O' clock adv గడియారమును గురించి. ten * పది ఘంటల వేళ.
O.S. n. s. Contraction of Old Style పాతలెక్క. N. S. or NewStyle కొత్తలెక్క. అనగా ఆన 1790 యో సంవత్సరములో 11 తేదులు వృద్దిగావచ్చినందున అప్పుడు తేదులు క్షయించేటట్టు, వొకనియమముచేసుకొన్నారుగనకఆపూర్వపుమర్యాదను O.S. అన్నిన్ని -కొత్తగాచేసుకౌన్న నియమమును N. S. అనిన్ని వ్యవహరిస్తారు. దానికిన్ని 11 తేదులు ముందు వెనకగా వుంటున్నది.
Oaf n s జడుడు, మందమతి.
Oafish adj జడుడైన, మందమతియైన.
Oak n s టేకువంటి వొక చెట్టు, దిన్ని వృక్షరాజమంటారు. Fabricius says కర్వాలియుమరం. Reeve says మర్దిగిడ.
Oaken adj Oak అనే కొయ్యతో చేసిన.
Oakum n s పీచు, అనగా పాత దారము మొదలైనవాటిని కొట్టి చేసిన పీచు.
Oar n s అల్లీస కర్ర, తండుకోల, అడక, తెడ్డు, నౌకాదండము.he was then resting upon his *s పడవను తొయ్యక వుండినాడు,అనగా పని చాలించి వూరికే వుండినాడని తాత్పర్యము.
Oasis n s అఘోరమైన అడవిలో చిక్కిన రమ్యమైన ప్రదేశము. this village is a perfect * amid the wild కుంపటిలో తామర మొలిచినట్టు వున్నది, అనగా యీ మోట రాజ్యములో యీ వొకవూరు అతి రమణీయముగా వున్నది.
Oat n s See Oats.
Oaten adj Oat అనే ధాన్యముతో చేసిన.
Oath n s ప్రమాణము, సత్యము, బాస, ఒట్టు. to take an * సత్యము చేసుట. he has taken the * as Governer గవనరువుద్యోగానికి సత్యము చేసినాడు.
Oatmeal n s Oats అనే ధాన్యపు పిండి.
Oats n s వోటు బియ్యము, అనగా వులవలవంటి వొక విధమైన ధాన్యము, దీన్ని ముఖ్యముగా గుర్రాలకు పెట్టుతారు. he has sown his wild * వాడి పోకిరీతనము అణిగి యిప్పుడు కొంచెము గునముగా వున్నాడు.
Obduracy n s కఠినత్వము, కఠోరత్వము, మూర్ఖత్వము, ముష్కరత్వము.
Obdurate adj కఠినమైన, కఠోరమైన, కర్కశమైన, మూర్ఖమైన, ముష్కరమైన.
Obedience n s విధేయత, భవ్యత. in * to your order తమ ఆజ్ఞ ప్రకారము. they were in * to him అతనికి భవ్యులై వుండిరి. what is the use of a command if you do not exact *? నీవు వుత్తరువుప్రకారము నడిచేటట్టు చేయనట్లైతే వుత్తరువుకు యేమి ఫలము.
Obedient adj విధేయుడైన, చెప్పినట్లు చేసే. your most * servant తమకు మిక్కిలీ విధేయుడైన దాసుడు.
Obediently adv వినయ విధేయముగా.
Obeisance n s దండము, వందనము.
Obelisk n s శాసనము వ్రాసి నిలబెట్టిన రాతి స్థంభము,అచ్చుపుస్తకములో వేసే వొక గుర్తు (+).
Oberon n s king of fairies కుబేరుడు.
Obesity n s fatness కొవ్వు, కాయ పుష్టి.
Obit n s మరణము.
Obituary n s చచ్చిన మనిషిని గురించిన చరిత్ర.
Object n s that which is seen, (in low English, a sight) వస్తువు, కండ్లకు అగుపడే వస్తువు, విషయము, తాత్పర్యము, ఉద్దేశము. the mango tree in flower is an * of great beauty పూచిన మామిడి చెట్టు నిండా అందమునకు ఆస్పదముగా వున్నది. he is a fit * for favour వాడు అనుగ్రహమునకు తగిన పాత్రుడు. this is a most important * యిది ముఖ్యమైన విషయము. is it your * to enrage him? అతణ్ని రేచవలెనని నీకు అభిప్రాయమా. he wrote so as to conceal his * తన అభిప్రాయము బయటపడకుండా వుండేటట్టుగా వ్రాసినాడు. he has carried his * తన వుద్దేశమును నెరవేర్చినాడు, వాడి పట్టును సాధించినాడు. that is no * అది అ విషయము. the distence is no * దూరము వొక విషయము కాదు. an * of sense ఇంద్రియ గోచరమైన వస్తువు. the soul is not an * of sense ఆత్మ యింద్రియములకు అగోచరము. he is a wretched * వాడొక దిక్కుమాలిన పక్షి. in grammar కర్మ.
objection n s ఆక్షేపణ, ఆక్షేపము. to make an * ఆక్షేపించుట. I hava no * to it అట్లాగేకానీ. he raised this * వాడు యీ ఆక్షేపణ చేసినాడు.
Objectionable adj ఆక్షేపగ్రస్తమైన, కాని, తప్పయిన.
Objective adj విశేషమైన. * case ద్వితీయ్యావిభక్తి.
Objector n s ఆక్షేపించేవాడు.
Objurgation n s దూషణ.
Objurgatory adj దూషణమైన.
Oblation n s బలి, నైవేద్యము.
Obligation n s బద్ధుడై వుండడము, నిర్బంధము, నియమము, బాధ్యత. a written * పత్రము, ఖరారునామా, ఒడంబడిక. he was under the * of an oath అతను ప్రమాణముచేత బద్ధుడై వుండెను. she was under the * of a vow అది నోము యొక్క నియమమునకు లోబడి వుండెను. I was under great *s to him ఆయన చేసిన వుపకారములకు బద్ధుడై వుంటిని. I shall never forget my *s to you తమరు నాకు చేసిన వుపకారాన్నియెన్నటికి మరువను. In ethicks, a perfect * కర్మము. an imperfect * పుణ్యము. a voluntary * వ్రతము, నోము. final * కుమారుడు తీర్చుకోవలసిన పితృ ఋఉణము.
Obligatory adj కర్తవ్యమైన, విధిగా వుండే, ఋణముగా వుండే,విహితమైన.
Obliged adj నిర్బంధించబడ్డ, బద్ధుడైన. he was * to sell his house అతను యింటిని అమ్ముకోవలసి వచ్చినది. I shall be much * if you will do this తమరు దీన్ని చేస్తే తమ వుపకారమునకు బద్ధుడై వుందును. I am your * humble servant తమ వుపకార బద్ధుడైన దాసుడను.
Obliging adj ఉపకారియైన, సజ్జనుడైన. an * person ఉపకారి. * conduct ఉపకారము. be so * as to go there దయచేసి అక్కడికి పొండి. you are very * తమ దయ. they accepted his * offer వాడు చేస్తానన్న వుపకారము గైకొన్నారు.
Obligingly adv ఉపకారముగా, ఆదరణ పూర్వకముగా.
