Monday, February 7, 2011

Talon English to Telugu free online dictionary

Talon n s the claw of a bird of prey గోరు, నఖము, ఇది డేగ మొదలైన పక్షిగోళ్ళను గురించిన మాట.
Tamarind n s ( Tree ) చింత చెట్టు. the fruit చింతపండు.
Tamarisk, or Tamarix n s. ఈతచెట్టులో భేదము, ఝావుకః. Wils.
Tamboured adj బుట్టాలు వేసిన.
Tambourine, Tambour,Tombor n s. a kind of little drum గిలక తప్పెట.tambour frame వస్త్రము మీద పూలు బుట్టాలు వేశేటందుకై వలయమువలె కట్టినబద్ద,దీనిమీద వస్త్రమును బిగించికట్టి పూలు వేస్తారు.
Tame adj not wild; domestick సాధువైన, శాంతమైన, మనుష్యులలో మెదిగిన. a* cat వూరపిల్లి. a * hog వూరపంది. * fowls పెరటి కోళ్ళు, వూరకోళ్ళు. bynursing it so long the jackal grew * నిండా దినాలు పెంచినందున నక్కమనుష్యులలో వాడుక పడిపోయినది. a * hawk పెంపుడు డేగ. the birds in thisdesert are so * that they alight almost at the feet of the horses యీఅడవిలో పక్షులు నిర్భయముగా వుండేటివి గనక గుర్రాల కాళ్ళ మీద వాలుతవి. this is a* poem యిది నిస్సారమైన కావ్యము.
Tamed adj మరిగిన, వాడుకబడ్డ, మెలిగిన, మెదిగిన. after the elephant was *యేనుగ మనుష్యులలో మెలిగేటట్టుగా చేసిన తర్వాత. parrots are easily * చిలకలుమనుష్యులలో సులభముగా వాడుకపడి పోతవి. he was * affliction ఆ వ్యాకులముతోవాడి పొంగు అణిగినది. a crow cannot be * కాకి మనుష్యులలో యిమిడి వుండదు.mungoose is very easily * ముంగిస మనుష్యులలో సులభముగా మెదిగి వుంటున్నది.
Tamely adv meanly; spiritlessly సాధువుగా, జబ్బుగా, నీచత్వముగా. he *submitted వాడు అడ్డమాడకుండా లోబడ్డాడు.
Tameness n s gentleness; mean submission సాధుత్వము, మెత్తాదితనము.
Tamil n s అరవము, అరవభాష, ద్రవిడము. the * country అరవదేశము.
Taming n s మరగడము. a hawk requires much * డేగ మరగడము నిండాకష్టము. a parrot requirer very little * చిలక మరగడము నిండా సులభము.
Tampered adj meddled, జోలికి పోబడ్డ, చెరపబడ్డ, దుర్బోధన చేయబడ్డ.witnesses that have been * with చెరపబడ్డ సాక్షులు.
Tampering n s జోలికి పోవడము, దుర్బోధన చేయడము, చెరపడము. his * ruinedthe witnesses వాడి దుర్బోధన వల్ల సాక్షులు చెడిపోయినారు.
Tamulain n s అరవవాడు. * female అరవది.
Tan n s the bark of the oak వోకు అనే చెట్టు యొక్క పట్ట, దీనితో చర్మమునుపదును చేస్తారు. an inveterate * కొంచానపోని మంచి కందు వన్నె.
Tandem n s ముందు వెనకగా రెండు గుర్రములు కట్టిన వొక బండి.
Tang n s a taste left in the mouth తిన్న వెనక కొంచాన పోకుండా వుండే రుచి.
Tangent n s a line touches a circle మండలమును అంటినట్టుగా వుండే నిడుపుగీత, గలయస్పర్శ రేఖ. Jour. of Asiat. Soc. 3.514. స్పర్శ రేఖ. he went offat a *, or he flew off at a * భగ్గున మండిపడ్డాడు. he flew off at a * andbegan to talk about the quarrel లటక్కున యీ సంగతిని విడిచిపెట్టి ఆ జగడపుసంగతిని యెత్తుకొన్నాడు.
Tangible adj that may be touched స్పర్శ నీయమైన, స్పర్శేంద్రియ గ్రాహ్యమైన,తాకకూడిన, ముట్టుకూడిన. air is not * ఆకాశము స్పర్శించకూడనిది. a ghost is no *దయ్యమును పట్టబోతే చేతికి తగలదు. In modern English it is a cant word forgood, pretty, fair, possible. I see no * benefit in this business యిందులోనిజమైన ఫలము లేనట్టు వున్నది.
Tangle n s చిక్కు. a sort of sea-weed వొక విధమైన సముద్రపు పాచి.
Tangled adj చిక్కుబడ్డ. * silk చిక్కుబడ్డ పట్టు.
Tank n s గుంట, తటాకము, చెరువు. the " Spur * " ( Egmore tank ) atMadras is called యెగుమూరి చెరువు. or, యెళుంబూరి చెరువు. The " Long * "is called కోడంబాక చెరువు. an iron * or reservior in a ship or buildingతటాకము, అనగా వాడలో నీళు పోశి పెట్టే పెద్ద యినప తొట్టి. the * diggers ఉప్పరవాండ్లు.
Tankard n s a large vessel with a cover, for strong drink పై మూతగలగిండి.
Tanned adj పదును చేయబడ్డ. * by the sun కందిన.
Tanner n s చర్మమును పదును చేసేవాడు.
Tanpit n s చర్మమును పదును చేయడమునకై నాన వేశే గుంట.
Tansy n s a flower ఒక పుష్పము. a pudding వొక ఫలాహారము.
Tantalizing adj ఏమార్చే, వట్టి ఆశలు పెట్టే. this is very * యిది వట్టి ఆశలు చూపి వ్యాకుల పరిచేటిది.
Tantamount adj ప్రాయమైన, తుల్యమైన. this is * to paying the money యిదిరూకలు చెల్లించిన దానితో సమానమే. this is * to a gift యిది బహుమానప్రాయమేను. this is * to a confession యిందువల్ల నేరము వొప్పుకొన్నట్టే అయినది.
Tantivy adv చివచివ.
Tanyard n s తోళ్ళు చక్క పెట్టే చోటు.
Tap n s తట్టు, అనగా తట్టినట్టు, తాడనము. a pipe at which the liquor of avessel is let out పీపాయిలో నుంచి నీళ్ళు కారే గొట్టము. the * of of an alehouse or a * room కల్లంగడి. * root కుంకటి వేరు, పెద్దనడిమివేరు.
Tape n s నాడా. a broad strong * used in lacing beds నవారు.
Taper n s సన్నమైన పువత్తి.
Tapering adj కూచిగావుండే, ఆదోకపాటుగా వుండే, కిరీటాకృతిగా వుండే. her * waist దాని సన్నమైన నడుము.
Tapestried adj చిత్రవిచిత్రమైన.
Tapestry n s cloth woven in regular figures చిత్ర విచిత్రముగా నేశినవస్త్రము, నానా విధముగా సరిగ పూలు మొదలైనవి వేశిన వస్త్రము.
Tapeworm n s నిండా నిడుపుగా వుండే యేటిక పాము.
Tapis n s ( A French word; the carpet ) రత్న కంబళి. the literal senseis not used. This matter was brought upon the * యీ సంగతి ప్రస్తావమువచ్చినది. matters that are not upon the * అప్పుడు ప్రస్తాపము చేయనిసంగతులు.
Taproot n s కుంకటివేరు, తల్లి వేరు.
Tapster n s కల్లు అంగడివాడు.
Tar n s కీలు. a word for a sailor వాడవాడు.
Tarantula n s నిండా విషముగల వొక చెలిది పురుగు, దీన్ని పురికొస అంటారు,యెవణ్నైనా యీ పురుగు కుట్టగానే వాడు తన ముందర వాయించే పిడీలు మొదలైనవాయిద్యమునకు సరిగ్గా ఆడితే దాని విషము దిగిపోతున్నదని అంటారు. surely a * hasbitten him ( Smollett ) అయ్యో యేమి వెర్రితాండవ మాడుతున్నాడు.
Tardily adv జబ్బుగా, మందముగా, తామసముగా.
Tardiness n s మందము. from the * of the spring వసంత రుతువు జబ్బుగావున్నది గనక, అనగా వసంతరుతువు వచ్చిన్ని దాని లక్షణము కానము గనక.
Tardy adj మందమైన, జబ్బైన జాప్యమైన. from his * progress in learningవాడికి చదువు జబ్బుగా వున్నది గనక. he gave a * consent వాడు బహు కష్టము మీదవొప్పుకొన్నాడు.
Tare n s In commerce, deficiency in the weight or quantity of goodsby reason of the weight of the cask, bag, or other thing containing thecommodity, and which is weighed with it; hence, the allowance orabatement of a certain weight or quantity from the weight or quantityof a commodity sold in a cask, chest, bag, or the like, which theseller makes to the buyer on account of the weight of such cask,chest, or bag; or the abatement may be on the price of the commoditysold. When the tare is deducted, the remainder is called the net or neatweight. ( Webster ) తోపుడు, తూనికెలో తోపుడు, దీన్ని తారమంటారు.
Tares n s a certain plant పయిరులో పడే వొక కలుపు.
Targe n s a shield డాలు.
Target n s a shield డాలు. also a mark at which arrows are shotనడమ బొట్టు వేసిన గురి పలక.
Targum n s వ్యాఖ్యానము, భాషాంతరము.
Tariff n s నిరకునామా.
Tarnished adj కాంతిహీనమైన, మెరుగుమాసిన, కళతప్పిన. * silver మకమకలాడేవెండి. a * reputation చెడిపోయిన పేరు, అపనింద.
Tarpaulin n s కీలుచాప.
Tart adj sour; acid పుల్లని, పుల్లగా వుండే. green mangoes are *మామిడికాయలు పులుసుగా వుంటవి. * words క్రూరమైన మాటలు.
Tartan n s నానావర్ణములుగా నేశిన కంబళి.
