. he was guilty of * పాదిరి వుద్యోగమును క్రయవిక్రయములు చేసిన నేరస్తుడైనాడు.
Simoom n s అరబ్బీ దేశములో కొట్టే చెడ్డ వడగాడ్పు, దీనివల్లనిండా జీవచ్ఛేద మవుతున్నది.
Simper n s చిరునవ్వు. Same as Simmer: See Johnson's remarkon this.
Simpering adj చిరునవ్వునవ్వే.
Simple adj plain, without art సరళమైన సాధువైన, నిష్కపటియైన,వట్టి, ఉత్త. they drink * water వాండ్లు వుత్తనీళ్లు తాగుతారు. he ate * food వాడు వట్టి అన్నము తిన్నాడు. the letter was written, in a *style ఆ జాబు సరళముగా వ్రాయబడ్డది. a * believer మూఢభక్తుడు. a *hearted man నిష్కపటి, సరళమైనవాడు. a * loan చేయిబదులుగా తీసుకొన్న అప్పు. the * sense సరళమైన అర్ధము, సహజమైన అర్ధము.stupid, foolish, silly పిచ్చి, బేల, బోళ. you were very * to dothis నీవు పిచ్చిపట్టి యీ పని చేసినావు. you were very * to believe himపిచ్చిపట్టి వాడు చెప్పినదాన్ని నీవు నమ్మినావు. a * fellow పిచ్చివాడు. as Iwas a * woman he deceived me నేను యేమీ యెరగని బేలను గనుక నన్ను మోసము చేసినాడు. a maid ముగ్ధ, ముగ్ధరాలు. copper is a * metal but brass is a compound meatal రాగి స్వయంభూలోహము గాని యిత్తడి కొన్నిలోహములు కలిసి అయిన లోహము. he held the lands in fee * ఆ నేలకుస్వతంత్రుడుగా వుండినాడు.
Simpleness n s సరళత. from the * of this rule యీ సూత్రముసరళమైనది గనక, చిక్కులేనిది గనక.
Simples n s తోటకూరలు, ఓషధులు.
Simpleton n s a fool తెలివిమాలినవాడు, అవివేకి.
Simplicity n s నిష్కాపట్యము, మూఢత్వము, సరళత. in her * shebelived him వాడు చేప్పినదాన్ని పిచ్చిపట్టి నమ్మినది. from the * of diet వాండ్లు వట్టి కూడ తింటారుగనక. from the * of his style వాడిదిసరళమైన పాకముగనక.
Simplify v a to render plain తేటపరుచుట, విశదపరుచుట.
Simply adv without art నిష్కపటముగా, మాయలులేక. this is * ruinఇది వుత్తనష్టము. foolishly బేలగా, బోళగా, పిచ్చిగా, అవివేకముగా. withoutaddition కేవలము, విశేషములు లేకుండా. he told me * the truth వాడు చెప్పినది నిజమేగాని మరేమి లేదు. merely వూరికె. I * want this నాకు యిదే కావలసినది, solely మాత్రము. naturally సహజముగా.
Simultaneous adj acting together; existing at the same timeఏకకాలమందే జరిగిన, సంభవించిన, సమకాలీనమైన, కూడా జరిగిన, కూడా కలిగిన, యౌగపద్యమైన. there were two * decisions regarding thisin two separate courts యిదే సంగతిని గురించి ప్రత్యేకముగా రెండు కోరట్టులలో యేకకాలమందు రెండు తీర్పులు అయినవి. by one * effort they succeeded ఉభయులు యేకకాలమందు చేసిన వొకటే ప్రయత్నమువల్ల సాధించినారు.his arrival was * with mine వాడు నేను యేకకాలమందు వచ్చి చేరినాము.
Simultaneously adv ఏకకాలమందు, యౌగపద్యేన. we arrived * withhim వాడు మేము యేకకాలమందు వచ్చి చేరినాము. he is * a master and a servant అప్పట్లో తానే యజమానుడుగానున్ను తానే బంటుగానున్ను వుండినాడు. he was * praised and blamed వాడికి దూషణ భూషణలు కూడా యేక కాలమందే కలిగి వుండినవి. the crocodile is * a fish and a quadruped మొసలిజలజంతువుగానున్ను చతుష్పాజ్జంతువుగా నున్ను వున్నది. how can you be * afriend and a foe? శత్రువుగా నున్ను మిత్రుడుగా నున్ను కూడా ఎట్లా వుండగలవు.he was * poor and rich వాడు యేక కాలమందే దరిద్రుడుగా నున్ను మహరాజుగా నున్ను కూడా వుండినాడు. he studied Telugu and Tamil * తెలుగు అరవము కూడా యేకకాలమందే చదివినాడు.
Simultaneousness n s ఏకకాలమందు సంభవించిడము. from the * of theirarrival వాండ్లిద్దరు వొక ముహూర్తమునందు వచ్చి చేరినారు గనక.
Sin n s పాపము, దోషము, తప్పు, I John III. 4. పాపం A+. The original sense is తప్పు. For the Hebrew word `hatta' is interpretedfrustrari, carere.'
Sinapism n s నూరి గుడ్డకు పట్టించిన ఆవాలపిష్టము, దీన్నిపొక్కడమునకైవేస్తారు.
Since adv conj. because that గనుక, కాబట్టి. * they are myrelations వాండ్లు నా చుట్టాలు గనక. * he consented అతడు సమ్మతించినందున,అతడు సమ్మతించిన నాటనుంచి. * these things are so ఇట్లా వున్నవి గనక,కాబట్టి. he arrived a year * సంవత్సరము కీందట వచ్చినాడు. he arrivedten years * పది యేండ్లకు ముందర వచ్చినాడు, వాడు వచ్చిన పది సంవత్సరము లాయెను. I told him long * వాడికి శానా దినాల కీందటనే చెప్పినాను. tendays * పది దినముల కిందట, పది దినముల ముందర. I have not been there * నాటనుంచి నేను అక్కడికి పోలేదు. a few days * or not long * కొన్నాళ్లనుంచి. how long *? యెన్నాళ్లనుంచి. ever * you have you beenhere నీ విక్కడికి వచ్చినప్పటినుంచి. ever * నాటనుంచి. he has never comehere * నాటనుంచి వాడు రానేలేదు.
Sincere adj అచ్చమైన, మంచి, నిష్కపటమైన, నిష్కళంకమైన, మనఃపూర్వకమైన, సద్భావముగల, సరళమైన (A+ in Phil. I. 10.)he is a friend వాడు నిజమైన స్నేహితుడు. a * heart సద్భావము. he said this but he was not * వాడు అట్లా అన్నాడుగాని మనఃపూర్వకముగా చెప్పినదికాదు.
Sincerely adv నిజముగా, నిష్కపటముగా, సద్భావముగా, త్రికరణశుద్ధిగా.
Sincereness, sincerity n s. ?????????????, ?????, ?????????,????????. I Cor. V. 8. ????. A+. his * is judged by hisacts ???? ??????? ???? ????? ?????????????, ???? ???????? ?????????????.
Sine n s In Mathematics a right sine ద్విజ్య, క్రాంతీజ్యా, శుద్ధకోటి.
Sinecure n s a paid employment without duty పనిలేకుండా జీతముతీసుకొని వుండే వుద్యోగము. he enjoyed a * పని యేమిన్నీ లేకుండా జీతము తీసుకొని తింటూ వుండినాడు. you will find the business a * ఆ వుద్యోగములోచేయవలసిన పని యేమిన్నీ లేదు జీతము మాత్రము వచ్చును. he was ill forthree months and his horses enjoyed a * వాడు మూడునెలలు వొళ్లు కుదురులేకుండా పడి వుండినాడు గనక వాడి గుర్రాలు పనిలేక వూరికే తింటూ వుండినవి.
