Monday, February 7, 2011

Smut English to Telugu free online dictionary

Smut n s dirt మురికి, బూజు, మసి. in corn పంటకు తగిలే కాటుక.or obscenity బూతులు, పోకిరిమాటలు.
Smutted adj మురికియైన.
Smuttiness n s dirtiness మురికి. obscenity పోకిరి తనము, కొంటెతనము.
Smutty adj dirty మురికియైన, obscene కొంటె, పోకిరి.
Snack n s a share భాగము. a little food రవంత భోజనము, ఫలహారము. I went *s with him చిక్కినదాన్ని చేరిసగము పంచుకొన్నాము.
Snaffle n s నీళ్లకళ్ళెము.
Snag n s ఒంటిగా వుండే పల్లు. or tooth (in contempt) పండ్లకు యెగతాళి పేరు. the part that sticks విరిగి మిట్టగా నిల్చేటిది.
Snail n s బంక పురుగు, గుల్ల పురుగు, నత్తగుల్ల, రెండు కొమ్మలున్ను పైన గుల్లయున్న గలిగి గోడలమీద పాకే జంతువు. he went on at a *'s paceతారాడుతూ పోయినాడు. సోమరితనముగా పోయినాడు.
Snake n s పాము; సర్పము. the * called boa కొండచిలువ. the rock * కొండ చిలువ, కొండ పలుగు పాము. the cobra de capello; the male of thisis called జెర్రిపోతు, సారెపాము. the female is మంచిపాము, తాచుపాము, నాగుపాము. the water * నీళ్లపాము, నీరుకట్టె, వాన కోవిల. * doctor పాములవాడు. the * pipe పాము నాగసరము. A *'s skin when cast off కుబుసము. a hooka * హుక్కా తాగే నాళము, తీగె.
Snake-gourd n s పొట్లకాయ. Ainslie. 2. 391.
Snaky adj పామువలె వుండే, పాము సంబంధమైన. To Snap, v. a. to break at once ఫెళక్కుమనివిరుచుట, పుటుక్కుమని తెంచుట. he snapped the rope ఆ దారమును పుటుక్కుమని తెంచినాడు. she snapped her knuckels at him వాణ్ని చూచి మెటికలు విరిచినది. he snapped the lock.చటక్కని బీగము వేసినాడు. to * up లంకించుకొనుట. the dog snapped up thebone and ran away ఆ కుక్క యెముకను లంకించుకొని పారిపోయినది.
Snap n s an attempt to catch కరవ బోవడము, కరవరావడము. the dog made a * at me ఆ కుక్క నన్ను కరవవచ్చినది.
Snapdragon n s ఒక విధమైన పిల్లకాయల ఆట.
Snappish adj cross, peevish మండిపడే. when a man is in a fever he often is * జ్వరము వచ్చినప్పుడు మనిషికి చీదరగా వుంటున్నది.
Snappishly adv peevishly మండిపడుతూ, చీదరపడుతూ, మంటగా.
Snappishness n s చీదర, మంట, అసహ్యము.
Snare n s to catch an animal with వల పుచ్చు, బోను, ఉపాయము, యుక్తి, వాగురా, మృగబంధినీ. they set a * for the tiger పులిని పట్టడానికి ఒక బోను పెట్టినారు. youth is surrounded by *s యౌవనమునకు యెటు చూచినాగండముగా వున్నది, సంకటముగా వున్నది. they laid a * to ruin him వాణ్ని చెరపడానకువొక యుక్తి పన్నినారు. he fell into her *s దాన్ని మోసములో చిక్కుపడ్డాడు.
Snared adj వలలో చిక్కిన, మాయలోబడ్డ.
Snarler n s రేగేవాడు, చిరచిరలాడేవాడు, మండిపడేవాడు.
Snarling n s చిరచిర, మంట, ఆగ్రహము.
Snatch n s a hasty catch లటుక్కున పెరుక్కోవడము.
Snatcher n s పెరుక్కొనేవాడు, దొంగ.
Sneak n s a mean wretch పిరికి, పంద, దొంగ.
Sneaker a large bowl బోగోణి,బోగిణి,డబర
Sneaking adj base, mean నీచమైన, క్షుద్రమైన. * tricks కయుక్తులు.
Sneakingly adv basely, meanly నీచముగా, అల్పముగా.
Sneer n s ఎగతాళి, అపహాస్యము. a covert * నోరు మాట్లాడడము,నొసలు వెక్కిరించడము.
Sneerer n s నసికేవాడు, వెక్కిరించేవాడు.
Sneering n s నసకడము, వెక్కిరించడము.
Sneeze n s తుమ్ము.
Snip n s కత్తిరించినది, తునక, తుండు.
Snipe n s ముక్కు, పురుడిపిట్ట, ఉల్లంకిపిట్ట, ఉల్లాం, కసవుకోడి,యేల్చె, బొగ్గేల్చె, ముక్కిడి. These names are used in various partsof the country and perhaps belong to birds of diferent kinds.There are nine species described as Indian birds. The Hindusataniname పన్మరి panmari, and the English word, pronounced snuff or Isnap,is in general use. The painted snipe కసవుకోడి, కసవుగువ్వ. Ainslie 1.393. Jerdon's Catalogue.
Snip-snap n s tart dialogue తిట్లు, తిమ్ములు.
Snivel n s the running of the nose చీమిడి.
Sniveller n s నీలి యేడుపుల యేడ్చేవాడు.
Snob n s a contemptible wretch పనికిమాలిన గొడ్డు.
Snooze n s (a dutch word) spelt Sundge by Johnson నిద్ర,ఇది నీచమాట.
Snore n s గురక.
Snort n s బుస, హుంకారము.
Snot n s the ooze of the nose చీమిడి.
Snottiness n s చీమిడిగా వుండడము.
Snotty adj చీమిడిగా వుండే. * nosed చీమిడికారే ముక్కుగల.
Snout n s the nose of a pig or beast పందిముక్కు, పోత్రము,ముట్టె, బర్రెముక్కు. the nose of a man (in contempt) మూతి, ఇది తిరస్కారమైన శబ్దము.
Snouted adj మూతిగల, ముట్టెగల. a long * boar నిడువుమూతిగల పంది.
Snow n s మంచు, హిమము. white as * హిమధావళ్యమైన, మిక్కిలీ తెల్లని.
Snow-ball n s మంచుగడ్డ. as it went along, the crowd gathered weight like a * ఆ గుంపు పోతూవుండగా దోవలో వాండ్లు వీండ్లు చేరి బ్రహ్మాండమైన గుంపైనది. సీమలో మంచుగడ్డను పేరి వండే మంచుమీద రువ్వితే ఆ గడ్డపోతూ వుండగా కిందిమంచు అంటుకొని మరీమరీ పెద్దది అవుతున్నది గనక ఆ దృష్టాంతమునుపట్టి యీ ప్రయోగమువచ్చినది. It goes on increasing like a * in snow (Duke of Willington's Despatches June 1800) మంచులో మంచు గడ్డ వలెనే క్రమేణాఅభివృద్ధి అయినది.
Snow-broth n s మంచునీళ్ళు, మంచుగడ్డ కరిగిన నీళ్ళు, అతి సీతలమైననీళ్ళను గురించినమాట.
Snow-drop n s a kind of flower ఒక విధమైన తేల్లని అడవిపుష్పము.
Snow-white adj అతి ధావళ్యమైన.
Snowy adj మంచుగా వుండే. a * night బహుమంచుగా వుండే రాత్రి. *weather మంచుకాలము.pure, white అతి ధావళ్యమైన. her * arms దాని తెల్లటి భుజములు. a * robe శుభ్రవస్త్రము, అతి ధావళ్యమైన వస్త్రము.
Snub n s rebuff, rebuke చీవాట్లు, గద్దింపులు. a * nose చప్పిడి ముక్కు.
Snub-nosed adj చప్పిడి ముక్కు గల.
Snuff n s smell ముక్కుతో పీల్చడము, అఘ్రాణించడము. for the nose పొడుము,ముక్కు, పొడి, నశ్యము. the * of a candle కోడి, కత్తిరించివేసిన మండే దీపపు వత్తికొనను కట్టిన చిట్టెము.
Snuff-box n s పొడిడబ్బి, పోడిబుర్ర.
Snuffers n s దీపపుకొడిని కత్తిరించే కత్తెర.
Snug adj హాయిగా వుండే, సుఖముగా వుండే, పొందికగా వుండే, భద్రముగా ఉండే. every thing is very * here యిక్కడ అంతా హాయిగా వున్నది, యిక్కడ అంతా పొందికగా వున్నది. the children lie very * there బిడ్డలు అక్కడ హాయిగా పండుకొన్నారు,భద్రముగా పండుకొన్నారు. the fox lay very * in the bush ఆ నక్క పొదలో నిండాహాయిగా పండుకొని వుండినది. he kept it * దాన్ని భద్రముగా దాచినాడు. *'s the word!(Smollett) భద్రంభద్రం, నోరు తెరిచేవు సుమీ, బయిట విడువబొయ్యేవు సుమీ.
Snugly adv హాయిగా, సుఖముగా, భద్రముగా, నిమ్మళముగా.
Snugness n s హాయి, సుఖము, భద్రము, నిమ్మళము. from the * of this house.యీ యిల్లు భద్రమైనది గనక.
