Monday, February 7, 2011

Rhapsodist English to Telugu free online dictionary

Rhapsodist n s One who recited or sings rhapsodies, orcompositons, for a livelihood; one who writes without regulardependence of one part upon another (Todd) పాడేవాడు, చదివేవాడు, వొకటితో వొకటి సందర్భము లేకుండా వుండే శ్లోకములు చెప్పేవాడు, తలాతోకా లేకుండా వ్రాశేవాడు.
Rhapsody n s తలాతోకా లేకుండా వుండే ప్రభంధము.
Rhatany n s ఒక మూలికె.
Rhetorical adj అలంకార శాస్త్ర సంబంధమైన, అలంకార సంబంధమైన. * languageఉత్ప్రేక్షవుపమ మొదలైనవి.
Rhetorically adv అలంకారముగా, చాతుర్యముగా, జంభముగా. he * compares theking to a * mountain వాడు అలంకారముగా రాజుము పర్వముతో పోల్చినాడు.
Rhetorician n s అలంకారికుడు, అలంకార శాస్త్రము తెలిశినవాడు.
Rhetorick n s అలంకారము, అలంకార శాస్త్రము, వాక్చాతుర్యము. she tried thevarious kinds of female * ఆడవాండ్లకు వుండే చాతుర్యముల నంతా చేసి చూచినది,ఆడువాండ్లకు యెన్ని వగలు కద్దో వాటినంతా చేసినది.
Rheum n s of the eye పుసి. of the nose చీమిడి.
Rheumatic adj వాయువు సంబంధమైన. * pains వాతనొప్పులు, వాతశూల.
Rheumatism n s వాయువు. * in the joins ఖీళ్ల వాయువు.
Rheumy adj వాత సంబంధమైన.
Rhinoceros n s ఖడ్గమృగము, ఇది అడవిలో వుండే చిన్న యేనుగువంటిది, దీనికిముక్కు మీద వొక కొమ్ము వుంటున్నది, అడివి దున్నపోతు కన్న చెడ్డది. "It is asolitary animal; nor at any time does the male live in the society of the female" (Francis Bu. Hamilt. E. Ind. 3. 574.) Hence the Telugu name is వొంటరి గాడు.
Rhododendron n s వొక విధమైన పుష్పవృక్షము. the oleander or rose bayగన్నేరు చెట్టు.
Rhodomontade n s అనర్థకమైన ఆత్మశ్లాఘనము, పిచ్చిగర్వము, జంభాలు నరకడము.
Rhomb n s a lozenage మాణిక్యపట్టె యొక్కగాని డైమ్న చుక్క యొక్కగాని ఆకారము.
Rhombold, Rhomboidical adj మాణిక్య పట్టె ఆకారముగా వుండే. "The islandof Ireland is of rhomboidical shape" (Encyclopedia.) అయిరులాండనేదీవి మాణిక్యపట్టె ఆకారముగా వున్నది.
Rhubarb n s వొక విధమైన చెట్టు, దీని చెక్కతో చేసిన బేది అయ్యే మందును రేవల్చిన్ని అంటారు. See Madras Journal, Oct. 1836. p. 422.
Rhyme n s ఇంగ్లిషు పద్యముల ప్రతి వాక్యము యొక్క కొనలోనున్ను వొకపాదములోవచ్చిన అక్షరమే మళ్లీ మళ్లీ రావడము, అనగా "With grateful hearts the past we own. The future, all to us unknown, We to thy guardian care commit, And peaceful leave before thy feet." యిందులో వుం rhymes, own, known, commit, feet అనే మాటలే. * in Sanscrit verseఅంత్య నియమము, పరిపతతి పయోనిధౌపతంగః, సరసిరు హాముదరేషు మత్తభృంగః, ఉపవనతరు కోటరే విహంగః, యవతిజనేషు శనైశ్శరనంగః. In Telugu poetry there are two kinds of *, one is called యతి and the other is called ప్రాస. he spoke without * of reason తలాతోక లేక మాట్లాడినాడు, ఆలోచన లేకుండా మాట్లాడినాడు.
Rhymer, Rhymester n s. a word of contempt for a poet కుకవి.
Rhythm n s Metre; verse: numbers ఛందము.
Rhythmical adj harmonical; having one sound proportioned to another చందోవిశిష్టమైన, ఛందోబద్ధమైన.
Rial, Ryal,Real n s. (a coin) వొక నాణెము.
Rib n s పక్క యెముక. the horse kicked him and broke his *s గుర్రము తన్ని వాని పక్క యెముకలు విరిగినవి. the *s in a leaf ఆకులో వుండే నరాలు. a low word for a wife భార్య, యిది నీచమాట. he smote him under the fifth * వాణ్ని డొక్కలో పొడిచినాడు. See Adam Clarke on 2 Sam. XX. 10.
Ribald n s పోకిరి, తుంటవాడు.
Ribaldry n s పోకిరితనము, తుంట మాటలు.
Riband n s or ribbon నాడా. shoe * జోళ్ళకు కట్టే నల్లనాడా. the sail was torn to ribbons వాడ చాప పేలికలు అయిపోయినది. he gained the * రాజసన్మానమును పొందినాడు.
Ribbed adj గుమ్మడికాయవలె బద్దలు బద్దలుగా యేర్పడి వుండే. the pumpkin is *గుమ్మడి కాయ మీద పక్క యెముకలవలె బద్దలు బద్దలుగా యేర్పడి వుంటున్నది.
Ribbon n s See Riband నాడా.
Rice n s clear from the husk బియ్యము. * in the husk ధాన్యము.raw * పచ్చి బియ్యము. raw * coloured with saffron అక్షతలు, అక్షింతలు.boiled * అన్నము. burnt * మాడు. malted * వుప్పుడు బియ్యము. washings of * కడుగు. various fine kinds of * are called మురారిజల్లి రాజనాలు,శ్రీరామభోగాలు. &c.
Ricefield n s మడి, వరి పొలము.
Rice-milk n s పాయసము, పరమాన్నము.
Rich adj wealthy ఐశ్వర్యముగల. a * man భాగ్యవంతుడు, కలిగినవాడు,ఐశ్వర్యవంతుడు. * people కలిగినవాండ్లు. in * abundance విస్తారముగా, యథేష్టముగా. as a Dives, or wicked man సుఖవాసియైన, సుఖప్రాణియైన.* food సుభోజనము. * milk వెన్న అయ్యే పాలు. a * shawl నిండా బుట్టాలుగల శాలువ. a * dress జంభమైన వుడుపు. a * soil సత్తువగలభూమి. a * blue మంచినీల వర్ణము. a * description దివ్యమైన వర్ణన. a * story సరసమైన కధ. * in herbs పశువుల గల. he is * in good works వాడు తపోధనుడు, పుణ్యవంతుడు. this isle is * in antiquities యీ దీవిలో పూర్వకాలపు గుడిగోపురాలు మొదలైన గుర్తులు శానా వున్నవి. he took her for richer or poorer దాన్ని నయనషటాలకు బాధ్యురాలుగా పెండ్లాడినాడు.
Riches n s కలిమి, భాగ్యము, ధనము. what is the good of * after death చచ్చిన తర్వాత బాగ్య మెందుకు. through the * of his mercy ఆయన యొక్క విశేష కటాక్షమువల్ల.
Richly adv దివ్యముగా. this bird, this insect or this snake is * coloured దీని వన్నె దివ్వయముగా ఉన్నది. he * deserves this దీనికి వాడు నిండా అర్హుడుగా వున్నాడు, పాత్రుడుగా వున్నాడు.
Richness n s అతిశయము, ఆధిక్యము. from the * of the colour వన్నె దివ్యమైనది గనక. from the * of the taste మాదుర్యాతిశయము వల్ల.from the * of the soil భూసారము వల్ల.
Rick n s a pile of corn or hay ఓదె, చిన్న వామి.
Rickets n s a distemper in children మూతి కడుపు వూదుకొని కాళ్లు చేతులు యీచుకొని కీళ్లు కదుములు కట్టుకొనే రోగము, యీ రోగము తొమ్మిది నెలలకు పైన రెండేండ్లకు లోగా తగిలి అవతల కుదురినా దానివల్ల పుట్టే నిస్సత్తువ చచ్చేదాకా తీరదు.
