Sea-fight n s వాడలజగడము.
Sea-fowl n s సముద్రపు పక్షి.
Sea-girt adj సముద్రముచేత చుట్టబడ్డ. an island is * ఒక దీవినిసముద్రము చుట్టుకొని వున్నది.
Sea-green adj సముద్రమువలె పచ్చగా వుండే.
Sea-gull n s sea-crow సముద్రపు కాకి.
Seal n s the sea-calf సముద్రములో ఉండే ఒక జంతువు, భృంగివంటిది. sealskin ఈ జంతువు యొక్క చర్మము, ఇది ఉడుము చర్మమును నిండా బిరుసుగా ఉంటున్నది.
Sea-language n s sea phrases వాడవాండ్ల భాష.
Sealed adj ముద్రవేసిన. signed, *, and delivered చేవ్రాలు ముద్రవేసి ఇవ్వబడ్డది. a * volume రహస్యమైన గ్రంథము, చదవరాని అక్షరము. his fate is * వాడి పని ముగిసినది, వాడి కొంప మునిగినది.his pardon is * వాడికి విమోచనమైనది, వాడికి మోక్షమైనది. my lipsare * నేను నోరు తెరవను.
Sealing-wax n s ముద్రవేసే లక్క. red sealing-wax ఎర్ర లక్క.black sealing wax నల్ల లక్క.
Seam n s the joining of two edges నడిమి, కుట్టు, అతుకు. the *s of the scull కపాలము యొక్క సంధి. * of planks కూర్పు. the *of the leaf ఆకు మీది నరము. In tin work గొందు కూరు. he joinedthe brass plate top so that the * was hardly visible ఈ తపిలెను అతుకు తెలియకుండా అతికినాడు.
Sea-man n s a sailor వాడవాడు, వాడంగి, వాడలో వుండే పనివాడు.
Sea-mark n s point or conspicuous place distinguished atsea, and serving the mariners as directions of their courseసముద్రములో పొయ్యేవాండ్లకు నగరికొండవలె భూమిమీద అగుపడే గురుతు.
Seamed adj అతుకులు గల. his face was * over with scars వాడిముఖమంతా పుండ్ల మచ్చలుగా ఉండినది.
Seamless adj కుట్లులేని, అతుకులేని.
Seamstress n s కుట్రపుది.
Seamy adj కుట్లుగల, అతుకుగల.
Sea-piece n s సముద్రపటము.
Sea-port n s రేవు, వాడ రేవు.
Seapoy n s (an Indian word for a native soldier) సిపాయి.
Sear adj dry, old ఎండిన, పండిన. * leaves పండినాకులు. To Sear, v. a. కాల్చుట. they cut off his leg and then *edthe stump వాడి కాలునుకోసి నెత్తురు కారకుండా ఆ మొండెమును కాల్చినారు.or else they dipped it in బోఇలిన్గ్ oil to * it నెత్తురు కారకుండాదాని మండేనూనెలో అద్దినారు. they *ed his eyes వాడి కండ్లను కాలినఇనుముతో కాల్చి పోగొట్టినారు. pride *s the heart గర్వమువల్ల మనసు రాయి అయిపోతున్నది. a *ed conscience రాతి మనసు, చెడు మనస్సు. కఠిన హృదయము. his conscience appears to be *ed వాడి మనసు రాయి అయిపోయినట్టు వున్నది.
Sear cloth n s a wrong spelling for cerecloth, మైనపుగుడ్డ.
Searce n s (a sieve) జల్లెడ.
Search n s enquiry, seeking, విచారణ, విమర్శ, పరిశోధన, వెతకడము.
Searcher n s శోధకుడు, శోధించేవాడు, పరిశీలన చేసేవాడు, విచారించేవాడు. God who is the * of hearts మనసును శోధించే దేవుడు.
Searching p|| నిశితమైన,ఖండితమైన,చురుకైన, a * enquiry నిశితపరీక్ష, ఖండితమైన విమర్శ, స్తనశల్య పరీక్ష. a * medicine జర్ఝరీభూతమైన ఔషధము, రోగమును పట్టే మందు. a * question మర్మమును బయిలు వెళ్లదీసే ప్రశ్న.
Searchingly adv గురుతుగా, చక్కగా, పరిష్కారముగా. she looked* in each face ప్రతి ముఖము నన్ను గురుతుగా చూచినది.
Sea-room n s సముద్రములో వాడ తిరిగే టందుకు విశాలముగా వుండేయేడము.
Sea-service n s వాడ కొలువు. naval war వాడ యుద్ధము.a naval force యుద్ధవాడలు.
Sea-shore n s వాడరేవు, వాగర్త.
Sea-sick adj వాడమీద యెక్కే వాడుక లేనందున వాంతులయ్యే. being unused to the sea they were soon * వాండ్లకు వాడమీద యెక్కే వఅఢుక లేనందున వాంతులు అయినవి. she became * by sitting inట్హే swing వుయ్యాలలో ఊగినందున దానికి వాంతులైనవి.
Sea-sickness n s వాడమీద పోవడము వల్ల తల తిరిగి కలిగే వాంతులు.
Sea-side n s సముద్రతీరము.
Season n s one of the four parts of the year ఋతువు,కాలము, తరుణము, తరి. The English reckon four *s in ట్హే year,which are, spring, summer, autumn, and winter, The Hindussay there are six *s (See the word ఋతువు.) the hot *ఎండ కాలము. at the at * or time ఆ సమయమునందు. they remainedfor a short * కొన్నాళ్లు వుండిరి. at this * ఇప్పట్లో, యిట్టి తరుణంలో,ప్రస్తుతమందు. mangoes are now out of * మామిడికాయలు తల బడ్డది.oranges are not now in * ఇది కిచ్చిలి కాయలు కాచే కాలము కాదు.a bitch that is in * వెదగా వుండే కుక్క, అనగా చూలు కావడమునకుయత్నముగా వుండేటిది. an elephant that is in * మదమెక్కిన యేనుగ.plantains are always in * అరిటికి ఎప్పుడున్ను కాలమే. flowers whichare always in * సమస్త ఋతువులోనున్ను పూచే పుష్పములు. the toddy *కల్లు దించే దినాలు, కల్లు పంట కాలము.
Seasonable adj happening at a proper time సమయోచితమైన.this was a * assistance ఇది సమయోచితమైన సహాయము, అదునుకు వొదిగిన సహాయము.
Seasonableness n s సమయోచితత్వము. from the * of his aid వాడి సహాయము సమయోచితముగా వుండినందున.
Seasonably adj in proper time సమయోచితముగా.
Seasoned adj having a taste prepared మసాలా వేసిన, తిరగబోయబడ్డ,పక్వము చేయబడ్డ, * with salt and prepper వుప్పుకారము వేసిన. mirth *with wisdom తెలివితో గూడుకొన్న వుల్లాసము. a treat * with friendly talk విశ్వాసోక్తి సహితమైన అతిధిపూజ. his reproofs were * with kindnessవిశ్వాసమిళితమైన చీవాట్లు, అనగా వాడు చీవాట్లు పెట్టడములో నడమనడమ విశ్వాసము నున్ను అగుపరిచినాడు. * wood మసాలాకట్టిన మాను. a well * scholar ఆరితేరిన పండితుడు. awell * word సమయోచితమైన మాట. he is * to the climate ఆ నీళ్లు వాడికి వొంటిపోయినది.
Seasoning n s spicery మసాలా, సంబారము.