So adv in like manner అట్లా, ఇట్లా, ఈరీతిగా, వలె. let it be so అట్లా వుండనీ. be it so కాని, చింతలేదు. so be it కాని, ఔగాక. you may come earlyso as I may meet you నిన్ను నేను చూచేటట్టు ప్రొద్దుగలగ రా. he struck so as to break the sword కత్తి విరిగేటట్టుగా కొట్టినాడు. therefore గనక. for thisreason; in consequence of this అందువల్ల, యిందువల్ల. and so forth మొదలైన. so long అంత పొడుగు, అంత మట్టుకు. so many అంతమంది, ఇంతమంది, అన్ని, ఇన్ని.so many days అన్నాళ్ళు, ఇన్నాళ్ళు. so much the more * that యెందుచేతనంటే,యెంతమట్టుకంటే, ముఖ్యముగా. * that the blood flowed నెత్తురు కారేలాగు. * thatthe letter may reach me నాకు జాబు అందేలాగు. he is * weak that he cannotrise వాడు యెంత అశక్తిగా వున్నాడంటే కూర్చున్నచోటనుంచి లేవడు. * then గనక, అట్లా వుండగా, సరేగదా. one * or so ఒకటి, అర, కొన్ని. so and so ఫలానివాడు. heconsented to go if * and * would accompany him ఫలాని ఫలాని వాండ్లు తనతో కూడా వస్తే పోతానన్నాడు. Mr. so and * ఫలాని దొర, యిన్నో వొకదొర. I amvery so so to-day యీ వేళ నాకు యిదిగా వున్నది. this translation is veryso so యీ భాషాంతరము అంతంతలుగా వున్నది, అనగా మంచిది కాదు. his English is but so so వాడికి వచ్చిన యింగ్లీషు అంతంతమట్టుకుగా వున్నది. his reasons are but so so వాడు చెప్పిన సమాధానములు అంతంతమట్టుకుగా వున్నది, పనికి రానివిగా వున్నవి.
Soaked adj నానిన, నానవేసిన, నానబెట్టిన, తడిపి పెట్టిన.
Soaking adj తడిపే, a rain తడిపేవాన, మంచి వాన.
Soap n s సబ్బు. fuller's earth used for * చవిటిమన్ను. the paste used instead of * వొళ్లు తోముకొనే పిండి. * suds నురుగు.
Soap-boiler n s సబ్బు కాచి అమ్మేవాడు.
Soap-nut n s కుంకుడుకాయ.
Soap-stone n s a stone like slate బలపపురాయి, మరిగరాయి. a pencilmade of this stone బలపము, బలపపుకోపు.
Soapy adj సబ్బువలె వుండే.
Soaring adj ఆకాశానికి యెగిరే.
Sob n s ఏడవడములో వచ్చే వెక్కు. I heard three *s అది యేడవడములో మూడు వెక్కులు విన్నాను.
Sober adj స్థిరబుద్ధిగల, నెమ్మదిగా వుండే, తెలివిగల, వివేకశాలియైన. he is a *man, you may take his advice వాడు తెలివిగలవాడు, వాడు చెప్పేబుద్ధి విను. a very * child మంచి తెలివిగల బిడ్డ. not drunk మైకము లేని. he makes many promises when he is drunk, but he forgets them all when he is * తాగి వొళ్ళు తెలియకుండా వుండేటప్పుడు యిది చేస్తాను అది చేస్తాను అంటాడుగాని వొళ్ళు తెలిశేటప్పటికి అది అంతా మరిచిపోతాడు. I wish I could persuade you to be * అయ్యో నీకు శాంతము లేకపోయేనే. A+ says ఉపయుక్త.
Soberly adv శాంతముగా, నిమ్మళముగా, తెలివిగా, మైకము లేకుండా. In Titus. 2. 12.ఉపయుక్తముగా. A+.
Soberness, or Soberity n s. శాంతము, నిమ్మళము, నెమ్మది, మైకము లేకుండా వుండడము.Hindus are remarkable for thier sobriety హిందువులు తాగే వాండ్లు కారు.
Soccage n s పాళెగాడితనము.
Soccager n s పాళెగాడు. (vulgarly) a poligar.
Sociable adj సరసులైన, సహవాస యోగ్యులైన, కలియగలుపుగా వుండే. the Hindu arevery * హిందువులు నిండా సరసులు, సహాకార యోగ్యులు. the dog is a * animal కుక్క మనుష్యులోత కలియుగలుపుగా ఉండేటిది. the parrot is a * creature but the crow is not * చిలక మనుష్యులలో యిమిడివున్నదిగాని కాకి అట్లా కాదు.
Sociableness n s సరసత, కలియగలుపు, అన్యోన్యము. from the * ofthese people వీండ్లు సరసులు గనక, వీండ్లు క్రూరులు కారు గనక.
Sociably adv సరసముగా, కలియుగలుపుగా, అన్యోన్యముగా.
Social adj సరసులైన, కలియుగలుపుగా వుండే. * beings కలియగలుపుగా వుండే వాండ్లు, అన్యోన్యముగా వుండే వాండ్లు. monks are not * beings సన్యాసులు కలియుగలుపు లేనివాండ్లు, వొకరితో చేరిక లేకుండా వొదిగి యుండే వాండ్లు. * worshipపదిమందితో కూడా చేసే పూజ. * meals పదిమందితో కూడా బోజనము చేయడము. * dutiesఅన్యోన్య మర్యాదలు. they look upon debt has a * crime అప్పును పరస్పర విరోధముగా యెంచుతారు, స్నేహభంగముగా యెంచుతారు.
Society n s community or company సభ, సంఘము, ప్రజలు. those who live in the * of the wise వివేకులతో సహవాసముగా వుండే వాండ్లు. the rules of * లోకమర్యాదలు, లోకాచారములు. in mixed * చిల్లర వాండ్లలో agreeable *యిష్టాగోష్టిగా వుండేవాండ్లు. civilized * నాగరీకులు. uncivilized * మోటు మనుష్యులు. the well being of * ప్రజాక్షేమము. he lives in * లోకులతోసహవాసముగా వున్నాడు. these people are not in * వాండ్లు లోకులతో సహవాసముగా వుండే వాండ్లు కారు. he lived in this woman's for a year సంవత్సరము దాకా దానితోసహవాసముగా వుండినాడు. he lived out of * లోకులను విడిచి యేకాంతముగా వుండినాడు.polished * రసికులు, నాగరీకులు. unpolished * నాగరీకము లేనివాండ్లు. a religious * భక్తులు, మతమును గురించి కూడిన సభ. a mercantile * వర్తకుల సంఘము, వర్తకులు. a Literary * విద్వత్సభ. (In the title page of the Persian Bible, the name "Bible Society" remains untranslated).
Sock n s మేజోడు, పత్తి, పట్టు, లేక బొచ్చుగుడ్డలతో కుట్టి చీలమండలదాకా వేసుకొనేటిది. or comic shoe నాటకములో వేసుకొనే వొకవిధమైన పాదరక్ష.
Socket n s any hollow that receives something inserted దేన్నైనా దోపేగూడు. the bone turns easily in the * ఆ యెముక దాని పాదులో సులువుగా తిరుగుతూవుంటున్నది. the * of the eye కంటిగుంట. his eyes are sunk in the *s వాని కండ్లు గుంటలు బడ్డవి. the hollow of a candlestick మైనపువత్తి శెమ్మలో వుండే బొక్క.
Sod n s turf, cold పచ్చికకరుడు, గరిక మోడి చెక్క, పచ్చికపెళ్ళ,మంటిపెళ్ళ, మంటిగడ్డ. he faced the pond with green *s గుంట కట్టకు పచ్చిక పెళ్ళలు వేసినాడు, కరుండ్లు వేసినాడు. When he lies under the green * మంటగలిశినప్పుడు.
Soda n s సోడ అనే వొకదినుసు. Alkali, borate of * క్షారము, చవిటిమన్ను,చవిటిసారము. * water యీ క్షారము కలిపిన నీళ్ళు.
Sodden pastp||boiled వండిన,పక్వమైన, the ground was quite * by the rain వానచేత నేల నిండా పదునై వుండినది.
Soever adv ఐనా. whatsoever యేదైనా. whosoever యెవడైనా. whensoever యెప్పుడైనా. wheresoever యెక్కడనైనా.
Sofa n s మెత్త తలగడగల నిడూపాటి వొరుగు పీట, దీన్ని సోపా, కౌచీ అంటారు.
Soffit n s the top of a door గడప పై భాగము.
Soft adj మెత్తని, మృదువైన. smooth నున్నని. * marble మెతకరాయి. * stone పిండిరాయి. * accents మృదూక్తులు. a * eyed maid లోలాక్షి, చంచలాక్షి. soft-eyedదయార్ద్రదృష్టిగల. silly, flexible, obedient విధేయమైన, సాధువైన . * waterమంచినీళ్ళు. he is a very * man వాడుయెట్లా ఆడిస్తే అట్లా ఆడేవాడు. Soft, (interj.) తాళుతాళు.
Softly adv మెల్లిగా, తిన్నగా, చల్లగా. fair and * ! ఆత్రపడక, మెల్లి మెల్లిగా.he spoke * తగ్గి మాట్లాడినాడు.
Softner n s that which makes soft శాంత పరచేటిది. time is a * of griefదినదినానకి వ్యసనము మట్టుపడుతన్నది.