Rickety adj దుర్బలమైన, నిస్త్రాణైన. a * bed మంచపు కుక్కి.
Rid past tense of Ride సవారివెళ్ళిన, he * there గుర్రమెక్కి అక్కడికిపోయినాడు.
RID 967 To R v a నివృత్తి చేసుట, విడిపించుట, విడదల చేసుట. I will * you of this debts నీ కీ ఋణ విమోచనము చేస్తాను. he beat the bed to * it of bugs నల్లులు పోవడమునకై మంచాన్ని కొట్టినాడు. I wish I could * you of telling lies నిన్ను అబద్ధా లాడకుండా యెట్లా చేయబోతానో. he *ded them of their sins వాండ్ల పాపములను నివృత్తి చేసినాడు, పోగొట్టినాడు. this will * you of going there యిందువల్ల నీవు అక్కడికి పోవడము మాన్పును. I am not quite * of the fever ఆ జ్వరము యింకా శుద్ధముగా తీయలేదు. to * the book of worms he put it in the sun పురుగులు పోవడానకై ఆ పుస్తకాన్నియెండలో పెట్టినాడు. I cannot get * of musquitoes యీ దోమ వుపద్రవము మాన్పుకోలేను.I did this to get * of him వాణ్ని నివృత్తి చేసుకోవడానకై యీ పనిని చేసినాను.
Riddance n s నివృత్తి, నివారణము, విమోచనము, విడుదల. he made a clear * of the book ఆ పుస్తకాలు తుట్రమరలేకుండా చేసినాడు.
Ridden past participle of Ride సవారెక్కిపోయిన, after he had * a mile గుర్రెమెక్కి గడియదూరము పోయిన తర్వాత.
Riddle n s a puzzle విడి కధ. i. e. మిద్దె మీది మిరపచెట్టు నీళ్లు లేక యెండిపోయెను, అనగా దీపము. his letter is a complete * వాడి జాబు యొక్క భావము యెంత మాత్రము తెలియదు. a sieve జల్లెడ.
Ride n s సవారి, వాహనమెక్కి పోవడము. there is a * round the hill ఆ కొండ చుట్టూ గుర్రమెక్కి పోవడానికి దారి వున్నది. he took a * వాహన మెక్కి పోయినాడు.
Rider n s రౌతు, గుర్రమెక్కి పొయ్యేవాడు, వాహన మెక్కి పొయ్యేవాడు. a rough * (he who breaks or teaches a horse) గుర్రమును తిప్పేవాడు, చబుకు సవారు. asupplement, additional paper ఉప గ్రంథము. messenger or travellerbetween merchants వర్తకులు వుండే ఆయా స్థలములకు పోతూ వస్తూ వుండే కార్యగాడు.
Ridge n s the top, a long elevation, of land శిఖరము, కొన. on the * of the hill కొండ మీద, పర్వత శిఖరము నందు. *s in a field గని మలు.the ground thrown up by one plough నాగేటిచాలు చక్కగా వుండే గనిమ. the* of the house యింటి కొప్పు, యింటి మొగటు.
Ridiciculously adv పిచ్చిగా, వెర్రిగా.
Ridicule n s ఎగతాళి, పరిహాసము, గేలి. or lady's bag (properly a resticule) దొరసానులు చేతికి తగిలించుకొనే సొగసైన సంచి.
Ridiculous adj exciting laughter, odd, queer పరిహాసమైన, ఎగతాళియైన, వికారమైన, వింతైన. a * dress వెర్రివుడుపు. a * excuse పిచ్చి సమాదానము. a * story వెర్రి కథ, వెర్రి మాట. it is * to say so నీవు యిట్లా చెప్పడము పనికిరాదు.
Riding n s going on horseback &c. సవారి పోవడము. Division of a country తుక్కుడి, తాలూకా.
Rife adj సంపూర్ణమైన, విస్తారమైన, అధికమైన, బహుళమైన. rats are * in thestable లాయములో యెలుకలు విస్తారముగా వున్నవి. the cholera was then * అప్పట్లో వాంతి భ్రాంతి అధికముగా వుండినది. the report was * that he was dead వాడు చచ్చినాడని అంతటా వదంతిగా వుండినది. this book is * with beauties యీ పుస్తకములో దివ్యమైన శ్లోకాలు నిండా వున్నవి. this account is * with mistakesయీ లెక్క తప్పుల తడకగా వున్నది.
Rifenenss n s fulness, plenty, abundance విస్తారము, ప్రాబల్యము, అధికము.
Riff-raff n s (Johnson) అల్లరిమూక, వట్టి పోకిరీలు.
Rift (past participleofRive) broken,split,tornచీలిన,పగిలిన,చిట్లిన
Riftings n s or chinks, splits కంతలు, బొందలు, బీటికెలు, పగుళ్లు.
Rig n s A contempluous word for things or articles of dress సామాను, ఉడుపు. he never thought when he set out of running such a * వాడు బయిలు దేరేటప్పుడు యింతపని సంభవించబోతున్దని యెంచ లేదు. Thus bags andbriefs bonds and gowns, and other like *s సంచులు, వ్యాజ్యసారాంశములు,పత్రములు, అంగీలు మొదలైన తుక్కాముక్కా.
RIG 969 Right interj సరే, న్యాయమే, వాస్తవ్యమే.
Rigadoon n s a kind of brisk dance తాండవము, నాట్యము.
Rigger n s వాడకు తాళ్లు తలుగులు తగిలించేవాడు. outrigger పనసమాను, అనగా పడవ పొర్లకుండా పడవకు బారెడు దూరములో పక్కన బొగ్గులు వేశి కట్టిన మాను.
Rigging n s వాడ తాళ్ళు చాపలు మొదలైనవి. they were perched on the* వాండ్లు వాడ స్తంభము యొక్క తాళ్ళ మీద కూర్చుండిరి. he manned the * వాడస్తంభము యొక్క తాళ్ళ మీద వాండ్లను వుండేటట్టు చేశినాడు.
Riggish adj ధూర్తుడైన, కొంటైన.
Right adj ఒప్పైన, తగిన, మంచి, సరియైన, న్యాయమైన, యుక్తమైన, అర్హమైన. *conduct మంచి నడక, న్యాయమైన నడక. this is not * యిది న్యాయము కాదు. this account is not * యీ లెక్క బాగా వుండలేదు, సరిగ్గా వుండలేదు. you are * నీవు చెప్పినదే సరి. I do not know if it is * or wrong అది తప్పో వొప్పో నాకు తెలియదు, అది సరో సరికాదో నాకు తెలియదు. this is * యిది న్యాయమే యిది సరే. as far as is * తగు మాత్రముగా. that is not his * name యిది వాడికి నిజమైన పేరు కాదు. the * way సరియైన దారి క్రమమైన మార్గము. he does not know the * way to do it దాన్ని చేయడానకు వాడికి సరి యైన దారి తెలియదు.he was formerly mad, he is now in his * mind వాడికి మునుపు వుండిన పిచ్చి తీరి యిప్పుడు తెలివిగా వున్నాడు. he was sitting clothed and in his * mind (సవస్త్రంస చేతనం A+) చక్కగా బట్టలు తొడుగుకొని పిచ్చి కళలు లేక తెలివిగలవాడై కూర్చుండివుండెను. not left కుడి, the * hand కుడి చెయ్యి. on the * side కుడి ప్రక్కన. he is my * hand man వాడే నాకు మంత్రి, వాడు వుంటేనే గాని నాకు యేపన్నీనిగడవదు, వాడు నాకు హస్తకుడు. the * hand caste కుడిచేతి వాండ్లు. he found fault with them all * and left వీడు వాడని చూడక అందరికిన్నీ చీవాట్లు పెట్టినాడు. he sold all his books * and left యిది అది అని చూడక పుస్తకాలన్నిటిని అమ్మినాడు. a * line చక్కని గీత, వంకరలేని గీత. * angleor the corner of a square చతురశ్రమముగా వుండె దానిలో వొక కోణము, చతురశ్రకోణము. * angle సరిమూల. a square has four * angles నలుచదరమునకునాలుగు సరి మూలలు వున్నవి.