Sine-die adv without a fixed date ఇట్టి దినమని నిర్ణయములేకుండా. the court was adjourned * ఫలానినాడు మళ్లీ కూడేదనే నిర్ణయము లేకుండా సభ కలిసిపోయినది.
Sine-qua-non n s that which is necessary or requisite ముఖ్యము.the teachers in the College must know English, this is a *కాలీజులో వుండే మునిషీలకు ఇంగ్లీషు తెలిసి వుండవలసినది, ఇది ముఖ్యము.
Sinew n s నరము, నాడి, సిరా. the back * of the neck మెడజీవులు,మెడ నరములు. or strength బలము, త్రాణ, సామర్ధ్యము. money is the *s of war యుద్ధమునకు రూకలు జీవాతువు. the *s of war are wanting దుడ్డులేదు, రూకలు లేవు.
Sinew-shrunk adj శుష్కించిన, బక్కచిక్కిన.
Sinewy adj నరములుగల, ధాతుపుష్టిగల, బలిష్టులైన.
Sinful adj పాపమైన, పాపిష్ఠియైన.
Sinfully adv పాపముగా.
Sinfulness n s అపవిత్రత, పాపిష్ఠితనము, పాపిత్వము.
Singed adj కాలిన, కమిలిన. his hands were * నిప్పు తగిలి వాడిచేతులు కొంచెము కమిలినవి.
Singer n s he or she that sings పాడేవాడు, గాయకుడు, పాడేటిది.
Singing n s గానము, సంగీతము. a * master సంగీతము నేర్పేవాడు.
Single adj ఒంటి, ఒక. a man with a * eye; that is a faithfulsimple good man సత్పురుషుడు, నిష్కపటి. at a * blow he cut thesnake in half వొక దెబ్బన ఆ పామును రెండు తునకలుగా వేసినాడు. he wholearns a lesson at a * reading ఏకసంతాగ్రాహి. he has not a * horseవాడికి వొక గుర్రమైనా లేదు. not a * man went there అక్కడికి వొకడున్నుపోలేదు. he came not a * time వాడు వొకమాటైనా రాలేదు. a * hearted manనిష్కపటియైన వాడు. or not married పెండ్లికాని. his sister is a * womanవాడి తోడబుట్టిన దానికి పెండ్లి కాలేదు. * combat వొకడితో వొకడు కత్తులుదూసుకొనిచేస జగడము, ద్వంద్వయుద్ధము. Vali met sugriva in * combat వాలిసుగ్రీవులు వొంటిగాండ్లు యుద్దము చేసినారు. he has a * diamond worth ten thousand rupees వొకటే వజ్రము పదివేల రూపాయలు వెల చేశేది వానివద్ద వున్నది.
Single-handed adj అసహాయుడై.
Singleness n s ఒంటితనము. * of heart నిష్కాపట్యము. from the * of his views వాడు నిష్కపటి గనుక.
Singlestick n s కట్టెలు తీసుకొనిచేసే సాము. they played at *sకట్టెలు తీసుకొని సాము చేసినారు.
Singly adv ఒంటరిగా , ఏకాకిగా, ఏకముగా. he is * bent uponthis వాడికి యిది వొకటే ధ్యానము.
Singular adj particular, remarkable అద్వితీయమైన, అసమానమైన, విశేషమైన, విపరీతమైన, వింతైన. by the * goodness of God దేవుడి యొక్క విశేష కటాక్షముచేత. from her * beauty దాని అద్వితీయమైన సౌందర్యమువల్ల. he is a very * man వాడు నిండా విపరీతుడు, విచిత్రమైన మనిషి. in Grammar the * number ఏకవచనము.
Singularity n s particularity, oddness అతిశయము, విశేషము, విపరీతము, విచిత్రము, వింత. there is a * in this bird ఈ పక్షిలో వొక విశేషము వున్నది. from the * of his dress వాడిది వింత వుడుపులు గనక.
Singularly adv అతిశయముగా, విశేషముగా. a girl who is * beautifulఅతి సుందరవతి.
Sinister adj on the left hand ఎడమచేతి, అపసవ్యమైన. unlucky,unfortunate కాని, దుష్ట, చెడ్డ. his being delirious in the feveris a * symptom జ్వరములో చిత్తభ్రమగా వుండడము వొక దుర్లక్షణము. hegave me a * look నన్ను క్రూరముగా చూచినాడు.
Sink n s జలదారి, మురికినీళ్ళు నిలిచే తొట్టి. this street is a* of wickedness యీ వీధి దుర్మార్గులకు ఆలయము, పుట్నిల్లు. a theatre is a * of all profaneness and debauchery (Wesely 7. 34.) వొక నాటకశాలపాపమునకున్ను పోకిరితనమునకున్ను పుట్నిల్లుగా వున్నది. Benares is decribedas a regular * of iniquity కాశి పరిష్కారముగా పాపమునకు పుట్నిల్లని అంటారు.
Sinking n s ముణిగిపోవడము, కుంగిపోవడము, తగ్గడము.
Sinless adj పాపవిహీనమైన, నిర్ధోషమైన. in * infancy నిష్కల్మషమైనబాల్యములో.
Sinlessness n s నిర్ధోషత్వము, పాపరాహిత్యము, పవిత్రత.
Sinner n s పాపి, పాపాత్ముడు, దుర్మార్గుడు (పాపి A+.)
Sinoffering n s పాపప్రాయశ్చిత్తబలి, అపరాధఘ్నబలి. Psal. XL. 6. (Sanscrit metrical version.)
Sin-offering n s తప్పుబలి. See Cobbin on Lev. iv. 4.
Sinuosity n s వంకర టొంకర.
Sinuous adj bending in and out వంకర టొంకరగా వుండే.
Sinus n s an opening, a hollow బొంద, సందు, రంద్రము, బీటిక.
Sip n s గుక్కెడు.
Siphon n s నీళ్ళను యీడవడానికై చేశి వుండే వొక యంత్రము.
Sippet n s a small bit of bread రొట్టె ముక్క.
Sipping n s కొంచెము, కొంచెముగా తాగడము, ఆచమనము.
Sir n s అయ్య. he is gone * వెళ్ళినారండి. he is come *వచ్చినాడయ్య. as Mighty * మహరాజా. Sirs అయ్యలారా. as a word of scorn అబ్బీ, వోయి. take care * or I shall punish you చూడరానీకు శిక్ష చేస్తాను. The king addresses his noblemen as My lords;they address him as Sir, or your majesty అయ్యా అని అంటారు.
Sircar n s (Indian word for Government సర్కారు, దివాణము.(Bengal word for an accountant) లెక్కలు వ్రాఇశేవాడు.
Sire n s a father తండ్రి. do you know this hore's * ?యీ గుర్రము యే గుర్రానికి పుట్టినది నీకు తెలుసునా. he is the * ofthe poets యీయన కవుల పితామహుడు. his royal * యీయన యొక్క తండ్రియైన రాజు. grand * తాత. greaat grand * ముత్తాత, మరిన్నిరాజు వారిదగ్గిర మనవి చేయడములో Sir అనకుండా Sire అంటారు.
Siren n s a goddess who enticed men by singing, and devouredthem; any mischievous alluring woman కవికల్పిత రాక్షసి గణ విశేషము,నిండా సొంపుగా పాడడముచేత మనుష్యులను ఆకర్షించి మింగేటిది, దీన్ని మోహిని అనవచ్చును. his wife is a perfect * వాడి పెండ్లాము దివ్యముగా పాడేటిది.he listened to the * song మోహమగ్నుడై చెడిపోయినాడు.
Sirius n s the dog-star అగ్నినక్షత్రము, దీన్నికత్తెర అంటారు. nowthe * rages యిప్పుడు యెండలు ముదురుతున్నవి.
