Seventeenth adj పదిహేడో. on the * of February ఫిబ్రవరి నెలలోపదిహేడో తేది.
Seventh adj ఏడో. on the * of January జనవరి నెల యేడోతేది.
Seventhly adv ఏడోదిగా.
Seventy adj డెభ్బై.
Several adj కొన్ని, కొందరు, వేరేవేరే. on three * occasions అప్పుడప్పుడు మూడు తరుణములలో. * points in this case ఈ వ్యాజ్యములోకొన్ని విషయములు. she washed the rice in * waters ఆ బియ్యమునువేరేవేరే నీళ్లు పోసి శానామాట్లు కడిగినది. * kinds of cloth నానావిధమైన గుడ్డలు. * people believe this దీన్ని కొందరు నమ్ముతారు. the * points in this case ఈ వ్యాజ్యములో ఆ విషయములు. this book gives the words with the * meanings ఈ పుస్తకములో ఆయా శబ్దములున్నువాటి వాటికి వుండే అర్థములున్ను వున్నవి. he lived in a * houseప్రత్యేకమైన వొక ఇంట్లో వుండినాడు. (ఇది పురాతన ప్రయోగము.)
Severally adv ప్రత్యేకముగా వేరే వేరే. they * gave their opinionsవారి వారి అభిప్రాయములను చెప్పినారు. they * signed the paper వారు వారు చేవ్రాలు చేసినారు. they * must be present వారు వారు వచ్చి వుండవలసినది.they * assented వారు వారు వొప్పుకున్నారు.
Severe adj చెడ్డ, క్రూరమైన, అఘోరమైన, ఉగ్రమైన. by gentle and * methods నయాన భయాన. a * blow మంచి దెబ్బ, చెడ్డ దెబ్బ. a * stormచెడ్డ గాలివాన. a * fever మహత్తైన జ్వరము, మంచిజ్వరము, చెడ్డ జ్వరము.the fever became * జ్వరము ముమ్మరించినది, బలమైనది. the weather was * గాలివాన కొట్టినది.
Severed adj తెగిన, వేరుబడ్డ, భిన్నమైన. the * boughs విరిగిన కొమ్మలు, నరికిన కొమ్మలు.
Severely adv క్రూరముగా, ఉగ్రముగా.
Severity n s క్రౌర్యము, క్రూరత్వము, ఉగ్రత. by gentleness andby * నయాన భయాన. from the * of the fever జ్వరము యొక్క వుగ్రమువల్ల. from the * of the season అది క్రూరమైన కాలము గనకఅనగా మహత్తైన చలికాలము గనక. through the * of the famine అఘోరమైన కరువుగనక. from the * of the weather గాలివానగా వుండినందున. the hermit passed his days in great severities ఆ ఋషి యిన్నాళ్లు అఘోరమైన తపస్సు చేస్తూ వుండినాడు.
Sewer n s she who sews కుట్టేటిది. a butler యింటి విచారణకర్త.a drain జలదారి. the common * వూళ్లోని కశ్మమంతా చేరి పొయ్యే కాలవ.
Sewn adj కుట్టుబడ్డ, స్యూతమైన.
Sex n s జాతి. the population of both *es అక్కడి ఆడవాండ్లు,మొగవాండ్లు. the petitioners were admitted * by *, to his courtమనవిచేసుకొన్న వాండ్లలో స్త్రీలు వేరే పురుషులు వేరేగా లోనికి వచ్చినారు.in the dress of these people the * is not distinguished; both*es dress alike వీండ్లలో ఆడవాండ్లకు మొగవాండ్లకు వొకటే వుడుపు. in birds the * is known by the colour వర్ణముచేత ఆడపక్షి మొగపక్షితెలుస్తున్నది. the * of a palm tree is known by the leaf తాటిచేట్టు పోతో పెంటో దాని ఆకువల్ల తెలుస్తున్నది. the parts that mark the * లింగము, మానస్థానము. the queen replied "Those of or * must submit" మన బోటి స్త్రీలు లోబడవలసినదని రాణి అన్నది. the * స్త్రీలు. the female* స్త్రీ జాతి, స్త్రీలు. in this school there are pupils of both *es ఈ పల్లెకూటములో ఆడవాండ్లు మొగవాండ్లు కూడా చదువు కుంటూ వున్నారు. the ruder* or stronger * మొగవాండ్లు. the weaker * అబలలు, అనగా స్త్రీలు. the fair * స్త్రీలు. she is disgrace to her * దానివల్ల ఆడవాండ్లకంతా అవమానము వచ్చినది. she was endowed with courage beyond her * or she outwent her * in resolution దానిధైర్యము యే ఆడదాన్నికిన్ని లేదు. she was flower or crown of her * అది స్త్రీ రత్నము, కాంతా తిలకము. he slew them all without any regard to * or age ఆడది ఆనక మొగవాడనక పిన్న అనక పెద్ద అనక అందరినిన్నీ చంపినాడు. in that country both *es great equestrains ఆ దేశములో ఆడదైనా సరే మొగవాడైనా సరే బాగా గుర్రమెక్కి సవారిచేస్తారు. the Musulmans forbid all conversationbetween the *es తురకవాండ్లు మొగవాండ్లతో ఆడవాండ్లను సంభాషించనియ్యరు.the softer * స్త్రీలు. the braver * పురుషులు. she hates the whole * దానికి మొగవాడంటే గిట్టదు. of servants she had one of each * వొక ఆడదాన్నిన్ని వొక మొగవాన్నిన్ని పనివాండ్లుగా పెట్టుకొని వుండినది. the gods of both *es దేవతలున్ను దేవతా స్త్రీలున్ను. people of neither * were allowed to see the queen రాణిని మొగవాండ్లున్ను చూడకూడదు, ఆడవాండ్లున్ను చూడకూడదు. Musulman women are never allowed to speakwith the other * తురకలు స్త్రీలను మొగవాండ్లతో, మాట్లాడనియ్యరు. theyhad no servants of either * వాండ్ల వద్ద పనివాడూ లేదు పనికత్తె లేదు.
Sexagenarian n s షష్టిపూర్తి అయినవాడు, అరవై ఏండ్లవాడు.
Sexagesima n s a certain feast వొక పండుగ పేరు.
Sexagesimal adj sixtieth అరవై యోది, వొక పండుగ పేరు.
Sexangular adj షట్కోణములుగల, ఆరుమూలలు గల.
Sextant n s నక్షత్రములు చూచే వొక యంత్రము.
Sextile n s జ్యోతిషమందువచ్చే వొక శబ్దము.
Sextion n s గుడిలో వుండే వొక పనివాడు, పీనుగలను పెట్టే గొయ్యితవ్వడము వీడికి ముఖ్యమైనపని.
Sexual adj లింగమును గురించిన, స్త్రీ జాతి పురుష జాతి సంబందమైన.the * distinctions of plants చెట్లలో ఆడది మొగది యని తెలిసేగురుతులు. * intercourse రతి, సంభోగము. * desires or passionsవ్యామోహము, కామము.SHA 1029
Shabbily adv నీచముగా, హీనముగా, తుచ్ఛముగా, వికారముగా.
Shabbiness n s నీచత్వము, హీనత్వము, తుచ్ఛత, వికారము.
Shabby adj నీచమైన, హీనమైన, తుచ్ఛమైన. a * beard వికారమైనదాడి. (this is the same as scabby) the * conduct తుచ్ఛనడక.
Shackles n s సంకెళ్లు.
Shad n s a kind of fish వొక విధమైన చేప.
Shaddock n s the fruit called pomelos or pumplemoose పంపరమాసపండు.
Shade n s నీడ, ఛాయ. darkness చీకటి, చాటు, మరుగు. in coloursకప్పు, కళ, కౌరు, చాయ. the dark part of a picture పటములో వ్రాసే నీడ. in this picture the man's right hand is in the light;the other hand is in the * ఈ పటములో ఆ మనిషి యొక్క కుడి చెయ్యితెలుస్తున్నది యెడమ చెయ్యి నురుగులో వున్నది. there is a * of distinction between these two ఈ రెంటికీ రవంత బేధము వున్నది. this cloth is a * dearer than the other దానికంటే యీ గుడ్డ కొంచెము వెల అధికము. a * or ghost దయ్యము.
Shadiness n s నీడగా వుండడము, మరుగుగా వుండడము. from the *of this valley ఈ కోనలో నీడగా ఉండేటందువల్ల.
Shadow n s నీడ, చాయ. or dark part of a picture నైల్యము.there is not a * of doubt about this ఇందున గురించి రవంతైనాసంశయము లేదు. there is not a * of proof regarding this దీనికి రవంతైనా దృష్టాంతము లేదు. without a * of change రవంతైనా భేదము లేక. any imperfect and faint representation opposed to substanceఛాయ, జాడ. we dwell under his * ఆయన నీడలో వున్నాము, అతని సంరక్షణలో వున్నాము. that man is quite my * వాడు నా నీడ వంటివాడు,అనగా నా వెంట యేవేళా కూడా వుండేవాడు. she is now a mere * అది ఇప్పుడు పుల్లవలె చిక్కిపోయివున్నది. those who live in darkness and the * of death చావును ఆయత్తముగా ఉండేవాండ్లు. in Herb. X. 1. మూర్తి A+.
Shadowy adj లీలగా వుండే, జాడగా వుండే. a ghost is a * formదయ్యము లీలగా వుండే ఆకారము.