Seat n s place for setting పీఠము, ఆసనము. situation స్థానము,చోటు. he took his * upon a tree చెట్టు మీద కూర్చున్నాడు. when the king took his * on the throne రాజు సింహాసనము మీద కూర్చున్నప్పుడు,రాజు సింహాసనాసీనుడై వుండినప్పుడు. Casi ws the great * Hindu learningకాశి విద్యకు పుట్నిల్లుగా ఉండినది. seringapatam was the * of war ఆ యుద్ధము జరిగిన ప్రదేశము శ్రీరంగపట్టణము. Bombay is the great * of trade బొంబాయి వర్తకము ముఖ్యముగా జరిగే చోటుగా వున్నది. the head is the * of intellect జ్ఞానము వుండే స్తానము శిరస్సు. the stomach was the * of this disease ఈ రోగానికి ఆధారము కడుపు. a gentleman * orcountry * వూరికకి బయట వుండే వొక వుద్యానవనము. at Madras the governor's country * is at Guindy చెన్నపట్నపు గౌనరు వారి వుద్యానవనము గిండిలో ఉన్నది. he has a good * on horsebacK వాడు గుర్రమెక్కడములో జతపడ్డవాడు.
Seated adj కూర్చున్న, ఆసీనుడైన. when the king was * on thethrone రాజు సింహాసనము మీద కూర్చున్నప్పుడు సింహాసనాసీనుడైనప్పుడు. a house * on a hill పర్వతముమీద ఉండే ఇల్లు. a deep * disease అస్తిగతమైన రోగము. deep * harted మహత్తైన వైరము, మనసులోనాటివుండే వైరము. deep * love మనసులో పాదుకోని వుండే విశ్వాసము.
Sea-term n s వాడభాష. a birth (or berth) the * for a chamber గదిని వాడభాషలో birth అంటారు.
Sea-weed n s శైవలము, సముద్రపుపాచి.
Sea-worthy adj that is strong, fit to go to sea బలిష్టమైన, ఇది వాడను గురించినమాట. this ship is not * బలిష్ఠమైనది గనుక ఈ వాడలో సముద్రమునకు తీసుకొనిపోవడమునకు తగినది కాదు.
Seceder n s he who leaves his religion మతత్యాగి, స్వమత త్యాగి,తనమతమును విడిచి వేరే మతములో బడ్డవాడు.
Secession n s స్వమత త్యాగము, తన మతమును విడిచి వేరే మతమునుఅవలంబించడము.
Secluded adj ఏకాంతముగా వుండే, ప్రత్యేకముగా ఉంచబడ్డ. a village* in the hills కొండలనడమ దాగిఉడే వొక పల్లె.
Seclusion n s ఏకాంతముగా వుండడము, ప్రత్యేకముగా వుండడము,వొకరికండ్ల పడకుండా వుండడము. the Musulman women lives in * తురక స్త్రీలు రాణివాసముగా వుంటారు. the Bramins do not keeptheir women in * బ్రాహ్మణులు స్త్రీలను రాణివాసములో పెట్టరు.
Second adj రెండో, ద్వితీయమైన. a * trial పునర్విమర్శ, he is * to none వాడు అసమానుడు, వాడు సర్వశ్రేష్టుడు. on * thoughtsI will pay the money మళ్లీ ఆలోచించేటప్పటికి ఆ రూకలను నాకుఇవ్వవలెనని తోచినది. * thoughts are best మళ్లీ ఆలోచించడముమంచిది. the * part of the book ఉత్తరబాగము. the day of the Hindu fortnight ద్వితీయతిధి, విదియ. he came off * bestవోడినాడు అపజయమును పొందినాడు. habit is * nature అభ్యాసము సహజమై పోతున్నది, అభ్యాసము ప్రకృతి సిద్ధమవుతున్నది. the * personin grammer మధ్యమపురుష. a woman's * marriage మారు మనువు.
Secondarily adv in the second place రెండో పక్షముగా, గౌణపక్షముగా.
Secondary adj inferior not the best రెండో అధమమైన,విముఖ్యమైన, సామాన్యమైన. the * crop వెలిపైరు. the * senseof a word రెండో అర్థము, విశేషార్ధము. the * symptoms ofdisease మరకపాటు.
Second-hand adv or adj. not new అనుభవించిన, వాడిన. hebought the carriage * వొకడు తన బండిని అమ్మివేస్తే వీడు కొనుక్కొన్నాడు.* clothes కట్టినగుడ్డలు.
Secondly adj మరిన్ని, పైగా.
Second-rate adj రెండోతరమైన, సామాన్యమైన, విముఖ్యమైన.
Second-sight n s జ్ఞానదృష్టి, దివ్యదృష్టి. See KP. 2. 186.and BPD. Book 2. line 1035.
Second-sort adj రెండోతరమైన, మట్టమైన, విముక్యమైన.
Secrecy, Secresy n s. రహస్యము, అంతరంగము, ఏకాంతము.
Secret adj అంతరంగమైన, రహస్యమైన, మర్మమైన, ఏకాంతము.
Secretariat n s the office of a సేచ్రేటర్య్ రాయసముపని, మునిషిపని, మంత్రిత్వము.
Secretary n s one who writes for another రాయసగాడు, జవాబునివీసు. phrase for a minister మంత్రి. in writing this letter he made his wife his * ఈ జవాబును తన పెండ్లాము చేత వ్రాయించినాడు.
Secretaryship n s రాయసము, మునిషీగిరి, ఉత్తర ప్రత్యుత్తరములువ్రాసేపని or minister మంత్రిత్వము.
Secreted adj పరిణమించిన, ఉద్భవించిన. milk that is * in ట్హే udder పొదుగులో చేసిన పాలు. matter that is * in a wound పుంటిలో కూర్చిన చీము. the money * by him అతడు అపహరించిన రూకలు.
Secretion n s పరిణమించినది, ఉద్భవించినది, తినిన ఆహారముపృథక్కుపృథక్కుగా పరిణమించిన శరీర వృక్షాది వినిర్గత మలమూత్ర దుగ్ధ స్వేదకఫనిర్యాసోర్ణాదులు. silk is the * of a caterpillarపట్టుకంబలిలో పురుగులో నుంచి పుట్టినది. gum, is a * బంక చెట్టులోనుంచి పుట్టినది.
Secretly adv రహస్యముగా, మరుగుగా, మర్మముగా. he * approvedtheir conduct వాడు బయిటికి అనకపోయినా వాండ్లు చేసినది న్యాయమని మనసులో అనుకొన్నాడు.
Secretory adj పరిణమించే. the * ducts రసము దిగే నరములు.
Sect n s a division in religion ఓర్ opinion మతము, సమయము.there are *s in ఏవేర్య్ religion ప్రత మతములోనున్ను అవాంతరమతములుకలవు, భిన్నమార్గములు కలవు. the Vaishnava bramins are divided into two *s called Tengala and vadagala వైష్ణవులలో తెంగల వడగల అని రెండు మతములు కలవు.
Sectarial adj denoting a sect in religion మతసంబంధమైన. * marks నొసట వుంచుకొనే బొట్టు.
Sectarian n s మతస్తుడు, స్వమతములోనే భిన్నమార్గము ఆవలంభించినాడు.* expressions పరిభాషలు. Milton in హిస్ Eikonoclastes ** 13. says,"I never kenw that time in England when men of truest religionతేరే not counted సేచ్టర్టిఅన్స్." To this Mr. St. John adds in a note; "Wickliffe was a sectarian; the reformers, when they అప్పేఅరేడ్, were all sectarians; Milton, Newton, Locke, were the same; so were Owen, Boxter, Leighton, &c. and some of the noblest ornaments of Christianity, in all ages have been insulted with his name."
Sectary n s మతస్తుడు, స్వమతములోనే భిన్నమార్గము అవలంభించినవాడు.
Section n s cutting విభజనము, నరకడము. after *, that is after cutting కోశిన తర్వాత. of a fruit బద్ద. of a book ప్రకరణము, స్వర్గ, అధ్యాయము, కాండ, పరిచ్ఛేదము. of paper సంచిక,of a regiment తుక్కుడి, దళము. of a country భాగము. of a town పేట.
Sectioner n s a transcribing clerk (Indian phrase) కూలికివ్రాసేవాడు.