Oblique adj అయిమూలగా ఉండే, వంకరైన, వక్రమైన, విపరీతమైన. he dropped an * hint జాడగా సూచన చేసినాడు. in grammar, the * case షష్ఠీ విభక్తి. an * look వార చూపు. in astrology, the * influence of a star వామ పార్శ్వ వేధ.
Obliquely adv అయిమూలగా, ఏటవాలుగా, వంకరగా.
Obliqueness n s వంపు, వంకర, వక్రత్వము. * of vision వార చూపు.
Obliquity n s వంపు, వంకరతనము, వక్రత్వము.
Obliterated adj మాసిపోయిన, చెడిపోయిన, నశించిపోయిన. writing * by rain వాన చేత చెడిపోయిన వ్రాత. a path * by sand యిసుక మూసుకొనిపోయిన దారి.
Obliteration n s మాసిపోవడము, చెడిపోవడము, మరుగైపోవడము.
Oblivion n s మరుపు, విస్మృతి. the affair was consigned to * ఆ సంగతి మూల పడ్డది, అడుగున పడిపోయినది. that affair is buried in * ఆ స్మరణే లేకపోయినది.
Oblivious adj మరిచిన.
Oblong adj నిడుపు వాటుగా వుండే, వెడల్పు కంటే నిండా నిడివిగ వుండే. a plantain is of an * shape అరిటి పండ్లు నిడివిగా వుంటవి. an * quadrangle (the shape of this volume) యీ పుస్తకము నాలుగు మూలలు గలిగి నిడివి వాటు ఆకారము గలదిగా వున్నది.
Obloquy n s అపనింద, అపవాదము, అపఖ్యాతి.
Obnoxious adj liable అర్హమైన, యోగ్యమైన, యెడమైన, దండ్యమైన. exposed, లోబడ్డ. offensive తప్పైన, చెడ్డ, కాని. this is an * remark యిది కాని మాట. he made himself very * to them వాండ్లకు కానివాడైనాడు. he used some * language అతను కొన్ని దుష్ట మాటలు చెప్పినాడు.his conduct is * to the laws వాడి నడక చట్టానికి విరుద్ధము. his conduct is * to censure వాడి నడక చీవాట్లకు యెడముగా వున్నది.
Obnoxiously adv తప్పుగా, దుర్మార్గముగా, యెడముగా.
Obscene adj బండైన, బూతైన.
Obscenely adv బండగా, బూతుగా.
Obsceneness,Obscenity n s. బండతనము, పోకిరితనము, పలవతనము.
Obscure adj చీకటిగా వుండే. or, not easily apparent తెలియబడని, మరుగైన. an * day మందారముగా వుండే దినము.an * room చీకటిగా వుండే యిల్లు. this is an * verse యిది గూఢమైన శ్లోకము. this poet was born in an * village యీ కవి అప్రసిద్ధమైన వూళ్ళో పుట్టెను. the difference between these two is very * యీ రెంటికీ వుండే భేదము అస్పష్టము.
Obscurely adv చీకటిగా, అస్పష్టముగా. the moon was seen * చంద్రుడు సూచనగా అగుపడెను, లీలగా అగుపడెను. he stated it * స్పష్టముగా తెలియ చేసినాడు కాదు. one who is * born అజ్ఞాత కుల గోత్రీకుడు.
Obscurity n s చీకటి, అంధకారము, అస్పష్టత. he lived in * అప్రసిద్ధుడై వుండెను, అజ్ఞాతవాసై వుండెను. from the * of the meaning అర్థము గూఢమైనందున. from the * of the room ఆ యిల్లు చీకటిగా వుండినందువల్ల.
Obsequies n s plu. ఉత్తర క్రియలు, కర్మాంతము.
Obsequious adj నైచ్యము గల, విధేయుడైన, వినీతుడైన,వినయ విధేయము గల.
Obsequiously adv వినయ విధేయమముగా, నైచ్యముగా.
Obsequiousness n s వినయము, నైచ్యము.
Observable adj అగుపడే, కండ్లబడే. there is an * difference between these two యీ రెంటికి స్పష్టమైన భేదమున్నది. that star is not now a * ఆ నక్షత్రము యిప్పుడు అగుపడదు.
Observance n s ఆచారము, అనుష్ఠానము, అనుసరించి నడుచుకోవడము. he taught the * of this law ఆ శాస్త్రమును అనుసరించి నడుచుకొనేటట్టు నేర్చినాడు. this is an * among us యిది మాలో నడిచే వొక ఆచారము.
Observant adj శ్రద్ధ గలిగిన, సదనుష్ఠానము గల.
Observation n s చూడడము, కనుక్కోవడము, తోచిన అభిప్రాయము.or comment టీక. he made another * in his letter అతని జాబులో యింకొక మాట వ్రాసినాడు. the *s of the government on this statement యిందు మీద గవర్నమెంటు వారికి తోచిన అభిప్రాయము.he made no *s upon it వాడు అందున గురించి యేమిన్ని అనలేదు. this often fell under my * యిది పదేపదే నాకు కండ్లబడుతూ వచ్చినది. he is a man of * అతడు వివేచన గలవాడు. practical *s వొక విధమైన వ్యాఖ్యానము. to take an * అశ్విన్యాది నక్షత్రములువుండే చోటును కనిపెట్టుట. In Luke XVII. 20. ఐస్వర్యదర్శనం A+.
Observatory n s నక్షత్రాదులను చూడడానికై కట్టివుండే యిల్లు, నక్షత్రములను చూచే మిద్దె.
Observer n s చూచేవాడు, కనుక్కొనేవాడు, విచారించేవాడు.
Obsolete adj వాడిక లేని, యిప్పట్లో వాడుక లేని, చెల్లని. an * custom యిప్పట్లో లేని వాడుక. that practice is now * ఆ మర్యాద యిప్పుడు లేదు. an * word యిప్పుడు చెల్లని మాట, యిప్పట్లో ప్రయోగము లేని మాట. this is an * phrase యీ ప్రయోగము యిప్పుడు వాడిక లేదు.
Obsoleteness n s యిప్పట్లో వాడిక లేక వుండడము.
Obstacle n s అభ్యంతరము, విఘ్నము, విఘాతము, అడ్డి. this is no * యిది వొక అభ్యంతరము కాదు.
Obsteric adj మంత్రసానితనమును గురించిన. the * art మంత్రసానితనము.
Obstinacy n s మూర్ఖత్వము, ముష్కరత్వము.
Obstinate adj మూర్ఖమైన, ముష్కరమైన. an * disease మొండి రోగము, కుదరని రోగము, అసాధ్య రోగము.
Obstinately adv మూర్ఖముగా, ముష్కరముగా.
Obstinateness n s మూర్ఖత్వము, ముష్కరత్వము.
Obstreperous adj అరిచే, కూసే, బొబ్బలు పెట్టే.
Obstreperously adv అరుస్తూ, కూస్తూ, బొబ్బలు పెట్టుతూ.
Obstruction n s విఘ్నము, విఘాతము, ఆటంకము, ప్రతిబంధకము.he laboured under *s of the bowels కడుపు వెళ్ళక సంకటపడుతూ వుండినాడు.
Obstructive adj అడ్డములాడే, భంగపరిచే, విఘ్న కారకమైన.
Obstructiveness n s విఘ్న జనకత్వము.