Sirloin n s the lion of beef రొండి, గొడ్డు యొక్కరొవ్ండి.
Sirname n s the family name యింటి పేరు.
Sirocco n s the south-east or Syrian wind వడగాడ్పు, అత్యుష్ణమైనగాలి, జంతువులు సుడిశిపడే గాలి.
Sirop, or Syrup n s. చిక్కని పానకము.
Sirrah n s a term of reproach or contempt ఒరే. go along *పోరా ఒరే.
Sis'erhood n s a number of women of the same order స్త్రీలు.the holy సన్యశించిన స్త్రీలు, కొత్తెమ్మలు. the frail * భోగము వాండ్లు,దాసీలు.
Siskin n s a bird; the green finch పక్షి విశేషము.
Sissoo n s (an Indian word, a kind of wood) ఇరుగుడుమాను.
Sister n s తోడబుట్టినది, సహోదరి. elder * అక్క, అప్ప. younger * చెల్లెలు. *s both elder and younger అక్కచెల్లెండ్లు. husband's * ఆడబిడ్డ. wife's * మరదలు. father's * మేనత్త. * in-law వదినె.joint * in-law తోడికోడలు. Mother's younger * పినతల్లి. Mother'selder * పెత్తల్లి. these two ships are *s they are * vessels యీ రెండు వాడలు వొకచోటనే చేయబడ్డవి. Canarese and Telugu are *languages కన్నడి తెలుగు యీ రెండు అక్కచెల్లెండ్లుగా వుండే భాషలు.
Sisterly adj సహోదర న్యాయమైన. she treated them with * kindnessవాండ్లను తోడబుట్టిన వాండ్లుగా విచారించినది.
Sistrum n s శస్త్రము.
Site n s చోటు, స్థలము, ఇల్లు వుండే చోటు. the * of the house in high ఆ యిల్లు వుండే చోటు మిట్టగా వున్నది. the * on whichthe camp stood దండుదిగి వుండినచోటు. the * of a house in Madrasis usually called నివేశనము.
Sith n s అనగా since, ఇది ప్రాచీన శబ్దము. This is used in the table of contents Rom. 5.
Sithe, or Sythe n s. సీమలో గడ్డికోసే వొక విధమైన పెద్ద కొడవలి.
Sitter n s కూర్చున్నవాడు, అనగా తన్ను చూచి చిత్రములో వ్రాయడానకై చిత్రకారుని యెదట కూర్చున్నవాడు. the * upon the mountains పర్వతాసీనుడు. a bird that broods గుడ్లను పొదుగుతూ వుండే పక్షి.
Sitting n s కూర్చోవడము, కూడడము. the court was employed on thethis business during three *s మూడు దినములు విచారించినారు. he finishedmy portrait in three *s మూడు దినములు నన్ను కూర్చుండ బెట్టుకొని చూచినాపటమును వ్రాశి తీర్చినాడు. he finished the poem at one * ఆ కావ్యమును వొక దినములోనే కడవెళ్ళ చెప్పి లేచినాడు.
Situated adj ఉండే. a town * on a hill పర్వతము మీద వుండే వూరు. ground * near a village వూరితో చేరినట్టు వుండే భూమి.
Situation n s స్థలము, స్దానము, చోటు. from the * of this town it is very cold యీ వూరు వుండే సన్నివేశమువల్ల నిండా చలిగా వున్నది. state, condition స్థితి, గతి, అవస్త. he is in a miserable * దుర్దశలో వున్నాడు. he is in a very strange * వాడు విచిత్రమైన దశలో వున్నాడు. వాడు విచిత్రమైన అవస్థలో వున్నాడు. a rural * అడవి ప్రదేశము. a * or employment ఉద్యోగము, వృత్తి, వ్యాపారము. he filled the * of a teacher వాడికి వుపాధ్యాయుల వుద్యోగము అయినది. they are in the relative *s of master and servant వాండ్లు స్వామిభృత్యన్యాయముగా వున్నారు.
Six n s ఆరు. during * days of the week they work at thisఆదివారము తప్ప కడమ ఆరు దినాలు యీ పనిలో వుంటారు. a coach and six ఆరు గుర్రముల బండి. the business is all at sixes and sevens (Shakespeare, Johnson) ఆ పని ఆరు మూడు తెరువులయి పోయినది. * and * pence అనగా * shillings and a half ఆరున్నరషిల్లింగు.
Sixpence n s అనగా అరషిల్లింగు, దీన్ని కాలు రూపాయి అనవచ్చును. the taking of a * more than the just and known salary of your employment under any pretence whatever, is corruption (Chesterfield.) ఒక కాసైనా.
Sixscore n s ఆరు యిరువైలు, అనగా నూట యిరవై.
Sixteen adj పదహారు, షోడశము. * attacked him వాడిమీద పదహారుమంది పడ్డారు.
Sixteenth adj పదహారో. one * of a rupee అణా, వీసము రుపాయి.one * వీసము. he arrived on the * పదహారో తేది వచ్చి చేరినాడు.
Sixth adj ఆరో. he arrived on the * ఆరో తేది వచ్చి చేరినాడు.
Sixthly adv ఆరోది.
Sixtieth adj అరవయ్యో.
Sixty adj అరవై.
Sizable adj తగుమాత్రమైన.
Size n s ప్రమాణము, మట్టు. a horse of a large * పెద్దగుర్రము.a house of a small * చిన్న ఇల్లు. do you know the * of the house? ఆ యిల్లు యేపాటిదో నీకు తెలుసునా. a book of this * యీ మాత్రపు పుస్తకము. of what *? యే మాత్రము, యేపాటి. a house of this * యింత యిల్లు. a stone of that * అంత రాయి. or liquid బంకవంటి వొక ద్రవ్యము, అనగా కొయ్యకు వేసే వజ్రమువలె తోలుకొమ్ములు వీటితో చేసేటిది.
Sizeable adj reasonably bulky తగుమాత్రమైన, తగుబాటిగా వుండే.
Sized adj or having largness పరిమాణముగల. large * పెద్ద,small * చిన్న. middle * నడితరముగా వుండే. fair * తగుమాత్రమైన.wetted with liquid బంక చరిమిన.
Sizer n s a certain rank of students in the universitiesపాఠశాలలో చదివే విశేషమైన వొక తరగతి చిన్నవాండ్లకు యీ పేరు కలిగియున్నది.
Skain n s See Skein చీడు, కండె.
Skate n s a kind of fish టేకిచేప, సేబడక్కాయ, చెంబడక్కాయ.irons for skating పేరిన మంచుమిద జరగడమునకై శప్పాతు కింద వేశేయినుము.
Skein n s చీడు, కండె. a * of thread నూలుకండె.
Skeleton n s కంకాళము, యెముకల వర్రు, మాంసము లేకుండా వుండే వట్టి యెముకల గూడు. that horse is a mere * ఆ గుర్రము వట్టిఎముకలగూడుగా వున్నది. I am now a mere * నేను నిండా శుష్కించివున్నాను. a walking * or lean man నడపీనుగ, అనగా బక్కచిక్కినాడు.he is reduced to mere * వాడు సన్ననూలు వడికినాడు. a * of a grammar వ్యాకరణ సంక్షేపము. the * of a regiment పటాళము యొక్కమూలాధారము, అనగా బంట్లులేకుండా నిలిచిన సరదార్లు. a * key తాలం చెవితో కాకుండా బీగము తీసే యినుపకమ్మి.