Sector n s a certain instrument మహాగణితములో కొలిచే వొక ఆయుధము పేరు.
Secular adj belonging to this world not spirtual ఐహికమైన,లౌకికమైన, a * priest పురోహితుడు. a bramin who is in * employmentలౌకికుడు.
Secularity n s worldiness లౌకికత్వము.
Secularized adj లౌకికములో బడ్డ.
Secundines n s the after birth మావి.
Secundum, artem adv యధావిధిగా, యథాశాస్త్రముగా.
Secure adj భద్రమైన, నిర్భయమైన, సురక్షితమైన. his health is now * ఇక వాడి వోంటిని గురించి భయములేదు. his victory is now * వాడికి జయము కలిగేటందున గురించి యిప్పట్లో సంశయము లేదు. వాడికి జయము కలిగేది సిద్ధము. he thought himself * of this దీన్ని గురించి భయము లేదనుకొన్నాడు, ఇది తనకు సిద్ధముగాదొరుకుతున్న దనుకొన్నాడు. do not be too * of this ఇది నీకు చిక్కేది సిద్ధము కాదు.
Secured p|| భద్రముగావుండే, well * మిక్కిలి భద్రముగా వుండే. an ill * house అబందరగా ఉండే ఇల్లు.
Securely adv భద్రముగా, సురక్షితముగా, నిశ్చింతగా.
Security n s safety రక్షణము. a place of * భద్రమైన స్థలము.they placed themselves in * దాగినారు. carelessness అజాగ్రత్త. his foolish * ruined him వాడి పిచ్చి అజాగ్రత్తే వాన్ని చెరిపినది. Bail &c. in law జామీను, పూట, తాకట్టు. what * have you ట్హట్ he will do this వాడు దీన్నిచేస్తాడని నీ కేమి నమ్మకము. he has no * beyondtheir word వారి మాట తప్పు, వాడికి వేరే ఆకరము లేదు. I shall be *for his appearance వాడు సిద్ధముగా వచ్చేటట్టు నేను పూటబడుతాను. he was my *, or he gave * for me వాడు నాకయి పూటబడ్డాడు. monied * రొక్కజామీను. personal * సఫరుజామీను. Securities plu. meaning bondsపత్రములు.
Sedan n s నాల్కీ, టాంజాం, కుర్చీవంటి పల్లకి.
Sedate adj తిన్నని, శాంతమైన అమరిక గల. she is young but she is very * అది పసిదైనా నిండా అమరిక గలది, నిండా పెద్ద మనిషి.
Sedately adv అమరికగా, తిన్నగా.
Sedateness n s అమరిక, తిన్నదనము, పెద్దమనిషి తనము.
Sedative adj శాంతపరచే. a * medicine నిద్రపట్టేట్టుచేసే మందు.
Sedentariness n s ఏవేళా కూర్చుండి వుండడము. from the * of theirlives వాండ్లే వేళా కూర్చుండి వుండే వారు గనక.
Sedentary adj కూర్చుండే. * employment కూర్చున్నట్టు చేసేపని. in England almost many * employments are given to women ఇంగ్లండులోకూర్చున్నట్టు చేసే పనులను బహుశః ఆడవాండ్లకు యిస్తారు.
Sedge n s తుంగ, జమ్ము.
Sedgy adj తుంగమయముగా ఉండే.
Sediment n s మష్టు, పుచ్చు, గసి.
Sedition n s రాజద్రోహము, రాజు మీద కుట్రచేయడము, కలహము.
Seditious adj రాజద్రోహియైన, ద్రోహియైన, కలహమైన, * languageద్రోహమైన మాటలు.
Seditiously adv ద్రోహముగా.
Seduced adj చెరపబడ్డ, చెరచబడ్డ, వలలో వేసుకోబడ్డ. he was* to do this దీన్ని చేయవలెననే దుర్బుద్దివానికి పుట్టినది. they were* from their allegiance వాండ్ల దుర్బుద్ధి వల్ల వాండ్లు అణిగి నడుచుకోకపోయినారు.
Seducer n s చెరిపేవాడు, వ్రతమును చెరిపేవాడు.
Seducing adj చెరిచే, దుర్బుద్ధి పుట్టించే, దుర్మార్గమునకు లోపరచే.music is a very * pursuit సంగీతము బుద్ధిని చెరుస్తున్నది.
Seduction n s చెరపడము, బుద్ధిని చెరపడము, దుర్భుద్దిని పుట్టించడము,దుర్మార్గమునకు లోపరచడము.
Seductive adj దుర్బుద్ధిని కలగచేస, దుర్మార్గమునకు లోపరచే, thisis a very * poem ఇది మిక్కిలి మనోహరమైన కావ్యము.
Seduisante adj beautiful, handsome మనోహరమైన.
Sedulous adj జాగ్రత్తగల.
Sedulously adv మిక్కిలి జాగ్రత్తగా.
sedulousness n s జాగ్రత్త.
See n s (Jurisdiction of the Pope or a Bishop) అధికారము,అనగా భిషపు యొక్క అధికారము, అధికారము చెల్లించే రాజ్యము. the pope made this rule throughout all his * that no priest should be married పాదుర్లు పెండ్లిచేసుకోకూడదని తన రాజ్యములో ఈ శాసనమును చేసినాడు.
Seed n s విత్తు, విత్తనము, విత్తనాలు. he bought * to sow చల్లడానికి విత్తనాలు కొన్నాడు. she bought *s to feed the bird ఆ పక్షికి మేతకై గింజలు కొన్నది. or offspring సంతానము. these blessingswere granted to him and to his * ఈ ఆశీర్వాదము వాడికిన్ని వాడి సంతతి వారికిన్ని చేయబడ్డది. or seminal రేతస్సు. this was the * or originof the quarrel ఆ జగడానికి ఇది కారణము, ఇది మూలము. the herbs ran to * ఆ కూరాకు విత్తనము పట్టినది, అనగా కూరకు పనికి రాదు. a seedsman విత్తనాలు అమ్మేవాడు.
Seedcake n s ఒకవిధమైన రొట్టె.
Seedcorn n s విత్తనాలు.
Seeder n s a plant that has grown old విత్తనము పట్టినచెట్టు,ముదిరి పనికిమాలిపోయిన చెట్టు.
Seed-lac n s లక్క బియ్యము.
Seedling n s a young plant just risen from the seed మొలక,a * oak లేతచెట్టు.
Seedpearl n s small pearls సన్నముత్యాలు, పొడి ముత్యాలు.
Seedplot n s నారు విడిచే మడి.
Seedtime n s విత్తేదినాలు, విత్తనము వేశే కాలము.
Seed-vessel n s ఉమక, ముట్టె, పెంకు.
Seedy adj విత్తులుపట్టిన, విత్తులుపట్టి ముదిరి చెడిపోయిన.
Seeing n s చూపు, దృష్టి, దర్శనము.
Seeing that adv గనుక, కాబట్టి. seeing that he consented అతడు వొప్పినందున.
Seeker n s వెతికేవాడు. a self * అహంకారి.
Seeking n s విచారణ, విమర్శ, వెతకడము. self * or selfishness,self interstedness స్వలాభమునకు విచారించడము, తన మేలునే విచారించడము.
Seely adj lucky, happy, silly, foolish, simple, inoffensiveసుఖజీవిగా వుండే.
Seeming n s appearance అగుపడడము, తోచడము. all his piety is mere * వాడి భక్తి అంతా వట్టి బూటకము.
Seemingly adv బయిటికి, చూపుకు. they are friends వాండ్లు చూపుకు స్నేహితులు.
Seemliness n s beauty సొంపు, సొగసు, సరసమైన. is this * ? ఇది తగునా, ఇది వొప్పునా, ఇది సరసమా.