Righteous adj సత్యసంధులైన, ధర్మాత్ములైన, న్యాయీకుడైన, న్యాయమైన. a * decision న్యాయమైన తీర్పు. a * judge న్యాయీకుడైన తీర్పరి. in the French Bible * is often translated Debonnaire i. e. merciful దయాళువైన. thus in Ps. XXXVII. 17 where సాధు. is certainly the sense. ధార్మిక is the word in A+ both here and in Prov. X. 6.&c.
Righteously adv ధర్మముగా, న్యాయముగా.
Righteousness n s ధర్మము, న్యాయము, యధార్ధ్యము. C+ పుణ్యం A+ నీతి P+ H+ F+ R+ In Rom. VIII. 4. ******* ధర్మకారిణి A+.
Rightful adj బాధ్యతగల, నిజమైన, న్యాయమైన. he is the * owner of the house ఆ యింటికి న్యాయమైన బాధ్యుడు వాడు, నిజమైన బాద్యుడు వాడు.
Rightfully advi న్యాయముగా, న్యాయతః. he * took the satate ఆ యాస్తిని వాడు న్యాయముగా యెత్తుకొన్నాడు, బాధ్యత కలిగి యెత్తుకొన్నాడు.
Rightly adv ధర్మముగా, న్యాయముగా, నిజముగా. they call it is a dog but * it is a fox దాన్ని కుక్క అంటారుగాని అది నిజముగా నక్క.
Rigid adj strict, exact, stiff, stem, severe ఖండితమైన, కఠినమైన,చెడ్డ. his is a * law among them యిది వారిలో వొక కఠినమైన శాసనము.he is very * వాడు నిండా కఠినుడు. as I know your * severity తమరు చెడ్డవారు గనక. * investigation ఖండితమైన విచారణ. a * ruler క్రూర శాసనీకుడు. the * puritans వీరశైవులు.
Rigidity, Rigidness n s. stiffness కాఠిన్యము, వంగకుండా వుండడము.
Rigidly adv కఠినముగా, క్రూరముగా.
Rigmarole n s Nonsense పిచ్చికూతలు, వెర్రి మాటలు, లేనిపోని మాటలు.Boswell's Johnson, Dec. 1759
Rigorous adj క్రూరమైన, కఠినమైన.
Rigorously adv క్రూరముగా, కఠినముగా.
Rigour n s stiffness క్రౌర్యము, కాఠిన్యము, ఖండితము. a shivering with cold వణకడము. through the * of the season నిండా చలికాలముగా వుండుట వల్ల, పాడు చలికాలము గనుక.
Rill n s Small stream కాలువ, చిన్న యేరు.
Rim n s అంచు. there was a brass * round the table పలక చుట్టూ విత్తడి కట్టు వేశి వుండినది.
Rind n s the skin of a fruit or of a tree పండ్లు ఫలాలమీది తోలు, పట్ట. the * of a green fruit చెక్కు.
Ring n s ఉంగరము. a circle మండలము, వలయము. the wedding * పెండ్లి కూతురి యెడమ చేతి వుంగరపు వేలిలో వేశే వుంగరము. a plain finger * బటువు. a toe * చుట్టు, మెట్టె. a nose * ముంగర, నత్తు, ముక్కు పోగు. the * of grass to set a pot upon చుట్ట కుదురు. a wasp has *s of yellow round its body గండ్రీగ మీద పచ్చసుళ్లు వుంటవి. a * or circle of people గుండ్రముగా నిలిచిన వాండ్లు, వలయాకారముగా నిలిచినవాండ్లు. the * or boxing * జెట్టీల సమూహము.the * of baked earth in a well వొరలు, a * well వొరలబావి. black *s worn as bracelets నల్ల గాజులు. a staple * గొలుసు కొండి.a * or peal of bellls సప్త స్వరములు పలికే గంటల జత. I heard a * గంటల యొక్క నాదము విన్నాను. a road that sound round చుట్టూరు వుండే దోవ. the sound of a bell నాదము, ధ్వని. the * finger అనామిక అనే వేలు. *s of hair on a horse skin సుళ్ళు.
Ring-bone n s గుర్రపు గొరిసెకింద కట్టేకాయ, యిది గుర్రాలకు వచ్చే వొక రోగము.
Ringdove n s కపోతభేదము, వొక విధమైన పావురాయి.
Ringing n s వాగడము, మోగడము, శబ్దించడము, ధ్వని.
Ringing-stone n s జీవశిల, తట్టితే మోగే నల్లరాయి.
Ringleader n s మొనగాడు, దుష్టాగ్రేసరుడు, అనగా దుష్ట పనులు చేశేవాండ్లకు అగ్రేసరుడు.
Ringlets n s plu. ముంగురులు, కుంతలములు.
Ringstreaked adj చిత్రవర్ణముగల. F. +. పట్టెగళుళ్ళవగళు H.+ రేఖావిశిష్ట D+.
Ringworm n s చిరుగుడు తామర.
Rinsing n s కడిగి కుమ్మరించిన నీళ్ళు. * of the mouth పుక్కిలించి వుమ్మి వేసిన నీళ్ళు.
RIO 971 Riotous adj అల్లరైన, తొందరైన, కలహముగా వుండే.
Riot n s అల్లరి, కలత, కలహము, రచ్చ. he ran * అల్లరి చేసినాడు, తన మనసు వచ్చినట్టు తుళ్ళి పడ్డాడు. the * act వొక అల్లరి పని జరిగే సమయములో పోలీసువారు చేసే ప్రకటన పత్రిక.
Rioter n s కలహము చేసేవాడు, అల్లరి పని చేసేవాడు.
Rioting n s అల్లరిపని, (భైరవచక్రం C+ కచ్చేళితనము P+.)
Riotously adv అల్లరిగా, ధూర్తతనముగా, రచ్చచేసి.
Riotousness n s అల్లరి పని, రచ్చ, రావిడి.
Rip v a a villain దుష్టుడు.
Ripe adj పక్వమైన, పండిన. when the fruit is * కాయ పండినప్పుడు.a fruit nearly * దోరపండు. * mangoes మామిడిపండ్లు. the boil is * ఆ గడ్డ పండు బారినది. matters were now * for a war యుద్ధము గడియల మీద వున్నది. he is a * scholar పూర్ణాధికారి మంచి పండితుడు. over *, too * మాగిన.
Ripened adj పరిపక్వమైన. * wit పరిపక్వమైన బుద్ధి.
Ripeness n s పరిపక్వము, పరిపూర్ణత, పరిపాకము, పరువము, సంపూర్తి,సంపూర్ణత.
Ripening n s పరిపక్వమయ్యే కాలము.
Ripple n s తరంగములు, సన్న అలలు, నీళ్లు కదలడము. there was not a * upon the sea గాలి లేనందున అప్పట్లో నీళ్ళు కదలకుండా వుండినవి.
Rise n s beginning, commencement ఆరంభము. after sunrise ప్రొద్దు పొడిచిన తర్వాత, సూర్యోదయమైన తర్వాత. moonrise నెలపొడుపు, చంద్రోదయము. ascent పైకి పోవడము, పైకి యెక్కడము. the house standson the * of the hill ఆ యిల్లు పర్వత తటమందు వున్నది. the house stands upon a small * ఆ యిల్లు వొక తిప్ప మీద వున్నది. the * of Mars శుక్రోదయము. Increase అభివృద్ధి. the * of that family in all owing to him ఆ కుటుంబము ముందుకు వచ్చినది అతని పుణ్యము. from the sudden * of the water లటక్కున నీళ్లు వుబికినందున. they took it's * వాండ్లు లేచిరి. it took it's * పుట్టినది, కలిగినది. the * and fall of prices వెల హెచ్చడము, తగ్గడము. the * and progress of the affair ఆ వ్యవహారము యొక్క పూర్వోత్తరము. this gave * to a quarrel ఇందువల్ల వొక కలహము పుట్టినది. this gave * to the storyయిందువల్ల ఆ కథ పుట్టినది.
Risen participle పుట్టిన,కలిగినలేచిన,ఉదయమైన
Risibility n s నవ్వే గుణము, నవ్వే స్వభావము.