Softness n s మెత్తన, మృదుత్వము, మాన్దవము, నునుపు, సౌమ్యము. * undermines wealth దాక్షిణ్యంధన నాశనం. easiness to be effected దాక్షిణ్యము. from the * of their nature, women weep easily ఆడవాండ్లు మెత్తనివాండ్లు గనుక కాస్త కూస్తకు యేడుస్తారు. timidity పిరికితనము, పందతనము.
Soho interj calling from a distant place ఒరే. stop నిలువు, తాళు.
Soi-disant p||(French) తమకుతామేచెప్పుకొనే, his * friends తమకు తామేచుట్టాలమని చెప్పుకొని వానివద్దకి వచ్చినవాండ్లు. a * doctor; that is, one who calls himself a doctor తనకు తానే వైధ్యుడని చెప్పుకొని తిరిగేవాడు.
Soil n s dirt మురికి, మాలిన్యము, కుప్ప, పెంట. red sandy * గరపనేల. stony * గరువు నేల, రాళ్ళభూమి. that * which is clay under sand పాలగరుపు. black * రేగడభూమి, రేగటి మన్ను. or land నేల, భూమి, మన్ను. his native * వాడి జన్మభూమి.those who till the * భూమిని దున్నే వాండ్లు. sons of the * నీచులు. goddess of the * భూదేవత. (W.) garden * మంచిసత్తువగల మన్ను. every morning they carry away the * in carts ప్రతిదినము తెల్లవారి కుప్పను బండ్లమీదవేశి తీసుకొనిపోతారు.
Soiled adj మురికిగా వుండే, మాసిన, మురికిచేయబడ్డ. * clothes మురికిబట్టలు.a * plate యెంగిలిగిన్నె. * silver మయిలగావుండే వెండిపాత్రలు.
Sojourn n s విదేశవాసము, నివాసము చేయడము, దిగివుండడము. during his * there వాడక్కడ వుండిన దినాలలో.
Sojourner n s విదేశవాసి, కొన్నాళ్లుగా వచ్చి వుండే వాడు.
Sol n s (poetical name of the God of the sun, భాస్కరుడు, సూర్యుడు.* soon hid his beams సూర్యుడు యింతలో కనుమరుగైనాడు.
Sola n s (the Bengali word for white pith) బెండు.
Solace n s comfort ఓదార్పు, స్వాంతనము. as a * in his trouble he wrote a letter to me వాడు పడే సంకటమునకు వుపశాంతిగా నాపేరట వొక వుత్తరము వ్రాసుకొన్నాడు.
Solar adj belonging to the sun సూర్యసంబంధమైన. the * rays సూర్యకిరణములు. * heat యెండ, సూర్యుని వేండ్రము. the * system సూర్యసిద్ధాంతము. the * year సౌరమానసంవత్సరము.
Solcitously adv విచారముగా, వ్యాకులముగా.
Sold participle of the verb ToSell అమ్మిన,అమ్మబడ్డ
Solder n s metallick cement. లోహమును అతికేపొడి.
Soldier n s బంటు, బంట్రోతు, శిపాయి శూరుడు. he was an eminent * వాడు మహాశూరుడు.
Soldierlike, Soldierly adj శిపాయికితగిన, శౌర్యమైన. soldierlyconduct శూరత్వమైన నడక.
Soldiery n s a body of military men బంట్లు, దండువాండ్లు, శిపాయీలు, శూరులు,దండు, సైన్యము.
Sole n s of the foot అరకాలు, అడగు. the bottom of the shoeచెప్పు యొక్క అట్ట. a certain fish నాలుక చేప, జెర్రిపోతు. See Russellon Fishes No. 2. XXIII.
Solecism n s impropriety in language అన్యాయము, విపరీతము, వైపరిత్యము,వ్యతిరేకము, అచుంబిత ప్రమేయము, రసాభాసము, ఘాతశులము, వికారమైనపని, వికారమైన మాట,వ్యంగ్యము. a blunder అనన్వయము, వ్యాకరణ భంగము, అసంగతము.
Solely adv మాత్రము, కేవలము. * for that అందుకే, అందున గురించి మాత్రము. they paid the money * to him ఆ రూకలు అతనికే యిచ్చినారు. they live * on rice వాండ్లు అన్నము తప్ప మరేమి తినేదిలేదు.
Solemn adj religiously grave గంభీరమైన, భయభక్తియైన. * sound గంభీరమైనధ్వని. there was no * decision in this case యిందున గురించి క్రమమైన తీర్పు కాలేదు. awful భయంకరమైన. when the church is full, it is a * sight జనము గుడినిండి వుండేటప్పుడు చూచేవాండ్లకు నిండా భయముగా వుంటున్నది. a * grove భయంకరముగా వుండే వనము. he assumed a * air గంభీరముగా వుండినాడు. there was a * silence సద్దుచప్పుడులేక భయంకరముగా వుండినది. a * place మహాస్థలము, పుణ్యస్థలము.formal యథావిధియైన, క్రమమైన. he made a * declaration వాడు రూఢముగా చెప్పినాడు,గట్టిగా చెప్పినాడు. * rites శాస్త్రీయమైన ఆచారములు. they held a * examinationregarding this దిన్ని గురించి యథావిధిగా విచారించినారు. he made a * promise స్థిరముగా చెప్పినాడు, గట్టిగా చెప్పినాడు. a * oath యథావిధియైన ప్రమాణము. a * foolగంభీరముగా వుండే పిచ్చివాడు. still నిశ్శబ్దముగా వుండే. "sound" In Ps. 92. 3.గంభీరమైన. A+. a * day పుణ్యదినము, పండుగ దినము F+. ఉత్సవ దినము D+. See on Still adj.
Solemnity n s religious ceremony పండగ, ఉత్సవము. religious rite శుభాశుభ కర్మములు. the marriage was performed without any * ఆ పెండ్లి యథావిధిగా చేయబడలేదు, క్రమముగా చేయబడలేదు. awful grandeur భయంకరముగా వుండడము. stillness నిశ్శబ్దముగా వుండడము.
Solemnization n s celebration ఆచరించడము, కొనియాడడము, యథావిధిగాచేయడము. * of a marriage పెండ్లిని యథావిధిగా జరిగించడము. after the * of this feast ఆ పండుగను కొనియాడిన తర్వాత, చేసిన తర్వాత.
Solemnly adv భయభక్తిగా, యథావిధిగా, రూఢిగా, గట్టిగా. they were * married వారికి యథావిధిగా పెండ్లి అయినది. I * tell you that if youdo this I will never speak to you again నేను స్థిరముగా చెప్పేది యేమంటేనీవు దీన్ని చేస్తివా నీతో మళ్లి యెన్నటికీ మాట్లాడను. I * declare I willdo as he said వాడు చెప్పినట్లే నేను సిద్ధముగా చేస్తాను. In Gen. 43. 3. దృఢముగా A+. H+. and F+.
Solicitation n s ప్రార్థన, మనవి, యాచన, వేడుకోవడము. all his *s were ofno use వాడు యెంతమనివి చేసుకొన్నా పనికిరాకపోయినది.
Solicitor n s he who requests మనవి చేసేవాడు. a lawyer వకీలు.
Solicitous adj eager, anxious విచారపడే, చింతించే. they are not * toplease him వాణ్ని సంతోష పెట్టవలెననే చింత వాండ్లకు లేదు. he was very * to explain this దీనికి సమాధానము చెప్పడానకు నిండా బాధపడ్డాడు. why should yoube * about him వాడి కోసరము యెందుకు బాధపడతావు.
Solicitude n s anxiety విచారము, వ్యాకులము, చింత.
Solid adj గట్టియైన, దృఢమైన. wax is * but when melted it is fluidమయినము గట్టిగా వుంటున్నది కరిగితే నీరుగా వుంటున్నది. he took no food either *or liquid వాడు అన్నము తినలేదు, నీళ్లు తాగలేదు. a * rock చట్రాయి. * ivory బోలుగా వుండని గట్టిదంతము. the bracelet which was made of * gold బంగారు గట్టిగాజు. the sword was steel but the haft was * silver ఆ కత్తి వుక్కు అయితే దాని పిడివుత్త వెండితో చేయబడి వున్నది. the whole river is * iceయేరంతా మంచుగడ్డగా పేరుకొని యున్నది. the well is dug in * stone ఆ బావి శుద్ధబండలో తవ్వబడి యున్నది. he has taken no * food today వాడు నేడు అన్నముగా యేమీ తీసుకోలేదు. nourishment is divided into *s and fluids ఆహారము అన్నమూ నీళ్ళుగా వున్నది. not hollow బోలుకాని. these insects have destroyed the* wood గట్టికొయ్యను ఆ పురుగులు పాడుచేసినవి. the bamboos that are nearly* are called గట్టి వెదుళ్ళు. * sense దృఢబుద్ధి. he looked very * చూపుకుగట్టివాడుగా వుండినాడు. a * book సారవత్తైన గ్రంథము. this is not a reason యిదిమంచి సమాధానము కాదు.
Solidity n s గట్టి, గట్టితనము. from the * of the wood యిది గట్టి కొయ్య గనక. from the * of this reason యిది మంచి హేతువు గనుక. * of witదృఢ బుద్ధి, బుద్ధి దారుఢ్యము.