Obtainable adj పొందతగ్గ, దొరక గల, సంపాదించ కుడిన. that book is not * here ఆ పుస్తకము యిక్కడ చిక్కేదికాదు.
Obtained adj పొందిన, ప్రాప్తమైన, చిక్కిన, సంపాదించిన.
Obtruncated adj మొండెముగా కోసివేసిన, బోడి.
Obtrusion n s అమర్యాదగా చొరబడడము, పిలవక చొరబడము.
Obtrusive adj అమర్యాదగా చొరబడే, పిలవక చొచ్చే, మొండియైన,మూర్ఖమైన.
Obtuse adj పదును లేని, మొక్కగా వుండే, మొద్దైన, మూఢుడైన.an * angle బహిర్లంబకాశ్రము. a man of * intellect వట్టి జడుడు.
Obtuseness పదునులేమి,మొక్క,మొండి,శౌంఠ్యము,జడత్వ
Obviate v a నివారించుట, నివృత్తి చేసుట, పరిహరించుట. thisrule does not * the difficulty ఈ సూత్రముచేత ఆ తొందర నివారణము కాలేదు. this *d the objection ఇందువల్ల ఆ ఆక్షేపణ పరిహారమైనది.
Obvious adj స్పష్టమైన, విశదమైన, ప్రత్యక్షమైన, సహజమైన. the reason is * దీని హేతువు స్పష్టముగా వున్నది.
Obviously adv స్పష్టముగా, విశదముగా, ప్రత్యక్షముగా, సహజముగా.
Obviousness n s స్పష్టత, వైశిద్యము.
Occasion n s కారణము, నిమిత్తము, ప్రయోజనము, సమయము,తరుణము, అక్కర. on festive *s ఉత్సవ కాలములలో. on this* ఈ సారి, ఈ తేప. on the former * పోయినసారి, పోయిన తేప.on one * వొకసారి. on four *s నాలుగు తరుణములలో. have you * for this book? ఈ పుస్తకము నీకు అక్కర వున్నదా. as I had * for a horse నాకొక గుర్రము కావలశి వుండినందున. I have no * for it అది నాకు అక్కర లేదు. what * had you to go to him? నువ్వు వాడి వద్దికి యెందుకోసరము పోవలిసి వచ్చింది. I will advance money as there is * నీకు రూకలు కావలసినప్పుడు యిస్తూ వస్తాను. without any * నిష్కారణముగా, వూరికే. there is no * for water నీళ్ళు నిమిత్తము లేదు. or, religious celebration ప్రయోజనము.
Occasional adj అప్పుడప్పుడు సంభవించే, మధ్యే మధ్యే తటస్థమయ్యే. there are * difficulties మధ్యమధ్య కొన్ని సంకటములు సంభవిస్తవి. Occasionally, adv. అప్పుడప్పుడూ, అక్కడక్కడా.
Occidental adj పడమటి, పశ్చిమ. * learning అనగా Europe దేశపు విద్య.
Occiput n s పెడ తల, తల యొక్క వెనకటి భాగము.
Occult adj గుప్తమైన, గూఢమైన, గంభీరమైన, రహస్యమైన, అగుపడని. Occultation, n. s. జ్యోతిష శాస్త్రమందు నక్షత్రాది అదర్శన కాలము, గ్రహణ కాలము, మూఢము, సూర్య సంయోగము.
Occupancy n s అనుభవము, కాపురము ఉండడము.
Occupant n s అనుభవించేవాడు, కాపురము వుండేవాడు.
Occupation n s పని, వృత్తి, ఉద్యోగము. during the enemy's * of our town శత్రృవులు మా వూరిని ఆక్రమించుకొని వుండినప్పుడు.
Occupied adj కాపురము వుండే. a house *ed by him అతనుకాపురము వుండే యిల్లు. I was * all yesterday నిన్నంతా పనిలో వుంటిని.
Occupier n s కాపురము వుండేవాడు, అనుభవించేవాడు.
Occurence n s సంభవించిన పని. this is a strange * ఇది వొక తమాషా పని. the *s of each day నానాడు సంభవించిన పనులు.
Ocean n s సముద్రము, సాగరము.
Ochre n s కావి రాయి. red * ఎర్ర మన్ను; ఎర్ర కావి రాయి.a cloth dyed with red * కావి గుడ్డ, కాషాయము. yellow * గోపి. white * సుద్ద, తిరుమణి.
Octagon n s అష్ట కోణాకృతి, అష్ట కోణములు గలది.
Octave n s అష్టమ స్వరము. or eighth day కొన్ని పండుగలకు తర్వాత వచ్చే యెనిమిదో దినము.
Octavo n s వొక విధమైన బొక్కు, అనగా వొక కాకితాన్ని యెనిమిది పత్రములు అయ్యేటట్టుగా మడిచి అచ్చు వేశిన పుస్తకము.
October n s ఇంగ్లీషు వారి పదో నెల.
Octogenrian n s యెనభై యేండ్ల మనిషి, అశీతి వయస్కుడు.
Octupled adv (eight times as much) యెనిమిదింతలు.
Ocular adj కండ్లారా చూచిన, ప్రత్యక్షమైన. * proof ప్రత్యక్షమైన రుజువు.
Oculist n s నేత్ర వైద్యుడు. Odd, adj. as numbers in arithmetic బేసియైన, విషమమైన. even and * సరి బేసి. nine and eleven are * numbers తొమ్మిది పదకొండు బేసిగా వుండే సంఖ్యలు, విషమ సంఖ్యలు. a hundred and * నూట చిల్లర, నూరున్ను పై చుంగుడిన్ని. an * volume విడి పుస్తకము, అనగా వొక వాలమునకు అధికముగా బైండుచేశిన బొక్కులలో వొంటి పుస్తకము. these shoes are * ఇ జోళ్లు విజ్జోళ్లుగా వున్నవి. uncouth, strange, విపరీతమైన, వికారమైన, వింతైన. an * dress వింతైన వుడుపు.
Oddity n s వింత, చోద్యము, విచిత్రము.
Oddly adv strangely వింతగా, విచిత్రముగా.
Oddness n s వింత, విచిత్రము.
Odds n s వ్యత్యాసము. it makes no * whether you go or stay నీవు పోయినా వొకటే వున్నా వొకటే. we fought againstgreat * మేము కొంచెము మందిమి జనము అధికముగా వుండే వాండ్లతోపోట్లాడినాము. * and ends తుక్కా ముక్కా.
Ode n s వొక విధమైన కావ్యము.
Odious adj అసహ్యమైన, రోతైన, పాపిష్టి. an * book పాపిష్టి పుస్తకము.
Odiously adv అసహ్యముగా, రోతగా, చీదరగా.
Odiousness n s అసహ్యము, రోత.
Odium n s ద్వేషము. he incurred * by this ఇందుచేత వాడు అందరికీ పగవాడు అయినాడు. wishing to avoid the * of this ఈ అపవాదము మనకి యెందుకు అని.
Odium Theologicum n s (hatred caused by sectarian feelings) మత వైరము.
Odoriferous adj పరిమళించే, వాసన కొట్టే.
Odoriferousness n s వాసన, పరిమళము.
Odorous adj పరిమళించే, వాసన కొట్టే.
Odour n s వాసన, పరిమళము. good * సువాసన, మంచి పేరు. bad * కంపు, దుర్వాసన, అపఖ్యాతి.
