Monday, February 7, 2011

To Frequent

To Frequent v a పదేపదే పోవుట, మాటిమాటికి వచ్చుట, సంచరించుట. they * his house వాడి యింటికి అడుగడుక్కు పోతారు. they * these hills వాండ్లు యీ కొండలలో సంచరిస్తూ వుంటారు.
To Freshen v a కొత్తచేసుట, తాజాచేసుట. the rain has *ed thecolours of the trees వాన కురిసినందున చెట్లు పచ్చగా వున్నవి. this *edthe colour యిందుచేత వర్ణము వచ్చినది. this *ed his memoryయిందుచేత వాడికి మళ్లీ జ్ఞాపకము వచ్చినది.
To Fret v n to be sorrowful వ్యసనముతో కుంగుట, వ్యాకులపడుట.to be angry చిరేచిరలాడుట, మండిపడుట. to wear away byrubbing అరిగిపోవుట, దోగిపోవుట.
To Fribble v n చేతకాక తడమాడుట, చేతకాక మిణకరించుట.
To Fright v a జడిపించుట, బెదిరించుట, భయపెట్టుట, వెరపించుట.
To Frighten v a జడిపించుట, బెదిరించుట, భయపెట్టుట, వెరపించుట.he *ed away the birds ఆ పక్షులను అదిలించి వెళ్లకొట్టినాడు.
To Fringe v a జాలరు కట్టుట.
To Frisk v n గంతులు వేసుట, కుప్పిగంతులు వేసుట, దుముకులాడుట.
To Fritter v a తునకలు చేయట, బద్దలుచేయుట. he *s awayhis time వాడు యిట్లా కొంచెము అట్లా కొంచెము వృధాగా ప్రొద్దుపుచ్చుతాడు.he *ed away his money వాడు రూకలను వృధాగా శలవుచేసినాడు.he has *ed away the text ఆ మూలము యొక్క నిజమైన అర్థమునుపాడుచేసినాడు.
To Friz, ToFrizzle v a. వెచ్చని యినపశలాకుతో వెంట్రుకలుచుట్టలుచుట్టలుగా వుండేటట్టు చేసుట.
To Frolic v n కుప్పిగంతులువేసుట, తుళ్లుట.
To Front v a యెదురుగా వుండుట. they *ed me నా కభిముఖముగావుండినారు. they *ed the house with black marble ఆ యింటికిముందరితట్టు నల్లరాతితో కట్టినారు.
To Frown v n ముఖమును చిట్లించుకొనుట. he *ed at me నన్ను ముఖమునుచిట్లించుకొని చూచినాడు. fortune *ed upon him లక్ష్మి అతన్ని చిన్నచూపుచూచినది. a *ing sky మబ్బుమందారముగా వుండే ఆకాశము.the *ing forest భయంకరమైన అడవి, బావురమని వుండే అడవి.the *ing mountain భయంకరమైన పర్వతము . * ing circumstacesదీనదశ, తక్కువకాలము.
To Fructify v n పిందెలుపట్టుట, ఫలించుట.
To Fruit v n కాపుయెత్తుట, కాచుట, ఫలించుట.
To Fry v a పేల్చుట,వేయించుట.
To Fuddle v a మయికము కలిగేటట్టుచేసుట, మత్తుకమ్మేటట్టు చేసుట.
To Fulfil v a నెరవేర్చుట, యేడేర్చుట. he *led hispromise చెప్పినమాటను చెల్లించినాడు. he *led their hopes వాండ్లకోరికను కొనసాగించినాడు. he *led the law శాస్త్రప్రకారము జరిగించినాడు.
To Fulminate v a to utter as a curse or censure గర్జించి చెప్పుట.గద్దించి చెప్పుట, పిడుగుపడ్డట్టు చెప్పుట. the pope *d curses againsthim గురువు అతనికి శాపము యిచ్చినాడు. he *d threats గద్దించినాడు. gulminating powder నలిపితే తుపాకి వేటులేచినట్టు ఢమీలుమని మండే వొక పొడి.
To Fumble v n తడమాడుట, తవుళ్లాడుట, పుణకరించుట. he *d the bagtill he found the rupee ఆ సంచిలో తవుడు కాడి ఆ రూపాయ యెత్తినాడు. the sick man was fumbling with his fingers ఆ రోగి పుణకరింతలుపెట్టుతూ వుండినాడు.
To Fume v n పొగుసుట, కంపుకొట్టుట. fuming with rage ఆగ్రహపడే,మండిపడే, రేగే.
To Fumigate v a పొగవేసుట, దూపము, వేసుట.
To Fun v a to deride యెగతాళిచేసుట,యెకసెక్కముచేసుట, పరిహాసము చేసుట.
To Funk v n to stink through fear భయపడుట.
To Furbish v a తోముట, చికిలి చేయుట, మెరుగు పెట్టుట.
To Furl v a చుట్టుట, యెత్తికట్టుట. they *ed the sails వాడచాపలను యెత్తికట్టినారు. the bird *ed its wings పక్షి.రెక్కలను ముడుచుకొన్నది.
To Furnish v a సిద్ధపరుచుట, అమర్చుట, జాగ్రత్తచేసుట, యిచ్చుట. he *ed the house ఆ యింటికి కావలసిన సామానులను జాగ్రత్తచేసినాడు.ఆ యిల్లు ముస్తీబు చేసినాడు. he *ed the troops with ammunitionఆ దండుకు మందుగుండు జాగ్రత్త చేసినాడు, సర్ఫరా చేసినాడంటారు . the bird*es her young with food ఆ పక్షి పిల్లలకు ఆహారమును తెచ్చి పెడుతున్నది.this *ed him with an excuse యిందువల్ల వాడికి వొకసాకు చిక్కినది. I *edhim with dress వాడికి బట్టలు నేను యిచ్చినాను.
To Furrow v a చాలుకొట్టుట, దున్నుట.
To Further v a సహాయము చేసుట, అనుకూలము చేసుట, ప్రోత్సాహముచేసుట, ప్రోద్భలము చేసుట, అధికపరుచుట.
To Fuse v a కరిగించుట.
To Fuzz v n పొగగా లేచిపోవుట, దుమ్ముగా యెగసిపోవుట.
To Gabble v n వదురుట, పేలుట, కుసుట, లొడలొడమనుట.యిది బాతును గురించినమాట. the duck *s బాతు కూస్తున్నది.
To Gad v n దిమ్మిరిగా తిరుగుట, దేశమ్మ కాకిగా తిరుగుట.
To Gag v a ముగ్గొయ్యగట్టుట అనగా మాట్లాడనియ్యకుండానోటికి అడ్డముగా కట్టెను పెట్టి కట్టివేసుట. he issueda * going order మనుష్యులు మాట్లాడకుండా గట్టిగా ఆజ్ఞాపించినాడు.
To Gage v a కుదువబెట్టుట, యీ అర్ధము ప్రయోగమందు లేదు.or to measure కొలుచుట. See to gauge to Engage.
To Gaggle v n to cackle బాతులవలె అరుచుట.
To Gain v n అభివృద్ధియౌట, పెరుగుట, హెచ్చుట, ప్రబలమౌట.the water was * in upon us మాకు మరీమరీ నీళ్లు వుబుకుతూవుండినది.
To Gainsay v a కాదనుట, వద్దనుట, అడ్డముచెప్పుట,ఆక్షేపించుట.దురాక్షేపణచేసుట, విరోధముగా మాట్లాడుట.
To Gall v a to rub రాపిడిచేత గాయముచేసుట.the string *ed the paper దారము వొరుసుకున్నందుచేత ఆ కాగితముదోగిపోయినది . a *ed skin దోగిపోయినతోలు. to tease to vexఉపద్రవముచేసుట, యిబ్బంది చేసుట, చీదరపెట్టుట.a *ed sore కొట్టుకొనిపోయిన గాయము, వొరుసుకొనిపోయిన గాయము.he was much *ed at these expressions యీ మాటలు విని వాడుమహా సంకటపడ్డాడు, యిబ్బంది పడ్డాడు.
To Gallop v n గుర్రము తనబలముకొద్ది పరుగెత్తుట, నాలుక్కాళ్లపరుగెత్తుట. a * ping consumption అతివేగమైన క్షయరోగము.అనగా త్వరలో చంపేటిది.
To Galvanize v a విశేష ధాతు ద్రవ్యసంస్పర్శద్వారా విద్యుతీయశక్తిప్రకాశముచేసుట, యీ శాస్తప్రకారము మనుష్యదేహమందు అగ్నిని కలగచేసుట.
To Gamble v n జూదమాడుట. he *d away his estate జూదమాడిఆస్తిని పాడుచేసినాడు.
To Gambol v n గంతులువేయుట, తుళ్లుట, దుముకులాడుట.
To Game v n ఆడుట, జూదమాడుట.
To Gape v n నోరుతెరుచుట, వికారముగా నోరు తెరుచుట.he was gaping at the money ఆ రూకలను నోరుతెరుచుకొనియేకారినట్టు చూస్తూ వుండెను. he was gaping after it దానికిఆశపడి నోరుతెరుచుకుని వుండినాడు. or to yawn ఆవలించుట.the earth *d ఆ భూమి విచ్చి గండిపడినది.
To Garble v a నేముట, మలుచుట , కోడుట. they *d thesegoods యీ సరుకులను తరగతిగా యేర్పరచినారు. he has *d thisaccount ఈ లెక్కలో తనకు కావలసినంత పెట్టుకొని కడమ తోసివేసినాడు.he *d the story ఆ కథలో కొంత యెత్తుకొని కొంత విడిచిపెట్టినాడు.he *d the evidence ఆ సాక్షి చెప్పినదాంట్లో తనకు అనుకూలమైనదాన్నిపెట్టుకొని తోసివేసినాడు. he *d the letter ఆ జాబులో అక్కడక్కడకొంత తోసివేసినాడు.
To Gargle v a పుక్కిలించుట, గండూషముచేసుట, నీళ్లుమొదలైన వాటితో నోరు కడుగుట. he *d his throat with milkగొంతులో పాలు పోసుకోని గోండ్రించి వుమ్మివేసినాడు.
To Garnish v a అలకరించుట, శృంగారించుట.
To Garter v a మేజోడు జారిపోకుండా నాడాతో కట్టుట.
To Gash v a గీచుట, పల్లముగా కోసుట.
To Gasp v a యెగశ్వాసము, విడుచుట, యెగవూపిరివిడుచుట, యెగరోజు విడుచుట.
To Gather v n కూడుట, చేరుట, పోగౌట. a mob * ed గుంపుకూడినది. clouds * ed మబ్బువేసినది. a boil *ed పుండులేచినది. from this I * that he is coming యిందువల్ల వాడు వచ్చుననివూహించినాను, భావించుకొన్నాను.
To Gauge v a కొలుచుట, లోతుచూచుట, ప్రమాణము చూచుట.యిది సారాయి మొదలైన వాటిలో కొలత, చుట్టుకొలత, యింతమాత్రమువున్నదని నిర్ణయించుకోవడమును గురించిన మాట.
To Gaze v a రెప్పవేయకుండా చూచుట, వూరక నిదానించి చూచుట, వెరగుబడిచూచుట. they all *d at her అందరు దాన్నే చూచినారు.
To Geld v a విత్తులు కొట్టుట, కాలుపట్టుట.
To Gender v n సంభోగము చేయుట.
To Generalize v a to reduce to a genus ( French ) ఏర్పరుచుట,క్రమపరుచుట, అనగా వర్గాలుగా యేర్పచుట, సరిసమము చేసుట.
To Generate v a కలగచేసుట, పుట్టించుట. this *d worms యిందువల్ల పురుగులు కలిగినవి. this *d discontent యిందువల్లఅసహ్యము పుట్టినది.
To Germinate v n అంకురించుట, మొలకెత్తుట.
To Gesticulate v n అంగవిక్షేపముచేసుట, అభినయించుట.మాట్లాడడములో తలను చేతులను తిప్పుట. they * in talking మాట్లాడడములో తల చెయ్యి తిప్పుతారు.