Solidly adv గట్టిగా, దృఢముగా.
Solidness n s See Solidity.
Solifidian n s భక్తుడు, కేవలము భక్తిమార్గమును అవంబించి కర్మకాండను వుపేక్ష చేసేవాడు.
Soliloquy n s తనలో తాను మాట్లాడుకోవడము, తనకు తానే తలపోసుకోవడము.
Solitaire n s a recluse, a hermit ముని, సన్యాసి, వైరాగి. an ornamentfor the neck కంఠభూషనము, మాలిక.
Solitarily adv ఒంటిగా, ఏకాంతముగా.
Solitariness n s ఏకాంతము. from the * of his life వాడు ఏకాంతవాసిగా వున్నాడుగనక.
Solitary adj ఏకాంతమైన, ఒంటి. a * place ఏకాంతస్థలము, నిర్జనప్రదేశము. he leads *s life ఏకాంతవాసిగా వున్నాడు. he did not follow my advice in a *instance నేను చెప్పిన బుద్ధిని వొకమాటైనా వినలేదు. a * instance proves nothingవొక దృష్టాంతముచేత వొకటిన్నీ రూఢికాదు.
Solitude n s ఏకాంతముగా వుండడము, ఏకాంతవాసము. this island is a vast * ఈ దీవి శుద్ధ నిర్జన ప్రదేశముగా వున్నది. those who live in * ఏకాంతవాసులుగా వుండేవాండ్లు.
Solo n s a tune played by a single instrument ; an air sung by asingle voice ఒంటి గొంతుగా పాడేపాట, ఒంటి వాయిద్యము, ఒంటిగా వాయించే వాయిద్యము.
Solomon's seal n s a species of convallaria ఇది వొక చెట్టుపేరు.
Solon n s proper name of a Greek lawgiver గ్రీకు దేశములో వుండిన వొక స్మృతి కర్త. he is thought a perfect * ఆయనను ఋషిగా యెంచుతారు.
Solstice n s The point beyond which the sun does not go; the tropical point; the point at which the day is longest inSummer, or shortest in Winter. It is taken of itself commonlyfor the summer solstice ఐనము. the summer * (is on the 22d of June) ఉత్తరాయణము. the winter * (is on the 22nd of December) దక్షిణాయనము. the * as meaning hot weather or summer ఎండకాలము.
Solstitial adj ఎండకాల సంబంధమైన. * storms ఎండకాలములో కొట్టే గాలివాన.
Solubility n s capability of melting కరిగే గుణము. from the * of wax మయినము కరిగేటిది గనక.
Soluble adj కరిగే. wax is easily * మయినము సులభముగా కరిగేటిది. thisquestion is easily * యీ సంశయము సులభముగా తిరేటిది.
Solution n s matter dissolved కరిగినది. a * of salt ఉప్పు కలిపిన నీళ్ళు. a * of sugar బెల్లపు నీళ్ళు. a * of lime సున్నపు నీళ్ళు. a * of gold ద్రావకములో కరిగి మిశ్రితముగా వుండే బంగారు. resolution of a doubt సందేహ నివారణము, పరిహారము, విమోచనము. the * of a question సందేహ నివారణము, పరిష్కారము.
Solved adj తీరిన, పరిష్కృతమైన, వీడిన.
Solvency n s ability to pay అప్పులు చెల్లించే శక్తి కలిగి వుండడము. I doubt his * అప్పులను చెల్లించే శక్తి వాడికి వున్నట్టు వుండలేదు. this proves his* అప్పులను చెల్లించేశక్తి వాడికి వున్నట్టు యిందువల్ల రూఢమవుతున్నది.
Solvent adj able to pay debts contracted పడిన అప్పులనుచెల్లించగల. in a Chemistry లోహమును కరిగించే ద్రావకము.
Sombre adj sad, gloomy మకమకలాడే, మకిలగా వుండే. he looked very * వాడు వ్యాకులముగా వుండినాడు, మూతి ముడుచుకొని వుండినాడు. this picture is very* యీ పటము నిండా నల్లగా వున్నది. * intelligence చెడు సమాచారము.
Some adj కొన్ని, కొంత, కొంచెము, కాస్త. gave him * food వాడికి కాస్త ఆహారము యిచ్చినారు. * distance off కొంచెము దూరములో. * of these books యీ పుస్తకములలో కొన్ని. * of them వాండ్లలో కొందరు. he bought * land వాడు కొంత భూమిని కొన్నాడు. he kept * and sold * కొన్ని పెట్టుకొన్నాడు, కొన్ని అమ్మివేసినాడు. * two hundred years ago యిన్నూరు మున్నూరూ యేండ్లకు మునుపు. * ten miles నాలుగైదు కోసులు. give me * water కొంచెము నీళ్లు యియ్యి. somebody mayhave said so యెవరైనా అట్లా చెప్పివుందురు. he thinks himself somebody తానే గొప్ప అనుకొన్నాడు, హెచ్చనుకొన్నాడు. * one told him వాడితో యెవడో వొకడు చెప్పినాడు. he is a man of a learning వాడు కొంతమట్టుకు విద్యగలవాడు. * personsకోందరు. * went and * remain కొందరు పోయినారు, కొందరు వున్నారు. a town of * size కొన్నాళ్ళకు తర్వాత, కొంతసేపటికి తర్వాత. * person or other, * one or other, somebody or other యెవడో, యెవరో, యెవతో. in * book or other యేదో ఒక పుస్తకములో. there is * mischief or other brewing యేదో వొక కిల్బిషమువున్నది. in * way or other యెట్లాగైనా. in * place or other యెక్కడనో వొక చోట.
Somehow adv ఏట్లాగో, ఏ విధాన్నో.
Somerset n s a leap లాగు.
Something n s ఏదో, ఏదైనా, ఏదో వొకటి. they gave him * వాడికియెమో యిచ్చినారు. * will happen from this యిందువల్ల యేదో వొకటిసంభవించబోతున్నది. I am * better to-day నేడు నాకు కోంచెము వాసిగా వున్నది.they have a * in their looks that please the eye వాండ్లు చూడడములోవొక విశేషము వున్నది, అది చూడ వేడుకగా వున్నది.
Sometime adv once పూర్వము. at one time or other hereafter కొంత కాలమునకు, యెన్నటికో. he died * last year పోయిన సంవత్సరములో యేదో వొక నేలలో వాడు చచ్చినాడు. I bought that horse * before అంతకు ముందు వొకప్పుడుఆ గుర్రమును కొనియుంటిని. * after dinner భోజనము చేసిన మరికొంత సేపటికి. *or other యెప్పుడో.
Sometimes adv అప్పటప్పటికి. they * go there వాండ్లు అప్పటప్పటికి అక్కడికి పోతారు. I * see him నేను అప్పటప్పటికి వాణ్ని చూస్తాను. it * rains in this month అప్పుడప్పుడు యీ నెలలో వాన కురియడము కద్దు.
Somewhat adv కొంచెము, కొంత, కించిత్. this house is * larger thanthat one ఆ యింటికంటె యిది కోంచెము పెద్దది.
Somewhere adv ఎక్కడనో, ఎక్కడనైనా.
Somnambulism n s walking in sleep నిద్రలో నడవడము, తూగిపడుతూ నడవడము.
Somnambulist n s one who walks in his sleep నిద్రలో నడిచేవాడు.
Somniferous adj నిద్రను కలగచేసే, నిద్రపట్టేటట్టుచేస.
Somnolency n s sleepiness; in clination to sleep తూగు, నిద్రమబ్బు.brutish stupid neglect అజాగ్రత్త.
Somnus n s నిద్రాధి దేవత యొక్క పేరు. they are in the arms of *వాండ్లు నిద్రపోతున్నారు.
Son, sun n s. కొడుకు, కొమారుడు, పుత్రుడు. a * of Adam మనిషి, నరుడు. allmen are *s of Adam అందరున్ను ఆదిమ పురుషుడి వంశస్థులు. a * of Apelles (అతి ప్రసిద్ధుడైన ఆ పెల్లిసు అనే చిత్రకారుని కొడుకు అనగా) చిత్రకారుడు. a * of Marsసేనానాయకుడైన కుమారస్వామి కొడుకు, అనగా సిపాయి, శూరుడు. *s of England ఇంగ్లీషువాండ్లు. a * of the church పాదిరి. a spiritual * or disciple విద్యార్థి, శిష్యుడు. *s of God భక్తులు. the * of God A+. says ఈశ్వరస్యసుతః . * (in scripture language) శాలి. *s of pride గర్విష్టులు. of *s light జ్ఞానవంతులు.*s of darkness అజ్ఞానులు, పాపమూర్తులు. *s of peace శాంతుడు. *s of men మనుష్యులు,మానవులు. but the * of man అనగా జీసస్సు ఖ్రీస్టువు. son-in-law అల్లుడు.
Sonata n s a tune ఒక విధమైన పదము.
Song n s పాట, పదము, కీర్తన, సంగీతమ, గానము. a * for lulling infants asleep జోలపాట. of birds పక్షుల యొక్క సుస్వనము. or poetry కావ్యము. the housewas sold for a mere * ఆ యిల్లు అతి స్వల్ప వెలకు అమ్ముడు బోయినది. I sold it for a mere * దాన్ని అన్యాయానికి అమ్మినాను. they are all in one * అందరు వొకటేమాటగా వున్నారు. sing * or nonsense పిచ్చి సుద్దులు, వట్టి సుద్దులు.