Skeptic See Sceptic
Skeptical See Sceptical
Sketch n s an outline; a rough draught చిత్రము వ్రాయడములోమొదట వేసుకొనే కట్టు గీత, చిత్తుగా వ్రాసుకొన్న రూపు. he made a *of the hill ఆ కొండను చూచాయగా వ్రాసుకొన్నాడు. he prepared a * ofthe account ఆ లెక్కకు వొక నమునా యేర్పరచినాడు. I will give youa * of the business ఆ వ్యవహారమును సంగ్రహముగా చెప్పుతాను.
Skewer n s a pin శలాక, ముల్లు, పుడక.
Skiff n s a small light boat చిన్న పడవ.
Skilful adj సామర్ధ్యముగల, చాతుర్యముగల, నేర్పుగల, నిపుణతగల,తెలిసినవాడైన. a * cook గట్టివాడుగా వుండే వంటవాడు. a * personతెలిశినవాడు, ఉపమరి, వ్యక్తుడు, సమర్ధుడు. those who are * in painting చిత్రపనిలో గట్టివాండ్లుగా వుండేవాండ్లు, చిత్రపనిలో నిపుణులు.
Skilfully n s ఉపమగా, నేరుగా, సామర్ధ్యముగా. the doctor did thisvery * ఆ వైద్యుడు దీన్ని నిండా నేర్పుగా చేసినాడు.
Skilfulness n s నేర్పు, నిపుణత, సామర్ధ్యము.
Skill n s సామర్ధ్యము, కుశలత, నేర్పు, ప్రజ్ఞ. from their * inpainting చిత్రపనిలో వాండ్లకు వుండే సామర్ధ్యము వల్ల.
Skilled adj సామర్ధ్యముగల, నేర్పుగల, నిపుణతగల. * in theology వేదాంతవేత్త అయిన, వేదాంతమందు, ప్రవీణతగల. * in business కార్యదక్షుడైన. those who are * in music సంగీతములో నిపుణులుగా వుండే వాండ్లు. those who are * in arithmetic లెక్కలలో గట్టివాండ్లుగా వుండేవాండ్లు.
Skillet n s a small kettle or boiler చట్టి, భోగుణి.
Skilling (or shed )n s. (a German word) గుడిసె, పందిలి.
Skimmer n s మీగడ యెత్తే గరిటె.
Skimmilk n s మీగడ యెత్తివేసిన పాలు.
Skin n s తోలు, చర్మము. the * that forms over boiled milk మీగడ. he was wetted to the * వానలో వాడు దొప్పదోగినాడ, వాడు నిండా తడిసినాడు. they stripped him to the * దేహముతో విడిచిపెట్టినారు, వాణ్ని బొత్తిగా దోచుకొన్నారు. he came out with a whole* గాయము లేకుండా తప్పివచ్చినాడు. a * bottle for oil సిద్దె, స్నేహపాత్రము. the feeling called goose * గగుర్పు, రోమాంచము. he is nothing but * and bone వాడు నిండా శుష్కించివున్నాడు.
Skindeep adj slight; superficial పయిపయిగా వుండే. his repentanceis only * వాడిది వట్టి పై యేడ్పు.
Skinflint n s a miser రాతిలో నార తీశేవాడు, అనగా చెడులోభి.
Skink, or Skunk n s. an animal like the guana ఒక విధమైనవుడుము.
Skinned adj తోలుగల, చర్మముగల, తోలువొలిచిన, పొట్టులేని. a * sheepతోలు తీసిన గొర్రె. తోలు వొలిచిన గొర్రె. split grain that has been * పోట్టులేని పప్పు. thick * దళమైన తోలుగల. thin * సన్నతోలు గల. he is very thin * about this యిందున గురించి వాడు కొంచెములో రేగుతాడు.
Skinner n s a dealer in skins చర్మముల వర్తకుడు, తోలు వర్తకము చేసేవాడు.
Skinny adj lean బక్కపలచని, బక్కచిక్కిన, క్షీణించిన.
Skip n s a light leap గంతు, దుముకు. *s and leaps గంతులు. the flea gave a * ఆ మిణ్నిల్లి మిడిసిపడ్డది.
Skipper n s commandar of a ship వాడ యజమానుడు, మరకాడు.
Skirmish n s a slight battle, or combat కొంచెము జగడము, స్వల్ప యుద్ధము.a contention వివాదము కలత.
Skirt n s the border of the vest అంచు వస్త్రము యొక్క అంచు, కొన, చివర.the *s of the clouds మేఘముల యొక్క అంచులు. in the *s of the country ఆ దేశములయొక్క అంతమునందు, పొలిమేరల యందు. in the *s of the forest వనప్రాంతములందు, అడవి సమీపమందు.
Skit n s ( a jest, taunt, gibe) ఎగతాళిమాటలు, యెత్తు పోడుపుమాట.
Skittish adj shy; easily frighted జంకే, బెదిరే. a * horse జంకే గుర్రము,నమ్మరాని గుర్రము. this horse is * you must be careful అది నమ్మరాని గుర్రము,పదిలముగా వుండు. wanton ; volatile చంచలమైన, చపలమైన. a * girl చపలురాలు.
Skittles n s the game of nine pins తొమ్మిది మేకులు నాటి చెండుతో వేసి ఆడే ఆట.
Skreen See Screen
Skue adj (askew, so written in Johnson and in Bentley) ఐమూలగా వుండే,వంకరగా వుండే, ఘాతుశూలమైన.
Skull n s పుర్రె, పుచ్చె, కపాలము. a thick * or blockhead మందమతి, జడుడు. theplace of *s శ్మశానము, రుద్రభూమి. * cap జోడి కుళ్లాయి.
Skuttle See Scuttle
Sky n s ఆకాశము, గగనము, అంతరిక్షము, మిన్ను. the birds that pass through the * ఆకాశములో పారే పక్షులు. * high ఆకాశానికి. they applauded him to the skiesవాణ్ని దేవుడుగా స్త్రోత్రము చేసినారు. * blue ఆకాశ నీల వర్ణము. fun, game, sportవేడుక, ఉల్లాసము.
Skylark n s ఆకాశానికి యెగిరి చెవులకు యింపుగా కూశేపక్షి.
Skylight n s a window in the ceiling of a room యింటిపై నుంచి వెల్తురు వచ్చేటట్టుగా పెట్టెకిటిక.
Skyrocket n s ఆకాశ బాణము.
Slab n s a plane of stone : as a marble slab పలకవలె వుండే నల్లరాయి,చాపరాయి. he cut the * of cork into squares ఆ బెండు యొక్క తుండును చదరము చదరముగా కోసినాడు.
Slack adj loose వదులుగా వుండే, సళ్ళివుండే, జబ్బుగా వుండే. the tide is now * యిప్పుడు యేటిపోటు అణిగినది. because the bowels are * కడుపు వెళ్ళుతున్నది గనక. if your attention is * you cannot learn నీకు శ్రద్దమట్టయితే నేర్చుకోలేవు. when appetite is * ఆకలి మట్టుబడ్డప్పుడు * lime విరియబోసిన సున్నము.
Slacked, or Slackned adj వదిలిన, సళ్లిన, మట్టుపడ్డ.
Slackness n s looseness వదులు. negligence అశ్రద్ధ, ఉపేక్ష. tardinessజబ్బు, మందము. from the * of trade just now యిప్పట్లో వర్తకము జబ్బుగా వున్నందున.from the * of the tide యేట్లో నీళ్లు పారడము జబ్బుగా వున్నందున. from the * of the bowels ప్రవృత్తులు అవుతున్నవి గనుక.
Slag n s the dross of metals చిట్టెము.
Slain pastp|| killedచంపబడ్డ,హతమైన, those who were not * హతశేషులు.
Slammerkin n s a dirty woman అసభ్యముగా వుండే స్త్రీ, యేబ్రాసి.
Slander n s అపవాదము, అపనింద, అపదూరు, కొండేము, చాడి, అభాండము, అపోహము, దూషణ. he says that they drink but this is a mere * వాండ్లు తాగుతాడంటారు గాని యిది వట్టి అపవాదము, అపనింద.