Tartar n s what sticks to wine casks, like a hard stone, either whiteor red, as the colour of the wine from whence it comes వొయిసుపీపాయిలలో సీమసున్నమువలె గడ్డ కట్టిన మష్టు, దీన్ని ఔషధముగా వాడుతారు. the * ofthe teeth పండ్లకు కట్టిన గార. an inhabitant of Tartary టార్టరీ దేశస్థుడు. he isa regular * వాడు దూర్వాసుడు, వాడు ప్రచండుడు. he has caught a * వుడుముచిక్కుంటే మానె చెయి విడిస్తే చాలునని అయినది. he is generally a * at bottom (Smollett & c ) చూస్తే అట్లా వున్నాడు గాని వాడు యముడాయెనే. If you go andmeddle with him yo will catch a * నీవు పోయి వాడి జోలికి పోతివా అవతల నీపని వున్నది. * emetic వాంతిమందు. cream of * ఇది వొక మందు.
Tartarus n s నరకము.
Tartness n s పులుసు, చురుకు, తీక్ష్ణము, చిరచిర.
Tarty adv sharply తీక్ష్ణముగా, చిరచిరమని. she answered him * కోపముగాచెప్పినది.
Task n s పని, కార్యము, పెట్టిన పని, పాఠము. a Herculean * భగీరథ ప్రయత్నము,అసాధ్యమైన పని. to take to * చీవాట్లు పెట్టుట, కూకలు పెట్టు. he took them to *వాండ్లను చీవాట్లు పెట్టినాడు.
Tasked adj తొందరపడిన. he was severely * to do this దీన్ని చేయడానకునిండా శ్రమపడ్డాడు.
Tasker, Taskmaster n s. యజమానుడు.
Tassels n s plu. కుచ్చులు.
Taste n s రుచి, చవి, రసము. in this water there is an earthly * యీనీళ్ళలో మంటి వాసన వస్తున్నది. or judgement వివేకము. a man of * వివేకి,రసికుడు. I have no * for such books ఆ పుస్తకముల మీద నాకు యిష్టము లేదు.bad * ( that is, erroneous judgement ) అవివేకము, రసాభాసము. this verseis in bad * యీ పద్యము రసాభాసముగా వున్నది. his letter is written in verygood * వాడి జాబు మహాసరసముగా వ్రాయబడి వున్నది; they have no * forreading వాండ్లకు చదువు మీద ఆశ లేదు.
Tasteful adj సరసమైన, యింపైన, సొగసైన.
Tastefully adv సరసముగా.
Tasteless adj నీరసమైన, విరసమైన, రుచి లేదు. perfectly good watershould be * శ్రేష్ఠమైన నీళ్ళలో వొక వాసనా వుండకూడదు, వాసన లేని నీళ్ళే మంచినీళ్ళు. this rice is * యీ అన్నము చప్పగా వున్నది. he made a * alteration inthe verse ఆ పద్యమును వాడు దిద్దడము విరసము.
Tastelessness n s విరసము, నీరసము, చప్పన.
Tasteliness n s నాగరీకత. from the * of their dress వాండ్ల బట్టలునాగరీకముగా వున్నవి గనక.
Tastily adv సరసముగా, నాగరీకముగా, సొగసుగా.
Tastiness n s నాగరీకత, సరసత.
Tasty adj elegant సరసమైన. a * dress నాగరీకమైన వుడుపు.
Tat , or Tattoo n s. (a horse) తట్టువాణి గుర్రము. Tat, or Tatty, n. s. a kind of screen తడక.
Tatler n s one who talks వదిరేవాడు, పేలేవాడు.
Tatterdemalion n s a miserable wretch దిక్కుమాలినవాడు.
Tattered adj చినిగిపోయిన, పేలికలైన.
Tatters n s plu. bits fragments తునకలు, చినిగిన గుడ్డలు, పేలికలు.
Tattle n s ముచ్చట, పేలడము, వదరడము.
Tattler n s వదరుబోతు.
Tattling n s ముచ్చట, వదరడము, పేలడము.
Tattoo n s the beat of drum by which soldiers are warned to theirquarters సిపాయీలు వచ్చి చేరేటట్టుగా తంబుర కొట్టడము. also a horse తట్టు.marks on the skin దేహము మీద పొడిచే పచ్చ.
Tattowed marks n s పచ్చ.
Tatty n s ( Indian word for a screen ) తడక. the fragrant root ofwhich these screens are sometimes made of is called వెట్టి వేళ్ళు.
Taught past and participle of the verbToTeach నేర్పిన,నేర్పబడ్డ
Tauntingly adv కుత్సితముగా, ఎత్తి పొడిచి, ఎగతాళిగా, నిందగా.
Taurus n s the sign of the bull వృషభరాశి.
Tautological adj చెప్పినదాన్నే చెప్పే, పునరుక్తమైన.
Tautology n s ఆమ్రేడితము, చెప్పిన దాన్నే చెప్పడము, పౌనరుక్త్యము.
Tavern n s సత్రము, చావడి. a house where wine is sold, and drinkersare entertained కల్లంగడి, పూటకూళ్ళ యిల్లు.
Tavernkeeper n s సారాయి అమ్మేవాడు, పూటకూళ్లు వేశేవాడు.
Taw n s a marble to play with పిల్లకాయలు ఆట్లాడే యెర్రగోలి గుండు.
Tawdry adj paltry, contemptible పిచ్చి సొగసుగా వుండే, బుడుబుడుక్కులవాండ్లవేషము వలె వుండే. in the Mohurram they wear * dresses మొహరములోపిచ్చిసొగసు బట్టలు తొడుక్కొంటారు.
Tawny adj a sort of yellow మెరుగు పెట్టిన, తామ్రవర్ణమైన, కపిలమైన. a * tint పింగళ వర్ణము, గోరోచన వర్ణము. a * ( salmon coloured ) vest కావివస్త్రము.
Tax n s పన్ను. property * వాడివాడి ఆస్తికి తగినట్టుగా తీశేపన్ను. a certain *upon traders వీసబడి. this was a great * upon his time యిందువల్ల వాడికినిండా కాలము వృథాగా పోయినది. this was a great * upon his patienceయించువల్ల వాడి ప్రాణము విసికినది.
Taxation n s పన్ను వేయడము, పన్ను కట్టడము.
Te Deum n s జయించగానే దేవుణ్ని గురించి పాడే వొక మంగళ శ్లోకము. after thebattle the army sung * యుద్ధము కాగానే సైనికులు టీడియమనే మంగళ శ్లోకమునుచదివినారు.
Te Heal v a మాన్పుట, వాసిచేసుట, స్వస్థపరచుట.
Tea n s a article of grocery తేయాకు. as a beverage తేనీళ్ళు. a green *పచ్చని తేయాకు. black * నల్లని తేయాకు. Hyson *, Pekoe * వొక విధమైనతేయాకులు. a balm *, or lemon grass * నిమ్మకసువు వేశి కాచిన నీళ్ళు. ginger *శొంఠికషాయము. * made of penny royal తులసి కషాయము. beef * మాంసము వేశికాచిన కషాయము. * things తేనీళ్ళకు కావలశిన చిప్పలు గరిటెలు మొదలైన సామానులు. * board, or * tray తేనీళ్లతట్ట, తేనీళ్ల పింగాణూలు పెట్టే తట్ట. * table talkముచ్చట, వేడుకమాటలు, * time సాయంకాలము. they arrived before *ఆస్తమానము కాకమునుపే వచ్చి చేరినారు.
Teachable adj శిక్షార్హమైన. a parrot is *, but a crow is not చిలకకు నేర్పితేనేర్చుకొంటున్నది గాని కాకికి నేర్పితే నేర్చుకోనేరదు.
Teachableness n s శిక్షార్హత. from the * of a dog కుక్కకు నేర్పితే నేర్చుకోతగ్గది గనక.
Teacher n s నేర్పేవాడు, ఉపాధ్యాయులు, శిక్ష చెప్పేవాడు. a spiritual * గురువు,బోధకుడు.
Teacherous adj ద్రోహియైన, నమ్మరాని, వంచనగల. the * soil కాలుజారే భూమి.
Teaching n s నేర్పడము, శిక్ష.
Teak n s టేకు మాను.
Teal n s a wild fowl of the duck kind ఒక విధమైన అడవి బాతు. thewhistling * చిలువ బాతు.
Team n s a number of horses or oxen drawing at once the samecarriage బండికి కట్టే వొక విడితి గుర్రములు, లేక యెద్దులు. a * of eight cattledrew the waggon ఆ బండిని యెనిమిది యెడ్లు యీడ్చినవి.
Teapot n s నీళ్ళు పోశే జాడివంటి వొక చెంబు.
Teapoy n s a little table చిన్న బల్ల.
Tear n s కన్న్నీరు, బాష్పము, అస్రువు. she was in *s at this యిందున గురించి,కండ్లనీళ్ళు పెట్టుకొన్నది. to shed *s కన్నీళ్లు కార్చుట. crocodile *s నీలి యేడ్పు.
Tearful adj ఏడ్చే, కండ్ల నీళ్లు పెట్టుకొనే.
Teasing n s తొందర, పీడనము, బాధ.
Teat n s చన్ను. a goat's *s మేక చండ్లు.
Teatotal adj మదద్రవ్యములు, తాగని మత సంబంధమైన.
Teatotaler n s సారాయిని మానుకొన్నవాడు.
Teatotalism n s సారాయి కారాదనే మతము.
Technical adj పారిభాషికమైన, సాంకేతికమైన. a * term పారిభాషిక శబ్దము. thebusiness is easy, but the lawyers make * difficulties వ్యవహారముసులభమైనదే గాని ఆలాయలున్ కొన్ని సాంకేతికమైన సంకటములు పెట్టుతున్నారు. Iunderstand this word, but I do not know, the * meaning యీ శబ్దము నాకుతెలుసునుగాని దీని సాంకేతికార్థము నాకు తెలియ లేదు. memoria technicalజ్ఞాపకార్థముగా చేయబడ్డ సంకేతము.
Technicality n s సంకేతము, పరిభాష.
Technically adj సాంకేతికముగా, పరిభాషగా. one kind of paper is * calledfoolscap వొకవిధమైన కాకితమును సంకేతముగా పిచ్చి టోపి అని అంటారు.
Techy adv peevish; fretful ముసురుమూతి యైన, మండిపడే.
Tedded pastp|| scattered,spreadout పరచిన,పరవబడ్డ
Tedious adj slow, wearisome, tiresome విసుకుపుట్టించే, కొంచానతీరని,తామసమైన, తొందరైన, ఆయాసకరమైన. a * story యెంత సేపటికీ తీరని కథ. writinga Dictionary is a * task నిఘంటువు వ్రాయడము కొంచాన తీరే పని కాదు. totravel with bullocks is * యెడ్లను తోలుకొని దోవనడవడము తొందరగా వున్నది.this continued rain is very * విడవకుండా కురిశే యీ వానవల్ల నిండా తొందరగావున్నది.