Shady adj నీడగా వుండే, చీకటిగావుండే. they halted in a * spot నీడగా వుండేచోట నిలిచినారు.
Shaft n s an arrow అమ్ము, బాణము. a straight piece of wood,a pole పొడుగాటి కర్ర. the *s of a plough ఏడికోల. the * of a pillar స్తంభము యొక్క నడిమి భాగము, ప్రకాండము. this pillarhad a base one foot high; the capital was two feet height యీస్తంభము అడుగు పీఠము వొక అడుగు యెత్తున్ను బోదె రెండడగుల ఎత్తున్ను నడిమి భాగము ముప్పై అడుగుల పొడుగున్ను వున్నది. the *s of a carriageబండిని ఈడ్చే టందుకై గుర్రమునకు రెండు పక్కల వచ్చే కర్రలు. a * in a mine గనిలోకి దిగే బొక్క.
Shag n s hair బొచ్చు, చింపిరి వెంట్రుకలు.
Shagged adj hairy బొచ్చుగల, బొచ్చుమయముగా వుండే. See Shaggy.
Shagginess n s బొచ్చు, బొచ్చుమయముగా వుండడము.
Shaggy adj hairy బొచ్చుగల, బొచ్చుమయముగా వుండే. his * faceయేకముగా బొచ్చు మూసుకొన్న వికారమైన వాని ముఖము. the lion has a* neck సింహము యొక్క మెడ అంతా బొచ్చుమయముగా వుంటున్నది.
Shagreen n s the skin of a fish used in polishing వొకచేపతోలు, ఇది గరుకుగా వుంటున్నది, దీనితో కొయ్య నున్నగా వుండేటట్టుమెరుగు చేస్తారు.
Shakal n s or jackal నక్క.
Shake n s motion కదలడము, ఆడడము. he gave a * with his head తల వూచినాడు. by the * of his head I saw that he was ill వాడి తల ఆడడము చూచివాడికి జ్వరము వచ్చినట్టు నాకు తోచినది. a * in music మూర్ఛన.
Shaken adj కదిలిన. or relaxed శిధిలమైన. he is * in intellectవాడు చపలచిత్తుడుగా వున్నాడు.
Shaking n s కంపనము, ఆడడము, వణుకు. Shako, or chaco, n. s. దండువాండ్ల వుడుపులో వొక భాగము, ఇది వొక తోలు సంచి.
Shale n s a husk పొట్టు.
Shall verb defective వలెను. who ever doth it * die దీన్ని యెవడు చేస్తాడో వాడు చావవలసినదే. I * send you the horse గుర్రమును మీ వద్దికి పంపిస్తాను. he that * come will come రావలసిన వాడు వచ్చును, రావలసిన వాడు రాక మానడు. they * not do this వాండ్లుదీన్ని చేయరాదు.
Shalloon n s a slight woollen stuff సన్న బొంత.
Shallop n s చిన్న పడవ.
Shallow adj not deep లోతులేని. this pond is * ఈ గుంటలోనీళ్లు లోతు లేదు. a * stream లోతులేనియేరు. silly తెలివిలేని. a * fool తెలివిలేనివాడు. a * plot పిచ్చి కుట్ర, పిచ్చి యుక్తి,పిచ్చి కల్పన.
Shallowbrained adj foolish తెలివిలేని, పిచ్చి.
Shallowness n s want of depth లోతులేక వుండడము. from the * of the water నిండా లోతులేక వుండేటందువల్ల. from the * of his brain వాడి అవివేకమువల్ల.
Shallows n s plu. లోతులేని స్థలము.
Shalm n s a kind of trumpet వొకతుత్తార.
Shalot n s a kind of small onion ఒక విధమైన తెల్లగడ్డలు.
Shalt (verb) thou * go నీవు పోవలసినది. thou * see చూతువు.thou * not steal దొంగతనము చేయరాదు. thou * live one hundredyears నీవు నూరుయేండ్లు బ్రతుకుదువుగాక.
Sham n s pretence వట్టిమాయ.
Shambles n s the place where butchers kill or sell their meat;a butchery కసావు వాని అంగడి, కటికెవాని అంగడి.
Shambling n s వికారముగా నడవడము.
Shame n s సిగ్గు, లజ్జ, అవమానము, నింద, దూషణ. he put them to *వాండ్లమీద సొడ్డు వేశినాడు, జయించినాడు. in learning he put them all to * పాండిత్యములో వాడు అందరినిన్నీ మించినాడు. they were naked, they had nothing to cover their * వాండ్లు దిసమొలగా వుండినారు. మానమును ముయ్యడానికి యేమిన్నీలేక వుండినది. he cried * on them వాండ్లను ఛీ పొమ్మన్నాడు. what a * ! అయ్యో పాపము, యేమి అన్యాయము. If you do this all will cry * upon you నీవు యిట్లాచేస్త నలుగురు ఛీ అందురు. for shame!or fie for * ! ఛీ పో, అయ్యో పాపము. for * don'ట్ beat her అయ్యో దాన్ని కొట్టక, పాపము దాన్ని కొట్టక. shame! shame! అయ్యయ్యో, పాపం పాపం.
Shamed adj సిగ్గుపడ్డ, అవమానపడ్డ.
Shamefaced adj that is modest timid fearful భయస్థురాలైన, సిగ్గుగల.
Shamefacedly adv timidly భయపడి, బిడియముగా.
Shamefecedness n s బిడియము, భయము.
Shameful adj disgraceful అవమానమైన, పాపిష్టి, పాడైన. a * actదుష్టపని, అన్యాయము.
Shamefully adv అన్యాయముగా. Shameless, adj. సిగ్గుమాలిన, పోకిరి, కొంటె.
Shamelessly adj సిగ్గుమాలిన.
Shamelessness n s సిగ్గుమాలినతనము. from the * of these frairsఈ సన్యాసులు సిగ్గుమాలినవాండ్లు గనక.
Shamming n s మాయ, పితలాటకము, బొంకించడము.
Shampooing n s అంగమర్దనము, వొళ్లు పిసకడము.
Shamrock n s త్రిపత్రకమనే వొకవిధమైన గరికె.
Shank n s the bone of the leg గుర్రపు ముఖమనే కాలియెముక.he has long *s వాడు జంఘాలుడు, వాడు పొడుగాటి కాళ్లు గలవాడు.the long part of a tool వులి మొదలైన ఆయుధము యొక్కకొనకున్నుపిడికిన్ని నడిమి భాగము. the *s of an anchor లంగరు యొక్కచేతులు. a * of thread నూలుపోశేయీర, పింజ, చీడు.
Shanker n s sore పుండు, పొక్కు.
Shape n s form రూపము, ఆకారము. he made it in the * of a treeచెట్టు ఆకారముగా చేసినాడు. there was nothing in the * of an accountలెక్క అనతగ్గదిగా వొకటిన్నీ వుండలేదు. they have nothing in the *of a dictionary వాండ్ల దగ్గిర నిఘంటువు అనతగ్గది వొకటిన్నీ లేదు.
Shapeless adj వికారమైన. the body was mangled; it was a * massఆ పీనుగ ఛిన్నా భిన్నమైన ఆకారము చెడి కుప్పగా పడి వుండినది. the house was burned down and there was only a * mass of ruins ఆ ఇల్లు కాలి కుప్పగా పాడుబడి యుండినది.
Shapeliness n s అందము, సౌందర్యము.
Shapely adj చక్కని, కుదురైన, సొగసైన, సౌందర్యముగల.
Shard n s a fragment of an earthen vessel, or of any eggor a snail పెంకు, చిల్ల పెంకు, బొచ్చె, గుల్ల.
Share n s a part భాగము, పాలు, వంతు. they took equal *s చెరిసగముగా పంచుకొన్నారు. It fell to his * ఇది వాడి పాలికి వచ్చనది,యిది వాడి పాలబడ్డది. that which fell to his * భాగలబ్ధమైనది. theyhad a * in doing this ఈ పనిలో వాండ్లూకూడా కలశినారు. I for my * have consented నేనైతే వొప్పినాను. he has had his * వాడిపాలు వాడికి వచ్చినది, అనగా. he has had his * of bad luck వాడు పడవలసినదంతాపడ్డాడు. he has had his * of good luck వాడికి రావలసిన భాగ్యము వచ్చినది. the * of a plough నాగేటికర్ర.
Shareholder n s భాగరి, పాలికాపు.
Sharer n s he who enjoys or receives పోందేవాడు, అనుభవించేవాడు,పాలి కాపు.
Sharing n s పంచడము, పంపకము.
Shark n s మనుష్యులను మింగే పెద్ద చేప, మర చేప, సొర్రమీను.white * పాలసొర్ర. the angel * సొడ్లమరమీను. a cruel wretchసర్వభక్షకుడు. యీ మాటలను లాయర్ల గురించి అంటారు. In merchandizeshark's fins are called సొరచేపల రెక్కలు. Sharp, adj. తీక్షణమైన, పదునుగల, చురుకైన వడిగల, వాడిగా వుండే కత్తి. a * stone వాడిగా వుండే రాయి, గసిక రాయి. she has * ears దానిది పాముచెవులు. the hawk has a * sight డేగ దూరదృష్టి కలది.a * boy మంచి చురకుగల పిల్లకాయ. a * sound కీచుమనే ధ్వని. * words క్రూరమైన మాటలు. or clever తీక్షణబుద్దిగల, ప్రజ్ఞగల. * acid చెడుపులుసు. this wine is * ఈ సారాయి నిండా పుల్లగా వున్నది.a * set appetite చెడు ఆకలి. I see they are * set వాండ్లకునిండా ఆకలిగా వున్నట్టు తెలుస్తున్నది.