To Get v n అవుట, కలుగుట, యిది అనేకచోట్ల. to be or tobecome అని అర్ధమిస్తున్నది యేలాగంటే. when I got home యింటికి చేరినప్పుడు when I got there నేను అక్కడికిచేరేటప్పటికి before I got through the letter జాబు కడవెళ్ళచదవక మునుపే. he got through the difficulty ఆ కష్టమునుదాటినాడు, గడిచినాడు, వాడికి కష్టములు తీరినది.he got through the book ఆ పుస్తకముయను కడవెళ్లా చదివినాడు.how did you* throgh ? నీకు యెట్లా నివర్తి అయినది. he got thro'the hole కన్నముగుండా చొరబడినాడు. he got through the passby sunnet అస్తమానానికి కనమను దాటినాడు. * along అవతలికిపో.he is *ting well వాడికి వొళ్లు కుదురుముఖముగా వున్నది.how are you *ting on ? నీవు యెట్లా వున్నావు. he is now *tingon very well వాడికి యిప్పుడు బాగా జరుగుతున్నది. it gotblack నల్లబడ్డది. it got dry యెండినది. the rope got entangled or was entangled ఆ దారము చిక్కుపడి వుండినది.it got wet తడిసినది. he got drunk వాడికి మత్తు యెక్కినది. it got hot కాగినది. it gotburnt కాలిపోయినది.it got spoilt చెడిపోయినది. he gotshot వాడికి గుండు దెబ్బ తగిలినది. it got well వాడికి వొళ్లు కుదిరినది. he got sick అశక్తపడ్డాడు. he got freeవిముక్తుడైనాడు. వాడి తొందర తీరినది. he got free ofthe debt ఋణవిముక్తుడైనాడు. I got quit of them soon వాండ్లనుత్వరగా పరిహరిస్తిని. * you gone లేచిపో. my horse gotloose and ran away నా గుర్రము విడిపించుకొని పరుగెత్తిపోయెను. we got among them మేము వాండ్లలో పోయిచేరినాము.I cannot * at it అది నాకు అందదు. the rope got between దారము నడుమ చిక్కుకొన్నది. to * down దిగుట. he god downthe hill కొండ దిగినాడు. he got down from the horse గుర్రము దిగినాడు.the bird got from him పక్షి వాడి దగ్గరనుంచి తప్పించుకొనిపోయినది. the dog got in his way కుక్క అతనికి అడ్డము వచ్చినది.the wind *s in by this crevice యీ బీటిక గుండా గాలిలోపలికి వస్తున్నది. how did this letter * into this book ?యీ పుస్తకములోకి యీ జాబు యేట్లా వచ్చినది. It got into hishead that I was his enemy తనకు నేను శత్రువు అనుకొన్నాడు.he got into bad habits వాడికి దుర్వాడికిలు పట్టుబడ్డవి. he gotinto the well బావిలో దిగినాడు. he got into the carriageబండి యెక్కినాడు. he got into trouble తొందరలో చిక్కుకొన్నాడు.the liquor got into his head సారాయి అతని తలకెక్కినది, అనగా మైకము వచ్చినది. the water got into the house నీళ్లు యింట్లోకిచొరబడ్డది.they got into a dispute వాండ్లకు వ్యాజ్యమువచ్చినది. one was punished and two got off వొకడికిశిక్ష అయినది, యిద్దరికి విడుదల అయినది. For want of witness he gotoff clear సాక్షులు లేనందున తప్పినారు. they got off the wallగోడ యెక్కి దిగినారు. you cannot *off without doing soఅట్లా చేయకుంటే నీకు నివృత్తిలేదు. this is a mere * off యిదివట్టి వ్యాజ్యము, వట్టి నెపము. he must pay the money ; there isno * off వాడికి వేరే విధి లేదు, రూకలు చెల్లించవలెను. he got on his horseగుర్రమును యెక్కినాడు.I cannot * on without this యిది లేకనాకు గడవదు. they got over the wall and plundered the houseగోడ యెక్కి దుమికి యింటిని కొల్లబెట్టినారు. that horse *s over thethe ground well ఆ గుర్రము బాగా నడుస్తున్నది. he gotover the river by sun set అస్తమానానికి యేటిని దాటినాడు. I gotout of the house with difficulty ఆ యింట్లోనుంచి బయిటికివచ్చేటప్పటికి బహుతొందరైనది. to escape the police he got out of the town పోలీసువాండ్లకు చిక్కకుండ పట్నము విడిచిపోయినాడు.the news got out ఆ సమాచారము బయటపడ్డది. * out of the wayతొలుగు, దోవతి. he got to sleep soon వాడికి నిద్రపట్టినది.he got under the table మేజ కిందికి చొరబడ్డాడు. he gotup into the tree చెట్టెక్కినాడు. he got up లేచినాడు, నిద్రలేచినాడు.the sun got up సూర్యుడు ఉదయించెను. It is added to passives; thus : he got killed or he was killed చంపబడ్డాడు.he got hurt వాడికి గాయము తగిలినది.see Got.
To Gibber v n గబ్బిలమువలే కూసుట, వికారముగా కీచుకీచుమనిఅరుచుట.
To Gibbet n s తూకుతీసుట, వురిదీయుట అనగా వురిదీసినట్టే ఆ శవమునుయినుపజీరాతో వేలాడనిచ్చుట.
To Gibe v n యెగతాళిచేసుట, యెకసెక్కము లాడుట, పరిహాసము చేసుట.
To Gild v a బంగారు మొలాము చేసుటు, బంగారు నీరు పోసుట,బంగారు రేకువేసుట. or to adron శృంగారించుట. the rising sun *ed the mountain top ఉదయిస్తూ వుండే సూర్యుడు కొండ యొక్క శిఖరమునుప్రకాశింపచేసేను.
To Gingle v n గలగలమని ధ్వనించుట, ఘల్లుఘల్లుమనుట.the gingling bells worn by dancing girls బోగమువాండ్లుకట్టుకొనే గజ్జెలు. Gingle, n. s. గలగలమనే ధ్వని, ఘల్లుఘల్లుమనే ధ్వని.
To Gird v a కట్టుట, నడుముకట్టుట, దట్టి కట్టుట.he *ed himself up నడుము కట్టుకొన్నాడు. he *ed his swordupon his thigh or he *ed himself with the sword కత్తినికట్టుకొన్నాడు. to * in or to surround చుట్టుకొనుట. the city was *ed in by the troops. దండు ఆ పట్నమునుచుట్టుకొన్నది. the vest she *ed on అది కట్టుకొన్నబట్ట. he *ed the box with the rope ఆ పెట్టెను దారముతోబిగించి కట్టినాడు.
To Girdle v a చుట్టుకొని వుండుట. the sea that *s Britianin సీమను చుట్టుకొని వుండే సముద్రము.
To Give v n to yield or to sink. లోబడుట.వంగుట, కుంగుట. * back తొలగివుండండి. he gave into theirplot వాండ్ల కుట్రలో వీడున్ను కలిసినాడు. he gave into theirdoctrines వాండ్ల మతములో పడ్డాడు.
To Glad, ToGladden v a. సంతోషపెట్టుట, రంజింపచేసుట.atlast the long expeceted letter *ded his eyes బహుదినములుగా యెదురుచూస్తూ వుండిన జాబు తుదకు వాడి కండ్లకు పండగ చేసినది.
To Glance v a రాల్చుట. the tiger's eyes *d fire పులికండ్లు నిప్పులురాలుస్తవి. with eyes glancing fireనిప్పులు రాలుతూ వుండే కండ్లుగల.
To Glaze v a అద్దము వేసుట, అద్దాలువేసుట. he *d the windowకిటికీకి అద్దాలువేసినాడు. or to varnish మెరుగునూనె వేసుట.he *d the picture పటానికి మెరుగునూనె పూసినాడు.
To Gleam v n మిణుక్కుమనుట, తళుక్కుమనుట,మెరుసుట.
To Glean v n పరిగలేరుట, చేలో రాలిపోయిన గింజలను యేరుట.he *ed some information there వాడు అక్కడ సమాచారమును తెలుసుకున్నాడు.
To Glide v n జారుట, జరుగుట, పారుట. the snake *d gentlyపాము మెల్లిగా జరిగినది. the river *d away rapidly like a dayవొక సంవత్సరము వొక దినముగా జరిగిపోయినది.
To Glimmer v n మిణుకు, మిణుక్కుమనుట. a * ing nation తెలిసి తెలియని భావము.
To Glister v n మెరుసుట, ప్రకాశించుట.
To Glistern v n మెరుసుట, నిగనిగలాడుట.
To Glitter v n మెరుసుట, తళతళలాడుట.
To Gloat at v n ఆశగా చూచుట, భ్రాంతిగా చూచుట, ఏకారినట్టుచూచుట.వెరగుపడిచూచుట. he is * ing over the prospect of ourbeing defeated మేము వోడిపోవలెనని యెదురుచూస్తున్నాడు.
To Glorify v a (to praise) స్తుతించుట, స్తోత్రముచేసుట,మహిమను కలగచేసుట. God దేవుడు వాండ్లకు మహాత్యమును యిచ్చినాడు. he glorified them glorified himself అహంకరించినాడు. In Gal . I.25. ధన్యవాదమకుర్వ ్ .A+.
To Glory v n గర్వించుట.
To Gloss v n వ్యాఖ్యానము చెప్పుట, టీక చెప్పుట. to make slyremarks శృంగారించి చెప్పుట. he *ed over the transaction ఆ సంగతినిశృంగారించి మాట్లాడినాడు. He glossed over the assault తాను చేసినదౌర్జన్యాన్ని పూసిపెట్టి మాట్లాడినాడు.
To Glout v n ముఖము మాడ్చుట. a * ing face దుముదుములాడముఖము.
To Glow v n యెర్రగా కాగుట, మండుట. the iron *s యినుముయెర్రగా కాగుతున్నది. her cheeks * ed with shame సిగ్గుచేత దాని ముఖముయెర్రబడ్డది. he was *ing with fever జ్వరము కాస్తూ వుండినది.his heart *ed with hope వాడికి మనసులో ఆశ పెట్టుకొంటూ వుండినది.the stars * by night నక్షత్రములు రాత్రిలో ప్రకాశిస్తున్నవి.
To Gloze v n వజ్రముతో అంటించుట. he *d the boards togetherఆ పలకను వజ్రముతో సంతన చేసినాడు.
To Glut v a నించుట, నిండించుట, వెక్కమయ్యేటట్టు తినిపించుట.he *ted them with sweet meats వాండ్లకు ముక్కుమట్టుకు మిఠాయివేసినాడు.he *ted the troops with plunder ఆ సేనకు దోపిడిని తనివిదీరా యిచ్చినాడు.
To Gnash v. n. కోపముచేత పండ్లను పటపటమని కొరుకుట, ఔడుకరుచుట
To Gnaw v a కొరుకుట, కొంచెము కొంచెముగా తినుట. the whireants have *ed this wood ఈ కొయ్యను చెదలు కొట్టినది. therats have*edthis wood యెలుకలు యీ కొయ్యను కొరికినవి. a *ing pain నవిలేనొప్పి,నులి, పీకడము.
To Go v n పోవుట, వెళ్లుట, నడుచుట, సాగుట, జరుగుట. will you *with us మాతో కూడా వస్తావా. the child cannot * yet ఆ బిడ్డయింకా నడవనేరదు. the child *es on all fours ఆ బిడ్డ యింకానడవనేరదు. the child *es on all fours ఆ బిడ్డ దోగాడుతున్నది.it is ridiculous to dance when we should * మనము నడవవలసినప్పుడునాట్యమాడడము పిచ్చి. the report *es that he is dead చచ్చినాడనివదంతిగా వున్నది. they * under the name of merchants వర్తకులనబడుతారు. the clock *es well ఆ ఘడియారము బాగా పోతున్నది, తిరుగుతున్నది. the clock is not *ing ఆ ఘడియారము నిలిచిపోయినది, ఆ ఘడియారముపారడములేదు. these rupees do not * now యీ రూపాయలు యిప్పుడుచెల్లవు. as far as my observation *es నాకు తెలిసే మట్టుకు.as far as Tamil *es he is a good scholar అరవములో నంటే వాడు సమర్ధుడు.he went so far as to strike them వాండ్లను కొట్టేంతమట్టుకు అయినాడు.as times * he is a learned man యీ కాలానికి వాడు పండితుడు. he *es about the town పట్టణములో సంచరిస్తాడు, పట్టణములోతిరుగుతాడు. the ship went about ఆ వాడ మళ్లుకొన్నది. he went abroadవాడుదేశాంతరమునకు పోయినాడు. they went across the river వాండ్లుయేటిని దాటినారు. a bridge that *es across the river యేటి మీద వుండేవంతెన. that went against his inclination or it *es against hisstomach యిది వానికి గిట్టదు, యిది వానికి కాదు. the decree went againsthim వాడికి విరోధముగా తీర్పు అయినది. In this doctrine * I entirelyalong with you యీ సిద్ధాంతమందు నిన్ను అనుసరిస్తాను. they went ashore వాండ్లుదగి గట్టుకుపోయినారు. the ship went ashore ఆ వాడ దరి తట్టినది.they went astray వాండ్లు తప్పుదోవను పోయినారు, మార్గము తప్పినారు.she went astray వ్యభిచరించినది. he went away లేచి పోయినాడు.he went back మళ్లుకొనిపోయినాడు, తిరుక్కొనిపోయినాడు. I went betweenthem in this affair యిందున గురించి వాండ్లకు మధ్యస్తము చేస్తివి. theywent beyond him అతన్ని మించిపోయినారు. he went beyondme in this business యీ పనిలో నన్ను మోసపుచ్చినాడు.you must * by the doctor's advice వైద్యుడు చెప్పిన ప్రకారమునీవు నడుచుకోవలెను. the time went by rapidly కాలము త్వరగానడిచిపోయినది. the opportunity is gone by సమయము మించిపోయినది.the clock has gone down గడియారము నిలిచిపోయినది. this will not *down with him యిది వాడికి యెంతమాత్రము దిగదు, అనగా గిట్టదు.the sun went down సూర్యుడు అస్తమించెను. the swelling wentdown ఆ వుబ్బు అణిగినది, ఆ వాపు తీసినది. the ship wentdown వాడ ముణిగిపోయినది. things * ill with him వాడి కార్యములుప్రతికూలముగా వున్నవి. he went in unto them వాండ్ల వద్దకు పోయిచేరినాడు.he went into the merits of the case ఆ వ్యాజ్యము యొక్కస్వారస్యమును విచారించినాడు. he did not * into particularsవాడు వివరముగా చెప్పలేదు. they went into mourning దుఃఖవస్త్రములను వేసుకొన్నారు. she went into a swoon అది మూర్ఛపోయినది.the cloth went into holes ఆ గుడ్డ బొందలు పడ్డది. the earth wentinto cracks ఆ నేల బీటికలు బాసినది. will all this grain * into thisbasket ? యీ ధాన్యమంతా యీ గంపలో పట్టునా. he went into the wellబావిలో దిగినాడు. he went mad వాడికి పిచ్చిపట్టినది. the rain wentoff వాన నిలిచిపోయనది. the thieves went off దొంగలు పారిపోయినారు.the gun went off పిరంగి కాలినది, తుపాకి వేటు లేచినది. the work *eson well పని బాగా జరుగుతున్నది. * on ! do not stop నిలుప,పైన కాని, నిలుపసాగనీ. as he went on writing వాడు వ్రాస్తూ వ్రాస్తూవుండగా, he went on his knees i.e. he knelt మోకాళ్లమీద నిలిచినాడు.after *ing out of mourning కర్మాంతము అయిన తరువాత అనగాపుల్లపుడులను తీసివేసిన తర్వాత. the lamp went out దీపముఆరిపోయినది. mangoes * out in July ఆషాడమాసముతో మామిడిపండ్లకాలము సరి. the Captain went out with the Major వాండ్లువొకరినొకరు కాలుచుకో పోయినారు. I will * over the letteragain ఆ జాబును మళ్లీ చదువుతాను. the ball went through his armఆ గుండు వాడి చేతిలో దూసిపోయినది. he went through many troublesవాడు నానా కడగండ్లు పడ్డాడు. he went through a great dealon the their account వాండ్లకై శానా ప్రయాసపడ్డాడు. he wentto bed or went to sleep శయనించినాడు, నిద్రపోయినాడు.he went to bed upon the stone రాతిమీద పండుకొన్నాడు. he went to law with me నా మీద ఫిర్యాదు చేసినాడు.he went to the dogs చెడిపోయినాడు .it went to pieces బద్దలైపోయినది. he went to work and settled the whole at once ఆ పనిలో ప్రవేశించియావత్తును వొక దెబ్బన తీర్చినాడు. at last his father went to extremitieswith him తుదకు వాడి తండ్రి వాడిమీద క్రౌర్యము చేయవలసివచ్చినది.this *es to prove that he is the owner యిందుచేత అతడు సొంతగాడని నిరూపణమయ్యేటట్టు వున్నది.it is *ing to rain వానవచ్చేటట్టు వున్నది. * to let us make brick యిటిక రాళ్లు కోతాములెండి, పదండి. he went to the wall i.e. was ruined వాడు వోడిపోయినాడు. to * up the country or to * into the countryదేశముమీదికి పోవుట. he went up into the tree చెట్టెక్కినాడు.he went up stairs మిద్దెమీదికి యెక్కినాడు. she went uponthe town or went upon the streets అది వూరిమీద పోయినది, చెడిపోయినది.when it *es well with him వాడికి మంచికాలము వచ్చినప్పుడు.while her mother went with her దాని తల్లి దాన్ని గర్భముగావుండినప్పుడు. the cow *es with young or with calf for ten months ఆవు పదినెలలు చూలుగా వుంటున్నది. he went away with this bookయీ పుస్తకమును అంటుకొనిపోయినాడు. he went without his dinnerవాడికి భోజనము దొరకకపోయినది. he went without the moneyవాడికి ఆ రూకలు రాలేదు. Is she to go without being marriedదానికి పెండ్లి లేకపొయ్యేదా. he ate it all and she was obligedto * without వాడు అంతా తిని పోయినాడు గనక అది వూరక వుండ వలసివచ్చినది. he went without drinking the whole day ఆ దినమంతాతాగక వుండినాడు. on the new and full moon the Hindus * withoutbreakfast పౌని్మి. అమావాస్యలలో హిందువులకు చద్ది భోజనము లేదు. it went wrong తప్పినది. something has gine wrong with himవాడి విషయమందు యేమో వ్యత్యాసము జరిగినది. he gave them the * byవాండ్లను మించినాడు. a * cart బిడ్డలకు నడపనేర్పే బండిSee Gone.