Tediously adv విసుకుగా, చీదరగా ఆయాసకరముగా.
Tediousness n s విసుకు, తొందర, చీదర.
Teeming adj నిండిన, సంపూర్ణమైన. a * woman గర్భిణిగా వుండే స్త్రీ. a * floodసంపూర్ణమైన ప్రవాహము. a book * with beauties దివ్యమైన పద్యములమయముగా వుండే పుస్తకము.
Teens n s the years reckoned by the termination టీను అనే ప్రత్యయముకొనన వచ్చే సంవత్సరములు, అనగా. thirteen, fourteen, &c She is now in her *దానికి యిప్పుడు వయసు కాలము. she is not yet in her * దానికి యింకా వయసురాలేదు.
Teeth n s (plural of the word tooth) పండ్లు.
Teetotal adj మద్య ద్రవ్యములు తాగని మత సంబంధమైన.
Teetotalism n s సారాయి కారాదనే మతము.
Te-he interj of scorn! చీపో! భళా!
Teil tree n s ఒక చెట్టు పేరు.
Telegraph n s an instrument that answers the end of writing byconveying intelligence to distance through the means of signalsసంజ్ఞాయంత్రము, అనగా దూరము నుంచి సంజ్ఞలచేత మాట్లాడే వొక యంత్రము.
Telegraphic adj సంజ్ఞ చేత మాట్లాడే యంత్ర సంబంధమైన.
Telescope n s దుర్బీను, వోకు, దూరమున వుండేదాన్ని చూచే కొనన అద్దము గలగొట్టము.
Telestic adj తాత్వికమైన.
Telinga n s This is a Tamil word, adopted by musulmans butunknown to the Telugus.
Tell, tell v n. To take effect or to produce some effect సఫలమవుట,సిద్ధించుట, తగులుట, తట్టుట, తాకుట. every shot *s ప్రతి గుండు సఫలమవుతున్నది,తగులుతున్నది. this will never * యిది వొకనాటికీ పనికిరాదు. every little *s uponhis constitution వాడి శరీరము నిండా సున్నితమైనది గనక కొంచెము హెచ్చినా తగ్గినానిండా విరోధముగా వున్నది. every word he said told వాడు చెప్పినది వొకటైనానిష్ఫలము కాలేదు. this does not * in his favour యిది వాడిలో వొక సద్గుణము.this disease *s upon him యీ రోగము వాణ్ని కుంగగొట్టుతున్నది. the heat ofthis climate *s upon us in time కొన్నాళ్ళు వున్నందు మీదట యీ దేశము యొక్క యెండకాకమమ్మున కుంగగొట్టుతున్నది. the hot weather *s severely on the constitution యీ యెండ దేహానికి నిండా విరోధముగా వున్నది, యీవడ కళలనన్నీ పీలుస్తవి. the fever did not * upon him ఆ జ్వరము వాణ్ని నిండా పీడించలేదు. this plan *s very well యీ వుపాయము సఫలమవుతున్నది. the story *s well but it is false యీ కథ పొందికగా వున్ణది అయితే అబద్ధము. he is a foolish fellow, but he takes care of hisrelations, this *s well for him వాడు వొక వెర్రివాడు, అయితే తల్లిదండ్రాదులనుపోషిస్తాడు, వాడి యందు యిది వొక మంచి గుణము వున్నది.
Teller n s చెప్పేవాడు, లెక్కపెట్టేవాడు, యెంచుకొనేవాడు. fortune * సోదెచెప్పేవాడు. tale * చాడీలు చెప్పేవాడు.
Telling n s చెప్పడము, కథనము. a story never loses by * వాడి నోట్లో వీడినోట్లో పడి గోరంత సంగతి కొండంతగా పెరిగినది.
Telltale n s చాడీ చెప్పేవాడు. her * eyes భావసూచకమైన దాని చూపులు,భావమును తెలియచేసే దాని చూపులు.
Temerity n s rashness; unreasonable contempt of danger సాహసము,వెర్రి ధైర్యము. he had the * to go there సాహసము చేసి అక్కడికి పోయినాడు. hehad the * to tell this story to the king పిచ్చి పట్టి రాజుతో పోయి యీ సంగతిచెప్పినాడు.
Temper n s disposition of mind గుణము స్వభావము, ప్రకృతి. the * of iron&c పదును. when the metal is of a proper * లోహము మంచి పదునుకువచ్చేటప్పటికి. patience సహనము, వోర్పు. a man of good * మంచి గుణముగలవాడు, మంచివాడు, సరసుడు. a man of bad * విరసుడు, క్రూరుడు. he lost his* వాడికి కోపము వచ్చినది. he keeps his * రేగడు, ఆగ్రహపడడు. his * gave wayవాడి ప్రాణము విసికినది, రేగినాడు. keep your * కోపము వద్దు. constitution ofbody దేహప్రకృతి.
Temperament n s counstitution ప్రకృతి, స్వభావము. * of the body దేహప్రకృతి. the choleric * శ్లేష్మ ప్రకృతి. a cool * శీతళ ప్రకృతి, శీతళ శరీరము. aman of luxurious * సుఖభోగిగా వుండేవాడు. he is a victim to his * orpassions ( a French phrase ) పంచేంద్రియ బద్ధుడు. I have made some *sand explanations in this new edition ( Burke. ) యీ మాటు అచ్చువేయడములో కొన్ని దిద్దుబాట్లున్ను పరిష్కారములున్ను చేసి యున్నాను.
Temperance n s moderation; opposed to gluttony and drunkennessమితభోజనము, మితముగా తాగడము, యింద్రియ దమనము. a * man సారాయితాగకుండా అంటకుండా నీళ్ళే తాగేవాడు. * society తాగడము నిషేధించడమును గురించికూడే సభ. patience సహనము తాలిమి, వోర్పు.
Temperate adj not excessive; moderate మితమైన. sober తాగని. mildశాంతమైన. a * region or zone సమశీతోష్ణమైన భూమి, ప్రదేశము.
Temperately adv moderately మట్టుగా, మితముగా, తగుమాత్రముగా.
Temperature n s state with regard to heat and cold సమశీతోష్ణత. a high* ఉష్ణము. the * of the river was high ఆ యేటి నీళ్ళు వేడిగా వుండినది. a low* చలవ. being in so elevated situation this place enjoys a low * యిదివున్నతమైన స్థలము గనక యిక్కడ చల్లగా వున్నది.
Tempered adj disposed with regard to the passions గుణముగల. zeal *with discretion వివేక మిళితమైన భక్తి. good * సద్గుణముగల, మంచి భావముగల. bad * దుర్గుణముగల, చెడు గుణముగల, మండిపడే.
Tempest n s గాలివాన. a * of tears ప్రచండమైన యేడ్పు.
Tempestuous adj ప్రచండమైన. a * wind ప్రచండ వాయువు.
Templar n s a student of law, or in the temple, స్మృతి శాస్త్రాధ్యయన కర్త. The same as an Abbe మిండజంగము.
Temple n s గుడి, ఆలయము, మందిరము. A+ B+. his house is indeed a * ofdissipation. వాడి యిల్లు వొక దొమ్మరికొంప. the *s of the head కణతలు.
Temporal adj not eternal, belonging to this world అనిత్యమైన, నశ్వరమైన,ఐహికమైన. * happiness ఐహిక సుఖము. the * artery కణతలలో వుండే నరము. the* augment in Sanscrit spelling వృద్ధి.
Temporallities, Temporals n s. ఐహిక ధనము మొదలైనది.
Temporally adv not eternally, for a short time తత్కాలమునకు, ఆవేళకు.the treasure is * kept here ఖజానా తత్కాలమునకు యిక్కడ వుంచినారు.
Temporarily adv తత్కాలమునకు, ఆవేళకు, యీ వేళకు.
Temporary adj అనిత్యమైన, నిలకడలేని, కొన్నాళ్ళు జరిగే. this life is * ప్రాణమనిత్యము. a * appointment కొన్నాళ్ళకు వుండి పోయ్యే వుద్యోగము. a * abodeకొన్నాళ్ళు వుండడము. the * difficulties కొద్ది దినములకు తీరిపొయ్యే తొందరలు.
Temporizer n s కాలానుసారముగా నడిచేవాడు, ఇచ్చకాలమారి.
Temporizing n s కాలానుసారముగా నడవడము, వట్టి కాలవ్రయము.
Temptation n s enticement, allurement, trial తీపి, చూపినరుచి, పెట్టిన ఆశ,దుష్కర్మములో ప్రవర్తింప చేయడమునకై యత్నపడడము, బులుపు, ఉశికొలపడము, పరిక్ష. A+ శోధన. the beauty of the style is a great * to the student అతిసుందరమైన ఆ గ్రంథము యొక్క శయ్య విద్యార్థుల యొక్క మనసును ఆకర్షిస్తున్నది. thecheapness of the ring was one * and he like a fool bought it ఆ వుంగరమునయముగా వున్నదని వెర్రిపట్టి దాన్ని కొనుక్కొన్నాడు. the cheapness is a great *నయమైతే అందరు వచ్చి పడుతారు. by his * she fell వాడి దుర్బోధన వల్ల అది చెడ్డది.she resisted the * అది దుర్బోధనకు లోబడలేదు. this is a mere * యిది వట్టిదుర్బుద్ధి యిది వట్టి బులుపు. Viswamitra underwent many *s రంబాదులను పంపిఅనేక పర్యాయములు విశ్వామిత్రుని మనస్సు శోధించబడ్డది. what * could you haveto go there ? అక్కడికి పోవడానికి నీకేమి పట్టినది. in HIndu morality *s arecalled foes, అరిషడ్వర్గము. the six foes are enumerated as కామ, క్రోధ,లోభ, మోహ, మద మాత్సర్యములు. that is, lust, anger, covetousness, &c.he listened to the * ఆ దుర్బోధనకు లోబడ్డాడు. by the * of the devil he didthis సైతాను యొక్క దుర్బోధన వల్ల దీన్ని చేసినాడు, వానికి వొక దుర్బుద్ధి పుట్టి దీన్ని చేసినాడు. he fell into * మాయకు లోనైనాడు. the whole passage is socurious that resist the * to transcribe it ఆ పదమంతా నిండా చోద్యముగావుండినందున దాన్ని యిక్కడ వుదాహరించక నా మనసు నిలవలేదు. the roads wereso bad that we had little * to travel దోవ రసాభాసముగా వుండినందువల్లపోవడమునకు మాకు మనసు లేకపోయినది.