Seen (past participle of the verb tosee) చూడబడ్డ,దృష్టమైన, they were * at her house దాని ఇంట్లో అగుపడ్డారు.
Seer n s one who sees చూచేవాడు. a prophet దీర్ఘదర్శి, జ్ఞానదృష్టిగలవాడు. In I Sam. IX 9. ప్రదర్శకుడు D+. దీర్ఘధర్శి H+.
Seerfish n s వజ్జిరమనే చేప.
Seer-fish n s read వింజిరమనే చేప.
Seesaw n s ముందుకు వెనక్కు వూగులాడడము. there is a * in thegarden ఈ కొనను వొకడు ఆ కొనను వొకడు కూర్చుండి కిందికీ పైకీ వూగేవొకమీట ఆ తోటలో ఉన్నది.
Segar, or cigar n s. or tobacco పొగచుట్ట.
Segment n s a portion ఖండము, అంశము, భాగము. a * of a circleమండలములో ఒక అంశము. the half moon is called a * of the moon అర్ద చంద్రుడు చంద్రుడిలో వొక బాగము. the moon in the first quartershows only a * of the circle : on the third day of the moon we only see a * of the moon's disk తృతియ్యనాడు చంద్రబింబములోఒకబాగము మాత్రము తెలుస్తున్నది. these books are read by a small * of the people ఈ పుస్తకము చదివేవాండ్లు కొద్దిమంది.
Segregation n s separation ఏకాంతవాసము, ఏకాంతముగా వుండడము.herding alone: keeping himself to himself, the opposite of sociability ఏకాంతవాసము, ఏకాంతవాసముగా వుండడము, ఒంటిగా వుండడము.
Seignior n s (Italian word ఙోర్ అ లోర్డ్) ప్రభువు, దొర. శేఇగ్నిఓర్, న్. స్. టదేస్ పఇడ్ ఓన్ coining money ముద్రవట్టము, ఇదిదివాణానికి చేరుతున్నది.
Seigniory n s a lordship రాజ్యము, ప్రభుత్వము, దొరతనము.
Seine n s (a great net) సముద్రములో వేశే బ్రహ్మాండమైన వల.
Seisin n s (a law word) possession యాజమాన్యము.
Seized adj పట్టుకొన్న, పట్టుకోబడ్డ, చిక్కిన, చిక్కించుకోబడ్డ. * by fever జ్వరము తగిలిన. those who are * by disease వ్యాధిగ్రస్తులు.
Seizin n s (a law word) possession యాజామాన్యము.
Seizure n s పట్టుకోవడము, after the * of the bonds ఆ పత్రములనుపట్టుకొన్న తర్వాత.
Seldom adv అరుదుగా. that fruit is * found in this country ఈ దేశములో ఆ పండు చిక్కడమరుదు. it * rains in this month ఈ నెలలోవాన కురియడ మరుదు.
Select adj ఏర్పరచిన, శ్రేష్టమైన, ముఖ్యమైన. * pearls శ్రేష్టమైనముత్యాలు. * expressions ముఖ్యమైన మాటలు, విశేషోక్తులు. * men ఘనులు.
Selected adj ఏర్పరచబడ్డ, ఘనమైన, నికరమైన, వరించబడ్డ. the horses were well * for the purpose ఆ గుర్రాలు ఆ పనికి తగుబాటివిగాచూచి యేర్పరచబడ్డవి.
Selection n s the act of choosing ఏర్పరచి యెత్తడము. in employing that man he made a very bad * అన్ని మందిలోనుంచి యేర్పరచి వొక పనికిమాలినవాణ్ని పెట్టుకొన్నాడు. in marrying her he made an excellent * వెతికి వెతికిదీన్ని పెండ్లాడినాడు, ఈ పని మంచిదే. in buyingthis you have made a foolish * వెతికి వెతికి వొకపనికిమాలిన దాన్నిపోయికొన్నావు. a * of verses ఆయా గ్రందములలోనుంచి యేర్పరచి యెత్తినదివ్యమైన శ్లోకముల గ్రంథము, ప్రసంగ రత్నావళి అనవచ్చును. without *వివేచనలేకుండా, మంచీచెడూ విచారించకుండా. he bought them అల్ల్ without* మంచీచెడు విచారించకుండా అన్నీ కొనుక్కొన్నాడు. Self, pron. is expressed by adding the emphatick ఏ; as, I నేను.I myself నేనే. He అతడు. He himself అతడే Or ai; as, He తాను. He himself తానయి. he hanged himself ఉరిబోసుకుని చచ్చినాడు. he came himself తానే వచ్చినాడు. he grieves himself about this మనసులో కుళ్లుకొంటున్నాడు. the Hindu women are modesty itself అణుకువే హిందుస్త్రీలుగా వచ్చి పుట్టినది. I am not myself to-day ఈ వేళ నాకు వొళ్లు యిదిగా వున్నది, అనగా నాకు వొళ్లు కుదురులేదు. he learned to conquer himself ఇంద్రియ నిగ్షహము చేసినాడు. he covered himself with paint వొళ్లంతా వర్ణము పూసుకొన్నాడు. he hurt himself గాయము చేసుకొన్నాడు,దేహానికి తొందర తెచ్చుకున్నాడు. he killed himself తన్ను తానే చంపుకొన్నాడు,హత్య చేసుకున్నాడు. he kept himself to himself యే జోలికీ పోక వుండినాడు.he saw himself in ట్హే glass అద్దములో తన్ను చూచుకున్నాడు. the river separates itself into two streams in this place ఆ యేరు యిక్కడ రెండుగా చీలుతున్నది. he thinks himslef handsome తానే అందగాడనుకొన్నాడు.they said among themselves, what will he do? వాడు యేమి చేయపోతాడో అని తమలో తాము అనుకొన్నారు. we among ourselves మాలో మేము. he was besidehimself చలచిత్తుడుగా వుండినాడు. this house stands by itself ఈ యిల్లుకడగా వున్నది, విశిరివేశినట్టు వున్నది. when he was by himself he counted the money తాను వొంటిగా వుండేటప్పుడు రూకలను యెంచుకొన్నాడు. he bought it for himself దాన్ని స్వంతానికి కొనుక్కొన్నాడు. హే మడే అ చోఅట్ఙోర్ హిమ్సేల్ఙ్ తనకు వొక చొక్కాయిని కోట్టుకొన్నాడు. హే ట్హిన్క్స్ ఙోర్ హిమ్సేల్ఙ్పరాపేక్ష లేకుండా తానే స్వతః ఆలోచిస్తాడు. for myself నాకైతే. in itself స్వతః, స్వయం, తనకుతానే fruit is in itself wholesome, but if raw or rotten it is pernicious పండ్లు స్వతః ఆరోగ్యకరములే గాని పండకనైనాకుళ్ళిపోయి అయినా వున్నట్టు అయితే దేహానికి విరోధము. your reading this bookis in itself a fault ఈ పుస్తకమును చదవడమే నీకు పాపము. the food in itself is good, but the butter spoils it మొదలు అన్నము మంచిదే గాని ఆ నెయ్యి దాన్ని చెరిపివేసినది. this regulation is wrong in itself ఈచట్టమే తప్పు. the law is right in itself, but your comments ruin it ఈ చట్టము స్వతః బాగానే వున్నది గాని నీవుచేసుకొన్న అర్థముచేత అది చెడిపోయినది. the verse is clear in ఇట్సేల్ఙ్, but the comment spoils it ఆ శ్లోకము స్వతః బాగానే వున్నదిగాని ఆ వ్యాఖ్యానము దాన్ని చెడగొట్టినది. the shape of the dress is in itself unimportant మొదలు వేషము యొక్క రీతే విముఖ్యము. in himself man is powerless స్వతః మనుష్యులు అశక్తులు, ఈశ్వర సహాయము లేకుంటే యేదీ చేయలేరేని భావము. vile in itself the monkeyspoils the grove తా చెడ్డ కోతి వనమెల్లా చెరుచును. it fell of itselfతనకు తానే పడ్డది. it broke of itself తనకు తానే పగిలినది. he came of himself తనకు తానే వచ్చినాఢు, ఒకరి ప్రేరపణ లేకుండా తనకు తానే వచ్చినాడు. when he came to himself వాడికి తిక్క తెలిశిన తర్వాత వాడికి తెలివి వచ్చినతర్వాత. he read the letter to himself ఆ జాబును చదువుకున్నాడు. * abasement అతి దీనత్వము. * admiration, * conceit, * consequence, all of them denote pride అహంకారము. * praise ఆత్మస్తుతి.