Songestress n s సంగీతకత్తె, గాయకురాలు, సుస్వరముగా కూసే కోకిల మొదలైన పక్షి.
Songster n s సంగీతగాడు, గాయకుడు, సుస్వరముగా కూశే కోకిల మొదలైన పక్షి.
Sonnet n s పద్యము, పదము. a set of *s శతకము.
Sonnetteer n s a small poet, (in contempt) దిక్కుమాలిన కవి.
Sonorous adj ధ్వనిగల, నాదముగల, మోగే, ఘణీలుమనే, ఖంగుమనే.
Sonorously adv ఘణీలుమని.
Sonorousness n s ఘణీలు మనడము. from the * of brass ఇత్తడివాయిస్తే ఘణీలుమనేది గనుక.
Sonship n s the being a son పుత్రత్వము, ఇది ఖ్రీస్తువును గురించిన మాట.
Soodra n s (name of a caste) శూద్ర. the *s శూద్రులు. a * woman శూద్రది.
Soogie n s (Indian word for grits) నూకలు. In Madras called సుజ్జి.
Soon adv త్వరగా, శ్రీఘ్రముగా. you have come * to-day నేడు పెందలకాడే వచ్చినావు. I wish you to come * to-morrow రేపు యెప్పటికంటే త్వరగా రా.* after they arrived వాండ్లు వచ్చిచేరిన కొంచెము సేపటికి. or presentlyమరీ కొంచెము సేపటికి, యింతలో. as * as he came వాడు రాగానే.
Sooner Comparative of soon మిక్కిలిత్వరగా,* or later కొంచెము ముందో వెనకో. I had * die than do so నేను చచ్చినా చేయను.
Soot n s కరదూపము, దీపకిట్టము, పొగమసి.
Sooth n s truth, reality నిజము, యధార్ధము. in * మెట్టుకు. * to say Iam not very sorry for it మెట్టుకు అందువల్ల నాకు వొక వ్యసనము లేదు.
Soothed adj ఉపశాంతి చేయబడ్డ, ఊరార్చబడ్డ.
Soothing adj ఉపశాంతియైన, ఓదార్పుగా వుండే.
Soothsayer n s he who foretells సోదె చెప్పేవాడు, సోదె చెప్పేటిది.
Soothsaying n s foretelling సోదెచెప్పడము.
Sootiness n s పొగచూరడము. from the * of the walls గోడలుపొగచూరి వున్నవి గనక.
Sooty adj పొగచూరిన. the * Indians నల్లవాండ్లుగా వుండే హిందువులు.
Sop n s (any thing steeped in liquor) నానవేసినది. or bribe లంచము, బహుమానము. this was a mere * to cerberus మింగవచ్చిన దానికిఅడ్డముగా వేసిన కడి. soursop యిది వొక విధమైన రామా ఫలము.
Soph n s విద్యార్ధి.
Sophi n s the emperor of Persia పార్షీ దేశపు రాజు.
Sophism n s a fallacious argument; an unsound subtilty;a fallacy కుత్కరము. In 2 Peter. 1. 16. Sesophismenois mythoisకల్పితోపన్యాసము. A+. "He silenced him with this sophism. Thereare some degrees of fever in which cold water is good for a man: every man who has a fever has it in some degree: and therefore water is good for every man in a fever." -Again, Do you know your father? yes, Do you know this man who is veiled? No. Then you do not know your father, for it is he thatis veiled. (Penny Cyclop.)
Sophist n s కుతర్కము చెప్పేవాడు, తాంత్రికుడు.
Sophistical adj కుతర్కముగా వుండే.
Sophistically adv కుతర్కముగా.
Sophisticated adj కుతర్కమైన.
Sophistication n s కుతర్కము. his reply is mere * వాడిప్రత్యూత్తరమంతా వట్టి కుతర్కము. In Italian Cosa serve sofisticarecosi-what signifies all this minuteness of enquiry.
Sophistry n s కుతర్కము.
Soporiferous, Soporifick adj నిద్రవచ్చేటట్టుచేసే, నిద్రకారియైన.opium is * నల్లమందు నిద్ర వచ్చేటట్టు చేసేటిది.
Sopped adj wet, wetted నానిన, నానవేయబడ్డ.
Sorcerer n s శూన్యగాడు, తోడుబోతులమారి, మాయావి. A+.
Sorceress n s శూన్యకత్తె.
Sorcery n s శూన్యము, పంపు. In Rev. XVIII. 23. (Gr. pharmacia) మాయ. A+.
Sordes n s dirt మలినము, పాచి.
Sordid adj base, mean నీచమైన, క్షుద్రమైన, భ్రష్టమైన, దిక్కుమాలిన. * lucre పాడు రూకలు, అనగా నీచవృత్తివల్ల కూడబెట్టిన రూకలు.
Sordidly adv నీచత్వముగా, క్షుద్రత్వముగా, దిక్కుమాలిన రీతిగా.
Sordidness n s baseness నీచత్వము, నికృష్టత, క్షుద్రత.
Sore n s పుండు. the burning produced a * కాలిపుండు అయినది.a sinus or hollow * లొట్టెపుండు.
Soreness n s నొప్పి, సలుపు. from the * of the wound పుండు నొప్పిగా వుండినందున. there is some * between them వాండ్లిద్దరికీ కొంచెము ద్వేషముగావున్నది.
Sorrel n s a plant having an acid taste పులిచింతాకు, పుల్లగావుండే వొక విధమైన కూరాకు.
Sorrily adv basely, meanly, poorly హీనముగా, నీచముగా, క్షుద్రముగా. he was * dressed దిక్కుమాలిన గుడ్డలను కట్టుకోని వుండినాడు. he is but * prepared for the examination ఆ పరీక్షను గురించి సిద్దమయ్యీ కాకవున్నాడు.
Sorriness n s meanness; wretchedness దిక్కుమాలినతనము, బీదగలిగినతనము. from the * of the horses గుర్రాలు బీదగిలి యున్నవి గనక.
Sorrow n s చింత, వ్యాకులము, దుఃఖము, వ్యసనము, విచారము, ఖేదము, జాలి.
Sorrowful adv వ్యసనమైన, వ్యాకులముగా వుండే. * intelligence దుఃఖసమాచారము.a * face యేడుపు ముఖము.
Sorry adj base miserable useless పనికిమాలిన, దిక్కుమాలిన, తుచ్చమైన, నీచమైన. a * excuse పనికిమాలిన సాకు. a * steed దిక్కుమాలిన గుర్రము. or suffering grief విచారపడే, దుఃఖపడే. I am * for him వాణ్ని గురించి నాకు చింతగాఉన్నది. I am * I gave it him అయ్యో దాన్ని వాడికి యెందుకు యిస్తినో. I am not *to hear this యిది మంచి సమాచారమే. I was * to see him so ill వాడికి అంత వొళ్లు అశక్తముగా వుండిన దాన్ని చూచి నాకు నిండా వ్యాకులముగా వుండెను. I am * to say he did not receive the letter అయ్యో వాడికి జాబు చేరక పోయినదే. I am * to say he is ill. వాడికి వొళ్లు కుదురుగా ఉండలేదు.
Sort n s kind quality విధము, జాతి, దినుసు. all these are of thesame * ఇవి అంతా వొక మచ్చే, అంతా వొక విధమే. what * of wood is this? ఇది ఏ జాతి కొయ్య. what * of a house is this? యిది యే విధమైన యిల్లు.in some * this is a compensation దీన్ని వొక బహుమానముగా పెట్టుకోవచ్చును,అనుకోవచ్చును. a * of dress merely means a dress వొక విధమైన వుడుపు అంటేవూరికే వుడుపు అనే అర్థమే అవుతున్నది. you have brought the wrong * of seed కావేలసినదాన్ని విడిచిపెట్టి వేరే మరి వొక విధమైన విత్తులను తీసుకొని వచ్చినావు.this is the right * of cloth కావలసిన గుడ్డ యిదే. of what *? యెటువంటి.of this * యిటువంటి. of that * అటువంటి. they make a curious * ofcloth here యిక్కడ వొకవిధమైన వింత గుడ్డలు నేస్తారు. there were fruitsof six *s ఆరు విధములైన పండ్లు వుండినవి. flowers of all *s నానా విధములైనపుష్పములు. he rides out in all *s of weather యీ కాలము ఆ కాలము అనిచూడకుండావాడు అన్నిడకాలములలోనున్ను గుర్రమెక్కి పోతాడు. people of a better * గొప్పవాండ్లు, ఘనులు. people of the baser * నీచులు, తుచ్చులు. people of the middle* సామాన్యులు. he is out of *s to-day యీ వేళ వాడికి వొళ్ళు యిదిగావున్నది.
Sortie n s (a French word) to sally out కోటలో వుండేదండు బైలుదేలి కోట చుట్టుకొని వుండే శత్రుదళము మీద వచ్చిపడడము. they made a * upon usకోటలో వుండిన వాండ్లు కోటను చుట్టుకొని వుండే మామీద వచ్చి పడ్డారు.
Sot n s a fool, a drunken wretch పిచ్చిగాడు, చెడు తాగుబోతు.
Sottish adj పిచ్చి, మూర్ఖమైన, మొండియైన, మడ్డియైన.