Risible adj నవ్వటాలైన, నవ్వేటందుకు ఆస్పదమైన, ఎగతాళిగా వుండే.this excited his * muscles యిందువల్ల నవ్వును పట్టలేక పోయినాడు. he had some difficulty in composing his * muscles వచ్చిన నవ్వును అణచుకొన్నాడు.
Rising n s ఉదయము, లేవడము. elevation of ground తిప్ప. the * of the sun సూర్యోదయము. the * of a river యేరుపుట్టడము, నది యొక్క వుత్పత్తి. * from the dead పునరుత్థానము, చచ్చినవాడు మళ్ళీ బ్రతకడము.the * as a tumour పుండు, గడ్డ. as an insurrection కలహము. the * in the north ఉత్తర దేశములో పుట్టి వుండే కలహము.
Risk, Risque n s. Hazard; danger; chance of harm అపాయము, ఆపద,మోసము. he did it at an enormous * ప్రాణానికి వొడ్డి దీన్ని చేసినాడు.he ran the * of killing himself వాడికి ప్రాణగండము తప్పినది. he ran the * of quarrelling with his father వాడి తండ్రితో జగడము వచ్చేగతిగా వుండి తప్పినది. In this you run no *; or, there is no * of losing the money యిందులో నీ రూకలకు భయములేదు. I will run the * వొక చెయి చూస్తాను.
Rite n s క్రియ, కర్మము, అగమము, ఆచారము. the marriage * వివాహము.funereal *s ఉత్తర క్రియలు. magic *s మాంత్రిక క్రియలు. sacrificial *sహోమము, యజ్ఞము మొదలైనవి. the *s of Bacchus బలరామ చేష్టలు, అనగా మద్యపానము. Ritual, adj. ఆగమసంబంధమైన, ఆచారసంబంధమైన.
Ritual n s ఆచారకాండ, ఆగమము, ఆగమ పుస్తకము.
Ritualist n s ఆచారకాండ, ప్రకారముగా నడిచేవాడు, కర్మఠుడు.
Ritually adv ఆచారకాండ ప్రకారముగా, యథావిధిగా.
Rival n s పోటిగా వుండేవాడు, పోటి చేసేవాడు. * wives సవతులు.
Rivalling adj పోటిగా వుండే, సరితూగే.
Rivalry n s పోటి, సాటి, ఈడు.
Riven adj split, divided, broken చీలిన, బద్ధలైన, చీలచబడ్డ.
River n s ఏరు, నది. the middle of the * నట్టేరు, నదీ గర్భము.the mouth of a * ముఖద్వారము.
River-dragon n s మొసలి, గ్రాహము.
River-god n s నదీ దేవత.
River-horse n s ఏటిగుర్రము, నీరు గుర్రము.
Rivet n s మణగకొట్టిన చీల, వెనకతట్టు మణగకొట్టిన చీల, సందులో చొప్పించి అవతలి మొనను వెడల్పుగా కొట్టిన చీల.
Riveted adj veVnaka wattu maNagakoVttina, yixi cIlanu గురించిన mAta. Metaphorically, fixed లగ్నమైన.
Rivulet n s కాలవ, చిన్న యేరు.
Rixdollar n s ఒక విధమైన వరహా, యిది ముక్కాలు రూపాయికి మారుతున్నది.
ROA 973 Roach n s ఒక చేప. he is as sound as a * వాడు బాగా పటుత్వముగా వున్నాడు, యేనుగవలె వున్నాడు.
Road n s బాట, దోవ, దారి, మార్గము, త్రోవ. on my * I met him నేను పోతూ వుండగా దోవలో వాడు అడ్డుపడ్డాడు. he took his * దారి పట్టినాడు. he took to the * i. e. he became a highway man దారికట్టి దోచే దొంగ అయినాడు. a *, or *s, for ships సముద్రపు రేవులో వాడలు లంగరుచేసే చోటు.
Roadstar n s a horse for travelling దోవ ప్రయాణమునకు అర్హమైన గుర్రము.
Roadstead n s వాడలు లంగరు చేసే రేవు. Madras is not a port, it is merely an open * చెన్న పట్టణములో వాడలు లంగరు చేశి వుండడానకు వైపైన చోటు లేదు, గాలికి మరుగులేక తెరపగా వుండే వాడ రేవు వున్నది.
Roaming n s తిరగడము, సంచారము, అల్లాడడము.
Roan adj bay, sorrel, or black colour, with grey or white spots, interspersed very thick గుర్రము యొక్క వొకవన్నె.
Roar n s అరుపు, కూత, మోత, ఘోష, గర్జనము, బొబ్బలు. the roaringof the sea సముద్రము యొక్క ఘోష, మోత. *s of laughter పకపకలు.
Roarer n s a horse with a broken chest గుండెలు పగిలిన గుర్రము.
Roast n s కాల్చి పక్వము చేయబడ్డ మాంసము. to rule the * (Johnson) పెత్తనము చేసుట, ప్రభుత్వము చేసుట, సర్వాధికారము చేసుట. the wife rules the * యింట్లో పెత్తనమంతా వాడి పెండ్లాము చేస్తున్నది.
Roast, Roasted p|| కాల్చిన,కాల్చిపక్వముచేసిన,roasted corn పేలాలు.* meat కాల్చిన మాంసము. it is usually called (H.) కబాబు.
Rob n s (Inspissated juice) తాండ్ర.
Roball n s a certain Indian fish మాగచేప, మేవ చేప. This name is Spanish of South America. The fish is described in Stevenson's South America 1825. Vol. 1, page 121. Also in Lyon's Mexico. 2. 190 where he says it resembles our coal fish.
Robber n s దొంగ, ముచ్చు, చోరుడు. a highway * దారికట్టి దోచేవాడు. gang *s బందిపోటు దొంగలు.
Robbery n s దోపిడి, దొంగతనము, కొట్టి దోచడము. gang * బందిపోటు. highway * దారికట్టి దోచడము. * of the person బలవంతముగానైనా తెలియకుండానైనా వొంటి మీది సొమ్మును ముచ్చిలించడము,జేబులో వేసుకొన్న దాన్నిగాని కొంగున ముడివేసుకొన్న దాన్ని గాని దొంగిలించడము. a * of jewels నగల దొంగతనము. * of a house యిల్లు దోచుకోవడము.
Robe n s అంగీ, నిలువుటంగీ, రాజువేషము, గౌరవమైన వుడుపు.
Robed adj dressed ఉడుపు వేసుకొన్న, వేషము వేసుకొన్న.
Robin, Robin-red-breast n s. గోరింక వంటి వొక పక్షి.
Robinia mitis n s a kind of tree కానుగు చెట్టు. Roxb. 3. 239. కరంజవృక్షము.
Robust adj బలిష్ఠుడైన, దృఢగాత్రుడుగా వుండే, బలిసిన. he was then in * health వాడు అప్పట్లో దృఢగాత్రుడుగా వుండినాడు. or boisterous అల్లరిచేసే, తుంటైన.
Robustness n s stoutness పుష్టి, కాయపుష్టి బలుపు, లావు.
Roc n s fabulous bird కథలలో వచ్చే గంఢభేరుండము వంటి వొక పక్షి.
Rochet n s పాదిరి యొక్క వొక విధమైన వుడుపు, పాదిరి వేసుకొనే వొక విధమైన చొక్కాయ.
Rock n s రాయి, కొండ, పర్వతము, శిల, బండ. a shoal of *s in the sea నీళ్ళలో వుండే పర్వతము, చుట్టు. the living * జీవశిల.the * of our salvation ఆశ్రయము, శరణము, రక్షణము. the * he split on was ambition వాడి అత్యాశే వాణ్ని చెరిపినది. the * and spindle రాట్నము తిప్పే కర్ర.
Rocket n s ఆకాశచువ్వ, ఆకాశబాణము. wheel * చక్రబాణము. a large * రాచూరి బాణము. an instrument used in war శతఘ్ని. a plant ఒక తోటకూర.
Rock-pigeon n s పోలుగు, పోలిక పిట్ట.
Rocksalt n s రాతివుప్పు.
Rock-snake n s a great but harmless Indian serpent కొండచిలువ, కొండపాము, తుండుపాము.
Rocky adj రాళ్ళమయముగా వుండే. * soil చాట్టుమన్ను, రాళ్ళమయముగా వుండే భూమి.