To Goad v a ములుగోలతో పొడుచుట, యెత్తి విడుచుట, ప్రేరేపించుట.he * ed me on to do this దీన్ని చేయుమని నా ప్రాణాలు తీసినాడు.
To Gobble v a బొక్కుట, బొక్కులాడుట, ఆవురు ఆవురావుమనివేసుకొనుట, ఆతురముగా తినుట.
To Gore v a కుమ్ముట, కొమ్ములతో పొడుచుట. the bull *dthe bank of the river ఆ వృషభము యేటిగట్టున కోరాడినది.
To Gorge v a కబళించుట, మింగుట, ముక్కు మోయతినుట.వెక్కసమయ్యేటట్టు తినుట. the fish *d the hook చేప గాలమును మింగినది.
To Gormandize v a అమితముగా తినుట, దయ్యమువలె తినుట.
To Gossip v n వృధామాటలాడుట, వదురుట, పేలుట.
To Gouge v a ( an American art) గోటితో కనుగుడ్డును పెళ్లగించుట.
To Govern v a యేలుట, నిర్వహించుట. this noun * s the verbయీ శబ్దము క్రియను ఆకాంక్షిస్తున్నది. the *ing principle ముఖ్యమైనసిద్ధాంతము.
To Grabble v a పుణుకుట, తవుడుకాడుట, దేవులాడుట.
To Grace v a శృంగారించుట, అలంకరించుట, అనుగ్రహించుట,గౌరవపరుచుట. he * ed him with a title వాడికి వొక పట్టణమునుయిచ్చి గౌరవించినాడు. he *d our board మాతో కూడా భోజనముచేసి మమ్ముల గౌరవపరిచినాడు.
To Graduate v a to divide క్రమ విభాగము చేసుట.
To Graff, ToGraft v a. అంటు వేసుట. he grafted some mangoesin his graden వాడి తోటలో కొన్ని మామిడిచెట్లకు అంటువేసినాడు.
To Grant v a యిచ్చుట, దయచేసుట, అనుగ్రహించుట, అంగీకరించుట.he *ed her request ఆమె కోరిక ప్రకారము చేసినాడు. he *ed ten days to finish this దీన్ని ముగించడానికి పది దినములలోయిచ్చినాడు.I * that the father has the power తండ్రికిఅధికారము కద్దని వొప్పినాను. you must that this was wrongయిది తప్పని నీవు వొప్పుకోవలసినదే. * that he has proved this ! what good doesit do him ? వాడు దాన్ని నిరూపణమే చేసెను. అందువల్ల వాడికేమిప్రయోజనము . * it be so అట్లా వున్నప్పటికిన్ని. to take it for *ed అనుకొనుట, యెంచుకొనుట. I take it for *ed that he conssentsఆయన ఒప్పుననుకొన్నాను. Pray real that letter :" I take it for *edthat you know the language నీకు యీ భాష వచ్చి వుండును గదాయీ జాబు చదువు. I take it for *ed you have secured thisదీన్ని నీవు భద్రముచేసి వుందువు గదా. * in that she is an old womanshe certainly handsome అది ముసలిది వాస్తవమే అయితే అందకత్తె.
To Granulate v n నూకలునూకలుగా యేర్పడుట, పుండుకరకట్టుట.అనగా యెండడానకు మొదలుపెట్టే పుంటిమీద నూకలు నూకలుగాకట్టుట. after the sugar was boiled it cooled and *d బెల్లముపాకముచల్లారి నూకలు నూకలుగా కట్టుకొన్నది.
To Grapple v n పీకులాడుట, పెనుగులాడుట, పోరాడుట, గుంజులాడుట.you ought to * with these difficulties యీ తొందర్లకు నీవురొమ్ము యివ్వవలసినది. a grappling hook or grappling irons పాతాళభేదిగాలము.
To Grasp v n పట్టు, పట్టుకోవడము, చేతితో పట్టుకోవడము.I got a * of the tail తోకను బట్టుకొన్నాడు. It got our of his *వాడిచేతిలోనుంచి విడబడ్డది. when he loosed his * వాడు పట్టువదిలినప్పుడు, వాడు పట్టుకొన్న దాన్ని విడిచిపెట్టినప్పుడు. a mind of great* గ్రహణధారణ శక్తిగల మనసు.
To Grate v a పొడిపొడిగా, రాలేటట్టు రాచుట, అరగరాచుట, తరుముట.he *d the nutmeg జాజికాయను రాచి పొడిపొడిగా చేసినాడు అనగాతురిమినాడు. to * sandal wood చందనము తీసుట, గంధము తీసుట.that sound *s upon the ear ఆ శబ్దము వినడానకు చెవులకు ములుకులుగావున్నది. this *d upon his feelings or hurt him యిదివాడి మనసును కోస్తూ వుండినది, యిది వాడి మనకు బాధగా వుండినది.
To Gratify v a సంతోషపెట్టుట, తృప్తిచేసుట, తీర్చుట. he gratifiedhis curiosity by truning over the papers ఆ కాగిదాలను తిప్పి తిప్పి చూచివాడి ముచ్చటను తీర్చుకొన్నాడు. he gratified his desires వాడి కోరికలనుతీర్చుకొన్నాడు. he gratified them withten rupees for theirtrouble వాండ్ల కష్టానికి పదిరూపాయలు యిచ్చి సంతోషపెట్టినాడు. Gratifying, adj. సంతోషకరమైన, మనోహరమైన. * intelligenceమంచిసమాచారము, సంతోష సమాచారము. this is a * result యిట్లాకావడము సంతోషమే.
To Gratulate v a దీవించుట, మంగళశాసనము చేసుట.
To Grave v a (Engrave) చెక్కుట.
To Gravel v a జల్లివేసుట. or to embarrass చిక్కులు పెట్టుట.he was completely *led at this objection యీ ఆక్షేపణకు వాడికియెటూ తోచలేదు.
To Gravitate v n మొగ్గుట, బలువుచేత కిందికి వంగుట, వంగుట,లోబడుట. " The people of France are easily electrified : weare too solid for such dreams : Amber may be draw straws :we do not * so easiluy (Walpole) తృణగ్రాహిశిలకు తృణములు స్వాధీనమే కాని మేమంతా కొంచెములో వంగేవారము కాము, లోబడే వారము కాము.
To Graze v a మేపుట. or to strike lightly తేలికగా తాకుట,అసిగాయముగా తాకుట. the ball *d his head ఆ గుండువాడి తలను కొంచెము తేలికగా తాకిపోయనది.
To Grease v a మెరుగు చమురుట, నూనె పూసుట.
To Greaten v a అధిక పరుచుట, వృద్దిచేసుట. this *s hismerit యిందుచేత వాడి యోగ్యతమరీ అతిశయిస్తున్నది. this *s thedifficulty యిందువల్ల మరీ కష్టమౌతున్నది.
To Greet v a నమస్కరించుట, దండముపెట్టుట, సలాముచేసుట,మన్ననచేసుట, రాగానే చూచి ఆనందించుట, ఆహ్లాదపడుట, కొనియాడుట.at last she *ed my eyes తుదకు నా కండ్లకు పండుగ చేసినది.at last my native country *ed my eyes నిన్న మీ జాబు చేసిసంతోషించినాను.
To Grieve v n వ్యసనపడుట, దుఃఖపడుట, శోకించుట, చింతపడుట,జాలిపడుట, విచారపడుట.
To Grill v a పేల్చుట, వేయించుట.
To Grin v n పండ్లిగిలించుట. to * with rage కోపముచేత పండ్లుగట్టిగా బిగించుట. the * ning jaws of a scull తలపుర్రెయొక్కయిగిలించుకొని వుండే దవడలు. a * ning phiz కరాళవదనము.
To Grind v a విసురుట, పిండిచేసుట, పొడిచేసుట, నూరుట, రుబ్బుట.to * sandal wood గంధము తీసుట. to * a knife కత్తి పదునుపెట్టుట.to * the teeth పండ్లు కొరుకుట. he ground the faces of the poorబీదలను పీడించినాడు, తొందరపెట్టినాడు, బాదించినాడు.
To Grip v a పిడికిట బిగపట్టుకోనుట. see to Gripe
To Gripe v a to hold with the fingers closed to hold hard పిడికిట బిగపట్టుకొనుట. to give a pain in the bowels కడుపునొత్తుట,కడుపుకుటెత్తుట. the medicine *d him యీ మందు చేత వాడికికడుపు నొప్పెత్తినది.
To Groan v n మూలుగుట. his table daily *s under a great varietyof vainds వాడి బల్ల ప్రతిదినము నానావిధమైన ఆహారములతో మూలుగుతున్నది, అనగా వాడింట్లో బహుమంది భోజనము చేస్తారు.
To Groobe v a to cut hollow or channel with a tool గీతకట్టుట,తట్టుతీసుట.
To Groom v a గుర్రమును తోముట.
To Grope v n to search by feeling in the dark తవుళ్లాడుట, దేవులాడుట.
To Ground v n గట్టుతట్టుట, దరితట్టుట. the ship *ed ఆ వాడగట్టుతట్టినది.
To Group v a గుంపుగా చేర్చుట.
To Grovel v n నేలపడి పొర్లాడుట, అల్లాడుట, పాకుట. or to be base నీచముగా ప్రవర్తించుట.
To Grow v a పయిరుచేసుట. they * chillies here యిక్కడ మిరపకాయలనుపయిరుచేస్తారు. they are occupied in *ing rice వరి పయిరుచేస్తారు.
To Growl v n గుర్రుమనుట, గురుకాయించుట, యిదిరేగిన పులి,కుక్క, భల్లూకము మొదలైనవాటిని గురించినమాట. Johnson *dout his consent గురకాయించి మంచిదన్నాడు.
To Grub v a తవ్వుట. he *bed up the grass కసువును తవ్విపెళ్లగించినాడు. earth worms * in the soil యెర్రలు నేలనుతొలుస్తున్నవి.
To Grudge v n to murmur, to repine సణుగుట, అసహ్యపడుట,గిట్టకవుండుట, మాత్సర్యపడుట, అర్ధాంగీకారముగా వుండుట.
To Grumble v n గొణుగుట, సణుగుట, అసహ్యపడుట. he *svery much at this decision యీ తీర్పును గురించి అసహ్యపడుతాడుhis belly *d వాడి కడుపు గుర్రుమని కసినది. grumbling thunder తిన్ననివురుము.
To Grunt v n గుర్రుగుర్రుమని కూసుట, యిది పంది,యేనుగను గురించిన మాట. the hogs *s పందులు గుర్రుగుర్రుమనికూస్తవి.
To Grustrate v a ఆశాభంగము చేసుట, విచ్చిత్తుచేసుట, చెరుపుట.
To Guaranteee v n ఉత్తరవాదముగా వుండుట, పూటబడుట.he *d in this business యీ పనిని గురించి నాకు భరవసా యిచ్చినాడు.యీ పనికి నేనున్నానన్నాడు. See to Warrant.
To Guard v a కావలి కాచుట, కాచుట, కాపాడుట, రక్షించుట.he *ed the gate ద్వారపాలకుడై వుండినాడు. they who * the doorద్వారపాలకుడు. you must * against fever జ్వరాన్ని గురించినీవు భద్రముగా వుండవలసినది.
To Guess v a ఊహించుట, నిదానించుట. I *ed that he was goneపోయినాడనుకొన్నాను. I cannot * what he means వాడి భావమేమోనేను నిదానించలేను. you would * it to be pearl దాన్ని ముత్యమనుకొందును.you have *ed the right man నీవు నిదానించినవాడే సరి. theseare his relations I * వీండ్లు అతని బంధువులుగా వుందురు.
To Guide v a దారిచూపుట, ఉపదేశించుట, నడిపించుట. the master *shis pupils ఉపాధ్యాయులు తన శిష్యులకు వుపదేశిస్తాడు, శిక్ష చెప్పుతాడు.the light *d me to his house ఆ వెలుతురు గురిపెట్టుకొని వాడి యింటికిపోయినాను. smell *s dogs వాసన కుక్కలుకు దారిచూపిస్తున్నది.అనగా కుక్కలు వాసన బట్టుకొని పోతవి. these words *d me to hismeaning యీ మాటలచేత వాడి అభిప్రాయము నాకు తెలిసినది.