Tempted adj పరిక్షించబడ్డ, శోధించబడ్డ, బులుపు పెట్టబడ్డ, ఉశికొలుపబడ్డ, రేచబడ్డ. I should be * to doubt this దానిమీద నాకు అనుమానము తట్టుతున్నది. he was * to quarrel with them వాడికి వాండ్లతో జగడము చేయవలెనని వుండినది. I was * to tell him my mind నా మనసులోని మాట వానితో చెప్పక వుండలేక పోయినాడు. I was* to go there అక్కడికి పోవలెనని నాకు వొక బుద్ధి పుట్టినది.
Tempter n. s. an enticer దుర్భోధన చేసేవాడు, దుర్బుద్ధిపుట్టించేవాడు,దుర్మార్గమ, In I Thes. III.5, పరిక్షించేవాడు. A+ In HIndu morals tempters are called Foes ****** అరిషడ్వర్గము. Thus love, lust, avarice, &c. కామక్రోధ మద మాత్సర్యములు.
Tempting adj alluring దుర్బుద్ధి పుట్టించే, ఆశపుట్టించే, మనోహరమైన, మనసునుఆకర్షించే, మరులుకొలిపే. * fruit ఆకలి పుట్టించే పండ్లు, దీపన కారియైన పండ్లు. a* prospect మనసు కొట్టుకొనే ఆశ. her * beauty మనసును ఆకర్షించే దాని అందము. a* woman మరులు కొలిపే స్త్రీ. this is very * యిది నిండా మనోహరమైనది. a *dish ఇష్టమైన ఆహారము. this is not very * ఇది అంత మంచిది కాదు. the dinnerwas not at all * అక్కడ పెట్టి వుండిన ఆహారములు యెంత మాత్రం యిష్టములైనవి కావు. Itis * but I will not do it దాని మీద నాకు ఆశేగాని దాన్ని నేను చేయను.
Ten adj పది, దశము. I shall be there by * పది గంటలకు అక్కడికి వస్తాను.
Tenable adj that can be held or maintained రక్షణీయమైన, దార్ఢ్యమైన, గట్టి.that fortres is not now * ఆ కోట యిప్పుడు గట్టిగా వుండలేదు. that assertionis not * అది దృఢమైన మాటకాదు.
Tenacious adj జిగటవలె పట్టుకొనే, లేక, వదలని, పట్టుకొని పోరాడే, పిడివాదముగావుండే. as sticky జిగటగావుండే. this gum is not * యీ బంక బిగిగా పట్టుకొనేదికాదు. a * memory మంచి జ్ఞాపకము. a * creditor జిగిటవలె పట్టుకొన్న అప్పులవాడు. *of life మొండి ప్రాణము గల. he is * of this theory యిదే మాటను పట్టుకొనివదలక పోరాడుతాడు. he is very * of money వాడు నిండా బంక, వాడు నిండా లోభి.the prince was * of ceremony ఆ రాజు మర్యాదలకు పీకులాడేవాడు. he was * offeeding the horses himself గుర్రాలకు దాణా తానే పెట్టవలెనని పీకులాడేవాడు. theyare * of being seen, i.e. they avoid spectators [ a bad use of theword ] తమ్మున యెవరున్ను చూడరాదని యేడుస్తారు.
Tenaciously adv పిడివాదముగా, ముష్కరముగా. he maintained this * దీన్నిగురించి ముష్కరముగా మాట్లాడినాడు.
Tenaciousness, Tenacity n s. పిడివాదము, ముష్కరము, కోతిపట్టు, మొండిపట్టు.from the * of this gum యీ బంక గట్టిగా పట్టుకొంటున్నది గనక.
Tenancy n s Temporary possession of what belongs to anotherఅనుభవము, అనగా బాడిగె యిచ్చి అనుభవించడము, స్వామి, భోగము యిచ్చిఅనుభవించడము. during his * వాడి అనుభవములో వున్నప్పుడు.
Tenant n s బాడిగె యిచ్చి అనుభవించేవాడు, స్వామి భోగము యిచ్చిఅనుభవించేవాడు, బాడిగెకు వుండేవాడు, కాపురము వుండేవాడు. an under *లోపాయకారి. a * of the holy place or shrine తీర్థవాసి, పుణ్యక్షేత్రవాసి. the *s of the deep జలచరములు. the *s of the grove వనవాసులు, అనగా పక్షులు. the soul as a * of the body క్షేత్రజ్ఞుడు.
Tenantless adj కాపురములేని, విడిగా వుండే, వూరికెవుండే.
Tench n s a certain fish ఒక విధమైన జల్ల చేప.
Tendance n s attendance కాచుకొని వుండడము, యెదురు చూస్తూ వుండడము.care; act of tending రక్షణము, పరిపాలనము, ప్రాపు.
Tendency n s course; drift ఆశయము, అభిప్రాయము, భావము పర్యవసానము. Ido not see the * of this regulation యీ చట్టము యెట్లా పర్యవసానముకాబోతున్నదో నాకు తెలియలేదు. this has a * to do evil యిది చెరువుగాపర్యవసానమయ్యేటట్టు వున్నది, యిందువల్ల చెరువు వచ్చేటట్టుగా వున్నది. from the *fo fire to spread నలుదిక్కుల వ్యాపించేది నిప్పు యొక్క గుణము గనక. from the* of milk to turn sour పెట్టిపెట్టితే పులిశి పోవడము పాలయొక్క గుణము గనక.
Tender adj soft; not hard మృదువైన, లేతైన పసి. delicate సుకుమారమైన,సున్నితమైన. from a * age చిన్నప్పటినుంచి. the skin of the foot is not * కాలితోలు కఠినము, నొప్పి తెలియదు. the part that you cut off the nail is not *;but the root is very * గోరుతీశేచోట తగిలితే నొప్పిలేదు గాని గోటికంటిలో తగిలితేనిండా నొప్పి. the boil was very * ` పుంటిని తాకితే ప్రాణము పొయ్యేటట్టు వున్నదిwhen the lips are * పెదవులు పచ్చిపుండుగా వున్నప్పుడు. when the eye is *కండ్లు పచ్చి పుండుగా వుండేటప్పుడు. when the fruit became * పండుమెత్తపడ్డప్పుడు. a * child లేత బిడ్డ. compassionate దయాళువైన. her heart is *దానిది మెత్తని మనసు. she was * eyed దానికి చూపు మధ్యస్థముగా వుండినది,మట్టుగా వుండినది. the * passion శృంగార భావము, మోహము. he is not at all *about his children వాడికి బిడ్డల మీద పాశము లేదు. God is * towards usఈశ్వరుడు మన యందు దయగా వుంటాడు. a * mother విశ్వాసముగా వుండే తల్లి. youare touching on * ground నీవు అనరాని మాట అంటావు. every man is * inspeaking of his mother యెవడున్ను తల్లిని గురించి మెళుకువగా మాట్లాడుతాడు. theLaw is always * of allowing a wife to sue her husband మొగుని మీదపెండ్లాము వ్యాజ్యము చేయడమునకు చట్టములు కొంచాన అనుకూలించవు. the Law isvery * concerning the rights of husbands భర్తృ స్వతంత్రములను గురించినిండా సున్నితములుగా వున్నవి.
Tender-hearted adj మెత్తని మనసుగల, దయాళువైన.
Tenderly adv మృదువుగా, మెత్తగా, దయగా, కృపగా.
Tenderness n s mercy దయ, కరుణ, దాక్షిణ్యము, లేతతనము, సౌకుమార్యము,బాల్యము. the dues of * సాత్విక గుణధర్మములు. ( Goldsmith Citizen of theworld LIX ) from the * of the boil ఆ పుండు తాకితే ప్రాణము పోతున్నది గనక.from the * of the plant చెట్టు లేతది గనక. from its * the eye is easily hurtకన్ను నిండా సున్నితమైనది గనక యెంత తగిలినా మోసమే. from the * of the styleof Kalidasa కాళిదాసు యొక్క శయ్య శృంగారరసము కలది గనక.
Tending n s care, charge సంరక్షణ, పెంపు.
Tendon n s a nerve నరము, సిరా.
Tendril n s తీగె. the * of the bean seized the branch ఆ చిక్కుడు తీగెకొమ్మను చుట్టుకొన్నది.
Tenement n s ఇల్లు, గృహము.
Tenesmus n s కడుపు నులిబెట్టి యిరికి నట్టు మాటిమాటికి ప్రవర్తి కావడము, శీతభేది. he is labouring under * వానికి బంక పడుతున్నది.
Tenet orn s. principle; opinion సిద్ధాంతము, సంకల్పము, విధి.
Tenfold adj పదింతలు. you are * worse than him నీవు వానికంటె పదింతలుదుష్టుడవు.
Tennis n s ఒకవిధమైన పుట్టచెండ్లాట.
Tenon n s or dovetail, the end of a timber cut to be fitted intoanother timber కుసి, తొలి, కూరు (ఇది వడ్రాంగమును గురించిన మాట. )
Tenor n s క్రమము, భావము, అభిప్రాయము. from the * of his letter అతనిజాబు యొక్క బావమువల్ల. they kept the even * of their way క్రమముగానడిచినారు వెళ్ళినారు. in music సప్తమస్వరము.
Tense adj stretched బిగువుగా వుండే, బిగుతుగా వుండే. the belly was * కడుపుబిగుసుకొని వుండినది, వుబ్బరించుకొని వుండినది.
Tense bread n s నూకలపిండితో చేసిన రొట్టె.
Tenseness n s tightness బిగువు.
Tension n s stretching బిగువు.
Tent n s to live in డేరా, గుడారము. a roll of lint వత్తి, కారపువత్తి. a kind ofwine వొక విధమైన సారాయి.
Tentative adj పరిశీలనచేశే.
Tented adj గుడారములు గల. in the * field రణరంగమందు, యుద్ధ భూమి యందు.
Tenterbooks n s సిళ్లు. I was on the * of anxiety about this ఇందునగురించి నేను పడిన వ్యసనము యింతంతకాదు, కొనప్రాణముతో వుంటిని.
Tenth adj పదో. on the * పదో తేదీని.