Sharp n s in music పంచమ స్వరము.
Sharpened adj పదునుపెట్టిన, తీక్షణమైన, చురకుగల.
Sharper n s టక్కులమారి, పచ్చెపుదొంగ.
Sharply adv తిక్షణముగా, చురకుగా. the air bites * గఅలి కొరుకుతున్నది, అనగా చలి వ్యధ పెట్టుతున్నది.
Sharpness n s వాడిమి, చురకు. from the * of the razorకత్తి చురకుగా వుండినందున. from the * of the wind నిండా చలిగావుండినందువల్ల. from the * of his language వాడి మాటల క్రౌర్యమువల్ల. form the * of his wit వాడి బుద్ధి సూక్ష్మతవల్ల from the * of the taste చెడు పులుసైనందున.
Sharp-sighted adj దూరదృష్టిగల, వివేకియైన.
Sharp-visaged adj డేగ ముఖముగల.
Sharp-witted adj తీక్షబుద్ధిగల.
Shaster n s a learned book of the Hindus శాస్త్రము.
Shatter-brained adj చలచిత్తుడైన, పిచ్చి.
Shattered adj బద్దలైన, తుత్తుమురైన, తునక తునకలైన, శిధిలమైన.a * bit పెంకు, పెళ్ల. his nerves were much * వాడి పేగులు తెగినవి,అనగా వాడి ధైర్యము చెడినది.
Shatters n s fragments, bits వక్కలు, ముక్కలు, బద్దలు, పెంకులు,తునకలు. it was broken to * తుత్తుమురైనది.
Shaven adj గొరగబడ్డ, గోరుక్కోబడ్డ. a * head బోడితల.
Shaver n s మంగలవాడు. a robber, plunderer, rogue వంచకుడు,దొంగ, దోపిడిచేసేవాడు. a close * గొరిగిన తలను కత్తిరించేవాడు,అనగా నిండా లోభి.
Shaving n s (the beard &c.) పవనము, క్షౌరము.
Shaving, or Shavings n s. పేళ్లు, చిత్రికె పొట్టు.
Shaw n s a small shady wood in a valley వొక కోనలో వుండేదట్టమైన అడవి.
Shawl n s శాలువ, ఉత్తరీయము, అంగవస్త్రము, పైట.
Shawled adj పైట వేసుకొన్న.
Shawm n s a hautboy ఒక విధమైన సన్నాయి.
She pronoun అది,ఆపె,ఆమె,ఆబిడ,ఇదిఈపె,ఈబిడె, or femaleanimal పెంటి. a * elephant ఆడ యేనుగ. a * bear ఆడ వెలుగ్గొడ్డు.a * goat పెంటి మేక. a * devil గయాళి. a * gallant విటకత్తె.
Sheaf n s పన.
Shearer n s గొర్రెలబొచ్చు కత్తిరించేవాడు.
Shears n s పెద్దకత్తెర, గోర్రె బొచ్చును కత్తిరంచే కత్తెర.
Sheath n s ఒర, కోశము. when the sword is out of the *యుద్ధము ఆరంభమైనప్పుడు, కత్తులు దూసుకొన్నప్పుడు.
Sheathed adj ఒరలోవేసిన, దాచిన, కప్పిన.
Sheathing n s thin plank which is placed as a covering on a ships bottom మూతబల్ల, పైకప్పు. Sheave, n. s. the wheel in a pulley కప్పి నడిమి చక్రము.
Shed pastp|| కారిన,చిందిన, all the blood that was * was of no use కారిన నెత్తురంతా వ్యర్థమైనది, అనగా యిన్ని మంది చచ్చిన్నినిరర్ధకమైనది.
Sheen adj bright ప్రకాశమానమైన.
Sheep n s singular and plural గొర్రె, గొర్రెలు. fifty * యాభై గొర్రెలు. he slew them like * వాండ్లను పశుప్రాయముగా చంపినాడు. he gave them a rupee to buy a * వేటను కొనుమని వొక రూపాయి యిచ్చినాడు.this book is bound in * ఈ పుస్తకమును గొర్రెతోలుతో జిల్దు కట్టివున్నది. in theology, the people పశుప్రాయులైన జనులు. he distinguished betweenthe * and the goats సజ్జనులను దుర్జనులను వేరే వేరే యేర్పరచి నిలిపినాడు.a wolf in *s clothing కపట సన్యాసి. a black * (which properly meansa goat) భ్రష్టుడు, దుష్టుడు, పాపజీవి, పోకిరి. one sickly * infects the flock పదిమందిని వాచెరచడానకు వొక దుష్టుడు చాలును, వొకని దుర్మార్గము అందరికీ ప్రసరిస్తున్నది.
Sheepcote, Sheepfold n s. గొర్రెలదొడ్డి.
Sheephook n s దోటి.
Sheepish adj bashful, shamefaced దేబయైన, వెర్రిముఖమైన, బేల అయిన.
Sheepishness n s దేబతనము, బేలతనము, అధైర్యము, సంకోచము.
Sheepseye n s a timid glance భయపడి చూచే చూపు, వ్యామోహముగాచూచేచూపు. he was casting * at her దాన్ని ఆశగా చూస్తూ వుండినాడు.Massinger's Maid of Honour Act 4 scene 5 speech 5.
Sheepshearing n s గొర్రెలబొచ్చు కత్తిరించడము.
Sheepstealer n s గొర్రెలను దొంగిలించేవాడు.
Sheepwalk n s పోళ్లు, అడివిపట్టు.
Sheer adj Utter, total శుద్ద, వట్టి, పచ్చి. this is * impositionఇది వట్టి మోసము. a * falsehood వట్టి అబద్ధము.
Sheet n s దుప్పటి. a cloth for a bed మంచముమీది దుప్పటి. a * of paper వొక తావు కాకితము. a book in *s జిల్లదుకట్టకుండా వుండే పుస్తకము. the following *s ఈ కింద వ్రాశే గ్రంధము. the balance * లెక్కలలో తీర్పు కాకితము, ఫయిసల్ నామా. a * of copper రాగి తగుడు, రేకు.there was a great * of rain జడివాన కురిసినది. there was a * of snow all over the country ఆ దేశమంతా మంచు మూసుకొన్నది. a * of water నీళ్ల మడుగు. a * of flame పెనుమంట, బ్రహ్మాండమైన జ్వాల. there was a great * of cultivation యిక్కడ నేల బహుదూరము సాగుబడిఅయివున్నది. * lead చాపగా చుట్టిన సీసపు రేకు. * glass, a * of glassపెద్ద అద్దపు బిళ్ల in sea language, a sheet means a rope తాడు,పగ్గము.
Sheet-anchor n s the chief anchor వాడలో వుండే పెద్ద లంగరు,దీన్నీ జీను అంటారు. chief support ముఖ్యమైన ఆధారము. their son was their * వాండ్ల కంతా ఆ కొడుకు జీవాధారముగా వుండినాడు.
Sheeted adj covered as with a sheet దుప్పటి కప్పుకొన్న. a * ghost ప్రేతవస్త్రము కప్పుకొన్న పిశాచము. the roads which were * with ice మంచు మూసుకున్న బాటలు.
Shekel n s లెక్కలలో వొక సంఖ్య.
Shelf n s a board in a press &c. అటక, అట్టువ, మచ్చు. he placed the books upon the shelves ఆ పుస్తకాలను అలమారు బల్లల మీదపెట్టినాడు. a set of shelves అల్మారా. a rock or sand bank in the sea సముద్రములో వుండే చట్టు, కొండ. the eagle built its nest in a * on the hill కోండ మీద పడి కట్టువలె వుండిన వొక చోట గూళి గూడుకట్టినది. that business is now laid on the * ఆ వ్యవహారమును యిప్పుడు మానుకొన్నారు. It was laid on ట్హే * or it was neglected అది యిప్పుడు మూలబడ్డది.
Shell n s the hard covering of any thing పెంకు, చిప్ప. the * of the cocoanut టెంకాయ బుర్ర, టెంకాయ చిప్ప. the * of thetamarind చింతగుల్ల. a ladle formed of a cocoanut * డోకిపిడత, అబక. * of certain seeds పొట్టు. the * of the tortoise తాబేలు పెంకు, చిప్ప. the * of an oyster ముత్యపుచిప్ప. a bivalve * కప్ప చిప్ప. a * used as a trumpet వూదే శంఖము. a cowry, less than a farthing గవ్వ. a large cowry బోకుగవ్వ. egg * గుడ్డు మీది పెంకు.the * of a snail &c. నత్త యొక్క గుల్ల. a live * (cochlea viva)పురుగుగల గుల్ల. * or bomb బొంబాసు. a live * (bomb*) మందుకూరిన బొంబాసు గుండు. in poetry, a lyre వీనె, తంబుర. the house was burnt; nothing was left but the * ఆ యిల్లు కాలి మొండి గోడలుగా నిలిచినది.
Shell-eater n s a kind of stork గుల్ల కొంగ, లొత్తగొట్టిగాడు.
Shelled adj ఒలిచిన, తోలుతీసిన. * almonds ఒలిచిన బాదముపప్పు.
Shellfish n s గుల్లలుగల పురుగులు, గుల్లలుగల జంతువులు.
Shell-lac n s అటుకుల లక్క.