* command స్తిరబుద్ధి. * control జితేంద్రియత్వము, ధైర్యము. * confidence ధైర్యము. * contradiction తాను చెప్పినదానికి విరుద్ధముగా చెప్పడము. * dedication ఆత్మార్పణము, ప్రాణదానము. * delusion భ్రమ, మాయ. * deception భ్రమ. he exercised * denial ఇంద్రియ నిగ్రహము చేసినాడు. * denying వైరాగ్యముగా వుండే. * denial వైరాగ్యము. * devotion తన ప్రాణమును యివ్వడము.* driven తనకు తానే యెగిరిన. * evident ప్రత్యక్షమైన, స్పష్టమైణ. * existent స్వయంభువుగా వుండే. * importance అహంకారము. * indulgence విషయలోలుపత, పంచేంద్రియ బద్ధత్వము. * knowledge ఆత్మజ్ఞానము. * mortification తపస్సు. * murder ఆత్మహత్య. * muderer తన్ను తానే చంపుకొన్నపాపి. * pollution తన్ను తానే ఇంద్రియ స్ఖలనమయ్యేటట్టు చేసుకోవడము, ముష్టి మైదునము. * possession నిబ్బరముగా వుండడము, చలించకుండా వుండడము. * reproach ఆత్మదూషణ. it is the * same thing ఇది అదే, ఇది యెంతో అది అంతే. these two books are the work of the * same poet ఈ రెండు కావ్యములు చెప్పినది ఒకడే. on the * same day ఆ దినమందే. the * same horse అదే గుర్రము. * seeking అహంకారము. * sufficiency అహంకారము.* will దుడుకు దౌష్ట్యము, అహంకారము. * willed దుడుకైన, గురువులేక తానే నేర్చుకొన్న. In James Ferguson's biography of himself he says of Cautley `He was what is generally called selftaught: but I think he might with much more propriety have been termed God Almighty's scholar సాక్షాదీశ్వరునివల్ల నేర్పబడ్డవాడు.
Self-acting adj తనకు తానే తిరిగే, తనకు తానే ఆడే. A self-actingspinning wheel తనకు తానే వడికే రాట్నము.
Self-command n s నిబ్బరము, ధైర్యము. he has great * జితేంద్రియుడు,వాడు యెందుకు చలంచేవాడు కాడు.
Selfish adj స్వసుఖమునే విచారించే, స్వకార్య ధురంధరుడైన, పరులసుఖమును విచారించని. he is * స్వసుఖమునే విచారించేవాడు, తనమేలే మేలనేవాడు. a * man పరుల సుఖమను యెంతమాత్రము విచారించనివాడు,స్వార్థ పరాయణుడు.
Selfishly adv with regard only to హిస్ own interst, withoutlove of others స్వ సుఖమునే విచారించి పరుల సుఖమును విచారించక.he * ate all the fruit himself కేవలము తన సుఖమును విచారించిఆ పండ్లనంతా తానే తిన్నాడు. he acted * in this business ఈ పనిలోపరుల సుఖమును విచారించకుండా స్వసుఖమునే విచారించినాడు.
Selfishness n s స్వకార్య ధరుంధరత్వము, తన మేలునే చూచుకోవడము.
Self-moving (as a title of the deity) స్వయంభువు
Self-righteous adj అహంకారియైన, గర్వియైన.
Self-righteousness n s అహంకారము, గర్వము.
Self-working adj స్వతంత్రులైన.
Seller n s విక్రయించేవాడు. a book * పుస్తకాలమ్మేవాడు. a cloth * బట్టలమ్మేవాడు, బట్టల వర్తకుడు.
Selling n s విక్రయించడము, అమ్మకము. * and buying క్రయవిక్రయములు,అమ్మడము, కొనడము.
Selvage, Selvedge n s. బద్దె.
Selves the plural of Self
Semaphore n s a light house రాతి దీప స్థంభము అనగా వాడలోవచ్చేవాండ్లకు గురుతు తెలియడమునకై ఎత్తుగా కట్టిన దీపములగ రాతి స్థంభము. to * (to మకే signs) పగట్లో ఆ రాతి దీపపు గూటిచుట్టూవుండే కమ్ములను సంకేత ప్రకారముగా తిప్పడముచేత సంజ్ఞలు చేసుట.
Semblance n s పోలిక, ఆకారము, రూపము. under the * of friendshipస్నేహమనే వేషము వేసుకొని. there was not even the * of a replyప్రత్యుత్తరమనే పొళుకువ లేదు.
Semen n s రేతస్సు, వీర్యము, శుక్లము.
Semi adj అర్ధమైన. * barbarous అర్ధకిరాతుకులైన, కిరాత ప్రాయులైన,బోయవాండ్ల రీతిగా వుండే, * human, మనుష్యప్రాయుడైన.
Semicircle n s అర్ధమండలము, అర్ధచంద్రాకృతి.
Semicircular adj అర్థచంద్రాకారముగా వుండే, అర్ధమండలాకారముగా వుండే.
Semicolon n s చదవడములో నాలుగు నిముషములు నిలిపేదనే (;) ఇటువంటిసంజ్ఞ.
Semilunar adj అర్ధ చంద్రాకారమైన.
Semimetal n s half metal, imperfect metal లోహప్రాయముగా ఉండే సత్తుతుత్తినాగము మొదలైనది.
Seminal adj వీర్యసంబంధమైన. the * vesels కళాస్థానములు. the * fluid రేతస్సు.
Seminary n s seed-plot నారు విడిచే మడి. place of education బడి.
Semination n s విత్తడము.
Semitone n s. అర్ధస్వనము. శేమిట్రన్స్పరేన్ట్, adj. అరవాసి తేటగావుండే, glass is transparent butpaper is * అద్దములో గుండా చూస్తే స్వచ్చముగా కనబడుతన్నది, కాగితములో గుండా చూస్తే దానిలో సగంవాసి తెలుస్తున్నది.
Semivowel n s a consonant which makes an imperfect sound, ordoes not demand a total occulsion of the mouth B. P. మొదలైన అర్ధస్వనము గల హల్లు.
Sempstress, Semstress n s. బట్టలు కుట్టి బ్రతికే ఆడది.
Sempt ternal adj Eternal.
Sen adv that is Senior.
Senate v s ఆలోచన సభ, a member of the * సభికుడు. ఆలోచన సభలోవొకడు.
Senator n s a member of the senate ఆలోచనా సభవారిలో వొకడు.when the senateme, సభ కూడినప్పుడు.
Sen-board n s the coast సముద్రతీరము. those who dwell in sea-board towns సముద్ర తీరపు పట్టణములలో వుండే వాండ్లు.
Sender n s పంపేవాడు.
Sending n s అంపకము, అంపడము, పంపడము.,
Seneschal n s or manager కార్యనిర్వహకుడు.
Seneselessness n s తెలివిమాలినతనము, అవివేకము, బుద్ధిలేమి.
Senility n s వృద్ధాప్యము. when he fell into * ముసలివాడైనప్పుడు.
Senior n s పెద్దవాడు. the *s in a school పల్లెకూటములోపెద్దవాండ్లుగా వుండే వాండ్లు.