Tenuity n s thinness పలచన, క్షీణత, సూక్ష్మత. from the * of a fly's wingఈగ యొక్క రెక్క నిండా పలచనిది గనక.
Tenure n s condition ఒడంబడిక, నిబంధన, నియమము. these people holdtheir lands on various *s వారు వారు ఆయా నేలలను వేరే వేరే వొడంబడికలమీదఅనుభవిస్తున్నారు. he holds the land on a * of producing one hundred troopsevery year ప్రతి సంవత్సరమున్ను నూరుమంది సిపాయీలను యిప్పిస్తామనే వొడంబడికమీద ఆ నేలను వాడు అనుభవిస్తున్నాడు. land held on feudal * కట్టుబడిభూమి. heholds his land on an uncertain * ఆ నేలను వాడు అనుభవించడమునకై వుండేనిభంధన అస్థిరమైనది. the * of life is uncertain ప్రాణము యిన్నాళ్ళు వుంటున్నదనినిశ్చయము లేదు.
Tepid adj మలివెచ్చగా వుండే, గోరు వెచ్చగా వుండే. they bathe in * waterవాండ్లు నులివెచ్చని నీళ్ళు పోసుకొంటారు.
Tergiversation n s పారిపోవడము.
Term n s word మాట, పదము. or phrase ప్రతినామము, పరిభాష. a vulgar *నీచమాట. ప్రసాదము is a * for rice ప్రసాదమనే శబ్దము అన్నమనే దానికి పరిభాష.this is an abuse of *s ఇది దుష్ప్రయోగము. or end అంత్యము. on the * ofhis lease వాడి గుత్త తీరగానే. a limit అవధి, పర్యంతము, గడువు. the * of lifewas sixty years మనుష్యులకు ఆయుఃప్రమాణము అరువై యేండ్లుగా వుండెను. for along * నిండా కాలము దాకా. for a short * కొంత కాలము వరకు. for the * offour years నాలుగు యేండ్ల కాలము వరకు. or time of sessions నియమితకాలము,ఇది కోరట్టును గురించిన మాట.
Termagant n s ధూర్తస్త్రీ, గయ్యాళి, రాక్షసి.
Terminated adj సమాప్తమైన, ముగిశిన.
Termination n s the end సమాప్తి, ముగింపు. the * of a word శబ్దము యొక్కఅంతము. words that have similar *s సమానమైన అంతములుగల శబ్దములు.masculine nouns of which the * is డు, belong to the first declension డుఅనే వర్ణమును అంతమందు గల పుల్లింగ శబ్దములు మొదటి విభక్తితో చేరుతవి. resultఫలము. at the * of the mouth నెలసరికి, మాసాంతమునందు.
Terminolity n s i.e. Termination.
Terminology n s అంత్యప్రత్యయము. Sanscrit words which have theTelugu * తెలుగు అంత్య ప్రత్యయములు గల సంస్కృత శబ్దములు, తెనుగుప్రత్యయములను కొలుకులయందు గల సంస్కృత శబ్దములు.
Terminus n s a halting place దిగే స్థలము.
Terms n s or bargain వొడంబడిక. they proposed * సమాధానము మాట్లాడినారు. they are on good * వాండ్లు విహితముగా వున్నారు. they are on bad *విరోధముగా వున్నారు. they are not on speaking * వాండ్లకు మాటలు లేవు. theyare on bad * with us వారికీ మాకు విరోధముగా వున్నది, సరిపడక వున్నది. they areon bad * with one another వాండ్లు వొకరికొకరు సరిపడక వున్నారు. those whoare on bad * with him వాడికి విరోధులైన వాండ్లు, వాడికి సరిపడని వాండ్లు. in plain* he won't come వెయిమాట లేల వాడు రాడు. they came to * సమ్మతిపడ్డారు.they would not come to * తిరగబడ్డారు. at last they came to * తుదకుసమాధానపడ్డారు. I brought them to * వాండ్లు సమాధాన పడేటట్టు చేసినాను. theyreduced him to * వాణ్ని దోవకు తెచ్చినారు.
Ternary adj proceeding by threes; consisting of three మూడు మూడైన.in a * series మూడేశి మూడేశిగా.
Terra n s భూమి. terra firma తీరము, ఒడ్డు.
Terra japonica, or Catechu n s. కాచు.
Terrace n s a mount of earth covered with grass, or gravel తిప్ప,దిన్నె, తిన్నె. there were *s on the hill ఆ కొండ మీద తిన్నెలు తిన్నెలుగావుండినవి. a balcony; an open gallery మిద్దె మీద తెరపగా వుండే తాళ్వారము. a *roofed house మిద్దె యిల్లు.
Terraqueous adj composed of land and water జల స్థలమయమైన, మన్నునీళ్లుగా వుండే. the * globe ఇహము, భూగోళము.
Terrene adj earthly భూసంబంధమైన మృణ్మయమైన. the * పృథ్వి, భూమి.
Terrestrial adj earthly not celestial భూసంబంధమైన, సాంసారిక, పార్ధివమైన the * globe భూగోళము.
Terrestriality n s గరిమ, పృథ్వీత్వము.
Terrible adj భయంకరమైన, అఘోరమైన, భీకరమైన.
Terribly adv భయంకరముగా, ప్రచండముగా.
Terrier n s a dog ఒక విధమైన కుక్క.
Terrific adj భయంకరమైన, అఘోరమైన, భీకరమైన.
Terrified adj భయపడ్డ,దిగులుపడ్డ,వెరచిన,చకితమైన, she was * at seeingthis దీన్ని చూచి దిగులుపడ్డది.
Terrifying adj భయంకరమైన.
Territorial adj రాజ్యసంబంధమైన. * acquisitions సంపాదించిన భూములు.
Territory n s రాజ్యము, దేశము, సీమ.
Terror n s భయము, భీల, దిగులు.
Terse adj short and elegant సురచితమైన, సుందరమైన, చక్కని. a *expression సొంపైన శబ్దము, పొంకముగా వుండే శబ్దము.
Tersely adv చిక్కగా, పొంకముగా.
Terseness n s neatness of style పొంకము, పొందిక, సంగ్రహత. from the *of his style వాడి వాక్కు నిండా సంగ్రహమైనది గనక, వొక ముక్కలో అన్నీ అణిగేటట్టుచెప్పుతున్నాడు గనక.
Tertian n s an ague intermitting but one day దినము మార్చి దినము వచ్చేజ్వరము.
Tessellated adj variegated by squares, like a chess board, or afish's scales పప్పళి. * pavement నానా వర్ణములు గల రాళ్ళతో పేర్చిన కుట్టిమము,నేల.
Test n s trial, examination పరిక్ష, శోధన. this will stand the severest *ఇది యెంత పరిక్షకైనా నిలుచును. this is the * for gold ఇది బంగారుకు పరిక్ష. theyput his knowledge of English to the by desiring him to read Milton మిల్టను చదవమని వాడికి ఇంగ్లీషులో వుండే జ్ఞానమును పరిక్షించినారు. this put hispatience to the * ఇందుచేత వాడి ప్రాణము విసికినది. I will put your friendshipto the * నీ స్నేహము చూతాము. as a Protestant * ప్రమాణము.
Testaceous adj having a shell గల్ల గల. * animals గుల్ల గల జంతువులు, పెంకుగల జంతువులు, చిప్పగల జంతువులు.
Testament n s a will శాసనము, మరణ శాసనము. the Old * ప్రాచీన నిబంధన.the New * కొత్త నిబంధన. but A+ says ధర్మ పుస్తకం, ఉత్తరకాండ. F+ saysశాసనము. The word * by itself means The New *, Thus He sells Biblesand *s బైబిలు పుస్తకములున్ను ఉత్తర కాండలున్ను అమ్ముతాడు. In the title pageధర్మపుస్తకస్య శేషాంశః. A నవీన శాస్త్రం, నూతన నిర్ణయం. P Erasmus uses thephrase Novum Instrumentum.
Testamentary adj మరణ శాసన సంబంధమైన. * arrangements మరణశాసనములో చేసిన ఏర్పాట్లు.
Testator n s one who writes a will at his death మరణ శాసనము వ్రాశిచచ్చేవాడు.
Testatrix n s she who writes a will మరణ శాసనము వ్రాశి చచ్చే స్త్రీ.
Tested adj tried, examined పరిక్షించబడ్డ, పరిశోధించబడ్డ.
Tester n s a sixpence పావులాకు సరిగ్గా వుండే వొక నాణ్యము. the cover of abed మంచము మీది పందిలి.
Testicles n s వృషణములు, వట్టకాయలు. swelled testicle వరిబీజము, బుడ్డ.
Testily adv angrily చలముగా, కోపముగా, ఆగ్రహముగా, చిరచిర.
Testimonial n s సాధకము, దస్తావేజు, యోగ్యతాపత్రిక. he produced several *sregarding his character తన నడతను గురించి కొన్ని యోగ్యతా పత్రికలు తెచ్చియిచ్చినాడు. this reward is a * of his merit యీ బహుమానమే వాని యోగ్యతకుగురుతు. this cure is a * of his skill ఇట్లా స్వస్థము కావడము వానిసామర్థ్యమునకు గురుతు.
Testimony n s evidence given సాక్షి, దృష్టాంతము, ప్రమాణము.
Testiness n s peevishness కోపము, చిరచిర, మంట.
Testy adj peevish చిరచిరలాడే, మండిపడే.
Tetanus n s ఈడ్పువాయువు, పండ్లు గిట్టుకొని పొయ్యే జన్ని.
Tetchy adj peevish చిరచిరలాడే, మండిపడే, ఆగ్రహముగల.
Tete n s pronounced, a quiet chat ముచ్చట, ఇష్టాలాపము, ఇష్టాగోష్ఠి,దీర్ఘసంభాషణ, మరుగుగా జరిగిన ముచ్చట. they had a tete a tete అదీ వాడుఇష్టాలాపముగా వుండిరి.
Tether n s పగ్గము, తాడు, అనగా గుర్రము పశువు వీటినికట్టి మేయవిడిచే నిడుపాటిపగ్గము. he cut the cow's * ఆ యావును కట్టి మేయవిడిచిన పగ్గము కోశినాడు. hedoes not know the length of his * వాడికి తోక యెంతమట్టుకో అంతమట్టుకువిసరవలెను.
Tetotaler n s సారాయి తాగరాదనేవాడు. they are *s వాండ్లు యెంత మాత్రముసారాయి తాగేవాండ్లు కారు.