To Gull v a మోసముచేసుట, వంచించుట, యేమార్చుట.
To Gulp v a గుటుక్కున తాగుతాడు, గుటుక్కున మింగుట.
To Gurgle v n పారేనీళ్లు, జలజలమని ధ్వనించుట. gurguingstream జలజలమని పారే నీళ్లు.
To Gush v n జరీలుమని బయిలుదేలుట. the blood *ed out ఆ నెత్తురుజరీలుమని బయలుదేరినది. the milk *ed చంట్లోనుంచి పాలుజరీలుమని బయిలుదేరినది.
To Gut v a పేగులను వెళ్లదీసుట. or empty యింట్లో ఏమిన్ని లేకతుడిచిపెట్టిపోవుట. or to plunder దోచుట, తుడిచిపెట్టుట. the police*ted the house పోలీసువాండ్లు ఆ యింటిని తుడిచి పెట్టిపోయినారు.
To Guttle v n మొక్కుట, బొక్కుట, బాపుకొనుట, ఆవురుమనితినుట.
To Guzzle v a అధికముగా సారాయి తాగుట, ముక్కుమోయతాగుట.
To Habituate v a అభ్యాసపరచుట, అలవాటు పరచుట, వాడికపరచుట, మరుపుట.You must * yourself to writing నీవు వ్రాయడానికి వాడిక చేయవలసినది.
To Hack v a ఛిన్నాభిన్నముగా నరుకుట, తుత్తుమురుగా నరుకుట, చిందరవందరగాకోసుట. how he *s English యింగ్లీషును యెట్లా అధ్వాన్నము చేస్తాడు అనగాఅధ్వాన్నముగా మాట్లాడుతాడు.
To Hackle v a ఏకుట, చిక్కుతీసుట, దువ్వుట, చక్కబెట్టుట, యిది పట్టుబొచ్చు వీటిని గురించిన మాట.
To Haggle v n to be tedious in a bargain నచ్చు బేరమాడుట.
To Hail v n వడగండ్లుపడుట, వడగండ్లు వాన కురుసుట.
To Hale v a ఈడ్చుట, గుంజుట. they *d him to the police పోలీసుకు వాణ్ని యీడ్చుకపోయినారు. See To Haul.
To Halloo v n కేకవేసి పిలుచుట, కూయుట, బొబ్బిలిడుట. he *ed to me ఒరే యని నిన్ను కేక వేసి పిలిచినాడు. he *ed to the dogs వుసుకో వుసుకో యనిఅరిచినాడు.
To Hallow v a consecrate సమర్పణ చేసుట. to make holy పరిశుద్ధముచేసుట, పవిత్రము చేసుట, పావనము చేసుట, పునీతము చేసుట. he *ed his talentsto this task యీ పనికి వాడి శక్తిని అర్పితము చేసినాడు. he *ed the temple ఆ గుడికి పుణ్యాహవాచనము చేసినాడు. the priest *ed the idol ఆ విగ్రహమునకు సంప్రోక్షణ చేసినాడు, or to reverence as holy ఆచరించుట. he does not * the sabbath వాడు ఆదివారమును ఆచరించడు. he *s no day వాడికి ఆదివారము లేదు అమావాస్యలేదు. Dz. says సంస్కారము చేసుట, ప్రతిష్ఠ చేసుట.
To Halt v a నిలుపుట, దించుట, మజిలీ చేయించుట, ముకాము చేయించుట. he *edhis troops at the village దండును ఆ వూరిలో మజిలీ చేయించినాడు.
To Halter v a దారముతో కట్టుట.
To Halve v a చెరిసగము చేయుట.
To Hammer v n to be busy (Shark. in Johnson) పనిపడుట, ఆయాసపడుట,తొక్కులాడుట. or to hesitate తడమాడుట.
To Hamper v a బందాలు వేయుట, చిక్కుల బెట్టుట, యిబ్బంది పరచుట, సంకటపెట్టుట, కలవర పెట్టుట. they *ed the horses and turned them out to graze గుర్రాలకు బందాలు వేసి మేతకు విడిచిపెట్టినారు. he *ed the gift with manyconditions ఆ భూమిని దానిమివ్వడములో దానము పట్టిన వాడు దాన్ని అనుభవించడమును గురించి కొన్ని నిభందలు యేర్పరచినాడు. or to spoil a lock తాళము చెవిని తిప్పి తిప్పి తాళమును దెరుపుట. he *ed the lock తాళము చెవిని తిప్పి తిప్పి ఆ తాళమును చెరిపినాడు.
To Hamstring v a గుదికాలినరమును తెగకొట్టుట.
To Hand, hand n a. అందుకొనుట, చేతయెత్తి యిచ్చుట. * me that book ఆపుస్తకాన్ని యిట్లా అందియియ్యి. he *ed her into the room దానికి చెయ్యి యిచ్చియింట్లోకి తీసుకొని వచ్చినాడు. they *ed down the estate to him పరంపరగావాండ్ల ఆస్తి వాడికి వచ్చినది. the puranas have *ed down this story యీ కథ పురాణాల క్రమముగా వచ్చినది. he *ed the house over to me ఆ యింటిని నాపరము చేసినాడు. to * up ఫిర్యాదు చేసుట.
To Handcuff v a చెయిసంకెళ్ళు వేసుట.
To Handle v a తాకుట, స్పర్శించుట, వాడుట, చేతపట్టివాడుట, వాడిమాపుట. at first they do not know how to * the pen వాండ్లకు ముందుగా పేనా యెట్లా పట్టేదో తెలియదు.she *s the child roughly ఆ బిడ్డను మోటుతనముగా యెత్తుతున్నది. * your horse gently నీ గుర్రమును వుపాయముగా పట్టుకరా. If you * the paper you will dirty it ఆ కాకితమును చేత పట్టుతూ వస్తే మురికి అయిపోను. he *d the text very well ఆ మూలమునకు వ్యాఖ్యానము బాగా చేసినాడు. they *ed him roughly వాణ్ని నానాకడగండ్ల పెట్టినారు. what we have seen with our eyes, what we have heard with our ears and what our hands have *d మనము కండ్లార చూచి, చెవులార విని, చేతులార తాకినవి.
To Handsel v a మొదటి అనుభవమును చేసుట, బోణిచేసుట, సంచకరువు యిచ్చుట.when I *led the cart I found it would not do నేను ఆ బండిని కొని యెక్కగానే అది పనికిరాదని తెలిసినది.
To Hang v n వేలాడుట. the beggars * about his house బిచ్చగాండ్లు వాడియింటి చుట్టూ తారాడుతూ వున్నారు. these bad habits hung about him all hislife ఈ దుర్వాడికలను వాడు చచ్చేదాకా విడువలేదు. to * back వెనక చిక్కుటవెనకబడుట, సంకోచించుట. there was a lantern hung from the ceilingతారుసుకు లాంతరు తగిలించి వుండినది. his life still *s in doubt వాడు బ్రతికేదియింకా అనుమానముగానే వున్నది. the clouds * over the hill మేఘములు ఆ కొండమీద మేస్తవి, వాలినవి. at that time a great misfortune hung over me అప్పట్లో నాకు వొక ఆపద సంభవించేటట్టు వుండినది. the story * together well ఆ కథ పొందికగా వున్నది. a story which does not * together well అసంగతముగా వుండే కథ. the witness hung together well ఆ సాక్షులు పలికి నందులో వొకటికొకటి అసందర్భము లేదు, ఆ సాక్షులందరు ఏకవాక్యముగా పలికినారు. the child was *ing upon her ఆ బిడ్డ దాన్ని కరుచుకొని వుండినది. the time hung heavy on his hands పనిలేనందున వాడికి ప్రొద్దుపోలేదు. she hung upon his neck వాడి మెడను కట్టుకొన్నది. there by *s a tale అందున గురించి వొక కథ కద్దు.
To Hanker v n అత్యాశపడుట, అతురపడుట, కాంక్షపడుట. the pick pocketswere *ing about the Pagoda గుడి వద్ద కేపుమార్లు తారాడుతూ వుండినారు.
To Hansel v a See Handsel.
To Hap v n సంభవించుట. I *ped upon that book or I lighted upon that book ఆ పుస్తకము నాకు తగిలినది, యిది ప్రాచీన ప్రయోగము.
To Happen v n సంభవించుట, ఘటించుట, కలుగుట. I *ed to go to his houseఅకస్మాత్తుగా వాడి యింటికి పోతిని. what *ed next ? ఆ పిమ్మట యేమి జరిగినది,తరువాత యేమైనది. * what may యేమి సంభవించినాసరె, యెట్లాగైనాసరె. what ever*ed to be wanted యేది కావలసివచ్చినా.
To Harangue v n ప్రసంగించుట, ఉపన్యసించి చెప్పుట.
To Harass v a ఉపద్రవపెట్టుట, కడగండ్లు పెట్టుట, తొందరపెట్టుట, బాధించుట,వేధించుట. the muskitoes * the horse ఆ గుర్రాన్ని యీ గెలు పీక్కొని తింటవి,వేధిస్తవి.
To Harbour v a దాచుట, ఎడమిచ్చుట, చేరనిచ్చుట. he *ed them, వాండ్లుదాగడానకు తాను చోటిచ్చినాడు. these tables * musquitoes యీ బల్లులు దోమలుచేరడానకు ఆస్పదముగా వుంటవి. you should not * these suspicions యీఅనుమానములను మనసులో పెట్టుకొని వుండరాదు. he *s ill will against meమనస్సులో నా మీద చలము పెట్టుకొని వున్నాడు.
To Harden v n గట్టిపడుట, దృఢపడుట, మొండిపారుట.
To Hark v a వినుట, ఆలంకించుట.
To Harm v a హాని చేయుట, చెరుపు చేయుట, ఉపద్రవము చేయుట, అపాయముచేయుట.
To Harmonize v n సుతిగూడుట, సరిపడుట, పొందికపడుట. this does not *with what he said before వాడు ముందర చెప్పినదానికిన్ని యిప్పుడు చెప్పేదానికిన్నిపొందికపడలేదు.
To Harness v a బండికి గుర్రాన్ని వేసుట. * the horse గుర్రాన్ని బండికి వెయ్యి. or to arm కవచము వేసుకొనుట, జీరా వేసుకొనుట.
To Harp v n వీణె వాయించుట. he is always *ing upon this వాడికినిత్యము యిదే పాట.
To Harpoon v a సముద్రములో చేపను పంట్రకోలతో వేసుట.
To Harrass v a See To Harass.
To Harrow v a పాపటము తోలుట, అనగా దున్నిన పొలములో విత్తనాలు వేసిన తరువాత చదరముచేసుట. this horrible story *s the mind యీ పాపిష్ఠి కథ మహా వేదన చేస్తున్నది.
To Harry v a కొల్లబెట్టుట, చిందరవందర చేసుట, చిన్నాభిన్నము చేసుట, అల్లాడబెట్టుట.
To Hash v a మాంసమును కొందుట, నజ్జు నజ్జుగా నరుకుట.
To Hasp v a గొళ్లెము వేసుట, చిలుకును తగిలించుట.
To Haste, ToHasten v a. త్వరబెట్టుట, తీవరించుట.
To Hatch v n గుడ్డు చితికి పిల్ల బయిటపడుట. the eggs *ed and the young were born గుడ్లు చితికి పిల్లలు బయిటవచ్చినవి, పుట్టినవి.
To Hate v a అసహించుకొనుట, ఈసడించుకొనుట, గిట్టకపోవుట, సరిపడకపోవుట. I *it అది నాకు గిట్టదు, అది నాకు సరిపడదు. he *s study వాడికి చదువు అంటే విషముగావున్నది చీదరగా వున్నది. the cat *s the mouse పిల్లికి యెలుకకు గిట్టదు, విరోధము.they * wine వాండ్లకు సారాయి అంటే విరోధము, కారాదు, కూడదు, సరిపడదు. he *s aquiet life నెమ్మదిగా వుండడము వాడికి గిట్టదు.
To Haul v a ఈడ్చుట, గుంజుట, లాగుట. to * over విమర్శించుట, వుండజూచుటthey *ed him over the coals వాడికి చీవాట్లు పెట్టినారు.
To Haunt v a చుట్టుకొని తిరుగుట, సంచరించుట. he *s *s her house దానియింటిని చుట్టుకొని తిరుగుతాడు. this suspicion *ed his mind for two yearsవాడికి ఆ యనుమానము రెండేండ్ల దాకా మనస్సులో మెరమెరలాడుతూ వుండినది. they say ghosts * this garden యీ తోటలో దయ్యములు సంచరిస్తవట.