Seniority n s (in birth) జ్యేష్ఠత్వము. in rank పెత్తనము,పెద్దరికము.
Senna n s నేల తంగేడు ఆకు, దీన్ని బేదికియిచ్చే కషాయములో వేస్తారు.
Sennight adv వారందినాలకు. Satuarday * వచ్చే శనివారముగాక అవతలి శనివారము, పోయిన శనివారము గాకు అంతకు ముందు శనివారము. he arrived here Thursday * పోయిన గురువారము గాక అంతకు ముందు గురువారము వచ్చి చేరినాడు. If mention is made, on Monday, of Thursday sennight,the Thursday that follows the next Thursday, is meant (Johnson).
Sensation n s తెలివి, తోచడము, స్మరణ, స్మారకము. the hand when torpid has no * చెయి తిమురుపట్టినప్పుడు గిల్లితే తెలియదు. he was so ill that he had no * remaining వాడు స్మరణ లేకుండాపడి వుండినాడు. a * of grief కొంచెము వ్యాకులము తెలియడము. a * of hunger ఆకలి తెలియడము. a * of pleasure రవంత సంతోషము తెలియడము. his departure made a great * in the village వాడువెళ్లడము వల్ల ఊరంతా నిండా దెబగుబలుగా వుండినది.
Sense n s ఇంద్రియము, జ్ఞానము, తెలివి, బుద్ధి. the * of hearingశ్రోత్రేంద్రియము, వినడము. the * of seeing దృగింద్రియము, చూడడము. the five *s పంచేంద్రియములు. he denied the *s ఇంద్రియ నిగ్రహము చేసినాడు.he lost his *s వానికి తెలివితప్పినది, స్మారకము తప్పినది, వాడికి వొళ్లుతెలియలేదు. when he recovered his *s వాడికి మళ్లీ స్మారకము వచ్చేటప్పటికి. he is out of his *s వాడికి స్మారకము తప్పినది, తెలివి తప్పినది. an object of * విషయము, అనగా ఇంద్రియ గోచరమైనది.the organs of * ఇంద్రియములు. a pleasant odour saluted his *s మంచివాసన కొట్టినది. Meaning అర్థము. what is the * of this wordఈ మాట యొక్క అర్థమేమి. I took the words in another * ఆ మాటలకునేను వేరే భావము చేసుకొన్నాను. the literal * శబ్దార్ధము, సామాన్యమైనఅర్ధము. the spiritual * విశేషార్థము. in every * అన్ని విధాలా. in some*s కొన్ని విషయములందు. purport, bearing భావము. is that the right * of the law? ఆ చట్టము యొక్క భావము యిదేనా. he was a poet in the highest * of the word కవి అంటే వాడే. a man of * బుద్ధిమంతుడు, వివేకి.have you no * of shame? నీకు ఇంచుకైనా శిగ్గులేదా. a man of good * సద్భుద్ది గల వాడు. he had the good * to pay the money తెలివిగలవాడైఆ రూకలను చెల్లించినాడు. common *+ వివేకము.
Senseless adj without perception తెలివిలేని, వివేకములేని. wanting life అచేతనమైన. wood and stone other * things కొయ్యరాయి మొదలైనఅచేతనములు. * things అచేతనమైన వస్తువులు. why should you beat the table while it is *? బల్లను కొట్టితే దానికి నొప్పి కద్దా, దాన్ని యేల కొట్టుతావు. a corpse is * పీనుగకు వొకటీ తెలియదు. a * judge బుద్ధి విహిహీనుడైన న్యాయాధిపతి, అవివేకియైన న్యాయాధిపతి. silly పిచ్చి. stupid స్మారకము తప్పిన. he was drunk and they carried him away while he was * వాడు తాగి వొళ్లు తెలియకుండా పడివుండగా వాణ్ని ఎత్తుకొని పోయినారు. this is a * rule ఇది తెలివిమాలిన సూత్రము. a * fool తెలివిమాలిన పిచ్చిగాడు. this is a * reason యిది వొక పిచ్చి సమాధానము.this is a * custom యిది వొక పిచ్చివాడుక. a * letter పిచ్చిజాబు.
Senselessly adv అవివేకముగా, పిచ్చిగా, తెలివిమాలి.
Sensibility n s kindness, feeling, tenderness, mercy దయారసముకరుణ. a woman of great * నిండా మెత్తని మనసుగలది, అనగా రవంతలో సంతోషపడి రవంతలో వ్యాకులపడే గుణము గలది. the heel has little * ఏమి చేసినా మడిమెకు నొప్పి తెలియదు.
Sensible adj having understanding, తెలివిగల, వివేకముగల. a * man తెలివిగలవాడు, వివేకి, జ్ఞాని. he is a * boy వాడు తెలివిగల పిల్లకాయ, వాడు బుద్ధిశాలి. having feeling గోచరమైన, యింద్రియములకు గ్రాహ్యమైన. he was so ill that his skin was not * వాడికి వుండిన రోగము వాడి వొంటిమీద ఏమి తాకినా వాడికి తెలియలేదు. I am very * ofyour kindness తమరు చేసినవుపకారము నాకు బాగా తెలిశి వున్నది. living bodies are * of pain; the dead are not సజీవిగా వుండే వాడికి నొప్పి తెలుస్తున్నది పీనుగకు తెలియదు. perceptible; as, the difference is * to the eye ఈ భేదము కండ్లకు అగుపడేటిదిగా వున్నది. దృష్టి గోచరముగా వున్నది. there is no * difference between these two ఈ రెంటికి వుంఅడే భేదము తెలుసుకోతగ్గది కాదు. his pulse is not now * వాడికి ధాతువు ఇప్పుడు అణిగి పోయినది, తెలియలేదు. he is * of his error వాడి తప్పువాడికి తెలిశివున్నది. are you * of any difference these between two? ఈ రెంటిలో భేదము కద్దని నీకేమైనా తెలుస్తున్నదా. * peril ముఖ్యమైన అపాయము. Sensibly, adv. with discrimination వివేకముగా, తెలివిగా. he spoke * about this ఇందున గురించి తెలివిగా మాట్లాడినాడు. (as meaning) evidentlyస్పష్టముగా this is * the largest యిది స్పష్టముగా దానికంటే పెద్దది. he was * affected at these words ఈ మాటలకు నిండా అఘోరించినాడు. I was * obliged to him వాడికి నేను నిండా బద్ధుడనైవున్నాను. Doddr. Comm. 2. 303.
Sensitive adj having quick feeling నొప్పితెలిసే, నిండా సున్నితమైన,కంచుపదునుగా ఉండే. she is very * అది నిండా సున్నితమైనది, రవంతహెచ్చునూ కూడదు తగ్గనూకూడదు. the eye is very * కంటికి యెంతకొంచెము తొందర తగిలినా వోర్చదు. a cow 's horn is not * ఆవుల కొమ్ముకు నొప్పి తెలియదు. you should not be so * కాస్తకుకూస్తకునీవు రేగురాదు. they are not very * regarding conjugal infidelityవాండ్లు వ్యభిచారమును అంతగా విచారించే వాండ్లు కారు. the * pant అత్తపత్తి చెట్టు.
Sensitiveness n s సున్నితము, కంచుపదును. from his great * regarding honour వాడిది మహా కంచుపదును మర్యాదలో కొంచమైనా హెచ్చుతగ్గులు రాకూడదు గనుక. he should not show over * regarding his wife's behavaviour పెండ్లాముమీద వాడు కాస్తకుకూస్తకు రేగరాదు.
Sensory, or Sensorium n s. the mind, the memory మనసు, జ్ఞానేంద్రియము, బుద్ధి. Rambler, 78. p. 1.