Slandered adj దూషించబడ్డ, రవ్వలపాలయిన.
Slanderer n s అపోహములు చెప్పేవాడు, దూరుపెట్టేవాడు.
Slanderous adj అపవాదమైన, అపోహమైన, అభాండమైన. a * story అపవాదమైన సంగతి.
Slang n s base language, cant తప్పు కూతలు, నీచమాటలు, or abuse తిట్లు,దూషణ. a metaphorical and figuarative language బందు కట్టుమాటలు, సాంకేతికమైన మాటలు. (nearly the same as cant) a * name సాంకేతిక నామము, క్షుద్రనామము. a *word నీచమాట, తిట్టు.
Slant adj ఏటవాలుగా వుండే. a * roof ఏటవాలుగా వుండే యింటిపై కప్పు.
Slanting adj ఏటవాలుగా వుండే.
Slantingly adv ఏటవాలుగా.
Slap n s చెంపకాయ, చెంపపెట్టు, దూషణ,
Slapdash adv దఢాలున, లటుక్కున.
Slapping adj (a low word) grand, fine దొడ్డ, ఘనమైన.he came along at a * pace బిర బిర వచ్చినాడు.
Slash adj నరకబడ్డ, ఛేదితమైన. * breeches లోగా వొక వన్నెగుడ్డపైన మరివొక వన్నె గడ్డ జమిలిగా కుట్టి పై గుడ్డను నిడుదలు నిడుదలగాకత్తిరించి అంచులు కుట్టినందున యెర్రమన్ను సున్నపు పట్టెలు వేశినట్టుకనుపడే యిజారు.
Slate n s a kind of stone ఒక విధమైన రాయి; దీన్ని యింటి పైకప్పకుపెంకులవలె వేస్తారు, మరిన్ని వ్రాసేరాతిపలక. * pencil యీ పలకమీద బలపము వలె వ్రాసే అదే రాతితో చేసిన కడ్డి.
Slate colour n s మేఘ వర్ణము.
Slate-colour, or ash colour n s. బూడిదె వర్ణము.
Slater n s a workman whose business it is to cover theroofs of houses with slates ఇంటి పై కప్పుకు పెంకులవలె రాతిపలకలను సంతన చేసేవాడు.
Slattern n s a woman negiligent, not elegant or nice, a dirtywoman ఏబ్రాసి, అసభ్యముగా వుండే స్త్రీ, మురికిది, మోటది, నాగరీకము లేనిది.
Slaughter n s హత్య, సంహారము, మారణము. he made a great * amongthe birds పక్షులను నిండా సంహరించినాడు, బహుపక్షులను చంపినాడు. an animal bought for * కొట్టుకొని తినడమునకు గాని బలి యివ్వడమునకుగానికొన్న గొర్రె జింక మొదలైన పశువు.
Slaughter-house n s a butchers shop కటిక వాని అంగడి.
Slaughterman n s కటికవాడు.
Slave n s అడిమె, దాసుడు, ఊడిగపువాడు, ఖాసా. a village * (ascriptusgleba) వెట్టినాడు. a female * or a * girl తొత్తు, బానిసె, బోనకత్తె,పనికత్తె, దాసిది. he is a * to his passions వాడు పంచేంద్రియబద్ధుడైవున్నాడు.
Slaver n s a ship in which slaves are carried అడిమెగా వుండేవాండ్లనుకొని యెక్కించుకొని పొయ్యేవాడ.
Slavering, oridiotic adj వెర్రి, పిచ్చి.
Slavery n s దాసత్వము, దాస్యము, అడిమెతనము.
Slave-trade n s బొట్టెలబేరము, పిల్లకాయలను గాని మనుష్యులనుగాని దొంగిలించుకోనిపోయి అమ్మే బేరము.
Slaving n s or labour పని, పాట్లు.
Slavish adj base, miserable దిక్కుమాలిన, దీనమైన, క్షుద్రమైన. Slavishly, adv. basely, miserably దీనత్వముగా, దిక్కుమాలినరీతిగా,క్షుద్రముగా.
Slavishness n s baseness నీచత్వము, దీనత్వము.
Slayer n s చంపేవాడు, సంహరించేవాడు. a child * బాలఘాతకుడు.a man * నరహత్యచేశేవాడు. Vishnu as the * of Mura మురారి.
Sledge n s a kind of carriage ఎడ్లు యీడ్చుకొని పొయ్యేకొయ్యమొద్దు, దీనిమీద మనుష్యులు కూర్చుండిపోతారు, దీన్ని చొరవడి, సరుగడు,సరవడి, సరవండ్లు, అని అంటారు.
Sledge,or Sledge-hammer n s. సమ్మెట.
Sleek adj నునుపుగా వుండే, సన్నని, పుష్టిగా వుండే.* headed నున్నని వెంట్రుకలుగల.
Sleekness n s నున్నన, మసృణము. from the * of the horseగుర్రము నున్నగా వున్నది గనుక, గుర్రము పుష్టిగా వున్నది గనుక.
Sleep n s నిద్ర, స్వాపము. to go to * నిద్రపోవుట. she putthe child to * ఆ బిడ్డను నిద్ర పుచ్చినది. when he rose from * వాడు మేలుకొన్నప్పుడు. to talk in * కలవరించుట. the * of deathమరణము. he slept his last * చచ్చినాడు. the long * దీర్ఘనిద్ర,చావు.
Sleeper n s one who sleeps నిద్రపొయ్యేవాడు, a rafter వాసము,త్రావి.
Sleepily adv drowsily నిద్రమబ్బుగా, జబ్బుగా, సోమారిగా. he spoke* తూగిపడుతూ మాట్లాడినాడు.
Sleeping n s నిద్రమబ్బు.
Sleepless adj నిద్రలేని. he had a * night వాడు రాత్రి అంతనిద్రపోలేదు.
Sleeplessness n s నిద్రలేమి.
Sleepy adj నిద్రమబ్బుగా వుండే, జబ్బుగా వుండే. she is * దానికినిద్ర వస్తున్నది.
Sleet n s smooth small snow, not falling in flakes, but singleparticles మంచుతోకూడా కురిశేవాన. iron * బాణవర్షము.
Sleety adj మంచు సంబంధమైన.
Sleeve n s చొక్కాయచెయ్యి, రవికె చెయ్యి. hanging *sచేతికి మించి నిండా పొడుగుగా వేలాడే చొక్కాయచేతులు. a * ofsilk పట్టునూలు వుండ. he laughed in his * లోగా నవ్వుకొన్నాడు.those who pin their faith upon his * అతణ్నే గురువుగాయెంచేవాండ్లు.
Sleeved adj చేతులుగల, ఇది చొక్కాయిని రవికను గురించిన మాట.
Sleeveless adj foolish, miserable దిక్కుమాలిన, పిచ్చి.
Sleight n s a trick చమత్కారము, పితలాటకము. * of handహస్తలాఘవము. * of hand players గారడివిద్య చేసే వాండ్లు. Slender, adj. సన్నమైన, సూక్ష్మమైన. a * waist తను మధ్యము,సన్ననడుము. a * nymph తన్వి. * or invisible ancles గూఢగుల్భము.a * man పలాచటివాడు. I have * hopes of his coming వాడు వచ్చేదినాకు రూఢి లేదు. a * estate స్వల్ప ఆస్తి. * means కొంచెము రూకలు. aman of * wit అల్పబుద్ధిగల వాడు.
Slenderly adv కొంచేముగా, స్వల్పముగా. they are * providedwith food వాండ్లకు తిండికి చాలదు. they are * provided withclothes వాండ్లకు బట్టలు చాలకుండా వున్నవి.