To Have v a కలిగివుండుట. this is generally expressed by వుండుట. to be, governed by a dative : thus, He has two sons వాడికి యిద్దరుకొడుకులున్నారు. one who has two sons యిద్దరు కొడుకులు గలవాడు. I * it అదినాకు వున్నది, నాకు చిక్కినది, నా వద్ద వున్నది. I * it not నా వద్ద లేదు. I * occasion to go there నాకు అక్కడికి పోవలసి వున్నది. I * some business with you నీతో నాకు కొంచెము పని వున్నది. he has sense వాడికి తెలివి వున్నది. he has no sense వాడికి తెలివి లేదు. I * no servant here యిక్కడ నాకు పనివాడు లేడు. I * no leisure to go పోవడానకు నాకు సావుకాశము లేదు. I * it by me అది నా వద్ద వున్నది. a man likely to * that book ఆ పుస్తకము వుండ తగినవాడు, ఆ పుస్తకమును కలిగివుండవలసినవాడు. he had tears in his eyes కండ్ల నీళ్లు పెట్టుకొన్నాడు. he has a fever వాడికి జ్వరము తగిలినది. she has a child దానికి వొక బిడ్డ వున్నది. she has had a child but it is dead అది బిడ్డను కన్నది అయితే ఆ బిడ్డ పోయినది. she had a child four months ago నాలుగు నెలల కిందట అది బిడ్డను కన్నది. In God we live and move and * our being మనము జీవించడము, మెలగడము, వుండడము దేవుని యందు. he who has nothing shall receive nothing వకటీ లేని వానికి వకటిన్నీ దొరకదు. I will not * this యిది నాకు వద్దు. will you * this ? యిది నీకు కావలెనా. Brick is to be had here యిటికలు యిక్కడ దొరుకుతవి. they will * his life వాడి ప్రాణమును పుచ్చుకొంటారు. we had a wet night రాత్రి వాన కురిసినది. you may * the house for 100 rupees నీవు ఆ యిల్లు నూరు రూపాయీలకు కొనవచ్చును. I had this money from him అతని వద్ద నుంచి యీ రూకలను తెచ్చుకొన్నాను. I had a letter from her దాని వద్ద నుంచి జాబు వచ్చినది.* you had your dinner ? భోజనము చేసినావా. what would you * ? నీవు కోరే దేమి. what would you * from me ? నన్నుంచి నీ కేమి కావలసివున్నది. they will not let you * it దాన్ని నీకు దొరకనివ్వరు. * is often the sign of the causal voice; thus; I had it brought తెప్పిస్తిని. I had a letter written జాబు వ్రాయించినాను. I had it woven నేయించినాను. I had it weighed తూపించినాను. Iwould * you go and tell him this నీవు పోయి అతనితో చెప్పవలసినది. I wouldnot * you think so నీవు అట్లా యెంచరాదు. I would * you to know this iswrong యిది కారానిది సుమీ. this has nothing to do with it అందుకు యిందుకుసమ్మంధము లేదు, యిది యెక్కడ అది యెక్కడ. you must * your wits about youజాగ్రతగా వుండు. you must * patience నీకు వోర్పు వుండవలెను. he will * it thatyou told him నీవు చెప్పినావని సాధిస్తాడు. they had him in honour వాణ్నిగౌరవముగా విచారించినారు. they had him in contempt వాణ్ని అలక్ష్యము చేసినారు.I * now to pay the money ఆ రూకలు నేను యిప్పుడు చెల్లించవలసివచ్చినది. theyhad him up into the castle అతణ్ని కోటలోకి తీసుకొని పోయినారు. he had his will of her or he had to do with her దానితో పోయినాడు. * done ! అంతమట్టుకు చాలించు. * at you ! భద్రము, కత్తి దూసుకొని వొకడి మీదికి పొయ్యేటప్పుడు చెప్పేమాట. Have a care ! జాగ్రత కలిగి వుండు, భద్రము. had it not been for him I should * died అతడు లేకపోతే నేను చత్తును. had he come I would * paid them అతను వచ్చివుంటే నేను యిచ్చివుందును. Rumour has it that they are descended from him వాండ్లు అతని సంతతి యని వదంతి కలదు. I * to deal with a great rogue నాకు వక క్షుద్రుడితో వ్యాపారము చేయవలసివచ్చినది. I had ratherdie than do so అట్లా చేయడము కంటే నేను చావడము మేలు. I had rather pay the money myself ఆ రూకలు నేనే యిస్తేవాసి. he had the worst of it వోడినాడు. he had the best of it జయించినాడు.
To Haw v n ఆ, ఊ, అని సందేహముగా మాట్లాడుట. what is he humming and *ing about అతడు ఆ, ఊ అని యేల సందేహిస్తాడు.
To Hawk v n డేగను విడిచి వేటాడుట. he *ed all day but caught nothingవొక దినమంతా డేగను విడిచినాడు గాని వొకటిన్ని చిక్కలేదు.
To Hawl v a ఈడ్చుట, గుంజుట, లాగుట.
To Hazard v a తెగించిచేసుట, సాహసించి, చేసుట. he *ed his life in thisundertaking యీ పనిలో తన ప్రాణానికి తెగించినాడు. he *ed this assertionసాహసము చేసి యీ మాటను చెప్పినాడు.
To Head v a అధిపతిగా వుండి నడిపించుట. he *ed the troops and took them into the town ఆ సేనకు నాయకుడై పట్టణములోకి తీసుకొనిపోయినాడు. he *ed the spear with brass ఆ యీటెకు యిత్తళి అలుగు వేసినాడు. he *ed the cane with gold ఆ బెత్తానికి బంగారుపొన్ను వేసినాడు. he *ed the coloumn with these words ఆకత్తెంతలమీద యీ మాటలు వ్రాసినాడు.
To Heal v n ఆరుట, కుదురుట, మానుట, వాసియౌట.
To Heap v a ఫోగుచేసుట, కుప్ప చేసుట. he *ed up riches ధనమునుకూడబెట్టినాడు.
To Hear v a వినుట. I * he is gone వాడు వెళ్ళినాడట, వాడు పోయినాడని విన్నాను. I shall * from him tomorrow వాడి వద్ద నుంచి రేపు నాకు జాబు వచ్చును. I *d of it అందున గురించి విన్నాను. will you * me my lesson ? నా పాఠము వొప్పగించుకొంటావా. the judge *d the case విమర్శ చేసినాడు * ! * ! * ! వినువిను, చూడు చూడు.
To Hearken v a వినుట, ఆలకించుట, యిది ప్రాచీన శబ్దము. God *ed to him వాడి మొరను దేవు డాలకించినాడు.
To Hearten n s ధైర్యము పుట్టించుట, ధైర్యమును కలగచేసుట.
To Heat v a కాచుట, తప్తము చేసుట. he *ed the iron red hot ఆ యినుమును పండ గాచినాడు. he *ed the water నీళ్లు గాచినాడు. he *ed his blood with drinking తాగి వొంటిలో కాకపుట్టేటట్టు చేసినాడు.
To Heave v n ఉబ్బివుబ్బి అణుగుట. her bosom *d దాని రొమ్ము యెత్తి యెత్తివేసినది. the sea was heaving సముద్రము వుల్లోలకల్లోలముగా వుండినది. the sight made my stomach * దాన్ని చూచేటప్పటికి నాకు వోకరింత పుట్టినది, నా పేగులు పెళ్ళగించుకొని వచ్చినది.
To Hebetate v a జబ్బుపరచుట, మందముచేసుట. drinking *s mind తాగడముచేత బుద్ధిమాంద్యము కలుగుతున్నది.
To Hector v a బుడ్డ బెదిరింపులు బెదిరించుట, జంభాలుకొట్టుట.
To Hedge v a కంచెవేసుట. they *d up the road దోవకు అడ్డముగా కంచెవేసినారు. they *d him on every side వాడికి యెటూ దారి లేక చేసినారు.
To Heed v a లక్ష్యములో వుంచుట, లక్ష్యము చేసుట, సడ్డ చేసుట. he did not *their order వాండ్ల ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు.
To Heel v n to lean to one side వొరుగుట. the ship *ed with the wind గాలి చేత ఆ వాడ వొడ్డిగిలినది.
To Heighten v a అధికపరచుట, పొడిగించుట, యెక్కువచేసుట, హెచ్చు చేసుట.this *s the injustice యిందు చేత ఆ అన్యాయము మరీ అతిశయించినది. varnish *s the colour మెరుగు నూనె చేత వన్నె హెచ్చుతున్నది, అధికరిస్తున్నది.
To Help v a సహాయము చేసుట, ఉపకారము చేసుట. he *ed me with somemoney అతడు నాకు కొంచెము రూకలు సహాయము చేసినాడు. he cannot * it, hemust go విధి లేదు వాడు పోవలెను, వాడు పోక విధిలేదు, వేరే గతి లేదు వాడు పోవలెను,వాడు పోక తీరదు. I cannot * it నేనేమి చేసేది, నన్నుంచి యేమి కాదు. If she is ugly she cannot * it అది కురూపి అయితే అందుకు అది యేమి చేయవచ్చును. how could I * giving it him దాన్ని నేను వాడికి యివ్వక తీరదు. I went to his house : how could I * it విధిలేక అతని ఇంటికి పోతిని. how could I * it నేనేమి చేతును. I could not * seeing it నేను చూడక విధిలేదు.I could not * laughing at the sight దాన్ని చూచి నాకు నవ్వు పట్టకూడక పోయెను. he *ed her down from the horse ఆమెను గుర్రము మీది నుంచి దించినాడు. he *ed me out of this difficulty నాకు యీ శ్రమ నివారణము చేసినాడు. he *ed me up the wall నన్ను గోడ మీదికి యెక్కించినాడు. will you * me up with this box and put it on my head ఈ పెట్టెను వొక చెయిపట్టి నా తల మీదికి యెత్తు. to * at meals వడ్డించుట. will you * me to some rice ? కొంచెము అన్నము వడ్డిస్తావా, వకటిని వడ్డించేదన్నప్పుడు * to అని వస్తున్నది. If you don't * me what am I to do నీవు వడ్డించకుంటే నేనేమి చేసేది. she *ed all the children alike బిడ్డలకంతా సరిగ్గా వడ్డించినది. It cannot be *ed యేమి చేసేది, చేయవలసినది యేమిన్ని లేదు. the horse is dead it cannot be *ed గుర్రము చనిపోయినది, మనము చేయవలసినది యేమిన్ని లేదు.
To Hem v n to utter a noise by violent expulsion of the breathగొంతును సవరించుకొనుట.
To Herald v a చాటించుట.
To Herd v n మందగూడుట, మందచేరుట, గుంపుకూడుట. why do you * withthem ? అటు వంటి పశువులతో నీ వెట్లా చేరుతావు.
To Hesiate v a అనుమానించుట, శంకించుట, సందేహించుట.
To Hew v a గొడ్డలితో నరుకుట, కాశపని చేసుట, మలుచుట. he *ed the tree down ఆ చెట్టును కొట్టి పడతోసినాడు, నరికి పడతోసినాడు. he *ed an image of marble రాతి విగ్రహమును చేసినాడు. he *ed the rock to piecesఆ రాతిని కొట్టి బద్దలు చేసినాడు.
To Hide v a దాచుట, దాచిపెట్టుట మరుగు చేసుట. clouds hid the hill ఆ పర్వతమును మేఘములు మూడుకొన్నవి. he has no place to * his head in వాడికియిల్లు లేదు వాకిలి లేదు. or to flog, to thrash పులుముట, బాదుట, కొట్టుట.
To Hie v n త్వరగా పోవుట. they *d them home ఇంటికి త్వరగా వెళ్ళినారు. she *d her flight to the hill యెగిరిపోయినది.
To Higgle v n నచ్చుబేరమాడుట, పీకులాట బేటమాడుట.
To Hinder v a అడ్డగించుట, అభ్యంతరము చేసుట, అటకాయించుట, ఆటంకముచేసుట. he *ed me from coming నన్ను రాకుండ చేసినాడు. this *ed him fromseeing it ఇందువల్ల దాన్ని చూడడానికి అభ్యంతరమైనది.
To Hinge v n To depend ఆధారముగా వుండుట, మూలముగా వుండుట. the wholebusiness *s upon the minister యావద్వ్యవహారమున్ను మంత్రి చేతిలో వున్నది. the whole business *s upon the permission of the Government దానికి ముఖ్యము రాజాజ్ఞ.
To Hint v a and v. n. సన్న చేసుట, సూచించుట, సైగ చేసుట, ఎచ్చరించుట, జాడగాతెలియచేసుట. he *ed this to me దీన్ని వాడు నాకు జాడగా తెలియచేసినాడు. he *edto me to go out of the room నన్ను బయిట పొమ్మని జాడగా చెప్పినాడు.
To Hire v a అద్దెకు తీసుకొనుట, కూలికి బెట్టు కొనుట. he *ed ten men to build this house ఈ యింటిని కట్టడానకు పది మంది కూలివాండ్లను పెట్టుకొన్నాడు.he *ed a house వొక యింటిని బాడిగెకు తీసుకొన్నాడు. he *d a palankeen కూలిపల్లకి పెట్టుకొన్నాడు. he *d false witnesses లంచమిచ్చి సాక్షులను కుదుర్చుకొన్నాడు. they *d themselves to me నా వద్ద కూలికి వుంటామన్నారు. he *d himself out కూలికి అమరినాడు, జీతానికి అమరినాడు. to * out or lend a vessel కేవుకు యిచ్చుట. he *d the palankeen to me ఆ పల్లకీని నాకు బాడిగెకు యిచ్చినాడు. to * or borrow a vessel కేవుకు తీసుకొనుట.
To Hiss v n బుసకొట్టుట, బుస్సుమనుట, చుర్రుమనుట. the hot iron *edwhen plunged into water కాలిన యినుమును నీళ్ళలో ముంచితే చుర్రుమన్నది.the snake *ed పాము బుసకొట్టినది. they *ed his speech వాడు చెప్పిన మాటకు ధూత్పొమ్మనారు, అనగా కసురుకొన్నారు. he *ed to the dog కుక్కను వుసికొలిపినాడు, జూ అన్నాడు, ఈల వేసినాడు. he *ed the dog on the boar ఆ పంది మీద కుక్కను వుసికొల్పినాడు.
To Hit v a కొట్టుట, తగులుట, తాకుట, పొందుట. he * the mark గురిని కొట్టినాడు. he did not * the mark గురి తప్పినది. he tried to * me with a stone నా మీద రాయిరువ్వజూచెను. you have * the sense అర్థమును సాధించినావు. I cannot * the meaning నాకు ఆ యర్థము గ్రాహ్యాము కాలేదు. he * me on the head నా తల మీద దెబ్బ తగిలినది. you have * the nail on the head నీకు ముఖ్యుముగా కావలసినది యేదో అదే లభించినది. whether you * or miss నీవు గురిని కొట్టినా కొట్టకపోయినా.
To Hitch, hitch v n. తగులుకొనుట, చిక్కుకొనుట. the rope *ed on the pin ఆ తాడు ఆణిలో తగులుకొన్నది. or to limp in walking కుంటుట.
To Hive v a తేనీగలను చేర్చుట, అనగా తేనె తెట్ట బెట్టేటట్టు చేసుట. he *d thebees in a hollow tree తొర్రగల చెట్టులో తేనీగలను కూర్చినాడు, అనగా తేనెతెట్టబెట్టేటట్టు చేసినాడు.
To Hoard v a కూర్చిబెట్టుట, చేర్చిబెట్టుట, దాచిపెట్టుట, కూడబెట్టుట.
To Hobble v n కుంటినడుచుట.
To Hoe v a తొళ్ళికతోతవ్వుట, గసికతో తవ్వుట, పారతో తవ్వుట. Hog, hog, n. s. పంది, సూకరము. you have brought your *s to a fine market (Johnson gives this proverb) మక్కాకు పోయి కుక్కశప్పాలు తెచ్చినావు.