Rod n s Any thing long and slender కర్ర, కోల దండము. a * of gold కనకశలాక. a * of iron యినపకమ్మి. a * of office వెండి బెత్తము. a twig చువ్వ. an instrument of punishment బడిలో పిల్లకాయలను కొట్టడానకై నాలుగు అయిదు చేర్చికట్టిన చువ్వలు. a stick for measuring కొలిచే కోల. a kind of sceptre శంగోలు, శంగోలము. to kiss the * నాకు చేసిన శిక్షన్యాయమేనని వొప్పుకొనుట.
Rode See Ride
Rodomontade n s జల్లి, జంభాలు కొట్టడము, జంభాలు నరకడము.
Roe n s ఆడ జింక. fish * (that is) eggs in a fishజెన, చెపగుడ్లు.
Roebuck n s మొగలేడి.
Rogue n s దొంగ, మోసగాడు, పోకిరి, కొంటె. a playful word of affection దొంగ, ముచ్చు.
Roguery n s దొంగతనము, కొంటెతనము, మోసము.
Roguish adj దొంగైన, దొంగతనమైన, మోసమైన, వంచనైన.
Roguishly adv దొంగతనముగా, వంచనగా.
Roguishness n s దొంగతనము, మోసము.
Roisterer n s తొందరమనిషి, అల్లరి చేసేవాడు.
Roll n s చుట్ట. a * of silk పట్టు చుట్ట. a turband is a * of cloth పాగా, అనగా చుట్టగా చుట్టినగుడ్డ. he gave a * పొర్లినాడు. a * of tobacco పొగాకునగ. a * of beetle leaf ఆకు ముడుపు. a * of cotton for spinning ఏకు. a * of cordనులకపిడి. a bead * జపమాలిక. or book గ్రంథము. a list పట్టీ. a * of names పేళ్ళపట్టీ. a * of bread చిన్న రొట్టె.a * on the drum తంబుర మీద వాయించే గుడుగుడుమనే శబ్దము.
Roller n s పొత్తరము, రుబ్బు పొత్తరము, గుండ్రాయి. a horse's girth టంగుపట్ట. a kind of bird వొక పక్షి. a wave తరంగము,అల. for smoothing a road బాట సమము కావడమునకై దొర్లించే రాతి ప్.ఒత్తరము
Rolling n s పొర్లిక.
Rolling-pin n s అప్పడాల కొయ్య, కొడుపు.
Rolling-press n s అచ్చు వేశే వొక విధమైన యంత్రము.
Rollypoly adv (Johnson) గిరగిర.
Rolong n s (an Indian word; a kind of flour) నూకలు.
Roman adj రోందేశ సంబంధమైన. * letter వొక విధమైన అచ్చు అక్షరములు. a man with a * nose గరుడ ముక్కు గలవాడు.
Romance n s కల్పనాకధ, కట్టుకధ, చిత్రవిచిత్రమైన కధ. the * of Harischandra హరిశ్చంద్రచరిత్ర. the adventure of Arjuna, a * విజయ విలాసము. the adventures of Stella and the Genuisతారళశాంక విజయము. "Mr. Brooker's Journal regarding Borneo exemplifies the truth that great things are rarely accomplished in new and strange fields excepting by men with a strong tendency to * in their composition." (Edinb, Rev. July, 1846, p. 148.) that is ఊత్సాహపురుషులు.
Romancer n s చరిత్రలు చెప్పేవాడు.
Romanist n s రోంమతస్థుడు.
Romantic adj చిత్రవిచిత్రమైన. or visionary లేనిపోని, కల్పించిన, కల్పనైన, వట్టి. a * story శృంగారకధ, కల్పనాకధ, కట్టుకధ a * attachment లేనిపోని మోహము, పిచ్చిభ్రమ. * hopes వుత్త ఆశ.
Romish adj రోంమత సంబంధమైన.
Romp n s a rude girl మోటుపడుచు, దిమ్మరి. boisterious play అల్లరిఆట, గంతలు మొదలైనవి.
Romping n s rude noisy play మోటు చేష్టలు, అల్లరిపని, పిల్లకాయలు అల్లరిగా వేసే గంతులు, దౌష్ట్యము.
Rondean n s a kind of poetry in three couplets మూడు శ్లోకాలు గల వొక చిన్న కావ్యము. a piece of music in three strains రాగవిశేషము.
Rood n s the fourth part of an acre యెకరాలో నాలుగో భాగము. Also, a name for the cross.
Roof n s పై కప్పు, పైపూరి. while I was under his * నేను అతని యింట్లో వుండగా. the * tree వెన్నుబద్ద, వెన్నుపట్టె. a flat * దద్దళము. a shelving *, or pent * పెణక. the pitch of the * ఇంటి యొక్క యేటవాలు, వాటము. the * of the mouth అంగిలి, నోటిలో పైతట్టు. the * of the cavern గుహ యొక్క పై తట్టు.
Roofless adj పై కప్పులేని, తెరపగా వుండే, కప్పు లేకుండా వుండే.
Rook n s ఒక విధమైన కాకి. at chess ఏనుగ.
Rookery n s కాకులు యేకముగా గూళ్లు పెట్టివుండే తోపు.
Room n s space స్థలము, ఎడము, జాగా. or chamber గది, కొట్టు, యిల్లు. put a light in that * ఆ యింట్లో వొక దీపము పెట్టు. a public * చావడి పదిమంది కూడే చోటు. a suit of *s వొక వరసగా వుండే గదులు.there was no * for me in the house ఆ యింట్లో నాకు చోటు లేదు. there is no * in the chest for the books ఆ పెట్టెలో ఆ పుస్తకాలు పట్టవు,ఆ పుస్తకాలకు యెడము లేదు. there is no * to suppose he consented అతను వొప్పినాడనేటందుకు యెడము లేదు. I went in his * అతని మారుగా నేను పోతిని. make * వొత్తు, తొలగు. this gives * for some suspicion యిది అనుమానమునకు అస్పదముగా వున్నది, యిందువల్ల అనుమానము కలుగుతున్నది.give *; that is, go away వెళ్ళండి, లేచిపొండి.
Roominess n s విశాలత. from the * of that house ఆ యిల్లు విశాలమైనది గనుక.
Roomy adj విశాలమైన, విశాలముగా వుండే.
Roost n s పక్షి నిద్రపొయ్యే స్థానము, యీ మాట గూటిని గురించి చెల్లదు.
Root n s వేరు, మూలము, దుంప. bulbous *s గడ్డలు. esculent *s తినేగడ్డలు. the * of a tooth పంటి గురుసు. the * of a tail తోక యొక్క మొదలు, తోక గురుసు. the * of a word ధాతువు. the *s of a mountain పర్వతము యొక్క అడుగు. the tap * కుంకటి వేరు, తల్లి వేరు.after the plant takes * ఆ చెట్టుకు వేళ్ళు పారిన తర్వాత. the * ofthe whole busines ఆ వ్యవహారములో వుండే కిటుకు, సారాంశము. the love of money is the * of evil రూకల మీది అశే పాపములకు కారణము. he is ruined * and branch వాడు నమూల నాశనమైననాడు, దుంపనాశనమైనాడు.
Rooted adj వేరుపారిన, పాదుకొన్న. deep * hatred మనసులో నాటివుండే చలము. * aversion బద్ధవైరము. * out, or * up పెళ్ళగించిన, పెళ్ళగించబడ్డ. In Ephes. III. 7. ప్రేమ్ణాబద్ధమాలాన్. A+.
Rootedly adv firmly దృఢముగా, స్థిరముగా.
Rope n s తాడు, పగ్గము. a thick * మోకు. a straw * వెంటి.a rope's end కొణతాడు, అనగా కొరడా. a * of onions ఉల్లిగడ్డలసరము, తాటిలో గుచ్చిన వుల్లిగడ్డలు.
Rope-dancer n s దొమ్మరివాడు.
Rope-ladder n s నూలునిచ్చెన.
Rope-walk n s తాళ్ళు పేడే చోటు.
Ropiness n s బంఖ, జిగట.
Ropy adj జిగటగావుండే, బంకగా వుండే.
Roquelaure n s a cloak for men భైరవాసము.