Slenderness n s సన్నము. from the * of the crane's legs కొంగకాళ్ళు నిండా సన్నముగా వుంటవి గనక.
Slept (pastandp||oftheverbToSleep) she * అది నిద్రపోయినది.
Slew past tense of the verb ToSlay He * them వాండ్లను చంపినాడు.
Slgihtness n s weakness దౌర్బల్యము from the * of the house ఆ యిల్లు దృఢమైనది కాదు గనక. from the * of the wound అది అసిగాయముగనక.
Slice n s బద్ద, చీలికె, చెక్క, ముక్క. a * of bread రొట్టెముక్క.a paper * కాకితాలు కోశే కత్తి.
Slick adj utter, entire, total, also adv. entirely, totally(this is low word) శుద్ధ, బొత్తిగా.
Slid past tense of the verb ToSlide The boys * on the iceఆ పిల్లకాయలు మంచుమీద జరిగినారు.
Slide n s జారేటిది. a * in a telescope చుక్కాణిలో ముందుకువెనక్కు యీడ్చేదిగా వుండేటిది.
Slider n s జారేటిది.
Slight adj small స్వల్పమైన, కొంచమైన సామాన్యమైన, కొద్ది,జబ్బైన. a * fever రవంత జ్వరము. a * smile చిరునవ్వు. a *difference కొంచెము భేదము. a * wound అసిగాయము. a * girlపీలగా వుండే పడుచు. a * man or foolish fellow అల్పుడు, స్వల్పుడు.
Slighted adj అలక్ష్యముచేయబడ్డ, తిరస్కరించబడ్డ. a * friendఅగౌరవముచేయబడ్డ స్నేహితుడు.
Slightingly adv అలక్ష్యముగా, ఉపేక్షగా, తిరస్కారముగా.
Slightly adv స్వల్పముగా, అల్పముగా, కొంచెముగా.
Slily adv cunningly నంగనాచి తనముగా, నాలి ముచ్చుతనముగా,కుత్సితముగా, ఉపాయముగా.
Slim adj సన్నమైన. a * girl తన్వి, కృశాంగి, పలాచటిది.a * waist సన్ననడుము, బీదనడుము.
Slime n s viscous mire బంక, జిగట, బంధన his foot slipped in the * బంకమట్టిలో వాడి కాలు జారినది. as the fish was covered with * it slipped from his hand ఆ చేపపై నంతా జిగటగా వుండినందున చేతిలోనుంచి జారిపోయినది. in Gen. XI. 3. పిన్చి. F+. శిలాజితు D+. Adam Clarke in Gen. 7 says Bitumen, asphaltus.
Slimeness n s బంక, జిగట, బంధన.
Slimy adj బంకగా వుండే, జిగటగా వుండే.
Sliness n s ఉపాయము, కుయుక్తి, నంగనాచితనము, నాలిముచ్చుతనము.
Sling n s వడిశల. he wore his arm in a * రుమాలగుడ్డనునివీతముగా కట్టి అందులో నొప్పిగా వుండే చేతిని దూర్చుకొని వుండినాడు.or bag to hang pots in వుట్టి. the * at the end of a (కావడి) or yoke to hold pots or bundles కావడి, వుట్టి, మట్టు.
Slip n s the act of slipping జారడము, జరగడము. a long narrow piece సన్నగా వుండేటిది. there is a * of land betweenthe two lakes ఆ మడుగుల నడమ సన్నగా కొంత భూమి వున్నది. a * of ivory సన్నదంతపు పలక. a * of cloth పేలిక, గుడ్డతునక.a * of wood కొయ్యతునక. a * of paper కాకితపు ముక్క. by a *of memory జ్ఞాపకము తప్పినందున. a * of the tongue నోరు జారి వచ్చినమాట. he did not mean this it was a mere * of the penఇది వాడు కావలెనని వ్రాసినది కాదు, యిది వట్టి చెయితప్పు. a * set for a plant చెట్టు కావడానకై నాటిన కొమ్మ. when she was a young * అది పసిదిగా వుండినప్పుడు. as part of a woman's dress పావడ. aleash, or string in which a dog is held కుక్కను కట్టేపలుపు.
Slipknot n s a bowknot; a knot easily untied దూముడి.
Slipper n s a show without leather behind into which thefoot slips easily పాదరక్షలు, చెప్పులు, జోళ్లు. the Englishwear shoes but the natives wear *s ఇంగ్లీషు వాండ్లు శప్పాతులువేసుకొంటారు నల్లవాండ్లు చెప్పులు జోళ్లు వేసుకొంటారు, ఇంగ్లీషు వాండ్లువేసుకొనే దానికి మడిమెకు అడ్డముగా చర్మము వుంటున్నది నల్లవాండ్లువేసుకోనేవాటకి అట్లాలేదు.
Slippery adj not affording firm footing, hard to hold జరిగే,జారే, జారిపోయ్యే. uncertain; changeable అనిశ్చయమైన, చంచలమైన,చపలమైన, నమ్మరాని. the ground was * and he fell నేల జారుతూవుండినది గనక వాడు పడ్డాడు. a * rogue నమ్మరాని వాడు. a * witness నిలకడలేని సాక్షి.
Slipshod adj మడిమెకు అడ్డముగా వుండే శప్పాతు చర్మమును కిందికితోసి తొడుక్కున్న. the English say all the natives who wear shoes go * జోళ్లు వేసుకొనే నల్లవాండ్లందరున్ను కాలు జారకుండా మడిమెకు అడ్డముగా చర్మము లేకనే నడుస్తారని ఇంగ్లీషు వాండ్లు అంటారు. that book is written in a * style ఆ పుస్తకము జబ్బుపాకముగారచించబడి యున్నది.
Slipslop adj foolish, idle పిచ్చి, జబ్బు.
Slit n s a long cut చీలికె, చీలికెగా తెగినది, నిడువుగా కోసిన గాయము.
Sliver n s పేడు, చీలికె.
Slobber n s చొంగ, జొల్లు, లాల.
Slobberer n s an idiot, a fool, a flatterer: also a jobbing tailor, జొల్లు కార్చుకొనేవాడు, యెంబన్న, పొగడేవాడు,వెర్రిస్తోత్రములు చేసే వాడు.
Slobbering adj Idiotical, flattering జొల్లుకార్చుకొనే, పిచ్చిగాడైన,వెర్రిస్తోత్రములు చేసే.
Sloe n s ఒక విధమైన నల్లని అడవిపండు.
Sloe-black adj కాటుకవలె నల్లగా వుండే.
Sloop n s a small ship ఒంటి స్తంభపుచిన్నవాడ, దీన్ని స్లూపుఅంటరు.
Slop n s గంజి, గట్ర. or spilt liquid చిందిన నీళ్ల్ళు, వొలకబోసుకొన్న నీళ్ళు. she made a * నీళ్ళను వొలకబోసుకొన్నది.
Slope adj ఏటవాలుగా వుండే, ఆదోకపాటుగ వుండే, చేటచెరుపుగావుండే.
Sloping adj ఏటవాలుగా వుండే, ఆదోకపాటుగా వుండే. the * beams ofthe setting sun అస్తమాన కాలములో ఆదోకోపాటుగా వుండే సూర్య కిరణములు.
Slopingly adv ఏటవాలుగా, ఆదోకపాటుగా.
Sloppy adj చిత్తడిగా వుండే, చితచితలాడే. a * place నీళ్ళ మడుగులుగా వుండే స్థలము. when the child came to the * place in the road, it stopped ఆ బిడ్డ దోవన పోతూ నీళ్లు చిలపచిలపలుగా వుండే చోటికి వచ్చి అక్కడ నిలిచి పోయినది.