Sottishly adj అవివేకముగా, పిచ్చితనముగా, మోటతనముగా.
Sottishness n s drunkenness తాగుబోతుతనము, మోటతనము.
Soubriquet n s nickname ఎగతాళి పేరు.
Sough n s a drain కాలవ. a * tile దోనె పెంకు.
Sought past and participle of the verb to seek వెతికిన,వెతకబడ్డ, this is a medicine much * after యిది అందరికీ కావలసిన మందు.
Soul n s the immortal spirit ఆత్మ, జీవుడు. he will save their *s alive వాండ్లను రక్షించును. In Matt. 10. 28. ఆత్మ A+. In the Sanscrit philosophy (See Sankhya Karica page 12+ &c. &c. ) * or spirit is called పురుషః. a living * ప్రాణి. they had nothing to keep body and * together వాండ్లకు జీవనోపాయము లేకుండా వుండెను. వాండ్లకు అన్నానికి లేకుండా వుండెను. there was not a * in the house యింట్లో వొక ప్రాణిన్నీ లేదు. in the house three were more than twenty *s ఆ యింట్లో యిరువై మంది దాకా వుండినారు. every * of them ప్రతిమనిషి. he is a simple * వాడు వట్టి వెర్రిముఖము. he is a kind * వాడు మంచివాడు, దయాళువు. she is a dear * అది మంచి మనిషి. she is agood * అది దయారసము కలది. poor * he is very ill పాపము వాడికి వొళ్లు కుదురులేదు. with heart and * సర్వాత్మనా. discipline is the * of war యుద్ధమునకుశిక్షే ప్రాణము. she was the * of the assembly అదే ఆ సభకు జీవాతువుగా వుండెను. ప్రాణాధారముగా వుండేను. obedience is the * of an army విధేయత దండుకు ముఖ్యము. the* of a promise is truth మాటకు ప్రాణము సత్యము.
Soulless adj mean low మూర్ఖమైన, పశుప్రాయమైన.
Sound adj దృఢమైన, గట్టియైన, దారుడ్యముగల, పటుత్వమైన, ఆరోగ్యమైన. he is in* health వాడు దృఢగాత్రుడుగా వున్నాడు. a man of * sense స్థిరబుద్దిగలవాడు. one bottle is broken but the other one is * ఒక బుడ్డి పగిలిపోయినది, వొకటి బాగా వున్నది. this horse is not * యీ గుర్రము పనికిమాలిపోయినది. a man of * judgement మంచి వివేకము గలవాడు. he is in a * sleep వాడికి యిప్పుడుమంచినిద్ర. * doctrine మంచి వుపదేశము. they arrived sage and * వాండ్లు సుఖముగావచ్చి చేరినారు. this argument is not * యీ న్యాయము పనికిరాదు.
Sounding adj మోగే, వాగే, ధ్వనించే.
Sounding board n s కిన్నెర పెట్టెవంటి వొక పలక.
Soundings n s సముద్రములో లోతు కనుక్కోతగ్గ చోటు.
Soundly adv well properly చక్కగా, బాగా, లెస్సగా. they beat him * వాణ్ని బాగా కొట్టినారు. Soundness, n. s. ఆరోగ్యము, దారుఢ్యము. from the * of the wall ఆ గోడ గట్టిగా వున్నది గనుక. from the * of this reason యిది మంచి హేతువు గనుక. *of judgment స్థిరబుద్ధి, మంచి బుద్ధి, వివేకము.
Soup n s strong decoction of flesh for the table చారు, మాంసము,వేసి కాచినచారు. a * kitchen బీదవాండ్లకు గంజిపోసే సత్రము.
Soup plate n s కొంచెము లోతుగా వుండేతట్ట, తాంబాళము.
Sour adj పుల్లని. tamarinds are * చింతపండు పుల్లనిది. ripe mangoes are sweet and unripe mangoes are * మామిడిపండ్లు తీపు కాయలు పులుసు. * gruel కూటినీళ్ళు. to turn * పులిసి పోవుట. to make * పులియబెట్టుట. * looks క్రూర దృష్టి. the sweets and the *s of life మనిషికి వుండే సుఖదుఃఖములు. nasty, dirty మురికిగా వుండే, కల్మశముగా వుండే. the grapes are * ద్రాక్ష దోరకాయలుగావున్నవి. but as a proverb దొరకనిది పనికిరాదు అన్నట్టు, అభావే విరక్తిః అన్నట్టు.
Source n s మూలము, మూలాధారము, జన్మస్థానము. * of a river నదిమూలము, యేరు పుట్టినస్థలము. this story was a great * of entertainment యీ కథ అందరికీ వేడుకగా వుండెను. I found out the * of the disease యీ వ్యాధి యొక్క కారణము కనుక్కొన్నాను, మూలము కనుక్కొన్నాను.
Sourish adj slightly sour కొంచెము పుల్లగా వుండే.
Sourness n s పుల్లతనము, పులుసు. asperity క్రౌర్యము. from the * of this యీ పండ్లు పుల్లనివి గనక.
Sour-sop n s a certain tree. ఉప్పిచెట్టు.
Sous n s (French word for a penny; pronounced soo) రూక.
Souse n s pickle made with salt ఉప్పున వూరవేసిన వూరుగాయ, ఊరగాయవూట.
South n s దక్షిణము, దక్షిణపుదిక్కు. the * wind which the English at Madrascall the long shore wind దక్షిణపు వడగాడ్పు.
Southeast n s ఆగ్నేయ దిక్కు.
Southerly adj దక్షిణపు. a * breeze దక్షిణపు గాలి. Southern, adj, దక్షిణపు. * India ద్రవిడాంధ్ర కర్నాటక దేశములు.
Southernwood n s a plant దవనము వంటి వొక చెట్టు.
Southward, or Southwards adj and adv. దక్షిణపు తట్టుకై. the wind is southward to-day నేడు దక్షిణపు గాలి తిరిగినది. they travelled southwardsదక్షిణముగా పోయినారు.
Southwest n s నైరుతిమూల.
Souvenir n s (French word meaning remembrance.) a keepsakeజ్ఞాపకము, జ్ఞాపకార్ధముగా యిచ్చినది.
Sovereign adj supreme in power శ్రేష్టమైన, ముఖ్యమైన, శ్రేష్టుడైన, ముఖ్యుడైన.he is a * ruler వాడే సర్వాధికారి. * power సర్వాధికారము, ముక్యమైన అధికారము. this is a * remedy for cough యిది దగ్గుకు దివ్యమైన మందు. * contempt మహత్తైనఅలక్ష్యము.
Sovereignty n s ప్రభుత్వము, దొరతనము, సర్వాధికారము. when he obtained the * వాడు దొరయైనప్పుడు.
Sovreign n s రాజు, ప్రభువు, చక్రవర్తి, అధిపతి, కర్త. the * of the corporation (Smollett) గ్రామాధిపతి. a gold coin పదిపదకొండు రూపాయీలకు మారే వొక బంగారు నాణెము.
Sow n s the animal ఆడపంది. the * and pigs పందిన్ని పంది పిల్లలున్ను.
Sower n s విత్తేవాడు. a * of discord కలహములు పెట్టేవాడు.
Sowgelder n s he that spays పందులకు విత్తులు కొట్టేవాడు.
Sowing n s scattering seed విత్తడము, విత్తనము వేయడము. the * of seedవిత్తులు విత్తడము. * time విత్తనము వేశేకాలము విత్తేకాలము.
Sown past participle of the verb ToSow విత్తిన, the seed that was* చల్లిన విత్తనాలు, విత్తిన విత్తనాలు. the field that was * విత్తిన పొలము. in this book the beauties are thickly * యీ కాండ శృంగార జటిలముగా వున్నది. hehas * his wild oats కాగి చల్లారిన పాలుగా వున్నాడు, ఆరి తీరిన వాడుగా వున్నాడు.
Spa n s a medicinal well ఆరోగ్యమైన నీళ్ళుగల బావి, రోగములను పోగొట్టే వుదకముగల కూపము.
Space n s room ఎడము, స్థలము, అవకాశము. empty * ఆకాశము. the * occupied by this house యీ యిల్లు వుండే స్థలము. in the * of ten miles ఆమడ దూరములో. for a long * of time they remained here వాండ్లిక్కడశానా దినాలు వుండిరి. he tarried for a * కొంచెము సేపు వుండినాడు. he remained there for a * or for a * of time కొంచెము సేపు వుండినాడు. he remained there for the * of an hour గడియ సేపు వుండినాడు.
Spacious adj విశాలమైన, విస్తారమైన, పెద్ద.
Spaciously adv విశాలముగా.
Spaciousness n s విశాలత. from the * of this house యీ యిల్లువిశాలమైనది గనక, పెద్దది గనక.
Spade n s పొర, సలకపార. the English * is of one shape and the Indian * is of another shape ఇంగ్లీషు పార వొకవిధముగా వుంటున్నది, యీ దేశపు పార వొక విధముగా వుంటున్నది. a * at cards ఆడే కాగితాలలో యిస్పేటు.
Spadebone n s రెక్క, యెముక.
Spadille n s కాకితాలాటలో వొక భేదము.
Spake past tense of the verb ToSpeak Span, n. s. జేన, ప్రాదేశము. * long జేనెడు. the * of life ఆయుః ప్రమాణము. a bridge of fifty feet * యాభై అడుగుల వెడల్పు కన్నుగల వంతెన.