ROS 977 Ros adj ఎర్రని, పాటలమైన. her * lips దాని యెర్రని పెదవులు.* faced పద్మముఖ. * fingered కమలహస్త. the * nymph పువ్వు బోడి,పద్మగంధి.
Rosary n s జపమాలిక.
Rose n s రోజాపువ్వు, సీమవన్నీరుపువ్వు. the dog * నక్కపన్నీరు.white * తెల్ల రోజాపువ్వు. the red china * దాసానిపువ్వులవంటి వొక పుష్పము. she who was the * of her sex స్త్రీ రత్నము, నారీతిలకము.under the * I believe he stole it వాడు దాన్ని దొంగిలించినాడు, యిది నీ మనసులో వుండని, బైటవిడవక. I suspect he drinks under the * వాడు రహస్యముగా తాగుతాడని తోస్తున్నది. the * of a waterengine జలయంత్రపు గొట్టములో వుండే నాళము యొక్క కొనపువ్వు.
Rose-apple n s ఆల్లోనేరేడు పండు.
Roseate adj రోజాపువవువంటి, యెర్రని.
Rose-bay n s a kind of tree పాలకొడిసె చెట్టు, కుటజము.
Rose-colour n s గులాబివర్ణము, సీమపన్నీరు పువ్వు వర్ణము, పాటవర్ణము.
Roselle n s తమరతచెట్టు.
Rosemary n s దవనము వంటి వొక చెట్టు.
Rosepattern adj సీమపన్నీరు పుష్పాకారముగా వుండే, కమలాకారముగా వుండే.
Rosette n s గుడ్డతో కుట్టిన పువ్వు.
Rose-water n s పన్నీరు.
Rose-wood n s నూకమాను. This grows luxuriantly in the neighbourhood of Trichinopoly+
Rosin n s గుగ్గిలము.
Rosinate n s దిక్కుమాలిన గుర్రపు తట్టు, యిది నాటకములో వచ్చే మాట.
Rosiness n s ఎరుపు పాటలవర్ణము.
Roster n s a list పట్టీ.
Rostrum n s ప్రసంగము చేసేటప్పుడు నిలిచే వున్నతమైన అనినము, సభామధ్యమందు వుండే వేదిక.
Rot n s తెవులు, చీడ.
Rotation n s తిరగడము, భ్రమణము, వరస, క్రమము, వంతు.the wheel made four *s ఆ చక్రము నాలుగు తిరుగులు తిరిగినది.the judges tried the causes in * న్యాయాధిపతులు వ్యాజ్యములను వాండ్ల వరసక్రమముగా విచారిమచినారు.
Rotatory adj తిరిగే, చుట్టే.
Rote n s repitition of words without sense అర్థజ్ఞానము లేకుండా చెప్పినదాన్నే వూరికె చెప్పడము. he repeats the Amaram like a parrot by * అర్థజ్ఞానము లేకుండా వూరికె అమరమును నోటిపాఠముగా చిలుకవలె చెప్పుతాడు. to get by * వర్లిమచుట. Bramins get the Vedas by * బ్రాహ్మణులు వేదమును అర్థము లేకుండా వూరికె వర్లిస్తారు.
Rotgut n s (Johnson) పేగుతెవులు, అనగా పనికిరాని సారాయి.
Rotten adj కుళ్లిన, మురిగిపోయిన, పుచ్చిన, పుప్పిపట్టిన. a * nut పుచ్చినవిత్తు. * sheep తెవులు పట్టిన గొర్రెలు. a * argument పనికిమాలిన న్యాయము, పనికిమాలిన సమాధానము. there is something * in the state ఆ వ్యవహారములో యేమో కల్మషము వున్నది. * stone i. e.a particular kind of stone వొక విధమైన నాపరాయి.
Rottenness n s పుప్పి, కుళ్లు, మురుగుడు.
Rotund adj గుండ్రని, వర్తులమైన.
Rotunda n s గిన్నె బోర్లించినట్టు కట్టి వుండే యిల్లు.
Rotundity n s గుండ్రన, వర్తులత్వము.
Rouge n s స్త్రీలు పూర్వకాలమందు చంపలకు పట్టించుకొనే వొక విధమైన గులాలుపొడి, ఎర్ర వర్ణము.
Rough adj గరుకైన, బిరుసుగా వుండే. * ground మిట్టాపల్లముగా వుండే భూమి. the sea was very * yesterday నిన్న అలలు అధికముగా వుండినవి.* weather నానా గాలిగా వుండే కాలము. * beard క్షౌరము చేయని గడ్డము. *rubies కెంపులదళము. a * diamond సానపట్టనిరవ, మూగరవ, స్వయంభూరవ. (metaph.) కొంచెము, ధూర్తుగా వుండినప్పటికిన్ని మంచివాడుగా వుండేవాడు. or miscellaneous చిల్లర. * words మోటుమాటలు, తిట్లు. the sound made by a saw is * రంపము యొక్క శబ్దము కర్ణకఠోరముగా వుంటున్నది. a * voice రాసినగొంతు. he spoke in a * voice పెద్దగొంతు చేసినాడు, కూకలు పెట్టినాడు. * behaviour, * manners అమర్యాద,దౌర్జన్యము. a man of * temper ధూర్తుడు. a * man మోటుమనిషి. raw mangoes are * to the taste మామిడిపిందెలు నోటికి వొగురుగా వుంటవి.a * draft of a letter చిత్తుగా వ్రాశిన జాబు. a * calculation ఉజ్జాయింపుగా వేసుకొన్న లెక్క. by all means both * and smooth నయాన భయాన, మంచితనాన చెడుతనాన. a * cast wall సున్నము పెట్టని గోడ, ముతక సున్నము పూశిన గోడ.
Roughcast adj ముతక సున్నము పూసిన.
Roughly adv ధూర్తుగా, పరుషముగా, కఠినముగా. * calculated ఊజ్జాయింపుగాలెక్క వేసుకొన్న.
Roughness n s గరుకు, బిరుసు, మిట్టా పల్లముగా ఉండడము. harshness to the earth కఠోరత్వము, పరుషత్వము. harshness of temper మోటుతనము.harshness to the taste వొగరు. as of skin బరుసు storminess గాలి కసురుగా వుండడము.
Roughrider n s గుర్రమును తిప్పేవాడు, చబుకు సవారు.
Rough-shod adj గరుకులాడముకొట్టిన. he rode * over their rules and customs వారి శాస్త్ర సంప్రదాయములను తొక్కి పారవేసినాడు.
Rouleau n s రూకలు పొట్లము.
Round adj గుండ్రని, బటువుగా వుండే, వర్తులమైన, వట్రువైన. a * pearl ఆణిముత్యము. * shot పెద్ద పిరంగి గుండ్లు. a * assertion స్థిరముగా చెప్పినమాట, గట్టిగా చెప్పినమాట, నిశ్చయముగా చెప్పినమాట.a * sum అధిక రూకలు, అధిక వెల. a bold * hand ముక్తాఫలము వంటి మోడి. the boy is now in * hand పిల్లకాయ యిప్పుడు సున్నలు చుట్టుతున్నాడు.he walked at a * pace త్వరగా నడిచినాడు.
Roundabout adv తిరుగుళ్ళుగా. he spoke in a very * manner సరిగ్గామాట్లాడకుండా తిరుగుళ్ళుగా మాట్లాడినాడు.
Rounded adj గుండ్రని, బటువైన.
Roundelay n s a kind of song వొక విధమైన పదము.
Roundhead n s a word of scorn for a puritan వొక మతమునకు దూషణగా చెప్పే పేరు.
Roundhouse n s చావడి, ఠానా చావడి.
Roundish adj కోంచెము గుండుగా వుండే, వర్తులమైన.
Roundly adv well, properly చక్కగా, బాగా.
Roundness n s గుండ్రన, వర్తులత్వము.
Roused adj రేగిన, మేలుకొన్న. the country was immediately * in search of the thief ఆ తాలూకాలో అంతా ఆ దొంగను వెతికేటట్టు యెచ్చరిక చేయబడ్డది.