Sensual adj విషయాశక్తిగల, ఇంద్రియదోష సంబందమైన, ఇంద్రియ సుఖాసక్తమైన శారీరక, పంచేంద్రియ పరితోషకమైన, కామాతురుమైన. a * man పంచేంద్రియ బద్ధుడు. a * man పంచేంద్రియ బద్ధుడు, కాముకుడు. * appetite, విషయేచ్ఛ, కామము, ఇంద్రియ వ్యాపారము. * pleasures విషయ సుఖములు. in James III. 15. శారీరకం A+ in Jude 19. సాంసారిక. A+.
Sensualist n s పంచేంద్రియ బద్ధుడు, కాముకుడు, విషయాసక్తుడు.
Sensuality n s విషయాసక్తి, కామము, ఇంద్రియ వ్యాపారము, లాంపట్యము,శారీరక సుఖాభిలాష, ఐహిక సుఖబోధేచ్ఛ.
Sensually adv విషయాసక్తిగా, కాముకత్వముగా, శారీరక సుఖాభిలాషగా.
Sent past participle of the verb tosend పంపబడ్డ,he who is * ప్రేరితుడు, పంపబడ్డ వాడు.
Sentence n s a judgment pronounced చెప్పినతీర్పు. the * wasreversed ఆ తీర్పు మార్చబడ్డది. a period in writing వాక్యము. ఇన్ this* there are ten words ఈ వాక్యములో పదిశబ్దములున్నవి. a maxim సూత్రము, విధి.
Sententiouness n s నూటికి వొకమాటగా చెప్పడము. from his * I saw he was very proud వాడు నూటికి వొకమాట చెప్పడమువల్ల వాడు గర్వియని కనుక్కొన్నాను.
Sententious adj short and పిట్హ్య్ energetic సంక్షిప్తమైన, సంగ్రహముగా చెప్పబడ్డ. he is very * వాడు నూరు మాటలకు వొక మాట చెప్పుతాడు.
Sententiously adv with striking brevity మిక్కిలి సంగ్రహముగా.
Sentient adj having the faculty ఓఙ్ perception జ్ఞానముగల, తెలివిగల,వివేకముగల. తోర్మ్స్ అరే ట్హే లోతేస్ట్ ఓఙ్ * చ్రేఅటురేస్ జ్ఞానముగల జంతువులలోపురుగులు నిండా అధమైనవి.
Sentiment n s భావము, అభిప్రాయము, తాత్పర్యము. *s of friendshipస్నేహభావము. or love మోహము. Modern wirter use it for delicacyor respectful love. Thus "in her intercourse and ultimate union with him there was passion, but not sentiment; for how could sentiment exist where trust as property were vioalted?" Sheridan Knowledge Fortescue, Chap. XLII.
Sentimental adj భావగర్భితమైన, కరుణాదిరసముగల, శృంగారభావముగల. the journey శృంగారయాత్ర, యిది వొక గ్రంధము పేరు.
Sentimentalist n s విరహి.
Sentimentality n s విరహభావము, శృంగార భావము.
Sentinel, or Sentry n s. కావలివాడు, పారావాడు, ద్వారపాలకుడు.I stood sentry for three hours నేను మూడు గంటలు పారా యిస్తిని.
Separable adj ప్రత్యేకము చేయగూడిన, విడతియ్యగూడిన. the word and its meaning are not * శబ్దము అర్థము వొకనాటికీ వీడేదికాదు. భిన్నమయ్యేదికాదు.
Separate adj ప్రత్యేకమైన, వేరైన, భిన్నమైన, పృథక్కైన. the nameis the same but the two families are * పేరు వొకటేగాని వంశములువేరు. keep this * దీన్ని వేరేపెట్టు, ప్రత్యేకముగా పెట్టు. he kept the witness * ఆ సాక్షులను వేరేవేరే పెట్టినాడు, ప్రత్యేకముగా వుంచినాడు.
Separated adj వేరుపోయిన, ప్రత్యేకబడ్డ, విభజించబడ్డ, విభాగించబడ్డ.a * family వేరుబోయిన వాండ్లు, విభాగాలైనవాండ్లు, పృథగ్భాండాశనులుగా వుండే వాండ్లు.
Separately adv పృథక్కుగా, భిన్నముగా, వేరేవేరే. he questioned allthe servants * పనివాండ్లనంతా వేరేవేరే అడిగినాడు.
Separation n s విభజనము, విభాగము, ప్రత్యేకము కావడము, ఎడబాయడము,ఎడబాపడము. the * of the hair on the forhead పాపట, సీమంతము. the * of a monk సన్యాసవృత్తి, they live in * వేరేవేరే వున్నారు, ప్రత్యేకముగా వున్నారు. * of lovers వియోగము, విరహము.
Sepoy n s (an Indian word for a native soldier) సిపాయివాడు.
Sept n s at dice సత.
September n s తొమ్మిదోనెల.
Septennial adj ఏడేండ్లు జరిగే. * parliament ఏడేండ్ల దాకా కూడివుండే మహాసభ.
Septentrional adj northern.
Septuagenarian n s డెబ్భైఏండ్లవాడు.
Septuagint n s బైబిలు యొక్క ప్రాచీన భాషాంతరము.
Sepulchral adj సమాధిసంబంధమైన. he spoke in a * tone of voiceచావు గొంతుతో మాట్లాడినాడు. * rites ఉత్తర క్రియలు.
Sepulchre n s సమాది, పాతేగొయ్యి, శవమందిరము.
Sepulture n s burying సమాధిలో పెట్టడము, గోయిలో పెట్టడము.
Sequel n s శేషము, శేషభావము, కడమకథ. in ట్హే * కడాపట,తుదను, తర్వాత. you will see what happened in the * తుదకుయేమైనదో నీకు తెలుస్తున్నది. in the * he really bought the houseతుదకు వాడు ఆ యింటిని కొన్నాడు.
Sequence n s క్రమము, అనుక్రమము, పరంపర.
Sequestered adj hidden, separate, concealed దాచిన, దాగిన.యేకాంతముగా వుండే. in a * village యేకాంతముగా వుండే వూళ్లో. a * spot రహస్యమైన స్థలము, నిర్జన ప్రదేశము.
Sequestration n s a separation or setting apart ప్రత్యేకముగావుంచడము, వేరే పెట్టడము. the act of seizing ఆక్రమించుకోవడము,జప్తీచేయడము. after the * of ట్హే estate ఆ సొత్తును గుంజుకొన్న తర్వాత, ఆ యాస్తిని జప్తీ చేసుకొన్న తర్వాత.
Sequestred adj hidden, separate, concealed దాచిన, దాగిన,ఏకాంతముగా వుండే. in a * village ఏకాంతముగా వుండే వూళ్లో, a * spot రహస్యమైన స్థలము, నిర్జన ప్రదేశము. he was * from parliament, i. e. dismissed, put aside removed తోశివేయబడ్డాడు.
Sequin n s a certain gold coin వొక బంగారు నాణెము. thisis usually called chicken; it is worth form Rs. 3-12-0 to Rs. 4-4-0.
Seraglio n s అంతఃపురము, రాణివాసము, రాణివాసపు స్త్రీలు. an expression in history for the council of Turkey తురకల సభ.
Seraph n s దేవదూత.
Seraphic adj దివ్యమైన.
Seraphim, seraphin n s. దేవదూతలలో భేదము.
Sere adj dry as a leaf &c. యెండిపోయిన, శుష్కించిన.
Serenade n s "A musical performance at night by a loverto his mistress" రాత్రికాలమందు నాయకుడు నాయకి వినడమునకై వాద్యమును వాయించడము.
Serene adj నిర్మలమైన, ప్రసన్నమైన, తిన్నని. his countenancewas * వాడి ముఖము శాంతముగా వుండినది, సౌమ్యముగా వుండినది.
Serenely adv శాంతముగా, నిమ్మళముగా.
Serenity. n. s. calmness శాంతము, నిమ్మళము,నైర్మల్యము,నెమ్మది
Serf n s a slave దాసుడు, కింకరుడు, కమతగాడు, మాలవాడు.