Shelly adj గుల్లలుగల. the * beach గుల్లలమయముగా వుండే సముద్రతీరము.
Shelter n s a covering protection మరుగు, శరణము, రక్షణము, అదరువు. he gave them * in his house వాండ్లను తన యింట్లో దాచినాడు.as it is raining will you give me * in your tent? వాన కురుస్తున్నది గనక నీ డేరాలో చోటు యిస్తావా? they have no * from the rain ఆ వానకు నిలవడమునకు చోటు లేక పోయినది. to seek * దాగుట. theysought * in the cave గుహలో దాగుకొన్నారు. they sought * with him అతణ్ని శరణుజొచ్చినారు. in this heat they sought * under the treesయీ యెండకు చెట్ల కింద వుండినారు. he took * behind the wall from therain ఆ వానకు గోడ చాటున నిలిచినాడు.
Sheltered adj that is kept in safety కాపాడబడ్డ, పోషించబడ్డ.
Shelterless adj unprotected దిక్కులేని, ఆదరువు లేని.
Shelving adj sloping వంపుగా వుండే, వాటముగా వుండే. a * roof వాటముగా వుండే పైకప్పు, తాళ్వారము. a * rock యేటవాలుగా వుండే బండ, వాటముగా వుండే కొండ.
Shent adj ruined, spoiled చెడిపోయిన, నశించిన.
Shepherd n s గొర్రెలు కాచేవాడు, గొల్ల వాడు. or lover విరహతాపము గలవాడు.
Shepherdess n s గొల్లది. or lover విరహతాపము గలది.
Sherbet n s (an Indian word for a beverage) పానకము, పంచదార నిమ్మపండ్ల రసము కలిపిచేసిన పానకము.
Sherd n s a pot shard పెంకు, చిల్ల పెంకు.
Sheriff n s a certain officer అధికారి.
Sheriffdom n s (the authority of a sheriff,) అధికారము.
Sherry n s ఒకవిధమైన వైను సారాయి.
Shew See Show
Shew-bread n s bread offered as sacrifice దర్శనీయాపూపము. A+.దివ్యసముఖ అప్పము. G+.
Shibboleth n s అనరానిమాట, ఉచ్చరించరాని శబ్దము. this is their* వాండ్లలో వుండే పెద్ద మాట యిదే.
Shield n s డాలు, కేడెము.
Shift n s an evasion ఉపాయము, యుక్తి. I did not believe him,I thought his sory was a mere * వాణ్ని నేను నమ్మను వాడు చెప్పినదివట్టి కుయుక్తి అని తలచినాను. they had no * but this యిది తప్ప వాండ్లకు వేరేగతి లేదు. he was put to his *s గతిలేక వుండినాడు,నానా కడగండ్లు బడ్డాడు. he made * to do it ప్రయాసపడి యీ పనిచేసినాడు. he made * to do it ప్రయాసపడి యీ పని చేసినాడు. he makes * with small wages కొద్ది జీతముతో గడుపుకొంటున్నాడు. a woman's under garment స్త్రీలు తొడుక్కొనే లోనివుడుపు, దీన్ని కంజు అనిఅంటారు.
Shifting adj చంచలమైన, చపలమైన, నిలకడలేని. on account of the * sands in this river యీ యేట్లో ఇసుక నిలిచిన చోట నిలవదుగనక.
Shiftless adj without resource గతిలేని, నిరాధారమైన, దౌర్భాగ్యమైన.(See Crabbe. Tale. XXI. in VOl 5. page 243. In vain he tried the shiftless lad ta guide.)
Shilling n s a coin worth about half a rupee అర రూపాయికి కొంచెము తక్కువైన వొక నాణ్యము. twenty *s make a pound ఇరువై షిల్లింగులు వొక పౌను, పదిరూపాయలు అన వచ్చును, ముఖ్యముగా యీ shillingఅనే మాట చెప్పక విడిచిపెట్టుతారు, యెలాగంటే $** 12..10..0 అనగా twelve pound ten అని అంటారు గాని ten shillings అని అనరు. $** 0..4..6 అనగా four and six pence అంటారు గాని four shillings and six pence అని అనరు.
Shimmer n s light brightness, gleam నిగనిగ, తళతళ.
Shin n s గుర్రపుముఖమనే యెముక. he broke his * వాడి కాలిగుర్రపు ముఖము మీద గాయము తగిలినది, దోక్కొని పోయినది.
Shine n s brightness, lustre ప్రకాశము, కాంతి వెలుగు.
Shingles n s pebbles, small stones గుళక రాళ్లు, మరపరాళ్లు.or scab పుండ్లు.
Shining adj bright, lucid ప్రకాశమైన, మెరిసే, వెలిగే.
Shiny adj bright, luminous ప్రకాశమానమైన, వెలుతురుగా వుండే. a * night వెలుతురుగా వుండే రాత్రి.
Ship n s a vessel వాడ. he went on board * వాడ మీదికి యెక్కినాడు. To Ship, v. a. వాడ మీదికి యెక్కించుట. he shipped the rice బియ్యాన్నియెగుమతి చేసినాడు.
Shipment n s the putting things on board-ship వాడమీద యెక్కించడము, యెగుమతి చేయడము. after the * of the troops దండును వాడ మీద యెక్కించిన తర్వాత.
Shipper n s వాడవాడు, అనగా వాడకప్తాను, వాడ మీదికి సరుకు యెక్కించేవర్తకుడు.
Shipping n s (a number of ships) వాడలు. there is much * there అక్కడ నిండా వాడలు వున్నవి. they took * and went away వాడ యెక్కి పోయినారు.
Shippon n s that is, an outhouse, or shed పశువులదొడ్డి,పశువుల కొట్టము.
Shipwreck n s వాడ ముణీగిపోవడము, పగిలిపోవడము, నష్టము, ధ్వంసము.a * took place at Madras last year పోయిన సంవత్సరము చెన్నపట్టణపురేవులో వొక వాడ పగిలిపోయినది. after the * of my hopes నా ఆశ భంగమైపోయిన తర్వాత. he made * of all his former piety వాడి వ్రతభంగమైనది. (Manu. 6. 42.)
Shipwrecked adj వాడముణిగిన, నష్టమైన, చెడ్డ. a * man ముణిగినవాడు.సర్వవ్యాపారము కోలు పుచ్చుకొన్నవాడు.
Shipwright n s వాడలు చేసే వడ్లవాడు.
Shire n s దేశము సీమ. in England there are fifty-two *sఇంగ్లండులో యాభై రెండు సీమలున్నవి, అనగా యాభై రెండు జిల్లాలు వున్నవి.
Shirt n s a man's garment worn next the body మగవాండ్లువేసుకొనే లోని వుడుపు. the robbers stripped him to his * దొంగలువాన్ని గోచితో విడిచినారు. they brought him in his * వాణ్ని మొలబట్టలతో పట్టుకొని వచ్చినారు. a habit * స్త్రీలు అలంకారముగా తొడుక్కొనే వస్త్ర విశేషము.
Shirtless adj దిగంబరమైన.
Shittim n s that is, Cassia Lignea తుమ్మకర్ర వంటి వొక కొయ్య.వొక విధమైన పాలటేకు. (Kitto.) but Royle Sissoo wood ఇరుగుడు చెక్క.D+ and A+ use the word untranslated.
Shiver n s a bit, a fragment తునక, పెళ్ల, వ్రయ్య.
Shivered adj తునకలైన, తుత్తుమురైన, పగిలిన, వ్రయ్యలైన.
Shoal n s (a crowd of fish &c.) గుంపు, సమూహము, పోగు.a * in the sea కొండ, చుట్టు, దిబ్బ. * water సముద్రములో నిండా నీళ్లు లేని చోటు, చట్టుగల చోటు.
Shock n s a sudden snake అఘాతము, దెబ్బ, తాకు, అదురు. the horse touched me and the * threw me down గుర్రము నా మీద తాకి ఆ వురవడికి నేను పడిపోయినాను. an earthquake happened and there were three *sభూకంపము సంభవించి అందులో మూడుమాట్లు భూమి అదిరినది. she heard of hisdeath and she never recovered form the * వాడు చచ్చినాడని విని ఆ యదురు దానికి తీరనేలేదు. he had several *s of fever వాడికి రెండుమూడుమాఠ్లు మంచి జ్వరము తగిలినది. they చోఉల్డ్ not resist the * of the enemy's troops శత్రుసేన యొక్క దెబ్బకు నిలవలేక పోయినారు. a * of corn కోతకోశికట్టిన మోపు. he cut off the * of his hair వాడితల వెంట్రుకలను కోశివేసినాడు. * headed తల పెంచుకొన్న, a * dog కుచ్చికుక్క, వొళ్లంతా బొచ్చు మయముగా వుండేకుక్క.
Shocked pastpart అదిరిన,ఆయాసమునుపొందిన, I was * athearing this దీన్ని విని అఘోరించినాను. I am quite * at youఛి అదేమిపని, ఇది స్త్రీలు గద్దింపుగా చెప్పేమాట.
Shocking adj అఘోరమైన, చెడ్డ, పాపిష్టి, ఆయాసకరమైన. shocking !!అయ్యయ్యో, అబ్బబ్బా. it is a * sight ఇది చూడడానికి అఘోరముగా వున్నది.
Shockingly adv అఘోరముగా.