Spangle n s any thing sparkling and shinning తళతళమని మెరిసేటిది,తళుకుతళుకుమనే బంగారు రేకు. her dress was ornamented with *s దాని వుడుపుమీద తలతళమని మెరిసేటట్టు రవంతేసి బంగారు రేకులు పెట్టి కుట్టి వుండినది. a gold * wornin the forehead తళతళమని మెరిసే బంగారు బొట్టు. the grass was covered with*s of dew కసువంతా మంచి బిందువులచేత తళతళమని మెరుస్తూ వుండినది.
Spangled adj చుక్కలవలె తళతళమని మేరిసే. a * jacket చుక్కలవలెవుండే అద్దపు బిళ్లలు లేక అభ్రకపు పొడిచేత తళతళమని మెరిసే రవికె. the * heavens చుక్కలచేత తళతళమని మెరిసే ఆకాశము.
Spaniard n s స్పేను దేశస్తుడు.
Spaniel n s చిన్న కుక్క, కుచ్చికుక్కవంటి వొక కుక్క. a servileperson దాసుడు, బద్ధుడుగా వుండేవాడు.
Spanish adj స్పేన్ దేశ సంబంధమైన.
Spanish, fly n s. జోరీగవంటి వొకవిధమైన యీగెలు, వీటిని చూర్ణము చేసి చిత్రమూలమువలె వొళ్ళు పొక్కడానకు పట్టిస్తారు.
Spanker n s the back sail of a ship వాడకు వెనకతట్టు కట్టేచాప.a rough rude large woman స్థూలకాయముగల ఆడది. the child is a *ఆ బిడ్డ బాగా మొద్దువలె వున్నది.
Spanking adj large, big స్థూలముగా వుండే.
Spar n s a kind of sotne ఒక విధమైన స్ఫటికరాయి. a bar ofwood పట్టె. a palmira * తాటిపట్టె. a teak * టేకుపట్టె. SeeCorundum Spar. (Ainsw. says Cortex rudis metalli.)
Spare adj thin, lean సన్నపాటి, బక్కచిక్కిన, బక్కపలచని,కృశించిన. a * person బక్కచిక్కినవాడు, పలాచటివాడు. * dietమితాహారము. scaty, not abundant మితమైన, మట్టైన. he was * ofspeech వాడు మితభాషిగా వుండినాడు. superfluous, unwanted మిగతగా వుండే, అధికముగా వుండే. he gives all his * money to his brotherతనకు మించివుండే రూకలను తన తమ్ముడికి యిస్తాడు. each is mounted on a horse and has a * horse at his side తలా వొక గుర్రముమీద యెక్కుకొని పక్కన వొక్కొక్క విడి గుర్రమును పెట్టుకుని యుండినారు.
Spareness n s కార్శ్వము, కృశత్వము, పలచన.
Spare-rib n s రిబ్స్ cut away from the body and having on them spare or little flesh: as a spare-rib of pork ఎముక తునక.
Sparing adj little కొద్ది, కొంచెము. scanty; not plentifulమితమైన, మట్టైన. parsimonious; not liberal పట్టి చూచే. he whois * of his words మితభాషిగా వుండేవాడు. he who is * in his diet మితాహారము చేశేవాడు.
Sparingly adv మితముగా, మట్టుగా.
Spark n s మిణుగురు, కణము. a * of fire అగ్నికణము, స్ఫులింగము. he has not a * of sense వాడికి రవంతైనా తెలివిలేదు. there is not a * of life remaining రవంతైనాప్రాణము లేదు. the vital * ప్రాణము. the divine * ప్రాణము, అంతరాత్మ,జ్ఞానము. a fop or beau నీటుగాడు, సొగసుగాడు, విటుడు.
Sparkish adj gay, showy, fine సొగసైన.
Sparkle n s a spark, a small particle of fire మిణుగురు,అగ్నికణము. lustre తళుకు, నిగనిగలు, ధగధగలు, మినుకు,చాకచక్యము.
Sparring n s boxing, using the fists మల్లయుద్దము. theytake great pleasure in * వాండ్లకు మల్లయుద్దములో నిండా యిష్టము.or mere contention వాగ్వాదము, ఘర్షణ.
Sparrow n s పిచ్చిక, ఊరపిచ్చుక.
Sparrowhawk n s the female of the musket hawk పెంటిడేగ.
Sparry adj consisting of spar స్ఫటికమయముగా వుండే, స్ఫటికశిలామయమైన.
Spasm n s convulsion ఈడ్పు.
Spasmodic adj convulsive ఈడ్పులు యీడ్చే, కాళ్లుచేతులు యీడ్పులుయీడ్చే, అనిశ్చయమైన.
Spat n s the spawn of shell-fish గుల్ల పురుగుల జెన.
Spatterdashes n s coverings for the legs; by which the wetis kept off కాళ్ళు బురద కాకుండా మడిమెలు మొదలుకొని మోకాళ్ళదాకా బొత్తాసులతో కాళ్ళకు తగిలించుకొనే గుడ్డ.
Spattered adj బురదైన, మురికైన, చెదిరిన. the place was all* with blood ఆ స్థలమంతా నెత్తురు మరకలు కట్టి వుండినది, ఆ స్థలమంతానెత్తురుతో తడిశి వుండినది.
Spatterings n s చినుకులు, మరకలు.
Spatula n s పెళాస్త్రి చరిమేబద్ద, పెళాస్త్రి చరిమే కత్తి.
Spavin n s this disease in horses is a bony excrescence,or crust as hard as a bone, that grows on the inside of the hough గుర్రానికి వచ్చే వొక రోగము, ఇందుచేత గుర్రములు కుంటివైపోతవి. Spawn, n. s. the eggs of fishes and frogs జెన, అనగా చేప,కప్ప, వీటి గుడ్లు.
Speaker n s మాట్లాడేవాడు, వక్త. a public * పదిమందిలో జంకులేకుండా మాట్లాడేవాడు. the * of the house of Commons సభానాయకుడు. But కథికుడు.is the word in Ward 3. 299.
Speaking p|| మాట్లాడే,చెప్పే,strictly * or properly * న్యాయముగా,ముఖ్యముగా, విశేషముగా. properly * this is the third part యిది న్యాయముగా మూడోభాగము. Generally * ముఖ్యముగా. a vivid or * (eloquent)eye మనసులో వుండే భావమును తెలియచేసే చూపు. * trumpet మాట్లాడేగొట్టము,అనగా దూరములో వుండే వాండ్లకు వినేటందుకై నోటికి ఆనించుకొని మాట్లాడే పెద్దగొట్టము.
Spear n s బల్లెము, ఈటె, బర్చి, కుంతము. short * తోమరము, నేజా.a * without point బరికట్టె. a fish * పంటె. a broad bladed *ముకుందబల్లెము. I broke a * with him వాడికీ నాకు జగడమైనది.
Speargrass n s రక్కసిగడ్డి, చిగిరింతగడ్డి.
Spearman n s ఈటెవాడు.
Spearmint n s ఒక చెట్టు.
Special adj విశేషమైన, ముఖ్యమైన, ప్రధానమైన, ఘనమైన, ఉత్తమమైన.by a * providence విశేషమైన వొక యీశ్వర సహాయముచేత.
Speciality n s విశేషము, అధికారము, ప్రభావము.
Specially adv విశేషముగా, ముఖ్యముగా.
Special-pleading n s కుతర్కము, యుక్తులు పన్నడము. he used *హేతువులకు హేతువులు చెప్పి నేర్చి నేర్చి మాట్లాడినాడు, యుక్తులు పన్ని మాట్లాడినాడు.
Specialty n s the province wherein a man excels విశేషము, అధికారము.
Specie, InSpecie adv రూకలు,రొక్కముగా, నగదుగా. they paidone thousand rupees in specie and one thousand in paper వెయ్యిరుపాయలు రొక్కముగానున్ను వెయ్యి రూపాయలు నోట్లుగానున్ను చెల్లించినారు.
Species n s భేదము, జాతి, విదము. he rails as his * (Addison)తాను మనిషిగా వుండి మానవులనే దూషిస్తున్నాడు.
Specific adj విశేషమైన, ముఖ్యమైన. there is a * rule regardingthis యిందున గురించి విశేషమైన వొక సూత్రమున్నది, వేరే వొక సూత్రమువున్నది.
Specifically adv విశేషించి, విశేషముగా, ముఖ్యముగా.
Specification n s వివరణము, వివరము.
Specified adj విశేషమైన, ఉదాహరించిన, నిర్ధేశించి చెప్పిన.
Specimen n s మచ్చు, మాదిరి, సవతు, దృష్టాంతము. a fine *of needlework యిది కుట్రపుపనిలో శ్రేష్టమైనమాదిరి. I will bringyou a * of the stone ఆ రాయికి మాదిరి తీసుకొని వస్తాను. this is a * of his hand-writing యిది వాని అక్షరాల మాదిరి, యిది వాడి వ్రాలు. he brought this as a * of the leaves ఆ ఆకులకు మాదిరిగాదీన్ని తీసుకొని వచ్చినాడు.
Speciosuly adv బైటికి న్యాయముగా, చూపుకు బాగుగా.