OEconomy n s See Economy.
OEcumenical adj General, universal సర్వసాధారణమైన, సమస్త పృధ్వీ సంబంధమైన. an * council సార్వభౌమకాలోచన.
OEsophagus n s కంఠ నాళము.
Of prep యొక్క. the name * the man ఆ మనిషి యొక్క పేరు. the scent * a flower పుష్పము యొక్క వాసన. 2. లో. which * them is oldest? వాండ్లలో యెవడు పెద్ధవాడు. one * the books ఆ పుస్తకములలో వొకటి. six * these వీటిలో ఆరు.3. మీద. the love * money రూకల మీద ఆశ. 4. చేత, వల్ల, చొప్పున, గూండా. I learned it * him వాడి గూండా విన్నాను.he did this * his merry విశ్వాసము చేత చేసినాడు, విశ్వాసము వల్ల చేసినాడు. 5. అనే. he gained the name * a poet కవి యనే పేరును పొందినాడు. a jewel * a book గ్రంధ రత్నము. theflames of * శోకమనే వహ్ని. the village * Vinuconda వినుకొండఅనే వూరు. the kingdom * Persia పర్శియా అనే దేశము. the fool * a doctor తెలివిమాలిన వైద్యుడు, వెర్రి వైద్యుడు. the rogue * agoldsmith ఆ కంసాలి హరంజాద, ఆ వంచకుడయిన కంసాలవాడు. withoutfear * falling పడుతామనే భయం లేకుండా. 6. కు. within a mile * their houses వాండ్లిండ్లకు గడియ దూరములో. he made a copy * that paper ఆ దస్తావేజుకు వొక నకలు వ్రాసుకొన్నాడు. 7. వద్ద, దగ్గెర. he took leave * his master ఉపాధ్యాయుల వద్ద సెలవు పుచ్చుకొన్నాడు. he bought it * me నా దగ్గెర కొన్నాడు. * whom did you buy it? దాన్ని యెవడి దగ్గెర కొంటివి. 8. తో. a box made * gold బంగారుతో చేసిన డబ్బీ, బంగారు డబ్బీ. a box made * horn కొమ్ముతో చేసిన బరిణె, కొమ్ము బరిణె. made * leather తోలుతో కుట్టిన. 9. గురించి. I heard * him వాణ్ని గురించి విన్నాను.articles of war దండును గురించి చట్టములు. the life * Ramaరామ కధ, రామ చరిత్ర. 10. గల. a man * fifty యాభై యేండ్లు గలవాడు, యాభై యేండ్ల వడు. PHRASES, a bag * gold మొహిరీల సంచి. a man * sense బుద్ధిమంతుడు. a man * learning విధ్వాంసుడు.a woman * beauty అందకత్తె, రూపవతి. all * us మేమందరము. they robbed * all I had నావద్ద వుండినదంతా దోచుకొన్నారు. being * wicked heart దుర్మార్గమునకులోనై. he did it * himself తనకు తానే చేసినాడు, స్వబుద్ధ్యా చేసినాడు. it fell down * itself తనకు తానే పడ్డది. he settled the business out * hand ఆ పనిని తక్షణమే పరిష్కారము చేసినాడు. he sleeps * an afternoon మూడుజాములకు నిద్రపోతాడు. * late they often go there ఇటీవల వాండ్లక్కడికి పదేపదే పోతారు. * old they wore another dress పూర్వ కాలమందు, వాండ్లు వేరే వుడుపు వేసుకొన్నారు. * a poor man he became rich పేదవాడుగా వుండి భాగ్యవంతుడైనాడు. a house * his అతనిది వొక యిల్లు. he has two horses * his own వాడికి స్వంతముగా రెండు గుర్రఆలు వున్నవి. a cup * water గిన్నెడు నీళ్ళు. * course కాక యేమి. first * all తొలుదొలుత, మొట్టమొదట. ten rupees worth * rice పది రూపాయిల బియ్యము. I am in possession * that book ఆ గ్రంధము నా వద్ద వున్నది. I know nothing * it దాని గురించి నాకేమీ తెలియదు. I know * no other carpenter there అక్కడ వేరే వడ్ల వాడు వునట్టు నాకు తెలియదు. what has become * him? వాడేమాయెను. * a morning he rides out తెల్లవారి పూట సవారీపోతాడు. that paper is not * my composing ఆ దస్తావేజు నేను వ్రాశినది కాదు. instead of doing so అలా చేయకుండా. what is the use of keeping it? దాన్ని పెట్టుకోవడము వల్ల యేమి ఫలము. * a truth, they knew he was gone వాడు పోయినాడని వాండ్లకు నిజముగాతెలిసి వుండెను. he knew that * necessity I must come నేను అవశయముగా రావలసినదని వాడికి తెలుసును.
of cows పేడ., గోమయము, driedcow*forfuelఏరుపిడకలు, * or manure పెంట,. ఎరుపు. of birds of fish రెట్ట.of horse or elephan. s. లద్ది. *of dogs * of wild animalshuman * మలము ,పియ్యి, అమేధ్యము. devils's *or assafoetida అఇంగువ. * of flies ఈపి.
Of Yore adv long time past, of old time పూర్వము. of yore they lived here పూర్వము వాండ్లు యిక్కడ వుండినారు. in days of yore పూర్వ కాలమందు.
Off adv మీదనుంచి. (is the original sense, thus) he took his hand * the table బల్ల మీద నుంచి చేయ్యి అవతలికి తీసుకొన్నాడు. they took their hats * తల మీద నుంచి టోపీలు తీసివేశినారు. theypulled him * his bed వాణ్ని మంచము మీద నుంచి కిందికి యీడ్చినారు. it is often expressed by వేయు, పెట్టు, పోవు. to cut కోసుట. to cut * కోసివేసుట. they pushed him * వాణ్ని అవతలికి తోసివేసినారు. he left * reading Tamil అరవము చదవడము విడిచిపెట్టినాడు. he poured the water * నీళ్ళను వంచి వేసినాడు. he took * the skin తోలును తీసివేసినాడు, వొలిచివేసినాడు. the horsefell * in flesh ఆ గుర్రము చిక్కిపోయినది. PHRASES, he is * బయలుదేరినాడు, పారిపోయినాడు, పడ్డాడు, పరిగెత్తుతూ వున్నాడు. the stream carried me * my legs ఆ ప్రవాహము నా కాళ్ళను భూమి మీద ఆననీయలేదు. he waited on the * side of the house ఇంటికి అవతలి తట్టున కనిపెట్టుకొని వుండినాడు. the horse is * his feed ఆ గుర్రము మేత యెత్త లేదు. the * side of a horse గుర్రానికి అవతలి తట్టు, అనగా గుర్రానికి కుడి తట్టు. * and on he was employed in that work ten years వాడప్పుడప్పుడు ఆ పనిలో వుండినదంతా చేరిస్తే పది యెండ్లు అవుతున్నది. he read it * hand
Off! interj. వెళ్ళు పో, పోపో,be*!పో,వెళ్ళు,Off, prep. లేకుండా. he was * his guard వాడు జాగ్రత్త లేకుండావుండినాడు, ఎచ్చరిక లేకుండా వుండినాడు. a village five miles *అయిదు ఘడియల దూరములో వుండే వూరు.