Shod adj wearing shoes లాడముకట్టిన. the horse is * ఆ గుర్రమునకు లాడము కట్టి వున్నది. his horses were * with silver వాడి గుర్రాలకు వెండిలాడములు కట్టి వుండినవి. a staff * with iron ఇనుపపొన్ను వేశిన కర్ర. his spear was * with brass వాడి యీటె అడుగుకు ఇత్తడికుప్పె వేశిఉండినది, పొన్నువేశి వుండినది. he arrived there dry * కాళ్ళకునీళ్ళు తగలకుండా వచ్చి చేరినాడు.
Shoe n s చెప్పు, పాదరక్ష, పైజారు, జోడు. a pair of *sపాదరక్షలు, జోళ్ళు, a horse * లాడము. my horse has lost two *s నా గుర్రానికి రెండు కాళ్ళ లాడములు పోయినవి. you now stand in his *s వాడి స్థానములో నీవు వున్నావు. what is the good of standing in other men's *s? పరుల పనిని తాను చూడడములో యేమి ప్రయోజనము."In the absence of Rama; the hero Bharata as his representative was installed with his *s" See Ramay : book 2 at the end.
Shoe flower n s the China rose or Hibiscus దాసానిపువ్వు.
Shoeboy n s చెప్పులు తుడిచేవాడు.
Shoeing-horn n s a horn used to facilitate the admission of the foot into a narro shoe శప్పాతును సులభముగా తొడుక్కోవడానకుసాధనముగా వుండే కొమ్ము. any thing by which a transaction isfacilitated ; any thing used as a medium: in contempt సాధనము,అడ్డముగా పెట్టుకొన్నది.
Shoemaker n s చెప్పులు కుట్టేవాడు, మాదిగె వాడు. a man of thatcaste మాదిగె వాడు. a woman of the * caste మాదిగెది.
Shoetye n s శప్పాతుమీద కట్టే నాడా.
Shone past p|| of the verb toShine ప్రకాశించే
Shoodra n s (an Indian word) శూద్రుడు.
Shook past,of the verb toShake కదిలిన
Shoot n s branches issuing from the main stock చిగురు, మొలకకొమ్మ, మోవి, మోసు. she brought some young *s out of the garden అది కొంచెము మొలక్కూర్ తెచ్చినది.
Shooting adj పడే, పోట్లు పోడిచే. a * star పడే చుక్క, పడే నక్షత్రము.a * pain శూలనొప్పి, పోట్లు.
Shop n s అంగడి. a carpenter's * వడ్లవాని శాల. a smith's * కరమలవాడు పనిచేసే స్థలము. a range of *s అంగడి విధి. a wholesale* మండి, మళిగె.
Shopboard n s అంగడిబల్ల.
Shopkeeper n s అంగడివాడు, వర్తకుడు.
Shoplifter n s ఉతకయెత్తి అంగట్లో చొరబడే దొంగ.
Shopman n s అంగడివాని చేతికింద వుండే పనివాడు.
Shopping n s అంగడికిపోయి బేరమాడడము. she passed all the morningin * తెల్లవారి అంతా అంగడంగడికి పోయి బేరమాడడముతో దానికి సరిపోయినది.to go a * బేరమాడడమునకై అంగడంగడికి పోయి బేరమాడడము.
Shopwoman n s అంగడి పెట్టుకోని వుండేటిది.
Shore n s తీరము, దరి, గట్టు, వొడ్డు, కట్ట. the ship got on *ఆ వాడ గట్టు తట్టినది. or common "Sewer" బహిర్బూమి, జలదారి. to goto the common * (Memorirs of Sully. English I. 85.) బహిర్దేశమునకుపోవుట. *s (plural) or props స్థంభములు, వాహనములు.
Shoreless adj అపారమైన, దరిలేని, దురంతమైన.
Shorn adj కత్తిరించబడ్డ. some are shaven and some are *కొందరు గొరగబడ్డారు, కొందరు కత్తిరీంచబడ్డారు. after he was * of his locks వాడి వెంట్రుకలను కత్తిరించివేసిన తర్వాత. the morning was cloudy and the sun was * of his beams తెల్లవారిమబ్బుగా వుండినందున కిరణములు లేక సూర్యబింబము మాత్రము అగుపడ్డది.
Short adj not long పొట్టి, కురచ. a * story చిన్న కథ. a *rope కురచైన దారము. a * stick తుండ్రుకర్ర. a * life అల్పాయువు. a * man పొట్టివాడు. a * syllable లఘ్వక్షరము, హ్రస్వాక్షరము. they went round while I went the shortest way వాండ్లు చుట్టుకొనివచ్చినారు నేను అడ్డదోవను పోయినాను. in a * time కొంచెములో, కొంచెము కాలములో. in * మెట్టుకు, వెయ్యి మాట లేల. in * they are coming మెట్టుకు వస్తున్నారులే. in * you must pay the money నీవు రూకలు చెల్లించి తీరవలెను. to cut the affair * he sold the horseయీ పీకులాట యెందుకని గుర్రాన్ని అమ్మివేసినాడు. when the water fell* నీళ్ళు లేక పోయ్యేటప్పటికి. he gave me * weight తక్కువగా తూచిఇచ్చినాడు. he gave me * measure అన్యాయపు కొలకొలిచినాడు.
Shortcoming n s failures, faults తప్పు, నేరములు, అపరాధములు.చేయక మానుకొన్నందున, వచ్చే దోషములు, అకరణేప్రత్యవాయము.
Shorthand n s సంకేతలిపి, అనగా సంగతులు తెలిసేలగు వ్రాసే సాంకేతికమైనగురుతులు.
Short-lived adj అల్పాయుస్సుగల, కొన్నాళ్లు బ్రతికిన.
Shortly adv in a little time కొంచెములో, కొంచెము కాలములో,కొన్నాళ్ళలో. * after his marriage పెండ్లి అయిన కొన్నాళ్ళకు.
Shortness n s పొట్టితనము, కురచతనము. from the * of the time కాలము కొంచేము గనుక. from the * of his stature వాడి ఆకారము పొట్టిదిగనక.
Shortribs n s పక్క యెముకల కింది చిన్న యెముకలు.
Shortsighted adj దూరదృష్టిలేని దూరాలోచనలేని. he is * వానికి దూరదృష్టిలేదు, వాడి దృష్టి శానా దూరము పారదు. from * pride అవివేకమైన గర్వముచేత.
Shortsightedness n s దూరదృష్టిలేమి. or folly అవివేకము.
Shortspoken adj that is rude దూర్తుడైన. a * man ధూర్తుడు, అమర్యాదస్థుడు.
Shortwinded adj ఊపిరిపుష్టిలేని, కొంచెములో యెగరోజే. he is so *that he cannot walk a mile వాడికి కొంచెములో యెగరోజు వస్తున్నదిగనక నాడు గడియదూరమ నడవలేడు.
Shot past of the verb toshoot He * the tiger పులిని కాల్చినాడు,పులిని వేశినాడు.
Shot-free adv not obliged to pay any thing దుడ్డు వ్రయము లేకుండా.he lived there for one month * అక్కడ నెల్లాండ్లు పుణ్యానికి జీవించినాడు,దుడ్డు వ్రయములేకుండా కాలము జరిపినాడు.
Shot-silk n s ఒక విధమైన పట్టుగుడ్డ, డమాసు.
Should verb వలసినది, you * do this నీవు దీన్ని చేయవలసినది.* we swallow poison? మనము విషము తాగవలసినదా. you * not doso నీవు అట్లా చేయరాదు, నీవు అట్లా చేయవలసినది కాదు. * he say soఅతడు అట్లా చెప్పినట్టయితే. * he live thirty years longer వాడుయింకా ముప్పై యేండ్లు బ్రతికితే. if he * not come వాడు రాకపోతే. * it not prove to be true నిజము కానట్టయితే. we * not give up hope మనము ఆశను విడిచిపెట్టరాదు, నిరాశ చేసకోరాదు. * it not beso ? అట్లా కానట్టయితే * he not be at home వాడు యింట్లో లేకుంటే. how * I know? నాకు యెట్లా తెలియవలసినది. had I known he was there I * have gone to him వాడు అక్కడ వుండేది తెలిసివుంటే నేను అక్కడికి పోయివుందును.
Shoulder n s భుజము, స్కంధము. the palanqueen bearers carry the pole on their *s బోయీలు దండెము భుజముమీద పెట్టుకొని పోతారు. the braminical thread is worn on the * (literally on the neck) జంద్యమును మెళ్ళో వేసుకొంటారు. he wore the badge on his * బిళ్ళను మెళ్ళో వేసుకొన్నాడు. his * is dislocated వానిరెట్ట వదిలినది, తొలిగినది. a * of mutton మేక రెట్ట, అనగా భుజము. a * of mutton sail మోచేతి వంపుగా వుండే వాడ చాప. he thrust me out by the head and *s నన్ను మెడ బట్టి బయిటికి గెంటినాడు. he hauled in that story by the head and *s ఆ కథను నడమ అసందర్భముగా తెచ్చి వేసినాడు. you must put your * to the wheel నీ చేతనైనమట్టుకు నీవు యత్నము చేసి చూడ వలసినది.
Shoulderbelt n s దవాలీ, అనగా బంట్రౌతులు మెళ్ళో వేసుకునేవారు.
Shoulderblade n s రెక్క.
Shoulderknot n s ఒక విధమైన పని వాండ్లు అలంకారార్ధముగా భుజముమీద పెట్టుకొనే సరిగెతోగాని నాడాతో గాని వేసిన ముడి.