Slops n s గుడ్డాగుడుసులు, ఇది వుడుపును గురించిన నీచమాట, యిది ముఖ్యముగాయిజారుకు పేరు. he did not eat proper food, he merely lived upon * కడుపుకు చక్కగా తినకుండా గంజీ గట్రా తాగి గడిపినాడు.
Slopseller n s కుట్టినవుడుపులు అమ్మేవాడు.
Slopshop n s కుట్టినవుడుపులు అమ్మే అంగడి.
Sloth n s సోమారితనము, అలసత, జడత, బద్ధకము. the animalcalled a * యేవేళా నిద్రపొయ్యే వొక జంతువు. It is also said to becalled దేవాంగపిల్లి.
Slothful adj సోమారియైన, అలసుడైన, మందుడైన.
Slothfully adj lazily సోమారి తనముగా.
Slothfulness n s సోమారతనము.
Slouch n s a down cast look అధోదృష్టి, అధోముఖము, కింది చూపు.a depressi on the of the head తల నేల వేసుకోవడము.
Slouching adj అధోముఖముగా వుండే, తలవేలవేసుకొని వుండే. the buffalo has a very * look యెనుము తలను నేలకు వంచుకొని పోతున్నది. a * gait తలవేల వేసుకొనిగాడిదెవలె పోవడము.
Slough n s a deep miry place లత్తాడుగా వుండే చోటు, బురదగా వుండేచోటు. theyleft him in the * of despond వాణ్ని నిరాశయనే బురదలో చేయి విడిచినారు.
Sloven n s మురికిముండ, అసభ్యురాలు, యెడ్డెమనిషి, రోతగా వుండేటిది.
Slovenliness n s ఎడ్డె తనము, ఏబ్రాసితనము, అసభ్యత. from the * of the house ఆ యిల్లు నిండా రోతగా వున్నది గనక.
Slovenly adj రోతైన, మురికియైన, అసభ్యమైన.
Slow adj not fast జబ్బైన, మందమైన, జాప్యమైన. a * scholar మందుడు, జడుడు,మందబుద్ధిగలవాడు. a man of * heart బుద్ధిమాంద్యము గలవాడు. a plant of * growthసావకాశముగా పెరిగే చెట్టు. a * paced horse జబ్బునడగల గుర్రము. a * fellow జడుడు.* time in music జంపె తాళము. a * fire మండిని నిప్పు. a * match జానకి తాడు.he who is * of hearing చెవులు మందముగా వుండేవాడు. he who is * of speech జబ్బుగా మాట్లాడేవాడు.
Slowly adv తిన్నగా, మందముగా, ఆలస్యముగా, జబ్బుగా. you mustlet it boil * దాన్ని సావకాశముగా కాచవలసినది.
Slowness n s మాంద్యము, తామసము, జడత్వము. from the * of thecure దినాల పేర స్వస్థము కావడమువల్ల, సావకాశముమీద స్వస్థమయినదిగనక. from the boy's * ఆ పిల్లకాయ యొక్క జడత్వము వల్ల, మందబుద్ధివల్ల.
Slow-worm n s మొండి పురుగు అనే సర్పము.
Sludge n s mire, dirt mixed with water బురద, రొంపి.
Slug n s a slow worm జీమిడి జలగ పురుగు. a lazy wretchసోమారి. leaden *s తుపాకిలో వేసే పెద్దరవలు, సిసపు తునకలు.
Sluggard n s సోమారి, జడుడు, మందుడు.
Sluggish adj lazily సోమారిగా, సోమారితనముగా.
Sluggishness n s సోమారితనము.
Sluice n s తూము. to open a * అలుగెత్తుట.
Slumber n s తూగు, నిద్రమబ్బు.
Slumberer n s తూగిపడేవాడు, సోమారి.
Slums n s the backyard పెరడు, రోతగా వుండే స్థలము.
Slunk past tense of the verb ToSlink
Slur n s slight disgrace నింద, అపనింద. trick, in musickమబ్బుతాళము వేయడము, ఒక స్వరమును తెలిసీ తెలియక జాడగా దాట వేయడము.
Slurred adj passed over with neglect మబ్బుతాళమువేసిన,ఉపాయముగాదాటవేసిన
Slush n s filthy water మురికినీళ్ళు.
Slut n s a mean woman తొత్తు, ఏబ్రాసి, అసభ్యముగా వుండేటిది,రోతగా వుండేటిది. (See Southey's wesley 2. 220. and Fielding's Joseph Andr. 2. XIII.)
Sluttish adj రోతగా వుండే, అసభ్యముగా వుండే.
Sluttishness n s రోత, మురికితనము. from the * of theircustoms వాండ్లనడక రోతగా వుండేటందువల్ల.
Sly adj నాలిముచ్చుగా వుండే, కపటమైన, కృత్రిమమైన, కుత్సితమైన.the cat is very * పిల్లి నిండా కపటి. this girl is very *యీ పడుచు నిండా నంగనాచి. he is as * as a fox వాడు నక్కజిత్తులమారి. a * fellow జిత్తులమారి. he made a * remark వాడు సరసముగా వొకమాట చెప్పినాడు. చోద్యముగా వొకమాట చెప్పినాడు.
Slyboots n s (Goldsmith) చెడ్డదొంగ, యిది యెగతాళి మాట.
Slyly adv See Slily.
Slyness n s See Slienss.
Smack adv లటుక్కున, దఢాలున.
Small adj చిన్న, కొద్ది, కొంచెము, కాస్త. there is but a * difference between these two యీ రెంటికీ వుండే భేదము కొంచెము. a * box చెయిపెట్టె. a * knife సూరకత్తి. a * basket పుటిక. heground it * దాన్ని సన్నగా నూరినాడు. a * fault స్వల్పదోషము. * andgreat పిన్నా పెద్దలు. * or seed pearls పొడి ముత్యాలు. * stones పొడిరాళ్ళు. * shot తుపాకి రవలు. he has a * voice వాడిది సన్నగొంతు. * talk ముచ్చట. * change చిల్లరదుడ్లు, కాసులు. * beerపాయసము. the * of the back వీపు నడిమి భాగము, రొండి. the * ofthe leg పిక్కకు కింది భాగము.
Smallclothes n s breeches ఇజారు.
Smallcoal n s little wood coals used to light fires వంట చెరుకు.
Smallcraft n s plu. small vessels చిన్నవాడలు, దోనెలు. in this storm much * was destroyed యీ గాలివానకు చిన్నవాడలు బహుశాముణిగిపోయినవి.
Smaller adj చిన్న. the * house are built of wood కొద్దిపాటియిండ్లను కొయ్యతో కట్టుతారు.
Smallest adj అన్నిటికీ చిన్న. give me the * అన్నిటిలో చిన్నదిగాచూచి యియ్యి. there is not the * reason for fearing this దీన్నిగురించి సందేహించడమునకు రవంతైనా హేతువు లేదు.
Smallness n s పొట్టితనము, కురచతనము, సన్నన, పలచన. from the * of his handwriting వాడి అక్షరాల నిండా సన్నము గనక.
Smallpox n s మశూచికము, స్ఫోటకము. (the vulgar name is అమ్మవారుmeanig `Our Lady,') he has got the small pox అమ్మవారు పోసినది. the confluent small pox తట్టు.
Smallwares n s plu. చిల్లర సామగ్రీలు.
Smalt n s a kind of blue ఒక విధమైన నీల వర్ణము.
Smaragdine adj made of emerald; resembling emerald పచ్చలతోచేసిన,గారుత్మతమయమైన, పచ్చలవలెవుండే.
Smart n s quick, pungent or lively pain మంట, నొప్పి. the *of the wound గాయము యొక్క నొప్ఫి.
Smarting adj నొచ్చే, జలపరించే. * pain మంట, జలపరింపు.
Smartingly adv మంటగా, నొప్పిగా.