Offal n s కసురు, కశ్మలము, అనగా వొక జీవమును కోశి తనగూడినమాంసమును యెత్తుకౌని పారవెయ్యవలసిన పేగులు మొదలైనవి. he sheepweighed fifty pounds, of which tne pounds were * ఆ మేక యాభైరతుల యెత్తు వుండినది, అందులో తోలుతో వొక పది రతులు పోయినవి.leavings of food (addison's Tatler No. 24) ఉచ్ఛిష్టము,యెంగిలి.
Offence n s తప్పు, నేరము, అపరాధము, ఉపద్రవము, ఆయాసము.he pardoned their *s వాండ్ల తప్పులను క్షమించినాడు. he gave themno* వాండ్లకు వాడేమి ఆయాసము చేయలేదు. a captial *తలపొయ్యేనేరము. a moral * దునీ్ తి. a cirminal * దొంగతముమొదలైన రాజదండనకు అహన్నమైన తప్పు. a civil * శివిల్ కోర్టువారు శిక్షించవలసిన తప్పు. a state * రాజద్రోహము. an * againstpropriety అమర్యాద. he took * at what I said నేను చెప్పినదిఅతనికి ఆయాసమైనది. he lived without * వొకరికి వుపద్రవముచేయకుండా వుండినాడు.
Offenceless adj నిరపరాధియైన, నేరములేని.
Offender n s నేరస్థుడు, అపరాధి, తప్పు చేశినవాడు.
Offensive adj అసహ్యకరమైన, ఆయాసకరమైన, ఉపద్రవకరమైన. a *smell దువా్ సన. * behaviour ఆయాసకరమైన నడత. * weapons కత్తి,తుపాకి, మొదలయిన వధించడానకు యోగ్యమైన ఆయుధములు. defensiveweapons అనగా. shield డాలు మొదలైన సంరక్షక ఆయుధములు.an * and defensive alliance నీ శత్రువులే నా శత్రువులు, నీ మిత్రులే నామిత్రులు అన్నట్టు. the enemy made no * movement శత్రువులుమాకేమిన్ని బాధగా వుండిన పని చేయలేదు.
Offensively adv ఆయాసకరముగా, ఉపద్రవకరముగా, అసహ్యముగా.
Offer n s యత్నము. I rejected his * వాడు యిస్తానంటేఅక్కరలేదన్నాను. he made an * of peace సంధిమాట్లాడినాడు.he accepted the * మాటను అంగీకరించినాడు. he rejected the *నేను అడిగిన మాటను తోశివేశినాడు. she accepted his * వాడు అడిగినదానికి పెండ్లి చేసుకొంటానని వొప్పినది.
Offered adj ఇయ్యవచ్చిన, యత్నపడ్డ, నైవేద్యము చేసిన,బలిపెట్టిన.
Offering n s సమప ్ ణ, నజరు, కానుక, నైవేద్యము, బలి.a burnt * ఆహుతి. a meat * వపాహోమము. a drink * అఘ్య ్ ము. a wave * మంగళ ఆరతి.
Offhand adv ధారాళముగా, అవలీలగా. he composed this poem * ఈకావ్యమును అవలీలగా రచించినాడు.
Office n s పని, వ్యాపారము, ఉద్యోగము. he exercised the *of priest గురువుగా వుండినాడు. he passed through the highest*s అతడు గొప్పగౌప్ప వుద్యోగములు చేశినాడు. whilst he was in *అతడు వుద్యోగములో వుండగా. a man in * అధికారి, ఉద్యోగస్థుడు.while he was in the * అతను కచ్చేరిలో వుండగా. a printing *అచ్చకూటము, ముద్రాక్షరశాల. fire * నిప్పు కార్ఖానా, అనగా ఈకార్ఖానాను పెట్టుకౌన్న వాండ్లకు సంవత్సరానికి యిల్లు వొకటింటికిపన్ను యింత అని యేర్పరుచుకొని యిస్తూ వస్తారు,ఈ పన్ను యిచ్ఛే యిండ్లలో యేదైనా వౌకటి కాలిపోయినట్టైతేఅందువల్ల వచ్చిన నష్ఠమును ఆ కార్ఖానా వాండ్లు అచ్చుకొంటారు.the marriage * వివాహప్రయోగగ్రంథము.. the * for the burial ofthe dead అపర ప్రయోగ గ్రంథము. the house is old but the *s arenew ఇల్లు పాతదిగాని అందుతో చేరిన వంటయిల్లు, గుర్రుపు లాయముమొదలైనవి కొత్తవి. a house of * పాయిఖానా, మరుగుపెరడు. good *s ప్రత్యుపకారములు, సత్కర్మములు. a return of good *sప్రత్యుపకారములు. ill *s అపకారములు.
Officer n s అధికారి. a military * దండుదొర. a medical *డాక్తరు. a revenue * ములికీ వుద్యోగస్థుడు. in the armyసేనానాయకుడు. a police * or peace * బంట్రోతు.
Officered adj సరదార్లుగల.
Official adj ఉద్యోగమునుపట్టిన, వ్యవహారసంబంధమైన, దివాణపుసర్కారు. he gave me a private answer but he would not giveme an * one తాను స్వంతముగా జవాబు వ్రాశినాడుగానివుద్యోగమునుబట్టి వ్రాయలేదు. * duty సర్కారు పని, దివాణపు పని.an * year దివాణపు లెక్క సంవత్సరము.
Officially adj ఉద్యోగతః, ఉద్యోగమునుపట్టి, అధికారమునుపట్టి.
Officious adj అధికప్రసంగియైన. do not be * నీకు ఆ జోలియెందుకు, అది నీపని కాదు.
Officiously adv అధికప్రసంగముగా. he acted very * in thisbusiness తనకు నిమిత్తములేని పనికి పోయినాడు.
Officiousness n s అధికప్రసంగము.
Offing n s తీరము నుంచి కౌంత లెక్క సముద్రము. three shipsappeared in the * సముద్రతీరమునుంచి కొంత లెక్క సముద్రములోమూడు వాడలు అగుపడ్డవి.
Offset n s అంకురము, మొలక.
Offsourings n s మురికి, మలము, అనగా కడిగిపారపోశే మురికి. these were the * of people జనులలో వీండ్లు తుచ్ఛులు,భ్రష్టులు, వూరు రోశిన వాండ్లు.
Offspring n s సంతానము, సంతతి. they are his * వీండ్లు అతనిబిడ్డలు.
Oft adv పదేపదే.
Often adv పదేపదే, మాటిమాటికి. how * am I to tell you ?నీతో యెన్ని మాట్లు చెప్పేది. they attacked us four times andwere as * repelled మామీదికి నాల్గుమాట్లు వచ్చిపడి అన్నిమాట్లున్ను వోడిపోయినారు.
Oftentimes adv పదేపదే, మాటిమాటికి, పలుమారు.
Oftimes adv పదేపదే, మాటిమాటికి, పలుమారు.
Ogle n s కీకంటిచూపు, వారచూపు, కీకంటి సైగ.
Ogling n s కటాక్షము, అపాంగదృష్టి.
Oglio n s (a dish) వొకవిధమైనకూర, కలవంటకము, కదంబము,కలగూరగంప.