Shout n s అరుపు, కేక, బొబ్బలు.
Shove n s తోపు, గెంటు, నూకు.
Shovel n s for fire నిప్పు తోడే గరిటె. for earth వొకవిధమైన పార. a * hat వొక విధమైన టోపి.
Shovelboard n s పాచికలవంటి వొక ఆట ఆడే బల్ల.
Show n s a spectacle వేడుక, తమాషా, ఆట, బూటకము, కల్ల, మాయ.appearance రూపము, ఆకారము. the outward * is very good బయిట రూపుబాగానే వున్నది. his friendship is all మేరే * వాడి స్నేహము వట్టి బూటకము. his piety is all empty * వాడి భక్తి అంతా వట్టి బూటకము.this world is all an empty * యీ ప్రపంచమంతా వట్టి మాయ. in * he was a friend of mine వాడు నాకు బయిటికి స్నేహితుడుగా వుండినాడు. dumb * నోరు తెరవకుండా వూరికే అభినయించి ఆడే ఆట. a puppet * బొమ్మలాట. there was a cattle * here last week పోయిన వారములో యిక్కడ అమ్మజూపపడానకై శానా పశువులను తీసుకొని వచ్చినారు.
Show-bread (add,)inHebr, ix. దర్శనీయావూపము. A+ but thenew Tamil says సముఖ అప్పము. I would say చూపు అప్పము or చూపురొట్టె .
Showbread, or shewbread n s. నైవేద్యము చేసిన అప్పము, ప్రసాదము.
Shower n s of rain జల్లు, వర్షము. there were three *s this morning నేడు తెల్లవారి వాన మూడుమాట్లు వచ్చినది. a slight * చినుకులు.during the * వాన కురుస్తూ వుండగా. between the *s వాన విడిచి వుండినపుడు. a * of tears మహత్తైన ఏడ్పు. a * of pearls ముత్యాల వర్షము. a * of kisses అనేక ముద్దులు. a * of blows లక్ష దెబ్బలు.when the smith struck the hot iron the sparks flew in *s కరమలవాడు యినుమును కాల్చి కొట్టేటప్పటికి నిప్పులు యేకముగా చెదిరినవి.a * of stones was flung at him వాని మీద వూరికే రాళ్ళు రువ్వినారు.
Shower bath n s వర్ష మజ్జనశాల, అనగా వర్షము కురిసేటట్టుగానీళ్లు పడేటట్టు యుక్తిచేసి పట్టిన స్నావాటిక.
Showery adj వర్షించే. * weather వాన కాలము. the * bow ఇంద్ర ధనస్సు.
Showing n s చూపడము. by his own * he is wrong తాను చెప్పినమాటవల్లనే తాను తప్పినట్టు తోస్తున్నది.
Showman n s he who exhibits బొమ్మలాటగాడు.
Shown past p' అగుపడ్డ, అగుపరచబడ్డ. the glory of God was* forth in this యిందులో దేవుని మహిమ తెలిసినది.
Showy adj handsome outwardly పైకి సొగసుగా వుండే చూపుకు అందముగా వుండే. a * woman సొగసుకత్తె.
Shrank past tense of the verb toShrink
Shred n s తునక, బద్ద, కత్తిరించగా పడే తునక, యిది తోలుకాకితముగుడ్డ, వీటిని గురించిన మాట. a mere * of cloth రవంత గుడ్డ. *s ofpaper కాకితపు తునకలు.
Shrew n s గయాళి, రక్కసి.
Shrewd adj గట్టి, చెడ్డ, వివేకమైన, చమత్కారమైన, చిలిపివిషపు,యుక్తిగల. he is a very * boy వీడు గట్టి పిల్లకాయ. a * womanగయాళి. a * turn అపకారము, కుయుక్తి. he hit me a * blow నన్నుచెడ్డ దెబ్బ కొట్టినాడు. this was a * objection యిది చెడ్డ ఆపేక్షణ.I have a * suspicion that the two accounts are the same యీ రెండు లెక్కలు వొకటే అయినట్టు నాకు నిండా అనుమానముగా వున్నది.
Shrewdly adj గట్టిగా, నిండా, వివేకముగా, యుక్తిగా.
Shrewdness n s చమత్కారము, యుక్తి, వివేకము.
Shrewish adj గయాళిగా వుండే.
Shrewmouse n s ఒక విధమైన చిట్టెలుక.
Shriek n s కూత, కీచుమనే కూత.
Shrievalty n s షరీపు వుద్యోగము. during his * వాడు షరీపుగా వుండగా.
Shrift n s గురువు చేసే మన్నన.
Shrike n s ఒక విధమైన పక్షి. or king crow జెముడు కాకి.See Dr. Wight in Madras Journal Oct. 1839 page 238. As anight bird పైడికంట. the Jocose * or Bulbul గిజిగాడు, పిగిలిపిట్ట. (See As. Soc. Journal Vol. X. 640) Shrill, adj. కీచుమనే. a * voice కీచుగొంతు. crikets make a * sound యిలకోళ్లు కీచుమని కూస్తవి.
Shrilly adj కీచుమని, ఖంగుమని. the cock crowed * కోడిఖంగుమని అరిచినది.
Shrimp n s రొయ్య. a drawarfish creature మరుగుజ్జు, పొట్టివాడు.
Shrine n s a place of worship పుణ్యస్థలము, పూజచేసే స్థలము.or temple గుడి, or holy place in a temple గర్భగృహము. or smallsilver case వెండి సంపుటము. they sacrificed at the * of pride వాండ్లు గర్వమునకు పాలైనారు. they sacrificed at the * of Cupidరతికి పాలైనారు, అనగా రతిలోలులైనారు. they sacrifice at the * ofVenus యోని. they sacrifice at the * of Bacchus వాండ్లు బలరామ పూజ చేసినారు, అనగా తాగుబోతులైనారు. he sacrficed his ease at the * of ambition అత్యాశవల్ల చెడిపోయినాడు.
Shrink v n ముడుచుకొనుట. the river shrunk into a small streamఆ యేరు ప్రవాహము తీసిపోయి చిన్న కాలవగా పారుతున్నది. the heat made thewood * యెండకు యీ కొయ్య శుష్కించి పోయినది. to withdraw as from dangerవెనక్కు తీసుట, సంకోచించుట, జంకుట. he shrunk from doing his dutyతన పనిని చేయడమునకు తానే వెనక్కు తీసినాడు.
Shrivelled adj ముడుచుకొనిపోయిన, శుష్కించిన. a * leg యీచుకొనిపోయిన కాలు. a * leaf యెండిన ఆకు.
Shriven pastp|| Pardoned by the priest గురువుచేతమన్నించబడ్డ
Shroff n s an Indian word for a money changer సరాబు.
Shroud n s a vest in which a corpse is dressed ప్రేతవస్త్రము. It was all hidden in a * of smoke ఏకముగా పొగ మూసుకొన్నది. the *s of a ship వాడ స్థంభానికి కట్టే నూలు నిచ్చెన.
Shrouded past p|| covered, concealed, veiled కప్పుకొన్న,కమ్ముకొన్న, మూసుకొన్న. * in darkness చీకటి మూసుకొన్న.
Shrovetide, or shrove-tuesday n s. అది వొక పండుగ పేరు.Shroving time (See Milton's prose Wks. 120. Vol. 2. 336.)carnival యిది వొక పండుగ పేరు.
Shrub n s a bush, a small tree పొద, చెట్టు. a kind of wine వొక విధమైన సారాయి.
Shrubbery n s చిన్న చెట్లు వుండే స్థలము, తోట.
Shrubby adj చిన్న చెట్లుగల, పొదలుగల. a * wildernessగుట్ట గుట్ట పొదలుగల అడవి.
Shrunk past tense of the verb To Shrink
Shrunken pastp|| శుష్కించిన,ఈచబోయిన,ముడుచుకొన్న,యె, a* leaf యెండి ముడుచుకున్న ఆకు. there were * with cold చలికి ముడుచుకొని వుండినారు. his * hands and legs వాడి వూచకాళ్లు చేతులు.
Shudder n s వణుకు, కంపము.
Shudderingly adj ఝల్లుమని, వడవడవణికి.
Shuffilignly adv with an irregular motion తారుమారుగా. with fraud మోసముగా, వంచనగా, పితలాటకముగా.
Shuffle n s the act of disordering things గందరగోళముచేయడము. a trick, an artifice మోసము, వంచన.
Shuffler n s a cheat మోసగాడు, వంచకుడు, ప్రతారకుడు.
Shuffling n s motion with the feet ఆటలో అడుగులు వేయడము.* the cards ఆడే కాగితములను కలపడము. trickery roguery మోసము,వంచన, పితలాటకము.
Shut pastp|| closed మూసుకొన్న,ముక్కుళించిన, the door was * to, but was not locked ఆ తలుపు వూరికె మూశి వుండినదిగాని గడియవేయలేదు. the Turks keep their women * up తురకలు ఆడవాండ్లను రాణివాసములో వుంచుతారు. the heavens were * up వాన బిగ్గట్టినది.
Shutter n s తలుపు, కిటికితలుపు. the man was put on a * and carried home వాణ్ని వొక తలుపు మీద వేశి యింటికి యెత్తుకొనిపోయినారు.
Shuttle n s a weaver's instrument to carry thread నాడె,వేమ, దీన్ని లాడి అని అంటారు.