Smartly adv quickly చురుకుగా, వడిగా, చాతుర్యముగా.
Smartness n s quickness చురుకు, వడి. wittiness చాతుర్యము.
Smash n s దఢాలునపడ్డది. there was a great * అన్నీ ధడీలుమనిపడ్డవి. after the * of his estate వాడి ఆస్తి అంతా చెదిరిపోయిన తర్వాత.
Smashed adj పగిలిన, బద్దలైన, ఛిన్నాభిన్నమైన.
Smatterer n s one who has a slight or superficial knowledgeఅల్పజ్ఞాని, పరిజ్ఞానము లేనివాడు, అల్పవిద్యగల వాడు.
Smattering n s a very slight knowledge అల్పజ్ఞానము. he has amere * of Sanscrit వాడికి గీర్వాణము తెలిసినట్టు అనరాదు, వానికి తెలిశీతెలియకుండా వున్నది.
Smeared adj అలికిన, పూసిన, చరిమిన, పట్టించిన. clothes * withblood నెత్తురుతో తడిసిన గుడ్డలు.
Smearing n s పూయడము, చరమడము, పట్టించడము, లేపనము.
Smell n s వాసన, గంధము. a sweet * పరిమళము, సుగంధము. a bad * కంపు, దుర్గంధము.
Smelling-bottle n s ఆఘ్రాణించే వుప్పు వేశేబుడ్డి.
Smelling-salts n s ఆఘ్రాణించే వుప్పు.
Smelt past participle of the verb ToSmell వాసనచూచిన,ఆఘ్రాణించిన
Smelting n s ముద్దకొలిమి పని, మట్టితో కలిపిన లోహమును కరిగిశుద్ధము చేయడము.
Smile n s చిరునవ్వు, మందహాసము, పొడినవ్వు, మొలకనవ్వు.
Smiling part నవ్వే. a * countenance నవ్వు ముఖము. a * face చిరునవ్వుగల ముఖము. * seasons మంచికాలము. * scenery రమ్యమైనప్రదేశము. * prospects or good hopes మంచి ఆశ, సఫలము కాగల ఆశ. * fortune మంచి అదృష్టము. a * harvest కలకలమని వుండే పంట.a * city పాలు పొంగుతూ వుండే పట్టణము.
Smilingly adv సరసముగా.
Smirched adj మాసిన, ప్రకాశము తప్పిన.
Smirk n s వికారమైన నవ్వు.
Smith n s బత్తుడు. an iron * or blacksmith కమ్మరవాడు.coppersmith కంచరవాడు. goldsmith or silversmith బంగారుపనిచేశేవాడు, వెండి పనిచేశేవాడు, కంసలవాడు. a gun * ఫిరంగీలు చేసేవాడు.
Smithery n s a smith's workshop కమ్మరవాని పట్టడ, యినుముపనిచేసే స్థలము.
Smithfield n s the name of a certain market in London లండన్పట్టణములో అమ్ముడు పశువులు నిలిచే వొక బయలు పేరు. Fomerly personswere burnt alive in this place on account of religion మునుపుయిక్కడ కొందరిని మతద్వేషము చేత ప్రాణముతో కాల్చినారు గనక, దీన్ని శ్మశానము, రుద్రభూమి అనవచ్చును.
Smithy n s ఇనపపని చేసే స్థలము.
Smitten pastp||oftheverbToSmite కొట్టబడ్డ,చంపబడ్డ,హతముచేయబడ,those who are * with love మోహపరవశులైన వాండ్లు. those who are * with disease వ్యాధిగ్రస్తులు.
Smock n s a woman's garment కోక, పావడ, ఇది ఆడరాని మాఠ.(Spenser F. Q. 3. 1. 63. and 65.)
Smockfaced adj effeminate, girlish ఆణంగిరేకు అయిన.
Smock-frock n s కూలివాండ్లు వేసుకొనే ముతక చొక్కాయి.
Smoke n s పొగ, ధూమము. the whole bnsiness ended in *ఆ పని తుదకు యేమీ లేక పోయినది. To Smoke, v. n. పొగసుట, పొగరాజుట, పొగవచ్చుట. the house wasburnt and I saw it smoking the next day ఆ యిల్లు కాలి మరునాడుపొగుస్తూ వుండగా నేను చూస్తిని. a pot of smoking milk కాగి పొగలులేస్తూవుండే కుండెడు పాలు. supper soon *d upon the board యింతలో వడ్డించినారు. or inhale చుట్టతాగుట. or be suspicious సందేహించుట,అనుమానించుట. I *d that there was something wrong అక్కడయేమో కొంచెము తప్పువుండినట్టు అనుమానించినాను.
Smoked adj పొగవేయబడ్డ, పొగలో కట్టి పక్వము చేయబడ్డ,పొగచూరిన. * milk పొగచూరిన పాలు. * herrings పొగలో కట్టిపక్వము చేసి వుంచిన చేపలు.
Smoker n s చుట్ట తాగేవాడు.
Smokiness n s పొగగా వుండడము. from the * of this housethre are no musquitoes in it యీ యింట్లో పొగచుటటు కొంటున్నదిగనక దోమలు లేవు.
Smoking n s పొగియడము, పొగరాజడము, చుట్ట తాగడము.
Smoky adj పొగసే, పొగగా వుండే. or blackened with smokeపొగచూరి నల్లగా వుండే. * tasted పొగచూరిన, కంపుకొట్టే.
Smooth adj నున్నని, మెత్తని, మృదువైన. * words మృదు వచనములు,చల్లని మాటలు. ground * సమముగా వుండే భూమి, మిట్టాపల్లము లేకుండా వుండే భూమి. the * passage of the hawk in the sky డేగ ఆకాశములోతిన్నగా పోవడము. by all means rough and * నయాన, భయాన.
Smooth handed adj మెత్తని చేతులుగల, మృదువైన చేతులుగల.
Smooth-faced adj mild looking, cunning నంగనాచివలే, వుండే,పిల్లివలె వుండే.
Smoothly adj with even glide నున్నగా, తిన్నగా, సరాళముగా.the hawk came down * డేగ తిన్నగా దిగినది.
Smoothness n s నున్నన, నునుపు, మృదుత్వము. gentleness of speechమాధుర్యము. * of behaviour నమ్రత, సరసత.
Smote past tense of the verb toSmite
Smother n s ఊపిరి తిప్పకుండా చేయడము. there was a * of dust ఊపిరి గూడాతిప్ప కుండా దుమ్ము మూసుకొన్నది.
Smothered adj గుక్క తిరగకుండా చేసి చంపబడ్డ. I am quite * with smokeయీ పొగలో నాకు గుక్క తిప్పుకో కూడలేదు, నేను చస్తాను. a * laugh అణచుకోబడ్డ నవ్వు.supressed అణచివేయబడ్డ. * fury అణుచుకోబడ్డ కోపము. a * report మర్మముగా వుండేవొక సమాచారము, అణచివేయబడ్డ సమాచారము.
Smouldering adj గనగనలాడే. * fire గనగనలాడే నిప్పు, అంగారము.
Smug adj trim, neat, pretty ముద్దుగా వుండే సొగసుగా వుండే,ఇది యెగతాళి మాట.
Smuggled adj సుంక మివ్వకుండా దొంగతనముగా తీసుకొనిరాబడ్డ.
Smuggled goods n s సుంకము చెల్లించని దొంగ సరుకులు,.
Smuggler n s సుంకము చెల్లించకుండా దొంగ సరుకులు తీసుకొనిపోయ్యేవాడు.
Smuggling n s సుంకము చెల్లించకుండా దొంగ సరుకును తీసుకొని పోవడము.
English to Telugu free online dictionary
Enter English word and know Telugu meaning
No comments:
Post a Comment