Specious adj చూపుకు బాగా వుండే, బైటికి సొగసుగా వుండే, బూటకమైన,పైకి మినుకుగా వుండే. a * hypocrite బైటికి మంచివాడుగా వుండే మోసగాడు.a * excuse బైటికి సొగసుగా వుండే సాకు, పనికిమాలిన సాకు.
Speciousness n s బైటికి బాగా వుండడము, చూపుకు బాగా వుండడము,పై మినుకు. from the * of his conduct వాడి నడక బైటికి బాగా వున్నది గనక.
Speck n s పొడ, మచ్చ, మరక. the country is a mere wildreness with a few *s here and there inhabited ఆదేశమంతావట్టి అడవి, అయితే చెదిరినట్టు అక్కడక్కడా వొక వూరు వున్నది.
Specked adj పొడలుగల, మచ్చలుగల.
Speckle n s చిత్రవిచిత్రము, పొడ, మచ్చ.
Speckled adj చిత్రవిచిత్రమైన, మచ్చలుగల.
Spectacle n s a show వేడుక, వింత, తమాషా, వేడుకగా వుండేటిది,వింతగా వుండేటిది. a pair of *s సులోచనము, ముక్కద్దము.
Spectator n s చూచేవాడు, చూస్తూ వుండినవాడు, సాక్షి.
Spectrum n s an image; a visible form ప్రతిమ, ప్రతిచ్ఛాయ.
Speculation n s mental view; యోచన, ఎన్నిక. a buying inexipectation of a rise in price క్రియలేనియోచన, వట్టి యెన్నిక,మంచివెల వచ్చునని తెగించికొనడము.
Speculative adj that which rests in thought or idea నిరాధారమైన,నిరర్దకమైణ, క్రియలేని, భ్రామికమైన, ఎన్నిలు పెట్టె. a mere * pointవట్టి అనుమానము. a * belief నిరాధారమైన నమ్మిక. a * philosopher నిరాధారమైన ఆలోచనలు చేసే జ్ఞాని.
Speculatively adv భ్రామికముగా, అనుమానముగా, ఎన్నికలు పెట్టుతూ.
Speculator n s యోచనలుచేసేవాడు, ఎన్నికలు పెట్టుతూ వుండేవాడు,యుక్తాయుక్తము విచారించక యెట్లాతోస్తే అట్లా చేసేవాడు. *s in Indigoనీలి మందులో నిండా వారుకో వచ్చునని రూకలు వేసేవాండ్లు. he is no* వాడు కండ్లు మూసుకొనిపోయి పడేవాడు కాడు, గట్టి విమర్శ చేసేవాడు.
Speculum n s a mirror అద్దము, దర్పణము. * in the eye కనుపాప వుండే అద్దము.
Sped past part of Speed తీరిన. he is well * వానిపని సుఖముగా తీరినది. he is foully * వానిపని చెడినది, చంపబడ్డాడు.
Speech n s వాక్కు, మాట. men are gifted with * దేవుడుమనుష్యులకు మాట్లాడే శక్తిని యిచ్చినాడు. he made a long * aboutthis యిందున గురించి బహుదూరము మాట్లాడినాడు. all his * is of no use వాడి మాటలు పనికిరావు. I had not the power of * నాకునోరాడక పోయినది, నాకు నోటిమాట రాక పోయినది. fluency of * వాగ్ఘరి.the parts of * భాషాభాగములు, అనగా noun, adjective, verb మొదలైనవి.
Speechless adj నోరుపడ్డ. he was * వాడికి నోరుపడ్డది, అనగామాట్లాడేశక్తి పోయినది.
Speed n s త్వర, వేగము, చురుకు. a horse that has * వడిగలగుర్రము. with all * అతి త్వరగా. they went at full * అతి త్వరగావెళ్లినారు. they wished him good * (or, God *) వాడికి శుభంకలుగుగాక అని దీవించిరి.
Speedily adv త్వరగా, తీవ్రముగా.
Speedy adj త్వరగల, వడిగల, వేగముగల.
Spell n s charm మంత్రము. she cast a * over him వాడిమిదమంత్రచ్చాటన చేసినది. a task, a job, a turn of work వొకపూట పని.
Spelling n s అక్షరాలు కూర్చడము, గుణింతము.
Spelter n s తుత్తినాగము.
Spencer n s a coat without tails ఆడవాండ్లు తొడుక్కొనే వొకవిదమైన బట్ట.
Spendthrift n s దూపరదిండి.
Spent past participle of the verb ToSpend వ్రయముచేయబడ్డ, he walked ten miles and then was quite * ఆమడ దూరము నడిచివాడి ప్రాణము విసికినది.
Sperm n s or seed రేతస్సు. a substance called spermacetiwhich is like wax మైనము వంటిది వొకవస్తువు, చేపకొవ్వు, సొర్ర రెట్ట, దీనితో వత్తులు చేస్తారు. These are the expression in theTariff.
Spermatic adj రేతస్సంబంధమైన. the * vessels కళాస్థానములు,కళలు.
Spetre n s appearance of persons dead భూతము, దయ్యము,పిశాచము.
Spewing n s వమనము, వాంతి.
Sphacelus n s a gangrene; a mortification శరీరములో వొక భాగము కుళ్ళడము, మురిగిపోవడము.
Sphere n s a globe, orb గోళము, ఉండ, మండలము, చక్రము.the * of the universe బ్రహ్మాండము. the * of the earthభూగోళము, భూచక్రము, భూవలయము. the * of the eye కనుగుడ్డు.the celestial * ఖగోళము. the terrestrial * భూగోళము. at dawn the lamp contract the * of their radiance ఉదయకాలములోదీపము యొక్క ప్రకాశము సంకోచిస్తున్నది. Raghuvams. 5. 74. స్వకిరణపరివేషోద్భేద శూన్యః ప్రదీపాః. province; compass of knowledge or action శక్తి, అధికారము. he is out of his proper * వాడు తాను వుండవలసిన స్తానము తప్పివున్నాడు, how can you teach this artto a child? it is quite out of his * యీ శాస్త్రమును నీవుబిడ్డకు యెట్లా నేర్పబోతున్నావు యిది వాని శక్తిని మించి యున్నది. a childrecolects all that is with the * of his observation బిడ్డకు తెలుసుకొనే శక్తిలోబడ్డ వాటినంతా జ్ఞాపకము పెట్టుకొంటున్నది.mathematicks is quite beyond their * మహాగణితము వారి శక్తిని మించి వున్నది, వారికి గ్రాహ్యమయ్యేది కాదు. that affair is out of my * ఆ కార్యము నా శక్తిని మించి వున్నది. ఆ కార్యమును చేశే శక్తి నాకు లేదు. thefts and murders are within the Magistrate's * but suits for land or debt are beyond his * దొంగతనములు హత్యలు విచారించే అధికారము మేజస్ట్రీటు వారికి వున్నదిగాని నేలలు అప్పులు వీటినివిచారించే అధికారము వారికి లేదు. the music of the *s దేవగానము.
Spherical adj గుండ్రనైన, వట్రువైన, వర్తులమైన, బటువైన.
Spherically adv వర్తలముగా, బటువుగా, గుండుగా.
Sphericity n s గుండ్రన, నర్తులత్వము.
Spheroid n s అండాకారము, అండాకారముగా వుండే గోళము.
Sphinx n s a famous monster in Egypt having the faceof a virgin and the body of a lion ముఖము ఆడదానివలెనున్ను శరీరము సింహమువలెనున్ను వుండేటిది, యిది కష్టమైన విడి కథలు అడిగి వాటిని విప్పని వారిని చంపివేసే రాక్షసి.
Spice n s సంబారము, మసాలా. without the least * of angerకోపమనే వాసన లేకుండా, కోపమనే పొళుకువ లేకుండా. he has not a * of sense వాడికి రవంతైన తెలివి లేదు.
Spiced adj సంబారము చేర్చిన, మసాలా వేసిన.
Spicery n s సంబారము, మసాలా.
Spiciness n s flavour సంబారపురుచి. form the * of the tasteఅది సంబారపు రుచిగా వున్నది గనక.
Spick-and-span-new adj quite, new; now first used (Johnson)కొత్తకొత్తగా వుండే, యిదివరకు యేవరున్ను అంటని, వాడని.
Spicy adj సంబార సంబంధమైన. a * taste సంబారపు వాసన,మసాలా వాసన. a * jest సరసమైన యెగతాళి.
Spider సాలెపురుగు,లూత, the large venomous * పురికొస. In Prov. XXX. 28 the animal meant is the lizard బల్లి, or perhaps నలికరిపాము.
Spider-ant n s కట్టెచీమ.
Spigot n s a pin or peg put into the faucet to keep in theliquor బిరడా.
Spike n s of iron ఆణి, శలాక, నారసము, కొనన వాడిగా వుండేనిడూపాటి, యినుపశలాక, లేక కర్ర.
Spikenard n s జటామాంసి అనే వృక్షము.
Spill n s a small shiver of wood or thin bar of ironపుడక, శలాక.
Spillikin n s పుల్ల, పుడక.
Spilt adj ఒలకబోసిన, చిందిన. she wiped up the milk that was* వొలకబోసిన పాలును తుడిచి వేసినది. there was much blood * in this battle యీ యుద్ధములో బహుమంది చచ్చినారు.


English to Telugu free online dictionary
Enter English word and know Telugu meaning

No comments:

Post a Comment