Shuttle-cock n s రెక్కల బెండు, అనగా కలబంద చెట్టు ఆకారముగా పక్షి యీకలు దోపిన బెండుదిండు, దీన్ని దిగువపడకుండా పిల్లకాయలు తోలుకర్రతో తట్టుతారు, రెక్కలచెండు ఆట అనవచ్చును. he is a mere * inhis judgement వాడికి బుద్ధి నిలకడలేదు, చపలుడు. they made a mere* of him వాణ్ని పిచ్చివాణ్నిగా ఆడించినారు. he has made a mere * of the money ఆ రూకలను ఛిన్నాభిన్నము చేసినాడు.
Shy adj జంకుగల, సంకోచముగల. the crow is impudent but thecuckoo is * కాకి గండా గుండిగాని కోకిల నిండా పిరికిది. one who is* సంకోచపడేవాడు. he was * జంకినాడు, సంకోచించినాడు. the femaleswere * and withdrew ఆడవాండ్లు జంకి వెనక్కు పోయినారు. the child is * ఆ బిడ్డ యెవరి దగ్గరికీ పోదు. to fight * of (that is toస్హున్) మానుకొనుట, త్యజించుట, తొలిగిపోవుట. they fought * of himవాణ్ని చూచి జంకి తొలగిపోయినారు. he fought * of the police పోలీసువాండ్లకు జంకి తొలగిపోయినాడు. See Joseph Andrews, Bk. 2. Chap10, ult.
Shyness n s జంకు, సంకోచము.
Sibilant adj hissing ఊష్మలైన. the letters సశష are called* ఊష్మలు.
Sibyl n s a prophetess సోదె చెప్పేటిది. or old woman ముసలమ్మ.
Sibylline adj సోదె సంబందమైన. the * books ఖిల రుక్కులు.
Sicamore (See Sycamore)
Sick adj ఆశక్తముగా వుండే, రోగముగా వుండే, నలుకువుగా వుండే. the * require the doctor రోగులకు వైద్యులు కావలేను. the * man రోగి, అశక్తుడు. he is * వాడు అశక్తముగా వున్నాడు. I am * of this businessయీ పని అంటే నాకు చీదర. I am * of him వాడంటే నాకు అసహ్యము. he is* of life వాడికి ప్రాణము మీద విసికినది. * of love విరహతాపముగల.those who are * of the palsy చలి జ్వరముగల వాండ్లు. to బే *; thatis, to vomit కక్కుట, వమనము చేసుట. the child was * all over the cloth బిడ్డ ఆ గుడ్డ మీదంతా కక్కినది.
Sickening p|| చీదరచేసే,అసహ్యమునుకలుగచేసే, a * smell వాంతివచ్చే కంపు. this is a * business ఇది అసహ్యమైన పని.
Sickish adj likely to vomit వాంతి వచ్చేటట్టు వుండే. I feel* నాకు వాంతివచ్చేటట్టు వున్నది.
Sickishness n s nausea డోకు, వాంతివచ్చేటట్టుగా వుండడము.
Sickle n s కొడవలి. the corn is ripe for the * పంటకోతకు వచ్చినది.
Sicklied adj pale పాలిన, వివర్ణముగా వుండే.
Sickliness n s weakness, illness అశక్తము, జాడ్యము, నలుకువ.from the * of the season ఇది రోగము తగిలే కాలము గనుక.
Sickly adj weak, miserable దుర్బలముగా వుండే, అశక్తముగా వుండే,నిస్త్రాణగా వుండే. a * child నలుకువగా వుండే పిల్ల. a * tree దిగపెరిగే చెట్టు.
Sickness n s వ్యాది, రోగము, అశక్తత. during his * వాడుఅశక్తపడి వుండేటప్పుడు.
Sidden past p|| of the verb ToSlide
Side n s పక్క, పార్శ్వ్ము, పక్షము, తట్టు, వైపు, వోర. on that* ఆ పక్కన. go on one * వారగాపో. on the * of the hill కొండపక్కన. కొండ అడుగున. on the north * ఉత్తరపు దిక్కున. * of aleaf, being one page పొరట. a * of bacon అరపంది. * of a river, one bank తీరము. a side-saddle పక్కజీని, అనగా ఆడవాండ్లు యేక్కే గుర్రముమీద వెసే పల్లము. side-arms, that is, sword andpistols పార్శ్వ ఆయుధములు, అనగా కత్తిపిస్తోలు. they spoke on his * అతని పక్షముగా మాట్లాడినారు. a witness on my * నా పక్షమైన సాక్షి.It is an error on the safe * తప్పు వాస్తవమే మెట్టుకు యిది కావడము శుభము. ఇది అన్యాయము సరే మెట్టుకు యిందుచేత ఫలము కద్దు,గుడ్డిలో మెల్ల శ్రేష్టము. to lie on one * వొత్తిగిలి పండుకోనుట.God who was on my * నా పాలిటి దైవము. God is on their * దేవుడువాండ్ల పక్షముగా వున్నాడు. youth is on his * వీడు వయసు వాడనేదివీడి యందు విశేషము. On both *s ఉభయత్ర యిరుగడల. on all *sనల్ దిక్కుల. relations on the mother's * తల్లివంక వాండ్లు, మాతృవర్గము. from * to * యీ పక్కనుంచి ఆ పక్క దాకా. he nearlysplit his *s with laughing పక్కలు పగల నవ్వినాడు. In theAmaram the Sancrit and the Telugu are printed * by * అమరములోసంస్కృతము వొక పక్క తెలుగు వొక పక్కగా అచ్చువేసినారు. In theline the soldiers stood * by * సిపాయీలు వరసగా నిలిచినారు.the books were placed * by * ఆ పుస్తకములను వరసగా పెట్టినారు.they were buried * by * వాండ్లిద్దరినిన్ని జోడుగా పూడ్చినారు.
Sideboard n s a sort of table ఒక విధమైన మేజ. a fine * of plate వెండిపాత్ర సామాగ్రీ.
Sided adj having sides పక్కలుగల. three * మూడుపక్కలుగలan eight * pillar యెనిమిది పట్టెలు గల స్తంభము. one * (that is)partial పక్షపాతముగల.
Sideface n s పక్కరూపుగా వుండే ముఖము. the * is like his father's but the full face is different పక్కన చూస్తే తండ్రి ముఖము వలె వున్నది, యెదట చూస్తే అట్లా లేదు.
Sidelong adv and adj. పక్క, వోర. * glances పక్కచూపులు.she looked at me * అది నన్ను కడకంట చూచినది.
Sidelook n s ఓరచూపు, పక్కచూపు, పార్శ్వదృష్టి.
Sidereal adj నక్షత్ర సంబంధమైన.
Sidesman n s he who assists సహాయ పడేవాడు, ఆప్తుడు, హితుడు.
Sideview n s పక్క చూపు. the * of the house is not handsomeపక్కనుంచి చూస్తే ఆ యిల్లు అందముగా వుండ లేదు.
Sideways adv పక్కవాటుగా, వోరగా.
Side-wind n s పక్కవాటుగా కొట్టే గాలి, కయుక్తి, అడ్డదోవ.
Siege n s the act of surrounding a fort ముట్టడి. or attempt ప్రయత్నము.
Siesta n s పగులు బోజనముచేసి నిద్రపోవడము. he took a * పగట్లోనిద్ర పోయినాడు.
Sieve n s జల్లెడ, చాలిని. a kind of basket ఒక విధమైనగంప.
Sifting n s (trial) విమర్శ, పరిశోధన.
Sigh n s నిట్టూర్పు, పెద్దవూపిరి, ఉచ్ఛాస్వము. she heaveda deep * అది వొక పెద్ద వూపిరి విడిచినది.
Sight n s the sense of seeing దృష్టి. at first * చూడగానే.he has lost his * వాడికి దృష్టి తప్పినది. I హవే not hada * of him to-day నేను వాణ్ని చూడలేదు. as long as the shipwas in * ఆ వాడ కండ్లబడుతూ వుండేదాకా. this happened in their* యిది వాండ్లకండ్లెదుట జరిగినది. in హిస్ * she is a beautyవాడి కంటికి అది అందము. I trust that you will give such a decision as may be right in the * of God తమ తీర్పు దైవసమ్మతిగా వుండవలసినది. In their * this is wrong వారి బుద్ధికి యిది తప్పు. the thieves kept out of his * దొంగలు అతనికి కండ్లబడకుండా వుండినారు, చిక్కకుండా వుండినారు. this isout of all * superior to the other ఇది యెక్కడ అది యెక్కడ,దానికంటే యిది లక్షంతలు అధికము. when the bird went out of *in the sky ఆకాశములో పక్షికండ్లకు అగుపడకుండా పొయ్యటప్పటికి.or thing seen, చూడబడ్డది. the marriage was a fine * ఆ పెండ్లి నిండా చూడ వేడుకగా వుండినది. or wonder చోద్యము, వింత.he visited the tigers and the pagodas and all the other *s పులులు గుళ్ళు యింకా వుమడే వేడుకలన్నీ పోయి చూచినాడు. If youwill come here I will show you a * యిక్కడికి వస్తే నీకువొక వింత చూపిస్తాను. act of seeing or beholding చూడడము,దర్శించడము. Will you favour me with a * of the letter? ఆ జాబును నాకు చూపిస్తావా. at last I caught * of him తుదకు వాన్నికనిపెట్టినాను. I lost * of it అది నాకు దాగినది, అది నాకు చిక్కలేదు.this is not to be lost * of ఇది వుపేక్ష చేయతగ్గదికాదు. you must not lose * of this దీన్ని నీవు వుపేక్ష చేయరాదు. I do notknow him by * వాణ్ని చూస్తే ఫలాని వాడని నాకు తెలియదు. I know him by * వాణ్ని చూస్తే నాకు తేలుసును. prophetic or second * జ్ఞానదృష్టి, దివ్యదృష్టి, యోగదృష్టి. a bill payable at * దర్శన హుండి,వాయిదాలేని హుండి. a bill payable at ten days' * పది దినాల వాయిదా మీద చెల్లించే హుండి.