To Hog v a to cut the hair short; he hogged the horse's mane ఆ గుర్రము యొక్క మెడ వెంట్రుకలను పందివీపువలె కత్తిరించినాడు.
To Hoist v a ఎత్తుట, పైకియెత్తుట, కప్పి తాటితో పైకి యెక్కించుట, పైకి చేదుట, they *ed up the palankeen పల్లకీని యెత్తుకొన్నారు. the flag was *ed కొడివేసినారు. they *ed sail చాపలు కట్టినారు, అంకారించినారని అంటారు.
To Hold v n పట్టుట, తాళుట, లగించుట, ఇముడుట, పొసగుట, ఎంచుట. they *that this is false ఇది అబద్ధ మనుకొన్నారు. the wood broke but the leather held కొయ్య విరిగినది అయితే తోలు నిలిచినది. the rule does not * here ఆ సూత్రము ఇక్కడ చెల్లదు. why should you * back ? నీవు యెందుకు వెనకతీస్తావు. he held forth all night రాత్రి అంతా మాట్లాడుతూ వుండినాడు. he could not * from weeping ఏడ్పును పట్టలేక పోయినాడు. the principle does not * good in practice ఈ సిద్ధాంతము అనుభవమునకు సరిపడదు. this *s good in all parts of India ఇండియా దేశములో సర్వత్ర యిది సహజమే. she was very angry but held in for a long time దానికి బహు కోపము వుండినది అయినప్పటికిన్ని శానా సేపు తాళినది. I desired to * off వాణ్ని కడగా వుండమన్నాను.the trade held on for many years ఆ వర్తకము అనేక సంవత్సరములు జరుగుతూ వచ్చినది. he held on his course నిలువక సాగిపోయినాడు. the fort held out for two months against the enemy ఆ కోట శత్రువులకు స్వాధీనపడక రెండు నెలల దాకా నిలిచినది. he will certainly die but I think he may * out for two months వాడు సిద్ధముగా చస్తాడు అయితే రెండు నెలలు తాళునేమో.this mortar's together well, they put hair in it గచ్చు బాగా కర్చుకొంటున్నది, అందులో వెంట్రుకలను కలుపుతారు. this story does not * together well ఈ కథలో వొకటికొకటి అసందర్భముగా వున్నది. Many * to this belief ఈ నమ్మిక శానా మందికి కద్దు. this king had several barons *ing under him ఆ రాజుకు తనకు లోబడ్డ జమీందారులు శానామంది వుండినారు. it rained in themorning but held up at noon తెల్లవారి వాన కురుసినది మధ్యాహ్నము వెలిసినది.almost all the bramins * with their great divine Shankara chari శానామంది బ్రాహ్మణులు శంకరాచార్యుల అవలంబించి వున్నారు. **! తాళుతాళు.
To Holloa v n ఒరే యని కేకవేసి పిలుచుట, ఓయని కేకవేసి పిలుచుట, కేక వేసుట.
To Hollow v n or to shout అరుచుట, కూసుట, కేకవేసుట, యిది నీచ శబ్దము.he *ed to me to come నన్ను రమ్మని కేక వేసినాడు.
To Honor, To Honour v a. గౌరవము చేసుట, సన్మానము చేసుట, గొప్ప చేసుట,మర్యాద చేసుట.
To Hoodwink v a కండ్లకు గంత కట్టుట, మోసము చేసుట, మాయచేసుట.
To Hook v a తగిలించుట. he *ed a fish వాడి గాలములో వొక చేప పడ్డది. hetried to * the branch దోటిని కొమ్మకు తగిలించపోయినాడు. he *ed me into thatbusiness ఆ పనిలో నన్ను తగిలించినాడు, వాడివల్ల మోసపోయినాను.
To Hoop v a కట్లు వేసుట. he *ed the cask ఆ పీపాయికి కట్లు వేసినాడు.
To Hoot v n గుడ్లగూబ కూసుట, వొకణ్ని యెగతాళి చేసి కేకలు వేసుట. I heard an owl *ing గుడ్ల గూబ కూయగా విన్నాను.
To Hop v n (as a bird) దుమికి దుమికి నడుచుట. as a boy వొంటి కాలితోదుమికిదుమికి పోవుట.
To Hope v a కోరుట, ఆశించుట, ఇచ్చించుట, అపేక్షించుట. I * you will grant me this ఇది తమరు దయచేయవలెను. I * you will attend to my orders నీవు మా యజ్ఞ వినవలసినది సుమీ, (యిది గద్దింపుమాట.) I * you will be better tomorrow రేపు నీకు బహుశః వొళ్ళు లఘువవును. In I. Cor. XIII.ప్రత్యాశ్నుతే. A+. కోరుట. P+.
To Horn v a కుమ్ముట, కొమ్ములతో పొడుచుట.
To Horse v a గుర్రము మీదికి యెక్కించుట. he *d the regiment ఆ రిజిమెంటుకుగుర్రములను యిచ్చినాడు.
To Hough, hok or hoff v a. మడమలు, తెగగొట్టుట, గుదికాలు నరము తెగకొట్టుట.
To Hound v a కుక్కలను పైకి వుసుకొలుపుట.
To House v n వొకని యింట్లో దిగుట, వొకని యింట్లో దాగుట.
To Hover v a వొడ్డు వేసుకొని చుట్టూతూ వుండుట. there were some kites *ing over the corpse ఆ పీనుగ వుండే స్థలానికి పైగా కొన్ని గద్దలు ఆడుతూ వుండినవి. the army was *ing on the borders of the country ఆ దండు ఆ దేశమా చాయల తారాడుతూ వుండినది. while his soul was *ing on his lips నోట ప్రాణము పోతూ వుండగా.
To Howl v n కూసుట, యిది నక్క, కుక్క, తోడేలు, వీటికూతను గురించిన మాట. toutter cries in distress ప్రలాపించుట. the jackal *s నక్క కూస్తున్నది. thewolf *s తోడేలు కూస్తున్నది. the dogs * at the moon కుక్కలు చంద్రుణ్ని చూచియేడుస్తవి. the child *s ఆ బిడ్డ కుయ్యో మొర్రో అని యేడుస్తున్నది. the thief *ed when flogged కొట్టుతూ వుండగా ఆ దొంగ మొర్రో మొర్రో అని మొత్తుకొన్నాడు. thewind *s గాలి బుస్సు బుస్సుమని ప్రచండముగా కొట్టుతున్నది.
To Huddle v a అబంధరగా వొకటి మీద వొకటి వేసుట, గందరగోళము చేయుట,దడబడగా చేయుట, గందరగోళము చేయుట, దడబడగా చేయుట, తారుమారుగా వేసుట.she *d on some clothes and ran out of the house కొన్ని వుడుపులనుఅయినట్టు పొయినట్టు వేసుకొని పారిపోయినది. he *d over his dinner and ran away అదాబాదానోట్లో వేసుకొని పారిపోయినది. he *d over his dinner and ran away అదా బాదా నోట్లో వేసుకొని పరుగెత్తి పోయినాడు. the marriagewas *d over పెండ్లి దడబడగా చేసి అయిందనిపించినారు. all the furniture was *d up in one room ఆ సామానంతా వొక కొట్టులో అబంధరగా వేసి వుండినది.he and his children were all *d up in one little carriage వాడువాడి బిడ్డలు అందరు రవంతబండిలో వొకరిమీద వొకరు తారుమారుగా కూర్చున్నారు. he *d all the papers up in one bundle ఆ కాగిదముల నంతా తలాతోకా లేక వొక కట్టగా కట్టినాడు.
To Huff v a కోపించుట, కసరుట, గద్దించుట, తిరస్కరించుట, ధిక్కరించుట,ఎత్తిపారవేసుట.
To Huff, huff v n. అలుగుట, కోపముగా వుండుట.
To Hug v a గట్టిగా కౌగిలించుకొనుట, గాఢాలింగనము చేసుకొనుట. the mother *ged her child తల్లి బిడ్డను కౌగిలించుకొన్నది. he *s the money దుడ్డు వదలడు. he *s himself upon his garden ఆహా నాకు యెంత తోట చిక్కిన దనుకొంటాడు, దీనికి మించిన తోట లేదంటాడు. the ship *ged the shore ఆ వాడ, గట్టును ఆనుకొని పోయినది.
To Hum v. n. ఝంకారము చేసుట, ఝంమనుట, a low confused noise కలకలధ్వని. what *ming noise is that అది యేమి గొలగొల ధ్వని. he paid itwithout *ming of hawing చిటుకు పొటుకు మనకుండా చెల్లించినాడు, కిక్కురుముక్కురు మనకుండా చెల్లించినాడు.
To Humanize v a మనుష్యులలో మరుపుట, నాగరీకము కలగచేసుట. education *s man శిక్ష చేత మనుష్యులకు వివేకము కలుగుతున్నది, నాగరీకము కలుగుతున్నది, విద్యాదదాతి వినయం.
To Humble v a అణగదొక్కుట, అణుచుట. he *d their pride వాండ్ల గర్వమునుఅణిచినాడు. he *d himself to them వాండ్లకు లొంగినాడు.
To Humbug v a పితలాటకము చేసుట, మాయ చేసుట, మోసపుచ్చుట.
To Humiliate v a అణుచుట, గర్వభంగము చేసుట.
To Humor v a See To Humour.
To Humour v a to indulge మనస్సు ప్రకారము పోనిచ్చుట, ముఖప్రీతికి చేసుట.he knows this is foolish but he does it to * his wife ఇది పిచ్చి పని అని వాడికి తెలుసును అయితే పెండ్లానికి ముఖప్రీతిగా చేసినాడు. he bought this kite to * his child బిడ్డకు బులుపుగా యీ గాలి పటమును కొన్నాడు. if you * the child too much you will ruin it బిడ్డను నిండా పోయిన పోకెల్లా పోనిస్తె చెడిపోను. he *s his servants in every thing ఏ పనిలో నున్ను పనివాండ్ల మనసు యెట్లాపోతే అట్లా విడిచి పెట్టుతాడు.
To Humph v n to say * గర్రుగుర్రుమనుట, గర్రుబుర్రుమనుట.
To Hunger v n ఆకలికొనుట, ఆకలి యెత్తుట. he *ed వాడు ఆకలికొనివున్నాడు.he *ed after learning వాడు చదువు మీద నిండా ఆశగా వున్నాడు విద్యాతురము గలవాడైవున్నాడు.
To Hunt v n వెతుకుట. he *ed for an excuse ఏమి సాకు చిక్కునా అనిచూచినాడు. they *ed for the child through the town ఆ బిడ్డను వూరంతావెతికినారు.
To Hurry v n అవసరముగా పోవుట, అవసరపడుట, ఆతురబడుట, త్వరబడుట,తీవరబడుట.
To Hurt v a ఉపద్రవపెట్టుట, బాధించుట. he says cold bathing will * youచన్నీళ్ళలో స్నానము చేస్తే నీకు ఉపద్రవ మౌనంటాడు. this blow *s him very muchఈ దెబ్బ చేత వాడికి నిండా వుపద్రవమైనది.
To Hurtle v n గుంపుగా వచ్చుట, పుంఖాను పుంకముగా పోవుట, యిది ప్రాచీనశబ్దము, యిప్పుడు చెల్లదు.
To Husband v a కాపాడుట, పోషించుట, నిర్వహించుట. he *s his propertyదుడ్డును కాపాడుతాడు.
To Hush up v a అణిచివేసుట, మూసిబెట్టుట. they have *ed up the matter ఆ సంగతిని బయిట రాకుండా అణిచివేసినారు, మూసిబెట్టినారు.
To Hush, hush v a. జోకొట్టుట, సద్దణుచుట, శాంతపరచుట.
To Husk v a పొట్టుతీసుట, దంచుట.
To Hustle v a to shake togetherin confusion కుదిలించుట, ముళ్లుకత్తిరించడమునకై దొంగలు గుంపులో తోదో పుళ్ళు కలగచేసుట. he *d the tickets inhis hat తన టోపిలో చీట్లను వేసి కుదిలించినాడు. they *d him in the crowd ఆ గుంపులో వాణ్ని నజుగుజులు చేసినారు.
To Hut v a దండును గుడిసెలలో దించుట. *ting money గుడిసెలువేసుకోవడమునకై యిచ్చే రూకలు.
To Huzza v n శాబాశు, భళీ, భళిర, మఝ్ఝూ, అని కేకలు వేసుట.
To Hybernate v a చలికాలము గడుపుట. these birds * beyond the sea ఈ పక్షులు సముద్రమునకు అవతలికిపోయి వుండి చలికాలమును గడుపుతవి. See To Winter.
To Hymn v n ధ్యానము చేసుట, నామసంకీర్తనము చేసుట, తిరునామాలు పాడుట.
To Idealize v a to form ideas,to fancy ఊరికె అనుకొనుట, ఊరికె యెంచుకొనుట.
To Identify v a ఇది అదేనని నిరూపించుట. the witness identified the horse as belonging to the merchant ఆ వర్తకుని గుర్రము ఆ సాక్షి పలికినాడు.
To Idle v n ఊరక ప్రొద్దుపుచ్చుట, వృధా కాలక్షేపము చేయుట. he *d away two years there అక్కడ రెండేడ్లు వృధాగా ప్రొద్దుపోగోట్టినాడు.
To Idolize v a to love or to reverence foolishly అదే పిచ్చిగా వుండుట,కాంక్షగా వుండుట, ప్రాణముగా వుండుట, the English * Shakespear ఇంగ్లిషువాండ్లు షేకుస్పీరనే కావ్యము మీద ప్రాణములు విడుస్తారు. he *s his wifeవాడికి పెండ్లాము పిచ్చే పిచ్చి.
To Ignite v n To catch fire అంటుకొనుట, తగులుకొనుట, రగులుకొనుట.
To Ignore v a తెలియదనుట, యెరుగననుట, అనగా అంగీకరించకపోవుట.the court *d the magistrate's decision పోలీసు వారి తీర్పును కోర్టువారుయెరగమన్నారు, అనగా అంగీకరించలేదు. to * a bill in the grand juryis it to throw it out వ్యాజ్యమును తోసివేసుట.
To Illude v a మాయచేయు, వంచించుట.