Ogre n s బాలఘాతకుడు, రాక్షసుడు, పెద్దలావాటి ముసలమ్మ.
Ogress n s బాలఘాతకి, రాక్షసి, పూతన.
Oh ! o interj అబ్బా, అయ్యో.
oho ! interj. ఓహో, ఆహా,అహాహా
Oil n s నూనె, చమురు, తైలము, మెరుగు. linseed * (oftencalled gingily *)1 మంచినూనె. sweet * or olive * వొకవిధమైనసీమ నూనె.Gingli is corrupted from Chenchilit the word used in upper Bengal.castor * ఆముదము. earth * మట్టితైలము. essential * of sandalచందనధృతి. *ed butter (called ghee) వెయ్యి. a leathern *bottle శిద్దె. a picture painted in * నూనెవర్ణముతో వ్రాశినప్రతిమ.
Oil cake n s గానుగపిండి.
Oil colours n s నూనె వర్ణములు, అనగా నూనె పోశి కలిసినవర్ణములు.
Oiled-butter n s నెయ్యి.
Oiliness n s జిడ్డు, మెరుగు. from the * of these seedsఈ విత్తులలో నూనె కద్దు గనక.
Oiling n s నూనె పట్టించడము.
Oilman n s గాండ్లవాడు, నూనెవాడు.
Oilman's stores n s అనగా వుప్పుతో బాగాచేశిన మాంసము వగైరాఆహారములు.
Oilmill n s గానుగ.
Oily adj జిడ్డుగల, నూనెగల. * language వట్టి బుజ్జగింపులు.
Ointment n s తైలము.
Old adj ముసలి, ప్రాచీనమైన, పాత. an * friend బహుదినాలస్నేహితుడు. when his coat grew * వాడి చౌక్కాయపాతగిలినప్పుడు. an * saying సామిత. an * promise పూర్వముయిచ్చిన మాట. an * man ముసలివాడు. an * woman ముసలిది.an * poem ప్రాచీన కావ్యము. an * book పాత పుస్తకము. * ageవృద్ధాప్యము, ముసలితనము. when he grew * వాడికి వృద్ధాప్యమువచ్చినప్పుడు. how * are you ? నీ వయస్సెంత. my child is notso * as your's నా బిడ్డి చిన్నది, నీ బిడ్డ పెద్దది. fiftyyears * యాభై యేండ్లుగల. he is *er than me నా కంటెపెద్దవాడు. of * or in * time, they did not do soపూర్వకాలమందు వాండ్లు అట్లా చేయలేదు. in the days of *పూర్వకాలమందు. young and * బాలులువృద్ధులు, పిన్న పెద్దలు.she is of an * family ఆమె అనాది వంశస్థురాలు. * fellow ! అన్నా,అబ్బీ. this is the * story ఇది యెల్పప్పటి కూతె. * testamentబైబిల్ యొక్క మొదటిభాగము, పూర్వభాగము. he is an * acquaintanceof her's దానికి నిండా దినములుగా గురైరుకైనవాడు.
Oldfashioned adj మునుపటితరహాగా వుండే, పూర్వకాలపు మాదిరిగావుండే.
Oldness n s ముసలితనము, ముదిమి. from the * of the houseఇల్లు పాతది గనుక.
Oleaginous n s నూనె గల.
Oleander n s గన్నేరు.
Olfactory n s ఘ్రాణేంద్రియ సంబంధమైన. his olfactoriesముక్కు. this offended his olfactories ఈ కంపు వాడికి తాళ కూడలేదు.
Olibanum n s సీమ సాంబ్రాణి, అందుగుచెట్టు బంకర, కుందురికీ. See Ainslie 1. 136. 264.
Oligarchical adj కౌందరు పెద్ద మనుష్యులు కూడుకొని చేశేరాజ్యాధిపత్య సంబంధమైన.
Oligarchy n s `A form of government which places thesupreme power in a small number : aristocracy.'(Johnson)కులీనులైన కౌందరు పెద్ద మనుష్యులు కూడుకౌని చేశేరాజ్యాధిపత్యము.
Olio n s కలవంటకము, కలగూర, కదంబము. this book is a mere * ఈ పుస్తకము వట్టి కలగూర గంపగా వున్నది.
Olive n s వొకవిధమైన సీమచెట్టు, దాని యొక్క పండున్ను, దానివిత్తులలోనుంచి నూనె తీస్తారు, నేతికి సమానమైనది. * complexionచామనిచాయ, తమాలవర్ణము, కానుగాకువర్ణము. (as an emblem ofpeace) an * branch యుద్ధములో సమాధానమనేటందుకు గురుతుగా పట్టేయీ చెట్టుయొక్క కౌమ్మ.
Olla Podrida n s కలవంటకము.
Olympio n s గ్రీకు దేశపు కథలలో వచ్చే నాల్గు యేండ్లకువౌకపేరు.
Olympus n s కైలాసమువంటి వౌక దేవావాసమైన పర్వతము. the Greeks gavethis name to various hills.
Ombre n s వొకవిధమైన కాకితాల ఆట.
Omega n s గ్రీకుభాష యొక్క అక్షరములలో కడాపటి అక్షరము,మొదటివణ ్ మున్ను యీ అంత్యవణ ్ మునకున్ను ప్రత్యాహారముచేస్తే మధ్యలోవుండే అక్షరములకు కూడా గ్రహణము.
Omelet n s గుడ్లతో చేశే వొకవిధమైన ఆహారము.
Omen n s శకునము. a good * మంచి శుకునము. an evil *దుశ్శకునము, ఉత్పాతము.
Omentum n s పేగులువుండే వౌకవిధమైన తిత్తి.
Ominous adj భావిసూచకమైన, అరిష్ట సూచకమైన, రాబౌయ్యే శుభాశుభసూచకమైన. I thought this * ఇందువల్ల చెరుపు రాబోతున్నదనుకొంటిని. such compliments are * ఇటువంటి దీవెనలు అవలక్షణములే,యిది విషమస్తవము.
Ominously adv భావిసూచకముగా, అరిష్టసూచకముగా, రాబౌయ్యేశుభాశుభ సూచకముగా.
Omission n s పడుబాటు, లోపము, స్ఖాలిత్యము విడిచిపెట్టడము.sins of commission చేశినందువల్ల వచ్చిన పాపములు. sins of *మానుకౌన్నందువల్ల వచ్చిన పాపములు.
Omitted adj విడిచిపెట్టిన, తప్పిన.
Omlet n s గుడ్డతోచేశిన వౌకవిధమైన ఆహారము.
Omnibus n s ఇరువై మంది కూర్చుండ తగిన వొక విధమైనపెద్దబండి.
Omnipotence n s సర్వశక్తిత్వము.
Omnipotent adj సర్వశక్తిగల. God alone is * దేవుడేసర్వశక్తి గలవాడు.
Omnipresence n s సర్వవ్యాపకత్వము, అంతటా వ్యాపరించివుండడము.
Omnipresent adj సర్వవ్యాపకమైన, అంతటా వ్యాపరించివుండే.
Omniscience n s సర్వజ్ఙత్వము, సర్వసాక్షిత్వము, అన్నిటినియెరిగి వుండడము.
Omniscient adj సర్వజ్ఙుడైన, సర్వసాక్షియైన, అన్ని తెలిశిన.