Sighted adj దృష్టిగల. far * దూరదృష్టిగల, సూక్ష్మ బుద్దిగల.short * దూరదృష్టిలేని, దురాలోచనలేని, అవివేకియైన.
Sightless adj blind అంధుడైన, గుడ్డిగా వుండే. Sightly, adj. handsome కంటికి యింపైన, సొగసైన, అందమైన.
Sigit n s a seal ముద్ర, ఇది మంత్రశాస్త్రములో వచ్చే వాక్యము.
Sign n s సంజ్ఞ, గురుతు, చిహ్న, సైగ, జాడ, లక్షణము, ఆనవాలు, సూచన. there is no * of their coming వాండ్లు వచ్చే జాడ కానము.a favourable * or omen మంచి శకునము. a bad * అవలక్షణము, అపశకునము. he made a * for me to come నన్ను రమ్మని సైగ చేసినాడు. I took or understood his * వాడు చేసిన సైగను కనుక్కొన్నాను, తెలుసుకొన్నాను. *s of the zodiac రాసులు. while the sun was in the * Virgo సూర్యుడు కన్యరాశిలో వుండేటప్పుడు. the* manual రాజుచేవ్రాలు. the * of an inn సత్రము వాకిట యిది సత్రమనితెలిశేటట్టుగా వొక పలక మీద వ్రాసిన గురుతు.
Signal n s జాడ, సైగ, లక్షణము, గుర్తు. he fired a gun as a * సంజ్ఞగా వొక గుండు వేసినాడు. when he came near the town theyhoisted a * వాడు వూరి దగ్గరికి వచ్చేటప్పటికి కోడి వేసినారు. his comingwas the * for their ruin వీడు రావడము వాండ్లకు చేటైనది. his entrancewas the * for a general silence వాడు రాగానే అందరు నోరు మూసుకొన్నారు.
Signally adV ఘనముగా, విశేషముగా.
Signature n s చేవ్రాలు. or Johnson's No. 2 లక్షణము, ఆనవాలు.
Signet n s a seal ముద్ర, రాజముద్ర.
Significance, Significancy n s. force, energy, meaning స్వారస్యము,భావము. importance విశేషము, ముఖ్యము.
Significant adj అర్ధముగల, భావముగల, భావగర్భితమైన, సూచకమైన, భావ సూచకమైన. important; momentous విశేషమైన, ముఖ్యమైన. he reviled them in a * manner వాండ్లకు తగిలేటట్టు తిట్టినాడు. he maintained a * silence వాడు నోరు తెరవకుండా వుండడములో యేమో విశేషము ఉన్నది.
Significantly adv భావ సూచకముగా, అభిప్రాయ సూచకముగా. Signification, n. s. meaning అర్థము, ఆశయము, అభిప్రాయము, భావము.a false or erroneous * అపార్ధము.
Significative adj అర్థముగల, భావముగల.
Significatory n s తెలియచేయడము. he wrote a letter * of hisintentions వాడి అభిప్రాయము తెలియచేశేటట్టుగా వొక జాబును వ్రాశినాడు.
Signifying adj అర్థమయ్యే. Achalam * a mountain అచలము అనగాపర్వతము.
Signior n s దొరగారు, సాహేబులవారు.
Signiory n s dominion జమీందారి, జమీందారుడి యొక్క రాజ్యము.
Signor n s దొరగారు, సాహేబులవారు. the Grand * or the Emperorof Constantinople కన్ష్ఠాంటునోపిల్ అనే దేశము యొక్క చక్రవర్తి.
Signora n s దొరసాని, నాయిక.
Signpost n s గురుతు స్థంభము, అనగా సత్రము సారాయి అంగడి వీటి దోవలు తెలిసేటట్టు వ్రాసిన పలకలు తగిలించే స్థంభము.
Silence n s మౌనము, నిశ్శబ్దము, చప్పుడు లేకుండా వుండడము. theykept * మాట్లాడకుండా వుండినారు, నిశ్శబ్దముగా వుండినారు. I kept * నేను వొకటీ అనలేదు, నేను నోరు తెరవలేదు. at last he broke * తుదకునోరు తెరచినాడు, మాట్లాడినాడు. from the * of the town at nightరాత్రిళ్ళు ఆ వూళ్ళో మాటుమణిగి వుండడమువల్ల. he passed by thisobjection in * ఈ ఆక్షేపణకు వొకటీ ఉత్తరము చెప్పకుండా వూరికె పోనిచ్చినాడు, యీ ఆక్షేపణకు యేమి అనకుండా వూరికె వుండినాడు. * that speaks and elovuence of eyes మాటలు లేని సంభాషణ, అనగా అభినయము. I wrote him four letters but he maintained a long * వాడికి నాలుగు జాబులు వ్రాసినప్పటికిన్ని వాడు ప్రత్యుత్తరము వ్రాయలేదు.*! సద్దు.
Silent adj నోరెత్తని, మాట్లాడని, మౌనముగా వుండే. he is a very* man వాడు యెక్కువ మాట్లాడేవాడు కాడు. a * meeting నిశ్శబ్దముగా వుండేసభ. I spoke to him but he was * about this వాడితో మాట్లాడితేయిందున గురించి వాడేమిన్ని అనలేదు. the * forest నిశ్శబ్దముగా వున్న అడవి. a * consonant అర్ధాక్షరము. as in the words అవశాత్, తస్మిన్,పృథక్.
Silently adv without speaking మౌనముగా, మాట్లాడకుండా, నోరెత్తక,ఊరికె, నిశ్శబ్దముగా. she * looked at me మాట్లాడకుండా వూరికె అది నన్ను చూచినది. he * submitted నోరెత్తకుండా వొప్పుకున్నాడు.
Silk n s పట్టు. raw * or floses వడకని పట్టు. soft as *మిక్కిలినున్నవి. the musulmans are forbidden to wear * పట్టువస్త్రముకట్టుకోవడము తురకలకు నిషేధము. * thread పట్టునూలు. the * cotton tree శాల్మలీవృక్షము, బూరగచెట్టు.
Silken adj made of silk పట్టు. a * vest పట్టువస్త్రము. her *fingers దానిమెత్తని వేళ్ళు, మృదువైన వేళ్ళు. the * threads whichare made by the spider సాలెపురుగుచేసే నున్నని పోగులు.
Silkworm n s పట్టునూలు పురుగు, దీన్ని పసిరికాయ పురుగు అంటారు.
Silky adj soft, fine మృదువైన, మెత్తని.
Sill n s the timber or stone at the foot of a door గడప,ద్వారబంధము యొక్క అడుగుపెట్టె పొదికట్టు. the lintel and the * ఉత్తరాసులు.
Sillabub n s a liquor made of mild and wine or ciderపాలుతో కలిపిన వైను సారాయి.
Silliness n s అవివేకము, పిచ్చితనము, వెర్రితనము, వెంగలితనము.
Silly adj అవివేకియైన, పిచ్చి, వెర్రి, వెంగలియైన.
Silt n s mud, slime బురద, అడుసు, రొంపి.
Silvan adj See Sylvan.
Silver n s వెండి, రజతము, రూప్యము. or money, రూకలు, రొక్కము.German * వెండి వలె ఉండ వొక లోహము, కృత్రిమ రజితము.
Silvered adj వెండిమొలాము చేసిన, నెరసిన.
Silversmith n s కంసాలవాడు, రజితకారుడు.
Silvery adj white, brilliant తెల్లని, ప్రకాశమానమైన. her *voice దాని మధుర స్వనము. the * light of the moon పండు వెన్నెల.
Simar n s a robe కోక.
Similar adj సమానమైన, సరియైన, ఈడైన, వంటి. there is a house* to this one దీనివంటి యిల్లు వొకటి వున్నది. * to it అటువంటి. *to this యిటువంటి, దీనికి తుల్యమైనది.
similarity n s సాదృశ్యము, సామ్యము, పోలిక. from the * of thesetwo houses యీ రెండు యిండ్లు వొకటే మాదిరిగా వుండుటవల్ల. from the *of their faces వాండ్ల ముఖాలు వొకటే పోలికగా వున్నందున.
Simile n s ఉపమానము, ఉపమ. he fell upon them like a tigerవాండ్లమీద పెద్దపులివలె పడ్డాడు, ఈ వాక్యములో like a tiger పులివలెఅనే మాట ఉపమాన మవుతున్నది.
Similitude n s likeness; resemblance ఉపమ, ఉపమానము, పోలిక, దృష్టాంతము. Vema. 2. 7. యిచ్చువానివద్ద నీనివాడుండిన చచ్చుగాని యీవిసాగనీడు, కల్పతరువు కింద గచ్చ చెట్లున్నట్టు, ఈ పద్యములో కల్పతరువుకిమద అనే వాక్యము similtude అనగా ఉపమానము.
English to Telugu free online dictionary
Enter English word and know Telugu meaning
No comments:
Post a Comment