Tetrarch n s అధిపతి. A+. a Roman governor of the fourth part of aprovince రాజ్యములో నాలుగింట్లో వొక భాగమును యేలేవాడు.
Tetrastick n s పద్యము, శ్లోకము, (Sir W.Jones.)
Tetter n s పుండు, ఎంగిలిచిడుము, చిడుగుడు, తామర.
Text n s that on which a comment is written మూలము. the * is short,but the commentary is long మూలము కొంచెము, వ్యాఖ్యానము నిండా. a verseout of the Bible బైబిలు లోని వాక్యము, మూలవాక్యము. * book మూల గ్రంథము.
Text-hand n s పెద్ద అక్షరము, పిల్లకాయలు వ్రాశే పెద్ద లిపి.
Textile adj నేత సంబంధమైన. * manufactures నేత పని.
Texture n s నేత, అల్లిక. silk of fine * నాణ్యమైన పట్టు వస్త్రము. cloth ofopen * వెలితిగా వుండే బట్ట. cloth of close * తరుచుగా వుండే గుడ్డ.
Than adv కంటె, కన్న. more * ten rupees పది రూపాయల కంటె, పైగా. less * amile అరకోసుకు తక్కువ. not less * three nor more * ten months మూడునెలలకు తగ్గకుండా పది నెలలకు హెచ్చకుండా.
Thane n s రాజు, పాళెగాడు.
Thankful adj ఉపకారస్మృతిగల, కృతజ్ఞతగల చేసిన వుపకారము యెరిగిన. Valpy onColoss 3. 15. says ********* is interpreted variously " blandi, et comes" -- " benefici et liberales " " grati et accepti Deo " " gratias agiteDeo " తథాయుయంకృతజ్ఞాభవత. A+.
Thankfully adv ఉపకార స్మృతిగలవాడై, కృతజ్ఞత కలవాడై.
Thankfulness n s కృతజ్ఞత, ఉపకారస్మృతి, చేసిన మేలును యెరగడము.
Thankless adj కృతజ్ఞతలేని, కృతఘ్నుడైన. a * task నిష్ఫలమైనపని.
Thanklessness n s కృతఘ్నత.
Thankoffering n s offering paid in acknowledgement of mercy కృపచేసినందుకై చేసిన ఆహుతి.
Thanks, thangks n s. ఉపకారస్మృతి, దండము. thanks to him I got well atlast తుదకు నాకు వొళ్ళు కుదిరినది ఆయన పుణ్యము. this is all thanks to you ఇదిఅంతా మీ పుణ్యామే, ఇది అంతా మీ దయే, ఇది అంతా మీ కటాక్షమే. thanks to your good wishes తమ ఆశీర్వచనమువల్ల, before eating he offered thanks యీ అన్నం తను పుణ్యమని దేవుడికి దండము పెట్టినాడు. this is no thanks to you ఇందులో నీవుపకారము మరేమి లేదు. thanks be to God for his unspeakable gift ఈశ్వరస్య నిర్వచనీయదానత్ తస్య ధన్యనాదో భవతు A+ యింతంతనరాని దేవుడు చేసిన బహుమానమును గురించి ఆయనకుదండము. See Shore on Indian Affairs, vol. 1. p, 521. Note.
Thanksgiving n s మహోపకారము చేసినారని అనడము, స్తుతించడము. In 2 Cor.IX. 11. ధన్యవాదము. A+.
Thankworthy adj వందనీయమైన, మహోపకారము చేసినావని దండము పెట్టతగ్గ,కర్మగ్రాహ్యము. A+.
That, that (pron) అది,ఆ, I don't know * అది నేను యెరగను. he * said soఅట్లా చెప్పినవాడు. * will do అది సరే. * house ఆ యిల్లు. in * place అక్కడ. on *day నాడు. * man వాడు. by * అందువల్ల. for * అందున గురించి. in * గనక, కాబట్టి.in * he is a relation బంధువుడై నందున. upon * అందుమీదట, ఆ మీదట. * isఅనగా, యేమంటే. that's all అంతే. besides * అదిగాక.
Thatch n s పూరి, యింటికప్పు, పైకప్పు, ఇంటికి గడ్డి వేయడము.
Thatcher n s ఇంటికి విడవలి నేసేవాడు.
Thaw n s మంచుగడ్డలు కరిగే కాలము, రాయిగా పేరుకొన్న నీళ్ళు కరిగే కాలము.
the Accusative case n s ద్వితియ్యా విభక్తి.
The Ancients n s పూర్వీకులు, పూర్వకాలస్థులు.
the Baubul tree n s తుమ్మచెట్టు, బబ్బుళి. (K).
the Commonalty n s సామాన్యులు, ప్రజలు, లోకులు.
The Exact sciences n s లక్షణయుక్తమైన విద్యలు.
The Holy spirit n s సాంక్తస్పిరిత, పరిశుద్ధాత్మ.
The Inwards n s కడుపులోనివి, అనగా పేగులు.
The Metropolitan adj రజధాని సంబంధమైన. the * newspapers పట్నములో పుట్టే ప్రసిద్ధ పత్రికలు.
The Pudenda n s (plural) మానము, వొళ్లు.
The Self-planting leaf (a certain plant) కట్టెపాపర,ఆకుమొలకాకుచెట్టు,సీమజిల్లేడు,పానుమోడుమొక్క, M. M. says ప్రణబీజము.
The Sticklebackfish n s కాగినచేప.
The voices of various animals and the sounds emitted by some inanimatethings are in English conveyed కూసుట, Doors and guns Bang. Dogs and foxes Bark.Bulls, cows, boys, Bellon *. Sheep, calves and goats Bleat, Asses, stags,chariots, wheels, Bray. Flies, bees Buzz *. Geese Cackle. * Rooks and crows can. sparrows, parrots monkies Chatter. * Money Chinks. Sparrows,crickets, mice, lizards Chirp. Chains and bars of iron Clank. Hammers Clink. Watches Click. Hens and chickens Cluck. Doves Coo. * Fire, branches,Crackle, Chairs, doors, beds, shoes, Creak. Frogs, toads, ravens croak, Cocks, Crow. * Caves, empty rooms, hills, walls (resound or) Echo .* Geese and turkeys gobble. Tables, forests Groan, * Bears, dogs Gronl* A bear, the belly Grumbles * Hogs Grunt. * Snakes fires Hiss. * OwlsHoot *. Dogs, jackals, wolves, honl Bees Hum. * Monkeys Tubber, * Cows Lon. Cats Men. Doves. streams Murmur. * Thunders Mutter. * Horses Neigh.Hail and rain patter. * Thunder, bells, guns Peal. Cats purr. * Ducks Quack. Doors, chains, wheels, bullets, tongues Rattle. Bells and silveror brass vessels Ring. Streams Ripple. Thunder, cannon, storms, fires,rivers, winds, waves, lions, bulls, elephants Roar. * Branches, snakes,clothes Rustle. Thunder, carts Rumble. Peacocks, parrots Scream. * Winds,birds, arrows, swans Sing. * pigs, mice, rats, bats, wheels, hares,squeak. * Pigs Squeal. Parrots Talk. * Breezes, streams Whishper. * Birds,bullets, winds Whistle. * Arrows, stones, cannonballs, bullets Whiz.Dogs, jackals, wolves, tigers Yell. *
The, the (definite article) ఆ,ఈ, where is the book ? ఆ పుస్తకముయెక్కడ, పుస్తక మెక్కడ. where is the man ? అతడు యెక్కడ, ఆ మనిషి యెక్కడ,వాడు యెక్కడ. where is the woman ? ఆమె యెక్కడ, ఆ ఆడది యెక్కడ. whilehe was in office వాడు వుద్యోగములో వున్నప్పుడు. while he was in the officeకచేరిలో వున్నప్పుడు. he went to bed పండుకొన్నాడు. he went to the bedమంచము దగ్గిరికి పోయినాడు. the Ganges గంగ. the Cavery కావేరి అనే నది. theRamayanam రామాయణమనే గ్రంథము. the Munro మండ్రో అనే వాడ. the Madrasమద్రాస్ అనే వాడ. the Calcutta కల్కత్తా అనే వాడ. the Indus సింధునది, మరిన్నిఆ పేరు గలవాడ. the Himalaya Mountains హిమవత్పర్వతము.
Theatre n s రంగము, నాట్యరంగము, నాటకశాల. the * of battle రణరంగము.Yesterday the village was a * of disturbance నిన్న ఆ వూళ్ళో అల్లరిగావుండినది. this street was a * of the quarrel ఆ జగడము జరిగినది యీ వీధిలోనే. In Oxford this means Public Hall the * of modern history ఆధునికచరిత్రార్ణవము. the * of wit శృంగార రత్నాకరము, చమత్కార చంద్రిక. the * of loveor Cupid అనంగరంగము.
Theatric, Theatrical adj నాట్యరంగ సంబంధమైన. the theatrical books నాటకములు. a theatrical hero నాటకమందు నాయకుడు. theatricalrepresentation నాట్యము. he used theatrical action వేషగాడివలె మాట్లాడినాడు.
Theatrically adv వేషగాడివలె.
Thee pron నిన్ను.
Theft, theft n s. దొంగతనము.
Their, or ther (pronoun) వారియొక్క,వాటియొక్క
Theist n s a man who follows no particular religion, but onlyacknowledges the existence of God ఒక మతమని లేక దేవుడు మాత్రము కద్దనేవాడు. Colebrooke says The school of Patanjali is denominatedసేశ్వరసాంఖ్య. ( Sa-iswara-Sankhya ) Seshwara Sankhya or Theistical; that of Capila is Nir-iswara-sankhya నిరీశ్వర సాంఖ్య or Atheistical.
Them (pronoun) వారిని,వాండ్లను,వాటిని,వీరిని,వీట
Theme n s a subject on which one speaks or writes సంగతి, విషయము,ప్రసంగము, ప్రస్తాపము. he spoke two hours on this * యీ సంగతిని గురించిరెండు గడియలు మాట్లాడినాడు. a short dissertation written by boys on anytopick పిల్ల కాయలను వ్రాయమని ఉపాధ్యాయులు చెప్పిన సంగతి. he became the *of their discourse వాండ్లు యితణ్ని గురించి మాట్లాడినారు. The original word,whence others are derived ధాతువు.
Themselves pron plu. వారే, వారికి వారే, తమకుతామే, వారంతటవారే. theysettled it between * తమలో తామే పరిష్కారము చేసుకొన్నారు.