Serge n s a kind of woolen cloth వొక విధమైన సెకలాతు,దీన్ని శార్జి అంటారు.
Sergeant n s in the army హవల్దారుడు. a servant, దండులోపదిమంది సోజర్లకు పెద్దగా వుండేవాడు. (in the courts) a bailiffతలారి, బంట్రోతు. or Lawyer లాయరు, వకీలు. or Judge న్యాయాధిపతి,ధర్మాధిపతి.
Series n s క్రమము, వరస, సరణి. he went through a * ofmisfortunes వాడు నానా కడగండ్లు పడ్డాడు. in unbroken * దండాయమానముగా.
Serious adj important ముఖ్యమైన. solemn పెద్దమనిషిగా వుండే.a * person భక్తుడు. she is not at all * అది భక్తురాలు కాదు.grave గంభీరమైన. he looked very * వాడు మూతి ముడుచుకోని వుండినాడు. when the disease assumed a * aspect రోగము ముదిరినప్పుడు, ముమ్మరించినప్పుడు. a * matter ముఖ్యమైన పని. earnest అతి ధృడమైన.are you * ? యిది నవ్వే మాటకాదు గదా. * impressions భక్తి, విశ్వాసము.to be * you must pay the money నవ్వులు కట్టిపెట్టి రూకలనుచెల్లించవలసినది. Seriously, adv. ముఖ్యముగా. she was * inclined అది భక్తురాలుగా వుండెను.she was * inclined to marry him వాణ్ని పెండ్లాడ వలెనని దానికి ముఖ్యముగా వుండినది. this terminated * ఇది నిండా ప్రమాదమైనది. this did not terminate * ఇది నిండా ప్రమాధము కాలేదు.
Seriousness n s ముఖ్యము, గంభీరము. from the * of the chargeఇది ముఖ్యమైన ఫిర్యాదు గనుక. from his * అతడు గంభీరముగా వుండినందున.
Seritude n s దాసత్వము, దాస్యము.
Sermon n s a discourse, on a religious subject ప్రసంగము,మత విషయమైన ప్రసంగము, జ్ఞానోపదేశము.
Serous adj రస సంబంధమైన. See Serum.
Serpent n s పాము, సర్పము. a fiery * నాగుపాము, కాలకూటము. a deceiver కపటి, మోసగాడు. a kind of firework తారాజువ్వలు, ఇది వొకవిధమైన ఆకాశ భాణములు. or trumpet వొక విధమైన బూరగ.
Serpentine adj winding like a serpent పామువలె వంకరవంకరగావుండే.
Serpigo n s a kind of itch ఒక విదమైన గజ్జి.
Serrated adj jagged like a saw రంపమువలె వుండే, రంపమువలెపండ్లు పండ్లుగా వుండే. the Margosa leaf is * వేపాకు అంచులు రంపమువలె పండ్లుపండ్లుగా వుంటున్నది.
Serried adj దట్టముగా వుండే,
Serum n s juice రసము.
Serval n s a kind of wild cat జంగుపిల్లి.
Servant n s శేవకుడు, భృత్యుడు, దాసుడు, పనివాడు. a female *బానిసె పనికత్తె దాసి. a * girl బానిసె. meaning a kiing's minister మంత్రి. a * of God భగవద్దాసుడు. an eye * యజమానుడు ఎదుట లేనప్పుడు అక్కరగా పాటు పడనివాడు. your * sir నీకు వొకదండము అంతమట్టుకు చాలును పో.
Serviceable adj ఉపయోగమైన, పనికివచ్చే, ఫలకరమైన.
Serviceableness n s ఉపయోగము, ఫలము, ప్రయోజనము.
Servile adj దాసుడైన, నీచుడైన. the * classes దాసులు, నీచులు.
Servilely adv basely, అతి నీచముగా, దాస్యముగా.
Servility n s దాసత్వము, అతి నీచత్వము.
Serving n s వడ్డన.
Servitor n s శిష్యుడు.
Sesamum n s నువ్వులు, తిలలు. * flour నూబిండి. * seed నువ్వులు.* oil మంచినూనె.
Sesquipedalian adj very long అతిదీర్ఘుడైన.
Session, or Sessions n s. సభ. the * took place lastweek పోయిన వారములో దొంగల విచారణను గురించి న్యాయాధిపతులు కూడినారు. while the gods sat in * దేవతలు సభకూడినప్పుడు.
Set part adj. ఉంచబడ్డ, పెట్టబడ్డ, నాఠబడ్డ, చెక్కిన. the fruit is * పిందెపట్టినది. his eyes are * i. e. in death వాడికి నిలువుగుడ్లు పడ్డవి. a regulation that is * aside తోసివేయబడ్డ చట్టము. rubies * in gold కుందనముతో చెక్కిన కెంపులు. spectacles that are * in gold బంగారుతో కట్టిన ముక్కద్ధము. a post * in the earth నేలపాతిన స్థంభము.her mind is * upon going there అక్కడికి పోవలెనని మనసులో నిశ్చయముచేసుకోన్నది. a city * upon a hill కొండమిద కట్టిన వూరు.
Set off or equivalent n s as a compensation ఈడు, బదులు,చెల్లు. he took the house at high price, but as a set off,he got the garden for nothing ఆ ఇంటిని అధిక వెలపెట్టి కొన్నాడు, అయితే దానికి చెల్లుగా ఆ తోట వాడికి వూరికే వచ్చినది. he is very learned but as a set off this he is very proud వాడు నిండా విద్వాంసుడు, అయితే దీనికి ప్రతివాడు నిండా గర్వి.
Seton n s కారపువత్తి.
Settee n s a couch కౌచీ.
Setter n s a kind of dog ఒక విధమైన కుక్క.
Setting n s అస్తమానము, పొద్దుగూకడము. the * of a gem చెక్కడము.జవ. the price of spectacles depends on the * ముక్కద్దము యొక్క వెల కట్టడములో వున్నది. the * in of the rain వర్షాకాలము ఆరంభము కావడము. I was there at their * off వాండ్లు బయిలుదేరేటప్పుడు నేను వుంటిని. a * or young plant నారు. the * of this current is northwards యీ ప్రవాహము ఉత్తరముగా పారుతున్నది.
Settle n s a seat, ఆసనము. he sat down upon the * తిన్నెమీదకూర్చున్నాడు.
Settled adj తీరిన, పరిష్కారమైన, కుదిరిన. we will consider this *యిది పరిష్కారమైనదని అనవచ్చును. he has no * habitation వాడికి నిలకడగావొక ఇల్లు లేదు. a * handwiriting కుదిరిన అక్షరము. this is my * opinionయిదే నాకు రూఢిగా ఉండే భావము. a * district శాశ్వత బేరీజు యేర్పరచబడ్డదేశము.
Settlement n s తీర్పు, పరిష్కారము. after the * of this businessఈ వ్యవహారము తీరిన తర్వాత. a marriage * మొగుడు చనిపోయిన తర్వాత,పెండ్లానికి యీ యీ సొత్తు చేరవలసినదని పెండ్లిలో చేసే నిర్ణయము. or town as the * of Madras చెన్నపట్టణమువంటి పట్టణము. after theestablishment of our *s మేము అక్కడ పోయి చేరి వూళ్లు కట్టుకొన్న తర్వాత. revenue * of a district జమాబంది.
Settler n s a foreigner కొత్తగా వచ్చి చేరినవాడు. a decisionతీర్పు, పరిష్కారము, ఇది నీచమాట.
Seven n s ఏడు, ఆరునొక్కటి.
Sevenfold adj ఏడింతలు. as an adverb ఏడింతలుగా.
Sevennight n s a week వారం దినాలు.
Seventeen adj పదిహేడు.
English to Telugu free online dictionary
Enter English word and know Telugu meaning
No comments:
Post a Comment