Omnium adj చిల్లర, వివిధమైన, నానావిధమైన. See Miscellaneous.
Omnium-gatherum n s చిల్లరతడక, చిల్లరమూక, చిల్లరవాండ్లు.
On Horse-back adv గుర్రముల మీద. he came * గుర్రము యెక్కి వచ్చినాడు.
On Ship-board adv వాడమీద, వాడలో. he went on ship-board వాడమీద యెక్కినాడు.
On, (or,)Upon Prep మీద, పైన. * the top of thehouse ఆ యింటిమీద. the paints * the wall came off గోడమీదివణ ్ ము లేచిపోయినది. he was sworn * a book పుస్తకము మీదప్రమాణము చేసినాడు. he drew his sword * me నా మీదికి కత్తిదూడుకొన్నాడు. * one side వౌక పక్కన. * this side ఈ తట్టున.* the tenth day of the month పదోతేదిని. * the fourth dayనాలుగోనాడు. concerning గురించి. * this ఇందున గురించి.* account of this ఇందువల్ల. a comment * the Bharat భారతవ్యాఖ్యానము. the ring * his finger వానివేలిని వున్న వుంగరము.he will come * Wednesday వాడు బుధవారము నాటికి వచ్చును.the property found * him వాడి వద్ద చిక్కిన సొత్తు. I depend *you తమ్మున నమ్మి వున్నాను. he came * foot, not * horsebackనడచివచ్చినాడు గుర్రముమీద రాలేదు. millions upon millionsకోటానకోట్లు, లక్షలతరగడి. he read book upon bookవొక్కక్కపుస్తకముగా చదవినాడు. Time upon time he rode the samehorse తేపతేపకు అదే గుర్రాన్ని యెక్కినాడు. * his account తనస్వంతానికి. * his broher's account తన అన్న లెక్కలో. * hiscoming here వాడు యిక్కడికి వచ్చిన మీదట, వచ్చేటప్పటికి. heset the house * fire ఆ యింటిని తగలపెట్టినాడు. a house * fireకాలేయిల్లు, మండేయిల్లు. hwile he was * his jouney toCanjeveram వాడు కంచికి పోతూవుండగా. he stated this coathదీన్ని ప్రమాణ పూర్వకముగా చెప్పినాడు. * many occasionsఅనేకమాట్లు. (లో) * one occasion వౌకతరుణములో, వౌకప్పుడు.* purpose కావలైనని, ప్రయత్న పూర్వకముగా. he struck me *purpose నన్ను కావలెనని కొట్టినాడు. he played * the Guitar వీణవాయించినాడు. a witness * his side వాడి పక్షంగా పలికినసాక్షి. * a sudden ఆకస్మికముగా, లటక్కున. the horse hasnothing to feed * గుర్రానికి మేశేటందుకు యేమి లేదు.Elephants graze * bulrushes యేనుగలు తుంగ మేస్తవి.he had nothing * వాడు పైన బట్ట లేకుండా వుండినాడు.
On, Upon adv వూరికె. he slept * వూరికె నిద్రపోయినాడు,అట్టె నిద్రపోయినాడు. go * in reading పైన చదువుకొనిపో. inwriting అవతల వ్రాసుకొనిపో. he went * అవతలికి సాగినాడు.send the baggage * ఆ మూటలను సాగనంపు. and so * అవి మొదలైనవి,ఇత్యాదులు. * and off అప్పటప్పటికి. a pain came * వొక నొప్పికనిపించినది.they passed * అవతలికి సాగినారు. see to get on,put *, mount * &c. what had he * ? యేమి తొడుక్కొని వుండినాడు.
Once adv వొకసారి, వొకమాటు. he came * వొకమాటు వచ్చినాడు.tell him this * or tell him * more వాడికి యింకొకమాటు చెప్పు.he * was * rich man వీడు మునుపు భాగ్యవంతుడుగా వుండెను. whenyou have * bought the house, you can arrange about the modeof payment నీవు ముందర యింటిని కొనుక్కుంటే రూకలనుచెల్లించడమును గురించి బందోబస్తు చేసుకో వచ్చును. * moreతిరిగీ, మళ్లీ. all of them came at * అందరు వొకేదెబ్బగావచ్చినారు. all at * అకస్మాత్తుగా. all at * the rope brokeఆ పగ్గము పటుక్కున తెగినది. tell me at * పరిష్కారముగా చెప్పు.Four at * నాలుగేసి. he lost his two children at * వాడియిద్దరు బిడ్డలు వొకేసారిగా చచ్చిరి. * for all వెయ్యిమాట లేల.Never but * వొకేవౌక మాటు.
Ondit n s వదంతి, అంటారు, అట.
One adj వౌక, వొంటి, ఏకమైన. It was all * sheet of waterఅంతా యేకజలమయముగా వుండెను. * Ramaswamy bought itరామస్వామియనే వొకడు దాన్ని కౌన్నాడు. It was * thing for youto buy a book and another for you to understand it నీవు వొక పుస్తకమును కొనుక్కోవడము సరేగాని నీవు దాన్ని తెలుసుకొనేది యెక్కడ. theycall * anogher names వొకరిని వొకరు తిట్టు కొంటారు. * withanother, the horses are worth 50 rupees each ఆ గుర్రాలుసరాసరి యాభై రూపాయలు వెల అవుతున్నది. It is all * to meనాకంతా వొకటే.
Oneness n s ఏకత్వము, ఐక్యము, ఐకమత్యము.
Onerous adj దుస్సహమైన, బళువైన.
Onion n s వుల్లిగడ్డ, నీరుల్లి, యెర్రవుల్లి గడ్డ.
Only adj ఏకమైన, వొకటే. a * daughter వొకటే కూతురు.This is genrally expressed by the intensive affix E'. as, he is the * bramin here ఇక్కడ వీడు వొక్కడే బ్రాహ్మణుడు. * he,వాడే * this is his * support వానికి యిదే జీవనము. a hole * large* enough to admit the hand చెయిమాత్రమే పట్టగల సందు.
Onomatopeia n s or, Onomatopy, కవి కల్పిత శబ్దము,వ్యంగ్యార్థక శబ్దము, శ్లేషార్థక శబ్దము.
Onset n s యద్ధారంభము. they made the * వాండ్లు మొదట మా మీదికి వచ్చినారు.
Onslaught n s See Onset.
Ontology n s i. e. Metayphsicks తర్కభేదము.
Onus n s భారము, పూచి, జవాబు దారి.
Onward adv ముందరికి, అవతలికి.
Onyx n s వొకవిధమైన మణి, నులిమాని రాయి. Fabr. saysగోమేధికము.
Ooze n s ఒండుబురద, ఒండు, వండలి, వురుపు.
Oozings n s వురువునీళ్లు, చెమర్చిననీళ్లు.
Oozy adj చెమర్చే, తేమగా వుండే.
Opacity n s చీకటి, మబ్బు, అస్వచ్ఛత,మందము. by he reason ofthe * of atmosphere మంచు మూసుకొని వుండినందున.
Opake adj చీకటైన, మందమైన, అస్వచ్ఛమైన. glass istransparent, silver is * గాజుతో చూస్తే అవతలి వస్తువుతెలుస్తున్నది, వెండితో చూస్తే కండ్ల బడదు, గాజు తేట వెండిమందము.