Then adv అప్పుడు, అంతట, తర్వాత, ఇట్లా వుండగా. he * stopped అంతటనిలిపినాడు. * why did you go ? అట్లా వుండగా యేలపోతిని, అయితే యెందుకుపోతివి. * there is the horse to be paid for పైగా గుర్రానికి కూడా క్రయముయివ్వవలసినది. * he has three children అయితే వాడికి ముగ్గురు బిడ్డలు వున్నారు.true it is old but * ఇది పాతది సరే గాని. go along * సరేపో. how * will youdo it ? అట్లాగైతే యేట్లా చేస్తావు. he, * is your brother ? అట్లాగైతే వాడు నీ తమ్ముడా. every now and * అప్పుడప్పుడు. the * rulers నాటి దొరలు. the * judge అప్పుడు వుండిన న్యాయాధిపతి.
Thence adv from that place or time అక్కడినుంచి, అప్పటినుంచి. they went* అక్కడి నుంచి వెళ్ళినారు. for that reason అందువల్ల.
Thenceforth, Thenceforward adv అది మొదలుకొని, అప్పటినుంచి.
Theocracy n s Government immediately superintended by God దేవునిప్రభుత్వము, దేవాధిపత్యము.
Theodolite n s a mathematical instrument for taking heights anddistances దృష్టి సహాయుడు, అనగా పొడుగును కొలిచే వొక యంత్ర విశేషము.
Theogony n s the generation of the gods దేవతల వంశావళి.
Theologian n s a professor of divinity వేదాంతి.
Theological adj వేదాంత విషయమైన. odium theologicum తమ వైరము.
Theologically adv వేదాంత విషయముగా.
Theologist n s వేదాంతి.
Theology n s వేదాంతము, Dz. says పరమార్థ విద్య, ధర్మజ్ఞానము, ఈశ్వరవిషయకవిద్య. Knight says జ్ఞానశాస్త్రము, వైదిక శాస్త్రము. Reeve says వదశాస్త్రము,దేవవిద్య. But వేదాంతము expresses the braminical notion : quite separate from the European meaning.
Theophillanthropist n s a kind of deist ఒక విధమైన జ్ఞాని, తాంత్రికుడుఅనవనచ్చును.
Theorem n s ఒక విధమైన పెద్ద వీణె.
Theoretic, Theoretical adj speculative; not practical అనిశ్చయమైన,అనుమానికమైన, అనుమాన మూలకమైన.
Theorist n s he who forms a speculation యుక్తి చేసేవాడు, ఊహించేవాడు. heis a mere * వాడు వూరికె వూహాపోహలు చేసేవాడు.
Theory n s a speculation; a scheme; a system అనుమానము, కల్పన, నూతనప్రసంగము, ఊహ. In * this is right but practically it is unjust మాటలకుయిది న్యాయమే గాని పనికి చూస్తే న్యాయము కాదు. this is the * they frame ఇదిలేని పోని యుక్తి. See note on Hypothesis.
Therapeutic adj వైద్యశాస్త్రమును గురించిన. the * act వైద్యము.
There, or ther adv అక్కడ. here and * అక్కడక్కడ, వొకావొక చోట. beholdఅదుగో. * was a famine last year పోయిన సంవత్సరము కరువు సంభవించినది. *was a king వొకానొక రాజు కలడు. * was a man whose name was Johnయోహాననేవాడు వొకడు వుండెను. * is a book called the Kadambari కాదంబరి అనేపుస్తకము వొకటి వున్నది, వొకటికద్దు. * were fifty people to be fed యాభై మందికిఅన్నము పెట్టవలసి వుండినది. * is no end to these troubles యీ తొందరలకుఅంత్యము లేదు. * is no fear regarding him వాణ్ని గురించి భయము లేదు. * isno fear regarding him వాణ్ని గురించి భయము లేదు, చింతలేదు.
Thereabout, Thereabouts adv near that place ఆ సమీపాన, ఆ ప్రాంతములో. he lives there abouts ఆ ప్రాంతములో వున్నాడు, ఆ సమీపములో వున్నాడు.nearly దగ్గిర. he was aged fifty or thereabouts వాడికి దగ్గిర దగ్గిర యాభైయేండ్లు అయినవి. In January or thereabouts జనవరి నెల ఆ సందున. ten milesor thereabouts కొంచెము హెచ్చు తక్కువ ఆమడ దూరము.
Thereafter adv after that అటు తర్వాత. according to that అప్రకారముగా.
Thereat adv at that place, then, on that account అక్కడ, అందున గురించిhe was offended * అందున గురించి రేగినాడు.
Thereby adv by that అందువల్ల. by means of that దానిమూలకముగా.
Therefore adv గనక, కాబట్టి, అందున గురించి. in some places this wordmay be omitted. See Rom. VIII. 1.
Therefrom adv అక్కడినుంచి.
Therein adv అందులో.
Thereof adv of that దాని, దాని యొక్క.
Thereon adv అందుమీద, అందున గురించి.
Thereto adv అందుకు, అందుకె, దానికి, అందు నిమిత్తము.
Thereunto adv అందుకు.
Thereupon adv దాని మీద, అందు మీదట, అటుపిమ్మట.
Therewith adv అందులో, దానితో.
Therewithal adv పైగా, అధికముగా.
Thermantidote n s పంకాకు బదులుగా చేసిన వొక యంత్రము.
Thermometer n s an instrument to measure heat గ్రీష్మా గ్రీష్మ పరిమాపకయమత్ర విశేషము, గ్రీర్ష్మము యొక్క హెచ్చుతగ్గులను తెలియచేసే యంత్రము. the press, that * of liberty, has proved this స్వతంత్రమునకు పరిమాపకమైనప్రసిద్ధి పత్రిక వల్ల యిది నిరూపించ బడ్డది.
These plu of this ఇవి. * people వీరు, వీండ్లు. * things యీ వస్తువులు.
Thesis n s కోటి, పక్షము, వితర్కనీయ విషయము. he gave the boys a * వొకసంగతి చెప్పి దీని మిద మీకు తోచేదాన్ని వ్రాసుకొని రమ్మని పిల్లకాయలకు చెప్పినాడు.
Thews n s sinews నరములు, దారుఢ్యము, త్రాణ.
They pronoun వారు,వాండ్లు,వీరు,వీండ్లు,అవి,ఇవి,* say he is gone వాడుపోయినాడట.
Thick adj not thin, dense చిక్కని, దళసరియైన, దప్పమైన, దట్టమైన,నీరంధ్రమైన, నిబిడమైన. a * plank మందముగా వుండే పలక. a plank of fourinches * నాలుగు అంగుళములు మందముగల పలక. a * gold chain లావాటి బంగారుగొలుసు, పెద్ద గొలుసు. in the very * of the battle యుద్ధము యొక్కముమ్మరములో. the leaves fall * ఆకులు నిండా రాలుతవి. a * forestగొండారణ్యము, చీకారణ్యము, ఈగ దోమ చొరరాని అడివి. * milk చిక్కనిపాలు. * asflames సాంద్రమైన. * as a mob వొత్తుడుగా వుండే. * as trees గుబురుగా వుండే.the children came as * hops తవుడు చల్లినట్టుగా పిల్లలు వచ్చినారు. they camevery * నిండా గుంపుగా వచ్చినారు. a cloth of * texture ముతకబట్ట, నేత వొత్తుగావుండే బట్ట. * darkness గాఢాంధకారము. thick or stupid జడమైన, మందమైన. hespeaks * కొళకొళమని మాట్లాడుతాడు. a * head మందమతి, జడుడు. the peoplestood very * గుంపు కిక్కరించుకొని వుండినది, గుంపు తరచుగా వుండినది. they arevery * or intimate నిండా సయ్యోధ్యగా వుణ్నారు, వొద్దికగా వున్నారు. he went onthrough * and thin ముక్కుకు సరిగ్గా పోయినాడు, మంచో చెడో వొకటీవిచారించకపోయినాడు. a chariot thick-set with gems సాంద్రరత్న విమానము.
Thicket n s పొద, అడివి.
Thickly adv దట్టముగా, సాంద్రముగా, తరుచుగా. the blows fell * దెబ్బలుమోపుగా పడ్డవి. the arrows flew * బాణములు పుంభానుపుంఖములుగా వచ్చినవి.this town is * peopled యీ వూళ్ళో జనము తరచుగా వున్నది.
Thickness n s దళసరి, దట్టము, తరుచు, సాంద్రత్వము. from the * of thewood కర్ర దళసరియైనది గనక. from the * of the darkness చీకటి గాఢముగావున్నందున. from the * of his speech వాడు కొళకొళమని మాట్లాడేటందువల్ల. fromthe * of the leaves ఆకులు గుబురుగా వుండేటందువల్ల.
Thicksculled adj మందబుద్ధిగల, జడుడైన.
Thickset adj సాంద్రమైన, దట్టముగా, వుండే, దగ్గిరదగ్గిరగా వుండే, నిబిడముగా వుండే. the houses were * ఇండ్లు కిక్కిరుసుకొని వుండినది.
Thickskinned adj stupid, dull unfeeling మోటైన, ముతకైన.
Thief n s దొంగ, ముచ్చు, చోరుడు. set a * to catch a * దొంగనుకొని దొంగనుపట్టు. procrastination is the * of time నేడూ రేపు అని దినాలు తోయడము వట్టికలహరణము. the * in a candle వంగినకొడి, అనగా మైనపు వత్తికి మించి పొడుగ్గావుండి మైనము మీద పడి కరిగి కాలవకట్టేటట్టు చేసే కొడి.
Thiefatcher, Thieftaker n s. తలారివాడు.
Thievery n s దొంగతనము, చోరత్వము, చౌర్యము.
Thieving adj దొంగిలించే, ముచ్చిలించే. the * propensities of the cat పిల్లియొక్క దొంగగుణము. the * bazar ( a division of Madras-town) గుజిరీ.
Thievish adj దొంగైన, ముచ్చైన. he is as * as a crow వీడు కాకికన్న ముచ్చు.rats and such * creatures యెలుకలు మొదలైన దొంగ జంతువులు.
Thievishly adv దొంగతనముగా.
Thievishness n s దొంగతనము, దొంగగుణము.
Thigh n s తొడ, ఊరువు. the upper * పెందొడ. the * joints సడుగులు.
Thill n s the shafts of a waggon బండి కాడి, మేడి. the * cattle మేటిపశువులు, అనగా కలపకు ముందరకట్టే గట్టి పశువులు.