Rout n s a crowd, or mob అల్లరి మూక, అల్లరి గుంపు. running away, flight పారిపోవడము. he put them to the * వాండ్లను వెళ్ళగొట్టినాడు.the route (course or way) దారి, మార్గము, ప్రయాణము. their * was to Guntoor గుంటూరు మీదుగా పోయినారు. a sort of entertainment వొక విధమైన విందు. Route in old days people used to give suppers, or cards, or music, or dancing. When all four were united this was called a Route. We call it a ball. See Johnson's Rambler, No. 107.
Route n s See Rout.
Routed adj విరగబడ్డ, తరమకొట్టబడ్డ, వోడిన.
Routine n s order, series క్రమము వరస.
Rover n s దేశము తిరిగేవాడు, దేశదిమ్మరి.
Roving n s తిరగడము, వూరి మీద తిరగడము.
Row n s a riot, uproar, or disturbance (Wilberforce and Canning use this) అల్లరి, గత్తర, రచ్చ.
ROW 979 Row n s వరస, క్రమము, చాలు, చాల్పు. a * of pillars స్తంభాలవరస. a * of beads వొక పేట, జపమాలిక, తావళము. a mean lane దిక్కుమాలిన సందు, సన్న సందు.
Rowan n s a scotch word for a tree వొక విధమైన అడివిచెట్టు.(Southey, in "The Doctor.")
Rowball n s a certain Indian fish మాగచేప, మేవచేప.
Rowels n s the little wheels of spurs శప్పాతు ముండ్ల యొక్క కొనచక్రములు, గుర్రమెక్కే వాడు మడిమలకు కట్టుకొన్న ముండ్ల యొక్క పండ్లు గల చిన్న చక్రములు.
Rower n s పడవను తెడ్డుతో తోసేవాడు.
Royal adj belonging to a king or queen రాజసంబంధమైన, శ్రీ శ్రీమత్.those of * blood రాజవంశస్థులు. the blood * రాజకులస్థులు. he ate at the * table or king's board రాజ పంజ్తిలో భోజనము చేసినాడు, రాజుతో కూడా భోజనము చేసినాడు. a * tiger పెద్ద పులి. a * elephant పట్టపు యేనుగ.battle * ప్రచండమైన యుద్ధము. there was a battle * among the women ఆడవాండ్లలో వొక పెద్ద కలహము జరిగినది. his * highness రాజ కుమారుడు.
Royalist n s adherent to a king రాజుపక్షముగా వుండేవాడు, అనగారాజ్యభ్రష్టుడైన రాజును మళ్ళీ తీసుకవచ్చి పెట్టవలెననేవాడు. This was the phrase in the South American Revolution, in the French Revolution, in the English Revolution, &c.
Royally adv ఘనముగా, దివ్యముగా, రాజుకు తగినట్టుగా, రాజార్హముగా.
Royalty n s రాజత్వము, ప్రభుత్వము.
Rozeille SeeRoselle
Rub n s the act of rubbing రాపిడి. difficulty సంకటము, తొందర,ఆటంకము. the *s of life లోకములో సంభవించే అసహ్యములు, ఐహికములో వుండేసంకటములు.
Rub-a-dub-dub animitativeఫెళఫెళ
Rubbed adj రాచిన, తోమిన, పిసికిన, మర్దించిన, బుద్ధిన. * to pieces పొడిగా దలిచిన. the word that was * out తుడిచివేసిన మాట.
Rubber n s he who rubs తుడిచేవాడు, తోమేవాడు. the thing with which one rubs తుడిచేగుడ్డ మొదలైనది. Indian * రబ్బరు.(English word) this is the juice of a tree: the Hindus imagine that it is ఒమటె వట్టలతోలు, చర్మము. a * at cards కాకితాలు ఆడడములో వొక ఆట.
Rubber ; see Caout-chouc n s in this Supplement.
Rubbing n s రాపిడి, సంఘట్టన, ఒరియడము. smearing with sandal paste చందన లేపనము, గంధము పూయడము. * the limbs with fragrant paste నలుగు పెట్టడము.
Rubbish n s mingled mass తుక్కాముక్కా, పనికిమాలినది. * in a well పూడిక. the * of a building పడిపోయిన యింటి యొక్క పనికిమాలిన సామాను. do you call this a diamond? it is mere * ఇది వజ్రమంటావా, యిది వట్టి పనికిమాలినది. all his excuses are mere * వాడు చెప్పిన సాకులన్నీ పనికిమాలినవి. in bird'smusic పనికిమాలిన కూతలు.
Rubicon n s A small river forming the boundary of Italy,which Caesar crossed when he invaded Italy, with theintention of subduing it. Hence "to pass the Rubicon" is totake a desperate step in an enterprise, or to adopt ameasure form which one can not recede, or form which he isdetermined not to recede: (Webster) సాహసమైన ప్రయత్నము చేయడము,ముందరపెట్టినకాలు వెనకపెట్టని ప్రయత్నము చేయడము.
Rubicund adj Inclining to redness ఎర్రదాళువుగా వుండే.
Rubric n s Directions printed in books of law and in prayer books; so termed because they were originally distinguished by being written in red ink చట్ట పుస్తకములో గాని ప్రార్థన పుస్తకములో గాని అంచులో యెర్ర యింకితో వ్రాశి వుండే విధి.
Ruby n s కెంపు, కురువింధము. the fine * పద్మరాగము. redness ఎరుపు.
Ruck n s (i. e. a rick) a mass, throng నలగడము. my gown is all in a * నా చొక్కాయ అంతా నలిగి పోయినది. Out of the * i. e. the mass or crowd of dancers వేషగాండ్ల గుంపులో.
Rudder n s చుక్కాని the tall is the * of a fish చేపకు తోకే చుక్కాని.
Ruddiness n s ఎరుపు, కావివనె.
Ruddle n s ఎర్ర మన్ను.
Ruddy adj ఎర్రని. * gold కుందనము. * bronze colour నీలలోహిత వర్ణము, మధువర్ణము.
Rude adj మోటైన, మూర్ఖమైన, మడ్డియైన, మొరడైన. * behaviour మోటునడక, అమర్యాదైన పని. he is in * health రాయివలె వున్నాడు, మొద్దువలె వున్నాడు.
Rudely adv మోటుతనముగా, మడ్డితనముగా, అమర్యాదగా.
Rudeness n s మోటుతనము, మొరటుతనము, అమర్యాద, మూఢత్వము.
Rudimental adj మూలాధారమైన, ప్రాథమికమైన. * instruction బాలశిక్ష.
Rue n s సదాపచెట్టు.
Rueful adj చింతాక్రాంతుడైన, విచారపడే, దుఃఖపడే. * tidings దుఃఖ సమాచారము.
Ruefully adv వ్యసనముగా, విచారముగా, వ్యాకులముగా.
Ruff n s A puckered linen ornament, formerly worn about the neck మెడకుంచె, అనగా కుచ్చె పెట్టి కుట్టిన మెడగుడ్డ.
Ruffian n s పాతకుడు, చండాలుడు, గొంతు కోసేవాడు, ఘాతకుడు.
Ruffianism n s పాపిష్ఠితనము, దుష్టతనము, దౌర్జన్యము.
Ruffianly adj vile, rude దుష్ట, పాపిష్ఠి, చండాల.
Ruffle n s Plaited linen used, as an ornament కుచ్చెపట్టినబట్ట disturbance; tumult కతల. A kind of flourish upon a drum గుడుగుడుమని వొక విధముగా తంబుర వాయించడము. there is a * upon the water నీళ్లు వుల్లోలకల్లోలముగా వున్నది.
Ruffled adj కలతబడ్డ, చీకాకుబడ్డ, వితాకుబడ్డ.
Rug n s కంబళి, గొంగడి. an ornamental * రత్నకంబళి.
Rugged adj మిట్టాపల్లముగా వుండే, మోటైన, గడుసైన. a * road మిట్టాపల్లముగా వుండే బాట. this is a * task యిది వొక సంకటమైన పని.
Ruggedly adv మోటుగా, కఠినముగా, మిట్టాపల్లముగా.
Ruggedness n s కఠినము, మోటుతనము, మిట్టాపల్లము.
RUI 981 To Ru v a చెరుపుట, నాశనము చేసుట, పాడుచేసుట. this *ed his health యిందువల్ల వాడి వొళ్ళు చెడిపోయినది. he *ed her దాన్ని చెరిపినాడు.