Opal n s వొక విధమైనరాయి, దీన్ని గోపాలరాయి అంటారు.
Opaque adj See Opake.
Open adj తెరిచి వుండే, తెరిచిన, విచ్చిన, వికసించిన. an *confession బాహాటముగా వౌప్పుకోవడము. they broke * the doorతలుపును పగలకొట్టి తెరిచినారు. an * jar ముయ్యనిజాడి. an * letter లకోటాలేని జాబు. an * place బట్టబయిలు. an * boat పై కప్పులేనిపడవ. the law is * to alll పోయిన సుఖముగా ఫిర్యాదుచేసుకోవచ్చును, విచారించేటందుకు దివాణం వారు సిద్ధముగావున్నారు. he slept in the * air బయలులో పండుకొన్నాడు. an *garden వెలుగులేని తోట. he left it * దాన్ని మూయలేదు. therewas no * war బాహాటమైన జగడము లేదు. they came to an * ruptureబయిటపడి జగడము చేయసాగిరి. the question is * toreconsideration ఆ సంగతిని మళ్ళీ ఆలోచించడానకు వౌక ఆటంకమున్నులేదు. the decree is * to appeal ఆ తీర్పుమీద అప్పీలుచేసుకోవడానకు అడ్డిలేదు. the jury returned an * verdict"Found dead" చచ్చిపడివుండి చిక్కినాడని జూరీలు మొత్తముగా చెప్పినారు. an * hearted man నిష్కపటి. an * handed man ఉదారి.he received them with an * countenance పోయిన వాండ్లనుప్రసన్నముగా సన్మానించినాడు. he received them with * arms వాండ్లను అత్యుల్లాసముగా సన్మానించినాడు, బహుప్రీతి చేశినాడు.he did it with his eyes * రాబౌయ్యే గతి తెలిసివుండే చేసినాడు.he kept the door * వాకిలి మూయక విండినాడు, తలుపుతెరిచిపెట్టినాడు. In this * weather యిట్లా తెరవగా వుండేకాలమందు. to lay * తెరిచిపెట్టుట. he laid the matter * to meఆ సంగతిని నాకు తెలియక చేసినాడు. the surgeion laid the wound* ఆ పుంటిని సత్రము చేసినాడు. * texture of cloth వెలితిగా* వుండే నేత. * with interstices like a net జల్లెడ కంతలుగా* వుండే the account is still * ఆ లెక్కయింకా తీరలేదు.
Opened adj తెరిచిన, విచ్చిన, వికసించిన. See To Open.
Openhanded adj దాతయైన. he is very * వాడి చేతికి నరాలులేవు.
Openhearted adj నిష్కపటియైన.
Opening n s అవకాశము, గండి, సందు, రంద్రము, చీటిక. orbeginning ఆరంభము. or opportunity సమయము.
Openly adv బాహాటముగా, నిష్కపటముగా.
Openmouthed adj అరిచే. they cmae to me * about this అందునగురించి బౌబ్బలు పెట్టుతూ నా వద్దకి వచ్చిరి. the dog came *upon me ఆ కుక్క ళొళ్ళని కరవ వచ్చినది.
Openness n s నిష్కాపట్యత.
Opera n s సంగీతశాల, నాటకశాల. * girl బోగముది, వేశ్య.
Operation n s క్రియ, వ్యాపారము, కార్యము. during this *యీ పనిచేస్తూ వుండగా. a surgical * అంగచ్ఛేదాది చికిత్సావ్యాపారము. military *s దండు వ్యాపారములు. by the * of thespirit ఈశ్వర వ్యాపారమువల్ల. in I Cor. XII. 6. కార్యం. A+.
Operative adj వ్యాపించే. the medicine is not * ఆ మందువ్యాపించలేదు. an * chemist మందును కూర్చేపనివాడు. the *classes పనిపాటలు చేసే వాండ్లు. an * అనగా a labourerకూలివాడు, పనివాడు, కామాటి.
Operator n s కార్యకర్త, చేసేవాడు. four doctors wereassembled and the youngest was the * నలుగురు వైద్యులుకాడినారు కార్యము చేసినవాడు వాండ్లలో చిన్నవాడు, కార్యము అనగాఅంగచ్ఛేదాది కార్యము, యిది వైద్యమును గురించిన మాట.
Operose adj కష్టమైన.
Ophir n s వొక దేశము యొక్క పేరు. gold of * అతిశ్రేష్ఠమైనబంగారు.
Ophites n s సాలగ్రామశిల.
Ophthalmia n s నేత్రరోగము, కండ్లకలక.
Opiate n s నల్లమందుతో చేసిన ద్వావకము, నిద్రిపుచ్చేమందు.this acted as an * to his grief యిది వాడి దుఃఖానికివుపశమనమైనది.
Opinated, opinative adj ముష్కరమైన, మూర్ఖమైన.
Opinion n s తలంపు, ఆలోచన, అభిప్రాయము, మతము, పక్షము. isthis your *? మీకు అట్లా తోచిందా, మీ తలంపా, అది మీ పక్షమా. itis my * that he is worng వాడు తప్పినాడని నాకు తోస్తున్నది.their * differs form ours వాండ్లకు తోచినది, వేరు మాకుతోచినది వేరు. to play at cards is worng in the * of manyకాకితాలు ఆడరా, దనేది బహుమంది యొక్క మతము. I have no * of himor I have a bad * of him వాని మాట నాతో చెప్పవద్ధు, వాడుమంచివాడు కాదనేది నా తాత్పర్యము. be has a good * o themవాండ్లు యోగ్యులని అతనికి తాత్పర్యము. what right have you togive your *? అభిప్రాయము చెప్పడమునకు నీకేమి పట్టినది ? thosewho were of the same * సాభిప్రాయము గలవాండ్లు, అంగీకరించినవాండ్లు, ఒప్పినవాండ్లు. those who were of a contraryవిరుద్ధాభిప్రాయము గలవాండ్లు, అంగీకరించని వాండ్లు.ఒప్పనివాండ్లు. he expressed on * about this యిందున గురించివాడి అభిప్రాయమును చెప్పలేదు. I have my own * regarding hisbehaviour వాడి నడత నాకు తెలుసును అనగా చెడ్డనడత అని భావము.
Opinionative adj మూర్ఖడైన, ముష్కరుడైన, మొండియైన.
Opium n s నల్లమందు, అభిని.
Opodeldoc n s కర్పూరతైలముతో చేసిన లేపనము.
Opossum n s అడవిపిల్లి వంటి వౌక జంతువు.
Opponent n s యెదిరి, ప్రతివాది శత్రువు, విరోధి,ప్రతిపక్షి.
Opporser n s యెదిరించేవాడు, అడ్డమాడేవాడు.
Opportune adj సమయోచితమైన.
Opportunity n s సమయము, తరుణము. I will take another * ofdoing this దీన్ని మరి వొక సమయములో చేస్తాను.
Opposed adj యెదిరించిన, ప్రతిఘటించిన, విరుద్ధమైన, అడ్డమైన.
Opposing adj యెదిరించే, ప్రతిఘటించే విరుద్దమైన, అడ్డగించే,the * army శతృసేన.
English to Telugu free online dictionary
Enter English word and know Telugu meaning
No comments:
Post a Comment