To Illuminate v a విస్తారముగా దీపాలుపెట్టుట, వెలిగించుట, ప్రకాశింపచేయుట, they *d the town వీధివీధికీ దీపాలు పెట్టినారు. the Musulmans * the Koran తురకలు ఖురాను యెక్క మొదటి పత్రములోవన్నెలు చిన్నెలు పెట్టుతారు.
To Illumine v a ప్రకాశింప చేయుట, జ్ఝానముకలుగ చేయుట.
To Illustrate v a తేటపరచుట, వివరించుట, విశదపరచుట, స్పష్టముచేయుట. he *d the meaning with four instances నాలుగు దృష్టాంతరముల చేత దాని అర్ధమును విశదపరచి నాడు.
To Illustrate, Illusory adj నమ్మరాని, భూటకమయిన, మాయగాయుండే,మోసమైన, వంచనైన.
To Image v a ఎంచు, ఎంచుకొనుట, భావించుట.
To Imagine v a అనుకొనుట, తలచుట, ఎంచుట, భావించుట. I * he is thereబహుశ వాడు అక్కడ వుండును, అక్కడ వుండునేమో,వుండు కాబోలు. I * heis gone వాడుపోయి వుండవచ్చును. I came because I *d they were hereవాండ్లు యిక్కడ వున్నారని వస్తిని. I *d it was wood అది కొయ్య అనుకొంటిని.I don't * so నాకట్లాతోచలేదు. I could not have *d this ఇది నాకుయెంత మాత్రము తోచలేదు.
To Imbibe v a ఈడ్చుకొనుట, గ్రహించుకొనుట, పీల్చుట. the earth *s theకొటుంన్నది.
To Imbue v a అద్దకము చేసుట, నానబెట్టుట,మనస్సలో పట్టేటట్టు చేసుట,మనస్సులో లగించేసేటట్టు చేయుట. he *d his scholars with these principles.ఈ సిధ్ధాంతములు తన పిల్లకాయల మనస్సున బట్టేటట్టు చేసినాడు, మనసులో లగించేటట్టుచేసినాడు.
To immerse v a ముంచుట.
To Immigrate v n పరదేశములో పోయి వుండుట, దేశాంతరము నుంచివచ్చి వుండడము.
To Immolate v a బలియిచ్చుట, గావు యిచ్చుట, హతము చేయుట.
To Immortalize v a శాశ్వతముగా వుండునట్లు చేయుట, శ్లాఘించుట.
To immure v a మరుగులో వుంచుట దాచుట, చెరచాలలో వుంచుట. he *shim self ప్రచ్ఛన్నుడై వున్నాడు, అనగా బయట రాడు. the Musulmans*s their wives తురకలను తమ భార్యలను ఘోషాలో వుంచుతారు.
To Imp v a అధికపరచుట, పెంచుట, పొడుగుచేసుట, హెచ్చించుట,See To Eke.
To Impair v a క్షీణింపచేసుట, హానిచేసుట,చెరుపుట. his health was *dవాడి వొళ్ళు చెడి పోయినది. his fortune was *d వాడి ఐశ్వర్యానికి హానివచ్చినది. his sight was *d వాడికి దృష్టి పాటవము తప్పినది.*d visionor sight మంద దృష్టి.
To Impale v a కొర్తవేసుట. one *d on a stake కొరతవేయబడ్డవాడు. animpaling post or stake కౌర్రు.
To impart v a ఇచ్చుట, దయచేయుట, కలగచేయుట, తెలియచేయుట. God*ed his grace to them ఈశ్వరుడు తన అనుగ్రహమును వాండ్ల మీదప్రసరింప చేసినాడు.the flower *ed its scent to her dress ఆ పువ్వులు వాసనంతా దానిబట్టకు అంటినది.
To Impawn v a కుదువబెట్టుట, తాకట్టుబెట్టుట.
To impeach v a to accuse by public authory దోషారోపణముచేయుట, నేరముమోపుట, నేరముచేసినాడని వొకనిమీద ఫిర్యాదు తెచ్చుట, ఆక్షేపించుట,కాదనుట. I do not * your judgement మీ తీర్పును నేను ఆక్షేపించను, కాదనను. they *ed him వానిమీద దోషమున్న దన్నారు.
To Impearl v a ముత్యాలుకట్టుట. the dews of the morning * every thornప్రాతఃకాలమందలి మంచు ప్రతిముల్లుకున్న ముత్యమును కట్టుతున్నది, అనగామంచు ప్రతిముల్లు కొనకు ముత్యమువలె వుంటున్నది.
To Impede v a ఆయాసబెట్టుట, ఇబ్బందిబెట్టుట, సంకటము చేసుట. the weightof the box *d his fight పెట్టె యొక్క బరువుచేత వాడికి పరుగెత్తకూడక పోయినది.
To Impel v a ముందరికి తోసుట, నిర్భంధనము చేయు, ప్రేరేపించుట. the tide *led the log towards me అలలు ఆ మొద్దును నాకై తోసుక వచ్చినవి. this *ledhim to go there యిది వాణ్ని అక్కడికి పోయేట్టు ప్రేరేపించినది. this *led meto learn the language ఇందుచేత నాకు చదువలెనని బుద్ధిపుట్టినది. necessity *led him to sell the house వాడికి వుండే అగత్యముచేత యిల్లు అమ్ముకోవలసివచ్చినది.
To Impend v n తటస్థించుట, సంభవించుట, సన్నిహితమౌట.
To Impinge v n కొట్టుకొనుట, తాకుట, సమఘట్టనమౌట.
To Implant v a తగిలేటట్టుచేసుట, నాటేటట్టుచేసుట. he *ed these notions in the minds of his scholar పిల్లకాయల మనసులో యీ భావము నాటేటట్టుచేసినాడు.
To Implead v a వొకరిమీద వ్యాజ్యమును తీసుకవచ్చుట, ఫిర్యాదు చేయుట.
To Implicate v a చిక్కించుట, తగిలించుట. they *ed him in this businessవాణ్ని యీ పనిలో తగిలించినారు. in their confession they *d him తామునేరమును వొప్పుకోవడములో వాణ్నిన్ని తగిలించినారు.
To Implore v a ప్రార్ధించుట, బతిమాలుకొనుట, వేడుకొనుట.
To Imply v n అర్ధమౌట, భావమును యిచ్చుట, భావించుట. this implies that he is dead యిందుచేత వాడు చచ్చిననాడనే భావము తేలుతున్నది.what does this * ? దీని తాత్పర్యమేమి, దీనిభావమేమి.
To Import v a దిగుమతి చేసుట, దేశాంతరమునుంచి తెప్పించుట. they * these articles from Hyderabad హైదరాబాదు నుంచి యీ సరుకులునుతెప్పించినారు. he *ed cloth and exported rice దేశాంతరము నుంచిబట్టలను తెప్పించి బియ్యమును పంపించినాడు. or to mean అర్ధమిచ్చుటఅర్ధమౌట. he *ed that he is gone ఇందువల్ల వాడుపోయినాడనిఅర్ధమౌతున్నది. what *s it that they were his sons వాండ్లు వాడికొడుకులై నందున యేమివిశేషము. this *s not ఇది వొక అతిశయము కాదు.
To Importune v a గోజాడుట, తొందరపెట్టుట, నచ్చుపెట్టుట, పీక్కొని తినుట,పీడించుట.
To Impose v n మోసము చేసుట, వంచించుట. he *ed upon me నన్నుమోసము చేసినాడు, వంచించినాడు. I was *ed upon మోసపోయితిని, గడ్డితింటిని.
To Impound v a దొడ్డిలో వేసి మూసుట. the documents are *ed in courtఆ సాధకములు కోర్టువారివల్ల నిలుపుకోబడ్డవి.
To Impoverish v a దరిద్రుణ్నిగా చేసుట, క్షీణింపచేసుట. sickness *es the blood రోగముచేత నెత్తురు చెడిపోతున్నది.
To Impower v a అధికారము యిచ్చుట.
To Imprecate v a to call for evil upon himself or others తగులు గాకఅని కోరుట, శాపమిచ్చుట, శపించుట, తిట్టుట. they * the curse of Godagainst him వాడికి దేవుడి శాపము తగులుగాక అనీ అన్నారు. they *edevery evil on his head వాడికి నానాకడగండ్లు వచ్చు గాక అనిశపించినారు.
To Impregnate v a గర్భముయిచ్చుట, గర్భాదానము చేయుట. the rains * theearth వాన నీళ్ళు భూమిని ఫలింపచేయుచున్నది.
To Impress v a గురుతు యేర్పడేటట్టు వొత్తుట, గురుతు వేసుట,ముద్రవేసుట,అచ్చువేసుట. he *ed the seal upon the wax లక్కమీద ముద్రవేసినాడు.he *ed the flowers in gold upon the leather తోలుమీద యీ బంగారుపూలు వేసినాడు. he *ed these ideas on their minds ఈ అభిప్రాయములను వాండ్ల మనసులో లగింపచేసినాడు, నాటేటట్టు చేసినాడు. they *soldiers, sailors or labourers దండకు గానీ, వాడకు గానీ,మాటలుమోసేటందుకు గానీ, మనుష్యులను బలవంతముగా పట్ఠుకుపోతారు.
To Imprint v a అచ్చుగా యేర్పడేటట్లు చేయుట, అచ్చువేసుట, గురుతువేసుట,See To Imptess.
To Imprison v a కావలిలో బెట్టుట, చెరసాలలో బెట్టుట.
To Impropriate v a మాన్యములను ఆక్రమించుకొనుట, మాన్యములను పడగొట్టుట, మాన్యములను అమానిని దాఖలు చేసుకొనుట, మాన్యములను జప్తిచేసుకొనుట.
To Improve v a అభివృద్ధిచేసుట, వృద్ధిపొందించుట. to * land నేలను బలముచేయుట. he *ed the dictionary ఆ నిఘంటును దిద్ది చక్కబెట్టి నాడు. he *edthe house ఆ యింటిని పెంచికట్టినాడు. he *s his time ఏవేళా పనిలోవుంటాడు, వృధాగా పొద్దుపుచ్చడు. Trade *d his circumstances వర్తకమువల్ల బాగుపడ్డాడు.
To Impugn v a ఆక్షేపించు, దోషముచెప్పుట, తిరస్కరించుట. he *ed thedecision of the government గవర్నమెంటువారి తీర్పును తిరస్కరించినాడు.
To Inaugurate v a పట్టాభిషేకము చేసుట, పట్టము గట్టుట, ప్రవేశబెట్టుట.
To Incage v a పంజరములో పెట్టుట.
To Incapacitate v a దుర్భలపరచుట.
To Incarcerate n s కావలిలో పెట్టుట, చెరసాలలో వేయుట.
To Incinerate v a burn to ashes బూడిదచేసుట, భస్మముచేసుట.
To Incite v a ఉసికొలుపుట, ఎత్తివిడుచుట, పురికొలుపుట, ప్రేరేపించుట, రేచుట. this *d me to write to him ఇందువల్ల అతనికి వ్రాయవలననినాకుతోచినది.
To Incline v a వంచుట. he *ed his head తన తలను వంచినాడు. * thine ear ఆలకింపుమా, చెవియిచ్చి వినుమా. as desirous ఇచ్చపుట్టించుట, బుద్ది పుట్టించుట. this *d me to consent ఇందు చేతసమ్మతించేనందుకు నాకు బుద్దిపుట్టినది.
To Inclose v a See to Enclose.
To Include v a కలుపుట, చేర్చుట. this account *s the expense of the dinner ఈ లెక్కలో భోజనము ఖర్చు కలసివున్నది. his family was forty people but this * gardeners వాడి సంసారము నలభైమంది అయితేతోటవాండ్ల సమేతముగా.
To Incommode v a ఇబ్బంది చేయుట, చిక్కుల బెట్టుట, తొందర బెట్టుట. the flies * the house ఈగలు గుర్రాన్ని హింస పెట్టుతున్నవి, ఉపద్రవపెట్టుతున్నవి.
To Incorporate v a కలుపుట, కూర్చుట, చేర్చుట, మిశ్రమముచేయుట.
To increase v n అతిశయించుట, అధికమౌట, అభివృద్ధియౌట, ప్రబలమౌట,పెరుగుట, పొడుగుట, హెచ్చుట.
To Incrust v a పైన చెక్క కట్టుట, పైపూతపూయుట, కవచమిచ్చుట. they * crucibles with cowdung మూసలను పేడతో పూసారు. the white ants have completely *ed this log with earth చెదలు యీ మొద్దును మట్టితోకప్పివేసినది.the fumes of the quicksilver *ed the copper పాదరసముఆ రాగి బోగోణిలో పతంగించినది.
To Inculcate v a ఉపదేశించుట, బోధించుట, నేర్పుట. they * obedinceవినయమును వుపదేసిస్తారు, చెప్పినటుల వినవలనని బోధిస్తారు. they * the transmigration of souls ఆత్మకు జన్మ పరంపర కచ్చని అంటారు.
To Inculpate v a కలియవేసుకొనుట, కలుపుకొనుట, అనగా తమ తప్పులోయితరులనుకూడా కలియవేసుకొనుట. they tried to * me తమ తప్పులోనన్ను కలుపుకోను చూచినారు. తమ తప్పును నాతలమీద కూడా పెట్టిచూచినారు.
To Incumber v a బళువు యెక్కించుట. See To Encumber.
To Incur v a పడిచు, పాత్రుడౌట, పొందుట. he *red the king's displeasure రాజు యెక్క కోపమునకు పాత్రుడైనాడు. he * red blame bythis ఇందుచేత నిందను పొందినాడు. he *red suspicion వాడిమీదఅనుమానము తట్టినది. he *red many debts చాలా అప్పులు పడ్డాడు. the truble he *red వాడు పొందిన శిక్ష. to * responsibility పూటబడుట.
To Indemnify v a ఈడుచేయుట, ఉత్తరవాదము చేయు, చెల్లుబెట్టుట,నష్టము కట్టియిచ్చుట, ప్రతిచేసుట. if you under take the workI will * you ఆ పనికి నీవు పూనుకుంటే దాంట్లో నష్టము వస్తే నేనే కట్టియిస్తాను.