Ruin n s పాడు, నాశనము, చెరుపు. this brought him to * యిందువల్ల చెడ్డాడు, యిందు వల్ల వాడికి చెరుపు వచ్చినది. the house is a complete * ఆ యిల్లు శుద్ధపాడుఅయి వున్నది, గోడల వాడ అయి వున్నది.this prevented his * యిందువల్ల వాడు చెడక తప్పినాడు.
Ruination n s పాడు, నాశనము, ధ్వంసము, నిపాతము, చెరుపు.
Ruined adj పాడుగా వుండే, శిథిలమైన, చెడిపోయిన. he is in * health వాడి వొళ్ళు చెడి వున్నది. a * man చెడిపోయినవాడు, ఐశ్వర్యమును పోగొట్టుకొన్నవాడు.
Ruinous adj పాడుపడ్డ, చెడ్డ, చెడిన.
Ruinously adv పాడుగా, నాశనముగా.
Rule n s సూత్రము, నిబంధన, అధికారము, దొరతనము. under the Musulman * తురక ప్రభుత్వములో. the * of three త్రయరాసికము. a carpenter's * గజకోల, కొలిచే కొయ్య.
Ruler n s or governor ఏలేవాడు, పాలించేవాడు, అధికారి, దొర, ప్రభువు. the * of all సర్వేశ్వరుడు. the instrument by which lines are drawn గీతలు వేసే కర్ర, రూలు కర్ర.
Ruling part ఏలే, ప్రభుత్వము చేసే. the * prince యిప్పుడు యేలేరాజు.the * passion తలయెత్తి వుండే గుణము, ముఖ్యమైన గుణము. his * passion is avarice వాడిలో ముఖ్యముగా వుండేది అత్యాశ. the * passion of the Musulmans is pride తురకలలో ముఖ్యముగా వుండేది గర్వము, తురకలకు గర్వమే ప్రధానము. his * passion is for dogs and horses వాడికి ముఖ్యముగా వుండే బులుపు కుక్కల మీద, గుర్రాల మీద. their * passion is lust వాండ్లు మోహపాశబద్ధులై వున్నారు. he felt the * passion strong in death వాడు చచ్చేవరకు అదే పట్టుగా వుండినాడు.
Rum n s బెల్లపు సారాయి.
Rumble n s the seat behing a carriage బండి వెనకతట్టు కూర్చుండే చోటు.
Ruminant adj chewing the cud నెమరువేసే. the cow is a * animal ఆవులు నెమరు వేసే జంతువులు.
Rumination n s chewing the cud నెమరు వేయడము. meditation ధ్యానము,యోచన.
Rummer n s a large glass పెద్దగిన్నె.
Rumour n s ప్రవాదము, వదంతి, వర్తమానము.
Rumoured adj వదంతిగా వుండే. It is * that he is coming వాడు వస్తాడని వదంతిగా వున్నది.
Rump n s The end of the back bone నితంబము, పిరుదులు. the * of a bird పక్షి యొక్క వీపు యెముక.
Rumpled adj నలిగిన, ముడతలుపడ్డ * paper నలిగిపోయిన కాకితము.
Rumpus n s uproar గత్తర గల్లత్తు, రచ్చ, అల్లరి.
RUN 983 A Run n s తుచ్ఛుడు, పనికి మాలినవాడు, పతితుడు.
Runlet n s a small barrle చిన్న పీపాయి.
Runnel n s a small stream చిన్న కాలవ.
runner n s He who runs పరుగెత్తేవాడు. a police * పోలీసు బంట్రోతు. of a creeper తీగె. vulgarly, one who carries the mail bag టప్పాలురన్నరు.
Runnet n s See Rennet.
Running n s కారడము, పరిగెత్తడము. this stopped the * of the blood యిందువల్ల నెత్తురు కారడము నిలిచినది. or pus చీము.
Runt n s a small cow మట్ట ఆవు.
Rupee n s రూపాయి. a * with milled edges బండిరూపాయి. a gold * మహరి.
Rupture n s breaking విరగడము, పగలడము. after the * of the bone ఎముక విరిగిన తర్వాత. a breach of the peace కలత.Hernia బుడ్డ, బృహద్బీజము. he has a * వాడికి బుడ్డ దిగినది.
Ruptured adj పగిలిన, విరిగిన, చినిగిన, బుడ్డ దిగిన.
Rupulsiveness n s అసహ్యము from the * of the food ఆ ఆహారముఅసహ్యమైనదిగా వున్నది గనక.
Rural adj పల్లెటూరి,నాటుపురపు,గ్రామ్యమైన,సుందరమైన,సుఖమైన, a * excursion వనవిహారము, నాటుపురానికి పోవడము. * sports వనవిహారము.the * deities క్షుద్ర దేవతలు. * produce నాటుపురములో వుత్పత్తి అయ్యే సరుకు. the * police నాటుపురపు పోలీసు. a * scene అడవిపట్టు. a * bard నాటుపురపుకవి. a * beauty అందముగా వుండే పల్లెటూరిది.
Rurally adv సుందరముగా, సుఖముగా, గ్రామ్యముగా.
Ruse n s (Ruse be guerre, French) a trick యుక్తి, కుయుక్తి, తంత్రము, కుతంత్రము, కృత్రిమము.
Rush n s violent course చొరబడడము, పారడము. the * of the river యేరుపారే వేగము. In the * I was knocked down వాండ్లు పరుగెత్తేవడిలో నన్ను పడతోసిరి. a plant జమ్ము, రెల్లు, తుంగ. a * bottomed chair తుంగతో అల్లిన కురిచి. I dont care a * for him వాడు నాకు తృణప్రాయుడు. a * light వొక విధమైన మయినపు వత్తి, నడమ నూలుకు బదులు రెల్లు పుడకను పెట్టుతారు. she was trembling like a * భయపడి రావి ఆకు రీతిగా గడగడ వణుకుతూ వుండినది.
Rusk n s ఒక విధమైన రొట్టె.
Russet n s a reddish brown colour కావిపంచవన్నె, కారాయవన్నె, యెండిన ఆకు వన్నె.
Russia n s ఒక దేశ నామము. * leather వాసన గల వొక విధమైన పదును చేసిన తోలు.
Rust n s తుప్పు, చిలుము.
Rustication n s నాటుపురవాసము. as a punishment పాఠశాలలో నుంచి తోశివేశి నాటుపురానికి పంపడము.
Rusticity n s గ్రామ్యము, మోటు తనము, మడ్డితనము.
Rustick adj rude, appertaining to the country మోటైన, పల్లెటూరి, నాటుపురపు, గ్రామ్యమైన. a * beauty అందముగా వుండే నాటు పురపుది. * language గ్రామ్యము, మోటుమాటలు.
Rusty adj తుప్పుపట్టిన. a * shawl చాయపోయిన శాలువ. a * hat నల్ల రంగుపోయిన టోపి. a * wall పాతగిలి వర్ణము పోయిన గోడ. a * house పాతయిల్లు. a * scholar ఛాందసుడు, అధికముగా చదివి లోకాచార మెరగనివాడు.
Rut n s the tract of a wheel బండి చక్రము వూడినందువల్లపడే పల్లము, తేరుపోయిన దోవన పడే పల్లము. the season of desire in some animals చూలు అయ్యే కాలము. an elephant in * మదము పట్టిన యేనుగ. a stag in * యేనుగ మొదలైన కొన్ని మృగములు చూలు అయ్యేకాలము.
Ruth n s pity, compassion దయ, కరుణ.
Ruthful adj sorrowful వ్యసనకరమైన, వ్యాకులకరమైన.
Ruthless adj unmerciful నిర్దయాత్మకుడైన, క్రూరుడైన.
Ruttish adj lewd ఎదగా వుండే, యిది పశువులనుగురించిన మాట.
Rye n s ఒక విధమైన కాయ ధాన్యము.
Ryegraas n s ఒక విధమైన గడ్డి.
Ryot, Rayat n s. (a farmer) కాపు, కాపవాడు, శేద్యగాడు.

Free online English to Telugu dictionary
Free dictionary
Learn a word

No comments:

Post a Comment