Thimble n s కొడుపు, తొడుపు అంగుస్తానము, కుట్రపువాడు వేలికి వేసుకొనేటిది. theEnglish * is a little cup ఇంగ్లిషువారు వేసుకొనే అంగుస్తానము చిన్న గిన్నె. a * full మిళ్లెడు.
Thimble-rigging n s ఒక విధమైన జూదము.
Thin adj సన్నని, పలచని, బక్కపలచని, కృశమైన, చిక్కిన. a * cloth సన్నపుగుడ్డ.the crown is now becoming * గుంపు తీశిపోతున్నది. it was a * meetingకూడిన జనము కొంచెముగా వుండినది. a * regiment జనము తక్కువగా వుండేపటాళము. he is very * వాడు నిండా చిక్కి వున్నాడు, కృశించి వున్నాడు. * skinnedఅనగా touchy, irratable ముంగోపియైనమ, మండిపడే. he is very * skinned వాడునిండా ముంగోపి. he went through thick and * to serve them వాండ్లనుకాపాడడానకు నానా పాట్లు బడ్డాడు.
Thine pronoun నీ,నీదైన
Thing n s వస్తువు, ద్రవ్యము, పదార్థము, విషయము, సంగతి. the * I went నాకుకావలసినది. whether you go or stay it comes to the same * నీవు వున్నా సరేపోయినా సరే. as meaning the world ప్రపంచము. the vicissitudes of *s కాలవైపరీత్యము. this is quite another * ఇది వేరే సంగతి. she is a young * అదిపసిపిల్ల. a little *, that is, a trifle కొంచెము, స్వల్పము. a little *, that is a child బిడ్డ. all things సమస్తము, అన్ని. all things are his సమస్త వస్తువులుఆయనవి. the good things, that is ( eatables ) భోజ్యములు, తినుబండములు,ఆహారములు. I will tell you one * నేను వొక సంగతి చెపుతాను, వొక మాట చెపుతాను. this is a good * ఇది మంచిది. I will tell you a good * వొక వింతవింటివా. Itis a good * to sing praises unto the Lord దేవుణ్ని స్తుతించడము వుత్తమం A+.this is a bad * ఇది మంచిది కాదు. a few things remain to be explainedఇంకా కొన్ని సంగతులు చెప్పవలశి వున్నవి. in some he is right కొన్నివిషయములందు వాడు చెప్పినది న్యాయమే. he sold some things of mine నాదికొన్ని సామానులు అమ్మినాడు. she is poor * అది పలాచనిది. this commentary isa poor * ఇది దిక్కుమాలిన వ్యాఖ్యానము. poor * ! her father's gone awayపాపము ఆమె తండ్రి వెళ్ళినాడు. poor * do not beat her పాపము దాన్ని కొట్టక. apoor old * పాపము వొక ముసలిది. the house is no great things ఆ యిల్లు వొకగొప్పకాదు. good things ( meaning jests ) నరసోక్తులు, చమత్కారములు. teathings తేనీళ్ళసామాను. dinner things భోజన పాత్రలు. it was one * for him totell me, and another for him to go and tell my father నాతో చెప్పడము సరేగాని మా తండ్రితో చెప్పడము యెట్టిది. he was the next * to dead వాడు కొనప్రాణముతో వుండినాడు. what with one * and another, he is now ruinedతుదకు వాడు చెడ్డాడు. no such * అట్లా యెంత మాత్రము కాదు.
Thinker n s a sage యోచించేవాడు, విచారించేవాడు. or philosopher జ్ఞాని,బుధుడు.
Thinking n s యోచన, తలంపు, యెన్నిక.
Thinly adv పలచగా మట్టుగా, విరళముగా. he is * clad వాడు నిండా బట్టలుతొడగడు. the country is but * peopled ఆ దేశములో జనము తక్కువ. the churchwas * attended గుడికి నిండా జనము రాలేదు.
Thinned adj పలచన, చేయబడ్డ, తక్కువ చేయబడ్డ. a country * by war యుద్ధముచేత ప్రజాక్షయమైన దేశము.
Thinnese n s పలచన, పలచతనము, సన్నన. from the * of the poeple జనముతరుచుగా వుండనందున.
Third adj మూడో. on the * of this month యీ నెల మూడో తేదిన. the *person in grammar ప్రథమ పురుష, వాడు, వాండ్లు, ఆమె మొదలైనవి. a *person or bystander పరుడు, అన్యుడు, తటస్థుడు. do either that or this,there is no * way అట్లాగైనా చెయ్యి యిట్లాగైనా చెయ్యి మూడో విధము లేదు. the *(or, ring) finger పవిత్రపు వేలు, అనామిక.
Thirdly adv in the third place మూడోది.
Thirst n s దాహము, దప్పిక, నీరువట్టు. or eagerness ఆశ, ఉత్సాహము,ఆతురము. they have a great * for knowledge వాండ్లకు చదువు మీద నిండా ఆశవున్నది.
Thirstiness n s దాహము, దప్పిక, ఆశ, అత్యాశ.
Thirsty adj దప్పికగొన్న, దాహమెత్తిన. I am * నాకు దాహముగా వున్నది.
Thirteen adj పదమూడు.
Thirteenth adj పదమూడో. on the * of this month యీ నెల పదమూడో తేదిన.on the * day of the moon త్రయోదశినాడు.
Thirtieth adj ముప్పైయో.
Thirty adj ముప్పయి.
This (pronoun) ఇది,ఈ ,do you know * ? ఇది నీకు తెలుసునా. during * ఇట్లావుండగా. * fellow వీడు. * woman ఈపె. I shall leave * tomorrowయిక్కడనుంచి రేపు వెళ్ళుతాను. like * ఇటువంటి.
Thistle n s కుసుమచెట్టు, అనగా నిండా ముండ్లుగల వొక చెట్టు. Reeve saysబ్రహ్మదండి, దీని పూలు పచ్చగా నున్న పెద్దవిగానున్ను వుంటున్నవి. H. says దుత్తూరము.
Thither adv అక్కడికి. hither and * యిక్కడికి అక్కడికి.
Thitherto adv అక్కడికి.
Thitherward adv అక్కడికి, ఆ తట్టుకు.
Tho adv abbreviation for though అయినప్పటి కిన్ని. tho' they went వాండ్లుపోయినప్పటికిన్ని.
Thong n s వారు, *s వార్లు.
Thoracic adj రొమ్ముతో చేరిన, వాక్షికము.
Thorax n s the breast, the chest రొమ్ము, ఎద, వక్షస్సు.
Thorn n s ముల్లు. *s ముండ్లు. he is on *s with anxiety వ్యాకులము చేతయెటూ తోచక వున్నాడు. lying upon *s i.e. being in trouble కళవెళపాటు,తొందర. he is a * in their side వాండ్లకు వీడు పక్కలో బల్లెముగా వున్నాడు. thisbusiness is a * in his side ఇది వాడికి పక్కలో బల్లెముగా వున్నది. he isnourishing a * in his side పాముకు పాలుపోశి పెంచుతున్నాడు.
Thornapple n s a certain fruit ( Datura Stramonium ) దుత్తూరము,ఉమ్మెత్తకాయ.
Thornback n s ఒక చేప పేరు.
Thorny adj difficult; perplexing ముండ్లు గల, కష్టమైన, సంకటమైన. a * plant ముండ్ల చెట్టు.
Thorough adj గట్టి, పూర్ణమైన, శుద్ధ. he is a * scholar వాడు పూర్ణపండితుడు.he is a * rogue వాడు శుద్ధదొంగ. this made a * change ఇందుచేత నిండావ్యత్యాసము వచ్చినది.
Thoroughfare n s అవతల పొయ్యేటందుకు దోవ వుండే సందు. there is no * atthe end of this street యీ వీధి కొనకు పోతే అవతల పొయ్యేటందుకు దోవ లేదు.
Thoroughgoing adj కొంకని, జంకని, సందేహించని, గట్టి, దృఢమైన.
Thoroughly adv గట్టిగా, బాగా, చక్కగా, పూర్ణముగా.
Thoroughpaced adj పూర్ణుడైన. a * horse అన్ని నడకలు నడిచే గుర్రము. a *rogue మంచిదొంగ. a * scholar పూర్ణ పండితుడు.
Thoroughsped adj dexterous తేరిన, పనుపడ్డ.
Thoroughstitch adv completely; fully సంపూర్ణముగా, చక్కగా, బాగా.
Those (pronoun) అవి,వాండ్లు
Thou (pronoun) నీవు, who art * ? నీవెవరు.
Though (conjunction) అయినప్పటికిన్ని, * he slay me వాడు నన్ను చంపినప్పటికిన్ని. he, *, came అతడైతే వచ్చినాడు. the child, *, is already sentబిడ్డను మట్టుకు ముందుగానే పంపించి వున్నది. this money * is not enough, or thismoney is not enough * యీ రూకలైతే చాలవు. as * వలె, అట్టు, అట్టుగా. heappeared as * he was deaf చెవిటివాడివలె అగుపడ్డాడు. he seemed as * hewould consent వాడు సమ్మతించేటట్టుగా వుండినది. as * she had, waking,beheld a vision మేలుకొని వుండగానే కలగన్నట్టు వుండినది.
Thought past tense of the verb ToThink ఎంచిన,తలచిన, he is * to havewritten this poem యీ కావ్యము అతడు చెప్పినాడట.
Thoughtful adj యోచనగల, ఆలోచన గల, చింతించే. why are you * about this? ఇందున గురించి యేల వ్యాకులముగా వున్నావు.
Thoughtfully adv చింతగా, వ్యాకులముగా, ఆలోచించి.
Thoughtfulness n s that is, prudence ఆలోచన, వివేకము, తెలివి.
Thoughtless adj ఆలోచన లేని, అవివేకియైన.
Thoughtlessness n s అవివేకము, పిచ్చితనము.
Thousand n s and adj. వెయ్యి సహస్రము. ten * పది వేలు, 100,000 లక్ష.
Thraldom n s slavery; servitude దాసత్వము, వశీభూతత.
Thrall n s ( a captive; captivity ) దాసుడు, దాస్యము, దాసత్వము.
Thrashed adj నూర్చిన. grain unthrashed నూర్చని ధాన్యము.


Talon English to Telugu free online dictionary
Enter English word and know Telugu meaning

No comments:

Post a Comment