To Indent v n వొడంబడికచేసుట, ఒప్పాచారముచేసుట, కావలసి వాటికైచీటీ వ్రాసుకొనుట, దర్ఖాస్తుచేయుట. he *ed upon us for some troopsకొంచెము దండుకావలెనని మాకు చీటీ వ్రాసుకున్నాడు.
To Indicate v a చూచుట, అగుపరచిట, తెలియచేయుట, సూచించుట.this * fever ఇది జ్వరమును తెలియచేస్తున్నది.
To Indict v a to charge any person by a written accusation beforea court of justic న్యాయస్థలములో వ్రాతమూలముగా వొకరి మీద నేరముగురించి వ్యాజ్యము తెచ్చుట, నేరము మోపుట.
To Indispose v a అసహ్యము బుట్టించుట, ప్రతికూలముచేయుట. this *edhim assist us మాకు సహాయముచేయడానకు యిందువల్ల అతనికి అసహ్యము బుట్టినది.
To Indite v a అల్లుట, రచించుట, ఇదిప్రాచీనశబ్దము.
To Individualilze v a ఉద్దేశించు, ప్రత్యేకించిచెప్పుట.
To Indoctrinate v a ఉపదేశించుట.
To Indorse v a సంతకము చేయబడ్డ హుండీ పెట్టుకొని వుండేవాడు.
To Induct v a ప్రవేశపెట్టుట, ఏర్పరుచుట. they *ed the priest. పట్టముగట్టినారు.
To Indue v a See To Endue.
To Indulge v n ఎడమిచ్చిన, పోయినదే పోకుగా వుండుట, యథేశ్చగా వుండుట. although he was ill he *d in mangoes ఒళ్ళు కుదురుగా లేనప్పటికిన్ని నోరుకట్టక పోయి మామిడిపండ్లును తిన్నాడు. the doctor says to a patient you must not * నీవు యేమిన్ని అమితముగా చేయరాదని వైద్యుడు రోగికి చెప్పుతూ వుంటాడు. he *d in abuse మట్టూమితీ లేక వూరికే నోటికివచ్చినట్టు తిట్టి నాడు. he *d in drinking మట్టూమితమూలేక వూరికే తాగినాడు. he *d in woman ఇది అది అని లేక ముండలతోపోసాగినాడు. he *s in foolish reading కన్నదీ చదువుతాడు. he *s inidleness శుద్ద సౌమారి అయిపోయినాడు. he *ed in malice కార్పణ్యమువహించినాడు. he *s in sleep వేళా పాళా లేక వూరికే నిద్రపోతాడు, నిద్రగతిగా పడివున్నాడు.
To Indurate v n ఘనీభవించుట, రాయిఅయిపోవుట, కరడుగట్టుట.
To Inebriate adj మత్తును కలుగ చేసుట, మదమును కలుగచేసుట,మయికమును కలుగచేసుట.
To Infatuate v a పిచ్చిపట్టేటట్టు చేసుట, మైమరచేటట్టు చేసుట, స్మారకముతప్పేటట్టు చేసుట. pride *d him వాడికి గర్వము వొళ్ళు తెలియలేదు.
To Infect v a (this governs an accusative in English but a dative in Telugu) అంటించుట, తగిలించుట, సోకించుట. he *ed themwith disease వాడు వాండ్లకు తన రోగమును తగిలించినాడు. this bookhas *ed him with strange opinions ఈ గ్రంథము చేత వాడికి కొన్ని వింత గుణాలు పుట్టివి. they *ed his mind with their follies వాండ్లువెర్రితనము వాడికి పట్టినది. he *ed her with his malice వాడి క్రౌర్యముదానికిన్ని పట్టుబడ్డది, వాడిక్రౌర్యము దానికిన్ని వచ్చినది. his laughing *edus all వాడు నవ్వగానే మాకంతా నవ్వు వచ్చింది.
To Infer v a ఊహించుట, భావించుట. we must * his approval అతనిఅంగీకారమును మనము వూహించుకోవలసినది. from this heat we may* that it will rain ఈ యెండచేత వానవచ్చునని మనము వూహించవలసివున్నది. what do you * from this ? దీనిమీద నీవు వూహించనిది యేమి.
To Infest v a ఉపద్రవపెట్టుట, పీడించుట, వేదించుట. thives * the road ఆ దోవలో దొంగలు వుపద్రవముగా యున్నది. snakes * these gardensఈ తోటలలో పాములు వుపద్రవమునిండా. flies * the market అంగడిలోఈగల వుపద్రవము. fevers * these villages ఈ వూళ్ళలో జ్వరోపద్రవముగా వున్నది. the road is *ed beggars ఆ దోవలో బిచ్చగాండ్లు ముసురుకొనివున్నారు.
To Infix v a నాటుట, నిలుపుట, పాదుట.
To Inflame v a మంటచేసుట. love *ed his heart వాడికి మన్మథోద్రేకముకలగినది. these words inflamed his rage యీ మాటలకు రేగినాడు.this *ed me with eagerness ఇందుచేత నాకు ఆశపుట్టినది. drinking *sthe blood తాగడముచేత వొళ్ళు నిప్పుగా వుంటుంన్నది.
To Inflate v a గాలితోనింపుట, ఉబ్బించుట. he inflated the balloonగుమ్మటము గాలితోనించినాడు. these words *d him with prideఈ మాటల చేత గర్వించినాడు.
To Inflect v a శబ్ధమునకుగాని క్రియకుగానీ రూపభేధములను యేర్పరుచుట. Inflection, n. s. రూపభేధము, అనగా He అతడు, His అతని, thou నీవు,thine నీ, యివి మొదలైనవి. యింటి is the * of యిల్లు.
To Inflict v a చేసుట, తగిలించుట. they *ed upon him this punishment వాడికి యీశిక్ష చేసినారు. the stone as it fell *ed a wound on his head ఆ రాయిపడడములో వాడి తలమీద గాయము తగిలినది.this *ed wound on her heart ఇందుచేత దానిమనసుకు మహా వ్యాకులము వచ్చినది.
To Influence v a ఏలుట, ప్రేరేపించుట. this *ed me to consent యిదినన్ను సమ్మతించేటట్టు చేసినది. the changes of the moon * the season చంద్రవ్యత్యయములు కాలవ్యత్యయములను చేస్తున్నవి. his will *sthem in all things అన్నిట్లోనున్ను వాండ్లను మనసు యేలుతున్నది,అనగా అన్నింటికిన్ని వాండ్లు వాడి మనసు ప్రకారము నడచుకుంటారు. thespur and bridle * the horse ముల్లును, కళ్ళెమును గుర్రమును యేలుతవి,అనగా స్వాధీనపరుస్తున్నవి.
To Infold v a చుట్టుట. they *ed his legs in bands వాడికాళ్ళకు గుడ్డపేలికలు చుట్టినారు. he *ed her in his arms దాన్ని కౌగిలించుకున్నాడు.
To Inform v n వొకడిమీద చెప్పుట, దాడిచేసుట. he *ed against themవాండ్లమీద పోయిచెప్పినాడు. they went to * about him వాడిమీద చెప్పడానికి పోయినారు.
To Infringe v a అతిక్రమించుట, ఉల్లంఘనముచేసుట, తప్పుట, మీరుట.
To Infuse v a పోయుట, నానవేసుట. to * poison విషముపెట్టుట.they *ed suspicion into his mind అతనికి సందేహము తెలియచేసినారు.this *d new life into him వాడికి మహాసంతోషమైనది.
To Ingraft v a అంటించుట, అంటువేసుట. he *ed this tree upon another ఆ చెట్టును మరియొక చెట్టుతో అంటువేసినాడు. he *ed his prejudices upon them తనదుర్భుద్ధని వాండ్లకు ప్రసరించేటట్లు చేసినాడు. Ingrafted, adj. అంటించిన, అంటువేసిన. See Ingraft.
To Ingulf v a మించుట, లోనికి యీడ్చు కొనుట. the *ed the ship సముద్రము ఆవోడను మింగినది, అనగా సముద్రములో ఆవోడ ముణిగిపోయినది. the earth *ed sits భూమి సీతను లోనికి దించుకున్నది.
To Inhabit v a కాపురము వుండుట, వాసముచేయుట. he *s the houseఆ యింట్లో కాపురము వున్నాడు. these trees * mountains కొండలమీదవుండే చెట్లు. he who *s the forest వనవాసి.
To Inhale v a ఆకర్షించుకొనుట, ఊపిరిని లోనికి యీడ్చుకొనుట, పీల్చుట.* smoke పొగత్రాగుట. to * a perfume ఆఘ్రాణించుట.
To Inherit v a కర్తృత్వమువల్ల పొందుట, బాధ్వతవల్ల పొందుట, స్వతంత్రముచేత పొందుట. I * his property బాధ్వతవల్ల అతని సొత్తు నాకు వచ్చినది.he *ed his father's estate కొడుకనే బాధ్యతచేత వాడి తండ్రి సొత్తువాడికి వచ్చినది. She *s her mother's beauty తల్లి అందము దానికివచ్చినది. he *s his father's vices తండ్రి యొక్క దుర్గుణములువీడికి వచ్చినవి.
To Initate v a అభ్వసింపచేసుట, ప్రవేశపెట్టుట, పనుపరచుట, అక్షరాభ్యాసము చేయించుట. he *d me in business అతడు మొదట పనిలో ప్రవేశపెట్టినాడు. he *d me in logic అతడు నాకు తర్కము నేర్పినాడు. he *dme in this spell ఈ మంత్రమును ఉపదేశించినాడు. he *d me in sanscrit వాడు సంస్కృతములో నాకు అక్షరాభ్యాసము చేయించినాడు.
To Inject v a లోపలవేసుట, లోపలికియెక్కించుట, అనగా చిమ్మన గొట్టముతో లోనికి చిమ్ముట. he *ed water in to my ear నా చెవిలో చిమ్మనగొట్టముతో నీళ్ళు చిమ్మినాడు. he *ed the foot that was cut off కోసినకాలి మొండెమునకు మైనము కట్టినాడు, అనగా మొండెము కుళ్ళి పోకుండాబహుదినాలు ఉండేటట్టు దానిలోని రక్తమును తీసివేసి దానికి బదులు చిమ్మనగొట్టముతో చిమ్మి యెక్కించినాడు.
To Ink v a శిరాచేసుట. I had *ed my hands నా చేతులు శిరా చేసుకున్నాను.
To Inlay v a చెక్కుట, పొదుగుట.
To Inoculate v a ( with the small pox) అమ్మవారు పొడిపించుట,అమ్మవారు పోయించుట. he has *d them with his opinions తనఅభిప్రాయములను వాండ్లకున్ను ప్రసరించేటట్టు చేసినాడు. to * tree.See to Graft.
To Inovate v n కొత్త కల్పనలు చేసుట.
To Inquire v n విచారము, అడుగుట. See to Enquire.
To Inrol v a ఉద్యోగములో పెట్టుకొనుట, పట్టీలో పేరు వ్రాసుకొనుట. I *ledmy name with them వాండ్ల దగ్గర కొలువుకు కుదిరాను.
To Inscribe v a అంకితము బెట్టుట. he *ed the book to the king ఆపుస్తకము రాజుమీద అంకితము పెట్టినాడు, కృతియిచ్చినాడు. he *d the stone with this name ఆ రాతిమీద యీ పేరుని చెక్కినాడు.
To Insert v a నడమబెట్టుట, ప్రవేశబెట్టుట, ఎక్కించుట, చేర్చుట. he *ed the string దారమును గూర్చినాడు. he *ed his hand చేయి దూర్చినాడు.he *ed a word ఒక మాటను నడుమ వ్రాసినాడు, నడుమపెట్టినాడు.
To Inshrine v a ప్రతిష్టచేయుట, నిలుపుట.
To Insinuate v a ఉపాయముగా ప్రవేశపెట్టుట, ఎక్కించుట, దూర్చుట. he *d his hand in to the hole తన చేతిని ఆ బొందలో దూర్చినాడు.he *d many things against us మా మీద నెమ్మదిగా శానాపుల్లలుపెట్టినాడు. he *s that I am your enemy నేను మీకు శత్రువైనట్టుబోధిస్తాడు. he *d some doubts about this ఇందున గురించి కొన్ని సందేహములు పుట్టునట్లు తంత్రము చేసినాడు. he *d some doubts into the King's mind రాజు మనసునకు అనుమానము పుట్టేటట్టు చేసినాడు. the water *s itself into the box ఆ పెట్టెలోకి నీరు ఎక్కినది.he *d himself into the prince's favor రాజు దయను ఉపాయముగాసంపాదించుకున్నాడు.
To Insist v n పిడివాదముచేసుట, హటముచేసుట. he *d upon your paying it నీవు దాన్ని చెల్లించవలెనని పిడివాదము చేస్తాడు, హటముచేస్తాడు. I * upon telling me నీవు నాకు చెబితేగానీ కూడదు. he *supon it that you told him నీవు తనతో చెప్పినట్లు సాధిస్తాడు.
To Insnare v a చిక్కించుకొనుట, తగిలించుకొనుట.
To Inspect v a చూచుట, పరిశీలనము చేసుట, విచారించుట, విమర్శించుట,శోధించుట.
To Insphare v a కవచమిచ్చుట, గుప్తముచేయుట, సంపక్షించుట, ఇదికావ్యమందు వచ్చే మాట.
To Inspire v a కలగచేసుట, పుట్టించుట, ప్రేరేపించుట, ఇచ్చుట. his words *d me with hope; or, his words *d hope into my mindవాడి మాటలు నాకు ఆశ కలుగచేసినవి, పుట్టించినవి. God *d to do thisదీన్ని చేయడానికి వాండ్లకు దేవుడు ప్రేరేపించినాడు. she *d him withlove అది వాడికి మోసము కలుగచేసినది.
To Inspirit v a ధైర్యమును కలుగచేసుట.
To Install v a పట్టము గట్టుట, ప్రవేశపెట్టుట. they *ed him as judgeఅతడిని న్యాయాధిపతిగా యేర్పరిచినారు.
To Instance v a ఉదాహరణ అగుపరచుట, దుష్టాంతరము చూపుట.
To Instigate n s దుర్భోధన చేసుట, పురుగొలుపుట, పుల్లలు పెట్టుట,ప్రేరేపణ చేసుట. anger *d him to do this కోపోద్రేకముచేత దీన్ని చేసినాడు.

No comments:

Post a Comment